Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 32
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ప్రశ్నల పత్రం – 32
1) నక్షత్రాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి?
A) రాశి ఫలాలు – జ్యోతిష్యం కొరకు
B) వర్షం కురిసేందుకు – కోర్కెలు తీర్చేందుకు
C) ఆకాశపు అలంకరణ – షైతాన్ లను తరిమేందుకు – చీకటిలో మార్గం తెలుసు కునేందుకు
D) పై వాటిలో ఏదీకాదు
2) ఏ ప్రవక్తను ఉద్దేశించి అతని పట్ల వారు హద్దు మీరినట్లుగా ! మీరు నా విషయంలో హద్దు మీరి పొగడకండి అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) తెలిపారు?
A) మూసా (అలైహిస్సలాం)
B) ఆదం (అలైహిస్సలాం)
C) ఈసా (అలైహిస్సలాం)
D) యహ్య (అలైహిస్సలాం)
3) ఇషా మరియు ఫజర్ నమాజ్ జమాఅత్ తో చెయ్యటం వల్ల ఎంత పుణ్యం లభిస్తుంది?
A) జీవితాంతం నమాజ్ చేసినంత
B) రోజంతా ఉపవాసం చేసినంత
C) పూర్తి రాత్రి తహజ్జుద్ చేసినంత
D) దినమంతా నమాజ్ చేసినట్లు
నిశ్చయంగా మేము ఆకాశంలో బురుజులను నిర్మించాము. చూపరుల కోసం దానిని అందంగా ముస్తాబు చేశాము. ఇంకా, దానిని ధూత్కారి అయిన ప్రతి షైతాను బారి నుంచి రక్షించాము. కాకపోతే దొంగచాటుగా (ఎవడైనా అక్కడి రహస్య విషయాలను) వినటానికి ప్రయత్నించినప్పుడు స్పష్టమైన అగ్నిజ్వాల ఒకటి వాడ్ని వెంటాడుతుంది.
“చీకట్లలోనూ, భూమిలోనూ, సముద్రంలోనూ మీరు మార్గం తెలుసుకునేందుకుగాను ఆయనే మీ కోసం నక్షత్రాలను సృష్టించాడు. మేము జ్ఞానం కలవారి కోసం మా సూచనలను బాగా విడమరచి చెప్పాము.”
2) ఏ ప్రవక్తను ఉద్దేశించి అతని పట్ల వారు హద్దు మీరినట్లుగా ! మీరు నా విషయంలో హద్దు మీరి పొగడకండి అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) తెలిపారు?
C) ఈసా (అలైహిస్సలాం)
البخاري 3445:- عن عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُ، يَقُولُ عَلَى المِنْبَرِ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: «لاَ تُطْرُونِي، كَمَا أَطْرَتْ النَّصَارَى ابْنَ مَرْيَمَ، فَإِنَّمَا أَنَا عَبْدُهُ، فَقُولُوا عَبْدُ اللَّهِ، وَرَسُولُهُ»
బుఖారీ 3445లో ఉంది, ఉమర్ (రజియల్లాహు అన్హు) మెంబర్ పై చెప్పారు, నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా విన్నాను: “క్రైస్తవులు ఈసా బిన్ మర్యమ్ అలైహిస్సలాం విషయంలో హద్దులు మీరినట్లు మీరు నా విషయంలో హద్దులు మీరకండీ. నిశ్చయంగా నేను అల్లాహ్ యొక్క దాసుడ్ని, కనుక మీరు అల్లాహ్ దాసుడు మరియు అతని ప్రవక్త అని అనండి.”
3) ఇషా మరియు ఫజర్ నమాజ్ జమాఅత్ తో చెయ్యటం వల్ల ఎంత పుణ్యం లభిస్తుంది?
C) పూర్తి రాత్రి తహజ్జుద్ చేసినంత
ఇషా మరియు ఫజ్ర్ నమాజ్ సామూహికంగా (జమాఅత్ తో) చేయుట
ప్రవక్త ﷺ ఇలా సంబోధించారని, ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః
వక్త/రచయిత : షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమిన్ (రహిమహుల్లాహ్)
తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఈ సందర్భంగా ఏప్రిల్ ఫూల్ పేరిట కొందరు మూర్ఖులు చేస్తున్న చేష్టల నుండి నేను ముస్లిములందరినీ హెచ్చరిస్తున్నాను: హెచ్చరిక ఏమిటంటే ఇది యూదుల, క్రైస్తవుల, మజూస్ (అగ్నిపూజారుల) మరియు అవిశ్వాసుల నుండి పొందిన ఓ అబద్ధం, అసత్యం. ఇందులో ధర్మపరమైన నిషేధమైన అసత్యమే కాకుండా ముస్లిమేతరుల పోలిక ఉంది, ముస్లిమేతరుల పోలిక నిషిద్ధం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “మన్ తషబ్బహ బిఖౌమిన్ ఫహువ మిన్ హుమ్” అంటే “ఎవరు ఏ జాతి పోలికను అవలంబిస్తాడో అతడు ఆ జాతి వారికి చెందినవాడు అవుతాడు”. (అబూదావూద్ 4031). (షేఖుల్ ఇస్లామ్ ఇబ్ను తైమియా దీని సనద్ ను ‘జయ్యిద్’ అంటే ప్రమాణికమైనదని అన్నారు.)
పోలిక అన్నది కనీసం నిషిద్ధంలో వస్తుంది, హదీసు యొక్క బాహ్య పదాలు చూస్తే పోలిక వహించేవాడు అవిశ్వాసానికి పాల్పడినట్లని కనబడతున్నాయి.
ఏప్రిల్ ఫూల్ అని చెప్పడంలో ఈ రెండు నిషిద్ధ కార్యాలే (1-అబద్ధం, 2- ఇతరుల పోలిక) గాకుండా ఇస్లాం మరియు ముస్లిం శత్రువుల పట్ల ముస్లిం అవమానత్వం కూడా ఉంది. ఎలా అనగా కామన్ సెన్స్ గా అందరూ ఎరిగిన విషయమే: ఎవని పోలిక అవలంబించడం జరుగుతుందో వాడు ఈ పోలిక అవలంబించేవాడికన్నా మేలైనవాడన్న గర్వంలో పడతాడు, వీనికన్నా బెటర్ గనకనే నన్ను ఫాలో అవతున్నాడన్న ఫీలింగ్ కి గురవుతాడు. తుదకు ఈ పోలిక అవలంబించేవాడు తనకు తాను తక్కువగా భావించి అంటే న్యూనతభావానికి గురై వాని పోలిక అవలంబిస్తాడు, ఈ విధంగా విశ్వాసి అవిశ్వాసికి తోకగా, వానికి ఫాలోవర్ గా అయి అవమానం పాలవుతాడు.
ఇంతే కాకుండా ఈ ఛండాలమైన, నీచమైన అసత్యపు ఎప్రిల్ ఫూల్ లో మరో నాలుగో నిషిద్ధం ఏముందంటే: అధర్మంగా ఇతరుల సొమ్ము కాజేయడం, ముస్లిములను భయభ్రాంతులకు గురి చేయడం. ఫూల్ జేస్తున్నా అని ఇంటివారికి మనింటికి చుట్టాలొస్తున్నారు మంచి వంటకాలు చేసి పెట్టండని కాల్ చేస్తాడు, లేదా ఇంకా ఇలాంటి జోక్స్ పేరు మీద జరిగే చేష్టలు. లేదా భయభ్రాంతులకు గురి అయ్యే సమాచారం అందజేస్తాడు, ఉదాహరణకు మీ యజమానికి ఆక్సిడెంట్ జరిగింది, బండి క్రింద పడ్డాడు అన్నటువంటి జోకులు. ఎట్టిపరిస్థితుల్లో కూడా ఇవి యోగ్యం కాజాలవు.
وبهذه المناسبة أحذر إخواني المسلمين مما يصنعه بعض السفهاء من كذبة أبريل، وأظن أنه قريبٌ من هذه الكذبة التي تلقوها عن اليهود والنصارى والمجوس وأصحاب الكفر، ثم إنها مع كونها كذباً والكذب محرم شرعاً، وكونها تشبهاً بغير المسلمين والتشبه بغير المسلمين محرم، وقد قال النبي صلى الله عليه وسلم: «من تشبه بقومٍ فهو منهم». قال شيخ الإسلام ابن تيمية رحمه الله: إسناده جيد. وأقل أحواله التحريم، وإن كان ظاهره يقتضي كفر المتشبه بهم. هي مع تضمنها لهذين المحظورين هي أيضاً إذلالٌ للمسلم أمام عدوه؛ لأن من المعلوم بطبيعة البشر أن المقلد يفخر على من قلده، ويرى أنه أقدم منه؛ ولذلك ضعف مقلده حتى قلده، ففيها إذلالٌ للمؤمن بكونه ذيلاً وتبعاً للكفار. المحظور الرابع أن غالبها -أي غالب هذه الكذبة الخبيثة- تتضمن أكلاً للمال بالباطل أو ترويعاً للمسلم، فإنه ربما يكذب فيكلم أهل البيت ويقول: إن فلاناً يقول ترى عندنا جماعة هذا اليوم يطبخون غداءً كثيراً ولحماً. وما أشبه ذلك. أو ربما يخبرهم بأمرٍ يروعهم؛ كأن يقول: قيمكم دُعس، دعسته سيارة. وما أشبه ذلك من الأمور التي لا تجوز بدون أن تكون بهذه الحال
సత్కార్య వనాలు – ద్వితీయ వనం అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
ముస్లిముల అవసరాలను తీర్చుట
ప్రియ సోదరా! ఈ వనం ఆరంభం ఒక చిన్న సంఘటన ద్వారా చేస్తాను, నా స్నేహితుడైన షేఖ్ (ఇబ్రాహీం బిన్ సాలిహ్, అహ్ సాలోని షరీఆ కాలెజ్ లెక్చరర్) చెప్పారు:
“సుమారు 18 సంవత్సరాల ఒక నవయువకుడు అహ్ సా నుండి దమ్మామ్ తన కార్లో బయలుదేరాడు. అతడు అస్థమ రోగి. దమ్మామ్ చేరుకున్న వెంటనే అతనికి ఊపిరి ఆడనట్లు ఏర్పడింది. ఇది ఓ భయంకర విషయానికి సంకేతం అని అస్థమ రోగులకు ముందే తెలుసు. ఇలాంటప్పుడు వివేకవంతమైన చురుకుతనం, వెంటనే రోగి చుట్టు గుమిగూడి అతని ఆరోగ్యం గురించి సూక్ష్మమైన శ్రద్ధ చాలా అవసరం.
ఎప్పుడైతే తాను ఏ క్షణాన్నైనా స్పృహ తప్పి పోవచ్చని, పడి- పోవచ్చనీ ఆ యువకునికి అర్థమయ్యిందో, అప్పడతను చుట్టాల ముందు పడిపోతే బాగుండదు కదా అన్న మరింత ఆవేదనతో దమ్మామ్ చేరుకొని ఏమంత సమయం కాక ముందే తిరిగి అహ్ సా చేరుకోవాలని నిశ్చయించుకున్నాడు. అతని ఛాతిలో ఏదో అవస్త ఉన్నట్లు, సరిగ్గా శ్వాస తీసుకోలేక పోతున్నాడని దగ్గరున్న వారు గ్రహించి, ఈ స్థితిలో వెళ్ళకుంటే బావుంటదని ప్రాధేయ పడ్డారు. ఎన్నో రకాలుగా అతనిపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయినా అతడు ఒక్కటీ పట్టించు కోకుండా తిరిగి పోవడానికి తన కారు ఎక్కాడు. ఒక్కో క్షణం అతి కఠినంగా గడుస్తుంది. ఒక్కో క్షణం ఒక్కో శ్వాసను ఆపుతున్నట్లుంది. ప్రక్కన తిరుగుతే ధైర్యం ఇచ్చే కారుణ్యతండ్రి లేడు. మమకారంతో గుండెకు హత్తుకునే మాతృమూర్తి లేదు. త్వరగా తొలి చికిత్స అందించే, ఆపద్బాంధువ సోదరుడు లేడు. రెప్పలార్పకుండా ముందుకు చూస్తూ పోతే పొడగాటి రొడ్డు. గమ్యానికి చేరుకునేంత శక్తి లేనట్లు ఏర్పడుతుంది. సగం దారి చేరుకున్నాడో లేదో అవస్త ఎక్కువై పోయింది. కంట్రోల్ కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. కళ్ళు తేటగిల్లుతున్నాయి. చావు సమీపించినట్లనిపిస్తుంది. ఇక చివరి ఘడియలే అని భావించాడు. ఒక బ్రిడ్జి క్రింద కారును ఆపాడు. దారి గుండా పోయేవారితో ఏదైనా సహాయం కోరుదామన్నా శక్తి లేకుండా అయిపోయింది. ఆశలు కోల్పోయాడు. ఇక అల్లాహ్ వైపునకు మరలాడు. అమానతుగా ఉన్న ఆత్మను అప్పజెప్ప- టానికి, ఒంటరి ప్రయాణంలో ఉండి, ఏమి చేయాలో దోయక అను- కోకుండా బండి నుండి దిగి దాని ముందు వచ్చి వెలకిల పడ్డాడు. బహుశా అల్లాహ్ కారుణ్యం కురుస్తేందేమో, జాడలేని ఒంటరితనంపై అల్లాహ్ కరుణ దృష్టి పడుతుందేమో. అదే క్షణంలో తనకు తానే మరచిపోయినట్లయింది. సృహ తప్పినట్లయింది. ఏమి జరుగు- తుందో ఏమీ తెలియదు. ఒక విషయం తప్ప; ఇక ఈ జీవితాన్ని దాని అందచందాలను వీడిపోయే సమయం వచ్చేసిందని.
కాని అల్లాహ్ కారుణ్యం అతని వెంటే వెంబడిస్తూ ఉంది. ఎందుకు అలా కాదు? ఆయన కరుణామయుడు, క్షమించువాడు, కృపాసాగరుడు, ఓర్పుగల పరిశుద్ధుడు.
దారి గుండా పోతున్న ప్రయాణికుల్లో ఒకతను స్పృహ తప్పినట్లు తన కారుపై పడి ఉన్న పడచుపిల్లవాడిని చూడటానికి వస్తాడు. ఏ యాక్సిడెంట్ చిహ్నాలు లేవు, ఇతని ఈ స్థితికి అసలు కారణం ఏమిటో తెలియడం లేదు. అయినా అతను ప్రశ్నల మోతలకు తావివ్వకుండా ముందు ఈ అపరిచిత వ్యక్తికి సహాయం అందిం- చాలి అని చెయితో పట్టి చూస్తే యువకుని చెయ్యి కదిలినట్లు చూశాడు అతడు తన మూతి, ముక్కు వైపు సైగ చేస్తున్నాడు. అంటే ఇక శ్వాస నడిచే అవకాశాల్లేవు అని తెలియజేస్తున్నాడు. అతడ్ని ప్రాణంతో చూసి ఈ పుణ్యాత్ముడు సంతోషపడ్డాడు. అల్లాహ్ అతడ్ని కాపాడడానికే నన్ను పంపాడెమో అని అనుకొని, దగ్గర ఉన్న ఓ ఊరిలో మంచి చెస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ వద్దకు తీసుకెళ్ళడానికి తొందర పడ్డాడు. అక్కడికి చేరుకున్నాక తన మెడపై వచ్చి పడ్డ అమానతు పట్ల మంచి శ్రద్ధ చూపాడు ఓ డాక్టర్. ఆ పుణ్యాత్ముడు శ్వాస ఆగిపోతున్న, చావుగురకలకు గురైన యువకుని తలాపున నిలబడి చూస్తునే ఉన్నాడు. తాను ఏ ఉద్దేశంతో ప్రయాణానికి బయలుదేరాడో మరచి పోయాడు. లోకాన్నే తన వెనక వదిలాడు. ప్రాణం కోల్పోతున్న మనిషిని కాపాడుటకు ముందుకు వచ్చి అల్లాహ్ దయతో తిరిగి అతని స్థానంలో చేర్చడానికి. ఏదో ముందు నుండే పరిచయం ఉన్నట్లు కాదు. ఐహిక లాభాన్ని ఉద్దేశించీ అంతకు కాదు. అల్లాహ్ అనుగ్రహించిన ఓ సత్కార్యం చేసుకోవాలని మాత్రమే. అలాగే దృష్టి సారించి యువకుని వైపు చూస్తూ, తనకు తోచిన శ్రద్ధ చూపుతూ, అల్లాహ్ అతనికి స్వస్థత ప్రసాదించాలని, తిరిగి కొత్త జీవితం దొరకాలని అల్లాహ్ తో దుఆలో నిమగ్నుడై ఉన్నాడు. కొంచం కొంచం మంచిగా శ్వాస తీసుకోగలుగుతున్నాడు. క్లిష్టపరిస్థితి దూరమవుతుంది. వ్రేళ్ళు ఆడుతన్నాయి. జీవితం మెరుపు కళ్ళల్లోని కాంతి ద్వారా మినుకుమినుకుమంటుంది. ఆ పుణ్యాత్ముడు ఎంతో ఆశతో డాక్టర్ కళ్ళల్లో కళ్ళేసి తదేకదృష్టి సారించి ఉన్నాడు. అతని మోమున ఒక ఆనందమైన చిరునవ్వు గురించి పెనగులాడుతున్నాడు. క్షణం తర్వాత క్షణం గడుస్తుంది. నీ ప్రభువు కారుణ్యం మేలుచేసేవారికి సమీపం కనబడుతుంది. యువకుని శరీరంగాలలో జీవచలనం మొదలయింది. డాక్టర్ ముఖకవలికల్లో సంతోషం తొనికిసలాడింది. అతని నూతన జీవిత శుభవార్త డాక్టర్ నోట వెలువడింది. ఆ పుణ్యాత్ముడు అప్పుడే అతని నోట అతని ఇంటి ఫోన్ నంబర్ తెలుసుకున్నాడు. అతని ఇంటివారికి తాను తెలియకుండా ఉండటానికి అక్కడి నుండి జారుకున్నాడు. తన ఈ సత్కార్యాన్ని వివేకవంతముతో గట్టెక్కించడానికి అతని ఇంటికి ఫోన్ చేసి వారి అబ్బాయి క్షేమ విషయంతో పాటు ప్రస్తుతం ఉన్న అడ్రస్ వారికి తెలిపేశాడు.
కానిః … మీరెవరండి మాట్లాడుతున్నది? చెప్పండి అల్లాహ్ మీకు సద్భాగ్యం ప్రసాదించుగాక? ఓ పుణ్యాత్ముడా మీరెవరో చెప్పండి? మీ శుభనామం తెలియజేయండి, మీ గొప్పతనం గురించి ప్రజలకు తెలుపనివ్వండి, మీరు చేసిన సత్కార్యం గురించి వివరించ- నివ్వండి, మీరు మాకు చేసిన మేలుకు బదులుగా మీకు మేలు చేయనివ్వండి, పరిశుద్ధుడైన అల్లాహ్ దయతో మా కొడుకు ప్రాణాన్ని కాపాడిన మీరు, మీకు ఏ మేలు చేస్తే సమతూలుతుంది. మిమ్మల్ని గౌరవించి, సత్కరించే భాగ్యం మాకివ్వరా? చెప్పండి మీరెవరు? అన అడిగిన ప్రశ్నకు బదులుగా “పుణ్యం సంపాదించుకోదలిచిన వాడు”… అన్న రెండే రెండు పదాలు చెప్పి కరుణామయుడు, కనికరించేవాడైన అల్లాహ్ నుండి సత్ఫలితాన్ని ఆశిస్తూ ఆ పుణ్యాత్ముడు ఫోన్ పెట్టేశాడు.
సత్కార్యం చేసినవాడా నీకు శుభం కలుగుగాక, అల్లాహ్ నీకు సరిపోవుగాక, నీ అడుగులు మంచి వైపే పయనమవుగాక, అల్లాహ్ నిన్ను సర్వ చెడుల నుండి కాపాడి, రక్షణ కల్పించుగాక, అల్లాహ్ నీ ఆరోగ్యం, నీ జీవితం, నీ సంతానాల్లో శుభం, వృద్ధి కలుగజేయుగాక, మీకు, మాకూ స్వర్గంలో ఉన్నత స్థానం ప్రసాదించుగాక అని వారు దీవించారు.
షేఖ్ నాతో చెప్పాడుః ఇప్పటికీ దీనమైన, వినయపూర్వకమైన ఈ చేతులు ఆ పుణ్యాత్ముని కొరకు దుఆ చేయుటకై అల్లాహ్ ముందు ఎత్తబడుతాయి. అతని మేలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఇదే పరిస్తితి ఉంటుంది.
తన సోదరుని ఓ అవసరాన్ని తీర్చాడు, చూడ్డానికి అదేమంతలే… కాని దానికి రెండు పక్కల్లో (ఇరువైపుల్లోని మధ్య) ఉన్న మనస్సు కావాలి. తన సోదరుని అవసరం తీర్చి ఎంత గొప్ప అదృష్టం సంపాదించాడు!! త్వరలో తీసుకెళ్ళి తొలి చికిత్స చేయించి ఏ సాఫల్యం, విజయం సాధించాడు!! నిశ్చయంగా అది గొప్ప సాఫల్యం, విజయం, దాని గురించే అల్లాహ్ ఇలా తెలిపాడుః
మీ ప్రభువును ఆరాధించండి, మంచి పనులు చేయండి, వీటి ద్వారానే మీకు సాఫల్య భాగ్యం లభిస్తుంది. (హజ్ 23: 77).
సోదరా నీకు సద్భాగ్యం ప్రాప్తమవుగాక! నీ సోదరుని ఏదైనా అవసరం తీర్చడంలో వెనకాడకు, అది నీ సమయం కెటాయించైనా, నీ శ్రమ ద్వారానైనా సరే. నీ సృష్టికర్త నీ అవసరాల్ని తీరుస్తూ ఉంటాడని, నీ బాధను తేలికగా చేస్తాడని, నీ చింతను దూరం చేస్తాడని మరియు నీ ఉపాధిలో శుభం కలుగజేస్తాడని నమ్మకం ఉంచు. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:
“ఒక వ్యక్తి వాహనము మీద కూర్చోడానికి లేదా అతని ఏదైనా సామాను దాని మీద పెట్టడానికి అతనికి సహాయపడుట కూడా సత్కార్యమే”. (ముస్లిం 1009, బుఖారి 2989).
బహుశా నీవు ఒక హవాల్దారునిగా పనిచేస్తున్న వీరుని సంఘటన విని ఉంటావు. అతని పేరు జుమ్ హూర్ బిన్ అబ్దుల్లాహ్ గామిదీ (రహిమహుల్లాహ్). ఏదో కోర్ నిష్ లో మునుగుతున్న ఒక తండ్రి అతని ఇద్దరు కొడుకులను కాపాడే భాగ్యం అల్లాహ్ అతనికి ప్రసాదించాడు. అస్ర్ నమాజు చేసుకోవడానికి తాను ఓ మస్జిద్ వైపు వెళ్తుండగా ‘కాపాడండి, కాపాడండి’ అని అంతరాత్మ నుండి వెళ్తున్న, పరిచయమైన కేకలు విని, క్షణం పాటు ఆలస్యం చేయ కుండా మునుగ బోతున్న ఆ ముగ్గురి ప్రాణాలు కాపాడుటకు ప్రయత్నం చేసి, ముందు తండ్రిని కాపాడి ఒడ్డుకు చేర్చి తన మిత్రునికి అప్పజెప్పాడు. అనంతమైన ధైర్యంతో, నిరుపమానమైన త్యాగంతో తన ఆత్మను, జీవితాన్ని ధారాపోసి తండ్రి లాంటి ప్రేమతో ఇద్దరు పిల్లలను కాపాడుటకు వెంటనే వెనక్కి తిరిగాడు. వారిద్దరిని కాపాడే భాగ్యం అల్లాహ్ అతనికి ప్రసాదించాడు. కాని క్షేమంగా ఒడ్డు చేరుకొనుటకు అతని శక్తి అతనికి తోడివ్వలేక పోయింది. విపరీతమైన అలసటకు గురయ్యాడు. సముద్ర సుడిగుండంలో పట్టు కోల్పోయాడు. కెరటాలు అతన్ని మరింత లోతుకే తీసుకెళ్ళ సాగాయి. శక్తి నశించి పోయింది. కళ్ళ ముందే కొంచెం కొంచెం జీవిత జ్యోతి ఆరిపోయింది. అతడు అల్లాహ్ మార్గంలో అమరవీరుడయ్యాడు. బహుశా ఈ అమరవీర పతకం తన గురించే ఎదిరి చూస్తుండవచ్చు. మనం ఇదే మంచి భావన ఉంచుతాము. అల్లాహ్ ఇదే మంచి స్థానం అతనికి ప్రాప్తి చేయుగాక. అయితే ఇలా ఈ వీరుడు కనుమరుగయి పోయాడు. సముద్రం లోతులోకి మునిగి పోయాడు. తన ఈ ధైర్యం మరియు శౌర్యంతో అరుదైన ఫిదాయీ మరియు ప్రాధాన్యత పలకలు చెక్కాడు. వాస్తవానికి మన ఈ కాలంలో ఇది అరుదైన నిదర్శన. నేను ఇంకేమనాలి. ఇంతకంటే ఎక్కువ ఏమీ అనలేను. అల్లాహ్ నీపై అనేకానేక కరుణలు కురిపించుగాక. విశాల స్వర్గంలో నివాసముంచుగాక. అమరవీరుల, పుణ్యాత్ముల స్థానం ప్రసాదించుగాక. ఆయన సత్కార్యఫలమిచ్చువాడు, కనికరం, దయ కలవాడు.
నీ సోదరుని అవసరం అంటే: అతనికి ఏదైనా బాధ ఉంటే నీవు దాన్ని సులువుగా చేయుట. అవస్త ఉంటే చికిత్స చేయించుట. అప్పు ఉంటే తీర్చుట. అతను అడిగినప్పుడు అప్పిచ్చుట. ఏదైనా లోపం ఉంటే దూరం చేసి అతని పరువు కాపాడుట. స్నేహం ద్వారా తృప్తినిచ్చుట. అతని వెనక అతని కొరకు దుఆ చేయుట. ప్రతి సత్కార్యంలో అతనికి చేయూతనిచ్చుట. మంచి విషయంలో సహాయపడుట. ఈ సత్కార్యాల ద్వారా అల్లాహ్ ప్రేమను చూరగొని, ఆయన కొరకే ప్రాయాసపడి ఆయన సంతృష్టి పొంది విజయ వంతునివి అయిపో.
ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవండి.
సత్కార్య వనాలు (Hadayiq)
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి, స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి, “నేను మీ ప్రభువును కానా?” అని అడిగినప్పుడు “ఎందుకు కావు? (నువ్వే మా ప్రభువువి). ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం” అని వారు చెప్పారు. ‘దీని గురించి మాకేమీ తెలియదు’ అని ప్రళయ దినాన మీరు అనకుండా ఉండటానికీ * లేదా “మొదట్లో మా పూర్వీకులు షిర్కుకు పాల్పడ్డారు. మేము వారి తరువాతివారి సంతతిలో పుట్టినవారము. ఆ దుర్జనులు చేసిన పాపానికి నువ్వు మమ్మల్ని వినాశానికి గురిచేస్తావా?!” అని మీరు అనకుండా ఉండటానికిగాను (మేము ముందే మీ నుండి ఈ విధంగా ఖరారు చేయించాము.) * వారు (బహుదైవారాధన నుండి ఏకదైవారాధన వైపుకు) మరలివస్తారేమోనని మేము ఈ విధంగా ఆయతులను విడమరచి చెబుతున్నాము.
సహీ ముస్లిం 2865లో ఉంది, ఇయాజ్ బిన్ హిమార్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: అల్లాహ్ ఇలా తెలిపాడని: “నేను నా దాసులను ముస్లిములుగా, సత్యాన్ని స్వీకరించి బహుదైవత్వాలకు దూరంగా ఉండేవారిగా పుట్టించాను, కాని షైతానులు వారి వద్దకు వచ్చి వారిని సత్యధర్మం నుండి దూరం చేశారు, నేను వారి కొరకు హరాం (నిషిద్ధం) చేసిన దానిని హరాం చేశారు”.
అనస్ బిన్ మాలిక్ ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “అల్లాహ్ ప్రళయదినాన అతితక్కువ నరక శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిని అల్లాహ్ అడుగుతాడు: భూమిలో ఉన్న సమస్తం నీదై ఉంటే దానిని పరిహారంగా చెల్లించి నరకం నుండి రక్షణ పొందాలనుకుంటున్నావా? అతడు అవును అని అంటాడు, అప్పుడు అల్లాహ్ అంటాడు: నీవు ఆదం వీపులో ఉండగానే నేను నీతో దీనికంటే ఎంతో తేలికైన విషయం ఒకటి కోరాను: నీవు నాతో పాటు ఎవ్వరినీ భాగస్వామిగా చేయకు అని, కాని నీవు తిరస్కరించావు, నాకు భాగస్వాములకు నిలబెట్టావు”.
2) జ్యోతిష్యుని వద్దకు వెళ్లి సమాచారం అడిగేవాని ఎన్ని రోజుల నమాజ్ స్వీకరించబడదు?
C) 40 రోజుల
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారని సఫియ్య (రజియల్లాహు అన్హా) ప్రవక్తగారి ఒక భార్య ద్వారా ఉల్లేఖించారు:
“ఎవరైనా జ్యోతిష్యుని వద్దకు వచ్చి దేని గురించైనా అతన్ని ప్రశ్నిస్తే అతని నలబై రోజుల నమాజు స్వీకరించబడదు”. (ముస్లిం పదాలు 2230).
ఇది మనుషుల రూపంలో ఉన్నవారి వద్దకు వెళ్ళి అడగడం వరకే పరిమితం కాదు. ఈ రోజుల్లో కొందరు తమ జాతకలు తెలుసుకోడానికి టీవిలలో కొన్ని ప్రోగ్రామ్స్ ఫాలో అవుతుంటారు. మరి కొందరు స్మార్ట్ ఫోన్లో వచ్చిన ఆప్స్ లను ఫాలో అవుతారు
గుర్తుంచుకోండి:
వెబ్ సైట్లోకెల్లి జాతకం గురంచి వెతకడం కూడా ఈ హదీసులో వస్తుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి
మరో ముఖ్య విషయం: 40 రోజుల నమాజు అంగీకరింపబడదని అంటే వాటి పుణ్యం లభించదని భావం, కాని చేయకుండా ఉంటే అది మరింత ఘోరమైన పాపం అవుతుంది.
3) జనాజ నమాజ్ చేసి దానివెంట వెళ్లి ఖననం అయ్యేవరకు పాల్గొంటే ఎన్ని ఖిరాతుల పుణ్యం దొరుకుతుంది?
C) 02 ఖిరాతులు
జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం
గొప్ప పుణ్య కార్యాల్లో ఒకటి; జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం, దానిపై లభించే పుణ్యం బరువు మానవుని త్రాసులో ఉహద్ పర్వతం కంటే అధికిమించి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉబై బిన్ కఅబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
“ఎవరు నమాజు మరియు (ఖననం) అయ్యే వరకు జానాజ వెంట ఉంటాడో అతనికి రెండు ఖీరాతులు, మరెవరయితే కేవలం నమాజు అయ్యే వరకు దాని వెంట ఉంటాడో అతనికి ఒక ఖీరాతు లభిస్తుంది. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన (అంటే అల్లాహ్) సాక్షి! ఒక్క ఖీరాత్ బరువు అల్లాహ్ వద్ద ఉన్న త్రాసులో ఉహద్ పర్వతంకంటే ఎక్కువ ఉండును”. (అహ్మద్ 5/ 131 ఇది సహీ హదీస్).
ప్రవక్త ﷺ తెలిపారని, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు;
“ఎవరు జనాజలో పాల్గొని నమాజు చేస్తాడో అతనికి ఒక ఖీరాత్, మరెవరయితే (నమాజు మరియు) ఖననం అయ్యే వరకు పాల్గొంటాడో అతనికి రెండు ఖీరాతులు లభించును”. రెండు ఖీరాతులంటే ఏమిటి? అని ప్రశ్న వచ్చినప్పుడు, ప్రవక్త చెప్పారు: “రెండు పెద్ద కొండల వంటివి”. (బుఖారి 1325, ముస్లిం 945, తిర్మిజి 1040, నిసాయి 1940, ఇబ్ను మాజ 1539, అహ్మద్ 2/ 401, ఇబ్ను హిబ్బాన్ 3080)
ముస్లింలో ఉంది; ఇబ్ను ఉమర్ (రజియల్లాహు అన్హు) జనాజ నమాజు చేసుకొని వెళ్ళేవారు, ఎప్పుడయితే వారికి అబూహురైరా (రజియల్లాహు అన్హు) గారి ఈ హదీసు చేరిందో ‘వాస్తవానికి మనం అనేక ఖీరాతులు పోగుట్టుకున్నాము’ అని బాధ పడ్డారు.
ఒకరోజు జిబ్రీల్ అలైహిస్సలాం మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర కూర్చొని ఉండగా పై నుండి ఒక ద్వారం తెరువబడే శబ్దం వినిపించింది. జిబ్రీల్ అలైహిస్సలాం తల పైకెత్తి, ‘ఆకాశంలోని ఒక ద్వారం తెరువబడింది, ఇది దాని శబ్దమే. ఇంతకు ముందు ఎన్నడూ ఆ ద్వారం తెరువబడలేదు’. అని అంటుండగా ఆ ద్వారం గుండా ఒక దైవదూత దిగాడు, ఆ దైవదూత గురించి చెబుతూ, ‘భూమిపైకి దిగిన ఈ దైవ దూత, ఇంతకుముందు ఎన్నడూ దిగలేదు,’ అని అన్నారు. వెంటనే ఆ దైవదూత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు సలామ్ చేసి, ‘మీకు రెండు కాంతులు ఇవ్వబడినందుకు సంతోషించండి, అవి ఇతర ప్రవక్త లెవ్వరికీ ఇవ్వబడ లేదు. అవి (1) సూరహ్ ఫాతిహా, (2) సూరహ్ బఖరహ్ లోని చివరి ఆయతులు. మీరు వీటిలోని ఏ అక్షరాన్ని పఠించినా, దాని పుణ్యం మీకు లభిస్తుంది లేక ఏ దు’ఆ చేసినా అది అంగీకరించబడుతుంది” అని చెప్పాడు.
ملخص الجواب : أن خواتيم سورة البقرة آيات مدنية ، وأن إعطاء الله تعالى هذه الآيات لنبيه صلى الله عليه وسلم ليلة المعراج ، يحتمل أنه أوحى بهما إليه بلا واسطة ، ثم نزلتا مرة أخرى في المدينة ، أو أن الله بشره بنزول هذه الآيات عليه ، ثم نزلتا حقيقة في المدينة ، وأما حديث ابن عباس فيحتمل أنه نزول بالآيات ، أو نزول بالفضل ومالثواب .
[ఈ హదీసు వివరణ:-] రెండు వెలుగులంటే సూరహ్ ఫాతిహా (1), సూరహ్ బఖరహ్(2) చివరి వాక్యాలు. తీర్పుదినం నాడు ఈ రెండు వెలుగుగా మారుతాయి. వీటి వెలుగులో ఖుర్ఆన్ పఠించేవారు నడుస్తూ ఉంటారు. ”నూరుహుమ్ యస్ఆ బైన అయ్దీహిమ్” (సూర తహ్రీమ్ 66:8). మరియు సూరహ్ బఖరహ్ చివరి భాగం అంటే ”ఆమనర్రసూలు’ నుండి చివరి వరకు.
సూరహ్ ఫాతిహా చాలాప్రాధాన్యత ఉంది. దీని పేరు ఉమ్ముల్ ఖుర్ఆన్, సబ్’ఉమసా’నీ, సూరహ్ షిఫా’ సూరతుల్ క’న్జ్, సూరతు ‘స్సలాహ్, దీన్ని పఠించనిదే నమా’జ్ నెరవేరదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు,
”అల్లాహ్ ఆదేశం, ”నేను నమా’జ్ అంటే సూరహ్ ఫాతిహాను నాకూ నా దాసునికి మధ్య చెరిసగం పంచివేసాను. ఎవరు నన్ను ఏది కోరితే దాన్నే అతనికి ప్రసాదిస్తాను. ఒకవేళ దాసుడు, ‘అల్’హమ్దులిల్లాహి రబ్బిల్ ‘ఆలమీన్’ అని అంటే అల్లాహ్ ‘హమిదనీ అబ్దీ’ నా దాసుడు నన్ను స్తుతించాడు అని అంటాడు. దాసుడు ‘అర్ర’హ్మానిర్ర’హీమ్’ అని అంటే అల్లాహ్ ‘అస్నా’అలయ్య అబ్దీ’, నా దాసుడు నన్ను కీర్తించాడు అని అంటాడు. దాసుడు, ‘మాలికి యౌమిద్దీన్’ అంటే అల్లాహ్, ‘మజ్జదనీ అబ్దీ’, నా దాసుడు నా గొప్పతనాన్ని కొనియాడాడు, అని అంటాడు. దాసుడు, ‘ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్తయీన్,’ అని అంటే అల్లాహ్, ‘ఇది నాకు నా దాసునికి మధ్య ఉంది. దాసుడు ఏది కోరితే అది నేను ప్రసాదిస్తాను.’ ఆ తరువాత దాసుడు చివరి వరకు పఠిస్తే, అల్లాహ్, ‘ఇదంతా నా దాసునికోసమే ఉంది, అతడు ఏమి కోరితే అదే అతని కోసం ఉంది,’ అని అంటాడు.” (నిసాయి’)
ఈ సూరహ్ మొత్తం స్తోత్రం, కీర్తనం, ప్రార్థనలతో నిండి ఉంది. అందువల్లే దీన్ని వెలుగు అనడం జరిగింది. అదేవిధంగా సూరహ్ బఖరహ్ చివరి ఆయతులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఇందులో ప్రార్థన, ప్రార్థనా ఫలితం రెండూ ఉన్నాయి. అది, ‘ఆమనర్రసూలు నుండి చివరి వరకు.
తఫ్సీర్ ఇబ్నె కసీ’ర్లో ‘స’హీ’హ్ బు’ఖారీ ఉల్లేఖనంలో ఈ రెండిటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఈ విధంగా ఉంది, ”ఎవరు ఈ రెండు ఆయతులను రాత్రి పఠిస్తే అతని కొరకు అవి సరిపోతాయి.”
ముస్నద్ అ’హ్మద్లో ఇలా ఉంది. “సూరహ్ బఖరహ్ చివరి ఆయతులు దైవసింహాసనం క్రింద ఉన్న నిధిలో నుండి నాకు ఇవ్వ బడ్డాయి. నా కంటే ముందు ఏ ప్రవక్తకూ ఇవి ఇవ్వబడ లేదు.”
‘స’హీ’హ్ ముస్లిమ్లో ఇలా ఉంది, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మే’రాజ్ చేసినపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ”సిద్రతుల్ మున్తహా” వరకు వెళ్ళారు. అది ఏడవ ఆకాశంపై ఉంది. భూమి నుండి పైకి వెళ్ళే ప్రతి వస్తువు సిద్రతుల్ మున్తహా వద్దకు చేరుతుంది. ఇక్కడి నుండి తీసుకోవటం జరుగు తుంది. ఆకాశం నుండి వచ్చేది కూడా ఇక్కడి వరకే చేరుతుంది. ఇక్కడి నుండి తీసుకోబడుతుంది. దీన్ని బంగారు పిచ్చుకలు కప్పి ఉంటాయి. ఇక్కడ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు 3 వస్తువులు ఇవ్వ బడ్డాయి. (1) 5 పూటల నమా’జులు, (2) సూరహ్ బఖరహ్ చివరి ఆయతులు, (3) ఏకదైవారాధకులందరి క్షమాపణ.
