మనశ్శాంతి ఎలా సాధ్యం? [ఆడియో]

బిస్మిల్లాహ్

[4:00 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

జిక్ర్ ,దుఆ మెయిన్ పేజీ
https://teluguislam.net/dua-supplications/

నమాజు మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/

నమాజు తర్వాత చదివే జిక్ర్ ఘనత [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

నమాజు తర్వాత చదివే జిక్ర్ ఘనత
https://youtu.be/_eBuDfQT_qU [27 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాలు సంపాదించే మార్గాల గురించి వివరించబడింది. ముఖ్యంగా, ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన దుఆలు మరియు జిక్ర్ యొక్క ప్రాముఖ్యత నొక్కిచెప్పబడింది. 10 సార్లు తస్బీహ్ (సుబ్ హా నల్లాహ్), తహ్మీద్ (అల్హమ్దులిల్లాహ్), మరియు తక్బీర్ (అల్లాహు అక్బర్) పఠించడం ద్వారా స్వర్గ ప్రవేశం మరియు ప్రళయ దినాన 1500 పుణ్యాలు లభిస్తాయని ఒక హదీసు ఉటంకించబడింది. అలాగే, నిద్రపోయే ముందు 33 సార్లు తస్బీహ్, 33 సార్లు తహ్మీద్, 34 సార్లు తక్బీర్ పఠించడం వల్ల 1000 పుణ్యాలు వస్తాయని చెప్పబడింది. మరో హదీసు ప్రకారం, ప్రతి నమాజ్ తర్వాత 33 సార్లు ఈ జిక్ర్‌లు చేయడం హజ్, ఉమ్రా, దానధర్మాలు మరియు జిహాద్ చేసినంత పుణ్యాన్ని ఇస్తుందని, మరియు 100వ సారిగా “లా ఇలాహ ఇల్లల్లాహ్…” పఠించడం సముద్రపు నురుగు అంత పాపాలను కూడా క్షమింపజేస్తుందని వివరించబడింది. ఫజ్ర్ మరియు మగ్రిబ్ నమాజ్‌ల తర్వాత 10 సార్లు “లా ఇలాహ ఇల్లల్లాహ్…” పఠించడం ద్వారా లభించే ప్రత్యేకమైన లాభాలు, షైతాన్ నుండి రక్షణ మరియు స్వర్గాన్ని వాజిబ్ చేసే పుణ్యాల గురించి కూడా చర్చించబడింది.

బిస్మిల్లాహిర్రహ్మా నిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్

మహాశయులారా! ఈరోజు మనం అల్లాహ్ యొక్క దయవల్ల, చాలా తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాలు పొందే అటువంటి కొన్ని సత్కార్యాల గురించి ఇన్షాఅల్లాహ్ తెలుసుకుందాము.

ఇందులో ప్రత్యేకంగా, ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని దుఆలు మనకు నేర్పారు. వాటి యొక్క ఘనత అనేది మహా గొప్పగా ఉంది. ఒకవేళ మనం ఫర్ద్ నమాజ్ తర్వాత రెండు నిమిషాలు, మూడు నిమిషాలు నమాజ్ చేసుకున్న స్థలంలోనే కూర్చుండి ఆ దుఆలను మనం చూసి చదివినా గానీ, ఇన్షాఅల్లాహ్ మహా గొప్ప పుణ్యాలు మనం పొందగలుగుతాము.

ఉదాహరణకు, చాలా చిన్నపాటి కార్యం. అందులో ఒక నిమిషం కాదు, అర నిమిషం కూడా పట్టదు. కానీ అల్లాహ్ యొక్క దయవల్ల పుణ్యాలు అనేటివి మహా గొప్పగా ఉన్నాయి. ఉదాహరణకు ఈ హదీస్ పై గమనించండి, సునన్ అబీ దావూద్ లో ఈ హదీస్ ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

خَصْلَتَانِ
[ఖస్ లతాని]
రెండు అలవాట్లు/గుణాలు

لَا يَعْمَلُ بِهِمَا عَبْدٌ مُسْلِمٌ إِلَّا دَخَلَ الْجَنَّةَ
[లా య’అమలు బిహిమా అబ్దున్ ముస్లిమున్ ఇల్లా దఖలల్ జన్నహ్]
ఏ ముస్లిం దాసుడైతే వాటిని ఆచరిస్తాడో, తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తాడు.

గమనించండి. రెండు మంచి అలవాట్లు, రెండు సత్కార్యాలు, ఏ ముస్లిం దాసుడు వాటిని పాటిస్తాడో తప్పకుండా స్వర్గంలో పోతాడు. అల్లాహు అక్బర్. ఆ రెండిటినీ పాటించిన వారు వారికి ఏం శుభవార్త ఇవ్వబడింది? స్వర్గ ప్రవేశం.

وَهُمَا يَسِيرٌ، وَمَنْ يَعْمَلُ بِهِمَا قَلِيلٌ
[వహుమా యసీరున్, వమన్ య’అమలు బిహిమా ఖలీలున్]
అవి చాలా సులభమైనవి, కానీ వాటిని ఆచరించేవారు చాలా తక్కువ.

అవి రెండూ చాలా స్వల్పమైనవి. కానీ వాటిని ఆచరించే వారు చాలా అరుదు, చాలా తక్కువ మంది.

ఇప్పుడు రెండు విషయాలు మన ముందుకు వచ్చాయి. ఒకటి, ఆ రెండు సత్కార్యాల ఘనత తెలిసింది. ఏంటి ఘనత? స్వర్గ ప్రవేశం. అంటే ఆ రెండు పనులు, ఆ రెండు కార్యాలు చేస్తే మనకు స్వర్గం లభిస్తుంది అని చెప్పారు ప్రవక్త. కానీ వెంటనే ఏం చెప్పారు? అవి చూడడానికి చాలా చిన్నగానే ఉన్నాయి, స్వల్పంగానే ఉన్నాయి. కానీ దాని మీద ఆచరించే వారు చాలా తక్కువ మంది ఉన్నారు.

అందులో ఒకటి ఏమిటంటే, ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత, 10 సార్లు సుబ్ హా నల్లాహ్, 10 సార్లు అల్హమ్దులిల్లాహ్, 10 సార్లు అల్లాహు అక్బర్ చదవడం.

ఇంత చెప్పిన తర్వాత ప్రవక్త గారు దాని యొక్క మరో లాభం చెప్పారు. అదేమిటి? చెప్పారు, ఈ 10, 10 సార్లు చదివితే ఎన్ని అయినాయి? 30. ఐదు నమాజుల్లో ఐదు 30 లు, 150. ప్రవక్త చెప్పారు, నాలుకపై ఇవి 150. కానీ ప్రళయ దినాన ఎప్పుడైతే తూకం చేయబడతాయో అప్పుడు 1500. 1500 పుణ్యాలు మనకు లభిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ సత్కార్యం చేయడం వల్ల మనకు ఒకటి, స్వర్గ ప్రవేశ శుభవార్త లభించింది. రెండవది, 1500 సత్కార్యాలు, 1500 పుణ్యాలు మనకు లభిస్తాయి అని కూడా మనకు తెలిసింది. ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత 10, 10 సార్లు ఇలా చదవడం ఏమైనా కష్టమవుతుందా? ఒకవేళ మనం ఆలోచించుకుంటే ఏ మాత్రం కష్టం కాదు. కానీ దానికి చదివే అలవాటు అనేది ఉండాలి.

ఇందులోనే రెండో విషయం ఏంటిది? పడుకునే ముందు 33 సార్లు సుబ్ హా నల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, 34 సార్లు అల్లాహు అక్బర్ అనాలి. ఎన్ని అయినాయి? 100. కానీ ప్రళయ దినాన ఇవి 1000 కి సమానంగా ఉంటాయి, అంటే మనకు 1000 పుణ్యాలు లభిస్తాయి.

అయితే ప్రవక్త గారి సహచరులు ఈ ఘనతలు విని ఊరుకుండలేదు. మరో ప్రశ్న అడిగారు. అదేమిటి? ప్రవక్తా, ఇంత గొప్ప పుణ్యం లభిస్తుంది, ఇంత చిన్నటి సత్కార్యం. కానీ మీరు ఒక మాట చెప్పారు, వాటిపై ఆచరించేవాళ్ళు చాలా తక్కువ మంది అని. అలా ఎందుకు చెప్పారు? వీటిని ఆచరించడంలో ఏంటి కష్టం? మాకేం కష్టం అనిపించడం లేదు కదా.

గమనించండి, ప్రవక్త గారు చెప్పారు, మనిషి ఎప్పుడైతే నమాజ్ పూర్తి ప్రవక్త చెప్పిన ఈ జిక్ర్ చేయడానికి కూర్చుంటాడో, షైతాన్ వాడు వచ్చి అతనికి ఏదో ఒక విషయం గుర్తు చేస్తాడు. డ్యూటీలో లేట్ అవుతుంది. అయ్యో వర్క్ షాప్ లో తొందరగా వెళ్ళేది ఉంది. ఆ, కూరగాయలు తీసుకొచ్చేది ఉంది. అరె, ఇంట్లో భార్య గుర్తు చేస్తుంది. ఏదో ఒక మాట. షైతాన్ వాడు గుర్తు చేస్తాడు, మనిషి ఈ జిక్ర్ చేయకముందే లేచి వెళ్ళిపోతాడు. పడుకునే ముందు మనిషి తన పడక మీదికి వెళ్ళిపోతాడు, వెంటనే నిద్ర వచ్చేస్తుంది, ఈ జిక్ర్ చేయడం మరిచిపోతాడు. ఈ విధంగా చూడండి సోదరులారా! షైతాన్ వాడు మనకు అల్లాహ్ యొక్క జిక్ర్ నుండి ఎలా దూరం చేస్తాడో ఆ విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పేశారు.

అయితే ఫర్ద్ నమాజ్ తర్వాత చేయవలసిన జిక్ర్, ఏ అజ్కార్, స్మరణలైతే ఉన్నాయో, దుఆలైతే ఉన్నాయో అందులో ఒక విషయం మనకు తెలిసింది. ఏం తెలిసింది? ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత ఏం చేయాలి మనం? 10, 10 సార్లు, 10 సార్లు సుబ్ హా నల్లాహ్, 10 సార్లు అల్హమ్దులిల్లాహ్, 10 సార్లు అల్లాహు అక్బర్ చదవాలి. ఇక రండి.

మరో హదీస్ లో ఉంది, సహీహ్ బుఖారీ లోని హదీస్ అది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒకసారి బీద సహచరులు వచ్చారు. వచ్చి చెప్పారు, ప్రవక్తా ఈ ధనవంతులు, డబ్బు ఉన్నవాళ్ళు పుణ్యాలు సంపాదించడంలో, ఉన్నత స్థానాలు పొందడంలో, సదాకాలం ఉండే అటువంటి వరాలు పొందడంలో మాకంటే చాలా ముందుకు వెళ్ళిపోయారు. ఏమంటున్నారు వాళ్ళు? ఈ డబ్బు ఉన్నవాళ్ళు బిల్డింగులు కట్టుకున్నారు అని అనట్లేదు. మాకంటే ఎక్కువ భూములు సంపాదించారు అని అనట్లేదు. ఏమంటున్నారు? వీళ్ళు తమ డబ్బు కారణంగా ఉన్నత స్థానాలు పొందడంలో మరియు

وَالنَّعِيمِ الْمُقِيمِ
[వన్న’యీమిల్ ముఖీమ్]
మరియు శాశ్వతమైన అనుగ్రహాలు (పొందడంలో)

ఎల్లకాలం ఉండే అటువంటి నేమతులు, వరాలు, అనుగ్రహాలు వాటిని పొందడంలో మాకంటే చాలా ముందుకు వెళ్ళిపోయారు. ప్రవక్త గారు అడిగారు, అదెలా? ఇప్పుడు వారు అన్నారు, మేము ఎలా నమాజ్ చేస్తున్నామో వారు కూడా చేస్తున్నారు. మేము ఎలా ఉపవాసం ఉంటున్నామో వారు కూడా ఉపవాసం ఉంటున్నారు. కానీ వారికి డబ్బు ఉంది, మా దగ్గర డబ్బు లేదు. ఆ డబ్బు కారణంగా వారు హజ్ చేస్తున్నారు, ఉమ్రా చేస్తున్నారు, దానధర్మాలు చేస్తున్నారు, అల్లాహ్ మార్గంలో జిహాద్ లో కూడా ఖర్చు పెడుతున్నారు.

ఈ నాలుగు రకాల పుణ్యాలు, హజ్, ఉమ్రా, సామాన్య దానధర్మాలు మరియు జిహాద్ లో కూడా ఖర్చు పెడుతున్నారు. మా దగ్గర డబ్బు లేదు గనుక హజ్ లో, ఉమ్రాలో, దానధర్మాలో, జిహాద్ లో మేము ఖర్చు చేసి చేయలేకపోతున్నాము గనుక ఆ పుణ్యాలు మేము పొందుతలేము. డబ్బు ఉన్నందువల్ల వారు ఇలాంటి పుణ్యాలు చేసి కూడా మాకంటే చాలా ముందుకు సాగిపోతున్నారు. అప్పుడు ప్రవక్త గారు ఏమన్నారో తెలుసా? నేను ఒక విషయం మీకు తెలుపుతాను. మీరు దానిని పాటించారంటే, ఆ విషయాన్ని మీరు పాటించారంటే మీకంటే ముందుకు ఎవరైతే వెళ్ళిపోయారో పుణ్యాల్లో, వారి వద్దకు మీరు చేరుకుంటారు. మరి ఎవరైతే మీ వెనుక ఉన్నారో, వారు ఎన్నటికీ కూడా మీకు సమానంగా రాలేరు. మరియు మీకంటే ఉత్తమమైన వారు మరెవరూ ఉండరు, కేవలం మీ లాంటి ఈ ఆచరణ, ఈ పని చేసేవారు తప్ప.

అదేంటి? మీరు ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ 33, 33 సార్లు చదువుతూ ఉండండి.

ఈ రెండో విషయంలో, మొదటి హదీస్ లో 10 సార్ల ప్రస్తావన వచ్చింది. దానికి రెండు శుభవార్తలు మనకు దొరికాయి. ఒకటి స్వర్గ ప్రవేశం, రెండవది 1500 పుణ్యాలు. గుర్తుంచుకోండి. 10, 10 సార్లు చదివితే ఏంటి లాభం? స్వర్గ ప్రవేశం మరియు 1500 పుణ్యాలు. ఈ రెండో హదీస్ లో, సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం లోని హదీస్ ఇది. ఇందులో ఏముంది? ప్రతి ఒకటి 33, 33 సార్లు చదవాలి. దాని యొక్క లాభం ఏంటి? హజ్ చేయడం తో సమానం, ఉమ్రా చేయడం తో సమానం, సదకా దానధర్మాలు చేయడం తో సమానం, అల్లాహ్ యొక్క మార్గం జిహాద్ లో ధనం ఖర్చు పెట్టినంత సమానం. ఎంత గొప్ప పుణ్యం గమనించండి.

అంటే ప్రతిరోజు ఐదు హజ్ ల పుణ్యం సంపాదించవచ్చు. ప్రతిరోజు ఐదు ఉమ్రాల పుణ్యం సంపాదించవచ్చు. ప్రతిరోజు ఎంతో డబ్బు ఉన్నవారు డబ్బు ఖర్చు పెట్టి దానధర్మాలు చేసి పుణ్యాలు సంపాదిస్తున్నారో, అంత మనం ఈ 33, 33 సార్లు చదివి పుణ్యం సంపాదించవచ్చు. అలాగే ఇంకా ఎవరైతే జిహాద్ లో ఖర్చు పెడుతున్నారో, వారికి ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం మనం ఇన్షాఅల్లాహ్ పొందవచ్చు.

ఈ 33 సార్లు సుబ్ హా నల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్, ఒక్కసారి, 33, 33, 33 – 99 అయినాయి కదా, ఒక్కసారి

لَا إِلَٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ
[లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహ్, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షై’ఇన్ ఖదీర్]
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన అద్వితీయుడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. సార్వభౌమత్వం ఆయనదే, సర్వ స్తోత్రాలు ఆయనకే శోభస్కరము, మరియు ఆయన ప్రతి వస్తువుపై అధికారం కలవాడు.

చదివితే, ముస్లిం షరీఫ్ లో మరో ఘనత తెలుపబడింది. ఈ విషయం ముస్లిం షరీఫ్ లో ఉంది. అదేమిటి? ఒకవేళ మీ పాపాలు సముద్రపు నురుగంత ఉన్నా గానీ ఆ పాపాలన్నిటినీ కూడా తొలగించబడుతుంది. అల్లాహు అక్బర్. అన్ని పాపాలు తొలగించబడతాయి అని ప్రవక్త గారు శుభవార్త ఇస్తున్నారు.

ఇక రండి, మరోసారి మీకు గుర్తుండడానికి వాటిని సంక్షిప్తంగా చేస్తూ, ఫర్ద్ నమాజ్ తర్వాత ఒక కార్యం కానీ రెండు విధానాలు తెలుసుకున్నాం. ఏంటి ఒక కార్యం? సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, ఈ మూడు పదాలు. కానీ ఒక పద్ధతి ఏంటిది? 10, 10 సార్లు చెప్పడం. ఇంకొకటి? 33, 33, 33, ఒకసారి లా ఇలాహ ఇల్లల్లాహ్… వీటన్నిటినీ కలిపి లాభాలు ఎన్ని మనం తెలుసుకున్నాము? ఒకటి లాభం, స్వర్గ ప్రవేశం. రెండవ లాభం, 1500 పుణ్యాలు. మూడవ లాభం, హజ్ చేసినంత పుణ్యం. నాలుగవ లాభం, ఉమ్రా చేసినంత పుణ్యం. ఐదవ లాభం, దానధర్మాలు చేసినంత పుణ్యం. ఆరవ లాభం, జిహాద్ లో ఖర్చు పెట్టినంత పుణ్యం. ఏడవ లాభం, సముద్రపు నురుగంత పాపాలు ఉన్నా ఆ పాపాలన్నీ తొలగించబడతాయి. ఎన్ని లాభాలు? ఏడు లాభాలు. ఏడు రకాల లాభాలండి.

కేవలం 10 రియాల్ ల ఓవర్ టైం మనకు దొరుకుతుంది ఒక గంటకు అని అంటే మనం వెనకాడతామా? మరి ఏడు రకాల పుణ్యాలు మనకు దొరుకుతున్నాయి. దీనికి ఒక గంట కాదు, టోటల్ నిమిషం, నిమిషంన్నర టైం పడుతుంది అంతే. మీరు ఒకసారి, మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, టైం పెట్టి, గడియారం పెట్టి మీరు చూడండి. మహా ఎక్కువ అంటే ఇది ఉంటే టోటల్ ఎంత? నిమిషంన్నర టైం పడుతుంది అంతే.

కొందరు పండితులు చెప్పారు, ఎంతవరకు వాస్తవం అల్లాహ్ కు తెలుసుగాక, ఒకవేళ మీరు 10 యొక్క ఉద్దేశంతో టోటల్ 33, 33 అనుకున్నా గానీ సరిపోతుంది, ఎందుకు? 33 లో 10 సరిపోతాయి కదా. అలా కూడా కొందరు అన్నారు.

ఈ విధంగా చూడడానికి మనం ఒక రకమైన కార్యం. సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ అనడం. కానీ ఎన్ని లాభాలు తెలుసుకున్నాము? ఒకసారి లెక్కించగలుగుతారా? ఏంటి చెప్పండి? ఒకటి, స్వర్గ ప్రవేశం. రెండవది, 1500 పుణ్యాలు. మూడవది, హజ్ చేసినంత. నాలుగవది, ఉమ్రా చేసినంత. ఐదవది, దానధర్మాలు, సదకా. ఆరవది, జిహాద్ లో ఖర్చు పెట్టినంత. ఏడవది, సముద్రపు నురుగంత పాపాలు ఉన్నా అవన్నీ తొలగించబడతాయి. ఇవి ఏడు.

ఇక రండి, స్వర్గం విషయంలో మరొక గొప్ప శుభవార్త కూడా మనకి ఇవ్వబడింది ఆయతుల్ కుర్సీ విషయంలో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని సహీహ్ హదీస్ లో ఉంది. ఇమాం నసాయి రహమతుల్లాహి అలైహి అమలుల్ యౌమి వల్ లైలా లో ప్రస్తావించారు. షేఖ్ అల్బాని రహమతుల్లాహి అలైహి కూడా తమ గ్రంథాలలో దీన్ని ప్రస్తావించారు. ఎవరైతే,

مَنْ قَرَأَ آيَةَ الْكُرْسِيِّ دُبُرَ كُلِّ صَلَاةٍ مَكْتُوبَةٍ لَمْ يَمْنَعْهُ مِنْ دُخُولِ الْجَنَّةِ إِلَّا الْمَوْتُ
[మన్ ఖర’అ ఆయతల్ కుర్సీ దుబుర కుల్లి సలాతిన్ మక్తూబతిన్, లమ్ యమ్న’అహు మిన్ దుఖూలిల్ జన్నతి ఇల్లల్ మౌత్]
ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత ఎవరైతే ఆయతుల్ కుర్సీ చదువుతారో, వారు స్వర్గంలో ప్రవేశించడానికి కేవలం చావు మాత్రమే అడ్డు ఉన్నది

.ఎంత గొప్ప శుభవార్త గమనించండి. ఆయతుల్ కుర్సీ అంటే ఏంటి?

اللهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ
[అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, లా త’ఖుదుహూ సినతున్ వలా నౌమ్]
అల్లాహ్, ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయన సజీవుడు, సర్వలోకాల నిర్వాహకుడు. ఆయనకు కునుకు రాదు, నిద్రపోడు. చివరి వరకు ఇది ఒక ఆయత్.

ఈ విధంగా ఆయతుల్ కుర్సీ ద్వారా కూడా మనకు చాలా గొప్ప లాభాలు లభిస్తాయి, వాటిని చదివే అలవాటు మనం చేసుకోవాలి.

ఇంకా ఫజ్ర్ నమాజ్ తర్వాత, అప్పుడైతే డ్యూటీ ఉండదు కదా వెంటనే. కనీసం ఒక రెండు నిమిషాలు మనం సలాం తిప్పిన తర్వాత మస్జిద్ లో కూర్చోవచ్చు కదా. కూర్చొని

لَا إِلَٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ
[లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహ్, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షై’ఇన్ ఖదీర్]
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన అద్వితీయుడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. సార్వభౌమత్వం ఆయనదే, సర్వ స్తోత్రాలు ఆయనకే శోభస్కరము, మరియు ఆయన ప్రతి వస్తువుపై అధికారం కలవాడు.

పదిసార్లు చదవాలి. ఎన్నిసార్లు? పదిసార్లు. ఏంటి లాభం? ప్రవక్తగారు చెప్పారు, అల్లాహ్ త’ఆలా

كَتَبَ اللهُ لَهُ عَشْرَ حَسَنَاتٍ
[కతబల్లాహు లహూ అషర హసనాత్]
అల్లాహ్ అతని కొరకు పది పుణ్యాలు రాస్తాడు

లా ఇలాహ ఇల్లల్లాహ్ పదిసార్లు చదవాలి. లాభాలు ఏంటి? ఇంకా ఉన్నాయి, దాన్ని గుర్తుంచుకోవాలి. పదిసార్లు లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివితే, మొదటి లాభం పది పుణ్యాలు అల్లాహ్ రాస్తాడు.

