హదీథ్׃ 09
ఇరుగు పొరుగు (పొరుగింటి) వారి హక్కులు – حق الجار على الجار
حَدَّثَنَا أَبُو بَكْرِ بْنُ أَبِي شَيْبَةَ: حَدَّثَنَا أَبُو الأَحْوَصِ عَنْ أَبِي حَصِينٍ عَنْ أَبِي صَالِحٍ عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُولُ اللّهِ: ” مَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الآخِرِ فَلاَ يُؤْذِ جَارَهُ. وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيُكْرِمْ ضَيْفَهُ. وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيَقُلْ خَيْراً أَوْ لِيَسْكُتْ “ رواة صحيح مسلم
హద్దథనా అబుబక్రిబ్ను అబి షైబత, హద్దథనా అబు అల్అహ్వశి అన్ అబిహశీనిన్ అన్ అబిశాలిహిన్ అన్ అబిహురైరత ఖాల, ఖాల రసూలిల్లాహి “మన్ కాన యుఁమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫలా యూది జారహు, వమన్ కాన యుఁమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫల్ యుక్రిమ్ దైఫహు, వమన్ కాన యుఁమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫల్ యఖుల్ ఖైరన్ అవ్ లియస్కుత్ ” రవాహ్ సహీ ముస్లిం.
అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ ముస్లిం హదీథ్ గ్రంధంకర్త ← అబుబక్రిబ్ను అబిషైబత ← అబు అల్అహ్వశి ← అబిహశీనిన్ ← అబిశాలిహిన్ ← అబిహురైరత (రదియల్లాహుఅన్హు) ← ప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం హితోపదేశం.
అల్ మతన్ (బోధించిన అసలు విషయం) అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు. “ఎవరైతే అల్లాహ్ పై మరియు ప్రళయదినం పై విశ్వాసము ఉంచుతారో వారు తమ యొక్క పొరుగు వారికి కష్టము కలిగించ కూడదు. మరియు ఎవరైతే అల్లాహ్ పై మరియు ప్రళయదినం పై విశ్వాసము ఉంచుతారో వారు తమ ఇంటికి వచ్చిన అతిధులకు మంచి ఆతిధ్యముతో గౌరవిచవలెను. ఎవరైతే అల్లాహ్ మీద మరియు ప్రళయదినం పై విశ్వాసము ఉంచుతారో వారు వీలైతే మంచి మాటలు చెప్పవలెను లేకుంటే మౌనము వహించవలెను”. సహీ ముస్లిం హదీథ్ గ్రంధం.
హదీథ్ వివరణ
ఇరుగు పొరుగు వారి హక్కులను కాపాడటం కూడా దైవ విశ్వాసం లోని ఒక ముఖ్యమైన భాగమని మరియు వారికి హాని కలిగించటం కూడా ఒక ఘోరమైన మహాపాపమని ఈ హదీథ్ ప్రకటిస్తున్నది. ఇతర పొరుగింటి వారి కంటే సత్యసంధులైన, ధర్మాత్ములైన పొరుగింటి వారి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపవలెను. ఇంకా ముస్లిం పొరుగింటి వారినందరికీ మంచి చేయవలెను, దయతో మంచి సలహాలివ్వవలెను, వారు సరైన మార్గాన్ని అనుసరించేటట్లుగా ప్రార్థించ వలెను, మరియు వారికి హాని కలిగించకూడదు.
ఉల్లేఖకుని పరిచయం: అబు హురైరా రదియల్లాహు అన్హు పూర్తి పేరు అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసీ. ఆయన 7వ హిజ్రీలో ఖైబర్ విజయం సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలోనికి చేరినారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం చేసినవారిలో సహచరులలో (సహాబాలలో) ఒకరు.
ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):
- పరస్పరం ప్రేమ మరియు సహాయసహకారాలు పెంపొందుకునే దిశగా ప్రజలను ఇస్లాం ప్రోత్సహిస్తుంది.
- ఇరుగు పొరుగు వారి మధ్య సహాయసహకారాలు వారి మధ్య బంధుత్వాన్ని పటిష్టపరుస్తాయి.
- పొరుగింటి పిల్లలను మాటలతో లేదా చేతలతో (పనులతో) నొప్పించకుండా ఉండటం ద్వారా వారిపై దయ చూపినట్లవుతుంది.
- ఇంటి కప్పు పై నుండి లేదా తలుపు రంధ్రాల నుండి పొరుగింటిలోనికి తొంగిచూడటం నిషేధించబడినది.
- పొరుగువారికి ఎలాంటి అపకారం, కీడు, హాని కలిగించటం నిషేధించబడినది.
- అతిథులను మర్యాదపూర్వకంగా సత్కరించడం ప్రతి ఒక్కరి బాధ్యత.
- అనవసరపు సంభాషణలు సంపూర్ణమైన దైవవిశ్వాసం (ఈమాన్) నుండి దూరం చేస్తాయి.
ప్రశ్నలు
- తప్పక చేయమని దైవప్రవక్త ఆదేశించిన మూడుపనులు వ్రాయండి.
- పొరుగువారి హక్కులు ఏవి?
- పొరుగువారి పిల్లలతో ఎలా మెలగాలి?
- దేని వలన దైవ విశ్వాసానికి (ఈమాన్) దూరమవుతారు.
- పొరుగువారితో ఎలా ప్రవర్తించ వలెను?
Source : హదీథ్ – రెండవ స్థాయి [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : – ముహమ్మద్ కరీముల్లాహ్