390. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-
ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గంలో విందు ఏర్పాటు చేస్తాడు.
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గంలో విందు ఏర్పాటు చేస్తాడు.
రమజాన్ నెల ప్రారంభం కావడానికి ఒకటి, రెండు రోజుల ముందుగా ఎవరూ ఉపవాసం పాటించకూడదు. ఒకవేళ ఎవరైనా ఆ తేదీల్లో ఎల్లప్పుడూ (ప్రతి యేడూ) ఉపవాసాలు పాటిస్తూ ఉంటే అలాంటి వ్యక్తి ఈ తేదీల్లో ఉపవాసం పాటించవచ్చు.
మేరాజ్ (గగన విహారం) రాత్రి బైతిల్ మఖ్దిస్ లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు రెండు గిన్నెలు ఉంచబడ్డాయి. వాటిలో ఒక గిన్నెలో సారా ఉంది. రెండవ గిన్నెలో పాలున్నాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ రెండింటినీ చూసి పాలగిన్నెను మాత్రమే తీసుకున్నారు. అప్పుడు దైవదూత హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) ఇలా అన్నారు. “అల్లాహ్ ఎంతో ప్రశంసనీయుడు! ఆయన మిమ్మల్ని ప్రకృతి వైపుకు మార్గదర్శనం చేశాడు. (అంటే ఆయన మీకు మానవ స్వభావాన్ని అనుగణమైన విషయం వైపుకు దారి చూపాడు). ఒకవేళ మీరు సారాయి గిన్నె తీసుకొని ఉంటే మీ అనుచర సమాజం సన్మార్గం తప్పిపోయేది”.
“ఆయనే మీ (హృదయ ఫలకం) పై ఈ గ్రంధాన్ని అవతరింపజేసినవాడు. ఇందులో రెండు రకాల సూక్తులున్నాయి. ఒకటి ముహ్కమాత్ (స్పష్టమైనవి). ఇవి గ్రంథానికి పునాదులు వంటివి. రెండు : ముతషాబిహాత్ (అస్పష్టమైనవి). వక్రబుద్ధి కలవారు కలహాలు సృష్టించే ఉద్దేశ్యంతో ఎల్లప్పుడూ అస్పష్టమయిన సూక్తుల వెంటే పడతారు. వాటికి లేనిపోని అర్ధాలు ఆపాదించడానికి ప్రయత్నిస్తారు. నిజానికి వాటి అసలు భావం ఆల్లాహ్ కి తప్ప మరెవరికీ తెలియదు. దీనికి భిన్నంగా విషయ పరిజ్ఞానంలో స్థిత ప్రజ్ఞులయినవారు ‘మేము వీటిని నమ్ముతున్నాము. ఇవన్నీ మా ప్రభువు నుండి వచ్చినవే’ అని అంటారు. అసలు ఏ విషయం ద్వారానయినా బుద్దిమంతులే గుణపాఠం గ్రహించగలరు” (ఆలి ఇమ్రాన్ : 7)
ఆ తరువాత ఆయన ఈ విధంగా ప్రవచించారు : “మీరెప్పుడయినా దివ్య ఖుర్ఆన్ లోని ఈ అస్పష్టమయిన సూక్తుల వెంటబడి ఆరా తీయడానికి ఎవరైనా ప్రయత్నిచడం చూస్తే, అల్లాహ్ (ఖుర్ఆన్ లో) వారిని గురించే ప్రస్తావించాడని తెలుసుకొని వారికి దూరంగా ఉండండి”.
బహుదైవారాధకుల యుక్త వయస్సుకు రాని పిల్లలను గురించి (వారు స్వర్గానికి పోతారా లేక నరకానికి పోతారా అని) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రశ్నించటం జరిగింది. దానికి ఆయన సమాధానమిస్తూ “వారు పెరిగి పెద్ద వాళ్ళయిన తరువాత ఎలాంటి కర్మలు ఆచరిస్తారో అల్లాహ్ కే తెలుసు” అని అన్నారు.
నరకం నుండి అందరికంటే చివర్లో బయటపడే, స్వర్గంలోనూ అందరికంటే చివర్లో ప్రవేశించే వ్యక్తిని గురించి నాకు బాగా తెలుసు. అతను నరకం నుండి పడుతూ లేస్తూ బయలుదేరుతాడు. అతనితో అల్లాహ్ ‘వెళ్ళు, (ఇక) స్వర్గంలో ప్రవేశించు’ అని అంటాడు. ఆ వ్యక్తి స్వర్గం దగ్గరికి వస్తాడు. చూస్తే స్వర్గం పూర్తిగా నిండిపోయి (జనంతో) క్రిక్కిరిసి ఉన్నట్లు కన్పిస్తుంది. దాంతో అతను వెనక్కి తిరిగొచ్చి “ప్రభూ! అది పూర్తిగా నిండిపోయి ఉంది (నాకక్కడ చోటే ఉన్నట్లు కన్పించడం లేదు)” అని అంటాడు.దానికి అల్లాహ్ “వెళ్ళు, స్వర్గంలో ప్రవేశించు. నేనక్కడ నీకు ప్రపంచమంత చోటిచ్చాను. ప్రపంచ మంతేమిటీ, దానికి పదింతలు విశాలమైన చోటిచ్చాను (వెళ్ళు)” అని అంటాడు.(అయితే ఆ వ్యక్తికి నమ్మకం కలగలేదు అందువల్ల) అతను “ప్రభూ! తమరు (సర్వలోకాల) చక్రవర్తి అయి ఉండి నాలాంటి వారితో పరిహాసమాడుతున్నారా? లేక నన్ను ఆట పట్టిస్తున్నారా?” అని అంటాడు. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) ఈ హదీసు ఉల్లేఖించిన తరువాత “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విషయం తెలియజేస్తూ ఫక్కున నవ్వారు. అప్పుడు ఆయన పల్లు కూడా స్పష్టంగా కనిపించాయి” అని అన్నారు. ఈ వ్యక్తి స్వర్గవాసులలో అందరికంటే అతి తక్కువ అంతస్తు కలవాడని అంటారు.
కొండ మీద నుండి పడి ఆత్మహత్య చేసుకున్న వాడు నరకానికి పోయి, మాటిమాటికి కొండ మీద నుండి త్రోయబడే ఘోర శిక్షను శాశ్వతంగా చవిచూస్తూ ఉంటాడు. విషం తిని ఆత్మహత్య చేసుకున్న వాడు నరకంలో విషంచేత పట్టుకొని తింటూ ఎల్లప్పుడు తనను తాను హతమార్చుకుంటూ ఉంటాడు. ఏదైనా ఆయుధంతో ఆత్మహత్య చేసుకున్నవాడు నరకంలో కూడా అదే ఆయుధం తీసుకొని కడుపులో పొడుచుకుంటూ, ఎల్లప్పుడు తీవ్ర యాతనలు అనుభవిస్తూ ఉంటాడు.
నేను స్వర్గ ద్వారం దగ్గర నిలబడి చూశాను. స్వర్గంలో ప్రవేశిస్తున్న వారిలో అత్యధిక మంది నిరుపేదలే ఉన్నారు. ధనికులు (విచారణ కోసం ద్వారం ముందు) నిరోధించబడ్డారు. అయితే నరకానికి పోవలసిన ధనికుల్ని నరకంలోకి పంపమని ముందే ఆజ్ఞాపించడం జరిగింది. నేను నరక ద్వారం దగ్గర కూడా నిలబడి చూశాను. నరకంలో ప్రవేశిస్తున్న వారిలో అత్యధిక మంది స్త్రీలే ఉన్నారు.
రెండు వచనాలున్నాయి. అవి నాలుకపై తేలిగ్గానే ఉంటాయి (పఠించడం చాలా తేలికే). కాని పరలోకపు త్రాసులో చాలా బరువుగా ఉంటాయి. కరుణామయుడైన ప్రభువుకు ఈ వచనాలు ఎంతో ప్రియమైనవి. (అవేమిటంటే) “సుబ్ హానల్లాహిల్ అజీం; సుబ్ హానల్లాహి వబిహమ్దిహి” (పరమోన్నతుడైన అల్లాహ్ ఎంతో పవిత్రుడు; అల్లాహ్ పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, నేనాయన్ని స్తుతిస్తున్నాను).
అల్లాహ్ (తన) కారుణ్యాన్ని వంద భాగాలు చేసి, అందులో తొంభైతొమ్మిది భాగాలు తన దగ్గర పెట్టుకొని ఒక్క భాగం మాత్రమే భూమిపై అవతరింపజేశాడు. ఆ ఒక్క భాగం కారుణ్యం కారణంగానే మానవులు, ఇతర జీవరాసులు ఒకరి పట్ల మరొకరు కారుణ్యం, కనికరాలతో మసులుకుంటున్నారు. చివరికి (ఈ కారుణ్యం మూలంగానే) గుర్రం తన పిల్ల (కు కాస్త కూడా నష్టం వాటిల్ల కూడదని, దాని) పై నుండి తన కాలిగిట్టను ఎత్తుకుంటుంది.
You must be logged in to post a comment.