తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 40 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 40
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

బంధుమిత్రులతో విని ప్రవక్త జీవిత ఘట్టాలు, క్విజ్ రూపంలో సహీ ఆధారాలతో తెలుసుకుంటున్నందుకు అల్లాహ్ కృతజ్ఞత చెల్లిస్తూ ఆనందించండి అల్ హందులిల్లాహ్, సుమ్మ అల్ హందులిల్లాహ్

ప్రశ్నల పత్రం – 40

దైవప్రవక్త (ﷺ) బాల్యం:

1) అనాధ గానే పుట్టిన మన ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు ఏ వయస్సులో తల్లిని కూడా కోల్పోయారు?

A) 3 సం”’
B) 6 సం'”
C) 12 సం ”

దైవప్రవక్త (ﷺ) యవ్వనం:

2) ఏ వయస్సులో మన ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) వారు నిఖా చేసుకున్నారు?

A) 40 సం
B) 25 సం
C) 19 సం

దైవప్రవక్త (ﷺ) సంతానం:

3] మన ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) వారికి ఎంత మంది కూతుళ్లు?

A) 4
B) 3
C) 1

క్విజ్ 40: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [6:27 నిమిషాలు]


దైవప్రవక్త (ﷺ) బాల్యం

1) అనాధ గానే పుట్టిన మన ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు ఏ వయస్సులో తల్లిని కూడా కోల్పోయారు?

B] 6 సం'”

తఫ్సీర్ ఇబ్ను కసీర్, సూర జుహా 93:6 వ్యాఖ్యానంలో ఉంది:

ثُمَّ تُوُفِّيَتْ أُمُّهُ آمِنَةُ بِنْتُ وَهْبٍ وَلَهُ مِنَ الْعُمْرِ سِتُّ سِنِينَ
వారి తల్లి ఆమిన బిన్తు వహబ్ చనిపోయారు, అప్పుడు ఆయన వయస్సు ఆరు సంవత్సరాలు.

సీరత్ ఇబ్ను హిషామ్ లో ఉంది:

ولَمَّا بَلَغَ -صلى اللَّه عليه وسلم- سِتَّ سِنِينَ تُوُفِّيَتْ وَالِدَتُهُ آمِنَةُ بِنْتُ وَهْبٍ بِالْأَبْوَاءَ، وهِيَ رَاجِعَةٌ بِهِ إلَى مَكَّةَ بَعْدَ زِيَارَةٍ قَامَتْ بِهَا مَعَهُ -صلى اللَّه عليه وسلم- إلَي أَخْوَالِ جَدِّهِ عَبْدِ المُطَّلِبِ، بِالْمَدِينَةِ المُنَوَّرَةِ

ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆరవ ఏటలో చేరగా, వారి తల్లి ఆమిన బిన్తు బహబ్ తన సుపుత్రుడైన బాల ముహమ్మద్ ను తీసుకొని మదీనా వెళ్ళారు, అక్కడ తాత అబ్దుల్ ముత్తలిబ్ యొక్క మేన మామలను కలుసుకోటానికి, అయితే మదీనా నుండి మక్కా తిరుగు ప్రయాణంలో ఉండగా, ‘అబ్వ’ అను ప్రాంతంలో పరమపదించారు. ఈ రోజుల్లో ‘అబ్వా’ నుండి మక్కా 264 కి.మీ.

దైవప్రవక్త (ﷺ) యవ్వనం

2) ఏ వయస్సులో మన ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) వారు నికాహ్ (వివాహం) చేసుకున్నారు?

B] 25 సం

హజ్రత్ ఖదీజా (రజియల్లాహు అన్హా) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు నఫీసా (రజియల్లాహు అన్హా)ని పంపారు, ఆమె వెళ్ళి పెళ్ళి సంబంధం గురించి తెలియజేసింది. అగ్దె నికాహ్ సందర్భంలో ఖదీజా (రజియల్లాహు అన్హా) వైపు నుండి ఆమె బాబయి (చాచా) అమ్ర్ బిన్ అసద్ వలీగా వచ్చారు. ప్రవక్త వెంట ఆయన పెత్తండ్రులు అయిన అబూ తాలిబ్ మరియు హంజా (రజియల్లాహు అన్హు) హాజరయ్యారు. బనూ హాషిం మరియు ముజర్ వంశానికి చెందిన పెద్దలు కూడా పాల్గొన్నారు. అబూ తాలిబ్ ఖత్బా (పెళ్ళి ప్రసంగం) ఇచ్చారు. అప్పుడు ప్రవక్త వయస్సు 25సం, ఖదీజా వయస్సు 40సం. (తబ్కాత్ ఇబ్ను సఅద్, అల బిదాయ వన్నిహాయ).

దైవప్రవక్త (ﷺ) సంతానం

3) మన ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) వారికి ఎంత మంది కూతుళ్లు?

A] 4

మన ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కి నలుగురు కూతుళ్ళు:

1- జైనబ్ (రజియల్లాహు అన్హా), భర్త: ఖదీజ సోదరి కుమారుడు అబుల్ ఆస్.
2- రుఖయ్య (రజియల్లాహు అన్హా), మూడవ ఖలీఫా ఉస్మాన్ (రజియల్లాహు అన్హు). తన భర్తతో హబష హిజ్రత్ చేశారు. బద్ద్ యుద్ధం సమయంలో చనిపోయారు.
3- ఉమ్ము కల్సూమ్ (రజియల్లాహు అన్హా), రుఖయ్య (రజియల్లాహు అన్హా) చనిపోయాక ఉస్మాన్ (రజియల్లాహు అన్హు)తో కుల్సూమ్ (రజియల్లాహు అన్హా) వివాహం జరిగింది.
4- ఫాతిమా (రజియల్లాహు అన్హా), స్వర్గపు స్త్రీల నాయకురాలు. అలీ (రజియల్లాహు అన్హు) పెళ్ళి చేసుకున్నారు.

(ముఅజమ్ కబీర్ తబ్రానీ 22/397, సునన్ కుబ్రా 7/111).

ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

%d bloggers like this: