Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 45
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
విశ్వాసుల తొలి హిజ్రత్ (వలస) ఘటనలు గూర్చిన ప్రశ్నలు
ఈ ప్రశ్నలు వీటి సమాచారాన్ని ఇన్ షా అల్లాహ్ హృదయం తో చదివితే కళ్ళు తడి అవ్వడం ఖాయం.
మీ బంధుమిత్రలందరితో కలసి ముస్లిమేతరుల హింసదౌర్జాన్యాలు అధికమయిన సందర్భంలో ఏ పుణ్యకార్యం గురించి అల్లాహ్ విశ్వాసులకు ఆదేశించాడన్న వివరాలు తెలుసుకోండి
1) హింసా దౌర్జన్యాలు పెరిగిన సందర్భంలో విశ్వాసులు తొలి హిజ్రత్ (వలస) చేసేందుకు ఏ సూరహ్ లో సంకేతాలు వచ్చాయి?
A) 62వ సూరహ్ జుము’అ
B)18వ సూరహ్ అల్ కహఫ్
C) 30వ సూరహ్ అ’ రూమ్
2) విశ్వాసుల తొలి హిజ్రత్ ఎక్కడికి జరిగింది?
A) అబీసీనియా
B) ఇరాక్
C) సిరియా
3) కాబా గృహం వద్ద దైవప్రవక్త (ﷺ) ఏ సూరహ్ పారాయణం చేస్తుంటే కరుడుగట్టిన ఖురైషీ సర్దారులు సైతం సజ్దా లో పడిపోయారు?
A) 53వ సూరహ్ అన్-నజ్మ్
B) 91వ సూరహ్ అష్-షమ్స్
C) 96వ సూరహ్ అల్-అలఖ్
క్విజ్ 45: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [12:19 నిమిషాలు]
1) హింసా దౌర్జన్యాలు పెరిగిన సందర్భంలో విశ్వాసులు తొలిహిజ్రత్ చేసేందుకు ఏ సూరహ్ లో సంకేతాలు వచ్చాయి?
B) 18వ సూరహ్ అల్ కహఫ్
హబషా వైపునకు మొదటి హిజ్రత్ (వలస)కు ఈ సూరాకు ఎలా సంబంధం ఉంది అనేది అర్థం కావడానికి ఇదే సూరాలోని ఆయతు 9 నుండి 26 వరకు అనువాదంతో చదవండీ అప్పుడు మీకు విషయం బోధపడవచ్చు ఇన్ షా అల్లాహ్. గుహవారి ఈ వృత్తాంతం యువతరానికి గొప్ప గుణపాఠం వంటిది. విచ్చలవిడితనం, వ్యర్థ వ్యసనాలకు గురవుతున్న నేటి నవయువకులు ఈ వృత్తాంతం నుండి నీతిని గ్రహించి, తమ శక్తియుక్తులను దైవప్రీతిని పొందే మార్గంలో వెచ్చిస్తే ఎంత బావుండదు!
మీరు నాతో పాటు ఆయతు 16పై శ్రద్ధ వహించండి:
18:16 وَإِذِ اعْتَزَلْتُمُوهُمْ وَمَا يَعْبُدُونَ إِلَّا اللَّهَ فَأْوُوا إِلَى الْكَهْفِ يَنشُرْ لَكُمْ رَبُّكُم مِّن رَّحْمَتِهِ وَيُهَيِّئْ لَكُم مِّنْ أَمْرِكُم مِّرْفَقًا
“ఇప్పుడు మీరు వాళ్ళతోనూ, అల్లాహ్‌ను గాకుండా వారు పూజిస్తున్న ఇతర దైవాలతోనూ తెగత్రెంపులు చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏదన్నా గుహలోకి పోయి కూర్చోండి. మీ ప్రభువు మీపై తన కారుణ్యాన్ని విస్తరింపజేస్తాడు. మీ కార్యసిద్ధికై సౌలభ్యాన్ని సమకూరుస్తాడు.”
సంక్షిప్తంగా వారి వృత్థాంతం ఇది:
హాఫిజ్ ఇబ్నె కసీర్ ప్రకారం: పూర్వం దిఖియానూస్ అనే రాజు ఒకడుండేవాడు. అతడు బహుదైవారాధన వైపుకు, జాతరల వైపుకు ప్రజల్ని పురికొల్పేవాడు. అయితే ఆరాధ్యదేవుడు ఒక్కడేనన్న సత్యాన్ని అల్లాహ్ ఈ కొద్దిమంది యువకులలో నూరిపోశాడు. భూమ్యాకాశాలను సృష్టించినవాడు, సమస్త జగతిని పోషిస్తున్నవాడే తమ నిజ దైవం కాగలడని వారు వాదించసాగారు. వారంతా ప్రజా బాహుళ్యం నుంచి వేర్చడి – ప్రత్యేకంగా ఒకచోట చేరి- ఒక్కడైన సృష్టికర్తను ఆరాధించేవారు. వారి ఏకదైవారాధన సమాజంలో చర్చనీయాంశంగా మారింది. అలా ఆ విషయం రాజుగారి చెవుల్లో కూడా పడింది. అతడు తన అధికారుల చేత వాళ్ళను రాజదర్చారుకు పిలిపించి విచారించాడు. వారు తమ అంతరాత్మ ప్రబోధాన్ని నిర్ధిష్టంగా చాటిచెప్పారు. అయితే పరిస్థితులు వారికి ఏమాత్రం అనుకూలంగా లేవు. ఒకవైపు బహుదైవారాధకులైన తమ జాతి జనుల విరోధం, మరోవైపు రాజుగారి భయం, అందువల్ల వారు తాము నమ్మిన ధర్మాన్ని కాపాడుకునేందుకు ఒక పర్వత గుహలో తలదాచుకున్నారు. అప్పుడు అల్లాహ్ వారిని గాఢమైన నిద్రకు లోనుచేశాడు. దాదాపు 309 సంవత్సరాలు వారు ఆ నిద్రావస్థలో ఉన్నారు.
పైన చెప్పినట్లు సూర కహఫ్, సూర నంబర్ 18, ఆయతు 9 నుండి 26 వరకు తఫ్సీర్ అహ్ సనుల్ బయాన్ లో తప్పక చదవండీ.
2) విశ్వాసుల తొలి హిజ్రత్ ఎక్కడికి జరిగింది?
A] అబీసీనియా
మొదటి ప్రశ్న సమాధానంలో దీని ప్రస్తావన వచ్చింది.
ఇమాం బుఖారీ రహిమహుల్లాహ్ కితాబ్ మనాఖిబిల్ అన్సార్ అనే చాఫ్టర్ లో బాబు హిజ్రతిల్ హబష అని సబ్ టైటిల్ పేర్కొన్నారు. అందులో ఐదు హదీసులు హబష వైపునకు హిజ్రత్ గురించి ప్రస్తావించారు. దాని తర్వాత మరో సబ్ టైటిల్ బాబు మౌతిన్ నజ్జాషీ అనే టైటిల్ పేర్కొన్నారు. అందులో ఐదు హదీసులు ప్రస్తావించారు. 3872లో ఉస్మాన్ రజియల్లాహు అన్హు, 3873లో ప్రవక్తవారి పవిత్ర భార్యలు ఉమ్మె హబీబా, ఉమ్మె సలమా రజియల్లాహు అన్హుమాల హిజ్రత్ ప్రస్తావన ఉంది. 3876లో జాఫర్ బిన్ అబీ తాలిబ్ హిజ్రత్ చేసిన సంఘటన ఉంది.
ఈ రోజుల్లో ఆ హదీసుల ద్వారా మనకు లభించే గొప్ప గుణఫాఠం ఏమిటంటే: మనం ఐహిక భోగభాగ్యాలు, ఇల్లు, ప్రాపటీ లాంటి ఇతర విషయాలకు విశ్వాసంపై ప్రాధాన్యతనివ్వకూడదు. ఎందుకంటే ఇవి ఇక్కడే మిగిలిపోయేవి, విశ్వాసమే మన వెంట ఉండేది.
3) కాబా గృహం వద్ద దైవప్రవక్త (ﷺ) ఏ సూరహ్ పారాయణం చేస్తుంటే కరుడుగట్టిన ఖురైషీ సర్దారులు సైతం సజ్దా లో పడిపోయారు?
A) 53వ సూరహ్ అన్-నజ్మ్
53వ సూర నజ్మ్
البخاري 4862:- عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا، قَالَ: «سَجَدَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِالنَّجْمِ وَسَجَدَ مَعَهُ المُسْلِمُونَ وَالمُشْرِكُونَ وَالجِنُّ وَالإِنْسُ»
బుఖారీ 4862:- అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు చెప్పారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూర నజ్మ్ చదివి సజ్దా చేశారు, ప్రవక్త తో పాటు ముస్లిములు, ముష్రికులు మరియు జిన్నాతులు, మానవులు కూడా సజ్దా చేశారు.
البخاري 4863:- عَنْ عَبْدِ اللَّهِ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: ” أَوَّلُ سُورَةٍ أُنْزِلَتْ فِيهَا سَجْدَةٌ وَالنَّجْمِ، قَالَ: فَسَجَدَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَسَجَدَ مَنْ خَلْفَهُ إِلَّا رَجُلًا رَأَيْتُهُ أَخَذَ كَفًّا مِنْ تُرَابٍ فَسَجَدَ عَلَيْهِ “، فَرَأَيْتُهُ بَعْدَ ذَلِكَ قُتِلَ كَافِرًا، وَهُوَ أُمَيَّةُ بْنُ خَلَفٍ
బుఖారీలోనే హదీసు నంబర్ 4863లో ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దా ఉన్న తొలి సూర, సూర నజ్మ్ చదివారు. ప్రవక్త సజ్దా చేశారు, ప్రవక్త వెనకున్నవారూ సజ్దా చేశారు. అయితే కేవలం ఒక వ్యక్తి సజ్దా చేయడానికి వంగలేదు. అరచేతి మన్ను తీసుకొని దానిపై సజ్దా చేశాడు. తర్వాత హత్య చేయబడ్డాడు. అతడు ఉమయ్య బిన్ ఖలఫ్. (బద్ర్ యుద్ధంలో బిలాల్ రజియల్లాహు అన్హు అతడ్ని చంపారు).
ఇతరములు :
తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz
You must be logged in to post a comment.