తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 54: రమజాన్ క్విజ్ 04 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 54
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

రమజాన్ ప్రత్యేక క్విజ్ ప్రశ్నల పత్రం – 04

(1) ఎవరైనా అల్లాహ్ మార్గంలో ఒక రోజు ఉపవాసం ఉంటే ఎన్ని సంవత్సరాల పాటు నరకాగ్ని కి దూరంగా ఉంచబడతాడు?

A)  1 సం ”
B)  40 సం ”
C) 70 సం”

(2) స్త్రీ – స్త్రీల కొరకు తరావీహ్ నమాజు చేయించవచ్చా?

A)  చేయించవచ్చు
B)  పురుషులే చేయించాలి
C)  చేయించ కూడదు

(3) రమజాన్ నెలలో ఉమ్రా చేస్తే దేనికి సమానం? 

A) హజ్ తో సమానం
B) 2 ఉమ్రాలు చేసినట్లు
C)  పై రెండూ పొరపాటే

క్విజ్ 54: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [10:42 నిమిషాలు]


(1) ఎవరైనా అల్లాహ్ మార్గంలో ఒక రోజు ఉపవాసం ఉంటే ఎన్ని సంవత్సరాల పాటు నరకాగ్ని కి దూరంగా ఉంచబడతాడు?

C) 70 సం”

عَنْ أَبِي سَعِيدٍ الخُدْرِيِّ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: «مَنْ صَامَ يَوْمًا فِي سَبِيلِ اللَّهِ، بَعَّدَ اللَّهُ وَجْهَهُ عَنِ النَّارِ سَبْعِينَ خَرِيفًا»

బుఖారీ 2840, ముస్లిం 1153లో ఉంది: “ఎవరు అల్లాహ్ మార్గంలో ఒక్క రోజు ఉపవాసం ఉంటాడో అల్లాహ్ డెబ్బై సంవత్సరాల కొరకు అతని ముఖాన్ని నరకాగ్ని నుండి దూరం ఉంచుతాడు.”

ఉపవాసం యొక్క ఘనతలో అనేక హదీసులున్నాయి.

(2) స్త్రీ – స్త్రీల కొరకు తరావీహ్ నమాజు చేయించవచ్చా?

A) చేయించవచ్చు

స్త్రీ, స్త్రీలకు ఇమాంగా ఉండి నమాజు చేయించవచ్చును. అందరూ ఏకీభవించిన విషయం ఇది.

అబూ దావూద్ 592లో ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉమ్ము వరఖ (రజియల్లాహు అన్హా)కు ఆదేశించారు, ఆమె తన ఇంటివారికి ఇమాంగా ఉండి నమాజు చేయించాలి అని.

وَقَدْ أَمَّتِ النِّسَاءَ عَائِشَةُ رَضِيَ اللَّهُ عَنْهَا وَأُمُّ سَلَمَةَ رَضِيَ اللَّهُ عَنْهَا في الفرض والتروايح

అబూ దావూద్ వ్యాఖ్యానం ఔనుల్ మఅబూద్ లో ఉంది: ఆయిషా (రజియల్లాహు అన్హా) మరియు ఉమ్ము సలమ (రజియల్లాహు అన్హా) ఇమాంగా ఉండి ఫర్జ్ మరియు తరావీహ్ నమాజులు చేయించేవారు.

అయితే స్త్రీ ఇమాం పురషుల మాదిరిగా ఒంటరిగా ముందు నిలబడదు. స్త్రీల మొదటి పంక్తి మధ్యలో నిలబడాలి. కేవలం స్త్రీలకు మాత్రమే ఆమె ఇమామత్ చేయించాలి. స్త్రీ పురుషలకంటే ఎక్కువ ఖుర్ఆన్ తెలిసిననప్పటికీ పురుషులకు ఇమామత్ చేయించరాదు

(3) రమజాన్ నెలలో ఉమ్రా చేస్తే దేనికి సమానం?

A) హజ్ తో సమానం

روى البخاري (1782) ومسلم (1256) عن ابْن عَبَّاسٍ قال : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لِامْرَأَةٍ مِنْ الْأَنْصَارِ : ( مَا مَنَعَكِ أَنْ تَحُجِّي مَعَنَا ؟ قَالَتْ : لَمْ يَكُنْ لَنَا إِلَّا نَاضِحَانِ [بعيران] ، فَحَجَّ أَبُو وَلَدِهَا وَابْنُهَا عَلَى نَاضِحٍ ، وَتَرَكَ لَنَا نَاضِحًا نَنْضِحُ عَلَيْهِ [نسقي عليه] الأرض ، قَالَ : فَإِذَا جَاءَ رَمَضَانُ فَاعْتَمِرِي ، فَإِنَّ عُمْرَةً فِيهِ تَعْدِلُ حَجَّةً ) وفي رواية لمسلم : ( حجة معي (

బుఖారీ 1782, ముస్లిం 1256లోని ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే “రమజానులో ఉమ్రా పుణ్యం హజ్ చేయడంతో సమానం”

(*) అరబీ తెలిసినవారు ఈ క్రింది ఆధారాలు చూడవచ్చు.

[أبوداود 592] (وَأَمَرَهَا أَنْ تَؤُمَّ أَهْلَ دَارِهَا) ثَبَتَ مِنْ هَذَا الْحَدِيثِ أَنَّ إِمَامَةَ النِّسَاءِ وَجَمَاعَتَهُنَّ صَحِيحَةٌثَابِتَةٌ مِنْ أَمْرِ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَقَدْ أَمَّتِ النِّسَاءَ عَائِشَةُ رَضِيَ اللَّهُ عَنْهَا وَأُمُّ سَلَمَةَ رَضِيَ اللَّهُ عَنْهَا في الفرض والتروايح قَالَ الْحَافِظُ فِي تَلْخِيصِ الْحَبِيرِ حَدِيثُ عَائِشَةَ أَنَّهَا أَمَّتْ نِسَاءً فَقَامَتْ وَسَطَهُنَّ رَوَاهُ عَبْدُ الرَّزَّاقِ وَمِنْ طَرِيقِهِ الدَّارَقُطْنِيُّ وَالْبَيْهَقِيُّ مِنْ حَدِيثِ أَبِي حَازِمٍ عَنْ رَائِطَةَ الْحَنَفِيَّةَ عَنْ عَائِشَةَ أَنَّهَا أَمَّتْهُنَّ فَكَانَتْ بَيْنَهُنَّ فِي صَلَاةٍ مَكْتُوبَةٍ
وروى بن أبي شيبة ثم الحاكم من طريق بن أَبِي لَيْلَى عَنْ عَطَاءٍ عَنْ عَائِشَةَ أَنَّهَا كَانَتْ تَؤُمُّ النِّسَاءَ فَتَقُومُ مَعَهُنَّ فِي الصَّفِّ
وَحَدِيثُ أُمِّ سَلَمَةَ أَنَّهَا أَمَّتْ نِسَاءً فَقَامَتْ وسطهن
الشافعي وبن أبي شيبة وعبد الزراق ثلاثتهم عن بن عُيَيْنَةَ عَنْ عَمَّارِ الدُّهْنِيِّ عَنِ امْرَأَةٍ مِنْ قَوْمِهِ يُقَالُ لَهَا هُجَيْرَةَ عَنْ أُمِّ سَلَمَةَ أَنَّهَا أَمَّتْهُنَّ فَقَامَتْ وَسْطًا وَلَفْظِ عَبْدِ الرَّزَّاقِ أَمَّتُنَا أُمُّ سَلَمَةَ فِي صَلَاةِ الْعَصْرِ فَقَامَتْ بيننا وقال الحافظ في الدارية وَأَخْرَجَ مُحَمَّدُ بْنُ الْحَسَنِ مِنْ رِوَايَةِ إِبْرَاهِيمَ النَّخَعِيِّ عَنْ عَائِشَةَ أَنَّهَا كَانَتْ تَؤُمُّ النِّسَاءَ فِي شَهْرِ رَمَضَانَ فَتَقُومُ وَسْطًا
قُلْتُ وَظَهَرَ مِنْ هَذِهِ الْأَحَادِيثِ أَنَّ الْمَرْأَةَ إِذَا تَؤُمُّ النِّسَاءَ تَقُومُ وَسْطَهُنَّ مَعَهُنَّ وَلَا تَقَدَّمُهُنَّ
قَالَ فِي السُّبُلِ وَالْحَدِيثُ دَلِيلٌ عَلَى صِحَّةِ إِمَامَةِ الْمَرْأَةِ أَهْلَ دَارِهَا وَإِنْ كَانَ فِيهِمُ الرَّجُلُ فَإِنَّهُ كَانَ لَهَا مُؤَذِّنًا وَكَانَ شَيْخًا كَمَا فِي الرِّوَايَةِ وَالظَّاهِرُ أَنَّهَا كَانَتْ تَؤُمُّهُ وَغُلَامَهَا وَجَارِيَتَهَا وَذَهَبَ إِلَى صِحَّةِ ذَلِكَ أَبُو ثَوْرٍ وَالْمُزَنِيُّ وَالطَّبَرِيُّ وَخَالَفَ ذَلِكَ الْجَمَاهِيرُ
وَأَمَّا إِمَامَةُ الرَّجُلِ النِّسَاءَ فَقَطْ فَقَدْ رَوَى عَبْدُ اللَّهِ بْنُ أَحْمَدَ مِنْ حَدِيثِ أُبَيِّ بْنِ كَعْبٍ أَنَّهُ جَاءَ إِلَيْهِ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وسلم فقال يارسول اللَّهِ عَمِلْتُ اللَّيْلَةَ عَمَلًا
قَالَ مَا هُوَ قَالَ نِسْوَةٌ مَعِيَ فِي الدَّارِ قُلْنَ إِنَّكَ تقرؤ ولا نقرؤ فَصَلِّ بِنَا فَصَلَّيْتُ ثَمَانِيًا وَالْوِتْرَ فَسَكَتَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ فَرَأَيْنَا أَنَّ سُكُوتَهُ رِضًا قَالَ الْهَيْثَمِيُّ فِي إِسْنَادِهِ مَنْ لَمْ يُسَمَّ
قَالَ وَرَوَاهُ أَبُو يَعْلَى وَالطَّبَرَانِيُّ فِي الْأَوْسَطِ وَإِسْنَادُهُ حَسَنٌ
تجوزُ إمامةُ المرأةِ للنِّساءِ، وهو مذهبُ الجمهورِ: الحَنَفيَّة (1) ، والشافعيَّة (2) والحَنابِلَة (3) ، وهو قولُ طائفةٍ من السَّلف (4) ، وحُكِيَ الإجماعُ على ذلك . ((المحلى)) (3/137.
الأدلَّة:
أولًا: من السُّنَّة
عن أمِّ ورقةَ بنتِ نوفل رَضِيَ اللهُ عنها: ((أنَّ رسولَ الله صلَّى اللهُ عليه وسلَّم كان يَزورُها في بيتِها، وجعَل لها مؤذِّنًا يؤذِّنُ لها، وأمَرَها أن تؤمَّ أهلَ دارِها)) [أخرجه أبو داود (592)، وأحمد (27324)، وابن خزيمة (1676) بنحوه صحَّحه ابن القيِّم في ((إعلام الموقعين)) (2/274)، وحسَّنه الألباني في ((صحيح سنن أبي داود)) (592).]
ثانيًا: من الآثارِ
1- عن عائشةَ أمِّ المؤمنينَ: (أنَّها أمَّتِ النِّساءَ في صلاةِ المغربِ، فقامتْ وسْطهنَّ، وجهرتْ بالقراءةِ). [[4479] أخرجه ابن حزم في ((المحلى)) (4/219) صحَّح إسنادَه ابنُ الملقِّن في ((خلاصة البدر المنير)) (1/198(]
2- عن حُجَيرةَ بنتِ حُصَينٍ، قالت: (أمَّتْنا أمُّ سَلمةَ أمُّ المؤمنينَ في صلاةِ العصرِ، وقامتْ بَيننا). [[4480] أخرجه عبد الرزاق في ((المصنف)) (5082)، وابن سعد في ((الطبقات الكبرى)) (10966)، والدارقطني (1/405). صحَّح إسنادَه النوويُّ في ((المجموع)) (4/199)، وقال البُوصِيريُّ في ((إتحاف الخيرة المهرة)) (2/96): له شاهدٌ موقوف، وقال الألباني في ((تمام المنة)) (154): رجاله ثقات غير حُجيرة، لكن له ما يُقوِّيه.]

https://www.dorar.net/feqhia/1385


ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

రమదాన్  మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

రంజాన్ & స్త్రీలు – రమదాన్ మాసంలో స్త్రీలు అధికంగా పుణ్యాన్ని పొందడానికి ఎలాంటి కార్యాలు చేయవచ్చు [వీడియో & టెక్స్ట్]

రంజాన్ మరియు స్త్రీలు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=CqgK0zzv4x4 (60 నిముషాలు)

ఈ ప్రసంగంలో వక్త రమదాన్ మాసం యొక్క గొప్పతనాన్ని, ప్రత్యేకించి స్త్రీలకు సంబంధించిన నియమాలు మరియు వారు పొందగలిగే పుణ్యాల గురించి వివరించారు. రుతుస్రావం లేదా ప్రసవానంతర సమయాల్లో స్త్రీలు ఉపవాసం మరియు నమాజు చేయలేకపోయినా, వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, అల్లాహ్ వారికి ఇతర మార్గాల ద్వారా పుణ్యాలను ప్రసాదిస్తాడని తెలిపారు. రమదాన్‌లో స్త్రీలు పుణ్యాలు సంపాదించడానికి నాలుగు ప్రధాన మార్గాలను సూచించారు: 1. ఉపవాసం, 2. రాత్రి పూట నమాజు (తరావీహ్), 3. దానధర్మాలు చేయడం మరియు ఇఫ్తార్ ఏర్పాటు చేయడం, 4. ఖురాన్ పఠనం మరియు దైవస్మరణ (జిక్ర్). చివరగా, గృహిణులు వంటపనుల్లో ఉంటూనే దైవస్మరణ ద్వారా పుణ్యాలను ఎలా పొందవచ్చో వివరిస్తూ, రమదాన్ పవిత్రతను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

السلام عليكم ورحمة الله وبركاته
الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్. అమ్మా బాద్

మన ముస్లిం స్త్రీలు కూడా రమదాన్ మాసంలోని శుభాలను పొందడానికి ఏ మాత్రం వెనుక ఉండకూడదు. అందుకొరకే ‘రమదాన్ మరియు స్త్రీలు’ అనే ఈ ప్రత్యేక అంశంపై ఈ రోజు ఈ ప్రసంగం కొనసాగుతుంది.

నా గౌరవనీయులైన తల్లులారా, చెల్లెల్లారా! ఈనాటి సమాజంలో మన విలువైన సమయాన్ని వృధా చేసే అటువంటి ఎన్నో పరికరాలు, ఎన్నో విషయాలు మన ముందుకు వచ్చేసాయి. పొద్దంతా ఉపవాసం ఉన్నా, ఆ ఉపవాసం యొక్క పుణ్యం, దాని యొక్క సత్ఫలితం కోల్పోయే అటువంటి ఎన్నో పనులు, వద్దన్నా ఇళ్లల్లో మన స్త్రీలు చేస్తూ ఉంటారు.

అందుకని ఈ ప్రత్యేక అంశం ద్వారా స్త్రీలు అధికంగా రమదాన్ మాసంలో పుణ్యాన్ని పొందడానికి ఎలాంటి కార్యాలు చేయవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం. ఇంకా మరోవైపున మన కొందరు ముస్లిం స్త్రీలు ఉన్నారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒక విధివ్రాత ప్రకారంగా, ప్రతి నెల కొన్ని రోజులు వారు నమాజ్ లేకుండా, ఉపవాసం లేకుండా ఏదైతే ఒక అనారోగ్యంలో ఉంటారో, దీని మూలంగా కూడా కొందరు స్త్రీలు నిరాశ నిస్పృహలకు గురై, “ఇక పుణ్యాలు కూడబెట్టుకోవడానికి మాకు మార్గం లేదు కదా” అని భావిస్తారు. కానీ అలాంటి అనారోగ్య స్థితిలో ఎలాంటి పుణ్యాలు చేయవచ్చు అనే విషయాన్ని మర్చిపోయి లేదా తెలుసుకోకుండా ఉంటారు. ఆ విషయాలు కూడా మనం ఇన్ షా అల్లాహ్ ఈనాటి ఈ ప్రసంగంలో తెలుసుకుందాం.

అయితే క్లుప్తంగా ముందు మనం రమదాన్ శుభాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రతి ఒక్క దానికి సహీహ్ హదీథుల ద్వారా ఆధారం ఉంది, ఖురాన్ ఆయత్ లు కూడా ఉన్నాయి. కానీ సమయం మనకు సరిపోదు గనక, నేను ఆ ఆధారాల వివరాలు మీ ముందు ఉంచకుండా, కేవలం ఆ ఘనతలను, ఆ శుభాలను ప్రస్తావిస్తాను.

రమదాన్ మాసం సర్వ మానవాళి దర్శకత్వం కొరకు పంపబడినటువంటి దివ్య గ్రంథం ఖురాన్ అవతరించిన మాసం (సూరా బఖరాలో ఈ ప్రస్తావన ఉంది). మరియు రమదాన్ మాసం ప్రవేశించింది అంటే స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి, నరకపు ద్వారాలు మూయబడతాయి మరియు ధూత్కరింపబడిన షైతాన్ లను బంధించడం జరుగుతుంది. ఇంకా ఈ మాసంలో ఒక రాత్రి ఉంది, అదే రాత్రి ఖురాన్ అవతరించిన రాత్రి. ఆ రాత్రి దాని యొక్క ఘనత ఎంత గొప్పగా ఉందంటే, వెయ్యి నెలలు ఒక వ్యక్తి అల్లాహ్ ఆరాధనలో గడిపాడంటే ఎంత పుణ్యం పొందుతాడో, అంతకంటే ఎక్కువ పుణ్యం కేవలం ఆ రాత్రి ఆరాధన చేసే వ్యక్తికి లభిస్తుంది.

ఇంకా ఇదే సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి ఒక చాలా శోచనీయమైన విషయం, బాధాకరమైన విషయం ఏమిటంటే, ఎవరైతే ఆ శుభప్రదమైన, ఘనమైన రాత్రి యొక్క మేలును కోల్పోతాడో, అలాంటి వ్యక్తి చాలా దురదృష్టవంతుడు. గమనించండి, స్త్రీలు కూడా రమదాన్ మాసంలో వచ్చే ఆ రాత్రిని పొందడానికి ఎంతో ప్రయత్నం చేయాలి.

ఇంకా రమదాన్ మాసంకు ఎన్నో ఘనతలు ఉన్నాయి. వాటిలో ఒక ముఖ్యమైనది ఏమిటంటే, రమదాన్ ప్రతి రాత్రి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అనేకమంది నరకవాసులను నరకం నుండి విముక్తి కలిగిస్తాడు. అల్లాహు అక్బర్! అల్లాహ్ మనల్ని కూడా అలాంటి పుణ్యాత్ములలో చేర్చుగాక. ఎవరైతే నరకం నుండి విముక్తి పొందుతారో. ఇంకా రమదాన్ లోని ప్రతి రోజు, గమనించండి, ప్రతి రోజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వాసుల ఏదైనా ఒక్క దుఆను తప్పకుండా స్వీకరిస్తాడు. అల్లాహు అక్బర్. ప్రతి రోజు.

అందుకని చెప్పుకుంటూ పోతే ఇంకా లాభాలు ఎన్నో ఉన్నాయి. అవి మా యొక్క వేరే వీడియోస్ లో కూడా మీరు మా ఛానల్ లో చూడవచ్చు ఇన్ షా అల్లాహ్. కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పే ఉద్దేశం, స్త్రీలు ఇలాంటి లాభాలు పొందడానికి ఏమాత్రం వెనుక ఉండకూడదు. రమదాన్ ఎంత శుభప్రదమైన మాసం!

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, మదీనాలో ఒక స్త్రీని చూశారు. అడిగారు “ఏమిటమ్మా, నీవు మాతో హజ్ చేయడానికి రాలేదా?”. ఆ స్త్రీ చెప్పింది, “ప్రవక్త, అంత దూరం ప్రయాణం రావడానికి మాకు ఎలాంటి వాహన సౌకర్యం లేకుండినది. ఒక ఒంటె ఉండగా మా భర్త దానిపై హజ్ చేయడానికి వెళ్లారు”. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకంగా ఆ స్త్రీకి, ఆమె ద్వారా ఇంకా ముస్లింలందరికీ, పురుషులకు స్త్రీలకు ఒక గొప్ప శుభవార్త ఇచ్చారు. అదేమిటి? “రమదాన్ వచ్చిందంటే, రమదాన్ లో నీవు ఉమ్రా చేసుకో. రమదాన్ లో చేసే ఉమ్రా ద్వారా నీవు హజ్ చేసినంత పుణ్యం పొందుతావు”. మరొక ఉల్లేఖనంలో ఉంది “నాతో హజ్ చేసినంత పుణ్యం పొందుతావు”. అల్లాహు అక్బర్.

నేను ఈ శుభాలను ఏవైతే క్లుప్తంగా ప్రస్తావించానో, వాటిలోని ప్రతి ఒక్క శుభాన్ని ప్రతి ముస్లిం స్త్రీ పొందడానికి ప్రయత్నించాలి. కనీసం కోరిక, కాంక్ష మనసులో పుట్టించుకొని, దానిని పొందడానికి ఏ ప్రయత్నం, ఏ ప్రయాస చేయాలో అది చేస్తూ ఉండాలి.

ఇక ‘రమదాన్ మరియు స్త్రీలు’. ఈ అంశాన్ని ఏదైతే ఈరోజు నేను మీ ముందు ప్రస్తావిస్తున్నానో, దానికి గాను ఒక మరో విషయాన్ని మీరు క్లుప్తంగా తెలుసుకున్నారు అంటే, ‘రమదాన్ మరియు స్త్రీలు’ ఈ అంశం యొక్క ప్రాముఖ్యత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజుల్లో స్త్రీల దినోత్సవం అని, తల్లుల దినోత్సవం అని, ఇంకా ఇలాంటి ఎన్నో దినోత్సవాలు జరుపుకుంటున్నారు. కానీ ఎప్పుడైనా మీరు గ్రహించారా? ఈ దినోత్సవాలు జరుపుకున్న ఆ ఒక్క దినం, ఆ ఒక్క రోజు వారి హక్కుల గురించి పోరాడడానికి ఎలాంటి ప్రసంగాలు, ఎలాంటి వ్యాసాలు, ఎలాంటి మాటలు మనం వింటూ ఉంటాము, చదువుతూ ఉంటాము. కానీ ఆ ఒక్క రోజు గడిచిపోయిన తర్వాత మళ్లీ ఆ స్త్రీల హక్కులను స్వయంగా వారే ఎలా కాలరాస్తున్నారు, స్త్రీల హక్కుల విషయంలో ఎంత కొరతకు వారు గురవుతున్నారు.

అయినా ఈ దినోత్సవాలు మొన్నమొన్నటి విషయం కదా. కానీ 1400 సంవత్సరాల క్రితమే మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్, సర్వ మానవాళికి కారుణ్య మూర్తిగా పంపబడినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా, మనందరి కొరకు, సర్వ మానవాళి కొరకు ఏ శాంతియుత ధర్మం ఇస్లాం ప్రసాదించాడో, అందులో ఆ మొదటి రోజు నుండే పురుషుల హక్కుల మాదిరిగా స్త్రీల హక్కులను కూడా ప్రస్తావించడం జరిగింది. అంతెందుకు, ఇస్లాం ఏ రోజు స్త్రీ పుట్టిందో ఈ లోకంలో, ఆ రోజు నుండే ఆమెకు హక్కు ఇవ్వడం జరిగింది. ఆమె యొక్క హక్కును ఆమె పొందడానికి ఏమాత్రం వెనుక ఉండకూడదు అని కూడా ప్రోత్సహించడం జరిగింది.

అందుకొరకే ఇస్లాంకు సంబంధించిన ఎన్నో ఆదేశాలు, స్వర్గంలో చేరడానికి ఎన్నో సత్కార్యాల ప్రస్తావన వచ్చినప్పుడు పురుషులతో పాటు స్త్రీల ప్రస్తావన కూడా వస్తుంది. అందుగురించే ఖురాన్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంత స్పష్టంగా తెలిపాడో గమనించండి:

مَنْ عَمِلَ صَالِحًا مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌ
“ఎవరు సత్కార్యాలు చేస్తారో – వారు పురుషులైనా సరే, స్త్రీలైనా సరే – వారు విశ్వాసులై ఉంటే…” (16:97)

ముఖ్యమైన షరతు ఏమిటంటే ముందు నుండే అతను విశ్వాసి అయి ఉండాలి. ఎవరైతే విశ్వాసులై సత్కార్యాలు చేస్తారో, వారు పురుషులైనా, స్త్రీలైనా వారికి అల్లాహ్ వద్ద స్వర్గంలో ఎన్నో గొప్ప వరాలు ఉన్నాయి. వారు చేసే ప్రతి సత్కార్యానికి గొప్ప సత్ఫలితం ఉంది అని ఖురాన్ లో ఒకచోట కాదు ఎన్నో సందర్భాలలో ఈ శుభవార్త ఇవ్వడం జరిగింది.

అందుకొరకు ముస్లిం స్త్రీలు ఈరోజు స్వయంగా ఇస్లాం ప్రకారం తమ జీవితం గడిపి, ఇతరులకు ఇస్లాం యొక్క గొప్పతనాన్ని తమ ఆచరణ ద్వారా చాటి చెప్పే అటువంటి ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ కూడా తమకు తాము కుంగిపోయినట్లుగా, ఏదో ఇస్లాం లో ఉన్నందుకు, ముస్లిం గా జీవిస్తున్నందుకు వెనుకబడి ఉన్నాము అన్నటువంటి న్యూనతా భావంలో ఉండకూడదు.

రమదాన్ మాసం వస్తుంది. ఈ సందర్భంలో ముస్లిం స్త్రీ అల్లాహ్ వద్ద తన స్థానాన్ని పెంచుకోవడానికి, స్వర్గంలో ఆమె యొక్క స్థానాలు ఉన్నతంగా కావడానికి మరియు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉపవాసం ఉన్నవారికి స్వర్గపు ఎనిమిది ద్వారాల్లో ఒక ద్వారం ప్రత్యేకంగా ఏదైతే ‘రయ్యాన్’ అని పేరు పెట్టి, కేవలం ఉపవాసం ఉన్నవారినే దాని నుండి ప్రవేశించడం జరుగుతుంది అని శుభవార్త ఇచ్చాడో, ఆ ద్వారం నుండి స్వయంగా మీరు కూడా ప్రవేశించే ప్రయత్నం చేయాలి. అవును.

అందుకొరకే మనం ఇస్లాం లోని తొలి కాలంలో ఉన్నటువంటి స్త్రీలను చూస్తే, అల్లాహు అక్బర్! కాలం ఎండాకాలం అయినా, చలికాలం అయినా, అన్ని స్థితుల్లో, అన్ని కాలాల్లో ఫర్జ్ ఉపవాసాలే కాదు, నఫిల్ ఉపవాసాలు కూడా వారు పాటిస్తూ ఉండేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా గాని, జైనబ్ రజియల్లాహు అన్హా గాని, ఇంకా వేరే ఎందరో సహాబియాత్, ముస్లిం స్త్రీలు ఆనాటి కాలంలో. వాటి ప్రస్తావనలోకి వెళితే ఇంకా చాలా సమయం మనకు అవసరం ఉంటుంది. కానీ రండి, రమదాన్ మాసంలో మన స్త్రీలు ఎలా పుణ్యాలు పొందవచ్చు?

మొట్టమొదటి విషయం, వారు ఈ మాసంలో ఉపవాసం ఉండి పుణ్యాన్ని పొందవచ్చు. కానీ అనేక మంది స్త్రీల ద్వారా వచ్చే ప్రశ్న ఏమిటంటే – స్త్రీలకు ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఉపవాసం ఉండలేరు. ప్రతి నెలలో మూడు రోజులు, ఐదు రోజులు, ఏడు రోజులు బహిష్టు కాలం, అందులో ఉపవాసం ఉండలేరు. మరియు గర్భ స్థితిలో, గర్భం దాల్చి ఉన్నప్పుడు ఉపవాసం ఉండలేరు. అలాగే చిన్న పాపకు పాలు త్రాగిస్తున్న సందర్భంలో ఉండడం కష్టంగా ఉంటుంది కావచ్చు. ఇలాంటి ప్రశ్నలు వారి ముందుకు వస్తాయి. అయితే ఇక వారు ఉపవాసం ఉండడానికి ఏ అవకాశం లేదా? అలా కాదు సోదరులారా. అల్లాహు అక్బర్! ముందు గొప్ప శుభవార్త మీరు వినండి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

ఎవరైతే ఒక ముస్లిం (పురుషుడైనా, స్త్రీ అయినా) ప్రయాణానికి వెళ్ళినప్పుడు లేదా అనారోగ్యానికి గురైనప్పుడు, అతడు కొన్ని సత్కార్యాలు ఏవైతే తన స్వగ్రామంలో ఉన్నప్పుడు లేదా ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేస్తూ ఉండేవాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాటికి బదులుగా ఆ ప్రయాణంలో, అనారోగ్యంలో ఉన్నప్పుడు చేయనందుకు కూడా అల్లాహ్ అతనికి పూర్తి పుణ్యం ప్రసాదిస్తాడు.”

ఉదాహరణకు ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు రమదాన్ లో ప్రతి రోజు ఉపవాసం ఉంది. కానీ మధ్యలో బహిష్టు కాలం అడ్డు వచ్చింది. ఆమె ఉపవాసం ఉండలేదు. ఐదు రోజులు, ఆరు రోజులు, ఏడు రోజులు గడిచిపోయాయి. కానీ ఆమె మనసులో ఏముండాలి – “నేను పరిశుద్ధంగా ఉంటే ఉపవాసం ఉండే దానిని కదా, అల్లాహ్ ఆజ్ఞ వచ్చింది, అల్లాహ్ యొక్క విధి ప్రకారంగా నాకు ఆటంకం ఏర్పడింది, అందుకే నేను ఉపవాసం ఉండడం లేదు”. ఈ సంకల్పం ఆమె మనసులో ఉంటే, ఆ వదిలేసిన ఉపవాసాల పుణ్యం అల్లాహ్ ఆమెకు ప్రసాదిస్తూ ఉంటాడు. ఇన్ షా అల్లాహ్. ఎంత గొప్ప శుభవార్త గమనించండి.

ఇంకా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన శుభవార్తల్లో మరొకటి మీరు గమనించండి. ఇప్పుడు నేను చెప్పబోయే హదీథ్ నమాజ్ గురించి ఉంది, కానీ దానిని మనం ఇతర సత్కార్యాల గురించి కూడా తీసుకోవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఒక వ్యక్తి రాత్రి తహజ్జుద్ చేయాలన్న ఉద్దేశంతో దృఢంగా సంకల్పించుకొని పడుకున్నాడు. రాత్రి నేను లేచి తహజ్జుద్ చదువుతానని నిశ్చయించుకున్నాడు. దానికి తగిన సాధనాలను కూడా ఏర్పరచుకున్నాడు (అలారం పెట్టుకోవడం గాని ఇంకా వేరే ఏదైనా అవసరం). కానీ గాఢ నిద్రలోకి లోనై అతడు మేల్కోలేకపోతే, అల్లాహు అక్బర్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అతడు నిశ్చయించుకున్న దాని ప్రకారం అల్లాహ్ అతనికి సంపూర్ణమైన ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ఇంకా ఆ నిద్ర అతనికి అతని ప్రభువు వైపు నుండి ఒక దానంగా, ఒక సదకాగా పరిగణించబడుతుంది.” అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ ఎంత గొప్పదో గమనిస్తున్నారా?

అందుగురించి నా ముస్లిం అక్కాచెల్లెల్లారా, మీరు రమదాన్ రాకముందే, “నేను అల్లాహ్ యొక్క దయతో ఈ రమదాన్ లో ఉపవాసాలు పాటిస్తాను, నేను గర్భంతో ఉన్నా గాని, నా సంకలో నా ఒడిలో పాప ఉండి పాలు త్రాగినప్పటికీ గాని, అల్లాహ్ నాకు శక్తి ప్రసాదించే వాడు ఉన్నాడు, అతని ఆజ్ఞను నేను పూర్తి చేస్తాను” అన్నటువంటి దృఢ సంకల్పం చేసుకొని ఉండండి. ఇక బహిష్టు రోజుల్లో, రక్తం స్రవించే ఆ రోజుల్లో, అది బహిష్టు వల్ల గాని లేదా ప్రసవం వల్ల గాని, ఆ స్థితిలో ఉపవాసం ఉండరాదు. యోగ్యం లేదు. ఎన్ని రోజులు ఉపవాసం వదులుకుంటారో, అన్ని రోజులు తర్వాత పూర్తి చేసుకోవాలి.

కానీ ఇక మిగతా రెండు విషయాలు ఏవైతే మనం చెప్పుకున్నామో – గర్భస్థితి మరియు పాలు త్రాగించడం – చూసుకోండి. పుష్టికర ఆహారం భుజించి, డాక్టర్ల యొక్క సలహాతో మంచి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకొని ప్రయత్నం చేయండి. రాత్రంతా సమయం ఉంది తినడానికి, మంచిగా తిని, సహేరీ భుజించి, ఇఫ్తార్ లో కూడా మంచిగా తిని, పద్దంతా ఉపవాసం ఉండే ప్రయత్నం చేసేదుంటే, అల్హమ్దులిల్లాహ్ రమదాన్ యొక్క శుభ రమదాన్ యొక్క శుభాలను, ఘనతలను పొందడానికి ఒక మంచి అవకాశం.

అలాగే ఈ సందర్భంలో ఎవరైతే కొన్ని రోగాలకు గురైన వారు ఉపవాసం ఉండే అవసరం లేదు అని ఖురాన్ ఆయతే ఉంది కదా అని, చిన్నపాటి రోగాలకు కూడా భయపడి వాటిని ఒక సాకుగా చేసుకొని, ఉపవాసం లాంటి గొప్ప సత్కార్యాన్ని, ఆరాధనను వదులుకోవడం ఇది మంచి విషయం కాదు. ఖురాన్ ఆయత్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీథుల్లో మనకు ఈ అవకాశం ఏదైతే ఇవ్వబడిందో, దానిని ఉలమాలు రెండు రకాలుగా విభజించి, విడమరచి చెప్పారు. దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

ఎవరైతే ప్రయాణంలో ఉండి లేదా అనారోగ్యంతో ఉండి ఉపవాసం ఉండలేకపోతారో, వారి యొక్క పరిస్థితి రెండు రకాలుగా ఉండవచ్చు. ఒకటి – ఆ స్థితిలో ఉపవాసం ఉండడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ నష్టం ఏమీ ఉండదు. అలాంటప్పుడు వారు ఉపవాసం ఉంటే మంచిది. కానీ ఎవరికైతే ఉపవాసం వల్ల నష్టం చేకూరుతుందో, అలాంటి వారు ఉపవాసం ఉండడం యోగ్యం లేదు.

ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణంలో ఉన్నారు. ఆ ప్రయాణం కూడా ఎలాంటి ప్రయాణం? మక్కాను జయించడానికి మక్కా వైపు వెళుతున్నారు. మదీనా నుండి సుమారు ఒక 60 కిలోమీటర్లు దాటారు. అక్కడ అసర్ నమాజ్ కూడా అయిపోయింది. ఆ తర్వాత కొందరి గురించి వార్త అందింది, వారు రమదాన్ మాసంలో ఉపవాసంతో ఉండి సొమ్మసిల్లిపోతున్నారు, స్పృహ తప్పిపోతున్నారు, చాలా బాధగా వారికి ఏర్పడుతుంది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నీళ్ల పాత్రను తెప్పించారు, ఇలా పైకి ఎత్తారు, త్రాగారు, అందరికీ కనబడే విధంగా. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసర్ నమాజ్ అయిన తర్వాత కూడా ఉపవాసాన్ని విరమించారు. ప్రయాణంలో ఉన్నారు గనక, వేరే సహచరులకు ఇబ్బంది కలగకుండా, వారి ఆరోగ్యం చెడిపోకుండా, వారికి ఏ నష్టం వాటిల్లకుండా ఉండడానికి. ఆ తర్వాత కొంత సేపటికి ప్రవక్తకు తెలిసింది కొందరు ఇంకా ఉపవాసంలోనే ఉన్నారు అని. అప్పుడు ప్రవక్త చెప్పారు “ఉలాయిక హుముల్ ఉసాత్” (వారే అవిధేయులు).

మరొక ఉల్లేఖనంలో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరో సందర్భంలో, ఇలాంటి మాట వచ్చింది, ఒక వ్యక్తి ప్రయాణంలో ఉన్నాడు, ఉపవాసం ఉండి స్పృహ తప్పిపోయాడు. కొందరు అతనికి పైన నీడ చేసి, ఒక ఛత్రీ మాదిరిగా ఏర్పాటు చేసి, గొడుగు మాదిరిగా ఏర్పాటు చేసి అతనికి నీడ చేసి, అతనికి స్పృహ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంలో ప్రవక్త చెప్పారు: “లైస మినల్ బిర్రి అస్సియాము ఫిస్సఫర్” (ప్రయాణంలో ఉపవాసం ఉండడం, ఇంత నష్టాన్ని ఇంత కష్టాన్ని భరించి ఇది పుణ్యం అని అనుకుంటున్నారా మీరు?). గమనించండి. ఇస్లాం మనకు కష్టంలో పడవేయదలుచుకోలేదు, మనల్ని నష్టంలో పడవేయదలుచుకోలేదు. అందుకే ఖురాన్ లో సూర్టె బఖరాలో, ఆయత్ నెంబర్ 185లో అల్లాహ్ ఎంత స్పష్టంగా చెప్పాడంటే:

يُرِيدُ اللَّهُ بِكُمُ الْيُسْرَ وَلَا يُرِيدُ بِكُمُ الْعُسْرَ
[యురీదుల్లాహు బికుముల్ యుస్ర వలా యురీదు బికుముల్ ఉస్ర]
“అల్లాహ్ మీ పట్ల సౌలభ్యాన్ని కోరుతున్నాడు, కఠినత్వాన్ని కోరడం లేదు.” (2:185)

కాబట్టి అల్లాహ్ ఇచ్చిన ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలి. అనవసరంగా కష్టం మీద వేసుకొని ఏదైనా నష్టంలో పడవేయాలి, పడిపోవాలి – ఇది అల్లాహ్ యొక్క ఇష్టం ఎంత మాత్రం కాదు.

అయితే ఇక్కడ చెప్పే విషయం ఏమిటి, ఇవన్నీ ఆధారాలు, ఇవన్నీ ఖురాన్ హదీథ్ యొక్క కొన్ని నిదర్శనాలు చూపించి, ఎప్పుడైతే మనకు ఉపవాసం నష్టంగా ఏర్పడుతుందో, అప్పుడు మనం ఉపవాసం మానుకోవచ్చు. నష్టం అంటే ఇక్కడ పాలు త్రాగించే తల్లి గాని, గర్భంతో ఉన్న స్త్రీ గాని, లేదా ఇంకా వేరే ఏదైనా అనారోగ్యంలో ఉన్నవారు, అలాగే ప్రయాణంలో ఉన్నవారు. కానీ ఎవరైతే బహిష్టులో ఉంటారో, లేదా ప్రసవం వల్ల వారు వారి యొక్క ఈ స్థితిలో ఉంటారో, వారిపై ఉపవాసం ఉండడం నిషిద్ధం.

అయితే ఈ ఉపవాసం యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది గనక, కొంత సమయం తీసుకొని దీని గురించి కొన్ని వివరాలు మీ ముందు చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఆ ఘనతలు ఏమిటో ఒక్కసారి వింటారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో హదీథుల్లో వాటి ఘనతలను స్పష్టంగా తెలిపారు.

ఉదాహరణకు మొట్టమొదటి ఘనత మీరు గమనించండి. అన్ని ఘనతల్లో ఈ ఒక్క ఘనతనే మనకు సరిపోయేది. ఎలా? హదీథ్ లో చాలా స్పష్టంగా ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ప్రతి సత్కార్యానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒకటి నుండి పది, పది నుండి 700 వరకు ఎక్కువ రెట్లు పుణ్యాలు ప్రసాదిస్తారు. కానీ అల్లాహ్ ఏమంటున్నాడు:

إِلَّا الصَّوْمَ فَإِنَّهُ لِي وَأَنَا أَجْزِي بِهِ
[ఇల్లస్ సౌమ ఫ ఇన్నహు లీ వ అన అజ్ జీ బిహి]
“కానీ ఉపవాసం, ఇది దాసుడు నా కొరకు ఉపవాసం ఉంటాడు గనక, నేను మాత్రమే దానికి ప్రతిఫలం ప్రసాదిస్తాను.”

గమనించండి. ప్రతి ఒక్క సత్కార్యానికి ఒక లిమిట్, ఒక పరిమాణంలో పుణ్యం తెలుపబడింది, ఒకటి నుండి పది, పది నుండి 700 వరకు అని. కానీ ఉపవాసం యొక్క ఫలితం ఏ పరిమితి లేకుండా అల్లాహు అక్బర్! అందుకే కొందరు పండితులు ఏమంటున్నారు, ఈ ఉపవాసం యొక్క పుణ్యం ఎలాంటిదంటే, దీనిని తూకం చేయడానికి ఏ త్రాసు సరిపోదు, దీనిని లెక్కించడానికి ఏ క్యాలిక్యులేటర్ సరిపోదు. ఎందుకు? అల్లాహ్ తాలా స్వయంగా తాను దీని యొక్క ఫలితం ప్రసాదిస్తాను అని అంటున్నాడు. ఇంతకంటే గొప్ప ఇంకేం చెప్పండి! ఇలాంటి గొప్ప పుణ్యాన్ని మనం వదులుకుందామా?

ఇంకా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఎవరైతే విశ్వాసంతో మరియు పుణ్యాన్ని ఆశించి రమదాన్ ఉపవాసాలు పాటిస్తారో, అల్లాహ్ అతని యొక్క వెనుక పాపాలన్నీ మన్నించేస్తాడు.” మరియు “ఎవరైతే ఒక్క రోజు ఉపవాసం ఉంటారో అల్లాహ్ యొక్క మార్గంలో, అల్లాహ్ 70 సంవత్సరాల వరకు నరకాగ్ని నుండి వారి యొక్క ముఖాన్ని దూరం ఉంచుతాడు.” అల్లాహు అక్బర్.

ఉపవాసం ఇది ఎంతో గొప్ప ఘనత గల సత్కార్యం. అంటే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు: “దాసుడు కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకు ఓపిక సహనాలు వహించి ఉపవాసం ఉంటాడు గనక, ఈ ఓపిక సహనాలు ఎలాంటి విషయాలో, ఇంతకుముందు చెప్పిన హదీథ్ లోనే ఆ ప్రస్తావన వచ్చింది. అతడు భోజనాన్ని వదిలేస్తాడు, అతడు అన్ని రకాల త్రాగే పదార్థాలను వదిలేస్తాడు, అతడు తన కోరికలు కూడా అల్లాహ్ సంతృప్తి కొరకు వదిలేసుకుంటాడు. ఈ మూడు మాత్రమే సరిపోవు. వేరే హదీథుల ద్వారా మనకు తెలుస్తుంది, మన కళ్ళు ఉపవాసం ఉండాలి, మన చెవులు ఉపవాసం ఉండాలి, మన నోరు ఉపవాసం ఉండాలి, మన చేతులు ఉపవాసం ఉండాలి, మన కాళ్ళు ఉపవాసం ఉండాలి. ఎలా? అన్ని రకాల చెడుల నుండి వీటిని మనం దూరం ఉంచాలి. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు:

“మీలో ఎవరైనా ఉపవాసం ఉన్నారు అంటే, దూషణలకు, తిట్లకు దిగకూడదు. ఒకరితో కొట్లాడకూడదు, జగడాలు చేయకూడదు. ఇంకా ఎవరితో కూడా ఎలాంటి వృధా కార్యకలాపాలు చేయకుండా, నోరు పారేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.”

ఇలా ఉన్నవారికి, ఇందులో చాలా ఎక్కువగా ఓపిక సహనాలు అవసరం ఉంటాయి గనక, అల్లాహ్ ఖురాన్ లో శుభవార్త ఇచ్చాడు:

إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُم بِغَيْرِ حِسَابٍ
[ఇన్నమా యువఫ్ ఫస్ సాబిరూన అజ్రహుమ్ బిగైరి హిసాబ్]
“నిశ్చయంగా ఓపిక సహనాలు వహించే వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా లెక్క లేకుండా ఫలితాలు ప్రసాదిస్తాడు.” (39:10)

అందుకొరకు సోదర సోదరీమణులారా, ఈ రమదాన్ మాసం వస్తుంది అంటే, సాధ్యమైనంత వరకు మీ ప్రత్యేక రెండు స్థితులు (బహిష్టు స్థితి మరియు ప్రసవం తర్వాత), ఈ రెండు కారణాలు తప్ప వేరే ఏ చిన్న అవస్థ ఉన్నా గాని, సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి.

ఇక రెండవ విషయం, దేని ద్వారా అయితే మన స్త్రీలు ఎక్కువగా పుణ్యాలు సంపాదించుకోవచ్చో ఈ రమదాన్ మాసంలో, అది తరావీహ్ నమాజ్. అవును. తరావీహ్ నమాజ్ యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “ఎవరైతే రమదాన్ మాసంలో విశ్వాసంతో మరియు పుణ్యాన్ని ఆశించి తరావీహ్ నమాజ్ చేస్తూ ఉంటారో ప్రతి రోజు, వారి యొక్క వెనుకటి పాపాలన్నీ కూడా మన్నించబడతాయి.” అల్లాహు అక్బర్. మరియు అదే తరావీహ్ నమాజ్ ఒంటరిగా చేసుకోకుండా జమాత్ తో చేసేదుంటే, మస్జిద్ లలో స్త్రీలు పోయే అటువంటి పరిస్థితి ఏర్పాటు చేసి, అక్కడ వారి కొరకు ఒక ప్రత్యేక చోటును ఏర్పాటు చేసి ఉండేదుంటే, అక్కడికి వెళ్లి జమాత్ తో చేసుకోవడం ద్వారా “ఎవరైతే ఇమామ్ తో తరావీహ్ నమాజ్ చేస్తారో, ఇమామ్ తో పాటు చివరి వరకు ఉంటారో, వారికి రాత్రంతా తహజ్జుద్ చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది.” అల్లాహు అక్బర్! ఎంత గొప్ప ఘనత గమనించండి.

ఇంకా ఈ ‘ఖియాముల్లైల్’ ఈ తహజ్జుద్ యొక్క ఘనత గురించి మా యూట్యూబ్ ఛానల్ లో ఒక రెండు చిన్న వీడియో క్లిప్స్ ఉన్నాయి, వినండి, మీకు దీని ఘనత ప్రత్యేకంగా తెలుస్తుంది.

ఇంకా మన స్త్రీలు ఈ రమదాన్ మాసంలో పుణ్యాలు పొందడానికి ఒక గొప్ప అవకాశం – దానధర్మాలు చేయడం. అవును. ఈ రమదాన్ మాసం దానధర్మాలు చేసే మాసం. ఇతర రోజుల కన్నా ఈ రోజుల్లో దాని యొక్క పుణ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎలా? సహీహ్ బుఖారీలో వచ్చి ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇతర రోజుల కంటే ఈ రమదాన్ మాసంలో ఎక్కువగా దానధర్మాలు చేస్తూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇతర రోజుల కంటే ఈ రోజుల్లో ఎక్కువగా దానధర్మాలు చేశారు అంటే, మనం కూడా అలాగే చేస్తూ ఉండేదుంటే రెండు రకాల పుణ్యాలు మనకు లభిస్తాయి. ఒకటి, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించినటువంటి పుణ్యం మరియు ఎక్కువగా దానధర్మాలు చేస్తూ ఉండే అటువంటి పుణ్యం.

ఇంకా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరో హదీథ్ ద్వారా నాలుగో రకమైన కార్యం, దేని ద్వారా అయితే మన స్త్రీలు ఎక్కువ పుణ్యాన్ని రమదాన్ లో సంపాదించుకోవచ్చో, అది ఉపవాసం ఉన్నవారి గురించి ఇఫ్తార్ యొక్క ఏర్పాటు చేయడం. ఇఫ్తార్ యొక్క ఏర్పాటు చేయడం మన శక్తి సామర్థ్యాలలో ఉన్నంత మాత్రమే.

ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అడిగారు: “ఓ ప్రవక్త, మా దగ్గర అంత శక్తి లేదు కదా, మా దగ్గర అంత డబ్బు ధనం లేదు కదా, మేము ఒక ఉపవాసం ఉన్న వ్యక్తికి కడుపునిండా భోజనం పెట్టడానికి”. అప్పుడు ఏం సమాధానం వచ్చింది?

“మీరు ఒక ఉపవాసం ఉన్న వ్యక్తికి ఒక ఖర్జూరపు ముక్క ద్వారా, లేదా ఒక గుక్కెడు నీళ్ళ ద్వారా, లేదా ఒక పాల చుక్క ద్వారా ఇఫ్తార్ చేసే అటువంటి సౌకర్యం కల్పించారంటే, మీకు కూడా ఉపవాసం ఉన్న వ్యక్తికి లభించినంత పుణ్యం లభిస్తుంది.”

గమనించండి. రమదాన్ మాసం వచ్చిందంటే ఇంకొక విషయం గమనించండి. ఇంటి వారి గురించి ఇఫ్తార్ సమయంలో ఇఫ్తార్ చేసిన తర్వాత భోజనాలు తయారు చేయడానికి, కొన్ని గంటల ముందు నుండే మన వంటశాలలో ఉంటాము. అయితే వారు ఒకవేళ ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ, “ఇఫ్తార్ గురించి తయారు చేయబడే ఈ వంటలో నా యొక్క కొంచెం వంతు ఉండాలి, నాకు కూడా పుణ్యం దొరకాలి” అన్నటువంటి కాంక్ష ఉండేదుంటే, పరిస్థితి అక్కడ ఎంత మంచిగా మారిపోతుందో గమనించండి మీరు.

అరే ఇంట్లో ఉన్నవారు, తండ్రి గాని, తల్లి గాని, కొడుకు గాని, అన్న గాని, తమ్ముడు గాని, వదిన గాని, ఆడబిడ్డ గాని, ఇంకా సహేరీలో భోజనం చేస్తారు కదా! దాని యొక్క పుణ్యం నాకు కూడా దొరకాలి అన్నటువంటి సద్భావన ఉండేదుంటే, పని చేయడంలో ఎంత ప్రేమ ఏర్పడుతుంది? పుణ్యాన్ని కూడా ఎంత మంచిగా మనం పొందుతాము? ఇలాంటి విషయాల గురించి కొంచెం మన మేధను ఉపయోగించి, గొడవలను తగ్గించుకొని, ప్రేమలను పెంచుకునే అటువంటి ప్రయత్నం మనం చేయాలి.

ఇంకా మరొక గొప్ప విషయం, ముఖ్య విషయం. ప్రత్యేక రోజుల్లో ఉన్న స్త్రీలు గాని, ఇంకా వేరే ఎవరైనా గాని “అయ్యో పుణ్యాలు సంపాదించుకోవడానికి మాకు ఈ మా విధివ్రాత అడ్డం వచ్చింది కదా” అని భావించకూడదు. పుణ్యం సంపాదించుకోవాలి అని కోరేవారికి ఒక్క మార్గం ఎక్కడైనా మూయబడి ఉంటే, పది మార్గాలు, వంద మార్గాలు మరో వైపున తెరిచి ఉంటాయి.

మీరు పరస్పరం ఎక్కడైతే జీవిస్తున్నారో, మీ ఇళ్ళ పక్కన, మీ పొరుగు వారిలో, మీ వాడకట్టులో ఎవరైనా బీదవారు ఉండవచ్చు, ఎవరైనా పేదవారు ఉండవచ్చు. భర్త చనిపోయిన ఏదైనా విధవ స్త్రీ ఉండవచ్చు, విడాకులు పొందిన ఎవరైనా ఉండవచ్చు. లేదా ఏదైనా ముసలితనంలో వారికి సహాయం చేయలేని అటువంటి ఎవరైనా పెద్దవాళ్ళు ఉండవచ్చు.

అల్లాహు అక్బర్! రమదాన్ మాసంలో గాని, వేరే రోజుల్లో గాని మనం ఇంట్లో వండుకున్న వంటలో కొంచెం నీళ్లు ఎక్కువ కలిపి గాని, లేదా మన పొరుగు వారికి కొంత ఏదైనా పంపాము అంటే, అవసరం ఉన్నవారి యొక్క అవసరాలు తీర్చడానికి చిన్న ప్రయత్నం చేసాము అంటే, సహీహ్ బుఖారీలో వచ్చిన హదీథ్ ప్రకారం:

“ఎవరైతే విధవలకు, నిరుపేదలకు వారి అవసరాలు తీరాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడో, వారి గురించి ప్రయాసపడుతూ ఉంటాడో, అతడికి అల్లాహ్ మార్గంలో జిహాద్ చేస్తున్నటువంటి వారి పుణ్యం మరియు రాత్రంతా తహజ్జుద్ చేస్తున్న వారి అంత పుణ్యం, పగలంతా ఉపవాసాలు పాటిస్తున్న వారి అంత పుణ్యం లభిస్తూనే ఉంటుంది.” అల్లాహు అక్బర్.

గమనించారా? ఎప్పుడైనా ఇలాంటి పుణ్యాల గురించి మనం ఆశించామా? ప్రయత్నం చేయండి. ఇప్పుడు తెలిసింది కదా, ఇక ప్రయత్నం చేయండి.

ఇక ఇంతటి పుణ్యాలు సంపాదించే అటువంటి శుభ మాసం వచ్చింది అంటే, ఈ పుణ్యాలన్నీ బూడిదలో కలిసే అటువంటి దుష్కార్యాల నుండి దూరం ఉండడం తప్పనిసరి. వాటిలో, ఆ దుష్కార్యాల్లో అతి చెడ్డది, మరీ భయంకరమైనది, మిగతా పుణ్యాలన్నింటినీ తుడిచి వేసే అటువంటిది, ఆ సత్కార్యాల సత్ఫలితం మీద బూడిద చల్లే అటువంటి కొన్ని దుష్కార్యాలు ఏవైతే ఉన్నాయో, వాటి నుండి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

మొదటి విషయం, రమదాన్ మాసం వచ్చిందంటే ఎందరో సోదరీమణుల ద్వారా ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కొందరైతే “ఇక మాకు ఉపవాసం లేదు కదా” అని వేరే పుణ్యాలు ఏదైతే చేసుకోవచ్చునో వాటిని కూడా వదులుకుంటారు. ఉదాహరణకు, ఏ స్త్రీకైతే వారి ప్రత్యేక సమయంలో, కాలంలో నమాజ్ మరియు ఉపవాసం ఉండరాదో, ఆ సమయంలో ఖురాన్ చదవడం నిషిద్ధం. ప్రత్యేకంగా ఖురాన్ లాంటి ఏదైనా పుస్తకం, ఖురాన్ తీసుకొని చదవడం నిషిద్ధం. కానీ మనకు ముందు నుండే ఏ ఖురాన్ అయితే మైండ్ లో ఉందో, మనం కంఠస్థం చేసి ఉన్నామో, జ్ఞాపకం చేసుకొని ఉన్నామో, ఆ ఖురాన్ చదవడం లేదా మొబైల్ లలో ఖురాన్ చదవడం ఇది నిషిద్ధం కాదు. ఈ రకంగా మనం పుణ్యాలు సంపాదించుకోవచ్చు.

మనం ఈ స్థితిలో ఉన్నప్పుడు ఆరోగ్యం పై ఎంతో ప్రభావం పడుతుంది. నడుము నొప్పి ఉండవచ్చు, ఇంకా వేరే తలనొప్పి ఉండవచ్చు, ఇంకా వేరే ఏవైనా అనారోగ్యాలు ఈ సందర్భంలో స్త్రీలకు వస్తాయి. ఇంట్లో కొన్ని పనులు చేయడానికి, ఇంట్లో ఉన్నవారికి సహకరించడానికి, వారితో ఉత్తమ రీతిలో, సత్ప్రవర్తనతో మసలుకోవడానికి వెనుక ఉంటారు. కానీ ఒకవేళ వారు ఈ స్థితిలో బాధను ఆపుకొని, సత్ప్రవర్తన వారు పాటిస్తూ ఉంటే, ఎంత గొప్ప పుణ్యాన్ని చేజిక్కించుకుంటారో! అల్లాహు అక్బర్. మనం అంచనా వేయలేము.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు:

إِنَّ الْمُؤْمِنَ لَيُدْرِكُ بِحُسْنِ خُلُقِهِ دَرَجَةَ الصَّائِمِ الْقَائِمِ
[ఇన్నల్ ము’మిన లయుద్రికు బిహుస్ని ఖులుఖిహి దరజతస్ సాఇమిల్ ఖాఇమ్]

“ఒక విశ్వాసి తన సత్ప్రవర్తన ద్వారా, ఎల్లప్పుడూ నమాజ్ చేస్తూ ఉండే, ఎల్లప్పుడూ ఉపవాసాలు ఉండే వ్యక్తి ఏ స్థానానికి చేరుకుంటాడో, ఉత్తమ ప్రవర్తన పాటించే స్త్రీ, ఉత్తమ ప్రవర్తన పాటించే పురుషుడు ఆ స్థానానికి చేరుకుంటారు.”

అల్లాహు అక్బర్! గమనించారా? ఇంట్లో ఇలాంటి సత్ప్రవర్తన ఇంకా అవసరం ఉంటుంది. మన సమాజంలో ఎన్నో ఇళ్లల్లో ఉమ్మడి కుటుంబం (Joint Family) ఉంటుంది. అంటే అత్తా మామలతో కోడళ్లు, వదినలతో భర్త యొక్క చెల్లెళ్లు (ఆడబిడ్డలు), ఇంకా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, తల్లిదండ్రులు, సంతానం అందరూ కలిసి ఉంటారు కదా. ఇలాంటి సందర్భంలో సత్ప్రవర్తన ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది. అంతెందుకు? ఇళ్లల్లో మనం చూస్తూ ఉంటాము. “అయ్యో కోడలు సరిగ్గా పని చేస్తలేదు” అని అత్తకు ఫిర్యాదు ఉంటుంది. “వదిన మాకు సహకరిస్తలేదు” అని ఆడబిడ్డలు గొడవలు పెడుతూ ఉంటారు. “అయ్యో నేను ఇంటికి పెద్దదా, వదినను వారికి అంకితం, పని భారం నా మీదనే వేస్తున్నారు, ఆడబిడ్డలు ఏం సహాయానికి వస్తలేరు” అని కోడళ్లు ఏడుస్తూ ఉంటారు. ఇట్లాంటి ఎన్ని సమస్యలు ఉన్నాయి! వీటి వల్ల ఎన్ని ఇళ్లల్లో ఎన్ని రకాల ప్రేమలకు, అభిమానులకు, అభిమానాలకు మనం దూరమవుతున్నాం.

కానీ ఒకవేళ మనం ముస్లింలం ఉత్తమ నడవడిక, సత్ప్రవర్తన వీటిని పాటించడం, పరస్పరం మంచి పనుల్లో మనం సహాయం చేసుకోవడం వీటి ఘనత తెలుసుకొని ఉండేదుంటే, ఇలాంటి గొడవలు అన్ని దూరమైపోతాయి. మన యొక్క జీవితాలు కూడా ఎంతో ప్రేమతో గడుస్తూ ఉంటాయి. మరియు మనం పుణ్యాల్లో కూడా అధిరోహిస్తూ పోతాము.

రమదాన్ మాసంలో ఇలాంటి పుణ్యాలు చేసుకుంటూ, ఖురాన్ పారాయణం, ఖురాన్ యొక్క తిలావత్ దీని ద్వారా మనం ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవచ్చు. అవును. ఒక్కొక్క అక్షరానికి బదులుగా పది పుణ్యాలు మనకు లభిస్తాయి. సామాన్యంగా గ్రామాల్లో ఉండే మన ఎక్కువ ముస్లిం స్త్రీలు “అయ్యో మాకు ఖురాన్ చదవడం రాదు కదా, మరి ఈ పుణ్యాన్ని మేము ఎలా పొందాలి?” అని బాధపడే అవసరం లేదు. మీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి.

మొదటి మార్గం: మీ 24 గంటల సమయంలో కనీసం ఒక 15 నిమిషాలు కేటాయించి, మీ చుట్టుపక్కల దగ్గరలో ఎవరైనా మీకు ఖురాన్ నేర్పించేవారు ఉండేదుంటే, “అలిఫ్, బే” అక్షరమాల నేర్చుకోండి. ఏ ఉద్దేశంతో? ఖురాన్ చదివే ఉద్దేశంతో మీరు ఈ అరబ్బీ నేర్చుకుంటూ ఉంటే, మీకు పుణ్యం ప్రారంభం అయినట్లే. అవును.

ఇంకా రెండో మార్గం, ఈ అవకాశం కలగకుంటే, ప్రత్యేకంగా ముసలితనంలో చేరినటువంటి మన పెద్దమ్మలు, మేనత్తలు, నానమ్మలు, అమ్మమ్మలు.. ఇలాంటి వారు పెద్దవారు.. “అయ్యో ఈ వయసులో మేమెక్కడ చదవాలి బిడ్డా” అని బాధపడే అవసరం లేదు. ఖురాన్ ఈ రోజుల్లో టీవీలో కూడా వస్తుంది. లేదా టేప్ రికార్డులో కూడా మనం దాన్ని వినవచ్చు. లేదా ఈరోజు మన పిల్లల చేతుల్లో మొబైల్స్ ఏవైతే ఉన్నాయో సెల్ ఫోన్లు, వాటిలో ఖురాన్ పెట్టి చాలా శ్రద్ధగా, మనసు వేరే ఎక్కడ ఉండకుండా అక్కడే ఖురాన్ యొక్క శబ్దంపై మనసు పెట్టి వింటూ ఉంటే, ఈ వినడంలో కూడా పుణ్యం ఉంది. అవును.

మరలా చాలా మంది ఈ విషయాన్ని మర్చిపోతారు లేదా తెలుసుకోలేక ఉన్నారు. ఖురాన్ వినడానికి సమయం కేటాయించడం కూడా ఎంతో గొప్ప పుణ్యం. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్, ఇలాంటి వారికి అవకాశం కల్పించండి ఎవరైతే ఖురాన్ వినదలుచుకుంటారో అని చెప్పాడు. అలాగే అవిశ్వాసుల గురించి చెప్పాడు, వారు విశ్వాసులు ఖురాన్ వినకూడదు అన్నటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం విశ్వాసులం, ఖురాన్ వినడానికి కూడా కొంత సమయం కేటాయించాలి.

మన ముస్లిం అమ్మాయిలు, యువతులు, పిల్లలు ఆడుకోవడంలో, పాటల్లో, ఇంకా ఫిలింలు చూడడంలో, సీరియళ్ళలో ఏ సమయం కేటాయిస్తారో ఇవన్నీ వదులుకొని, ఖురాన్ వినడంలో, ఖురాన్ దాని అనువాదంతో పాటు వినడంలో లేదా ఇంకా వేరే ధర్మ పండితులు, ఖురాన్ హదీథ్ ఆధారంగా ధర్మాన్ని బోధించే వారి యొక్క ఉపన్యాసాలు, ప్రసంగాలు వినడంలో కూడా మనకు ఎంతో గొప్ప పుణ్యం ఉన్నది.

ఇలాంటి పుణ్యాలను మనం పొందడానికి ముందుకు రావాలి. ఇంకా రెండు విషయాలు నేను మీ ముందు చెప్పదలుచుకున్నాను.

ఒక విషయం: ఇంట్లో ఉన్న స్త్రీలు, ప్రత్యేకంగా ఆ రెండు స్థితులు ఏవైతే మనం చెప్పామో ఇంతకుముందు – బహిష్టు కాలంలో మరియు ప్రసవం తర్వాత ఎన్ని రోజులు వారికి రక్తం స్రవిస్తూ ఉంటుందో ఆ రోజుల్లో – ఉపవాసం ఉండలేని స్త్రీలు ఇంకా ఎలాంటి పుణ్యాలు పొందవచ్చు?

మరియు రెండో విషయం: రమదాన్ లో మనం సంపాదించే ఈ పుణ్యాలు లేదా పుణ్యాలు పొందడానికి ఏ సత్కార్యాలు చేస్తున్నామో, ఆ పుణ్యాలను హరించి వేసే, ఆ పుణ్యాలను భస్మం చేసే, ఆ సత్కార్యాల సత్ఫలితం మీద బూడిద చల్లే అటువంటి కొన్ని దుష్కార్యాలు ఏవైతే ఉన్నాయో, వాటి నుండి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

మొదటి విషయం, రమదాన్ మాసం వచ్చిందంటే ఎందరో సోదరీమణుల ద్వారా ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కొందరైతే “ఇక మాకు ఉపవాసం లేదు కదా” అని వేరే పుణ్యాలు ఏదైతే చేసుకోవచ్చునో వాటిని కూడా వదులుకుంటారు. ఉదాహరణకు, ఏ స్త్రీకైతే వారి ప్రత్యేక సమయంలో, కాలంలో నమాజ్ మరియు ఉపవాసం ఉండరాదో, ఆ సమయంలో ఖురాన్ చదవడం నిషిద్ధం. ప్రత్యేకంగా ఖురాన్ లాంటి ఏదైనా పుస్తకం, ఖురాన్ తీసుకొని చదవడం నిషిద్ధం. కానీ మనకు ముందు నుండే ఏ ఖురాన్ అయితే మైండ్ లో ఉందో, మనం కంఠస్థం చేసి ఉన్నామో, జ్ఞాపకం చేసుకొని ఉన్నామో, ఆ ఖురాన్ చదవడం లేదా మొబైల్ లలో ఖురాన్ చదవడం ఇది నిషిద్ధం కాదు. ఈ రకంగా మనం పుణ్యాలు సంపాదించుకోవచ్చు.

మనం ఈ స్థితిలో ఉన్నప్పుడు ఆరోగ్యం పై ఎంతో ప్రభావం పడుతుంది. నడుము నొప్పి ఉండవచ్చు, ఇంకా వేరే తలనొప్పి ఉండవచ్చు, ఇంకా వేరే ఏవైనా అనారోగ్యాలు ఈ సందర్భంలో స్త్రీలకు వస్తాయి. ఇంట్లో కొన్ని పనులు చేయడానికి, ఇంట్లో ఉన్నవారికి సహకరించడానికి, వారితో ఉత్తమ రీతిలో, సత్ప్రవర్తనతో మసలుకోవడానికి వెనుక ఉంటారు. కానీ ఒకవేళ వారు ఈ స్థితిలో బాధను ఆపుకొని, సత్ప్రవర్తన వారు పాటిస్తూ ఉంటే, ఎంత గొప్ప పుణ్యాన్ని చేజిక్కించుకుంటారో! అల్లాహు అక్బర్. మనం అంచనా వేయలేము.

అల్లాహ్ మనందరికీ స్వర్గంలో చేర్పించే ప్రతి సత్కార్యం చేసే అటువంటి సద్భాగ్యం ప్రసాదించి, నరకంలో చేర్పించే ప్రతి దుష్కార్యం నుండి దూరం ఉండే భాగ్యం ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరా. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఇతరములు:

తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 28 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 28
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 28

1) అల్లాహ్ వ్రాసిన విధివ్రాత ప్రకారం ఒక విశ్వాసి ప్లేగు వంటి అంటువ్యాధుల వల్ల మరణిస్తే అది ఏ విధమైన మరణం అవుతుంది?

A) అకాల మరణం చెందినట్లు
B) షహీద్ (అమరగతి) చెందినట్లు
C) సహజ మరణం చెందినట్లు

2) ఏ కారణంగా స్త్రీలు అధికంగా నరకంలో ప్రవేశిస్తారు?

A) భర్త పట్ల అవిధేయత – కృతఘ్నత వల్ల
B) శాపనార్ధాలు – ఎత్తిపొడుపుల వల్ల
C) పై రెండూ కూడా కారణం

3) నరకంలో కాలిన కొంతకాలం తర్వాత ఎవరిని బయటకు తీసి స్వర్గంలో వెయ్యడం జరుగును?

A) అసాధ్యం ఎవ్వరినీ లేదు
B) యూదులనందరినీ
C) ఎవరి హృదయంలో గోధుమగింజంత స్వచ్ఛమైన ఏకదైవారాధన విశ్వాసం ఉందొ

క్విజ్ 28: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [14:59 నిమిషాలు]


ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

ప్రశ్న: భర్త నమాజు చదవడం లేదు. తావీజు ధరిస్తున్నాడు. షిర్క్ చేస్తున్నాడు. ఇటువంటి సమయంలో విశ్వాసురాలైన భార్య ఏం చేయాలి! [ఆడియో]

బిస్మిల్లాహ్

ప్రశ్న- భర్త నమాజు చదవడం లేదు. తావీజు ధరిస్తున్నాడు. షిర్క్ చేస్తున్నాడు. ఇటువంటి సమయంలో విశ్వాసురాలైన భార్య ఏం చేయాలి!

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [7:00 నిముషాలు ]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

వస్త్రధారణ ఆదేశాలు [పుస్తకం & వీడియో పాఠాలు]

బిస్మిల్లాహ్

[ఇక్కడ పుస్తకము చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [8 పేజీలు]
సంకలనం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
పబ్లిషర్స్: జుల్ఫీ ధర్మప్రచార విభాగం (సౌదీ అరేబియా)

వస్త్రధారణ ఆదేశాలు [పుస్తకం & వీడియో పాఠాలు]
https://youtu.be/7zmusYcXwMA [22 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఇస్లాం ధర్మం పరిశుభ్రత మరియు సౌందర్యాలను ప్రేమించు, ప్రోత్సహించు ధర్మం. ప్రతి ముస్లింకి (హద్దు లోపల ఉండి) అంద సౌందర్యాలను ప్రదర్శించే వస్త్రాలు ధరించే అనుమతిచ్చింది, ప్రోత్సహించింది. మర్మావయవాలను కప్పి ఉంచడానికి, అలంకరణగా ఉపయోగించుకోడానికి అల్లాహ్‌ వస్త్రాలను (తయారు చేసుకునే సాధానాలను) సృష్టించాడు. ఆయన ఆదేశం ఇలా వుంది:

يَا بَنِي آدَمَ قَدْ أَنزَلْنَا عَلَيْكُمْ لِبَاسًا يُوَارِي سَوْآتِكُمْ وَرِيشًا

“ఓ ఆదము సంతానమా! మేము మీపై దుస్తులను అవతరింపజేశాము. అవి మీరు సిగ్గుపడే మీ శరీర భాగాలను కప్పుతాయి. మీ శరీర రక్షణకు, శోభకు సాధనంగా ఉంటాయి.” (ఆరాఫ్‌ 7: 26).


వస్త్రధారణ విషయంలో ఏవి నిషిద్ధం అని స్పష్టమైన ఆధారం గలదో అవి తప్ప మిగతా వన్నియూ ధర్మసమ్మతమే. అలాగే ఇస్లాం వస్త్రధారణకు సంబంధించిన ఏదైనా ఒక ప్రత్యేక విధానాన్ని పరిమితం చేయలేదు. అయితే కొన్ని నియమ నిబంధనలు మాత్రం తెలిపింది. ప్రతీ ముస్లిం వస్త్రాలు ధరించినప్పుడు వాటిని ఆచరణలో ఉంచడం తప్పనిసరి. అవి ఈ విధంగా ఉన్నాయి:

1- శరీరంలో తప్పనిసరిగా దాచి ఉంచవలసిన భాగం మొత్తంపై వస్త్రం ఉండాలి. ధరించినప్పటికీ శరీరం కనబడునటువంటి పలచగా ఉండకూడదు. శరీరావయవాల పరిమాణాన్ని తెలుపునటువంటి ఇరుకుగా ఉండకూడదు.

2- ముస్లిమేతరుల ప్రత్యేక వస్త్రాల మాదిరిగా ఉండకూడదు. అలాగే సమాజంలో చెడు కార్యాలకు పాల్పడే వారికి ప్రత్యేక చిహ్నంగా ఉండే దుస్తుల మాదిరిగా కూడా ఉండకూడదు. (వారు హీరో, హీరోయిన్ల పేరుతో పిలువబడేవారయినా, వేశ్యావృత్తి అవలంభించువారైనా, మరెవరైనా సరే).

3- వృధా ఖర్చులతో కూడినవై ఉండకూడదు.


పై నియమాలను పాటిస్తూ మనిషి తనకిష్టమైన తనకు అవసరమైన, తన సమాజంలో వాడుకలో ఉన్న ఏ దుస్తులు ధరించినా మంచిదే. దుస్తుల విషయంలో వచ్చిన నివారణలు, నిషిద్ధతలకు సంబంధించిన వివరాలు క్రింద తెలుపబడుతున్నవి:

1- పురుషుల కొరకు బంగారం, పట్టు వస్త్రాలు నిషిద్ధం. అయితే అవి స్త్రీల కొరకు ధర్మసమ్మతమే. అలీ బిన్‌ అబూ తాలిబ్‌ (రజియల్లాహు అన్హు)  హదీసులో ఉంది:

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్టు వస్త్రాన్ని తమ కుడి చెయిలో, బంగారాన్ని తమ ఎడమ చెయిలో తీసుకొని ఇలా చెప్పారు: 

“ఇవి రెండూ నా అనుచర సమాజంలోని పురుషుల కొరకు నిషేధించబడ్డాయి” అని చెప్పారు. (అబూ దావూద్‌/ ఫిల్‌ హరీరి లిన్నిసా 4057, నసాయి/ తహ్రీముజ్జహబి అలర్రిజాల్‌ 5053).

కాని పురుషులు వెండితో లేదా వెండి కలిపి మరేదానితోనైనా చేయబడిన ఉంగరం తమ అలవాటు ప్రకారం తొడగడంలో అభ్యంతరం లేదు.

2- ప్రాణం గల చిత్రం ఉన్న వస్త్రాలు: అంటే మనుషులు, జంతువుల చిత్రాలు గల వస్తువులు ధరించడం యోగ్యం కాదు. అవి దుస్తులయినా, నగలయినా మరేవైనా సరే.

dress-rulings-2

ఆయిషా (రజియల్లాహు అన్హా)  ఉల్లేఖనం ప్రకారం, ఆమె బొమ్మలు గీసి యున్న ఒక దిండు కొన్నది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బయటి నుండి వచ్చి దానిని చూడగానే తలుపు దగ్గరే ఆగిపోయారు. లోపలికి ప్రవేశించలేదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఖంలో ఏదో ఇష్టం లేని చిహ్నాలు చూసి, ప్రవక్తా! నేను అల్లాహ్‌ వైపునకు తర్వాత ఆయన ప్రవక్త వైపునకు మరలుతున్నాను (క్షమాపణ కోరుకుంటున్నాను). నాతో జరిగిన తప్పేమిటో సెలవియ్యండి అని అన్నాను. అందుకు ఆయన “ఈ దిండు సంగతేమిటి?” అని మందలించారు. దీనికి మీరు ఆనుకొని కూర్చుంటారనే ఉద్దేశంతో నేను కొన్నాను అని చెప్పాను. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

“ఈ బొమ్మలు, చిత్రాలు చిత్రించేవారు ప్రళయదినాన శిక్షించబడుతారు. మీరు సృష్టించిన వాటిలో ప్రాణం పోయండి అని వారితో అనబడుతుంది”.

మళ్ళీ చెప్పారు:

“ఏ ఇంట్లో బొమ్మలు, చిత్రాలు ఫోటోలు ఉంటాయో ఆ ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు”.

(బుఖారి/అత్తిజారతు. ఫీమా యుక్రహు లుబ్సుహు… 2105, ముస్లిం/తహ్రీము తస్వీరి సూరతిల్‌ హైవాన్‌… 2107).

3- పురుషులపై నిషిద్ధమున్న మరో విషయం వారు తమ వస్త్రాలను చీలమండలం క్రిందికి తొడగుట.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారని అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

dress-rulings-3

“చీలమండలానికి క్రింద ఉన్న లుంగి (వస్త్రం) వారి ఆ భాగం నరకంలో ఉండును”. (బుఖారి/మా అస్ఫల మినల్‌ కాబైని… 5787).

అది పైజామా, పైంటు, దుప్పటి తదితర ఏ వస్త్రం అయినా సరే. కొందరి భ్రమ ప్రకారం ‘గర్వంతో తొడిగే వారికి ఈ శిక్ష’ అన్న మాట సరికాదు. గర్వం లేకుండా తొడిగే వారికే ఈ శిక్ష. గర్వంతో తొడిగే వారికి ఇంతకంటే మరీ ఘోరమైన శిక్ష గలదు. అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు:

dress-rulings-4

“అహంకారంతో తన వస్త్రాన్ని (లుంగి, పైంటు వగైరాలు) ఈడుస్తూ నడిచే వ్యక్తిని అల్లాహ్‌ పరలోకంలో కన్నెత్తి కూడా చూడడు”.

(బుఖారి/మన్‌ జర్ర సౌబహు మినల్‌ ఖయలా 5791, ముస్లిం/తహ్రీము జర్రిస్పౌబి ఖుయలా… 2085).

కాని స్త్రీలు తమ వస్త్రాలను క్రింది వరకు వ్రేలాడదీయాలి. పాదాలు కూడా కనబడకుండా ఉండాలి.

4- తొడిగి కూడా నగ్నంగా కన్పించేటటువంటి పలచని, సన్నటి వస్త్రాలు యోగ్యం కావు. అలాగే శరీరావయవాల పరిమాణాన్ని వర్ణించే విధంగా ఇరుకుగా తొడుగుట యోగ్యం కాదు. ఈ ఆదేశం స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుంది.ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

“ధరించికూడా నగ్నంగా కన్పించే దుస్తులు ధరించే స్త్రీలు స్వర్గంలో ప్రవేశించరు, దాని సువాసన కూడా పొందరు”. (ముస్లిం 2128).

5-. పురుషులు స్త్రీల లాంటి మరియు స్త్రీలు పురుషుల్లాంటి బట్టలు తొడుగుట నిషేధం.

ఇబ్ను అబ్బాస్‌ (రజియల్లాహు అన్హు) ఇలా చెప్పారు:

dress-rulings-5

“స్త్రీల వేషాధారణ వేసుకునే పురుషులను, పురుషుల వేషాధారణ వేసుకునే స్త్రీలను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శపించారు”. (బుఖారి/అల్‌ ముతషబ్బిహూన బిన్నిసా… 5885).

6- అవిశ్వాసులు తమ ధార్మిక చిహ్నంగా ప్రత్యేకించుకున్న వేషాధారణ ముస్లిం ధరించడం నిషిద్ధం.

అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్ర్ బిన్‌ ఆస్‌ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు:

dress-rulings-6

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా ఒంటిపై కాషాయ రంగుతో కూడిన రెండు బట్టలు చూసి, “ఇవి అవిశ్వాసులు ధరించే బట్టల్లో ఒక రకమైనవి, నీవు వీటిని ధరించకు” అని చెప్పారు. (ముస్లిం/ అన్నహ్‌ యు అన్‌ లుబ్బిర్రజులి… 2077).


వస్త్రధారణ ధర్మములు

1- ముస్లిం పాటించవలసిన ధర్మాల్లో ఒకటి, కొత్త బట్టలు ధరించేటప్పుడు ఈ దుఆ చదవడం.

అబూ సఈద్‌ ఖుద్రీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొత్త బట్టలు ధరించేటప్పుడు చొక్కా, తలపాగ మరేదైనా దాని పేరు చెప్పి ఈ దుఆ చదివేవారు:

dress-rulings-7

అల్లాహుమ్మ లకల్‌ హందు అంత కసౌతనీహి అస్‌అలుక మిన్‌ ఖైరిహీ వ ఖైరి మా సునిఅ లహూ వఅఊజు బిక మిన్‌ షర్రిహీ వషర్రి మా సునిఅ లహూ (*).

(భావం: ఓ అల్లాహ్‌! నీకే సర్వ స్తోత్రములు, నీవే నాకు ఈ బట్టలు ధరింపజేశావు. దీనిలోని మేలును మరియు దేని కొరకు అది నేయబడిందో దాని మేలును నీతో కోరుతున్నాను. దాని కీడు నుండి మరియు దేని కొరకు అది నేయబడిందో దాని కీడు నుండి నీ శరణు జొచ్చుచున్నాను). (అబూ దావూద్‌ 4020, తిర్మిజి 1767).

(*)  పైన ఇవ్వబడిన దుఆ కొత్త బట్టలు ధరించేటప్పుడు చదివేది. అయితే రోజువారి బట్టలు ధరించేటప్పుడు “అల్‌ హందు లిల్లాహిల్లజీ కసానీ హజస్‌ సౌబ వరజఖనీహి మిన్‌ ఘైరి హౌలిమ్‌ మిన్నీ వలా ఖువ్వహ్‌” చదివే వారి పూర్వపు పాపాలన్నీ మన్నించబడతాయి. (అబూ దావూదు 4023).

2- బట్టలు తొడుక్కునేటప్పుడు కుడి వైపు నుండి తొడగడం ధర్మం.

ఆయిష (రజియల్లాహు అన్హా)  చెప్పారు:

dress-rulings-8

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాధ్యమైనంత వరకు మంచి కార్యాలు కుడి వైపు నుండి చేయడం మరియు మొదలు పెట్టటం ఇష్టపడేవారు. అది వుజూలోనైనా, తల దువ్వుకునేటప్పడైనా మరియు చెప్పులు తొడిగేటప్పుడైనా”. (బుఖారి 426, ముస్లిం 268).

చెప్పులు తొడిగేటప్పుడు ముందు కుడి కాలులో తొడగాలి కాని తీసేటప్పుడు ముందు ఎడమ కాలి నుండి తీయాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఆదేశించారని, అబూ హురైర (రజియల్లాహు అన్హు)  ఉల్లేఖించారు:

dress-rulings-9

“మీలో ఎవరయినా చెప్పులు తొడిగేటప్పుడు కుడి కాలు నుండి తొడగాలి. తీసేటప్పుడు ఎడమ కాలు నుండి తీయాలి. తొడిగితే రెండూ తొడగాలి. తీస్తే రెండూ తీయాలి”. (ముస్లిం 2097, బుఖారి 5856).

మరొక హదీసులో ఒక చెప్పు తొడిగి నడవడం నుండి నివారించబడింది. (బుఖారి 5855).

3- ప్రతీ ముస్లిం తన శరీరాన్ని, దుస్తులను పరిశుభ్రంగా, అశుద్ధతకు దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. పరిశుభ్రత ప్రతి అలంకారాణికి, అందానికి మూలం లాంటిది.ఇస్లాం పరిశుభ్రత గురించి ప్రోత్సహించడంతో పాటు శరీర, దుస్తుల శుభ్రతపై శ్రద్ధ చూపాలని కూడా చాలా ప్రోత్సహించింది.

తెల్లని బట్టలు ధరించడం మంచిది. ఇబ్ను అబ్బాస్‌ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖించిన హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

dress-rulings-10

“మీరు తెల్లని దుస్తులు ధరించండి. మీ దుస్లులలోకెల్లా అతి ఉత్తమమైనవి ఇవే. మీ మృతులకు కూడా ఈ తెల్లని వస్త్రాలతోనే కఫన్‌ ఏర్పాటు చేయండి”. (అబూ దావూద్‌/అత్తిబ్‌/ ఫిల్‌ అమ్రి  బిల్‌ కొహ్‌ లి 3878, తిర్మిజి/మా యుస్తహబ్బు మినల్‌ అక్సాన్‌ 994).

ఇతర రంగులు యోగ్యమే.

5- దుస్తులు ఇతర అలంకరణ వస్తువుల ఖరీదులో దుబార ఖర్చులు చేయకుండా, మరీ పిసినారితనం వహించకుండా మధ్యేమారాన్ని అవలంబించాలి. అల్లాహ్‌ ఇలా ఆదేశించాడు:

وَالَّذِينَ إِذَا أَنفَقُوا لَمْ يُسْرِفُوا وَلَمْ يَقْتُرُوا وَكَانَ بَيْنَ ذَٰلِكَ قَوَامًا

“వారు తమ సంపద వినియోగిస్తున్నప్పుడు దుబారా ఖర్చు చేయరు. ఇటు పిసినారితనం కూడా వహించరు. వారి ఖర్చు ఆ రెండు అతిచర్యలకు మధ్యస్తంగా ఉంటుంది.” (ఫుర్ఖాన్  25: 67).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

dress-rulings-11

“తినండి, త్రాగండి, ధరించండి మరియు దాన దర్మాలు చేయండి. అయితే దుబారా ఖర్చులు చేయకండి. అహంకారానికి గురికాకండి”. (బుఖారి/ కితాబుల్లిబాస్‌).


ధర్మ శాస్త్ర శాసనాలు (Fiqhiyyah) – పుస్తకం – పేజీలు 24-31 నుండి
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్

వస్త్రధారణకు సంబంధించిన హదీసులు

వస్త్రధారణ ప్రకరణం (హదీసు కిరణాలు – రియాదుస్ సాలిహీన్ నుండి)

117.    తెల్లదుస్తులు  ధరించటం అభిలషణీయం .  ఎరుపు , ఆకుపచ్చ …
118.    చొక్కా ధరించటం అభిలషణీయం
119.    చొక్కా , చొక్కా చేతులు , లుంగీ , తలపాగా కొనలు ఎంత పొడవు ఉండవచ్చనే విషయం
120.    అణకువ కొద్దీ ఖరీదైన దుస్తుల్ని ధరించకుండా వుండటం
121.    వస్త్రధారణలో మధ్యేమార్గాన్ని అవలంబించటం …
122.    పట్టువస్త్రాలు ధరించటం పురుషులకు నిషిద్దం …
123.    గజ్జి , దురద వున్నవారు పట్టుబట్టలు ధరించవచ్చ్చు
124.    చిరుత తోలు మీద కూర్చోరాదు … దాన్ని వాహనం మీద ఆసనంగా ఉపయోగించరాదు
125.    కొత్తబట్టలు , కొత్తచెప్పులు మొదలగునవి తొడుకున్నప్పుడు  ఏమని పలకాలి ?
126.    దుస్తులు ధరించేటప్పుడు కుడివైపు నుండి ఆరంభించాలి?

శుచీశుభ్రత: నాల్గవ పాఠం: హైజ్ (బహిష్టు), నిఫాస్ (పురిటి రక్తం) [వీడియో]

బిస్మిల్లాహ్హైజ్ (బహిష్టు), నిఫాస్ (పురిటి రక్తం) الحيض والنفس

[11 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


హైజ్ అంటే ప్రసవం జరగకుండా, ఏ రోగంతో కాకుండా ఆరోగ్య స్థితిలో నిర్ణీత రోజుల్లో గర్భాశయం నుండి వెలువడే రక్తం. నలుపు రంగు, దుర్వాసన ఉంటుంది.

నిఫాస్ అంటే ప్రసవించినందుకు గర్భాశయం నుండి వెలువడే రక్తం.

స్త్రీలు తమ ఋతుస్రావము మరియు బాలంత గడువులో ఉన్నప్పుడు నమాజు, ఉపవాసాలు పాటించకూడదు. హజ్రత్ ఆయిష రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

إِذَا أَقْبَلَتِ الْحَيْضَةُ فَدَعِي الصَّلَاةَ وَإِذَا أَدْبَرَتْ فَاغْسِلِي عَنْكِ الدَّمَ وَصَلِّي {صحيح البخاري 331، صحيح مسلم 333}.

“నీవు ఋతువు రోజుల్లో ఉన్నప్పుడు నమాజు చేయడం మానేయి. ఋతు స్రావం ముగిసాక రక్తాన్ని కడిగి, తలంటు స్నానం చేసి నమాజు చేస్తూ ఉండు”. (బుఖారి 331, ముస్లిం 333).

ఈ రోజుల్లో చేయని నమాజులు తిరిగి చేయకూడదు.కాని ఈ రోజుల్లో తప్పిపోయిన ఉపవాసాలు మాత్రం పూర్తి చేయాలి.అలాగే వీరు కాబా ప్రదక్షిణం (తవాఫ్) కూడా చేయకూడదు. ఈ రోజుల్లో భర్త తన భార్యతో సంభోగించడం కూడా నిషిధ్ధం. అయితే రమించడం తప్ప పరస్పరం ఏ రకమైన ఆనందం పొందినా తప్పు లేదు. ఈ స్థితిలో స్త్రీ ఖుర్ఆనును ముట్టుకోవద్దు.

నమాజు సమయం ప్రవేశించిన తరువాత, ఆ నమాజు చేయక ముందే ఏ స్త్రీకైనా ఋతు స్రావం మొదలవుతే, లేదా ప్రసవిస్తే ఆమె పరిశుద్ధురాలయిన తరువాత ఆ నమాజును తిరిగి చేయాలి. (ఉదాహరణకు: జొహ్ర్ నమాజు వేళ ఆరంభమయింది పగలు పన్నెండు గంటల నలబై నిమిషాలకు, ఒక స్త్రీ ఒకటింటి వరకు కూడా జొహ్ర్ నమాజు చేసుకోలేక పోయింది. ఒకటింటికి ఋతు స్రావం మొదలయింది, లేదా ప్రసవించింది. అలాంటప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధురాలయిన తరువాత జొహ్ర్ నమాజు చేయాలి).

ఒక రకాతు మాత్రమే చేయునంత సమయం ఉన్నప్పుడు పరిశుద్ధుమైన స్త్రీ గుస్ల్ చేసిన తరువాత ఆ నమాజు చేసుకోవాలి. ఉదాహరణకు: ఇషా నమాజు సమయం రాత్రి 11 గం.లకు సమాప్తమవుతుందనుకుందాము, ఒక స్త్రీ 11 గం.కంటే కొంచెం ముందు పరిశుద్ధురాలైతే ఆమె స్నానం చేసిన తర్వాత ఇషా నమాజు చేసుకోవాలి.

ఉపవాస స్థితిలో సూర్యాస్తమయానికి (ఇఫ్తార్ కి) కొన్ని క్షణాల మందైనా ఎవరికైనా ఋతుస్రావం లేదా ప్రసవం జరిగితే ఆ ఉపవాసం లెక్కలోకి రాదు, ఒకవేళ అది రమజాను ఉపవాసం లాంటి విధి ఉపవాసమయితే పరిశుద్ధురాలయిన తర్వాత దానికి బదులుగా మరో ఉపవాసం ఉండడం విధిగా ఉంది.

ఫజ్ర్ సమయం ప్రవేశించే వరకు స్త్రీ బహిష్టులో ఉంటే ఆ రోజు ఉపవాసం ఉండడం ధర్మం కాదు, ఒక వేళ ఆమె ఫజ్ర్ ప్రవేశించిన కొన్ని క్షణాల ముందు పరిశుద్ధురాలయినా సరే. అదే ఫజ్ర్ ప్రవేశించిన కొద్ది క్షణాల ముందు పరిశుద్ధరాలయితే ఉపవాసం ఉండాలి. స్నానం ఉషోదయం తరువాత చేసినా అభ్యంతరం లేదు.

అలాగే జునుబీ (అంటే సంభోగం లేదా స్వప్నస్ఖలనం వల్ల అశుద్ధ స్థితిలో ఉన్న వ్యక్తి) ఫజ్ర్ కు కొంచెం ముందు ఉపవాసం నియ్యత్ చేసుకొని ఫజ్ర్ తర్వాత స్నానం చేసినా అతని ఉపవాసం సరియగును.

బహిష్టు, బాలంత స్త్రీలు జిక్ర్, తక్బీర్, తస్బీహ్ చేయుట, అల్ హందులిల్లాహ్ పలుకుట, దుఆ చేయుట మరియు తినుత్రాగినప్పుడు బిస్మిల్లాహ్ అనుట యోగ్యమే. అలాగే హదీస్, ఫిఖ్హ్ చదువుట, ఖుర్ఆన్ పారాయణం వినుట లాంటివేవీ నిషిద్ధం కావు. అలాగే ఖుర్ఆనును ముట్టుకోకుండా తనకు కంఠస్తమున్నదానిలో నుండి పారాయణం చేయవచ్చును.

రక్త స్రావం ఆగిన తరవాత స్నానం చేయడం విధిగా ఉంది(*). స్నానం తర్వాత వారి ఈ గడువులో నిశిద్ధంగా ఉన్నవన్నీ ధర్మ సమ్మతమవుతాయి. ఉదా: నమాజు, ఉపవాసాలు, ఖుర్ఆన్ ను ముట్టుకోవడం లాంటివి.

(*) కొందరు బాలంతలు 15, లేదా 20, 25 రోజుల్లో రక్త స్రావం నిలిచిపోయినా 40 రోజుల తరువాతే గుస్ల్ చేస్తారు. ఆ తరువాతే నమాజు ఆరంభిస్తారు. వారు ఇలా చేసేది చాలా ఘోరమైన తప్పు. ఎప్పుడు రక్త స్రావం నిలిచినదో అప్పుడే గుస్ల్ చేయాలి. నమాజు మొదలెట్టాలి. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు


ఇతరములుతహారా

హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హా)పై నిందారోపణ వృత్తాంతం

బిస్మిల్లాహ్

10వ అధ్యాయం – హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హా)పై నిందారోపణ

1763. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్‌ ఆయిషా (రది అల్లాహు అన్హాా)తనపై అపవాదు వేసిన వారి మాటలను గురించి ఇలా తెలియజేశారు :-

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి నిర్ణయించుకుంటే, తమ భార్యలను గురించి చీటి వేసి, అందులో ఎవరి పేరు వస్తే ఆమెను తమ వెంట తీసికెళ్ళేవారు. ఒక యుద్ధ [1] సందర్భంగా దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) మాలో ఎవరిని తమ వెంట తీసికెళ్ళాలనే విషయమయి చీటీ వేశారు. ఆ చీటీలో నా పేరు వచ్చింది. అప్పుడు నేను ఆయన వెంట బయలుదేరాను. ఈ సంఘటన పరదా ఆదేశం అవతరించిన తరువాత జరిగింది. అందువల్ల నన్ను ఒంటె మీద అంబారీలో కూర్చోబెట్టారు. ఒంటె మీది నుంచి దిగవలసి వచ్చినప్పుడు నన్ను అంబారీలో ఉంచే క్రిందికి దించేవారు. సరే మేము బయలుదేరాము. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఆ యుద్ధం ముగిసిన తరువాత తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణంలో మేము మదీనా పట్టణానికి కొన్ని మైళ్ళ దూరంలో ఒక ప్రదేశానికి చేరుకునేటప్పటికి చీకటి పడింది. ఆ రాత్రికి అక్కడ విడిది చేయాలని ప్రకటించబడింది.

నేనీ ప్రకటన విని (ఒంటె మీది నుంచి నా అంబారీని దించిన తరువాత) సహజ అవసరార్ధం సైన్యాలకు కాస్త దూరంగా బహిర్భూమికి వెళ్ళిపోయాను. మళ్ళీ నేను నా అంబారీ దగ్గరకు తిరిగొచ్చి కంఠం దగ్గర చేయి పెట్టి చూసుకుంటే నా ముత్యాల హారం కన్పించలేదు. అది తెగిపోయి ఎక్కడో పడిపోయి ఉంటుందని భావించి వెనక్కి వెళ్ళి వెతకడం ప్రారంభించాను. ఇలా వెతుక్కోవడంలో ఆలస్యమయిపోయింది. ఈలోగా నా అంబారీ ఎత్తే వాళ్ళు నేను అంబారీలో కూర్చొని ఉన్నాననుకొని దాన్ని ఎత్తి నా ఒంటె మీద పెట్టారు. ఆ రోజుల్లో మేము స్రీలము అన్నం తక్కువగా తినడం వల్ల బక్కగా ఉండేవాళ్ళము. ఎముకల మీద మాంసమే ఉండేది కాదు. అందువల్ల వారు నా అంబారీ ఎత్తి పెట్టేటప్పుడు బరువును అంచనా వేయలేకపోయారు. అదీగాక నేను నవ యౌవనంలో ఉండిన బాలికను. ఆ తరువాత వారు ఒంటెను లేపి వెళ్ళిపోయారు. నేను నా కంఠహారం వెతుక్కొని తిరిగి వచ్చేటప్పటికి సైన్యం అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అక్కడ పిలిచేవారు గాని, కేక వేస్తే జవాబిచ్చేవారు గాని ఎవరూ లేరు. నేను అంబారీలో కన్పించకపోతే వాళ్ళే నా దగ్గరకు తిరిగొస్తారని తలచి నేను సైన్యం విడిది చేసిన ప్రదేశంలోనే కూర్చున్నాను.

కాస్సేపటికి నాకు నిద్ర వచ్చి పడుకున్నాను. హజ్రత్‌ సఫ్వాన్‌ బిన్‌ ముఅత్తల్‌ సలమి  జక్వానీ  (రది అల్లాహు అన్హాు)సైన్యాలకు వెనకాలగా నడచి వస్తున్నారు. ఆయన మరునాడు ఉదయం నేను నిద్రిస్తున్న ప్రదేశానికి చేరుకున్నారు. ఎవరో పడుకున్నారని తలచి ఆయన సమీపానికి వచ్చి చూశారు. ఆయన లోగడ పరదా ఆదేశం రాక పూర్వం నన్ను చూసి ఉండటం వల్ల, దగ్గరికొచ్చి చూడగానే నన్ను గుర్తుపట్టి “ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్‌” అన్నారు. ఈ అలికిడికి నేను కళ్ళు తెరిచాను. ఆయన్ని చూసి వెంటనే ఓణీతో నా ముఖాన్ని కప్పుకున్నాను. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. మేము ఒకరితోనొకరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. నేనాయన నోట “ఇన్నాలిల్లాహి” అనే మాట తప్ప మరేదీ వినలేదు. ఆ తరువాత ఆయన ఒంటె (దిగి దాని)ని నేల మీద కూర్చోబెట్టారు. నేను లేచి దాని మీద ఎక్కి కూర్చున్నాను. ఆయన ఒంటె ముక్కుతాడు పట్టుకొని ముందుకు నడిచారు. ఈ విధంగా మేము ఎండ పెటపెటలాడే (మిట్ట మధ్యాహ్నం) వేళకు సైన్యాలు విడిది చేసిన చోటుకు చేరుకున్నాము. (ఈ మాత్రం సంఘటనకే) వారు (నా మీద అపవాదు వేసి) నాశనమయ్యారు. ఈ అపవాదును లేపడంలో అబ్దుల్లా బిన్‌ ఉబై ప్రధాన పాత్ర వహించాడు.

ఈ హదీసును ఉల్లేఖించిన వారిలో ఒకరైన హజ్రత్‌ ఉర్వా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు:- అతని (అంటే అబ్దుల్లా బిన్‌ ఉబై) సమావేశంలో ఈ అపవాదును గురించి బాహాటంగా చర్చ జరిగింది. రకరకాల మాటలు కల్పించబడ్డాయి. అతను వారిని సమర్ధిస్తూ వారు చెప్పే ప్రతి మాటనూ శ్రద్ధగా వింటూ విషయం మరింత తీవ్రరూపం దాల్చేలా (దానికి మిర్చీ మసాలా రాసి) మాట్లాడేవాడు. అపవాదు లేపిన వారిలో హస్సాన్‌ బిన్‌ సాబిత్ (రది అల్లాహు అన్హాు), మిస్తహ్‌ బిన్‌ ఉసాసా (రది అల్లాహు అన్హాు),హమ్నా బిన్త్ జహష్‌ (రది అల్లాహు అన్హా)ల పేర్లు మాత్రమే నాకు తెలుసు. వీరే కాకుండా మరికొందరు కూడా ఉన్నారు. వారి [2] పేర్లు నాకు తెలియదు. కాకపోతే దివ్య ఖుర్‌ఆన్‌లో “ఈ అపవాదును మీలోనే ఒక ముఠా లేపింది” (24:11) అనే సూక్తిని బట్టి వారొక ముఠాకు చెందిన వారని మాత్రం నాకు తెలుసు. ఆ ముఠాలో ప్రధాన సూత్రధారి అబ్దుల్లా బిన్‌ ఉబయ్యె. హజ్రత్‌ ఆయిషా (రది అల్లాహు అన్హా)తన ముందు ఎవరైనా హజ్రత్ హస్సాన్‌ బిన్‌ సాబిత్‌ (రది అల్లాహు అన్హాు)ని మాత్రం నిందిస్తే సహించేవారు కాదు. “నా తల్లిదండ్రులు, నా గౌరవ ప్రతిష్టలు ముహమ్మద్‌ మహనీయు (సల్లలాహు అలైహి వ సల్లం)ని గౌరవ ప్రతిష్టల పరిరక్షణకై సమర్పితం. అందులోనే నా గౌరవం ఇమిడి ఉంది – అనే కవిత హస్సానే కదా చెప్పింది” అని అంటారు ఆమె. హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హా)(తమ కథనాన్ని) కొనసాగిస్తూ ఇలా తెలియజేస్తున్నారు :-

ఆ తరువాత మేము మదీనాలో ప్రవేశించాము. మదీనా తిరిగొచ్చిన తరువాత నేను ఓ నెల రోజుల దాకా జబ్బుపడ్డాను. అపవాదు లేపిన వారి మాటలు విని ప్రజలు పరి పరి విధాలా చెప్పుకునేవారు. కాని నాకా సంగతే తెలియదు. అయితే నేను ఇది వరకు జబ్బు పడినప్పుడు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నా పట్ల కనబరిచే ప్రేమ, సానుభూతుల్ని ఇప్పుడు జబ్బు పడి ఉన్నప్పుడు కనబరచకపోవడం గమనించి నాక్కొంచెం అనుమానం వచ్చేది. నేనీ జబ్బుపడి ఉన్న రోజుల్లో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నా దగ్గరికి వచ్చి సలాం మాత్రం చేసేవారు. (నా ఆరోగ్యం గురించి నన్నడగకుండా) “ఈవిడకు ఎలా ఉంది?” అని (ఇంట్లో ఉండే ఇతర సభ్యుల్ని) అడిగేవారు. ఈ ధోరణి మాత్రమే నాక్కాస్త అనుమానం కలిగించేది (ఆయన నా మీద అలిగారేమోనని). అంతకు మించి నాకు అపవాదు గురించి బొత్తిగా తెలియదు.

నేను జబ్బు నుండి కొంచెం కోలుకున్న తరువాత ఓ రోజు ఉమ్మె మిస్తహ్‌ (రది అల్లాహు అన్హా)తో కలసి “మనాసా” ప్రదేశానికి బయలుదేరాను. ఇది మా స్త్రీల బహిర్భూమి. మేమక్కడికి రాత్రి వేళల్లో మాత్రమే వెళ్ళొస్తుంటాము. ఇది మా ఇండ్ల దగ్గర మరుగుదొడ్లు నిర్మించబడని నాటి సంగతి. ప్రాచీన అరబ్బుల అలవాటు ప్రకారం మేము బహిర్భూమి కోసం (ఊరి బయట చెట్టు చేమలుండే) అడవి ప్రదేశానికి వెళ్ళేవారము. ఆనాడు ఇండ్ల సమీపంలో మరుగుదొడ్లు నిర్మించడాన్ని జనం అసహ్యించుకునేవారు. ఉమ్మె మిస్తహ్‌ (అంటే మిస్తహ్‌ తల్లి) అబూరహమ్‌ బిన్‌ ముత్తలిబ్‌ బిన్‌ అబ్దుమునాఫ్‌ గారి కుమార్తె. ఆమె తల్లి బిన్తె సఖర్‌ బిన్తె ఆమిర్‌ (మా నాన్న) హజ్రత్‌ అబూబకర్‌ (రది అల్లాహు అన్హాు)కు పినతల్లి అవుతుంది. నేను ఉమ్మె మిస్తహ్‌ (రది అల్లాహు అన్హా)ఆ తరువాత బహిర్భూమి నుండి ఇంటికి తిరుగు ముఖం పట్టాము. దారిలో ఉమ్మె మిస్తహ్‌ (రది అల్లాహు అన్హా)కాలు దుప్పటిలో ఇరుక్కుపోయి ఆమె తూలి పడిపోయింది. అప్పుడామె (అప్రయత్నంగా) “మిస్తహ్‌ పాడుగాను!” అని అన్నది. నేను (విషయం అర్ధం గాక) “నువ్వు చాలా దారుణమైన మాటన్నావు. బద్ర్‌ యుద్ధంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని నిందిస్తున్నావా నువ్వు?” అని అడిగాను. దానికామె “పిచ్చి పిల్లా! అతనేమన్నాడో నీకేమైనా తెలుసా?” అని అన్నది. నేను “ఎమన్నాడేమిటి?” అని అడిగాను. అప్పుడామె నాపై అపనింద వేసిన వారు ఎలాంటి మాటలు కల్పించి ప్రచారం చేస్తున్నారో తెలియజేసింది. ముందే జబ్బు పడి ఉన్న నేను ఈ మాటలు వినడంతో నా జబ్బు మరింత ఎక్కువైపోయింది. నేను ఇంటికి చేరుకునేటప్పటికి దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వచ్చి ఉన్నారు. నన్ను చూసి ఆయన సలాం చేశారు. ఆ తరువాత “ఈవిడ పరిస్థితి ఎలా ఉంది?” అని అడిగారు (ఇంట్లోని ఇతర సభ్యులతో). నేనాయనతో “నేను నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళడానికి అనుమతిస్తారా?” అని అన్నాను. ఈ అనుమతి అడగడంలో నా ఉద్దేశ్యం, నా తల్లిదండ్రుల ఇంటికెళ్ళి ఈ వదంతి గురించి నిజానిజాలు తెలుసుకోవాలన్నదే. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నాకు పుట్టింటికి వెళ్ళేందుకు అనుమతిచ్చారు. నేను (వెళ్ళి మా అమ్మతో “అమ్మా! జనం ఏమిటి ఇలా చెప్పుకుంటున్నారు?” అని అడిగాను. దానికామె సమాధానమిస్తూ “అమ్మా! బాధపడకు. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. సాధారణంగా ఎవరికైనా అందమైన భార్య ఉండి అతనామెను బాగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆమె సవతులు ఆమెలో ఎదో ఒక లోపాన్ని ఎత్తి చూపుతూనే ఉంటారు. ఇది సహజం” అని అన్నది. నేనీ మాట విని “సుబ్‌హానల్లాహ్‌! (ఆశ్చర్యార్ధక పదం) ఇప్పుడు మరికొందరు కూడా ఇలాంటి అభూత కల్పనలకు పాల్పడుతున్నారా?” అని అన్నాను. ఆ రాత్రంతా నా కంటిమీద కునుకే లేదు. తెల్లారే దాకా ఏడుస్తూనే ఉండిపోయాను. తెల్లవారిన తరువాత కూడా నా కన్నీరు ఆగలేదు.

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) దివ్యావిష్కృతి (వహీ) అవతరణలో ఆలస్యమయినందున హజ్రత్‌ అలీ బిన్‌ అబూ తాలిబ్‌ (రది అల్లాహు అన్హాు), హజ్రత్‌ ఉసామా బిన్‌ జైద్‌ (రది అల్లాహు అన్హాు)లను పిలిపించి, ఆయన తమ భార్య నుండి (అంటే నా నుండి) విడిపోయే విషయమయి వారిద్దర్నీ సంప్రదించారు. అప్పుడు హజ్రత్‌ ఉసామా (రది అల్లాహు అన్హాు)మాట్లాడుతూ “దైవప్రవక్తా! మీ  భార్యామణిని మీ నుండి వేరు చేయకండి. ఆమెలో మేము మంచితనం తప్ప మరేదీ చూడలేదు” అని అన్నారు. అయితే హజ్రత్‌ అలీ మాట్లాడుతూ “దైవప్రవక్తా! అల్లాహ్ మీకు ఎలాంటి ఇబ్బందీ పెట్టలేదు. ఆయిషా (రది అల్లాహు అన్హా)యే గాకుండా (లోకంలో) చాలా మంది స్త్రీలున్నారు. మీరామె సేవకురాలిని అడిగి చూడండి, ఆమె వాస్తవమేమిటో చెబుతుంది” అని అన్నారు. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) (నా సేవకురాలు) హజ్రత్‌ బరీరా (రది అల్లాహు అన్హా)ను పిలిపించి “బరీరా! నీకు ఆయిషా (రది అల్లాహు అన్హా) పట్ల అనుమానం కలిగించే సంఘటన ఎదైనా జరిగినట్లు నువ్వు చూశావా?” అని అడిగారు. హజ్రత్‌ బరీరా (రది అల్లాహు అన్హా)సమాధానమిస్తూ “మీకు సత్యధర్మమిచ్చి పంపిన శక్తి స్వరూపుని సాక్షి! హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హా)లో నాకు అనుమానం కలిగించే ఎలాంటి చెడు విషయం నేనింతవరకు చూడలేదు. కాకపోతే ఆమె ఇంకా చిన్నపిల్లే అయినందున, ఇంట్లో పిండి కొట్టి ఉంచితే దాన్ని (నిర్లక్ష్యంగా) వదిలేసి నిద్రపోతుంది. ఈలోగా మేక వచ్చి దాన్ని కాస్తా తినిపోతుంది” అని అన్నది.

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఈ మాటలు విన్న తరువాత ఆ రోజే (మస్జిద్లో) వేదిక ఎక్కి (కపట విశ్వాసి) అబ్దుల్లా బిన్‌ ఉబైని శిక్షించే విషయం గురించి ప్రజలను అడిగారు. ఆయన ప్రజలను సంబోధిస్తూ ఇలా అన్నారు: “(సోదర) ముస్లింలారా! నా భార్యపై అపనింద మోపి నన్ను, నా కుటుంబాన్ని బాధించిన వ్యక్తిపై నా తరపున ప్రతీకారం తీర్చుకునేవారు ఎవరైనా ఉన్నారా? అల్లాహ్ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను నా భార్యలలో మంచితనం తప్ప మరేదీ చూడలేదు. అపవాదు మోపబడిన ఆ వ్యక్తిలో కూడా నేనింతవరకు ఎలాంటి చెడు చూడలేదు. అతను నా ఇంటికి ఎప్పుడొచ్చినా నేనింట ఉన్నప్పుడే వచ్చేవాడు. నేను లేనప్పుడు ఎన్నడూ రాలేదు.”

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పలికిన ఈ మాటలు విని బనీ అబ్దుల్ అష్‌హల్‌ ఉప తెగకు చెందిన హజ్రత్‌ సాద్‌ బిన్‌ ముఆజ్‌ (రది అల్లాహు అన్హాు)లేచి “దైవప్రవక్తా! నేను మీ తరపున ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ వ్యక్తి ఔస్‌ తెగవాడై ఉంటే నేను స్వయంగా అతడ్ని హతమారుస్తాను. ఒకవేళ అతను మా సోదర తెగ ఖజ్‌రజ్ కు చెందిన వాడయితే అతడి గురించి మీరు ఆజ్ఞాపించండి, మేము మీ  ఆజ్ఞను పాటిస్తాము” అని అన్నారు. ఈ మాట విని ఖజ్రజ్‌ తెగ నాయకుడు హజ్రత్  సాద్‌ బిన్‌ ఉబాదా (రది అల్లాహు అన్హాు)లేచి నిలబడ్డారు. ఆయన హజ్రత్‌ హస్సాన్‌ బిన్‌ సాబిత్‌ (రది అల్లాహు అన్హాు)తల్లికి వరుసకు సోదరుడవుతారు. (అంటే ఆమె పిన తండ్రి కొడుకు). ఆయన సాధారణంగా మంచి మనిషే. కాని సాద్‌ బిన్‌ ముఆజ్‌ (రది అల్లాహు అన్హాు)మాటలు విన్న తరువాత ఆయనలో అజ్ఞాన కాలంనాటి జాతీయ దురభిమానం పెల్లుబికింది. దాంతో ఆయన (ఉద్రేక పూరితుడయి) “నిత్య జీవుడయిన ప్రభువు సాక్షి! నీవు అబద్ధమాడుతున్నావు. నీవతడ్ని హతమార్చవు, హతమార్చలేవు కూడా. అతను గనక నీ తెగవాడయి ఉంటే, అతను చంపబడటానికి నీవు ఎన్నటికీ కోరవు” అని అన్నారు హజ్రత్‌ సాద్‌ బిన్‌ ముఆజ్‌ (రది అల్లాహు అన్హాు)తో.

హజ్రత్‌ సాద్‌ బిన్‌ ముఆజ్‌ (రది అల్లాహు అన్హాు)పిన తండ్రి కొడుకు హజ్రత్‌ ఉసైద్‌ బిన్‌ హజీర్‌ (రది అల్లాహు అన్హాు)ఈ మాట విని (దిగ్గున) లేచి నిలబడ్డారు. ఆయన సాద్‌ బిన్‌ ఉబాదా (రది అల్లాహు అన్హాు)ని సంబోధిస్తూ “నిత్య జీవుడయిన ప్రభువు సాక్షి! నువ్వొట్టి అబద్దాల రాయుడివి. మేమతడ్ని తప్పకుండా సంహరిస్తాం. నువ్వు కపట విశ్వాసిలా ఉన్నావు. అందుకే నువ్వు కపట విశ్వాసుల కొమ్ముకాస్తున్నావు అని అన్నారు.” ఈ సంభాషణ పెద్ద వివాదానికి దారి తీసింది. ఔస్‌, ఖజ్రజ్ రెండు తెగలు పరస్పరం భగ్గుమన్నాయి. కొట్లాటకు సిద్దమయ్యాయి. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వేదికపై నిలబడి ఉభయ తెగల వారికీ మాటి మాటికి సర్ది చెబుతూ వారిని శాంతపరచడానికి ప్రయత్నించారు. చివరికి ఎలాగో అందరూ శాంతించారు. గొడవ సద్దుమణిగింది. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కూడా మౌనంగా ఉండిపోయారు. నేనా రోజంతా ఏడుస్తూనే  ఉండిపోయాను. కంటి మీద కునుకు కూడా రాలేదు.

నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉన్నారు. నేనిలా ఒక పగలు, రెండు రాత్రులు నిరంతరాయంగా దుఃఖిస్తూ ఉన్నాను. కన్నీరు ఆగలేదు. నిద్ర కూడా పట్టలేదు. ఏడ్చి ఏడ్చి నా గుండె పగిలి పోతుందా అన్పించింది. కాస్సేపటికి ఒక స్త్రీ వచ్చి లోపల ప్రవేశించడానికి అనుమతి అడిగింది. నేనామెకు అనుమతిచ్చాను. ఆమె కూడా నాతోపాటు కూర్చొని ఏడ్వసాగింది. మేమా స్థితిలో ఉన్నప్పుడు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) (మా ఇంటికి) వచ్చారు. ఆయన సలాం చేసి కూర్చున్నారు. నా మీద అపనింద మోపబడిన నాటి నుంచి ఈ రోజు వరకు ఆయన నా దగ్గర కూర్చోలేదు. ఒక నెల గడచిపోయినా అపనింద విషయంలో ఆయనపై ఎలాంటి దివ్యావిష్కృతి (వహీ) అవతరించలేదు.

ఆయన కూర్చొని ముందుగా షహాదత్‌ కలిమా (సాక్ష్య వచనం) పఠించారు. ఆ తరువాత ఇలా అన్నారు : “ఆయిషా! నీ గురించి నేనీ మాట విన్నాను. నీవు ఏ పాపమెరగని దానివయితే త్వరలోనే అల్లాహ్ నీ పాతివ్రత్యాన్ని బహిర్గతం చేస్తాడు. ఒకవేళ నీ వల్ల ఎదైనా తప్పు జరిగి ఉంటే, పశ్చాత్తాప హృదయంతో అల్లాహ్ ముందు క్షమాపణ వేడుకో. దాసుడు తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో క్షమాపణ వేడుకుంటే, అల్లాహ్ అతని పాపాన్ని (తప్పకుండా) క్షమిస్తాడు.”

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తమ సంభాషణ ముగించగానే నా కన్నీటి ప్రవాహం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ తరువాత నా కళ్ళ నుంచి ఒక్క కన్నీటి బిందువు కూడా రాలలేదు. నేను మా నాన్నగారి వైపుకు తిరిగి “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పిన దానికి నా తరఫున మీరు సమాధానం ఇవ్వండి” అని అన్నాను. (మా నాన్న) హజ్రత్‌ అబూ బకర్‌ (రది అల్లాహు అన్హాు)మాట్లాడుతూ “(అమ్మాయ్‌!) అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. ఈ విషయంలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు ఏమని సమాధానమివ్వాలో నాకేమో అర్ధం కావడం లేదు” అని అన్నారు. ఆ తరువాత నేను మా అమ్మతో “(అమ్మా!) దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు నువ్వయినా సమాధానమివ్వు” అని అన్నాను. కాని మా అమ్మ కూడా “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు ఎం సమాధానమివ్వాలో నాకేమో తోచడంలేదు” అని అన్నది.

ఆ తరువాత నేను మాట్లాడటం మొదలెట్టాను. అప్పటికి నేను పెద్దగా వయసు లేని బాలికను. ఖుర్‌ఆన్‌ కూడా నేనెక్కువగా పఠించలేదు. అయినానేను మాట్లాడటానికి ఉపక్రమించాను. “మీరీ (అపనింద) మాటను బాగా విని ఉండటం వల్ల అది మీ అందరి హృదయాల్లో తిష్టవేసింది. అందరూ దీన్ని నిజమని భావిస్తున్నారు. అలాంటప్పుడు నేను ఏ పాపమెరుగని దాననంటే మీకు నమ్మకం కలగదు. ఒకవేళ నేను తప్పు చేయకపోయినా చేశానని ఒప్పుకుంటే మీరు వెంటనే నమ్ముతారు. కాని నేను ఎలాంటి పాపానికీ ఎంత మాత్రం పాల్పడలేదు. ఆ సంగతి అల్లాహ్ కి  తెలుసు. అందువల్ల అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. ఇప్పుడు నా పరిస్థితి, మీ పరిస్థితి హజ్రత్‌ యాఖూబ్‌ (అలైహిస్సలాం) పరిస్థితిలా ఉంది. ఈ స్థితిలో నేను హజ్రత్‌ యాఖూబ్‌ (అలైహిస్సలాం) అన్న మాటనే అంటాను. “ఇప్పుడు నేను ఉత్తమ రీతిలో సహనం వహిస్తాను. మీరు కల్పించి చెబుతున్న దాని గురించి నేనిక అల్లాహ్ ను  మాత్రమే సహాయం అర్ధించాలి’ (యూసుఫ్‌-18) అని అన్నారు ఆమె.”

…… ఇలా మాట్లాడిన తరువాత నేను పడక మీదికెళ్ళి పక్కకు తిరిగి పడుకున్నాను. నేను ఏ పాపమెరగని అమాయకురాలినని అల్లాహ్ కి  బాగా తెలుసు. అందువల్ల ఆయన నా పాతివ్రత్యాన్ని తప్పకుండా బహిర్గతం చేస్తాడని నాకు గట్టి నమ్మకం ఉండింది. అయితే అల్లాహ్ నా ఈ వ్యవహారంలో (ప్రళయం దాకా) నిత్యం పఠించబడేలా దివ్య వచనాలను అవతరింపజేస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు. నా వ్యవహారంలో అల్లాహ్ ప్రత్యేకంగా (దివ్య)వాణిని అవతరింపజేయడానికి నేనంతటి గొప్పదానిని కూడా కాను. కాని దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కలలో అలాంటిదేదైనా కన్పిస్తుందని మాత్రం నాకు నమ్మకముండింది.

అయితే దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తమ స్థానం నుండి లేవకుండా అలాగే కూర్చున్నారు. అటు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరూ లేచి బయటకు వెళ్ళలేదు. (ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే మట్టి బొమ్మల్లా కూర్చుండిపోయారు). అంతలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పై ‘దివ్యావిష్కృతి’ (వహీ) అవతరించింది. దివ్యావిష్కతి సమయంలో ఎర్పడే అనిర్వచనీయమైన బాధ ఆయన్ని క్రమ్ముకుంది. దైవవాణి మోపిన భారం వల్ల తీవ్రమైన చలిలో సయితం ఆయన శరీరం నుండి చెమట బిందువులు రాలసాగాయి. కాస్సేపటికి ఈ పరిస్థితి దూరమయింది. అప్పుడు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పెదవులపై దరహాసం తొణికిసలాడింది. ఆయన నోట వెలువడిన మొట్టమొదటి వాక్యం (చూడండి). “ఆయిషా! అల్లాహ్  నీ పాతివ్రత్యాన్ని ధృవపరిచాడు” అని అన్నారు ఆయన.

మా అమ్మ ఈ మాట వినగానే “ఇక లే. లేచి దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు కృతజ్ఞతలు చెప్పుకో” అని అన్నది. నేను (తల అడ్డంగా తిప్పుతూ) “నేను లేవను. అల్లాహ్ సాక్షి! పరమోన్నతుడయిన నా ప్రభువుకు తప్ప మరెవరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకోను” అని అన్నాను – దివ్యావిష్కృతి ద్వారా నూర్‌ సూరాలోని ఈ సూక్తులు వెలువడ్డాయి :

“ఈ అపవాదును మీలోనే ఒక వర్గం లేవదీసింది. (జరిగిందేదో జరిగింది, కాని) దీన్ని మీరు (మీ విషయంలో) చెడుగా భావించకండి. ఇది మీకు (ఒకందుకు) మంచిదే. ఇందులో ఎవరు ఎంత పాత్ర వహించారో ఆ మేరకు వారు పాపాన్ని మూటగట్టుకున్నట్లే. ఈ వ్యవహారం గురించి అత్యధిక బాధ్యతను నెత్తిమీద వేసుకున్న ప్రధాన పాత్రధారికి మాత్రం కఠినాతి కఠినమైన శిక్ష కాచుకొని ఉంది.” (11)

“ఈ నిందారోపణను వినగానే విశ్వాసులైన స్త్రీ పురుషులు అనుమానానికి లోనుకాకుండా సహృదయంతో ఎందుకు ఉండలేదు? మీరు అప్పటికప్పుడు ఇది పూర్తిగా నిరాధారమైన అపనింద అని ఎందుకు ఖండించలేదు? వారు (తమ నిందారోపణను నిరూపించుకోవడానికి) నలుగురు సాక్షులను ఎందుకు తీసుకురాలేదు? వారు సాక్ష్యం తీసుకురాలేదు. (తీసుకు రాలేరు కూడా, కనుక) అల్లాహ్ దృష్టిలో వారే పచ్చి అబద్దాలరాయుళ్ళు. (12, 13).

“మీ మీద ఇహపరలోకాల్లో అల్లాహ్ అనుగ్రహం, ఆయన కరుణాకటాక్షాలే గనక లేకపోయి ఉంటే, మీరు ఏ (నిరాధారమైన) మాటల్లో పడిపోయారో వాటి పర్యవసానంగా మీపై ఓ ఘోరమైన విపత్తు వచ్చిపడేదే. ఈ అసత్యారోపణ (ఎంత చెడ్డ విషయమో కాస్త మీరే ఆలోచించండి అది) మీ మధ్య ఒకరి నుంచి మరొకరికి (కార్చిచ్చులా) వ్యాపిస్తూ పోయింది. మీకు వాస్తవం ఎమిటో తెలియని విషయం మీనోట వెలువడసాగింది. మీరు దాన్ని సాధారణ విషయమని భావిస్తూ ఉండేవారు. కాని అల్లాహ్ దృష్టిలో ఇది చాలా తీవ్రమైన విషయం. (14-15)

“ఈ విషయం వినగానే “ఇలాంటి మాటలు పలకడం మనకు తగదు, అల్లాహ్ పరిశుద్దుడు. ఇది పూర్తిగా నీలాపనింద అని మీరు ఎందుకు అనలేదు? మీరు విశ్వాసులే అయితే ఇక ముందు ఎన్నటికీ ఇలాంటి పనులకు పాల్పడకూడదని అల్లాహ్ మీకు ఉపదేశిస్తున్నాడు. (మీరు విషయాన్ని అర్ధం చేసుకోవడానికి) అల్లాహ్ మీకు తన బోధనలను విడమరచి తెలియజేస్తున్నాడు. ఆయన సర్వం తెలిసిన వాడు, ఎంతో వివేకవంతుడు.” (16-18)

‘“విశ్వసించినవారి మధ్య అశ్లీల విషయాలు వ్యాపించాలని కోరుకునేవారు ఇటు ప్రపంచంలోనూ, అటు పరలోకంలోనూ వ్యధాభరితమైన శిక్షకు అర్హులవుతారు. (అశ్లీలం సమాజం మీద ఎంత దుష్ప్రభావం వేస్తుందో) అల్లాహ్ కి తెలుసు; మీకు తెలియదు. మీ మీద అల్లాహ్ అనుగ్రహం, ఆయన కారుణ్య కటాక్షాలు గనక లేకపోయి ఉంటే, అల్లాహ్ వాత్సల్యమూర్తి, దయామయుడు అయి ఉండకపోతే (మీ మధ్య వ్యాపింపజేయబడిన ఈ విషయం దారుణమైన పరిణామాలకు దారి తీసి ఉండేది). (19, 20)

“కనుక విశ్వాసులారా! షైతాన్‌ అడుగుజాడల్లో నడవకండి. వాడు తనను అనుసరించే వారికి చెడు, అశ్లీలతలను గురించే ఆదేశిస్తాడు. మీ మీద అల్లాహ్ అనుగ్రహం, ఆయన కారుణ్య కటాక్షాలే గనక లేకపోతే మీలో ఏ ఒక్కడూ పరిశుద్ధుడు కాలేడు. అయితే అల్లాహ్ తాను కోరిన వ్యక్తిని పరిశుద్ధం చేస్తాడు. ఆయన సర్వం వినేవాడు. సమస్తం ఎరిగిన వాడు.” (21)

“మీలోని ఉదార స్వభావులు, (ఆర్థిక) స్తోమత కలిగినవారు. (ఈ అపనిందలో పాలు పంచుకున్న) తమ బంధువులకు, నిరుపేదలకు, అల్లాహ్ మార్గంలో ఇల్లు వాకిలి వదలి వలస వచ్చిన వారికి సహాయం చేయము అని ప్రతిన బూనకూడదు. వారిని క్షమించాలి, ఉదారంగా వ్యవహరించాలి. అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని మీరు కోరుకోరా? అల్లాహ్ ఎంతో క్షమాశీలి, దయామయుడు.” (22)

“శీలవంతులయిన అమాయక ముస్లిం మహిళలపై లేనిపోని అపనిందలు మోపేవారు ఇటు ప్రపంచంలోనూ, అటు పరలోకంలోనూ శాపగ్రస్తులవుతారు. వారి కోసం కఠినాతి కఠిన శిక్ష ఉంది.” (23)

“ఇలా అపనిందలు మోపేవారు, స్వయంగా తమ నోళ్ళు, తమ కాళ్ళు చేతులే తమ అకృత్యాలను గురించి (తమకు వ్యతిరేకంగా) సాక్ష్యమిచ్చే రోజు ఒకటి వస్తుందన్న సంగతి మరచిపోకూడదు. ఆ రోజు అల్లాహ్ వారి కర్మలను బట్టి వారికి పూర్తి ప్రతిఫలాన్నిస్తాడు. అప్పుడు తెలుస్తుంది వారికి అల్లాహ్ యే సత్యమని, అల్లాహ్ యే నిజాన్ని నిజం చేసి చూపేవాడని.” (24, 25)

అపవిత్ర స్త్రీలు అపవిత్ర పురుషులకొరకు, అపవిత్ర పురుషులు అపవిత్ర స్త్రీల కొరకు తగినవారు. అలాగే పవిత్ర స్త్రీలు పవిత్ర పురుషుల కొరకు, పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీల కొరకు యోగ్యులు. జనం చెప్పుకునే (తప్పుడు) మాటల నుండి వారు పరిశుద్ధులు, పవిత్రులు. వారి కోసం మన్నింపు, ఉదారమైన ఉపాధి ఉన్నాయి.” (26)

(దివ్య ఖుర్‌ఆన్‌ – 24:11-26)

ఈ సూక్తుల్ని అల్లాహ్ నా పవిత్రత, పాతివ్రత్యాలను గురించి అవతరింపజేశాడు. (మా నాన్న) హజ్రత్‌ అబూ బకర్‌ (రది అల్లాహు అన్హాు)(తమ నిరుపేద బంధువయిన;) మిస్తహ్‌ బిన్‌ అసాసా (రది అల్లాహు అన్హాు)కు ధన సహాయం చేస్తుండేవారు. అయితే (నా మీద వచ్చిపడిన అపనిందలో ఆయన కూడా భాగం పంచుకోవడం వల్ల) ఆయన (ఆగ్రహం వెలిబుచ్చుతూ) “అల్లాహ్ సాక్షి! (నా కుమార్తె) ఆయిషా (రది అల్లాహు అన్హా)ను గురించి మిస్తహ్‌ (రది అల్లాహు అన్హాు)అన్న మాటలకు (నా హృదయం తూట్లు పడింది) నేనిక నుండి అతని కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టను ‘ అని అన్నారు. ఆయనలా అన్నందుకు అల్లాహ్ ఈ సూక్తిని అవతరింపజేశాడు : “మీలో దయానుగ్రహం పొందినవారు, (ఆర్థిక) స్తోమత కలిగిన వారు (ఈ అపనిందలో పాలు పంచుకున్న) తమ బంధువులకు, నిరుపేదలకు, ఇల్లు వాకిలి వదలి అల్లాహ్ మార్గంలో వలస వచ్చిన వారికి సహాయం చేయబోమని ప్రతిన బూనకూడదు. వారిని క్షమించాలి, వారి పట్ల ఉదారంగా మసలుకోవాలి. అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని మీరు కోరుకోరా? అల్లాహ్ ఎంతో క్షమాశీలి. దయామయుడు.” (24:22) ఈ సూక్తి అవతరించిన తరువాత హజ్రత్‌ అబూ బకర్‌ (రది అల్లాహు అన్హాు)(మనసు మార్చుకొని) “ అల్లాహ్ సాక్షి! అల్లాహ్ నన్ను క్షమించాలనే నేను కోరుకుంటున్నాను. ఇక నుంచి నేనీ సహాయాన్ని ఎన్నటికీ నిలిపి వేయను” అని అన్నారు. ఆయన మిస్తహ్‌ (రది అల్లాహు అన్హాు)కు ఇది వరకు ఎంత ధన సహాయం అంద చేస్తుండేవారో ఆ సహాయాన్ని తిరిగి అందజేయడం (ప్రారంభించారు.

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నా వ్యవహారం గురించి (విశ్వాసుల మాతృమూర్తి) హజ్రత్‌ జైనబ్‌ బిన్తె జహష్‌ (రది అల్లాహు అన్హా)ని కూడా విచారించారు. “ఈ విషయంలో నీకేమయినా తెలుసా?” అన్నారు ఆయన. దానికామె “దైవప్రవక్తా! నేను నా కళ్ళు చెవుల విషయంలో చాలా జాగ్రత్తగా మసలుకుంటాను. (చూడకుండా, వినకుండా, నోటికొచ్చినట్లు మాట్లాడను ). అల్లాహ్ సాక్షి! నేనామెలో మంచితనం తప్ప మరేదీ చూడలేదు” అని అన్నారు. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) భార్యలలో ఒక్క జైనబ్‌ (రది అల్లాహు అన్హా) మాత్రమే నాకు పోటీగా నిలిచే స్రీ. (అయినప్పటికీ ఆమె ఈ వ్యవహారంలో సవతి అసూయ ప్రదర్శించకుండా న్యాయంగా మాట్లాడారు) ఆమెలోని భక్తి పరాయణత వల్ల అల్లాహ్ ఆమెను (ఈ రొంపి నుండి) కాపాడాడు. అయితే హజ్రత్‌ జైనబ్‌ (రది అల్లాహు అన్హా)ను ఎల్లప్పుడూ సమర్ధిస్తూ మాట్లాడే ఆమె సోదరి మాత్రం అపవాదు లేపిన వారితో చేరి నాశనమయిపోయింది.

అపవాదు వ్యవహారంలోకి, నాతో పాటు ఈడ్చబడిన ఆ వ్యక్తి [3] అన్న పలుకులు కూడా ఎంతో గమనార్హమైనవి. ఆయన “అల్లాహ్ మాత్రమే పరిశుద్దుడు, పవిత్రుడు. కాని నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. ఈ రోజు వరకు నేను ఏనాడూ ఏ (పర) స్త్రీ వలువ విప్పలేదు” అని అన్నారు. ఈయన ఆ తరువాత కొన్నాళ్ళకు అల్లాహ్ మార్గంలో పోరాడుతూ అమరగతులయ్యారని హజ్రత్‌ ఆయిషా (రది అల్లాహు అన్హా)తెలిపారు.

(సహీహ్‌ బుఖారీ:- 64వ ప్రకరణం – మగాజీ, 34వ అధ్యాయం – హదీసిల్‌ ఇఫ్క్‌)

1764. హజ్రత్‌ ఆయిషా (రది అల్లాహు అన్హా)కథనం :- నా మీద లేనిపోని అపనింద మోపబడినప్పుడు నాకా సంగతే తెలియదు. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రసంగించడానికి (వేదికపై) నిలబడ్డారు. మొదట ఆయన షహాదత్‌ కలిమా (సాక్ష్య వచనం) పఠించారు. తరువాత అల్లాహ్ ని ఆయన ఔన్నత్యానికి తగిన విధంగా స్తుతించారు. ఆ తరువాత ఇలా అన్నారు. “నా భార్య మీద అపనింద మోపిన వ్యక్తిని గురించి మీరు నాకేదయినా సలహా ఇవ్వండి. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. నా కుటుంబ నభ్యులను గురించి ఎలాంటి చెడు విషయం కూడా ఎన్నడూ నా దృష్టికి రాలేదు. నా భార్యతో పాటు ఈ అపనిందలో ఇరికించబడిన వ్యక్తి గురించి కూడా నేనెప్పుడూ చెడు విషయం వినలేదు. అతను నా ఇంటికి నేను లేనప్పుడు ఎన్నడూ రాలేదు. నేనెప్పుడైనా ప్రయాణమయి ఎక్కడికైనా వెళ్తే అతను కూడా నాతో పాటే ఉండేవాడు.”

హజ్రత్‌ ఆయిషా (రది అల్లాహు అన్హా )కథనం :- దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నా యింటికి వచ్చి నా గురించి నా సేవకురాలిని విచారించారు. దానికి ఆమె సమాధానమిస్తూ “ఎంత మాత్రం లేదు. నేను ఆయిషా (రది అల్లాహు అన్హా)లో ఏనాడూ ఎలాంటి చెడునూ చూడలేదు. కాకపోతే ఆమె (అప్పుడప్పుడు) ఆదమరచి నిద్ర పోతుంది, అప్పుడు మేక వచ్చి పిండి తినిపోతుంది’ అని అన్నది. నా ఈ  సేవకురాలిని ప్రవక్త అనుచరులలో కొందరు గదమాయించారు, కోపగించుకున్నారు. అయినప్పటికీ ఆమె “అల్లాహ్ పరిశుద్ధుడు. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. స్వర్ణకారుణికి మేలిమి బంగారం గురించి ఏం తెలుసో ఆయిషా (రది అల్లాహు అన్హా)ను గురించి కూడా నాకు అదే తెలుసు. (అంతకు మించి మరేమో తెలియదు)” అని అన్నది. ఈ అపవాదులో నాతోపాటు ఇరికించబడిన వ్యక్తికి అపవాదు సంగతి తెలిసినపుడు “అల్లాహ్ పరిశుద్ధుడు. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. నేనీ రోజు వరకు ఏ (పర) స్త్రీ వలువ విప్పలేదు” అని అన్నాడు. ఈయన ఆ తరువాత కొన్నాళ్ళకు అల్లాహ్ మార్గంలో పోరాడుతూ అమరగతులయ్యారు.

(సహీహ్‌ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్‌, 24వ సూరా – నూర్‌, 11వ అధ్యాయం – ఇన్నల్లజీన యుహిబ్బూన అన్తషీ అల్‌ ఫాహిషతు ఫిల్లజీన ఆమనూ)

Footnotes:

[1] | ఒక యుద్ధం అంటే ఇక్కడ “బనీ ముస్తలిఖ్‌ యుద్ధం” అని అర్థం. దీన్నే ‘మురసీ యుద్ధం” అని కూడా అంటారు. (సంకలనకర్త)

[2] | ఇక్కడ మూలభాషలో ప్రయోగించిన ‘ఉస్బా’ అనేపదానికి పది నుండి నలభై మంది వ్యక్తుల ముఠా అని అర్ధం వస్తుంది (సంకలనకర్త)

[3] ఈ వ్యక్తి పేరు హజ్రత్‌ సఫ్వాన్‌ బిన్‌ ముఅత్తల్‌ (రది అల్లాహు అన్హాు)- (సంకలనకర్త)


ఇది మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) లో పశ్చాత్తాప ప్రకరణం నుండి తీసుకోబడింది.

పర స్త్రీతో ఏకాంతంలో ఉండుట | ఇస్లామీయ  నిషిద్ధతలు & జాగ్రత్తలు

బిస్మిల్లాహ్

షైతాన్‌ ఎల్లప్పుడూ మానవులను ఏదైనా ఉపద్రవంలో పడవేయడానికి మరియు నిషిద్ధ కార్యానికి గురిచెయ్యడానికి పరితపిస్తూ ఉంటాడు. అందుకే అల్లాహ్‌ మనల్ని ఈ విధంగా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ وَمَن يَتَّبِعْ خُطُوَاتِ الشَّيْطَانِ فَإِنَّهُ يَأْمُرُ بِالْفَحْشَاءِ وَالْمُنكَرِ

“విశ్వాసులారా! షైతాను అడుగుజాడలలో నడవకండి, ఎవడు షైతాన్‌ అడుగుజాడలలో నడుస్తాడో నిశ్చయంగా షైతాన్‌ అతనిని అశ్లీలమైన మరియు అసభ్యకరమైన పనులు చేయటానికి ప్రోత్సహిస్తాడు” (సూర నూర్‌ 24:21)

being-alone-with-a-non-mahram-woman

మనిషి శరీరంలో రక్తం ఎలా ప్రవహిస్తుందో అలాగే షైతాన్‌ మానవ శరీరంలో తిరుగుతుంటాడు. మానవులను అశ్లీల  కార్యం (వ్యభిచారం)లో పడవేయడానికి షైతాన్‌ మార్గాల్లో ఒకటి పరస్త్రీతో ఒంటరిగా ఉండడం. అందుకే ఇస్లాం ధర్మం ఆ మార్గాన్ని మూసివేసింది. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఆదేశించారు?

“వినండి! ఏ పురుషుడైనా ఏ స్త్రీతో ఏకాంతంలో ఉంటాడో వారిద్దరితో మూడోవాడు షైతాన్‌ ఉంటాడు”. (తిర్మిజి 2165. మిష్కాతుల్‌ మసాబీహ్‌ 3118).

being-alone-with-a-non-mahram-woman

ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారని అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్ర్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“ఈ రోజు తరువాత ఎవ్వరూ కుడా భర్త లేకుండా ఒంటరిగా ఉన్న స్త్రీ ఇంటిలో ప్రవేశించకూడదు. (ఏదైనా అవసరం ఉండి పోదలుచుకుంటే) అతనితో ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు ఉండాలి”.(ముస్లిం 2173).

ఏ పురుషుడు కూడా ఇంటిలోగాని, గదిలోగాని, వాహనములోగాని ఎక్కడైనా పరస్త్రీతో ఏకాంతంలో ఉండకూడదు. ఆమె సోదరుని భార్య అయినా, సేవకురాలు, ఆడ పనిమనిషి అయినా, డాక్టర్‌ వద్ద ఆడరోగి అయినా ఎవరైనా సరే. అనేక మంది తమపై లేదా ఇతరులపై నమ్మకంతో ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు. అందువల్ల వ్యభిచారంలో లేదా దాని కారణంగల విషయాల్లో పడే భయం ఉంటుంది. తర్వాత వంశవృక్ష౦లో లోటు మరియు అక్రమ సంతానాలు అధికమవుతున్న విషాద వార్తలు వినవస్తాయి.


[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు అను పుస్తకం నుంచి తీసుకోబడింది. ]

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/

తల్లిదండ్రుల ఆస్తిలో కూతుర్ల హక్కు [వీడియో & టెక్స్ట్]

తల్లిదండ్రుల ఆస్తిలో కూతుర్ల హక్కు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

https://www.youtube.com/watch?v=YLpOMHUjZH0 [ 7 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో వారసత్వపు హక్కుల గురించి, ముఖ్యంగా తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెల వాటా గురించి వివరించబడింది. సూరహ్ అన్-నిసాలోని ఆయతుల (వచనాల) ఆధారంగా, కుమారులతో పాటు కుమార్తెలకు కూడా ఆస్తిలో నిర్ధారితమైన వాటా ఉందని స్పష్టం చేయబడింది. ఆస్తి తక్కువైనా, ఎక్కువైనా సరే, ఈ వాటాను ఇవ్వడం అల్లాహ్ నిర్దేశించిన విధి (ఫర్ద్) అని నొక్కి చెప్పబడింది. ఆడపిల్లల వారసత్వపు హక్కును కాలరాయడం, కట్నకానుకలు ఇచ్చామనే సాకుతో వారి వాటాను నిరాకరించడం ఘోరమైన పాపమని హెచ్చరించబడింది. ప్రతి చర్యకు అల్లాహ్ సాక్షిగా ఉన్నాడని, ప్రళయ దినాన ప్రతి ఒక్కరూ తమ హక్కుల కోసం నిలదీస్తారని, అప్పుడు న్యాయం జరుగుతుందని గుర్తుచేయబడింది.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్.

لِلرِّجَالِ نَصيِبٌ مِّمَّا تَرَكَ الْوَالِدَانِ وَالأَقْرَبُونَ وَلِلنِّسَاء نَصِيبٌ مِّمَّا تَرَكَ الْوَالِدَانِ وَالأَقْرَبُونَ مِمَّا قَلَّ مِنْهُ أَوْ كَثُرَ نَصِيبًا مَّفْرُوضًا

తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అలాగే తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది. ఆ ఆస్తి తక్కువైనాసరే, ఎక్కువైనాసరే (అందులో) వాటా మాత్రం నిర్ధారితమై ఉంది.” (సూరహ్ నిసా 4:7)

ఈ ఆయత్ ను గమనించండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, “విశ్వాసులారా, మీ తల్లిదండ్రులు, మీ బంధువులు వదిలిన ఆస్తిలో మీకు హక్కు ఉంది” అని చెప్పలేదు. పురుషులకు ప్రత్యేకంగా “లిర్రిజాలి నసీబ్” – పురుషులకు హక్కు ఉంది, పురుషులకు వాటా ఉంది. అలాగే “వలిన్నిసాఇ నసీబ్” – స్త్రీలకు. పురుషులు, తల్లిదండ్రుల యొక్క సంతానమైనా లేదా బంధువులలో పురుషులు. అలాగే, ఎవరైనా తల్లిదండ్రులకు కూతుళ్ళు ఉన్నారు, అలాగే కుమారులు ఉన్నారు. అయితే ఎలాగైతే కుమారులకు తల్లిదండ్రుల ఆస్తిలో వాటా ఉందో, అలాగే కూతుళ్ళకు కూడా ఉంది.

ఇక్కడ గమనించవలసిన మరో విషయం, “మిమ్మా ఖల్ల మిన్హు అవ్ కసుర్” – ఆస్తి ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా. అరే, మా తల్లిదండ్రి చాలా తక్కువ వదిలి వెళ్లారు, మా చెల్లెళ్లకు, మా అక్కలకు లేదు అని ఎవరూ అనరాదు. ఎక్కువ వదిలినా, తక్కువ వదిలినా, ప్రతి ఒక్కరికీ అల్లాహ్ ఎవరెవరి పేర్లు చెప్పి వారి యొక్క హక్కులు నిర్ణయించాడో, వారికి తప్పకుండా అవి ఇవ్వాలి.

మరో విషయం గమనించాల్సింది, “నసీబమ్ మఫ్రూదా”. “మఫ్రూదా” అన్న దానికి మన కొన్ని తెలుగు ఖురాన్ అనువాదాల్లో “నిర్ధారితం” అన్న పదం వచ్చింది. కానీ “మఫ్రూదా” ఫర్ద్ నుండి. అంటే ఇది ఒక విధి. ఈ విధిని తప్పనిసరిగా పాటించాలి. ఇందులో ఎలాంటి కొరత అనేది చేయకూడదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చాలా స్పష్టంగా తెలుపుతున్నాడు.

మరి ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? ఎంతోమంది తమ అక్కచెల్లెళ్లకు సంబంధించినటువంటి, వారి తల్లిదండ్రులు ఏదైతే వదిలి వెళ్లారో, ఎందరో కొడుకులు, ఆ అక్కచెల్లెళ్ల యొక్క సోదరులు స్వయమే, మా హక్కు అని తీసుకుంటారు. మీకు మీ పెళ్లిళ్లలో కట్నకానుకల రూపంలో ఇచ్చేశాము, అయిపోయింది అని అంటారు. కానీ, ఈ కొడుకులకు వారి యొక్క చదువుల కొరకు, వారి యొక్క పెళ్లిళ్ల కొరకు, వారి యొక్క ఇంకా వేరే అవసరాలకు, ఉద్యోగం లేనందుకు ఏదైతే తండ్రి ఖర్చు పెట్టాండో, అవన్నీ కూడా మా తండ్రి మాకు ఖర్చు పెట్టాడు కదా, చెల్లెళ్లకు కట్నకానుకలు ఇచ్చినట్లుగా అని భావించకుండా, మీకు కట్నకానుకలు ఇవ్వడం జరిగింది, ఇక మీకు ఏ హక్కు లేదు అని కొట్టేస్తారు. అల్లాహ్ తో భయపడండి. ఒక ఫర్ద్ నమాజ్ ను వదులుట ఎంత పాపమని మీరు భయపడతారో, ఒక జకాత్ ఇవ్వడం విధిగా ఉంటే దానిని ఇవ్వకుంటే ఎంత పాపమని భయపడతారో, ఉపవాసం రమదాన్ లో ఉండడం విధి, అది ఉండకుంటే ఎంత పాపమని భయపడతారో, అలాగే అల్లాహ్ ఎవరికి ఆస్తిలో ఏ హక్కు నిర్ణయించాడో అది వారికి ఇవ్వకపోవడం అంతకంటే ఘోరమైన పాపం అని కూడా గమనించాలి. ఎందుకు? నమాజ్, రోజా, ఉపవాసాలు ఇలాంటివి అల్లాహ్ కు సంబంధించిన హక్కు. కానీ ఇక్కడ ఇది దాసులకు సంబంధించిన హక్కు.

ఇంకా మరొక ఆయత్ ఇదే సూరహ్ నిసాలో, ఆయత్ నెంబర్ 33 గమనించండి.

وَلِكُلٍّ جَعَلْنَا مَوَالِيَ مِمَّا تَرَكَ الْوَالِدَانِ وَالأَقْرَبُونَ وَالَّذِينَ عَقَدَتْ أَيْمَانُكُمْ فَآتُوهُمْ نَصِيبَهُمْ إِنَّ اللّهَ كَانَ عَلَى كُلِّ شَيْءٍ شَهِيدًا

తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తికి మేము వారి వారసులను నిర్థారించిపెట్టాము. మీరు ఎవరితోనయినా ఏదయినా ఒప్పందం చేసుకుని ఉంటే, తదనుగుణంగా వారి భాగాన్ని వారికి ఇవ్వండి. యదార్థానికి అల్లాహ్‌ అన్నింటిపై సాక్షిగా ఉన్నాడు.” (4:33)

తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలి వెళ్ళిన ఆస్తికి మేము వారి వారసులను నిర్ధారించాము. ఎవరికి ఏ వారసులు అనేది అల్లాహ్ నిర్ధారించాడు అని స్పష్టంగా చెప్పాడు. మీరు ఎవరితోనైనా ఏదైనా ఒప్పందం చేసుకుని ఉంటే, తదనుగుణంగా వారి భాగాన్ని వారికి ఇవ్వండి. “ఇన్నల్లాహ కాన అలా కుల్లి షైఇన్ షహీదా” అల్లాహు అక్బర్. యదార్థానికి అల్లాహ్ అన్నింటిపై సాక్షిగా ఉన్నాడు.

ఈ రోజు చెల్లెల్ల హక్కు ఏదైతే తినేస్తున్నారో, ఇహలోకంలో ఎవరు మీకు మీ వ్యతిరేకంగా సాక్షి ఉండకున్నా గానీ, అల్లాహ్ సాక్షిగా ఉన్నాడన్న విషయం మర్చిపోకండి. ప్రళయ దినాన అల్లాహ్ ముందు నిలబడినప్పుడు, అక్కడ మీ చెల్లెళ్లు, మీ సోదరీమణులు మీకు వ్యతిరేకంగా, మా తల్లిదండ్రులు వదిలిన ఆస్తిలో మా ఈ సోదరులు మాకు ఇవ్వలేదు అని అన్నప్పుడు, అక్కడ ఇవ్వడానికి ఏ ఇల్లు ఉండదు, ఏ భూమి ఉండదు, ఏ డబ్బు ఉండదు, ఏ బంగారం ఉండదు. ఆ రోజు మీ వద్ద ఏదైనా పుణ్యాలు ఉండేది ఉంటే అవి ఇవ్వాల్సి ఉంటుంది. లేదా అంటే, మీ సోదరీమణుల యొక్క పాపాలు దానికి పరిమాణంలో మీపై వేయబడుతుంది మరియు మీరు ఇహలోకంలో ఏదైతే మీ సోదరీమణుల హక్కులు చెల్లించలేదో, దానికి బదులుగా నరకంలో పోవలసి వస్తుంది. ఆ నరకం నుండి భయపడండి. సూరహ్ నిసాలో ఇంకా ఎన్నో ఆయతులు ఉన్నాయి ఈ ఆస్తికి సంబంధించిన, ఆయతులు చదవండి, గుణపాఠం నేర్చుకోండి.

అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5948

వారసత్వపు విద్య – మెయిన్ పేజీ
https://teluguislam.net/2026/01/27/laws-of-inheritance/

యూట్యూబ్ ప్లే లిస్ట్ :
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3vXEPX1zXyjGB6v0YY4opo


పరస్త్రీతో కరచాలనం (ముసాఫహా) చేయుట

బిస్మిల్లాహ్

మన సమాజంలోని కొన్ని ఆచారాలు అల్లాహ్‌ ధర్మం యొక్క హద్దులను మీరాయి. ప్రజల అలవాట్లు, వారి అంధవైఖరి అల్లాహ్‌ ఆదేశాలకు వ్యతిరేకంగా మితిమీరుతున్నాయి. చివరికి పరిస్థితి ఎంతవరకు చేరిందంటే నీవు వారిలోని ఏ ఒక్కరికైనా అల్లాహ్‌ ధర్మం ఆదేశం తెలిపి, దాని నిరూపణలు, నిదర్శనాలు చూపిస్తే వారు నిన్ను ప్రగతివిరోధి, సంకీర్ణవాది, బంధుత్వం తెంచువాడు మరియు సత్సంకల్పాల్లో అనుమానపడేవాడు అని నానారకాలుగా దూషిస్తారు. పినతండ్రి మరియు పెత్తండ్రి కూతుళ్ళతో, మేనత్త కూతుళ్ళతో, చిన్నమ్మ మరియు పెద్దమ్మ కూతుళ్ళతో, సోదరుల భార్యలతో, పినతండ్రి మరియు పెత్తండ్రి భార్యలతో మరియు మేనమామ భార్యలతో కరచాలనం చేయడం మన సమాజంలో నీళ్ళు త్రాగడం లాంటి తేలికగా మారింది. కాని ఇందులో ధార్మికంగా ఉన్న నష్టాలను తెలివైన దృష్టితో చూస్తే ప్రజలు అలా చేయడం మానుకుంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ హదీసు శ్రద్దగా చదవండి:

పరస్త్రీతో కరచాలనం (ముసాఫహా) చేయుట

“మీలో ఒకరి తలపై పెద్దసూది లేదా మొలతో గుచ్చడం పరస్త్రీని ముట్టుకునేదానికంటే ఎంతో మేలు”. (తబ్రానీ 20/212, సహీహుల్‌ జామి 4921).

ఇది చేతుల ద్వారా వ్యభిచారం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ ప్రవచనం చదవండి:

పరస్త్రీతో కరచాలనం (ముసాఫహా) చేయుట

రెండు కళ్ళు వ్యభిచారం చేస్తాయి. రెండు చేతులు వ్యభిచారం చేస్తాయి. రెండు కాళ్ళు వ్యభిచారం చేస్తాయి. మర్మాంగం వ్యభిచారం చేస్తుంది“. (అహ్మద్‌ 1/412, సహీహుల్‌ జామి 4126).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కన్నా పవిత్రహృదయం గలవాడు ఎవరైనా ఉన్నారా? (సమాధానం ఎవరూ లేరు  అనే వస్తుంది.) అయన ఏమన్నారో చదవండి:

పరస్త్రీతో కరచాలనం (ముసాఫహా) చేయుట

“నేను స్త్రీలతో కరచాలనం చేయను”.

(ముస్నద్‌ అహ్మద్‌ 6/357, సహీహుల్‌ జామి 2509).

మరో సందర్భంలో ఇలా అన్నారు:

పరస్త్రీతో కరచాలనం (ముసాఫహా) చేయుట

నేను స్త్రీల చేతులను తాకను“.

(తబ్రానీ కబీర్‌ 24/342, సహీహుల్‌ జామి 7054. ఇంకా చూడండి: ఇసాబ 4/354, దారుల్‌ కితాబిల్‌ అరబీ ముద్రణ).

ఆయిషా (రది అల్లాహు అన్హా) ఇలా చెప్పారు:

పరస్త్రీతో కరచాలనం (ముసాఫహా) చేయుట

“ఎన్నడూ లేదు, అల్లాహ్‌ సాక్షిగా! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హస్తం ఎన్నడూ ఏ పరస్త్రీ చేతిని కొంచమైనా తాకలేదు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో మాట ద్వారా బైఆత్‌ (విధేయత ప్రమాణం) చేసేవారు”. (ముస్లిం 1866, బుఖారి 5288).

జాగ్రత్త! తమ సోదరులతో కరచాలనం చేయని భార్యలను విడాకుల బెదిరింపులు ఇచ్చే భర్తలు ఇకనైనా అల్లాహ్‌తో భయపడాలి. అలాగే ఏదైనా వస్త్రము అడ్డుగా పెట్టి కరచాలనం చేయడం ఏ మాత్రం యోగ్యం కాదు. డైరక్ట్‌గా కరచాలనం చేసినా, ఏదైనా అడ్డుగా పెట్టి చేసినా అన్ని స్దితుల్లో పరస్త్రీలతో  కరచాలనం నిషిద్దమే అవుతుంది .


[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన “ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలుఅను పుస్తకం నుంచి తీసుకుబడింది. పదాలలో కొన్ని చిన్న మార్పులు చేశాము ]

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/