చిన్న షిర్క్ (ప్రదర్శనాబుద్ధి) విషయంలో ఎక్కువగా భయపడండి | బులూగుల్ మరాం | హదీసు 1281 https://www.youtube.com/watch?v=ZodO3_eKB7c [5 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
1281. హజ్రత్ మహమూద్ బిన్ లబీద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:
“మీ గురించి అన్నింటి కన్నా ఎక్కువగా నేను చిన్న షిర్క్ (షిర్కె అస్గర్) – అంటే ప్రదర్శనా బుద్ది విషయంలో భయపడుతున్నాను.” (ఇమామ్ అహ్మద్ దీనిని ‘హసన్ పరంపర నుండి సేకరించారు)
సారాంశం: ప్రదర్శనాబుద్ధి అనేది మనిషి మాటల్లోనూ, చేతల్లోనూ కూడా ఉంటుంది. మనిషి ఏదైనా మంచి పనిచేసి దాని ద్వారా అల్లాహ్ యేతరుల మెప్పు పొందగోరటమే ప్రదర్శనాబుద్ధి. ఈ ప్రదర్శనాబుద్ధి రెండు రకాలుగా ఉంటుంది. మనిషి తాను చేసిన గొప్ప పనిని ఎవరూ చూడక పోతే దాని గురించి నలుగురికీ చెప్పుకుంటూ లేక చూపించుకుంటూ తిరగటం ఒక రకం. ప్రతి పనినీ నలుగురికీ చూపిస్తూ చేయటం రెండవ రకం. ఇవి రెండూ సమ్మతం కావు. అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ ప్రదర్శనా భావాన్ని ఈసడించుకున్నారు. దీన్ని కపటత్వానికి నిదర్శనంగా కూడా ఖరారు చేశారు. ప్రదర్శనాబుద్ధితో కూడిన ఏ పుణ్యకార్యమూ అల్లాహ్ సమక్షంలో స్వీకరించబడదు. కాబట్టి అన్ని విధాలా – శాయశక్తులా – దీనికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచర సమాజం (ఉమ్మత్) గురించి అత్యధికంగా భయపడిన విషయం ‘షిర్కె అస్గర్’ (చిన్న షిర్క్) అని ఈ ప్రసంగం వివరిస్తుంది. ఈ చిన్న షిర్క్ అంటే ‘రియా’ – అనగా ఇతరుల మెప్పు, ప్రశంసలు పొందాలనే ఉద్దేశ్యంతో చేసే ప్రదర్శన బుద్ధి. ఇది ‘షిర్కె ఖఫీ’ (గుప్తంగా ఉండే షిర్క్) అని కూడా పిలవబడుతుంది. ప్రళయ దినాన, ప్రదర్శన బుద్ధి కోసం సత్కార్యాలు చేసిన వారిని అల్లాహ్, “మీరు ఎవరికోసం అయితే ఈ పనులు చేశారో, వారి వద్దకే వెళ్లి ప్రతిఫలం అడగండి” అని అంటాడని హదీసులో ఉంది. రియా వల్ల కలిగే నష్టాలు తీవ్రమైనవి: సత్కార్యాలు నిరర్థకం అవ్వడం, కపట విశ్వాసుల లక్షణాన్ని పోలి ఉండటం, మరియు తీవ్రమైన శిక్షకు గురికావడం. అందువల్ల, ప్రతి పనిని కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేయాలని, ప్రదర్శన బుద్ధికి దూరంగా ఉండాలని ఈ ప్రసంగం నొక్కి చెబుతుంది.
وَعَنْ مَحْمُودِ بْنِ لَبِيدٍ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم: إِنَّ أَخْوَفَ مَا أَخَافُ عَلَيْكُمُ الشِّرْكُ الأَصْغَرُ హజ్రత్ మహమూద్ బిన్ లబీద్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “మీ గురించి అన్నింటి కన్నా ఎక్కువగా నేను చిన్న షిర్క్ (షిర్కె అస్గర్) – అంటే ప్రదర్శనా బుద్ది విషయంలో భయపడుతున్నాను“.
అల్లాహు అక్బర్. చూడడానికి ఈ హదీస్ చాలా చిన్నగా ఉన్నప్పటికీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మన గురించి ఎంత రంది ఉండినదో తెలుస్తుంది, ఒక మాట. మనం ఏదైనా నష్టంలో పడిపోతామో, ఏదైనా పాపములో పడిపోతామో అని ప్రవక్త మన గురించి ఎంత భయం చెందేవారు. ఆ సందర్భంలో అలాంటి పరిస్థితిలో మనం ఏం చేయాలి అన్నది కూడా మనకు నేర్పేవారు.
షిర్కె అస్గర్ (చిన్న షిర్క్)
ఈ హదీస్ లో ఏం చెప్పారు ప్రవక్త వారు? షిర్కె అస్గర్. అంటే చిన్న షిర్క్ నుండి నేను మీ పట్ల చాలా భయపడుతున్నాను, మీరు దానికి పాల్పడతారని. షిర్కె అస్గర్ దేనిని అంటారు? రియా. మరొక హదీస్ ద్వారా తెలుస్తుంది, దీనినే,
الشِّرْكُ الْخَفِيُّ (అష్షిర్కుల్ ఖఫీ) దాగి ఉన్న, గుప్తమైన షిర్క్ అని కూడా అంటారు.
ఈ సందర్భంలో మరొక హదీస్ ను గనక మనం తెలుసుకుంటే, వాస్తవానికి మరొక హదీస్ కాదు వేరే ఉల్లేఖనాల్లో ఈ హదీస్ లోనే ఒక భాగం ఉంది. ఏంటి?
ఎవరైతే ఈ లోకంలో షిర్కె అస్గర్ కు, ప్రదర్శన బుద్ధికి పాల్పడతారో, ప్రళయ దినాన అల్లాహ్ వారితో అంటాడు – ఎప్పుడైతే అల్లాహు త’ఆలా ప్రజలందరికీ వారి కర్మల ప్రతిఫలం ప్రసాదిస్తాడో ఆ సమయంలో – ఏమంటాడు? “ఇహలోకంలో మీరు ఎవరి కొరకైతే మీరు మీ పనులు చేసేవారు – అంటే ప్రజలు మెచ్చుకోవాలి అని ప్రదర్శన బుద్ధితో చేశారు కదా ఈ లోకంలో – అయితే ఎవరు చూసి మిమ్మల్ని మెచ్చుకోవాలని మీరు ఆ కార్యాలు చేశారో, వారి వద్దకే వెళ్ళండి. వారు మీకు ఏదైనా ప్రతిఫలం ఇవ్వగలుగుతారా చూడండి.”
ఇస్తారా ఎవరైనా? ఇవ్వలేరు. అయితే ఏం తెలుస్తుంది మనకు? మనం ఏ మాట మాట్లాడినా, ఏ పని చేసినా, ఫలానా వారు చూసుకోవాలి, ఒరే మౌలసాబ్ ఎంత మంచిగా తఖ్రీర్ చేస్తున్నాడు అని మెచ్చుకోవాలి, అస్తగ్ ఫిరుల్లాహ్, అస్తగ్ ఫిరుల్లాహ్. నా తోటి వారు నేను ఎంత మంచిగా చదువుతున్నానో అని నన్ను మెచ్చుకోవాలి. ఇంకా ఏ పనులైనా గానీ, ఇక్కడ మనకు సంబంధించిన నేను ఉదాహరణలు ఒకటి రెండు ఇస్తున్నాను. అయితే ఇలా ప్రజలు చూసి మెచ్చుకోవాలన్నటువంటి భావనతో – ఈ మెచ్చుకోవడం రెండు రకాలు. ఒకటి, ఏదైనా పని చేయడం ప్రజలు మెచ్చుకోవాలని మన మనసులో ఉండడం. ఏదైనా మాట మాట్లాడడం లేదా ఏదైనా హోదా సంపాదించడం మరియు అక్కడ ప్రజల నోట ప్రశంసలు వెళ్ళాలి మన గురించి అని మనం అనుకోవడం. ఈ విధంగా ప్రదర్శన బుద్ధి, పేరు ప్రఖ్యాతుల కాంక్ష, ఇవన్నీ కూడా చాలా నష్టానికి పాల్పడతాయి, చాలా నష్టానికి మనల్ని గురిచేస్తాయి.
ప్రదర్శన బుద్ధి వల్ల కలిగే నష్టాలు
ఎలాంటి నష్టాలు? నంబర్ ఒకటి, మనం ఒక రకమైన షిర్క్ లో పడ్డవారమవుతాం. ఎందుకంటే మనం ప్రతీ కార్యం అల్లాహ్ ప్రసన్నత కొరకు చేయాలి. అంటే మనం అల్లాహ్ యేతరుల కొరకు చేసిన వాళ్ళం అవుతున్నాము. ఇక్కడ తప్పుడు భావములో పడకండి, పర్లేదులే చిన్న షిర్కే కదా అని. చిన్న చిన్న రాళ్లు కలిసే ఓ గుట్ట తయారవుతుంది. చిన్న చిన్న కట్టెలు కలిసే అన్నం వండుతారు, బిర్యానీలు వండుతారు. కదా? చిన్న చిన్న షిర్క్ కలిసి చాలా పెద్దగా అయిపోతే అది మరింత ఎక్కువ ప్రమాదకరమైపోతుంది.
రెండవ నష్టం, ఇది వంచకుల, కపట విశ్వాసుల, మునాఫికుల గుణం. సూరతున్నిసా ఆయత్ నంబర్ 142. అలాగే చివరి, ఖురాన్ యొక్క చివరి, ఆ సూరతుల్ మాఊన్ అని ఉంది కదా, చివరి చిన్న సూరాలలో, ఆ సూరాలో ఆయత్ నంబర్ నాలుగు నుండి ఏడు వరకు చదివి చూడండి.
మరియు అదే ఆయతులలో మూడవ నష్టం గురించి కూడా అల్లాహ్ మనకు తెలిపాడు. ఏంటి అది? వైల్ ఉన్నది, వారికి వినాశనం ఉన్నది, వారి కొరకు చాలా ఘోరమైన నరకంలో ఒక స్థానం ఉన్నది అని.
మరొక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఎవరు ఏ సత్కార్యాలు చేస్తారో, అందులో ప్రదర్శన బుద్ధి కలిగి ఉంటారో, ఆ సత్కార్యం అన్నది అల్లాహ్ స్వీకరించడు, అల్లాహ్ దానికి ప్రతిఫలం అనేది ప్రసాదించడు.
ఈ విధంగా సోదర మహాశయులారా, ఈ ప్రదర్శన బుద్ధి అన్నది ఇహలోకంలో, పరలోకంలో మనకు చాలా నష్టంలో పడవేస్తుంది. వీటన్నిటికీ మనం దూరం ఉండాలి. అల్లాహు త’ఆలా మనందరికీ కూడా చిన్న, పెద్ద అన్ని రకాల షిర్కుల నుండి దూరం ఉంచుగాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఏమీ లేనివారు దానం (సదకా) చేసేదెలా? https://youtu.be/wB4zgYE0JwQ [21 నిముషాలు] వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, దానం (సదకా) యొక్క ప్రాముఖ్యత మరియు దాని విస్తృతమైన అర్థం గురించి వివరించబడింది. గత వారం ప్రసంగంలోని 18 ప్రయోజనాలను గుర్తుచేస్తూ, ఈ వారం ముఖ్యంగా ఏమీ లేని వారు కూడా ఎలా దానం చేయవచ్చో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ద్వారా స్పష్టం చేయబడింది. శారీరక శ్రమ చేసి సంపాదించి ఇవ్వడం, అది కూడా సాధ్యం కాకపోతే ఇతరులకు శారీరకంగా సహాయపడటం, అది కూడా చేయలేకపోతే కనీసం చెడు పనుల నుండి దూరంగా ఉండటం కూడా దానమేనని వివరించబడింది. మంచి మాట పలకడం, దారి చూపడం, ఇబ్బంది కలిగించే వస్తువులను తొలగించడం వంటి ప్రతి మంచి పని సదకాగా పరిగణించబడుతుందని చెప్పబడింది. దానం చేసేటప్పుడు ప్రదర్శనా బుద్ధి (రియా) ఉండకూడదని, అల్లాహ్ ప్రసన్నతను మాత్రమే ఆశించాలని ఖురాన్ ఆయతుల ద్వారా నొక్కి చెప్పబడింది. దానం రహస్యంగా ఇవ్వడం ఉత్తమమని, కానీ ఫర్జ్ అయిన జకాత్‌ను ఇతరులను ప్రోత్సహించడానికి బహిరంగంగా ఇవ్వవచ్చని కూడా పేర్కొనబడింది.
الْحَمْدُ لِلَّهِ الَّذِي يُجْزِلُ الْمُتَصَدِّقِينَ దాతలకు గొప్ప ప్రతిఫలాన్నిచ్చే అల్లాహ్ కే సర్వ స్తోత్రములు.
وَيُخْلِفُ عَلَى الْمُنْفِقِينَ ఖర్చు చేసేవారికి ప్రతిఫలం ఇస్తాడు.
وَيُحِبُّ الْمُحْسِنِينَ సజ్జనులను ప్రేమిస్తాడు.
وَلَا يُضِيعُ أَجْرَ الْمُؤْمِنِينَ మరియు విశ్వాసుల ప్రతిఫలాన్ని వృధా చేయడు.
أَحْمَدُهُ سُبْحَانَهُ నేను ఆయన పవిత్రతను కొనియాడుతున్నాను,
عَلَىٰ نِعَمِهِ الْعَظِيمَةِ ఆయన గొప్ప అనుగ్రహాలకు,
وَآلَائِهِ الْجَسِيمَةِ మరియు ఆయన అపారమైన వరాలకు,
وَصِفَاتِهِ الْكَرِيمَةِ మరియు ఆయన ఉదార గుణాలకు.
وَأَسْأَلُهُ أَنْ يَجْعَلَ عَمَلَنَا فِي الْخَيْرِ دِيمَةً మంచి పనులలో మా ఆచరణను నిరంతరం ఉండేలా చేయమని నేను ఆయనను వేడుకుంటున్నాను.
وَأَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారు, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు లేరు.
وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త.
النَّبِيُّ الْأَمِينُ విశ్వసనీయ ప్రవక్త,
وَالرَّسُولُ الْكَرِيمُ గౌరవనీయమైన ప్రవక్త.
كَانَ أَجْوَدَ النَّاسِ ప్రజలందరిలోకెల్లా అత్యంత దాతృత్వంగలవారు.
وَأَكْرَمَ النَّاسِ ప్రజలందరిలోకెల్లా అత్యంత గౌరవనీయులు.
فَكَانَ أَجْوَدَ بِالْخَيْرِ مِنَ الرِّيحِ الْمُرْسَلَةِ ఆయన మంచి చేయడంలో వేగంగా వీచే గాలి కంటే ఎక్కువ దాతృత్వం కలవారు.
صَلَّى اللَّهُ عَلَيْهِ وَعَلَى آلِهِ وَصَحْبِهِ అల్లాహ్ ఆయనపై, ఆయన కుటుంబంపై మరియు ఆయన సహచరులపై శాంతిని వర్షింపజేయుగాక.
الَّذِينَ كَانُوا يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ వారు మంచి పనులలో పోటీపడేవారు.
فَكَانُوا يُنْفِقُونَ مِمَّا يُحِبُّونَ వారు తమకు ఇష్టమైన వాటి నుండి ఖర్చు చేసేవారు.
وَيُؤْثِرُونَ عَلَىٰ أَنْفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ మరియు తమకు అవసరం ఉన్నప్పటికీ, ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చేవారు.
وَمَنْ يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ మరియు ఎవరైతే తన మనస్సు యొక్క పిసినారితనం నుండి రక్షించబడ్డాడో, అటువంటి వారే సాఫల్యం పొందేవారు.
సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన, సకల లోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
అభిమాన సోదరులారా! గత శుక్రవారం మనం ఇహపర లోకాలలో దానం వల్ల కలిగే 18 ప్రయోజనాలు తెలుసుకున్నాం.
ఏమీ లేని వారు దానం చేసేదెలా?
ఈరోజు ఏమీ లేని వారు దానం చేసేది ఎలా? ఈ అంశంపై కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఒక హదీసులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట ఇలా ఉంటుంది.
عَلَى كُلِّ مُسْلِمٍ صَدَقَةٌ [అలా కుల్లి ముస్లిమిన్ సదఖతున్] ప్రతి ముస్లింపై దానం (సదకా) చేయడం తప్పనిసరి.
ఇది హదీస్ కి అర్థం. ప్రతి ముస్లింపై దానం చేయడం తప్పనిసరి విధి. మరి సహాబాలలో చాలామంది పేదవారు, లేనివారు. అంతెందుకు, కొంతమంది సహాబాకి ఇల్లు కూడా లేదు, మస్జిద్ లో ఉంటున్నారు. వారి నివాసం మస్జిద్. వారిలో కొంతమంది కూలి పని చేసుకుని తన జీవితం గడిపితే, మరి కొంతమంది దీన్ నేర్చుకోవడం కోసం పూర్తి జీవితాన్ని అంకితం చేశారు కాబట్టి మస్జిద్ లోనే ఉండిపోయేవారు. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) లాంటి వారు. అంటే ఎవరైనా ఏదైనా దానం చేసి ఖర్జూరం తీసుకుని వచ్చి ఇస్తే అది తినేవారు, లేకపోతే పస్తులు ఉండేవారు. మరి అటువంటి వారు దానం ఎలా చేయాలి? ఈ హదీస్ కి అర్థం ఏమిటి? “అలా కుల్లి ముస్లిం సదకా” – ప్రతి ముస్లింపై దానం చేయడం, సదకా చేయడం తప్పనిసరి. మరి సహాబాలకి ఆశ్చర్యం వేసింది, సహాబాలు అడిగారు. ఏం అడిగారు? “ఓ ప్రవక్తా, ఒకవేళ అతని వద్ద స్థోమత లేకుంటే ఏం చేసేది?”
قِيلَ: أَرَأَيْتَ إِنْ لَمْ يَجِدْ؟ దానం చేసే అంత స్థోమత లేదు, మరి ఏం చేయాలి?
قَالَ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,
يَعْتَمِلُ بِيَدَيْهِ అతను కూలి పని చేయాలి.
فَيَنْفَعُ نَفْسَهُ తద్వారా వచ్చిన వేతనంతో తాను తినాలి,
وَيَتَصَدَّقُ అవసరార్థులకు తినిపించాలి.
ప్రశ్న ఏమిటి? ఓ దైవ ప్రవక్తా దానం చేసే స్థోమత లేదు. అటువంటి వారు ఏం చేయాలి? దానికి సమాధానం ప్రవక్త గారు ఏం చెప్పారు? కూలి పని చేయండి. తద్వారా వచ్చిన వేతనంతో స్వయంగా తినండి, అవసరార్థులకు తినిపించండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు.
అంటే మనలో చాలామంది ఏమనుకుంటారంటే మిడిల్ క్లాస్ వారు, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు, పేదవారు, లేనివారు దానం అనేది ధనవంతులు మాత్రమే చేస్తారు, వారు చేసే పని, నాలాంటి వారికి, మాలాంటి వారికి దానం లేదు, పేదవాళ్ళం కదా అని ఆ భ్రమలోనే జీవితాంతం అలాగే ఉండిపోతారు. కానీ ఈ హదీసులో ఏమీ లేని వారు కూడా తమ స్థోమతను బట్టి దానం చేయాలని మహాప్రవక్త ఆజ్ఞాపించారు. అంతటితో హదీస్ పూర్తి అవ్వలేదు. ఆ తర్వాత మళ్లీ సహాబాలు అడిగారు.
أَرَأَيْتَ إِنْ لَمْ يَسْتَطِعْ؟ కూలి పని చేసే అంత శక్తి కూడా అతనికి లేదు.
కొందరు ఉంటారు, అనారోగ్యం మూలంగా, ముసలితనం మూలంగా, ఇంకో ఏదైనా కారణంగా ఆ పని కూడా చేయలేరు. మరి మీరేమో “అలా కుల్లి ముస్లిం సదకా” అని చెప్పేశారు, తప్పనిసరి అని చెప్పేశారు. కూలి పని చేసే అంత శక్తి కూడా లేదు, ఆ అవకాశం కూడా లేదు. అటువంటి వారు ఏం చేయాలి? అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఒకవేళ అతను కూలి పని కూడా చేయగలిగే శక్తి లేనివాడైతే ఆ వ్యక్తి దుఖితులకు, అవసరార్థులకు శారీరక సేవను చేయాలి. ఇది కూడా దానం కిందకే వస్తుంది. అంటే పేదవాడు, డబ్బు లేదు, ఏమీ లేదు, కూలి కూడా చేయలేడు, అటువంటి వాడు శారీరకంగా ఇతరులకు సహాయం చేయగలిగితే సహాయం చేయాలి, అది కూడా దానం కిందకే వస్తుంది. ఆ తర్వాత అది కూడా చేయలేకపోతే? అనారోగి. ఒక రోగి అనారోగ్యంతో ఉన్నాడు. శారీరకంగా కూడా సహాయం చేసే స్థితిలో లేడు. దాని గురించి అన్నారు, అది కూడా చేయకపోతే చెడు పనుల నుండి తన్ను తాను కాపాడుకోవాలి. ఇది కూడా సదకా కిందకే వస్తుంది. చెడు నుండి తనకు తాను కాపాడుకోవాలి. ఇది కూడా సదకా, దానం గానే పరిగణించబడుతుందని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
అలాగే బుఖారీలో ఒక హదీస్ ఉంది, అది ఏమిటంటే:
كُلُّ مَعْرُوفٍ صَدَقَةٌ ప్రతి మంచి మాట కూడా దానం కిందకే వస్తుంది.
ఒక మంచి మాట పలకడం కూడా దానమే అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
అలాగే అనేక హదీసులలో దారి తప్పిన బాటసారికి దారి చూపటం కూడా దానమే, ఒక గుడ్డివాని చేయి పట్టి మార్గదర్శకత్వం వహించడం కూడా దానమే, దారిలో నుండి ముల్లును, రాయిని, ఎముకను తొలగించడం కూడా దానమే. తన బొక్కెనలో ఉన్న నీరును తోటి సోదరుని కడవలో పోయటం కూడా దానమే అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అంటే దానం చేయాలంటే అనేక మార్గాలు మనకు ఇస్లాం తెలియపరుస్తుంది. కాకపోతే తన స్థోమత మేరకు ఆర్థికపరంగానైనా, శారీరకపరంగానైనా, ఏదో విధంగానైనా దానం చేయాలి, సహాయం చేయాలని బోధపడింది.
దానం వెనుక ఉద్దేశ్యం
ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానం చేసిన తర్వాత వాటి నుంచి ఏదీ ఆశించకూడదు. ఇది చాలా ముఖ్యమైన అంశం. మొదటి వహీ వచ్చింది: “ఇఖ్రా బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్”. ఆ తర్వాత రెండవ వహీ సూరహ్ ముద్దస్సిర్. దాంట్లో ఒక వాక్యం ఉంది.
وَلَا تَمْنُن تَسْتَكْثِرُ ఉపకారం చేసి ఎక్కువ (ప్రతిఫలం) పొందాలని ఆశించకు. (74:6)
నేను దానం చేస్తే, నేను సహాయం చేస్తే, తిరిగి అతనితో నాకు ఏదైనా ప్రయోజనం కలుగుతుంది అనే ఉద్దేశ్యంతో దానం చేస్తే అది దానం కాదు. అది సదకా కాదు. నువ్వు ఒక ఉద్దేశ్యంతో, ఒక లాభంతో, మళ్లీ నీకు ఏదో రూపంలో తిరుగు వస్తుందనే భావంతో నువ్వు ఇస్తున్నావు కదా? అది దానం ఎలా అయ్యింది? ఆ ఉద్దేశ్యంతో దానం, ఉపకారం చేయకు అని అల్లాహ్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఉద్దేశించి అంటున్నాడు. “వలా తమ్నున్ తస్తక్ సిర్” – ఓ ప్రవక్తా, అధికంగా పొందాలన్న ఆశతో ఉపకారం చేయకు. సర్వసాధారణమైన రీతిలో ముస్లింలకు ఈ విధంగా తాకీదు చేయడం జరిగింది.
అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చాడు:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُم بِالْمَنِّ وَالْأَذَىٰ كَالَّذِي يُنفِقُ مَالَهُ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ఓ విశ్వాసులారా! తన ధనాన్ని పరుల మెప్పుకోసం ఖర్చుచేస్తూ, అల్లాహ్‌ను గానీ, అంతిమదినాన్ని గానీ విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి.(2:264)
ఈ ఆయతులో ప్రదర్శనా బుద్ధితో దానం చేయటం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవిశ్వాసులతో పోల్చాడు. ఏ విధంగా అయితే “వలా యు’మిను బిల్లాహ్”, అల్లాహ్‌ను ఎవరు విశ్వసించరో, అల్లాహ్‌ను ఎవరు నమ్మరో, వారు ఈ విధానాన్ని పాటిస్తారు. వారికి మరణం తర్వాత జీవితం, వారికి అల్లాహ్ ప్రసన్నత, అల్లాహ్ పట్ల విశ్వాసం, అల్లాహ్ పట్ల భీతి లేదు కదా? విశ్వాసమే లేదు. అటువంటి వారు చేసే దానం, మీరు విశ్వసించే వారు, మీరు చేసే దానం ఒకే రకంగా ఉంటే తేడా ఏంటి? వారు ప్రదర్శనా బుద్ధితో దానం చేస్తారు, మీరు అలా చేయకండి. అలా చేస్తే వారు చేసిన దానం మాదిరిగా అవుతుంది అని అల్లాహ్ ఉపమానం ఇచ్చాడు. అలాగే సూరహ్ బఖరాలో ఇలా ఉంది:
قَوْلٌ مَّعْرُوفٌ وَمَغْفِرَةٌ خَيْرٌ مِّن صَدَقَةٍ يَتْبَعُهَا أَذًى ۗ وَاللَّهُ غَنِيٌّ حَلِيمٌ దానం చేసిన తరువాత మనసు నొప్పించటం కంటే మంచి మాట పలకటం, క్షమించటం ఎంతో మేలు. అల్లాహ్ అక్కరలేనివాడు, సహనశీలుడు.(2:263)
అంటే మీరు ప్రదర్శనా బుద్ధితో దానం చేస్తున్నారు, దానికంటే మంచి మాట చెప్పటం మంచిది. పుణ్యం వస్తుంది. దీనికి పుణ్యం రాదు కదా. అది రియా అయిపోయింది కదా, పాపం అయిపోయింది కదా. డబ్బు పోయింది, పుణ్యం పోయింది. దానికంటే అటువంటి దానం కంటే మంచి మాట పలకటం ఇది గొప్పది అని అల్లాహ్ అంటున్నాడు ఖురాన్ లో. అలాగే సూరహ్ బఖరాలో ఇలా ఉంది:
إِن تُبْدُوا الصَّدَقَاتِ فَنِعِمَّا هِيَ ۖ وَإِن تُخْفُوهَا وَتُؤْتُوهَا الْفُقَرَاءَ فَهُوَ خَيْرٌ لَّكُمْ ۚ وَيُكَفِّرُ عَنكُم مِّن سَيِّئَاتِكُمْ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ [ఇన్ తుబ్దుస్ సదఖాతి ఫనిఇమ్మా హియ, వ ఇన్ తుఖ్ఫూహా వ తు’తూహల్ ఫుఖరాఅ ఫహువ ఖైరుల్ లకుమ్, వ యుకఫ్ఫిరు అన్కుమ్ మిన్ సయ్యిఆతికుమ్, వల్లాహు బిమా త’అమలూన ఖబీర్] ఒకవేళ మీరు బహిరంగంగా దానధర్మాలు చేసినా మంచిదే గాని, గోప్యంగా నిరుపేదలకు ఇస్తే అది మీ కొరకు ఉత్తమం. (దీనివల్ల) అల్లాహ్ మీ పాపాలను తుడిచిపెడతాడు. అల్లాహ్‌కు మీరు చేసేదంతా తెలుసు.(2:271)
ఇక్కడ బహిరంగంగా అంటే కొంతమంది పండితులు ఇది జకాత్, ఫర్జ్ జకాత్. ఈ ఫర్జ్ జకాత్‌ని కొందరికి తెలిసి నేను ఇస్తే, వేరే వాళ్ళకి నేను ఆదర్శంగా ఉంటాను. ఇది ఫర్జ్ కదా. ఇప్పుడు మనం నమాజ్ ఫర్జ్, దాన్ని గోప్యంగా చేసే అవసరం లేదు. ఉపవాసం ఫర్జ్, గోప్యం అవసరం లేదు. ఉన్నవారికి హజ్ ఫర్జ్, గోప్యం అవసరం లేదు. ఆ విధంగా జకాత్ ఫర్జ్ అయిన వారు కొందరికి తెలిసి జకాత్ ఇస్తే అది మంచిదే. కానీ నార్మల్ సదకా, సాధారణమైన సదకా దానాలు, “వ ఇన్ తుఖ్ఫూహా వ తు’తూహల్ ఫుఖరాఅ ఫహువ ఖైరుల్ లకుమ్” అయితే మీరు వాటిని గోప్యంగా నిరుపేదల వరకు చేరిస్తే అది మీకు మరీ మంచిది. అల్లాహ్ మీ పాపాలను మీ నుండి దూరం చేస్తాడు. మీరు చేసేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు. అలాగే:
الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُم بِاللَّيْلِ وَالنَّهَارِ سِرًّا وَعَلَانِيَةً فَلَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ఎవరయితే తమ సిరిసంపదలను రేయింబవళ్లు రహస్యంగానూ, బహిరంగంగానూ ఖర్చుచేస్తారో వారి కొరకు వారి ప్రభువు వద్ద (గొప్ప) పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు. (2:274)
ఇక దానం చేసిన తర్వాత మనసులో బాధ కలిగితే, అది ఎటువంటి దానం అది? ఇష్టం లేకుండా, అయిష్టకరంగా ఇవ్వటం. వారు ఇస్తున్నారు, నేను ఇవ్వకపోతే బాగుండదు కదా, అనుకుని ఇవ్వటం. ఇచ్చిన తర్వాత బాధపడటం, అయ్యో పోయింది అని చెప్పి. దీన్ని ఏమంటారు? ఖురాన్ లో ఉంది.
وَلَا يُنفِقُونَ إِلَّا وَهُمْ كَارِهُونَ వారు, అంటే కపట విశ్వాసులు, మునాఫిఖీన్లు, ఒకవేళ దైవ మార్గంలో ఖర్చు పెట్టినా అయిష్టంగానే ఖర్చు పెడతారు. (9:54)
ఇది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కపట విశ్వాసుల గురించి చెప్పాడు. బాధపడుతూ దానం చేయటం, అయిష్టకరంగా దానం చేయటం, దానం చేసిన తర్వాత కుమిలిపోవటం, ఎందుకు ఇచ్చానా అని చెప్పి, డబ్బు పోయిందా అని అనుకోవటం, ఇది ఎవరి గుణము? కపట విశ్వాసుల గుణం. సూరహ్ తౌబాలో ఉంది. అంటే అయిష్టంగా ఖర్చు పెట్టడం ఇది కపట విశ్వాసుల లక్షణం.
وَمَثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ وَتَثْبِيتًا مِّنْ أَنفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍ بِرَبْوَةٍ దైవ ప్రసన్నతను చూరగొనటానికి (అల్లాహ్ ప్రసన్నత, అల్లాహ్ కి మర్జీ, అల్లాహ్ కి రజా పానే కే లియే) తమ పనులను, మనసులను నిమ్మళించడానికి సంపదను ఖర్చు పెట్టే వారి ఉపమానం ఎత్తైన ప్రదేశంలో ఉన్న తోట వంటిది.
وَمَا تُنفِقُونَ إِلَّا ابْتِغَاءَ وَجْهِ اللَّهِ ۚ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ يُوَفَّ إِلَيْكُمْ وَأَنتُمْ لَا تُظْلَمُونَ ఇంకా మీరు కేవలం అల్లాహ్ ప్రసన్నతను బడయటానికే ఖర్చు చేయండి. మీరేం ఖర్చు చేసినా అది మీకు పూర్తిగా తిరిగి ఇవ్వబడుతుంది. మీకు ఎంత మాత్రం అన్యాయం జరగదు. (2:272)
అంటే దానాల ప్రయోజనం అల్లాహ్ ఈ లోకంలో కూడా ప్రసాదిస్తాడు, పరలోకంలో కూడా ప్రసాదిస్తాడు.
అభిమాన సోదరులారా, ఒకటి, ప్రతి వ్యక్తి దానం చేయవచ్చు. డబ్బు ఉన్నవారు ఆర్థికపరంగా, తక్కువ ఉన్నవారు తమ స్థోమతపరంగా, ఏమీ లేని వారు ఇతర మార్గాల ద్వారా ప్రతి వ్యక్తి దానం చేసే అవకాశం ఉంది. రెండవది ఏమిటి? ప్రదర్శనా బుద్ధితో దానం చేయకూడదు, అది రియా అవుతుంది, చిన్న షిర్క్ అవుతుంది, దానికి ప్రతిఫలం రాదు.
మూడవ విషయం,
كُلُّ مَعْرُوفٍ صَدَقَةٌ [కుల్లు మ’అరూఫిన్ సదఖతున్] మేలుతో కూడుకున్న ప్రతి మంచి పని సదకా క్రిందకే వస్తుంది.
కుల్లు మ’అరూఫిన్ సదకా, మేలుతో కూడుకున్న ప్రతి మంచి పని సదకా కిందకే వస్తుంది. కావున స్థోమత ఉన్నవారు తమ స్థోమత పరంగా ఏదో రూపంలోనైనా దానం చేయాలి, అది చిన్నది అని అల్పంగా భావించకూడదు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
لَا تَحْقِرَنَّ مِنَ الْمَعْرُوفِ شَيْئًا وَلَوْ أَنْ تَلْقَى أَخَاكَ بِوَجْهٍ طَلْقٍ ఏ సత్కార్యాన్ని అల్పంగా, అతి సామాన్యంగా తలపోయకండి. ఆఖరికి తమ సోదరుణ్ణి నగుమోముతో పలకరించడాన్ని అయినా సరే.
అంటే చిరునవ్వుతో నవ్వటం కూడా మంచి సంకల్పంతో సదకా కిందకే వస్తుంది. అది ఎంత చిన్నదైనా, ఎంత రవ్వంత అయినా సరే, అల్పంగా భావించకండి. అల్లాహ్ మనసు చూస్తాడు, అల్లాహ్ నియ్యత్, సంకల్పం చూస్తాడు. ఎటువంటి సంకల్పంతో, ఎటువంటి బుద్ధితో ఇస్తున్నావు, అది ముఖ్యం. ఎంత ఇస్తున్నావు అది ముఖ్యం కాదు.
అలాగే చివర్లో ఒక హదీస్ చెప్పి నేను ముగిస్తున్నాను. అది ఏమిటంటే, ఒక హదీసులో ఇలా ఉంది:
كُلُّ سُلامَى مِنَ النَّاسِ عَلَيْهِ صَدَقَةٌ، كُلَّ يَوْمٍ تَطْلُعُ فِيهِ الشَّمْسُ ప్రతి ముస్లిం ప్రతి రోజూ అతని శరీరంలో ఎముకలు ఎన్ని జాయింట్లు ఉన్నాయో, ఎముకల జాయింట్లు, కొందరు అంటారు దాదాపు 360 జాయింట్లు ఉన్నాయి అంటారు. శరీరంలో ఎముకల జాయింట్లు 360 ఉన్నాయి. అంటే ప్రతి రోజూ ప్రతి జాయింట్ కి బదులుగా ఒక దానం చేయాలి, సదకా ఇవ్వాలి.
అంటే ప్రతి రోజు 360 దానాలు చేయాలి. కాకపోతే ఇక్కడ దానం అంటే డబ్బు రూపంలోనే కాదు. అది ఏమిటి?
يَعْدِلُ بَيْنَ اثْنَيْنِ صَدَقَةٌ ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయం చేయటం సదకా.
وَيُعِينُ الرَّجُلَ عَلَى دَابَّتِهِ فَيَحْمِلُ عَلَيْهَا ముందు కాలంలో గుర్రాల్లో, గాడిదల్లో, ఒంటెల్లో సవారీ చేసేవారు. దానిపై వారికి ఎక్కించడానికి, కొందరు అనారోగ్యం మూలంగా, వృద్ధాప్యం వలన పైకి ఎక్కలేరు. ఇప్పుడు కూడా బస్సులో, కార్లలో, మోటార్లలో, రైళ్లలో సామాన్లు ఎక్కువగా ఉంటాయి. ఆ సామాన్లు ఎక్కించడానికి వారికి సహాయం చేయటం, కొందరికి ఆరోగ్యం బాగా లేదు, వికలాంగులు, వారికి కూర్చోబెట్టడానికి సహాయం చేయటం అది కూడా దానమే, సదకాయే.
أَوْ يَرْفَعُ عَلَيْهَا مَتَاعَهُ صَدَقَةٌ సామాన్లు మోయటం అది సదకా.
وَالْكَلِمَةُ الطَّيِّبَةُ صَدَقَةٌ మంచి మాట చెప్పటం, అది కూడా సదకా.
وَكُلُّ خُطْوَةٍ يَخْطُوهَا إِلَى الصَّلَاةِ صَدَقَةٌ నమాజు కోసం మనము వేసే ప్రతి అడుగు సదకా కిందకే వస్తుంది.
وَيُمِيطُ الْأَذَى عَنِ الطَّرِيقِ صَدَقَةٌ దారి నుండి హాని కలిగించే, నష్టం కలిగించే ముల్లు లాంటిది, బండ లాంటిది, రాయి లాంటిది, ఏదైనా అశుద్ధత లాంటిది దూరం చేయటం కూడా అది కూడా సదకా కిందకే వస్తుంది.
కావున, ఏమీ లేని వారు కూడా అనేక రకాలుగా దానాలు చేయవచ్చు, ప్రతి రోజు చేయవచ్చు, ప్రతి సమయం చేయవచ్చు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఇటువంటి దానాలు చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ ఇహపర లోకాలలో సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్.
وآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ [వా ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్] మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రములు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగం “హృదయ రోగాల చికిత్స” అనే అంశంపై సాగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన హదీసు ప్రకారం, శరీరంలో హృదయం (ఖల్బ్) యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, అది బాగుంటేనే శరీరమంతా బాగుంటుందని, అది చెడిపోతే శరీరమంతా చెడిపోతుందని వివరించారు. ఖురాన్ ప్రకారం ప్రవక్త ఆగమన ఉద్దేశ్యం ప్రజల ఆత్మలను పరిశుద్ధం చేయడమేనని తెలిపారు. హృదయానికి సోకే ఐదు ప్రధాన వ్యాధులైన 1. షిర్క్ (బహుదైవారాధన), 2. కపటత్వం (నిఫాఖ్), 3. రియా (ప్రదర్శనా బుద్ధి), 4. అతిగా అనుమానించడం (జన్), 5. అసూయ (హసద్) గురించి సవివరంగా చర్చించారు. చివరగా, హృదయ శుద్ధి కోసం 7 మార్గాలను (అల్లాహ్ పై పరిపూర్ణ ప్రేమ, చిత్తశుద్ధి, ప్రవక్త అనుసరణ, దైవధ్యానం/భయం, దానధర్మాలు, రాత్రి పూట నమాజు, దుఆ) సూచించారు.
అభిమాన సోదరులారా! మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం “అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు”.
ఈ రోజు మనం “హృదయ రోగాల చికిత్స” అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అంశంలో ముఖ్యమైన మూడు విషయాలు తెలుసుకుందాం.
హృదయ ప్రాముఖ్యత
మొదటి విషయం ఏమిటంటే హృదయం గురించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక విషయం చెప్పారు. బుఖారీలో హదీసు ఉంది, అది సుదీర్ఘమైన హదీసు. ఆ హదీసులోని చివరి భాగం ఏమిటంటే:
“వినండి! నిశ్చయంగా దేహంలో ఒక మాంసపు ముక్క ఉంది. ఆ ఒక్క ముక్క క్షేమంగా ఉంటే పూర్తి దేహం, పూర్తి శరీరం క్షేమంగా ఉంటుంది. అదే గనక, ఆ ఒక్క ముక్క గనక పాడైపోతే సంపూర్ణ దేహం పాడైపోతుంది. వినండి! అదే హృదయం (ఖల్బ్).”
అంటే హృదయ పరిశుభ్రత, పరిశుద్ధత చాలా అవసరము. హృదయం పాడైపోతే పూర్తి శరీరం పాడైపోతుంది అన్నమాట. కావున శరీరంలోని హృదయానికి ముఖ్యమైన స్థలం ఉంది.
అలాగే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూర జుమాలో ఇలా తెలియజేశాడు:
ఆయనే నిరక్షరాస్యులైన జనులలో – స్వయంగా వారిలోనుంచే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. అతడు వారికి అల్లాహ్ వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు. వారిని పరిశుద్ధపరుస్తున్నాడు, వారికి గ్రంథాన్నీ, వివేకాన్ని బోధిస్తున్నాడు. అంతకు ముందు వారు స్పష్టమైన మార్గవిహీనతకు లోనైఉండేవారు. (62:2)
ఆయనే అంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నిరక్షరాస్యులైన జనులలో స్వయంగా వారిలోనే, వారిలో నుంచే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. ఆ ప్రవక్త చేసే పని ఏమిటి? అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నిరక్షరాస్యులలోనే ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త పని ఏమిటి? పంపడానికి గల ఉద్దేశ్యం ఏమిటి? ఆయన వారికి అల్లాహ్ వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు. అంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మన కోసము మనలోనే ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త ఖురాన్ వాక్యాలను, అల్లాహ్ వచనాలను, అల్లాహ్ వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు. ఎందుకు? దాని ద్వారా వారిని పరిశుద్ధపరుస్తున్నాడు. వారికి గ్రంథాన్ని, వివేకాన్ని బోధిస్తున్నాడు. అంతకు ముందు వారు స్పష్టమైన మార్గ విహీనతకు లోనై ఉండేవారు.
ఈ వాక్యంలో అనేక విషయాలు ఉన్నాయి. ఒక్క మాట ఏమిటంటే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ ఆయతుల ద్వారా వారిని పరిశుద్ధపరుస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధత అంటే అసలైన పరిశుద్ధత, మానసిక పరిశుద్ధత, ఆత్మ పరిశుద్ధత, మనసు పరిశుద్ధత, హృదయ పరిశుద్ధత అని అర్థం.
అభిమాన సోదరులారా! ఇక ఖురాన్ లోని సూరా ముద్దస్సిర్ లో ఒక ఆయత్ ఉంది. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు:
وَثِيَابَكَ فَطَهِّرْ [వ సియాబక ఫతహ్హిర్] నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. (74:4)
ఈ ఆయత్ లో ‘సియాబ్’ అంటే సాధారణంగా దానికి అర్థం దుస్తులే. ఇమామ్ ఇబ్నె ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి ‘వ సియాబక ఫతహ్హిర్’ ఈ ఆయత్ వివరణలో ఆయన ఇలా అన్నారు:
అంటే ఈ ఆయత్ లో ‘సియాబ్’ అంటే, దుస్తులు అంటే అర్థం, జుమ్హూర్ సలఫ్ లో ముఫస్సిరీన్లు, అలాగే సలఫ్ లోని తర్వాత తరం వారిలో కూడా, అంటే పూర్వం తరం వారిలో, తర్వాత తరం వారిలో జుమ్హూర్ ముఫస్సిరీన్ల అభిప్రాయం ఒక్కటే. అది ఏమిటంటే ఈ ఆయత్ లో ‘అస్-సియాబ్’ దుస్తులు అంటే హృదయం అన్నమాట.
అభిమాన సోదరులారా! ఇప్పుడు నేను మూడు విషయాలు (రెండు ఆయతులు, ఒక్క హదీసు) హృదయానికి, మనసుకి సంబంధించినది తెలియపరిచాను. దీని అర్థం ఏమిటి? అసలైన పరిశుద్ధత, అసలైన పరిశుభ్రత అది శరీరం కంటే ఎక్కువ, దేహం కంటే ఎక్కువ అది ఆత్మ పరిశుద్ధత, హృదయ పరిశుద్ధత అని అర్థం. ఎందుకంటే అది అసలైన విషయం. అది క్షేమంగా ఉంటే పూర్తి దేహం క్షేమంగా ఉంటుంది, అది పాడైపోతే పూర్తి దేహం పాడైపోతుంది.
హృదయ సంబంధిత ఐదు వ్యాధులు
ఇక రెండవ విషయం ఏమిటంటే, అటువంటి ముఖ్యమైన, విలువైన హృదయాన్ని దేని నుంచి కాపాడాలి? ఏ రోగాల నుంచి కాపాడాలి? అంటే హృదయానికి సంబంధించిన రోగాలు అనేక ఉన్నాయి. షిర్క్ ఉంది, బిద్అత్ ఉంది, కపటత్వం ఉంది, ఈ విధంగా చాలా రకాల రోగాలు ఉన్నాయి. కానీ ఈ రోజు మనం కేవలం హృదయానికి సంబంధించిన ఐదు రోగాలు తెలుసుకుందాం. ఇది ఈ రోజు అంశంలోని రెండవ ముఖ్యమైన విషయం.
1. షిర్క్ (బహుదైవారాధన)
మొదటిది షిర్క్. ఇది అన్నింటికంటే ముఖ్యమైన విషయం అన్నమాట. ఎందుకంటే ఇస్లాం ధర్మాన్ని అన్వేషించిన వారు, అనుసరించే వారు, వారికి ఈ విషయం బాగా తెలుస్తుంది. ఇస్లాం ధర్మంలో అన్నింటికంటే గొప్పది ‘తౌహీద్’ (ఏక దైవారాధన) అయితే, అన్నింటికంటే ఘోరమైనది అది ‘షిర్క్’. ఇస్లాం ధర్మంలో షిర్క్ కి మించిన పాపం ఏదీ లేదు. కావున షిర్క్ గురించి వివరం చెప్పడం నా ఉద్దేశ్యం కాదు ఈ రోజు టాపిక్ లో. హృదయానికి సంబంధించిన రోగాలలో మొదటి రోగం షిర్క్. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సెలవిచ్చాడు:
నిస్సందేహంగా షిర్క్ అనేది ఘోరమైన అన్యాయం. ఒక వ్యక్తి తౌబా (పశ్చాత్తాపం) చేసుకోకుండా షిర్క్ లోనే మరణిస్తే అతనికి క్షమాపణ లేదు. కావున అన్నింటికంటే ముందు మనం మన మనసుని షిర్క్ నుండి రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. ఇక షిర్క్ వివరాలు ఉన్నాయి, పెద్ద షిర్క్ అని, చిన్న షిర్క్ అని ఆ వివరాలు ఉన్నాయి. అది ఇప్పుడు అవసరం లేదు. షిర్క్ ఘోరమైన అన్యాయం, ఘోరమైన పాపం గనక అన్నిటికంటే ముందు మనం మన హృదయాన్ని, మనసుని షిర్క్ నుండి కాపాడుకోవాలి. ఇది మొదటి విషయం.
2. కపటత్వం (నిఫాఖ్)
రెండవది, రెండవ రోగం కపటత్వం. ఇది కూడా చాలా ఘోరమైనది. సూర బఖరా మనం చదివితే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూర బఖరా ప్రారంభంలో విశ్వాసుల గురించి ప్రస్తావన వస్తుంది, ఆ తర్వాత అవిశ్వాసుల గురించి ప్రస్తావన వస్తుంది, ఆ తర్వాత కపట విశ్వాసుల గురించి ప్రస్తావన వస్తుంది. ఖురాన్ మరియు హదీసులో కపట విశ్వాసుల శిక్ష గురించి చాలా కఠినంగా చెప్పడం జరిగింది.
కపటత్వం అంటే ఏమిటి? ఏ వ్యక్తిలో కపటత్వం ఉంటే ఆ వ్యక్తికి కపట విశ్వాసి అంటాం. అరబ్బీలో కపటత్వాన్ని ‘నిఫాఖ్‘ అంటారు, కపట విశ్వాసిని ‘మునాఫిఖ్‘ అంటారు. కపటత్వం అంటే క్లుప్తంగా చెప్పాలంటే, ఇస్లాం గురించి, మంచిని గురించి ప్రకటించటం, దాంతో పాటు మనసులో అవిశ్వాసాన్ని లేదా తిరస్కార భావాన్ని, కపటత్వాన్ని మనసులో దాచిపెట్టడం. ఓ పక్కన ఇస్లాం గురించి, మంచి గురించి ప్రకటిస్తారు, ఇంకో పక్కన మనసులో కపటత్వాన్ని దాచి ఉంచుతారు, తిరస్కార భావాన్ని దాచి ఉంచుతారు.
ఇది రెండు రకాలు:
విశ్వాసపరమైన కపటత్వం: మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఆ కపట విశ్వాసులకు నాయకుడు అబ్దుల్లాహ్ బిన్ ఉబై. అంటే విశ్వాసపరమైన కపటత్వం – మనసులో విశ్వాసం లేదు, మనసులో ఈమాన్ లేదు, హృదయంలో అల్లాహ్ ను నమ్మటం లేదు కానీ ప్రకటిస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు. ఇది విశ్వాసపరమైన కపటత్వం. ఈ కపటత్వం కలవాడు ఇస్లాం నుండి పూర్తిగా బహిష్కృతుడైపోతాడు. ఇది పెద్ద కపటత్వం.
క్రియాత్మకమైన కపటత్వం (నిఫాఖె అమలీ): అంటే హృదయంలో విశ్వాసం ఉంటుంది, అతను విశ్వాసి, అతను ముస్లిం. హృదయంలో అల్లాహ్ ను, అల్లాహ్ ప్రవక్తను, ఖురాన్ ని విశ్వసిస్తున్నాడు, నమ్ముతున్నాడు మనసులో. కానీ ఆచరణలో కపటత్వం.
ఒక హదీసు మనము విందాం, అర్థమైపోతుంది. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
أَرْبَعٌ مَنْ كُنَّ فِيهِ كَانَ مُنَافِقًا خَالِسًا [అర్బ ఉన్ మన్ కున్న ఫీహి కాన మునాఫికన్ ఖాలిసన్] నాలుగు లక్షణాలు ఉన్నాయి, ఆ నాలుగు లక్షణాలు ఏ వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి పక్కా కపట విశ్వాసి.
وَمَنْ كَانَتْ فِيهِ خَصْلَةٌ مِنْهُنَّ كَانَتْ فِيهِ خَصْلَةٌ مِنَ النِّفَاقِ حَتَّى يَدَعَهَا [వమన్ కానత్ ఫీహి ఖస్లతుమ్ మిన్హున్న కానత్ ఫీహి ఖస్లతుమ్ మినన్నిఫాఖి హత్తా యదఅహా] ఆ నాలుగు లక్షణాలు కాకుండా, ఆ నాలుగు లక్షణాలలో ఒక వ్యక్తిలో ఒక లక్షణం ఉంటే, కపటత్వానికి సంబంధించిన ఒక లక్షణం అతనిలో ఉందన్నమాట.
ఆ నాలుగు విషయాలు ఏమిటి? మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
ఈ నాలుగు విషయాలు. ఇది క్రియాత్మకమైన కపటత్వం. ఈ నాలుగు విషయాలు ఉంటే ఆ వ్యక్తి పక్కా కపట విశ్వాసి (మునాఫిక్) విశ్వాసపరంగా కాదు, క్రియాత్మకంగా. ఈ నాలుగులో ఒకటి ఉంటే కపటత్వానికి సంబంధించిన ఒక గుణం అతనిలో ఉందని అర్థం.
హృదయానికి సంబంధించిన మొదటి రోగం షిర్క్ అయితే, రెండవది కపటత్వం.
3. రియా (ప్రదర్శనా బుద్ధి)
ఇక మూడవది ‘రియా’, ప్రదర్శనా బుద్ధి. ఇది చాలా డేంజర్. ఎందుకంటే కొన్ని పుణ్యాలు చాలా గొప్పగా ఉంటాయి. హజ్, ఉమ్రా ఉంది, ఎంత గొప్పదైన పుణ్యం అది. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా చాలా గొప్ప పుణ్యం ఉమ్రా మరియు హజ్. అలాగే జకాత్, ఐదు పూటల నమాజులు, దానధర్మాలు లక్షల కొద్ది, కోట్ల కొద్ది దానాలు చేస్తారు. మరి:
إِنَّمَا الْأَعْمَالُ بِالنِّيَّاتِ [ఇన్నమల్ ఆ మాలు బిన్నియ్యాత్] కర్మలు, ఆచరణలు సంకల్పంపై ఆధారపడి ఉన్నాయి.
కనుక మన సంకల్పాన్ని శుద్ధి చేసుకోవాలి. సంకల్ప శుద్ధి అవసరం. ప్రదర్శనా బుద్ధితో మనము ఏ పని చేయకూడదు. అల్లాహ్ ప్రసన్నత కోసమే చేయాలి, ప్రవక్త గారి విధానం పరంగానే ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకే హృదయానికి సంబంధించిన రోగాలలో ముఖ్యమైన మూడవ రోగం, అది ప్రదర్శనా బుద్ధి (రియా).
మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
مَنْ صَامَ يُرَائِي فَقَدْ أَشْرَكَ [మన్ సామ యురాఈ ఫఖద్ అష్రక] ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో ఉపవాసం ఉన్నాడో ఆ వ్యక్తి షిర్క్ చేశాడు.
ఇంకా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
إِنِّي أَخَافُ عَلَيْكُمُ الشِّرْكَ الْأَصْغَرَ [ఇన్నీ అఖాఫు అలైకుముష్ షిర్కల్ అజ్గర్] నేను మీ విషయంలో చిన్న షిర్క్ (షిర్క్ అస్గర్) గురించి భయపడుతున్నాను అన్నారు.
చిన్న షిర్క్ అంటే ఏమిటి? ప్రదర్శనా బుద్ధితో ఆచరించటం. ఏ పుణ్యం చేసినా మంచి సంకల్పంతో కాదు, చిత్తశుద్ధితో కాదు, అల్లాహ్ ప్రసన్నత కోసం కాదు, నలుగురు మెప్పు కోసం, నలుగురు నన్ను పొగుడుతారని, నా గురించి గొప్పలు చెప్పుకుంటారని ప్రదర్శనా బుద్ధితో ఆచరిస్తే, అది ‘రియా‘. దానికి అంటారు షరియత్ పరిభాషలో అది చిన్న షిర్క్ అవుతుంది. ఆ ఆచరణ స్వీకరించబడదు. కావున హృదయ రోగాలలో మూడవది రియా (ప్రదర్శనా బుద్ధి).
4. అనుమానం (జన్)
నాలుగవది అనుమానం. అనుమానం గురించి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اجْتَنِبُوا كَثِيرًا مِّنَ الظَّنِّ إِنَّ بَعْضَ الظَّنِّ إِثْمٌ [యా అయ్యుహల్లజీన ఆమనుజ్ తనిబూ కసీరమ్ మినజ్జన్ని ఇన్న బ అ జజ్జన్ని ఇస్మున్] ఓ విశ్వాసులారా! అతిగా అనుమానించటానికి దూరంగా ఉండండి. కొన్ని అనుమానాలు పాపాల క్రిందికి వస్తాయి. (49:12)
‘జన్’ అంటే అసలు అనుమానం, తలపోయటం అని అర్థం. అయితే శ్రేయోభిలాషుల, భక్తిపరుల, సత్యమూర్తుల గురించి లేనిపోని అనుమానాలకు పోవటం దురనుమానాల క్రిందికి వస్తాయి. కావున షరియత్ లో దీనిని ‘అక్జబుల్ హదీస్’ (అన్నిటికంటే పెద్ద అబద్ధం) గా అభివర్ణించబడింది.
అభిమాన సోదరులారా! సారాంశం ఏమిటంటే మాటిమాటికి అతిగా అనుమానం చేయకూడదు. హృదయంలో ఏముందో అది అల్లాహ్ కు మాత్రమే తెలుసు. ఏదైనా కొంచెం చూసేసి చాలా వివరంగా చెప్పుకోకూడదు. అసలు అనుమానం మంచిది కాదు. إِنَّ بَعْضَ الظَّنِّ إِثْمٌ “ఇన్న బాజజ్జన్ని ఇస్మున్” (కొన్ని అనుమానాలు పాపం క్రిందికి వస్తాయి) అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేశాడు.
5. అసూయ (హసద్)
ఇక ఐదవ విషయం ఏమిటంటే అసూయ. అసూయ ఇది కూడా చాలా చెడ్డదండి. కర్మలు పాడైపోతాయి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు, సూర నిసాలో ఉంది ఇది:
أَمْ يَحْسُدُونَ النَّاسَ عَلَىٰ مَا آتَاهُمُ اللَّهُ مِن فَضْلِهِ [అమ్ యహ్ సుదూనన్నాస అలా మా ఆతాహుముల్లాహు మిన్ ఫజ్లిహి] అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన దానిపై వారు అసూయ పడుతున్నారా? (4:54)
అంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పరీక్ష నిమిత్తం కొందరికి తక్కువ ఇస్తాడు, కొందరికి ఎక్కువ ఇచ్చేస్తాడు ఆర్థిక పరంగా, పదవి పరంగా, కొందరికి ఆరోగ్యం ఇస్తాడు, కొందరికి అనారోగ్యం ఇస్తాడు. ఇదంతా పరీక్ష నిమిత్తం అల్లాహ్ చేస్తాడు, అది అల్లాహ్ హిక్మత్ (వివేకం) లో ఉంది. కాకపోతే దాని మూలంగా ఒకరు ఇంకొకరిపై అసూయ చెందకూడదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
ఏ విధంగా అగ్ని కట్టెల్ని కాల్చేసి బూడిద చేసేస్తుందో, అలాగే అసూయ అనేది మనిషి చేసిన పుణ్యాలకు, సత్కర్మలకు తినేస్తుంది అన్నమాట.
అభిమాన సోదరులారా! ఈ విధంగా హృదయ రోగాలు, హృదయానికి సంబంధించిన అనేక రోగాలు ఉన్నాయి. వాటిలో ఐదు నేను చెప్పాను. ఈ ఐదులో ప్రతి ఒక్కటికీ వివరం అవసరం ఉంది. షిర్క్ ఉంది, కపటత్వం ఉంది, అలాగే రియా ఉంది, అలాగే జన్ (అనుమానించటం) ఉంది, ఐదవది అసూయ. ఇవి కాక ఇంకా ఎన్నో ఉన్నాయి, నేను ముఖ్యమైన ఈ ఐదు చాలా ఘోరమైన పాపాలు గనక హృదయానికి సంబంధించిన రోగాలలో ఈ ఐదు తెలియజేశాను.
హృదయ శుద్ధికి 7 మార్గాలు
ఇక దీనికి చికిత్స ఏమిటి? హృదయం గురించి కొన్ని విషయాలు మొదటిగా నేను చెప్పాను. ఆ తర్వాత హృదయానికి సంబంధించిన రోగాలలో ఐదు రోగాల ప్రస్తావన వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు వాటి చికిత్స ఎలా? హృదయ రోగాల చికిత్స ఏ విధంగా చేసుకోవాలి? ముఖ్యమైన ఏడు పాయింట్లు, సమయం అయిపోయింది గనక నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను.
1. అల్లాహ్ ప్రేమలో పరిపూర్ణత (కమాలు ముహబ్బతిల్లాహ్)
అల్లాహ్ ప్రేమలో పరిపూర్ణత కలిగి ఉండాలి. యాక్టింగ్ మాత్రమే కాదు, అల్లాహ్ ని ప్రేమిస్తున్నామని చెప్పటము మరి పాపాలు చేయటము, అల్లాహ్ కు అవిధేయత చూపటం అలా కాదు. “కమాలు ముహబ్బతిల్లాహ్” – అల్లాహ్ యొక్క ప్రేమలో పరిపూర్ణత కలిగి ఉండాలి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కపట విశ్వాసుల, అలాగే ముష్రికుల, బహుదైవారాధకుల ప్రస్తావన చేసిన తర్వాత విశ్వాసుల గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
విశ్వసించిన వారు, విశ్వాసులు, ముమినిన్లు అల్లాహ్ కు అంతకంటే ప్రగాఢంగా, అధికంగా ప్రేమిస్తారు. అంటే విశ్వాసులు అల్లాహ్ పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉంటారు అన్నమాట. ఇది మొదటి విషయం.
2. చిత్తశుద్ధి (ఇఖ్లాస్)
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ [కుల్ ఇన్న సలాతీ వ నుసుకీ వ మహ్యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్] ఇంకా ఈ విధంగా ప్రకటించు : “నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే.” (6:162)
నా నమాజ్, ‘వ నుసుకీ’ దీనికి రెండు అర్థాలు ఉన్నాయి, ఒక అర్థం నా ఖుర్బానీ, రెండో అర్థం నా సకల ఆరాధనలు. నా నమాజు, నా సకల ఆరాధనలు, అంత మాత్రమే కాదు ‘వ మహ్యాయ’ – నా జీవనం, ‘వ మమాతీ’ – నా చావు, నా మరణం. ఇవన్నీ ‘లిల్లాహి రబ్బిల్ ఆలమీన్’ – సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే, అల్లాహ్ కోసమే. అంటే నేను నమాజ్ చేస్తున్నాను అల్లాహ్ కోసమే చేస్తున్నాను. నా సకల ఆరాధనలు, నమాజ్ మాత్రమే కాదు నా సకల ఆరాధనలు – దానం చేసినా, ఒకరికి సహాయం చేసినా, ఒకరి హక్కు పూర్తి చేసినా, భార్య విషయంలో, పిల్లల విషయంలో, అమ్మ నాన్న విషయంలో, ఇరుగుపొరుగు వారి విషయంలో, స్నేహితుల విషయంలో, మిత్రుల విషయంలో, శత్రువుల విషయంలో, జంతువుల విషయంలో, ప్రతి విషయంలో. చివరికి నా పూర్తి జీవితం, నా మరణం కూడా అల్లాహ్ కోసమే. ఇది చిత్తశుద్ధి కలిగి ఉండాలి.
3. ప్రవక్త అనుసరణ (హుస్నుల్ ముతాబఅ)
‘హుస్నుల్ ముతాబఅ’ అంటే ఆచరణ విశ్వాసపరంగా ఉండాలి. ఏదైతే చెబుతున్నామో అలాగే చేయాలి. ఏదైతే చేస్తామో అదే చెప్పాలి. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం పరంగా ఉండాలి. దీనికి అంటారు ‘హుస్నుల్ ముతాబఅ’. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ”మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (తత్ఫలితంగా) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు.” (3:31)
మీరు అల్లాహ్ కు ప్రేమిస్తున్నారా? అల్లాహ్ పట్ల మీకు ప్రేమ ఉందా? అల్లాహ్ పట్ల మీరు ప్రేమ కలిగి ఉన్నారా? అలాగైతే ‘ఫత్తబివూనీ’ – నన్ను అనుసరించండి (అంటే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను అనుసరించండి, ఇత్తెబా చేయండి). దానికి ప్రతిఫలం ఏమిటి? అల్లాహ్ అంటున్నాడు ‘యుహ్ బిబ్ కుముల్లాహ్’ – అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, ‘వ యగ్ఫిర్ లకుమ్ జునూబకుమ్’ – అల్లాహ్ మీ పాపాలు మన్నిస్తాడు.
అంటే ఈ ఆయత్ లో ఏది చెబుతామో అలాగే మనము ఆచరించాలి. అల్లాహ్ ను ప్రేమిస్తున్నాము చెబుతున్నాము, అల్లాహ్ ను విశ్వసిస్తున్నాము చెబుతున్నాము – ఆచరించాలి. ప్రవక్త గారి పట్ల మనకు ప్రేమ ఉంది చెబుతున్నాము – ఆచరించాలి. అలా చేస్తే అల్లాహ్ మమ్మల్ని ప్రేమిస్తాడు, అల్లాహ్ మన పాపాలు మన్నిస్తాడు.
4. దైవ ధ్యానం/జవాబుదారీ భావన (అల్-మురాఖబా)
‘అల్-మురాఖబా’ అంటే దైవ ధ్యానం, జవాబుదారీ భావన. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَهُوَ مَعَكُمْ أَيْنَ مَا كُنتُمْ [వహువ మ అకుమ్ ఐన మా కున్తుమ్] మీరెక్కడ ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. (57:4)
మీరు ఎక్కడైనా సరే, ఎక్కడున్నా సరే అల్లాహ్ మీకు తోడుగా ఉన్నాడు, అల్లాహ్ మీతోనే ఉన్నాడు, అల్లాహ్ గమనిస్తున్నాడు, అల్లాహ్ నిఘా వేసి ఉన్నాడు. ఈ భావన ఉంటే మనం పాపం చేయము కదా. ఏకాంతంలో ఉన్నాము, ఇంట్లో ఉన్నాము, బయట ఉన్నాము, రాత్రి పూట, పగటి పూట, చీకటి, వెలుగు – ఎక్కడైనా సరే అల్లాహ్ నన్ను కనిపెట్టుకొని ఉన్నాడు, నిఘా వేసి ఉన్నాడు, గమనిస్తున్నాడు, “అల్లాహ్ అలీముమ్ బిజాతిస్ సుదూర్” – హృదయాలలో ఏముంది అది అల్లాహ్ ఎరుగును. ఈ భావన ఉంటే మనిషి పాపాలకు దూరంగా ఉంటాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
إِنَّ اللَّهَ لَا يَخْفَىٰ عَلَيْهِ شَيْءٌ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ [ఇన్నల్లాహ లా యఖ్ ఫా అలైహి షైఉన్ ఫిల్ అర్జి వలా ఫిస్సమాఇ] నిశ్చయంగా – భూమ్యాకాశాలలోని ఏ వస్తువూ అల్లాహ్‌కు గోప్యంగా లేదు. (3:5)
5. దానధర్మాలు (సదఖా)
సదఖా చేస్తే కూడా దాని మూలంగా హృదయాలు శుద్ధి అవుతాయి. అల్లాహ్ సెలవిచ్చాడు:
(ఓ ప్రవక్తా!) నువ్వు వారిని పరిశుద్ధపరచటానికీ, వారిని తీర్చిదిద్దటానికీ వారి సంపదల నుంచి దానాలను తీసుకో. ఓ ప్రవక్త!) వారి సంపదల నుండి ‘సదఖా’ (దానధర్మాలు) వసూలు చేయి. దాని ద్వారా నీవు వారిని పరిశుద్ధులుగా, పవిత్రులుగా తీర్చిదిద్దగలవు. (9:103)
ఓ ప్రవక్త వారి నుండి దానాలను తీసుకో, దాని వల్ల ఏమవుతుంది? వారి హృదయాలు పరిశుద్ధం అవుతాయి. వారిని పరిశుభ్రపరచటానికి, వారిని తీర్చిదిద్దటానికి దానాలు తీసుకో అని అల్లాహ్ అంటున్నాడు. అంటే సదఖా మూలంగా పుణ్యంతో పాటు జీవితాలు, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తీర్చిదిద్దుతాడు, అలాగే హృదయాలు శుభ్రం అవుతాయి.
6. రాత్రి నమాజ్ (ఖియాముల్ లైల్)
ఖియాముల్ లైల్. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
تَتَجَافَىٰ جُنُوبُهُمْ عَنِ الْمَضَاجِعِ [తతజాఫా జునూబుహుమ్ అనిల్ మజాజిఇ] వారి ప్రక్కలు వారి పడకల నుంచి వేరుగా ఉంటాయి. (32:16)
వారు రాత్రి పూట తక్కువగా నిద్రిస్తారు. అంటే తహజ్జుద్ నమాజ్, ఖియాముల్ లైల్ కి అమితమైన, ఎక్కువ పుణ్యం ఉంది.
7. దుఆ (ప్రార్థన)
‘అద్దుఆ హువల్ ఇబాద’, ‘అద్దుఆ ముఖ్ఖుల్ ఇబాద’. అసలైన ఆరాధన అది దుఆ అని ప్రవక్త సెలవిచ్చారు.
అభిమాన సోదరులారా! ఈ ఏడు సూత్రాలు హృదయ పరిశుభ్రత కొరకు: 1. కమాలు ముహబ్బతిల్లాహ్ (అల్లాహ్ పట్ల/ప్రేమలో పరిపూర్ణత కలిగి ఉండాలి), 2. ఇఖ్లాస్ (చిత్తశుద్ధి), 3. హుస్నుల్ ముతాబఅ (ఆచరణ విశ్వాసపరంగా ఉండాలి), 4. మురాఖబా (దైవ ధ్యానం/జవాబుదారీ భావన), 5. సదఖా, 6. ఖియాముల్ లైల్, 7. దుఆ. ఈ ముఖ్యమైన ఏడు సూత్రాలు. వీటి ద్వారా మనం మన హృదయాన్ని రోగాల నుండి రక్షించుకోవాలి, కాపాడుకోవాలి.
అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నాకు చెప్పటం కంటే ఎక్కువ, మిమ్మల్ని వినటం కంటే ఎక్కువ, అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. మనందరినీ హృదయానికి సంబంధించిన రోగాల నుండి రక్షించుగాక, శుభ్రపరచుగాక. ఇహపరలోకాలలో అల్లాహ్ సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో షిర్క్ (బహుదైవారాధన) ఇస్లాంలో అత్యంత ఘోరమైన పాపం మరియు నేరం అనే అంశంపై దృష్టి సారించారు. సాధారణంగా ప్రజలు హత్య లేదా అత్యాచారం వంటి నేరాలను అతిపెద్దవిగా భావిస్తారని, కానీ ఖురాన్ మరియు హదీసుల ప్రకారం, అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించడమే (షిర్క్) అన్నింటికన్నా పెద్ద పాపమని వక్తవివరిస్తారు. షిర్క్ యొక్క తీవ్రమైన పరిణామాలను, అంటే చేసిన మంచి పనులన్నీ వృధా కావడం, స్వర్గం నిషేధించబడటం మరియు నరకంలో శాశ్వత శిక్ష వంటి వాటిని ఖురాన్ ఆయతుల ద్వారా ఉటంకిస్తారు. ఇంకా, షిర్క్ రెండు రకాలుగా ఉంటుందని వివరిస్తారు: షిర్క్-ఎ-అక్బర్ (పెద్ద షిర్క్), ఇది ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది, మరియు షిర్క్-ఎ-అస్గర్ (చిన్న షిర్క్). చిన్న షిర్క్‌లో అల్లాహ్ తప్ప ఇతరుల మీద ప్రమాణం చేయడం, తాయెత్తులు కట్టడం, మరియు రియా (ప్రదర్శన కోసం ఆరాధనలు చేయడం) వంటివి ఉంటాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా తెలియజేస్తారు. ప్రతి ముస్లిం ఈ ఘోరమైన పాపం నుండి దూరంగా ఉండాలని, తన ఆరాధనలను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేయాలని వక్త ప్రబోధిస్తారు.
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.
رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي [రబ్బిష్రహ్ లీ సద్రీ, వ యస్సిర్ లీ అమ్ రీ, వహ్ లుల్ ఉఖ్ దతమ్ మిల్ లిసానీ, యఫ్ ఖహూ ఖౌలీ] (ఓ నా ప్రభూ! నా హృదయాన్ని నా కొరకు విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభతరం చెయ్యి. నా నాలుకలోని ముడిని విప్పు. ప్రజలు నా మాటను సులభంగా అర్థం చేసుకునేటట్లు చెయ్యి.) (20:25-28)
షిర్క్ – ఒక పెద్ద నేరం
గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి నా జుమా ప్రసంగ అంశం, షిర్క్ ఒక పెద్ద నేరం.
అభిమాన సోదరులారా, సాధారణంగా నేరాలన్నింటిలో పెద్ద నేరం ఏమిటి? పాపాలన్నింటిలో పెద్ద పాపం ఏమిటి? అని ప్రశ్నించినప్పుడు, ధర్మజ్ఞానము లేని వారు లేదా అంతంత మాత్రమే ధర్మజ్ఞానం ఉన్నవారు నేరాలన్నింటిలో పెద్ద నేరం అంటే, ప్రజల ప్రాణాలు హరించటం పెద్ద నేరం అని సమాధానం ఇస్తారు. మరి కొంతమంది అయితే అమ్మాయిలపై బలాత్కారాలు చేయటం, అత్యాచారాలు చేయటం పెద్ద నేరం అండి అని కొంతమంది సమాధానం ఇస్తారు. అలాగే మరికొంతమంది ప్రజల సొమ్ము దోచేయటం, లూటీలు చేయటం పెద్ద నేరం అండి అని ఈ విధంగా రకరకాల సమాధానాలు ఇస్తూ ఉంటారు.
నిజం ఏమిటంటే, ఇవన్నీ పెద్ద నేరాలే. కానీ వీటన్నింటికంటే కూడా ఒక పెద్ద నేరం ఉంది. అది బలాత్కారాలు చేయడం కంటే కూడా పెద్ద నేరము, లూటీలు దోపిడీలు చేయటం కంటే కూడా పెద్ద నేరము, ప్రజల ప్రాణాలు హరించటము కంటే కూడా పెద్ద నేరము. ఆ నేరం గురించి మాత్రము ఎక్కువ మందికి తెలియదు, చాలా తక్కువ మంది మాత్రమే ఆ దాని గురించి తెలుసుకొని ఉన్నారు. ఆ అంత పెద్ద నేరం ఏమిటి ఆ పెద్ద నేరం అంటే అభిమాన సోదరులారా, షిర్క్! బహుదైవారాధన. అల్లాహ్‌కు ఇతరులను సాటి కల్పించటం. ఇది పాపాలన్నింటిలో, నేరాలన్నింటిలో పెద్ద నేరము, పెద్ద పాపము.
అరే! అది అంత పెద్ద పాపం అని మీరు ఎలా చెప్పగలరండీ అని మీరు ప్రశ్నిస్తారేమో? ఇది నా మాట కాదు. నేను నా తరఫున ప్రకటిస్తున్న విషయము కాదు. అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షిర్క్ బహుదైవారాధన పెద్ద నేరము అని పాపాలన్నింటిలో నేరాలన్నింటిలో పెద్ద నేరము అని ప్రకటించి ఉన్నారు.
మనం చూసినట్లయితే, సూరా లుఖ్మాన్‌లోని 13వ వాక్యంలో ఈ విధంగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు:
అలాగే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఒక వ్యక్తి ఈ విధంగా ప్రశ్నించాడు. యా రసూలల్లాహ్, అయ్యు జంబి అక్బరు ఇందల్లాహ్? అల్లాహ్ దృష్టిలో పెద్ద నేరము ఏమిటి? అల్లాహ్ దృష్టిలో పెద్ద పాపము ఏమిటి? అని ఆ వ్యక్తి ప్రశ్నించగా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తికి ఈ విధంగా సమాధానం ఇచ్చారు, అన్ తజ్ అల లిల్లాహి నిద్దన్ వహువ ఖలఖక. నీకు పుట్టించిన ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో ఇతరులను సాటి కల్పించడం, సహవర్తులుగా నిలబెట్టడం, ఇది నేరాలన్నింటిలో, పాపాలన్నింటిలో పెద్ద నేరము, పెద్ద పాపము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తికి సమాధానం ఇచ్చారు.
అలాగే మరొక సందర్భంలో శిష్యుల వద్ద ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రశ్నించారు. ఏమన్నారంటే, అలా ఉనబ్బిఉకుం బి అక్బరిల్ కబాయిర్? ఏమండీ నేను మీకు పాపాలలోనే పెద్ద పాపము, ఘోరాలలోనే పెద్ద ఘోరము, నేరాలలోనే పెద్ద నేరము దాని గురించి మీకు తెలుపనా అని తెలియజేశారు. శిష్యులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, బలా యా రసూలల్లాహ్. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తప్పనిసరిగా దాని గురించి మాకు మీరు తెలియజేయండి అనగా, అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదటిగా ప్రస్తావించిన విషయం ఏమిటంటే, అల్ ఇష్రాకు బిల్లాహ్. అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించటం, అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టటం, ఇది పెద్ద పాపాలలోనే పెద్ద పాపము, పెద్ద నేరము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంలో ప్రకటించారు.
అలాగే మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజానికి ఏడు ప్రాణాంతకమైన విషయాల గురించి హెచ్చరించి ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, ఇజ్తనిబుస్ సబ్అల్ మూబిఖత్. ఏడు ప్రాణాంతకమైన విషయాల నుండి మీరు దూరంగా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అన్నారు. ఆ ఏడు విషయాలు ఏమిటంటే అందులోని మొదటి విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అష్షిర్కు బిల్లాహ్. అల్లాహ్‌తో ఇతరులను సహవర్తులుగా నిలబెట్టడం, షిర్క్ చేయటం, ఇది ఏడు ప్రాణాంతకమైన పాపాలలో మొదటి పాపము అన్నారు.
అభిమాన సోదరులారా! అటు అల్లాహ్ వాక్యము ద్వారా, ఇటు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పలుకుల ద్వారా మనకు ఒక విషయం మాత్రము స్పష్టంగా అర్థమైపోయింది, అది ఏమిటంటే షిర్క్ చేయటం, బహుదైవారాధన చేయటం, అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించటం, ఇది ఘోరమైన నేరం, పెద్ద పాపము అని స్పష్టమయ్యింది.
షిర్క్ యొక్క పరిణామాలు
ఇక రండి, ఈ షిర్క్ చేస్తే, ఈ పాపానికి ఎవరైనా ఒడిగడితే అతనికి జరిగే పరిణామం ఏమిటి? అతనికి జరిగే నష్టం ఏమిటి? అది కూడా మనము ఇన్షా అల్లాహ్ ఖురాన్ మరియు హదీసు గ్రంథాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
షిర్క్ చేసే వ్యక్తికి కలిగే ఒక నష్టం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ వ్యక్తికి స్వర్గం నుండి దూరంగా ఉంచేస్తాడు. ఎవరైతే షిర్క్‌కు పాల్పడతారో వారి కోసము స్వర్గం నిషేధించబడుతుంది. వారి నివాసం నరకమైపోతుంది. మనం చూసినట్లయితే ఖురాన్‌లోని సూరా మాయిదా 72వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:
అలాగే అభిమాన సోదరులారా, షిర్క్ చేసే వానికి కలిగే మరొక నష్టం ఏమిటంటే, అతని సత్కార్యాలు అన్నీ, అతని కర్మలన్నీ, అతని పుణ్యాలు అన్నీ తుడిచివేయబడతాయి. ఖురాన్‌లోని సూరా జుమర్ 65వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హెచ్చరిస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నాడు:
وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” (39:65)
అల్లాహు అక్బర్. స్వయంగా ప్రవక్తలలో గొప్ప ప్రవక్త, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాకీదు చేస్తున్నాడు, ఒకవేళ నీవు గనుక షిర్క్‌కు పాల్పడినట్లయితే, నీ కర్మలన్నీ వృధా చేయబడతాయి అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయనకే, అంత గొప్ప వ్యక్తికే అంత గొప్ప మహా ప్రవక్తకే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాకీదు చేస్తున్నాడంటే, మీలాంటి, నాలాంటి, మనలాంటి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏమిటి అభిమాన సోదరులారా ఒక్కసారి ఆలోచించండి.
కాబట్టి ఇదే విషయము ఖురాన్‌లోని సూరా అన్ఆమ్ 88వ వాక్యంలో మనం చూచినట్లయితే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అక్కడ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు:
ذَٰلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُم مَّا كَانُوا يَعْمَلُونَ ఇదీ అల్లాహ్ మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సైతం, దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి. (6:88)
ఇక్కడ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కొంతమంది ప్రవక్తల ప్రస్తావన చేసి చివరికి ఏమంటున్నారంటే, ఇలాంటి ప్రవక్తలు కూడా ఒకవేళ షిర్క్‌కు పాల్పడినట్లయితే, బహుదైవారాధనకు గురైనట్లయితే, అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించినట్లయితే, వారి సత్కార్యాలన్నీ వృధా అయిపోతాయి అంటున్నాడు. కాబట్టి దీని ద్వారా మనకు ఒక విషయం మాత్రము స్పష్టమవుతుంది, అదేమిటంటే అభిమాన సోదరులారా, ఏ వ్యక్తి అయితే షిర్క్ చేస్తాడో, ఏ వ్యక్తి అయితే అల్లాహ్‌తో ఇతరులను సహవర్తులుగా, సాటిగా నిలబెడతాడో, అతని సత్కార్యాలు అన్నీ అతని కర్మలన్నీ వృధా చేయబడతాయి.
అలాగే అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా మనకు తెలియజేసి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆ విషయం మనము జీవితంలో ప్రతివేళ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అదేమిటంటే సూరా నిసాలోని 48వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేసి ఉన్నాడు:
إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. (4:48)
అంటే తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని షిర్క్‌ను అల్లాహ్ సుతరాము క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అంటే షిర్క్ తప్ప ఇతర పాపాలు మనిషి చేసి ఉంటే అల్లాహ్ తలిస్తే వాటిని క్షమించగలడేమో గానీ, షిర్క్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా క్షమించడు అని ఈ వాక్యంలో స్పష్టంగా మనకు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి, అభిమాన సోదరులారా, షిర్క్ పెద్ద నేరము అని, షిర్క్ క్షమించరాని నేరము అని, షిర్క్ వల్ల మనిషి స్వర్గానికి దూరమైపోతాడు, నరకానికి చేరుకుంటాడని, అతని కర్మలన్నీ వృధా చేయబడతాయని ఇంతవరకు విన్న విషయాలలో మనము అర్థం చేసుకున్నాము.
షిర్క్ రకాలు
ఇక రండి, షిర్క్ గురించి మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఉంది అదేమిటంటే, షిర్క్ రెండు రకాలు అభిమాన సోదరులారా. ఒకటి షిర్కె అక్బర్, రెండవది షిర్కె అస్గర్. షిర్కె అక్బర్ అంటే ఇప్పటివరకు మనం విన్నాము కదా, అల్లాహ్ దగ్గర చేయవలసిన కార్యాలు అల్లాహ్ వద్ద కాకుండా ఇతరుల వద్ద చేస్తే, అల్లాహ్‌కు ఇతరులను సాటి కల్పిస్తే అది షిర్కె అక్బర్ అవుతుంది. మరి షిర్కె అస్గర్ అంటే ఏమిటి? అభిమాన సోదరులారా, ఆ విషయము కూడా మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా స్పష్టంగా తెలియజేసి ఉన్నారు.
షిర్కె అస్గర్ రెండు రకాలు. చిన్న షిర్క్ రెండు రకాలు. ఒకటి బహిర్గతంగా కనిపించే షిర్క్, రెండవది కనిపించకుండా రహస్యంగా ఉండే షిర్క్.
బహిర్గతంగా కనిపించే చిన్న షిర్క్ ఏమిటి అంటే అభిమాన సోదరులారా, ఒకటి అల్లాహ్‌ను కాకుండా ఇతరుల మీద ప్రమాణం చేయటం. అల్లాహ్‌ను వదిలేసి ఇతరుల మీద ప్రమాణం చేయటం. మనం చూస్తూ ఉంటాం, ఏదైనా సందర్భంలో ఏదైనా ఒక మాట స్పష్టంగా ప్రజలకు నమ్మ జెప్పాలంటే చాలామంది ఏమంటుంటారంటే, నా తల్లి మీద నేను ప్రమాణం చేస్తున్నాను, నా తల్లి సాక్షిగా, నా బిడ్డల మీద నేను ప్రమాణం చేస్తున్నాను, నా బిడ్డల సాక్షిగా, నేను నడుపుతున్న బండి మీద నేను ప్రమాణం చేస్తున్నాను, ఈ బండి సాక్షిగా అని రకరకాల విషయాల మీద వాళ్లు ప్రమాణం చేస్తూ ఉంటారు. అయితే అభిమాన సోదరులారా, ఇలా చేయటం ధర్మ సమ్మతము కాదు. ఒకవేళ మనిషికి ప్రమాణం చేయటం తప్పనిసరి అయితే అతను కేవలం అల్లాహ్ పేరు మీద మాత్రమే ప్రమాణం చేయాలే గానీ ఇతరుల పేరు మీద ప్రమాణం చేయకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్ పేరు మీద కాకుండా ఇతరుల పేరు మీద ప్రమాణం చేస్తే ఆ వ్యక్తి కూడా షిర్క్ చేసినట్లు అవుతుంది, చిన్న షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పలుకులు వినండి, ఆయన తెలియజేశారు: మన్ హలఫ బిగైరిల్లాహి ఫఖద్ కఫర ఔ అష్రక. ఎవరైతే అల్లాహ్ కాకుండా ఇతరుల మీద ప్రమాణం చేస్తాడో అతను కుఫ్రుకు పాల్పడినట్లు లేదా షిర్క్‌కు పాల్పడినట్లు.
అలాగే అభిమాన సోదరులారా, చిన్న షిర్క్ యొక్క కనిపించే రెండో విషయం ఏమిటంటే, తాయెత్తులు వేలాడదీయటం. చాలామంది చేతుల్లో, మెడలలో, నడుము మీద, కాళ్ళ మీద తాయెత్తులు కట్టుకొని ఉంటారు. అభిమాన సోదరులారా, తాయెత్తులు కట్టటము కూడా ధర్మ సమ్మతము కాదు, నిషేధమైన కార్యము. ఎవరైనా వ్యక్తి తాయెత్తులు కట్టినట్లయితే అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది, అతను కూడా చిన్న షిర్క్ చేసినట్లు అవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అల్లఖ తమీమతన్ ఫఖద్ అష్రక. ఎవరైతే తాయెత్తులు కట్టాడో అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లే.
ఇది చిన్న షిర్క్‌లో బహిర్గతంగా కనిపించే షిర్క్.
ఇక రండి అభిమాన సోదరులారా, చిన్న షిర్క్‌లో కనిపించకుండా రహస్యంగా ఉండే ఒక షిర్క్ ఉంది, అదేమిటంటే రియా అని తెలుగులో అంటారు, ప్రదర్శనా బుద్ధితో చేసే సత్కార్యాలు అని తెలుగులో అంటారు. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను ఎక్కువగా ఈ షిర్కె అస్గర్ గురించి భయపడుతూ ఉన్నాను అన్నారు. శిష్యులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నించారు, ఓ దైవ ప్రవక్త, ఈ చిన్న షిర్క్ అంటే ఏమిటండీ, దీని గురించి మీరు కంగారు పడుతున్నారు అని ప్రశ్నించగా అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆయన పలుకులు వినండి, అఖ్వఫు మా అఖాఫు అలైకుం అష్షిర్కుల్ అస్గర్. ఖాలూ యా రసూలల్లాహ్ వమష్షిర్కుల్ అస్గర్? ఖాల అర్రియా. అంటే మీ విషయంలో నాకు అన్నిటికన్నా అధికంగా షిర్కె అస్గర్ చిన్న షిర్క్ గురించి భయమేస్తుంది. దైవ ప్రవక్త ఆ షిర్కె అస్గర్ అంటే ఏమిటి అని శిష్యులు అడిగినప్పుడు ఆయన అన్నారు, ప్రదర్శనా బుద్ధితో పని చేయటం.
అభిమాన సోదరులారా, ఒక వ్యక్తి నమాజు చేస్తున్నాడు, ఉపవాసాలు పాటిస్తున్నాడు, దానధర్మాలు చేస్తున్నాడు, జకాతు చెల్లిస్తున్నాడు, ఉమ్రా హజ్జులు ఆచరిస్తున్నాడు, అయితే అతను అల్లాహ్ ప్రసన్నత కోసం ఈ విషయాలన్నీ చేయట్లేదు గానీ ప్రజల దృష్టిలో నేను ఉత్తముడ్ని, భక్తుడ్ని అని నాకు పేరు ప్రతిష్టలు రావాలి అనే బుద్ధితో ఆ సంకల్పంతో అతను ఈ విషయాలు చేస్తే దీనినే రియా అంటారు, ప్రదర్శనా బుద్ధితో చేసిన సత్కార్యాలు అంటారు. ఇలా చేస్తే అభిమాన సోదరులారా, షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది. ఎందుకంటే సత్కార్యాలు, ఆరాధనలు కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు మాత్రమే చేయాలి గానీ ప్రదర్శనా బుద్ధితో చేయరాదు. ఎవరైనా ప్రదర్శనా బుద్ధితో చేస్తున్నట్టే అతను అల్లాహ్ ప్రసన్నత కోరుకోవట్లేదు గానీ ప్రజల ప్రసన్నత కోరుకుంటున్నాడు కాబట్టి అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది అభిమాన సోదరులారా.
అయితే మన బాధ్యత ఏమిటి? ఇప్పటివరకు మనం షిర్క్ గొప్ప షిర్క్ పెద్ద నేరమని తెలుసుకున్నాము. షిర్క్ రెండు రకాలు, షిర్క్ పెద్దది ఒకటి, చిన్నది ఒకటి అని తెలుసుకున్నాము. అలాగే పెద్ద షిర్క్‌కి, చిన్న షిర్క్‌కి ఉన్న తేడా ఏమిటో కూడా తెలుసుకోవాలి. అదేమిటంటే అభిమాన సోదరులారా, పెద్ద షిర్క్ చేసిన వారికి నరకశిక్ష విధించబడుతుంది, వారు స్వర్గం నుంచి దూరమైపోతారు, వారి సత్కార్యాలన్నీ వృధా చేయబడతాయి. అయితే చిన్న షిర్క్‌కు పాల్పడిన వారి సత్కార్యాలు మాత్రం వృధా చేయబడవు, వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాత్కాలిక శిక్షలు వేసి మళ్లీ శిక్షలు ముగిసిన తర్వాత స్వర్గానికి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ప్రదర్శనా బుద్ధితో ఏ ఏ సత్కార్యాలు ఆరాధనలు వారు చేసి ఉంటారో కేవలం ఆ సత్కార్యాలు, ఆ ఆరాధనలు మాత్రమే వృధా చేయబడతాయి.
కాబట్టి అభిమాన సోదరులారా, ఒక భక్తునిగా మనందరి బాధ్యత ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము షిర్క్‌కి పాల్పడకూడదు. అందుకోసమే మనం చూచినట్లయితే గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే గతించారో, వారు మరణించే ముందు వారి సంతానాన్ని పిలిచి షిర్క్‌కు పాల్పడవద్దు అని తాకీదు చేసి మరీ మరణించారు.
ఖురాన్‌లో లుక్మాన్ అలైహిస్సలాం వారి గురించి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రస్తావించి ఉన్నాడు. సూరా లుక్మాన్‌లో లుక్మాన్ అలైహిస్సలాం ఆయన కుమారుని పిలిచి ఏమంటున్నారంటే, “ఓ కుమారా, నీవు షిర్క్‌కు పాల్పడవద్దు. ఎందుకంటే షిర్క్ పెద్ద నేరము, ఘోరమైన పాపము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీవు షిర్క్‌కు పాల్పడవద్దు” అని తెలియజేశారు.
అదేవిధంగా ప్రవక్తలు, ఇతర గొప్ప గొప్ప భక్తులు వారి సంతానానికి, అనుచర సమాజానికి తెలియజేసిన విషయం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు అల్లాహ్‌ను వదిలి ఇతరులను ఆరాధించకండి, అల్లాహ్‌కు ఇతరులను సహవర్తులుగా సాటిగా కల్పించకండి, మీకు నిలువునా చీల్చేసేసినా సరే, మీకు సజీవంగా దహనం చేసేసినా సరే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బహుదైవారాధన, షిర్క్ చేయవద్దు, చేయవద్దు, చేయవద్దు అని తెలియజేసి ఉన్నారు.
కాబట్టి అభిమాన సోదరులారా, మనందరి బాధ్యత ఏమిటంటే మనం కేవలం అల్లాహ్‌నే ఆరాధించాలి, అల్లాహ్ మీదే నమ్మకం ఉంచాలి, ఆయన ప్రసన్నత కోసం మాత్రమే సత్కార్యాలు చేయాలి. అల్లాహ్‌తో నేను దుఆ చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ షిర్క్ నుండి కాపాడి, అల్లాహ్ ప్రసన్నత కోసం అల్లాహ్ ఆరాధనలు చేయడానికి మల్లా మనందరికీ భాగ్యము కల్పించు గాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
{ప్రవక్త తనపై తన ప్రభువు నుండి అవతరించినదానిని విశ్వసించాడు. ఈ ప్రవక్తను విశ్వసించినవారు కూడా దానిని హృదయ పూర్వకంగా విశ్వసించారు. వారంతా అల్లాహ్ నూ, ఆయన దూతలనూ, ఆయన గ్రంథాలనూ, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. వారు ఇలా అంటారుః “మేము అల్లాహ్ పంపిన ప్రవక్తలలోని ఏ ఒక్కరినీ భేదభావంతో చూడము. మేము ఆదేశం విన్నాము, శిరసావహించాము. ప్రభువా! క్షమాభిక్ష పెట్టుమని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరకు మేమంతా నీవద్దకే మరలి వస్తాము}. (సూరె బఖర 2:285).
1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్బు ఉల్లేఖించారుః “ఆచరణలు కేవలం మనో సంకల్పంపై ఆధారపడి ఉంటాయి. మనిషి దేని సంకల్పం చేసుకుంటాడో, అతనికి అదే ప్రాప్తమవుతుంది. (ఉదాహరణకుః) ఎవరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు వలసపోతాడో అతని వలస మాత్రమే నిజమయినది. ఎవరు ప్రపంచం కొరకు లేదా ఏదైనా స్త్రీని వివాహమాడటానికి వలసపోతాడో, అతని వలస ప్రపంచం కొరకు లేదా స్త్రీ కొరకు అనే పరిగణించబడుతుంది”. (బుఖారి 1, ముస్లిం 1907). విశ్వాస పాఠాలు
ఈ హదీసులో:
ఈ హదీసు ప్రతి ఆచరణకు పునాది లాంటిది. కర్మల అంగీకారం, తిరస్కారం మరియు అవి మంచివా లేదా చెడ్డవా అన్న విషయం మనోసంకల్పంపై ఆధారం పడి ఉంటుంది. ఎవరు ఏ సంకల్పం చేస్తారో అతనికి అదే ప్రాప్తమవుతుంది. ఒకప్పుడు ఆచరణ బాహ్యంగా (చూడటానికి) చాలా మంచిగా ఉండవచ్చు. కాని సత్సంకల్పం లేని కారణంగా అది చేసిన వానికి ఏ లాభమూ దొరక్కపోవచ్చు. దీనికి సంబంధించిన నిదర్శనాలు ఖుర్ఆనులో మరీ స్పష్టంగా ఉన్నాయిః
{జాగ్రత్తా! ధర్మం ప్రత్యేకంగా అల్లాహ్ కు చెందిన హక్కు మాత్రమే}. (సూరె జుమర్ 39:3). {పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని అల్లాహ్ కే ప్రత్యేకించు- కోవాలి}. (సూరె బయ్యినహ్ 98: 5). {మీరు షిర్క్ చేస్తే మీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి}. (సూరె జుమర్ 39: 65).
ఈ హదీసులో తెలిసిన మరో విషయం ఏమనగాః మనస్సు కార్యమే (సంకల్పశుద్ధియే) అన్నిటికి మూలం. మనిషి తాను చేసే ప్రతీ కార్యం తన ప్రభువు కొరకే ప్రత్యేకించి చేయుటకు, దాన్ని షిర్క్ దరిదాపులకు, ఇతర ఉద్దేశాలకు దూరంగా ఉంచుటకు ప్రయత్నం చేయాలి. ఆ కార్యం ద్వారా అల్లాహ్ సంతృప్తి, ఆయన దర్శనం పొందే ఉద్దేశ్యం మాత్రమే ఉంచాలి.
సర్వకార్యాలు, వాటి ఉద్దేశ్యాల్ని బట్టి ఉంటాయి తప్ప బాహ్య రూపంతో కాదు. ఎవరూ మరొకరి బాహ్య రూపం, బాహ్యాచరణలతో మోసపోకూడదు. అతని సంకల్పంలో కీడు చోటు చేసుకోవచ్చు. అయినా ప్రజల పట్ల సదుద్దేశం కలిగి ఉండటమే అసలైన విషయం.
ఆరాధనలు చేసేవారి పుణ్యాల్లో వ్యత్యాసం వారి మనస్సంకల్పాన్ని బట్టి ఉంటుంది అని కూడా తెలుస్తుంది.
ప్రమాణం, మ్రొక్కుబడి, విడాకులు, అలాగే షరతులు, వాగ్థానం, ఒప్పందాల్లాంటి విషయాల్లో సంకల్పం (నియ్యత్) తప్పనిసరిగా ఉండాలి. మరచిపోయేవాడు, బలవంతం చేయబడినవాడు, అజ్ఞాని, పిచ్చివాడు మరియు చిన్న పిల్లలు చేసే పనులు (ఉద్దేశపూర్వకంగా ఉండవు గనక) వారిపై ఇస్లామీయ ఆదేశాలు విధిగా లేవు. ఎవరు ఏ సంకల్పం చేస్తారో అతనికి అదే ప్రాప్తమవుతుంది. వేరేది కూడా లభించవచ్చునా లేదా? అన్న విషయం సందిగ్ధంలో ఉంది. మనుషుల సంకల్పాలను అల్లాహ్ తప్ప మరెవరూ ఎరుగరు.
ప్రదర్శనాబుద్ధి, పేరుప్రఖ్యాతులు పొందే సంకల్పం ప్రశంసనీయమైనది కాదు అని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. అది అల్లాహ్ యేతరులతో ఏదైనా పొందే ఉద్దేశ్యం క్రింద లెక్కించబడుతుంది. సత్సంకల్పం లేనిదే ఏ కార్యాలూ, సత్కార్యాలుగా పరిగణింపబడవు. ఎవరైతే ప్రాపంచిక లాభానికి ప్రాముఖ్యతనిచ్చి పరలోక లాభాన్ని విస్మరిస్తారో అతను పరలోక లాభాన్ని కోల్పోతాడు. మరెవరైతే పరలోక లాభానికి ప్రాముఖ్యతనిచ్చి, దానితో పాటు ప్రాపంచిక ప్రయోజనం కూడా పొందాలనుకుంటాడో అతనికి ప్రాపంచిక లాభం లభిస్తుంది మరియు పరలోకంలో కూడా సత్ఫలితం ప్రాప్తిస్తుంది. ఎవరైతే తాను చేసే ఆచరణ ద్వారా ప్రజల ప్రసన్నత పొందాలని ఉద్దేశిస్తాడో అతడు షిర్క్ చేసినవాడవుతాడు.
అల్లాహ్ చాలా సూక్ష్మజ్ఞాని అని మరియు అతి రహస్య విషయాలు కూడా ఎరుగువాడని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. ఇంకా దుష్టులను వారి దుష్సంకల్పం వల్ల హీనపరచకుండా వారి విషయం దాచి ఉంచి అల్లాహ్ తన దాసులపై చేసిన మేలు కూడా ఈ హదీసు ద్వారా తెలుస్తుంది.
సాఫల్యానికి సబబు ఆచరణలు ఎక్కువ ఉండటం కాదు. అవి మంచివి అయి ఉండటం. ఇఖ్లాస్ (అల్లాహ్ సంతృప్తి కొరకు, ఆయనకే ప్రత్యేకించి) మరియు ప్రవక్త పద్ధతి ప్రకారం చేయబడినప్పుడే ఏదైనా కార్యం సత్కార్యం అవుతుంది. చిన్న కార్యమైనా సరే ఇఖ్లాస్ తో కూడుకుంటే అదే చాలా గొప్పది. దీనికొక హదీసు కూడా సాక్ష్యముంది. మనిషి ఏదైనా కార్యం మొదలుపెట్టే ముందు తన నియ్యత్ (సంకల్పాన్ని) నిర్థారణ చేసుకోవాలి. ఫర్జ్ అయినా, నఫిల్ అయినా, ఏ కార్యమైనా నియ్యత్ లేనిది అంగీకరింపబడదు. నియ్యత్ కొరకు నోటితో పదాలు ఉచ్చరించుట అనవసరం, దేని విషయంలో స్పష్టమైన నిదర్శనం ఉందో అది తప్ప. (ఉదాః హజ్).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.