(8:12 నిముషాలు )
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
وعنه أن رسول الله صلى الله عليه وسلم ، ذكر يوم الجمعة، فقال: “فيها ساعة لا يوافقها عبد مسلم، وهو قائم يصلي يسأل الله شيئًا، إلا أعطاه إياه” وأشار بيده يقللها، ((متفق عليه)) .
1157. హజ్రత్ అబూహురైరా (రది అల్లాహు అన్హు)గారు చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒకసారి జుమా గురించి చెబుతూ ఇలా అన్నారు: “ఆ రోజులో ఒక ఘడియ ఉంది. ఏ ముస్లిం దాసుడయినా ఆ ఘడియను పొంది, ఆ సమయంలో అతను నిలబడి నమాజు చేస్తూ అల్లాహ్ ను ఏదయినా అడిగితే అల్లాహ్ తప్పకుండా ఇస్తాడు.” ఆ సమయం చాలా తక్కువగా ఉంటుందని ఆయన తన చేత్తో సంజ్ఞ చేసి చూపించారు.
(బుఖారీ-ముస్లిం) (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలోని జుమా ప్రకరణం)
ముఖ్యాంశాలు
శుక్రవారం రోజుకి సంబంధించిన మరొక మహత్యాన్ని ఈ హదీసులో పొందుపరచటం జరిగింది. ఆ రోజులో ఒక మహత్తరమైన ఘడియ ఉంది. ఆ ఘడియలో భక్తులు చేసుకునే విన్నపాలను అల్లాహ్ తప్పకుండా మన్నిస్తాడు. ఆ ఘడియ చాలా తక్కువగా ఉంటుంది.
అదీగాక ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అందుకని ఆ మహాభాగ్యాన్ని పొందాలంటే ఆ రోజు మొత్తం అత్యధికంగా అల్లాహ్ ను ధ్యానిస్తూ, ప్రార్థనలు, విన్నపాల్లో నిమగ్నులై ఉండాల్సిందే.
وعن أبي بردة بن أبي موسى الأشعري، رضي الله عنه، قال: قال عبد الله بن عمر رضي الله عنهما: أسمعت أباك يحدث عن رسول الله صلى الله عليه وسلم ، في شأن ساعة الجمعة؟ قال: قلت: نعم، سمعته يقول: سمعت رسول الله صلى الله عليه وسلم ، يقول: “هي ما بين أن يجلس الإمام إلى أن تقضى الصلاة” ((رواه مسلم)).
1158. హజ్రత్ అబూ బుర్దా బిన్ అబూ మూసా అష్ అరీ (రది అల్లాహు అన్హు) కథనం: ఒకసారి అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రది అల్లాహు అన్హు) నాతో మాట్లాడుతూ “శుక్రవారం నాటి ఘడియ గురించి మీ నాన్న ఏదయినా దైవప్రవక్త హదీసు చెప్పినప్పుడు నువ్వు విన్నావా?” అని అడిగారు. దానికి నేను సమాధానమిన్తూ, “విన్నాను ఆ ఘడియ ఇమామ్ వేదికపై కూర్చున్నప్పటి నుంచి నమాజ్ ముగిసేవరకు మధ్య కాలంలో ఉంటుందని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధిస్తుండగా తాను విన్నానని మా నాన్నగారు చెప్పారు” అని అన్నాను.
(ముస్లిం) (సహీహ్ ముస్లిం లోని జుమా ప్రకరణం)
ముఖ్యాంశాలు
శుక్రవారం రోజు ఆ ఘడియ ఎప్పుడొస్తుందనే విషయమై పండితుల మధ్య భిన్నాభి ప్రాయాలున్నాయి. కొంతమంది పండితులు పై హదీసును నిదర్శనంగా చేసుకొని ప్రార్థనలు స్వీకరించబడే ఆ శుభఘడియ శుక్రవారం రోజు ఇమామ్ ఖుత్బా కొరకు వేదికపై కూర్చున్నప్పటి నుంచి నమాజు ముగిసేవరకు మధ్యకాలంలో ఉంటుందనీ, అన్నింటికన్నా బలమైన అభిప్రాయం ఇదేనని అన్నారు. అయితే షేఖ్ అల్‌బానీ తదితర హదీసువేత్తలు అబూ మూసా (రది అల్లాహు అన్హు) వివరించిన ఈ హదీసుని ‘మౌఖూఫ్‘గా పేర్కొన్నారు. అంటే ఈ హదీసుని తాను నేరుగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుంచి విన్నారో లేదో ఆయన అనుచరుడు తెలుపలేదని దాని భావం. (వివరాల కోసం షేఖ్ అల్‌బానీ చేత పరిశోధించబడిన “రియాజుస్సాలిహీన్’ గ్రంథం చూడండి). అందుకే మరికొంతమంది పండితులు అబూదావూద్ మరియు నసాయి గ్రంథాల్లోని వేరొక హదీసుని ప్రాతిపదికగా చేసుకొని ఆ శుభఘడియ అస్ర్ మరియు మగ్రిబ్ నమాజుల మధ్యకాలంలో ఉంటుందని తలపోశారు. ఆ హదీసులో శుక్రవారం రోజు ఆ శుభఘడియను అస్ర్ నమాజ్ తర్వాత చివరివేళలో అన్వేషించమని ఆదేశించటం జరిగింది. మొత్తానికి ఆ ఘడియ నిర్ణయం అస్పష్టంగానే మిగిలిపోయింది కనుక ఆ రోజు సాంతం అత్యధికంగా దైవధ్యానంలో నిమగ్నులై ఉండటానికి ప్రయత్నించటం అన్ని విధాలా శ్రేయస్కరం.
నుండి: జుమానాటి ఘనత , జుమా నమాజు – హదీసులు – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ )
జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/
You must be logged in to post a comment.