
[43:35 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం & వీడియో పాఠాలు]
https://teluguislam.net/2019/08/18/muharramat/
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
[43:35 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం & వీడియో పాఠాలు]
https://teluguislam.net/2019/08/18/muharramat/
[6:55 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ధర్మపరమైన నిషేధాలు (పరిచయం)
అల్ హందులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅదహ్, వఅష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహ్, వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహ్. అమ్మా బఅద్!
మీరు ఈ పుస్తకాన్ని సంపూర్ణంగా చదవనిదే తీసి పక్కకు పెట్టకండి. ఇది మీ కొరకే, ఇతరులకు కాదు. నేను దీనిని ప్రేమ సిరా (Ink)తో వ్రాసాను. హృదయ ఏకాగ్రత, స్వచ్ఛతతో లిఖించాను.
దానిని ప్రేమ పోస్ట్ మరియు ఆకాంక్ష రాయబారి ద్వారా పంపాను. నీ చక్షువులకు ముందు నీ హృదయం; నీ కళ్ళకు ముందు నీ మనస్సులో అది నాటుకుపోవాలని.
ప్రియ సోదరా… ప్రియ సోదరి…
ఇస్లాం ధర్మం యొక్క పునాది బలమైన విశ్వాసముపై ఉన్నది. విశ్వాస ఆవశ్యకతా నివేదనలో ఆదేశాలను పాటించడం మరియు నివారణల నుండి దూరంగా ఉండడం తప్పనిసరి. ఇస్లాం ధర్మం యొక్క విసరురౌతు ఈ రెండు తిరుగలిరాయిల మీదే తిరుగుతుంది. అల్లాహ్ ఆదేశం చదవండి:
[وَمَا آَتَاكُمُ الرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَاكُمْ عَنْهُ فَانْتَهُوا] {الحشر:7}
దైవప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి, ఆయన మిమ్మల్ని నిషేధించిన దాని జోలికిపోకండి[. (సూరె హష్ర్ 59: 7).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః
(فَإِذَا نَهَيْتُكُمْ عَنْ شَيْءٍ فَاجْتَنِبُوهُ وَإِذَا أَمَرْتُكُمْ بِأَمْرٍ فَأْتُوا مِنْهُ مَا اسْتَطَعْتُمْ)
“నేను దేని నుండి మిమ్మల్ని వారిస్తానో దాని జోలికిపోకుండా ఉండండి, దేని గురించి నేను మిమ్మల్ని ఆదేశిస్తానో సాధ్యమైనంత వరకు దానిని నెరవేర్చండి”. (బుఖారి, అల్ ఇఖ్తిదాఉ బిసునని రసూ- లిల్లాహ్, 7288. ముస్లిం, తౌఖీరిహీ వ తర్కి ఇక్సారి సుఆలిహీ… 1337).
అల్లాహ్ ఏ దాని ఆదేశం ఇచ్చి, అది తప్పనిసరిగా చేయాలని విధించాడో మరియు దానిని నెరవేర్చాలని ప్రోత్సహించాడో విశ్వాసుడు దానిని నెరవేరుస్తూ ప్రేమ, ఆశతో మరియు ఆయన సన్నిధానం పొందుటకు తన పరమపవిత్రుడైన ప్రభువును ఆరాధిస్తాడు. అలాగే వినయనమ్రతతో, భయభక్తులతో మరియు ఆజ్ఞాపాలన భావంతో అల్లాహ్ వారించిన మరియు హెచ్చరించిన వాటికి దూరంగా ఉండుట కూడా అతనిపై విధిగా ఉంది.
ఈ విధంగా చూస్తే ఇస్లాం ధర్మం “చేయండి”, “చేయకండి” అనే రెండిటి మధ్యలో ఉంది. దేనిని ఎంపిక చేసుకోవాలనే స్వేచ్ఛ మనిషిలో ఉంది. దారి స్పష్టంగా తన ముందు ఉంది. సత్ఫ- లితమో, దుష్ఫలితమో ప్రళయదినాన దొరకనుంది. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:
[إِنَّا هَدَيْنَاهُ السَّبِيلَ إِمَّا شَاكِرًا وَإِمَّا كَفُورًا] {الإنسان:3}
మేము అతనికి మార్గం చూపాము. ఇక అతను కృతజ్ఞుడు కావచ్చు లేదా కృతఘ్నుడూ కావచ్చు[. (సూరె దహ్ర్ 76: 3).