وَمَحَا عَنْهُ عَشْرَ سَيِّئَاتٍ
[వమహా అన్హు అషర సయ్యిఆత్]
మరియు అతని నుండి పది పాపాలను తుడిచివేస్తాడు

రెండో లాభం ఏంటంటే, పది పుణ్యాలు అల్లాహ్ మాఫ్ చేస్తాడు, తొలగిస్తాడు. మూడో లాభం ఏంటంటే,

رَفَعَ لَهُ عَشْرَ دَرَجَاتٍ
[రఫ’అ లహూ అషర దరజాత్]
అతని కొరకు పది స్థానాలు పెంచుతాడు

وَكَانَ يَوْمَهُ ذَلِكَ كُلَّهُ فِي حِرْزٍ مِنْ كُلِّ مَكْرُوهٍ
[వకాన యౌమహు దాలిక కుల్లుహూ ఫీ హిర్జిన్ మిన్ కుల్లి మక్రూహ్]
మరియు ఆ రోజంతా అతను ప్రతి అసహ్యకరమైన దాని నుండి రక్షణలో ఉంటాడు

మరియు ఆ దినమంతా, ఆ రోజంతా అతని గురించి ప్రతి కీడు నుండి, చెడు నుండి, అసహ్య విషయాల నుండి అతన్ని కాపాడుకోబడుతుంది. ఎన్ని లాభాలు అయినాయి? లా ఇలాహ ఇల్లల్లాహ్ పదిసార్లు చదివితే ఎన్ని లాభాలు విన్నాము? పది పుణ్యాలు లిఖించబడతాయి, పది పాపాలు తొలగించబడతాయి, పది స్థానాలు పెంచబడతాయి, ప్రతి కీడు నుండి ఆ రోజు రక్షింపబడతాడు,

وَحُرِسَ مِنَ الشَّيْطَانِ
[వహురిస మినష్ షైతాన్]
మరియు షైతాన్ నుండి కాపాడబడతాడు

షైతాన్ నుండి కూడా కాపాడబడతాడు. షైతాన్ నుండి కూడా అతన్ని కాపాడడం జరుగుతుంది. ఐదు. ఆరవది,

وَلَمْ يَنْبَغِ لِذَنْبٍ أَنْ يُدْرِكَهُ فِي ذَلِكَ الْيَوْمِ إِلَّا الشِّرْكَ بِاللهِ
[వలం యంబగీ లిజంబిన్ అన్ యుద్రికహూ ఫీ దాలికల్ యౌమి ఇల్లష్ షిర్క బిల్లాహ్]
షిర్క్ తప్ప వేరే ఏదైనా పాపం ఉంటే అది కూడా మన్నించబడుతుంది

మరియు ఒకవేళ షిర్క్ కు పాల్పడేది ఉంటే మహా వినాశనం ఉంటుంది. కానీ షిర్క్ తప్ప వేరే ఏదైనా పాపం ఉంటే అది కూడా మన్నించబడుతుంది. దానివల్ల అల్లాహ్ త’ఆలా అతన్ని పట్టుకోడు. తొందరగానే వెంటనే శిక్షించడు. ఈ విధంగా లా ఇలాహ ఇల్లల్లాహ్.. పదిసార్లు చదవడం ద్వారా మనకు ఎన్ని లాభాలు కలిగాయి? ఒకటి, పది పుణ్యాలు లభిస్తాయి. రెండవది, పది పాపాలు తొలగించబడతాయి. పది స్థానాలు పెంచబడతాయి. ఇంకా, ఆ రోజంతా అతన్ని కాపాడబడుతుంది. మరియు షైతాన్ నుండి కూడా అతన్ని రక్షించడం జరుగుతుంది ఐదు. ఆరవది, ఏదైనా పాపం జరిగినా గానీ అల్లాహ్ వెంటనే శిక్షించడు, కానీ షిర్క్ నుండి దూరం ఉండాలి. అంటే షిర్క్ లాంటి పాపం అనేది కాకూడదు.

ఇది దేనివల్ల మనకు, ఫజ్ర్ నమాజ్ తర్వాత పదిసార్లు లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివితే. కానీ ఇదే లా ఇలాహ ఇల్లల్లాహ్ మగ్రిబ్ తర్వాత కూడా పదిసార్లు చదవాలి. మగ్రిబ్ తర్వాత కూడా పదిసార్లు చదవాలి. అప్పుడేంటి లాభం మనకు దొరుకుద్ది?

గమనించండి. ఈరోజు ఎన్ని లాభాలు మనం తెలుసుకుంటున్నామో అవన్నీ గుర్తున్నాయా లేవా? ఆ? మరోసారి రిపీట్ చేయాలా? సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ దీని గురించి మనం ఏడు లాభాలు తెలుసుకున్నాం. గుర్తున్నాయా? ఏంటెంటి? స్వర్గ ప్రవేశం, 1500 పుణ్యాలు, ఇంకా హజ్ చేసినంత పుణ్యం, ఉమ్రా చేసినంత పుణ్యం, దానధర్మాలు చేసినంత పుణ్యం, ఇంకా జిహాద్ చేసినంత పుణ్యం మరియు సముద్రపు నురుగంత పుణ్యాలు ఉన్నా గాని తొలగించబడతాయి. ఇవి ఏడు.

ఇక ఆయతుల్ కుర్సీ లాభం ఒకటి విన్నాం, అదేమిటి? ఎవరైతే ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో, అతనికి మరియు స్వర్గానికి మధ్య అడ్డు ఏముంది? చావు. అతని మరణం తప్ప వేరేది అడ్డు లేదు. ఇక ఫజ్ర్ నమాజ్ తర్వాత పదిసార్లు, ఫజ్ర్ నమాజ్ తర్వాత పదిసార్లు ఏం చదవాలి? లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహూ లా షరీకలహ్, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షై’ఇన్ ఖదీర్. ఎన్ని లాభాలు? ఆరు లాభాలు తెలుసుకున్నాము. ఒకటి, పది పుణ్యాలు దొరుకుతాయి, పది పాపాలు తొలగించబడతాయి, పది స్థానాలు పెంచబడతాయి, ప్రతి కీడు నుండి ఆ రోజు రక్షింపబడతాడు, షైతాన్ నుండి కాపాడబడతాడు, ఇంకా ఏ పాపం వల్ల కూడా అతన్ని అల్లాహ్ తొందరగా పట్టి శిక్షించడు, కానీ షిర్క్ నుండి దూరం ఉండాలి.

ఇదే లా ఇలాహ ఇల్లల్లాహ్ మగ్రిబ్ తర్వాత చదివితే ఏంటి లాభం? ఈ హదీస్ మీరు వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు,

بَعَثَ اللهُ لَهُ مُسَلَّحَةً يَحْفَظُونَهُ مِنَ الشَّيْطَانِ حَتَّى يُصْبِحَ
[బ’అసల్లాహు లహూ ముసల్లహతన్ యహ్ ఫదూనహూ మినష్ షైతాని హత్తా యుస్బిహ్]
అతను ఉదయం అయ్యేవరకు షైతాన్ నుండి అతన్ని కాపాడే ఆయుధాలు ధరించిన వారిని అల్లాహ్ పంపుతాడు.

మగ్రిబ్ తర్వాత చదివితే తెల్లారే వరకు, హత్తా యుస్బిహ్, తెల్లారే వరకు షైతాన్ నుండి అతన్ని కాపాడడానికి ఆయుధంతో నిండి ఉన్న దైవదూతలను పంపుతాడు. ఇది మొదటి లాభం. ఎప్పుడు చదివితే? మగ్రిబ్ తర్వాత. రెండవది,

وَكَتَبَ اللهُ لَهُ بِهَا عَشْرَ حَسَنَاتٍ مُوجِبَاتٍ
[వకతబల్లాహు లహూ బిహా అషర హసనాతిన్ మూజిబాత్]
మరియు దాని ద్వారా అల్లాహ్ అతని కొరకు తప్పనిసరి చేసే పది పుణ్యాలను రాస్తాడు.

అల్లాహ్ అతని కొరకు పది పుణ్యాలు ఎలాంటివి రాస్తాడో తెలుసా? స్వర్గానికి తీసుకువెళ్ళే పుణ్యాలు. సామాన్య పుణ్యాలు కాదు, స్వర్గం అతనిపై విధి చేసే అటువంటి పుణ్యాలు అల్లాహ్ అతని గురించి రాస్తాడు. ఎన్ని లాభాలు అయినాయి? మొదటిది ఏంటిది? షైతాన్ నుండి కాపాడడానికి అల్లాహ్ ఎవరిని పంపుతాడు? ఆయుధంతో ఉన్న దైవదూతలను పంపుతాడు. రెండవ లాభం ఏంటి? పది పుణ్యాలు రాస్తాడు, ఎలాంటి పది పుణ్యాలు? స్వర్గాన్ని విధి చేసే అటువంటి పుణ్యాలు. మూడవ లాభం, పది పాపాలని తొలగిస్తాడు, ఎలాంటి పాపాలు? మూబిఖాత్, అతన్ని నాశనం చేసే అటువంటి పది పాపాలు. మనిషి ఏదైనా పాపం చేసి ఉన్నాడు, ఎలాంటి పాపం? అతన్ని ఆ మనిషిని వినాశనానికి గురి చేస్తాయి. అలాంటి పాపం చేసి ఉన్నాడు. కానీ అల్లాహ్ అలాంటి పాపాన్ని కూడా మన్నించేస్తాడు. ఎందుకు మన్నిస్తాడు? లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహూ లా షరీకలహ్, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షై’ఇన్ ఖదీర్. ఎప్పుడు చదవాలి? మగ్రిబ్ తర్వాత ఎన్ని పుణ్యాలు, ఎన్ని లాభాలు దొరికినాయి? మూడు. ఆయుధంతో ఉన్న దైవదూతలు షైతాన్ నుండి అతన్ని కాపాడుతారు. అల్లాహ్ స్వర్గంలోకి తీసుకెళ్ళే అటువంటి పది పుణ్యాలు అతని గురించి రాస్తాడు, మరియు అతన్ని వినాశనానికి గురి చేసే, నరకంలోకి తీసుకెళ్ళే అటువంటి పది పాపాలు అతని నుండి మన్నించేస్తాడు. ఇంకా

وَكَانَتْ لَهُ بِعَدْلِ عَشْرِ رَقَبَاتٍ مُؤْمِنَاتٍ
[వకానత్ లహూ బి’అద్లి అష్రి రఖబాతిన్ ము’మినాత్]
మరియు పది మంది విశ్వాస బానిసలను విడుదల చేసినటువంటి పుణ్యం అతనికి లభిస్తుంది

పది విశ్వాసులను, విశ్వాస బానిసలను, పది మంది విశ్వాస బానిసలను విడుదల చేసినటువంటి పుణ్యం అతనికి లభిస్తుంది. ఈ నాలుగు లాభాలు. మగ్రిబ్ తర్వాత చదివితే నాలుగు లాభాలు. కానీ నాలుగు అని తక్కువ భావించొద్దు. మహా గొప్ప లాభాలు ఉన్నాయి ఇవి కూడా. పొద్దున చదివితే కూడా షైతాన్ నుండి రక్షించడం జరుగుతుంది అని చెప్పబడి ఉంది. కానీ సాయంత్రం చదివితే ఏముంది? దైవదూతలు, ఆయుధంతో ఉన్నటువంటి దైవదూతలను అల్లాహ్ త’ఆలా పంపుతాడు అని చెప్పడం జరిగింది. పొద్దున చదివితే కూడా పది పుణ్యాలు లభిస్తాయి అని చెప్పడం జరిగింది. కానీ సాయంకాలం దాంట్లో ఏముంది? మూజిబాత్, అంటే స్వర్గానికి తీసుకెళ్ళే అటువంటి పుణ్యాలు అని. పొద్దున చదివితే కూడా పది పాపాలు తొలగించబడతాయి, కానీ సాయంత్రం చదివితే, సాయంత్రం చదివితే ఆ, ఘోరమైన, మనిషిని వినాశనానికి గురి చేసే అటువంటి, నరకంలోకి తీసుకెళ్ళే అటువంటి పది పాపాలు మన్నించబడతాయి. కానీ ఇక్కడ మరో కొత్త విషయం వచ్చింది. పొద్దున చదివిన దాంట్లో రాలేదు. అదేంటి? పది బానిసలను విడుదల చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది.

ఈ విధంగా సోదరులారా! అల్లాహ్ యొక్క దయవల్ల ఈరోజు మనం ఫర్ద్ నమాజుల తర్వాత ఏ జిక్ర్ అయితే మనం చేయవలసి ఉందో, ప్రవక్త గారు నేర్పారో వాటిలో కొన్నిటి గురించి మనం తెలుసుకున్నాము, వాటి యొక్క లాభాలు కూడా తెలుసుకున్నాము. ఇన్ని గొప్ప లాభాలు ఉన్నాయో మీరే శ్రద్ధగా గమనించి వీటిని ఆచరించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని జిక్ర్ మాత్రమే ఉన్నాయని భావం కాదు, ఇంకా వేరేటివి కూడా ఉన్నాయి. కానీ ఎక్కువ లాభాలు ఉన్నటువంటి కొన్ని జిక్ర్ ల గురించి నేను మీ ముందు ఈ మాట ఉంచాను. అల్లాహ్ త’ఆలా వీటిని అర్థం చేసుకుని, వీటిని ఆచరించే సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.

జిక్ర్ ,దుఆ మెయిన్ పేజీ
https://teluguislam.net/dua-supplications/

నమాజు మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/

నాలుకపై చాలా సులభంగా, త్రాసులో బరువుగా మరియు కరుణామయునికి చాలా ప్రియమైన రెండు వాక్యాలు [ఆడియో]

బిస్మిల్లాహ్

[1:17 నిముషాలు]
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 29
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) తెల్పినటువంటి ” నాలుకపై సులభంగానూ ..త్రాసులో బరువుగానూ ఉండే ఆ రెండు వాక్యాలు ఏవి ?

సుబ్ హానల్లాహి వబిహందిహి సుబ్ హానల్లాహిల్ అజీమ్

సహీ బుఖారీలోని చివరి హదీసు, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారుః

كَلِمَتَانِ خَفِيفَتَانِ عَلَى اللِّسَانِ، ثَقِيلَتَانِ فِي المِيزَانِ، حَبِيبَتَانِ إِلَى الرَّحْمٰنِ: سُبْحَانَ الله وَبِحَمْدِهِ ، سُبْحَانَ الله العَظِيمِ

“రెండు పదాలున్నాయి, అవిః నాలుకపై చాలా సులభంగా, త్రాసులో బరువుగా మరియు కరుణామయునికి చాలా ప్రియమైనవి. అవేః సుబ్ హానల్లాహి వబిహందిహీ సుబ్ హానల్లాహిల్ అజీం”. (బుఖారి 6406, ముస్లిం 2694).

అనేక మందికి ఈ రెండు పదాల ఘనత తెలుసు, కాని త్రాసు బరువు కావటానికి చదివేవారు చాలా అరుదు. (మరికొందరికైతే) ఏదైనా కల్చరల్ ప్రోగ్రాముల్లో పోటాపోటీలు, కాంపిటేషన్లు జరుగుతున్నప్పుడు అందులో ఇలాంటి ప్రశ్న ఏదైనా వచ్చినప్పుడు అవి గుర్తుకు వస్తాయి. (ఇది ఎంత దారుణంॽॽॽ).

వఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్

ఐదు విషయాల కంటే ఎంతో మేలైన, ఉత్తమ ఆ ఒక్క విషయమేమిటి? [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ఐదు విషయాల కంటే ఎంతో మేలైన, ఉత్తమ ఆ ఒక్క విషయమేమిటి?
https://youtu.be/w7ANEdrN2IU [6:53 నిమిషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఈ ప్రసంగంలో యజమాని-దాసుడి సంబంధాన్ని ఉదాహరణగా తీసుకుని, మానవునికి మరియు సృష్టికర్త అయిన అల్లాహ్‌కు మధ్య ఉండవలసిన దాస్యత్వం గురించి వివరించబడింది. నిజమైన దాస్యత్వం అంటే ప్రతి క్షణం, ప్రతి స్థితిలో అల్లాహ్‌ను స్మరించుకోవడం (ధిక్ర్ చేయడం) మరియు ఆయనకు ఇష్టమైన పనులే చేయడం. అల్లాహ్ స్మరణ (ధిక్ర్) యొక్క గొప్పతనాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఒక హదీథ్ ద్వారా నొక్కిచెప్పబడింది. బంగారం, వెండి దానం చేయడం మరియు ధర్మయుద్ధంలో పాల్గొనడం కన్నా అల్లాహ్ స్మరణ ఎంతో ఉత్తమమైనదని, అది హోదాలను పెంచి, ప్రభువు వద్ద అత్యంత పరిశుద్ధమైనదిగా పరిగణించబడుతుందని ఈ హదీథ్ స్పష్టం చేస్తుంది.

అబూ దర్దా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అడిగారు:

మీ సదాచరణాల్లో అత్యుత్తమమైనది, మీ చక్రవర్తి అయిన అల్లాహ్ వద్ద ఎంతో పరిశుద్ధమైనది, మీ స్థానాలను ఎంతో రెట్టింపు చేయునది, మరి మీరు వెండి బంగారాలు ఖర్చు పెట్టే దాని కంటే ఉత్తమమైనది మరియు మీరు మీ శత్రువులను కలిసి మీరు వారి మెడలను వారు మీ మెడలను నరుకుతూ ఉండే దానికంటే ఉత్తమమైనది తెలియజేయనా?” వారన్నారు ఎందుకు లేదు! తప్పకుండా తెలియజేయండి, అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు: అల్లాహ్ స్మరణ

[సహీహ్ హదీథ్] [సునన్ ఇబ్నె మాజ 3790, మువత్త మాలిక్ 564, ముస్నద్ అహ్మద్ 21702,21704,27525]

سنن الترمذي أبواب الدعوات عن رسول الله صلى الله عليه وسلم | باب منه

3377 – عَنْ أَبِي الدَّرْدَاءِ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ : قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : ” أَلَا أُنَبِّئُكُمْ بِخَيْرِ أَعْمَالِكُمْ، وَأَزْكَاهَا عِنْدَ مَلِيكِكُمْ، وَأَرْفَعِهَا فِي دَرَجَاتِكُمْ، وَخَيْرٌ لَكُمْ مِنْ إِنْفَاقِ الذَّهَبِ وَالْوَرِقِ، وَخَيْرٌ لَكُمْ مِنْ أَنْ تَلْقَوْا عَدُوَّكُمْ، فَتَضْرِبُوا أَعْنَاقَهُمْ، وَيَضْرِبُوا أَعْنَاقَكُمْ “. قَالُوا : بَلَى. قَالَ : ” ذِكْرُ اللَّهِ تَعَالَى “.

حكم الحديث: صحيح
سنن ابن ماجه ( 3790 )، موطأ مالك ( 564 )، مسند أحمد ( 21702, 21704, 27525 ).

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

الْحَمْدُ لِلَّهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ اللَّهِ، أَمَّا بَعْدُ
(అల్ హందులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి, అమ్మా బాద్)
సర్వస్తోత్రాలు అల్లాహ్ కే శోభాయమానం. అల్లాహ్ యొక్క ప్రవక్తపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఇక ఆ తర్వాత…

ప్రియ వీక్షకుల్లారా, యజమాని మరియు దాసుడు. వారిద్దరి మధ్యలో సంబంధం ఎలాంటిది ఉంటుంది? దాసుడు ఎల్లవేళల్లో చాలా చురుకుగా, ఎప్పుడు ఏ సమయంలో యజమాని ఆదేశం ఏముంటుంది, నేను దానిని పాటించాలి, ఆజ్ఞాపాలన చేయాలి అన్నటువంటి ధ్యానంలో ఉంటాడు. అలాంటి వారినే మనం మెచ్చుకుంటాము. అవునా కాదా?

అయితే ఈ రోజుల్లో మనం మన అసలైన యజమాని, సర్వ సృష్టికి సృష్టికర్త, ఈ సర్వ సృష్టికి పోషణకర్త అల్లాహ్, ఎంతటి గొప్పవాడు! ఆయనే సార్వభౌమాధికారుడు. ఆయనే చక్రవర్తి. సోదర మహాశయులారా, ఎల్లవేళల్లో మనం అల్లాహ్ యొక్క ధ్యానంలో ఉండటం, అల్లాహ్‌ను గుర్తు చేసుకుంటూ ఉండటం, అల్లాహ్ యొక్క స్మరణలో ఉండటం, మనం ఎక్కడ ఉన్నా ఏ సందర్భంలో ఉన్నా గానీ అక్కడ ఆ సందర్భంలో, ఆ స్థితిలో మన సృష్టికర్త అల్లాహ్ మనం ఎలా ఉండటం, మనం ఎలా మాట్లాడటం, మనం ఎలా చూడటం, మనం ఎలా వినడం ఇష్టపడతాడో, ఆయనకు ఇష్టమైనవే మనం చేసుకుంటూ ఉండటం, ఇదే అసలైన నిజమైన దాస్యత్వం. దీన్నే ఈ రోజుల్లో చాలా మంది మరిచిపోయి ఉన్నారు.

అయితే, ఇలాంటి స్మరణలో ఉంటూ ప్రత్యేకంగా ఆయన యొక్క గొప్పతనాలను కీర్తిస్తూ, ఆయన యొక్క పరిశుద్ధత, పవిత్రతలను కొనియాడుతూ, ఆయన యొక్క ప్రశంసలు, పొగడ్తలను మనం స్తుతిస్తూ,

سُبْحَانَ اللَّهِ
(సుబ్ హా నల్లాహ్)
అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు.

الْحَمْدُ لِلَّهِ
(అల్ హందులిల్లాహ్)
సర్వస్తోత్రాలు అల్లాహ్ కే శోభాయమానం.

اللَّهُ أَكْبَرُ
(అల్లాహు అక్బర్)
అల్లాహ్ యే గొప్పవాడు.

لَا إِلَهَ إِلَّا اللَّهُ
(లా ఇలాహ ఇల్లల్లాహ్)
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు.

ఇంకా ఇలాంటి పలుకులు పలుకుతూ ఉంటే, ఇహలోకంలో మనకు ఎంత లాభం కలుగుతుందో, పరలోకంలో దీని యొక్క సత్ఫలితం ఎంత గొప్పగా లభిస్తుందో మనం ఊహించలేము.

అల్లాహ్ స్మరణ (ధిక్ర్) యొక్క గొప్పతనం

రండి, ఒకే ఒక హదీథ్ వినిపిస్తాను. ఆ తర్వాత మీరు సెలవు తీసుకోవచ్చు. శ్రద్ధగా వినండి. హజ్రత్ అబూ దర్దా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు. సునన్ తిర్మిజీలో వచ్చిన హదీథ్, 3377 హదీథ్ నంబర్. షేఖ్ అల్బానీ రహిమహుల్లా దీనిని ప్రామాణికమైనదిగా చెప్పారు.

ఏంటి హదీథ్? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ స్మరణ గురించి, అల్లాహ్ ధ్యానంలో ఉండటం గురించి ఎంత గొప్ప శుభవార్త ఇస్తున్నారో మీరే గమనించండి. ఐదు రకాలుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి ఎలా ప్రోత్సహిస్తూ చెబుతున్నారో గమనించండి.

أَلَا أُنَبِّئُكُمْ بِخَيْرِ أَعْمَالِكُمْ
(అలా ఉనబ్బిఉకుమ్ బి ఖైరి అఅమాలికుమ్)
మీ కర్మలలో అత్యుత్తమమైనది ఏమిటో మీకు తెలుపనా?

وَأَزْكَاهَا عِنْدَ مَلِيكِكُمْ
(వ అజ్కాహా ఇంద మలీకికుమ్)
మీ ప్రభువైన అల్లాహ్ వద్ద అత్యంత పరిశుద్ధమైనది,

وَأَرْفَعِهَا فِي دَرَجَاتِكُمْ
(వ అర్ఫఇహా ఫీ దరజాతికుమ్)
మీ హోదాలను అత్యున్నతంగా చేయునది,

وَخَيْرٌ لَكُمْ مِنْ أَنْ تُنْفِقُوا الذَّهَبَ وَالْوَرِقَ
(వ ఖైరుల్ లకుమ్ మిన్ అన్ తున్ఫికూ అజ్జహబ వల్ వరిఖ్)
మీరు వెండి బంగారాలు ఖర్చు పెట్టే దానికంటే కూడా ఉత్తమమైనది,

وَخَيْرٌ لَكُمْ مِنْ أَنْ تَلْقَوْا عَدُوَّكُمْ فَتَضْرِبُوا أَعْنَاقَهُمْ وَيَضْرِبُوا أَعْنَاقَكُمْ
(వ ఖైరుల్ లకుమ్ మిన్ అన్ తల్ ఖౌ అదువ్వకుమ్ ఫ తజ్రిబూ అఅనాఖహుమ్ వ యజ్రిబూ అఅనాఖకుమ్)
మరియు మీరు మీ యొక్క శత్రువులను ధర్మపరమైన యుద్ధంలో కలుసుకోవడం, వారు మీ మెడలను నరుకుతూ ఉండటం, మీరు వారి మెడలను నరుకుతూ ఉండటం, దీనికంటే కూడా ఎంతో ఉత్తమమైనది.

అల్లాహు అక్బర్! అల్లాహు అక్బర్! గమనించారా? ఎన్ని విషయాలు చెప్పారు ప్రవక్త? ఐదు విషయాలు. మీ సదాచరణల్లో అన్నిటికంటే ఉత్తమమైనది, మరియు ప్రభువు అల్లాహ్ వద్ద ఎంతో పరిశుద్ధమైనది, మరియు మీ యొక్క స్థానాలను ఉన్నతంగా చేయునది, మీరు వెండి బంగారాలు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టే దానికంటే ఉత్తమమైనది, మీరు అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయడానికి కంటే కూడా ఎంతో ఉత్తమమైనది, మీకు తెలుపనా? అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు.

ఈ ఐదు విషయాల కంటే ఉత్తమమైన మరో విషయం మీకు తెలపాలా? అని ప్రశ్నించారు. సహాబాలు, ప్రవక్త సహచరులు ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆతృత కలిగి ఉండేవారు. వారందరూ ఏకంగా అన్నారు,

بَلَى يَا رَسُولَ اللَّهِ
(బలా యా రసూలల్లాహ్)
తప్పకుండా, ఓ అల్లాహ్ ప్రవక్తా! ప్రవక్తా ఎందుకు తెలుపరు? తప్పకుండా తెలుపండి!

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

ذِكْرُ اللَّهِ
(ధిక్రుల్లాహ్)
అల్లాహ్ యొక్క ధిక్ర్. అల్లాహ్ యొక్క స్మరణ.

చూశారా? గమనించారా? ఈ హదీథ్‌ను ఎల్లవేళల్లో మదిలో నాటుకోండి. ఇలాంటి ఈ ధిక్ర్ ద్వారా ఈ ఐదు రకాల మంచి విషయాల కంటే గొప్ప పుణ్యం పొందగలుగుతారు. అల్లాహ్ మనందరికీ ఎల్లవేళల్లో, అన్ని సమయ సందర్భాల్లో, అన్ని స్థితుల్లో కేవలం అల్లాహ్‌ను మాత్రమే గుర్తు చేసుకుంటూ ఉండేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. అన్ని రకాల షిర్క్‌ల నుండి, అన్ని రకాల బిద్అత్‌ల నుండి అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ
(వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై శాంతి, అల్లాహ్ కారుణ్యం మరియు ఆయన శుభాలు వర్షించుగాక.

జిక్ర్ (అల్లాహ్ నామ స్మరణ)

అల్లాహ్ శిక్ష నుండి కాపాడే అత్యుత్తమ ఆచరణ అల్లాహ్ జిక్ర్ [వీడియో క్లిప్]

బిస్మిల్లాహ్

[30 సెకన్లు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

[జిక్ర్ ,దుఆ] – https://teluguislam.net/dua-supplications/

عَنْ مُعَاذِ بْنِ جَبَلٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ – صلى الله عليه وسلم -: «مَا عَمِلَ آدَمِيٌّ عَمَلاً قَطُّ أَنْجَى لَهُ مِنْ عَذَابِ اللهِ مِنْ ذِكْرِ اللهِ». (4) =صحيح

أحمد (22132)، تعليق الألباني “صحيح”، صحيح الجامع (5644).

ముఆజ్ బిన్ జబల్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు :

మనిషి చేసే సత్కార్యాల్లో అతనిని అల్లాహ్ శిక్ష నుండి రక్షణ కల్పించేది అల్లాహ్ జిక్ర్ కంటే అత్యున్నతమైనది మరొకటీ లేదు.

[ముస్నద్ అహ్మద్ 22132. సహీహుల్ జామి 5644]

జిక్ర్ (అల్లాహ్ నామ స్మరణ)

పాపాలను పుణ్యాలుగా మార్చే సదాచరణ మరియు అల్లాహ్ కారుణ్యం మరియు ప్రశంసలు పొందే సులభమైన మార్గం [ఆడియో]

బిస్మిల్లాహ్

[4:53 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

[జిక్ర్ ,దుఆ] https://teluguislam.net/dua-supplications/

عَنْ سَهْلِ بْنِ حَنْظَلَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ – صلى الله عليه وسلم -:

« مَا جَلَسَ قَوْمٌ مَجْلِساً يَذْكُرُونَ اللهَ عَزَّ وَجَلَّ فِيهِ فَيَقُومُونَ، حَتَّى يُقَالَ لَهُمْ: قُومُوا قَدْ غَفَرَ اللهُ لَكُمْ ذُنُوبَكُمْ، وَبُدِّلَتْ سَيِّئاتكُمْ حَسَنَاتٍ ».

ఎవరైనా అల్లాహ్ యొక్క జిక్ర్ (స్మరణ) కొరకు ఏదైనా సమావేశంలో కూర్చుండి అక్కడి నుండి లేచి వెళ్ళినప్పుడు వారితో ఇలా చెప్పడం జరుగుతుంది: “మీరు వెళ్ళండి, మీ పాపాలను అల్లాహ్ మన్నించాడు మరియు మీ పాపాలు పుణ్యాలుగా మార్చబడ్డాయి“” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారని సహల్ బిన్ హంజల (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు

(المعجم الكبير (639)، تعليق الألباني “صحيح”، صحيح الجامع (5610)، الصحيحة (2210). =صحيح


عَنْ أَبِي هُرَيْرَةَ وَأَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رَضِيَ اللهُ عَنْهُمَا: أَنَّهُمَا شَهِدَا عَلَى النَّبِيِّ – صلى الله عليه وسلم – أَنَّهُ قَالَ:

« لاَ يَقْعُدُ قَوْمٌ يَذْكُرُونَ اللهَ عَزَّ وَجَلَّ إِلاَّ حَفَّتْهُمُ الْمَلاَئِكَةُ، وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ، وَنَزَلَتْ عَلَيْهِمُ السَّكِيْنَةُ، وَذَكَرَهُمُ اللهُ فِيمَنْ عِنْدَهُ ».

