దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ధర్మం [పుస్తకం]

Daiva Pravaktha dharmam - Telugu Islam


రచయిత
:ముహమ్మద్ ఖలీలుర్ రహ్మాన్
పునర్విచారకులు :హాఫిజ్ అబ్దుల్ వాహెద్ ఉమ్రీ మదని, విజయవాడ
ప్రకాశకులు : అల్ అసర్ ఇస్లామిక్ సెంటర్, హైదరాబాద్

[ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి]
https://bit.ly/daiva-pravaktha-dharmam
[PDF] [250 పేజీలు] [మొబైల్ ఫ్రెండ్లీ బుక్]

ఆప్త వాక్కులు

బిస్మిల్లా హిర్రహ్మానిర్రహీం

విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ కు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి” (దివ్వ ఖుర్ఆన్ 3:103)

వాస్తవంగానే అల్లాహ్ ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉంది. అల్లాహ్ పై, అంతిమ దినంపై ఆశలు పెట్టుకొని అత్యధికంగా అల్లాహ్ ను స్మరించే వ్యక్తికి“.(దివ్య ఖుర్ఆన్ 33:21)

ప్రస్తుతం ముస్లిం సమాజంలోని అధిక శాతం ప్రజలలో కానవచ్చే విశ్వాసాలు ఆరాధనా పద్ధతులు మరియు ఆచరణా వ్యవహారాలు అన్నీ ధర్మం పేరుమీద ధర్మ వ్యతిరేకమైన కొత్త పద్ధతులు కొనసాతున్నాయి. ఇందుకు కారణం ఖుర్ఆన్ మరియు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆచరణ విధానాల గురించి ప్రజలలో నిజమైన అవగాహన లేకపోవటమే.

ప్రస్తుతం ముస్లిములలో తౌహీద్ (దేవుని ఏకత్వ) భావన అధిక శాతం లోపించింది. ఇందుకు భిన్నంగా షిర్క్ (బహుదైవారాధన) భావాలు ప్రజలలో పెరిగి పోతున్నాయి. తత్కారణంగా నేటి ముస్లిం సమాజంలో అనేక మూఢ విశ్వాసాలు, అనేక మూఢ నమ్మకాలు మరియు ఒళ్ళు గగ్గురపరిచే అనేక అజ్ఞానపు చేష్ఠలు సర్వసామాన్యం అయిపోయాయి.

ప్రపంచానికి మార్గదర్శకం వహించాల్సిన ముస్లిం సమాజంలోని అధిక ప్రజలు ప్రస్తుతం పతనావస్థకు చేరుకున్నారు.

ఇంతకంటే అనేక రెట్లు అజ్ఞానపు మూఢత్వంలో ఉన్న అరబ్బు జాతిని ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు తౌహీద్, ఆఖిరత్ అనే నినాదాన్ని పునాదిగా చేసుకుని పతనావస్థలో ఉన్న ఆ సమాజాన్ని విశ్వాసపరంగా మరియు నైతికపరంగా ఉన్నత స్థాయికి చేర్చి ప్రపంచానికి ఆదర్శంగా మలిచారు. అందుకు కారణం ఖుర్ఆన్లోని వాక్యాలు ఎలా అవతరించాయో అలానే ప్రజలలో సర్వసామాన్యం చేయటమే.

ఈ రోజు ఖుర్ఆన్ మరియు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆచరణ యధాస్థితిలో ఉన్నా ముస్లిం సమాజం స్థితి మారకపోవటానికి కారణం, (ఎ) ఆహారం తమ దగ్గర ఉన్నా పస్తులుండే వానివలె (బి) మందులు తమ దగ్గర ఉన్నా అనారోగ్యాన్ని దూరం చేసుకోలేని వాని పరిస్థితి వలె దైవ మార్గదర్శకత్వాన్ని పొంది కూడా దానిని పెడచెవిన పెట్టి అంధకారంలో తచ్చాడుతున్న వారిలా మారిపోయారు ముస్లింలు. అందువల్లనే అల్లాహ్ తన గ్రంథంలో ఇలా అంటున్నాడు.

“ఇక నా తరఫు నుండి మార్గదర్శకత్వం మీ దగ్గరకు వస్తే ఎవడు ఈ మార్గదర్శ కత్వాన్ని అనుసరిస్తాడో అతడు మార్గం తప్పడు, దౌర్భాగ్యానికి గురికాడు. నా జ్ఞాపికకు విముఖుడైన వానికి ప్రపంచంలో జీవితం ఇరుకే అవుతుంది. ప్రళయంనాడు మేము అతన్ని అంధుడుగా లేపుతాము” (దివ్యఖుర్ఆన్ 20:123 124)

అందుకే ఈ రోజు ముస్లింలు ప్రపంచంలో తమ స్థితిని చక్కబరచుకోవాలంటే ఒక్కటే మార్గం. అల్లాహ్ అవతరింపజేసిన ఖుర్ఆన్ బోధనలు మరియు దానిని ఆచరించి చూపిన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) జీవిత విధానాలు సర్వసామాన్యం చేయటం తప్ప వేరే మార్గం లేదు అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఈ పుస్తకం రచయిత జనాబ్ మహమ్మద్ ఖలీలుర్రహ్మాన్ గారు తౌహీద్ అంశంపై తెలుగు భాషలో సవివరంగా చర్చించటం జరిగినది. తౌహీద్ వాస్తవికతను అర్థం చేసుకోవ టానికి ఈ పుస్తకం ఉపకారి కాగలదు. పుస్తక రచనలో రచయిత సౌదీ అరేబియాలోని ప్రామాణిక రచయితల గ్రంథాల నుండి సేకరించిన అంశాలను పొందుపర్చటం జరిగినవి. తౌహీద్ తోపాటు ప్రజలు చేసే షిర్క్ దేవుని వేడుకోలు, గుణాలు, నామాలు సోదాహరణగా చర్చించటం జరిగినవి. విశ్వాసాలు, ఆరాధనలలో తౌహీద్ యొక్క వాస్తవ దృక్పథాన్ని వివరించడం జరిగినది. ఈ పుస్తకం దైవదాసులైన మానవాళికి మార్గదర్శి కావాలని, సందేశ దాతలకు సందేశ సామగ్రిగా ఉపయోగ పడాలని, పుస్తక రచయితకు అల్లాహ్ ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ…

హాఫిజ్ అబ్దుల్ వాహెద్ ఉమ్రి మదని

విషయ సూచిక:

  1. తొలి పలుకులు [PDF]
  2. దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ధర్మం [PDF]
  3. లా ఇలాహ ఇల్లల్లాహ్ మహమ్మదుర్రసూలుల్లాహ్ అని సాక్షమివ్వడం [PDF]
  4. లా ఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం-నియమాలు [PDF]
  5. లా ఇలాహ ఇల్లల్లాహ్ వివరణ [PDF]
  6. తౌహీద్ ఆల్ రుబూబియాత్ [PDF]
  7. తౌహీద్ ఆల్ ఉలూహియాత్ [PDF]
  8. హృదయారాధనలు [PDF]
  9. నోటి ఆరాధనలు [PDF]
  10. ఇతర శారీరక ఆరాధనలు [PDF]
  11. తౌహీద్ అల్ అస్మా వ సిఫాత్ [PDF]
  12. తౌహీద్ ప్రయోజనాలు [PDF]
  13. షిర్క్ యెక్క ఆరంభము [PDF]
  14. దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కాలం నాటి ముష్రిక్కులు [PDF]
  15. ముహమ్మదుర్రసూలుల్లాహ్  సాక్ష్యం వాస్తవీకత [PDF]
  16. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం )విధేయత లాభాలు [PDF]
  17. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) అవిధేయత నష్టాలు [PDF]
  18. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) సహచరుల విధేయత [PDF]
  19. నలుగురు ఇమాములు [PDF]
  20. సున్నత్-బిద్అత్ [PDF]
  21. సలఫ్ మరియు సున్నత్ [PDF]
  22. బిద్అత్ [PDF]
  23. యాసిడ్ టెస్ట్ [PDF]
  24. ఈమాన్ [PDF]
  25. ఇహ్ సాన్ [PDF]

ఉదయం సాయంత్రం ప్రార్ధనలు (రోజంతా అల్లాహ్ రక్షణలో) – శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్ [పుస్తకం]

Morning Evening Supplications

ఉదయం సాయంత్రం ప్రార్ధనలు (రోజంతా అల్లాహ్ రక్షణలో)
సంకలనం:ఎస్.ఎం.రసూల్ షర్ఫీ ,ముహమ్మద్ హమ్మాద్ ఉమరి
పునర్విచారకులు: మంజూర్ అహ్మద్ ఉమరి
ప్రకాశకులు: శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్, అక్బర్ బాగ్ , హైదరాబాద్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి ]
https://bit.ly/3JGxK03
[50 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

నీవు నీ మనసులోనే – కడు వినమ్రతతో, భయంతో – నీ ప్రభువును స్మరించు. ఉదయం, సాయంత్రం బిగ్గరగా కాకుండా మెల్లగా నోటితో కూడా (స్మరించు). విస్మరించే వారిలో చేరిపోకు. (ఖుర్ఆన్ 7 : 205)

ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను అత్యధికంగా స్మరించండి. ఉదయం, సాయంకాలం ఆయన పవిత్రతను కొనియాడండి. (ఖుర్ఆన్ 33 : 41, 42)

ఎక్కువగా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. (ఖుర్ఆన్ 62 : 10)

ఓ విశ్వాసులారా! మీ సిరిసంపదలు, మీ సంతానం మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి మరల్చరాదు. ఎవరైతే అలా చేస్తారో వారే నష్టపోయేవారు. (ఖుర్ఆన్ 63 : 9)

అల్లాహ్ రక్షణ లేనిదే సృష్టిలో ఏ జీవరాశికీ ఒక్క క్షణం కూడా మనుగడ లేదు. సృష్టిలో అందరి కంటే ఎక్కువ అవసరాలు కలిగిన వ్యక్తి మనిషి. కనుక మనిషికి మిగతా సృష్టిరాసులన్నింటి కంటే ఎక్కువ రక్షణ కావాలి. భౌతికంగా ఈ లోకంలో బతకటానికి కావలసిన రక్షణను మనిషి అడగకనే అల్లాహ్ అతనికి ఇచ్చేశాడు. పోతే; మనిషి అంతరంగానికి అవసరమైన రక్షణ మాత్రం అతను స్వయంగా కోరుకుంటేనే గాని అది ప్రాప్తించదని నిర్ణయించబడింది. మరి అల్లాహ్ రక్షణ లభించే ఏకైక మార్గం ఏమిటో తెలుసా?! అదే ప్రార్థన (దుఆ)!

దైనందిన జీవితంలో “ప్రార్థన” (దుఆ)కు గల ప్రాముఖ్యత ఎనలేనిది. ప్రతి రోజూ మనం చేస్తూ ఉండే సకల ఆరాధనల సారం ప్రార్థన. జీవచ్ఛవమైన మనసుకు ప్రాణం పోస్తుంది ప్రార్థన. నిరాశాభావుల్లో సరికొత్త ఆశల్ని చిగురింప జేస్తుంది. ప్రార్థనా మహత్యాన్ని గ్రహించిన వ్యక్తి జీవితాంతం అల్లాహ్ను ధ్యానిస్తూ, అనుక్షణం ఆయన్ను వేడుకుంటూ గడిపేయాలని కోరుకుంటాడు.

ఆపదలు ఎదురైనప్పుడు ప్రార్థనలు (దుఆలు) చేయటం సామాన్యుల లక్షణం. ఎలాంటి ఆపదలు లేకపోయినా తమ ప్రభువును ప్రార్థించటం ఉత్తముల విధానం. అలాంటి

పుణ్యాత్ములే అల్లాహ్ కు అత్యంత ప్రీతి పాత్రులైన దాసులు. అల్లాహ్ అనుగ్రహానికి అర్హులు. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారో తెలుసా? –

కష్టాల్లో ఉన్నప్పుడు తన ప్రార్థన స్వీకరించబడాలని కోరుకునే వ్యక్తి సంతోష సమయాల్లో అతి ఎక్కువగా ప్రార్థనలు చేయాలి. (తిర్మిజీ)

కేవలం కష్టాలు, సుఖాల్లోనే కాదు, ప్రార్థన మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోవాలి. దుఆలు చేసుకోవటం ఒక దైనందిన అలవాటుగా మారిపోవాలి. ఉదయం సాయంత్రం నియమం తప్పకుండా వేడుకోలు వచనాలు పఠిస్తూ ఉండాలి.

అదే జరిగితే, మన జీవితాల్లో అద్భుతమైన మార్పు వస్తుంది. రేయింబవళ్ళు అల్లాహ్ రక్షణలో గడుపుతున్న అపూర్వమైన అనుభూతిని మనం పొందుతాం. ఉదయం పూట అల్లాహ్ వేడుకోలు వచనాలతో మొదలైన మన దినచర్యలు సాయంత్రానికి సకల శుభాలతో, శ్రేయాలతో ముగుస్తాయి. ఆ రోజంతా మన విశ్వాసంలో, ఆచరణల్లో తాజాదనం ఉంటుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ క్షణమే వెళ్దాం, అల్లాహ్ రక్షణలోకి!
– ప్రకాశకులు

  1. ఆయతుల్ కుర్సీ 7
  2. ‘ఖుల్’ సూరాలు మూడేసి సార్లు 9
  3. ఈ ప్రార్థన కొంచెమే.. కాని పుణ్యం మాత్రం ఎంతో ఘనం 13
  4. గొప్ప మన్నింపు ప్రార్థన (సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్) 14
  5. అన్ని రకాల కీడుల నుంచి కాపాడే ప్రార్థన 16
  6. హానికారక జంతువుల నుంచి రక్షణ కొరకు… 17
  7. ఇది చదివితే అంతిమ దినాన అల్లాహ్ మిమ్మల్ని సంతోషపెడతాడు 18
  8. అన్నింటికీ అల్లాహ్ చాలు…. 18
  9. మీ కర్మల ఖాతాలో పుణ్యాలు నింపే అతి తేలికైన నాలుగు వచనాలు 19
  10. రేయింబవళ్ళు ఇస్లాం ధర్మంపై స్థిరత్వాన్ని కోరుతూ ప్రార్థన 21
  11. మీ సరికొత్త రోజుకు శుభారంభం ఈ ప్రార్థన 22
  12. తెల్లవార్లు, సాయంత్రాలు అల్లాహ్ దయతోనే 25
  13. ఈ ప్రార్థనతో మిమ్మల్ని మీరు నరకాగ్ని బారి నుంచి కాపాడుకోండి 26
  14. అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోండి ఇలా…. 28
  15. ప్రతి రోజూ విజయం, సహాయం, శుభం, శ్రేయం మీ సొంతం కావాలంటే…. 29
  16. అల్లాహ్ రక్షణ లేకుండా రెప్పపాటైనా ఉండగలమా?! 30
  17. ఈ ప్రార్థనతో మీ శరీరంలోని సకలం కుశలం 31
  18. ఉదయాన్నే వీటికోసం ప్రార్థిద్దాం 32
  19. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎన్నడూ వదలిపెట్టని ప్రార్థన! 32
  20. షైతాన్ పురికొల్పే షిర్క్ కీడు నుంచి రక్షణ కొరకు… 34
  21. ఈ ప్రార్థన రోజుకు 100 సార్లు… 35
  22. పాపాలు సముద్రపు నురుగులా ఉన్నా సరే, అన్నీ మన్నించబడతాయి 36
  23. మనుషుల సంక్షేమానికి ‘అల్లాహ్ క్షమ’ ఒక్కటే శరణ్యం 36
  24. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కోసం దరూద్ పఠించటం మర్చిపోకండి 37
    పై దుఆలన్నీ ఒకే చోట 39

దివ్యఖుర్ఆన్ లోని ఎంతో ఘనత గల ‘ఆయతుల్ కుర్సీ’ అనబడే ఈ క్రింది వాక్యాన్ని ఉదయం, సాయంత్రం పఠిస్తూ ఉండాలి.

పఠించటం వల్ల ప్రయోజనమేంటి?

ఉదయం పూట ఆయతుల్ కుర్సీ పఠించిన వ్యక్తి సాయంత్రం వరకు జిన్నాతుల బారి నుండి సురక్షితంగా ఉంటాడు. అలాగే సాయంత్రం పూట దీన్ని పఠించిన వ్యక్తి ఉదయం వరకు అల్లాహ్ రక్షణలో ఉంటాడు. (హాకిమ్ : 1/562)

اللَّهُ لَا إِلَهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ مَنْ ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلَّا بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ

అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, లా తాఖుజుహూ సినతున్ వలా నౌమ్, లహూ మాఫిస్సమావాతి వమా ఫిల్ అర్ద్, మన్ జల్లజీ యష్ఫఉ ఇందహూ ఇల్లాబి ఇజ్నిహీ, యాలము మాబైన ఐదీహీం వమా ఖల్ఫహుం, వలా యుహీతూన బిషైయి మ్మిన్ ఇల్మిహీ ఇల్లా బిమా షాఅ, వసిఅ కుర్సియ్యు హుస్సమావాతి వల్ అర్ద్, వలా యవూదుహూ హిఫ్జుహుమా వహువల్ అలియ్యుల్ అజీం. (సూర బఖర 2 : 255)

అల్లాహ్ (మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం). ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు; అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకుగానీ, నిద్రగానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన అధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయ గలవాడెవడు? మానవులకు ముందు ఉన్న దానినీ, వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్యపరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు.

ఈ క్రింద పేర్కొనబడుతున్న దివ్య ఖుర్ఆన్ సూరాలను ప్రతి రోజూ ఉదయం సాయంత్రం పఠిస్తూ ఉండాలి.

పఠించటం వల్ల ప్రయోజనమేంటి?

ఖుబైబ్ (రదియల్లాహు అన్హు) కథనం: మేము ఒకానొక రాత్రి భారీ వర్షం కురుస్తున్నప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను నమాజు చేయించమని పిలవటానికి చీకట్లోనే ఆయన్ని వెతుక్కుంటూ బయలుదేరాం. నాకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కనిపించారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో, “ఖుల్” (చెప్పు) అన్నారు. నేనేమీ మాట్లాడలేదు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మళ్ళీ, “ఖుల్”(చెప్పు) అన్నారు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఆ తరువాత మూడోసారి కూడా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), “ఖుల్” (చెప్పు) అన్నారు. ‘ఏం చెప్పాలి?’

అని అడిగాను. అప్పుడాయన, “ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం

“ఖుల్ హువల్లాహు అహద్…”,”ఖుల్ అవూజు బిరబ్బిల్ ఫలఖ్…”,”ఖుల్ అవూజు బిరబ్బిన్నాస్…”

(ఈ మూడు సూరాలూ 3 సార్లు) పఠించు. అన్ని రకాల కష్టాల నుండి సురక్షితంగా ఉంటావు” అని అన్నారు. (తిర్మిజీ-హసన్)

ఆ మూడు సూరాలు ఇవే:

1. సూరహ్ ఇఖ్లాస్

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِقُلْ هُوَ اللَّهُ أَحَدٌ اللَّهُ الصَّمَدُ لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ

బిస్మిల్లా హిర్రహ్మానిర్రహీమ్
ఖుల్ హువల్లాహు అహద్. అల్లాహుస్సమద్. లమ్ యలిద్ వలమ్ యూలద్. వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్.

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

ఇలా చెప్పెయ్యి, ఆయన అల్లాహ్, ఒక్కడు. అల్లాహ్ నిరపేక్షా పరుడు. ఎవరి ఆధారమూ, ఎవరి అక్కరా లేనివాడు. అందరూ ఆయనపై ఆధారపడేవారే. ఆయనకు సంతానం ఎవరూ లేరు. ఆయన కూడా ఎవరి సంతానమూ కాదు. ఆయనకు సరిసమానులు ఎవరూ లేరు.

2. సూరహ్ ఫలఖ్

బిస్మిల్లా హిర్రహ్మానిర్రహీమ్
ఖుల్ అవూజు బిరబ్బిల్ ఫలఖ్. మిన్ షర్రి మా ఖలఖ్. వ మిన్ షర్రి గాసిఖిన్ ఇజా వఖబ్, వ మిన్ షర్రిన్నఫ్పాసాతి ఫిల్ ఉఖద్. వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్.

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

ఇలా అను: నేను ఉదయం ప్రభువు శరణు కోరు

తున్నాను-ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి, కమ్ముకునే చీకటి రాత్రి కీడు నుండి, ముడులపై మంత్రించేవారి కీడు నుండి, అసూయా పరుడు అసూయ చెందేటప్పటి కీడు నుండి.

3. సూరహ్ నాస్

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِقُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ مَلِكِ النَّاسِ إِلَٰهِ النَّاسِ مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ مِنَ الْجِنَّةِ وَالنَّasăِ

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
ఖుల్ అవూజు బిరబ్బిన్నాస్, మలికిన్నాస్. ఇలాహిన్నాస్, మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్, అల్లజీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్. మినల్ జిన్నతి వన్నాస్.

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

ఇలా అను: నేను మానవుల ప్రభువు, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్) శరణు కోరుతున్నాను – దుష్ట భావాలు రేకెత్తించే వాడి కీడు నుండి, వాడు మాటిమాటికీ మరలి వస్తూ ప్రజల మనసుల్లో దుష్టభావాలను రేకెత్తిస్తాడు,

వాడు జిన్నాతు జాతికి చెందినవాడైనా కావచ్చు, మానవ జాతికి చెందిన వాడైనా కావచ్చు.

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ

లా ఇలాహ ఇల్లల్లాహు వహ್ದహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్. (10 సార్లు)

అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములెవరూ లేరు. విశ్వ సామ్రాజ్యాధికారం ఆయనదే. స్తోత్రం ఆయనకే. ఆయన ప్రతి వస్తువుపై సంపూర్ణ అధికారం కలిగి వున్నాడు. (సహీ ఇబ్నెమాజా 2/331)

పఠించటం వల్ల ప్రయోజనమేంటి?

ఎవరైనా ఉదయం పూట ఈ వాక్యాలు పఠిస్తే- అటువంటి వ్యక్తికి ఇస్మాయీల్ సంతతికి చెందిన ఒక బానిసకు విముక్తి ప్రసాదించినంత పుణ్యం

లభిస్తుంది. (అంతేకాదు) అతని కర్మల జాబితాలో అదనంగా పది పుణ్యాలు లిఖించబడతాయి. పది పాపాలు తొలగించబడతాయి. అతనికి పదింతల పదోన్నతి లభిస్తుంది. ఇంకా సాయంత్రం అయ్యే దాకా అతను షైతాన్ నుండి సురక్షితంగా ఉంటాడు. ఒకవేళ ఈ వాక్యాలు సాయంత్రం పూట పఠించినా కూడా ఈ పుణ్యం లభిస్తుంది. అటువంటి వ్యక్తి ఉదయం వరకు షైతాన్ నుండి సురక్షితంగా ఉంటాడు. (అబూ దావూద్, ఇబ్నె మాజా-సహీహ్)

షద్దాద్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు : అన్నింటికన్నా ఉత్తమ మైన మన్నింపు ప్రార్థన (సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్) ఇది. నువ్వు ఈ విధంగా ప్రార్థించు:

اللَّهُمَّ أَنْتَ رَبِّ لَا إِلَهَ إِلَّا أَنْتَ خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَا اسْتَطَعْتُ أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ أَبُوءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ وَأَبُوءُ لَكَ بِذَنْبِي فَاغْفِرْ لِي فَإِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ

“అల్లాహుమ్మ అంత రబ్బీ లా యిలాహ ఇల్లా అంత, ఖలఖ్తనీ వ అన అబ్దుక, వ అన అలా అహ్దిక వ వాదిక మస్తతాతు, అవూజు బిక మిన్ షర్రి మా సనాతు అబూవు లక బినీమతిక అలయ్య, వ అబూవు లక బిజంబీ, ఫగ్ఫిర్లీ ఫఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత.”

అల్లాహ్! నీవు నా ప్రభువువి. నీవు తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. నీవు నన్ను పుట్టించావు. నేను నీ దాసుణ్ణి (నీ దాసురాలను). నీతో చేసిన ప్రమాణం మరియు వాగ్దానాన్ని నా శక్తిమేరకు నెరవేర్చటానికి కృషి చేస్తున్నాను. నేను చేసిన చెడు పనుల కీడు నుండి నీ శరణు కోరుతున్నాను. నీవు నాకు చేసిన ఉపకారాలను ఒప్పుకుంటున్నాను. నా పాపాలను అంగీకరిస్తున్నాను. నన్ను క్షమించు. నీవు తప్ప క్షమించే వాడెవడూ లేడు.

పఠించటం వల్ల ప్రయోజనమేంటి?

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు – ఎవరైనా

పగటివేళ పూర్తి నమ్మకంతో ఈ వాక్యాలు పఠించి సాయంత్రం కాకముందే మరణిస్తే అతడు స్వర్గానికి వెళతాడు. అదే విధంగా ఎవరైనా రాత్రిపూట పూర్తి నమ్మకంతో ఈ వచనాలు పఠించి తెల్లవారక ముందే మరణిస్తే అతను కూడా స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. (బుఖారీ)

بِسْمِ اللَّهِ الَّذِي لَا يَضُرُّ مَعَ اسْمِهِ شَيْءٌ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ

“బిస్మిల్లా హిల్లజీ లా యదుర్రు మఅస్మిహీ షైవున్ ఫిల్ అర్ది వలా ఫిస్సమాయి వహువస్సమీఉల్ అలీం.” (3 సార్లు)

అల్లాహ్ పేరుతో, ఆయన పేరు తోడుంటే భూమ్యాకాశాల్లోని ఏ వస్తువూ కీడు తలపెట్టలేదు. ఆయన బాగా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.

పఠించటం వల్ల ప్రయోజనమేంటి?

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:

ఎవరైనా ఉదయం, సాయంత్రం మూడేసి సార్లు ఈ వచనాలు పఠిస్తే ఆ వ్యక్తికి ఏ వస్తువూ కీడు తలపెట్టజాలదు.

أَعُوذُ بِكَلِمَاتِ اللَّهِ التَّامَّاتِ مِنْ شَرِّ مَا خَلَقَ

“అవూజు బి కలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్.” (3 సార్లు)

అల్లాహ్ సృష్టి కీడు నుండి నేను ఆయన సంపూర్ణ నామాల శరణువేడుతున్నాను. (ముస్లిం)

పఠించటం వల్ల ప్రయోజనమేంటి?

ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి, “దైవప్రవక్తా! రాత్రి నాకు తేలుకుట్టింది. దానివల్ల నాకు విపరీతమైన నొప్పి కలిగింది” అని అన్నాడు. అందుకాయన (సల్లల్లాహు అలైహి వసల్లం), “నీవు సాయంత్రం పూట ఈ వచనాలు పఠిస్తే ఏ వస్తువూ నీకు కీడు తలపెట్ట జాలదు” అని అన్నారు.

رَضِيتُ بِاللَّهِ رَبًّا وَبِالْإِسْلَامِ دِينًا وَبِمُحَمَّدٍ نَبِيًّا

రద్వీతు బిల్లాహి రబ్బన్, వబిల్ ఇస్లామి దీనన్, వబి ముహమ్మదిన్ నబియ్యా (3 సార్లు)

అల్లాహ్ న్ను ప్రభువుగా, ఇస్లాంను ధర్మంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను దైవప్రవక్తగా నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. (అహ్మద్, తిర్మిజీ)

حَسْبِيَ اللَّهُ لَا إِلَهَ إِلَّا هُوَ عَلَيْهِ تَوَكَّلْتُ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ

హస్బియల్లాహు లా ఇలాహ ఇల్లా హువ అలైహి తవక్కల్తు వహువ రబ్బుల్ అర్షిల్ అజీం
(7 సార్లు)

అన్నింటికీ నాకు అల్లాహ్ చాలు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన పైనే నేను ఆధార పడ్డాను. ఆయన మహోన్నత సింహాసనానికి ప్రభువు. (అబూదావూద్)

ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఫజ్ర్ నమాజ్ కోసం మస్జిద్ కు బయలుదేరుతున్నప్పుడు జువైరియా (రదియల్లాహు అన్హా) తాను నమాజ్ చేసుకునే చోట కూర్చొని (దైవధ్యానంలో నిమగ్నులై) ఉన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బాగా ప్రొద్దెక్కిన తరువాత (మస్జిద్ నుండి) ఇంటికి తిరిగొచ్చారు. ఆమె అప్పటి వరకు అక్కడే కూర్చొని ఉన్నారు. ఆమెను చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), “నేను మస్జిద్ కు వెళ్ళినప్పటి నుండి నువ్వు ఇక్కడే కూర్చుని ఉన్నావా?” అని అడిగారు. “అవును, దైవప్రవక్తా!” అని సమాధాన మిచ్చారు జువైరియా (రదియల్లాహు అన్హా). అప్పుడు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: నేను నీ దగ్గరి నుండి వెళ్ళిన తరువాత నాలుగు వచనాలు – ఒక్కొక్కటి మూడు సార్లు చొప్పున పఠించాను. వాటిని గనక ఈ రోజు నువ్వు చేసిన అల్లాహ్ ధ్యానంతో తూచితే అవే ఎక్కువ బరువును తూస్తాయి. ఆ వచనాలు:

سُبْحَانَ اللَّهِ وَبِحَمْدِهِ عَدَدَ خَلْقِهِسُبْحَانَ اللَّهِ وَبِحَمْدِهِ رِضَا نَفْسِهِسُبْحَانَ اللَّهِ وَبِحَمْدِهِ زِنَةَ عَرْشِهِسُبْحَانَ اللَّهِ وَبِحَمْدِهِ مِدَادَ كَلِمَاتِهِ

  1. సుబ్ హా నల్లాహి వ బిహమ్దిహీ అదద ఖల్ఖిహీ
  2. సుబ్ హా నల్లాహి రిజా నఫ్సిహీ
  3. సుబ్ హా నల్లాహి జినత అర్షిహీ
  4. సుబ్ హా నల్లాహి మిదాద కలిమాతిహీ
    (ఇలా 3 సార్లు)

1. అల్లాహ్ సృష్టితాల సంఖ్యకు సమానంగా నేను అల్లాహ్ ను స్తుతిస్తూ (మానవులు కలిగి ఉండే జననం, మరణం, సంతానం, ఆకలి, నిద్ర మొదలగు లోపాలు ఆయనకు లేవని) ఆయన పవిత్రతను కొనియాడుతున్నాను. 2. అల్లాహ్ సంతోషించే వరకు నేనాయన పవిత్రతను (మాన వులు కలిగి ఉండే జననం, మరణం, సంతానం, ఆకలి, నిద్ర మొదలగు లోపాలు ఆయనకు లేవని) కొనియాడుతున్నాను. 3. అల్లాహ్ పీఠం బరువుకు సమానంగా నేను అల్లాహ్ పవిత్రతను కొనియాడు తున్నాను. 4. అల్లాహ్ వచనాలను లిఖించడానికి ఎంత సిరా పడుతుందో అంతగా నేను అల్లాహ్ పవిత్రతను (మానవులు కలిగి ఉండే జననం, మరణం, సంతానం, ఆకలి, నిద్ర మొదలగు లోపాలు ఆయనకు లేవని) కొనియాడుతున్నాను. (ముస్లిం)

أَصْبَحْنَا عَلَى فِطْرَةِ الْإِسْلَامِ وَعَلَى كَلِمَةِ الْإِخْلَاصِ وَعَلَى دِينِ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى مِلَّةِ أَبِينَا إِبْرَاهِيمَ حَنِيفًا مُسْلِمًا وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ

అస్బహ్నా (సాయంత్రమైతే “అమ్సైనా” అనాలి)అలా ఫిత్రతిల్ ఇస్లామి వ అలా కలిమతిల్ ఇఖ్లాసి వ అలా దీని నబియ్యినా ముహమ్మదిన్ వఅలా మిల్లతి అబీనా ఇబ్రాహీం, హనీఫన్ ముస్లిమా, వమా కాన మినల్ ముష్రికీన్.

ఇస్లాం ధర్మ సహజత్వంపై, స్వచ్ఛమైన వచనంపై, మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మంపై,

ఏకోన్ముఖుడు, విధేయుడూ, బహుదైవారాధకులతో ఏ మాత్రం సంబంధం లేని మా పితామహుడు ఇబ్రాహీం విధానం ప్రకారం మేము తెల్లవారు జాములోకి ప్రవేశించాము (లేక సాయం కాలంలోకి ప్రవేశించాము). (అహ్మద్)

(ఉదయం:)

أَصْبَحْنَا وَأَصْبَحَ الْمُلْكُ لِلَّهِ وَالْحَمْدُ لِلَّهِ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ. رَبِّ أَسْأَلُكَ خَيْرَ مَا فِي هَذَا الْيَوْمِ وَخَيْرَ مَا بَعْدَهُ وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا فِي هَذَا الْيَوْمِ وَشَرِّ مَا بَعْدَهُ. رَبِّ أَعُوذُ بِكَ مِنَ الْكَسَلِ وَسُوءِ الْكِبَرِ. رَبِّ أَعُوذُ بِكَ مِنْ عَذَابٍ فِي النَّارِ وَعَذَابٍ فِي الْقَبْرِ

అస్బహ్ నా వ అస్బహల్ ముల్కు లిల్లాహి, వల్హమ్దు లిల్లాహి, లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వ హువ అలా కుల్లి షైయిన్ ఖదీర్. రబ్బి! అస్అలుక ఖైర మా ఫీ హాజల్ యౌమి వ ఖైర మా బాదహూ వ అవూజు బిక మిన్ షర్రి మా ఫీ హాజల్ యౌమి వ షర్రి మా బాదహూ. రబ్బి! అవూజు బిక మినల్ కసలి, వ సూయిల్ కిబరి. రబ్బి! అవూజు బిక మిన్ అజాబిన్ ఫిన్నార్ వ అజాబిన్ ఫిల్ ఖబరి.

తెల్లవారింది. అల్లాహ్ రాజ్యమంతా తెల్ల వారింది. సకల స్తోత్రాలూ అల్లాహ్కే. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన ఒకే ఒక్కడు. ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. విశ్వ సామ్రాజ్యాధికారం ఆయనదే. స్తోత్రం ఆయనకే. ఆయన ప్రతి వస్తువుపై పరిపూర్ణ అధికారం కల వాడు. ప్రభూ! ఈ రోజులోని శ్రేయాన్ని, దీని తర్వాత కలిగే శ్రేయాన్ని ప్రసాదించమని అర్థి స్తున్నాను. ఈ రోజులోని కీడు నుంచి, దీని తర్వాత కలిగే కీడు నుంచి రక్షించమని నేను నీ శరణు వేడుతున్నాను. ప్రభూ! సోమరితనం నుంచి, విపరీతమైన వృద్ధాప్యం నుంచి నీ శరణు వేడు కుంటున్నాను. ప్రభూ! నరకాగ్ని శిక్ష నుంచి, సమాధిలో కలిగే బాధల నుంచి నీ శరణు వేడు కుంటున్నాను. (ముస్లిం)

(సాయంత్రం:)

أَمْسَيْنَا وَأَمْسَى الْمُلْكُ لِلَّهِ وَالْحَمْدُ لِلَّهِ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ. رَبِّ أَسْأَلُكَ خَيْرَ مَا فِي هَذِهِ اللَّيْلَةِ وَخَيْرَ مَا بَعْدَهَا وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا فِي هَذِهِ اللَّيْلَةِ وَشَرِّ مَا بَعْدَهَا. رَبِّ أَعُوذُ بِكَ مِنَ الْكَسَلِ وَسُوءِ الْكِبَرِ. رَبِّ أَعُوذُ بِكَ مِنْ عَذَابٍ فِي النَّارِ وَعَذَابٍ فِي الْقَبْرِ

అమ్సైనా వ అమ్సల్ ముల్కు లిల్లాహి, వల్హమ్దు లిల్లాహి, లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ,

లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వ హువ అలా కుల్లి షైయిన్ ఖదీర్. రబ్బి! అస్అలుక ఖైర మా ఫీ హాజిహిల్లైలతి వ ఖైర మా బాదహా… వ అవూజు బిక మిన్ షర్రి మా ఫీ హాజిహిల్లైలతి వ షర్రి మా బాదహా. రబ్బి! అవూజు బిక మినల్ కసలి, వ సూయిల్ కిబరి. రబ్బి! అవూజు బిక మిన్ అజాబిన్ ఫిన్నార్ వ అజాబిన్ ఫిల్ ఖబరి.

సాయంకాలం అయింది. అల్లాహ్ రాజ్యమంతా సాయంకాలం అయింది. సకల స్తోత్రాలూ అల్లాహ్కే. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన ఒకే ఒక్కడు. ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. విశ్వ సామ్రాజ్యాధికారం ఆయనదే. స్తోత్రం ఆయనకే. ఆయన ప్రతి వస్తువుపై పరిపూర్ణ అధికారం కలవాడు. ప్రభూ! ఈ రాత్రిలోని శ్రేయాన్ని, దీని తర్వాత కలిగే శ్రేయాన్ని ప్రసాదించ మని అర్థిస్తున్నాను. ఈ రాత్రిలోని కీడు నుంచి, దీని తర్వాత కలిగే కీడు నుంచి రక్షించమని నేను

నీ శరణు వేడుతున్నాను. ప్రభూ! సోమరితనం నుంచి, విపరీతమైన వృద్ధాప్యం నుంచి నీ శరణు వేడుకుంటున్నాను. ప్రభూ! నరకాగ్ని శిక్ష నుంచి, సమాధిలో కలిగే బాధల నుంచి నీ శరణు వేడు కుంటున్నాను. (ముస్లిం)

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెల్లవారినప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు:

(ఉదయం:)

اللَّهُمَّ بِكَ أَصْبَحْنَا وَبِكَ أَمْسَيْنَا وَبِكَ نَحْيَا وَبِكَ نَمُوتُ وَإِلَيْكَ النُّشُورُ

అల్లాహుమ్మ బిక అస్బహ్నా వ బిక అమ్సైనా వ బిక నహ్యా వ బిక నమూతు వ ఇలైక న్నుషూర్.

అల్లాహ్! నీ కృపతోనే మేము ఓ కొత్త ఉదయం లోనికి ప్రవేశించాము. నీ కృపతోనే సాయంత్రం వరకూ ఉంటాం. నీ దయ వల్లనే మేము బ్రతికి ఉన్నాము. తిరిగి నీ ఆజ్ఞతోనే మరణిస్తాం. తిరిగి

లేపబడిన తరువాత మేమంతా నీ వద్దకే మరలి రావలసి ఉన్నది. (అబూ దావూద్-సహీహ్)

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సాయంత్రం వేళ ఈ విధంగా ప్రార్థించేవారు:

(సాయంత్రం:)

اللَّهُمَّ بِكَ أَمْسَيْنَا وَبِكَ أَصْبَحْنَا وَبِكَ نَحْيَا وَبِكَ نَمُوتُ وَإِلَيْكَ الْمَصِيرُ

అల్లాహుమ్మ బిక అమ్సైనా వ బిక అస్బహ్నా వ బిక నహ్యా వ బిక నమూతు వ ఇలైకల్ మసీర్.

అల్లాహ్! నీ కృపతోనే సాయంకాలం అయింది. తిరిగి నీ కృపతోనే తెల్లవారుతుంది. నీ దయ వల్లనే మేము బ్రతికి ఉంటాం. నీ ఆజ్ఞతోనే మరణిస్తాం. తిరిగి లేపబడిన తరువాత మేమంతా నీ వద్దకే మరలి రావలసి ఉంది. (అబూ దావూద్- సహీహ్)

اللَّهُمَّ إِنِّي أَصْبَحْتُ أُشْهِدُكَ وَأُشْهِدُ حَمَلَةَ عَرْشِكَ وَمَلَائِكَتَكَ وَجَمِيعَ خَلْقِكَ أَنَّكَ أَنْتَ اللَّهُ لَا إِلَهَ إِلَّا أَنْتَ وَحْدَكَ لَا شَرِيكَ لَكَ وَأَنَّ مُحَمَّدًا cَبْدُكَ وَرَسُولُكَ

అల్లాహుమ్మ ఇన్నీ అస్బహ్తు (సాయంత్రమైతే

“అమ్సైతు” అనాలి) ఉష్హిదుక వ ఉష్హిదు హమలత అర్షిక వ మలాయికతక వ జమీఅ ఖల్ఖిక అన్నక అంతల్లాహు, లా ఇలాహ ఇల్లా అంత వహ్దక లా షరీక లక, వఅన్న ముహమ్మదన్ అబ్దుక వ రసూలుక. (4 సార్లు)

ఓ అల్లాహ్! నేను ఓ క్రొత్త ఉదయం (లేక సాయంత్రం)లోనికి ప్రవేశించాను. నీ సాక్షిగా! నీ సింహాసనాన్ని మోస్తున్నవారి సాక్షిగా! నీ దూతల సాక్షిగా! నీ సర్వసృష్టి సాక్షిగా! నీవు మాత్రమే ఆరాధనలకు అర్హుడవని, నీవు తప్ప మరెవ్వరూ ఆరాధనలకు అర్హులుకారని, నీవు ఒక్కడివేనని, నీకు భాగస్వాములు ఎవరూ లేరని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ దాసుడు, ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను.

పఠించటం వల్ల ప్రయోజనమేంటి?

ఈ దుఆను ప్రొద్దున లేక సాయంత్రం నాలుగు సార్లు చదివిన వ్యక్తికి అల్లాహ్ నరకాగ్ని నుండి విముక్తి కల్పిస్తాడు. (బుఖారి, అబూదావూద్ 4/317)

اللَّهُمَّ مَا أَصْبَحَ بِي مِنْ نِعْمَةٍ أَوْ بِأَحَدٍ مِنْ خَلْقِكَ فَمِنْكَ وَحْدَكَ لَا شَرِيكَ لَكَ فَلَكَ الْحَمْدُ وَلَكَ الشُّكْرُ

అల్లాహుమ్మ మా అస్బహ (సాయంత్రమైతే ‘మా అమ్సా’ అని చెప్పాలి) బీ మిన్ నీమతిన్ అవ్ బిఅహదిమ్మిన్ ఖల్ఖిక ఫ మిన్క వహ్దక లా షరీక లక, ఫలకల్ హమ్దు వలకష్షుక్ర్.

ఓ అల్లాహ్! నేను గాని నీ సర్వ సృష్టిలో మరిం కెవరైనా గాని ఈ ఉదయం పూట (లేక ఈ సాయంత్రం వేళ) పొందిన మేళ్ళన్నీ నీ వద్ద నుండి ప్రాప్తించినవే. నీకు భాగస్వాములెవరూ లేరు. స్తోత్రములు, కృతజ్ఞతలన్నీ నీకే చెందుతాయి.

పఠించటం వల్ల ప్రయోజనమేంటి?

ఎవరైతే ప్రొద్దున ఈ దుఆను చదువుతారో, వారు ఆ పగలు అల్లాహ్ కు కృతజ్ఞత చెల్లించవలసిన బాధ్యతను నెరవేర్చిన వారవుతారు. ఎవరైతే

సాయంత్రం చదువుతారో, వారు ఆ రాత్రికి అల్లాహ్ కు కృతజ్ఞత చెల్లించవలసిన బాధ్యతను నెరవేర్చిన వారవుతారు. (అబూదావూద్ 4/318, నసాయి, ఇబ్నె హిబ్బాన్ 2361)

(ఉదయం:)

أَصْبَحْنَا وَأَصْبَحَ الْمُلْكُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ خَيْرَ هَذَا الْيَوْمِ: فَتْحَهُ، وَنَصْرَهُ، وَنُورَهُ، وَبَرَكَتَهُ، وَهُدَاهُ، وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا فِيهِ وَشَرِّ مَا bَعْدَهُ

అస్బహ్ నా వ అస్బహల్ ముల్కు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఖైర హాజల్ యౌమి ఫత్హహూ వ నస్రహూ వ నూరహూ వ బరకతహూ వ హుదాహు వ అవూజు బిక మిన్ షర్రి మా ఫీహి వ షర్రి మా బాదహూ.

(సాయంత్రం:)

أَمْسَيْنَا وَأَمْسَى الْمُلْكُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ خَيْرَ هَذِهِ اللَّيْلَةِ: فَتْحَهَا، وَنَصْرَهَا، وَనُورَهَا، وَبَرَكَتَهَا، وَهُدَاهَا، وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا فِيهَا وَشَرِّ مَا بَعْدَهَا

అమ్సైనా వ అమ్సల్ ముల్కు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఖైర హాజిహిల్లైలతి ఫత్హహా వ నస్రహా వ నూరహా వ బరకతహా వ హుదాహా

వ అవూజు బిక మిన్ షర్రి మా ఫీహా వ షర్రి మా బాదహా.

తెల్లవారింది (లేక సాయంత్రమయింది). సర్వ లోకాల ప్రభువైన అల్లాహ్ యొక్క విశ్వవ్యవస్థలోనూ తెల్లవారింది (లేక సాయంత్రమయింది). ఓ అల్లాహ్! ఈ రోజు (లేక రాత్రి)లోని మేలును, అంటే అందులోని విజయాన్ని, సహాయాన్ని, కాంతిని, అందులోని శుభాలను, దానిలోని రుజుమార్గాన్ని ప్రసాదించమని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ఈ రోజు (లేక రాత్రి)లోని కీడును, దాని తర్వాత రాబోయే కీడు నుంచి నేను శరణు వేడుకుంటున్నాను. (అబూదావూద్)

يَا حَيُّ يَا قَيُّومُ بِرَحْمَتِكَ أَسْتَغِيثُ أَصْلِحْ لِي شَأْنِي كُلَّهُ وَلَا تَكِلْنِي إِلَى نَفْسِي طَرْفَةَ عَيْنٍ

యా హయ్యు యా ఖయ్యూము బిరహ్మతిక అస్తగీసు. అస్లిహ్ లీ షానీ కుల్లహూ వలా తకిల్నీ ఇలా నఫ్సీ తర్ఫత ఐనిన్

ఓ నిత్య సజీవా! విశ్వానికి ఆధారభూతుడా! నీ కారుణ్యం ఆధారంగా అర్థిస్తున్నాను. నా వ్యవహా రాలన్నింటినీ చక్కదిద్దు. రెప్పపాటు సమయమైనా నన్ను నా మనసుకు అప్పగించకు. (హాకిమ్)

అల్లాహుమ్మ ఆఫినీ ఫీ బదనీ, అల్లాహుమ్మ ఆఫినీ ఫీ సమ్ఈ, అల్లాహుమ్మ ఆఫినీ ఫీ బసరీ, లా ఇలాహ ఇల్లా అంత, అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మినల్ కుఫ్రి వల్ ఫఖ్రి, వ అవూజు బిక మిన్ అజాబిల్ ఖబ్రి, లా ఇలాహ ఇల్లా అంత. (3 సార్లు)

ఓ అల్లాహ్! నా దేహాన్ని సురక్షితంగా ఉంచు. నా వినికిడి శక్తిని సురక్షితంగా ఉంచు. నా కంటి చూపును సురక్షితంగా ఉంచు. నీవు తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు. ఓ అల్లాహ్! నీ పట్ల తిరస్కార

భావం కలిగివుండటం నుంచి, దారిద్ర్యానికి గురవటం నుంచి నీ శరణు వేడుతున్నాను. సమాధి యాతన నుంచి నీ శరణు వేడుతున్నాను. నీవు తప్ప మరో ఆరాధ్యుడు లేడు.

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫిఆ, వ రిజ్ఖన్ తయ్యిబా, వ అమలమ్ ముతఖబ్బలా

ఓ అల్లాహ్! ప్రయోజనకరమైన విద్యను, ధర్మ సమ్మతమైన ఉపాధిని, స్వీకృతిని పొందే ఆచరణా భాగాన్ని ప్రసాదించమని నేను నిన్ను ప్రార్థిస్తు న్నాను. (ఇబ్నెమాజా)

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉదయం, సాయంత్రం ఈ ప్రార్థన చేయటం ఎన్నడూ వదలి పెట్టేవారు కాదు –

“అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫిద్దున్యా వల్ ఆఖిరతి అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫీ దీనీ వ దున్యాయ వ అహ్లీ వ మాలీ. అల్లాహుమ్మస్తుర్ ఔరాతీ వ ఆమిన్ రౌఆతీ. అల్లాహుమ్మహ్ఫజ్నీ మిన్ బైని యదయ్య వ మిన్ ఖల్ఫీ వ అన్ యమీనీ వ అన్ షిమాలీ వ మిన్ ఫౌఖీ వ అవూజు బి అజ్మతిక అన్ ఉగ్తాల మిన్ తహ்தీ.”

అల్లాహ్! నాకు ఇహపరాల్లో మన్నింపును, క్షేమాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను. ఇంకా ప్రాపంచిక, ధార్మిక వ్యవహారాల్లో, సిరిసంపదల్లో, నా ఇంటివారి వ్యవహారాల్లో క్షేమాన్ని ప్రసాదించు. అల్లాహ్! నా లోపాలను మరుగుపరచు. నన్ను భయాందోళనల నుండి కాపాడు. అల్లాహ్! ముందు నుంచి, వెనుక నుంచి, కుడి నుంచి, ఎడమ నుంచి, పై నుంచి, క్రింది నుంచి నన్ను రక్షించు. నేను

క్రింది నుంచి నాశనమయి పోకుండా ( భూమిలో కూరుకుపోకుండా) ఉండాలని నీ ఔన్నత్యాన్ని శరణు కోరుతున్నాను. (అబూ దావూద్-సహీహ్)

అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో మాట్లాడుతూ, “దైవ ప్రవక్తా! నేను ఉదయం, సాయంత్రం చేసుకోవ టానికి అనువుగా నాకో ప్రార్థన ఉపదేశించండి” అని అడిగాను. అందుకాయన (సల్లల్లాహు అలైహి వసల్లం), “ఈ విధంగా ప్రార్థించు. ఉదయం, సాయంత్రం ఇంకా నిద్రపోవ టానికి పడక మీదకు చేరుకున్నప్పుడు కూడా నువ్వు ఈ ప్రార్థన చెయ్యవచ్చు” అని అన్నారు.

اللَّهُمَّ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ فَاطِرَ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبَّ كُلِّ شَيْءٍ وَمَلِيكَهُ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا أَنْتَ أَعُوذُ بِكَ مِنْ شَرِّ نَفْسِي وَمِنْ شَرِّ الشَّيْطَانِ وَشِرْكِهِ وَأَنْ أَقْتَرِفَ عَلَى نَفْسِي سُوءًا أَوْ أَجُرَّهُ إِلَى مُsْلِمٍ

“అల్లాహుమ్మ ఆలిమల్ గైబి వష్షహాదతి ఫాతిర స్సమావాతి వల్ అర్ది, రబ్బ కుల్ల షైయిన్ వ మలీకహూ అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత

అవూజు బిక మిన్ షర్రి నఫ్సీ వ మిన్ షర్రిష్షయి తాని, వ షిర్కిహీ వ అన్ అఖ్తరిఫ అలా నఫ్సీ సూఅన్ అవ్ అజుర్రహూ ఇలా ముస్లిమ్”

అల్లాహ్! గోచరాగోచరాల జ్ఞానీ! భూమ్యాకా శాల నిర్మాతా! సకల సృష్టికి యజమానీ! పరి పోషకా! నీవు తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్య మిస్తున్నాను. నేను నా ఆంతర్యంలో జనించే కీడు నుండి, షైతాన్ కీడు నుండి, అతని ‘షిర్క్’ కీడు నుండి నీ శరణు వేడుతున్నాను. ఇంకా నాకు నేను కీడు చేసుకోకుండా, నేను మరొకరికి కీడు తలపెట్టకుండా ఉండేలా నీ శరణు వేడుకుంటు న్నాను. (తిర్మిజీ)

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ

లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్.

అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములెవరూ లేరు. విశ్వ సామ్రాజ్యాధికారం ఆయనదే. స్తోత్రం ఆయనకే. ఆయన ప్రతి వస్తువుపై సంపూర్ణ అధికారం కలిగి వున్నాడు. (సహీహ్ ఇబ్నెమాజా 2/331)

سُبْحَانَ اللَّهِ وَبِحَمْدِهِ

“సుబ్ హా నల్లాహి వ బిహమ్దిహీ” (100 సార్లు)

అల్లాహ్ తన స్తుతి సమేతంగా (మానవులు కలిగి వుండే) సకల లోపాల నుంచి పవిత్రుడు.

أَسْتَغْفِرُ اللَّهَ وَأَتُوبُ إِلَيْهِ

“అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహ్” (100 సార్లు)

నేను అల్లాహ్ను క్షమాభిక్ష వేడుకుంటున్నాను.

(నా పాపాలపై పశ్చాత్తాపంతో) ఆయన వైపుకే మరలుతున్నాను.

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ mَجِيدٌ. اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ

“అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్, వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్.”
(10 సార్లు)

ఓ అల్లాహ్! నీవు ఇబ్రాహీంను ఆయన కుటుంబం వారిని కరుణించినట్లుగానే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను మరియు ఆయన కుటుంబం వారిని

కూడా కరుణించు. స్తోత్రానికి అర్హుడవు. ఘనత కలవాడవు నీవే. ఓ అల్లాహ్! ఇబ్రాహీం (అలైహి)పై, ఆయన కుటుంబం వారిపై శుభాలు కురిపించి నట్లుగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన కుటుంబీకులపై కూడా శుభాలు కురిపించు. నిస్సందేహంగా స్తుతింపదగినవాడవు, మహా ఘనుడవు నీవే. (బుఖారీ)

పఠించటం వల్ల ప్రయోజనమేంటి?

“ఎవరైనా ఉదయం, సాయంత్రం పదిసార్లు నా కొరకు దరూద్ పఠిస్తే వారికి ప్రళయ దినాన నా సిఫారసు ప్రాప్తిస్తుంది” అని స్వయానా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు. (తబ్రానీ)

اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُ sِنَةٌ وَلَا نَوْمٌ ۚ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ ۖ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ ۚ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ ۖ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا ۚ وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُఅల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, లా తాఖుజుహూ సినతున్ వలా నౌమ్, లహూ మాఫిస్సమావాతి వమా ఫిల్ అర్ద్, మన్ జల్లజీ యష్ఫఉ ఇందహూ ఇల్లా బి ఇజ్నిహీ, యాలము మాబైన ఐదీహీం వమా ఖల్ఫహుం, వలా యుహీతూన బిషైయి మ్మిన్ ఇల్మిహీ ఇల్లా బిమా షాఅ, వసిఅ కుర్సియ్యు హుస్సమావాతి వల్ అర్ద్, వలా యవూదుహూ హిఫ్జుహుమా వహువల్ అలియ్యుల్ అజీం. (సూర బఖర 2 : 255)

ఉదయం సాయంత్రం క్రింది మూడు సూరాలు
సూరహ్ ఇఖ్లాస్ (3 సార్లు)بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
قُلْ هُوَ اللَّهُ أَحَدٌ اللَّهُ الصَّمَدُ لَمْ يَلِدْ وَలَمْ يُولَدْ وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
ఖుల్ హువల్లాహు అహద్. అల్లాహుస్సమద్.లమ్ యలిద్ వలమ్ యూలద్. వలమ్. యకుల్లహూ కుఫువన్ అహద్.

సూరహ్ ఫలఖ్ (3 సార్లు)

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِقُلْ أَعُوذُ بِرَبِّ الْఫَلَقِ مِن شَرِّ مَا خَلَقَ وَమِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَబిస్మిల్లా హిర్రహ్మానిర్రహీమ్ఖుల్ అవూజు బిరబ్బిల్ ఫలఖ్. మిన్ షర్రి మా ఖలఖ్. వ మిన్ షర్రి గాసిఖిన్ ఇజా వఖబ్, వ మిన్ షర్రిన్నఫ్ఫాసాతి ఫిల్ ఉఖద్. వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్.

సూరహ్ నాస్ (3 సార్లు)

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِقُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ مَلِكِ النَّاسِ إِلَٰهِ النَّاسِ مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ مِنَ الْجِنَّةِ وَالنَّاسِబిస్మిల్లా హిర్రహ్మానిర్రహీమ్ఖుల్ అవూజు బిరబ్బిన్నాస్, మలికిన్నాస్. ఇలాహిన్నాస్, మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్, అల్లజీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్. మినల్ జిన్నతి వన్నాస్.

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌలా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్. (10 సార్లు)

اللَّهُمَّ أَنْتَ رَبِّ لَا إِلَهَ إِلَّا أَنْتَ خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَا اسْتَطَعْتُ أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ أَبُوءُ لَكَ bِنِعْمَتِكَ عَلَيَّ وَأَبُوءُ لَكَ بِذَنْبِي فَاغْفِرْ لِي فَإِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ“అల్లాహుమ్మ అంత రబ్బీ లా యిలాహ ఇల్లా అంత, ఖలఖ్తనీ వ అన అబ్దుక, వ అన అలా అహ్దిక వ వాదిక మస్తతాతు, అవూజు బిక మిన్ షర్రి మా సనాతు అబూవు లక బినీమతిక అలయ్య, వ అబూవు లక బిజంబీ, ఫగ్ఫిర్లీ ఫఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత.”

بِسْمِ اللَّهِ الَّذِي لَا يَضُرُّ مَعَ اسْمِهِ شَيْءٌ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ“బిస్మిల్లా హిల్లజీ లా యదుర్రు మఅస్మిహీ షైవున్ ఫిల్ అర్ది వలా ఫిస్సమాయి వహు వస్సమీఉల్ అలీం.” (3 సార్లు)

أَعُوذُ بِكَلِمَاتِ اللَّهِ التَّامَّاتِ مِنْ شَرِّ مَا خَلَقَ“అవూజు బి కలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్.” (3 సార్లు)

رَضِيتُ بِاللَّهِ رَبًّا وَبِالْإِسْلَامِ دِينًا وَبِمُحَمَّدٍ نَبِيًّاరద్వీతు బిల్లాహి రబ్బన్ వబిల్ ఇస్లామి దీనన్ వబి ముహమ్మదిన్ నబియ్యా (3 సార్లు)

حَسْبِيَ اللَّهُ لَا إِلَهَ إِلَّا هُوَ عَلَيْهِ تَوَكَّلْتُ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيمِహస్బియల్లాహు లా ఇలాహ ఇల్లా హువ అలైహి తవక్కల్తు వహువ రబ్బుల్ అర్షిల్ అజీం (7 సార్లు)

سُبْحَانَ اللَّهِ وَبِحَمْدِهِ عَدَدَ خَلْقِهِ، وَرِضَا نَفْسِهِ، وَزِنَةَ عَرْشِهِ، وَمِدَادَ كَلِمَاتِهِసుబ్ హా నల్లాహి వ బిహమ్దిహీ అదద ఖల్ఖిహీ, రిజా నఫ్సిహీ, జినత అర్షిహీ, మిదాద కలిమాతిహీ (3 సార్లు)

అస్బహ్నా (సాయంత్రమైతే “అమ్సైనా” అనాలి)అలా ఫిత్రతిల్ ఇస్లామి వ అలా కలిమతిల్ ఇఖ్లాసి వ అలా దీని నబియ్యినా ముహమ్మదిన్ వఅలా మిల్లతి అబీనా ఇబ్రాహీం, హనీఫన్ ముస్లిమా, వమా కాన మినల్ ముష్రికీన్.

(ఉదయం:) أَصْبَحْنَا وَأَصْبَحَ الْمُلْكُ لِلَّهِ وَالْحَمْدُ لِلَّهِ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ. رَبِّ أَسْأَلُكَ خَيْرَ مَا فِي هَذَا الْيَوْمِ وَخَيْرَ مَا بَعْدَهُ وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا فِي هَذَا الْيَوْمِ وَشَرِّ مَا بَعْدَهُ. رَبِّ أَعُوذُ بِكَ مِنَ الْكَسَلِ وَسُوءِ الْكِبَرِ. رَبِّ أَعُوذُ بِكَ مِنْ عَذَابٍ فِي النَّارِ وَعَذَابٍ فِي الْقَبْرِ
అస్బహ్నా వ అస్బహల్ ముల్కు లిల్లాహి, వల్హమ్దు లిల్లాహి, లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వ హువ అలా కుల్లి షైయిన్ ఖదీర్. రబ్బి! అస్అలుక ఖైర మా ఫీ హాజల్ యౌమి వ ఖైర మా బాదహూ వ అవూజు బిక మిన్ షర్రి మా ఫీ హాజల్ యౌమి వ షర్రి మా బాదహూ. రబ్బి! అవూజు బిక మినల్ కసలి, వ సూయిల్ కిబరి. రబ్బి! అవూజు బిక మిన్ అజాబిన్ ఫిన్నార్ వ అజాబిన్ ఫిల్ ఖబరి.

(సాయంత్రం:) أَمْسَيْنَا وَأَمْسَى الْمُلْكُ لِلَّهِ وَالْحَمْدُ لِلَّهِ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ. رَبِّ أَسْأَلُكَ خَيْرَ مَا فِي هَذِهِ اللَّيْلَةِ وَخَيْرَ مَا بَعْدَهَا وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا فِي هَذِهِ اللَّيْلَةِ وَشَرِّ مَا بَعْدَهَا. رَبِّ أَعُوذُ بِكَ مِنَ الْكَسَلِ وَسُوءِ الْكِبَرِ. رَبِّ أَعُوذُ بِكَ مِنْ عَذَابٍ فِي النَّارِ وَعَذَابٍ فِي الْقَبْرِ
అమ్సైనా వ అమ్సల్ ముల్కు లిల్లాహి, వల్హమ్దు లిల్లాహి, లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వ హువ అలా కుల్లి షైయిన్ ఖదీర్. రబ్బి! అస్అలుక ఖైర మా ఫీ హాజిహిల్లైలతి వ ఖైర మా బాదహా వ అవూజు బిక మిన్ షర్రి మా ఫీ హాజిహిల్లైలతి వ షర్రి మా బాదహా. రబ్బి! అవూజు బిక మినల్ కసలి, వ సూయిల్ కిబరి. రబ్బి! అవూజు బిక మిన్ అజాబిన్ ఫిన్నార్ వ అజాబిన్ ఫిల్ ఖబరి.

(ఉదయం:) اللَّهُمَّ بِكَ أَصْبَحْنَا وَبِكَ أَمْسَيْنَا وَبِكَ نَحْيَا وَبِكَ نَمُوتُ وَإِلَيْكَ النُّشُورُఅల్లాహుమ్మ బిక అస్బహ్నా వ బిక అమ్సైనా వ బిక నహ్యా వ బిక నమూతు వ ఇలైక న్నుషూర్.

(సాయంత్రం:) اللَّهُمَّ بِكَ أَمْسَيْنَا وَبِكَ أَصْبَحْنَا وَبِكَ نَحْيَا وَبِكَ nَمُوتُ وَإِلَيْكَ الْمَصِيرُఅల్లాహుమ్మ బిక అమ్సైనా వ బిక అస్బహ్నా వ బిక నహ్యా వ బిక నమూతు వ ఇలైకల్ మసీర్.

اللَّهُمَّ إِنِّي أَصْبَحْتُ أُشْهِدُكَ وَأُشْهِدُ حَمَلَةَ عَرْشِكَ وَمَلَائِكَتَكَ وَجَمِيعَ خَلْقِكَ أَنَّكَ أَنْتَ اللَّهُ لَا إِلَهَ إِلَّا أَنْتَ وَحْدَكَ لَا شَرِيكَ لَكَ وَأَنَّ مُحَمَّدًا cَبْدُكَ وَرَسُولُكَ
అల్లాహుమ్మ ఇన్నీ అస్బహ్తు (సాయంత్ర మైతే “అమ్సైతు” అనాలి) ఉష్హిదుక వ ఉష్హిదు హమలత అర్షిక వ మలాయికతక వ జమీఅ ఖల్ఖిక అన్నక అంతల్లాహు, లా ఇలాహ ఇల్లా అంత వహ్దక లా షరీక లక, వఅన్న ముహమ్మదన్ అబ్దుక వ రసూలుక. (4 సార్లు)

اللَّهُمَّ مَا أَصْبَحَ بِي مِنْ نِعْمَةٍ أَوْ بِأَحَدٍ مِنْ خَلْقِكَ فَمِنْكَ وَحْدَكَ لَا شَرِيكَ لَكَ فَلَكَ الْحَمْدُ وَلَكَ الشُّكْرُ
అల్లాహుమ్మ మా అస్బహ (సాయంత్రమైతే ‘మా అమ్సా’ అని చెప్పాలి) బీ మిన్ నీమతిన్ అవ్ బిఅహదిమ్మిన్ ఖల్ఖిక ఫ మిన్క వహ్దక లా షరీక లక, ఫలకల్ హమ్దు వలకష్షుక్ర్.

(ఉదయం:) أَصْبَحْنَا وَأَصْبَحَ الْمُلْكُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ خَيْرَ هَذَا الْيَوْمِ: فَتْحَهُ، وَنَصْرَهُ، وَنُورَهُ، وَبَرَكَتَهُ، وَهُدَاهُ، وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا فِيهِ وَشَرِّ مَا bَعْدَهُఅస్బహ్నా వ అస్బహల్ ముల్కు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఖైర హాజల్ యౌమి ఫత్హహూ వ నస్రహూ వ నూరహూ వ బరకతహూ వ హుదాహు వ అవూజు బిక మిన్ షర్రి మా ఫీహి వ షర్రి మా బాదహూ.

(సాయంత్రం:) أَمْسَيْنَا وَأَمْسَى الْمُلْكُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ خَيْرَ هَذِهِ اللَّيْلَةِ: فَتْحَهَا، وَنَصْرَهَا، وَنُورَهَا، وَبَرَكَتَهَا، وَهُدَاهَا، وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا فِيهَا وَشَرِّ مَا بَعْدَهَاఅమ్సైనా వ అమ్సల్ ముల్కు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఖైర హాజిహిల్లైలతి ఫత్హహా వ నస్రహా వ నూరహా వ బరకతహా వ హుదాహా వ అవూజు బిక మిన్ షర్రి మా ఫీహా వ షర్రి మా బాదహా.

يَا حَيُّ يَا قَيُّومُ بِرَحْمَتِكَ أَسْتَغِيثُ أَصْلِحْ لِي شَأْنِي كُلَّهُ وَلَا تَكِلْنِي إِلَى نَفْسِي طَرْفَةَ عَيْنٍ
యా హయ్యు యా ఖయ్యూము బిరహ్మతిక అస్తగీసు. అస్లిహ్ లీ షానీ కుల్లహూ వలా తకిల్నీ ఇలా నఫ్సీ తర్ఫత ఐనిన్.

اللَّهُمَّ عَافِنِي فِي بَدَنِي اللَّهُمَّ عَافِنِي فِي sَمْعِي اللَّهُمَّ عَافِنِي فِي بَصَرِي لَا إِلَهَ إِلَّا أَنْتَ. اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْكُفْرِ وَالْفَقْرِ وَأَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ لَا إِلَهَ إِلَّا أَنْتَ
అల్లాహుమ్మ ఆఫినీ ఫీ బదనీ, అల్లాహుమ్మ ఆఫినీ ఫీ సమ్ఈ, అల్లాహుమ్మ ఆఫినీ ఫీ బసరీ, లా ఇలాహ ఇల్లా అంత, అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మినల్ కుఫ్రి వల్ ఫఖ్రి, వ అవూజు బిక మిన్ అజాబిల్ ఖబ్రి, లా ఇలాహ ఇల్లా అంత. (3 సార్లు)

(ఉదయం:) اللَّهُمَّ إِنِّي أَsْأَلُكَ عِلْمًا نَافِعًا وَرِزْقًا طَيِّبًا وَعَمَلًا مُتَقَبَّلًا
అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫిఆ, వ రిజ్ఖన్ తయ్యిబా, వ అమలమ్ ముతఖబ్బలా

اللَّهُمَّ إِنِّي أَsْأَلُكَ الْعَفْوَ وَالْعَافِيَةَ فِي الدُّنْيَا وَالْآخِرَةِ اللَّهُمَّ إِنِّي أَsْأَلُكَ الْعَفْوَ وَالْعَافِيَةَ فِي دِينِي وَدُنْيَايَ وَأَهْلِي وَمَالِي اللَّهُمَّ اسْتُرْ عَوْرَاتِي وَآمِنْ رَوْعَاتِي اللَّهُمَّ احْفَظْنِي مِنْ bَيْنِ يَدَيَّ وَمِنْ خَلْفِي وَعَنْ يَمِينِي وَعَنْ شِمَالِي وَمِنْ فَوْقِي وَأَعُوذُ بِعَظَمَتِكَ أَنْ أُغْتَالَ مِنْ تَحْتِي
“అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫిద్దున్యా వల్ ఆఖిరతి. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫీ దీనీ వ దున్యాయ వ అహ్లీ వ మాలీ. అల్లాహుమ్మస్తుర్ ఔరాతీ వ ఆమిన్ రౌఆతీ. అల్లాహుమ్మహ్ఫజ్నీ మిన్ బైని యదయ్య వ మిన్ ఖల్ఫీ వ అన్ యమీనీ వ అన్ షిమాలీ వ మిన్ ఫౌఖీ వ అవూజు బి అజ్మతిక అన్ ఉగ్తాల మిన్ తహ்தీ.”

اللَّهُمَّ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ فَاطِرَ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبَّ كُلِّ شَيْءٍ وَمَلِيكَهُ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا أَنْتَ أَعُوذُ بِكَ مِنْ شَرِّ نَفْسِي وَمِنْ شَرِّ الشَّيْطَانِ وَشِرْكِهِ وَأَنْ أَقْتَرِفَ عَلَى نَفْسِي sُوءًا أَوْ أَجُرَّهُ إِلَى مُsْلِمٍ
“అల్లాహుమ్మ ਆలిమల్ గైబి వష్షహాదతి ఫాతిర స్సమావాతి వల్ అర్ద్, రబ్బ కుల్ల షైయిన్ వ మలీకహూ, అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అవూజు బిక మిన్ షర్రి నఫ్సీ వ మిన్ షర్రిష్షయితాని, వ షిర్కిహీ వ అన్ అఖ్తరిఫ అలా నఫ్సీ సూఅన్ అవ్ అజుర్రహూ ఇలా ముస్లిమ్”

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ
లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వహువ అలాకుల్లి షైయిన్ ఖదీర్, (100 సార్లు)

بْحَانَ اللَّهِ وَبِحَمْدِهِ
“సుబ్ హా నల్లాహి వ బిహమ్దిహీ” (100 సార్లు)

“అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహ్” (100 సార్లు)

“అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్. వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్.” (10 సార్లు)

ఈ పుస్తకంపై మీ సలహాలు, సూచనలను ఈ క్రింద తెలుపబడిన చిరునామాకు లేదా ఈ-మెయిలుకు పంపించ మనవి.

హాఫిజ్ ఎస్.ఎం. రసూల్ షర్ఫీ
16-2-867/10, అక్బర్ బాగ్, సయీదాబాద్,
హైదరాబాద్- 59. సెల్ : 9676144697
E-mail: shantimargam@gmail.com

ఈ పుస్తకాన్ని కనీసం 500 కాపీలు లేదా 1000, 1500, 2000 ఇలా ఎన్ని కాపీలైనా ముద్రించి దైవమార్గంలో ఉచితంగా పంచిపెట్టాలని కోరుతున్న శ్రేయోభిలాషులు వివరాల కోసం “శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్టు” వారిని సంప్రదించగలరు.
సెల్ : 9676144697
E-mail: shantimargam@gmail.com

(తనను సృష్టించిన) తన ప్రభువు (అల్లాహ్)ను స్మరించే వాడు బ్రతికున్న మనిషితో సమానం. స్మరించనివాడు చచ్చిపోయిన వానితో సమానం. (బుఖారి)

మనిషి తనను తాను అల్లాహ్ శిక్ష నుంచి కాపాడుకోవ టానికి ఆయన ధ్యానాన్ని మించిన మార్గం లేదు. (ఇబ్నె అబీ షైబా, తబ్రానీ)

ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సహచరుల్ని ప్రశ్నించారు: “మీ ఆచరణలన్నింటి కంటే ఉత్తమ ఆచరణ ఏదో చూపనా? అది మీ విశ్వ రాజ్యాధిపతి దృష్టిలో అన్నింటి కంటే పవిత్రమైనది. మీ స్థానాలలో కెల్లా ఉన్నతమైనది. ఇంకా, వెండి, బంగారాలు దానం చేయటం కన్నా మీ కోసం ఉత్తమమైనది. మీరు మీ శత్రువును ఎదుర్కొన్న ప్పుడు, మీరు వారిని సంహరించటం లేక వాడు మిమ్మల్ని సంహరించటం కన్నా మేలయినది.”

దానికి సమాధానంగా సహచరులు,“ తప్పకుండా తెలియ జేయండి ప్రవక్తా!” అన్నారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), “అది అల్లాహ్ నామ స్మరణ” అని వారికి తెలియజేశారు. (తిర్మిజీ, ఇబ్నెమాజా)

ఆషూరాఅ రోజు ఉపవాసం యొక్క విశిష్టత (The Virtues of fasting on Ashura)

ashura-telugu-islamThe Virtues of fasting on Ashura

క్లుప్త వివరణ : ఆషూరాఅ రోజున ఉపవాసం ఎందుకు ఉండవలెను మరియు ఆషూరాఅ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటి – అనే విషయాలు ఈ వ్యాసంలో క్లుప్తంగా వివరించబడినాయి.
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
మూలం : షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమీన్ (రహిమహుల్లాహ్) మరియు షేఖ్ సాలెహ్ అల్ ఫౌజాన్  (హఫిజాహుల్లాహ్) యెక్క గ్రంధముల నుండి గ్రహించబడినవి.

 [ఇక్కడ చదవండి/డౌన్ లోడ్ చేసుకోండి]

ముహర్రం & ఆషూరాహ్ (Muharram and Ashurah)

muharram-telugu-islamక్లుప్త వివరణ : పవిత్ర ముహర్రం నెల మరియు ఆషూరాహ్ దినపు ప్రత్యేక శుభాలు
అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : నజీర్ అహ్మద్
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్

[ఇక్కడ  చదవండి /డౌన్ లోడ్ చేసుకోండి] PDF

రమజాన్ నెలలో రఫీ ఏం చేస్తాడు?

ramadhan-telugu-islam(రంజాన్ నెలలో ముస్లిం దిన చర్యను తెలిపే ఓ కల్పిత కధ)
అంశాల నుండి : దారుస్సలాం పుస్తకాలయం
అనువాదం : హాఫిజ్ S.M.రసూల్ షర్ఫీ
ప్రకాశకులు:శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్
క్లుప్త వివరణ: రమదాన్ నెలలో ముస్లింల దినచర్య గురించి తెలిపే ఒక కల్పిత కథ.

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]

రఫీ చాలా మంచి బాలుడు. చదివేది ఐదో తరగతి అయినా అసామాన్య తెలివి తేటలు కలిగినవాడని అందరూ అతన్ని కొనియాడుతుంటారు. అతని నడవడికలో, కదలికల్లో తెలివిని మించిన సంస్కారం ఉట్టిపడుతుంది. ముక్కుపచ్చలారని వయసులో ముద్దులొలికే అతని మంచితనం అందరిని ముచ్చట గొలుపుతుంది. మురిపెమైన అతని మాట తీరు శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఐదో తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చేది అతనికే. దివ్యఖుర్ఆన్ మొత్తం కంఠతా, మధురాతి మధురంగా పారాయణం చేస్తాడు రఫీ. అంతేకాదు, దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన ఎన్నో హదీసులు కూడా అతనికి బాగా జ్ఞాపకం ఉన్నాయి.

తనకు అవసరం లేని విషయాలను రఫీ అస్సలు పట్టించుకోడు. చెడు సావాసాలకు ఎల్లప్పుడూ ఆమడ దూరంలో ఉంటాడు. ఇరుగు పొరుగువారికి, టీచర్లకు, తోటి విద్యార్థులకు, అందరికి అతనంటే చాలా ఇష్టం. అతను అందర్నీ గౌరవిస్తాడు. కనుక అందరూ అతన్ని గౌరవిస్తారు. అతను ఎవరి మనసూ నొప్పించడు. పరులకు కీడు చేయటం కలలోనైనా ఊహించలేని విషయం అతనికి.

రమజాన్ నెల అంటే రఫీకు వల్లమాలిన అభిమానం. కొన్ని నెలల ముందు నుంచే దాని కోసం అతని ఎదురు చూపులు మొదలవుతాయి. ఆ శుభప్రదమైన నెలకోసం అన్ని విధాలా సిద్ధమై ఉంటాడు. రమజాన్ ద్వారా వీలైనంత ఎక్కువ ప్రయోజనం పొందాలన్నది అతని ఆశ. అల్లాహ్ ను అమితంగా సంతోష పెట్టాలన్నది అతని తపన. పొద్దస్తమానం టి.వి. ముందు కూర్చొని సమయం వృధా చేసేవాళ్ళంటే అతనికి పరమ చిరాకు. కాలం విలువను లెక్క చేయకుండా సినిమాలు, క్రికెట్లు చూస్తూ జాలీగా గడిపేవాళ్ళ పరిస్థితి మీద ఎంతో జాలిపడతాడు రఫీ. రేపు పరలోకంలో వారు అల్లాహ్ కు సమాధానం చెప్పబోయే దృశ్యాన్ని తలచుకొని అతని మనసు పరిపరి విధాలా చింతిస్తుంది.

ఫీ మాత్రం తన ఖాళీ సమయాన్ని చక్కగా మంచి పనుల కోసమే వినియోగిస్తాడు. కాస్త వీలు దొరికితే త్వరగా ఏదైనా ధర్మకార్యం పూర్తిచేసి అల్లాహ్ ప్రసన్నత పొందాలని ఉవ్విళ్లూరుతూ ఉంటాడు.

ప్రతి సంవత్సరం షాబాన్ నెల పూర్తి కావస్తున్నప్పుడు రఫీలో ఆనందం గంతులేస్తుంది. రమజాన్ నెల దగ్గర పడుతున్న కొద్దీ అతనిలో సంతోషం పరవళ్లు తొక్కుతూ ఉంటుంది. షాబాన్ నెల చివరి రోజైతే నెల పొడుపు కోసం అతని కళ్లు ఆకాశం కేసి ఆశగా చూస్తుంటాయి. నెలపొడుపు కనిపించగానే అప్రయత్నంగా అతని నోటి నుంచి దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన ఈ క్రింది ప్రార్థనా వచనాలు వెలువడుతాయి:

“అల్లాహు అక్బర్, అల్లాహుమ్మ అహిల్లహూ అలైనా బిల్ అమ్ ని వల్ ఈమాని, వస్సలామతి వల్ ఇస్లామి, వత్తాఫీఖి లిమా తుహిబ్బు వ తర్ జా, రబ్బునా వ రబ్బుకల్లాహ్”

(అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. ఓ అల్లాహ్! ఈనెలవంకను మా కొరకు శాంతీ విశ్వాసాలకు, ప్రశాంతం విధేయతలకు, నీవు ఇష్టపడే, నీవు ప్రసన్నుడవయ్యే మా సద్బుద్ధికి ప్రతీకగా చెయ్యి. ఓ నెలవంకా! మా ప్రభువూ, నీ ప్రభువూ అల్లాహ్ యే సుమా! )

ఇక ఆ రోజు రాత్రి, ఇషా నమాజు అనంతరం అందరితో కలిసి ఇమాము వెనుక చక్కగా తరావీహ్ నమాజు పూర్తి చేస్తాడు రఫీ. అప్పటి వరకు మస్జిద్ వదలిపెట్టి ఇంటికి వెళ్ళడు. తరావీహ్ నమాజు గొప్పదనం గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన విషయాలు ఎన్నటికీ మరిచిపోలేని విధంగా అతనికి గుర్తున్నాయి.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

“ఎవరయితే పరిపూర్ణ విశ్వాసంతో, పుణ్యం కోసమని రమజాన్ నెల (రాత్రి వేళల్లో) నమాజు చేస్తారో, వారి గడిచిన పాపాలన్నీ క్షమించబడతాయి.”

ఆయన ఇంకా ఇలా అన్నారు:

“ఇమాము వెనుక చివరికంటూ నిలబడి నమాజు పూర్తి చేసిన వ్యక్తికి ఆరాత్రంతా నిలబడి నమాజు చేసినంత పుణ్యం లభిస్తుంది.”

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పిన ఈ మాటలు గుర్తుకు వస్తే చాలు, అతని మనస్సు భక్తి భావంతో పొంగిపొరలుతుంది.

రమజాన్ నెల, ఉపవాసాల నెల అని మనందరికి తెలుసు. ఈ నెలలో ఉపవాసాలు పాటించే మనుషులు రెండు రకాలు. మొదటి రకం మనుషులు ఎల్లప్పుడూ అల్లాహ్ విధేయతలోనే కాలం గడుపుతారు. ఉపవాస కాలంలో వీరు మాటల్లోనూ, చేతల్లోనూ చాలా ఖచ్చితంగా ఉంటారు. అత్యధికంగా ఖుర్ఆన్ పారాయణం చేస్తారు. మస్జిదులో సామూహికంగా నమాజులు పాటిస్తారు. ఆకలిగొన్న వారికి అన్నం పెడతారు. అవసరాల్లో ఉన్న వారిని ఆదుకుంటారు. తమ దగ్గర వున్న డబ్బుల్లో నుంచి కొంత డబ్బు తీసి నిరుపేదలకు సహాయం చేస్తారు. ఏ చిన్న మంచి పనినీ వారు అల్పంగా భావించరు. పుణ్యం తెచ్చిపెట్టే ఏ అవకాశాన్ని చేజారనివ్వరు. ఆ నోట ఈ నోట విన్న మాటల్ని నిజానిజాలు నిర్ధారించుకోకుండా నలుగురిలో వ్యాపింపజేస్తూ తిరుగరు. చాడీలు చెప్పటం, ఇతరుల్ని మోసం చేయటం లాంటి విషయాల్లో తమ విలువైన సమయాన్ని వారు అస్సలు వృధా కానివ్వరు. ఒకవేళ ఎవరైనా తమ మీద కొట్లాటకు గాని, తగవులాటకు గాని దిగితే మర్యాదగా వారితో, “మేము ఉపవాసం ఉన్నామండీ” అని చెప్పి, తెలివిగా ఆ తప్పుడు కార్యం నుంచి తప్పించుకుంటారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎలా చేయమని బోధించారో అలాగే చేస్తారు. మరి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏం ప్రబోధించారో తెలుసా?!

“(యుద్ధంలో సైనికుడు ఉపయోగించే) డాలు వంటిది ఉపవాసం. మీలో ఎవరయినా ఉపవాసం పాటిస్తున్నట్లయితే వారు ఆ రోజు వ్యర్ధమైన మాటలు మాట్లాడరాదు. నోరు పారేసుకోరాదు. మూర్ఖంగా ప్రవర్తించరాదు. ఒకవేళ తమ మీద ఎవరయినా దుర్భాషకు దిగితే లేక కయ్యానికి కాలు దువ్వితే వారితో, ‘నేను ఉపవాసం ఉన్న మనిషినండీ’ అని చెప్పేయాలి.”

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా అన్నారు :

“అన్నపానీయాలకు దూరంగా ఉండటం మాత్రమే ఉపవాసం కాదు సుమా! వ్యర్ధమైన పలుకులకు, అశ్లీల మాటలకు దూరంగా మసలుకోవటమూ ఉపవాసంలో అంతర్భాగమే!”

ఉపవాసం పాటించే వారిలో మరి కొందరుంటారు. వారు పొద్దస్తమానం తిండి గురించే ఆలోచిస్తుంటారు. పడమట దిక్కు సూర్యుడు అస్తమించాడో లేదో ఇక వారు భోజనం మీద పడతారు. తినే వస్తువులు ఏవి దొరికితే అవి గబగబా లాగించేస్తారు. పీకల దాకా మెక్కిన తర్వాత ఇక వారి ఇక్కట్లు మొదలవుతాయి. లేచి నిలబడాలన్నా వారికి కష్టంగా ఉంటుంది. అందుకని టి.వి. ముందు కుర్చీలకు అతుక్కొని కూర్చుంటారు. బాగా పొద్దుపోయే దాకా టి.వి. ఛానెళ్ళు మార్చి మార్చి చూస్తూ ఉంటారు. . ఎప్పుడో అర్ధరాత్రి తర్వాత మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. ఫలితంగా రాత్రిపూట వారికి నిద్ర సరిపోదు. ఇక తెల్లవారు జామున సహ్రీ కోసం నిద్ర లేవటం చాలా భారంగా అనిపిస్తుంది.  తప్పదు గనక సహరీ పేరుతో బలవంతాన రెండు ముద్దలు మింగుతారు.  సహరీ కార్యం అయిపోగానే మళ్లీ మంచం పట్టెలు వెతుక్కుంటారు. నడుంలో అసలు బలమే లేనట్టు పడకల మీద వాలిపోతారు. ఇంకేమవుతుంది?! తెల్లవారు జామున తప్పకుండా చేయవలసిన ఫజ్ర్ నమాజుకు ఎగనామం!!

రమజాన్ నెల, మనుషుల ప్రవర్తనలో మార్పు తీసుకు వచ్చే నెల అన్న మాట నిజమే, కాని అది ఇలాంటి వారి కోసం కాదు. అసలు మనసుల్లో మారాలన్న తలంపే లేనివారిని ఎవరూ మార్చలేరు. అందుకనే రమజాన్ నెలలోనూ ఇలాంటి వారి అలవాట్లలో పెద్దగా తేడా ఏమీ ఉండదు. వీరి దృష్టిలో రమజాన్ మాసం ఆరాధనల మాసం కాదు. వరాలు పొందే వసంతం కాదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరించిన ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని పారాయణం చేయవలసిన పుణ్యకాలమూ కాదు. అల్లాహ్ విధేయతలో గడపాల్సిన శుభ ఘడియలూ కావు.

పైగా వీరి దృష్టిలో రమజాన్ అంటే ఇతర రోజుల్లో కంటే ఎక్కువగా తిని, తాగి సోమరితనాన్ని పెంచుకునే మాసం. రమజాన్ పేరుతో దొరికే సెలవల్ని అనవసరమైన పనుల్లో ఖర్చుచేసే కాలం. సందేహం లేదు. ఇలాంటి వాళ్లు జీవితంలో చాలా నష్టపోతున్నారు. రమజాన్ మాసం గొప్పదనాన్ని వీరు గ్రహిం చలేకపోతున్నారు. రమజాన్ నెలలోనూ వ్యర్ధ విషయాల్లో కాలం గడపటం పరమ దురదృష్టం. రమజాన్ నెలను పొంది, అందులో సత్కార్యాలు చేసి తద్వారా తమ పాపాలకు క్షమాభిక్ష సంపాదించుకోలేని వారు పరమ దౌర్భాగ్యులని ఒక హదీసులో చెప్పబడింది.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పిన ఆ మాట గుర్తొస్తే చాలు, రఫీ నిలువెల్లా కంపించిపోతాడు. రమజాన్ మాసం అతని దృష్టిలో వజ్ర వైఢూర్యాలు, మణిమాణిక్యాల నిధుల కన్నా ఎంతో ఎక్కువ. అంత శుభవంతమైన మాసాన్ని వృధాగా పోనివ్వటం అతని వల్ల కాని పని. పైగా అలా చేసేవాళ్ల అమాయకత్వం మీద అతను చాలా జాలి పడతాడు.

ఖుర్ఆన్లో మొత్తం ముప్పయి పారాలు (కాండములు)  ఉన్నాయి కదా! వాటిలో ప్రతి రోజూ మూడు పారాలను పారాయణం చేయటం నియమంగా పెట్టుకుంటాడు రఫీ. రమజాన్ నెల సాంతం ఆ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తాడు.

ఒక యేడు రమజాన్ నెల పదవ తేదినాటి సంఘటన. అస్ర్ నమాజు ముగిసింది. చాలా మంది జనం ఇండ్లకు వెళ్ళ లేదు. మస్జిదులోనే ఉండి వివిధ పనుల్లో నిమగ్నులై ఉన్నారు. కొంతమంది ఖుర్ఆన్ పారాయణం చేస్తున్నారు. దైవగ్రంథ పారాయణ శబ్దం తుమ్మెద గానంలా ఇంపుగా వినిపిస్తోంది. మరి కొంత మంది మస్జిదులోనే ఓ పక్కకు వాలి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంకొందరు పక్కనున్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్లవెంట వచ్చిన చిన్న పిల్లలు పరుగెత్తుతూ అల్లరి చేస్తున్నారు. మస్జిదులో వారు అల్లరి చేస్తున్నా వారి పెద్దలు వారిని ఏమీ అనటం లేదు. ప్రశాంతంగా ఉండవలసిన మస్జిదులో పిల్లలు అల్లరి చేయటం రఫీకు నచ్చలేదు. అందుకని అతను ఆ పిల్లలకు, ఇంకా మస్జిదులో పడుకొని మాట్లాడుకుంటున్న వారికి దూరంగా ఒక మంచి స్థలం చూసుకున్నాడు. మధురమైన కంఠంతో దివ్యఖుర్ఆన్ పారాయణం మొదలు పెట్టాడు. అతని స్వరం చాలా ఇంపుగా, వినసొంపుగా ఉంటుంది. అతను గొంతెత్తి ఖుర్ఆన్ పారాయణం చేస్తే విన్నవారెవరైనా ముగ్ధులవుతారు.

రఫీ ఖుర్ఆన్ పారాయణం చేస్తున్నప్పుడు అతని పక్కనే ఆతిఫ్ మాస్టారు కూర్చొని ఉన్నారు. అతను ఆయన్ని గమనించ లేదు. అతని మంచితనం, తెలివి తేటలు మాస్టారుకు చాలా బాగా తెలుసు. రఫీని అమితంగా మెచ్చుకుంటారాయన. బయట కనిపించినప్పుడల్లా ప్రేమగా పలకరిస్తుంటారు.

ఖుర్ఆన్ పారాయణం పూర్తయింది. గ్రంథం మూసి ప్రక్కకు తిరిగి చూశాడు రఫీ. ఆతిఫ్ మాస్టారు తన ప్రక్కనే ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. మాస్టారును గమనించుకో నందుకు మనసులో అతనికి కొద్దిగా అసంతృప్తి కలిగింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయనకు సలాం చెప్పాడు. మాస్టారు రఫీని ఆప్యాయంగా దగ్గరకు పిలిచారు. అతను దగ్గరకు రాగానే, “రఫీ! చిన్న పిల్లలు ఉపవాసాలు పాటించటం అవసరమా?! ” అని అడిగారు. ప్రక్కనున్నవారు కూడా వినాలని కాస్త బిగ్గరగానే మాట్లాడారు.

“లేదు మాస్టారూ! చిన్న పిల్లలు ఉపవాసాలు పాటించటం విధి కాదు. అయితే కాస్త పెద్ద పిల్లలకు ఉపవాసం అలవాటు చేయటం మంచి విషయమే.”

ఎంతో వినయంగా సమాధానం చెప్పాడు రఫీ.

ఆ సంగతి మాస్టారుకూ తెలుసు. కాని అక్కడున్న వాళ్లలో చాలామందికి వయోజనులైన పిల్లలు ఉన్నారు. అయినా వాళ్ళు తమ పిల్లలకు ఉపవాసాలు పాటించమని ఆజ్ఞాపించటం లేదు. అలాంటి వారికి విషయం బోధపడాలని మాస్టారు బిగ్గరగా అడిగారు. మాస్టారు ఉద్దేశం పసికట్టిన రఫీ కూడా నలుగురికీ వినపడేలా గట్టిగా సమాధానమిచ్చాడు. –

వారి మాటలు మస్జిదులో కాలక్షేపం చేస్తున్న చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. గురుశిష్యుల సంభాషణను వినటానికి వారూ దగ్గరకు జరిగి కూర్చున్నారు.

“అంత రూఢీగా ఎలా చెప్పగల్గుతున్నావు రఫీ!?” మళ్లీ అడిగారు మాస్టారు.

“దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితం, ఆయన సహచరుల ఆచరణ, పండితుల పలుకులు ఆ విషయమే కదా బోధిస్తున్నవి?” అంటూ అసలు ఆ విషయంలో సందేహమే అక్కర్లేదన్నట్లు చాలా గట్టిగా సమాధానం చెప్పాడు రఫీ.

“ఏంటేంటి? అందరికి వినపడేలా, ఇంకాస్త వివరంగా చెప్పు?” – మస్జిదులో పడుకొని కబుర్లు చెప్పుకుంటున్న వారి వైపు సైగ చేస్తూ అడిగారు మాస్టారు.
ఆయన మాటలు పడుకున్న వారందరిని లేపి కూర్చో బెట్టాయి. రఫీ సమాధానం వినటానికి అందరూ చెవులు రిక్కించారు.

అందరి కళ్ళు తనవైపే చూస్తున్నాయి. తాను అక్కడున్న వారందరి కంటే చిన్నవాడు. అలాంటప్పుడు తాను వారికి బోధ పరచటం అమర్యాద అవుతుందేమోనని రఫీ కాస్త తటపటాయించాడు. కాని మాస్టారు మాత్రం అతన్ని మళ్ళీ మళ్లీ అడుగుతున్నారు.

“చెప్పు రఫీ! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనకు ఏం బోధించారు?” – మాస్టారు మాటను నిర్లక్ష్యం చేయటం మంచిది కాదని భావించాడు రఫీ. “సరే, చెబుతానండీ” అంటూ మొదలుపెట్టాడు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనకు ఏమని బోధించారంటే:

“పిల్లలకు ఏడేళ్లు రాగానే వారికి నమాజు చేయమని ఆజ్ఞాపించండి. పదేళ్ళ ప్రాయంలోనూ వారు నమాజును అలవర్చుకోకపోతే (కాస్త) దండించండి. ఇంకా వారిని వేర్వేరుగా పడుకోబెట్టండి.” (అహ్మద్, అబూదావూద్, హాకిమ్ గ్రంథాలలో ఈ హదీసు ఉంది.)

పై హదీసు ఉద్దేశం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. పిల్లలు యుక్త వయస్సుకు చేరుకున్నప్పుడే వారికి నమాజు గురించి ఆజ్ఞాపించాలన్న నియమం ఏమీ లేదు. పైగా పసితనం నుంచే వారిలో నమాజు పట్ల శ్రద్ధను, ఆశక్తిని పెంచాలి. బాల్యం నుంచే నమాజు అలవాటు చేయాలి. ప్రాజ్ఞ వయస్సు దగ్గర పడుతున్న ప్పటికీ పిల్లలు నమాజుకు అలవాటు కానట్లయితే తల్లిదండ్రులు తమ పెంపకం గురించి పునరాలోచించుకోవాలని పై హదీసు చూచాయగా బోధపరుస్తోంది. అంతేకాదు, మంచి ఫలితం ఉంటుందని భావిస్తే, ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను దండించినా ఫర్వాలేదని కూడా దైవప్రవక్త ప్రవచనం చెబుతోంది.

విధి రీత్యా ఉపవాసం కూడా నమాజు లాంటిదే. కనుక కొన్ని గంటలపాటు ఆకలిని, దప్పికను అవలీలగా తట్టుకోగల దశకు పిల్లలు చేరుకోగానే తల్లిదండ్రులు అటువంటి పిల్లలను ఉపవాసం పాటించమని ఆదేశించాలి. ఆ వయసు నుంచే పిల్లలకు ఉపవాసం పాటించటం అలవాటు చేయాలి. ప్రవక్త సహచరులు (సహాబీలు) తమ పిల్లల్ని చిన్నతనం నుంచే ఉపవాసాలు పాటించేందుకు ప్రోత్సహిస్తుండేవారని ఇస్లామీయ చరిత్ర చెబుతోంది. బుఖారీ, ముస్లిం ఉభయ పండితులు తమ గ్రంథాల్లో ఒక హదీసును ఉల్లేఖించారు. రుబయీ బిన్తె ముఅవ్విస్ చెప్పిన విషయం అది:

ఒకనాటి సంఘటన. అది ముహర్రమ్ నెల పదో తేది (అంటే ఆషూరా రోజు) ఉదయం. అన్సార్ సహచరులు ఉండే ప్రదేశానికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక మనిషిని పంపించారు. ప్రవక్త ఆదేశం మేరకు ఆ మనిషి ఇలా ప్రకటించాడు:

“తెల్లవార్లు ఏదైనా తిని వున్నవారు ఇక సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి. అలాగే ఏమీ తినకుండా ఉన్నవారు కూడా రోజంతా ఉపవాసాన్ని కొనసాగించాలి.”

ఇక అప్పట్నుంచి మేము ప్రతి యేడు ముహర్రమ్ నెల పదో తేదీన తప్పకుండా ఉపవాసం పాటిస్తూ ఉండేవాళ్లం. అంతేకాదు, మా పిల్లల చేత కూడా ఉపవాసాలు పెట్టించే వాళ్ళం.పిల్లల కోసం మేము ఉన్ని బొమ్మలు తయారు చేసి పెట్టుకునే వాళ్ళం. ఏ పిల్లవాడైనా అన్నం కోసం ఏడిస్తే ఉపవాసాన్ని విరమించే సమయం దాకా అతన్ని ఆ బొమ్మలతో బుజ్జగించే వాళ్ళం .

రఫీ బోధిస్తున్న తీరును చూసి అక్కడున్న పెద్దవాళ్లు విస్తు పోయారు. ఇంత పసితనంలోనే అతనిలో అంతటి ఇస్లామీయ పరిజ్ఞానం వారిని ఔరా అనిపించింది. మొత్తానికి అతని తెలివి తేటల్ని, ప్రతిభను అక్కడున్న వారు మెచ్చుకోకుండా ఉండలేక పోయారు. మంత్రముగ్ధులై గురుశిష్యుల సంభాషణనువినసాగారు.

రఫీకు తెలుగు సామెతలు చాలా తెలుసు. సామెతల ద్వారా ప్రజలకు ఖుర్ఆన్ హదీసులను చక్కగా వివరించవచ్చని కూడా అతను అర్థం చేసుకున్నాడు. కనుక తరచూ ఆ ప్రయోగం చేస్తుండేవాడు. ఈ సందర్భంగా అతనికి ఓ మంచి సామెత గుర్తొచ్చింది.

“మొక్కై వంగనిది మ్రానై వంగునా?” అని ప్రశ్నించాడు

అతని మాట తీరు అక్కడున్న వారిని కట్టిపడేస్తోంది. ఒంటి మీద పిచ్చుకలు వాలినట్లు కదలకుండా కూర్చొని ఆసక్తిగా ఆ బుడతడి మాటల్ని వింటున్నారు.

– “చిన్న మొక్కను మనం ఎలా కోరుకుంటే అలా వంచవచ్చు. ఆ మొక్కే పెరిగి మ్రానైనప్పుడు ఇక దాన్ని వంచటమూ చేతకాదు, మనకు నచ్చిన రీతిలో పెంచటమూ చేతకాదు. అందు కనే పిల్లలకు పసితనంలోనే అన్నీ నేర్పించాలి. మంచి విషయాలు అలవాటు చేయాలి. పెద్దయిన తర్వాత అవి వారికి చాలా . ఉపయోగపడతాయి. అంతేకాదు, వారి మంచి అలవాట్లు తల్లిదండ్రులకు కూడా సౌకర్యాన్ని కలుగజేస్తాయి.”

“యధా రాజా తథా ప్రజ.”

మరో సామెతను ప్రయోగించాడు రఫీ.

చిన్న పిల్లలు ప్రతిదీ తమ చుట్టుప్రక్కల వాతావరణం నుంచే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు, అన్నలు, అక్కలు ఏది చేస్తే పిల్లలూ అదే చేయటానికి ప్రయత్నిస్తారు. కనుక పెద్దవారు చిన్న పిల్లల అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలతో, చేతలతో వీలైనంత వరకు వారికి మంచి విషయాలు నేర్పించటానికి ప్రయత్నించాలి. మంచి అలవాట్లు వచ్చేలా చూడాలి. చిన్నప్పుడు నమాజులు, ఉపవాసాలు పాటిస్తుండేవారికి పెద్దయిన తర్వాత అవి ఏమాత్రం కఠినంగా అనిపించవు.

రఫీ ఇక్కడ ఆగి కాసేపు ఏదో ఆలోచించాడు. తర్వాత ఇలా అన్నాడు:

అల్లాహ్ మా నాన్న గారిని కరుణించాలని నేను నిత్యం ప్రార్థిస్తుంటాను. ఆయనే నాకు నమాజు అలవాటు చేశారు. క్రమశిక్షణతో జీవితం గడపటం నేర్పారు. అందరితో కలిసి నమాజు చేయటానికి గాను ఆయన ఎల్లప్పుడూ నన్ను తన వెంట మస్జిదకు తీసుకువెళ్తుండేవారు. నేను బడికి వెళ్లటం మొదలు పెట్టకముందే ఆయన నాకు రమజాన్ నెలలో ఉపవాసాలు పాటించటం అలవాటు చేశారు. కాని నేను ఉపవాసం ఉండటం మా అమ్మకు నచ్చేది కాదు. ఆకలితో బాధపడతానని అమ్మకు భయం. అయితే నాన్నగారు ఆమెకు నచ్చజెప్పేవారు.

“వీణ్ణి కనీసం సగం రోజైనా ఉపవాసం ఉండనీ. భయ పడాల్సిన విషయం ఏమీ లేదు. ఉపవాసం వల్ల లాభమే గాని నష్టం అస్సలు లేదు. ఉపవాసం జీవితంలో కష్టాలను, బాధలను ఎదుర్కోవటం నేర్పుతుంది. ఓర్పును, ధైర్యసాహసాలను నూరి పోస్తుంది. ఉపవాసం వల్ల స్థిరమైన వ్యక్తిత్వం అలవడుతుంది” అని అమ్మకు ఆయన బోధిస్తుండేవారు.

ఈ మాటలు చెబుతున్నప్పుడు రఫీకు దుఃఖం ముంచు కొచ్చింది. కళ్ళ నుంచి జలజలా నీళ్ళు రాలాయి. నాన్న గుర్తుకు రాగానే ఇక అతనికి ఏడ్పు ఆగలేదు.

నిజం ఏమిటంటే, రఫీ ఒక అనాధ పిల్లవాడు. కొన్ని నెలల క్రితమే అతని తండ్రి చనిపోయాడు. ఆ పసివాడి రోదన అక్క డున్న చాలామంది పెద్దలను కంటతడి పెట్టించింది. వాళ్లందరికి అతని తండ్రి బాగా తెలుసు. అతని తండ్రి ఆత్మీయులు కూడా వారిలో కొందరు ఉన్నారు. వారైతే నిగ్రహించుకోలేక పోయారు. ఉద్వేగంతో వచ్చి ఆ బాలుణ్ణి కావలించుకున్నారు. లోపలి నుంచి తన్నుకొస్తున్న ఏడ్పును బలవంతాన ఆపుకోగలిగారు.

ఇక అందరి దగ్గర సెలవు తీసుకొని ఇంటిముఖం పట్టాడు రఫీ. మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ ఇంటి దగ్గరికి చేరుకున్నాడు. దూరం నుంచే అమ్మ కనిపించింది. ఇక అతని కాలు ఆగలేదు. పరుగెత్తుకుంటూ వెళ్ళి అమ్మను చుట్టు కున్నాడు. వలవలా ఏడ్చాడు. తల్లి ఎంత అడిగినా సమాధానం చెప్పలేకపోయాడు.

కాసేపటికి అతని ఏడ్పు ఆగింది. మస్జిద్ లో జరిగిన దంతా తల్లికి వివరించాడు. భర్త జ్ఞాపకం ఆ ఇల్లాలినీ శోక సంద్రంలో ముంచివేసింది. కళ్లల్లో నీళ్లు సుడిగుండాలై పొంగాయి. గుండె చెరువు అయినట్లు అనిపించింది. పిల్లవాడి ముందు రోదించటం సబబు కాదని భావించింది ఆమె. గట్టిగా నోరు అదిమిపట్టుకుంది. దుఃఖాన్ని అతికష్టం మీద ఆపుకో గల్గింది. తరువాత కుమారుణ్ణి ఓదార్చటానికి ప్రయత్నించింది.

సూర్యుడు అస్తమించే సమయం. చెల్లి తమ్ముళ్లతో కలసి ఇంట్లోనే ఒక శుభ్రమైన స్థలంలో కూర్చున్నాడు రఫీ. సాయంత్రం పూట పఠించవలసిన ప్రార్థనా వచనాలు పఠిస్తున్నాడు. మధ్యలో తమ్ముళ్లకు కూడా నేర్పిస్తున్నాడు. కాసేపటికి సూర్యాస్తమయం అయింది. జనం కొందరు ఇండ్లల్లో, మరికొందరు మస్జిదుల్లో ఉపవాసం విరమిస్తున్నారు. ఉపవాసం విరమించటాన్ని “ఇఫ్తార్” అంటారు. అందరితోపాటు రఫీ కూడా కొన్ని ఖర్జూర పండ్లతో ఇఫ్తార్ చేశాడు. మామూలుగా అతను ఖర్జూర పండ్లతోనే ఇఫ్తార్ చేస్తాడు. ఒకవేళ ఇంట్లో ఖర్జూర పండ్లు లేకపోతే కాసిన్ని మంచినీళ్లు త్రాగి ఉపవాసం ఆపేస్తాడు. తర్వాత ఈ వచనాలు పఠిస్తాడు:

“జహబజ్జమవు వబ్ తల్లతిల్ ఉరూఖు వ సబతల్ అజ్రు ఇన్ షా అల్లాహ్” (దాహం తీరింది. నరాలు తడిచాయి. అల్లాహ్ తలిస్తే పుణ్యం కూడా తప్పకుండా లభిస్తుంది.)

ఇంకా తనకు ఆహారం తినిపించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ రఫీ ఇలా పలుకుతాడు:
.
“అల్ హము లిల్లాహిల్లజీ అత్ అమనీ హాజా వ రజఖనీహి మిన్ గైరి హౌలిమ్ మిన్నీ వలా ఖువ్వతిన్” (నాకు ఈ భోజనం తినిపించిన, నా శక్తియుక్తుల ప్రమేయం లేకుండానే నాకు ఈ ఆహారం ప్రసాదించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు.)

‘ఇఫ్తార్’ సమయంలో మరెన్నో ప్రార్థనలు చేస్తాడు రఫీ. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పిన ఈ క్రింది మాట రమజాన్ నెల మొత్తం అతనికి గుర్తుంటుంది.

“ఉపవాసం విరమించేటప్పుడు ఒక ఉపవాసి చేసుకునే విన్నపం మన్నించబడకుండా ఉండదు. (అంటే అతని ప్రార్థన తప్పక నెరవేరుతుంది)”

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన ఈ విషయం కూడా అతని మనసులో బాగా నాటుకుపోయింది.

“ముగ్గురి ప్రార్థనలు తిరస్కరించబడవు. ఆ ముగ్గురు ఎవరంటే, ఒకరు న్యాయం చేసే రాజు. మరొకరు ఇఫ్తార్ చేస్తున్న ఉపవాసి. ఇంకొకరు పరుల చేత పీడించబడిన వ్యక్తి.”

ఆహా! ఎంత మనోహరమైనది రమజాన్ మాసం! ఈ మాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇందులో అపారమైన మేళ్లు ఉన్నాయి. అల్లాహ్ గ్రంథమైన ఖుర్ఆన్ మానవుల సన్మార్గం నిమిత్తం ఈ నెలలోనే అవతరించింది; అల్లాహ్ ఎంతో మందిని ఈ నెలలోనే నరకాగ్ని నుంచి రక్షిస్తాడు. స్వర్గ ద్వారాలు తెరుచు కునేది, నరక ద్వారాలు మూతపడేది ఈ శుభమాసంలోనే. అంతేకాదు, ఈ నెలలో షైతానులను సంకెళ్ళతో బంధించటం జరుగుతాయి. తన దాసుల పాపాలను అల్లాహ్ ఈ నెలలో విపరీతంగా మన్నిస్తాడు. మామూలు రోజుల్లో ఒక మంచి పనికి ఒక పుణ్యం మాత్రమే లభిస్తుంది. కాని రమజాన్ నెలలో అదే మంచి పనికి మరెన్నో రెట్లు పుణ్యం లభిస్తుంది. స్వర్గంలో స్థానాలు ఉన్నతమయ్యేది ఈ నెలలోనే.

రమజాన్ నెలకు ఇంకో ప్రత్యేకత కూడా ఉందండోయ్! సంవత్సరంలో మరే నెలలోనూ రాని ఒక ఘనమైన రేయి ఈ నెలలో వస్తుంది. ఆ రేయి మానవాళి కొరకు ఒక మహత్తర వరం. దానికి “లైలతుల్  ఖద్ర్” అని పేరు. తెలుసా మీకు?! ఈ ఒక్క రాత్రి కొన్ని వేల రాత్రుల కంటే గొప్పది. కావాలంటే ఖుర్ఆన్ తీసి చదవండి. 97వ అధ్యాయంలో అల్లాహ్ ఇలా అంటున్నాడు:

“నిశ్చయంగా – మేము దీనిని (ఈ ఖుర్ఆనును) ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము. ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు? ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా మేలైనది. ఆ రాత్రి యందు దైవ దూతలు, ఆత్మ (జిబ్రయీల్) తమ ప్రభువు ఉత్తర్వుపై సమస్త విషయాల (నిర్వహణ) నిమిత్తం (దివి నుంచి భువికి) దిగివస్తారు. ఆ రాత్రి ఆసాంతం శాంతి యుతమైనది – తెల్లవారే ‘ వరకూ (అది ఉంటుంది).”.

ఈ నెల ముస్లింలకు దానధర్మాల కోసం డబ్బు ఖర్చు పెట్టడం నేర్పిస్తుంది. పసిపిల్లల్లోనూ ఉదార భావాన్ని అలవరు స్తుంది. ఈ నెల చలువతో ఒక పిసినారి మహా దానశీలిగా మారి పోయినా ఆశ్చర్యం లేదు. భయభక్తులు (తఖ్వా)తో కూడుకున్న జీవితాన్ని పొందాలనే ఆశతో ముస్లింలు ఈ నెలలో ఎన్నో మంచి పనులు చేస్తారు. ఈ దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా అంటున్నాడు:
.
“ఓ విశ్వసించిన వారలారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది – మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు (తఖ్వా) పెంపొందే అవకాశం ఉంది.” (ఖుర్ఆన్ 2 : 183)

మరి “తఖ్వా” అంటే ఏమిటో తెలుసా? తఖ్వా అనేది ఓ గొప్ప సుగుణం. విశ్వాసికి అత్యంత విలువైన సంపద. అల్లాహ్ పట్ల భీతితో, భక్తితో చెడులకు దూరంగా జీవితం గడపటమే తఖ్వా. విశ్వాసి జీవిత మహాశయం తఖ్వా. ముస్లింలైనవారు ఈ “తఖ్వా” స్థానాన్ని పొందటానికి అనునిత్యం ప్రయత్నిస్తూ ఉండాలి. రమజాన్ నెలలో అందుకు మార్గాలు మెండుగా ఉంటాయి. అందుకే ముస్లింల మనసుల్లో రమజాన్ నెలకు అంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత!

రమజాన్ నెల రాక కోసం ముస్లింలు కొన్ని నెలల ముందు నుంచే ఎదురు చూస్తుంటారు. ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ రమజాన్ నెలను సాదరంగా ఆహ్వానిస్తారు. సగౌరవంగా ఆ నెల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఈ నెలలో ఉపవాసాలు ఉండటానికి, ప్రార్థనలు జరుపుకోవటానికి, మంచి పనులు చేసుకోవటానికి శక్తిసామర్థ్యాలను ప్రసాదించమని సంవత్సరమంతా అల్లాహ్ సన్నిధిలో దీనంగా వేడుకుంటూ ఉంటారు.

అందరికి తెలిసిన సత్యమే ఇది. సంతోషకాలం కర్పూరంలా కరిగిపోతుంది. కాని దుఃఖ ఘడియలు దుర్భరంగా గడుస్తాయి. రమజాన్ నెల ముస్లింల కోసం ఒక పండుగ కాలం. ప్రతి రోజూ ఆ నెలలో ఓ పర్వదినమే. కాబట్టి ముస్లింల కళ్ళకు రమజాన్ పుణ్యకాలం కర్పూరంలా కరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. ముప్పయి రోజులు ముప్పయి ఘడియల్లోనే అయిపోతున్న అనుభూతి కలుగుతుంది. రమజాన్ మాసపు ప్రతి నిమిషం ఓ పుణ్యకాలం. అనుక్షణం ఆధ్యాత్మికత వెల్లివిరిసే శుభసమయం. కనుకనే ఈ నెలలో మరెప్పుడూ లేనంతగా దైవారాధన భావన మనుషుల్లో జాగృతమవుతుంది.

ఇరవై రోజుల ఉపవాసం అనంతరం ముస్లింల కోసం ఈ నెలలో ఒక తాయం వేచి ఉంటుంది. ఆఖరి పదిరోజుల్లో అమితంగా అల్లాహ్ ను ఆరాధిస్తూ, గత పాపాల మన్నింపు కోసం వేడుకుంటూ కాలం గడిపిన వారికి మాత్రమే అది ప్రాప్తమవుతుంది. రమజాన్ నెల చివరి పది రోజుల్లో ఒక మహత్తరమైన రాత్రి ఉంది. అది వెయ్యి రాత్రుల కంటే గొప్పది. ఆ ఒక్క రాత్రి ఆరాధన చేస్తే 83 యేండ్లు ఆరాధన చేసినంత పుణ్యం లభి స్తుంది. ఆ రేయి ద్వారా ప్రయోజనం పొందగలిగినవారు ఎంతో అదృష్టవంతులు. మన ప్రియప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ రేత్రికి ఎనలేని ప్రాముఖ్యతను ఇచ్చేవారు.

ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) శుభఆచరణను ఆదర్శంగా తీసుకుని ముస్లిం లందరూ ఈ నెల ఆఖరు పది రోజుల్లో అతి ఎక్కువగా ఆరాధన చేస్తారు. విరివిగా ధర్మవిధులు ఆచరించి అల్లాహ్ తమ కోసం రాసివుంచిన పుణ్యాన్ని పొందేందుకు కృషి చేస్తారు.

“రమజాన్ నెలలో చివరి పది రోజులు మొదలైనప్పుడు (ప్రార్థనల్లో నిమగ్నులవటం కోసం) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రిళ్ళు మేల్కొని ఉండేవారు. ఇంట్లో వారిని కూడా నిద్రలేపేవారు. అమితంగా అల్లాహ్ ను ఆరాధించటానికి సన్నద్ధులయ్యేవారు.”

అల్లాహ్ తన పొరపాట్లన్నిటినీ క్షమించినప్పటికీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విరివిగా సత్కార్యాలు చేస్తుండేవారు. ఎంత గొప్ప విషయం!

ప్రతి యేడు రమజాన్ నెల చివరి పది రోజులు రఫీ మస్జిద్ లోనే గడుపుతాడు. రేయింబవళ్ళు అక్కడే దైవధ్యానంలో, ప్రార్ధనల్లో నిమగ్నుడై ఉంటాడు. ఆరాధన కోసం ఇలా మస్జిద్ లో వుండిపోవటాన్ని “ఏతికాఫ్” అంటారు. రఫీ తన స్నేహితులకు కూడా ఏతికాఫ్ ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తుంటాడు. కాని ఈ సంవత్సరం అతని ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేవు. నాన్న చనిపోయారు. ఇంట్లో అమ్మకు తోడుగా పెద్దవాళ్ళు ఎవరూ లేరు. కనుక ఈ సంవత్సరం ఎతెకాఫ్ పాటించే ప్రయత్నం మానుకోవాలని భావించాడు రఫీ. ఇంటిపట్టున ఉండి చెల్లి తమ్ముళ్ల బాగోగులు చూసుకోవాలనుకున్నాడు. ఇంటి పనుల్లో అమ్మకు సాయంగా ఉందామనుకున్నాడు. ఈ అతని తండ్రి బ్రతికి వున్నప్పుడు తండ్రి కుమారులు ఇద్దరూ కలిసి మస్జిద్ లో ఎతెకాఫ్ పాటించేవారు. ఆ అనుభూతి రఫీకు చెప్పలేని ఆనందాన్నిచ్చేది. కాని ఈ సంవత్సరం తను ఒంటరివాడైపోయాడు. గతం గుర్తుకురాగానే మళ్ళీ ఏడ్పు ముంచుకు వచ్చింది అతనికి. “నాన్నా, ఎక్కడున్నావు?!” అనేశాడు అప్రయత్నంగానే. పాలుగారే అతని బుగ్గల మీద అశ్రువులు ధారలై ప్రవహించాయి. కాసేపటికి నాన్న గదిలోకి వెళ్ళాడు. అక్కడ నాన్న వస్తువులు కనపడగానే భోరుమన్నాడు. పిల్లవాడి ఏడ్పు విని పరుగెత్తుకుంటూ వచ్చింది తల్లి. విషయం అర్ధం చేసుకుంది. కొడుకుని ఓదార్చటానికి ప్రయత్నించింది.

అలవికాని ఒక రొద ఆమె ఎదలోనూ కాసేపు పెనుగులాడింది. ముఖం చాటుకు తిప్పుకోని గుట్టుగా కన్నీళ్ళు తుడుచుకుంది. … “ఎందుకు ఏడుస్తున్నావు కన్నా! నీ కన్నీళ్లు మీ నాన్నను తిరిగి తీసుకు రాలేవురా!” అంది కొడుకుని గాఢంగా గుండెలకు . హత్తుకుంటూ. – “నాకు తెలుసమ్మా! అయినా ఏం చేయను. నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు ప్రతిదీ నేర్పించారు. చిన్న తనంలోనే నాకు నమాజ్, ఉపవాసాలు అలవాటు చేశారు. ఖుర్ఆన్ చదివించారు. ఆయన్ని నేను సులువుగా మరిచి పోలేనమ్మా!” ఏడుస్తూనే సమాధానమిచ్చాడు రఫీ. ఆ పసివాడి మాటలు తల్లిని మరింత దుఃఖానికి గురి చేశాయి. “మీ నాన్నను ఎవరూ మరిచిపోలేరు చిన్నా! అల్లాహ్ తోడు, నేనెప్పుడూ మీ నాన్ననే తలచుకొని ఏడుస్తుంటాను. కాని ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం? ఇది అల్లాహ్ రాసిన రాత. మనమంతా అల్లాహ్ కు చెందిన వాళ్ళం. ఒకరి తర్వాత ఒకరం అందరం ఆయన వద్దకు చేరుకోవలసిన వాళ్ళమే. ఈ బాధలో సహనం వహిస్తున్నందుకు పుణ్యం ప్రసాదించమని మాత్రం మనం అల్లాహ్ ను వేడుకుంటూ ఉండాలి. సరేగాని రఫీ! నువ్వు ఎప్పటిలాగా ఈ సారి కూడా మస్జిద్ కు వెళ్ళి ఈ చివరి పది రోజులు ‘ఏతికాఫ్’ పాటించు. మీ నాన్న కోసం బాగా ప్రార్థించు. మా గురించి దిగులుపడొద్దు. మమ్మల్ని చూసుకోవటానికి మీ మామయ్య మన ఇంట్లో ఉంటానంటున్నారు.”రఫీ కన్నీళ్లు తుడుస్తూ, అతనికి ధైర్యం చెప్పింది తల్లి.

ప్రతి యేడులాగే ఈ యేడు కూడా మస్జిద్ లో ఏతికాఫ్ పాటించే అవకాశం లభించగానే అతని ముఖంలో ఆనందం తొంగిచూసింది. మనసుని మెలిపెట్టిన దుఃఖం సయితం క్షణాల్లో ఆవిరయింది. తల్లికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. ప్రేమగా ఆమె చెంపను ముద్దాడి మస్జిద్ కు బయలుదేరాడు.

రమజాన్ నెల చివరి పది రోజులు మస్జిద్ లోనే గడిచాయి. అందరితో కలిసి నమాజ్ చేయటం, ఖుర్ఆన్ పారాయణం చేయటం, క్షమాభిక్షకై వేడుకోవటం, అల్లాహ్ ను స్తుతించటం – ఈ పది రోజులు ఇవే అతని నిత్యకృత్యాలు. అన్ని రోజులు మస్జిద్ లో ఉన్నా అతనికి ఏమాత్రం విసుగు అనిపించలేదు. పైగా అతని మనసు అల్లాహ్ ధ్యానంలో లీనమై పోయింది, అల్లాహ్ ఆరాధనా మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోయింది. ఏతికాఫ్ దీక్షలో అతను ఈ క్రింది ప్రార్థనా వచనాన్ని ఎన్ని వందలసార్లు పఠించాడో. అతనికే తెలియదు.

“అల్లాహుమ్మ ఇన్నక అపువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫాఫు అన్నీ”

ఓ అల్లాహ్! నీవు అమితంగా మన్నించేవాడవు. మన్నిం పును ఇష్టపడతావు. నన్ను మన్నించు (ప్రభూ!)”

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన ఈ క్రింది హిత వచనాలను కూడా రఫీ నిత్యం గుర్తుపెట్టుకునేవాడు.

“పరిపూర్ణ విశ్వాసంతో, పుణ్యం దొరుకుతుందన్న ఆశతో ఘనమైన రేత్రిన నమాజుకై నిలబడినవాని గత పాపాలన్నీ క్షమించబడతాయి.” (బుఖారి, ముస్లిం గ్రంథాల్లో ఈ హదీసు ఉంది)

“ఘనమైన రేయిని (లైలతుల్ ఖద్రీను) రమజాన్ నెలలోని చివరి పది రోజుల్లో వెతకండి.” (బుఖారీ గ్రంథంలో ఈ హదీసు ఉంది).

పండుగ రేపు అనగా ఈ రోజు సాయంత్రానికి ఏతికాఫ్ దీక్ష ముగిసిపోతుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా దీక్షను పరిపూర్ణంగా నెరవేర్చినందుకు రఫీ మది ఆనందంతో నిండి పోయింది. మస్జిద్ లో మగ్రిబ్ నమాజు ముగించుకొని సంతోషంగా ఇంటికి వెళ్లాడు. అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని కొన్ని కిలోలు బియ్యం కొనుగోలు చేశాడు. నిరుపేదలకు, అభాగ్యులకు ఆ బియ్యం పంచిపెట్టాడు. పండుగ నాడు అందరి మొహాలు ఆనందంతో కళకళలాడాలన్నది అతని కోరిక. పండుగ రోజు అందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంటే అతని మది పులకించిపోతుంది. రఫీ కోరిక ప్రకారమే అతని ఇంట్లో, బంధుమిత్రుల్లో ఫిత్ర (రమజాన్) పండుగ చాలా సంతోషంగా గడిచిపోయింది.

ఇప్పుడు అతని మనసు మరుసటి రమజాన్ మాసం కోసం ఎదురు చూస్తోంది. వచ్చే యేడాది మరిన్ని పుణ్యకార్యాలు చేసి “తఖ్వా” (దైవభీతి) స్థానాన్ని పొందే అవకాశం కోసం అది నిరీక్షిస్తోంది.


మస్నూన్ నమాజు (Masnoon Namaz)


makkahసంకలనం
: ముఖ్తార్ అహ్మద్ అన్నదవీ
అనువాదం : మౌలానా  ముహమ్మద్  జాకీర్  ఉమ్రి
ప్రకాశకులు: అబ్దుస్సలాం ఉమ్రీ
మస్జిద్ -ఎ -ఫరూఖియః , హకీంపేట్ , టోలిచౌకి , హైదరాబాద్ (Masjid-e-Farooqiyah, Hakeempet, Tolichowki, Hyderabad)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన నమాజు పద్ధతి, ఆయన స్వయంగా నమాజు చేసిన పద్ధతి మరియు సహాబాలకు నేర్పిన పద్ధతి.

అద్దారుసలఫియ్యహ్  నుండి ప్రచురించబడిన ఈ పుస్తకం సలాతున్నబీ  యొక్క సంక్షిప్త రూపం.ఇందులో నమాజుకు సంభందించిన ముఖ్య విషయాలను , దుఆ లను చేర్చటం జరిగింది. అంతేకాక  ప్రతి విషయాన్ని ఖుర్ఆన్ మరియు ప్రామాణిక హదీసుల ద్వారా నిరూపించడం జరిగింది. ఈ విధంగా ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)  యొక్క నమాజు పద్ధతి యొక్క ప్రామాణిక స్వరూపం ముందుంచబడింది.

[ఇక్కడ PDF చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

ఇస్లామీ దుఆలు (Islamic Supplications)

dua-supplication-telugu-islamసంకలనం : రఊఫ్  అహ్మద్  ఉమ్రి (Raoof Ahmad Umri)
అనువాదం : ఇక్బాల్  అహ్మద్ (Iqbaal Ahmad)
ఎడిటింగ్ :మౌలానా  ముహమ్మద్  జాకీర్  ఊమెరీ (Moulana Muhammad Zakir Oomeri)
మస్జిద్ -ఎ – ఫరూఖియః , హకీంపేట్ , టోలి చౌకి , హైదరాబాద్ (Masjid-e-Farooqiyah, Hakeempet, Toli Chowki, Hyderabad)

నమాజులోనూ, ఇతర సందర్బాలలోనూ వేడుకునే దుఆలు. సూరహ్ ఫాతిహా మరియు ఖుర్ఆన్ లోని కొన్ని చివరి సూరాలు.

[ఇక్కడ Download / చదవండి]

హిస్నుల్ ముస్లిం (దుఆల పుస్తకం)

బిస్మిల్లాహ్
Hisnul Muslim - Telugu
Hisn al Muslim - Telugu Islam

అరబ్బీ మూలం: సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తాని
(Written by (Arabic) : Sayeed Bin Ali Bin Wahaf Al Qahtani)
అనువాదం: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ

Hisnul Muslim – Telugu

[చిన్న సైజు బుక్]
[మొబైల్ ఫ్రెండ్లీ] [PDF] [176 పేజీలు] [6.9 MB]

[పెద్ద సైజు బుక్]
[మొబైల్ ఫ్రెండ్లీ] [PDF] [176 పేజీలు] [128 MB]

[ఆడియో దుఆలు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
[MP3 ఆడియో] [జిప్ ఫైల్] [243 ఫైల్స్] [32 MB]

విషయసూచిక

అన్ని చాఫ్టర్లు PDF లింకులుగా క్రింద ఇవ్వబడ్డాయి. PDF డౌన్లోడ్ చేసుకోండి లేదా చదవండి. ప్రతి PDF చాప్టర్ లో ఒకటి లేదా ఎక్కువ దుఆలు ఉంటాయి. ఆ దుఆల నంబర్లు బ్రాకెట్లో ఇవ్వబడ్డాయి.

ఆడియో దుఆ నెంబర్ మీద క్లిక్ చేసి ఆ దుఆ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి.

ఈ పుస్తకం నుండి పబ్లిష్ అయిన పోస్టులు:

 

మంచిని ఆదేశించటం మరియు చెడును నివారించటం (Ordering Good and Forbidding Evil)

ordering-good-forbidding-evil(జుమా ఖుత్బా మస్జిదె నబవీ, మదీనా – 28 02 1431హి)
రచయిత : అలీ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్ హుదైఫీ (Shaikh Ali ibn Abdurrahman al-Hudhaifi)
అనువాదం : షేఖ్ అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్
పునర్విమర్శ : ముహమ్మద్ కరీముల్లాహ్
క్లుప్త వివరణ: మంచిని ఆదేశించటం మరియు చెడును నివారించటం గురించిన ఆదేశాలు, విశిష్ఠతలు, వాస్తవాలు, ప్రాముఖ్యతలు, షరతులు, మానవ హక్కుల గుర్తుంచుకోవటం – మొదలైన విషయాలు మదీనా మస్జిదు ఇమాం గారు ఈ శుక్రవారపు ఉపన్యాసంలో ప్రజల ఎదుట ప్రసంగించినారు.

[Read / Download PDF Here]

28 సఫర్ 1431ి (12 ఫిబ్రవరీ 2010) శుక్రవారం మస్జిదె నబవీ, మదీనాలో ఖతీబ్ ఇమాం షేఖ్ అలీ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్ హుదైఫీ అరబీబాషలో చేసిన జుమా ఖుత్బా ప్రసంగం యొక్క తెలుగు అనువాదం

మంచిని ఆదేశించండి మరియు చెడును నివారించండిఅనే ఇస్లామీయ ఆదేశం యొక్క ప్రాధాన్యత మరియు ఆవశ్యకత

ملخص الخطبة
1 فريضة الأمر بالمعروف والنهي عن المنكر. 2 فضل الآمرين بالمعروف والناهين عن المنكر. 3 بيان حقيقة المعروف والمنكر 4 أهمية الأمر بالمعروف والنهي عن المنكر. 5 من شروط الأمر بالمعروف والنهي عن المنكر وآدابه.6 التذكير بحقوق الأخوة

ఖుత్బా ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

  1. ‘మంచిని ఆదేశించండి మరియు చెడును నివారించండి’ గురించి మనపై ఉన్న బాధ్యత, కర్తవ్యం, ధర్మం మరియు విధి.
  2. ‘మంచిని ఆదేశించండి మరియు చెడును నివారించండి’ యొక్క శుభాలు.
  3. ‘మంచి – చెడు’ గురించిన వాస్తవ విషయాలు.
  4. ‘మంచిని ఆదేశించండి మరియు చెడును నివారించండి’ యొక్క ప్రాముఖ్యత
  5. ‘మంచిని ఆదేశించండి మరియు చెడును నివారించండి’ యొక్క షరతులు.
  6. మానవ సోదరులపై ఉన్న పరస్పర హక్కుల ప్రస్తావన

మొదటి ఖుత్బ: (అల్లాహ్ స్తోత్రములు, ప్రవక్తపై దయా, కరుణల దుఆ తర్వాత).

అల్లాహ్ తో భయపడవలసిన విధంగా భయపడండి. ఆయన స్వర్గం మరియు సంతృప్తి పొందడానికి పరుగెత్తండి.

يَا أَيُّهَا النَّاسُ اتَّقُواْ رَبَّكُمُ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاء وَاتَّقُواْ اللّهَ الَّذِي تَسَاءلُونَ بِهِ وَالأَرْحَامَ إِنَّ اللّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا[النساء: 1]

ఖుర్ఆన్వచనభావంయొక్కఅనువాదం: “మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతోమంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయ పడండి. ఎవరి పేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్ కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మీపై నిఘా వేసి ఉన్నాడు”. (అన్నిసా 4:1)

يَا أَيُّهَا الَّذِينَ آمَنُواْ اتَّقُواْ اللّهَ حَقَّ تُقَاتِهِ وَلاَ تَمُوتُنَّ إِلاَّ وَأَنتُم مُّسْلِمُونَ [آل عمران: 102].

ఖుర్ఆన్వచనభావంయొక్కఅనువాదం: “విశ్వాసులారా! అల్లాహ్ కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి, ముస్లింలుగా తప్ప మరణించకండి” (ఆలె ఇమ్రాన్ 3:102).

ఓ ముస్లిములారా! మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించి ఉన్నారు:

((إن اللهَ فرَض فرائضَ فلا تضيِّعوها، وحدَّ حُدودًا فلا تعتَدوها، وحرَّم أشياءَ فلا تنتَهِكوها، وسكَت عن أشياء رحمةً لكم غيرَ نسيانٍ فلا تبحَثوا عنها))

అనువాదం: ““నిశ్చయంగా అల్లాహ్ కొన్ని విధులను విధించినాడు, మీరు వాటిని వృధా చేయకండి. (తప్పక పాటించండి). కొన్ని హద్దులు నిర్ణయించాడు, మీరు వాటిని అతిక్రమించకండి. కొన్నింటిని నిషిద్ధపరిచాడు, మీరు వాటిని ఉల్లఘించకండి. (పాల్పడకండి). మరికొన్ని విషయాల పట్ల మౌనం వహించినాడు – మరచిపోయి కాదు, మీపై దయతలచి మాత్రమే. కాబట్టి మీరు వాటిని వెతక్కండి”[1].”

అల్లాహ్ తన దాసులపై విధించిన వాటిలోని ఒక విధి – ‘మంచిని గురించి ఆదేశించటం మరియు చెడు నుండి వారించటం’. అందులో ఇహలోక సంబంధమైన మరియు పరలోక సంబంధమైన, సామాన్యమైన మరియు విశేషమైన శుభాలన్నీ ఉన్నాయి. దీని వలన అన్నిరకాల చెడులు, సంక్షోభాలు, శిక్షలు మరియు విపత్తులు దూరమవుతాయి. అల్లాహ్ యొక్క ఈ ఆదేశాన్ని చదవండి.

وَلْتَكُن مِّنكُمْ أُمَّةٌ يَدْعُونَ إِلَى الْخَيْرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَأُوْلَـئِكَ هُمُ الْمُفْلِحُونَ [آل عمران: 104]

ఖుర్ఆన్వచనభావంయొక్కఅనువాదం: “శుభం వైపుకు పిలిచే, మంచిని చెయ్యమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పనిని చేసే వారే సాఫల్యాన్ని పొందుతారు”. (ఆలె ఇమ్రాన్ 3:104).

كُنتُمْ خَيْرَ أُمَّةٍ أُخْرِجَتْ لِلنَّاسِ تَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَتَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَتُؤْمِنُونَ بِاللّهِ[آل عمران: 110]

ఖుర్ఆన్వచనభావంయొక్కఅనువాదం: “మానవుల (శ్రేయస్సు) కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన శ్రేష్ఠసమాజం మీరు. మీరు మంచి విషయాలకై ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి ఆపుతారు, ఇంకా మీరు అల్లాహ్ ను విశ్వసిస్తారు”. (ఆలె ఇమ్రాన్ 3:110).

ఉమర్ రదియల్లాహు అన్హు ఇలా పలికినారు: ‘ప్రవక్త ముహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం వారి  సమాజంలో ఒక వ్యక్తిగా కావాలని కోరే మనిషి ఇందులో తెలుపబడిన షరతును పూర్తి చెయ్యాలి’. అదే – ‘‘మంచిని ఆజ్ఞాపించడం, చెడును వారించడం’.’

అల్లాహ్ విశ్వాసుల సుగుణాల్ని తెలుపుతూ ఇలా పలికినాడుః

وَالْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بَعْضُهُمْ أَوْلِيَاء بَعْضٍ يَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَيُقِيمُونَ الصَّلاَةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَيُطِيعُونَ اللّهَ وَرَسُولَهُ أُوْلَـئِكَ سَيَرْحَمُهُمُ اللّهُ إِنَّ اللّهَ عَزِيزٌ حَكِيمٌ [التوبة: 71].

ఖుర్ఆన్వచనభావంయొక్కఅనువాదం: “విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాత్ ను చెల్లిస్తారు. అల్లాహ్ కు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్ అతి త్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేచనాశీలి”. (తౌబా 9: 71).

పూర్వం గ్రంథం ఇవ్వబడినవారిలో, ఎవరైతే ఏమాత్రం మార్పులు చేర్పులకు గురి కాని తమ (నిజ) ధర్మాన్ని అవలంభిస్తూ, ఎలా మంచిని ఆజ్ఞాపిస్తూ, చెడును నివారిస్తూ ఉండేవారో, వారిని గురించి సైతం అల్లాహ్ తన దివ్య గ్రంథంలో ఇలా ప్రశంసించాడుః

لَيْسُواْ سَوَاء مِّنْ أَهْلِ الْكِتَابِ أُمَّةٌ قَآئِمَةٌ يَتْلُونَ آيَاتِ اللّهِ آنَاء اللَّيْلِ وَهُمْ يَسْجُدُونَ يُؤْمِنُونَ بِاللّهِ وَالْيَوْمِ الآخِرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَيُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَأُوْلَـئِكَ مِنَ الصَّالِحِينَ[آل عمران: 113، 114].

ఖుర్ఆన్వచనభావంయొక్కఅనువాదం: “వారంతా ఒకలాంటి వారు కారు. ఈ గ్రంథవహులలోని ఒక వర్గం వారు (సత్యంపై) నిలకడగా ఉన్నారు. వారు రాత్రి సమయాల్లో కూడా దైవవాక్యాలను పారాయణం చేస్తారు, సాష్టాంగపడతారు. అల్లాహ్ ను, అంతిమ దినాన్ని కూడా వారు విశ్వసిస్తారు. మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. సత్కార్యాల కోసం పరస్పరం పోటీపడతారు. వీరు సజ్జనుల కోవకు చెందినవారు”.(ఆలే ఇమ్రాన్ 3:113-114)

‘మంచి’’ అంటే ఇస్లాం ఆదేశించిన ప్రతి కార్యమూ; అది తప్పనిసరైన విధి కార్యమైనా లేదా అభిలషణీయమైన కార్యమైనా సరే. ఇహపరాలలో ఖచ్చితంగా మేలు కలిగించేవి తప్ప మరే ఆదేశాల్నీ ఖుర్ఆన్ మరియు హదీథులు ఇవ్వవు. ఇంకా అనుగ్రహాలతో నిండిన స్వర్గవనాలలో ప్రవేశం కొరకు అల్లాహ్ వేటిని అర్హతలుగా చేశాడో, వాటిని గురించి తప్ప మరే ఆదేశమూ ఇవ్వవు.

‘చెడు’’ అంటే ఇస్లాం నిషేధించిన ప్రతి కార్యమూ, అది నిషిద్ధమైన కార్యమైనా లేదా అవాంఛనీయమైన కార్యమైనా సరే. ఇహపరాల్లో ఖచ్చితంగా చెడుకు గురి చేసే కార్యాన్నే ఇస్లాం నిషేధిస్తుంది. అలాగే నరకానికి చేర్చే కారణాలనే నిషేధిస్తుంది.

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారని హుజైఫా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

((وَالَّذِي نَفْسِي بِيَدِهِ لَتَأْمُرُنَّ بِالْمَعْرُوفِ وَلَتَنْهَوُنَّ عَنْ الْمُنْكَرِ أَوْ لَيُوشِكَنَّ اللَّهُ أَنْ يَبْعَثَ عَلَيْكُمْ عِقَابًا مِنْهُ ثُمَّ تَدْعُونَهُ فَلَا يُسْتَجَابُ لَكُمْ))

అనువాదం: ““నా ప్రాణం ఎవరి చేతులో ఉందో ఆయన సాక్షి! మీరు తప్పకుండా మంచిని గురించి ఆదేశించండి మరియు తప్పకుండా చెడు నుండి నివారించండి, లేదా అల్లాహ్ తన వైపు నుండి ఓ విపత్తును మీ కురిపింపజేస్తాడు, అప్పుడు మీరు ఆయనను అర్థించినా (దుఆ చేసినా) మీ అర్థింపు అంగీకరించబడదు”[2].”

విశ్వాసుల సుగుణాల్ని తెలుపుతూ అల్లాహ్ ఇలా తెలిపాడుః

وَالْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بَعْضُهُمْ أَوْلِيَاء بَعْضٍ يَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ [التوبة: 71].

ఖుర్ఆన్వచనభావంయొక్కఅనువాదం: “విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు”. (తౌబా 9:71).

కొందరు ధర్మవేత్తలు ఇలా తెలిపారుః మంచిని గురించి ఆజ్ఞాపించడం, చెడు నుండి నివారించడం అనేది ఇస్లాం మూల స్తంభాలలో ఒకటి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా బోధించారని హజ్రత్ అబూ సఈద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

((مَنْ رأَى منكم منكرًا فليِّغيره بيده، فإن لم يستطع فبلِسانه، فإن لم يستطع فبقَلبه، وذلك أضعفُ الإيمان))

అనువాదం: “““మీలో ఎవరైనా ఏదైనా చెడును చూస్తే తన చేతితో దానిని ఆపాలి ఆ శక్తి లేకుంటే తన నాలుకతో, ఆ శక్తి కూడా లేకుంటే (కనీసం) మనస్సులో (దానిని చెడుగా భావించి దానికి దూరంగా ఉండాలి, ఈ చివరిది) విశ్వాసం యొక్క అతిబలహీనమైన స్థితి”[3].”

మరో ఉల్లేఖనలో ఇలా ఉందిః ప్రళయదినాన ఒక వ్యక్తి మరో వ్యక్తిని పట్టుకుంటాడు. కానీ, అతను విడిపించుకుంటూ ‘దూరంగా వెళ్ళిపో! నీ మీదా, నీ భార్యాపిల్లల మీదా, నీ ధనసంపదల-మానమర్యాదల మీదా నేను ఏ అన్యాయమూ చేయలేదు.’’ అని అంటాడు. అతడిని పట్టుకున్న వ్యక్తి అప్పుడు ‘‘నీవు నన్ను పాపంలో, తప్పులో పడి ఉండటం చూసి కూడా నన్ను నివారించలేదు’ అని అతడ్ని దుయ్యబెడతాడు.

మంచిని ఆదేశించే వ్యక్తి తాను ఆదేశిస్తున్న మంచి విషయం ‘ఇస్లాం ధర్మం ఆదేశించినదేనా – కాదా’ అనేది ముందుగా నిర్థారణ చేసుకోవాలి. అలాగే ఏ చెడు నుండి నివారిస్తున్నాడో దానిని ‘ఇస్లాం నివారించిందా – లేదా’ అనేది నిర్థారణ చేసుకోవాలి. అందుకై అతను పూర్తి అవగాహనతో ప్రామాణిక నిదర్శనాలను మరియు ఆధారాలను అనుసరించాలి. అంతేకాక మంచిని ఆదేశించే మరియు చెడు నుండి నివారించే వ్యక్తి వివేకవంతుడై ఉండాలి. ఆ వివేకం స్వభావికంగా అతనికి అబ్బినదైతే అల్ హందులిల్లాహ్, లేనిచో అతను దానిని ఇతరుల నుండైనా నేర్చుకోవాలి. దేని గురించి ఆదేశిస్తున్నాడో, నివారిస్తున్నాడో ముందుగా దానిని స్వయంగా అర్థం చేసుకొని ఉండాలి. ఎందుకనగా దేనిని ఆధారంగా చూపుబోతున్నాడో అది దానికి తగినదై ఉండాలి, ప్రామాణికమైనదై ఉండాలి. సర్వ వ్యవహారాల్లో, స్థితిగతుల మార్పులో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాల నుండి సరియైన విధానాన్ని కనుగొన గలగాలి. ఈ ఆదేశమే అల్లాహ్ మనకు ఇచ్చాడుః

ادْعُ إِلِى سَبِيلِ رَبِّكَ بِالْحِكْمَةِ وَالْمَوْعِظَةِ الْحَسَنَةِ وَجَادِلْهُم بِالَّتِي هِيَ أَحْسَنُ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ [النحل: 125].

ఖుర్ఆన్వచనభావంయొక్కఅనువాదం: “నీ ప్రభువు మార్గం వైపు జనులను వివేకంతోనూ, చక్కని ఉపదేశంతోనూ పిలువు, అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు, నిశ్చయంగా తన మార్గం నుండి తప్పినవాడెవడో నీ ప్రభువుకు బాగా తెలుసు, సన్మార్గాన ఉన్నవాడెవడో కూడా ఆయనకు బాగా తెలుసు”. (అన్నహ్ల్ 16:125).

మంచిని గురించి ఆజ్ఞాపించడం, చెడు నుండి నివారించడం అనేది విధులను, మర్యాదలను కాపాడుతుంది. చెడును, దుశ్చేష్టలను అడ్డుకొంటుంది. అంటే అది ఎప్పుడు ప్రక్కకు జరిగిపోతుందో, లేదా దానిని ప్రక్కన పెట్టేయడం తరుచుగా జరుగుతుందో, అప్పడు సమాజంలో అన్నిరకాల చెడులు, అసత్యాలు వ్యాపించుతూ పోతాయి.

చేతి శక్తితో చెడును అడ్డుకొనడం అనేది అధికార పీఠంలో ఉన్నవారి పని లేదా వారికి కుడి భుజంగా ఉన్నవారి పని.

నాలుకతో అడ్డుకొనడం అనేది వివేకంతో కూడిన పని. చెడును మానుకోవడంలోని లాభాలను, విడనాడకుంటే ఎదురయ్యే నష్టాలను, విపత్తులను వివరిస్తూ, మంచిగా నచ్చచెప్పడం ద్వారా అడ్డుకొనడం, ఆపడం ఆ చెడు గురించి గల అల్లాహ్ ఆదేశాలు తెలిసిన వ్యక్తి పని.

ఇక మనస్సులోనైనా చెడుగా భావించి చెడు విషయాలకు దూరం ఉండడమనేది ప్రతి ఒక్కరి పని.

‘మంచిని గురించి ఆజ్ఞాపించడం, చెడు నుండి నివారించడం’ అనే రెండు పనులు ఎల్లప్పుడూ కలిసే ఉండును, అవి రెండూ వేర్వేరు కావు, వాటిని అస్సలు వేర్వేరు చేయకూడదు. ఎవరైనా మంచిని ప్రేమించి చెడును అసహ్యించుకోకుంటే అతను ఓ విధిలో వెనుక బడిపోయాడు. అలాగే ఎవరైనా మంచిని గురించి ఆదేశించి, చెడు నుండి నివారించకపోతే అతను మరో విధిని విడనాడినట్లే. ఎవరైనా చెడు నుండి నివారించి మంచిని ప్రేమించకుంటే అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతికి విరుద్ధంగా చేసినట్లే. అందుకు మంచిని గురించి ఆదేశించడంతో పాటు దాని పట్ల ప్రేమ కలిగి ఉండడం, చెడు నుండి నివారించడంతో పాటు దాని పట్ల అసహ్యం కలిగి ఉండడం తప్పనిసరి. కొందరు పుణ్యపురుషులు తెలిపారుః ‘ఎవరైతే మంచిని గురించి ఆజ్ఞాపిస్తాడో మరియు చెడు నుండి నివారిస్తాడో అతను అల్లాహ్ యొక్క ఈ ఆయతులను గుర్తుకు తెచ్చుకోవాలి’:

أَتَأْمُرُونَ النَّاسَ بِالْبِرِّ وَتَنسَوْنَ أَنفُسَكُمْ وَأَنتُمْ تَتْلُونَ الْكِتَابَ أَفَلاَ تَعْقِلُونَ [البقرة: 44]

ఖుర్ఆన్వచనభావంయొక్కఅనువాదం: “మీరు ప్రజలకైతే మంచిని గురించి ఆదేశిస్తారు, కాని స్వయంగా మీరే (అవలంబించడం) మరచి పోతారెందుకు?”. (అల్ బఖర 2:44).

అలాగే షుఐబ్ అలైహిస్సలాం గురించి తెలిపిన ఈ ఆయతుః

وَمَا أُرِيدُ أَنْ أُخَالِفَكُمْ إِلَى مَا أَنْهَاكُمْ عَنْهُ [هود: 88]

ఖుర్ఆన్వచనభావంయొక్కఅనువాదం: “ఏ విషయాలను మానుకోమని మిమ్మల్ని గట్టిగా చెబుతున్నానో వాటి వైపుకు నేను స్వయంగా మొగ్గిపోయే ఉద్దేశం నాకు లేనేలేదు”. (హూద్ 11:88).

అలాగే ఖుర్ఆన్ లో మరోచోట తెలిపిన అల్లాహ్ యొక్క ఈ ఆదేశం కూడాః

يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا لِمَ تَقُولُونَ مَا لَا تَفْعَلُونَ كَبُرَ مَقْتًا عِندَ اللَّهِ أَن تَقُولُوا مَا لَا تَفْعَلُونَ [الصف: 23]

ఖుర్ఆన్వచనభావంయొక్కఅనువాదం: “ఓ విశ్వాసులారా! మీరు చేయని దానిని గురించి ఎందుకు చెబుతున్నారు? మీరు చేయని దానిని గురించి చెప్పటం అల్లాహ్ సమక్షంలో ఎంతో సహించరానిది”. (సఫ్ 61:2,3).

మంచిని గురించి ఆదేశించే, చెడు నుండి నివారించే వ్యక్తిపై తప్పని సరి విధి – ఓర్పు, సహనం వహించడం. ఎందుకనగా అలా చేయడంలో అతను కష్టాలకు లోనవుతాడు. ఇది అల్లాహ్ యొక్క పరీక్ష. (ఒక పుణ్యపురుషుడైన) లుఖ్మాన్ (తన తనయునికి చేసిన హితవును) అల్లాహ్ ఇలా తెలిపాడుః

يَا بُنَيَّ أَقِمِ الصَّلَاةَ وَأْمُرْ بِالْمَعْرُوفِ وَانْهَ عَنِ الْمُنكَرِ وَاصْبِرْ عَلَى مَا أَصَابَكَ إِنَّ ذَلِكَ مِنْ عَزْمِ الْأُمُورِ وَلَا تُصَعِّرْ خَدَّكَ لِلنَّاسِ وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا [لقمان: 16]

ఖుర్ఆన్వచనభావంయొక్కఅనువాదం: “ఓ నా (ప్రియమైన) కుమారా! నమాజును నెలకొల్పుతూ ఉండు, మంచిని గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు, చెడు నుండి వారిస్తూ ఉండు, ఏ ఆపద వచ్చిపడినా సహనం పాటించు, నిశ్చయంగా అది (సహనం) ధైర్యసాహసాలతో కూడిన విషయాల్లో ఒకటి”. (లుఖ్మాన్ 31:16).

ఈ ఓర్పు ఎందుకంటే, అతను ప్రజల మనోవాంఛలను ఎదురుకో బోతున్నాడు. ఆ మనోవాంఛలు అనేకమంది ప్రజలను తమ అధీనంలో ఉంచు కుంటాయి. (అంటే వారు తమ మనోవాంఛలకు బానిసలై పోతారు అలాంటి వారితో పోరాడడమనేది ధైర్యసాహసాలతో కూడుకున్న పని.)

మంచిని గురించి ఆజ్ఞాపించే, చెడు నుండి వారించేవారికి ఇహలోకంలో మరియు పరలోకంలో అనేక శుభవార్తలున్నాయి. చదవండి అల్లాహ్ ఆదేశాన్నిః

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ [الأحزاب: 70، 71].

ఖుర్ఆన్వచనభావంయొక్కఅనువాదం: “ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు భయపడండి, సత్యమైన మాటనే పలకండి. అల్లాహ్ మీ ఆచరణలను చక్కదిద్దుతాడు. మీ పాపాలను మన్నిస్తాడు”. (అహ్ జాబ్ 33:70,71).

పాపాల వల్ల వచ్చి పడే ఏ విపత్తుల నుండి అల్లాహ్ అతనిని అంటే ‘మంచిని గురించి ఆదేశించే, చెడు నుండి వారించే’ వానిని కాపాడతాడు. అంతే కాక అతనికి గొప్ప ప్రతిఫలం కూడా ప్రసాదిస్తాడు. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః

فَلَوْلاَ كَانَ مِنَ الْقُرُونِ مِن قَبْلِكُمْ أُوْلُواْ بَقِيَّةٍ يَنْهَوْنَ عَنِ الْفَسَادِ فِي الأَرْضِ إِلاَّ قَلِيلًا مِّمَّنْ أَنجَيْنَا مِنْهُمْ [هود: 116]

ఖుర్ఆన్వచనభావంయొక్కఅనువాదం: “మీకు పూర్వం గతించిన కాలాలవారిలో భూమిలో కల్లోలం రేకెత్తించకుండా నిషేధించే సజ్జనులు ఎందుకు లేరు? కొద్ది మంది తప్ప, వారిని మేము కాపాడాము”. (హూద్ 11:116).

فَلَمَّا نَسُواْ مَا ذُكِّرُواْ بِهِ أَنجَيْنَا الَّذِينَ يَنْهَوْنَ عَنِ السُّوءِ وَأَخَذْنَا الَّذِينَ ظَلَمُواْ بِعَذَابٍ بَئِيسٍ بِمَا كَانُواْ يَفْسُقُونَ [الأعراف: 165].

ఖుర్ఆన్వచనభావంయొక్కఅనువాదం: “ఎప్పుడైతే వారు, వారికి చేస్తూ వచ్చిన హితబోధను మరచిపోయారో (విస్మరించారో), అప్పుడు మేము చెడు నుండి వారిస్తూ ఉన్నవారిని రక్షించాము, మరియు అన్యాయా(దుర్మార్గా)నికి గురి అయినవారిని వారి అవిధేయతల కారణంగా కఠినమైన శిక్షతో పట్టుకున్నాము”. (ఆరాఫ్ 7:165).

ధనప్రాణాలపై, ఆలుబిడ్డలపై వచ్చిపడే ఉపద్రవాల వలన మనిషి ఏ పాపాలకు లోనవుతాడో, మంచిని గురించి ఆదేశిస్తూ, చెడు నుండి వారిస్తూ ఉండడమనేది అటువంటి పాపాలకు పరిహారంగా మారుతుంది. హజ్రత్ హుజైఫా రదియల్లాహు అన్హు ఉపద్రవాల గురించి ప్రశ్నించబడినప్పుడు ఇలా తెలిపారు: ‘‘నిశ్చయంగా నమాజ్, ఉపవాసం, మంచిని గురించి ఆదేశించడం, చెడు నుండి వారించడం, వీటిని సంపద-సంతానాల కారణంగా జరిగే పాపాలకు పరిహారంగా అల్లాహ్ చేస్తాడు.’

