తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 41 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 41
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

బంధుమిత్రులతో విని ప్రవక్త జీవిత ఘట్టాలు, క్విజ్ రూపంలో సహీ ఆధారాలతో తెలుసుకుంటున్నందుకు అల్లాహ్ కృతజ్ఞత చెల్లిస్తూ ఆనందించండి అల్ హందులిల్లాహ్, సుమ్మ అల్ హందులిల్లాహ్

ప్రశ్నల పత్రం – 41

దైవప్రవక్త (ﷺ) వారిపై వహీ (దివ్యవాణి) అవతరణ గూర్చిన ప్రశ్నలు

1) దైవప్రవక్త (ﷺ) ఏ కొండ గుహలో ఏకాంతంలో ఉండి అల్లాహ్ ను ఆరాధించేవారు?

A) కహఫ్
B) హీరా గుహ
C) సౌర్ గుహ

2) దైవప్రవక్త (ﷺ) వారిపై అవతరించిన తొలి వహీ ఏ సూరహ్ లో గలదు?

A) సూరహ్ అలఖ్
B) సూరహ్ ఫాతిహా
C) సూరహ్ ఇఖ్లాస్

3) దైవప్రవక్త (ﷺ) వారిపై అవతరించిన రెండవ వహీ ఏ సూరహ్ లో గలదు?

A) సూరహ్ అల్ బఖరా
B) సూరహ్ అల్ ముద్దస్సిర్
C) సూరహ్ అల్ ఫుర్ఖాన్

క్విజ్ 41: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [5:57 నిమిషాలు]


దైవప్రవక్త (ﷺ) వారిపై వహీ (దివ్యవాణి) అవతరణ గూర్చిన ప్రశ్నలు

1) దైవప్రవక్త (ﷺ) ఏ గుహలో ఏకాంతంలో ఉండి అల్లాహ్ ను ఆరాధించేవారు?

B] హిరా గుహ

సహీ బుఖారీ 3 లో ఉంది, ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హిరా గుహలో ఆరాధన చేస్తూ ఉండేవారు, అకస్మాత్తుగా ఒకసారి జిబ్రీల్ వచ్చారు, ‘చదువు’ అని అన్నారు. ప్రవక్త నేను చదువరుడ్ని కాను అని చెప్పారు. గట్టిగా అలముకొని వదలి చదువు అన్నాడు జిబ్రీల్, మళ్ళీ ప్రవక్త నేను చదువరుడ్ని కాను అని అన్నారు. రెండు, మూడు సార్లు ఇలాగే మరీ గట్టిగా అలముకొని వదలి సూర అలఖ్ లోని 5 ఆయతలు చదివించారు

2) దైవప్రవక్త (ﷺ) వారిపై అవతరించిన తొలి వహీ ఏ సూరహ్ లో గలదు?

A) సూరహ్ అలఖ్

సూరతుల్ అలఖ్, ఖుర్ఆన్ క్రమంలో 96వ సూర. దీనికి దలీల్ ఇప్పుడే మనం విన్న సహీ బుఖారీ హదీస్ 3

96:1 اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో.

96:2 خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ
ఆయన మనిషిని నెత్తుటి ముద్దతో సృష్టించాడు.

96:3 اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ
నువ్వు చదువుతూ పో. నీ ప్రభువు దయాశీలి.

96:4 الَّذِي عَلَّمَ بِالْقَلَمِ
ఆయన కలం ద్వారా (జ్ఞాన) బోధ చేశాడు.

96:5 عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ
ఆయన మనిషికి, అతడు ఎరుగని దానిని నేర్పాడు.

3) దైవప్రవక్త (ﷺ) వారిపై అవతరించిన రెండవ వహీ ఏ సూరహ్ లో గలదు?

B) సూరహ్ అల్ ముద్దస్సిర్

సూర ముద్దస్సిర్, ఖుర్ఆన్ క్రమంలో 74 సూర. తొలి 7 ఆయతులు. దీనికి దలీల్ సహీ బుఖారీలోని హదీస్ నంబర్ 4

74:1 يَا أَيُّهَا الْمُدَّثِّرُ
ఓ కంబళి కప్పుకున్నవాడా!

74:2 قُمْ فَأَنذِرْ
లే. (లేచి జనులను) హెచ్చరించు.

74:3 وَرَبَّكَ فَكَبِّرْ
నీ ప్రభువు గొప్పతనాన్ని చాటి చెప్పు.

74:4 وَثِيَابَكَ فَطَهِّرْ
నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో.

74:5 وَالرُّجْزَ فَاهْجُرْ
ఆశుద్ధతను వదలిపెట్టు.

74:6 وَلَا تَمْنُن تَسْتَكْثِرُ
ఉపకారం చేసి ఎక్కువ (ప్రతిఫలం) పొందాలని ఆశించకు.

74:7 وَلِرَبِّكَ فَاصْبِرْ
నీ ప్రభువు కొరకు ఓర్పు వహించు.

ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

%d bloggers like this: