ఆ శుభఘడియ ప్రతి శుక్రవారం వస్తుంది

[మిష్కాతుల్ మసాబీహ్ – 1359. (6) 1/428-దృఢం
https://teluguislam.net/2019/09/19/mishkatul-masabeeh/

అబూ హురైరహ్‌ (రదియల్లాహు అన్హు ) కథనం: నేను ‘తూర్‌ కొండపైకి వెళ్ళినపుడు క’అబ్‌ అ’హ్‌బార్‌ను కలిశాను. నేను అతని వద్ద కూర్చున్నాను. అతను నాకు తౌరాతు విషయాలను వినిపించ సాగారు, నేనతనికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ‘హదీసు’లను వినిపించసాగాను. వాటిలోఒక ‘హదీసు’ ఇలా ఉంది: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం,

సూర్యుడు ఉదయించే దినాలలో అన్నిటి కంటే ఉత్తమమైనది జుమ’అహ్‌ రోజు. ఈ రోజే ఆదమ్‌ (అలైహిస్సలాం) సృష్టించబడ్డారు. ఈ నాడే అతన్ని స్వర్గంనుండి భూమిపైకి దించటం జరిగింది, ఈనాడే అతని పశ్చాత్తాపం అంగీకరించబడింది. ఈనాడే అతను మరణించారు. ఈరోజే పునరుత్తానం సంభవిస్తుంది. ప్రతిప్రాణి జుమ’అహ్‌ రోజు ఫజ్ర్ సమయం మొదలునుండి సూర్యోదయం అయ్యేవరకు చెవియొగ్గి ఎక్కడ పునరుత్తానం సంభవిస్తుందో అని భయంతో వేచి ఉంటారు. అయితే జిన్నులు మరియు మానవులు తప్ప. ఇంకా ఈ జుమ’అహ్‌ దినంలో ఒక శుభఘడియ ఉంది. ఏ ముస్లిమ్‌కైనా నమా’జు స్థితిలో లభించి, అల్లాహ్‌ను ప్రార్ధిస్తే, అల్లాహ్‌ తప్పకుండా అతని కోరికను స్వీకరించి కోరింది ప్రసాదిస్తాడు” అని అన్నాను. అదివిని క’అబ్‌’అ’హ్‌బార్‌ ఈ శుభఘడియ సంవత్సరానికి ఒకసారి వస్తుంది అన్నారు. కానీ నేను “ఆ శుభఘడియ ప్రతి శుక్రవారం వస్తుంది” అని చెప్పగా, అప్పుడు క’అబ్‌ అ’హ్‌బార్‌ తౌరాతు చదివి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సత్యం పలికారు, అంటే ప్రతి వారం జుమ’అహ్‌ రోజు వస్తుందని’ అన్నారు.

ఆ తరువాత నేను ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ను కలిశాను. జుమ’అహ్‌ లోని శుభఘడియ గురించి నాకూ క’అబ్‌ అ’హ్‌బార్‌కూ మధ్య జరిగిన చర్చను గురించి ప్రస్తావించాను. ఇంకా ఇది సంవత్సరంలో ఒకసారి ఉంటుందని క’అబ్‌ అ’హ్‌బార్‌ అన్నారు’ అని అన్నాను. అది విని అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ క’అబ్‌ అ’హ్‌బార్‌ తప్పు పలికారు’ అని అన్నారు.

ఆ తరువాత నేను ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌తో క’అబ్‌, తౌరాతు చదివి ఆ శుభఘడియ ప్రతివారం జుమ’అహ్‌ రోజు వస్తుందని తెలిపారు’ అని చెప్పాను. అది విని ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌, క’అబ్‌ సత్యం పలికాడు’ అని అన్నారు. ఆ తరువాత ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ ఈ శుభఘడియ ఎప్పుడు వస్తుందో నాకు తెలుసు’ అని అన్నారు.

అప్పుడు నేను ‘అబ్బుల్లాహ్‌ బిన్‌ సలామ్‌తో ఆ శుభఘడియను గురించి నాకు తెలియజెయ్యండి, పిసినారితనం చూపకండి’ అని అన్నాను. అప్పుడు ‘అబ్బుల్లాహ్‌ బిన్‌ సలామ్‌, ‘ఆ శుభ ఘడియ జుమ’అహ్‌ రోజు చివరి భాగంలో ఉంది’ అని అన్నారు. దానికి నేను అతనితో ఈ శుభఘుడియ జుమ ‘అహ్‌ రోజు చివరి భాగంలోఎలా ఉంటుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక ముస్లిమ్‌ నమా’జు స్థితిలో ఉండాలి’ అని అన్నారు. ఈ చివరి భాగంలో నమా’జు చదవడం నిషిద్ధం’ అని అన్నాను. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌, ‘ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమా’జుకు వేచి ఉన్నవ్యక్తి నమా’జులో ఉన్నట్టు అని అనలేదా? అంటే నమా’జు గురించి ఎదురు చూడటం నమా’జులో ఉన్నట్టే కదా?” అని అన్నారు. దానికి నేను ‘అవును ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు’ అని అన్నాను. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ నమా’జులో ఉండటం అంటే నమా’జుకు వేచి ఉండటం అని అర్థం’ అని అన్నారు.

(మాలిక్‌, అబూ దావూద్‌, తిర్మిజి’, నసాయి’, అ’హ్మద్‌) (సహీహ్)

PDF:జుమా (శుక్ర వారం) – మిష్కాతుల్ మసాబీహ్ నుండి
https://teluguislam.files.wordpress.com/2020/03/juma-mishkatul-masabih.pdf

“عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ: خَرَجْتُ إِلَى الطُّورِ فَلَقِيتُ كَعْبَ الْأَحْبَارِ فَجَلَسْتُ مَعَهُ فَحَدَّثَنِي عَنِ التَّوْرَاةِ وَحَدَّثْتُهُ عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَكَانَ فِيمَا حَدَّثْتُهُ أَنْ قُلْتُ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: ” خَيْرُ يَوْمٍ طَلَعَتْ عَلَيْهِ الشَّمْسُ يَوْمُ الْجُمُعَةِ فِيهِ خُلِقَ آدَمُ وَفِيهِ أُهْبِطَ وَفَيْهِ تِيبَ عَلَيْهِ وَفِيهِ مَاتَ وَفِيهِ تَقُومُ السَّاعَةُ وَمَا من دَابَّة إِلَّا وَهِي مسيخة يَوْمَ الْجُمُعَةِ مِنْ حِينِ تُصْبِحُ حَتَّى تَطْلُعَ الشَّمْسُ شَفَقًا مِنَ السَّاعَةِ إِلَّا الْجِنَّ وَالْإِنْسَ وفيهَا سَاعَةٌ لَا يُصَادِفُهَا عَبْدٌ مُسْلِمٌ وَهُوَ يُصَلِّي يسْأَل الله شَيْئا إِلَّا أعطَاهُ إِيَّاهَا. قَالَ كَعْبٌ: ذَلِكَ فِي كُلِّ سَنَةٍ يَوْمٌ. فَقلت: بل فِي كل جُمُعَة قَالَ فَقَرَأَ كَعْبٌ التَّوْرَاةَ. فَقَالَ: صَدَقَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ. قَالَ أَبُو هُرَيْرَةَ: لَقِيتُ عَبْدَ اللَّهِ بْنَ سَلَامٍ فَحَدَّثْتُهُ بِمَجْلِسِي مَعَ كَعْب وَمَا حَدَّثْتُهُ فِي يَوْمِ الْجُمُعَةِ فَقُلْتُ لَهُ: قَالَ كَعْب: ذَلِك كُلِّ سَنَةٍ يَوْمٌ؟ قَالَ عَبْدُ اللَّهِ بْنُ سَلَامٍ: كَذَبَ كَعْبٌ. فَقُلْتُ لَهُ ثُمَّ قَرَأَ كَعْبٌ التَّوْرَاةَ. فَقَالَ: بَلْ هِيَ فِي كُلِّ جُمُعَةٍ. فَقَالَ عَبْدُ اللَّهِ بْنُ سَلَامٍ: صَدَقَ كَعْبٌ ثُمَّ قَالَ عَبْدُ اللَّهِ بْنُ سَلَامٍ: قَدْ عَلِمْتُ أَيَّةَ سَاعَةٍ هِيَ. قَالَ أَبُو هُرَيْرَة فَقلت لَهُ: فَأَخْبرنِي بهَا. فَقَالَ عَبْدُ اللَّهِ بْنُ سَلَامٍ: هِيَ آخِرُ سَاعَةٍ فِي يَوْمِ الْجُمُعَةِ. قَالَ أَبُو هُرَيْرَةَ: فَقُلْتُ: وَكَيْفَ تَكُونُ آخِرَ سَاعَةٍ فِي يَوْمِ الْجُمُعَةِ وَقَدْ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: «لَا يُصَادِفُهَا عَبْدٌ مُسْلِمٌ وَهُوَ يُصَلِّي وَتلك السَّاعَة لَا يُصَلِّي فِيهَا؟» فَقَالَ عَبْدُ اللَّهِ بْنُ سَلَامٍ: أَلَمْ يَقُلْ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: «مَنْ جَلَسَ مَجْلِسًا يَنْتَظِرُ الصَّلَاةَ فَهُوَ فِي صَلَاةٍ حَتَّى يُصَلِّيَ؟» قَالَ أَبُو هُرَيْرَةَ: فَقلت: بلَى. قَالَ: فَهُوَ ذَاك. رَوَاهُ مَالِكٌ وَأَبُو دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَرَوَى أَحْمد إِلَى قَوْله: صدق كَعْب”

క్రింది తప్పకుండా వినండి:
జుమా రోజులో ఒక మహత్తరమైన ఘడియ ఉంది [ఆడియో & హదీసులు]

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

%d bloggers like this: