10వ అధ్యాయం అల్లాహ్ యేతరుల కొరకు జిబహ్ (జంతు బలిదానం) [Slaughtering for other than Allah] అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
ఇలా అను: “నా నమాజ్, నా ఖుర్బాని (జంతుబలి), నా జీవనం, నా మరణం సమస్తమూ సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయనకు ఏ భాగస్వామీ లేడు.”(అన్ ఆమ్ 6: 162,163).
فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ
“నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి, ఖుర్బానీ కూడా ఇవ్వు.”(కౌసర్ 108: 2).
అలీ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు నాలుగు మాటలు నేర్పారు:
(1) అల్లాహ్ తప్ప ఇతరులకు జిబహ్ చేసిన వానిని అల్లాహ్ శపించాడు.
(2) తన తల్లిదండ్రుల్ని శపించిన, దూషించిన వానిని అల్లాహ్ శపించాడు.
(3) “ముహాదిన్ ” (బిద్ అతి, దురాచారం చేయు వాని)ని అల్లాహ్ శపించాడు.
(4) భూమిలో తమ స్థలాల (ఆస్తుల) గుర్తుల్ని మార్చిన వానిని అల్లాహ్ శపించాడు.
(ముస్లిం).
తారిఖ్ బిన్ షిహాబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఈగ కారణంగా ఒక వ్యక్తి స్వర్గంలో ప్రవేశించాడు. మరొక వ్యక్తి నరకంలో చేరాడు“.
అది ఎలా? అని సహచరులు అడుగగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు:
“ఇద్దరు మనుషులు ఒక గ్రామం నుండి వెళ్తుండగా, అక్కడ ఆ గ్రామవాసుల ఒక విగ్రహం ఉండింది. అక్కడి నుండి దాటిన ప్రతి ఒక్కడు ఆ విగ్రహానికి ఏ కొంచమైనా బలి ఇవ్వనిదే దాటలేడు. (ఆ విగ్రహారాధకులు) ఒకనితో అన్నారు: ఏదైనా బలి ఇవ్వు. “నా వద్ద ఏమి లేదు” అని అతడన్నాడు. “దాటలేవు. కనీసం ఒక ఈగనైనా బలి ఇవ్వు”. అతడు ఒక ఈగను ఆ విగ్రహం పేరు మీద బలిచ్చాడు. వారు అతన్ని దాటనిచ్చారు. కాని అతడు నరకంలో చేరాడు. “నీవు కూడా ఏదైనా బలి ఇవ్వు” అని మరో వ్వక్తితో అన్నారు. “నేను అల్లాహ్ తప్ప ఇతరులకు ఏ కొంచెమూ బలి ఇవ్వను” అని అతడన్నాడు. వారు అతన్ని నరికేశారు. అతడు స్వర్గంలో ప్రవేశించాడు.” (అహ్మద్).
ముఖ్యాంశాలు:
మొదటి ఆయతు యొక్క వ్యాఖ్యానం.
రెండవ ఆయతు యొక్క వ్యాఖ్యానం.
శాపం ఆరంభం అల్లాయేతరులకు జిబహ్ చేసినవారితో అయింది.
తల్లిదండ్రుల్ని దూషించిన, శపించినవానినీ శపించడమైనది. నీవు, ఒక వ్యక్తి తల్లిదండ్రుల్ని దూషించావంటే అది నీవు స్వయంగా నీ తల్లిదండ్రుల్ని దూషించినట్లే.
“ముహాదిన్”ని శపించడమైనది. ఏ పాపంపై శిక్ష ఇహంలోనే అల్లాహ్ విధించాడో, ఒక వ్యక్తి ఆ పాపం చేసి ఆ శిక్ష నుండి తప్పించుకోడానికి ఇతరుల శరణు కోరుతాడు. అతన్ని కూడా “ముహాదిన్ ” అనబడుతుంది.
భూమి గుర్తులను మార్చిన వానిని కూడా శపించబడినది. నీ భూమి, నీ పక్కవాని భూమి మధ్యలో ఉండే గుర్తుల్ని వెనుక, ముందు చేసి మార్చేయడం అని భావం.
ఒక వ్యక్తిని ప్రత్యేకించి శపించడంలో, పాపాన్ని ప్రస్తావించి అది చేసిన వారిని శపించడంలో ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలి.
ఈగ కారణంగా ఒకతను నరకంలో మరొకతను స్వర్గంలో చేరిన హదీసు చాలా ముఖ్యమైనది.
అతడు తన ప్రాణం కాపాడుకునే ఉద్దేశంతో ఒక ఈగను బలి ఇచ్చాడు. కాని నరకంలో చేరాడు.
విశ్వాసుల వద్ద షిర్క్ ఎంత ఘోర పాపమో గమనించవచ్చు. తన ప్రాణాన్ని కోల్పోవడం సహించాడు. కాని షిర్క్ చేయడానికి ఒప్పుకోలేదు.
నరకంలో చేరినవాడు విశ్వాసుడే. అతను మొదటి నుండే అవిశ్వాసి అయితే ఈగ కారణంగా నరకంలో చేరాడు అని అనబడదు.
ఈ హదీసు మరో హదీసును బలపరుస్తుంది. అది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ ప్రవచనం: “స్వర్గం మీ చెప్పు యొక్క పట్టీ (గూడ) కంటే చేరువుగా ఉంది, నరకం కూడా అలాగే“. (బుఖారి).
ముస్లింలు, ముస్లిమేతరులు అందరి వద్ద మనఃపూర్వకంగా ఉన్న ఆచరణ చాలా ప్రాముఖ్యత గలది.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
జిబహ్ కేవలం అల్లాహ్ కొరకే చేయాలి. పూర్తి చిత్తశుద్ధితో చేయాలి. నమాజు గురించి చెప్పబడినట్లే దీని గురించి ఖుర్ఆన్ లో స్పష్టంగా చెప్పబడింది. ఎన్నో చోట్ల దాని ప్రస్తావన నమాజుతో కలసి వచ్చింది. ఇక ఇది అల్లాహ్ యేతరుల కొరకు చేయుట షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్).
షిర్క్ అక్బర్ దేనినంటారో గుర్తుంచుకోండి: “ఆరాధనలోని ఏ ఒక భాగాన్ని అయినా అల్లాయేతరుల కొరకు చేయుట“. అయితే ఏ విశ్వాసం, మాట, కార్యాలు చేయాలని ఇస్లాం ధర్మం చెప్పిందో అది అల్లాహ్ కు చేస్తే అది తౌహీద్, ఇబాదత్, ఇఖ్లాసు. ఇతరల కొరకు చేస్తే షిర్క్, కుఫ్ర్ . ఈ షిర్క్ అక్బర్ యొక్క నియమాన్ని మీ మదిలో నాటుకొండి.
అదే విధంగా షిర్క్ అస్గర్ (చిన్న షిర్క్) అంటేమిటో తెలుసుకోండి. “షిర్క్ అక్బర్ వరకు చేర్పించే ప్రతీ సంకల్పం, మాట, పని. అది స్వయం ఇబాదత్ కాకూడదు“. షిర్క్ అక్బర్, షిర్క్ అస్గర్ యొక్క ఈ రెండు నియమాలను క్షుణ్ణంగా తెలుసుకుంటే, దీనికి ముందు, తరువాత అధ్యాయాలన్నింటిని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇంకా సందేహమనిపించే విషయాల్లో ఇది మీకు స్పష్టమైన గీటురాయిగా ఉంటుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
7 వ అధ్యాయం కష్టం తొలగిపోవుటకు, లేక రాకుండా ఉండుటకు కడాలు, దారాలు, వాటి లాంటివి ధరించుట షిర్క్ [Wearing bracelets and cords etc., To remove Afflictions or to seek protection is a form of shirk] అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
“ఒక వేళ అల్లాహ్ నాకేదైనా నష్టాన్ని కలిగించగోరితే, మీరు అల్లాహ్ ను కాదని వేడుకునే దేవతలు, ఆయన కలిగించే నష్టం నుండి నన్ను కాపాడగలరా?”(జుమర్ 39: 38).
ఇమ్రాన్ బిన్ హుసైన్ కథనం: ఒక వ్యక్తి చేతిలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రాగి కడం (bracelet) చూసి, “ఇది ఏమిటి?” అని అడిగారు. “వాహిన” [*] దూరము కావడానికి వేసుకున్నాను అని అతడు చెప్పాడు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “దాన్ని తీసివేయి. అది నీ “వాహిన” పెరుగుటకే కారణమవుతుంది. ఒక వేళ అది నీవు ధరించి ఉన్నప్పుడు మరణించావంటే ఎన్నటికీ సాఫల్యం పొందవు” అని హెచ్చరించారు. (అహ్మద్).
[*] భుజములోని ఒక నరం ఉబ్బి రోగము వస్తుంది. అది దూరము కావడానికి వారు అలాంటివి వేసుకునేవారు
ఉఖ్బా బిన్ ఆమిర్ కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశం: “తాయత్తు వేసుకున్నవారి ఉద్దేశాన్ని అల్లాహ్ పూర్తి చేయకుండుగాక. గవ్వ (సీపి) వేసుకున్న వానికి కూడా అల్లాహ్ స్వస్థత ప్రసాదించకుండా ఉండుగాక “. (అహ్మద్). మరో ఉల్లేఖనంలో ఉంది: “తాయత్తు వేసుకున్న వారు షిర్క్ చేయువారు“.
ఇబ్ను అబి హాతింలో ఉంది: హుజైఫా ఒక వ్యక్తి చేతిలో జ్వరం దూరం కావడానికి వేసుకున్న దారాన్ని చూసి తెంచారు. తరువాత ఈ ఆయతు చదివారు. “వారిలో చాలామంది అల్లాహ్ను విశ్వసిస్తూ కూడా ఆయనతో పాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెడుతున్నారు.” (యూసూఫ్ 12 : 106).
2.”అతను అదే స్థితిలో చనిపోతే సఫలుడు కాడు” అన్న దానితో షిర్క్ అస్గర్ (చిన్న షిర్క్), కబీర గునాహ్ లో (ఘోర పాపాల్లో) పెద్దది అని తెలుస్తుంది.
3. తెలియక పోవడము ఒక సాకుగా పరిగణింపబడలేదు.
4. దాని వలన లాభం కలగదు. ప్రవక్త ఆదేశానుసారం: ‘దాని వలన “వహన్” ఇంకా పెరుగుతుంది.’
5. ఇలాంటి పని చేసిన వారిని కఠినంగా హెచ్చరించబడింది.
6. ఇలాంటివి వేసుకున్నవారు దాని వైపే అప్పగించబడుతారు.
7. తాయత్తు వేసుకున్న వారు షిర్క్ చేయువారు అని స్పష్టం అయింది.
8. జ్వరం దూరం కావడానికి దారం వేసుకొనుట కూడా ఇందులోనే పరిగణించబడుతుంది.
9. హుజైఫా పఠించిన ఆయతుతో తెలిసిందేమిటంటే; ప్రవక్త సహచరులు పెద్ద షిర్క్ ప్రస్తావించబడిన ఆయతులతో చిన్న షిర్క్ గురించి ప్రమాణంగా ప్రస్తావించేవారు. సూరె బఖర వాక్యంలో ఇబ్నె అబ్బాసు (రదియల్లాహు అన్హు) ఇలాగే తెలిపారు.
10. దిష్టి తగలకుండా గవ్వ (సీపి) వేసుకొనుట కూడా షిర్క్ అవుతుంది.
11. తాయత్తు వేసుకున్న వారిని, గవ్వ వేసుకున్న వారిని శపించబడింది. అంటే అల్లాహ్ వారిని తన సంరక్షణలో ఉంచడు.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
నష్టం, కష్టం దూరం కావడానికి, లేక రాకుండా ఉండడానికి ఉపయోగించే సాధనాల (జరియ, అస్బాబ్)లో ఏవి యోగ్యం, ఏవి నిషేధం తెలుసుకొనటానికి, సాధనాల (జరీయ, అస్బాబ్)కు సంబంధించిన ఆదేశాల్ని తెలుసుకొనుట ఎంతయినా అవసరం. ఇందులో మూడు విషయాల్ని తెలుసుకొనుట చాలా ముఖ్యం.
1. ధార్మికంగా లేక శాస్త్రీయంగా లాభకరమయిన సాధనం అని రుజువైన వాటినే సాధనంగా ఉపయోగించాలి.
2. వాటిని ఉపయోగించే వ్యక్తి ఆధారం, భరోసా వాటిపై ఉండ కూడదు. వాటిని సాధనంగా చేసిన అల్లాహ్ పై నమ్మకం ఉండాలి.
3. సాధనాలు ఎంత గొప్పవి, శక్తి గలవైనా అల్లాహ్ వ్రాసి ఉంచిన విధి, (తఖ్ దీర్)కి అవి లోబడి ఉంటాయి. దానిని తప్పించుకోలేవు. అల్లాహ్ తాను కోరినట్లు వాటిలో మార్పు చేస్తాడు. అల్లాహ్ కోరితే అందులోని గుణాన్ని అలాగే ఉంచుతాడు. ఆయన దాసులు వాటిని తెలుసుకొని, ఉపయోగించి వాటిలో ఉన్నటువంటి అల్లాహ్ తత్వాన్ని గమనించగలరనీ. అతను కోరితే అందులోని గుణాన్ని మార్చనూవచ్చు. ఇలా దాసులు వాటిపైనే నమ్మకం ఉంచకూడదనీ, అల్లాహ్ శక్తిని అర్థం చేసుకోగలరనీ. మార్పు చేయు సర్వశక్తి, సర్వ ఇష్టం ఒకే ఒక్క అల్లాహ్ కు మాత్రమే ఉంది.
పై ముఖ్య విషయం తెలుసుకున్న తరువాత, ఇక వచ్చిన కష్టం తొలగడానికి, లేక కష్టం రాకుండా జాగ్రత్త పడడానికి దారం లేక కడం లాంటివి వేసుకున్న వాడు షిర్క్ చేసినట్లే కదా? ఎలా అనగా; అది కష్టం రాకుండా, లేక వచ్చిన తరువాత కాపాడునది అని విశ్వసిస్తే ఇది పెద్ద షిర్క్ అవుతుంది. అతడు అల్లాహ్ను గాక ఇతరులను స్వస్థత ఇచ్చేవాడుగా నమ్మినందుకు ఇది రుబూబియత్ కు సంబంధించిన షిర్క్. ఇంకా అతడు అందులో స్వస్థత ఉంది అని దానిపై భరోసా, నమ్మకం, ఆశ ఉంచినందుకు, ఇది ఉలూహియత్ కు సంబంధించిన షిర్క్ అవుతుంది.
ఒక వేళ అతడు అల్లాహ్ యే కష్టనష్టాలు రాకుండా, లేక వచ్చిన తరువాత కాపాడువాడు అని విశ్వసించి, అవి కేవలం సాధనం అని నమ్మినవాడు, ధార్మికంగా, శాస్త్రీయంగా సాధనం లేని దానిని సాధనంగా నమ్మినవాడవుతాడు. ఇది నిషిద్ధం (హరాం). మరియు ఇస్లాం పై, వైద్య శాస్త్రంపై ఒక అబద్దం మోపినవాడవుతాడు. ఎలా అనగా; ఇస్లామీయ ధర్మం దీనిని చాలా కఠినంగా నివారించింది. అది నివారించినవి లాభాన్నిచ్చేవి కావు. శాస్త్రీయంగా కూడా ఇవి ఆమోదం పొందినవి కావు. లాభం చేకూర్చే ఔషదాల్లో లెక్కించబడవు.
అందుకే ఇవి షిర్క్ వైపునకు లాక్కొని వెళ్ళే సాధనాలు. వాటిని వేసుకున్న వాని మనుస్సు వాటిపై లగ్నం అయి ఉంటుంది. అందుకే అది షిర్క్ భాగాల్లో ఒక భాగం. లేక సాధనాల్లో ఒక సాధనం.
ఇది ధార్మికంగా, శాస్త్రీయంగా సాధనం కాదని తెలిసినప్పుడు, విశ్వాసుడు తన విశ్వాసం సంపూర్ణమగుటకు దానిని వదిలి వేయాలి. అతని తౌహీద్ సంపూర్ణం అయిందంటే నివారించబడిన వాటిపై అతని మనుస్సు లగ్నం కాదు. లాభం లేని వాటిపై మనుస్సు లగ్నం కావడం బుద్ధిహీనతకు నిదర్శనం. ఎలా అనగా మనిషి తనకు లాభం లేని వాటిని ఉపయోగించడు. అందులో నష్టమే ఉంది.
ఈ సత్య ధర్మం యొక్క పునాది: “ప్రజల నుండి విగ్రహారాధనను, సృష్టి రాసుల పైనుండి నమ్మకాన్ని దూరము చేసి, వారి ధర్మాన్ని దురాచారాల, దుష్చేష్టల నుండి దూరం చేసి వారి బుద్ధి జ్ఞానాలను సంపూర్ణం చేయుట. బుద్ధిని అభివృద్ధి పరిచే, ఆత్మలను పరిశుద్ధపరిచే, ధార్మిక, ప్రాపంచిక స్థితిగతులను సంస్కరించే లాభదాయకమయిన విషయాల గురించి కృషి చేయుట.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
5 వ అధ్యాయం “అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు” అనే ప్రమాణానికి ఆహ్వానించుట అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
“ఆరాధనలో అల్లాహ్ ఏకత్వాన్ని పాటించాలని” పిలుపునివ్వు. వారు నీ ఈ మాటకు విధేయులయితే, అల్లాహ్ వారిపై రేయింబవళ్ళలో ఐదు పూటల నమాజు చేయడం విధించాడని తెలుపు. నీ ఈ మాటకు కూడా విధేయత చూపితే, అల్లాహ్ వారిపై జకాత్ విధించాడని తెలియజేయి. అది వారి ధనికుల నుండి వసూలు చేసి, వారి పేదలలో పంచబడుతుంది అని తెలుపు. నీ ఈ మాటను వారు అమలు పరుస్తే, (వారి నుండి జకాత్ వసూలు చేసేటప్పుడు) వారి శ్రేష్ఠమైన వస్తువుల జోలికి పోకు. పీడితుని ఆర్తనాదాలకు భయపడు. పీడితుని ఆర్తనాదానికి, అల్లాహ్ కు మధ్య ఏలాంటి అడ్డుతెర ఉండదు”.
ఖైబర్ యుద్ధం నాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నేను రేపు యుద్ధపతాకం ఎలాంటి వ్యక్తికి ఇస్తానంటే, అతను అల్లాహ్, ఆయన ప్రవక్తని ప్రేమిస్తాడు. అతన్ని అల్లాహ్, ఆయన ప్రవక్త ప్రేమిస్తారు. అల్లాహ్ అతని ద్వారా (ఖైబర్) విజయం చేకూరుస్తాడు”. ఆ పతాకం ఎవరికి దొరుకుతుందో అన్న ఆలోచనలోనే వారు రాత్రి గడిపి, తెల్లవారగానే ప్రవక్త సమక్షంలో హాజరయి, ప్రతి ఒక్కరూ తనకే ఆ పతాకం లభిస్తుందని ఆశించారు. అప్పుడు “అలీ బిన్ అబీ తాలిబ్ ఎక్కడున్నాడ“ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. ఆయన కళ్ళలో ఏదో బాధగా ఉంది అని సమాధానమిచ్చారు ప్రజలు. ఎవరినో పంపి అతన్ని పిలిపించడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని కళ్ళల్లో తమ లాలాజలాన్ని ఉమ్మినారు. తక్షణమే అలీ రదియల్లాహు అన్హు తనకసలు ఎలాంటి బాధే లేనట్లు పూర్తిగా ఆరోగ్యవంతులైపోయారు. యుద్ధ పతాకం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ రజియల్లాహు అన్హు చేతికి ఇచ్చి, ఇలా బోధించారు: “నీవు నెమ్మదిగా, హుందాగా వెళ్ళి వారి మైదానంలో దిగు. ఆ తరువాత వారికి ముందుగా ఇస్లాం సందేశాన్ని అందజెయ్యి. వారు నిర్వహించవలసిన అల్లాహ్ హక్కులు వారిపై ఏమున్నాయో వారికి బోధించు. అల్లాహ్ సాక్షిగా! నీ ద్వారా ఏ ఒక్కనికి అల్లాహ్ రుజు మార్గం (ఇస్లాం) ప్రసాదించినా అది నీకోసం ఎరుపు రంగు ఒంటెల కంటే ఎంతో విలువైనది, శ్రేష్ఠమైనది“. (బుఖారి 2942, ముస్లిం 2406).
ముఖ్యాంశాలు
1. అల్లాహ్ వైపునకు ఆహ్వానించుట (ప్రవక్త మరియు) ఆయన్ని అనుసరించిన వారి జీవితాశయం.
2. ‘ఇఖ్లాస్’ గురించి తాకీదు ఉంది. ఎందుకనగా ధర్మం వైపు ఆహ్వానిస్తున్నామంటున్న అనేక మంది స్వయంగా తమ వైపునకు ప్రజల్ని ఆహ్వానిస్తారు.
3. విద్య ఆధారంగా (ధర్మప్రచారం చేయుట) కూడా ఒక విధి.
4. అల్లాహ్ ను లోపాలు లేని పవిత్రుడని నమ్ముటయే ఉత్తమమైన తౌహీద్.
5. అల్లాహ్ లోపాలు గలవాడని భావించుట చాలా చెడ్డ షిర్క్.
6. ముస్లిం, ముష్రికులకు అతి దూరంగా ఉండాలి. ఎందుకనగా అతను షిర్క్ చేయనప్పటికి వారిలో కలసిపోయే ప్రమాదముంటుంది.
7. విధుల్లో మొట్టమొదటిది తౌహీద్.
8. అన్నిటికి ముందు, చివరికి నమాజుకన్నా ముందు తౌహీద్ ప్రచారం.
9. హదీసులో “అన్ యువహ్హిదుల్లాహ్” (అల్లాహ్ ఏకత్వాన్ని పాటించుట) మరియు “లాఇలాహ ఇల్లల్లాహ్” రెండింటి భావం ఒక్కటే.
10. మనిషి దైవ గ్రంథం పొందిన (యూదుడు, క్రైస్తవుడు లాంటి) వాడు అయి కూడా “లాఇలాహ ఇల్లల్లాహ్” అర్థం తెలియకపోవచ్చు, లేక తెలిసి కూడా దాని ప్రకారం ఆచరించకపోవచ్చు.
11. క్రమ క్రమంగా విద్య నేర్పాలని బోధపడింది.
12. అతి ముఖ్యమైన విషయంతో ఆరంభించాలని తెలిసింది.
13. జకాత్ సొమ్మును ఎందులో ఖర్చు పెట్టాలో తెలిసింది.
14. (జకాత్ సొమ్ము ఎందులో ఖర్చు చెయ్యాలి తెలియక, ముఆజ్ రజియల్లాహు అన్హు సందేహ పడకుండా ప్రవక్తవారు ముందే వివరించినట్లు) శిష్యులను సందిగ్ధంలో పడవేసే విషయాలను పండితుడు ముందే విశదీకరించాలి.
15. (జకాత్ వసూలు చేసే అతను) కేవలం మంచి సొమ్ము మాత్రమే తీసుకొనుట నివారించబడింది.
16. పీడుతుని ఆర్తనాదానికి భయపడాలని ఉంది.
17. అతని ఆర్తనాదం స్వీకరించబడటానికి ఏదీ అడ్డు పడదు అని తెలిసింది.
18. ప్రవక్త, సహాబాలు, ఇతర మహాభక్తులు (తౌహీద్ ప్రచారంలో) భరించిన కష్టాలు, ఆకలి, అంటు వ్యాధి బాధలు, తౌహీద్ యొక్క నిదర్శనాలు. (ఖైబర్ యుద్ధ సందర్భంలో ఇవి ఎదురయ్యాయి).
19. “నేను యుద్ధపతాకం ఇస్తాను” అన్న ప్రవక్త మాట, ఆయన సత్య ప్రవక్త అనడానికి గొప్ప సూచన.
20. అలీ రజియల్లాహు అన్హు కళ్ళల్లో ఆయన లాలాజలం పెట్టడం కూడా ఒక అద్భుత సంకేతం మరియు సత్య ప్రవక్త అనడానికి గొప్ప సూచన.
21. అలీ రజియల్లాహు అన్హు యొక్క ఘనత తెలిసింది.
22. ఇందులో సహాబాల ఘనత కూడా తెలుస్తుంది. ఎలా అనగా? యుద్ధ పతాకం ఏ అదృష్టవంతునికి లభిస్తుందో (అతడు నిజ ప్రేమికుడు, ప్రియుడు) అని ఆలోచించడంలోనే నిమగ్నులయ్యారు, అతని ద్వారానే అల్లాహ్ విజయం ప్రసాదిస్తాడన్న విషయం వారు మరచిపోయారు.
23. ఇందులో విధివ్రాతపై విశ్వాసం రుజువవుతుంది. అది ఎలా? యుద్ధ పతాకం కోరినవారికి లభించలేదు. కోరని, ఏ మాత్రం ప్రయత్నం చేయని వారికి లభించింది.
24. “నిదానంగా బయలుదేరు” అన్న ప్రవక్త మాటలో (యుద్ధ) శిక్షణ, పద్దతి బోధపడుతుంది.
25. ఎవరితో యుద్ధం చేయబోతున్నారో ముందు వారికి ఇస్లాం పిలుపు నివ్వాలి.
26. ఇంతకు ముందే పిలుపు ఇవ్వడం, లేక యుద్ధం జరిగియుంటే పరవా లేదు.
27. “వారిపై విధియున్న వాటిని వారికి తెలుపు” అనడంలో ధర్మ ప్రచార రంగంలో అవసరమైన వివేకం కానవస్తుంది.
28. ఇస్లాంలో అల్లాహ్ హక్కు ఏమిటో తెలుసుకొనుట చాలా అవసరం.
29. ఒక్క వ్యక్తి అయినా తమ ద్వారా రుజుమార్గం పొందితే ఇది ఎంత పుణ్యకార్యమో తెలుస్తుంది. .
30. ఫత్వా ఇస్తున్నప్పుడు అవసర సందర్భంగా అల్లాహ్ నామముతో ప్రమాణం చేయవచ్చును.
తాత్పర్యం
ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్: ఈ గ్రంధంలోని అధ్యాయాల్లో ఏ క్రమాన్ని పాటించారో అది చాలా ఉత్తమమైనది. మొదట తౌహీద్ “విధి” అని తెలిపారు, తరువాత దాని ఘనత, సంపూర్ణత ప్రస్తావన తెచ్చి, పిదప బాహ్యంతర్యాల్లో దాని “నిర్ధారణ”, ఆ తరువాత దానికి విరుద్ధమైన షిర్క్ తో భయంను ప్రస్తావించారు. ఇలా మనిషి ఒక విధంగా తనకు తాను పరిపూర్ణుడవుతాడు. ఆ తర్వాత “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క పిలుపునివ్వాలన్న అధ్యాయాన్ని చేర్చారు.
ఇది ప్రవక్తల విధానం. ఒకే అల్లాహ్ ఆరాధన చేయాలని వారు తమ జాతి వారికి పిలుపు ఇచ్చారు. ఇదే విధానం ప్రవక్తల నాయకులైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది. ఆయన వివేకంతో, చక్కని హితబోధతో, ఉత్తమ రీతి వాదనతో ఈ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చారు. అందులో అలసిపోలేదు. బలహీనత చూపలేదు. అల్లాహ్ ఆయన ద్వారా ఇస్లాం ధర్మాన్ని స్థాపించాడు. అది తూర్పు, పశ్చిమాల్లో వ్యాపించింది. అనేక మంది ఋజుమార్గం పొందారు. ఆయన స్వయంగా ఈ బాధ్యతను నెరవేర్చుతూ, తమ అనుచరులను ప్రచారకులుగా తీర్చిదిద్ది ఇతర ప్రాంతాలకు పంపేవారు. మొట్ట మొదట తౌహీద్ గురించే బోధించాలని చెప్పేవారు. ఎందుకనగా సర్వ కర్మల అంగీకారం దానిపైనే ఆధారపడియుంది. ఇలాంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అందుకే మొదట తౌహీద్ గురించి తెలుసుకోవాలి. పిదప దాని ప్రచారం చేయాలి. ప్రతి ఒక్కరిపై తన శక్తి మేరకు ఈ బాధ్యత ఉంటుంది. పండితుడు తన విద్య తో ఈ బాధ్యతను నెరవేర్చాలి. ధన, ప్రాణ శక్తి గలవాడు, హోదా అంతస్తు గలవాడు వాటిని ఉపయోగించి ఈ బాధ్యతను నెరవేర్చాలి. కనీసం ఒక మాటతోనైనా ఈ బాధ్యతను నెరవేర్చినవానిని అల్లాహ్ కరుణించుగాక! శక్తి, సామర్థ్యాలు కలిగియుండి కూడా ఈ బాధ్యతను నెరవేర్చని వానికి వినాశము ఉంటుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
షిర్క్ అవుతుందని ఏదైతే సమాధానం మీరు చదివారో, దీని వివరం తెలుసుకునేకి ముందు ఒక హదీసు విందాము :
ముఆవియా (రజియల్లాహు అన్హు) ఒక చోట వచ్చారు, ఆయన్ని చూసి అబ్దుల్లాహ్ బిన్ ఆమిర్ (తాబిఈ) నిలబడ్డారు, అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ (రజియల్లాహు అన్హుమా) (సహాబి బిన్ సహాబీ) కూర్చొని ఉన్నారు. ఇది చూసి ముఆవియ (రజియల్లాహు అన్హు) అబ్దుల్లాహ్ బిన్ ఆమిర్ తో చెప్పారు : “కూర్చో, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను:
“ప్రజలు తన కొరకు నిలబడాలని ఎవడు ఇష్టపడతాడో అతను తన నివాసం నరకంలో ఏర్పరుచుకోవాలి”. అబు దావూద్ లో ‘అహబ్బ’అనే పదం ఉంది అంటే ఇష్టపడతాడో, కోరుకుంటాడో, తిర్మిజిలో ఉంది: ‘సర్ర’అంటే నచ్చుతుందో, సంతోషం ఏర్పడుతుందో. అంటే అతడ్ని చూసి నిలబడని వారిని సంతోషంగా చూడడు, వారితో ప్రేమగా ఉండడు, నిలబడినవారి పట్ల సంతోషంగా వ్యవహరిస్తాడు.
ఈ సమస్య అంటే “ఒకరిని చూసి నిలబడటం” అనే విషయంలో కొన్ని వివరాలు ఉన్నాయి తెలుసుకోవడం చాలా అవసరం.
1- నేను ఏదైనా సమావేశంలో వస్తే, లేదా ప్రజలు నన్ను చూస్తే నిలబడాలని ఇష్టపడడం, కాంక్షించడం నిషిద్ధం.
ఇది గర్వానికి దారి తీస్తుంది, అప్పుడు గర్వం లేకున్నా గర్వ చిహ్నాల్లోకి వస్తుంది.
2- మనిషి ఇలాంటి కోరిక, కాంక్ష వల్ల నరకం పాలవుతాడని హెచ్చరించడం జరిగింది.
3- ఈ కోరిక, కాంక్ష ఉన్నవారిని చూసి నిలబడేవారు, ఓ నిషిద్ధ కార్యానికి సహాయం చేసినవారవుతారు.
4- ఇలాంటి కోరిక లేనివారి కొరకు కూడా నిలబడకూడదు, ఈ నిలబడటం అనే అలవాటు వారిలో ఆ కోరికను జనింపజేసే ప్రమాదముంది.
5- ఇక ఎవరైతే తమ ధర్మపరమైన బడాయితనాన్ని చాటుకుంటున్నారో, అనుయాయులు వారిని గౌరవించాలి, మర్యాద పాటించాలని కోరుకుంటున్నారో వారు నిజసృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క గౌరవమర్యాదలో జోక్యం చేసుకుంటున్నారు, కనుక అలాంటివారి కొరకు నిలబడుట షిర్క్ లోకి నెట్టేసే ప్రమాదం ఉంది.
6- ఇంట్లో పెద్దలు వస్తే పిల్లలు, నిలబడుట లేదా టీచర్లు క్లాస్ రూంలోకి వస్తే స్టూడెంట్స్ నిలబడుట కూడా మంచి అలవాటు కాదు.
7- కొందరు ఒక చోట ఉన్నారు ఎవరైనా వారి బంధువు, గురువు లాంటి పెద్దలు వచ్చారు అప్పుడు వారు నిలబడి, రెండు అడుగులు ముందుకు వచ్చి వచ్చే వ్యక్తికి స్వాగతం పలుకుతే పాపం కాదు. సహీ బుఖారీ 3043లో ఉంది: ఒక సందర్భంలో సఅద్ (రజియల్లాహు అన్హు) వచ్చినప్పుడు ప్రవక్త ఔస్ వంశంవారితో మీ నాయకుడైన సఅద్ వచ్చారు నిలబడి స్వాగతించండని ఆదేశించారు.
అలాగే ప్రయాణం నుండి వచ్చినవారిని స్వాగతించడానికి నిలబడి సలాం చేయడం, ముసాఫహా (కరచాలనం), ముఆనఖ (హగ్, అలాయిబలాయి) చేయడం యోగ్యమే. ప్రవక్త తమ కూతురింటికి వెళ్ళినప్పడూ, కూతురు ప్రవక్త ఇంటికి వచ్చినప్పుడు నిలబడి స్వాగతం పలికేవారని అబూ దావూద్ 5217 మరియు ఇతర హదీసుల్లో ఉంది.
(ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఉన్నాయి, ఫత్ హుల్ బారీ 11/49-51 మరియు షేఖ్ అల్బానీ గారి సహీహాలోని హదీసు 357, మరియు షేఖ్ ఇబ్ను ఉసైమీన్ గారి మజ్మూఉల్ ఫతావా 24/2 చూడవచ్చును)
2) మనకు ఏదయినా నష్టం జరిగినప్పుడు “నేను ఒక వేళ అలా చెయ్యకపోతే బాగుండేది” అని అనవచ్చునా?
”దృఢమైన, పరిపూర్ణ విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కంటే గొప్పవాడు. వాడి ప్రతిపనిలో మేలు ఉంటుంది. కావున లాభం చేకూర్చే దాన్ని కోరుకో, అల్లాహ్ తఆలా సహాయంకోరు. బలహీనత ప్రదర్శించకు. ఒకవేళ ఏదైనా ఆపదవస్తే, ”ఒకవేళ నేను అలా చేస్తే ఇలా అయ్యేదని అనకు.” అల్లాహ్ తఆల కోరింది అయ్యిందని, నా విధిలో ఉన్నది జరిగిందని భావించు. ఎందుకంటే ఒకవేళ అనేది షై’తాన్ ద్వారాన్ని తెరచి వేస్తుంది”.(సహీ ముస్లిం).
3) ప్రళయదినం నాడు అత్యధిక శిక్ష పడేది వీరిలో ఎవరికి ?
A) బొమ్మలు గీసే వాళ్లకు
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “أَشَدُّ النَّاسِ عَذَابًا عِنْدَ اللهِ الْمُصَوِّرُوْنَ”.
4497. ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రాణుల చిత్రాలు తయారుచేసే వారిని తీర్పుదినం నాడు అందరి కంటే కఠినంగా శిక్షించడం జరుగుతుంది.” (బు’ఖారీ, ముస్లిమ్)
وَعَنْهَا عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “أَشَدُّ النَّاسِ عَذَابًا يَوْمَ الْقِيَامَةِ الَّذِيْنَ يُضَاهُوْنَ بِخَلْقِ اللهِ”.
4495. ‘ఆయి’షహ్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం, ”తీర్పు దినం నాడు అల్లాహ్ తఆలా సృష్టించిన ప్రాణుల నకిలీ చిత్రాలు చేసేవారిని, అంటే ప్రాణుల చిత్రాలు తయారుచేసే వారిని అందరికంటే కఠినంగా శిక్షించటం జరుగుతుంది.” (బు’ఖారీ, ముస్లిమ్)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “قَالَ اللهُ تَعَالى: )وَمَنْ أَظْلَمُ مِمَّن ذَهَبَ يَخْلُقُ كَخَلْقِيْ فَلْيَخْلُقُوْا ذَرَّةً أَوْ لِيَخْلُقُوْا حَبَّةً أَوْ شَعِيْرَةً”(. متفق عليه.
4496. అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. అల్లాహ్ ఆదేశం, ”నేను సృష్టించే వాటిలా సృష్టించే అంటే చిత్రాలు వేసేవాడి కంటే దుర్మార్గుడు మరెవడు కాగలడు? అతడిని ఒక చీమ లేదా ఒక గోధుమ గింజ సృష్టించి చూపమనండి.” (బు’ఖారీ, ముస్లిమ్)
వివరణ-4496: ఇలా ఎందుకు ఆగ్రహించడం జరిగిందంటే, చీమను లేదా గోధుమ గింజను సృష్టించలేడు. అందు వల్ల ప్రాణుల చిత్రాలుగానీ ఫోటోలను గానీ తీయ రాదు అని హెచ్చరించడం జరిగింది
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “كُلُّ مُصَوِّرٍفِي النَّارِيَجْعَلُ لَهُ بِكُلِّ صُوْرَةٍ صَوَّرَهَا نَفْسًا فَيُعَذِّبُهُ فِيْ جَهَنَّمَ”. قَالَ ابْنُ عَبَّاسٍ: فَإِنْ كُنْتُ لَابُدَّ فَاعِلًا فَاصْنَعِ الشَّجَرَوَمَا لَا رُوْحَ فِيْهِ.
4498.’అబ్దుల్లాహ్ బిన్ ‘అబ్బాస్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రాణుల చిత్రాలు తయారు చేసే ప్రతి ఒక్కరినీ నరకంలో వేయబడును. ఇంకా వారితో, చేసిన చిత్రాలన్నింటిలో ప్రాణం పోయమని ఆదేశించటం జరుగును. వారు ఎలాగూ ప్రాణం పోయలేరు, అందువల్ల నరకంలోనే ఉండవలసి వస్తుంది”. ఇబ్నె ‘అబ్బాస్ (రజియల్లాహు అన్హు) అభిప్రాయం, ”ఒకవేళ చిత్రం వేసే అవసరం వస్తే చెట్లు, నిర్జీవ వస్తువుల చిత్రాలు వేసుకోండి.” (బు’ఖారీ, ముస్లిమ్) అంటే బట్టలపై, దుస్తులపై నిర్జీవ ఫలాల, ఆకుల, వస్తువుల చిత్రాలు వేసుకోవచ్చును.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“అల్లాహ్ మీ వద్దకు ఏ నిదర్శనాన్నీ అవతరింపజేయనప్పటికీ మీరు అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించే విషయానికి భయపడటం లేదు. మరి అటువంటప్పుడు అల్లాహ్‌కు సహవర్తులుగా మీరు నిలబెట్టే వాటికి నేనెలా భయపడతాను? కాబట్టి ఈ రెండు పక్షాలలో సురక్షిత స్థితికి అర్హులెవరో మీకు తెలిస్తే కాస్త చెప్పండి.”(సూరా అల్ అన్ ‘ఆమ్ 6:81)
“విశ్వసించి, తమ విశ్వాసాన్ని దుర్మార్గం (షిర్కు)తో కలగా పులగం చేయకుండా ఉండేవారే సురక్షితంగా ఉన్నవారు. సన్మార్గంపై ఉన్నవారు కూడా వారే”. (సూరా నూహ్ 6:82)
“ఇబ్రాహీము (అలైహిస్సలాం) తన జాతి వారిని ఎదుర్కొనటానికిగాను మేము అతనికి ఇచ్చిన మా ‘నిదర్శనం’ ఇది! మేము తలచుకున్నవారి అంతస్తుల్ని పెంచుతాము. నిశ్చయంగా నీ ప్రభువు వివేకవంతుడు, గొప్ప పరిజ్ఞానం కలవాడు.”(సూరా నూహ్ 6:83)
“ఇంకా మేము అతనికి ఇస్‌హాఖును, యాఖూబ్‌ను ప్రసాదించాము. వారిలో ప్రతి ఒక్కరికీ మేము సన్మార్గం చూపించాము. అంతకు మునుపు మేము నూహ్‌కు సన్మార్గం చూపించి ఉన్నాము. ఇంకా అతని సంతతి వారిలోనుంచి దావూదు సులైమానులకు, అయ్యూబు యూసుఫులకు, మూసా హారూనులకు మేము సన్మార్గం చూపాము. సత్కార్యాలు చేసేవారికి మేము ఇలాగే ప్రతిఫలం ఇస్తూ ఉంటాము.”(సూరా నూహ్ 6:84)
“ఇంకా – ఇస్మాయీలుకు, యసఆకు, యూనుసు లూతులకు కూడా (మేము మార్గదర్శకత్వం వహించాము). వారిలో ప్రతి ఒక్కరికీ మేము లోకవాసులందరిపై శ్రేష్ఠతను అనుగ్రహించాము”.(సూరా నూహ్ 6:86)
“అంతేకాదు, వారి పితామహులలో (తాత ముత్తాతలలో), వారి సంతానంలో, వారి సహోదరులలో కూడా కొందరిని (మేము కటాక్షించాము.) వారిని (మా సేవకోసం) ఎన్నుకున్నాము. వారిని రుజుమార్గం వైపుకు నడిపించాము.”(సూరా నూహ్ 6:87)
“ఇదీ అల్లాహ్ మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సైతం, దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి.”(సూరా నూహ్ 6:88)
అలాగే సూర జుమర్ 39:65లో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఉద్దేశించి ఇలా చెప్పడం జరిగింది
నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” (సూర జుమర్ 39:65)
అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: అల్లాహ్ ఇలా తెలిపాడు: “భాగస్వాములందరికంటే ఎక్కువగా నేను షిర్క్ కు అతీతుడ్ని. ఎవరైనా ఒక సత్కార్యం చేసి అందులో ఎనరినైనా నాకు భాగస్వామిగా చేస్తే నేను అతడ్ని అతని షిర్క్ తో పాటు వదిలేస్తాను.” (ముస్లిం 2985)
2] నమాజ్ లో రెండు సజ్దాల మధ్య రబ్బిగ్ ఫిర్లీ అని పలికే దువా భావం ఏమిటి?
B] నా ప్రభూ నన్ను మన్నించు
النسائي 1069 ، أبو داود 874:- وَبَيْنَ السَّجْدَتَيْنِ: «رَبِّي اغْفِرْ لِي، رَبِّي اغْفِرْ لِي»
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రెండు సజ్దాల మధ్యలో రబ్బిగ్ ఫిర్లీ, రబ్బిగ్ ఫిర్లీ అనేవారు.
3] అల్లాహ్ మనతోపాటు ఏ విధంగా అతి దగ్గరలోనే ఉన్నాడు?
“(ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికి చెప్పు). కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి (ఈ విషయం నీవు వారికి తెలియజేయి). తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగల్గుతారు.”(సూర బఖర 2:186)
అల్లాహ్ మనతో పాటు ఉన్నాడన్న విశ్వాసం “అల్లాహ్ పై విశ్వాసం”లోని ఓ ముఖ్యమైన భాగం. అరబీలో ‘మఇయ్యతుల్లాహ్’ అనబడుతుంది. అల్లాహ్ తనకు తగిన రీతిలో ఏడు ఆకాశాల పైన తన అర్ష్ పై ఉన్నాడు. ఇందులో ఏ అనుమానం లేదు. ఖుర్ఆనులో ఎన్నో ఆయతులున్నాయి. ఉదాహరణకు చూడండి సూర తాహా 20:5
అయితే ఇది (‘మఇయ్యతుల్లాహ్’) రెండు రకాలు 1: ‘మఇయ్య ఆమ్మ’ 2: ‘మఇయ్య ఖాస్స’
1: ‘మఇయ్య ఆమ్మ’అంటే అల్లాహ్ తన అర్ష్ పై ఉండి కూడా సర్వ సృష్టి వెంట ఉన్నాడు, అంటే సర్వ సృష్టిపై దృష్టి పెట్టి ఉన్నాడు, వారిని చూస్తూ వింటూ ఉన్నాడు. దీనికి దివ్య ఖుర్ఆన్ సూర హదీద్ 57:4 లో ఉంది:
“ఆయనే భూమ్యాకాశాలను ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని అధిష్టించాడు. భూమి లోపలికి పోయేదీ, అందులో నుంచి బయల్పడేదీ, ఆకాశం నుంచి క్రిందికి దిగేదీ, మరందులోకి ఎక్కిపోయేదీ – అంతా ఆయనకు (బాగా)తెలుసు. మీరెక్కడ ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. మరి మీరు చేసే పనులన్నింటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు.” (సూర హదీద్ 57:4)
2: ‘మఇయ్య ఖాస్స’: అంటే పై భావంతో పాటు ప్రత్యేకంగా తన ప్రవక్తల, విశ్వాసులకు తోడుగా, మద్దతుగా, సహాయంగా ఉన్నాడని కూడా భావం వస్తుంది.
“బాధపడకు. నిశ్చయంగా అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు” అని ఓదార్చినప్పుడు అల్లాహ్‌యే వారికి తోడ్పడ్డాడు. (ఆ ఘడియలో) అల్లాహ్ తన తరఫునుంచి అతనిపై ప్రశాంతతను అవతరింపజేశాడు. మీకు కానరాని సైన్యాలతో అతన్ని ఆదుకున్నాడు. (సూర తౌబా 9:40)
పై మూడు ఆయతుల వ్యాఖ్యానంలో ఇమాం ఇబ్ను తైమియా (రహిమహుల్లాహ్) చెప్పారు:
“అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు అబూ బక్ర్ కు తోడుగా ఉండి, సహాయ పడ్డాడు అబూ జహల్ మరియు ఇతర శత్రువులకు వ్యెతిరేకంగా, మూసా (అలైహిస్సలాం) మరియు హారూన్ (అలైహిస్సలాం)కు తోడుగా ఉండి, సహాయం అందించాడు ఫిర్ఔన్ కు వ్యెతిరేకంగా, ఇంకా భక్తిపరులకు, సద్వవర్తనులకు తోడుగా ఉండి, సహాయపడ్డాడు పాపాత్ములు, దౌర్జన్యపరులకు వ్యెతిరేకంగా.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
عقيدة التوحيد అఖీదా-యే-తౌహీద్ (అల్లాహ్ ఏకత్వం) – మూడవ ప్రకరణం సమాధుల, దర్గాల వద్ద జంతుబలి ఇవ్వటం. కానుకలు, నజరానాలు సమర్పించుకోవటం, శ్రద్ధాంజలి ఘటించటం
బహుదైవారాధన వైపు తీసుకుపోయే మార్గాలన్నింటినీ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మూసివేశారు. ఆ మార్గాలకు దూరంగా ఉండవలసిందిగా సావధానపరిచారు. అలాంటి వాటిలో సమాధులు కూడా ఉన్నాయి. సమాధిపూజ, సమాధివారల పట్ల అతిశయిల్లటం మొదలగు విషయాలలో కట్టుదిట్టమయిన నిబంధనలను కూడా నిర్ధారించారు. వాటిలో కొన్ని ఇవి:
1. ఔలియాల, మహనీయుల, సత్పురుషుల యెడల అభిమానంలో మితిమీరి వ్యవహరించటాన్ని గురించి ఆయన హెచ్చరించారు. ఎందుకంటే ఈ మితిమీరటమే (అతివాదమే) క్రమక్రమంగా వారి ఆరాధన వైపు తీసుకుపోతుంది.
