Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 35
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ప్రశ్నల పత్రం – 35
1) షిర్క్ (బహు దైవారాధన) చేస్తూ కర్మలు ఆచరిస్తే ఏమవుతుంది?
A) కర్మలు ఫలిస్తాయి
B కర్మలు వ్రాయబడవు
C) కర్మలు వృధా అవుతాయి
2) నమాజ్ లో రెండు సజ్దాల మధ్య “రబ్బిగ్ ఫిర్లీ” అని పలికే దువా భావం ఏమిటి?
A) ఓ.. అల్లాహ్ స్వీకరించు
B) నా ప్రభూ నన్ను మన్నించు
C) నా ప్రభువా నా దువా వినుము
3) అల్లాహ్ మనతోపాటు ఏ విధంగా అతి దగ్గరలోనే ఉన్నాడు ?
A) అవతారాల రూపంలో
B) సృష్టి రాసులన్నిటిలో ఉంటూ
C) వినే రిత్యా – చూసే రిత్యా – జ్ఞానం రిత్యా.
క్విజ్ 35: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [20 నిమిషాలు]
1) షిర్క్ (బహు దైవారాధన) చేస్తూ కర్మలు ఆచరిస్తే ఏమవుతుంది? (బహుదైవారాధన చేసి వారి సత్కర్మలన్నీ ఏమవుతాయి?).
C] కర్మలు వృధా అవుతాయి
وَكَيْفَ أَخَافُ مَا أَشْرَكْتُمْ وَلَا تَخَافُونَ أَنَّكُمْ أَشْرَكْتُم بِاللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ عَلَيْكُمْ سُلْطَانًا ۚ فَأَيُّ الْفَرِيقَيْنِ أَحَقُّ بِالْأَمْنِ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ
“అల్లాహ్ మీ వద్దకు ఏ నిదర్శనాన్నీ అవతరింపజేయనప్పటికీ మీరు అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించే విషయానికి భయపడటం లేదు. మరి అటువంటప్పుడు అల్లాహ్‌కు సహవర్తులుగా మీరు నిలబెట్టే వాటికి నేనెలా భయపడతాను? కాబట్టి ఈ రెండు పక్షాలలో సురక్షిత స్థితికి అర్హులెవరో మీకు తెలిస్తే కాస్త చెప్పండి.” (సూరా అల్ అన్ ‘ఆమ్ 6:81)
الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ أُولَٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُم مُّهْتَدُونَ
“విశ్వసించి, తమ విశ్వాసాన్ని దుర్మార్గం (షిర్కు)తో కలగా పులగం చేయకుండా ఉండేవారే సురక్షితంగా ఉన్నవారు. సన్మార్గంపై ఉన్నవారు కూడా వారే”. (సూరా నూహ్ 6:82)
وَتِلْكَ حُجَّتُنَا آتَيْنَاهَا إِبْرَاهِيمَ عَلَىٰ قَوْمِهِ ۚ نَرْفَعُ دَرَجَاتٍ مَّن نَّشَاءُ ۗ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ
“ఇబ్రాహీము (అలైహిస్సలాం) తన జాతి వారిని ఎదుర్కొనటానికిగాను మేము అతనికి ఇచ్చిన మా ‘నిదర్శనం’ ఇది! మేము తలచుకున్నవారి అంతస్తుల్ని పెంచుతాము. నిశ్చయంగా నీ ప్రభువు వివేకవంతుడు, గొప్ప పరిజ్ఞానం కలవాడు.” (సూరా నూహ్ 6:83)
وَوَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ ۚ كُلًّا هَدَيْنَا ۚ وَنُوحًا هَدَيْنَا مِن قَبْلُ ۖ وَمِن ذُرِّيَّتِهِ دَاوُودَ وَسُلَيْمَانَ وَأَيُّوبَ وَيُوسُفَ وَمُوسَىٰ وَهَارُونَ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
“ఇంకా మేము అతనికి ఇస్‌హాఖును, యాఖూబ్‌ను ప్రసాదించాము. వారిలో ప్రతి ఒక్కరికీ మేము సన్మార్గం చూపించాము. అంతకు మునుపు మేము నూహ్‌కు సన్మార్గం చూపించి ఉన్నాము. ఇంకా అతని సంతతి వారిలోనుంచి దావూదు సులైమానులకు, అయ్యూబు యూసుఫులకు, మూసా హారూనులకు మేము సన్మార్గం చూపాము. సత్కార్యాలు చేసేవారికి మేము ఇలాగే ప్రతిఫలం ఇస్తూ ఉంటాము.”(సూరా నూహ్ 6:84)
وَزَكَرِيَّا وَيَحْيَىٰ وَعِيسَىٰ وَإِلْيَاسَ ۖ كُلٌّ مِّنَ الصَّالِحِينَ
“ఇంకా జకరియ్యా, యహ్యా, ఈసా, ఇల్యాస్‌లకు కూడా (మేము సన్మార్గం చూపించాము.) వారంతా సద్వర్తనుల కోవకు చెందినవారే.” (సూరా నూహ్ 6:85)
وَإِسْمَاعِيلَ وَالْيَسَعَ وَيُونُسَ وَلُوطًا ۚ وَكُلًّا فَضَّلْنَا عَلَى الْعَالَمِينَ
“ఇంకా – ఇస్మాయీలుకు, యసఆకు, యూనుసు లూతులకు కూడా (మేము మార్గదర్శకత్వం వహించాము). వారిలో ప్రతి ఒక్కరికీ మేము లోకవాసులందరిపై శ్రేష్ఠతను అనుగ్రహించాము”.(సూరా నూహ్ 6:86)
وَمِنْ آبَائِهِمْ وَذُرِّيَّاتِهِمْ وَإِخْوَانِهِمْ ۖ وَاجْتَبَيْنَاهُمْ وَهَدَيْنَاهُمْ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
“అంతేకాదు, వారి పితామహులలో (తాత ముత్తాతలలో), వారి సంతానంలో, వారి సహోదరులలో కూడా కొందరిని (మేము కటాక్షించాము.) వారిని (మా సేవకోసం) ఎన్నుకున్నాము. వారిని రుజుమార్గం వైపుకు నడిపించాము.” (సూరా నూహ్ 6:87)
ذَٰلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُم مَّا كَانُوا يَعْمَلُونَ
“ఇదీ అల్లాహ్ మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సైతం, దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి.” (సూరా నూహ్ 6:88)
అలాగే సూర జుమర్ 39:65లో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఉద్దేశించి ఇలా చెప్పడం జరిగింది
الزمر: 39:65 وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” (సూర జుమర్ 39:65)
مسلم 2985:- عَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: ” قَالَ اللهُ تَبَارَكَ وَتَعَالَى: أَنَا أَغْنَى الشُّرَكَاءِ عَنِ الشِّرْكِ، مَنْ عَمِلَ عَمَلًا أَشْرَكَ فِيهِ مَعِي غَيْرِي، تَرَكْتُهُ وَشِرْكَهُ “
అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: అల్లాహ్ ఇలా తెలిపాడు: “భాగస్వాములందరికంటే ఎక్కువగా నేను షిర్క్ కు అతీతుడ్ని. ఎవరైనా ఒక సత్కార్యం చేసి అందులో ఎనరినైనా నాకు భాగస్వామిగా చేస్తే నేను అతడ్ని అతని షిర్క్ తో పాటు వదిలేస్తాను.” (ముస్లిం 2985)
2] నమాజ్ లో రెండు సజ్దాల మధ్య రబ్బిగ్ ఫిర్లీ అని పలికే దువా భావం ఏమిటి?
B] నా ప్రభూ నన్ను మన్నించు
النسائي 1069 ، أبو داود 874:- وَبَيْنَ السَّجْدَتَيْنِ: «رَبِّي اغْفِرْ لِي، رَبِّي اغْفِرْ لِي»
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రెండు సజ్దాల మధ్యలో రబ్బిగ్ ఫిర్లీ, రబ్బిగ్ ఫిర్లీ అనేవారు.
3] అల్లాహ్ మనతోపాటు ఏ విధంగా అతి దగ్గరలోనే ఉన్నాడు?
C] వినే రిత్యా – చూసే రిత్యా – జ్ఞానం రిత్యా.
وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ ۖ فَلْيَسْتَجِيبُوا لِي وَلْيُؤْمِنُوا بِي لَعَلَّهُمْ يَرْشُدُونَ
“(ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికి చెప్పు). కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి (ఈ విషయం నీవు వారికి తెలియజేయి). తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగల్గుతారు.” (సూర బఖర 2:186)
అల్లాహ్ మనతో పాటు ఉన్నాడన్న విశ్వాసం “అల్లాహ్ పై విశ్వాసం”లోని ఓ ముఖ్యమైన భాగం. అరబీలో ‘మఇయ్యతుల్లాహ్’ అనబడుతుంది. అల్లాహ్ తనకు తగిన రీతిలో ఏడు ఆకాశాల పైన తన అర్ష్ పై ఉన్నాడు. ఇందులో ఏ అనుమానం లేదు. ఖుర్ఆనులో ఎన్నో ఆయతులున్నాయి. ఉదాహరణకు చూడండి సూర తాహా 20:5
అయితే ఇది (‘మఇయ్యతుల్లాహ్’) రెండు రకాలు 1: ‘మఇయ్య ఆమ్మ’ 2: ‘మఇయ్య ఖాస్స’
1: ‘మఇయ్య ఆమ్మ’ అంటే అల్లాహ్ తన అర్ష్ పై ఉండి కూడా సర్వ సృష్టి వెంట ఉన్నాడు, అంటే సర్వ సృష్టిపై దృష్టి పెట్టి ఉన్నాడు, వారిని చూస్తూ వింటూ ఉన్నాడు. దీనికి దివ్య ఖుర్ఆన్ సూర హదీద్ 57:4 లో ఉంది:
هُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۚ يَعْلَمُ مَا يَلِجُ فِي الْأَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنزِلُ مِنَ السَّمَاءِ وَمَا يَعْرُجُ فِيهَا ۖ وَهُوَ مَعَكُمْ أَيْنَ مَا كُنتُمْ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
“ఆయనే భూమ్యాకాశాలను ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని అధిష్టించాడు. భూమి లోపలికి పోయేదీ, అందులో నుంచి బయల్పడేదీ, ఆకాశం నుంచి క్రిందికి దిగేదీ, మరందులోకి ఎక్కిపోయేదీ – అంతా ఆయనకు (బాగా)తెలుసు. మీరెక్కడ ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. మరి మీరు చేసే పనులన్నింటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు.” (సూర హదీద్ 57:4)
2: ‘మఇయ్య ఖాస్స’: అంటే పై భావంతో పాటు ప్రత్యేకంగా తన ప్రవక్తల, విశ్వాసులకు తోడుగా, మద్దతుగా, సహాయంగా ఉన్నాడని కూడా భావం వస్తుంది.
దీనికి ఆధారంగా అనేక ఆయతులు హదీసులున్నాయి.
قَالَ لَا تَخَافَا ۖ إِنَّنِي مَعَكُمَا أَسْمَعُ وَأَرَىٰ
“మీరు ఏ మాత్రం భయపడకండి. నేను మీతోనే ఉన్నాను. అంతా వింటూ, చూస్తూ ఉంటాను” అని సమాధానమిచ్చాడు అల్లాహ్. (సూర తాహా 20:46)
… إِذْ يَقُولُ لِصَاحِبِهِ لَا تَحْزَنْ إِنَّ اللَّهَ مَعَنَا ۖ أَنزَلَ اللَّهُ سَكِينَتَهُ عَلَيْهِ وَأَيَّدَهُ بِجُنُودٍ لَّمْ تَرَوْهَا…
“బాధపడకు. నిశ్చయంగా అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు” అని ఓదార్చినప్పుడు అల్లాహ్‌యే వారికి తోడ్పడ్డాడు. (ఆ ఘడియలో) అల్లాహ్ తన తరఫునుంచి అతనిపై ప్రశాంతతను అవతరింపజేశాడు. మీకు కానరాని సైన్యాలతో అతన్ని ఆదుకున్నాడు. (సూర తౌబా 9:40)
إِنَّ اللَّهَ مَعَ الَّذِينَ اتَّقَوا وَّالَّذِينَ هُم مُّحْسِنُونَ
“నిశ్చయంగా అల్లాహ్ తనకు భయపడుతూ జీవితం గడిపే వారికి, సద్వర్తనులకు తోడుగా ఉంటాడు.” (సూర నహ్ల్ 16:128)
పై మూడు ఆయతుల వ్యాఖ్యానంలో ఇమాం ఇబ్ను తైమియా (రహిమహుల్లాహ్) చెప్పారు:
“అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు అబూ బక్ర్ కు తోడుగా ఉండి, సహాయ పడ్డాడు అబూ జహల్ మరియు ఇతర శత్రువులకు వ్యెతిరేకంగా, మూసా (అలైహిస్సలాం) మరియు హారూన్ (అలైహిస్సలాం)కు తోడుగా ఉండి, సహాయం అందించాడు ఫిర్ఔన్ కు వ్యెతిరేకంగా, ఇంకా భక్తిపరులకు, సద్వవర్తనులకు తోడుగా ఉండి, సహాయపడ్డాడు పాపాత్ములు, దౌర్జన్యపరులకు వ్యెతిరేకంగా.”
(మజ్మూఉల్ ఫతావా 11/ 249-250)
ఇతరములు :
తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz
You must be logged in to post a comment.