అయితే మనము దాసులం. కనుక దాసుడు తన యజమాని ఆధీనంలో ఉంటాడు. యజమాని ఆదేశిస్తాడు, వారిస్తాడు. దాసుడు సంతోషంగా శిరసావహిస్తాడు మరియు శ్రద్ధభక్తులతో విధేయత చూపుతాడు. మనం ఏకైక అల్లాహ్ కు దాసులమయి ఉండడంలో ఉన్న కీర్తి మనకు చాలు.
ప్రియ పాఠకులారా, లేదా శ్రోతల్లారా! నేను నా కొరకు మరియు మీ కొరకు విశ్వాసానికి మరియు దైవఏకత్వానికి సంబంధించిన కొన్ని వారింపులను సమకూర్చాను. వాటి ప్రస్తావన దివ్య ఖుర్- ఆనులో లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో ఉంది. మన విశ్వాసం అన్ని రకాల లోటుపాట్లకు, కొరత తగ్గింపు- లకు దూరంగా ఉండాలని మరియు అజ్ఞానంగా వాటిలో చిక్కుకోకుండా, వాటిని తెలుసుకొనుటకు మరియు వాటిలో చిక్కుకు- పోయిన ముస్లింలను హెచ్చరించి, హెచ్చరిక బాధ్యత పూర్తి చేయుటకు లేదా అల్లాహ్ కాపాడేవారిని దాని కీడు నుండి దూరముంచుటకు (ఇవి నేను సమకూర్చాను).
ఆయన మంచి నామముల, ఉత్తమ సద్గుణాల ఆధారంతో, ఆయన కారుణ్యాన్ని ఆశిస్తూ ఈ పనిలో శుభం కలుగజేయాలని, ఏలాంటి కొరతా, దోషం లేకుండా చేయాలని, కేవలం ఆయన సంతృప్తి కొరకు, ఆయన దర్శన భాగ్యం కలిగే కొరకు చేయాలని అల్లాహ్ ను వేడుకుంటున్నాను. మరియు దీనిని సమకూర్చిన, సరిచేసిన, ప్రచురించిన మరియు పంపిణీ చేసిన వారందరికీ అల్లాహ్ సత్ఫలితం ప్రసాదించుగాక! ఆమీన్. వల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు
ఇస్లామీయ నిషిద్ధతలు (ముహర్రమాత్) – పార్ట్ 03 (23 జులై 2020)
[40:44 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [40:44 నిముషాలు]
ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]
https://teluguislam.net/2019/08/18/muharramat/
అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేయుట (జంతువును బలి ఇచ్చుట) షిర్క్.
فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ
నీ ప్రభువు కొరకే నమజు చేయు మరియు ఖుర్బానీ ఇవ్వు. (కౌసర్ 108: 2).
అంటే అల్లాహ్ కొరకు మరియు అల్లాహ్ పేరుతో మాత్రమే జిబహ్ చేయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఆదేశించారు:
لَعَنَ اللهُ مَنْ ذَبَحَ لِغَيْرِ الله
“అల్లాహ్ కు కాక ఇతరుల కోసం జిబహ్ చేయువానిపై అల్లాహ్ శపించాడు”. (ముస్లిం 1978).
జిబహ్ లో రెండు నిషేధాలు ఏకమవుతాయి. (1) అల్లాహ్ కు తప్ప ఇతరుల కోసం జిబహ్. (2) అల్లాహ్ పేరుతో కాకుండా ఇతరుల పేరుతో జిబహ్. ఈ రెండు కారణాల వల్ల ఆ జంతువు మాంసం తినడం యోగ్యం కాదు. ఈ రోజుల్లో జిన్నుల పేరు మీద జిబహ్ చేసే షిర్క్ ప్రభలి ఉంది. అదేమనగా; ఇల్లు కొనుగోళు చేసినా, నిర్మించినా అందులో ఎక్కడైనా లేదా ప్రత్యేకించి దాని గడప మీద, అలాగే బావి త్రవ్వినా, అక్కడే ఓ జంతువు జిబహ్ చేస్తారు. అది షైతాన్ (భూతాల)కు భయపడి, వాని నష్టం నుండి దూరముండుటకు వాని పేరు మీద జిబహ్ చేస్తారు. (వాస్త వేమిటంటే అల్లాహ్ ను కాక ఇతరులతో భయపడరాదు. ఇలాంటి జిబహ్ చేయరాదు). (తైసీరుల్ అజీజుల్ హమీద్ 158. దారుల్ ఇఫ్తా ముద్రణ).