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:
“మీరు అభిమానంలో అతిశయిల్లకండి. ఎందుకంటే ఈ అతివాదమే (ఘులూ) మీ పూర్వీకులను అంతమొందించింది.” (అహ్మద్, తిర్మిజీ, ఇబ్నుమాజా-3029 సహీహ్)
వేరొక హదీసులో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తాకీదు చేశారు.
“క్రైస్తవులు మర్యమ్ కుమారుడగు ఈసా (ఏసుక్రీస్తు) అభిమానంలోఅతిశయిల్లి (ఆయన్ని అల్లాహ్ కుమారునిగా చేసి)నట్లుగా మీరు నా విషయంలో అతిశయిల్లకండి (నన్ను నా పరిమితులను దాటనివ్వకండి). నేను అల్లాహ్ దాసుడను. కనుక మీరు నన్ను అల్లాహ్ దాసుడని, ప్రవక్త అనీ అనండి.”(సహీహ్ బుఖారీ)
(2) సమాధులను పటిష్ఠపరచటాన్ని, వాటిపై కట్టడాలను కట్టడాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారించారు. అబుల్ హయాజ్ అల్ అసదీ గారి కథనం ద్వారా మనకు తెలిసేది ఇదే. అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) తనతో ఇలా చెప్పారని ఆయన తెలిపారు –
“దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నన్ను ఏ పనిపై పంపారో ఆ పనిపై నేను మిమ్మల్ని పంపనా? అదేమిటంటే ఏ విగ్రహం కనిపించినా మీరు దానిని పడగొట్టాలి. ఏ సమాధి ఎత్తుగా కనిపించినా మీరు దానిని సమం చేసివేయాలి.”(సహీహ్ ముస్లిం)
(3) సమాధులను పటిష్ఠపరచటాన్ని, వాటిపై నిర్మాణాలు చేయటాన్ని కూడా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారించారు. జాబిర్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు :
“సమాధిని పక్కాగా నిర్మించటాన్ని, దానిపై కూర్చోవటాన్ని, దానిపై కట్టడం కట్టడాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారించారు.” (ముస్లిం)
(4) సమాధుల వద్ద నమాజ్ చేయటాన్ని కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారించారు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ::
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు మరణ సూచనలు ప్రస్ఫుటం అయినపుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ముఖంపై దుప్పటి కప్పుకోసాగారు. ఊపిరాడక పోవటంతో దుప్పటిని తొలగించారు.ఆ స్థితిలోనే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు :
“యూదులపై, క్రైస్తవులపై అల్లాహ్ శాపం పడుగాక! వారు తమ ప్రవక్తల సమాధులనే సాష్టాంగ (సజ్జా) స్థలంగా చేసుకున్నారు.” వారి చర్య గురించి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జనులను సావధానపరిచేవారు. ఈ వ్యవహారంలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంత దృఢంగా ఉండకపోతే, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధిపట్ల కూడా అలాగే చేసేవారేమో!
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంకా ఇలా తాకీదు చేశారు :
“వినండి. మీకు పూర్వం గతించినవారు తమ ప్రవక్తల సమాధులను ఆరాధనా (సజ్దా) స్థలాలుగా చేసుకునేవారు. జాగ్రత్త! మీరు మాత్రం సమాధులను ఆరాధనా స్థలాలుగా చేసుకోకండి. నేను దీని నుండి మిమ్మల్ని వారిస్తున్నాను.”(సహీహ్ ముస్లిం)
సమాధులను ఆరాధనా స్థలాలుగా చేసుకోవటం అంటే భావం అక్కడ మస్జిద్ లేకపోయినప్పటికీ అక్కడ నమాజ్ చేయటం. నమాజ్ కోసం సంకల్పం చేసుకున్న ప్రతి స్థలం సాష్టాంగ ప్రణామ స్థలం – ఆరాధనా స్థలం – అవుతుంది. ఎందుకంటే మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు : –
“నా కొరకు భూమండలమంతా మస్జిద్ (సాష్టాంగ స్థలం)గా, పరిశుద్ధత పొందే స్థలంగా చేయబడింది.”(సహీహ్ బుఖారీ)
కాబట్టి సమాధిపై మస్జిద్ ని నిర్మిస్తే, వ్యవహారం చాలా సంక్లిష్టమైపోతుంది. కాని చాలామంది వారించబడిన ఈ విషయాలను ఉల్లంఘించారు. ఏ ఏ పనులు చేయరాదని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గట్టిగా తాకీదుచేశారో వాటికి ఒడిగట్టారు. తత్కారణంగా వారు పెద్ద తరహా షిర్క్ కు పాల్పడిన వారయ్యారు. వారు సమాధులపై మస్జిదులను, విశ్రాంతి స్థలాలను నిర్మించారు. సమాధులను సందర్శనా క్షేత్రాలుగా తీర్చిదిద్దారు. పెద్ద తరహా షిర్క్ (షిర్కె అక్బర్) గా పరిగణించబడే పనులన్నీ అక్కడ యధేచ్ఛగా జరుగుతాయి. ఉదాహరణకు : జంతువులను బలి ఇవ్వటం, సమాధిలో ఉన్న మృతుల ముందు చేయిచాచి అర్థించటం, ఫిర్యాదులు చేసుకోవటం, మొక్కుకోవటం, మొక్కుబడులు చెల్లించటం, నజరానాలు సమర్పించటం ఇత్యాదివి.
అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు : “ఏ వ్యక్తి అయినా సమాధుల గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి విధానాన్ని, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశాలను, నిషేధాజ్ఞలను, వాటికి ప్రవక్త సహచరులు (రదియల్లాహు అన్హుమ్) కట్టుబడిన తీరును అధ్యయనం చేసి, అదే సమయంలో నేటి ప్రజలలో చాలామంది (అంటే ఇబ్నుల్ ఖయ్యిమ్ గారి సమకాలికులు) అవలంబిస్తున్న పోకడల్ని పోల్చిచూసుకుంటే ఆ రెండు వర్గాల మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. వారి మధ్య అసలు పొంతనే కనిపించదు. ఎందుకంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధుల వద్ద నమాజ్ చేయరాదని తాకీదు చేశారు. కాని వీళ్ళు అక్కడ నమాజ్ చేస్తున్నారు. సమాధులను ఆరాధనా స్థలాలుగా చేసుకోవటాన్ని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారించారు. కాని వీళ్ళు సమాధిపై ఆరాధనా కట్టడం నిర్మిస్తున్నారు. దేవుని ఆరాధనా స్థలాలను పోలిన కట్టడాలను నిర్మించి వాటికి ‘దర్గాహ్’ అని నామకరణం చేస్తున్నారు. సమాధులపై దీపాలంకరణ చేయటాన్ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారించగా, వీళ్ళేమో దీపాలు వెలిగిస్తూ ఉండటానికి ఆస్తులను వక్ఫ్ చేస్తున్నారు. సమాధులను ఉత్సవ స్థలాలుగా చేయరాదని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాకీదు చేశారు. కాని ఈ మహానుభావులు సమాధులను ఉత్సవాలకు, ఉరుసులకు, మేళాలకు ప్రత్యేకించుకుని సంబరాలు జరుపుకుంటున్నారు.
సమాధులను (నేలకు) సమంగా చేయమని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆజ్ఞాపించి నట్లుగా ఇమామ్ ముస్లిం తన ప్రామాణిక గ్రంథంలో పొందుపరిచారు. అబుల్ హయాజుల్ అసదీ కథనం : అలీ బిన్ అలీ తాలిబ్ (రదియల్లాహు అన్హు)తనతో ఇలా అన్నట్లు ఆయన తెలిపారు:
“దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నన్ను ఏ పనిపై పంపారో, ఆ పనిపై నేను మిమ్మల్ని పంపనా!? అదేమంటే ఏ విగ్రహం కనిపించినా దానిని రూపుమాపాలి. ఏ సమాధి ఎత్తుగా ఉన్నట్లు కనిపించినా దానినినేలమట్టం చేయాలి.” (సహీహ్ ముస్లిం)
సహీహ్ ముస్లింలోనే సుమామ బిన్ షుఫా కథనం ఇలా ఉంది : “మేము ఫుజాలా బిన్ ఉబైద్ (రదియల్లాహు అన్హు) వెంట రోము రాజ్యంలో ‘రూడ్స్’ అనే ప్రదేశంలో ఉండగా మా సహవాసుల్లో ఒక వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి సమాధిని భూమికి సమంగా చేయమని ఫుజాలా (రదియల్లాహు అన్హు) ఆజ్ఞాపిస్తూ ఇలా అన్నారు : “సమాధులను నేలకు సమంగా ఉంచమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆజ్ఞాపించటం నేను స్వయంగా విన్నాను.”
కాని వీళ్లు ఈ రెండు హదీసులను వ్యతిరేకిస్తూ, అతిగా ప్రవర్తిస్తున్నారు. తమ నివాస గృహాల మాదిరిగా సమాధులను కూడా బాగా ఎత్తుగా నిర్మిస్తున్నారు. వాటిపై డోములు అమర్చుతున్నారు.
అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ఇంకా ఇలా అంటున్నారు : సమాధులకు సంబంధించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏఏ ఆదేశాలిచ్చారో, మరే నిషేధాజ్ఞలు జారీ చేశారో వాటి వెలుగులో చూస్తే, ఈ సమాధి పూజారులు కల్పించుకున్న విధానాలకు – ప్రవక్త విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. వీళ్ల పోకడలో ఉన్న అరిష్టాలను లెక్కించటం మనిషి తరం కాదు.
తరువాత ఆయన ఈ అనర్థదాయక విషయాలను గురించి చెబుతూ ఇలా అన్నారు: సమాధుల సందర్శన సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏ ఏ విషయాలను అనుమతించారో కాస్త చూడాలి. సమాధుల సందర్శనలోని ముఖ్య ఉద్దేశం పరలోకాన్ని స్మరించుకోవటం! సమాధిలో ఉన్న మృతుని మన్నింపునకై దైవాన్ని వేడుకోవటం!! అతనిపై కరుణించమని, అతని యెడల ఉదారంగా వ్యవహరించమని ప్రార్థించటం!!! ఈ విధంగా గనక చేస్తే అటు మృతునికి మేలు చేసినట్లవుతుంది, ఇటు తన స్వయానికి కూడా మేలు చేకూర్చుకున్నట్లవుతుంది. కాని ఈ ముష్రికులు వ్యవహారాన్నంతటినీ తలక్రిందులు చేసేశారు. ధర్మాన్ని తలక్రిందులు చేసివేశారు. వీళ్ళ సమాధి సందర్శన ఉద్దేశం మృతుణ్ణి దైవానికి భాగస్వామిగా నిలబెట్టడమై ఉంటుంది. మృతుని ముందు వేడుకోవటం, మృతుని ద్వారా దైవాన్ని వేడుకోవటం, మృతుని వాస్తాతో శుభాలు కురిపించమని ప్రార్థించటం, శత్రువులకు వ్యతిరేకంగా తోడ్పడమని మృతుల ద్వారా విజ్ఞాపన చేసుకోవటం అయి ఉంటుంది. ఈ విధంగా వారు తమ ఆత్మకు అన్యాయం చేసుకోవటమే గాక, మృతునికి కూడా హాని కలిగించేందుకు ప్రయత్నించారు. ఇలా చేయటం వల్ల వారికి అసలుకే నష్టం కలుగుతుంది. మృతుని మన్నింపుకోసం, కారుణ్యం కోసం దుఆ చేయమని అల్లాహ్ సూచించాడు. ఈ సూచనను ఉల్లంఘించినందువల్ల కలగవలసిన శుభం కూడా కలగకుండా పోతుంది. (ఇఘ్ ఆసతుల్ లహ్ ఫాన్ : 1/414, 415, 417)
దీనిద్వారా స్పష్టమయ్యేదేమిటంటే దర్గాల వద్ద మొక్కుకోవటం, మొక్కుబడులు సమర్పించుకోవటం షిర్కె అక్బర్ (పెద్ద షిర్క్). ఎందుకంటే ఇది సమాధుల విషయంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేసిన ఆజ్ఞకు పూర్తిగా విరుద్ధం. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశానుసారం సమాధుల వద్ద కట్టడం గానీ, మస్జిద్ గానీ నిర్మించకూడు. నిర్మాణాలు గనక జరిగితే, అజ్ఞానులు దానికి పవిత్రతను ఆపాదించే అవకాశముంటుంది. సమాధులలో ఉన్న మృతులకు, లాభనష్టాలు చేకూర్చే శక్తి ఉందని వారు ఊహిస్తారు. అక్కరలు తీరుస్తారని నమ్ముతారు. అందుకే వారు సమాధులను అలంకరించటం, దుప్పట్లను కప్పటం, మొక్కుబడులు సమర్పించటం మొదలెడతారు. ఆ విధంగానే ఆ సమాధులు విగ్రహారాధనా కేంద్రాలైనాయి. జనులు నిజదైవాన్ని వదలి విగ్రహపూజ చేయసాగారు. నిజానికి అంతిమ దైవప్రవక్త ఈ విషయమై ఎంతో ఆర్ద్రంగా ఇలా వేడుకున్నారు : –
“అల్లాహ్! నా సమాధిని ప్రజలు పూజించే విగ్రహంగా మార్చకు.” (మాలిక్-376, అహ్మద్-7054)
ముస్లిం సముదాయంలో సమాధుల పట్ల ఈ విధమైన వ్యవహారం జరగనున్నదని పసిగట్టి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రార్థించారు. అనేక ముస్లిం దేశాలలో ఈ పరిస్థితి ఎదురయింది కూడా. కాని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ప్రార్థనా శుభం వల్ల అల్లాహ్ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధిని ఇలాంటి అపచారాల నుండి సురక్షితంగా ఉంచాడు. కొంతమంది అజ్ఞానులు, అవివేకులు ఇప్పటికీ ఆయన మస్జిద్ (మస్జిదె నబవీ)లో ఆజ్ఞ ఉల్లంఘనకు పాల్పడుతూ ఉంటారు. కాని వారు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి సమాధి వరకూ చేరుకోలేరు. ఎందుకంటే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి మస్జిద్ లో లేదు, అది ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్వగృహంలో ఉంది. దానికి నలువైపులా ఎత్తయిన గోడలు నిర్మితమై ఉన్నాయి. ఆ విషయమే అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ఒక పద్యంలో ఇలా చెప్పారు :
“లోకేశ్వరుడు మీ మొరను ఆలకించాడు. దానిని (మీ సమాధిని) మూడు గోడలతో దిగ్బంధం చేశాడు.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అబూ మాలిక్ అష్ అరి (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు:
“నా అనుచర సంఘంలోనివారు జాహిలియ్యత్ (అజ్ఞాన కాలాని)కి సంబంధించిన నాలుగు విషయాలను విడనాడరు.
(1) వంశంపై గర్వపడుట.
(2) ఇతర వంశాలను దూషించుట.
(3) నక్షత్రాల ప్రభావంతో వర్షం కురుస్తుందని తారాబలాన్ని నమ్ముట.
(4) శోకము చేయుట“.
ఇంకా ఇలా చెప్పారు: “శోకము చేయు స్త్రీ తౌబాచేయకుండా చనిపోతే ప్రళయదినాన లేపబడినప్పుడు ఆమెపై తార్ కోల్ (Tar coal) పైజామా, చిడుము (ఖారిష్) వ్యాధికి గురి చేసే కవచము ఉండును“.
జైద్ బిన్ ఖాలిద్ అల్ జుహ్నీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: హుదైబియ ప్రాంతములో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాకు ఫజర్ నమాజ్ చదివించారు. ఆ గడిచిన రాత్రి వర్షం కురిసింది. నమాజ్ అయిన తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల వైపు తిరిగి “మీ ప్రభువు ఏం సెలవిచ్చాడో మీకు తెలుసా?” అని అడిగారు. ‘అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు, మాకు తెలియదు’ అని అన్నాము. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), అల్లాహ్ ఇలా చెప్పాడని తెలిపారు: “ఈ రోజు ఉదయం నా దాసుల్లో కొందరు విశ్వాసులయిపోయారు, మరికొందరు అవిశ్వాసులయ్యారు. అల్లాహ్ దయ వల్ల మనకు వర్షం కురిసింది” అన్నవారు తారాబలాన్ని నిరాకరించి, నన్ను విశ్వసించిన వారయ్యారు. దీనికి భిన్నంగా ఫలానా నక్షత్ర ప్రభావంతో వర్షం కురిసిందని అన్నవారు నక్షత్ర విశ్వాసులయి, నన్ను తిరస్కరించిన వారయ్యారు”. (బుఖారి, ముస్లిం).
ఇలాంటి హదీసు ఇబ్ను అబ్బాసు (రదియల్లాహు అన్హు) కూడా ఉల్లేఖించారు. అందులో ఇంకా ఈ విషయం ఉంది. అందులో కొందరున్నారు: ఫలాన, ఫలాన నక్షత్ర (ప్రభావం) నిజమయింది (అందుకే వర్షం కురిసింది). అప్పుడు అల్లాహ్ ఈ ఆయతులు అవతరింపజేసాడు;
“నక్షత్రాల స్థానాలు సాక్షిగా చెబుతున్నాను: మీరు తెలుసుకుంటే, ఇది చాలా పెద్ద ప్రమాణం: ఇది ఒక మహోన్నతమైన ఖురాన్; ఒక సురక్షితమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది. దానిని పరిశుద్ధులు తప్ప మరెవరూ తాకలేరు. ఇది సకల లోకాల ప్రభువు అవతరింపజేసినటు వంటిది. అయినా మీరు ఈ వాణిని తేలిక విషయంగా తీసుకుంటారా? అల్లాహ్ మీకొసంగిన ఉపాధిని, ఆయన్ని తిరస్కరించుటకు ఉపయోగిస్తు న్నారా?”(వాఖిఅ 56: 75-82).
ముఖ్యాంశాలు:
1. సూరె వాఖిల ఆయతు యొక్క భావం.
2. జాహిలియ్యత్ (అజ్ఞాన కాలం)కు సంబంధించిన నాలుగు విషయాల ప్రస్తావన.
3. అందులో కొన్ని అవిశ్వాసం, తిరస్కారమునకు సంబంధించినవి.
4. తిరస్కారంలో కొన్ని రకాలు ధర్మభ్రష్టతకు కారణము కావు.
5.”నా దాసుల్లో కొందరు నన్ను విశ్వసించువారు, మరికొందరు నన్ను తిరస్కరించువారయ్యారు” అన్నది అల్లాహ్ కారుణ్యమైన వర్షం కురిసినప్పటి సంగతి.
6. ఇక్కడ విశ్వాసం యొక్క వాస్తవికతను గమనించాలి. (అల్లాహ్ కరుణ, దయ వలన అని చెబితే విశ్వాసం).
7. అవిశ్వాసం యొక్క వాస్తవికతనూ గమనించాలి. (ఫలాన, ఫలాన నక్షత్ర ప్రభావం అని చెప్పితే అది అవిశ్వాసం).
8. నక్షత్రం నిజమయింది అనుట కూడా అవిశ్వాసం గనుక దానిని గమనించాలి.
9. శిష్యులకు విషయం బాగుగా అర్థం కావడానికి ప్రశ్నించి మరీ జవాబు చెప్పాలి అని “మీ ప్రభువు ఏమన్నాడో మీకు తెలుసా?” అన్న వాక్యంలో తెలుస్తుంది.
10. శోకము చేసేవారికి ప్రళయము నుండే శిక్ష మొదలవుతుంది.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
అనుగ్రహించువాడు, కష్టాలు తొలగించువాడు అల్లాహ్ మాత్రమేనని మనసా వాచా విశ్వసించి, వాటిని ఆయన విధేయత కొరకే ఉపయోగించుట తౌహీద్ అయినప్పుడు, “ఫలాన నక్షత్రం వలన వర్షం కురిసింది” అనుట ఆ తౌహీద్ విశ్వాసానికి చాలా విరుద్ధం. వర్షమూ, ఇతర వరాలు అల్లాహ్ యే ఇచ్చువాడనుట తప్పనిసరి. ఆయనే వాటిని తన దాసులకు ప్రసాదించాడు కనుక.
వర్షం కురువటానికి నక్షత్రాలు ఏ విధంగానూ కారణం కాజాలవు. అల్లాహ్ యొక్క దయ, కరుణా కటాక్షముల వలన, మానవుల అవసరము, వారు తమ వాజ్మూలిక, స్థితి భాషలో తమ ప్రభువుతో వేడుకొనుట ద్వారా అల్లాహ్ వారి అవసరాలను బట్టి తన వివేకము, కరుణతో వర్షం కురిపిస్తాడు.
మానవుడు తనపై, సర్వ సృష్టిపై ఉన్న అల్లాహ్ యొక్క బాహ్యాంతర సర్వ వరాలను విశ్వసించనంత వరకు అతని తౌహీద్ సంపూర్ణం కాదు. అనుగ్రహాలన్నిటిని అల్లాహ్ కు అంకితం చేయాలి. ఆయన్ను ఆరాధిస్తున్నప్పుడు, స్మరిస్తున్నప్పుడు, కృతజ్ఞత తెలుపుతున్నప్పుడు వాటి సహాయము, ఆధారము తీసుకోవాలి.
ఇలాంటి సందర్భములలోనే తౌహీద్ వాస్తవికత తెలుస్తుంది. దీనితోనే విశ్వాసం యొక్క పరిపూర్ణత మరియు కొరతా తెలుస్తుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి, స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి, “నేను మీ ప్రభువును కానా?” అని అడిగినప్పుడు “ఎందుకు కావు? (నువ్వే మా ప్రభువువి). ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం” అని వారు చెప్పారు. ‘దీని గురించి మాకేమీ తెలియదు’ అని ప్రళయ దినాన మీరు అనకుండా ఉండటానికీ * లేదా “మొదట్లో మా పూర్వీకులు షిర్కుకు పాల్పడ్డారు. మేము వారి తరువాతివారి సంతతిలో పుట్టినవారము. ఆ దుర్జనులు చేసిన పాపానికి నువ్వు మమ్మల్ని వినాశానికి గురిచేస్తావా?!” అని మీరు అనకుండా ఉండటానికిగాను (మేము ముందే మీ నుండి ఈ విధంగా ఖరారు చేయించాము.) * వారు (బహుదైవారాధన నుండి ఏకదైవారాధన వైపుకు) మరలివస్తారేమోనని మేము ఈ విధంగా ఆయతులను విడమరచి చెబుతున్నాము.
సహీ ముస్లిం 2865లో ఉంది, ఇయాజ్ బిన్ హిమార్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: అల్లాహ్ ఇలా తెలిపాడని: “నేను నా దాసులను ముస్లిములుగా, సత్యాన్ని స్వీకరించి బహుదైవత్వాలకు దూరంగా ఉండేవారిగా పుట్టించాను, కాని షైతానులు వారి వద్దకు వచ్చి వారిని సత్యధర్మం నుండి దూరం చేశారు, నేను వారి కొరకు హరాం (నిషిద్ధం) చేసిన దానిని హరాం చేశారు”.
అనస్ బిన్ మాలిక్ ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “అల్లాహ్ ప్రళయదినాన అతితక్కువ నరక శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిని అల్లాహ్ అడుగుతాడు: భూమిలో ఉన్న సమస్తం నీదై ఉంటే దానిని పరిహారంగా చెల్లించి నరకం నుండి రక్షణ పొందాలనుకుంటున్నావా? అతడు అవును అని అంటాడు, అప్పుడు అల్లాహ్ అంటాడు: నీవు ఆదం వీపులో ఉండగానే నేను నీతో దీనికంటే ఎంతో తేలికైన విషయం ఒకటి కోరాను: నీవు నాతో పాటు ఎవ్వరినీ భాగస్వామిగా చేయకు అని, కాని నీవు తిరస్కరించావు, నాకు భాగస్వాములకు నిలబెట్టావు”.
2) జ్యోతిష్యుని వద్దకు వెళ్లి సమాచారం అడిగేవాని ఎన్ని రోజుల నమాజ్ స్వీకరించబడదు?
C) 40 రోజుల
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారని సఫియ్య (రజియల్లాహు అన్హా) ప్రవక్తగారి ఒక భార్య ద్వారా ఉల్లేఖించారు:
“ఎవరైనా జ్యోతిష్యుని వద్దకు వచ్చి దేని గురించైనా అతన్ని ప్రశ్నిస్తే అతని నలబై రోజుల నమాజు స్వీకరించబడదు”. (ముస్లిం పదాలు 2230).
ఇది మనుషుల రూపంలో ఉన్నవారి వద్దకు వెళ్ళి అడగడం వరకే పరిమితం కాదు. ఈ రోజుల్లో కొందరు తమ జాతకలు తెలుసుకోడానికి టీవిలలో కొన్ని ప్రోగ్రామ్స్ ఫాలో అవుతుంటారు. మరి కొందరు స్మార్ట్ ఫోన్లో వచ్చిన ఆప్స్ లను ఫాలో అవుతారు
గుర్తుంచుకోండి:
వెబ్ సైట్లోకెల్లి జాతకం గురంచి వెతకడం కూడా ఈ హదీసులో వస్తుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి
మరో ముఖ్య విషయం: 40 రోజుల నమాజు అంగీకరింపబడదని అంటే వాటి పుణ్యం లభించదని భావం, కాని చేయకుండా ఉంటే అది మరింత ఘోరమైన పాపం అవుతుంది.
3) జనాజ నమాజ్ చేసి దానివెంట వెళ్లి ఖననం అయ్యేవరకు పాల్గొంటే ఎన్ని ఖిరాతుల పుణ్యం దొరుకుతుంది?
C) 02 ఖిరాతులు
జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం
గొప్ప పుణ్య కార్యాల్లో ఒకటి; జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం, దానిపై లభించే పుణ్యం బరువు మానవుని త్రాసులో ఉహద్ పర్వతం కంటే అధికిమించి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉబై బిన్ కఅబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
“ఎవరు నమాజు మరియు (ఖననం) అయ్యే వరకు జానాజ వెంట ఉంటాడో అతనికి రెండు ఖీరాతులు, మరెవరయితే కేవలం నమాజు అయ్యే వరకు దాని వెంట ఉంటాడో అతనికి ఒక ఖీరాతు లభిస్తుంది. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన (అంటే అల్లాహ్) సాక్షి! ఒక్క ఖీరాత్ బరువు అల్లాహ్ వద్ద ఉన్న త్రాసులో ఉహద్ పర్వతంకంటే ఎక్కువ ఉండును”. (అహ్మద్ 5/ 131 ఇది సహీ హదీస్).
ప్రవక్త ﷺ తెలిపారని, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు;
“ఎవరు జనాజలో పాల్గొని నమాజు చేస్తాడో అతనికి ఒక ఖీరాత్, మరెవరయితే (నమాజు మరియు) ఖననం అయ్యే వరకు పాల్గొంటాడో అతనికి రెండు ఖీరాతులు లభించును”. రెండు ఖీరాతులంటే ఏమిటి? అని ప్రశ్న వచ్చినప్పుడు, ప్రవక్త చెప్పారు: “రెండు పెద్ద కొండల వంటివి”. (బుఖారి 1325, ముస్లిం 945, తిర్మిజి 1040, నిసాయి 1940, ఇబ్ను మాజ 1539, అహ్మద్ 2/ 401, ఇబ్ను హిబ్బాన్ 3080)
ముస్లింలో ఉంది; ఇబ్ను ఉమర్ (రజియల్లాహు అన్హు) జనాజ నమాజు చేసుకొని వెళ్ళేవారు, ఎప్పుడయితే వారికి అబూహురైరా (రజియల్లాహు అన్హు) గారి ఈ హదీసు చేరిందో ‘వాస్తవానికి మనం అనేక ఖీరాతులు పోగుట్టుకున్నాము’ అని బాధ పడ్డారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ ఆదేశం: “గ్రంథజ్ఞానంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని నీవు చూడలేదా? వారి పరిస్థితి ఎలా వుందంటే, వారు “జిబ్త్ “ను “తాగూత్” ను నమ్ముతారు.” (నిసా 4:51).
మరో ఆదేశం: “అల్లాహ్ వద్ద ఎవరి ముగింపు అవిధేయుల ముగింపు కంటే కూడా హీనతరంగా ఉంటుందో వారిని గురించి తెలియజేయనా? వారు అల్లాహ్ శాపగ్రస్తులు. వారిపై ఆయన ఆగ్రహం విరుచుకు పడింది. వారు కోతులుగా, పందులుగా చెయ్యబడ్డారు. వారు తాగూత్ దాస్యం చేశారు.” (మాఇద 5:60).
మరో చోట: “కాని ఈ వ్యవహారంలో పై చేయిగా ఉన్నవారు, “మేము వారిమీద ఒక ఆరాధనా మందిరాన్ని నిర్మిస్తాము” అని అన్నారు.” (కహఫ్ 18:21).
అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు:
“మీరు తప్పకుండా పూర్వీకుల (అంటే గత మతస్థుల) జీవన విధానాలను బాణం, బాణంకు సమానం ఉన్నట్లు అనుసరిస్తారు. చివరికి వారు ఉడుము కన్నంలోకి దూరితే, వారి వెంట మీరు కూడా అందులోకి దూరుతారు”. సహచరులు ఈ మాట విని దైవప్రవక్తా! “ఏమిటీ మేము యూదుల్ని, క్రైస్తవుల్ని అనుసరిస్తామా?” అని అడిగారు (ఆశ్చర్యంతో). దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం): “మరి ఎవరు అనుకుంటుకున్నారు?” అని అన్నారు.(బుఖారి, ముస్లిం).
సౌబాన్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు:
“అల్లాహ్ నా కొరకు భూమిని చుట్టి దగ్గరికి చేశాడు. నేను దాని తూర్పు పడమర అంతా చూశాను. నా ఎదుట చుట్టబడిన భూమి అంతటిలో నా అనుచర సంఘం చేరుకుంటుంది. నాకు ఎర్రని, తెల్లని రెండు ధన భండారాలు ఇవ్వబడినవి. నేను నా ప్రభువుతో ఇలా వేడుకున్నాను: “నా అనుచర సంఘాన్ని అనావృష్టి (ఖహత్) ద్వారా నశింపజేయకు. వారిపై గెలిచి, వారిని అణచివేసే ముస్లిమేతరులైన శత్రువులకు వారిపై విజయం ప్రసాదించకు”. అప్పుడు నా ప్రభువు అన్నాడు: “వారిని అనావృష్టితో నశింపజేయను. ముస్లిమేతరులైన శత్రవులకు వారిపై ఆధిపత్యం ఇవ్వను. వారంతా ఏకమై వచ్చినప్పటికీ. ఇది వారిలో ఒకడు మరొకడ్ని నాశనం జేసి, ఖైదీలుగా చేయకుండా అందరు ఏకమై ఉన్నంత వరకు”. (ముస్లిం).
ఇదే హదీసును బర్ ఖాని ఉల్లేఖించారు, అందులో ఇంకా ఇలా వుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు:
“నేను నా అనుచర సంఘం పట్ల వారిలోని దుర్మార్గులైన నాయకులు, పండితులతో భయపడుతున్నాను. వారిపై ఒకసారి కత్తి పడిందంటే ప్రళయం వరకు లేపబడదు. నా అనుచర సంఘంలోని ఒక చిన్న సమూహం ముష్రికులతో కలువని వరకు, మరొక సమూహం విగ్రహాలను పూజించని వరకు ప్రళయం సంభవించదు. నా అనుచర సంఘంలో 30 అసత్యవాదులు వస్తారు. వారిలో ప్రతి ఒక్కడు తనే ప్రవక్త అని అరోపణ చేస్తాడు. నేను చిట్టచివరి ప్రవక్తని. నా తరువాత ఏ ప్రవక్త రాడు. ఎల్లకాలం, ఎల్లవేళల్లో సత్యం, ధర్మంపై ఒక సంఘము ఉండే ఉంటుంది. వారికి దైవ సహాయం లభిస్తూనే ఉంటుంది. ఆ సంఘాన్ని వదలి వెళ్ళినవాడు దానిని ఏ మాత్రం హాని కలిగించలేడు. చివరికి ప్రళయం సంభవిస్తుంది”.
ముఖ్యాంశాలు:
1. సూరె నిసా ఆయతు భావం.
2. సూరె మాఇద ఆయతు భావం.
3. సూరె కహఫ్ ఆయతు భావం.
4. ఇది చాలా ముఖ్య విషయం : ఇందులో జిబ్త్, తాగూత్ పై విశ్వాసం అంటే ఏమిటి? అది హృదయాంతర విశ్వాసమా? లేక అది మిథ్యం , అసత్యం అని తెలిసి, దానితో ప్రేమ, ఇష్టం లేనప్పటికి కేవలం దాన్ని అనుసరించిన వారితో సంబంధమా?
5. అవిశ్వాసుల అవిశ్వాసం తెలిసి కూడా వారు విశ్వాసులకన్నా ఉత్తమమైన మార్గంపై ఉన్నారన్న యూదుల మాట కూడా తెలిసింది.
6. ఒక ముఖ్య విషయం అది ఈ అధ్యాయంలో ఉద్దేశించినది. అది అబూ సఈద్ హదీసులో వచ్చినది; ప్రవక్త అనుచర సంఘంలో కొంత మంది గత మతస్తులను అనుసరిస్తారు.
7. వీరిలో కొంత మంది విగ్రహ పూజారులు అవుతారు.
8. విచిత్రమైన విషయం : ప్రవక్తలు అని ప్రకటన చేసేవారు వస్తారు. ఉదా: ముఖ్తార్ అబూ ఉబైద్ సఖఫీ. అతడు “లా ఇలాహ ఇల్లల్లాహ్”ను చదివి, ప్రవక్త అనుచర సంఘంలోనివాడయి, ముహమ్మద్ ప్రవక్తను సత్యప్రవక్త, చివరి ప్రవక్త అని, ఖుర్ఆన్ సత్యం అని నమ్మి కూడా వాటికి వ్యెతిరేకించి తానే ప్రవక్త అని ప్రకటించుకున్నాడు. అతడు ప్రవక్త సహచరుల చివరి జీవితకాలంలో పుట్టినవాడు. అతన్ని చాలా మంది అనుసరించారు.
9. ఇంతకు ముందు కాలంలో జరిగినట్లు ఇస్లాం ధర్మం నశించిపోదు. ఎల్లప్పుడు దానిని అనుసరించేవారు కొందరు ఉంటారు అన్న శుభవార్త ఉంది.
10. వారు సంఖ్యలో అల్పులయినప్పటికీ వారిని విడనాడినవాడు, వ్యెతిరేకించినవాడు వారికి ఏ హానీ కలిగించలేడు అన్న గొప్ప సూచన ఉంది.
11. ఇది ప్రళయము వరకు ఉండును.
12. ఇందులో ఉన్న గొప్ప సూచనలు:
అల్లాహ్, ప్రవక్తకు తూర్పు, పడమర వరకు ఉన్న భూమిని దగ్గరికి చేశాడు. ప్రవక్త ఈ దాని గురించి తెలిపిన విషయం నిజమయింది. (అంటే తూర్పు, పడమరలో ఇస్లాం వ్యాపించింది). ఉత్తరం, దక్షిణం గురించి ఇలా ఏమి తెలుపలేదు.
రెండు ధనభండారాలు లభించాయి అని తెలిపారు.
ప్రవక్త చేసిన రెండు దుఆలు అల్లాహ్ స్వీకరించాడు.
పరస్పర యుద్ధాలకు, వినాశనాలకు గురికాకూడదు అన్న మూడవ దుఆ అల్లాహ్ స్వీకరించలేదు.
వారి పై కత్తి నడిచిందంటే అగదు అన్నది కూడా సత్యమైంది.
పరస్పరం హత్యయత్నాలు, ఖైదీలు చేయడం జరుగతుంది అన్న విషయం తెలిసింది.
అనుచర సంఘం పై భ్రష్టనాయకుల, పండితుల (మౌల్వీల) భయం ఉంది అని తెలిపారు.
వీరిలో తానే ప్రవక్త అని ఆరోపించేవారు వస్తారు అన్న సూచన ఉంది.
అల్లాహ్ సహాయం పొందే ఒక సమూహం ధర్మం వైపు ఎల్లప్పుడూ ఉంటుందన్న శుభవార్త ఇచ్చారు. ప్రవక్త తెలిపిన పై సూచనలు మన బుద్ధిజ్ఞానంతో ఆలోచిస్తే అసంభవం అని అంటామేమో, కాని అవి పూర్తిగా నిజమైనాయి.
13. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచర సంఘం పట్ల భయం మార్గభ్రష్టులైన పండితులతో మాత్రమే ఉంది అని తెలిపారు.
14. విగ్రహ పూజ యొక్క భావాన్ని వివరించారు. (అది అల్లాహ్ యేతరులకు రుకూ, సజా చేయడమే కాదు. వారు హలాల్ చేసినదాన్ని హలాల్, హరాం చేసినదాన్ని హరాంగా నమ్ముట కూడా).
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం ముస్లిం సంఘంలో సంభవించిన షిర్క్ నుండి హెచ్చరించడం. ఇది ముస్లిం సమాజంలో వ్యాపించింది. అదే విధంగా “లాఇలాహ ఇల్లల్లాహ్” నోటితో పలికి, తనకు తాను ముస్లిం అని చాటుకున్న వ్యక్తి, దానికి వ్యెతిరేకమున్న: సమాధిలో ఉన్నవారితో దుఆ, మొరపెట్టు కొనుట లాంటి పనులు చేసి, దానికి వసీల అన్న పేరు పెడితే అతని తౌహీద్ లో ఏలాంటి తేడా ఉండదు అని అన్నవారి ఖండన కూడా ఇందులో ఉంది.
“వసన్” అంటే: అల్లాహ్ తప్ప పూజింపబడే వారు. అందులో పూజింపబడే చెట్లు, రాళ్ళు (సమాధులపై ఉన్న) నిర్మాణాలు. ఇంకా ప్రవక్తలు, పుణ్యాత్ములు,దుష్టులు అన్నీ వస్తాయి. ఇబాదత్ కేవలం అల్లాహ్ హక్కు. అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయువాడు, లేక వారిని ఆరాధించేవాడు, వారిని “వసన్” (విగ్రహంగా, ఆరాధ్యదైవంగా) చేసుకున్నవాడయ్యాడు. అందువల్ల అతను ఇస్లాం నుండి దూరమవుతాడు. తనకు తాను ముస్లిం అని చెప్పుకున్నా లాభం లేదు. తమను తాము ఇస్లాం వైపుకు అంకితం చేసుకున్న అవిశ్వాసులు, నాస్తికవాదులు, తిరస్కారులు, కపట విశ్వాసులు (మునాఫిఖులు) ఎంత మంది లేరు. వాస్తవ ధర్మంతోనే స్వఛ్చమైన విశ్వాసుడు అనబడును. కేవలం పేరుతో, పదాలతో కాదు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
16 వ అధ్యాయం అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
అల్లాహ్ ఆదేశం: (చివరకు దైవదూతల హృదయాల నుండి భయం తొలగిపోయినపుడు, వారు “మీ ప్రభువు ఏమని పలికాడు?” అని అడుగుతారు. వారు, “సత్యం పలికాడు”, ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడు అని అంటారు). (సబా 34:23).
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పారు:
“అల్లాహ్ ఆకాశంలో ఒక ఆదేశం జారి చేసినప్పుడు, ఆయన ఆజ్ఞకు (విధేయులై) దైవదూతలు తమ రెక్కలు కొడుతారు. దాని శబ్దం కొండరాతిపై గొలుసుతో కొట్టినట్లు ఉంటుంది. ఆయన ఆదేశం వారి వరకు చేరుతుంది. చివరకు వారి హృదయాల నుండి భయం తొలగిపోయినప్పుడు, వారు “మీ ప్రభువు ఏమని పలికాడు?” అని అడుగుతారు. వారు, “సత్యం పలికాడు”, ఆయన మహెూన్నతుడు, మహిమాన్వితుడు అని చెబుతారు. ఈ మాటను దొంగలించడానికి షైతాన్ వింటూ ఉంటాడు. షైతానులు ఒకరిపై ఒకరు ఇలా ఉంటారు అని (ఈ హదీసు ఉల్లేఖించేవారిలో ఒకరు) సుఫ్యాన్ బిన్ ఉమయ్య నా తమ అరచేతిని వంచి వ్రేళ్ళ మధ్య వ్యత్యాసముంచి వివరించారు. ఆ షైతాన్ ఒక్క మాట విని, అతని క్రింద ఉన్న షైతాన్ కు ఇస్తాడు. ఇలా ప్రతి ఒకడు తన క్రిందివానికి ఇస్తూ చివరివాడు మాంత్రికునికి, లేక జ్యోతిష్యునికి ఇస్తాడు. ఒకప్పుడు ఆ మాట క్రిందికి చేరక ముందే (అల్లాహ్ ఆకాశంలో నియమించిన) అగ్ని జ్వాల అతడ్ని పట్టుకొని (కాల్చేస్తుంది). ఒకప్పుడు ఆ అగ్నిజ్వాల పట్టుకోక ముందే ఆ మాటను అతడు పంపేస్తాడు. ఆ ఒక్క మాటలో మాంత్రికుడు, లేక జ్యోతిష్యుడు వంద అబద్దాలు కలిపి (ప్రజలకు చెబుతాడు). అతడు చెప్పింది నిజమయేదుంటే, ప్రజలు అతను (మాంత్రికుడు, జ్యోతిష్యుడు) అలా, అలా చెప్పలేదా అని అనుకుంటారు. కాని అందులో నిజమయేది ఆ ఆకాశం నుండి విన్న ఒక్క మాటే”. (బుఖారి).
నవాసుబ్ను సమ్ ఆన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
“అల్లాహ్ ఒక విషయం వహీ (దివ్య సందేశం) పంపాలని కోరినప్పుడు వహీ ద్వారా మాట్లాడుతాడు. అప్పుడు అల్లాహ్ భయంతో ఆకాశాలు కంపించిపోతాయి. ఆకాశవాసులు ఇది విన్నప్పుడు సొమ్మసిల్లి, సజ్దాలో పడిపోతారు. మొట్ట మొదట వారిలో జిబ్రీల్ తలెత్తుతారు. అల్లాహ్ తాను కోరింది వహీ ద్వారా అతనితో మాట్లాడుతాడు. తరువాత జిబ్రీల్ దైవదూతల ముందు వెళ్తారు. ప్రతీ ఆకాశం నుండి వెళ్తున్నప్పుడు ఆ ఆకాశ దైవదూతలు మీ ప్రభువు ఏమన్నాడు? అని అడుగుతారు. “సత్యం పలికాడు. ఆయన మహెన్నతుడు, మహిమాన్వితుడు” అని అతడంటాడు. వారందరు జిబ్రీల్ అన్నట్లు అంటారు. తరువాత జిబ్రీల్ ఆ విషయాన్ని ఎక్కడ చేరవేయాలని అల్లాహ్ చెప్పాడో అక్కడికి చేరవేస్తారు”.
ముఖ్యాంశాలు:
1. ఖుర్ ఆన్ ఆయతు యొక్క భావం (అల్లాహ్ వహీ చేసినప్పుడు దైవ దూతల భయ కంపనాల వివరణ ఉంది).
2. ఇందులో షిర్క్ కు విరుద్ధంగా బలమైన ఋజువు ఉంది. ప్రత్యేకంగా పుణ్యపురుషుల పేరు మీద జరిగే షిర్క్. ఈ ఆయత్ ఆంతర్యాల నుండి షిర్క్ పునాదులను బద్దలు చేస్తుంది అని అనబడింది.
3. “సత్యం పలికాడు, ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడూ” అన్న ఆయతు భావం.
4. వారు ప్రశ్నించింది ఎందుకు అన్నది కూడా తెలుస్తుంది. (అల్లాహ్ భయంతో).
5. ఆ తరువాత జిబ్రీల్ “అల్లాహ్ ఇలా ఇలా చెప్పాడు” అని వారికి బదులిస్తారు.
6. “మొదటిసారిగా తల ఎత్తేవారు జిబ్రీల్ ” అన్న ప్రస్తావన వచ్చింది.
10. అల్లాహ్ ఆదేశమిచ్చిన చోటకి వహీ తీసుకెళ్ళేవారు జిబ్రీలె.
11. షైతానులు మాటలను దొంగతనం చేసే ప్రయత్నాలు చేసేవారు.
12. షైతానులు ఒకరిపై ఒకరు ఎక్కుతారు, ఆకాశంలోని మాట అందుకోవటానికి.
13. వారిని తరిమి కొట్టడానికి అగ్నిజ్వాల పంపబడుతుంది.
14. ఒక్కప్పుడు అగ్నిజ్వాల అతన్ని అందుకొని కాల్చేస్తుంది. ఒకప్పుడు అతడు తప్పించుకొని ఆ మాట మాంత్రికుని, లేక జ్యోతిష్యునికి అందిస్తాడు.
15. ఒక్కోసారి మాంత్రికుని, జ్యోతిష్యుని మాట నిజమవుతుంది.
16. మాంత్రికుడు, జ్యోతిష్యుడు ఆ ఒక్క మాటకు వంద అబద్దాలు కలుపుతాడు.
17. అతని అసత్య మాటల్ని ప్రజలు నిజమనుకునేది ఆ ఒక్క ఆకాశ మాట నిజమయినందుకే.
18. అసత్యాన్ని, మిథ్యాన్ని మనుస్సు ఎంత తొందరగా ఒప్పుకుంటుందో చూడండి. ఒక్క మాటను చూస్తారు, కాని వంద అబద్దాలున్నాయని గమనించరు.
19. షైతానులు పరస్పరం ఆమాటను అందుకొని జ్ఞాపకముంచుకుంటారు. ఇతర మాటల్ని నిజమని భావింపజేసే ప్రయత్నం చేస్తారు.
20. ఇందులో అల్లాహ్ గుణవిశేషణాలు రుజువవుతున్నాయి. “అష అరియ్య, ముఅత్తిల” వర్గంవారు వాటిని తిరస్కరిస్తారు. (వాస్తవానికి తిరస్కరించ కూడదు).
21. కంపించుట, సొమ్మసిల్లుట అనేది అల్లాహ్ భయం వలన జరుగుతుంది.
22. దైవదూతలు అల్లాహ్ కు సజ్దా చేస్తారు.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ)
ఇందులో కూడా తౌహీద్ విధితం, షిర్క్ తుచ్ఛం అని చెప్పడానికి గొప్ప నిదర్శనం ఉంది. పై మూల వాక్యాల్లో అల్లాహ్ గొప్పతనం, ఔన్నత్యం ప్రస్తావించబడినది. ఆ గొప్పతనం, ఔన్నత్యం ముందు సర్వ సృష్టి యొక్క పెద్దరికాలు మట్టిలో కలిసిపోతాయి. అతని మాట వింటేనే భూమ్యాకాశాల్లో ఉన్న సర్వ దైవదూతల గుండెలు అదిరిపోతాయి. వారందరు ఆయన ఎదుట తల మోకరిల్లి, ఆయన గొప్పతనం, ఔన్నత్యాలను స్తుతిస్తారు. ఆయనతో భయపడుతారు. ఇలాంటి గొప్ప గుణం గల ప్రభువే, ఆరాధనకు అర్హుడు కాగలడు. ఆయన తప్ప మరెవ్వరూ ఆరాధనకు, పొగడ్తలకు, ప్రశంసలకు, కృతజ్ఞతకు అర్హులు కారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.