ముస్నద్లో ఇలా ఉంది, ” ‘ఉఖ్బహ్ బిన్ ‘ఆమిర్తో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు, ”సూరహ్ బఖరహ్ లో ఈ చివరి ఆయతులు ఎల్లప్పుడూ పఠిస్తూ ఉండు. నాకు అవి దైవసింహాసనం క్రింది నిధి నుండి ఇవ్వబడ్డాయి.”
ఇబ్నె మర్ద్వైలో ఇలా ఉంది, “మాకు ఇతరులపై మూడు విధాలా ఆధిక్యత లభించింది. సూరహ్ బఖరహ్ చివరిఆయతులు, ఇవి దైవసింహాసనం క్రింది నిధి నుండి ఇవ్వబడ్డాయి. నా కంటే ముందు ఎవ్వరికీ ఇవ్వబడ లేదు. నా తరువాత కూడా ఎవ్వరికీ ఇవ్వబడవు.”
ఇబ్నె మర్ద్వైలో ఇలా ఉంది. ‘అలీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “ముస్లిముల్లోని ఎవరైనా ఆయతుల్ కుర్సీ మరియు సూరహ్ బఖరహ్ చివరి వాక్యాలు చదవకుండా పడుకుంటారని నేననుకోను. ఇవి మీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు దైవసింహాసనం క్రింద ఉన్న నిధి నుండి లభించాయి.“
మరో తిర్మిజి 2882′ ‘హదీసు’లో ఇలా ఉంది, “అల్లాహ్ భూమ్యా కాశాలను సృష్టించడానికి రెండువేల సంవత్సరాల ముందు ఒక గ్రంథం వ్రాయబడింది. ఇందులో రెండు ఆయతులు లిఖించి సూరహ్ బఖరహ్ పూర్తి చేయబడింది. ఎవరి ఇంటిలో మూడు రోజుల వరకు పఠించబడుతుందో, ఆ ఇంటి సమీపానికి కూడా షై’తాన్ రాలేడు.” (షేక్ అల్బానీ సహీ అన్నారు.)
ఇబ్నె మర్ద్వైహ్లో ఇలా ఉంది, ”ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సూరహ్ బఖరహ్ చివరి ఆయతులు, ఆయతుల్ కుర్సీ పఠిస్తే నవ్వుతారు, ఇంకా ఈ రెండు దైవసింహాసనం క్రింద నిధి నుండి లభించాయి,” అని అంటారు.
కొన్ని ‘హదీసు’ల్లో ఇలా ఉంది,
“దాసుడు, ‘గుఫ్రానక రబ్బనా,’ అని ప్రార్థిస్తే అల్లాహ్ , ‘నఅమ్, నేను నీ పాపాలను క్షమించాను,’ అని అంటాడు, ఒకవేళ దాసుడు ”రబ్బనా, లాతుఆ’ఖిజ్’నా,” – ‘ఓ అల్లాహ్ మా పాపాల పట్ల మమ్మల్ని విచారించకు,’ అని అంటే అల్లాహ్ సమాధానంగా, ‘నేనలాగే చేస్తాను,’ అని అంటాడు. ఒకవేళ, ”లాత’హ్మిల్ ‘అలైనా,” – ‘నాకు శక్తిలేని భారం వేయకు,’ అని అంటే అల్లాహ్, ‘నేనలాగే చేస్తాను, అంటే శక్తికి మించిన బరువు వేయనని’ అంటాడు, ఒకవేళ దాసుడు, ”వ ‘అఫు అన్నా” – ‘ఓ అల్లాహ్ నన్ను క్షమించు,’ అని అంటే అల్లాహ్, ‘నేను క్షమించివేస్తాను,’ అని అంటాడు. ఒక వేళ, ”వ’గ్ఫిర్లనావర్’హమ్నా,” – ‘మమ్మల్నిక్షమించు కరుణించు,’ అని అంటే అల్లాహ్ , ”మేము క్షమిం చాము, కరుణించాము,” అని అంటాడు. ఒకవేళ, ”ఫన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్,” – ‘మాకు అవిశ్వా సులపై సహాయం చేయి,’ అని అంటే అల్లాహ్ , ”మేము మీకు సహాయం చేసాము అని అంటాడు.”
2) అప్పగింతలో ద్రోహం – అబద్ధం – వాగ్ధాన భంగం – మరియు దుర్భాషలాడటం ఈ 4 లక్షణాలు ఎవరిలో ఉంటాయి?
C] మునాఫిక్
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
”ఏ వ్యక్తిలో ఈ 4 గుణాలుంటాయో అతడు ఖచ్చితంగా కపటాచారియే. ఎవరిలోనైనా వీటిలోని ఒక్క గుణం ఉంటే అతడు దానిని వదలనంత వరకు అతనిలో ఒక కాపట్య చిహ్నం ఉన్నట్టే. ఆ 4 గుణాలు ఇవి: 1. అమానతు ఉంచబడితే ద్రోహం తలపెడతాడు; 2. మాట్లాడితే అసత్యం పలుకుతాడు; 3. వాగ్దానం చేస్తే వాగ్దానభంగం చేస్తాడు; 4. వివాదం తలెత్తితే తిట్లకు దిగుతాడు”. (బు’ఖారీ, ముస్లిమ్)
3) అల్లాహ్ వద్ద పుణ్య పరంగా అతి గొప్ప గుటక ఏది?
A) కోపం దిగమింగే గుటక
అల్లాహ్ కొరకు కోపాన్ని దిగమింగుట
ప్రవక్త ﷺ ఉపదేశించారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“అల్లాహ్ వద్ద పుణ్యపరంగా అతి గొప్ప గుటక, అల్లాహ్ అభీష్ఠానికై దాసుడు మింగే కోపాగ్ని గుటక”. (ఇబ్ను మాజ 4189, అహ్మద్ 2/ 128, అదబుల్ ముఫ్రద్ 1318, సహీహుత్తర్గీబ్: అల్బానీ 2752).
ఇలాంటి ఎన్ని సందర్భాలు మనకు ఎదురవుతాయో, అప్పుడు మనం ఈ హదీసును, ఈ గొప్ప పుణ్యఫలితాన్ని గుర్తుకు తెచ్చుకుంటామా? అల్లాహ్ కొరకు మన కొపాన్ని మింగి పుణ్యాన్ని పొందుతామా?
కోపం వచ్చినప్పుడు కోపం ప్రకారం ఆచరించడానికి శక్తి ఉండికూడా కోపాన్ని దిగమ్రింగేవారిని అల్లాహ్ సుబ్ హానహు వతఆలా ప్రశంసించి, వారికి మన్నింపు, క్షమాపణ, స్వర్గప్రవేశ శుభవార్త ఇచ్చాడు.
“ఎవరు కలిమిలోనూ, లేమిలోనూ (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తారో మరియు కోపాన్ని దిగమ్రింగుతారో ఇంకా ప్రజలను మన్నిస్తారో, (ఇలాంటి) సజ్జనులను అల్లాహ్ ప్రేమిస్తాడు. మరెవరైతే (వారి ద్వారా) ఏదైనా అశ్లీల పని జరిగితే లేదా వారు తమపై అన్యాయం చేసుకుంటే, వెంటనే అల్లాహ్ ను స్మరించి తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. –నిజానికి అల్లాహ్ తప్ప పాపాలను క్షమించేవాడెవడున్నాడు?- వారి ద్వారా జరిగింది తప్పు అని తెలిసినప్పుడు దానిపై హటం చెయ్యరు (మంకుపట్టు పట్టరు). ఇలాంటి వారి ప్రతిఫలం, వారి ప్రభువు నుండి క్షమాభిక్ష మరియు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సత్కార్యాలు చేసే వారికి ఎంతో శ్రేష్ఠమైన ప్రతిఫలం ఉంది”. (ఆలె ఇమ్రాన్ 3:134-136).
ఈ ఘనమైన ఫలం పైన మరో ప్రతిఫలం ఏమిటంటే; అతనికిష్టమైన హూరె ఐన్ (అందమైన పెద్ద కళ్ళుగల స్వర్గపు సుందర కన్య)ను ఎన్నుకునే స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. సహల్ బిన్ ముఆజ్ తన తండ్రితో ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:
“ఎవరు తన కోపాన్ని దిగమింగుతాడో, అతను దానిని అమలు పరచడానికి శక్తి ఉండి కూడా (దిగమింగుతాడో), అల్లాహ్ ప్రళయదినాన అతనిని ప్రజల ఎదుట పిలుస్తాడు, అతనికిష్టమైన హూరె ఐన్ ను ఎన్నుకునే అధికారం ఇస్తాడు”. (అబూదావూద్ 4777, తిర్మిజి 2493, ఇబ్నుమాజ 4186, అల్బానీ సహీహుత్తర్గీబ్ 2753లో హసన్ అని చెప్పారు).
ఏదైనా ప్రాపంచిక వృధాకార్యం కోసం నీవు ఇంతటి గొప్ప పుణ్యాన్ని వదులుకుంటావా? ప్రజల్ని ఓటమికి గురి చేసేవాడు శక్తిశాలి కాదు, తన కోపాన్ని దిగమ్రింగేవాడు అసలైన శక్తిశాలి. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:
“ఎదుటి వానిని చిత్తుచేసినవాడు శూరుడు కాదు, తాను ఆగ్రహానికి గురైనప్పుడు తన్ను తాను అదుపులో ఉంచుకున్నవాడే అసలైన శూరుడు”. (బుఖారి 6114, ముస్లిం 2609, అహ్మద్ 2/ 236.).
وكان عند ميمون بن مهران ضيف، فاستعجل على جاريته بالعشاء، فجاءت مسرعة ومعها قصعة مملوءة، فعثرت وأراقتها على رأس سيدها ميمون، فقال: يا جارية أحرقتني، قالت: يا معلم الخير، ومؤدب الناس، ارجع إلى ما قال الله تعالى، قال: وما قال الله تعالى؟ قالت: قال: ﴿ وَالْكَاظِمِينَ الْغَيْظَ ﴾ [آل عمران: 134]، قال: قد كظمت غيظي، قالت: ﴿ وَالْعَافِينَ عَنِ النَّاسِ ﴾ [آل عمران: 134]، قال: قد عفوت عنك، قالت: زِد؛ فإن الله تعالى يقول: ﴿ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ ﴾ [آل عمران: 134]، قال: أنت حرة لوجه الله تعالى [إحياء علوم الدين].
رابط الموضوع:
“నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే“.(ఖురాన్ – 51 : 56)
షాబాన్ నెల ఇది ఇస్లాం నెలలో 8వ నెల ఈ నెల యెుక్క విశిష్టత ఏమిటంటే ఎంతో ఘనత కల్గిన రంజాన్ నెలను తనతో పాటు తెస్తుంది. అంటే ఈ నెల తరువాత వచ్చేది రంజాన్ నెల.
షాబాన్ మాసంలో ఇస్లాం అనుమతిస్తున్న మనం చేయవలసిన సత్కార్యాల్లో అతి ముఖ్యమైనది ఉపవాసం. స్వయంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) షాబాన్ లో అత్యధికంగా ఉపవాసాలు పాటించేవారు. చూసేవారికి నెలంతా ఉపవాసమున్నారా అనిపించేది.
ఆయిషా (రజియల్లాహు అన్హా) చెప్పారు: “ప్రవక్తకు ఉపవాసం ఉండటానికి చాలా ప్రీతికరమైన మాసం షాబాన్ మాసం, ఈ మాసంలో ఉపవాసం పాటిస్తూ రమజాను వచ్చేసేది”.(అబూదావూద్ 2431).
وعن عائشة رَضِيَ اللهُ عنها قالت: لَمْ يكن النبي – صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ – يَصُومُ مِنْ شَهْرٍ أكْثَرَ مِنْ شَعْبَانَ، فَإنَّهُ كَانَ يَصُومُ شَعْبَانَ كُلَّهُ
ఆయిషా (రజియల్లాహు అన్హా) ఇలా తెలిపారు: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) షాబాన్ నెలలో (నఫిల్) ఉపవాసాలు పాటించినంతగా మరే ఇతర నెలలోనూ పాటించేవారు కాదు. నిశ్చయంగా ఆయన షాబాన్ నెలసాంతం ఉపవాసం పాటించేవారు. వెరొక ఉల్లేఖనం ప్రకారం షాబాన్ నెలలోని కొన్ని రోజులు మినహాయించి మిగతా రోజులన్నీ ఆయన ఉపవాసం పాటించేవారు”. (బుఖారీ 1969, ముస్లిం 1156)
మానవుల కర్మలు పైకి లేపబడే మాసం
ప్రవక్త షాబాన్ మాసంలో అత్యధికంగా ఉపవాసాలు పాటించటానికి గల కారణాన్ని వేరొక హదీసు ఈ విధంగా వివరించింది:
“ఇది రజబ్ మరియు రమజాను మధ్యలోని మాసం, ప్రజలు దాని పట్ల అశ్రద్ధగా ఉంటారు.దాసుల కర్మలు షాబాన్ మాసంలో అల్లాహ్ సన్నిధిలో ప్రవేశపెట్టబడతాయి. నేను ఉపవాసంలో ఉన్న స్థితిలోనే నా కర్మలు అల్లాహ్ సన్నిధిలో ప్రవేశపెట్టబడాలన్న కోరిక నాది“. (నసాఈ 2357, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ హసన్ అన్నారు.)
“ప్రతి సోమవారము మరియు గురువారాల్లో మానవుల ఆచరణలు ప్రవేశపెట్టబడతాయి”.ఈ హదీసు పైన కూడా శ్రద్ద వహించాలి.
హజ్రత్ అబూహురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:
“సోమ మరియు గురువారాల్లో (అల్లాహ్ సన్నిదిలో దాసుల) ఆచరణలు ప్రవేశపెట్టబడతాయి. అందుకని నేను ఉపవాసిగా ఉన్న స్ధితిలో నా ఆచరణ ప్రవేశపెట్టడాన్ని నేనిష్టపడతాను“.(తిర్మిజి- హసన్ , రియాదుస్ సాలిహీన్ :1257#)
పై హదీసులో రెండు లాభాలున్నాయి.
1. ప్రజలు అశ్రద్ధగా ఉన్నప్పుడు అల్లాహ్ ఆరాధన ఘనత చాలా గొప్పగా ఉంది.
ప్రత్యేకంగా ఉపవాసం, ఇందులో బాహ్యతనం లేదు. ఇఖ్లాస్ (చిత్తశుద్ధి) ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సత్కార్యం అందరూ చేస్తున్నప్పుడు వారిని చూసి చేయని వాడు కూడా ఆ సత్కార్యం చేయడానికి పూనుకుంటాడు, కాని ఎవరు చేయని సమయంలో సత్కార్యం చేయాలని ఆలోచన రావడం, ఆలోచన వచ్చినా నేను ఒక్కణ్ణి చేస్తే ఎవరేమంటారో అనే దురాలోచనకు దూరమైన ప్రత్యేక శ్రధ్ధతో, అల్లాహ్ సంతృష్టి ఉద్దేశ్యంతో చేయడం ఎంతో గొప్ప విషయే కాకుండా అత్యధిక పుణ్యానికి కూడా అర్హత కల్పిస్తుంది. ఇలాంటి వారికి ప్రవక్త ఎంత గొప్ప శుభవార్త ఇచ్చారో ఈ హదీసు చదవండి:
“మీ తర్వాత ఓర్పుసహనాల ఓ కాలం రానుంది, ఆ కాలంలో ధర్మంపై స్థిరంగా ఉన్న వ్యక్తికి 50 మంది అమరవీరుల పుణ్యం ఉంటుంది”. (తబ్రానీ కబీర్ 10394, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 2234లో సహీ అన్నారు.)
అబూ దావూద్ 4341లోని హదీసులో ఉంది:
“మీ తర్వాత ఓర్పు సహనాల ఓ కాలం రానుంది, అప్పుడు (ధర్మంపై స్థిరంగా ఉంటూ) సహనం వహించడం నిప్పులను చేత్తో పట్టుకోవడంతో సమానం. అప్పుడు సత్కార్యాలు చేసే వ్యక్తికి మీలోని 50 మందికి లభించే పుణ్యం లభిస్తుంది.”
2) ఈ మాసంలో సత్కార్యాలు అల్లాహ్ సన్నిధిలో ప్రవేశపెట్టబడతాయి.
అల్లాహు అక్బర్! గమనించండి: సాయంకాలం యజమాని ముందు పొద్దంతా చేసిన పని గురించి లెక్క చెప్పవలసి ఉంది అని తెలిసినప్పుడు ఆ పొద్దంతా ఎలా పనిచేస్తాడు ఆ గుమాస్త? మరి ప్రతి రోజు ఫజ్ర్ మరియు అస్ర్ లో రెండు సార్లు వారంలో ప్రతి సోమ, గురు రెండు రోజులు సంవత్సరంలో ఈ షాబాన్ మాసంలో మన కర్మలన్నీ అల్లాహ్ ముందు ప్రవేశపెట్టబడుతున్నప్పుడు మనం పాపాలకు ఎంత దూరంగా ఉండాలి. సత్కార్యాలు ఎంత ఎక్కువగా చేస్తూ ఉండాలి అర్థమవుతుంది కదా!
కాని ప్రజల సులభతరానికి, వారికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఎంతగా కాంక్షించేవారంటే, షాబాన్ 15రోజులు గడిసిన తర్వాత ఉపవాసం పాటించకూడదని ఆదేశించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “షాబాన్ సగం గడిచిపోయాక ఉపవాసం ఉండకండి”. (అబూదావూద్ 2337)
హదీసు వ్యాఖ్యానకర్తలు చెప్పారు: ప్రజలు షాబాన్ చివరి వరకు ఉపవాసాలు పాటించి, రమజానులో ఫర్జ్ (విధి) ఉపవాసాలు పాటించడంలో బలహీనులు కాకూడదని సగం షాబాన్ తర్వాత ఉపవాసాలు పాటించడం నుండి వారంచబడినది.
అల్లాహ్ మనందరికీ సద్బుద్ధిని మరియు సంపూర్ణ ఇస్లామ్ జ్ఞానాన్ని మరియు దాని మీద జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.
1) ఒక వ్యక్తి పుణ్యం మరియు పేరు ప్రఖ్యాతుల కొరకు పోరాటం చేస్తే అతనికి ఏమి దక్కుతుంది?
C] అతనికి ఏ పుణ్యం దక్కదు
ప్రతి కార్యానికి పునాది సంకల్పశుద్ధి. ఏ కార్యం ఎంత సంకల్ఫశుద్ధితో కూడుకొని ఉంటుందో త్రాసులో అంతే బరువుగా ఉంటుంది, అది కొంచమైనా సరే. ఒకవేళ చూపుగోలు, పేరు, ప్రఖ్యాతులతో సమ్మిళితమై ఉంటే త్రాసు తేలికగా ఉంటుంది, అది ఎంత ఎక్కువగా అయినప్పటికీ సూక్ష్మకణాలుగా, దుమ్ము, ధూళివలే అయిపోతుంది (అంటే రవ్వంత పుణ్యం లభించదు). అల్లాహ్ సుబ్ హానహు వతఆలా వద్ద కర్మల ఘనత, వాటిని చేసేవారి మనస్సులో ఉండే సంకల్పశుద్ధిని మరియు వారిలో ఉండే అల్లాహ్ పట్ల ప్రేమను బట్టి పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది.
అబూ ఉమామహ్ బాహిలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఓ మనిషి వచ్చి, ‘ఒక వ్యక్తి పుణ్యఫలం మరియు పేరుప్రఖ్యాతులనుద్దేశించి పోరాడుతుంటే అతనికి ప్రాప్తమయ్యేదేమిటి?’ అని అడిగాడు. “అతనికి ఏ పుణ్యమూ దక్కదు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిచ్చారు. ఆ మనిషి తిరిగి మూడు సార్లు అదే ప్రశ్న అడిగాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతనికి ఏ పుణ్యమూ దక్కదు” అని మూడు సార్లు జవాబిచ్చారు, మళ్ళీ ఆ తర్వాత ఇలా చెప్పారు: “అల్లాహ్ సంకల్పశుద్ధితో, ఆయన అభీష్టాన్ని కోరుతూ చేసిన సత్కార్యాన్ని మాత్రమే స్వీకరిస్తాడు”. (నిసాయి 3140, తబ్రానీ కబీర్ 7628, సహీహుల్ జామి 1856).
అబ్దుల్లాహ్ బిన్ ముబారక్ రహిమహుల్లాహ్ చెప్పారు: ‘ఒక చిన్న కార్యాన్ని సంకల్పం గొప్పదిగా, పెద్దదిగా చేయవచ్చు, ఒక పెద్ద కార్యాన్ని సంకల్పం చిన్నదిగా చేయవచ్చు’. (జామిఉల్ ఉలూమి వల్ హికం, రచయితః ఇబ్ను రజబ్ అల్ హంబలీ 1/71).
మైమూన్ బిన్ మహ్రాన్ రహిమహుల్లాహ్ చెప్పారు: ‘మీ ఆచరణలు ఉన్నవే చాలా తక్కువ, ఆ తక్కువవాటిని సంకల్పశుద్ధితో ఆచరించండి’. (హిల్ యతుల్ ఔలియా వ తబ్ ఖతుల్ అస్ఫియా, రచయితః అబూ నుఐమ్ 4/92).
ఇఖ్లాస్ (సంకల్పశుద్ధి)తో కూడుకొని ఉన్న సత్కార్యం యొక్క పుణ్యం ఎలా పెరుగుతుందో ఈ హదీసు చదవండి. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త ﷺ చెప్పారు:
“ఒక దిర్హమ్ ఒక లక్ష దిర్హములపై గెలుపొందింది”. అదెలా ప్రవక్తా! అని సహచరులు అడగ్గా, ఇలా సమాధానమిచ్చారుః “ఒక వ్యక్తి వద్ద రెండే రెండు దిర్హములు ఉండగా అతను అందులో నుండి ఒక దిర్హమ్ దానం చేశాడు, మరో వ్యక్తి తన ధన బంఢారం వైపనకు వెళ్ళి అందులో నుండి ఒక లక్ష దానం చేశాడు”.
“ما أهلَّ مُهِلٌّ قط إلا بُشِّرَ، ولا كَبَّر مُكَبِّرٌ قط إلا بُشِّرَ”. قيل: يا رسول الله! بالجنة؟ قال: “نعم”.
తల్బియా చదివిన మరియు అల్లాహు అక్బర్ అని పలికిన వారికి శుభవార్త ఇవ్వడం జరుగుతుంది, ప్రవక్తా! స్వర్గ శుభవార్తనా? అని అడిగారు, అందుకు ప్రవక్త అవును అని చెప్పారు.
3) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) తెల్పినటువంటి ” నాలుకపై సులభంగానూ ..త్రాసులో బరువుగానూ ఉండే ఆ రెండు వాక్యాలు ఏవి ?
సహీ బుఖారీలోని చివరి హదీసు, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారుః
كَلِمَتَانِ خَفِيفَتَانِ عَلَى اللِّسَانِ، ثَقِيلَتَانِ فِي المِيزَانِ، حَبِيبَتَانِ إِلَى الرَّحْمٰنِ: سُبْحَانَ الله وَبِحَمْدِهِ ، سُبْحَانَ الله العَظِيمِ
“రెండు పదాలున్నాయి, అవిః నాలుకపై చాలా సులభంగా, త్రాసులో బరువుగా మరియు కరుణామయునికి చాలా ప్రియమైనవి. అవేః సుబ్ హానల్లాహి వబిహందిహీ సుబ్ హానల్లాహిల్ అజీం”. (బుఖారి 6406, ముస్లిం 2694).
అనేక మందికి ఈ రెండు పదాల ఘనత తెలుసు, కాని త్రాసు బరువు కావటానికి చదివేవారు చాలా అరుదు. (మరికొందరికైతే) ఏదైనా కల్చరల్ ప్రోగ్రాముల్లో పోటాపోటీలు, కాంపిటేషన్లు జరుగుతున్నప్పుడు అందులో ఇలాంటి ప్రశ్న ఏదైనా వచ్చినప్పుడు అవి గుర్తుకు వస్తాయి. (ఇది ఎంత దారుణంॽॽॽ).
You must be logged in to post a comment.