అల్లాహ్ స్మరణ చెయ్యడానికి కూర్చున్న సమావేశంలోని వారిని దైవ దూతలు చుట్టుముట్టుకొంటారు, అల్లాహ్ యొక్క కారుణ్యం వారిని కమ్ముకుంటుంది, శాంతి నెమ్మది అవతరిస్తుంది. అల్లాహ్ వారి గురుంచి తన దగ్గరగా ఉన్న దేవ దూతల మధ్య ప్రస్తావిస్తాడు” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారని అబూ హురైర మరియు అబూ సఈద్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు

(مسلم (2700) =صحيح

ఇతర లింకులు:

ప్రళయ దినాన మనిషి ఏ ఘడియను గుర్తు చేసుకొని పశ్చాత్తాప పడతాడు? [ఆడియో]

బిస్మిల్లాహ్

[4:55 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

[జిక్ర్ ,దుఆ] https://teluguislam.net/dua-supplications/


عَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُولُ اللهِ – صلى الله عليه وسلم -:
«مَا مِنْ سَاعَة تَمُرّ بِابْنِ آدَمَ لَمْ يَذْكُر اللهَ فِيهَا إِلاَّ تَحَسَّرَ عَلَيْهَا يَوْمَ الْقِيَامَة».
(حلية الأولياء (5/ 362)، شعب الإيمان (511 (فصل في إدامة ذكر الله عز وجل .. واللفظ له، تعليق الألباني “حسن”،
صحيح الجامع (5720). حسن
ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

అల్లాహ్ జిక్ర్ చేయకుండా గడిసిన ప్రతి ఘడియపై మనిషి ప్రళయదినాన పశ్చాత్తాపం చెందుతూ బాధపడతాడు

(హిల్ యతుల్ ఔలియా 5/362, షుఅబుల్ ఈమాన్ : బైహఖీ 511. సహీహుల్ జామి : అల్బానీ 5720)


عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ النَّبِيُّ – صلى الله عليه وسلم -:
«مَا مِنْ رَاكِبٍ يَخْلُو فِي مَسيْرِهِ بِاللهِ وَذِكْرِهِ إِلاَّ كَانَ رَدْفهُ (5) مَلَكٌ، وَلاَ يَخْلُو بِشِعرٍ وَنَحْوِهِ إِلاَّ كَانَ رَدْفهُ شَيْطَانٌ».
( المعجم الكبير (895)، تعليق الألباني “حسن”، صحيح الجامع (5706).حسن

ఉఖ్బా బిన్ ఆమిర్ (రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు), ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

ఏ ప్రయాణికుడు తన ప్రయాణంలో అల్లాహ్ (ధ్యానంలో) మరియు అల్లాహ్ జిక్ర్ లో నిమగ్నులై ఉంటాడో అతనికి తోడుగా దైవదూత ఉంటాడు. పద్యాలు లాంటి వాటిలో నిమగ్నులై ఉంటే అతనికి తోడుగా షైతాన్ ఉంటాడు.

(అల్ మొజముల్ కబీర్ : తబ్రానీ 895, సహీహుల్ జామి 5706)



عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ – صلى الله عليه وسلم -:
«مَا جَلَسَ قَوْمٌ مَجْلِساً لَمْ يَذْكُرُوا اللهَ فِيهِ، إِلاَّ كَانَ عَلَيْهِمْ تِرَةً ومَا مَشَى أَحَدٌ مَمْشًى لَمْ يَذْكُرِ اللهَ فِيهِ، إِلاَّ كَانَ عَلَيْهِ تِرَةً، وَمَا أَوَى أَحَدٌ إِلَى فِرَاشِهِ وَلَمْ يَذْكُرِ اللهَ فِيهِ، إِلاَّ كَانَ عَلَيْهِ تِرَةً».
(ابن حبان (850)، تعليق الألباني “صحيح”، تعليق شعيب الأرنؤوط “حديث صحيح”. =صحيح

అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

ఎవరైనా ఏదైనా సమావేశంలో కూర్చొని అల్లాహ్ జిక్ర్ చేయకుంటే అందుకై అతని కొరకు అది పశ్చాతపం, బాధకరంగా మారుతుంది. ఎవరైనా ఏదైనా దారి గుండా నడుస్తూ అల్లాహ్ జిక్ర్ చేయకుంటే అది వారి పశ్చాత్తాపం, బాధలకు కారణం అవుతుంది. ఎవరైనా తన పడకపై వచ్చి అల్లాహ్ జిక్ర్ చేయకుంటే అందుకై అతనికి పశ్చాత్తాపం బాధలకు గురికావలసి వస్తుంది.

(ఇబ్ను హిబ్బాన్ 850, షేఖ్ అల్బానీ సహీ అన్నారు)

ఇతర లింకులు:

రాత్రి పడుకునేటప్పుడు అల్లాహ్ పవిత్రతను కొనియాడటం

1739. హజ్రత్ అలీ (రధి అల్లాహు అన్హు) కధనం :-

హజ్రత్ ఫాతిమా (రధి అల్లాహు అన్హ) తిరగలి విసరి విసరి వ్యాధిగ్రస్తులయ్యారు. (అంటే ఆమె చేతులకు కాయలు కాశాయి). ఓసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు కొందరు (యుద్ధ) ఖైదీలు వచ్చారు. అది తెలిసి హజ్రత్ ఫాతిమా (రధి అల్లాహు అన్హ) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటికెళ్లారు. కాని ఆయన లేరు. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) మాత్రమే వున్నారు. అందుచేత ఫాతిమా (రధి అల్లాహు అన్హ) ఆమెనే కలుసుకొని విషయం తెలియజేశారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చారు. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) ఆయనకు ఫాతిమా (రధి అల్లాహు అన్హ) వచ్చి పోయిన సంగతి తెలియజేశారు.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా ఇంటికి వచ్చారు. అప్పుడు మేము మా పడకలపై పడుకొని ఉన్నాము. నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను చూసి లేవడానికి ప్రయత్నించాను. కాని ఆయన నన్ను అలాగే పడుకొని ఉండమని చెప్పి మా ఇద్దరి మధ్య కూర్చున్నారు. అప్పుడు ఆయన దివ్యపాదాల చల్లదనం నా గుండెలకు తాకింది. ఆయన ఇలా అన్నారు,

“(ఫాతిమా!) నీవు నన్నడిగిన దానికంటే ఎంతో మేలయినది నీకు చెప్పనా? నీవు పడుకోవటానికి పడక మీదికి చేరినపుడు 34 సార్లు అల్లాహు అక్బర్ అనీ, 33 సార్లు సుబ్ హానల్లాహ్ అనీ, 33 సార్లు అల్ హమ్దులిల్లాహ్ అనీ పఠిస్తూ ఉండు. ఈ స్మరణ నీ కోసం సేవకుడి కంటే ఎంతో శ్రేష్ఠమైన సంపద.”

[సహీహ్ బుఖారీ :- 62 వ ప్రకరణం – ఫజాయిలి అస్ హాబిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం), 9 వ అధ్యాయం – మనాఖిబ్ అలీ బిన్ అబీతాలిబ్ అల్ ఖురషీ – రజి]

ప్రాయశ్చిత్త ప్రకరణం : 19 వ అధ్యాయం – ఉదయం, రాత్రి పడుకునేటప్పుడు అల్లాహ్ పవిత్రతను కొనియాడటం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2 . సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్