అల్లాహ్ హరాం చేసినదానిని హలాల్ చేయుట, లేదా అల్లాహ్ హలాల్ చేసినదానిని హరాం చేయుట, లేదా ఇలాంటి హక్కు అల్లాహ్ తప్ప ఇతరులకు ఉంది అని నమ్ముట, లేదా సమస్యల తీర్పు కొరకు ఇస్లాం ధర్మం కాకుండా ఇతర న్యాయస్థానాలకు వెళ్ళుట, మరియు ఇస్లామీయ చట్టాలతో కాకుండా ఇతర చట్టాలతో తీర్పు కోరుట, లేదా అది యోగ్యమేనని సంతోషంగా నమ్ముట ఎంతటి భయంకరమైన అవిశ్వాసంలోకి వస్తుందో ఈ ఆయతు ద్వారా తెలుసుకోండి:
اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِنْ دُونِ اللهِ
వారు (యూదులుక్రైస్తవులు) అల్లాహ్ ను కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. (తౌబా 9: 31).
ఈ ఆయతు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పఠిస్తుండగా, అదీ బిన్ హాతిం (రజియల్లాహు అన్హు) విని, ప్రవక్తా! యూదులు, క్రైస్తవులు తమ పండితులను, సన్యాసులను ఆరాధించేవారు కారు కదా? అని చెప్పగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అవును, కాని అల్లాహ్ హరాం చేసిన దానిని వారి పండితులు, సన్యాసులు హలాల్ చేస్తే వారు దానిని హలాల్ గానే భావించే వారు. ఇంకా అల్లాహ్ హలాల్ చేసినదానిని వారి పండితులు, సన్యాసులు హరాం చేస్తే వారు దానిని హరాంగానే భావించేవారు. కనుక ఇది వారిని ఆరాధించినట్లు” అని సమాధానం చెప్పారు. (బైహఖీ ఫీ సుననిల్ కుబ్రా 10/116, తిర్మిజి 3095, ఇది హసన్ అని షేఖ్ అల్బానీ గాయతుల్ మరాం 19లో తెలిపారు).
నిషిద్ధతలను నిషిద్ధంగా నమ్మనివారు యూదులు, క్రైస్తవులు మరియు బహుదైవారాధకులు అని అల్లాహ్ ఈ క్రింది ఆయతులలో స్పష్టం చేశాడు:
وَلَا يُحَرِّمُونَ مَا حَرَّمَ اللهُ وَرَسُولُهُ وَلَا يَدِينُونَ دِينَ الحَقِّ
అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషిద్ధంగా నిర్ణయించిన దానిని వారు నిషిద్ధంగా భావించరు. ఇంకా సత్యధర్మాన్ని వారు తమ ధర్మంగా చేసుకోరు. (తౌబా 9: 29).
قُلْ أَرَأَيْتُمْ مَا أَنْزَلَ اللهُ لَكُمْ مِنْ رِزْقٍ فَجَعَلْتُمْ مِنْهُ حَرَامًا وَحَلَالًا قُلْ آَللهُ أَذِنَ لَكُمْ أَمْ عَلَى اللهِ تَفْتَرُونَ
ఇలా అను: మీరు ఆలోచించరా! అల్లాహ్ మీ కొరకు అవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీరు స్వయంగానే కొన్నింటిని హరాం చేసు కున్నారు. మరికొన్నింటిని హలాల్ చేసుకున్నారు. ఇలా అడుగు: ఇలా చేయడానికి అల్లాహ్ మీకు అనుమతించాడా? లేదా మీ బూటక కల్పనలను అల్లాహ్ కు అంటగట్టుతున్నారా?. (యూనుస్ 10: 59).
చేతబడి (చేయుట, చేయించుట, నేర్పుట, నేర్చుకొనుట) అవిశ్వాసంలో లెక్కించ బడుతుంది. అది వినాశనానికి గురి చేసే ఏడు మహాపాపాల్లో ఒకటి. అది నష్టమే కలుగజేస్తుంది తప్ప ఏమీ లాభం కలగజేయదు. దానిని నేర్చుకొనుట గురించి అల్లాహ్ ఇలా తెలిపాడు:
وَيَتَعَلَّمُونَ مَا يَضُرُّهُمْ وَلَا يَنْفَعُهُم
వారు నేర్చుకునేది వారికి నష్టం కలిగించేదే కాని లాభం కలిగించేది ఎంత మాత్రం కాదు. (బఖర 2: 102). మరో చోట ఇలా తెలిపాడు:
وَلَا يُفْلِحُ السَّاحِرُ حَيْثُ أَتَ
మాంత్రికుడు ఎన్నడూ సఫలుడు కానేరడు. వాడు ఎటు నుంచి, ఎలా వచ్చినా సరే. (తాహా 19: 69).
చేతబడి చేయువాడు అవిశ్వాసి. చదవండి అల్లాహ్ ఆదేశం:
وَمَا كَفَرَ سُلَيْمَانُ وَلَكِنَّ الشَّيَاطِينَ كَفَرُوا يُعَلِّمُونَ النَّاسَ السِّحْرَ وَمَا أُنْزِلَ عَلَى المَلَكَيْنِ بِبَابِلَ هَارُوتَ وَمَارُوتَ وَمَا يُعَلِّمَانِ مِنْ أَحَدٍ حَتَّى يَقُولَا إِنَّمَا نَحْنُ فِتْنَةٌ فَلَا تَكْفُرْ
సులైమాను ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్ట లేదు. అసలు అవిశ్వాసానికి పాల్పడినది ప్రజలకు చేతబడిని బోధించే షైతానులే. వారు హారూత్, మారూత్ దేవదూతల ద్వారా (ఇరాఖ్ లోని) బాబీలోనియాలో అవతరింప జేసినదాని వెంట బడ్డారు. ఎవడికైనా ఆ విద్యను నేర్పినప్పుడు ఆ దేవ దూతలు స్పష్టంగా ఇలా హెచ్చరిక చేసేవారుః జాగ్రత్త! మేము (మానవు లకు) కేవలం ఒక పరీక్ష మాత్రమే. కనుక మీరు (జాలవిద్యను నేర్చుకొని) అవిశ్వాసులు కాకండి. (బఖర 2: 102).
మాంత్రికుని గురించిన ఆదేశమేమిటంటే అతడ్ని హతమార్చాలి. అతని సంపద కూడా నిషిద్ధమైన చెడు సంపద. అజ్ఞానులు, దుర్మార్గులు, బలహీన విశ్వాసులు మాంత్రికుల వద్దకు వెళ్ళి , ఇతురలపై అన్యాయం, దౌర్జన్యం చేయడానికి, లేదా ప్రతీకారం తీర్చుకోడానికి చేతబడి చేయిస్తారు. మరికొందరు తనపై చేయబడిన చేతబడిని దూరం చేయించు- కోడానికి మాంత్రికుని వద్దకు వెళ్ళి ఓ నిషిద్ధ కార్యానికి పాల్పడతారు. ఇలాంటప్పుడు మాంత్రికుల వద్దకు వెళ్ళకుండా అల్లాహ్ వైపునకు మరలి, ‘ముఅవ్విజాత్’ వంటి అల్లాహ్ పవిత్రవచనాల ఆధారంగా అల్లాహ్ తో స్వస్థత కోరాలి. (ముఅవ్విజాత్ అంటే సూర ఫలఖ్, సూర నాస్ మరియు దీనికి సంబంధించిన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నేర్పిన దుఆలు).
ఇస్లామీయ నిషిద్ధతలు (ముహర్రమాత్) – పార్ట్ 02 (16 జులై 2020)
[1:04:21 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [1:04:21 నిముషాలు]
ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]
https://teluguislam.net/2019/08/18/muharramat/
ఇది నిషిద్ధతాల్లో ఘోరాతిఘోరమైనది. దీనికి ఆధారం అబూ బక్ర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ఈ హదీసుః
(أَلَا أُنَبِّئُكُمْ بِأَكْبَرِ الْكَبَائِرِ) ثَلَاثًا ، قَالُوا: بَلَى يَا رَسُولَ الله قَالَ: الْإِشْرَاكُ بِالله).
“ఘోరపాపాల్లోనే మరీ ఘోరమైన పాపం ఏదో తెలుపనా?” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మూడు సార్లు ప్రశ్నించారు. దానికి వారన్నారు: తప్పక తెలుపండి ప్రవక్త అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “అల్లాహ్ కు భాగస్వాములను కల్పిం చుట”. (బుఖారి 2654, ముస్లిం 87).
