ఇబ్రాహీం అలైహిస్సలాం జీవిత సందేశం [సూరా అస్ సాఫ్ఫాత్ , అయతులు 99 – 105] [వీడియో]

బిస్మిల్లాహ్
ఇబ్రాహీం అలైహిస్సలాం జీవిత సందేశం – హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజాహుల్లాహ్) (19th July 2020) – [సూరా అస్ సాఫ్ఫాత్ , అయతులు 99 నుండి 105 వరకు]

37. సూరా అస్ సాఫ్ఫాత్ , అయతులు 99 నుండి 105 వరకు

7:99 وَقَالَ إِنِّي ذَاهِبٌ إِلَىٰ رَبِّي سَيَهْدِينِ
అతను (ఇబ్రాహీమ్‌) ఇలా అన్నాడు : “నేను నా ప్రభువు వైపుకే పోతాను. ఆయన తప్పకుండా నాకు మార్గం చూపుతాడు.

37:100 رَبِّ هَبْ لِي مِنَ الصَّالِحِينَ
“నా ప్రభూ! నాకు గుణవంతుడైన కుమారుణ్ణి ప్రసాదించు” (అని ప్రార్థించాడు).

37:101 فَبَشَّرْنَاهُ بِغُلَامٍ حَلِيمٍ
అందువల్ల మేమతనికి, సహనశీలుడైన ఒక అబ్బాయి గురించిన శుభవార్తను అందజేశాము.

37:102 فَلَمَّا بَلَغَ مَعَهُ السَّعْيَ قَالَ يَا بُنَيَّ إِنِّي أَرَىٰ فِي الْمَنَامِ أَنِّي أَذْبَحُكَ فَانظُرْ مَاذَا تَرَىٰ ۚ قَالَ يَا أَبَتِ افْعَلْ مَا تُؤْمَرُ ۖ سَتَجِدُنِي إِن شَاءَ اللَّهُ مِنَ الصَّابِرِينَ
మరి ఆ కుర్రాడు అతని వెంట పరుగెత్తే ఈడుకు చేరుకున్నప్పుడు, “ఒరేయ్‌ చంటీ! నేను నిన్ను ‘జిబహ్‌’ చేస్తున్నట్లు కల చూస్తున్నాను! మరి నీ అభిప్రాయమేమిటో చెప్పు” అని అతను (ఇబ్రాహీం) అన్నాడు. “నాన్నగారూ! మీకు ఆజ్ఞాపించబడిన దానిని (నిస్సంకోచంగా) నెరవేర్చండి. అల్లాహ్‌ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు” అని ఆ బాలుడు అన్నాడు.

37:103 فَلَمَّا أَسْلَمَا وَتَلَّهُ لِلْجَبِينِ
మరి వారిరువురూ (దైవాజ్ఞను) శిరసావహించినప్పుడు అతను తన కుమారుణ్ణి ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాడు.

37:104 وَنَادَيْنَاهُ أَن يَا إِبْرَاهِيمُ
అప్పుడు మేమతన్ని పిలిచాము – “ఓ ఇబ్రాహీం!

37:105 قَدْ صَدَّقْتَ الرُّؤْيَا ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
“నువ్వు కలను నిజంచేసి చూపావు.” నిశ్చయంగా మేము సదాచార సంపన్నులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము.

%d bloggers like this: