عَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُولُ اللهِ – صلى الله عليه وسلم -: «مَا مِنْ سَاعَة تَمُرّ بِابْنِ آدَمَ لَمْ يَذْكُر اللهَ فِيهَا إِلاَّ تَحَسَّرَ عَلَيْهَا يَوْمَ الْقِيَامَة». (حلية الأولياء (5/ 362)، شعب الإيمان (511 (فصل في إدامة ذكر الله عز وجل .. واللفظ له، تعليق الألباني “حسن”، صحيح الجامع (5720). حسن ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
అల్లాహ్ జిక్ర్ చేయకుండా గడిసిన ప్రతి ఘడియపై మనిషి ప్రళయదినాన పశ్చాత్తాపం చెందుతూ బాధపడతాడు
عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ النَّبِيُّ – صلى الله عليه وسلم -: «مَا مِنْ رَاكِبٍ يَخْلُو فِي مَسيْرِهِ بِاللهِ وَذِكْرِهِ إِلاَّ كَانَ رَدْفهُ (5) مَلَكٌ، وَلاَ يَخْلُو بِشِعرٍ وَنَحْوِهِ إِلاَّ كَانَ رَدْفهُ شَيْطَانٌ». ( المعجم الكبير (895)، تعليق الألباني “حسن”، صحيح الجامع (5706).حسن
ఉఖ్బా బిన్ ఆమిర్ (రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు), ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
ఏ ప్రయాణికుడు తన ప్రయాణంలో అల్లాహ్ (ధ్యానంలో) మరియు అల్లాహ్ జిక్ర్ లో నిమగ్నులై ఉంటాడో అతనికి తోడుగా దైవదూత ఉంటాడు. పద్యాలు లాంటి వాటిలో నిమగ్నులై ఉంటే అతనికి తోడుగా షైతాన్ ఉంటాడు.
అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
ఎవరైనా ఏదైనా సమావేశంలో కూర్చొని అల్లాహ్ జిక్ర్ చేయకుంటే అందుకై అతని కొరకు అది పశ్చాతపం, బాధకరంగా మారుతుంది. ఎవరైనా ఏదైనా దారి గుండా నడుస్తూ అల్లాహ్ జిక్ర్ చేయకుంటే అది వారి పశ్చాత్తాపం, బాధలకు కారణం అవుతుంది. ఎవరైనా తన పడకపై వచ్చి అల్లాహ్ జిక్ర్ చేయకుంటే అందుకై అతనికి పశ్చాత్తాపం బాధలకు గురికావలసి వస్తుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[గమనిక: ఈ చాప్టర్ ఇమాం ఇబ్నె బాజ్ (రహిమహుల్లాహ్) గారు వ్రాసిన “హజ్, ఉమ్రహ్ & జియారహ్ –ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో” అనే పుస్తకం నుండి తీసుకోబడింది. ఇది హజ్ చేసే వాళ్ళ కోసం రాయబడిన పుస్తకం. కానీ క్రింది చాప్టర్ లో పేర్కొనబడిన జిక్ర్ మరియు దుఆలు హజ్ చేయని వారు కూడా అరఫా రోజు చేసుకొని లాభం పొందవచ్చు. ఈ జిక్ర్ మరియు దుఆలు అరఫా రోజే కాకుండా మిగతా రోజుల్లో సందర్భాలలో కూడాచేసుకోవచ్చు. అల్లాహ్ మనందరికీ సత్బాఘ్యం ప్రసాదించు గాక, అమీన్]
అరఫహ్ మైదానంలో నిలబడుట మరియు అక్కడి ఇతర ఆరాధనలు:
ఆ తరువాత ప్రజలు అరఫహ్ మైదానంలో నిలబడవలెను. బత్నె ఉర్నా అనే స్థలం తప్ప, మొత్తం అరఫహ్ మైదానంలో ఎక్కడైనా నిలబడవచ్చు. ఒకవేళ వీలయితే ఖిబ్లహ్ మరియు జబలె రహ్మహ్ ల వైపు తిరిగి నిలబడవలెను. అంటే ఖిబ్లహ్ దిశల తమ ముందు జబలె రహ్మహ్ ఉండేటట్లు నిలబడ వలెను. ఒకవేళ రెండింటికి అభిముఖంగా నిలబడ లేకపోతే, కేవలం ఖిబ్లహ్ వైపు మాత్రమే తిరిగి నిలబడవలెను. అలా నిలబడినపుడు, హజ్ యాత్రికుడు అల్లాహ్ ను ధ్యానించడంలో, అల్లాహ్ ను వేడుకోవడంలో, ప్రార్థించడంలో మనస్పూర్తిగా నిమగ్నమై పోవలెను.
దుఆ చేసేటపుడు, రెండు చేతులు పైకెత్తి దుఆ చేయవలెను. లబ్బైక్ అనే తల్బియహ్ పలుకులు మరియు ఖుర్ఆన్ పఠనం కొనసాగించవలెను.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలను అనుసరించి ఈ క్రింది దుఆ చేయడం ఉత్తమం:
లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్దహు, లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, యుహ్ఈ వ యుమీతు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్.
ఆరాధింపబడే అర్హత కలిగిన ఆరాధ్యుడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. అల్లాహ్ యే మహోన్నతుడు. ఆరాధింపబడే అర్హత కలిగిన వాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. ఆయన ఏకైకుడు. ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. విశ్వమంతా ఆయనకే చెందింది మరియు సకల ప్రశంసలు ఆయనకే చెందుతాయి. చావు బ్రతుకులు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ప్రతి దానిపై ఆయనకు ఆధిపత్యం ఉన్నది.
ఈ క్రింది నాలుగు ధ్యానాలను అల్లాహ్ ఎక్కువగా ఇష్టపడతాడని కొన్ని ప్రామాణిక ఉల్లేఖనలు తెలుపుతున్నాయి –
سُبْحَانَ الله సుబ్-హానల్లాహ్ అన్ని రకాల లోపాలకు అతీతుడు, పరమ పవిత్రుడు
وَ الْـحَـمْدُ لله వల్ హమ్దులిల్లాహ్ సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు అల్లాహ్ కే
وَ لاَ إِلَـهَ إِلاَّ الله వలా ఇలాహ ఇల్లల్లాహ్ ఆరాధింపబడే అర్హతలు గల ఆరాధ్యుడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప.
وَ اللهُ أَكْبـَرْ వల్లాహు అక్బర్ అల్లాహ్ అందరి కంటే (అన్నింటి కంటే) మహోన్నతుడు.
ఈ పలుకులను మనస్సు లోపలి పొరలలో నుండి దృఢంగా విశ్వసిస్తూ, తరచుగా పలుకుతూ ఉండవలెను. అలాగే షరిఅహ్ ఆమోదించిన ఇతర పలుకులు కూడా పలుకవలెను. ప్రత్యేకంగా వీటిని అరఫహ్ మైదానంలో ఈ అత్యుత్తమమైన దినం నాడు మనస్పూర్తిగా తరచుగా పలుకుతూ వలెను. ప్రత్యేకంగా హజ్ యాత్రికులు అల్లాహ్ యొక్క ఘనతను ప్రశంసించే కొన్ని సమగ్రమైన, విశేషమైన దుఆలను ఎంచుకొని, ఈ దినం నాడు వాటిని హృదయ పూర్వకంగా వేడుకోవలెను. వాటిలో కొన్ని క్రింద ఇవ్వబడినాయి:
سُبْحَانَ اللهِ وِبِحَمْدِهِ، سُبْحَانَ اللهِ الْعَظِيمَ సుబహానల్లాహి వ బిహమ్దిహి – సుబహానల్లాహిల్ అజీమ్. ఆయన అన్ని లోపాలకూ అతీతుడు, పరమ పవిత్రుడు మరియు సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు ఆయనకే చెందును – ఆయన అన్ని లోపాలకూ అతీతుడు, పరమ పవిత్రుడు, అత్యంత ఘనమైన వాడు.
لاَ إِلَهَ إِلاَ أَنْتَ سُبْحَانَكَ إِنِّي كُنْتُ مِنَ الظَّالِـمِـيْنَ లా ఇలాహ ఇల్లా అంత, సుబహానక, ఇన్నీ కుంతు మినజ్జాలిమీన్ ఆరాధింపబడే అర్హతలు గల ఆరాధ్యుడెవ్వడూ లేడు – నీవు తప్ప. అన్ని లోపాలకూ అతీతుడివీ, పరమ పవిత్రుడివి. నిశ్చయంగా నేను హద్దుమీరిన వారిలోని వాడినే (కేవలం నీ దయ కారణంగానే నేను హద్దుమీరక నీ దాసుడిగా మారగలిగాను).
లా ఇలాహ ఇల్లల్లాహ్, వ లా నఆబుదు ఇల్లా ఇయ్యాహు, లహున్నఅమతు, వ లహుల్ ఫద్లు, వ లహుథ్థానాఉల్ హుస్ను, లా ఇలాహ ఇల్లల్లాహు, ముఖ్లిసీన లహుద్దీన, వలవ్ కరిహల్ కాఫిరూన్
ఆరాధింపబడే అర్హత గలవాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. మేమందరమూ కేవలం నిన్నే ఆరాధిస్తాము. అన్ని రకాల శుభాలు మరియు అనుగ్రహాలు ఆయనవే. అత్యంత ఘనమైన ప్రశంసలు కేవలం ఆయన కొరకే. ఆరాధింపబడే అర్హత గలవాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. మా యొక్క చిత్తశుద్ధితో కూడిన విశ్వాసం ఆయన కొరకే – సత్యతిరస్కారులకిది అయిష్టమైనా సరే.
لاَ حَوْلَ وَلاَ قُوَّةَ إِلاَّ بِالله లా హౌల వ లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ ఆయన వద్ద నున్న శక్తీ, సామర్థ్యం తప్ప మరింకేదీ లేదు.
అల్లాహుమ్మ అస్లిహ్ లి దీనీ – అల్లదీ హువ ఇస్మతు అమ్రీ, వ అస్లిహ్ లీ దున్యాయ – అల్లతీ ఫీహా మఆషీ, వ అస్లిహ్ లీ ఆఖిరతీ – అల్లతీ ఫీహా మఆదీ, వజ్అలిల్ హయాత జియాదతన్ లీ ఫీ కుల్లి ఖైరిన్, వల్ మౌత రాహతన్ లీ మిన్ కుల్లి షర్రిన్.
ఓ అల్లాహ్! నా ఆచరణలను (చెడు నుండి) కాపాడే విధంగా నా ధర్మాన్ని సరిదిద్దు. నా జీవనోపాధి ఉన్న నా ఈ ప్రపంచాన్ని సరిదిద్దు. నేను మరల వలసి ఉన్న నా పరలోకాన్ని సరిదిద్దు. నా కొరకు ప్రతి ఒక్క శుభంలోనూ నా ఈ జీవితాన్ని పొడిగించు. మరియు ప్రతి దుష్టత్వం నుండి నా మరణాన్ని కాపాడు.
అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మినల్ హమ్మ వల్ హజని, వ మినల్ అజ్ జి వల్ కసలి, వ మినల్ జుబ్ని వల్ బుఖ్లి, వ మినల్ మఅథమి వల్ మగ్రమి, వ మిన్ గలబతిద్దీని వ ఖహ్రిర్రిజాలి.
ఓ అల్లాహ్! బాధలకు, కష్టాలకు, కలతలకు, విచారానికి, దు:ఖానికి, పీడనలకు, నిస్సహాయానికి, బద్దకానికి, సోమరితనానికి, పిరికితనానికి, పాపాలకు మరియు అప్పులకు, అప్పుల భారముకు మరియు ఇతరులు నాపై ఆధిక్యం చలాయింటానికి వ్యతిరేకంగా నేను నీ శరణు వేడుకుంటున్నాను.
అల్లాహుమ్మస్తుర్ ఔరాతీ, వ ఆమిన్ రౌఆతీ, వహ్ఫజ్నీ మిన్ బైని యదయ్య వ మిన్ ఖల్ఫీ, వఅన్ యమీనీ వఅన్ షిమాలీ, వమిన్ ఫౌఖీ, వఅఊదు బి అజమతిక అన్ ఉగ్తాల మిన్ తహ్తీ
ఓ అల్లాహ్! నా తప్పులను దాచివేయి మరియు భయం నుండి నన్ను కాపాడు, నా కుడివైపు నుండి మరియు నా ఎడమ వైపు నుండి మరియు నా పై వైపు నుండి, నా ముందు నుండి మరియు నా వెనుక నుండి నన్ను రక్షించు. నా క్రింద నుండి నేను హత్య చేయబడతానేమో అనే భయంతో నేను నీ ఘనత ఆధారంగా నీ శరణు వేడుకుంటున్నాను.
అల్లాహుమ్మగ్ఫర్లీ మా ఖద్దమ్తు, వ మా అఖ్ఖర్తు, వ మా అస్రర్తు, వ మా ఆలంతు, వ మా అంత ఆలము బిహీ మిన్నీ, అంతల్ ముఖద్దిము వ అంతల్ ముఅఖ్ఖిరు వ అంత అలా కుల్లి షైఇన్ ఖదీర్.
ఓ అల్లాహ్! నా ద్వారా పూర్వం జరిగిపోయిన వాటినీ మరియు జరుగబోయే వాటినీ క్షమించు, మరియు రహస్యంగానూ, బహిరంగంగానూ నా ద్వారా జరిగిపోయిన వాటినీ క్షమించు – అవి నా కంటే ఎక్కువగా నీకే తెలుసు. కేవలం నీవు మాత్రమే ఎవరినైనా ముందుకు పంపగలవు లేదా వెనక్కి తీసుకురాగలవు. కేవలం నీవు మాత్రమే అన్నింటిపై ఆధిపత్యం కలిగి ఉన్నావు.
అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక థ్థబాత ఫిల్ అమ్రి, వల్ అజీమత అలర్రుష్ది, వ అస్అలుక షుక్ర నేమతిక వ హుస్న ఇబాదతిక, వ అస్అలుక ఖల్బన్ సలీమా, వ లిసానన్ సాదిఖా, వ అస్అలుక మిన్ ఖైరి మా తాలము, వ అఊదుబిక మిన్ షర్రి మా తాలము, వ అస్తగ్ఫిరుక లిమా తాలము, ఇన్నక అల్లాముల్ గుయూబ్.
ఓ అల్లాహ్! నేను నీ నుండి అన్ని విషయాలలో స్థిరత్వాన్ని మరియు సన్మార్గాన్ని అనుసరించటంలో నిలకడను వేడుకుంటున్నాను. నీ అనుగ్రహాలకు బదులుగా నీకు కృతజ్ఞతలు తెలిపుకునే శక్తినీ మరియు నిన్ను సరిగ్గా ఆరాధించే శక్తినీ ప్రసాదించు. సన్మార్గం పై నడిపించే హృదయాన్ని మరియు సత్యాన్ని పలికే నాలుకను నేను నీ నుండి వేడుకుంటున్నాను. నీకు తెలిసిన మంచిని నేను నీ నుండి కోరుకుంటున్నాను. నీకు తెలిసిన ప్రతి చెడు నుండి నేను నీ వద్ద శరణు కోరుకుంటున్నాను. నీకు తెలిసిన పాపాల నుండి నేను నీ మన్నింపును కోరుకుంటున్నాను. నిశ్చయంగా అన్ని గుప్త విషయాలు నీకే తెలుసు.
అల్లాహుమ్మ రబ్బన్నబియ్యి ముహమ్మదిన్ అలైహిస్సలాతు వస్సలామ్ – ఇగ్ఫర్లీ దంబీ వ అద్హిబ్ గైజ ఖల్బీ, వ అయిద్నీ మిమ్ ముదిల్లాతల్ ఫిత్ని మా అబ్ ఖైతనీ.
ఓ అల్లాహ్! ముహమ్మద్ యొక్క ప్రభువా! నా తప్పులను మన్నింపుము. క్రోధం నుండి నా హదయాన్ని శుభ్రం చేయుము. నేను సజీవంగా ఉండాలని నీవు తలిచినంత కాలం వరకు, నన్ను దారి తప్పించే ఫిత్నాల (దుష్టత్వం) నుండి కాపాడుము.
అల్లాహుమ్మ రబ్బస్సమావాతి వ రబ్బల్ అర్ది వ రబ్బల్ అర్షిల్ అజీమ్, రబ్బునా వ రబ్బు కుల్లి షైఇన్, ఫాలిఖుల్ హబ్బి వన్నవా, ముంజిలుత్తౌరాతి వల్ ఇంజీలి వల్ ఖుర్ఆన్, అఊదు బిక మింషర్రి కుల్లి షైఇన్ అంత ఆఖిదుంబి నాశియతిహి, అంతల్ అవ్వలు ఫలైస ఖబ్లక షైఉన్, వ అంతల్ ఆఖిరు ఫలైస బఆదక షైఉన్, వ అంతజ్జాహిరు ఫలైస ఫౌఖక షైఉన్, వ అంతల్ బాతిను ఫలైస దూనక షైఉన్, ఇఖ్ది అన్నీ అద్దీన వ అగ్నినీ మినల్ ఫఖ్రి.
ఓ అల్లాహ్! భూమ్యాకాశాల ప్రభువా మరియు మహోన్నతమైన అర్ష్ సింహాసనం యొక్క ప్రభువా! ఓ మా అందరి యొక్క మరియు అన్నింటి యొక్క ప్రభువా! మొలకెత్తుట కొరకు విత్తనాల్ని మరియు గింజలన్ని చీల్చేవాడా మరియు మొక్కలు మొలకెత్తించేవాడా! నీవే తౌరాతును, గోస్పెలును మరియు ఖుర్ఆన్ ను అవతరింపజేసావు. నీ చేతిలో తన నుదురు చిక్కించుకుని ఉన్న ప్రతిదాని దుష్టత్వం నుండి నేను నీ శరణు కోరుతున్నాను. నీవే ప్రథముడివి – నీకు పూర్వం ఉనికిలో ఏదీ లేదు. నీవే కడపటి వాడివి – నీ తర్వాత ఉనికిలో ఏదీ ఉండదు. నీవే మహోన్నతుడివి – నీ పై ఏదీ లేదు. రహస్యాలన్నీ తెలిసిన వాడివి నీవే. గుప్తంగా దాచబడిన వాటిని నీ కంటే బాగా ఎరిగినవారు ఎవ్వరూ లేరు. నా తరుఫున నా ఋణాలు తీర్చు మరియు లేమీ, పేదరికం, దారిద్ర్యం, శూన్యత్వం మొదలైనవి నా దరిదాపులకు కూడా చేరనంత పటిష్టంగా, అభేద్యంగా నన్ను చేయి.
అల్లాహుమ్మ ఆతీ నఫ్సీ తఖ్వాహా వ జక్కిహా, అంత ఖైరు మిన్ జక్కాహా, అంత వలియ్యుహా వ మౌలాహా
ఓ అల్లాహ్! నాకు తఖ్వా (ధర్మనిష్ఠ) ను ప్రసాదించు మరియు నా ఆత్మను పవిత్రం చేయి. ఉత్తమంగా పవిత్రత చేకూర్చేవాడివి నీవే. ఉత్తముడివి నీవే, నా రక్షకుడివి నీవే మరియు నా పాలకుడివి నీవే.
అల్లాహుమ్మ లక అస్లమ్ తు, వ బిక ఆమన్ తు, వ అలైక తవక్కల్ తు, వ ఇలైక అనబ్ తు, వ బిక ఖాసమ్ తు, అఊదు బి ఇజ్జతిక అన్ తుదిల్లనీ, లా ఇలాహ ఇల్లా అంత, అంతల్ హయ్యుల్లదీ లా యమూతు వల్ జిన్ను, వల్ ఇన్సు యమూతూన్.
ఓ అల్లాహ్! నేను నీకు విధేయుడైనాను మరియు నిన్నే విశ్వసించాను, నిన్నే నమ్ముకున్నాను, నీవైపుకే మరలాను, నీ కొరకు పోరాడాను. మార్గభ్రష్టత్వం నుండి నన్ను కాపాడమని నీ ఘనత ద్వారా నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను. ఆరాధింపబడే అర్హత గలవారెవ్వరూ లేరు – ఒక్క నీవు తప్ప. నీవే శాశ్వతమైనవాడివి. నీకు చావు లేదు – కానీ, జిన్నాతులు మరియు మానవులకు చావు ఉంది.
అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ ఇల్మిన్ లా యంఫవు, వ మిన్ ఖల్బిన్ లా యఖ్షవు, వ మిన్ నఫ్సిన్ లా తష్బవు, వ మిన్ దావతిన్ లా యుస్తజాబు లహా
ఓ అల్లాహ్! ప్రయోజనం కలిగించని జ్ఞానం నుండి, భయపడని హృదయం నుండి, ఎన్నడూ తనివి తీరని / తృప్తి పొందని ఆత్మ నుండి మరియు స్వీకరించబడని ప్రార్థనల నుండి నేను నీ వద్ద శరణు వేడుకుంటున్నాను.
అల్లాహుమ్మఅక్ఫీనీ బి హలాలిక అన్ హరామిక, వ అగ్ నినీ బి ఫద్ లిక అమ్మన్ సివాక
ఓ అల్లాహ్! నా ఆవసరాలకు చాలినంతగా నాకు ధర్మసమ్మతమైన జీవనోపాధినే ప్రసాదించు గానీ, అధర్మమైంది కాదు. ఇతరుల నుండి అడుక్కునే గత్యంతరం రానీయకుండా, నీ ఆనుగ్రహాల ద్వారా నన్ను సంతృప్తి పరుచు,
అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ జన్నత, వ మా ఖర్రబ ఇలైహా మిన్ ఖౌలిన్ ఔవ్ అమలిన్, వ అఊదుబిక మినన్నారి వ మా ఖర్రబ ఇలైహా మిన్ ఖౌలిన్ ఔవ్ అమలిన్, వ అస్అలుక అన్ తజ్అల కుల్ల ఖదాయిన్ ఖదైతహు లీ ఖైరా
ఓ అల్లాహ్! నేను నీ నుండి స్వర్గాన్ని మరియు స్వర్గం సమీపానికి చేర్చే పలుకు మరియు పని కోరుకుంటున్నాను. నేను నరకాగ్ని నుండి మరియు నరకం సమీపానికి చేర్చే పలుకు మరియు పని నుండి నీ శరణు వేడుకుంటున్నాను. మరియు నీవు నా కోసం వ్రాసిపెట్టిన ప్రతిదానినీ శుభంగా మార్చమని నేను నిన్ను వేడుకుంటున్నాను.
లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హమ్ దు, యుహ్యీ వ యుమీతు, బి యదిహిల్ ఖైరు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్
అల్లాహ్ తప్ప ఆరాధింపబడే అర్హతలు గల వారెవ్వరూ లేరు. ఆయన ఏకైకుడు. ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. సకల లోకాలు మరియు సమస్త ప్రశంసలు ఆయనకే చెందుతాయి. చావుబ్రతుకులు ఆయన ఆదేశంతోనే సంభవిస్తాయి. శుభమంతా ఆయన చేతుల్లోనే ఉంది. మరియు ప్రతి దానినీ శాసించే శక్తిసామర్ధ్యాలు గలవాడు ఆయనే.
సుబహానల్లాహి, వల్ హమ్ దులిల్లాహి, వ లా ఇలాహ ఇల్లల్లాహ్, వల్లాహు అక్బర్, వ లా హౌల వ లా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్ అలియ్యిల్ అజీమ్
అల్లాహ్ యే పరమ పవిత్రుడు, సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు అల్లాహ్ కే, అల్లాహ్ తప్ప ఆరాధింపబడే అర్హతలు గలవారెవ్వరూ లేరు, అల్లాహ్ యే మహోన్నతుడు. అల్లాహ్ తప్ప – అంతటి శక్తిసామర్ధ్యాలు గలవారెవ్వరూ లేరు. ఆయనే మహోన్నతుడు, ఘనత గల వాడూను.
అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్.అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్.
ఓ అల్లాహ్! ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) పై మరియు ఆయన కుటుంబంపై నీవు కారుణ్యం కురిపించినట్లుగా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై మరియు ఆయన కుటుంబం పై కారుణ్యం కురిపించు. నిశ్చయంగా కేవలం నీవు మాత్రమే స్తుతింపదగిన వాడవు మరియు గొప్ప ఘనత గల వాడవూను. ఓ అల్లాహ్! ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) పై మరియు ఆయన కుటుంబం పై శుభాలు కురిపించినట్లుగా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై మరియు ఆయన కుటుంబం పై శుభాలు కురిపించు. నిశ్చయంగా కేవలం నీవు మాత్రమే స్తుతింపదగిన వాడవు మరియు గొప్ప ఘనత గలవాడవూను.
రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతవ్ వ ఫిల్ ఆఖిరతి హసనవ్ వ ఖినా అదాబన్నార్
ఓ నా ప్రభూ! ఈ లోకంలో మాకు శుభాన్ని ప్రసాదించు మరియు పరలోకంలో మాకు శుభాన్ని ప్రసాదించు మరియు మమ్ముల్ని నరకాగ్ని నుండి కాపాడు.
పై వాటితో పాటు హజ్ యాత్రికులు ఈ పవిత్ర స్థలంలో పూర్తిగా అల్లాహ్ యొక్క స్మరణలతో నిండిన ఇతర దుఆలు కూడా చేస్తూ, వీలయినంత ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపాలి. ఈ దుఆలు చేసేటప్పుడు హృదయ పూర్వకంగా ఏడుస్తూ, ఇహపరలోకాలలో శుభాలు ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకోవాలి. దుఆ చేసేటపుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరచుగా దానిని మూడు సార్లు రిపీట్ చేసేవారు. కాబట్టి మనం కూడా ఆయన సంప్రదాయాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి. అరఫహ్ మైదానంలో ముస్లింలు వినయం, నమ్రత, నిగర్వం, అణుకువలను ప్రదర్శిస్తూ, ఆయన దయాదాక్షిణ్యాలను మరియు మన్నింపును ఆశిస్తూ పూర్తిగా అల్లాహ్ వైపు మరలాలి, ఆయన సహాయాన్ని అర్థించాలి, ఆయనకు పూర్తిగా సమర్పించుకోవాలి, ఆయన వైపుకు వంగాలి. ఆయన యొక్క శిక్షలకు మరియు ఆగ్రహానికి వారు భయపడాలి. వారు తాము చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకుని, చిత్తశుద్ధితో తౌబా చేసుకుంటూ, వాటిని క్షమించమని పెద్ద ఎత్తున ప్రజలు ఒకే చోట చేరిన ఆ మహోన్నతమైన పర్వదినాన అల్లాహ్ ను వేడుకోవాలి. ప్రత్యేకంగా ఈ రోజున అల్లాహ్ తన దాసులపై ఎక్కువ అనుగ్రహం చూపుతాడు మరియు సగర్వంగా తన దైవదూతల ముందు వారి గురించి కొనియాడతాడు. అల్లాహ్ ప్రత్యేకంగా ఈ రోజున అనేక మందిని నరకంలో నుండి తప్పిస్తాడు. అరఫహ్ రోజున షైతాను ఎన్నడూ లేనంతగా చిన్నబుచ్చుకున్నట్లు మరియు ఘోరమైన పరాభవానికి గురైనట్లు కనబడతాడు – బదర్ యుద్ధం రోజును గాకుండా. తన దాసులపై అల్లాహ్ చూపే అపరిమితమైన అనుగ్రహాలను, అనేక మంది ప్రజలు విడుదల చేయబడటాన్ని మరియు క్షమింపబడటాన్ని షైతాను ఈరోజున చూస్తాడు. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన హదీథు ఆయెషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన ఆధారంగా సహీహ్ బుఖారీలో ఇలా నమోదు చేయబడింది:
అల్లాహ్ అంత ఎక్కువగా తన దాసులను నరకాగ్ని నుండి విడుదల చేయడు – అరఫాత్ రోజున తప్ప. ఆయన మానవుడికి సమీపంగా వస్తాడు మరియు తన దైవదూతలతో వారి గురించి సగర్వంగా కొనియాడతాడు. ఆయనిలా అంటాడు: “ఈ నా దాసులు ఏమి కావాలని వేడుకుంటున్నారు?”
కాబట్టి ముస్లింలు మంచి నడవడికను ప్రదర్శిస్తూ, తమ బద్ధశత్రువైన షైతానును అవమానం పాలు చేయవలెను. ఎంత ఎక్కువగా వారు మనస్ఫూర్తిగా అల్లాహ్ స్మరిస్తూ, వేడుకుంటూ, తాము చేసిన పాపాలన్నింటికీ పశ్చాత్తాప పడుతూ మరియు అల్లాహ్ యొక్క మన్నింపును అర్థిస్తూ ఉంటే, షైతాను అంత ఎక్కువగా నిరాశా, నిస్పృహలకు గురవుతూ, బాధ పడతాడు. సూర్యాస్తమయం వరకు యాత్రికుడు అల్లాహ్ యొక్క స్మరణలో మరియు దుఆలలో మనస్పూర్తిగా ఏడుస్తూ గడప వలెను.
సూర్యాస్తమయం తర్వాత, ప్రజలు ప్రశాంతంగా ముజ్దలిఫహ్ వైపుకు మరలాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయాన్ని అనుసరిస్తూ, వారు తరుచుగా తల్బియహ్పలుకుతూ ఉండాలి మరియు ముజ్దలిఫహ్ ప్రాంతంలో వ్యాపించాలి. సూర్యాస్తమయం కంటే ముందే అరఫాత్ మైదానం వదిలిపెట్టడం అనుమతించబడలేదు.
సూర్యాస్తమయం పూర్తయ్యే వరకు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అరఫహ్ మైదానంలో గడిపారు. అంతిమ హజ్ లో ఆయన ఇలా బోధించారు:
خُـذُوْا عَنِّي مَـنَاسِكَـكُمْ
ఖుదూ అన్నీ మనాసికకుమ్
“నా నుండి మీరు మీ హజ్ ఆచరణలు నేర్చుకోండి”
ఈ వ్యాసం క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
హజ్, ఉమ్రహ్ & జియారహ్ –ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో అరబీ పుస్తక రచయిత : షేఖ్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్). తెలుగు అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్, పునర్విమర్శ : షేక్ నజీర్ అహ్మద్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
أَسْتَغْفِرُ الله أَسْتَغْفِرُ الله أَسْتَغْفِرُ الله. اَللهُمَّ أَنْتَ السَّلامُ ومِنْكَ السَّلامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ وَ الإكْرَام.
అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను, అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను, అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను. ఓ అల్లాహ్ నీవు ఏలాంటి లోపాలు లేనివాడవు. నీవే రక్షణ నొసంగువాడవు. ఓ ఘనుడవు, పరమదాతయువు నీవు శుభములు గలవాడవు.
లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅతైత వలా ముఅతియ లిమా మనఅత వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్ కల్ జద్ద్. (బుఖారీ 844, ముస్లం 593).
అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు. ఆయనకు భాగస్వామి ఎవడూ లేడు. ఆయనకే అధికారము చెల్లును. ఆయనకే సర్వ స్తోత్రములు గలవు. ఆయనే సర్వశక్తుడు. ఓ అల్లాహ్ నీవు నొసంగిన వరాలను ఎవడు అడ్డగింపజాలడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వజాలడు. ధనికుడు తన ధనముతో నీ శిక్షల నుండి తప్పించుకు- పోజాలడు.
అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు. ఆయనకు భాగస్వామి ఎవడూ లేడు. ఆయనకే అధికారము చెల్లును. ఆయనకే సర్వ స్తోత్రములు గలవు. ఆయనే సర్వశక్తుడు. పాపాములను వదులుకొనుట మరియు పుణ్యాలు చేయుట అల్లాహ్ దయవలననే కలుగును. అల్లాహ్ దప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన్నే మేము ఆరాధించుచున్నాము. ఆయనే సర్వ అనుగ్రహాలు దయ చేయువాడు. ఆయనకే ఘనత, మంచి స్తోత్రములు గలవు. అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. చిత్తశుద్ధితో మేము ఆయన్నే ఆరాధించుచున్నాము. ఈ విషయము సత్య తిరస్కారులకు నచ్చకున్నా సరే. (ముస్లిం 591, 593, 594, బుఖారి 844).
తరువాత సుబ్ హానల్లాహ్ 33, అల్ హందులిల్లాహ్ 33, అల్లాహు అక్బర్ 33 సార్లు చదివి, లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ తో 100 పూర్తి చేయాలి. (ముస్లిం 597).
జమాతుతో ఒకటి లేదా ఎక్కువ రకాతులు తప్పిపోయిన వ్యక్తిని మస్బాఖ్ అంటారు.
ఇమాం రెండవ సలాం త్రిప్పిన తర్వాత ఈ వ్యక్తి సలాం త్రిప్పకుండా తప్పిపోయిన రకాతులు వెరవేర్చాలి.
అతను ఇమాంతో ఏ రకాతులో కలిసాడో అదే అతనిది మొదటి రకాతు.
ఇమాంను రుకూ స్థితిలో పొందినవాని ఆ రకాతు అయినట్లే. ఇమాంను రుకూలో పొందకుంటే ఆ రకాత్ తప్పిపోయినట్లే లెక్క.
జమాతు నిలబడిన తర్వాత వచ్చేవారు జమాతును ఏ స్థితిలో చూసినా అదే స్థితిలో కలవాలి. వారు రుకూ, లేదా సజ్దా ఇంకే స్థితిలో ఉన్నా సరే. వారు మరో రకాతు కొరకు నిలబడే వరకు నిరీక్షించవద్దు.
నిలబడి తక్బీరె తహ్రీమ అల్లాహు అక్బర్ అనాలి. రోగి లాంటి ఏదైనా ఆటంకం ఉన్నవారు కూర్చుండి అల్లాహు అక్బర్ అంటే ఏమీ తప్పు లేదు.
నమాజును భంగపరుచు కార్యాలు:
1- తెలిసి, కావాలని మాట్లడడం, అది కొంచమైనా సరే.
2- పూర్తి శరీరముతో ఖిబ్లా దిశ నుండి పక్కకు మరలడం.
3- వుజూను భంగపరిచే కారణాల్లో ఏ ఒకటైనా సంభవించడం.
4- అనవసరంగా ఎడతెగకుండా ఎక్కువ చలనము చేయడం.
5- కొంచం నవ్వినా నమాజు వ్యర్థమవుతుంది.
6- తెలిసి కూడా ఎక్కువ రుకూ, సజ్దాలు, ఖియాం, జుల్సాలు చేయడం.
7- తెలిసి కూడా (రుకూ, సజ్దా వగైరా) ఇమాంకు ముందు చేయడం.
నమాజులు చేయరాని వేళలు:
కొన్ని సమయాల్లో నమాజు చేయుట యోగ్యం లేదు. అవి:
1- ఫజ్ర్ నమాజు తర్వాత నుండి సూర్యోదయం తర్వాత సూర్యుడు బారెడంత పైకి వచ్చే వరకు.
2- మిట్ట మధ్యానం, సూర్యుడు నడి ఆకాశంలో, తలకు సమానంగా ఉన్నప్పుడు. అది పశ్చిమాన వాలే వరకు.
3- అస్ర్ నమాజు తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు.
కాని ఈ సందర్భాల్లో కొన్ని నమాజులు చేయవచ్చు. ఉదాః తహియ్యతుల్ మస్జిద్ (మస్జిదులో ప్రవేశించిన వెంటనే చేయు నమాజ్). జనాజా నమాజ్. సూర్య గ్రహణ నమాజ్. తవాఫ్ సున్నతులు. తహియ్యతుల్ వుజూ లాంటివి.
అలాగే తప్పిపోయిన నమాజులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసు ఆధారంగా:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
షేఖ్ ముహమ్మద్ ఇబ్న్ అల్-ఉతైమీన్- రహిమహుల్లాహ్ – చెప్పారు :
‘ప్రజలు షరియా నుండి రెగ్యులర్ దుఆ మరియు జిక్ర్ లను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించినప్పుడు, అప్పుడు జిన్నాతులు వారిలో చాలాపెరిగాయి, మరియు అవి వారిని ఎగతాళి చేసి వారితో ఆడుకున్నాయి’
[లికా అల్-బాబ్ అల్-మఫ్ తూహ్ 197]
من أقوال ابن العثيمين رحمه الله
ولمَّا غفل النَّاس عن الأوراد الشَّرعية كثرت فيهم الجنُّ الآن، وتلاعبت بهم .
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.