ఖుర్ఆన్ ద్వారా స్వస్థత (షిఫా) ఎలా పొందాలి? [వీడియో]

బిస్మిల్లాహ్

[52:36నిముషాలు]
The Qur’an is a Cure
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

10:57  يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ وَشِفَاءٌ لِّمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ

ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్నవ్యాధుల నుంచి స్వస్థత నొసగేది, నమ్మేవారి కోసం మార్గదర్శకం, కారుణ్యం.

10:58  قُلْ بِفَضْلِ اللَّهِ وَبِرَحْمَتِهِ فَبِذَٰلِكَ فَلْيَفْرَحُوا هُوَ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ

(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “అల్లాహ్‌ ప్రదానం చేసిన ఈ బహుమానానికి, కారుణ్యానికి జనులు సంతోషించాలి. వారు కూడబెట్టే దానికంటే ఇది ఎంతో మేలైనది.”

17:82  وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ ۙ وَلَا يَزِيدُ الظَّالِمِينَ إِلَّا خَسَارًا

మేము అవతరింపజేసే ఈ ఖుర్‌ఆన్‌ విశ్వాసుల కొరకు ఆసాంతం స్వస్థత, కారుణ్య ప్రదాయిని. అయితే దుర్మార్గులకు (దీని వల్ల) నష్టం కలగటం తప్ప మరే వృద్ధీ జరగదు.

41:44  وَلَوْ جَعَلْنَاهُ قُرْآنًا أَعْجَمِيًّا لَّقَالُوا لَوْلَا فُصِّلَتْ آيَاتُهُ ۖ أَأَعْجَمِيٌّ وَعَرَبِيٌّ ۗ قُلْ هُوَ لِلَّذِينَ آمَنُوا هُدًى وَشِفَاءٌ ۖ وَالَّذِينَ لَا يُؤْمِنُونَ فِي آذَانِهِمْ وَقْرٌ وَهُوَ عَلَيْهِمْ عَمًى ۚ أُولَٰئِكَ يُنَادَوْنَ مِن مَّكَانٍ بَعِيدٍ

ఒకవేళ మేము ఈ ఖుర్‌ఆను (గ్రంథము)ను అరబ్బీయేతర ఖుర్‌ఆన్‌గా చేసివుంటే, “దీని వాక్యాలు స్పష్టంగా ఎందుకు వివరించబడలేదు? (ఇదేమిటయ్యా!) ఇదేమో అరబ్బీయేతర గ్రంథమూను, నువ్వేమో అరబీ ప్రవక్తవా!” అని వారు చెప్పి ఉండేవారు. (ఓ ప్రవక్తా!) నువ్వు వారికి చెప్పేయి: “ఇది విశ్వసించిన వారికోసం మార్గదర్శిని, ఆరోగ్య ప్రదాయిని. కాని విశ్వసించని వారి చెవులలో మాత్రం బరువు (చెవుడు) ఉంది. పైగా ఇది వారి పాలిట అంధత్వంగా పరిణమించింది. వారు బహు దూరపు చోటు నుంచి పిలువబడే జనుల్లా ఉన్నారు.”

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran

%d bloggers like this: