“పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతని దగ్గర ఒక మాంత్రికుడు ఉండేవాడు. ఆ మాంత్రికుడు బాగా ముసలివాడై పోయిన తరువాత (ఒకనాడు) రాజుతో “నేనిక ముసలివాణ్ణయిపోయాను. నాకు ఒక బాలుణ్ణి అప్పగిస్తే నేనతనికి మాంత్రిక విద్యలన్నీ నేర్పిస్తాను” అన్నాడు. దానికి రాజు సరేనని ఒక బాలుణ్ణి అతని వద్దకు పంపాడు. మాంత్రికుడు ఆ బాలునికి మాంత్రికవిద్యను నేర్పేవాడు. అయితే ఆ బాలుడు మాంత్రికుని వద్దకు వెళ్ళే దారిలో ఒక మతగురువు నివాసం ఉండేది. ఆ బాలుడు మాంత్రికుని వద్దకు వెళ్ళినప్పుడల్లా (దారిలో కొంత సేపు) మత గురువు దగ్గర కూడా కూర్చొనేవాడు. ఆ విధంగా అతను ఆ గురువు మాటలకు ప్రభావితుడయ్యాడు. దాంతో అతను మాంత్రికుని వద్దకు వెళ్ళినప్పుడల్లా దారిలో మత గురువు దగ్గర కూడా కూర్చోవడం ప్రారంభించాడు. (రావడంలో ఆలస్యమవుతున్నందుకు) మాంత్రికుడు బాలుణ్ణి కొట్టేవాడు. అతను ఈ విషయం మతగురువుకి తెలియజేశాడు. అది విని ఆయన, “మాంత్రికుడు నిన్ను కొడతాడని భయం వేస్తే ఇంట్లో (పనుంటే) ఆగమన్నారని చెప్పు. అలాగే ఆలన్యమెందుకయిందని ఇంట్లో నిలదీస్తే మాంత్రికుడు ఆగమన్నాడని చెప్పు” అని అన్నాడు.
అలాగే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆ బాలుడు తను వెళ్ళే దారిలో ఒక పెద్ద మృగాన్ని చూశాడు. అది మనుషుల రాక పోకలకు అడ్డంకిగా నిల్చుంది. అప్పుడా బాలుడు ఈ రోజు మాంత్రికుడు గొప్పవాడో లేక మతగురువు గొప్పవాడో తేలిపోవాలని మనసులో అనుకున్నాడు, అతను చేతిలో ఒక రాయి తీసుకొని “ఓ అల్లాహ్! మతగురువు చేస్తున్న పని నీ దృష్టిలో మాంత్రికుని పని కన్నా ప్రీతికరమైనదైతే. (ఈ రాయితో) మృగాన్ని చంపెయ్యి. మనుషులు తమ దారిన తాము వెళ్ళిపోతారు” అని వేడుకొని రాయిని మృగంపైకి విసిరేశాడు. ఆ దెబ్బకు మృగం చచ్చిపోయింది. దాంతో ప్రజలు (నిర్భయంగా) ఆ దారిగుండా రాకపోకలు సాగించారు. ఆ తరువాత అతను మతగురువు దగ్గరికి వెళ్ళి జరిగినదంతా వివరించాడు. అది విని మతగురువు “నాయనా! ఈ రోజు నీవు నాకంటే గొప్పవాడివి అయ్యావు. (దైవభక్తి, విద్యాపరంగా) నువ్వు ఏ స్థాయికి చేరుకున్నావో నాకర్థమయ్యింది. త్వరలోనే నీకు పరీక్షలు ఎదురౌతాయి. (అయితే ఒక విషయం మాత్రం గుర్తుం చుకో) ఆ పరీక్షా సమయం ఆసన్నమయినప్పుడు నా గురించి ఎవరికీ చెప్పకు సుమా!” అని హితవు పలికాడు.
ఈ బాలుడు పుట్టు గుడ్డివారిని కుష్టు రోగులను కూడా (దైవ సహాయంతో) నయం చేసేవాడు. అన్ని రకాల రోగాలకూ చికిత్సలు చేసేవాడు. రాజ దర్చారులోని ఒకతనికి కంటిచూపు పోయింది. అతను ఈ బాలుణ్ణి గురించి విని ఎన్నో కానుకలు వెంటబెట్టుకొని వచ్చి ఆ బాలునితో “నువ్వు గనక నాకు నయం చేస్తే నేను తీసుకువచ్చిన ఈ కానుకలన్నీ నీకే” అన్నాడు. దానికి ఆ అబ్బాయి “నేనెవరికీ నయం చేయలేను. నయం చేసేది కేవలం అల్లాహ్ మాత్రమే. నువ్వు కూడా అల్లాహ్‌ను విశ్వసిస్తే, నేను నీ కోసం దుఆ చేస్తాను (నీ వ్యాధి నయమయిపోతుంది)” అని చెప్పాడు. ఆ బాలుని మాటలు విని ఆ వ్యక్తి అల్లాహ్‌ను విశ్వసించాడు. అల్లాహ్ అతనికి నయం చేశాడు.
ఆ తరువాత అతను రాజు దగ్గరికి వెళ్ళి మునుపటిలాగే అతని ముందు కూర్చున్నాడు. రాజు అతన్ని చూసి “నీకు తిరిగి దృష్టి ఎలా వచ్చింది?” అనడిగాడు. దానికతను “నా ప్రభువు నాకు తిరిగి దృష్టిని ప్రసాదించాడు” అని సమాధాన మిచ్చాడు. అందుకు రాజు “ఏమిటి? నేనుగాక నీకు వేరే ప్రభువు ఉన్నాడా?” అని ప్రశ్నించాడు. “నాకూ నీకూ ప్రభువు అల్లాహ్ (మాత్రమే)” అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. దాంతో రాజు (కోపోద్రిక్తుడై) అతన్ని బంధించి శిక్షించసాగాడు. ఆఖరికి అతను ఆ బాలుని గురించి రాజుకి చెప్పేశాడు.
బాలుణ్ణి రాజు దర్చారుకి తీసుకురావడం జరిగింది. “నువ్వు పుట్టుకతో అంధులైనవారిని, కుష్టు రోగుల్ని కూడా నయం చేస్తున్నావట. ఇంకా పెద్ద పెద్ద పనులు చేస్తున్నావట. ఇంద్రజాలంలో అంతటి నైపుణ్యం వచ్చిందా నీకు!” అని రాజు ఆ బాలుణ్ణి ప్రశ్నించాడు. దానికా బాలుడు “నేను ఎవరికీ నయం చేయలేను. నయం చేసే వాడు అల్లాహ్ మాత్రమే” అని సమా ధానమిచ్చాడు. బాలుని సమాధానం విని రాజు అతన్ని కూడా బంధించి యాతన పెట్టసాగాడు. చివరికి ఆ బాలుడు మతగురువు గురించి చెప్పేశాడు.
మతగురువుని కూడా (రాజు దర్బారులో) నిలబెట్టడం జరిగింది. తన ధర్మం నుండి మరలిపొమ్మని ఆయనకు చెప్పబడింది. కాని ఆయన అందుకు నిరాకరించాడు. రాజు ఒక రంపాన్ని తెప్పించాడు. దాన్ని గురువు నడినెత్తిన ఉంచి ఆయన శిరస్సును కోయటం జరిగింది. దాంతో ఆయన తలకాయ రెండు ముక్కలై పోయింది.
ఆ తరువాత రాజ దర్బారు లోని వ్యక్తిని తీసుకువచ్చారు. అతన్ని కూడా తన ధర్మం నుండి మరలి పొమ్మని ఆదేశించడం జరిగింది. ఆ వ్యక్తి కూడా నిరాకరించాడు. అతని తల పాపటిలో రంపం పెట్టి కోయడంతో అతని తల కూడా రెండు ముక్కలైంది.
ఆ తరువాత బాలుణ్ణి పట్టుకొని తీసుకు వచ్చారు. తన ధర్మం నుండి తిరిగిపోవాలని అతన్ని కూడా ఆదేశించడం జరిగింది. కాని అ బాలుడు కూడా ససేమిరా అన్నాడు. రాజు ఆ పసివాణ్ణి తన ప్రధాన భటులకు అప్పగించి “ఇతన్ని ఫలానా పర్వత శిఖరం పైకి తీసుకెళ్ళండి. ఇతను తన ధర్మం విడిచిపెడితే సరి; లేకపోతే అక్కణ్ణుంచి క్రిందికి తోసెయ్యండి” అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆ పిల్లవాడి తీసుకొని కొండపైకెక్కారు. అక్కడ ఆ బాలుడు, “దేవా! ఎలాగైనాసరే (నీయిష్ట ప్రకారం) వీళ్లకు వ్యతిరేకంగా నీవు నాకు అండగా ఉండు” అని వేడుకున్నాడు. దాంతో ఆ కొండ కంపించసాగింది. ఆ ప్రకంపనకు వాళ్ళందరూ క్రిందపడి పోయారు. ఆ పిల్లవాడు తిరిగి రాజు దగ్గరికి వచ్చాడు. రాజు అతణ్ణి చూసి (ఆశ్చర్యపోతూ) “నీ వెంటవెళ్ళిన వారు ఏమైపోయారు? (వాళ్లు నిన్ను క్రిందికి తోసెయ్యలేదా?)” అని అడిగాడు. దానికి ఆ బాలుడు “వారికి ప్రతిగా అల్లాహ్ నాకు తోడ్పడ్డాడని” సమాధాన మిచ్చాడు.
రాజు కోపం చల్లారలేదు. ఆ పిల్లవాడిని ఇంకొంతమందికి అప్పజెప్పి “ఇతన్ని పడవ ఎక్కించుకొని సముద్రంలోకి తీసుకెళ్ళండి. వీడు తన ధర్మం నుండి మరలి పోతే సరి; లేకపోతే నడి సముద్రంలోకి విసరివేయండి” అని ఆజ్ఞాపించాడు. (రాజు ఆజ్ఞానుసారం) భటులు ఆ పిల్ల వాడిని తీసుకెళ్ళారు. అతను పడవలో కూర్చొని “దేవా! ఎలాగైనాసరే వీళ్లకు వ్యతిరేకంగా నీవు నాకు రక్షణ కల్పించు” అని వేడుకున్నాడు. దాంతో పడవ తలక్రిందులయింది. తోడు వచ్చిన వారంతా మునిగిపోయారు.
తిరిగి ఆ పిల్లవాడు రాజు దగ్గరికి చేరు కున్నాడు. రాజు అతన్ని చూసి “వాళ్ళు ఏమైపోయారు?” అని అడిగాడు. దానికి ఆ పిల్లవాడు “వారికి ప్రతిగా అల్లాహ్ నాకు సహాయపడ్డాడు” అని జవాబిచ్చాడు. ఇంకా ఆ బాలుడు ఇలా అన్నాడు: “నేను చెప్పే పద్ధతి అనుసరించనంతవరకు నువ్వు నన్ను చంపలేవు.” ఆ పద్ధతి ఏమిటని రాజు అడిగాడు. అప్పుడు పిల్లవాడు చెప్పాడు : “ప్రజలందరినీ ఒక ఖాళీ ప్రదేశంలో హాజరుపరచు. నన్ను ఉరికంబం ఎక్కించి నా అంబులపొది నుండి ఒక బాణం తీసుకో. అ తరువాత బాణాన్ని వింటి తంతువుపై వుంచి ఈ మాటలు (ఈ పిల్లవాని ప్రభువైన అల్లాహ్ నామముతో అని) చెప్పి బాణాన్ని నాపైకి ప్రయోగించు. అలా చేస్తే నువ్వు నన్ను చంపడంలో సఫలీకృతుడవుతావు.”
రాజు (పిల్లవాడు చెప్పినట్లే) ప్రజలందరినీ ఒక పెద్ద స్థలంలో సమీకరించాడు. ఉరితీయడం కోసం పిల్లవాడిని ఊరి కొయ్యల మీదకు ఎక్కించాడు. అతని అంబులపొది నుండి ఒక బాణం తీసి, దాన్ని వింటి తంతువుపై ఉంచి “బిస్మిల్లాహి రబ్బిల్ గులామి (ఈ పిల్ల వాని ప్రభువైన అల్లాహ్ నామముతో)” అంటూ బాణాన్ని వదలిపెట్టాడు. బాణం వచ్చి అ పిల్లవాని కణతకు తగిలింది. ఆ పిల్లవాడు కణతను పట్టుకొని నేలకొరి గాడు.
జరిగినది చూసిన ప్రజలంతా “మేము ఈ బాలుని ప్రభువును విశ్వసించాము” అని నినదించసాగారు. కొంతమంది రాజువద్దకు వెళ్ళి “ప్రభూ! ఇన్నాళ్ళు తమరు జరగకూడదని భీతిల్లినదే జరిగిపోయింది. మీరు భయపడిన విపత్తు వచ్చిపడింది. ప్రజలంతా అల్లాహ్‌ను విశ్వసిస్తున్నారు” అని రాజుకు వార్తనందజేశారు. అది విని రాజు వెంటనే తోవల ప్రక్కల్లో కందకాలు త్రవ్వమని ఆదేశించాడు. రాజు ఆదేశానుసారం కందకాలు త్రవ్వబడ్డాయి. వాటిలో మంటలు రగిలించారు. తాము విశ్వసించిన ధర్మాన్ని వదలని ప్రజలను అందులోకి విసరి వేయమని లేదా ఆ మంటల్లోకి దూకెయ్యమని వారితో చెప్పండని రాజు (తన భటులను) ఆజ్ఞాపించాడు. వారు (రాజాజ్ఞను శిరసావహించి) అలాగే చేశారు. (ఈ దారుణమారణ హోమం జరుగుతుండగా) ఒక స్త్రీ తన చేతుల్లో ఓ పసివాడిని మోసుకొని అక్కడికి వచ్చింది. అయితే మంటల్లో దూకటానికి తటపటాయిస్తుండగా ఆమె చేతు ల్లోని పసికందు “అమ్మా! సహనం వహించు. నిస్సందేహంగా నువ్వు సత్యంపై ఉన్నావు” అంటూ మంటల్లో దూకేయమని తల్లిని పురికొల్పాడు. (ముస్లిం)
ముఖ్యాంశాలు:
1.పై హదీసు ద్వారా కలిగే అతి ముఖ్యమైన గుణపాఠం ఏమిటంటే ధర్మావలంబనలో ఎదురయ్యే కష్టాలు, కడగండ్లను సహన స్థయిర్యాలతో ఎదుర్కోవాలి. అవసరమైతే ధర్మం కోసం ప్రాణాలర్చించడానికి కూడా వెనుకాడరాదు.
2. అల్లాహ్ ప్రియదాసుల (వలీల) మహిమలు వాస్తవమే. అల్లాహ్ తన వివేచనతో తన యిష్టప్రకారం వాటి అవసరాన్ని గుర్తిస్తే తన దాసుల ద్వారా వాటిని ఉనికిలోకి తెస్తాడు.
3. ఈ హదీసు ద్వారా ఖుర్‌ఆన్ యొక్క సత్యబోధనా ప్రశస్తి ఇనుమడిస్తోంది. రేయింబవళ్ళ తెరల మరుగునపడి కాలం చేత విస్మరించబడిన అతి ముఖ్యమైన చారిత్రక ఘట్టాలను కళ్లకు కట్టినట్టు వివరించే దైవగ్రంథ హితబోధనామృతానికి ఇది అద్దం పడుతోంది.
4. హదీసు లేకుండా ఖురాన్‌ను వ్యాఖ్యానించడం, విశదీకరించడం సాధ్యం కాదు. హదీసులో కందకం వాళ్ళ గాధ వివరించబడనట్లయితే దివ్య ఖురాన్‌లో చెప్పబడిన ‘అస్‌హాబుల్ ఉఖ్‌దూద్‘ (కందకాలవాళ్ళ) వృత్తాంత వాస్తవికత ఏమిటో మనకు అర్ధం అయ్యేది కాదు. ఖురాన్ సూక్తుల్లోని ఈ సూక్ష్మతను, సమగ్రతను హదీసు విశదపరచింది.
5. ఇటువంటి గాధలు సత్య సందేశ ప్రధాతలకు స్ఫూర్తినీ, స్థయిర్యాన్నీ అందజేస్తాయి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
(ఆ సందర్భాన్ని కూడా కాస్త జ్ఞాపకం చేసుకోండి!) ఎప్పుడైతే ఇబ్రాహీమ్ ఇలా వేడుకున్నాడో: “నా ప్రభూ! ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయి. నన్నూ, నా సంతానాన్నీ విగ్రహాల పూజ నుంచి కాపాడు.”(ఇబ్రాహీం 14:35).
“అతి ఎక్కువగా నేను మీ పట్ల భయం చెందేది “షిర్కె అస్గర్” (చిన్న షిర్క్) కు మీరు పాల్పడుతారని”, అప్పుడు సహచరులు “అదేమిటి”? అని అడిగితే “ప్రదర్శనాబుద్ధి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం బదులిచ్చారు. (ముస్నద్ అహ్మద్ 23630).
“అల్లాహ్ తో మరెవ్వరినీ సాటి కల్పించని స్థితిలో చనిపోయిన వ్యక్తి స్వర్గంలో చేరుకుంటాడు. అల్లాహ్ తో సాటి కల్పించి చనిపోయిన వ్యక్తి నరకంలో చేరుకుంటాడు”. (ముస్లిం 93).
3. అది “షిర్కె అస్గర్” (చిన్న షిర్క్) లో వస్తుంది. (పై హదీసు ఆధారంగానే)
4. సత్కార్యాలు చేసేవారిలో అది చోటు చేసుకుంటుందన్న భయం ఎక్కువ ఉంటుంది.
5. స్వర్గనరకాలు సమీపములోనే ఉన్నాయని తెలిసింది. (ముస్లిం 93)
6. ఒకే హదీసులో రెండిటిని కలిపి చెప్పడం జరిగింది.
7. షిర్క్ చేయకుండా చనిపోయి అల్లాహ్ తో కలసినవాడు స్వర్గంలో చేరుతాడు. షిర్క్ చేసి చనిపోయి అల్లాహ్ తో కలసినవాడు నరకంలో పోతాడు. అతడు అందరికన్నా ఎక్కువ ప్రార్థనలు చేసినవాడైనప్పటికినీ.
8. ముఖ్య విషయం: ఇబ్రాహీం (అలైహిస్సలాం) తమను, తమ సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడమని అల్లాహ్ తో దుఆ చేశారు.
9. “ప్రభూ! ఈ విగ్రహాలు చాలా మందిని మార్గం తప్పించాయి” (14: 36). అంటూ (దుర్మార్గంలో పడుతున్న) అధికసంఖ్యాకులతో గుణపాఠం నేర్చుకొని “ఓ ప్రభూ! నా సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడుము” అని అర్ధించారు.
10. ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) తెలిపిన ప్రకారం ఇందులో “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావం ఉంది.
11. షిర్క్ నుండి దూరమున్నవారి ఘనత తెలిసింది.
తాత్పర్యం
షిర్క్ తౌహీద్ కు విరుద్ధం. దాని రెండు రకాలు: ఒకటి షిర్కె అక్బర్ (పెద్ద షిర్క్ = జలీ). రెండవది: షిర్కె అస్గర్ (చిన్న షిర్క్ = ఖఫీ)
షిర్కె అక్బర్ అంటే: అల్లాహ్ తో ‘మొరపెట్టుకున్నట్లు, భయం చెందినట్లు, ప్రేమంచినట్లు ఇతరులతో మొరపెట్టుకొనుట, భయం చెందుట, ప్రేమించుట. సారాంశమేమనగా: అల్లాహ్ కు చేయవలసిన ప్రార్ధనలు, ఆరాధనలు ఇతరులకు చేయుట షిర్కె అక్బర్. దీనికి పాల్పడినవానిలో ఏ మాత్రం తౌహీద్ లేనట్లే. అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించింది ఇలాంటి ముష్రికుల పైనే. అతని నివాసం నరకం. ఇక ఏవైనా ఇలాంటి పనులు చేస్తూ దానిని “వసీల”, “పుణ్యపురుషుల ప్రేమ”, అన్న పేర్లతో నిజాన్ని వక్రీకరిస్తే అది కూడా షిర్క్ అవుతుంది.
షిర్కె అస్గర్ అంటే: షిర్కె అక్బర్ వరకు చేర్పించే సాధనాలు, కార్యాలు. ఉదాహరణకు: “గులువ్వ్ ” (అతిశయోక్తి. అంటే: పుణ్యపురుషుల విషయంలో హద్దులు మీరుట), అల్లాహ్ యేతరుల ప్రమాణం, చూపుగోలుతనం, ప్రదర్శనాబుద్ధి మొదలగునవి).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[40 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఉమర్ (రజియల్లాహు అన్హు) గారి ఇస్లాం స్వీకరణ వల్ల కూడా ముస్లిములకు గట్టి బలం, పటిష్టము లభించింది. హంజా (రజియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరణకు మూడు రోజుల తర్వాత ఇతను ఇస్లాం స్వీకరించారు. అది ఎలా అనగా: ఉమర్ (రజియల్దాహు అన్హు) ఓ రోజు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని హతమార్చే ఉద్దేశ్యంతో వెళ్ళాడు. దారిలో ఒక వ్యక్తి కలసి ‘ఎటు వెళ్ళుచున్నావు ఉమర్!’ అని అడిగాడు. దానికి అతడు ‘ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వస్లలం)ను హతమార్చుటకు వెళ్ళుచున్నాను’ అని సమాధానమిచ్చాడు. దానిపై అతడన్నాడు: ‘నీవు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమారుస్తే బనూ హాషిం మరియు బనూ జుహా నిన్ను క్షేమంగా వదులుతారా?’ ఉమర్ అన్నాడు: ‘నీవు నీ తాతముత్తాతల మతాన్ని వదలి కొత్త మతాన్ని స్వీకరించినట్లున్నావు’? అతడన్నాడు: ‘దీనికంటే మరీ విచిత్రమైన విషయం చెప్పాలా ఉమర్! నీ చెల్లి మరియు బావ ఇద్దరూ ఇస్లాం స్వీకరించారు. తాతముత్తాతల మతాన్ని వదిలేశారు’.
ఉమర్ అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళి చెల్లిలి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఖబ్బాబ్ బిన్ అరత్త్ (రజియల్లాహు అన్హు) వారింట్లో ఉన్నాడు. ఖుర్‌ఆన్ లోని సూర తాహా వ్రాసిఉన్న పత్రం అతని వద్ద ఉంది. అతను వారికి ఆ సురా నేర్పుతున్నాడు. ఉమర్ వస్తున్నది గమనించిన ఖబ్బాబ్ (రజియల్లాహు అన్హు) ఇంట్లో ఓ మూలకు దాగిపోయాడు. ఉమర్ చెల్లి ఫాతిమా ఆ పత్రాన్ని దాచిపెట్టింది. ఉమర్ ఇంటికి సమీపంలో చేరినప్పుడే ఖబ్బాబ్ (రజియల్లాహు అన్హు) ఖుర్‌ఆన్ పారాయణాన్ని విన్నాడు. లోనికి ప్రవేశించిన వెంటనే ‘నేను మీ ఇంట్లో విన్నదేమిటి? అని అడిగాడు. ‘ఏమి లేదు, అట్లే మాట్లాడుకుంటూ ఉంటిమి’ అని వారిద్దరు అన్నారు. ఉమర్ అన్నాడు: బహుశా మీరిద్దరు పాత మతాన్ని విడనాడి కొత్త ధర్మం స్వీకరించారు కదూ? బావ చెప్పాడు: ‘ఉమర్! ఒకవేళ సత్వం అన్నది నీ మతంలో కాకుండా వేరే ధర్మంలో ఉంటే ఏమిటి మీ ఆలోచనా?’ దానిపై ఉమర్ అతడ్ని చాలా చితకబాదాడు. అంతలోనే చెల్లి వచ్చి ఉమర్ ను భర్త మీది నుండి పక్కకు జరపబోయింది. ఉమర్ ఆమెను సయితం కొట్టి రక్తసిక్తం చేసేశాడు. ఆమె ముఖం ద్వారా రక్తం కారడం మొదలయింది. అదే కోపంలో ఆమె ఇలా అంది: “అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్“. అంటే సత్య ఆరాధ్యుడు అల్లాహ్ తప్ప ఎవడు కాడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని సాక్ష్యమిచ్చుచున్నాను.
ఉమర్ రక్తసిక్తమైన చెల్లిని చూసి చాలా సిగ్గు పడ్డాడు. ‘మీ వద్ద ఉన్న పుస్తకం ఏది? ఇవ్వండి’ అని అడిగాడు. చెల్లి చెప్పింది: నీవు అపరిశుద్దునివి, దీని పరిశుద్ధులు ముట్టుకుంటారు’ లేచి స్నానం చేసుకో’. ఉమర్ లేచి, స్నానం చేసి, పుస్తకం తీసుకొని బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం చదివి ‘చాలా మంచి పేర్లున్నాయి’ అని చెప్పాడు. మళ్ళి సూర తాహా మొదటి నుండి 14వ ఆయతు (నిశ్చయంగా, నేనే అల్లాహ్‌ను! నేను తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమాజును స్థాపించు) వరకు చదివి, ఈ మాట ఎంత బావుంది మరెంత గౌరవప్రదంగా ఉంది, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎక్కుడున్నాడో దారి చూపండి’ అని అన్నాడు.
ఉమర్ యొక్క ఈ మాటను విన్న ఖబ్బాబ్ (రజియల్లాహు అన్హు) లోపలి నుండి బైటికి వచ్చి “సంతోషించు ఉమర్! “అల్లాహ్! ఉమర్ బిన్ ఖత్తాబ్ లేదా అబూ జహల్ బిన్ హిషామ్ ద్వారా ఇస్లాంను బలపరుచు” అని ప్రవక్త చేసిన దుఆ అంగీకరించబడిందని ఆశిస్తున్నాను’ అని అన్నాడు.
ఆ తర్వాత ఉమర్ (రజియల్లాహు అన్హు) తన కరవాలాన్ని తీసుకొని ప్రవక్త వైపునకు బయలుదేరాడు. తలుపును తట్టాడు. ఒక వ్యక్తి తలుపు సందుల్లో నుండి చూశాడు. ఉమర్ కరవాలం ధరించి ఉండడాన్ని గమనించి, లోపలున్న ప్రజలకు తెలిపాడు. వారు దిగ్భ్రాంతి చెందారు. అప్పుడు ప్రవక్త లోపలి గదిలో ఉన్నారు. అక్కడే దగ్గర ఉన్న హంజా (రజియల్లాహు అన్హు) ప్రజలను గమనించి ఏమిటి సంగతి? అని అడిగాడు. ఉమర్ అని వారన్నారు. అప్పుడు హంజా (రజియల్లాహు అన్హు) అన్నారు: ‘అతని కొరకు ద్వారం తెరవండి. అతను సదుద్దేశ్యంతో వచ్చాడా అది అతనికి లభించుటకు సహాయపడదాము. ఒకవేళ ఏదైనా దురుద్దేశ్యంతో వచ్చాడా అతని కరవాలంతో అతడ్ని హతమార్చుదాము’. ఉమర్ లోనికి ప్రవేశించి ఇస్లాం స్వీకరించానని చాటి చెప్పాడు. వెంటనే అక్కడ ఉన్నవారందరూ ఏకంగా మరియు పెద్ద శబ్దముతో అల్లాహు అక్బర్ అని అన్నారు. ఆ శబ్దాన్ని మస్జిదె హరాంలో ఉన్నవారు విన్నారు.
సుహైబ్ రూమి (రజియల్లాహు అన్హు) ఇలా తెలిపారు: ‘ఉమర్ (రజియల్లాహు అన్హు) ఇస్లాంలో ప్రవేశించినప్పటి నుండి ఇస్లాం బలంగా, గౌరవంగా ఉంది. దాని వైవు బహిరంగంగా పిలవడం జరిగింది. మేము కాబా వద్ద కూర్చోగలిగాము మరియు దాని ప్రదక్షిణం (తవాఫ్) చేయగలిగాము’.
అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు? ‘ఉమర్ (రజియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరించినప్పటి నుండి మేము గౌరవంగా జీవించగలిగాము’.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
వుజూ
వుజూ లేని నమాజు స్వీకరించబడదు. అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
“మీలో ఎవనికైనా అపానవాయువు జరిగితే, వుజూ భంగమయితే అతను వుజూ చేసుకోనంత వరకు అల్లాహ్ అతని నమాజును స్వీకరించడు”. (బుఖారి 6954, ముస్లిం 225).
అందుకే ముస్లిం వ్యక్తి నమాజుకు ముందు వుజూ చేయడం తప్పనిసరి. వుజూ ఘనతలు చాలా ఉన్నాయి, మనిషి వాటిని తెలుసుకోవడం చాలా అవసరం. ఈ రెండుహదీసులు శ్రద్ధగా వినండి:
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా శుభవార్త ఇచ్చారని, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
“ఎవరు వుజూ చేసినప్పుడు పూర్తి శ్రద్ధతో మంచి విధంగా చేస్తారో అతని శరీరం నుండి అతని పాపాలన్నీ రాలిపోతాయి. చివరికి గోళ్ళ నుండి కూడా రాలిపోతాయి”. (ముస్లిం 245).
“అల్లాహ్ ఆదేశించిన విధంగా సంపూర్ణంగా వుజూ చేసేవారు, వారి ఫర్డ్ నమాజులు వాటి మధ్య జరిగే పాపాల ప్రక్షాళనకు కారణభూతమవుతాయి”.(ముస్లిం 231).
వుజూ విధానం:
1- వుజూ నియ్యత్ (సంకల్పం) నోటితో పలుకకుండా మనుసులోనే చేయాలి. ఒక పని చేయుటకు మనుసులో నిర్ణయించుకోవడమే ‘నియ్యత్’. మళ్ళీ బిస్మిల్లాహ్ అనాలి.
2- రెండు అరచేతులను మణికట్ల వరకు మూడు సార్లు కడగాలి.
3- మూడు సార్లు నోట్లో నీళ్ళు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్ళు ఎక్కించి శుభ్రం చేయాలి.
4- మూడు సార్లు ముఖము కడగాలి. అడ్డంలో కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు, నిలువులో నొసటి పై భాగం నుండి గదువ క్రింది వరకు.
5- రెండు చేతులు మూడేసి సార్లు కడగాలి. వ్రేలు మొదటి భాగము నుండి మోచేతుల వరకు. ముందు కుడి చెయ్యి, తరువాత ఎడమ చెయ్యి.
6- ఒక సారి తల ‘మసహ్’ చేయాలి. అంటే రెండు చేతులను తడి చేసి తల మొదటి (నుదుటి) భాగము నుండి వెనక మెడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ వెనక నుండి మొదటి (నుదుటి) వరకు తలను స్పర్శిస్తూ తీసుకురావాలి.
7- ఒక సారి రెండు చెవుల ‘మసహ్’ చేయాలి. అంటే రెండు చూపుడు వ్రేళ్ళతో చెవి లోపలి భాగాన్ని, బొటన వ్రేళ్ళతో పై భాగాన్ని స్పర్శించాలి.
8- రెండు కాళ్ళను వ్రేళ్ళ నుండి చీలమండల వరకు మూడేసి సార్లు కడగాలి. ముందు కుడి కాలు తరువాత ఎడమ కాలు. అవయవాలు ఒకసారి లేదా రెండు సార్లు కడిగినా పరవాలేదు, కాని ఆ అవయవం సంపూర్ణంగా కడగబడడం తప్పనిసరి.
9- తర్వాత ఈ మస్నూన్ దుఆ చదవాలి: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“మీలో ఎవరైనా సంపూర్ణంగా వుజూ చేసుకొని
‘అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహ్’
(నేను సాక్ష్యమిస్తున్నాను; అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త).
చదువుతారో అతని కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి, ఎందులో నుండి ప్రవేశించగోరినా అతని ఇష్టం’. (ముస్లిం 234).
వుజూలో ఒక అవయవం తరాఇత మరో అవయవం క్రమ ప్రకారంగా మరియు వెంటవెంటనే కడుగుట తప్పనిసరి(*)
(*) క్రమ ప్రకారంగా అంటే: 1 నుండి 8 వరకు ఉన్న క్రమం ప్రకారం వీటిలో వెనకా ముందు చేయకూడదు. వెంటవెంటనే అంటే: పై క్రమం ప్రకారం, ఒక అవయవం కడిగాక, దాని తడి ఆరక ముందే వెంటనే దాని వెనక అవయవం కడగాలి. మరీ ఆలస్యం చేయవద్దు.
వుజూను భంగపరిచే విషయాలు:
1- మలమూత్రపు మార్గాల నుండి ఏదీ వెలువడినా సరే అందు వలన వుజూ భంగమవుతుంది: మలము, మూత్రము, అపానవాయువు (పిత్తు), ‘మజీ’, ‘వదీ’ రక్తము మరియు ‘మనీ’. ‘మనీ’ వలన స్నానం చేయడం కూడా విధి అవుతుంది.
2- నిద్ర.
౩- ఒంటె మాంసం తినడం.
4- స్పృహ తప్పటం మరియు బుద్ధి క్షీణించడం.
మేజోళ్ళ పై ‘మసహ్’
ఇస్లాం ధర్మం యొక్క సులువైన ఉత్తమ విషయం ఒకటి: మేజోళ్ళపై ‘మసహ్’ చేసే అనుమతివ్వడం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా ‘మసహ్’ చేసేవారని రుజువైనది. అమ్ర్ బిన్ ఉమయ్య (రజియల్లాహు అన్హు) చెప్పారు:
“ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ తలపాగ మరియు మేజోళ్ళపైన ‘మసహ్’ చేస్తున్నది నేను చూశాను.” (బుఖారి 205).
వాటి పై ‘మసహ్’ చేయుటకు ఒక నిబంధన ఏమిటంటే అవి వుజూ చేసిన తర్వాత తొడిగి యుండాలి.
తడి చేసిన చెయ్యితో పాదాల పై భాగాన ‘మసహ్’ చేయాలి, క్రింది భాగాన కాదు.
ఇక ‘మసహ్’ గడువు విషయానికి వస్తే; స్థానికులు ఒక పగలు ఒక రాత్రి. ఏ ప్రయాణంలో నమాజ్ ఖస్ర్ చేయవచ్చునో ఆ ప్రయాణంలో ఉన్నవారు మూడు రేయింబవళ్ళు మేజోళ్ళపై ‘మసహ్’ చేయవచ్చును. (వుజూ చేసి తొడిగన తరువాత మొదట సారి మసహ్ చేసిన క్షణం నుంచీ గడువు మొదలవుతుంది).
‘మసహ్’ భంగమయే కారణాలు:
గడువు ముగిసిన మరుక్షణం నుంచే ‘మసహ్’ భంగమైపోతుంది.
‘మసహ్’ చేసిన తరువాత కనీసం ఒకసారైనా తీసినట్లయితే ‘మసహ్’ భంగమవుతుంది.
లేదా మనిషి (స్వప్నస్థలనం లేదా భార్యభర్తల సంభోగం కారణంగా) అశుద్ధతకు లోనైతే ‘మసహ్’ భంగమవుతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఓ విశ్వాసులారా! మీరు మీ ఇళ్లల్లోకి తప్ప ఇతరుల ఇళ్లల్లోకి వారి అనుమతి పొందనంతవరకూ, అక్కడున్న వారికి ‘సలామ్’ చేయనంతవరకూ ప్రవేశించకండి. ఇదే మీ కొరకు మేలైన పద్ధతి. మీరు గుర్తుంచుకునేందుకుగాను (ఈ విధంగా బోధపరచ బడింది). (ఖుర్’ఆన్ 24 : 27)
ఇంట్లో ప్రవేశిస్తూ సలాం చేయుట వలన హదీసులలో మంచి ప్రతిఫలం మరియు ఉన్నతమైన ప్రయోజనాలు కలిగివున్నాయి.
దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి భోదనలు చదవండి:
عَنْ أَبِي أُمَامَةَ رَضِيَ اللهُ عَنْهُ: أَنَّ رَسُولَ اللهِ – صلى الله عليه وسلم – قَالَ: «ثَلاثَةٌ كُلُّهُمْ ضَامِنٌ عَلَى اللهِ إِنْ عَاشَ رُزِقَ وَكُفِي، وَإِنْ مَاتَ أَدْخَلَهُ اللهُ الْجَنَّة، مَنْ دَخَلَ بَيْتَهُ فَسَلَّمَ فَهُوَ ضَامِنٌ عَلَى اللهِ …»
హజ్రత్ అబూ ఉమామా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:
ముగ్గురు; వారిలో ప్రతి ఒక్కరి గురించి అల్లాహ్ పూచి (జమానత్) తీసుకున్నాడు, వారు బ్రతికి ఉంటే అల్లాహ్ ఉపాధి ప్రసాదిస్తాడు, అల్లాహ్ వారికి సరిపోతాడు. ఒకవేళ చనిపోతే అల్లాహ్ వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఆ ముగ్గురిలో ఒకరు: తన ఇంట్లో ప్రవేశిస్తూ సలాం చేసే వ్యక్తి గురించి అల్లాహ్ పూచి తీసుకున్నాడు. [సహీ ఇబ్ను హిబ్బాన్ 499, సహీహుత్ తర్గీబ్ 321]
హజ్రత్ అనస్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు ఇలా తెలిపారు:
“ఓ సుపుత్రుడా! నీవు ఇంట్లో ప్రవేశిస్తూ ఇంటివారికి సలాం చేయి, ఇందులో నీ కొరకు మరియు నీ ఇంటి వారి కొరకు శుభము గలదు.”
(తిర్మిజి 2698, సహీహుత్ తర్గీబ్ 1608).
సారాంశం:
1- ఇంట్లో ప్రవేశిస్తూ సలాం చేయాలి.
2- ప్రవేశించు వ్యక్తి చేయాలి, అతను చిన్నవాడైనా, పెద్దవాడైనా, పురుషుడైనా, స్త్రీ అయినా ఎవరైనా సరే.
3- సలాం చేసే వారు అల్లాహ్ పూచిలోకి వస్తారు.
4- బ్రతికి ఉంటే ఉపాధి, అల్లాహ్ రక్షణ పొందుతారు.
5- సలాం చేసేవారికి, ఇంటి వారికి శుభం ప్రాప్తమవుతుంది.
6- మరణిస్తే స్వర్గంలో ప్రవేశిస్తారు.
7- సహీ హదీసులో వచ్చిన సలాం పదాలు: అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరుకాతుహు.
8- అస్సలాము అలైకుం అంటే పది (10) పుణ్యాలు.
9- అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటే ఇరువై (20) పుణ్యాలు
10- అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు అంటే ముప్పై (30) పుణ్యాలు.
11- అస్సలాము అలైకుం…. తప్ప గుడ్ మార్నింగ్ అని లేదా వేరే పదాలు పలకుతూ ఇంట్లో ప్రవేశించడం ముస్లింలకు తగదు.
అల్లాహ్ మనందరికీ సధ్బుధ్ధిని మరియు సంపూర్ణ ఇస్లామ్ ఙ్ఞానాన్ని మరియు దాని మీద జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.
మీసోదరుడు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లామీయ సత్ప్రవర్తన, నైతిక ప్రవర్తన (గుడ్ క్యారెక్టర్) – వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/heqzqooCHzY [42 నిముషాలు] ఆడియోలో క్రింది విషయాలు వివరించబడ్డాయి: [1] ఇస్లాంలో సత్ప్రవర్తన (ఉత్తమ నడవడిక ) కు ఎలాంటి విలువ ఉన్నది? [2] సత్ప్రవర్తన (అఖ్లాఖ్) వలంబిస్తే మనకు ఇహపర లోకాల్లో ఏమి లాభాలు కలుగుతాయి? [3] సత్ప్రవర్తన ఎవరి పట్ల ఎలా అవలంబించాలి? [4] సత్ప్రవర్తన రావాలంటే ఎలాంటి సాధనాలను ఉపయోగించాలి?
విషయ సూచిక:
ఇస్లామీయ ప్రవర్తన
సద్వర్తన నిదర్శనాలు
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవర్తన
కొన్ని సద్గుణాలు: సత్యత, అమానతు, వినయము, సిగ్గు, బిడియం,లజ్జ
కొన్ని దుర్గుణాలు: జుల్మ్ (అత్యాచారం),ఈర్ష్య, మోసం, దుష్గర్వం
నైతిక గుణాలు ఆర్జించు మార్గాలు
విశ్వాస శుద్ధి
దుఆ
ముజాహదా (ప్రయత్నం,కృషి)
ముహాసబ (ఆత్మ విమర్శ)
సద్వర్తన వాళ్ళ వచ్చే ప్రయాజనాలను ఆలోచించుట
దుర్గుణాల దుష్ఫలితాల గురుంచి యోచించుట
సంపూర్ణ ఆత్మ శుద్ధి కోసం ప్రయత్నించుట
మందహాసం,చిరునవ్వు
చూసి చూడనట్లు ఉండుట
సంయమనం,సహనం
మూర్ఖుల జోలికి పోకుండా ఉండుట
దూషించకుండా ఉండుట
బాధని మరిచిపోవాలి
మన్నింపు వైఖరి
దాతృత్వం
అల్లాహ్ వద్ద ప్రతిఫలం పొందే నమ్మకం
కోపం నుండి దూరముండుట
నిర్మాణాత్మక మైన విమర్శను స్వీకరించుట
పనిని సంపూర్ణంగా చేయుట
తప్పు జరిగితే ఒప్పుకోవుట
సత్యం ఆవశ్యకమైనది
సద్గుణులతో స్నేహం చేయుట
పరస్పర సంభాషణ, సమావేశ పద్ధతులు పాటించుట
ప్రవక్త మరియు సహచరుల జీవిత చరిత్ర చదువుట
సద్గుణాలకు సంబంధించిన రచనలు చదువుట
[పూర్తి పుస్తకం క్రింద చదవండి]
అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బఅద్!
సర్వ స్తోత్రములకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై శాంతి, కరుణ కురియుగాక!
అల్లాహ్ మనకు ఇస్లాం వరాన్ని అనుగ్రహించినందుకు, సద్గుణాలు అవలంభించా లని ప్రోత్సహించినందుకు, సద్గుణ సంపన్నులకు గొప్ప ప్రతిఫలం సిద్ధపరచినందుకు మనం ఆయనకు అనేకానేక స్తోత్రములు పఠించాలి.
సద్గుణ సంపన్నులైయుండుట ప్రవక్తల, పుణ్యాత్ముల గుణం. సద్గుణాల వల్ల ఉన్నత స్థానాలు లభించును. అల్లాహ్ ఒకే ఒక ఆయతులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఎలా ప్రశంసించాడంటే, అందులో ఆయన సర్వ సద్గుణాలు ఇమిడియున్నాయి: చూడండి: ఖలం (68:4)
[وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ]
“నిస్సందేహంగా నీవు నైతికంగా అత్యున్నత స్థానంలో ఉన్నావు”.
సద్గుణాల ద్వారా ప్రేమ, అప్యాయతలు జనిస్తాయి. దుర్గుణాల వల్ల ద్వేషం, ఈర్ష్యలు పుడతాయి. సద్గుణ సంపన్నులకు సత్ఫలితం, వారి పర్యవసానం ఇహపరాల్లో స్పష్టమయి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సద్గుణాన్ని దైవభయభీతితో కలిపి తెలిపారు:
అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, అనేక మందిని స్వర్గంలో ప్రవేశింపజేయునది ఏమిటని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగినప్పుడు, ఆయన చెప్పారు: “అల్లాహ్ భయభీతి మరియు సద్వర్తన”. (తిర్మిజి 2004, సహీహా 977, సహీహుత్ తర్గీబ్ 1723).
సద్వర్తన అంటే: నగుమోముతో ఉండుట, మంచి చేయుట, ప్రజలకు అవస్త కలిగించకుండా ఉండుట, ఇంకా మృదువుగా మాట్లాడుట, కోపాన్ని దిగమింగుట, కోపం వ్యక్తపరచకుండా ఉండుట, ఇతరుల బాధ భరించుట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు:
“ఇహపరవాసుల అత్యుతమ నడవడిక గురించి నీకు తెలుపనా? నీతో సంబంధం తెంచుకున్న వానితో నీవు సంబంధం పెంచుకో, నీకు ఇవ్వనివానికి నీవు ఇవ్వు, నీ పట్ల దౌర్జన్యం చేసినవానిని నీవు మన్నించు”. (మకారిముల్ అఖ్లాక్: ఇబ్ను అబిద్ దున్యా 19, ముస్నద్ అహ్మద్ 17334, సహీహా 891).
సోదరా! ఈ ప్రశంసనీయమైన సద్గుణం యొక్క లెక్కలేనన్ని పుణ్యాలను, గొప్ప సత్ఫలితాలను గమనించు; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. అబూ దావూద్ 4798, సహీహా 794లో ఉంది:
“అల్లాహ్‌కు అత్యంత ప్రియుడు ప్రజలకు అత్యంత ప్రయోజనకరుడు. అల్లాహ్‌కు సత్కార్యాల్లో అత్యంత ప్రియమైనవి; ముస్లింకు సంతోషం కలిగించడం, అతని ఓ కష్టాన్ని తొలగించడం, అతని అప్పు చెల్లించటం, అతని ఆకలి భాధను తీర్చటం. నేను నా ముస్లిం సోదరుని వెంట అతని ఓ అవసరాన్ని తీర్చుటకు నడవడం నా మస్జిదు (మస్జిదె నబవీ)లో ఒక నెల ఏతికాఫ్ చేయడం కంటే ఎంతో ప్రియమైనది”. (తబ్రానీ సగీర్ 861, సహీహుత్ తర్గీబ్ 2623).
ముస్లిం సోదరా! మృదువుగా, ప్రేమగా ఓ మాట నీవు మాట్లాడినా అందులో నీకు పుణ్యం ఉంది, అది నీ కొరకు ఒక దానం లాంటిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
«وَالكَلِمَةُ الطَّيِّبَةُ صَدَقَةٌ»
“మంచి మాట ఒక దానం వంటిది”. (బుఖారీ 2989, ముస్లిం 1009).
మంచిమాటకు ఈ ఘనత ఎందుకు లభించినది? ఎందుకనగా; అందులో ప్రశంసనీయమైన ప్రభావం ఉంది. అది హృదయాలను చేరువుగా చేస్తుంది, మనస్సును ప్రేమతో నింపుతుంది, ద్వేషాలను దూరం చేస్తుంది.
ఇతరుల నుండి బాధ భరించి అయినా సద్వర్తన కలిగి ఉండడం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రోత్సహించిన సందర్భాలు అనేకం, వాటిలో ఒకటి:
“ఎక్కడ ఉన్నా అల్లాహ్ తో భయపడు, పాపం జరిగిన వెంటనే పుణ్యం చెయ్యి, దాని వల్ల పాపం తుడుచుకుపోవును, ప్రజల ఎడల సద్వర్తనతో మెలుగు”. (తిర్మిజి 1987, సహీహుత్ తర్గీబ్ 2655).
ప్రతీ సమయ, సందర్భంలో ముస్లిం ఈ సద్గుణాలను అలవర్చుకొని ఉంటాడు, అందుకు అతను ప్రజలకు ప్రియుడయి ఉంటాడు. ఏ దారి గుండా నడిచినా, ఏ చోటకి వెళ్ళినా వారికి సన్నిహితుడవుతాడు, చివరికి తన భార్యకు ఓ అన్నం ముద్ద తినిపించినా, అతనికి ఇస్లాంలో సత్ఫలితం లభిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
నీవు ఖర్చు చేసే ఒక్కో దానికి బదులుగా నీకు సదఖ చేసినంత పుణ్యం, చివరికి నీవు నీ భార్య నోట్లో పెట్టే ఓ అన్నం ముద్దకు బదులుగా కూడా పుణ్యం లభిస్తుంది. (బుఖారీ 2742).
ప్రియ సోదరా! విశ్వాసులు పరస్పరం సహోదరులు, విశ్వాసి తన కొరకు ఇష్టపడినదే తన సోదరుని కొరకు ఇష్టపడాలి. కనుక నీకిష్టమైనదేదో చూసుకొని అదే, అలాంటిదే నీ సోదరునికీ ఇవ్వు. నీకు ఇష్టం లేనిది అతని నుండి దూరంగానే ఉంచు. జాగ్రాత్త! అల్లాహ్ ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన ప్రవక్తగా విశ్వసించినవారిని చిన్నచూపుతో చూడకు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు:
“తన ముస్లిం సోదరుడ్ని కించపరచడం, చిన్న- చూపుతో చూడడం స్వయం తాను చెడ్డవాడు అనడానికి గొప్ప చిహ్నం”. (ముస్లిం 2564).
ముస్లిం సోదరా! అన్ని వేళల్లో సుగమమైన మార్గం, సులభమైన ఆరాధన సద్వర్తన అవలం- బించండం. అవును, దీని సత్ఫలితం ఇంతా అంతా కాదు, రాత్రంతా తహజ్జుద్ చేసే, పగలంతా ఉపవాసం పాటించే వారితో సమానం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే శుభవార్త ఇచ్చారు:
“విశ్వాసి తన సద్వర్తన ద్వారా (నఫిల్) ఉపవాసాలు, తహజ్జుద్ నమాజులు పాటించేవారి స్థానాన్ని చేరుకుంటాడు”. (అబూ దావూద్ 4798, సహీ తర్గీబ్ 2643).
సద్వర్తన చిహ్నాలు
సద్గుణాలంటే కొన్ని మంచి గుణాల కలయిక (సమూహం). వాటిలో కొన్ని దిగువ తెలుసు- కుందాము, పాటించే ప్రయత్నం చేద్దాము:
మనిషి ఎక్కువగా బిడియం గలవాడై ఉండాలి. ఇతరులకు బాధ కలిగించకుండా ఉండాలి. అధికంగా సంస్కరణకర్త అయి, సత్యవంతుడై ఉండాలి. తక్కువ మాట్లాడాలి. ఎక్కువ పని చేయాలి. వృధా వాటికి దూరంగా ఉండాలి. ప్రతి మంచిలో ముందంజ వేయాలి. బంధుత్వాన్ని పెంచుకుంటూ ఉండాలి. సహనశీలుడై, కృతజ్ఞుడై, సంతృప్తి పడేవాడై, ఓర్పుగలవాడై, మృదువైఖరి అవలంబించేవాడై ఉండాలి. సౌశీల్యుడై కనికరుడై ఉండాలి. శపించువాడు, దూషించువాడు, చాడీలు చెప్పేవాడు, పరోక్షంగా నిందించేవాడు, తొందరుపాటు పడేవాడు, కపటం గలవాడు, పిసినారి, ఈర్షాపరుడై ఉండకూడదు. సంతోషంగా, ఉల్లాసంగా ఉండాలి. అల్లాహ్ కొరకే ప్రేమించాలి. అల్లాహ్ కొరకే ఇష్టపడాలి. అల్లాహ్ కొరకే కోపంగా ఉండాలి.
సద్వర్తన గల మనిషి ప్రజల బాధను సహిస్తాడు, ఎల్లప్పుడు వారి నుండి జరిగే పొరపాట్లకు ఏదైనా సాకు వెతుకుతాడు, వారి తప్పులెన్నడం, వారి లోటుపాట్లను వెతకడం నుండి ఆమడ దూరమే ఉంటాడు. విశ్వాసి ఏ స్థితిలో, సందర్భంలో దుర్గుణుడు, దుష్ప్రవర్తన గలవాడు కాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక సందర్భాలలో సద్వర్తన ప్రాముఖ్యతను, సద్గుణ సంపన్నడు పొందే గొప్ప సత్ఫలితాన్ని ఎంతో నొక్కి చెప్పారు. ఉసామా బిన్ షరీక్ ఉల్లేఖించారు, మేము ప్రవక్త వద్ద కూర్చొని ఉండగా, కొంత మంది వచ్చి ఇలా అడిగారు:
“మీలో నాకు అత్యంత ప్రియుడు మరియు ప్రళయదినాన నా సమావేశంలో నాకు అత్యంత సమీపంలో కూర్చునేవాడు ఎవరో మీకు తెలుపనా?”, అవును తెలుపండి ప్రవక్తా! అని సహచరులు విన్నవించుకున్నారు: “మీలో అందరికన్నా ఎక్కువ సద్గుణాలు గలవాడు”. (ముస్నద్ అహ్మద్ 6735, సహీహుత్ తర్గీబ్ 2649).
అబూ దర్దా రజియ్లలాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహాబాలను ఏ సద్వర్తన అలవర్చుకోటానికి ఆహ్వానించేవారో వాటిలో ఆయన అత్యుత్తమ గొప్ప ఆదర్శంగా ఉండేవారు. ప్రవక్త తమ సహచరుల మదిలో అత్యున్నత సద్గుణాలు ఉపదేశాలతో, వివేచనాపరమైన మాటలతో నాటేకి ముందు తమ ఆచరణతో నాటేవారు.
అనస్ రజియల్లాహు అన్హు తెలిపారు: నేను పది సంవత్సరాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో ఉన్నాను, అల్లాహ్ సాక్షిగా! ఆయన ఏ ఒక్కసారి కూడా నన్ను కసురుకోలేదు, ఇంకా ఈ పని ఎందుకు చేశావు, ఈ పని ఎందుకు చేయలేదు అని కూడా అనలేదు. (బుఖారీ 6038, ముస్లిం 2309).
“అనస్ రదియల్లాహు అన్హు తెలిపారు: ఒక సారి నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట నడుస్తుండగా -అప్పుడు ఆయన నజ్రాన్‌లో తయారైన మందమైన అంచుగల ఒక దుప్పటి ధరించి ఉన్నారు- ఒక గ్రామీణుడు వచ్చి దుప్పటిని వడిగా లాగాడు. దాని వలన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెడ భుజానికి దగ్గర మచ్చ ఏర్పడింది నేను స్వయంగా చూశాను. మళ్ళీ అతను ఇలా అడిగాడు. ముహమ్మద్! నీ వద్ద ఉన్న అల్లాహ్ ధనం నాకింత ఇప్పించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని వంక తిరిగి చూస్తూ నవ్వారు. మళ్ళీ అతనికి కొంత ఇవ్వవలసినదిగా ఆదేశించారు. (బుఖారీ 3149, ముస్లిం 1057).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ఏమి చేసేవారని ఆయిషా రజియల్లాహు అన్హాను ప్రశ్నించినప్పుడు, ఆమె ఇలా చెప్పారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ఎక్కువ చిరునవ్వు నవ్వేవారిని నేను చూడలేదు. (తిర్మిజీ 3641, ఇది హసన్ హదీస్).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గుణవిశేష- ణాల్లో; ఆయన దాత, ఎన్నడూ పిసినారితనం వహించలేదు. శూరుడు, సత్యం నుండి ఎన్నడూ వెనక్కి తిరగలేదు. న్యాయశీలి, ఎన్నడూ తీర్పు చేయడంలో అన్యాయం చేయలేదు. పూర్తి జీవితంలో సత్యవంతుడు, విశ్వసనీయుడు అనే ప్రఖ్యాతి చెందారు.
జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైనా ఏదయినా అడిగితే, “లేదు” అని ఎన్నడూ అనలేదు. (బుఖారి 6034, ముస్లిం 2311).
ఆయన తమ సహచరులతో పరిహాసమాడేవారు. (ధనికపేద బేధం లేకుండా) అందరితో కలసి ఉండేవారు. పిల్లవాళ్ళను తమ వడిలో కూర్చోబెట్టి ఆటలాడే వారు. ఆహ్వానాన్ని అంగీకరించేవారు. వ్యాధిగ్రస్తుల్ని పరామర్శిం చేవారు. అపరాధుల సాకును ఒప్పుకునేవారు.
తమ సహచరులను వారికి నచ్చిన మంచి పేర్లతో సంబొధించేవారు. మాట్లాడుతుండేవారి మాట మధ్య అభ్యంతరం కలిగించేవారుకారు.
అబూ ఖతాద రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఒక సారి నజ్జాషి రాయబార బృందం ఒకటి ప్రవక్త వద్దకు వచ్చినప్పుడు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేస్తున్నది చూసి, ఆయన సహచరులు ప్రవక్తా! మీరు ఉండండి. మేము వారికి సేవ చేస్తాము అని విన్నవించుకోగా. ఆయన “వారు మా సహచరులతో మంచి విధంగా ప్రవర్తించారు. ప్రతీకగా వారి ఆతిథ్యం స్వయంగా నేనూ మంచి విధంగా చేయాలను- కుంటున్నాను” అని అన్నారు. (దలాఇలున్ నుబువ్వ 2/307, సీరతుబ్ని కసీర్ 2/31).
ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: “నేను ఒక దాసున్ని, దాసుడు ఎలా తింటాడో అలాగే నేను తింటాను. అతను ఎలా కూర్చుంటాడో అలా నేను కూర్చుంటాను”. ఆయన గాడిదపై స్వారీ చేసేవారు, నిరుపేదలను పరామర్శించేవారు, బీదవాళ్ళతో కలసి కూర్చుండేవారు.
సత్యం
నిశ్చయంగా విశ్వాసుడు తన ప్రభువు పట్ల సత్యవంతుడు. ప్రజల ఎడల సత్యవంతుడు. అన్ని వేళల్లో, స్థితుల్లో తన మాటల్లో, చేష్టల్లో సత్యవంతుడుగానే ఉంటాడు. అల్లాహ్ ఆదేశం గమనించండి:
“ఎవరైతే ఉద్దేశ్య పూర్వకంగా నాపై అబద్దాన్ని మోపుతాడో అతడు తన నివాసం నరకంలో నిర్మించుకోవలసి ఉంటుంది”. (బుఖారి 1291, ముస్లిం 3).
బాలల మనుస్సులో సైతం సత్యాన్ని నాటాలని, వారు ఆ మనుగడను అనుసరిస్తూ పెరగాలని ఇస్లాం ప్రోత్సహిస్తుంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శుభవార్త ఇచ్చారు: “పరిహాసానికయినా అసత్యము చెప్పని వ్యక్తి కోసం స్వర్గం మధ్యలో నివాసం లభిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. (అబూ దావూద్ 4800, సహీహా 273)
వ్యాపారి తన సరుకు అమ్మడానికి అబద్దం చెబుతాడు. అయితే ప్రవక్త ఈ హెచ్చరికను వినలేదా, చదవలేదా? “అల్లాహ్ ప్రళయదినాన ముగ్గురితో మాట్లాడడు, వారి వైపు చూడడు, వారిని శుద్ధిపరచడు” అని ప్రవక్త హెచ్చరించి- నప్పుడు, వారెవరు ప్రవక్తా! వారైతే నాశనమై- పోయారు, నష్టములో పడ్డారు అని అబూ జర్ర్ రజియల్లాహు అన్హు అడిగారు. అప్పుడు ప్రవక్త చెప్పారు: “చీలమండలానికి క్రింద దుస్తులు ధరించేవారు, ఉపకారం చేసి దెప్పిపొడిచేవాడు మరియు అసత్య ప్రమాణాలతో తమ సరుకును విక్రయించేవారు”. (ముస్లిం 106).
ఉఖ్బా బిన్ ఆమిర్ చెప్పారు: “ఒక ముస్లిం ఓ సరుకును అమ్మేటప్పుడు అందులో ఉన్న లోపం తెలిసి కూడా దాన్ని (కొనేవారికి) చెప్పకపోవుట ధర్మ సమ్మతంకాదు”. (బుఖారీలో 2079కి ముందు హదీసు).
అమానతు
ఇస్లాం తన అనుచరులకు (విశ్వాసులకు) అమానతులను హక్కుదారులకు అప్పగించాలని ఆదేశిస్తుంది. ప్రతి వ్యక్తి తాను చేసే పని చిన్నదైనా, పెద్దదయినా తన ప్రభువు తనను చూస్తున్నాడు అనే విషయం తెలుసుకోవాలి. ఇది కూడా అమానతే.
ముస్లిం తనపై అల్లాహ్ విధించిన విషయాల్ని నెరవేర్చడములో విశ్వసనీయుడు. ప్రజల ఎడల ప్రవర్తించడంలో సయితం విశ్వసనీయుడు.
అమానతు అంటే: మనషి తనకు అప్పగించబడిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చడానికి కృషి చేయడం. అల్లాహ్ ఆదేశం:
“ఎవరి అమానతులను వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి” అని అల్లాహ్ మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు. (నిసా 4:58).
మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని, అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
«لَا إِيمَانَ لِمَنْ لَا أَمَانَةَ لَهُ»
“ఎవరిలోనయితే అమానతు లేదో వారిలో ఈమాన్ (విశ్వాసం) లేదు”. (అహ్మద్ 12383, ఇది హసన్ హదీస్).
అమానతు అంటే ఈ రోజుల్లో కొందరు అనుకునే విధంగా “ఒకరి వస్తువును భద్రంగా కాపాడి తను అడిగినప్పుడు తిరిగి ఇవ్వడం” మాత్రమే కాదు. అంతకంటే విశాలమైన భావాలు (విషయాలు) అందులో వస్తాయి. అమానతు అదా చేయడం, అప్పగించడం అంటే: ఒక వ్యక్తి ఏ పని, లేక విధి అతనికి అప్పగించబడినదో, అది ధర్మపరమైనది గాని లేక ప్రాపాంచికమైనది గాని అన్నిటినీ మనఃపూర్వకంగా, సరియైన రీతిలో నెరవేర్చాలి. తన వైపు నుండి ఏ రవ్వంత కొరత లేకుండా నెరవేర్చాలి.
వినయము
ముస్లిం అవమానానికి గురి కాకుండా వినయ వినమ్రత పాటిస్తాడు.. గర్వాహంకారాలు ముస్లింకు వాంఛనీయం కావు. అల్లాహ్ ఆదేశం:
“మీరు వినయ, వినమ్రత పాటించండి అని అల్లాహ్ నాకు వహీ (సందేశం) పంపాడు. ఎంతవరకు అనగా మీలో ఒక వ్యక్తి మరో వ్యక్తిపై గర్వాహంకారినికి ఒడికట్టకూడదు. ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దౌర్జన్యం చేయకూడదు”. (ముస్లిం 2865).
వినయవినమ్రత యొక్క ప్రత్యక్ష రూపాలు: బీద, నిరుపేదలతో కూర్చుండుట. కలియ గలుపుగా ఉండుట. వారిపై పెత్తనం చలాయించ కుండా, గర్వించకుండా, ప్రజల మధ్య మందహాసముతో ఉండుట. ఇతరుల కంటే తనే ఉన్నతుడు, గొప్పవాడు అన్న భావన మనిషికి ఉండకపోవుట.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మహాప్రవక్త అయినప్పటికీ ఇంటిని శుభ్రపరిచేవారు (ఇల్లు ఊడిచేవారు). మేకపాలు పిండేవారు. బట్టలకు అతుకులు వేసి కుట్టుకునేవారు. తమ బానిసతో కలసి తినేవారు. మార్కెట్ (బజారు) నుండి స్వయంగా ఖరీదు చేసేవారు. విశ్వాసులైన చిన్న, పెద్ద, ధనిక, పేద బేధం లేకుండా అందరితో కలిసేవారు. ముసాఫహా (కరచాలనం) చేసేవారు.
లజ్జ
లజ్జా, బిడియం విశ్వాస భాగాల్లో ఓ భాగం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశానుసారం: “లజ్జా గుణం వలన మేలుతప్ప మరేమి చేకూరదు”. (బుఖారి 6117, ముస్లిం 37).
విశ్వాసునికి ఈ మహోన్నత గుణంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప ఆదర్శం, ఆయన మహాలజ్జ గుణం గలవారు. అబూ సఈద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఏదైనా విషయం అసహ్యం కలిగించిందంటే, అది మేము ఆయన ముఖము చూసి తెలుసుకునే వారము. (బుఖారీ 6102).
సిగ్గు, బిడియం గుణాలు ముస్లింను సత్యమైన మాట పలకడం, విద్య అభ్యసించడం, మంచిని ఆదేశించడం, చెడును నివారించడం నుండి ఆపదు. ఉదా: ఈ గుణం ఉమ్మె సులైమ్ రజియల్లాహు అన్హాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా ప్రశ్నించడానికి అడ్డుపడలేదు: ప్రవక్తా! అల్లాహ్ హఖ్ (ధర్మ) విషయం అడిగితె సిగ్గుపడడు కదా!. స్త్రీలకు స్వప్న స్ఖలనమైనచో స్నానం చేయుట తప్పనిసరియా? అని ప్రశ్నించింది. అందుకు ప్రవక్త “అవును స్వప్న స్ఖలనం అయినట్టు తెలిసి, తడి చూసినచో స్నానం చేయాలి” అని సమాదానమిచ్చారు. (బుఖారి 282).
కాని ఈ లజ్జగుణం ముస్లింకు, దుష్కార్యాలు చేయునప్పుడు, అతనిపై విధించబడినదానిని సంపూర్ణంగా నిర్వర్థించకుండా ఉన్నప్పుడు. ఒకరి లోపాల్ని బహిర్గతం చేసేటప్పుడు. ఎవరికైనా నష్టం చేయాలని పూనుకున్నప్పుడు తప్పకుండా అడ్డు పడాలి.
అల్లాహ్ పట్ల లజ్జగుణంతో మెలగడం అత్యంత ప్రధాన హక్కు. విశ్వాసి తన సృష్టికర్త అయిన అల్లాహ్ పట్ల సిగ్గుపడాలి. ఆయనే అతనికి ఉనికి ప్రసాదించి, అనేక వరాలు నొసంగాడు. కనుక ఆయన విధేయతలో, వరాల కృతజ్ఞత తెలుపుటలో అశ్రద్ధ చూపుటకు సిగ్గుపడాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు: “సిగ్గుపడటానికి ప్రజలకంటే అల్లాహ్ ఎక్కువ అర్హతగలవాడు”. (బుఖారి).
దుర్గుణాలు
జుల్మ్ – (అన్యాయం, దౌర్జన్యం)
నిజమైన ముస్లిం తరపున ఎన్నడూ ఏ ఒకరి పట్ల “జుల్మ్” జరగదు. ఎందుకనగా ఇస్లాంలో “జుల్మ్” కు పాల్పడుట నిషిద్ధం. అల్లాహ్ ఆదేశం:
“ఓ నా దాసులారా! నేను దౌర్జన్యాన్ని నిషేధిస్తున్నాను. మీరు కూడా ఒకరి పై నొకరు దౌర్జన్యం చేయడం నిషిద్ధం అని భావించండి, అలాగే ఆచరించండి”. (ముస్లిం).
“జుల్మ్” మూడు రకాలు:
1. మొదటి రకం: మానవుడు తన ప్రభువు పట్ల చేసే “జుల్మ్”. అనగా తన ప్రభువు పట్ల అవిశ్వాసానికి పాల్పడటం. అల్లాహ్ ఆదేశం:
[وَالكَافِرُونَ هُمُ الظَّالِمُونَ] {البقرة:254}
“అవిశ్వాస మార్గం అవలంభించేవారే “జుల్మ్” చేయువారు (జాలిములు)” (బఖర 2:254).
ఆరాధనలో అల్లాహ్ తో పాటు ఇతరుల్ని భాగస్వామి చేయడం ద్వారా మనిషి ఈ “జుల్మ్” కి పాల్పడతాడు. అంటే ఆరాధనల్లో కొన్నిటిని అల్లాహ్ యేతరుల కొరకు చేయుట. అల్లాహ్ ఆదేశం:
2. రెండవ రకం: ఒక వ్యక్తి తన తోటి మానవులపై చేసే “జుల్మ్”. అది వారి శీలమానాల్లో జోక్యం చేసుకొని బాధించడం, లేక వారిని శారీరకంగా బాధించడం, లేక అధర్మంగా వారి సొమ్మును కాజేసి బాధించడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు:
ఎవరైనా తన సోదరున్ని అవమాన పరచి లేదా మరే విధమైన “జుల్మ్” చేసి బాధించినచో, దిర్‌హమ్ దీనార్ (డబ్బు ధనం) చెల్లని ఆ రోజు రాక ముందు ఈ రోజే (క్షమాపణ కోరి లేక వారి హక్కు ఇచ్చేసి) తొలిగిపోవాలి. (లేదా) ఆ రోజు, తాను చేసిన “జుల్మ్”కి పరిమాణంలో అతని పుణ్యాలు తీసుకొని (బాధితునికివ్వబడతాయి). అతని వద్ద పుణ్యాలు లేనిచో బాధితుని పాపాలు తీసుకొని అతనిపై వేయబడతాయి. (బుఖారి 6534).
3- మూడవ రకం: మనిషి తన ఆత్మపై చేసుకునే “జుల్మ్”. అదేమిటనగా మనిషి నిషిద్ధ విషయాలకు పాల్పడుట. అల్లాహ్ ఆదేశం:
“వారు మాపై ఏ మాత్రం “జుల్మ్” చేయలేదు. వారు తమకు తామే “జుల్మ్” చేసుకున్నారు. (2: ఒఖర: 57).
నిషిద్ధ కార్యాలకు పాల్పడుట మనిషి తన ఆత్మపై చేసుకునే “జుల్మ్”. ఎందుకనగా అతని ఈ పాపం అతను అల్లాహ్ శిక్షకు గురికావడానికి కారణమవుతుంది.
అసూయ
అసూయ దుర్గుణాల్లో ఓ గుణం. ముస్లిం దాని నుండి దూరంగా ఉండడం తప్పనిసరి. ఎందుకనగా, అల్లాహ్ తన దాసులకు పంచిన దానిలో ఆక్షేపించినట్లగును. అల్లాహ్ ఆదేశం గమించండి:
“ఇతరులను చూసి వారు అసూయపడటానికి కారణం అల్లాహ్ వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదించాడనా?”. (నిసా 4:54).
అసూయ రెండు రకాలు:
1. మనిషి ఒక వ్యక్తి వద్ద ఉన్న ధనం, లేక విద్య లేక అధికారం లాంటి వరం నశించిపోయి తనకు లభించాలని కాంక్షించడం.
2. ఒకరి వద్ద ఉన్న ఓ అనుగ్రహం అది అతనికి లభించకున్నా ఆ వ్యక్తి వద్ద ఉండకుండా నశించిపోవాలని కోరడం. ఇవి రెండూ నిషిద్ధం.
ముఖ్య గమనిక: ఒక వ్యక్తి వద్ద ఉన్న అనుగ్రహం నశించిపోవాలని కాంక్షించకుండా తనకు కూడా అలాంటిదే కావాలని కోరడం అసూయ అనబడదు.
మోసం
ముస్లిం తన సోదరుల పట్ల మంచి చేయువాడు, అందుకు అతను ఏ ఒక్కరికీ మోసం చేయడు. తనకిష్టమైనది తన సోదరుని కొరకు ఇష్టపడతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఓ ధాన్యముల కుప్ప నుండి దాటుతూ అందులో చెయ్యి వేశారు. వేళ్లకు తడి అంటింది. “ఇదేమిటి ఓ వ్యాపారి?” అని అడిగారు. ‘వర్షము కురిసినందు వలన తడిసినవి (అయితె వాటిని నేను క్రింద ఉంచాను) ప్రవక్తా’ అని జవాబిచ్చాడు ఆ ధాన్యాల యజమాని. “అదే పైన ఎందుకు ఉంచలేదు, ప్రజలకు తెలిసేది కదా. మోసము చేయువారు మాలోని వారు కారు”. అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. (ముస్లిం 102).
గర్వం
మానవుడు తనకున్న విద్యకారణంగా ఒక్కోసారి గర్వానికి గురి అవుతాడు. ఇక ఇతరులపై, లేక విజ్ఞానులపై పెత్తనం చూపుతూ, వారిని చిన్న చూపుతో చూస్తాడు.
ఒక్కో వ్యక్తి తనకు ఉన్న ఆస్తి, సంపదల కారణంగా గర్వానికి లోనయి, ఈ మూలంగా ప్రజల ఎడల అహంకారభావంతో మసులుకుంటాడు.
ఒక్కో మనిషి తనకున్న బలం, శక్తి లేక తాను చేసే ఆరాధన లాంటి పనులతో గర్వానికి గురవుతాడు.
కాని నిజమైన ముస్లిం గర్వహాంకారాలకు గురికాకుండా దాని నుండి దూరంగా, జాగ్రత్తగా ఉంటాడు. ఇబ్లీసును స్వర్గం నుంచి వైదొలిగించింది అతని గర్వం, అహంకారమేనన్న విషయం ముస్లిం గుర్తించాలి. ఆదం అలైహిస్సలాంకు సజ్దా చేయి అని అల్లాహ్ అతన్ని ఆదేశించినప్పుడు అతడు: “నేను అతడికంటే శ్రేష్ఠుణ్ణి. నీవు నన్ను అగ్నితో సృష్టించావు. అతన్ని మట్టితో” అని అన్నాడు. అల్లాహ్ కారుణ్యం నుండి అతను దూరం కావడానికి ఇదేకారణం అయింది.
గర్వం, అహంకారభావం చికిత్స ఏమిటనగా ప్రతి వ్యకి తనకు అల్లాహ్ నొసంగిన అనుగ్రహాల్లో అది; విద్య, లేక ధనం, లేక ఆరోగ్యం మొదలయినవి ఏవైనా, అల్లాహ్ ఏ క్షణంలోనైనా తిరిగి తన నుంచి తీసుకునే శక్తిగలవాడు అని తెలుసుకోవాలి.
నైతిక గుణాలు ఆర్జించు మార్గాలు
మనిషి ఏ గుణాలపై స్థిరపడ్డాడో వాటిని మార్చడం మానవ నైజానికే అతికష్టం అనడంలో సందేహం ఏ మాత్రం లేదు. అయినా అది అసాధ్యం, అసంభవం కాదు. కొన్ని సాధనాలు, వివిధ మార్గాలున్నాయి వాటి ఆధారంగా మనిషి సద్గుణాలు ఆర్జించవచ్చును. వాటిలో:
1- సలామతుల్ అఖీద (విశ్వాస శుద్ది): విశ్వాసం మహోత్తరమైన విషయం. సర్వసాధారణంగా మనిషి నడవడిక, స్వభావం, అతని ఆలోచనకు, విశ్వాసానికి, అతను అవలంభించిన ధర్మానికి ప్రత్యక్ష రూపంగా ఉంటుంది. విశ్వాసులలో అత్యుత్తమ సద్వర్తనగలవాడే వారిలో సంపూర్ణ విశ్వాసం గలవాడు. విశ్వాసం సరిగ్గా ఉంటే ప్రవర్తన కూడా చక్కగా ఉంటుంది. సరియైన విశ్వాసంగల వ్యక్తికి అతని ఆ విశ్వాసం సత్యత, దాతృత్వం, సంయమనం, శూరత్వం సద్గుణాలను ప్రోత్సహిస్తుంది. అదే విధంగా అబద్ధం, పిసినారితనం, కోపం. అజ్ఞానం మొదలయిన దుర్గుణాల నుండి హెచ్చరిస్తుంది.
2 దుఆ: అది గొప్ప ద్వారం. ఒక దాసుని కొరకు అది తెరువబడుతే అల్లాహ్ వైపు నుండి దాతృత్వం, మేళ్ళు, శుభాలు కురుస్తునే ఉంటాయి. సద్గుణ సంపన్నుడవ్వాలని, దుర్గుణాలకు దూరంగా ఉండాలని కోరువారు అల్లాహ్ సన్నిధిలోకి చేరుకొని, ఆయనతో మొరపెట్టుకోవాలి. అల్లాహ్ అతనికి సద్గుణాలు ప్రసాదించాలని, దుర్గుణాల నుండి దూరముంచాలని. ఈ విషయంలో మరియు ఇతర విషయాల్లో దుఆ చాల ప్రయోజన కరమైనది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వినయ, వినమ్రతతో అల్లాహ్ ను చాలా వేడుకునే, అర్థించేవారు. తక్బీరే తహ్రీమ తరువాత చదివే దుఆలలో అప్పుడప్పుడు ఇలా కూడా దుఆ చేసేవారు.
“అల్లాహుమ్మహ్ దినీ లిఅహ్సనిల్ అఖ్‌లాఖి, లా యహ్దీ లిఅహ్సనిహా ఇల్లా అన్‌త, వస్రిఫ్ అన్నీ సయ్యిఅహా, లా యస్రిఫ్ అన్నీ సయ్యిఅహా ఇల్లా అన్‌త“. (ముస్లిం 771).
భావం: ఓ అల్లాహ్! నీవు నాకు సద్గుణాలు ప్రసాదించు. నీవు తప్ప మరెవ్వడూ సద్గుణాలు ప్రసాదించ లేడు. ఓ అల్లాహ్! నన్ను దుర్గుణాల నుండి దూరముంచు, నీవు తప్ప మరెవ్వరూ దుర్గుణాల నుండి దూరముంచలేడు.
3- ముజాహద: (ప్రయత్నం, కృషి) ఈ ప్రక్రియలో “ముజాహద” చాల ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవడు సద్గుణాలు అలవర్పుకోటానికి దుర్గుణాలను వదులుకోడానికి ముజాహద చేస్తాడో అతనికి అనేక మేళ్ళు లభించును. భయంకరమైన కీడు అతని నుండి దూరమగును. కొన్ని గుణాలు సహజమైనవి. మరికొన్ని ఆర్జించవలసి యుంటాయి. అవి శిక్షణ, అభ్యాసముతో వస్తాయి.
మనిషి “ముజాహద” ఒక సారి, రెండు సార్లు లేక కొంచెం ఎక్కువసార్లు చేసి విడనాడకూడదు. జీవితాంతం చేస్తునే ఉండాలి. ఎందుకనగ ఈ “ముజాహద” ఆరాధనలో లెక్కిచబడుతుంది. అల్లాహ్ ఆదేశం చదవండి:
[وَاعْبُدْ رَبَّكَ حَتَّى يَأْتِيَكَ الْيَقِينُ]
“తప్పకుండా చివరి గడియ వచ్చే వరకు నీ ప్రభువు దాస్యం చేస్తూవుండు”. (హిజ్ర్ 15:99)
4: “ముహాసబ”:చెడ్డ పని చేసినప్పుడు తన ఆత్మను విమర్శించి, మరోసారి ఆ చెడ్డపనికి అది పాల్పడకుండా ఉంచే ప్రయత్నం చెయ్యాలి.
5: సద్వర్తన వల్ల సంభవించే ప్రభావాలను యోచించాలి. ఏ విషయం యొక్క ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుంటే, వాటి సత్పలితాల్ని గ్రహిస్తే, అవి చేయుట మరియు చేయుటకు ప్రయత్నించుట సులభమగును.
6: దుర్గుణాల దుష్పలితం పట్ల చింతన చేయాలి. దుర్గుణం వల్ల కలిగే శాశ్వత బాధ, విడదీయని రోధ, పశ్చాత్తాపం, అనుతాపం, ప్రజల మనస్సుల్లో ద్వేషాలు పెరగటం లాంటి విషయాల్ని గమనించాలి (ఇలా దుర్గుణాల నుండి దూరముండ గలుగుతాడు).
7 ఆత్మశుద్ధి చేసుకోలేననే నిరాశకు గురికాకూడదు. విశ్వాసి నిరాశచెందుట మంచి విషయం కాదు. ఎన్నటికీ అది అతనికి తగనిది. తన సంకల్పాన్ని దృఢపరుచుకొని, సంపూర్ణంగా ఆత్మశుద్ధి చేయుటకు ప్రయత్నం చేయాలి. దానిలో ఉన్న లోపాల్ని లేకుండా చేసే ప్రయత్నం చేయాలి.
8: మందహాసము, చిరునవ్వుతో ఉండాలి. ముఖము చిట్లించి, మాడ్పు ముఖముతో ఉండకూడదు. ఒక వ్యక్తి తన ముస్లిం సోదరున్ని కలిసినప్పుడు చిరునవ్వు నవ్వుట “సదఖా” చేసినంత సమానం. దానిపై అతనికి పుణ్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శుభవార్త ఇచ్చారు.
«تَبَسُّمُكَ فِي وَجْهِ أَخِيكَ لَكَ صَدَقَةٌ»
“నీ సోదరున్ని కలిసి చిరునవ్వునవ్వుట నీకు “సదఖా” చేసినంత సమానం”. (తిర్మిజి 1956).
మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు.
“ఏ ఒక చిన్న సత్కార్యాన్ని చిన్నచూపుతో చూడకు. అది నీ సోదరున్ని మందహాసముతో కలియుట అయినా సరే”. (ముస్లిం 2626).
9: చూచి చూడనట్లుఉండాలి. ఇది మహాపురుషుల గుణం. ఈ గుణం వలన ప్రేమ ఎక్కువకాలం ఉంటుంది, (ప్రేమ లేని వారిలో ప్రేమ) కుదిరింపజేస్తుంది. శతృత్వాన్ని నశింపజేస్తుంది.
10: సంయమనం, సహనం: అది సద్గుణాల్లో అతి గొప్పది. జ్ఞానుల ఉన్నతమైన గుణం. సంయమనం అంటే ఆగ్రహం కలిగినప్పుడు దాన్ని దిగమింగుట. సంయమనం అంటే ఆ గుణంగల వ్యక్తికి కోపం రాకూడదు అని కాదు. ఆగ్రహం పెంచే కారణాల ఊబిలో చిక్కుకొని తీవ్రకోపానికి గురైనప్పుడు తనను తాను ఓదార్చుకోవాలి. ఒక వ్యక్తిలో సంయమనం గుణం చోటు చేసుకుందంటే అతన్ని ప్రేమించేవారి సంఖ్య పెరుగుతుంది. అతన్ని ద్వేషించేవారి సంఖ్య తరుగుతుంది. అతని స్థానం ఉన్నతం అవుతుంది.
11.మూర్ఖుల తెరువుకు పోకుండ ఉండుట: మూర్ఖుల జోలికి పోనివాడు తన మానాన్ని కాపాడుకుంటాడు. తనకు తాను తృప్తిగా ఉంటాడు. వారి నుండి బాధాకరమైన మాటలు వినకుండా శాంతిపొందుతాడు. అల్లాహ్ ఇలా ఆదేశించాడు.
12: దూషించవద్దు: తిట్లు, దుషణాలకు అతి దూరంగా ఉండాలి.
13: బాధను మరచిపోవాలి: నీకు ఎవరైనా బాధ కలిగిస్తే దాన్ని మరచిపో. అతని పట్ల నీ మనుస్సులో కల్మషం లేకుండా ఉండు. అతనితో భయపడకుండా ఉండు. తమ సోదరుల తరపు నుండి కలిగిన బాధను మరువకుండా గుర్తుంచుకునేవారిలో, వారి పట్ల ప్రేమ ఉండదు. అలా మరువనివారు వారితో కలిసి జీవితం గడుపలేరు. ఎంత మరువగలుగుతావో అంత బాధను మరచిపో.
14: మన్నింపు వైఖరి అవలంబించుకో: చెడు చేసినవారికి ప్రతీకారంగా మంచి చేయాలి. స్థానాలు ఉన్నతం కావడానికి ఇది ఒక సబబు (కారణం). అందులో శాంతి ఉంది. ప్రతీకారంతో తృప్తిపడే మనస్సుకు (ఆ అవకాశము ఇవ్వకుండా) నిరోధించినట్లగును.
15: దాతృత్వం: దాతృత్వం ప్రశంసనీయమైనది. పిసినారితనం నిందార్హమైనది. దాతృత్వం ప్రేమను ఆకర్షిస్తుంది. శతృత్వాన్ని దూరం చేస్తుంది. మంచి ప్రస్తావన సంపాదించి, తప్పిదాలను, లోటుపాట్లను కప్పిఉంచుతుంది.
16: అల్లాహ్ వద్ద ప్రతిఫలం పొందే నమ్మకం ఉండాలి. మహోన్నతమైన గుణాలు ఆర్జించడానికి సహాయపడే విషయాల్లో ఇది అతి గొప్పది. ఓపిక, ముజాహద, ప్రజల నుండి బాధలు, కష్టాలు భరించుటకు కూడా ఇది సహాయ పడుతుంది. విశ్వాసునికి తన సద్గుణాలకు, ఆత్మను అదుపులో ఉంచు కున్నందుకు అల్లాహ్ ప్రతిఫలం ఇచ్చేవాడున్నాడని విశ్వసించినప్పుడు మరింత ఎక్కువ సద్గుణాలు ఆర్జించడానికి ప్రయత్నిస్తాడు. ఈ దారిలో ఎదురయ్యే కష్టాలు కూడా తేలికగా ఏర్పడుతాయి.
17: కోపం నుండి దూరముండాలి. కోపం ఒక అగ్ని. అది గుండెల్లో మంటలు లేపుతుంది. దౌర్జన్యం చేయాలని, ప్రతీకారం తీసుకోవాలని, తృప్తి పొందాలని ప్రోత్సహిస్తుంది. మనిషి తనకు కోపం వచ్చినప్పుడు తన మనుస్సును అదుపులో ఉంచుకుంటే తన మానాన్ని, గౌరవాన్ని కాపాడుకోగలుగుతాడు. తర్వాత హీనమైన సాకులు చెప్పే పరిస్థితికి, పశ్చాత్తాపానికి దూరంగా ఉంటాడు. (కోపం ఎంత చెడ్డదో క్రింది హదీసు ద్వారా తెలుస్తుంది).
అబూ హూరైరా రజియల్లాహు అన్హు కథనం: ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ‘నాకు ఏదైనా ఉపదేశించండి’ అని అర్ధించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “కోపగించుకోకు” అని బోధించారు. ఆ వ్యక్తి దాని తరువాత కూడా మాటిమాటికి ‘ఉపదేశించండి’ అని అర్ధించసాగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతీసారి “కోపగించుకోకు” అని మాత్రమే బోధించారు. (బుఖారి 6116).
18- ఉద్దేశ్యపూర్వకమైన ఉపదేశాన్ని, నిర్మాణాత్మకమైన విమర్శనను స్వీకరించాలి. తనలో ఉన్న లోపం అతనికి తెలుపబడుతే దాన్ని స్వీకరించి దాన్ని దూరం చేసుకోవాలి. తన లోపాల పట్ల తాను తెలిసి తెలియనట్లు ఉండిపోతే. ఆత్మశుద్ధి సంపూర్ణంగా చేయలేడు.
19: ఒక మనిషికి ఏ పని చేయాలని నిర్ణయంచబడిందో దాన్ని అతడు పరిపూర్ణముగా చెయ్యాలి. అలా తను చీవాట్లకు, ఎత్తిపొడుపులకు, గద్ధింపులకు, నీచమైన సాకులు చెప్పుట నుండి దూరముంటాడు.
20:తప్పుజరిగితేదాన్నిఒప్పుకోవాలి.బొంకులాడకుండా జాగ్రత్త పడాలి. ఇది సద్గుణానికి ఒక చిహ్నం. ఎలాంటి అబద్దం చెప్పకుండ ఉండాలి. తప్పును ఒప్పుకొనుట ఘనతగల విషయం. అలా ఆ వ్యక్తి ప్రఖ్యాతి ఇనుమడింపజేయబడుతుంది.
21: సత్యం ఆవశ్యకమైనది. దాని ప్రభావం ప్రశంసనీయమైనది. సత్యం వలన మనిషి గౌరవం, మర్యాద, స్థానం పెరుగుతుంది. అది అసత్య కసటు, వ్యాకులం, పరితాపం, హీనత్వ సాకుల నుండి కాపాడుతుంది. ప్రజలు అతనికి చేసే కీడు నుండి, అతడు నమ్మకద్రోహి కాకుండా రక్షిస్తుంది. అతనిలో గౌరవం, ధైర్యం ఆత్మ విశ్వాసం (సెల్ఫ్ కాన్ఫిడెన్స్) తెఛ్చిపెడుతుంది.
22: చెడు చేసినవారిని మాటిమాటికి చీవాట్లు పెట్టుట, ఎత్తిపొడుచుట మానుకోవాలి. ఆ దుర్గుణం ఆగ్రహాన్ని ఆహ్వానిస్తుంది. శతృత్వానికి కారణభూతమవుతుంది. కష్టతరమయిన విషయాలు వినవలసి వస్తుంది. జ్ఞానుడు, బుద్ధిమంతుడు ప్రతి చిన్న పెద్ద విషయంపై తన సోదరుల్ని చీవాట్లు పెట్టడు. తాను ఓ హేతువు వెతుకుతాడు. ఒక వేళ చీవాట్లు పెట్టవలసి ఉంటే అది మృదువుగా, మంచి విధంగా ఉండాలి.
23: సద్గుణులు, మంచివాళ్ళకు తోడు (దోస్తాన) ఉండాలి. సద్గుణ సంపన్నుడుగా మార్చే విషయాల్లో ఇది అతిగొప్పది. మంచిని మనుస్సులో నాటుకొని యుండుటకు ముఖ్యకారణం అవుతుంది.
24: పరస్పర సంభాషణ, సమావేశ పద్దతులను పాటించాలి. ఆ పద్దతులు ఇవి: మాట్లాడే వ్యక్తి మాట శ్రద్ధతో వినాలి. మధ్యలో మాట ఆపవద్దు. అబద్దం చెబుతున్నాడని (నిందించవద్దు). హేళన చేయవద్దు. మాట పూర్తి కాక ముందు సమావేశం నుండి వెళ్ళ వద్దు.
ఇంకా: సలాం చేస్తూ సమావేశంలో పాల్గొనాలి. సలాం చేస్తూ బైటికి రావాలి. సమావేశాల్లో ఇతరులకు చోటు కల్పించాలి. కూర్చున్న వ్యక్తిని లేపి అతని చోట కూర్చోవద్దు. కలసి కూర్చున్న ఇద్దరిలో వారి అనుమతి లేకుండా విడదీయ వద్దు. ఒక్కరిని వదలి ఇద్దరు పరస్పరం రహస్యంగా మాట్లాడుకోవద్దు.
25: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత చరిత్ర చదువుతూ ఉండాలి. అది దాన్ని చదివేవారి ముందు మానవత ఎరిగిన దానికంటే ఒక గొప్ప ఆదర్శాన్నిచూపుతుంది. మానవ జీవిత సరళిలో ఒక సంపూర్ణ మార్గం ఉంచుతుంది
26: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరుల చరిత్రను కూడా చదువుతూ ఉండాలి.
27: సద్గుణాలకు సంబంధించిన రచనలు చదవాలి. అవి సద్గుణాలను బోధిస్తూ, వాటి ఘనత తెలుపుతాయి. వాటిని ఆర్జించటానికి సహాయ పడుతాయి. దుర్గుణాల నుండి హెచ్చరిస్తాయి. వాటి దుష్ఫలితాన్ని, వాటి నుండి దూరముండే విధానాన్ని తెలుపుతాయి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హదీసులు క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి చదవండి: సహనం , ఓర్పు [PDF]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.