తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 44 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 44
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

దైవప్రవక్త (ﷺ) వారిపై జరిగిన హింసా దౌర్జ్యన్య ఘటనలు గూర్చిన ప్రశ్నలు .ఈ ప్రశ్నలు వీటి సమాచారంను ఇన్షా అల్లాహ్ హృదయం తో చదివితే కళ్ళు తడి అవ్వడం ఖాయం

1) మన ప్రియ ప్రవక్త (ﷺ) వారు నడిచే దారిలో మరియు గుమ్మం ముందు కూడా ముళ్లను పరచిన ఆ దుష్ట స్త్రీ ఎవరు?

A) హింద
B) అబు జహల్ భార్య
C) ఉమ్మె జమీల్

2) కాబా గృహం వద్ద సజ్దా లో ఉండగా ఒంటె ప్రేవులను మన ప్రియ ప్రవక్త (ﷺ) వారి వీపుపై వేసిన దుష్టుడు ఎవరు?

A) అబూజహల్
B) ఉఖ్బా బిన్ అబీ మూఅయిత్
C) షైబా బిన్ రబియా

3) ఇస్లాం స్వీకరించిన కారణంగా ఇంటి నుండి గెంటి వేయబడిన ధనిక యువకుడు ఎవరు?

A) ముస్అబ్ బిన్ ఉమైర్ (రజియల్లాహు అన్హు)
B) ముఅజ్ బిన్ జబల్ (రజియల్లాహు అన్హు)
C) అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్(రజియల్లాహు అన్హు)

క్విజ్ 44: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [10:40 నిమిషాలు]


1) మన ప్రియ ప్రవక్త (ﷺ) వారు నడిచే దారిలో మరియు గుమ్మం ముందు కూడా ముళ్లను పరచిన ఆ దుష్ట స్త్రీ ఎవరు?

C) ఉమ్మె జమీల్

ఉమ్మె జమీల్. అబూ సుఫ్యాన్ సోదరి మరియు అబూ లహబ్ యొక్క భార్య. ఈ విషయం తఫ్సీర్ ఇబ్ను కసీర్ లో సూర మసద్ (111:4) వ్యాఖ్యానంలో ఉంది. అలాగే సహీ బుఖారీ యొక్క ప్రఖ్యాతిగాంచిన వ్యాఖ్యానం ఫత్ హుల్ బారీలో కూడా ఉంది.

2) కాబా గృహం వద్ద సజ్దా లో ఉండగా ఒంటె ప్రేవులను మన ప్రియ ప్రవక్త (ﷺ) వారి వీపుపై వేసిన దుష్టుడు ఎవరు?

B) ఉఖ్బా బిన్ అబీ ముఈత్

ఉఖ్బా బిన్ అబీ ముఈత్. సహీ బుఖారీ 240లో, సహీ ముస్లిం 1794లో ఉంది.

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాబా గృహానికి దగ్గరలో నమాజు చేస్తున్నారు. అంతలో అక్కడ కూర్చున్న అబూ జహల్, అతని మిత్రమూక పరస్పరం మాట్లాడుకుంటూ వారిలో ఒకడు ఇలా అన్నాడు: ఫలానా తెగ వాడలో ఒంటె ప్రేగులు పడి ఉన్నాయి. వాటిని తెచ్చి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దా చేస్తున్నప్పుడు ఆయన వీపు మీద పెట్టాలి. ఈ పని చేసేవారు మీలో ఎవరైనా ఉన్నారా? అప్పుడు వారందరిలో ఉఖ్బా బిన్ అబీ ముఈత్ అనే అనే పరమ దౌర్భాగ్యుడు లేచాడు. అతను వెళ్ళి ఆ ప్రేగుల్ని తెచ్చి సమయం కోసం ఎదురు చూడసాగాడు. చివరికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దా స్థితిలోకి పోగానే ఆ దుర్మార్గుడు ఆ ప్రేగుల్ని ఆయన భుజాల మధ్య వీపు మీద పెట్టాడు.

నేనప్పుడు ఇదంతా కళ్ళప్పగించి చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేకపోయాను. నాకే గనక శక్తి ఉంటే నేనా దుర్మార్గుడ్ని అడ్డుకునేవాడ్ని. వారీ పైశాచిక చర్యకు పాల్పడటమే గాకుండా వెకిలి నవ్వులు కూడా నవ్వడం మొదలెట్టారు. సంతోషం పట్టలేక ఒకరి మీద ఒకరు పడుతూ నవ్వుకోసాగారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (వీపు మీదున్న ఒంటె ప్రేగుల బరువు వల్ల) సజ్దా స్థితిలోనే పడి ఉన్నారు. తల పైకెత్తలేక పోయారు. చివరికి హజ్రత్ ఫాతిమా (రజియల్లాహు అన్హా) వచ్చి చూసి, ఈ భారాన్ని ఆయన వీపుపై నుంచి తొలగించి వేశారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దా నుండి తల పైకెత్తి “అల్లాహ్! ఖురైషీయులకు తగిన శిక్ష విధించు” అని శపించారు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పెట్టిన శాపం విని వారు బెంబేలిత్తిపోయారు. ఈ మక్కా నగరంలో ఏ ప్రార్థన చేసినా అది తప్పక అంగీకరించబడుతుంది అని వాళ్ళు నమ్మేవారు. ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి) వసల్లం వారిలో ఒక్కొక్కరి పేరు ప్రస్తావిస్తూ “అల్లాహ్! అబూ జహల్ ని శిక్షించు, ఉత్బా బిన్ రబీఆ, షైబా బిన్ రబీఆ, వలీద్ బిన్ ఉత్బా, ఉమయ్యా బిన్ ఖలఫ్, ఉఖ్బా బిన్ అబీ ముఈత్ లను కూడా శిక్షించు” అని ప్రార్థించారు.

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ ఇంకా చెప్పారు: “నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో అతని సాక్షి! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పేర్లెత్తి శపించిన వీరంతా బద్ర్ (యుద్ధంలో వధించబడి) గుంటలో బొక్క బోర్లా పడి ఉండటాన్ని నేను స్వయంగా చూశాను. (మహా ప్రవక్త మహితోక్తులు 1172).

3) ఇస్లాం స్వీకరించిన కారణంగా ఇంటి నుండి గెంటి వేయబడిన ధనిక యువకుడు ఎవరు?

A) ముస్అబ్ బిన్ ఉమైర్ (రజియల్లాహు అన్హు)

ముస్అబ్ బిన్ ఉమైర్ (రజియల్లాహు అన్హు) మక్కాలో అత్యంత అందమైన యువకుడు, వారి తల్లి గొప్ప ధనవంతురాలు, తనయుడికి చాలా ధర గల దుస్తులు ధరింపచేసేది, అలాగే అత్యంత సువాసనగల అత్తర్లు పూసేది అని చరిత్ర గ్రంథాల్లో ఉంది. కాని ఇస్లాం స్వీకరించిన తర్వాత చాలా శిక్షించబడ్డారు, వేరే ఎవరితోనో కాదు. స్వయంగా ఎంతో ప్రేమ, వాత్సల్యాలతో పెంచిన కన్న తల్లి ద్వారానే. తల్లితో పాటు మరి కొందరు కలసి బందీఖానాలో వేశారు. ఏలాగో హబషా వలస వెళ్ళారు. అస్సాబిఖూనల్ అవ్వలూన్ లో ఒకరు ముస్అబ్ కూడాను. ప్రవక్త కంటే ముందు మదీనాకు ఎందుకవచ్చారో మరో క్విజ్ లో తెలుసుకుంటారు ఇన్ షా అల్లాహ్. చివరకు ఆయన షహీద్ అయిన రోజు కఫన్ కొరకు సరిపడ బట్ట దొరకలేదు. (బుఖారీ 1274, 1275).  ఇంకా చాలా ఘనతలున్నాయి.


ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

%d bloggers like this: