Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 42
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
బంధుమిత్రులతో విని ప్రవక్త జీవిత ఘట్టాలు, క్విజ్ రూపంలో సహీ ఆధారాలతో తెలుసుకుంటున్నందుకు అల్లాహ్ కృతజ్ఞత చెల్లిస్తూ ఆనందించండి అల్ హందులిల్లాహ్, సుమ్మ అల్ హందులిల్లాహ్
ప్రశ్నల పత్రం – 42
దైవప్రవక్త (ﷺ) వారి సందేశ ప్రచారం గూర్చిన ప్రశ్నలు
1) దైవప్రవక్త (ﷺ) తొలి దశలో ఎన్ని సంవత్సరాలు రహస్య ప్రచారం చేశారు?
A) 3 సం”
B) 1సం”
C) 5 సం”
2) దైవప్రవక్త (ﷺ) తొలి దశ లో ఎవరి ఇంటిలో సమావేశం జరిపేవారు?
A) దారుల్ అర్ఖమ్
B) పవిత్ర కాబా యందు
C) ఖబ్బాబ్ బిన్ అర్త్ (రజియల్లాహు అన్హు) ఇంటిలో
3) ప్రప్రధమ దశలోనే ఇస్లాం స్వీకరించిన వారిని ఏమంటారు?
A) అషరే ముబష్యిరా
B) షహీద్ లు
C) అస్సాబికూనల్ అవ్వలూన్
క్విజ్ 42: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [9:19 నిమిషాలు]
దైవప్రవక్త (ﷺ) వారి సందేశ ప్రచారం గూర్చిన ప్రశ్నలు
1) దైవప్రవక్త (ﷺ) తొలి దశలో ఎన్ని సంవత్సరాలు రహస్య ప్రచారం చేశారు?
A) 3 సం”
3 సంవత్సరాలు, అయితే ప్రచారం యొక్క ఆరంభ దశ రహస్యంగా ఉండినదని సహీ ముస్లిం, హదీసు నంబర్ 832 ద్వారా కూడా తెలుస్తుంది. ఉల్లేఖించినవారు అబూ ఉమామ (రజియల్లాహు అన్హు), ఇందులో అమ్ర్ బిన్ అబస సులమీ (రజియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరించిన సంఘటన చాలా మంచిగా ఇందులో ఎన్నో మంచి గుణపాఠాలు, బోధనలున్నాయి. రియాజుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) 438లో ఈ హదీసు పూర్తిగా చదవండి. అలాగే ఈ గుప్త ప్రచారం గురించి మహాప్రవక్త మహితోక్తులు అనే హదీసు గ్రంథంలో కూడా చదవగలరు. హదీసు నంబర్ 256.
2] దైవప్రవక్త (ﷺ) తొలి దశ లో ఎవరి ఇంటిలో సమావేశం జరిపేవారు?
A] దారుల్ అర్ఖమ్
దారుల్ అర్ఖమ్. దీని ప్రస్తావన సూర మర్యం, సూర నంబర్ 19, ఆయత్ నంబర్ 73 యొక్క వ్యాఖ్యానంలో వచ్చి ఉంది.
ఉర్దూ, అరబీ తెలిసిన వారు తఫ్సర్ ఇబ్ను కసీర్ చూడవచ్చు. తెలుగు తెలిసినవారు అహ్ సనుల్ బయాన్ లో ఈ ఆయతు వ్యాఖ్యానం చూడవచ్చు.
19:73 وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا أَيُّ الْفَرِيقَيْنِ خَيْرٌ مَّقَامًا وَأَحْسَنُ نَدِيًّا
స్పష్టమైన మా ఆయతులను వారి ముందు చదివి వినిపించినపుడు అవిశ్వాసులు “ఇంతకీ మన ఇరు వర్గాలలో ఎవరు మంచి స్థితిలోఉన్నారో, ఎవరి సభలు ఉత్తమంగా ఉన్నాయో చెప్పండి?” అని ముస్లిములతో (ఎగతాళిగా) అంటారు.
అహ్ సనుల్ బయాన్ వ్యాఖ్యానం నుండి:
“ఖుర్ఆన్ వంటి అద్భుత సందేశాన్ని ఎదుర్కోవటం చేతకాని ఖురైషు శ్రీమంతులు నిరుపేద ముస్లింల ఆర్థిక పరిస్థితి, నిరాడంబరమైన వారి సమావేశ స్థలాలనుఎత్తిచూపుతూ తమ డాబును, దర్పాన్ని చాటుకుంటున్నారు. ముస్లింలలో బిలాల్,అమ్మార్,సుహైబ్ లాంటి సహచరులు నిరుపేదలు. అవిశ్వాసుల దృష్టిలో వారు బలహీన వర్గానికి చెందినవారు. వారి సభావేదిక అయిన దారుల్ అర్ఖమ్ చాలా సీదాసాదాగా ఉంటుంది. అదే సమయంలో అవిశ్వాసులైన అబూ జహల్, నజర్ బిన్హారిస్, ఉత్బా, షైబా తదితర ప్రముఖుల సభావేదికలు ఎంతో అట్టహాసంగా ఉండేవి. పెద్ద పెద్ద మేడలలో వారు కొలువు తీరేవారు. ఈ ధన మదం, అధికార మదంతోనే వారు నిరుపేద ముస్లింలను చిన్నచూపు చూశారు.”
అలాగే ఇమాం ఇబ్ను హజర్ అస్ఖలానీ అల్ ఇసాబలో ఇబ్ను మంద (రహిమహుల్లాహ్) ఆధారంగా ప్రస్తావించారు. ఆయన అబ్దుల్లాహ్ బిన్ ఉస్మాన్ ఉల్లేఖనాన్ని పేర్కొన్నారు.
3) ప్రప్రధమ దశలోనే ఇస్లాం స్వీకరించిన వారిని ఏమంటారు?
C) అస్సాబికూనల్ అవ్వలూన్
وَالسَّابِقُونَ الْأَوَّلُونَ مِنَ الْمُهَاجِرِينَ وَالْأَنصَارِ وَالَّذِينَ اتَّبَعُوهُم بِإِحْسَانٍ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ وَأَعَدَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي تَحْتَهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ
ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను అల్లాహ్ వారికోసం సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం అంటే ఇదే. (సూరహ్ నూహ్ 9:100)
ఇతరములు :
తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz
You must be logged in to post a comment.