ఇబ్రాహీం అలైహిస్సలాం జీవిత సందేశం – హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజాహుల్లాహ్) (19th July 2020) – [సూరా అస్ సాఫ్ఫాత్ , అయతులు 99 నుండి 105 వరకు]
37. సూరా అస్ సాఫ్ఫాత్ , అయతులు 99 నుండి 105 వరకు
7:99 وَقَالَ إِنِّي ذَاهِبٌ إِلَىٰ رَبِّي سَيَهْدِينِ అతను (ఇబ్రాహీమ్) ఇలా అన్నాడు : “నేను నా ప్రభువు వైపుకే పోతాను. ఆయన తప్పకుండా నాకు మార్గం చూపుతాడు.
37:101 فَبَشَّرْنَاهُ بِغُلَامٍ حَلِيمٍ అందువల్ల మేమతనికి, సహనశీలుడైన ఒక అబ్బాయి గురించిన శుభవార్తను అందజేశాము.
37:102 فَلَمَّا بَلَغَ مَعَهُ السَّعْيَ قَالَ يَا بُنَيَّ إِنِّي أَرَىٰ فِي الْمَنَامِ أَنِّي أَذْبَحُكَ فَانظُرْ مَاذَا تَرَىٰ ۚ قَالَ يَا أَبَتِ افْعَلْ مَا تُؤْمَرُ ۖ سَتَجِدُنِي إِن شَاءَ اللَّهُ مِنَ الصَّابِرِينَ మరి ఆ కుర్రాడు అతని వెంట పరుగెత్తే ఈడుకు చేరుకున్నప్పుడు, “ఒరేయ్ చంటీ! నేను నిన్ను ‘జిబహ్’ చేస్తున్నట్లు కల చూస్తున్నాను! మరి నీ అభిప్రాయమేమిటో చెప్పు” అని అతను (ఇబ్రాహీం) అన్నాడు. “నాన్నగారూ! మీకు ఆజ్ఞాపించబడిన దానిని (నిస్సంకోచంగా) నెరవేర్చండి. అల్లాహ్ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు” అని ఆ బాలుడు అన్నాడు.
37:103 فَلَمَّا أَسْلَمَا وَتَلَّهُ لِلْجَبِينِ మరి వారిరువురూ (దైవాజ్ఞను) శిరసావహించినప్పుడు అతను తన కుమారుణ్ణి ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాడు.
37:105 قَدْ صَدَّقْتَ الرُّؤْيَا ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ “నువ్వు కలను నిజంచేసి చూపావు.” నిశ్చయంగా మేము సదాచార సంపన్నులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
చేపవాడు (యూనుస్ అలైహిస్సలాం) కోపగించుకుని వెళ్ళిపోయినప్పటి స్థితి(ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి.) మేము తనను పట్టుకోలేమని అతడు భావించాడు. ఆఖరికి అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి” అని మొరపెట్టుకున్నాడు.
అందువల్ల మేము అతని మొరను ఆలకించాము. దుఃఖం నుంచి అతనికి విముక్తిని కల్పించాము. విశ్వాసులను మేము ఇలాగే కాపాడుతాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మొదటి పంక్తిలో ఉండే కాంక్షలో కూడా గొప్ప ఘనత ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దాని నిర్ణీత ఫలితం తెలుపకుండా మౌనం వహించడమే దాని గొప్ప శ్రేష్ఠతను సూచిస్తుంది. ఆయన ప్రవచనం ఇలా ఉంది:
“అజాన్ చెప్పడంలో, మొదటి పంక్తిలో చేరడంలో ఎంత పుణ్యం ఉందో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటులు వేసుకునే పద్ధతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటులు వేసుకుంటారు. అలాగే నమాజ్ వేళ కాగానే తొలి సమయంలో (మస్జిద్) చేరడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీపడతారు“. (బుఖారీ 615, ముస్లిం 437).
జాబిర్ బిన్ సముర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా మధ్యలో వచ్చి “దైవదూతలు తమ ప్రభువు ముందు ఏ విధంగా బారులు తీరియుంటారో మీరు ఆ విధంగా మీ పంక్తులను సరి చేసుకోరా?” అని ప్రశ్నించారు. ‘దైవదూతలు తమ ప్రభువు ముందు ఎలా బారులు తీరియుంటారు ప్రవక్తా’ అని మేమడిగాము. “మొదటి పంక్తి పూర్తి చేశాకే దాని తర్వాత పంక్తిలో నిలబడతారు. మరియు దగ్గర దగ్గరగా కట్టు దిట్టంగా నిలబడతారు” అని చెప్పారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). (ముస్లిం 430).
అబూ సఈద్ ఖుద్రీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ అనుచరుల్ని నమాజులోని పంక్తుల నుండి వెనక ఉండడాన్ని చూసి ఇలా చెప్పారు: “ముందుకు రండి, మీరు నన్ను అనుసరించండి. మీ వెనక వారు మిమ్మల్ని అనుసరిస్తారు. (జాగ్రత్త!) ప్రజలు గనక ఎప్పుడూ వెనకే ఉంటే అల్లాహ్ కూడా వారిని వెనకబాటుతనానికి గురిచేస్తాడు“. (ముస్లిం 438).
(క) మొదటి పంక్తుల్లో ఉన్నవారిపై అల్లాహ్ మరియు ఆయన దూతల దీవెనలు:
బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పంక్తుల మధ్య వచ్చి మా భుజాలను, ఛాతిని వెనకా ముందు ఉండ కుండా సరిచేసేవారు. ఇంకా ఇలా అనేవారు: “మీరు పంక్తుల్లో వెనకా మందు విభిన్న రీతిలో నిలబడకండి, అందువల్ల మీలో మనస్పర్థలు ఏర్పడవచ్చు”. ఇంకా ఇలా అనేవారుః “మొదటి పంక్తుల్లో ఉన్నవారిని అల్లాహ్ తనకు అతిసన్నిహితంగా ఉన్న దైవదూతల మధ్య ప్రశంసిస్తాడు మరియు దైవదూతలు వారి కొరకు దుఆ చేస్తారు“. (అబూ దావూద్ 664).
9 – సున్నతె ముఅక్కద
(అ) నిరంతరం సున్నతె ముఅక్కద చదివేవారు స్వర్గంలో ఒక గృహానికి అర్హులవుతారు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నానని ఆయన సతీమణి ఉమ్మె హబీబ (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు: “ముస్లిం దాసుడు ప్రతి రోజూ ఫర్జ్ నమాజు కాకుండా పన్నెండు రకాతుల నఫిల్ నమాజు అల్లాహ్ కొరకు చేస్తూ ఉంటే అల్లాహ్ అతని కొరకు స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు. లేక ఒక ఇల్లు అతని కొరకు నిర్మించబడుతుంది“. (ముస్లిం 728).
సున్నతె ముఅక్కదలో కొన్ని ఫర్జ్ నమాజుకు ముందున్నాయి, మరి కొన్ని తర్వాతున్నాయి. అవి మొత్తం 12 రకాతులు.
ఫర్జ్ కంటే ముందున్నవి:
1- ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు:
“ఫజ్ర్ కు ముందు రెండు రకాతులు ప్రపంచము మరియు అందులో ఉన్నవాటి కంటే ఉత్తమమైనవి“. (ముస్లిం 725).
నాతో పాటు మీరు కూడా ఈ హదీసుపై శ్రద్ధ చూపండి:|
“ఫజ్ర్ సున్నతులు ప్రపంచం, వాటిపై ఉన్న డబ్బు, ధనము, బిల్డింగులు, కార్ల కంటే చాలా మేలైనవి.”
2- జొహ్ర్ కు ముందు 4రకాతులు.
ఫర్జ్ తర్వాతవి:
1- జొహ్ర్ తర్వాత రెండు. 2- మగ్రిబ్ తర్వాత రెండు. 3- ఇషా తర్వాత రెండు.
(ఆ) అస్ర్ కు ముందు నాలుగు రకాతులు చేయడం వల్ల అవి చేసేవారికి ప్రవక్త చేసిన రహ్మత్ యొక్క దుఆలో పాలుపంచుకునే భాగ్యం లభిస్తుంది. ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు:
“అస్ర్ కు ముందు నాలుగు రకాతులు చదివేవారి పై అల్లాహ్ కరుణ కురియుగాకా!”. (అబూ దావూద్ 1271, తిర్మిజి 430).
10 – అజాన్ మరియు ఇఖామత్ మధ్యలో దుఆ:
నమాజు వైపునకు త్వరగా వెళ్ళడం వల్ల అజాన్ మరియు ఇఖామత్ మధ్య దుఆ చేసే భాగ్యం కలుగుతుంది. మరియు ఇది దుఆ అంగీకార సమయం గనుక అదృష్టంగా భావించాలి. సమయమే గాకుండా మస్జిద్ స్థలం గనుక దాని శ్రేష్ఠతను దృష్టిలో ఉంచుకోవాలి. ఇంకా నమాజు కొరకు వేచి ఉండి దుఆ చేయడం అన్నది మరీ ఘనత గల విషయం. (ఇలా దుఆ అంగీకరించబడే అవకాశం ఎన్నో రకాలుగా ఉంది). ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లామీయ నిషిద్ధతలు (ముహర్రమాత్) – పార్ట్ 03 (23 జులై 2020) [40:44 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేయుట (జంతువును బలి ఇచ్చుట) షిర్క్.
فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ
నీ ప్రభువు కొరకే నమజు చేయు మరియు ఖుర్బానీ ఇవ్వు. (కౌసర్ 108: 2).
అంటే అల్లాహ్ కొరకు మరియు అల్లాహ్ పేరుతో మాత్రమే జిబహ్ చేయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఆదేశించారు:
لَعَنَ اللهُ مَنْ ذَبَحَ لِغَيْرِ الله
“అల్లాహ్కు కాక ఇతరుల కోసం జిబహ్ చేయువానిపై అల్లాహ్ శపించాడు”. (ముస్లిం 1978).
జిబహ్ లో రెండు నిషేధాలు ఏకమవుతాయి. (1) అల్లాహ్ కు తప్ప ఇతరుల కోసం జిబహ్. (2) అల్లాహ్ పేరుతో కాకుండా ఇతరుల పేరుతో జిబహ్. ఈ రెండు కారణాల వల్ల ఆ జంతువు మాంసం తినడం యోగ్యం కాదు. ఈ రోజుల్లో జిన్నుల పేరు మీద జిబహ్ చేసే షిర్క్ ప్రభలి ఉంది. అదేమనగా; ఇల్లు కొనుగోళు చేసినా, నిర్మించినా అందులో ఎక్కడైనా లేదా ప్రత్యేకించి దాని గడప మీద, అలాగే బావి త్రవ్వినా, అక్కడే ఓ జంతువు జిబహ్ చేస్తారు. అది షైతాన్ (భూతాల)కు భయపడి, వాని నష్టం నుండి దూరముండుటకు వాని పేరు మీద జిబహ్ చేస్తారు. (వాస్త వేమిటంటే అల్లాహ్ ను కాక ఇతరులతో భయపడరాదు. ఇలాంటి జిబహ్ చేయరాదు). (తైసీరుల్ అజీజుల్ హమీద్ 158. దారుల్ ఇఫ్తా ముద్రణ).
(4) అల్లాహ్ హరాం చేసినదానిని హలాల్ చేయుట, లేదా హలాల్ చేసిన దానిని హరాం చేయుట
అల్లాహ్ హరాం చేసినదానిని హలాల్ చేయుట, లేదా అల్లాహ్ హలాల్ చేసినదానిని హరాం చేయుట, లేదా ఇలాంటి హక్కు అల్లాహ్ తప్ప ఇతరులకు ఉంది అని నమ్ముట, లేదా సమస్యల తీర్పు కొరకు ఇస్లాం ధర్మం కాకుండా ఇతర న్యాయస్థానాలకు వెళ్ళుట, మరియు ఇస్లామీయ చట్టాలతో కాకుండా ఇతర చట్టాలతో తీర్పు కోరుట, లేదా అది యోగ్యమేనని సంతోషంగా నమ్ముట ఎంతటి భయంకరమైన అవిశ్వాసంలోకి వస్తుందో ఈ ఆయతు ద్వారా తెలుసుకోండి:
వారు (యూదులుక్రైస్తవులు) అల్లాహ్ ను కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. (తౌబా 9: 31).
ఈ ఆయతు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పఠిస్తుండగా, అదీ బిన్ హాతిం (రజియల్లాహు అన్హు) విని, ప్రవక్తా! యూదులు, క్రైస్తవులు తమ పండితులను, సన్యాసులను ఆరాధించేవారు కారు కదా? అని చెప్పగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అవును, కాని అల్లాహ్ హరాం చేసిన దానిని వారి పండితులు, సన్యాసులు హలాల్ చేస్తే వారు దానిని హలాల్ గానే భావించే వారు. ఇంకా అల్లాహ్ హలాల్ చేసినదానిని వారి పండితులు, సన్యాసులు హరాం చేస్తే వారు దానిని హరాంగానే భావించేవారు. కనుక ఇది వారిని ఆరాధించినట్లు” అని సమాధానం చెప్పారు. (బైహఖీ ఫీ సుననిల్ కుబ్రా 10/116, తిర్మిజి 3095, ఇది హసన్ అని షేఖ్ అల్బానీ గాయతుల్ మరాం 19లో తెలిపారు).
నిషిద్ధతలను నిషిద్ధంగా నమ్మనివారు యూదులు, క్రైస్తవులు మరియు బహుదైవారాధకులు అని అల్లాహ్ ఈ క్రింది ఆయతులలో స్పష్టం చేశాడు:
ఇలా అను: మీరు ఆలోచించరా! అల్లాహ్ మీ కొరకు అవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీరు స్వయంగానే కొన్నింటిని హరాం చేసు కున్నారు. మరికొన్నింటిని హలాల్ చేసుకున్నారు. ఇలా అడుగు: ఇలా చేయడానికి అల్లాహ్ మీకు అనుమతించాడా? లేదా మీ బూటక కల్పనలను అల్లాహ్ కు అంటగట్టుతున్నారా?. (యూనుస్ 10: 59).
(5) చేతబడి
చేతబడి (చేయుట, చేయించుట, నేర్పుట, నేర్చుకొనుట) అవిశ్వాసంలో లెక్కించ బడుతుంది. అది వినాశనానికి గురి చేసే ఏడు మహాపాపాల్లో ఒకటి. అది నష్టమే కలుగజేస్తుంది తప్ప ఏమీ లాభం కలగజేయదు. దానిని నేర్చుకొనుట గురించి అల్లాహ్ ఇలా తెలిపాడు:
సులైమాను ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్ట లేదు. అసలు అవిశ్వాసానికి పాల్పడినది ప్రజలకు చేతబడిని బోధించే షైతానులే. వారు హారూత్, మారూత్ దేవదూతల ద్వారా (ఇరాఖ్ లోని) బాబీలోనియాలో అవతరింప జేసినదాని వెంట బడ్డారు. ఎవడికైనా ఆ విద్యను నేర్పినప్పుడు ఆ దేవ దూతలు స్పష్టంగా ఇలా హెచ్చరిక చేసేవారుః జాగ్రత్త! మేము (మానవు లకు) కేవలం ఒక పరీక్ష మాత్రమే. కనుక మీరు (జాలవిద్యను నేర్చుకొని) అవిశ్వాసులు కాకండి. (బఖర 2: 102).
మాంత్రికుని గురించిన ఆదేశమేమిటంటే అతడ్ని హతమార్చాలి. అతని సంపద కూడా నిషిద్ధమైన చెడు సంపద. అజ్ఞానులు, దుర్మార్గులు, బలహీన విశ్వాసులు మాంత్రికుల వద్దకు వెళ్ళి , ఇతురలపై అన్యాయం, దౌర్జన్యం చేయడానికి, లేదా ప్రతీకారం తీర్చుకోడానికి చేతబడి చేయిస్తారు. మరికొందరు తనపై చేయబడిన చేతబడిని దూరం చేయించు- కోడానికి మాంత్రికుని వద్దకు వెళ్ళి ఓ నిషిద్ధ కార్యానికి పాల్పడతారు. ఇలాంటప్పుడు మాంత్రికుల వద్దకు వెళ్ళకుండా అల్లాహ్ వైపునకు మరలి, ‘ముఅవ్విజాత్’ వంటి అల్లాహ్ పవిత్రవచనాల ఆధారంగా అల్లాహ్ తో స్వస్థత కోరాలి. (ముఅవ్విజాత్ అంటే సూర ఫలఖ్, సూర నాస్ మరియు దీనికి సంబంధించిన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నేర్పిన దుఆలు).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లామీయ నిషిద్ధతలు (ముహర్రమాత్) – పార్ట్ 02 (16 జులై 2020) [1:04:21 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
“ఘోరపాపాల్లోనే మరీ ఘోరమైన పాపం ఏదో తెలుపనా?” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మూడు సార్లు ప్రశ్నించారు. దానికి వారన్నారు: తప్పక తెలుపండి ప్రవక్త అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “అల్లాహ్ కు భాగస్వాములను కల్పిం చుట”. (బుఖారి 2654, ముస్లిం 87).
అల్లాహ్ షిర్క్ తప్ప ఏ పాపాన్నైనా క్షమించగలడు. దానికి ప్రత్యేకమైన పశ్చాత్తాపం తో క్షమాభిక్ష కోరడం (తౌబా చేయడం) తప్పనిసరి. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః
“నిశ్చయంగా అల్లాహ్ తనకు భాగస్వామిని కల్పించటాన్ని ఏ మాత్రం క్షమించడు. అది తప్ప దేనినయినా తాను కోరినవారిని క్షమిస్తాడు“. (నిసా 4: 48).
షిర్క్ లో ఒక రకం పెద్ద/ఘోరమైన షిర్క్ (షిర్కె అక్బర్). ఇది ఇస్లాం నుండి బహిష్కరణకు కారణమవుతుంది. తౌబా చేయకుండా అదే స్థితిలో మరణించేవాడు నరకంలో ప్రవేశించి అందులో శాశ్వతంగా ఉంటాడు. ముస్లిం సమాజంలో ప్రబలి ఉన్న ఈ రకమైన షిర్క్ యొక్క కొన్ని రూపాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
1. సమాధుల పూజ
సమాధులను పూజించడం, మరణించి సమాధుల్లో ఉన్న వలీలు (పుణ్యపురుషులు) అవసరాలను తీరుస్తారని, కష్టాలను తొలిగిస్తారని నమ్మడం మరియు అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నదాని సహాయం వారితో కోరడం, వారితో మొరపెట్టుకోవడం లాంటివి పెద్ద షిర్క్ లో లెక్కించ బడతాయి. అల్లాహ్ ఆదేశం చదవండిః
“మీ ప్రభువు తనను తప్ప ఇతరులను మీరు ఆరాధింపకూడదని ఆదేశించాడు“. (బనీ ఇస్రాఈల్ 17: 23).
అదే విధంగా చనిపోయిన ప్రవక్తలతో, పుణ్యాత్ములతో ఇంకెవరితోనైనా వారి సిఫారసు పొందుటకు, తమ కష్టాలు దూరమగుటకు వారితో దుఆ చేయడం కూడా షిర్క్. చదవండి అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:
“బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరలను ఆలకించి అతని బాధను తొలగించేవాడు ఎవడు? భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగా చేసినవాడు ఎవడు? అల్లాహ్ తో పాటు (ఈ పనులు చేసే) మరొక దేవుడు కూడ ఎవడైనా ఉన్నాడా?“. (నమ్ల్ 27: 62).
కొందరు కూర్చున్నా, నిలబడినా, జారిపడినా తమ పీర్, ముర్షిదుల నామములను స్మరించు టయే తమ అలవాటుగా చేసుకుంటారు. ఎప్పుడు ఏదైనా క్లిష్టస్థితిలో, కష్టంలో, ఆపదలో చిక్కుకున్నప్పుడు ఒకడు యా ముహమ్మద్ అని, మరొకడు యా అలీ అని, ఇంకొకడు యా హుసైన్ అని, మరి కొందరు యా బదవీ, యా జీలానీ, యా షాజులీ, యా రిఫాఈ, యా ఈద్ రూస్, యా సయ్యద జైనబ్, యా ఇబ్ను ఉల్వాన్ అని, యా గౌస్ అల్ మదద్ అని, యా ముఈనుద్దీన్ చిష్తీ అని, యా గరీబున్నవాజ్ అని, నానా రకాలుగా పలుకుతారు. కాని అల్లాహ్ ఆదేశం ఏమిటని గమనించరు:
“అల్లాహ్ ను వదలి మీరు వేడుకుంటున్న వారు మీ మాదిరిగానే కేవలం దాసులు. మీరు వారిని ప్రార్థించి చూడండి. మీకు వారి పట్ల ఉన్న భావాలు నిజమే అయితే మీ ప్రార్థనలకు వారు సమాధానం ఇవ్వాలి“. (ఆరాఫ్ 7: 194).
కొందరు సమాధి పూజారులు సమాధుల ప్రదక్షిణం చేస్తారు. వాటి మూలమూలలను చుంబిస్తారు. చేతులు వాటికి తాకించి తమ శరీరంపై పూసుకుంటారు. వాటి గడపను చుంబిస్తారు. దాని మట్టిని తీసుకొని తమ ముఖాలకు రుద్దుకుంటారు. వాటిని చూసినప్పుడు సాష్టాంగ పడతారు (సజ్దా చేస్తారు). తమ అవసరాలను కోరతూ రోగాల నుండి స్వస్థత పొందు టకు, సంతానం కావాలని, అవసరం తీరాలని వాటి యదుట భయభీతితో, వినయవినమ్రతలతో నిలబడతారు. ఒక్కోసారి సమాధిలో ఉన్నవారిని ఉద్దేశించి ఇలా పిలుస్తారు కూడాః యా సయ్యిదీ! ఓ మేరే బాబా! నేను చాలా దూరం నుండి మీ సమక్షంలో హాజరయ్యాను, నాకు ఏమీ ప్రసాదించక వెనక్కు త్రిప్పి పంపుతూ అవమాన పరచకు. కాని అల్లాహ్ ఆదేశం ఏముందో గమనించారా?
“అల్లాహ్ ను వదలి ప్రళయం వరకు తమ ప్రార్థనలను విని సమాధాన మివ్వలేనటువంటి వారిని ప్రార్థించే వారికంటే, ఎక్కువ మార్గభ్రష్టులెవరు? మరియు వారు వీరి (ప్రార్థించేవారి) ప్రార్థనలను ఎరుగకుండా ఉన్నారు“. (అహ్ఖాఫ్ 46: 5).
ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు:
(مَنْ مَاتَ وَهْوَ يَدْعُو مِنْ دُونِ الله نِدًّا دَخَلَ النَّارَ)
“ఎవరు అల్లాహ్ ను కాదని ఇతరులను ప్రార్థిస్తూ/దుఆ చేస్తూ చనిపోతాడో అతను నరకంలో ప్రవేశిస్తాడు”. (బుఖారి 4497).
కొందరు సమాధుల వద్ద తమ తల గొరిగించుకుంటారు. ‘సమాధుల హజ్ చేసే విధానం’ అన్న పేరుగల పుస్తకాలు కొందరి వద్ద లభిస్తాయి. విశ్వవ్యవస్థ నిర్వహణ శక్తి మరియు లాభనష్టాలు చేకూర్చే శక్తి వలీలకు ఉన్నదని కొందరు నమ్ముతారు. కాని అల్లాహ్ యొక్క ఈ ఆదేశం పట్ల వారు ఎలా అంధులైపోయారో గమనించండి:
“ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవరూ లేరు. ఇంకా ఆయన గనక నీ విషయంలో మేలు చేయాలని సంకల్పిస్తే ఆయన అనుగ్రాహన్ని మల్లించే వాడు కూడా ఎవడూ లేడు“. (యూనుస్ 10: 107).
2. మొక్కుబడులు
అల్లాహ్ ను కాకుండా ఇతరుల పేరున మొక్కుకొనుట షిర్క్ అవుతుంది. ఈ రోజుల్లో ప్రజలు సమాధిలో ఉన్నవారి పేరున దీపాలు, కొవ్వత్తులు, కోళ్ళు, ఆస్తులు మొదలగునవి ఇస్తానని మొక్కుకుంటారు. అయితే ఇది ఘోరమైన షిర్క్ అన్న విషయం మరచిపోతారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గంలో ఆతిథ్యం ఇస్తాడు“. (ముస్లిం 669, బుఖారి 662).
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు: “ఎవరైనా తనింట్లో వుజూ చేసుకొని అల్లాహ్ గృహాల్లోని ఒక గృహానికి అల్లాహ్ విధుల్లోని ఒక విధి నెరవేర్చడానికి బయలుదేరుతే అతని ఒక అడుగుకు బదులుగా పాప మన్నింపు జరిగితే రెండవ అడుగుకు బదులు అతని స్థానం పెరుగుతుంది“. (ముస్లిం 666).
అబూ మూసా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శుభవార్తిచ్చారు: “నమాజు విషయంలో అందరికంటే గొప్ప ఫలానికి అర్హుడు అందరికంటే ఎక్కువ దూరం నండి నమాజు కోసం నడిచి వచ్చేవాడు. నమాజు తొందరగా చేసి పడుకునే వ్యక్తి కంటే సామూహిక నమాజు కోసం ఎదురు చూస్తూ ఇమాంతో నమాజు చేసుకునే వ్యక్తి ఎక్కువ పుణ్యానికి అర్హుడవుతాడు“. (ముస్లిం 662, బుఖారీ 651).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని బురైద రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “చీకట్లో నడుచుకుంటూ మస్జిద్ కు వెళ్ళే వారికి ప్రళయదినాన సంపూర్ణ కాంతి శుభవార్త ఇవ్వండి“. (తిర్మిజి 223. అబూ దావూద్ 561).
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “మంచి మాట ఒక సదకా (దానం) మరియు నమాజు కొరకు మస్జిదుకు వెళ్తున్నప్పుడు వేసే ప్రతి అడుగు దానమే“. (బుఖారీ 2891, ముస్లిం 1009).
(7.6) మస్జిద్ లో ప్రవేశిస్తూ చేసే దుఆ
మస్జిద్ లో ప్రవేశిస్తూ ఎవరైనా “అఊజు బిల్లాహిల్ అజీం వబివజ్ హిహిల్ కరీం వసుల్తానిహిల్ కదీం మినష్షైతానిర్రజీం” చదివితే, ‘ఈ రోజంతా ఇతడు నా నుండి కాపాడబడ్డాడు’ అని షైతాన్ అంటాడు. (అబూదావూద్ 466, సహీహుల్ జామి 4715).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగం జుల్ హిజ్జా మాసం మొదటి పది రోజుల విశిష్టతను మరియు ఆ దినాలలో చేయవలసిన సత్కార్యాల ప్రాముఖ్యతను వివరిస్తుంది. అల్లాహ్ తన సృష్టిలో ఈ పది రోజులను సంవత్సరంలోకెల్లా అత్యంత శ్రేష్టమైన దినాలుగా ఎంచుకున్నాడని వక్త స్పష్టం చేశారు. ఈ దినాలలో చేసే నమాజ్, ఉపవాసం, దానధర్మాలు మరియు తక్బీర్ వంటి సత్కార్యాలు అల్లాహ్ కు అత్యంత ప్రియమైనవి మరియు ఇతర దినాల కంటే ఎన్నో రెట్లు అధిక ప్రతిఫలాన్ని ఇస్తాయని హదీసుల ఆధారంగా వివరించారు. ఖురాన్ లో అల్లాహ్ ఈ పది రాత్రులపై ప్రమాణం చేశాడని, ఈ మాసంలోనే హజ్, ఖుర్బానీ వంటి మౌలిక ఆరాధనలన్నీ ఏకమవుతాయని గుర్తుచేశారు. ముఖ్యంగా అరఫా దినం (తొమ్మిదవ రోజు) ఉపవాసం ద్వారా పాపాలు క్షమించబడతాయని, నహర్ దినం (పదవ రోజు) అల్లాహ్ వద్ద అత్యంత గొప్ప దినమని తెలిపారు. ఈ పది రోజులలో అధికంగా తక్బీర్, తహ్మీద్, తహలీల్ పఠించాలని, ఖుర్బానీ ఇచ్చేవారు గోర్లు మరియు వెంట్రుకలు తీయకూడదనే నియమాలను పాటించాలని సూచించారు. చివరగా, ప్రతి పనిలో ఇహ్సాన్ (ఉత్తమ ప్రవర్తన) పాటిస్తూ, పాపాలకు దూరంగా ఉండి మనల్ని మరియు మన కుటుంబాలను నరకాగ్ని నుండి రక్షించుకోవాలని ఉద్బోధించారు.
وَالْفَجْرِ ﴿١﴾ وَلَيَالٍ عَشْرٍ ﴿٢﴾ وَالشَّفْعِ وَالْوَتْرِ ﴿٣﴾ وَاللَّيْلِ إِذَا يَسْرِ ﴿٤﴾ (వల్ ఫజ్ర్. వలయాలిన్ అష్ర్. వష్షఫ్ ఇ వల్ వత్ర్. వల్ లైలి ఇజా యస్ర్.) ఉషోదయపు సాక్షిగా! పది రాత్రుల సాక్షిగా! సరి మరియు బేసి సాక్షిగా! గతించిపోయే రాత్రి సాక్షిగా! (89:1-4)
సోదర మహాశయులారా, సర్వ స్తోత్రములు మన సృష్టికర్త అయిన అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయనే మన ఆరాధనలకు ఏకైక అర్హుడు. లెక్కలేనన్ని కరుణా శాంతులు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఇతర ప్రవక్తలందరిపై, ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశాన్ని తమ తమ జాతుల వరకు అమానతుగా విశ్వసనీయతగా సంపూర్ణంగా చేరవేశారో, మరియు చిట్టచివరి ప్రవక్త దయామయ దైవ ప్రవక్త కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ప్రత్యేకంగా, ఆయన పై అల్లాహ్ సర్వ మానవాళి కొరకు ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణం చేశాడు. ఈనాటి మన అంశం జుల్ హిజ్జా తొలి దశ, మొదటి దశకం పది రోజుల ఘనత, విశిష్టత. అందులో మనం చేయవలసిన సత్కార్యాలు, ప్రత్యేకంగా ఏ విషయాల నుండి మనం దూరం ఉండాలి.
సోదర మహాశయులారా అలాగే సోదరీమణులారా, ఈ అంశంలోకి ప్రవేశించే ముందు కొన్ని మూల విషయాలు ముఖ్య విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. వాటిలో అతి ముఖ్యాతి ముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే:
అల్లాహ్ యొక్క ఎంపిక మరియు గొప్పదనం
وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ (వరబ్బుక యఖ్ లుకు మా యషాఉ వయఖ్తార్) మరియు నీ ప్రభువు తాను కోరిన దానిని సృష్టిస్తాడు మరియు (తాను కోరిన వారిని) ఎన్నుకుంటాడు. (28:68)
సూరతుల్ కసస్ ఆయత్ నెంబర్ 68 లో అల్లాహ్ తెలిపాడు. ఈ విషయం నీ ప్రభువు తాను కోరిన దానిని సృష్టిస్తాడు మరియు తన సృష్టిలో తాను కోరిన వాటిని, కోరిన వారిని, కోరిన దానిని ఎన్నుకుంటాడు. అల్లాహ్ సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వ వివేకి. కనుక తన సృష్టిలో కొందరికి మరికొందరిపై, కొన్నిటికి మరికొన్నిటిపై ఘనతలు ప్రసాదిస్తాడు. వాస్తవానికి ఈ ఘనతలు ప్రసాదించడంలో మన కొరకు ఎన్నో రకాల లాభాలు ప్రయోజనాలు ఉన్నాయి. రమదాన్ మాసము వచ్చిందంటే సర్వ సామాన్యంగా మనం వింటాము, అన్ని నెలల్లో రమదాన్ మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత, రమదాన్ మాసానికి ఇవ్వబడినటువంటి ఘనతలు విశిష్టతలు మరే మాసానికి లేవు అని. నిజమైన మాట సత్యమైన మాట అందులో అనుమానం లేదు. అయితే మాసాల ప్రకారంగా, నెలల ప్రకారంగా రమదాన్ మాసానికి అలాంటి ఘనత ఉంది. కానీ దశల రీత్యా చూస్తే సంవత్సరంలోకెల్లా రెండు దశలు ఉన్నాయి, వాటికి కూడా చాలా చాలా ఉన్నత స్థానం ఎంతో గొప్ప విశిష్టత ఉంది.
ఏంటి ఆ రెండు దశలు? ఒకటి రమదాన్ లోని చివరి దశ రాత్రులు, పది రాత్రులు. రెండవది జుల్ హిజ్జా మాసం యొక్క మొదటి పది దినాలు. సోదర మహాశయులారా నేను కొన్ని ఆయతులు, కొన్ని హదీసులు మీకు తెలియజేస్తాను అప్పుడు మరింత స్పష్టంగా మీకు తెలుస్తుంది అప్పుడు మీరు అర్థం చేసుకోగలుగుతారు. అయితే ఈ విషయాన్ని మదిలో నాటుకోండి, ఎలాగైతే రమదాన్ మాసం వచ్చిందంటే మనం పుణ్యకార్యాలలో ఎంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తామో, వేరే కొన్ని పాపాలను కావాలని ఏవైతే మనం చేస్తున్నామో వదులుకునే ప్రయత్నం చేస్తామో, అలాగే అంతకంటే ఎక్కువ ఈ జుల్ హిజ్జా మాసం ప్రవేశించిందంటే అలాంటి కాంక్ష, కుతూహలం మనం పుణ్యాల్లో సత్కార్యాలలో ఎంతో ఉత్సాహంతో ముందుకు ఎగిసిపోయేటువంటి ఆ ప్రయత్నం అనేది చాలా చాలా ఉండాలి.
జుల్ హిజ్జా మొదటి పది రోజుల విశిష్టత
ఎందుకంటే రమదాన్ మాసంలో ఉపవాసానికి దానధర్మాలకు ఉమ్రాలకు ఖురాన్ పారాయణానికి సంబంధించిన ప్రత్యేక హదీసులు వచ్చి ఉన్నాయి. వాటి యొక్క ఘనత ఎక్కువగా ఉంది అని ఆ రమదాన్ మాసంలో. కానీ ఈ జుల్ హిజ్జా మాసం యొక్క తొలి దశ అంతకంటే ఎక్కువ ఘనత గలదని మనకు హదీసుల ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే:
مَا مِنْ أَيَّامٍ الْعَمَلُ الصَّالِحُ فِيهِنَّ أَحَبُّ إِلَى اللَّهِ مِنْ هَذِهِ الأَيَّامِ الْعَشْرِ (మా మిన్ అయ్యమిన్ అల్ అమలుస్సాలిహు ఫీహిన్న అహబ్బు ఇలల్లాహి మిన్ హాజిహిల్ అయ్యమిల్ అష్ర్) ఈ పది దినాలలో చేసే సత్కార్యాల కంటే అల్లాహ్ కు అత్యంత ప్రియమైన సత్కార్యాలు మరే ఇతర దినాలలో లేవు.
ఈ పది రోజులలో ఏ ఒక్క సత్కార్యం గురించి ప్రత్యేకంగా కాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకంగా ప్రతి సత్కార్యం యొక్క పుణ్యం దాని యొక్క సత్ఫలితం ఎన్నో రేట్లు ఎంతో గొప్పగా పెంచి ఇవ్వడం జరుగుతుంది అని చాలా చాలా స్పష్టంగా తెలియపరిచారు. అందుకొరకు మనం ఈ జుల్ హిజ్జా మాసం యొక్క తొలి దశ ప్రవేశించింది అంటే రమదాన్ కు మనం ఎలా ప్రాముఖ్యత ఇస్తామో, ఎన్నో పనులు మనం వెనకేసుకొని పుణ్యాల్లో సత్కార్యాల్లో ముందుకు ఉండే ప్రయత్నం చేస్తామో, అలాంటి ప్రయత్నం ఈ జుల్ హిజ్జా దశం ప్రారంభమయ్యే సందర్భంలో కూడా మనం చేయాలి.
విశ్వాసి వ్యవహారాలన్నీ మేలైనవే
ఇక ఘనత విషయానికి వస్తే రండి అల్లాహ్ విశ్వాసుని యొక్క జీవితాన్ని సర్వ శుభాలలోనే ఉంచాడు. విశ్వాసునికే ఇది ప్రత్యేకం అవును కానీ దురదృష్టవశాత్తూ ఏమిటో తెలుసా మనం ఇంత అదృష్టవంతులమని తెలుసుకోవడం లేదు మనం స్వయంగా. ఎలా అదృష్టవంతులం, ఎల్లా వేళల్లో మనం శుభాల్లో ఎలా ఉన్నాము? సోదర మహాశయులారా చెప్పుకుంటూ పోతే ఈ అంశం చాలా దీర్ఘంగా ఎంతో పెద్దగా ఉంటుంది కానీ సంక్షిప్తంగా ఒక రెండు విషయాలు మీరు గ్రహించండి అర్థం చేసుకోవడానికి ఒక రెండు ఉదాహరణలు కూడా సరిపోతాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలియజేశారు ముస్లిం షరీఫ్ లోని హదీస్:
విశ్వాసి వ్యవహారం ఎంతో ఆశ్చర్యకరమైనది! అతని వ్యవహారాలన్నీ అతని కొరకు మేలైనవే. ఈ భాగ్యం విశ్వాసికి తప్ప మరెవరికీ లేదు. అతనికి ఏదైనా సంతోషం కలిగితే అతను కృతజ్ఞత తెలుపుకుంటాడు, అది అతనికి మేలైనది. మరియు అతనికి ఏదైనా ఆపద కలిగితే అతను సహనం పాటిస్తాడు, అది కూడా అతనికి మేలైనదే. (సహీహ్ ముస్లిం)
విశ్వాసుని యొక్క విషయమే చాలా వింతకరమైన విషయం. విశ్వాసునికి ఏదైనా సుఖ సంతోషం ఎదురైనప్పుడు అతడు కృతజ్ఞత చెల్లిస్తాడు, ఈ విధంగా అతడు ఎంతో మేలును ఎన్నో రకాల మేళ్లు శుభాలు మంచితనాలు జరుగుతాయి. అతనికి ఒకవేళ ఏదైనా కీడు దాపురమైంది ఏదైనా ఆపద ఏదైనా కష్టం వచ్చేసింది అప్పుడు అతను ఓపిక సహనాలతో జీవిస్తాడు, అది అతని కొరకు మేలే మేలు జరుగుతుంది. ఇది విశ్వాసుని తప్ప ఇంకా వేరే ఎవరికీ సాధ్యం కాదు.
గమనించండి మనం ఉదయం మేల్కొన్నప్పటి నుండి నిద్రించడానికి పడకపై రాత్రి వెళ్లేసరికి ఈ రెండు స్థితుల్లో ఏదో ఒకట్లో ఉంటాము కదా, ఎక్కడైనా సంతోషంగా ఆనందంగా లేదా ఎక్కడైనా కొంచెం బాధగా, ప్రతి విషయంలో కూడా విశ్వాసునికి మేలే మేలు, శుభమే శుభము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు గుర్తు చేశారు.
ఇంకా మీరు ఒకవేళ అర్థం చేసుకోగలిగితే విశ్వాసుని జీవితం చాలా చిన్నది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు కూడా ఉంది కదా సర్వసామాన్యంగా 60 సంవత్సరాలు మహా ఎక్కువ ఎవరంటే 70, అంతకంటే ఎక్కువ దాటే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కానీ మనకంటే ముందు జాతి వారు వందలాది సంవత్సరాలు వేలాది సంవత్సరాలు గడిపారు, వారందరికంటే పుణ్యాల్లో పరలోకంలో అందరికంటే ముందు లెక్క తీర్పు జరిగి స్వర్గంలో ప్రవేశించడంలో, ఇంకా అన్ని రకాల మేళ్లు శుభాలు వారందరికంటే ముందు పొందడంలో మనం ఏదైతే ఉంటామో అయితే ఈ చిన్న జీవితంలో మన పుణ్యాలు అంత ఎక్కువగా ఎలా చేరుతాయి అల్లాహ్ ప్రసాదించిన ఒక గొప్ప వరం ఏంటో మనకు తెలుసా!
సత్కార్యాలకు లభించే అనేక రెట్ల ప్రతిఫలం
మనం చేసే కొన్ని పనులు మనం చేసే చిన్నపాటి కార్యక్రమాలు సత్కార్యాలు కొన్ని సందర్భాలలో, కొన్ని సమయాలలో, కొన్ని క్షేత్రాలలో మరియు అల్లాహ్ తన యొక్క ఇష్టంతో కొన్ని పనులకు స్వయంగా ఎన్నో రేట్లు పుణ్యాలు పెంచి ఇస్తాడు, ఇది ఎంత శుభప్రదం మన కొరకు ఎప్పుడైనా మనం గ్రహించామా? ఉదాహరణకు గమనించండి మనం 24 గంటల్లో ఐదు పూటల నమాజులు చదువుతాము కానీ ఎన్ని నమాజులు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది, 50 నమాజులు చేసినంత పుణ్యం లభిస్తుంది. శుభం కాదా ఇది! ఖురాన్ తిలావత్ చేస్తాము ఒక్క అక్షరానికి పదేసి పుణ్యాలు లభిస్తాయి ఎంత గొప్ప శుభం ఇది! మనం దానధర్మాలు చేస్తాము ఖురాన్ లో సూరె బకరాలో చెప్పబడింది కదా ఒక దానం ఏదైతే అల్లాహ్ మార్గంలో మనం చేస్తామో దాని యొక్క ఫలితం అల్లాహ్ 10 నుండి 700 వరకు ఇంకా అల్లాహ్ ఇంకా కోరిన వారికి ఇంకా పెంచి ఇస్తాడు గమనించండి.
وَاللَّهُ يُضَاعِفُ لِمَن يَشَاءُ (వల్లాహు యుదాయిఫు లిమన్ యషాఉ) మరియు అల్లాహ్ తాను కోరిన వారికి (దానిని) ఇంకా ఇనుమడింపజేస్తాడు. (2:261)
ఎవరైనా ప్రజలందరి పట్ల సద్వర్తన వహించాడంటే మంచి నడవడిక, ఉత్తమ విధానం మాటలో తీపి ప్రవర్తనలో ఉత్తమ రీతి అవలంబించాడంటే అతనికి రాత్రంతా నమాజులు తహజ్జుదులు చేసే పగలంతా ఉపవాసాలు ఉండేవారి కంటే ఎక్కువగా పుణ్యం లభిస్తుంది అని శుభవార్త ఇవ్వబడింది కదా అబూ దావూద్ లోని సహీ హదీస్, ఈ విధంగా ఇంకా ఎన్నో సత్కార్యాలు మీరు చూడండి ఎన్ని రెట్లు మనకు పుణ్యాలు పెంచి ఇవ్వడం జరిగింది, ఇది అల్లాహ్ యొక్క ఎంత గొప్ప శుభం. అల్లాహ్ వైపు నుండి మనకు ఎంత మేలు కలుగుతుంది, అయినా గానీ మనం సత్కార్యాలు పుణ్యాలు వదులుకొని జీవితం గడపాలనుకుంటాము. సత్కార్యాలను వదిలి మనం పాపాలు చేసుకుంటూ ఎంతో మనం ఆనందం పొందుతున్నాము అన్నట్లుగా భావిస్తాము. వాస్తవానికి ఇది మోసం చాలా.
పవిత్ర మాసాలలో జుల్ హిజ్జా ప్రాముఖ్యత
అయితే సోదర మహాశయులారా ఇక రండి, ఈ జుల్ హిజ్జా మాసం ఏదైతే ఉందో సుమారు ఒక వారం తర్వాత మనం ఈ జుల్ హిజ్జా మాసంలో ప్రవేశించబోతున్నాము. వచ్చే ఆదివారం కూడా మనం ఈ అంశం గురించి చెప్పుకోవచ్చు కానీ మా ఉద్దేశం ఏమి ఉండినది అంటే లేదు లేదు ఒక వారం ముందు నుండే మన మిత్రులందరూ కూడా మెంటల్ గా కూడా రెడీగా ఉండి దానికి సంసిద్ధతలు అన్నీ కూడా పాటించి, ఈ ఆడియో, వీడియో ఇంకా ఎక్కువ మంది ప్రజలలో ఎడిట్ అయి రికార్డ్ అయి చేరేసరికి ఒక రెండు రోజులు ఏమైనా పట్టేది ఉంటే జుల్ హిజ్జా రాకముందే అన్ని విషయాలు తెలుసుకొని మనం వాటి గురించి సిద్ధంగా ఉండాలి అన్నటువంటి శుభాశయంతో ఇప్పుడే ఈ అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది.
సోదర మహాశయులారా జుల్ హిజ్జా మాసం ఇది ప్రస్తుతం మనం ముహర్రం నుండి ఒక కొత్త మాసాన్ని ఏదైతే ప్రారంభించి కొత్త సంవత్సరం అని పేర్కొంటామో దాని ప్రకారంగా చూస్తే ఇది 12వ మాసం. జుల్ హిజ్జా మాసం సూరతు తౌబా ఆయత్ నెంబర్ 36 లో అల్లాహ్ నాలుగు మాసాలు గౌరవప్రదమైనవి అని ఏదైతే తెలిపాడో దాని గురించి వివరణ నేను గత వారంలోని పాఠంలో తెలియజేశాను.
إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا (ఇన్న ఇద్దతష్షుహూరి ఇందల్లాహిస్నా అషర షహ్రన్) నిశ్చయంగా, అల్లాహ్ గ్రంథంలో, (ఆకాశాలను మరియు భూమిని సృష్టించినప్పటి నుండి) అల్లాహ్ వద్ద నెలల సంఖ్య పన్నెండు. (9:36)
అందులో ఒకటి ఈ జుల్ హిజ్జా మాసం. జుల్ హిజ్జా మాసానికి ఉన్నటువంటి మరో మూడవ ఘనత ఏమిటంటే జుల్ హిజ్జా మాసం హజ్ మాసాలలో కూడా ఒకటి, దీని ప్రస్తావన కూడా ఇంతకుముందు పాఠంలో మనం తెలుసుకున్నాము.
ఖురాన్ లో పది రాత్రుల ప్రమాణం
అయితే జుల్ హిజ్జా మాసంలోని మొదటి దశ తొలి పది రోజుల ఘనతలో అల్లాహ్ సూరతుల్ ఫజర్ లోని తొలి ఆయతులలో ఇలా తెలియపరిచాడు బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్:
وَالْفَجْرِ ﴿١﴾ وَلَيَالٍ عَشْرٍ ﴿٢﴾ وَالشَّفْعِ وَالْوَتْرِ ﴿٣﴾ وَاللَّيْلِ إِذَا يَسْرِ ﴿٤﴾ (వల్ ఫజ్ర్. వలయాలిన్ అష్ర్. వష్షఫ్ ఇ వల్ వత్ర్. వల్ లైలి ఇజా యస్ర్.) ఉషోదయపు సాక్షిగా! పది రాత్రుల సాక్షిగా! సరి మరియు బేసి సాక్షిగా! గతించిపోయే రాత్రి సాక్షిగా! (89:1-4)
ఫజర్ సమయం యొక్క ప్రమాణం, ఫజర్ నమాజ్ యొక్క ప్రమాణం, పది రాత్రుల ప్రమాణం, బేసి మరియు దానికి అపోజిట్ గా ఉన్నటువంటి ఈ రెండిటి యొక్క సాక్ష్యం, నడుస్తున్నటువంటి రాత్రి సాక్షి. ఈ సూరత్ యొక్క ఆరంభంలో అల్లాహ్ ఎన్ని విషయాల ప్రమాణం చేసాడో ఒకసారి మీరు గమనించండి. వల్ ఫజ్ర్, వలయాలిన్ అష్ర్, వష్షఫ్ ఇ వల్ వత్ర్, వల్ లైలి ఇజా యస్ర్ ఐదు విషయాల ప్రమాణం చేశాడు. సోదర మహాశయులారా ఇక్కడ ఈ ఐదు విషయాల ప్రస్తావన ఏదైతే వచ్చిందో దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఒకవేళ.
ఇందులో గొప్ప విషయం ఏమిటంటే ఫజర్ నమాజ్ దాని యొక్క ఘనత చాలా చాలా గొప్పగా ఉంది. ఫజర్ నమాజ్ సమయంలో పగటి దైవదూతలు రాత్రి దైవదూతలు ఏకమవుతారు, ఫజర్ నమాజ్ సమయంలో దైవదూతలు హాజరై ఆ ఖురాన్ ఏదైతే పారాయణం చేయడం జరుగుతుందో వారు వింటారు. సూరత్ బనీ ఇస్రాయిల్ లో దాని ప్రస్తావన వచ్చి ఉంది. అలాగే సోదర మహాశయులారా ఫజర్ నమాజ్ ఎవరైతే చదువుతారో జమాత్ తోని ఆ పొద్దంతా అల్లాహ్ రక్షణలో ఉన్నటువంటి జమానత్ అల్లాహ్ తీసుకుని ఉన్నాడు. ఇంకా ఎన్నో ఘనతలు ఉన్నాయి.
ఆ తర్వాత వలయాలిన్ అష్ర్ ఇక్కడ పది రాత్రులు అని ఏదైతే చెప్పడం జరిగిందో వాస్తవానికి ఈ జుల్ హిజ్జా యొక్క పది రోజులు అని సుమారు ముఫస్సిరీన్ ఖురాన్ వ్యాఖ్యానకర్తలు అందరూ ఏకీభవించారు, ఇందులో విభేదం ఏమీ లేదు. అయితే ఈ పది రాత్రుల్లోనే ఒక రెండు రోజులు ఉన్నాయి చాలా ఘనత గల రోజులు మరింత ఎక్కువగా, ఒకటి షఫా బేసి సంఖ్యలో వస్తుంది ఇది 10వ తారీకు, మరియు వత్ర్ అంటే ఇది 9వ తారీకు బేసి సంఖ్య. దీనికి సంబంధించి కొన్ని హదీసులు కూడా వచ్చి ఉన్నాయి.
ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈ తొలి దశ జుల్ హిజ్జా మాసంలో విడివిడిగా కూడా అల్లాహ్ ఇందులో కొన్ని రోజుల ప్రమాణం చేసి ఉన్నాడు. ఉదాహరణకు సూరతుల్ బరూజ్ చదివారంటే అక్కడ అల్లాహ్ ఇలా ప్రమాణం చేసి ఉన్నాడు:
وَشَاهِدٍ وَمَشْهُودٍ (వ షాహిదిన్ వ మష్ హూద్) సాక్షి మరియు సాక్ష్యమివ్వబడినదాని సాక్షిగా! (85:3)
దీన్ పరిపూర్ణత
ఈ విధంగా సోదర మహాశయులారా ఈ జుల్ హిజ్జా మాసంలోని తొలి దశకంలోని ఘనతల్లో మరొక గొప్ప విశేషం, దీని ప్రస్తావన అయితే మనకు సహీ బుఖారీలో కనబడుతుందో హదీస్ నెంబర్ 4407. ఇదే తొలి దశలోని తొమ్మిదవ తారీకు రోజున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరఫాత్ మైదానంలో ఉన్నప్పుడు అల్లాహ్ ఈ ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణం చేశాడు. సంపూర్ణం చేసిన ప్రస్తావన సూరతుల్ మాయిదా ఆయత్ నెంబర్ 3 లో ఉంది.
الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ (అల్యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్) ఈ దినం నేను మీ ధర్మాన్ని మీ కోసం పరిపూర్ణం చేశాను. (5:3)
ఈ సంపూర్ణత చేసిన విషయం ఎంత గొప్ప విషయమో ఈ విషయాన్ని యూదులలో ఉన్నటువంటి పండితులు కూడా గమనించారు. సహీ బుఖారీ లోనే వచ్చి ఉంది ఇంతకు ముందు చెప్పిన హదీస్ నెంబర్ లో యూద పండితులు వచ్చి హజ్రత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు తో చెప్పారు, మీ ఖురాన్ లో ఒక ఆయత్ ఉంది అది గనక మా గ్రంథంలో అవతరించి ఉండేది ఉంటే అవతరించిన ఆ దినాన్ని మేము ఒక పండుగ దినంగా జరుపుకునే వాళ్ళము. అప్పుడు ఉమర్ రజియల్లాహు తాలా అన్హు చెప్పారు నాకు తెలుసు అది ఏ రోజు అవతరించిందో అనేది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ చేసిన సందర్భంలో అది కూడా మాకు శుభప్రదమైన ఒక గొప్ప రోజు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరఫాత్ మైదానంలో ఉన్నారు, యౌమె అరఫా అరఫా రోజున ఈ ఆయత్ అవతరించింది.
కేవలం ఈ హదీస్ యొక్క వివరణలో మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. దురదృష్టవశాత్తూ ఈ రోజుల్లో ఎంతో మంది ముస్లింలు కొన్ని విషయాలు ఈ హదీస్ లో ఉన్నటువంటివి తెలుసుకోనందువల్ల ఎన్నో రకాల బిదఅత్ లకు సలఫ్ మన్హజ్ కు వ్యతిరేకమైన మార్గంలో పడిపోయారు.
సోదర మహాశయులారా అతి ముఖ్యమైన విషయం అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించేకి ముందే ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణం చేశాడు అంటే ఇక ప్రళయం వరకు ఇందులో ఎలాంటి మార్పు చేర్పులకు ఇది గురికాదు. ఇందులో మనం అదనంగా ఏదైనా చేర్చే అవసరం కూడా లేదు. ఇందులో నుండి ఏదైనా తీసే అవసరం కూడా లేదు. ఏ విషయం అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణాని కంటే ముందు ధర్మంగా లేకుండినదో అది ఎన్నటికీ ధర్మం కాజాలదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి.
ఆరాధనల సమ్మేళనం
ఈ జుల్ హిజ్జా యొక్క తొలి దశకం ఘనతల్లో మనం తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన మరో విషయం ఇమామ్ ఇబ్ను హజర్ అస్ఖలానీ రహిమహుల్లాహ్ ఫత్హుల్ బారీ సహీ బుఖారీ యొక్క షరహ్ లో తెలిపారు. ఈ పది దినాలకు ఇంత ఘనత ఉండడానికి ఒక కారణం ఏమిటంటే:
ఇస్లాం యొక్క మౌలిక విషయాలు మూల ఆరాధనలు ఈ రోజుల్లోనే ఏకమవుతాయి వేరే ఏ రోజుల్లో కూడా ఇలా జరగదు. కలిమ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్ యొక్క సాక్ష్యం తర్వాత నమాజ్, ఉపవాసం, జకాత్, హజ్. ఈ నాలుగు మరియు మొదటి దానిని కలుపుకోండి కలిమ తయ్యిబా యొక్క సాక్ష్యం, ఇవన్నీ కూడా ఈ పది రోజుల్లో జుల్ హిజ్జా తొలి దశకంలో ఏకమవుతున్నాయి.
హదీసుల వెలుగులో పది రోజుల ఘనత
ఇంకా సోదర మహాశయులారా ఇక ఈ పది రోజుల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులు ఏవైతే వచ్చి ఉన్నాయో ఇక రండి కొన్ని హదీసులపై మనం శ్రద్ధగా సూక్ష్మంగా ఆలోచించే గ్రహించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ నేను వేరు వేరు హదీస్ పదాలు ఏదైతే తీసుకొస్తున్నానో అందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వేరు వేరు పదాలను ఉపయోగించి ఈ పది రోజుల ఘనతను ఈ పది రోజుల విశిష్టతను ఎలా స్పష్టపరిచారో ఆ విషయాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. తర్వాత ఆ యొక్క విశ్వాసం మరియు నమ్మకంతో అందులో చేయవలసిన పనుల గురించి తర్వాత తెలుసుకుందాం.
ఒక హదీస్ అబూ దావూద్ లో వచ్చి ఉంది, దీని యొక్క భావం సహీ బుఖారీ లో కూడా ఉంది, అలాగే తిర్మిజీలో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
مَا مِنْ أَيَّامٍ الْعَمَلُ الصَّالِحُ فِيهِنَّ أَحَبُّ إِلَى اللَّهِ مِنْ هَذِهِ الأَيَّامِ الْعَشْرِ (మా మిన్ అయ్యామిన్ అల్ అమలుస్సాలిహు ఫీహిన్న అహబ్బు ఇలల్లాహి మిన్ హాజిహిల్ అయ్యామిల్ అష్ర్) ఈ పది దినాలలో చేసే సత్కార్యాల కంటే అల్లాహ్ కు అత్యంత ప్రియమైన సత్కార్యాలు మరే ఇతర దినాలలో లేవు. (సహీహ్ బుఖారీ, అబూ దావూద్)
అల్లాహ్ దృష్టిలో అల్లాహ్ వద్ద ఈ పది రోజుల్లో చేసే సత్కార్యాలు ఇతర రోజుల్లో చేసే సత్కార్యాల కంటే ఎక్కువగా ప్రీతికరమైనవి, చాలా ప్రియమైనవి. గమనించండి ఇక్కడ ఇతర రోజుల్లో చేసే సత్కార్యాల కంటే ఈ రోజుల్లో చేసే సత్కార్యాలు అల్లాహ్ వద్ద చాలా ప్రియమైనవి అంటే ఇప్పుడు ఇంక మనం జుల్ హిజ్జా లో ప్రవేశించలేదు కదా ఈ రోజుల్లో చేసే నమాజులు, ఈ రోజుల్లో చేసే దానధర్మాలు, ఈ రోజుల్లో చేసే ఖురాన్ పారాయణం ఇంకా వేరే సర్వ సత్కార్యాలు అల్లాహ్ కు ప్రియమైనవే, కానీ జుల్ హిజ్జా మొదటి దశకంలో చేసే సత్కార్యాలు ఇంతకంటే ఎక్కువ ప్రియమైనవి.
గమనించండి.
فَلَا تَضْرِبُوا لِلَّهِ الْأَمْثَالَ (ఫలా తద్రిబూ లిల్లాహిల్ అమ్సాల్) కనుక మీరు అల్లాహ్ కు సాటి (పోలికలు) కల్పించకండి. (16:74)
అల్లాహ్ కొరకు ఎలాంటి ఉదాహరణ పోలిక లేదు. ఎలాంటి భాగస్వామి పోలికలు లేనివాడు అల్లాహు తాలా. కానీ మన బుద్ధి జ్ఞానాలకు అర్థం కావడానికి, మన అల్పజ్ఞానులకు విషయం స్పష్టంగా అర్థం కావడానికి మనం ప్రతిరోజూ ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో, జాబ్ చేస్తున్నామో, పని చేస్తున్నామో, కూలి చేస్తున్నామో గమనించండి. మన యజమానికి, మన సేట్ కి, మన ఓనర్ కి, మన మేనేజర్ కి, మన యొక్క సిఈఓ కి ఏ పని ఎక్కువగా ఏ సందర్భంలో ఏ సమయంలో ప్రియమైనదిగా ఉంటుందో మనం ఆ అవకాశాన్ని పోగొట్టుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకునే మరియు మన యజమాని దృష్టిలో మనం ఎక్కువ స్థానం పొందాలి అన్నటువంటి కాంక్ష ఉంటుందా లేదా మనందరికీ? స్వభావం. అయితే మాలికి యౌమిద్దీన్, యజమానుల్లో కెల్లా అతి గొప్ప యజమాని, అధికారుల్లో కెల్లా సర్వాధికారి, ఆ అల్లాహ్ కు ఏ సత్కార్యం, ఏ పని, ఏ విషయం, ఏ రోజుల్లో ఎక్కువగా ప్రియమో, ప్రియతమో, ఇష్టమో దాన్ని మనం ఆ రోజుల్లో పాటించడం అతనికి అంటే అల్లాహ్ కు ఎంత ఇష్టమో ఒక్కసారి మనం గమనించండి. దీని భావం ఏంటి ఆ రోజుల్లో మనం సత్కార్యాలు ఎక్కువగా చేస్తూ ఉన్నామంటే మనం అల్లాహ్ కు ప్రియులవుతాము, అల్లాహ్ మనల్ని ప్రేమిస్తాడు. అల్లాహ్ ఎవరిని ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడా? నీవు నీ సంతానాన్ని ప్రేమిస్తావంటే వారిని కొడతావా శిక్షిస్తావా, లేదు కదా? అయితే సోదర మహాశయులారా ఈ విషయాన్ని గ్రహించండి. ఒక పదం ఏమి విన్నారు మీరు అహబ్బు ఇలల్లాహ్ దీన్ని ఇంకా విడమరిచి చెబుతూ ఉండేది ఉంటే చాలా విషయాలు మనకు బోధపడతాయి కానీ ఇప్పుడు ఇచ్చిన చిన్నపాటి ఉదాహరణతో విషయం అర్థమైంది అనుకుంటాను. ఒక పదం ఏం తెలిసింది జుల్ హిజ్జా పది రోజుల్లో చేసే సత్కార్యాలు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి వేరే రోజుల్లో చేసే సత్కార్యాల కంటే కూడా ఎక్కువగా ప్రియమైనవి.
ఇక రండి హదీసులో ఈ రోజుల్లో చేసే సత్కార్యాల గురించి మరో పదం ఏం వచ్చి ఉంది సహీ బుఖారీలో ఉంది హదీస్ నెంబర్ 969.
అఫ్ దల్ – ఎక్కువ ఘనత గలవి
مَا مِنْ أَيَّامٍ الْعَمَلُ الصَّالِحُ فِيهِنَّ أَفْضَلُ (మా మిన్ అయ్యామిన్ అల్ అమలుస్సాలిహు ఫీహిన్న అఫ్ దల్) ఈ దినాలలో చేసే సత్కార్యాల కంటే ఎక్కువ ఘనత గలవి మరే ఇతర దినాలలో లేవు. (సహీహ్ బుఖారీ)
ఇతర రోజుల కంటే జుల్ హిజ్జా పది రోజుల్లో చేసే సత్కార్యాలు ఎక్కువ ఘనత గలవి. వాటికి విశిష్టత అనేది ఎక్కువగా ఉంది ఘనత ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు మనకు ఎన్ని విషయాలు దీని ద్వారా బోధపడుతున్నాయి కొంచెం ఆలోచించండి. ఖురాన్ హదీసుల ఆధారంగా రమదాన్ లో మన యొక్క పరిస్థితి ఏముంటుంది? కొందరు అంటారు, వాస్తవానికి అది సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు హదీస్ అని కానీ సహీ హదీస్ కాదు అది, రమదాన్ లో ఒక నఫిల్ చేస్తే ఒక ఫరజ్ చేసిన దానితో సమానం, ఒక ఫరజ్ చేస్తే 70 ఫరజులు చేసిన దానితో సమానం, ఇక ప్రజల యొక్క కాంక్ష ఎలా ఉంటుందో చూడండి మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాము ఎన్నో ఇండ్లల్లో టీవీల మీద కర్టన్ వేసి ఉంటారు పర్దా వేసి ఉంటారు రమదాన్ అంతా మనం టీవీ చూడకూడదు అని. మరి కొందరు ఎవరైతే వేరే రోజుల్లో షేవ్ చేస్తూ ఉంటారో రమదాన్ లో షేవ్ చేయకుండా ఉంటారు (తెలుగులో ఉర్దూలో గడ్డం గురించి ఒక మూడు నాలుగు నిమిషాల వీడియో ఉంది విని చూడండి). ఇంకా ఎంతో మందిని చూస్తాము ప్రత్యేకంగా ఏదైనా అటక మీద చాలా ఎత్తు మీద ఖురాన్ పెట్టి ఉండేది ఉంటే తీస్తారు . ఎందుకు? ఇది చాలా ఘనత గల సమయం వచ్చేస్తుంది మనం చేసే పుణ్యాల ఘనత ఎక్కువగా పెరిగిపోతుంది అని. రమదాన్ వచ్చినప్పుడు, జుమా రోజు వచ్చినప్పుడు సత్కార్యాల గురించి పుణ్యాల గురించి మనం ఎలా ప్రయత్నం చేస్తున్నామో ఎక్కువ ఘనత గల రోజులు అని ఈ జుల్ హిజ్జా తొలి దశకంలో మనం చేసే సత్కార్యాల యొక్క విశిష్టత ఘనత ఇతర రోజుల్లో చేసే సత్కార్యాల కంటే ఎక్కువగా ఉంది అందుకొరకు మనం ముందుకు వెళ్లాలి.
మూడవ పదం ఏదైతే ప్రస్తావన హదీసుల్లో దీని గురించి వచ్చి ఉందో సహీహు తర్హీబ్ లో షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ ప్రస్తావించారు.
أَفْضَلُ أَيَّامِ الدُّنْيَا (అఫ్ దలు అయామిద్దున్యా) ప్రపంచ దినాలలో కెల్లా అతి గొప్ప ఘనత గల రోజులు. (సహీహు తర్హీబ్)
ప్రపంచంలో ఎన్ని రోజులు అయితే ఉన్నాయో ఆ రోజుల్లోనే అతి గొప్ప ఘనత గల రోజులు. మీకు విన్న వెంటనే ఇప్పుడు చెప్పిన విషయమే అని అనిపిస్తుందా, అఫ్జల్ ఘనత విశిష్టత అన్న పదం వచ్చింది కానీ చిన్నపాటి తేడా ఉంది గమనించండి ఇంతకుముందు హదీస్ లో ఏదైతే సహీ బుఖారీ యొక్క రిఫరెన్స్ తో చెప్పడం జరిగిందో ఆ హదీస్ లో ఈ దశకంలో చేసే సత్కార్యం చాలా ఘనత గలది వేరే రోజుల్లో చేసే సత్కార్యం కంటే ఎక్కువ ఘనత గలది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ హదీస్ లో అఫ్జలు అయ్యామిద్దున్యా ప్రపంచంలో ఉన్న రోజుల్లోకెల్లా అతి గొప్ప రోజులు అంటే అతి గొప్ప అతి ఘనత గల అతి విశిష్టత గల రోజులు ఈ పది రోజులు.
అలాగే సోదర మహాశయులారా మరో ఉల్లేఖనం ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉంది సహీ హదీస్ ఇది ముస్నద్ అహ్మద్ లోని వాల్యూమ్ 10 పేజీ నెంబర్ 296:
ఈ పది దినాలలో చేసే సత్కార్యాల కంటే అల్లాహ్ వద్ద అత్యంత గొప్పవి మరియు ఆయనకు అత్యంత ప్రియమైనవి మరే దినాలలో లేవు. (ముస్నద్ అహ్మద్)
ఈ హదీస్ లో రెండు పదాల ప్రస్తావన వచ్చి ఉంది ఒక పదం ఇంతకుముందే మనం అబూ దావూద్ యొక్క ఉల్లేఖనంలో విన్నాము మరో రెండవ పదం ఇందులో వచ్చింది ఏమిటి ఈ హదీస్ లో రెండవ పదం మనం కంటిన్యూ గా ఏదైతే తెలుసుకుంటున్నామో దాని పరంగా చూస్తే నాలుగవది అల్లాహ్ వద్ద రోజుల్లోకెల్లా అతి గొప్ప రోజులు. నేను స్టార్టింగ్ లోనే ఆరంభంలోనే సూరతుల్ కసస్ ఆయత్ నెంబర్ 68 యొక్క ఆధారంతో చెప్పాను అల్లాహ్ తన ఇష్టంతో ఎవరినైనా మరొకరిపై, మరికొందరిని మరికొందరిపై, కొన్నిటిని మరికొన్నిటిపై ఘనత మరియు విశిష్టత అనేది ప్రసాదిస్తాడు అయితే ఇక్కడ అల్లాహ్ వద్ద అజీమ్ గొప్ప ఔన్నత్యం గల రోజులు ఏమైనా ఉండేది ఉంటే ఈ తొలి దశకంలోని రోజులు అని.
ఇంకా సోదర మహాశయులారా ఒకవేళ మనం సునన్ దారమీ లో వచ్చిన హదీస్ ను చూస్తే షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహు తర్హీబ్ లో పేర్కొన్నారు అక్కడ మరో రెండు పదాలు అదనంగా ఉన్నాయి. అల్లాహు అక్బర్, ఈ విధంగా చూస్తే ఈ దశకం గురించి ఆరు రకాల వేరు వేరు పదాల ద్వారా భావాలు కలిగేటువంటి వేరు వేరు భావాలు కలిగేటువంటి పదాల ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీని యొక్క గొప్పతనాన్ని విశిష్టతను చాలా స్పష్ట పరుస్తున్నారు సునన్ దారమీలో వచ్చిన హదీసుల్లో ఏముంది:
مَا مِنْ عَمَلٍ أَزْكَى عِنْدَ اللَّهِ عَزَّ وَجَلَّ، وَلَا أَعْظَمَ أَجْرًا (మా మిన్ అమలిన్ అజ్కా ఇందల్లాహి అజ్జ వజల్ల వలా అఅజమ అజ్రన్) అల్లాహ్ వద్ద అత్యంత పవిత్రమైన మరియు అత్యంత గొప్ప ప్రతిఫలం గల సత్కార్యం మరేదీ లేదు. (సునన్ దారమీ)
ఈ హదీస్ లో కూడా రెండు పదాలు ఏంటి మొదటి పదం అజ్కా ఇందల్లాహ్ వేరే రోజుల్లో చేసే సత్కార్యాల కంటే ఈ రోజుల్లో చేసే సత్కార్యాలు, అంటే తొలి దశ జుల్ హిజ్జా లోని, ఈ రోజుల్లో చేసే సత్కార్యాలు అజ్కా ఎక్కువ పవిత్రమైనవి ఎక్కువగా శుభ్రమైనవి. ఇక్కడ ఎక్కువ పవిత్రమైనవి అంటే ఏంటి నౌజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ వేరే సత్కార్యాలు అని ఏవైతే మనం చేస్తామో అవి అపరిశుభ్రమా నౌజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ కాదు నిదానంగా వినండి అర్థం చేసుకుంటూ వెళ్ళండి ఇక్కడ చూడడానికి పదం ఎలా ఉంది అతి పవిత్రమైన అతి పరిశుభ్రమైన అతి శుద్ధమైన ఆచరణ అల్లాహ్ వద్ద ఈ జుల్ హిజ్జా తొలి దశకంలో చేసే ఆచరణ. అంటే భావం ఏ ఆచరణల ద్వారా నైతే మనం పరిశుద్ధులమవుతామో, ఏ సత్కార్యాల ద్వారా నైతే మన పాపాలు మన్నించబడతాయో, ఏ సత్కార్యాల ద్వారా నైతే ఏ రోజుల్లో చేసే సత్కార్యాల ద్వారా నైతే మనం పాపాల నుండి విముక్తి పొంది అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలతో వాటి ప్రక్షాళన జరిగి పవిత్రమైపోతామో శుద్ధమైపోతామో ఈ రోజుల్లో చేసే సత్కార్యాల ద్వారా అతి ఎక్కువగా మనం పరిశుభ్రత పొందుతాము. అంటే మన పాపాలు చాలా మన్నించబడతాయి ఈ విధంగా మనం పాప రహితులుగా అయిపోతాము అల్లాహు అక్బర్.
రెండవ పదం ఈ హదీస్ లో వచ్చిన రెండవ పదం సత్ఫలిత ప్రదంగా సత్ఫలిత పరంగా అతి గొప్పది ఈ రోజుల్లో చేసే సత్కార్యము. వేరే రోజుల్లో చేసే సత్కార్యాలకు ఏ పుణ్యం అయితే దొరుకుతుందో, ఏ సత్ఫలితం అయితే దొరుకుతుందో, ఎంత మనకు దానికి బదులుగా రివార్డ్స్ దొరుకుతాయో ఈ రోజుల్లో, ఈ తొలి దశకంలో చేసే సత్కార్యాలకు అంతకంటే ఎంతో గొప్పగా అంతకంటే ఎంతో ఎక్కువగా సత్ఫలితం ప్రసాదించబడుతుంది. కేవలం అర్థం కావడానికి చిన్న ఉదాహరణ, ఇప్పటికి కొన్ని కంపెనీలలో కొన్ని ఫ్యాక్టరీలలో కొన్ని ఉద్యోగాల్లో ఆదివారం సెలవు ఉంటుంది. ఇతర అరబ్ దేశాలలో కొన్ని ప్రాంతాల్లో జుమా రోజు సెలవు ఉంటుంది. కానీ కంపెనీలో పని ఎక్కువగా ఉండి చాలా అవసరమై ఉండి ఈరోజు మీరు పని చేశారంటే మీకు డబల్ జీతం అంతే కాదు ఈరోజు సెలవు మీ కొరకు రిజర్వ్ ఉంటుంది వేరే ఏ సందర్భంలో నైనా మీరు తీసుకోవచ్చు ఇలాంటివి ఉంది కదా, మనం చూస్తూ ఉన్నాము అంతేకాదు పొలాల్లో పని చేసే వ్యవసాయంలో పని చేసే వారు కూడా సామాన్యంగా రోజువారీ కూలి ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది కానీ ఎప్పుడైతే పంట రెడీగా ఉంది ఎంత తొందరగా మనం కోత దాన్ని కోసి ఇంట్లోకి తీసుకొచ్చుకుంటామో అంతే ఎక్కువ లాభం ఆలస్యం చేసామంటే వర్షం వల్ల గాని వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల గాని ఏదైనా నష్టం అవుతుంది అలాంటప్పుడు కూలి మనుషులు దొరకనప్పుడు ఏం చేస్తారు యజమానులు భూస్వాములు సామాన్య రోజుల్లో ఇచ్చేటువంటి కూలి కన్నా ఎక్కువగా నిర్ణయించి పంట తొందరగా మన గోదాంలోకి రావాలి అని ఆలోచిస్తారు కదా. ఇక్కడ నేను ముందే చెప్పేసాను ఆ ఉదాహరణ కేవలం చిన్నపాటిగా అర్థం కావడానికి అంతే నూటికి నూరు పాళ్ళు చూడడం జరగదు అల్లాహ్ కు ఇలాంటి ఉదాహరణల అవసరమే లేవు. కానీ అల్లాహ్ మనపై దయ తలచి ఇలాంటి గొప్ప శుభాలు గల రోజులు మనకు ప్రసాదించి అందులో చేసే సత్కార్యాలు వాటి యొక్క సత్ఫలితం మనకు వేరే రోజుల్లో ఇచ్చే సత్ఫలితాని కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ఎంతో గొప్పగా అల్లాహ్ మనకు ప్రసాదిస్తాడు అందుకొరకే సోదర మహాశయులారా ఎంత ధర్మ జ్ఞానం ఎక్కువగా మనం తెలుసుకుంటామో పండితులకు దగ్గరగా ఉండి సలఫ్ మన్హజ్ ప్రకారంగా అర్థం చేసుకుంటూ తెలుసుకుంటామో అంతే పుణ్యాల పట్ల ఎక్కువ కాంక్ష కూడా పెరుగుతుంది, పుణ్యాలు సంపాదించే మార్గాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి.
సోదర మహాశయులారా ఈ తొలి దశకం దీనికి ఇంత గొప్ప ఘనత ఎందుకు ఉన్నది ఇంతకుముందే సంక్షిప్తంగా కొన్ని విషయాలు మీకు ప్రస్తావించాను ఈ దశకంలోనే ఒక రోజు ఉంది ఆ రోజు గురించే సూరతుల్ ఫజర్ లో వల్ వత్ర్ అని చెప్పడం జరిగింది మరియు సూరతుల్ బరూజ్ లో మష్ హూద్ అని చెప్పడం జరిగింది, ఏంటి అది అరఫా యొక్క రోజు అల్లాహు అక్బర్ ఎంత గొప్ప రోజు అది. చాలా గొప్ప రోజు అరఫా రోజు హాజీల కొరకు ఒక ప్రాణం లాంటిది.
అరఫా దినం యొక్క విశిష్టత
అవును ఎందుకంటే మనిషి హజ్ పేరు మీద లక్షలు ఖర్చుపెట్టి ఏడు ఎనిమిది రోజులు కాదు నెల రెండు నెలలు మక్కాలో పడి ఉండి ఎన్నో నమాజులు ఎన్నో సత్కార్యాలు ఎన్నో పనులు చేసినా అరఫాత్ మైదానంలో తొమ్మిదవ రోజు ఏదైతే వచ్చి అక్కడ ఇబాదత్ చేయాలో ఆరాధన చేయాలో తొమ్మిదో తారీకు ఒకవేళ అరఫాలో హాజరు కాలేదంటే అతని హజ్ కానే కాదు. తిర్మిజీలో వచ్చి ఉంది, సహీ హదీస్ ఇది. అంతటి గొప్ప ఘనత గల రోజు గమనించండి. ముస్లిం షరీఫ్ లో వచ్చిన హదీస్ ప్రకారం గమనించండి ఆ రోజు అల్లాహ్ ఎంత మందిని నరకం నుండి విముక్తి కలిగిస్తాడో వేరే ఏ రోజుల్లో కూడా అంత మందిని విముక్తి కలిగించడు అల్లాహు అక్బర్.
وَلِلَّهِ عُتَقَاءُ مِنَ النَّارِ، وَذَلكَ فِي كُلِّ لَيْلَةٍ (వలిల్లాహి ఉతఖాఉ మినన్నార్, వ జాలిక ఫీ కుల్లి లైలహ్) మరియు అల్లాహ్ నరకం నుండి ఎంతో మందిని విముక్తులను చేస్తాడు, ఇది ప్రతి రాత్రి జరుగుతుంది. (సహీహ్ తిర్మిజీ)
مَا مِنْ يَوْمٍ أَكْثَرَ مِنْ أَنْ يُعْتِقَ اللَّهُ فِيهِ عَبْدًا مِنَ النَّارِ مِنْ يَوْمِ عَرَفَةَ (మా మిన్ యౌమిన్ అక్సర మిన్ అన్ యుఅతికల్లాహు ఫీహి అబ్ దన్ మినన్నారి మిన్ యౌమి అరఫా) అరఫా దినాన అల్లాహ్ నరకం నుండి దాసులను విముక్తి చేసినంతగా మరే ఇతర దినాన విముక్తి చేయడు. (సహీహ్ ముస్లిం)
రమదాన్ లో విన్నాము కదా మనం రమదాన్ ఆన్లైన్ క్లాసులలో మీరు హాజరయ్యారు కదా ఏం విన్నాము తిర్మిజీ యొక్క సహీ హదీస్ అల్లాహ్ రమదాన్ లోని ప్రతి రాత్రిలో ఎంతో మంది నరకవాసులను నరకం నుండి విముక్తి కలిగిస్తాడు. కానీ ఇక్కడ హదీస్ వినండి అరఫా రోజున అల్లాహ్ ఎంత ఎక్కువ మందిని నరకం నుండి విముక్తి కలిగిస్తాడో అంత పెద్ద సంఖ్యలో వేరే ఏ రోజుల్లో కూడా విముక్తి కలిగించడు అంత గొప్ప అంత పెద్ద సంఖ్యలో ఇక గమనించండి ఆ రోజు మనం ఉపవాసం పాటించడం ఓ అల్లాహ్ నన్ను నరకం నుండి కాపాడు నరకానికి తీసుకువెళ్లే పాపాల నుండి కాపాడు అల్లాహ్ అని ఏడ్చుకుంటూ ఆ నరకంతో భయపడుతూ అల్లాహ్ తో శరణు కోరడం ఎంత అవసరమో ఒకసారి ఆలోచించండి.
అంతేకాదు ఆ హదీసులో మరో శుభవార్త కూడా ఉంది ఏముంది అల్లాహ్ అరఫా రోజున తన దాసులకు చాలా దగ్గరికి వస్తాడు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ సలఫె సాలిహీన్ యొక్క అఖీదా ఇక్కడ అల్లాహ్ వస్తాడు అని తెలిపాడు మనము నమ్మాలి కానీ అల్లాహ్ కు తగిన రీతిలో వస్తాడు అని నమ్మాలి ఎలా వస్తాడు దాని గురించి మనం ప్రశ్నించవద్దు అల్లాహ్ కరుణామయుడు మనపై దయ తలచు వాడు నరకం నుండి విముక్తి కలిగించే రోజు అది అల్లాహ్ తన దాసులకు అతి సమీపం అవుతాడు అని అంటే మనం ఈ తొలి దశకంలో ప్రత్యేకంగా అరఫా రోజున మనకు మనం అల్లాహ్ కు దగ్గరగా కావడానికి ఇంకా ఎంత సత్కార్యాల్లో ముందుకు ఉండి పాపాలకు దూరంగా ఉండాలో గమనించండి.
అరఫా యొక్క రోజు ఘనతలో వచ్చిన హదీస్ ను మనం గమనిస్తే: అల్లాహ్ హజ్ కొరకు అరఫాత్ మైదానంలో వచ్చి ఉన్నవారి పాపాలను పాపాలు అనేనా కాదు కాదు సంతోషం వహించండి హదీస్ లో ఇంకా ఉంది ఆ హాజీలు ఎవరెవరి గురించి అయితే దువాలు చేస్తారో వారందరి పాపాలను అల్లాహ్ మన్నించేస్తాడు దాసులకు మరింత తృప్తి ఆనందం కలగాలని అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోట మరింత వివరణ తెలియపరిచాడు. ఏంటి వారి పాపాలు ఇసుక యొక్క ఉసికలో చిన్న చిన్న రాళ్లు ఏవైతే ఉంటాయో వాటికంటే ఎక్కువ సంఖ్యలో వర్షపు నీటి చుక్కల కంటే ఎక్కువ సంఖ్యలో సముద్రములోని నురుగు కంటే ఎక్కువ సంఖ్యలో హాజీలను హాజీలు ఎవరెవరి గురించి అయితే దువాలు చేశారో వారందరి పాపాలను అల్లాహ్ మన్నించేస్తాడు అల్లాహు అక్బర్ అందుకొరకు అల్లాహ్ నుండి మనం మన పాపాల మన్నింపు కొరకు మనం చేయవలసిన అతి ముఖ్యమైన పని ఏంటో తెలుసా అల్లాహ్ యొక్క తౌహీద్ పై స్థిరంగా ఉండాలి. షిర్క్ కు అతి దూరంగా ఉండాలి, ప్రవక్త సున్నత్ ను అవలంబించాలి బిదఅత్ ను విడనాడాలి అందుగురించే గమనించండి మువత్తా ఇమామ్ మాలిక్ లో వచ్చిన హదీస్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
أَفْضَلُ مَا قُلْتُ أَنَا وَالنَّبِيُّونَ مِنْ قَبْلِي: لاَ إِلَهَ إِلاَّ اللَّهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ (అఫ్ దలు మా కుల్తు అన వన్నబియ్యూన మిన్ కబ్లీ: లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షయ్ ఇన్ కదీర్) నేను మరియు నాకంటే ముందు వచ్చిన ప్రవక్తలు పలికిన పదాలలో అత్యుత్తమమైనది: అల్లాహ్ తప్ప మరే ఆరాధ్యుడు లేడు, ఆయన ఏకైకుడు, ఆయనకు ఎలాంటి భాగస్వామి లేడు. సార్వభౌమాధికారం ఆయనదే, సర్వ స్తోత్రములు ఆయనకే శోభిస్తాయి, మరియు ఆయన ప్రతి వస్తువుపై సర్వాధికారి. (మువత్తా ఇమామ్ మాలిక్)
నేను మరియు నాకంటే ముందు ప్రవక్తలందరూ కూడా పలికినటువంటి అతి ఉత్తమ పదాలు అతి ఘనత గల పదాలు లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లాషరీకలహ్ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైయిన్ కదీర్. అరఫా రోజున ప్రత్యేకంగా హాజీలు ఎక్కువగా చదవాలి వేరే వారు కూడా హాజీలనే కాదు మనం కూడా ఎవరైతే హజ్ చేయమో సహీ బుఖారీ లోనే హదీస్ అయితే మీకు గుర్తుంది కదా ఎవరైతే ఉదయం 100 సార్లు లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లాషరీకలహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైయిన్ కదీర్ చదువుతారో వారి 100 పాపాలు మన్నించబడతాయి వారి కొరకు 100 పుణ్యాలు వ్రాయబడతాయి వారి కొరకు 100 స్థానాలు పెంచబడతాయి వారిని ఉదయం చదివేది ఉంటే సాయంకాలం వరకు సాయంకాలం చదివేది ఉంటే ఉదయం వరకు షైతాన్ నుండి రక్షింపబడడం జరుగుతుంది మరో గొప్ప ఘనత ఆ రోజు అతని కంటే ఉత్తముడు మరొకడు ఉండడు ఎవరైనా ఉండేది ఉంటే ఇలా లేదా ఇంతకంటే ఎక్కువ చదివిన వారు.
సోదర మహాశయులారా సుమారు గంట టైం కావస్తుంది ఇప్పటివరకు మనం జుల్ హిజ్జా మాసంలోని తొలి దశకం యొక్క ఘనత వింటూ వస్తున్నాము అయితే రండి మరి కొన్ని క్షణాల్లో అతి ముఖ్యమైన కొన్ని విషయాలు చెప్పి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను ఆ తర్వాత మీ ప్రశ్నలు ఏవైనా ఉండేది ఉంటే వాటిని మనం తీసుకుందాము.
సోదర మహాశయులారా అరఫా రోజు యొక్క ఘనత చివరి ఒక మాట చెప్తాను అరఫా గురించి అరఫా రోజు యొక్క ఘనత ఎవరైతే హజ్ లో ఉన్నారో వారి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. కానీ ఎవరైతే హజ్ లో లేరో వారి గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాము అయితే హజ్ లో లేని వారి గురించి మరో శుభవార్త ఏమిటంటే ఎవరైతే హజ్ చేయడం లేదో వారు తమ తమ దేశాల్లో తమ తమ ప్రాంతాల్లో తొమ్మిదవ తారీకు జుల్ హిజ్జా రోజున ఉపవాసం ఉండాలి దీని కారణంగా అల్లాహ్ రెండు సంవత్సరాల వారి పాపాలను మన్నించేస్తాడు అల్లాహు అక్బర్ (సహీహ్ ముస్లిం, హదీస్ నెంబర్ 1162) ఎంత గొప్ప ఘనత గమనించండి అలాగే సోదర మహాశయులారా సంవత్సరంలోని 365 రోజుల్లో అతి గొప్ప రోజు అతి ఘనత గల రోజు అది యౌమున్ నహర్ పదవ తారీకు అవును పదవ తారీకు ఎక్కువ ఘనత గలదా లేదా అరఫా రోజు ఎక్కువ ఘనత గలదా చిన్నపాటి విభేదం ధర్మవేత్తల మధ్య ఎక్కడైనా మీరు వినేది ఉంటే కన్ఫ్యూజ్ కాకండి ఎవరైనా యౌమున్ నహర్ ను ఘనత గలది అని అనేది ఉంటే కూడా మీరు వ్యతిరేకించే అవసరం లేదు. కానీ ఎవరైతే యౌమున్ నహర్ 10వ తారీఖుకు ఎక్కువ ఘనత గలది అని చెప్పారో వారి వద్ద డైరెక్ట్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీస్ ఉంది అబూ దావూద్ హదీస్ నెంబర్ 1765 మరియు దానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి.
నహర్ దినం – త్యాగాల దినం
ఎందుకు సర్వ సామాన్యంగా ఈ హదీస్ కాకుండా మరొక హదీస్ ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే అల్లాహ్ కు ఈ రోజున ఖుర్బానీ అంటే చాలా ఎక్కువ ఇష్టం మరియు హజ్ లో ఉన్న వారు తల్బియా చదవడం, తక్బీర్ చదవడం చాలా ఇష్టం అంతే కాదు ఎవరైతే హజ్ లో లేరో వారు తమ తమ ప్రాంతాల్లో ఏదైతే వారికి ఈదుల్ అద్హా పండుగ రోజు ఉంటుందో ఖుర్బానీ పండుగ అని సామాన్యంగా ఏదైతే మనం అంటామో ఆ రోజున వారు తక్బీర్ ఎక్కువగా చదవడం ఇది వారి కొరకు చాలా ఘనత గల విషయం.
ఈ పది రోజులలో చేయవలసిన ముఖ్యమైన పనులు
సోదర మహాశయులారా జుల్ హిజ్జా తొలి దశ ఘనతలో యౌమున్ నహర్ గురించి మనం తెలుసుకుంటూ ఉంటిమి ఆ రోజు చాలా ఘనత గల రోజు ఎందుకంటే ఎన్నో రకాల ఆరాధనలు ఎన్నో రకాల ఇబాదత్ లు ఆ రోజు ఏకమవుతున్నాయి అందుకొరకు సంవత్సరంలోని రోజుల్లో కెల్లా యౌమున్ నహర్ ఖుర్బానీ యొక్క రోజు మొదటి రోజు చాలా ఘనత గలది అని కూడా చెప్పడం జరిగింది. అయితే మనం ఖుర్బానీ కూడా చేస్తూ ఉండాలి అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పినటువంటి ఇంకా ఎన్నో సత్కార్యాల్లో మనం ముందుకు ఉండాలి. ప్రత్యేకంగా, ప్రత్యేకంగా మనం చేయవలసిన సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక లిస్ట్ మాదిరిగా నేను సంక్షిప్తంగా తెలియజేస్తున్నాను ఆ తర్వాత మన ఈ ప్రసంగం అనేది సమాప్తం అవుతుంది.
సోదర మహాశయులారా తౌహీద్ లో మనం చాలా బలంగా స్థిరంగా నిలకడగా నమ్మకంగా గట్టిగా ఉండాలి ఎందుకంటే ఇదే మన సత్కార్యాలన్నిటికీ మూలం ఇదే మన సత్కార్యాలు అల్లాహ్ వద్ద స్వీకరించబడటానికి గొప్ప సబబు ఈ తౌహీద్ మన జీవితానికి వెన్నెముక లాంటిది ఆత్మ లాంటిది చాలా ముఖ్యమైనది మనం వేరే ఎన్ని పనులు ఎంత ఎక్కువగా చేసినా ఎన్ని సత్కార్యాలు ఎంత ఎక్కువగా చేసినా ఒకవేళ మనం అల్లాహ్ యొక్క తౌహీద్ పై స్థిరంగా లేము అంటే సోదర మహాశయులారా చాలా చాలా నష్టంలో మనం వెళ్ళిపోతాము ఎందుకంటే అల్లాహ్ ఈ తౌహీద్ కు ఇచ్చినటువంటి ఘనత వేరే ఏ దానికి అంత ఎక్కువగా లేదు దీనికి సంబంధించి ఖురాన్ హదీసుల్లో ఎన్నో ఆయతులు ఎన్నో హదీసులు ఉన్నాయి వాటన్నిటినీ ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు కానీ అర్థం చేసుకోండి తౌహీద్ ను ముందు పరుచుకోవాలి స్థిరంగా ఉండాలి షిర్క్ కు అతి దూరంగా ఉండాలి ప్రవక్త సున్నత్ ను అవలంబించాలి బిదఅత్ ను విడనాడాలి అందుగురించే గమనించండి మువత్తా ఇమామ్ మాలిక్ లో వచ్చిన హదీస్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు నేను మరియు నాకంటే ముందు ప్రవక్తలందరూ కూడా పలికినటువంటి అతి ఉత్తమ పదాలు అతి ఘనత గల పదాలు అతి విశిష్టత గల పదాలు లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లాషరీకలహ్ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైయిన్ కదీర్.
అరఫా రోజున ప్రత్యేకంగా హాజీలు ఎక్కువగా చదవాలి వేరే వారు కూడా హాజీలనే కాదు మనం కూడా ఎవరైతే హజ్ చేయమో సహీ బుఖారీ లోనే హదీస్ అయితే మీకు గుర్తుంది కదా ఎవరైతే ఉదయం వంద సార్లు ఇలా చదువుతారో వారి వంద పాపాలు మన్నించబడతాయి వారి కొరకు వంద పుణ్యాలు రాయబడతాయి వారి కొరకు వంద స్థానాలు పెంచబడతాయి వారిని ఉదయం చదివేది ఉంటే సాయంకాలం వరకు సాయంకాలం చదివేది ఉంటే ఉదయం వరకు షైతాన్ నుండి రక్షింపబడడం జరుగుతుంది. మరో గొప్ప ఘనత ఆ రోజు అతని కంటే ఉత్తముడు మరొకడు ఉండడు ఎవరైనా ఉండేది ఉంటే ఇలా లేదా ఇంతకంటే ఎక్కువ చదివిన వారు.
సోదర మహాశయులారా సుమారు గంట టైం కావస్తుంది ఇప్పటివరకు మనం జుల్ హిజ్జా మాసంలోని తొలి దశకం యొక్క ఘనత వింటూ వస్తున్నాము. అయితే రండి మరి కొన్ని క్షణాల్లో అతి ముఖ్యమైన కొన్ని విషయాలు చెప్పి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను.
సోదర మహాశయులారా తౌహీద్ పై స్థిరంగా ఉండాలి. ప్రవక్త సున్నత్ పై స్థిరంగా ఉండండి. ఐదు పూటల నమాజులు పురుషులు జమాత్ తో పాటిస్తూ ఉండండి ఫజర్ నమాజ్ యొక్క సంబంధించి ఫజర్ నమాజ్ తర్వాత జికిర్ చేస్తూ ఉండడం ద్వారా ఏదైతే గొప్ప హజ్ యొక్క పుణ్యం పొందగలుగుతాము అన్నటువంటి ఒక గత పాఠంలోని వీడియో ద్వారా ఏదైతే తెలపడం జరిగిందో ఒక సోదరుడు ప్రశ్నించాడు ఈ రోజుల్లో కరోనా వైరస్ కారణంగా భయం చెంది మస్జిద్ కు వెళ్ళకుంటే ఏమైనా పాపమా? అవును కరోనా వల్ల ఎంత మనం భయపడుతున్నామో ఒక్క విషయం గమనించండి చావు ఏ రీతిలోనైనా రానుంది కానీ మనం తగిన జాగ్రత్తలు పాటిస్తూ మస్జిద్ లు తెరవబడిన తర్వాత కూడా వేరే ఇంకా ఏ ధర్మ కారణం లేకుండా జమాత్ ను వదలడం మనకు మనం చాలా నష్టంలో పడేసుకుంటున్నాము. ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో రకాల గొప్ప సత్ఫలితాలను పుణ్యాలను మనం పోగొట్టుకుంటున్నాము. అందుకొరకు అలా చేయకండి స్త్రీలు సమయంలో ఇంట్లో నమాజు చేయాలి మరియు నమాజ్ విషయానికి వస్తే మనం ప్రత్యేకంగా ఈ రోజుల్లో నమాజ్ ద్వారా ఎలా ఎక్కువ పుణ్యాలు పొందగలుగుతాము పురుషులు తొలి సమయంలో మస్జిద్ కు రావడం ద్వారా మరియు ఫరజ్ నమాజ్ కంటే ముందు తర్వాత సున్నతులు ఏవైతే ఉన్నాయో వాటిని పాబందీగా పాటించడం ద్వారా ఇంట్లో స్త్రీలు తొలి సమయంలో నమాజు చేస్తూ దానికంటే ముందు తర్వాత ఉన్నటువంటి సున్నతులు పాటించడం ఫరజ్ నమాజ్ చేసిన తర్వాత కొంతసేపు నమాజు చేసుకున్న స్థలంలోనే కూర్చుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినటువంటి దువాలు ఒకవేళ యాద్ లేకుంటే కంఠస్థం లేకుంటే పుస్తకంలో చూసి చదవండి మొబైల్ లో చూసి చదవండి పాపం ఏమీ లేదు.
అలాగే సోదర మహాశయులారా నమాజ్ విషయానికి వస్తే ఇంకా తహజ్జుద్ నమాజ్ ఉంది అలాగే సలాతుద్దోహా చాష్త్ నమాజ్ ఉంది మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జోహర్ తర్వాత కొన్ని సందర్భాల్లో నాలుగు చేసే విషయంలో కూడా ప్రోత్సహించారు అసర్ కంటే ముందు నాలుగు చేసే విషయంలో కూడా ప్రోత్సహించారు దీనికి సంబంధించి మా యూట్యూబ్ ఛానల్ జెడికె నసీర్ లో సున్నతు నమాజుల ఘనత అని రెండు వీడియోలు ఉన్నాయి తప్పకుండా విని మరింత ఎక్కువ జ్ఞానం పొందే ప్రయత్నం చేయండి.
అలాగే సోదర మహాశయులారా ఈ జుల్ హిజ్జా తొలి దశంలో మనం ఉపవాసాలు పాటించవచ్చు తొమ్మిదవ తారీకు ఉపవాసం గురించి చెప్పడం జరిగింది రెండు సంవత్సరాల పాపాలు మన్నించబడతాయి అని కానీ అదే కాకుండా మీరు ఒకవేళ ఒకటి నుండి ఎనిమిది వరకు నఫిల్ ఉద్దేశంతో ఉపవాసాలు పాటించినా పాపం లేదు. ఈ రోజుల్లో కొందరు ఒక విషయాన్ని ప్రచారం చేస్తున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకటి నుండి ఎనిమిది వరకు ఉపవాసం ఉన్నట్టు ఎక్కడా రుజువు లేదు అందుకొరకు కేవలం తొమ్మిది ఉండాలి అని సోదర మహాశయులారా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడంలో మనం ముందుకు వెళ్ళకూడదు ఎవరైనా ఏది మంచి భావనతో ఏదైనా ఒక చిన్న ఆధారం దొరికింది అని ఎలా ప్రచారం చేస్తే అల్లాహ్ వారికి హిదాయత్ ఇవ్వు గాక వారి యొక్క జ్ఞానం మరింత ఎక్కువగా అధికంగా ప్రసాదించు గాక కానీ న్యాయమైన మాట ధర్మ పండితులు తెలిపినటువంటి విషయం స్వయంగా మీరు హదీసును గ్రహించండి ఇప్పటివరకు మనం విన్న హదీసులో మామిన్ అయ్యామిన్ అల్ అమలస్సాలిహ్ ఏ ఆచరణ కూడా ఏ సత్కార్యం కూడా ఈ రోజుల్లో ఎంత ఎక్కువగా అల్లాహ్ కు ప్రియమో పవిత్రమో ఎక్కువ పుణ్యప్రదమో ఎక్కువ ఘనత గల విశిష్టత గలదో ఆరు రకాల పదాలు మనం విన్నాం కదా గుర్తుందా అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని సత్కార్యాల గురించి చెబుతున్నారు.
నేను మీకు మరో విషయం ఆ హదీసుల్లో వచ్చింది ఇంకా చెప్పలేదు టైం సరిపడటం లేదు అని కానీ సంక్షిప్తంగా చెప్తున్నాను గుర్తుంచుకోండి సహాబాలు అడిగారు సహాబాల దృష్టిలో జిహాద్ యొక్క స్థానం చాలా గొప్పగా ఉంది. సహాబాలు అడిగారు ప్రవక్త మీరు ఏ ఆచరణ కూడా అంత అల్లాహ్ కు ప్రియమైనది కాదు అంటున్నారు జిహాద్ కూడా లేదా అని అంటే ప్రవక్త ఏమన్నారు జిహాద్ కూడా లేదు ఒకవేళ ఏదైనా జిహాద్ ఉండేది ఉంటే అంటే వేరే సందర్భంలో చేసే జిహాద్ ఏదైనా ఉండేది ఉంటే ఏది అది మనిషి తన ప్రాణంతో తన ధనంతో వెళ్ళాడు ఏ ఒక్క దానితో కూడా తిరిగి రాలేదు అలాంటి వ్యక్తి విషయం వేరు అని చెప్పారు గమనించండి. ఉపవాసం ఇక సత్కార్యాల్లో రాదా ఇట్లా జనరల్ గా మనం ఆలోచించేది ఉంటే ఉమ్మె సల్మా రజియల్లాహు తాలా అన్హా ఇంకా వేరే కొందరు సహాబీల సహాబియాత్ ల యొక్క ఉల్లేఖనాలు ఉన్నాయి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసం పాటించినట్లుగా అందుకొరకు సోదర మహాశయులారా సోదరీమణులారా నఫిల్ ఉపవాసాలు ఈ రోజుల్లో ఉండవచ్చు మరియు ఈ హదీసుల యొక్క భావంతో మనకు ఏమి తెలుస్తుంది వేరే రోజుల్లోని ఉపవాసాల కంటే ఎక్కువ పుణ్యం వేరే రోజుల్లోని నమాజుల కంటే ఎక్కువ పుణ్యం వేరే రోజుల్లోని దానధర్మాల కంటే ఎక్కువ పుణ్యం ప్రతి సత్కార్యం ఈ రోజుల్లో చేస్తే దాని యొక్క పుణ్యం వేరే రోజుల్లో చేసిన దానికంటే ఎక్కువగా ఉంటుంది.
అలాగే సోదర మహాశయులారా దానధర్మాలు కూడా ఎక్కువగా చేయండి. ఈ మధ్యలో ఖుర్బానీ చేయడం మర్చిపోకండి ఖుర్బానీ ఈ రోజుల్లో కరోనా వైరస్ కారణంగా కొన్ని ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలు ఖుర్బానీ పై పాబందీ చేయాలి ఖుర్బానీ చేయనివ్వకూడదు అన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు జరుగుతుంది కానీ ఒకవేళ ముస్లింలు అందరూ ఐక్యంగా ఉండి మేము కరోనా వైరస్ కు సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ పరిశుభ్రతకు మేము ఒక అందరి కొరకు ఒక గొప్ప ఉపమానంగా ఒక ఐడియల్ గా నిలుస్తాము అంత పరిశుభ్రత మేము పాటిస్తాము అన్నటువంటి మాట ఇచ్చి అలాగ మనం వాస్తవంగా పాటిస్తూ ఖుర్బానీ చేయడానికి ముందుకు వచ్చామంటే అల్లాహ్ యొక్క సహాయం తప్పకుండా అందుతుంది కానీ విషయం ఏంటి మనలో కూడా ఎన్నో రకాల కొన్ని తప్పిదాలు ఉంటాయి దాని కారణంగా మనపై ఇలాంటి ఆంక్షలు వస్తాయి చివరికి ఫలానా వారు మనకు శత్రువులు మనల్ని చేయనివ్వడం లేదు అన్నటువంటి నినాదాలు మనం చేస్తాము కానీ వాస్తవానికి శత్రువులు చేసే ప్రయత్నాలు చేస్తారు ఎందుకు చేయరు వారు కానీ మనం చేసే ప్రయత్నాలు మనం ఎందుకు సరిగ్గా చేయకూడదు ఇక్కడ విషయం ఆలోచించండి నౌజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ కొందరు నా మాటను తప్పుడుగా తీసుకుంటారు నేనంటాను ఎగ్జాంపుల్ నీ శత్రువు నీ మేలు ఎందుకు కోరుతాడు ఒక చిన్న ఉదాహరణ కానీ నీవు ఒక ఉత్తమ ముస్లిం గా నీవు చేసే పని మీద ఒక శత్రువు కూడా వేలు లేపకుండా ఉండేటటువంటి ప్రయత్నం ఒకవేళ మనం చేసేది ఉంటే అటు అల్లాహ్ నుండి సహాయం కోరుతూ అల్లాహ్ ఇచ్చిన ఆదేశాన్ని నెరవేర్చడానికి ఏ ఆటంకాలు రాకూడదు అన్నటువంటి ప్రయత్నాలు చేస్తూ పరిశుభ్రత గాని లేకుంటే ఈ కరోనా కు సంబంధించినటువంటి జాగ్రత్తలు గాని ఇంకా ఏ ఏవి అవసరం ఉన్నాయో వాటన్నిటిని మనం పాటించాము అంటే అల్లాహ్ యొక్క సహాయం తప్పకుండా అందుతుంది అంటే నేను చెప్పే విషయం మనుషులం మనం కొన్ని కొరతలు కొన్ని లోటుపాట్లు మనవి ఉంటాయి మనం వాటిని కూడా దూరం చేసుకొని ఉత్తమ రీతిలో మనం పని చేసే ప్రయత్నం చేయాలి అల్లాహ్ మనకు ఇదే ఆదేశించాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు:
إِنَّ اللَّهَ كَتَبَ الإِحْسَانَ عَلَى كُلِّ شَىْءٍ (ఇన్నల్లాహ కతబల్ ఇహ్సాన అలా కుల్లి షయ్) నిశ్చయంగా అల్లాహ్ ప్రతి విషయంలోనూ ఇహ్సాన్ (ఉత్తమ రీతిలో ప్రవర్తించడాన్ని) తప్పనిసరి చేశాడు. (సహీహ్ ముస్లిం)
అల్లాహ్ ఇహ్సాన్ ప్రతి విషయంలో మీరు పాటించాలని విధిగా ఉంచాడు గమనించండి సహీ హదీస్ ఇది కతబల్ ఇహ్సాన ఫీ కుల్లి షై. ఇక్కడ ఇహ్సాన్ అంటే ప్రతి పనిని మీరు ఎక్దం పర్ఫెక్ట్ గా లోటుపాట్లు లేకుండా ఇతరులకు ఇబ్బంది లేకుండా మంచి విధంగా చేసే ప్రయత్నం చేయండి అయితే ఆవేశాలకు కోపతాపాలకు దూరం ఉండి మంచి కార్యాల్లో ఇంకా మనం ముందుకు వెళ్ళాలి.
కుటుంబ సంస్కరణ మరియు ఇహ్సాన్
ఖురాన్ పారాయణం అధికంగా చేయాలి ఇంతవరకే మన సోదరుడు అబ్దుల్లా తెలిపినట్లు ఇంకా పండుగ కొరకు సుమారు ఇటు వారం పది రోజులు అటు సుమారు పది రోజులు ఇంకా కనీసం ఎంత లేకున్నా 15 20 రోజుల సమయం ఉంది ఈ మధ్యలో కూడా మనం పిల్లల కొరకు ఒక మంచి ప్రోగ్రాం మొదలుపెట్టాలన్నటువంటి కాంక్ష కూడా మాది ఉంది మీరు రండి ఈ రోజుల్లో పెద్దల కొరకు ధర్మం నేర్చుకోవడానికి ఏదో ఒక రకమైన సౌకర్యం ఉండవచ్చు కానీ పిల్లల గురించి మనం ఆలోచిస్తున్నామా అల్లాహ్ ఏమని చెప్పాడు:
قُوا أَنفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا (ఖూ అన్ఫుసకుమ్ వ అహ్లీకుమ్ నారా) మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను అగ్ని నుండి కాపాడుకోండి. (66:6)
మీరు కూడా నరకం నుండి రక్షణ పొందండి మీ యొక్క సంతానాన్ని కూడా మీరు రక్షణ కలిగించండి అని. అయితే పిల్లలకు ఇస్లాం నేర్పడం చాలా ముఖ్యం అలవాటు చేయండి ఇంట్లో ఆడపిల్లలకు ఏడు సంవత్సరాల వయసు పైగా అయ్యారు అంటే వారికి పరదా విషయాలు గాని పరపురుషులతో ఉండేటటువంటి విషయాలు గాని నేర్పండి మెల్లమెల్లగా అలవాటు చేయండి నమాజు గురించి ఇతర సత్కార్యాల గురించి పిల్లల ద్వారా దానధర్మాలు చేయించండి మంచి అలవాట్లు మంచి గుణాలు వారికి కూడా అబ్బే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండండి.
సంక్షిప్తంగా ఒకే మాటలో చెప్పాలంటే అల్లాహ్ కు ఇష్టమైన ప్రతి మంచి పని చేయడంలో ముందుకు అల్లాహ్ కు ఇష్టం లేని ప్రతి చెడు పని చేయడంలో వెనక్కి ఎంత దూరం ఉండగలిగితే అంతే ప్రయత్నం చేయాలి అల్లాహ్ జుల్ హిజ్జా తొలి దశకం ఏదైతే రాబోతున్నదో ఈసారి మనం అల్లాహ్ కు ఇలాంటి సత్కార్యాలతో మనం ముందుకు వచ్చి మనం ఉత్తమమైన ముస్లిం గా చూపించే ప్రయత్నం చేయాలి అలాంటి కాంక్ష మనం కలిగి ఉండాలి అల్లాహ్ మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించు గాక అల్లాహ్ తన కరుణాకటాక్షాలతో మనపై దయ తలచు గాక మన ఆయుష్షులో బరకత్ ప్రసాదించు గాక మనకు ఆరోగ్యాలు ప్రసాదించు గాక మన ధన ప్రాణ సత్కార్యాలలో వృద్ధిని దయచేయు గాక మనము జీవించి ఉన్నంతకాలం ఇస్లాం మరియు ఈమాన్ పై నిలకడ ప్రసాదించు గాక మనకు ఈ లోకం నుండి మనము వెళ్ళేది ఉంటే మన తుది శ్వాస తౌహీద్ పై ఈమాన్ పై కలుగునట్లుగా భాగ్యము కలుగజేయుగాక మన పాపాలను మన్నించు గాక మనకు ధర్మ జ్ఞానం ఎక్కువగా నేర్చుకుంటూ ఉండి అల్లాహ్ దాని ప్రకారంగా ఆచరిస్తూ ఇతరులకు ఆహ్వానించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
(తప్పక చూడవలసిన వీడియో)! [1:01:35 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ప్రియమైన సోదరులారా! సోదరీమణులారా! అందరు తప్పక చూడవలసిన వీడియో!
టైటిల్ చూసి బోరింగ్ టాపిక్ అనుకోవద్దు.వీడియో మొదట భాగంలో కొంచెం ఓర్పు పట్టి వినండి. కొంత సమయం తర్వాత, మీకు తప్పక ఇంటరెస్ట్ కలుగుతుంది. దీంట్లో చెప్పిన విషయాలు శ్రద్దగా వినండి, ఇన్షా అల్లాహ్ మనలో తప్పక మార్పు కలుగుతుంది.
మీరు వినటమే కాదు, తప్పక మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి మరియు వినమని ప్రోత్సహించండి.
అల్లాహ్ మనందరికీ సత్ భాగ్యం కలుగ జేయుగాక.అమీన్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నమాజు కొరకు తొలి సమయంలో (త్వరగా, శీఘ్రముగా) బయలుదేరుట చాలా ఘనతగల విషయం. ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారని అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ:
“అజాన్ చెప్పడంలో, మొదటి పంక్తిలో చేరడంలో ఎంత పుణ్యం ఉందో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటీలు వేసుకునే పద్ధతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటీలు వేసుకుంటారు. అలాగే నమాజ్ వేళ కాగానే తొలి సమయంలో (మస్జిద్) చేరడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీపడతారు“. (బుఖారీ 615, ముస్లిం 437).
జుమా నమాజు కొరకు తొలి సమయంలో వెళ్ళటంలో ప్రత్యేక శ్రేష్ఠత మరియు చెప్పరాని విశిష్ఠత ఉంది. ఈ హదీసుపై శ్రద్ధ వహించండి. ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
عَنْ أَوسِ بنِ أَوسٍ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ:
“ఎవరు జుమా రోజు తలంటు స్నానం చేసి, తొలి సమయంలో అందరికంటే ముందుగా (మస్జిద్ చేరుకుని), ఇమాంకు సమీపంగా నిశ్శబ్దంగా కూర్చున్నాడో, అతను నడిచే ప్రతి అడుగుకు బదులుగా ఒక సంవత్సరపు ఉపవాసాల మరియు ఒక సంవత్సరపు తహజ్జుద్ నమాజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇది అల్లాహ్ కు ఎంతో కష్టం కాదు“([1]).
జుమా కొరకు ఒక్కో అడుగుపై ఒక సంవత్సరపు ఉపవాసాల మరియు తహజ్జుద్ చేసినంత పుణ్యం!! ఇంతకంటే గొప్ప శ్రేష్ఠత, ఘనతగల ఫలితం ఇంకేముంది?
నిరంతరం నమాజు కొరకు తొలి సమయంలో వెళ్ళటం మనసంతా మస్జిద్ లోనే ఉందన్నదానికి సంకేతం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉపదేశించారు:
“అల్లాహ్ ఛాయ తప్ప మరెలాంటి ఛాయ లభించని (ప్రళయ)దినాన అల్లాహ్ ఏడుగురు వ్యక్తులను తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. అందులో ఒకడు: మస్జిద్ నుండి వెళ్ళినప్పటి నుండీ అక్కడికి తిరిగి వచ్చే వరకు మనసంతా మస్జిదులోనే ఉండేటటువంటి వ్యక్తి“. (తిర్మిజి 2391, బుఖారి 660, ముస్లిం 1031).
5 – అజాన్ కు బదులు పలకటం:
ఇప్పటికీ మనం నమాజుకు సంబంధించిన నిధుల మధ్య ఉత్తమ మైన సుకృతాలు, అమూల్యమైన పుణ్యాల అన్వేషణలో ఉన్నాము. అజాన్ యొక్క జవాబు ద్వారా స్వర్గం పొందవచ్చన్న శుభవార్త ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇచ్చియున్నారు. ఈ రెండు హదీసులపై శ్రద్ధ వహించండి:
عَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ:
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
“ముఅజ్జిన్ ‘అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్’ అన్నపుడు దానికి జవాబుగా మీలో ఒకడు తన హృదయాంతరంతో ‘అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్’ అంటే, అతను (ముఅజ్జిన్) ‘అష్ హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్’ అన్నపుడు ఇతను (మీలో ఒకడు) ‘అష్ హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్’ అంటే, అతను ‘అష్ హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్’ అన్నపుడు ఇతను ‘అష్ హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్’ అంటే, అతను ‘హయ్య అలస్సలాహ్’ అన్నపుడు ఇతను ‘లాహౌల వలా ఖవ్వత ఇల్లా బిల్లాహ్’ అంటే, అతను ‘హయ్య అలల్ ఫలాహ్’ అన్నపుడు ఇతను ‘లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్’ అంటే అతను అల్లాహు అక్బర్ అన్నపుడు ఇతను అల్లాహు అక్బర్ అంటే మళ్ళీ అతను లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నపుడు ఇతను ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అంటే ఇతను స్వర్గంలో ప్రవేశిస్తాడు“. (ముస్లిం 385).
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో యమన్ వైపున హిజాజులో ఒక ఎత్తైన ప్రదేశంలో ఉండగా, బిలాల్ నిలబడి అజాన్ ఇచ్చాక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః “ఇతను (బిలాల్) చెప్పినట్లు పూర్తి నమ్మకంతో ఎవరు జవాబిస్తారో అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు”. (అహ్మద్ 2/352. నిసాయీ 668).
6 – అజాన్ తర్వాత దుఆః
అజాన్ తర్వాత దుఆ యొక్క ఘనత కూడా గొప్పగా ఉంది. కాని అనేకులు దీని పట్ల అశ్రద్ధ వహిస్తున్నరు. దాని సారాంశం క్రింది విధంగా ఉందిః
“‘అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్దావతిత్తామ్మతి వస్సలాతిల్ ఖాఇమతి ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫజీలత వబ్అస్ హు మఖామమ్ మహ్మూద నిల్లజీ వఅత్తహూ’. ఈ న్న దుఆ ఎవరు అజాన్ విన్న తర్వాత చదువుతారో వారు ప్రళయదినాన నా సిఫారసుకు అర్హులవు తార”ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చినట్లు జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 614).
[1]. అల్ ముఅజముల్ కబీర్ లిత్తబ్రానీ 1/214. అహ్మద్ 4/9. దీని భావం అబూ దావూద్ 345. తిర్మిజి 496. నిసాయీ 1381. ఇబ్ను మాజ 1087లో ఉంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
బద్ర్ యుద్ధం తర్వాత ఒక సంవత్సరానికి, మస్లిముల మరియు అవిశ్వాసుల మధ్య ఈ యుద్ధం జరిగింది. బద్ర్ యుద్ధంలో ఓటమికి పాలైన అవిశ్వాసులు, ముస్లిములతో ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకే ఈ సారి 3000 సైనికులతో బయలుదేరారు. వారితో పోరాడడానికి ముస్లిముల వైపు నుండి 700 మంది పాల్గొన్నారు. ప్రారంభ దశలో ముస్లిములే గెలుపొందారు. అవిశ్వాసులు మక్కా దారి పట్టారు. కాని వెంటనే మళ్ళీ తిరిగి వచ్చారు. కొండ వెనుక వైపు నుండి వచ్చి, ముస్లిములపై విరుచుకు పడ్డారు. ఇలా ఎందుకు జరిగిందంటే: అదే కొండపై ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొందరు విలుకాండ్రులను నియమించారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆ స్థానాన్ని వదలకూడదని వారికి నొక్కి చెప్పారు. కాని వారు ముస్లిములు గెలుపొందినది, ముష్రికులు పారిపోవునది చూసి (యుద్ధం ముగిసిందన్న భ్రమలో పడి) విజయప్రాప్తి కోసం పరుగెత్తుకొచ్చారు. అందువల్ల ఆ స్థలం ఖాలీ అయిపోయింది. ఖురైషులకు మంచి అవకాశం లభించింది. కొండ వెనక నుండి తిరిగి దాని శిఖరంపై వచ్చి అక్కడి నుండి ముస్లిములపై దాడి చేశారు. అందుకే ఈ సారి ముష్రికులు గెలుపొందారు. ఈ యుద్ధంలో 70 మంది ముస్లిములు అమరవీరులయ్యారు. వారిలో ఒకరు: హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హు). ముష్రికుల వైపు నుండి 22 మంది చంపబడ్డారు.
ఖందక యుద్ధం
ఉహద్ యుద్ధం తర్వాత కొద్ది రోజులకు మదీన యూదులు మక్కా వెళ్ళి ఖురైషుల్ని కలుసుకొని మీరు గనక మదీనా పై దాడి చేసి, ముస్లిములతో యుద్ధం చేస్తే ఈ సారి మేము (లోపల నుండి) మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వాగ్దానం చేశారు. ఖురైషులు సంతోషంతో దీన్ని ఒప్పుకున్నారు. ఖురైషులు ఒప్పుకున్నాక ఇతర తెగవాళ్ళను కూడా పురికొలిపారు. వారు కూడా ఒప్పుకున్నారు. అరబ్బు దేశమంతటి నుండి యూదులు, ముష్రికులందరూ ఏకమై భారీ ఎత్తున మదీనా పై దండ యాత్రకు బయలుదేరారు. సుమారు పది వేల మంది సైనికులు మదీనా చుట్టు ప్రక్కన పోగు అయ్యారు.
శత్రువుల కదలిక గురించి ప్రవక్తకు వార్తలు అందుతున్నాయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహాబాలతో సలహా కోరారు. అప్పుడు ఈరాన్ దేశస్తుడైన సల్మాన్ ఫార్సీ (రదియల్లాహు అన్హు) ఖందకం త్రవ్వాలని సలహా ఇచ్చారు. మన రెండు వైపులా ఖర్జూరపు తోటలు, ఒక వైపు కొండ ఉండగా మరో వైపు ఏమీ అడ్డుగా లేనందు వల్ల అదే వైపు ఖందకం త్రవ్వడం ప్రారంభించారు. ముస్లిములందరూ ఇందులో పాల్గొని అతి తొందరగా దాన్ని పూర్తి చేశారు. ముష్రికులు ఖందకానికి ఆవల ఒక నెల వరకు ఉండిపోయారు. మదీనలో చొరబడటానికి ఏ సందు దొరకలేదు. ఆ కందకాన్ని దాటలేక పోయారు. అల్లాహ్ అవిశ్వాసులపై ఒకసారి తీవ్రమైన గాలి దుమారాన్ని పంపాడు. దాని వల్ల వారి గుడారాలు ఎగిరిపోయాయి. వారిలో అల్లకల్లోలం చెలరేగి భయం జనించింది. క్షణం పాటు ఆగకుండా పారిపోవడంలోనే క్షేమం ఉంది అనుకొని పరిగెత్తారు. ఈ విధంగా అల్లాహ్ ఒక్కడే దాడి చేయుటకు వచ్చిన సైన్యాలను పరాజయానికి గురి చేసి, ముస్లిములకు సహాయ పడ్డాడు.
ముష్రికుల సైన్యాలు దారి పట్టిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఈ సంవత్సరం తర్వాత ఖురైష్ మీపై దాడి చేయరు. కాని మీరు వారి మీద దాడి చేస్తారు“. వాస్తవంగా ప్రవక్త చెప్పినట్లు ఖురైషు వైపు నుండి ఇదే చివరి దాడి అయ్యింది. (ఆ తర్వాత వారు ఎప్పుడు ముస్లింపై దాడి చేయుటకు సాహసించలేదు).
కందకం త్రవ్వే సందర్భంలో ముస్లిములు ఘోరమైన ఆకలికి గురి అయ్యారు. ఆకలి భరించలేక కడుపుపై రాళ్ళు కట్టుకోవలసి వచ్చింది. అప్పుడు జాబిన్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కనీసం ప్రాణం కాపాడేంత పరిమాణంలోనైనా ప్రవక్తకు ఏదైనా తినిపించాలని కోరుకొని తన వద్ద ఉన్న ఓ చిన్న మేక పిల్లను కోశాడు. మాంసం తయారు చేసి భార్యకు ఇస్తూ దీని కూర వండి, అతితక్కవగా ఉన్న బార్లీ గింజల పిండితో రొట్టెలు చేసి పెట్టమని చెప్పాడు. వంట తయ్యారు అయ్యాక ప్రవక్త వద్దకు వెళ్ళి ‘మీకు మరో ఒక్కరికి లేదా ఇద్దరికి మాత్రమే సరిపడేంత భోజనం ఉంది’ అని తెలియజేశాడు. అప్పుడు ప్రవక్త “ఎక్కువగా ఉంది, మంచిగా ఉంది” అని కందకంలో పాల్గొన్న వారందరినీ పిలిచారు. మరియు స్వయంగా మాంసం ముక్కలు మరియు రొట్టెలు వడ్డించారు. అందరూ కడుపు నిండా తిన్నారు. అయినా ఆ భోజనం ఎవరి చేయి పెట్టినట్లుగా మిగిలింది. అప్పుడు వారు సుమారు వెయ్యి మంది ఉండిరి. ఇది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహిమల్లో ఒకటి.
హుదైబియా ఒప్పందం
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ముస్లిములు మదీనకు వలస వచ్చినప్పటి నుండి, వారిని ఎన్నటికీ తిరిగి మక్కా రానివ్వకూడదని, మస్జిదె హరాం దర్శనం చేయనివ్వద్దని దృఢంగా ముష్రికులు నిశ్చయించుకున్నారు. కాని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన సహచరులు మక్కాకు పయనం కావాలని హిజ్రి శకం ఆరవ ఏట ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిశ్చయించారు. వెళ్ళడానికి జిల్ ఖాద నెల నిర్ణయమయింది. అది గౌరవపదమైన నెల అని, అందరూ దాన్ని గౌరవిస్తారనీ, ఉమ్రా ఉద్దేశ్యంతో బయలుదేరారు. యుద్ధ ఆదేశం ఏ మాత్రం లేకుండినది. 1400 మంది సహాబాలు ఇహ్రామ్ దుస్తులు ధరించి, బలివ్వడానికి ఒంటెలు తమ వెంట తీసుకెళ్ళారు. వాస్తవానికి వీరు కాబా దర్శనానికి, దానిని గౌరవార్ధమే బయలుదేరారన్న నమ్మకం చూసేవారికి కలగలాని, ఖురైషువారు వీరిని మక్కాలో ప్రవేశం నుండి నిరోధించుటకు ఊహించనూ వద్దని ఆయుధాలు కూడా ధరించలేదు. కేవలం ప్రయాణికులు తమ ఖడ్గ ఒరలో ఉంచుకునే ఆయుధం తప్ప.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖస్వా పేరుగల తమ ఒంటపై పయనమయ్యారు. సహచరులు ఆయన వెనక ఉన్నారు. మదీనవాసుల మీఖాత్ జుల్ హులైఫా చేరుకున్నాక, అందరూ బిగ్గరగా తల్బియా చదువుతూ ఉమ్రా యొక్క ఇహ్రామ్ సంకల్పం చేశారు. వాస్తవానికి కాబా దర్శన హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంది. దాని దర్శనం మరియు ప్రదక్షిణం నుండి నిరోధించే హక్కు అప్పటి ఆచారం (దస్తూర్, ఖానూన్) ప్రకారం కూడా ఖురైషుకు ఏ మాత్రం లేదు. వారి శత్రువైనా సరే, అతడు కాబా గౌరవ ఉద్దేశ్యంతో వస్తే అతడ్ని ఆపవద్దు.
కాని ముస్లిములు మక్కా ఉద్దేశ్యంతో బయలుదేరారని విన్న వెంటనే ముష్రికులు యుద్ధానికి సిద్ధమయ్యారు. వారికి ఎంత కష్టతరమైన సరే ప్రవక్తను మక్కాలో రానివ్వకూడదని దృఢంగా నిర్ణయించుకున్నారు. వారి ఈ చేష్ట, వారు ముస్లిముల పట్ల శత్రుత్వంగా, దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నా రనడానికి మరియు వారికి లభించవలసిన హక్కుల నుండి వారిని దూరం చేస్తున్నారు అనడానికి గొప్ప నిదర్శనం.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బిడారం నడుస్తూ నడుస్తూ మక్కాకు సమీపములో చేరుకుంది. కాని ఖురైషువారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన సహచరుల్ని మక్కాలో ప్రవేశించకుండా, కాబా ప్రదక్షిణం చేయకుండా నిరోధిస్తునే ఉన్నారు.
ప్రవక్తతో సంధి చేసుకొని ఏదో ఓ కొలికికి రావాలని రాయబార వ్యవహారాలు మొదలయ్యాయి. ఇరు పక్షాల్లో (అంటే ముస్లిముల మరియు మక్కాలోని ముష్రికుల మధ్య) అనేక రాయబార బృందాలు వస్తూ పోయాయి. ఈ మధ్యలో ఖురైష్ యువకుల్లో నలబై మంది హఠాత్తుగా ముస్లిములపై విరుచుకుపడి వారిలో కొందరిని చంపుదాము అని అనుకున్నారు. కాని ముస్లిములు వారిని పట్టుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం వద్దకు తీసుకువచ్చారు. అయితే ప్రవక్త వారితో ఏ ప్రతికార చర్యకు పాల్పడకుండా వారిని వారి దారిన వదిలేసి వారిని మన్నించారు.
ఆ తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు)ని రాయబారిగా ఖురైష్ నాయకుల వద్దకు పంపి, మేము యుద్దానికి కాదు వచ్చింది. కేవలం అల్లాహ్ గృహ దర్శనం, దాని గౌరవార్థం వచ్చాము అని తెలియజేశారు. ఉస్మాన్ మరియు ఖురైషుల మధ్య సంధి కుదరలేదు. అంతే గాకుండా వారు ఉస్మాన్ ని పోనివ్వకుండా తమ వద్దే నిర్బంధించారు. అందువల్ల ఉస్మాన్ హత్యకు గురయ్యాడు అన్న పుకారు పుట్టింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఈ విషయం తెలిసిన వెంటనే “ఉస్మాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకోకుండా ఇక్కడి నుండి కదిలేది లేదు” అని స్పష్టం చేసి, దీనికై ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అందరితో శపథం తీసుకున్నారు. అప్పుడు తమ ఒక చేతిని ఉస్మాన్ చేతిగా పరిగణించి తమ రెండవ చేయిని దానిపై కొట్టి శపథం చేశారు. ఈ శపథం ” బైఅతుర్ రిజ్వాన్” అన్న పేరు పొందింది. ఓ చెట్టు క్రింద జరిగింది. ప్రవక్తగారు సహచరులతో చేసిన శపథం ఇలా ఉండింది: ఉస్మాన్ కు వాస్తవంగా ఏదైనా కీడు జరిగింది అని తెలిస్తే గనక మీలో ఏ ఒక్కరూ పారిపోకుండా ముష్రికులతో పోరాడనిదే ఈ స్థలాన్ని వదలేది లేదు. తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తెలిసిన వార్త ఏమిటంటే ఉస్మాన్ క్షేమంగానే ఉన్నారు. హత్య చేయబడలేదు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిములతో యుద్ధానికి సిద్ధమన్నట్లు శపథం చేశారని తెలిసిన వెంటనే సుహైల్ బిన్ అమ్ర్ ను దౌత్యవేత్తగా పంపారు. అతను ప్రవక్తతో కూర్చుండి; ముస్లిములు ఈ సారి తిరిగి వెళ్ళిపోవాలని మరియు వచ్చే సంవత్సరం ఎప్పుడైనా రావచ్చనే విషయంపై సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడు. సంధి కుదిరింది. ప్రవక్త కూడా సంధి ఒప్పంద నిబంధనలను అంగీకరించారు. ఈ నిబంధనలు బాహ్యంగా ముష్రికుల పక్షంలో వారికి మాత్రమే అనుకూలమైనవిగా ఉండెను. అందుకే ముస్లిములు మండిపడ్డారు. వారి దృష్టిలో అవి అన్యాయం, దౌర్జన్యంతో కూడి ఉన్న నిబంధనలని. ముష్రికులకు అనుకూలమైనవిగా ఉన్నాయని అనిపించింది. కాని ప్రవక్త సంధి కుదరాలనే కోరేవారు. ఎందకుంటే ఇస్లాం ప్రశాంత వాతవరణంలో వ్యాపిస్తూ ఉంటే అనేక మంది ఇస్లాంలో ప్రవేశించవచ్చు అన్న విషయం ప్రవక్తకు తెలుసు. వాస్తవానికి జరిగింది కూడా ఇదే. ఈ యుద్ధవిరమణ కాలంలో ఇస్లాం విస్తృతంగా వ్యాపించింది.
అంతే కాదు, వాస్తవానికి ముస్లిముల మరియు ఖురైష్ ల మధ్య జరిగిన ఈ యుద్ధవిరమణ సంధి ఇస్లాం మరియు ముస్లిముల పాలిట గొప్ప సహాయంగా నిలిచింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవజ్యోతితో చూస్తూ ఉన్నారని కుడా ఈ సంఘటన గొప్ప నిదర్శనంగా నిలిచింది. ఎలా అనగ నిబంధనలన్నిటీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అంగీకరిస్తూ పోయారు. అదే సందర్భంలో కొందరి సహచరులకు అవి బాహ్యంగా ముష్రికులకు అనుకూలంగా కనబడినవి.
మక్కా విజయం
హిజ్రి శకం ఎనిమిదవ ఏట (ముష్రిక్కులు తాము చేసిన వాగ్దానానికి వ్యెతిరేకం వహించినందుకు) మక్కాపై దాడి చేసి, జయించాలని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిర్ణయించారు. రమజాన్ 10వ తారీకున 10 వేల వీరులతో బయలుదేరారు. ఏలాంటి పోరాటం, రక్తపాతం లేకుండా మక్కాలో ప్రవేశించారు. ఈ ప్రవేశం చారిత్రకమైనది. చెప్పుకోదగ్గది. ఖురైషులు తమ ఇష్టానుసారం లొంగిపోయారు. అల్లాహ్ ముస్లిములకు సహాయపడ్డాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మస్జిదె హరాం వెళ్ళి కాబా యొక్క తవాఫ్ చేసి, కాబా లోపల, వెలుపల, పైన ఉన్న విగ్రహాలన్నిటిని తొలగించి దాని లోపల రెండు రకాతుల నమాజు చేశారు. తర్వాత కాబా గడపపై వచ్చి నిలుచున్నారు. ఖురైషులు గడప ముందు నిలబడి, ప్రవక్త వారి గురించి ఏ తీర్పు ఇస్తారు అని వేచిస్తున్నారు. ప్రవక్త గంభీర స్వరంతో “ఓ ఖురైషులారా! నేను మీ పట్ల ఎలా ప్రవర్తిస్తానని భావిస్తున్నారు” అని అడిగారు. వారందరూ ఏక శబ్దమై “మేలు చేస్తారనే భావిస్తున్నాము. ఎందుకంటే మీరు మంచి సోదరులు, మంచి సోదరుని సుపుత్రులు” అని సమాధానమిచ్చారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “పోండి, మీరందరికి స్వేచ్ఛ ప్రసాదించబడుతుంది” అని ప్రకటించారు. ఈ విధంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన్ను, తన సహచరుల్ని బాధించి, నానా రకాలుగా హింసించి, స్వదేశం నుండి తరిమిన శత్రువుల్ని ఈ రోజు క్షమిస్తూ, మన్నిస్తూ ఒక గొప్ప ఉదాహరణ / ఆదర్శం నిలిపారు.
బృందాల రాక, రాజులకు ఇస్లాం సందేశం
మక్కా విజయం తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రస్తావన మరియు ఇస్లాం ధర్మ ప్రచారం నలువైపులా వ్యాపించింది. ఇక సుదూర ప్రాంతాల నుండి బృందాలు వచ్చి ఇస్లాం స్వీకరించ సాగాయి.
అలాగే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చుట్టుప్రక్క దేశాల రాజులకు ఇస్లాం పిలుపునిస్తూ, ఉత్తరాలు వ్రాయించి పంపారు. వారిలో కొందరు ఇస్లాం స్వీకరించారు. మరి కొందరు ఇస్లాం స్వీకరించలేదు కాని ఉత్తమరీతి లో ఉత్తరాన్ని తీసుకొని మంచి విధంగా సమాధానమిచ్చారు. కాని ఈరాన్ రాజైన ఖుస్రో (Khosrau) ప్రవక్త పత్రాన్ని చూసి కోపానికి గురై దాన్ని చింపేశాడు. ప్రవక్తకు ఈ విషయం తెలిసింది. పిమ్మట ఆయన ఇలా శపించారు: “అల్లాహ్! అతని రాజ్యాన్ని కూడా నీవు చించేసెయి“. ఈ శాపనానికి ఏమంత ఎక్కువ సమయం గడువక ముందే అతని కొడుకు స్వయంగా తండ్రిని చంపేసి, రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు.
మిస్ర్ (Egypt) రాజు ముఖోఖిస్ ఇస్లాం స్వీకరించలేదు. కాని ప్రవక్త రాయబారితో ఉత్తమ రీతిలో ప్రవర్తించి, అతనితో ప్రవక్త కొరకు కానుకలు పంపాడు. అలాగే రోమన్ రాజు కూడా ప్రవక్త రాయబారికి మంచి ఆతిథ్యం ఇచ్చి మంచి విధంగా ప్రవర్తించాడు.
బహైన్ రాజు ముంజిర్ బిన్ సావీ ప్రవక్త పత్రాన్ని ప్రజలందరికీ వినిపించాడు. వారిలో కొందరు విశ్వసించారు మరి కొందరు తిరస్కరించారు.
హిజ్రి శకం 10వ ఏట ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్ చేశారు. ఆయన చేసిన ఏకైక హజ్ ఇదే. ఆయనతో పాటు లక్షకు పైగా సహచరులు హజ్ చేశారు. ఆయన హజ్ పూర్తి చేసుకొని మదీన తిరిగి వచ్చారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం
హజ్ నుండి వచ్చాక సుమారు రెండున్నర మాసాలకు ప్రవక్తకు అస్వస్థత అలుముకొన్నది. దిన దినానికి అది పెరగ సాగింది. నమాజు కూడ చేయించడం కష్టమయిపోయింది. అప్పుడు అబూబక్ర్ ను నమాజు చేయించాలని ఆదేశించారు.
హిజ్రి పదకొండవ శకం, నెల రబీఉల్ అవ్వల్, 12వ తారీకు సోమవారం రోజున ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమోన్నతుడైన అల్లాహ్ వద్దకు చేరుకున్నారు. మొత్తం 63 సంవత్సరాలు జీవించారు. ప్రవక్త మరణ వార్త సహచరులకు అందగా వారికి సృహ తప్పినట్లయింది. నమ్మశక్యం కాక పోయింది. అప్పుడు అబూ బక్ర సిద్దీఖ్ రజియల్లాహు అను నిలబడి ప్రసం గించారు: వారిని శాంతపరుస్తూ, ప్రశాంత స్థితి నెలకొల్పుతూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అందరి లాంటి ఒక మానవుడే, అందిరికి వచ్చి నటువంటి చావు ఆయనకు వచ్చింది అని స్పష్టపరిచారు. అప్పుడు సహచరులు తేరుకొని, శాంత పడ్డారు. ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)కు స్నానం చేయించి, కఫన్ దుస్తులు ధరియింపజేసి, ఆయిషా (రజియల్లాహు అన్హా) గదిలో ఖననం చేశారు.
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవక్త పదవికి ముందు 40 సం. ఆ తర్వాత 13 సం. మక్కాలో, 10 సం. మదీనలో గడిపారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.