అల్లాహ్ షిర్క్ తప్ప ఏ పాపాన్నైనా క్షమించగలడు. దానికి ప్రత్యేకమైన పశ్చాత్తాపం తో క్షమాభిక్ష కోరడం (తౌబా చేయడం) తప్పనిసరి. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః
[إِنَّ اللهَ لَا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ]
“నిశ్చయంగా అల్లాహ్ తనకు భాగస్వామిని కల్పించటాన్ని ఏ మాత్రం క్షమించడు. అది తప్ప దేనినయినా తాను కోరినవారిని క్షమిస్తాడు“. (నిసా 4: 48).
షిర్క్ లో ఒక రకం పెద్ద/ఘోరమైన షిర్క్ (షిర్కె అక్బర్). ఇది ఇస్లాం నుండి బహిష్కరణకు కారణమవుతుంది. తౌబా చేయకుండా అదే స్థితిలో మరణించేవాడు నరకంలో ప్రవేశించి అందులో శాశ్వతంగా ఉంటాడు. ముస్లిం సమాజంలో ప్రబలి ఉన్న ఈ రకమైన షిర్క్ యొక్క కొన్ని రూపాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
సమాధులను పూజించడం, మరణించి సమాధుల్లో ఉన్న వలీలు (పుణ్యపురుషులు) అవసరాలను తీరుస్తారని, కష్టాలను తొలిగిస్తారని నమ్మడం మరియు అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నదాని సహాయం వారితో కోరడం, వారితో మొరపెట్టుకోవడం లాంటివి పెద్ద షిర్క్ లో లెక్కించ బడతాయి. అల్లాహ్ ఆదేశం చదవండిః
[وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ] {الإسراء:23}
“మీ ప్రభువు తనను తప్ప ఇతరులను మీరు ఆరాధింపకూడదని ఆదేశించాడు“. (బనీ ఇస్రాఈల్ 17: 23).
అదే విధంగా చనిపోయిన ప్రవక్తలతో, పుణ్యాత్ములతో ఇంకెవరితోనైనా వారి సిఫారసు పొందుటకు, తమ కష్టాలు దూరమగుటకు వారితో దుఆ చేయడం కూడా షిర్క్. చదవండి అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:
[أَمَّنْ يُجِيبُ المُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الأَرْضِ أَإلَهٌ مَعَ اللهِ] {النمل:62}
“బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరలను ఆలకించి అతని బాధను తొలగించేవాడు ఎవడు? భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగా చేసినవాడు ఎవడు? అల్లాహ్ తో పాటు (ఈ పనులు చేసే) మరొక దేవుడు కూడ ఎవడైనా ఉన్నాడా?“. (నమ్ల్ 27: 62).
కొందరు కూర్చున్నా, నిలబడినా, జారిపడినా తమ పీర్, ముర్షిదుల నామములను స్మరించు టయే తమ అలవాటుగా చేసుకుంటారు. ఎప్పుడు ఏదైనా క్లిష్టస్థితిలో, కష్టంలో, ఆపదలో చిక్కుకున్నప్పుడు ఒకడు యా ముహమ్మద్ అని, మరొకడు యా అలీ అని, ఇంకొకడు యా హుసైన్ అని, మరి కొందరు యా బదవీ, యా జీలానీ, యా షాజులీ, యా రిఫాఈ, యా ఈద్ రూస్, యా సయ్యద జైనబ్, యా ఇబ్ను ఉల్వాన్ అని, యా గౌస్ అల్ మదద్ అని, యా ముఈనుద్దీన్ చిష్తీ అని, యా గరీబున్నవాజ్ అని, నానా రకాలుగా పలుకుతారు. కాని అల్లాహ్ ఆదేశం ఏమిటని గమనించరు:
[إِنَّ الَّذِينَ تَدْعُونَ مِنْ دُونِ اللهِ عِبَادٌ أَمْثَالُكُمْ فَادْعُوهُمْ فَلْيَسْتَجِيبُوا لَكُمْ إِنْ كُنْتُمْ صَادِقِينَ] {الأعراف:194}
“అల్లాహ్ ను వదలి మీరు వేడుకుంటున్న వారు మీ మాదిరిగానే కేవలం దాసులు. మీరు వారిని ప్రార్థించి చూడండి. మీకు వారి పట్ల ఉన్న భావాలు నిజమే అయితే మీ ప్రార్థనలకు వారు సమాధానం ఇవ్వాలి“. (ఆరాఫ్ 7: 194).
కొందరు సమాధి పూజారులు సమాధుల ప్రదక్షిణం చేస్తారు. వాటి మూలమూలలను చుంబిస్తారు. చేతులు వాటికి తాకించి తమ శరీరంపై పూసుకుంటారు. వాటి గడపను చుంబిస్తారు. దాని మట్టిని తీసుకొని తమ ముఖాలకు రుద్దుకుంటారు. వాటిని చూసినప్పుడు సాష్టాంగ పడతారు (సజ్దా చేస్తారు). తమ అవసరాలను కోరతూ రోగాల నుండి స్వస్థత పొందు టకు, సంతానం కావాలని, అవసరం తీరాలని వాటి యదుట భయభీతితో, వినయవినమ్రతలతో నిలబడతారు. ఒక్కోసారి సమాధిలో ఉన్నవారిని ఉద్దేశించి ఇలా పిలుస్తారు కూడాః యా సయ్యిదీ! ఓ మేరే బాబా! నేను చాలా దూరం నుండి మీ సమక్షంలో హాజరయ్యాను, నాకు ఏమీ ప్రసాదించక వెనక్కు త్రిప్పి పంపుతూ అవమాన పరచకు. కాని అల్లాహ్ ఆదేశం ఏముందో గమనించారా?
[وَمَنْ أَضَلُّ مِمَّنْ يَدْعُو مِنْ دُونِ اللهِ مَنْ لَا يَسْتَجِيبُ لَهُ إِلَى يَوْمِ القِيَامَةِ وَهُمْ عَنْ دُعَائِهِمْ غَافِلُونَ] {الأحقاف:5}
“అల్లాహ్ ను వదలి ప్రళయం వరకు తమ ప్రార్థనలను విని సమాధాన మివ్వలేనటువంటి వారిని ప్రార్థించే వారికంటే, ఎక్కువ మార్గభ్రష్టులెవరు? మరియు వారు వీరి (ప్రార్థించేవారి) ప్రార్థనలను ఎరుగకుండా ఉన్నారు“. (అహ్ఖాఫ్ 46: 5).
ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు:
(مَنْ مَاتَ وَهْوَ يَدْعُو مِنْ دُونِ الله نِدًّا دَخَلَ النَّارَ)
“ఎవరు అల్లాహ్ ను కాదని ఇతరులను ప్రార్థిస్తూ/దుఆ చేస్తూ చనిపోతాడో అతను నరకంలో ప్రవేశిస్తాడు”. (బుఖారి 4497).
కొందరు సమాధుల వద్ద తమ తల గొరిగించుకుంటారు. ‘సమాధుల హజ్ చేసే విధానం’ అన్న పేరుగల పుస్తకాలు కొందరి వద్ద లభిస్తాయి. విశ్వవ్యవస్థ నిర్వహణ శక్తి మరియు లాభనష్టాలు చేకూర్చే శక్తి వలీలకు ఉన్నదని కొందరు నమ్ముతారు. కాని అల్లాహ్ యొక్క ఈ ఆదేశం పట్ల వారు ఎలా అంధులైపోయారో గమనించండి:
وَإِنْ يَمْسَسْكَ اللهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ وَإِنْ يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ
“ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవరూ లేరు. ఇంకా ఆయన గనక నీ విషయంలో మేలు చేయాలని సంకల్పిస్తే ఆయన అనుగ్రాహన్ని మల్లించే వాడు కూడా ఎవడూ లేడు“. (యూనుస్ 10: 107).
అల్లాహ్ ను కాకుండా ఇతరుల పేరున మొక్కుకొనుట షిర్క్ అవుతుంది. ఈ రోజుల్లో ప్రజలు సమాధిలో ఉన్నవారి పేరున దీపాలు, కొవ్వత్తులు, కోళ్ళు, ఆస్తులు మొదలగునవి ఇస్తానని మొక్కుకుంటారు. అయితే ఇది ఘోరమైన షిర్క్ అన్న విషయం మరచిపోతారు.
[61 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [61 నిముషాలు]
ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]
https://teluguislam.net/2019/08/18/muharramat/
You must be logged in to post a comment.