తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 39 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 39
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

బంధుమిత్రులతో విని ప్రవక్త జీవిత ఘట్టాలు, క్విజ్ రూపంలో సహీ ఆధారాలతో తెలుసుకుంటున్నందుకు అల్లాహ్ కృతజ్ఞత చెల్లిస్తూ ఆనందించండి అల్ హందులిల్లాహ్, సుమ్మ అల్ హందులిల్లాహ్

ప్రశ్నల పత్రం – 39

1) అబ్దుల్ ముత్తలిబ్ సమక్షంలో కాబా గృహానికి సంబంధించి జరిగిన ప్రధాన సంఘటనలు ఏమిటి?

A) చంద్రుడు రెండు ముక్కలు కావడం
B) ఏనుగుల ఘటన – పూడ్చబడిన జమ్ జమ్ బావి ఆచూకీ దొరకడం
C) తొలిగా కాబా నిర్మాణం – బావి త్రవ్వకం

2) దైవప్రవక్త (ﷺ) వారికి తల్లి తర్వాత పాలిచ్చిన స్త్రీ ఎవరు?

A) ఉమ్మె అయిమన్
B) అబూ జువైబ్ కూతురు హలీమా
C) సూబియా (Thuwaibah ثُوَيْبَةُ)

3) దైవప్రవక్త (ﷺ) వారిని కొంత జీతం నిమిత్తం పాలిచ్చి పెంచిన దాయా ఎవరు?

A) అబూజువైబ్ కూతురు హలీమా
B) బర్కత్
C) ఉమ్మె అయిమన్

క్విజ్ 39: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [6:23 నిమిషాలు]


1) అబ్దుల్ ముత్తలిబ్ సమక్షంలో కాబా గృహానికి సంబంధించి జరిగిన ప్రధాన సంఘటనలు ఏమిటి?

B] ఏనుగుల ఘటన – పూడ్చబడిన జమ్ జమ్ బావి ఆచూకీ దొరకడం

రెండు ఘటనలు జరిగినవి. అయితే ఏనుగల ఘటన ఇది వరకే మనం విని ఉన్నాము. సూరతుల్ ఫీల్ సూర నంబర్ 105 చదవండి. ఇక రెండవ ఘటన సారాంశం ఏమిటంటే:

అల్లాహు తఆలా ఇస్మాఈల్ (అలైహిస్సలాం) మరియు ఆయన మాతృమూర్తి అయిన హాజర్ (అలైహస్సలాం)కు ఒక గొప్ప మహిమగా ప్రసాదించిన జమ్ జమ్ నీరు , అది తర్వాత ఓ బావిగా ఏర్పడింది. అయితే ఓ కాలం తర్వాత జుర్హుమ్ మరియు ఖుజాఆల మధ్య జరిగిన గొడవలో జుర్హుమ్ దానిని మూసివేశారు. సంవత్సరాల తరబడి మూసి ఉన్న ఆ బావి ప్రదేశాన్ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి తాత అయిన అబ్దుల్ ముత్తలిబ్ కు అల్లాహ్ ఎన్నో సార్లు కళలో చూపించాడు. ఆ తర్వాత అతను అదే ప్రదేశంలో త్రవ్వడం మొదలెట్టాడు. అల్ హందులిల్లాహ్ జమ్ జమ్ బావి వెలికి వచ్చింది. ఇది ఆయన జీవితంలోని ఓ గొప్ప సంఘటన.

(ఈ త్రవ్వక విషయం సహీ సనద్ తో ఇమాం బైహఖీ గారు దలాఇలున్నుబువ్వహ్ లో ప్రస్తావించారు. 1/93. అల్లూలుఉల్ మక్నూన్… 1/53).

2) దైవప్రవక్త (ﷺ) వారికి తల్లి తర్వాత పాలిచ్చిన స్త్రీ ఎవరు? 

C) సూబియా (సువైబ సరియైన ఉచ్ఛారణ)

బుఖారీ 5106 ఇతర హదీసుల ద్వారా తెలుస్తుంది.

أَرْضَعَتْنِي وَأَبَاهَا ثُوَيْبَةُ
సువైబ నాకు పాలు త్రాపించిందని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు.

3) దైవప్రవక్త (ﷺ) వారిని కొంత జీతం నిమిత్తం పాలిచ్చి పెంచిన దాయా ఎవరు?

A) అబూజువైబ్ కూతురు హలీమా

బుఖారీలో సంక్షిప్తంగా; హునైన్ యుద్ధం తర్వాత పట్టుబడిన బానిసల సంఘటనలో ఈ విషయం వస్తుంది. అయితే ముస్నద్ అహ్మద్ 12221, సహీ ముస్లింలో వచ్చిన హదీసుల ద్వారా కూడా ఈ విషయం బోధపడుతుంది.

مسند أحمد 12221 ، صحيح على شرط مسلم:- عَنْ أَنَسٍ، ” أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَلْعَبُ مَعَ الصِّبْيَانِ، فَأَتَاهُ آتٍ فَأَخَذَهُ فَشَقَّ بَطْنَهُ، فَاسْتَخْرَجَ مِنْهُ عَلَقَةً فَرَمَى بِهَا، وَقَالَ: هَذِهِ نَصِيبُ الشَّيْطَانِ مِنْكَ، ثُمَّ غَسَلَهُ فِي طَسْتٍ مِنْ ذَهَبٍ مِنْ مَاءِ زَمْزَمَ، ثُمَّ لَأَمَهُ فَأَقْبَلَ الصِّبْيَانُ إِلَى ظِئْرِهِ: قُتِلَ مُحَمَّدٌ، قُتِلَ مُحَمَّدٌ، فَاسْتَقْبَلَتْ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، وَقَدِ انْتَقَعَ (1) لَوْنُهُ ” قَالَ أَنَسٌ: ” فَلَقَدْ كُنَّا نَرَى أَثَرَ الْمَخِيطِ فِي صَدْرِهِ ” (2)

పై హదీసు సారాంశం ఏమిటంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హలీమ సఅదియా వద్ద ఉండగానే ‘షర్హె సద్ర్’ సంఘటన జరిగింది. దీని వివరణ మరో క్విజ్ లో తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్.

ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

%d bloggers like this: