ఈ పాఠంలో, వక్త ‘తాగూత్’ అనే విషయాన్ని వివరిస్తారు. అల్లాహ్‌ను కాకుండా ఆరాధించబడే ప్రతిదాన్ని ‘తాగూత్’ అంటారు. ప్రతి ఒక్కరూ తాగూత్‌ను తిరస్కరించి, అల్లాహ్‌ను మాత్రమే విశ్వసించాలని ఇస్లాం నిర్దేశిస్తుందని వక్త పేర్కొన్నారు. ఇమామ్ ఇబ్న్ అల్-ఖయ్యిమ్ నిర్వచనం ప్రకారం, ఆరాధన, విధేయత లేదా అనుసరణలో మానవుడు తన పరిధిని దాటడానికి కారణమయ్యేది తాగూత్. ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్ద్ అల్-వహాబ్ ప్రకారం, ఐదు ప్రధాన తాగూత్‌లు ఉన్నాయి: 1. ఇబ్లీస్ (సైతాన్), 2. తన ఆరాధన పట్ల సంతోషించేవాడు, 3. తనను ఆరాధించమని ప్రజలను పిలిచేవాడు, 4. అగోచర జ్ఞానం ఉందని చెప్పుకునేవాడు, 5. అల్లాహ్ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా తీర్పు చెప్పేవాడు. చివరగా, “ధర్మానికి శిరస్సు ఇస్లాం, దాని స్తంభం నమాజ్, మరియు దాని శిఖరం జిహాద్” అనే హదీస్‌తో వక్త పాఠాన్ని ముగించారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
జిహాద్ అంటే ఏమిటి? అవిశ్వాసుల_సందేహం – చంపడానికి ఆదేశించే ఇస్లాం శాంతియుత ధర్మం ఎలా అవుతుంది? https://youtu.be/gSMYVw32Mr4 [12 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
Al-Hajj 22:39 أُذِنَ لِلَّذِينَ يُقَٰتَلُونَ بِأَنَّهُمْ ظُلِمُوا۟ۚ وَإِنَّ ٱللَّهَ عَلَىٰ نَصْرِهِمْ لَقَدِيرٌ ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేయబడుతుందో, వారికి (కూడా ప్రతిఘటనకు) అనుమతి ఇవ్వబడుతోంది. ఎందుకంటే వారు (ముస్లిములు) పీడితులు. నిశ్చయంగా అల్లాహ్ వారిని ఆదుకోగల శక్తి గలవాడు.
Al-Baqarah 2:190 وَقَٰتِلُوا۟ فِى سَبِيلِ ٱللَّهِ ٱلَّذِينَ يُقَٰتِلُونَكُمْ وَلَا تَعْتَدُوٓا۟ۚ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلْمُعْتَدِينَ మీతో పోరాడే వారితో మీరు కూడా దైవమార్గంలో పోరాడండి. కాని మితిమీరకండి. మితిమీరి పోయేవారిని అల్లాహ్ ఇష్టపడడు.
Al-Anfal 8:61 وَإِن جَنَحُوا۟ لِلسَّلْمِ فَٱجْنَحْ لَهَا وَتَوَكَّلْ عَلَى ٱللَّهِۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ ఒకవేళ వారు సంధివైపు మొగ్గు చూపితే (ఓ ప్రవక్తా!) నువ్వు కూడా సంధి వైపుకు మొగ్గుచూపు. అల్లాహ్‌పై భారం మోపు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
An-Nisa’ 4:90 … فَإِنِ ٱعْتَزَلُوكُمْ فَلَمْ يُقَٰتِلُوكُمْ وَأَلْقَوْا۟ إِلَيْكُمُ ٱلسَّلَمَ فَمَا جَعَلَ ٱللَّهُ لَكُمْ عَلَيْهِمْ سَبِيلًا … కాబట్టి వారు మీ దారినుంచి తప్పుకుని, మీతో యుద్ధం చేయకుండా, సంధి కోసం ప్రయత్నిస్తే (అప్పుడు వారిపై దాడి జరపటానికి) అల్లాహ్ మీకు మార్గం తెరచి ఉంచలేదు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[9:05 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
అబూ ఉమామ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెలిపారు:
“ముగ్గురు అల్లాహ్ యొక్క హామీ/పూచీ(జమానత్)లో ఉన్నారు. బ్రతికివుంటే వారికి మంచి ఉపాధి లభిస్తుంది వారివైపు నుండి అల్లాహ్ సరిపోతాడు.ఒకవేళ చనిపోతే అల్లాహ్ వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. మొదటి వ్యక్తి ఇంట్లోకి ప్రవేశిస్తూ సలాం చేసేవాడు. అతను అల్లాహ్ యొక్క పూచీలో ఉంటాడు. రెండవ వ్యక్తి మస్జిద్ వైపునకు వెళ్ళేవాడు. అల్లాహ్ యొక్క పూచీలో అతను కూడా ఉంటాడు. మూడో వ్యక్తి అల్లాహ్ యొక్క మార్గంలో బయలుదేరిన వ్యక్తి. అతను కూడా అల్లాహ్ యొక్క హామీలో ఉంటాడు.”
504 صحيح ابن حبان كتاب البر والإحسان باب إفشاء السلام وإطعام الطعام
499 المحدث شعيب الأرناؤوط خلاصة حكم المحدث صحيح في تخريج صحيح ابن حبان
Abu Umamah reported: The Messenger of Allah, peace and blessings be upon him, said,
“Three people have a guarantee from Allah. If he lives he will have provision to suffice him, and if he dies he will enter Paradise: one who enters and greets with peace has a guarantee from Allah, one who goes out to the mosque has a guarantee from Allah, and one who goes out in the way of Allah has a guarantee from Allah.”
Source: Ṣaḥīḥ Ibn Ḥibbān 504. Grade: Sahih (authentic) according to Al-Mundhiri
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
(ఓ ప్రవక్తా!) ప్రజలు నిన్ను నెలవంకలను గురించి ప్రశ్నిస్తున్నారు కదూ! ఇది ప్రజల (ఆరాధనల) వేళలను, హజ్ కాలాన్ని నిర్ధారించటానికి (జరిగిన ఏర్పాటు) అని నువ్వు వారికి సమాధానం ఇవ్వు. (ఇహ్రామ్ స్థితిలో) మీరు మీ ఇళ్ళల్లోకి వెనుక వైపు నుంచి రావటం సత్కార్యం కాదు. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి వున్నవాడిదే అసలు సత్కార్యం. మీరు మీ ఇండ్లల్లోకి వాకిళ్ళ నుండే ప్రవేశించండి. సాఫల్యం పొందగలందులకుగాను అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి.
వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో తలపడండి, మిమ్మల్ని ఎక్కడి నుంచి వారు తరిమికొట్టారో, అక్కడి నుంచి మీరు కూడా వారిని తరిమికొట్టండి. ఫిత్నా (కుఫ్ర్, షిర్క్, పీడన) అనేది చంపటం కన్నా తీవ్రమైనది. ‘మస్జిదె హరామ్’ వద్ద వారు మీతో యుద్ధం చేయనంతవరకూ మీరూ వారితో పోరాడకండి. వారు గనక మిమ్మల్ని హతమార్చడానికి ప్రయత్నిస్తే మీరు కూడా దీటైన జవాబు ఇవ్వండి. అవిశ్వాసులకు సరైన సమాధానం ఇదే.
పీడన (ఫిత్నా) సమసిపోనంతవరకూ, దైవధర్మానిది పైచేయి కానంతవరకూ వారితో పోరాడుతూనే ఉండండి. ఒకవేళ వారు యుద్ధాన్ని విరమిస్తే (మీరూ విరమించండి). మెడలు వంచ వలసింది దౌర్జన్యపరులవే.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఓ విశ్వాసులారా! “అల్లాహ్ మార్గంలో బయలుదేరండి” అని మీతో అనబడినప్పుడు మీరు నేలకు అతుక్కుపోతారేమిటి? అసలు మీకేమైపోయిందీ? మీరు పరలోకానికి బదులు ఇహలోక జీవితాన్నే కోరుకున్నారా? అయితే వినండి! ప్రాపంచిక జీవితపు సకల సామగ్రి పరలోకం ముందు అత్యల్పమైనది.
మీరు గనక (దైవమార్గంలో) బయలు దేరకపోతే అల్లాహ్ మీకు బాధాకరమైన శిక్ష విధిస్తాడు. మీకు బదులుగా మరో జాతిని (మీ స్థానంలో) తీసుకువస్తాడు. మీరు అల్లాహ్‌కు ఎంత మాత్రం నష్టం కలిగించలేరు. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు.
మీరు గనక అతనికి (ప్రవక్తకు) తోడ్పడకపోతే (పోనివ్వండి), అవిశ్వాసులు దేశం నుంచి అతనిని వెళ్ళగొట్టినప్పుడు- అతను ఇద్దరిలో రెండవవాడు. వారిద్దరూ గుహలో ఉన్నప్పుడు, అతను తన సహచరునితో, “బాధపడకు. నిశ్చయంగా అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు” అని ఓదార్చినప్పుడు అల్లాహ్‌యే వారికి తోడ్పడ్డాడు. (ఆ ఘడియలో) అల్లాహ్ తన తరఫునుంచి అతనిపై ప్రశాంతతను అవతరింపజేశాడు. మీకు కానరాని సైన్యాలతో అతన్ని ఆదుకున్నాడు. ఆయన అవిశ్వాసుల మాటను అట్టడుగు స్థితికి దిగజార్చాడు. అల్లాహ్ వాక్కు మాత్రమే సర్వోన్నతమైనది, సదా పైన ఉండేది. అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేకవంతుడు.
(ఓ ప్రవక్తా!) త్వరగా సొమ్ములు లభించి, ప్రయాణం సులభతరమై ఉంటే వాళ్లు తప్పక నీ వెనుక వచ్చి ఉండేవారే. కాని సుదీర్ఘ ప్రయాణం అనేసరికి అది వారికి దుర్భరంగా తోచింది. ఇప్పుడు వాళ్లు, “మాలోనే గనక శక్తీ స్థోమతలు ఉండి ఉంటే తప్పకుండా మీ వెంట వచ్చి ఉండేవారం” అని అల్లాహ్‌పై ఒట్టేసి మరీ చెబుతారు. వాస్తవానికి వారు తమను తాము నాశనం చేసుకుంటున్నారు. వారు అబద్ధాలకోరులన్న సంగతి అల్లాహ్‌కు బాగా తెలుసు.
(1) మీకు ఇవ్వ బడిన సిలబస్(తౌబా – 9: 40) వివరణ ప్రకారం దైవప్రవక్త (ﷺ) వారితో పాటుగా గుహలో ఉన్న రెండవ వ్యక్తి (సహచరుడు) ఎవరు? A) అబూబక్ర్ సిద్దీక్ (రజియల్లాహు అన్హు) B) అలీ (రజియల్లాహు అన్హు) C) అబూహురైరా (రజియల్లాహు అన్హు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.