మంచిని గురించి ఆదేశించే, చెడు నుండి వారించే వారికి అల్లాహ్ సర్వసుఖాల స్వర్గం మరియు కఠిన శిక్షల నుండి రక్షణను వాగ్దానం చేశాడు.

التَّائِبُونَ الْعَابِدُونَ الْحَامِدُونَ السَّائِحُونَ الرَّاكِعُونَ السَّاجِدونَ الآمِرُونَ بِالْمَعْرُوفِ وَالنَّاهُونَ عَنِ الْمُنكَرِ وَالْحَافِظُونَ لِحُدُودِ اللّهِ وَبَشِّرِ الْمُؤْمِنِينَ [التوبة: 112]

ఖుర్ఆన్వచనభావంయొక్కఅనువాదం: “(వీరే అల్లాహ్ ముందు) పశ్చాత్తాప పడేవారు. ఆయనను ఆరాధించేవారు. స్తుతించేవారు. (అల్లాహ్ మార్గంలో) సంచరించేవారు. (ఉపవాసాలు ఉండేవారు). ఆయన సన్నిధిలో వంగేవారు (రుకూ చేసేవారు). సాష్టాంగం (సజ్దా) చేసేవారు. ధర్మమును ఆదేశించేవారు. మరియు అధర్మమును నిషేధించేవారు. మరియు అల్లాహ్ విధించిన హద్దులను పాటించేవారు కూడాను. మరియు విశ్వాసులకు శుభవార్తను తెలుపు” (అత్తౌబా 9:112)

శుభవార్త ఇహపరాల మేలు కొరకే ఉంటుంది. అయితే ఈ శుభవార్త  గురించి ఇప్పుడు ఒకసారి చదవండి

يَوْمَ تَرَى الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ يَسْعَى نُورُهُم بَيْنَ أَيْدِيهِمْ وَبِأَيْمَانِهِم بُشْرَاكُمُ الْيَوْمَ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ذَلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ [الحديد: 12].

ఖుర్ఆన్వచనభావంయొక్కఅనువాదం: “అల్లాహ్ నాకు మీకు దివ్య ఖుర్ఆన్ ద్వారా శుభం కలుగజేయుగాక! అందులో ఉన్న ఆయతుల మరియు వివేకవంతమైన హితోపదేశాల ద్వారా లాభం చేగూర్చుగాక! ఇంకా ప్రవక్తల నాయకుల సన్మార్గం మరియు ఆయన సద్వచనాల ద్వారా కూడా ప్రయోజనం కలుగజేయుగాక!” (అల్ హదీద్ 57:12)

ఇక్కడికే నేను నా మాటను సమాప్తం చేస్తున్నాను. నా గురించీ, మీ గురించీ, ఇంకా ముస్లిములందరి గురించీ ప్రతి పాపం నుండి మహోన్నుతుడైన అల్లాహ్ తో క్షమాపణ కోరుతున్నాను, మీరు కూడా క్షమాపణ కోరండి!

రెండవ ఖుత్బ: అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వలియ్యిల్ మూమినీన్, అహ్మదు రబ్బీ వ అష్కురుహూ, వ అతూబు ఇలైహి వఅస్తగ్ఫిరుహూ, వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ యుహిబ్బుల్ ముత్తఖీన్, వ అష్ హదు అన్న నబియ్యనా వ సయ్యిదనా ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ బఅసహుల్లాహు బిల్ హుదా వల్ యఖీన్, లియున్ జిర మన్ కాన హయ్యన్ వ యహిఖ్ఖల్ ఖౌలు అలల్ కాఫిరీన్, అల్లాహుమ్మ సల్లి వ సల్లిమ్ వ బారిక్ అలా అబ్దిక వ రసూలిక ముహమ్మదివ్ వ అలా ఆలిహీ వ సహబిహీ అజ్మఈన్. అమ్మాబఅద్:

అల్లాహ్ తో భయపడవలసిన విధంగా భయపడండి, ఇస్లాం కడియాలను గట్టిగా పట్టకోండి.

అల్లాహ్ దాసులారా! దాసునిపై అతి గొప్ప వరం ఏమిటంటేః అల్లాహ్ అతనికి నిర్మలమైన మనస్సు ప్రసాదించటం. ఆ మనస్సు మంచిని గుర్తించి – దానిని మరియు దానిని పాటించువారిని ప్రేమించి, మంచిని గురించే ఆదేశిస్తూ ఉంటుంది. అలాగే చెడును గుర్తించి – దానిని అసహ్యించుకొని, దానికి పాల్పడేవారితో ఏ నిషిద్ధ కార్యంలోనూ పాలుపంచుకోదు.

మహాశయ ముస్లిములారా! అజ్ఞానం పెరిగిపోయినది. పుణ్యకార్యాల మరియు పాపకార్యాల పరిజ్ఞానం తగ్గిపోయింది. ఇలాంటి సందర్భంలో ఒక ముస్లిం తన తోటిముస్లిం సోదరునికి ఏదైనా గొప్ప లాభం చేకూర్చ గలడంటే – అది అతనికి సన్మార్గం వైపునకు దారి చూపటం, ఏదైనా చెడు, నిషిద్ధ కార్యం నుండి హెచ్చరించడం. వాస్తవానికి విశ్వాసులు పరస్పరం శ్రేయోభిలాషులు, మంచిని కోరేవారు. అందుకే తమ ముస్లిం సోదరుల కొరకు మంచిని ఇష్టపడతారు. ఓ హదీథులో ఇలా ఉందిః

(( لا يؤمن أحدُكم حتى يحبَّ لأخيه ما يحبّ لنفسه))

అనువాదం: ““““మీలో ఒక వ్యక్తి తన కొరకు ఇష్టపడినదానిని తన సోదరుని కొరకు ఇష్టపడనంత వరకు (నిజమైన) విశ్వాసి కాజాలడు”. (బుఖారి మరియు ముస్లిం హదీథు గ్రంథాలు – అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన).

జరీర్ రదియల్లాహు అన్హు ఇలా పలికారు: “నేను ప్రతి ముస్లిం పట్ల శ్రేయోభిలాషిగా ఉంటాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో శపథం చేశాను.”

అయితే మునాఫిఖులు (కపటవిశ్వాసులు) వంచకులు, మోసగాళ్ళు. వారు మంచిని నిరోధిస్తుంటారు.

الْمُنَافِقُونَ وَالْمُنَافِقَاتُ بَعْضُهُم مِّن بَعْضٍ يَأْمُرُونَ بِالْمُنكَرِ وَيَنْهَوْنَ عَنِ الْمَعْرُوفِ وَيَقْبِضُونَ أَيْدِيَهُمْ نَسُواْ اللّهَ فَنَسِيَهُمْ إِنَّ الْمُنَافِقِينَ هُمُ الْفَاسِقُونَ [التوبة: 67].

ఖుర్ఆన్వచనభావంయొక్కఅనువాదం: “కపటవిశ్వాసులైన పురుషులు, స్త్రీలు, వారంతా ఒకటే, వారు చెడు విషయాల గురించి ఆజ్ఞాపించి, మంచి విషయాల నుండి ఆపుతారు. తమ చేతులను (మేలు చేయకుండా) మూసి ఉంచుతారు. వారు అల్లాహ్ ను మరచిపోయారు, కావున ఆయన కూడా వారిని మరచిపోయాడు. వాస్తవానికి ఈ కపటవిశ్వాసులే అవిధేయులు”. (తౌబా 9: 67).

ముస్లిం మహాశయులారా! పరస్పర ప్రేమను పెంపొందించండి, మృదువుగా, మెతకవైఖరితో, పుణ్యాన్ని ఆశిస్తూ శ్రేయోభిలాషిగా మెలగండి. అజ్ఞానికి ధర్మ విషయాలు నేర్పండి, అతనికి తౌహీద్ (దైవఏకత్వం) మరియు అల్లాహ్ కు భాగస్వామిని చేసే నిషిద్ధమార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసి, అప్రమత్తం చేయండి. అలాగే నమాజ్ ఆదేశాలు మరియు ఇస్లాంకు సంబంధించిన ఇతర మూలస్థంభాలు, మూలసిద్ధాంతాలు నేర్పండి.

అలీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా బోధించారు:

((لَأَنْ يهديَ الله بك رجلًا واحدًا خيرٌ لك من حُمُر النِّعم)).

అనువాదం: “““““నీ కారణంగా అల్లాహ్ ఒక వ్యక్తికి సన్మార్గం చూపిన ఇది నీ కొరకు అరబ్బులోని ఎర్ర ఒంటెలకంటే ఎంతో ఉత్తమం”.”

అల్లాహ్ పట్ల ఏమరపాటుకు గురైన వ్యక్తిని మేల్కొలపండి, తన పరలోక ప్రయోజనానికి ఏదైనా సత్కార్యం చేసుకుంటాడు, ప్రపంచంతో మోసబోకుండా ఉంటాడు. అల్లాహ్ పై తిరుగుబడిదారి అవలంభించి, పాపాలకు ఒడిగట్టేటంతటి ధైర్యం చేసేవానికి అల్లాహ్ పట్టు చాలా పటిష్టమైనదని హెచ్చరించండి. పుణ్యకార్యాల్లో బద్ధకం వహించేవానికి, త్వరపడి సత్కార్యాలు చేసుకోమని హితబోధ చేయండి. ధైర్యహీనులను ఖుర్ఆన్ మరియు సున్నతుల ద్వారా ధైర్యపరచండి, ఇలాగైనా వారి విశ్వాసం పెరుగుతుంది.

ముస్లిములారా! నిశ్చయంగా మీ సంతానానికి, ఇంటివారికి, బంధుమిత్రులకు, ఇరుగుపొరుగువారికి మంచిని గురించి ఆజ్ఞాపించే మరియు చెడు నుండి వారించే బాధ్యత మీపై ఎంతైనా ఉంది. ఓ ముస్లింలారా! వాస్తవంగా నీపై నీ భార్యాబిడ్డల యొక్క గొప్ప బాధ్యత ఉన్నది. అది ఒక పెద్ద అమానతు. అల్లాహ్ వారిపై విధిగావించిన విషయాలు వారు సరియైన విధంగా నిర్వర్తించేలా నీవు వారిని ఆదేశించు, అల్లాహ్ వారిపై నిషిద్ధపరచిన వాటి నుండి వారిని వారించు. దుష్ట మానవుల, జిన్నాతుల, షైతానుల నుండి వారిని కాపాడు, అలాంటి దుష్టులు వారిని అన్ని రకాల అశ్లీలానికి ప్రేరేపిస్తారు, అల్లాహ్ మార్గం మరియు భోగభాగ్యాల స్వర్గం నుండి వారిని దూరం చేస్తారు.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ عَلَيْهَا مَلَائِكَةٌ غِلَاظٌ شِدَادٌ لَا يَعْصُونَ اللَّهَ مَا أَمَرَهُمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ[التحريم: 6]

ఖుర్ఆన్వచనభావంయొక్కఅనువాదం: “ “ఓ విశ్వాసులారా! మీరు మిమ్మల్ని మరియు మీ కుటుంబీకుల్ని, మానవులు మరియు రాళ్ళు ఇంధనం కాబోయే నరకాగ్ని నుండి కాపాడుకోండి. దానిపై ఎంతో కఠినులు, బలిష్ఠులూ అయిన దైవదూతలు ఉన్నారు. వారు అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞను ఉల్లఘించరు, మరియు వారికివ్వబడిన ఆజ్ఞలను వారు నెరవేరుస్తూ ఉంటారు”. (తహ్రీం 66:6)

ఇహలోకంలోనైనా, పరలోకంలోనైనా సర్వ మానవుల్లో ఎక్కువ బాధకు గురి అయ్యేవారు ఈ అమానతును వృధా చేసినవారే.

మస్లిములారా! మీ సంతానం మీతో శాంతినిలయం (స్వర్గం)లో ఉండాలని ఇష్టపడరా? అయితే చదవండి, అందరికంటే సత్యమాట పలికేవాడైన అల్లాహ్ ఇలా చెప్పాడు, ఆయన ఎన్నటికీ వాగ్దాన భంగం చేయడు.

وَالَّذِينَ آمَنُوا وَاتَّبَعَتْهُمْ ذُرِّيَّتُهُم بِإِيمَانٍ أَلْحَقْنَا بِهِمْ ذُرِّيَّتَهُمْ وَمَا أَلَتْنَاهُم مِّنْ عَمَلِهِم مِّن شَيْءٍ كُلُّ امْرِئٍ بِمَا كَسَبَ رَهِينٌ [الطور: 21].

ఖుర్ఆన్వచనభావంయొక్కఅనువాదం: “మరెవరయితే విశ్వసించారో, వారి సంతానం కూడా విశ్వసంతో వారిని అనుసరిస్తే, మేము వారి సంతానాన్ని వారితో కలుపుతాము. మరియు వారి కర్మలలో వారికి ఏ మాత్రం నష్టం కలిగించము. నిజానికి ప్రతి వ్యక్తీ తాను సంపాదించిన దానికి తాకట్టుగా ఉంటాడు”. (తూర్ 52:21).

ఈ ఆయత్ వ్యాఖ్యానంలో వ్యాఖ్యానకర్తలు ఇలా చెప్పారుః నిశ్చయంగా అల్లాహు తఆలా సంతానాన్ని స్వర్గంలో వారి పితామహుల స్థాయికి చేరుస్తాడు, ఒకవేళ పిల్లల సత్కార్యాలు వారి తండ్రుల సత్కార్యాల కంటే తక్కువ ఉన్నా సరే, ఇది అల్లాహ్ యొక్క దయ, కరుణ, కృపాలతో, పితామహులు తమ సంతానాన్ని తమ వెంట చూసుకుంటూ వారి కళ్ళకు చల్లదనం కలగాలని. అల్లాహ్ తండ్రుల పుణ్యకార్యాల్లో ఏ తగ్గింపు, కొరత చేయడు. ఎందుకనగా ఆయన గొప్ప దయ,దాతృత్వ గుణం కలవాడు, ఆయన దాతృత్వానికి అంతు లేదు. ఆయన ఈ గొప్ప దయ, దాతృత్వాలను పొందుటకు అల్లాహ్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. మీరు అల్లాహ్ ఆదేశాలను అమలు పరచండి, ఆయన మీకు చేసిన వాగ్దానాలు పొందుటకు, ఆయన ఎన్నటికీ వాగ్దాన భంగం చేయడు.

అల్లాహ్ దాసులారా! “నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై దరూద్ లు పంపుతూ ఉంటారు.

ఖుర్ఆన్వచనభావంయొక్కఅనువాదం: “ఓ విశ్వాసులారా! మీకు కూడా అతనిపై దరూద్ లు మరియు మీ హృదయపూర్వక సలాంలు పంపుతూ ఉండండి”. (అహ్ జాబ్ 33: 56).


[1] ఈ హదీసును ‘అబూ సఅలబా అల్ ఖషనియ్యి’ ఉల్లేఖించారు.  ఈ హదీసు ప్రామాణికమైనదని, దీనిని ‘దారు ఖుత్నీ’ తదితరులు సేకరించారని ఇమాం నవవి రహిమహుల్లాహ్ తెలిపారు.

[2] ఈ హదీసు తిర్మిజి రహిమహుల్లాహు ఉల్లేఖించి, ఇది హసన్ అని తెలిపారు.

[3] ముస్లిం హదీథు గ్రంథం 49.

నైతిక ప్రవర్తన (నీతిబద్ధమైన నడవడిక) – Good Character

హదీథ్׃ 10

:حسن الخلق : నైతిక ప్రవర్త (నీతిబద్ధమై నడవడిక)

عَنْ عَبْدِ اللهِ بْنِ عَمَرٍ و رضى الله عنهما قَالَ : لَـمْ يَكُنِ النَّبِىُّ ^ فَا حِشاً وَّلاَ مُتَفَحِّشاً وَّ كَانَ يَقُوْلُ : ﺇِنَّ مِنْ خِيَارِكُمْ أَحْسَنُكُمْ أَخْلَاقاً  (رواه البخارى)

అన్ అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ రదిఅల్లాహు అన్హుమా ఖాల –  ″లమ్ యకున్ అన్నబియ్యు (సల్లల్లాహు అలైహి వసల్లమ్) – ఫాహిషన్ వలా ముతఫహ్హిషన్ – వకాన యఖూల్ ఇన్న మిన్ ఖియారికుమ్ అహ్ సనుకుమ్ అఖ్ లాఖ.″ రవాహుల్ బుఖారి

తాత్పర్యం :- అన్ = ఉల్లేఖన, అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ = ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క సహచరుడు(సహాబి), రదియల్లాహు అన్హుమా = అల్లాహ్ వారితో ఇష్టపడుగాక ,  ఖాల = తెలిపారు,  లమ్  యకున్ = ఉండేవారు కాదు, అన్నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లమ్ = ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్), ఫాహిషన్ = అసభ్యకరమైన, అసహ్యకరమైన మాటలు పలికే కలవారు, వ = మరియు, లా  ముతఫహ్హిషన్ = అసహ్యకరమైన ప్రవర్తన కలిగిన వారూ కాదు, వ = మరియు, కాన యఖూలు = తెలిపేవారు, ఇన్న = ఖచ్చితంగా, మిన్ ఖియారికుమ్ =  మీలో మంచివారు (ఉన్నతమైన వారు),  అహ్ సనుకుమ్ అఖ్ లాఖ = మంచి గుణాలు కలిగిన వారు. ఇమాం బుఖారి నమోదు చేసినారు.

అనువాదం:- అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ రదియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖించారు “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ″ఫాహిష్(అసభ్యకరమైన సంభాషణ చేసేవారు)″ మరియు ″ముతఫహ్హిష్ (అసభ్యకరంమైన ప్రవర్తన కలవారు)″ కానీ కారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) అంటూ ఉండేవారు “మీలో ఉత్తమమైన వారు (ఎవరంటే), (ఎవరైతే) ఉత్తమమైన, ఉన్నతమైన గుణగణాలు (నడవడి )కలవారు.

వివరణ:- ఈ హదీథ్ లో – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఉత్తమమైన నడవడి, సభ్యత, సౌజన్యం కలవారు అనడానికి నిదర్శనం ఉన్నది. ఆయన ఎప్పుడూ అసభ్యకరంగా మాట్లాడటం గానీ, తనచుట్టూ ఉన్నవాళ్ళను నవ్వించడానికి ఆ విధమైన సంభాషణ చేయడం గానీ ఎప్పుడూ చేయలేదు. అసభ్యకరమైన నడవడిక ఏ విషయంలోనైనా సరే (మనపట్ల) అసహ్యం, ఏహ్యభావం కలగచేస్తుంది. మనం సంభాషించేతీరు, ఉపయోగించే మాటలు, మనచేష్టలు, మన గుణగణాలు, స్వభావం (మనం ఇతరులకు ఆపాదించే గుణగణాలు) ఇవన్నీ మన సభ్యత, అసభ్యతలను తెలియచేస్తాయని గమనించాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఒకసారి ఇలా అన్నారు “అసభ్యకరంగా ప్రవర్తించే వారినీ, నీతిబాహ్యులను అల్లాహ్ ఇష్టపడడు”

ఈ హదీథ్ అమలు చేయడం వలన కలిగే లాభాలు :-

  1. ఇస్లామీయ చట్టాల గొప్పదనం ఏమిటంటే అవి ప్రతి విషయంలోనూ నీతివంతమైన నడవడికి ప్రాధాన్యం ఇస్తాయి. ఇతరులకు నష్టం లేక కష్టం కలిగించడాన్నుంచి ఎల్లప్పడూ దూరంగా ఉండాలని, ప్రీతిపాత్రమైన నడవడిక కలిగి ఉండడాన్ని, మంచిపనులు చేయడాన్ని అన్ని వేళలా ప్రోత్సహిస్తుంటాయని గమనించాలి.
  2. ధర్మబద్ధతకు,సన్మార్గశీలతకు కట్టుబడి ఉండడం అంటే నీతిబాహ్యమైన వాటికి దూరంగా ఉండడం.
  3. నీతివంతమైన ప్రవర్తన, మంచి నడవడిక తీర్పుదినం నాడు మనల్ని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) దగ్గరకు చేరుస్తాయి.
  4. మనం ఇతరులను గౌరవించడం, వారిపట్ల దయ, కనికరం తో ప్రవర్తించడం – ధర్మబద్ధతకు, సత్శీలతకు నిదర్శనం అని గమనించాలి.
  5. సత్శీలత మనల్ని అల్లాహ్ అనుగ్రహానికి దగ్గర చేస్తుంది.

హదీథ్ ను ఉల్లేఖించినవారి పరిచయం:-ఈ హదీథ్ ను ఉల్లేఖించినవారి పేరు అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ బిన్ ఆస్ బిన్ వాయిల్ అస్సహామీ రదియల్లాహు అన్హుమా. ఈయన ఖురైష్ తెగకు చెందినవారు. ఈయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) వంశానికి చెందినవారే. ఈయన వంశవృక్షంలో ఉన్న ముత్తాత కాబ్ బిన్ లోయి మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) వంశవృక్షంలోఉన్న ముత్తాత కాబ్ బిన్ లోయి ఒకరే. ముందుగా ఇస్లాం స్వీకరించినవారిలో (సాబిఖీన్ అల్ అవ్వలీన్) ఒకరు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) హదీథ్ లను ఎక్కువ సంఖ్యలో ఉల్లేఖించినవారిలో వీరూ ఒకరు.

ప్రశ్నలు

  • 01. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) _____________, ____________″  కానీ కారు.
  • 02. “అల్లాహ్ _____________ ప్రవర్తించే వారినీ, _____________ ఇష్టపడడు”
  • 03. ఇస్లాం ప్రతివిషయంలోనూ _____________ నడవడికి ప్రాధాన్యం ఇస్తుంది.
  • 04. _____________ మనల్ని అల్లాహ్ అనుగ్రహానికి దగ్గర చేస్తుంది.
  • 05.అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ బిన్ ఆస్ బిన్ వాయిల్ రదియల్లాహు అన్హుమా గురించి వ్రాయండి.
  • 06. మంచి వ్యక్తులు కలిగి ఉండే ఉన్నతమైన గుణం  _______________

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా