సుమయ్య (రజియల్లాహు అన్హా) జీవిత చరిత్ర | ఇస్లాంలో తొలి షహీదా (అమరవీరురాలు) [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ఇస్లాంలో తొలి షహీదా (అమరవీరురాలు) – Sumayyah (radhiyallaahu anha)
వీరి గురించి ప్రవక్త “ఓపిక వహించండీ, మీకు స్వర్గవాగ్దానం ఉంది“ అని అన్నారు

సుమయ్య (రజియల్లాహు అన్హా) జీవిత చరిత్ర | ఇస్లాంలో తొలి షహీదా (అమరవీరురాలు)
https://youtu.be/0RpTYePDBes [38 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఇస్లాం ధర్మంలో మొట్టమొదటి మహిళా షహీద్ అయిన సుమయ్య (రది యల్లాహు అన్హా) జీవిత చరిత్రను వివరించబడింది. ఆమె జీవితంలోని మూడు ముఖ్యమైన గుణపాఠాలు- ఈమాన్ (విశ్వాసం), సబర్ (సహనం), మరియు ఇస్తిఖామత్ (స్థిరత్వం) – ఎలా మనకు ఆదర్శంగా నిలుస్తాయో చర్చించబడింది. సూరహ్ అల్-అహ్జాబ్ మరియు సూరహ్ అల్-ముల్క్ నుండి ఆయతులను ఉటంకిస్తూ, ఒక విశ్వాసి యొక్క లక్షణాలను మరియు జీవితం యొక్క ఉద్దేశ్యాన్ని స్పష్టం చేయబడింది. యాసిర్ (రది యల్లాహు అన్హు) కుటుంబం ఇస్లాం ప్రారంభ రోజులలో ఎదుర్కొన్న కఠినమైన హింసలు, మరియు అబూ జహల్ చేతిలో సుమయ్య (రది యల్లాహు అన్హా) యొక్క దారుణమైన షహాదత్ (అమరగతి) గురించి వివరించబడింది. చివరగా, విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందడానికి అవసరమైన మూడు లక్షణాల గురించిన హదీసును వివరిస్తూ, సుమయ్య (రది యల్లాహు అన్హా) జీవితం నుండి ప్రేరణ పొంది మన విశ్వాసాన్ని, సహనాన్ని మరియు స్థిరత్వాన్ని బలోపేతం చేసుకోవాలని ప్రబోధించబడింది.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్. వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్. వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అమ్మాబాద్.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక. అభిమాన సోదరులారా! మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈరోజు నా ప్రసంగాంశం, ఇస్లాం ధర్మంలో షహీద్ అయిన మొదటి మహిళ సుమయ్య రది యల్లాహు అన్హా.

ఆవిడ జీవిత చరిత్రలో ముఖ్యమైన మూడు విషయాలు మనకు ఆదర్శం. అన్నిటికంటే విశిష్టమైనది, ప్రాముఖ్యమైనది, దానికి మించినది ఏదీ లేదు అనే విషయం ఈమాన్, విశ్వాసం. అలాగే రెండవది సబర్, సహనం. మూడవది ఇస్తిఖామత్, స్థిరత్వం. ముఖ్యమైన ఈ మూడు విషయాలు మనకి సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవిత చరిత్రలో బోధపడుతుంది.

ఒక విశ్వాసిలో ఉండవలసిన గుణాలు, గుణాలలో కొన్ని గుణాలను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర అహ్జాబ్, సూరహ్ నంబర్ 33, ఆయత్ నంబర్ 35లో ఇలా సెలవిచ్చాడు.

إِنَّ الْمُسْلِمِينَ وَالْمُسْلِمَاتِ وَالْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ وَالْقَانِتِينَ وَالْقَانِتَاتِ وَالصَّادِقِينَ وَالصَّادِقَاتِ وَالصَّابِرِينَ وَالصَّابِرَاتِ وَالْخَاشِعِينَ وَالْخَاشِعَاتِ وَالْمُتَصَدِّقِينَ وَالْمُتَصَدِّقَاتِ وَالصَّائِمِينَ وَالصَّائِمَاتِ وَالْحَافِظِينَ فُرُوجَهُمْ وَالْحَافِظَاتِ وَالذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ أَعَدَّ اللَّهُ لَهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

“నిశ్చయంగా, ముస్లిం పురుషులు, ముస్లిం స్త్రీలు, విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు, విధేయులైన పురుషులు, విధేయులైన స్త్రీలు, సత్యసంధులైన పురుషులు, సత్యసంధులైన స్త్రీలు, సహనశీలురైన పురుషులు, సహనవతులైన స్త్రీలు, అణకువ గల పురుషులు, అణకువ గల స్త్రీలు, దానధర్మాలు చేసే పురుషులు, దానధర్మాలు చేసే స్త్రీలు, ఉపవాసం ఉండే పురుషులు, ఉపవాసం ఉండే స్త్రీలు, తమ మర్మాంగాలను కాపాడుకునే పురుషులు, కాపాడుకునే స్త్రీలు, అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు, స్మరించే స్త్రీలు- వీరిందరి కోసం అల్లాహ్ మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.”

ప్రియ సోదరులారా! ఈ సూర అహ్జాబ్ ఆయత్ నంబర్ 35 కి ఇది అర్థం.

కాకపోతే ఇక ఈ ఆయత్ యొక్క వివరము, తఫ్సీర్ లో నేను వెళ్ళదలచలేదు. కేవలం ఈ ఆయత్ లో వివరించబడిన గుణాలలో ఒక్క ముఖ్యమైన గుణం – వస్సాబిరీన వస్సాబిరాత్. సహనశీలురైన పురుషులు, సహనవతులైన స్త్రీలు. సబర్ గురించి. సబర్ అంటే సహనం. సాబిర్, సహనం చేసేవారు, వహించేవారు.

సహనశీలి అయిన స్త్రీ జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎంతో సహనంతో ఎదుర్కొంటూ దైవధర్మంలో స్థిరంగా ఉండే స్త్రీని సాబిరహ్ అంటారు. మరొకసారి నేను ఈ అర్థానికి రిపీట్ చేస్తున్నాను. సహనశీలి అయిన స్త్రీ అంటే ఏమిటి? సాబిరహ్ అంటే ఏమిటి? జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎంతో సహనంతో ఎదుర్కొంటూ దైవధర్మంలో స్థిరంగా ఉండే స్త్రీని సాబిరహ్ అంటారు. నిరాశ చెంది దైవాభిష్టానికి వ్యతిరేకమైన ఎటువంటి పనులకు పాల్పడకూడదు. తూఫాను భీభత్సంలో చిక్కుకొని భయంకరమైన కెరటాలకు ఊగిపోయే జీవిత నౌకను సహన స్థైర్యాలు కలిగిన నావికురాలు అల్లాహ్ మీద భారం వేసి అంతిమ శ్వాస వరకు దాన్ని తీరానికి తీర్చడానికే ప్రయత్నిస్తుంది. ఇటువంటి స్త్రీయే సుమయ్య రది యల్లాహు అన్హా.

సత్య ధర్మాన్ని నమ్మి దాని ప్రకారం నడుచుకునే ధృఢ మనస్కులు సహన స్థైర్యాలతో శత్రువుల దౌర్జన్యాలను తట్టుకుంటూ ఇస్లామీయ ఉద్యమంలో పురోగమిస్తున్న సాహసవతులలో యాసిర్ రది యల్లాహు అన్హు, ఆయన యొక్క అర్ధాంగి సుమయ్య రది యల్లాహు అన్హా, తనయుడు అమ్మార్ బిన్ యాసిర్ రది యల్లాహు అన్హు కూడా ఉన్నారు.

సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క భర్త యాసిర్ రది యల్లాహు అన్హుని మిట్టమధ్యాహ్నం మండుటెండలో ఇసుక నేల మీద నగ్నంగా పడేసి కొరడాలతో ఒళ్ళు హూనం చేశారు. నిప్పుతో వాతలు పెట్టేవారు. మక్కాలో ఇస్లాం ప్రారంభ కాలంలో ఆ యాసిర్ రది యల్లాహు అన్హు, భార్య సతీమణి సుమయ్య రది యల్లాహు అన్హా, తనయుడు అమ్మార్ రది యల్లాహు అన్హు, ఆ కుటుంబం యొక్క దయనీయ స్థితిని చూసి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ కళ్ళారా చూసి, ఏమీ చేయలేని సమయం అది. ఆ సమయంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోట వచ్చిన మాట: “ఇస్బిరూ యా ఆల యాసిర్, ఫ ఇన్న మౌయిదకుముల్ జన్నహ్.” ఓ యాసిర్ కుటుంబీకులారా, సహనం వహించండి ఎందుకంటే మీ నివాస స్థలం స్వర్గం. చివరికి యాసిర్ రది యల్లాహు అన్హు అవిశ్వాసులు పెడుతున్న బాధలు అనుభవిస్తూ ప్రాణం విడిచారు.

సతీమణి సుమయ్య రది యల్లాహు అన్హా గాథ కూడా దయనీయమైనదే. పరమ దుర్మార్గుడైన అబూ జహల్ ఆవిడను బాధించడమే కాకుండా ఒక రోజు అనరాని మాటలు అని తన చేతిలో ఉన్న ఈటెను ఎత్తి సుమయ్య రది యల్లాహు అన్హా మీదికి బలంగా విసిరాడు. ఆ దెబ్బకు ఆ సాధీమణి విలవిల్లాడుతూ నేల కొరిగారు. ఈ విధంగా ఇస్లాం ధర్మంలో షహీద్ అయిన, అమరగతి నొందిన మొదటి మహిళ సుమయ్య రది యల్లాహు అన్హా.

అభిమాన సోదరులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర ముల్క్ లో ఇలా సెలవిచ్చాడు, ఆయత్ నంబర్ రెండు సూర ముల్క్ లో:

الَّذِي خَلَقَ الْمَوْتَ وَالْحَيَاةَ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا وَهُوَ الْعَزِيزُ الْغَفُورُ
(అల్లదీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లు వకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా, వహువల్ అజీజుల్ గఫూర్)
“మీలో ఎవరు ఉత్తమమైన కర్మలు చేస్తారో పరీక్షించడానికి, ఆయనే మరణాన్ని, జీవితాన్ని సృష్టించాడు. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు.”

అంటే ఈ జీవన్ మరణాలను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్షించే నిమిత్తం మీలో ఎవరు మంచి పనులు చేస్తారు, సదాచరణ చేస్తారు, సత్కార్యాలు చేస్తారు, మంచి పనులు, మంచి వారు ఇవి చూడటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ చావుని, ఈ బ్రతుకుని, ఈ జీవితాన్ని, ఈ మరణాన్ని సృష్టించాడు. కనుక ఈ ప్రపంచంలో సుఖ సంతోషాలతో పాటు దుఃఖాలు, విచారాలు కూడా ఉన్నాయి. ఆనందము ఉంది. బాధా ఉంది. ప్రశాంతత, అప్రశాంతతలు రెండూ ఉన్నాయి. ఏ కష్టాలు వచ్చినా, ఏ కడగండ్లు ఎదురైనా నిరాశ చెందకుండా ధైర్యంతో, సంపూర్ణ విశ్వాసంతో సహనంతో ఏది పోగొట్టుకున్నా, ఏది నష్టం అయిపోయినా విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు అనే పాఠం మనకు బోధపడుతుంది సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవితంలో.

అభిమాన సోదరులారా! సుమయ్య రది యల్లాహు అన్హా అసలు ఆవిడ ఎవరు? ఒకసారి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఇది ప్రారంభ కాలం. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నబువ్వత్ వచ్చిన ప్రారంభంలో మక్కాలో ఒక వీధి ఉంది. దాని పేరు బనూ మఖ్జూమ్ వీధి. ఆ మక్కాలో బనూ మఖ్జూమ్ ఆ వాడ నుండి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పోతుండగా ఒక ముసలావిడని ఇనుముతో తయారు చేసిన ఆ వస్త్రాలలో, దానికి ఉర్దూలో జిరాహ్ అంటారు. దాంట్లో బాగా కట్టేసి మండుటెండలో పడేశారు. ఆవిడే సుమయ్య రది యల్లాహు అన్హా.

అంటే ఒక సందర్భంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా వీధులలోని ఒక వీధి, వాడలోని ఒక వాడ బనూ మఖ్జూమ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పోతుండగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తమ శుభప్రదమైన, పవిత్రమైన తమ కళ్ళతో చూసిన దృశ్యం ఇది. ఒక ముసలావిడను ఇనుముతో తయారు చేసిన దానితో బాగా కట్టేసి భగభగ బాగా విపరీతమైన వేడిలో పడేశారు. ఆవిడే సుమయ్య రది యల్లాహు అన్హా.

అసలు సుమయ్య రది యల్లాహు అన్హా ఎవరంటే అజ్ఞాన కాలంలో మక్కాలో ధనవంతులలో ఒక ధనవంతుడైన అబూ హుజైఫా బిన్ అల్ ముగైరా మఖ్జూమి అనే వ్యక్తి యొక్క బానిసరాలు సుమయ్య రది యల్లాహు అన్హా. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ప్రవక్త పదవి లభించక, అంటే బేసతే నబవి, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రవక్త పదవి లభించక 45 సంవత్సరాల ముందు, అంటే ఇంకా అప్పుడు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టనే లేదన్నమాట, 45 సంవత్సరాల ముందు యమన్ నుంచి యాసిర్ బిన్ ఆమిర్ అనే వ్యక్తి మక్కాకు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆ యాసిర్ బిన్ ఆమిర్ అనే వ్యక్తి యొక్క ఒక తమ్ముడు వ్యాపార నిమిత్తమో, ఏదో నిమిత్తమో యమన్ నుంచి వేరే దేశాలకి వచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి పోలేదు. తప్పిపోయారన్నమాట. తన తప్పిపోయిన తమ్ముడిని వెతుక్కుంటూ మక్కాకి వచ్చారు యాసిర్ బిన్ ఆమిర్ అనే వ్యక్తి. ఆ విధంగా వచ్చి మక్కాలోనే ఉండిపోయారు. తమ నివాసంగా మార్చుకున్నారు.

ఆ యాసిర్ బిన్ ఆమిర్ తో అబూ హుజైఫా బిన్ అల్ ముగైరా అంటే సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క యజమాని, ఆ అబూ హుజైఫా తన బానిస అయిన సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క వివాహం యమన్ నుంచి తమ్ముడిని వెతుక్కుంటూ వచ్చిన యాసిర్ బిన్ ఆమిర్ తో జరిపించాడు. ఈ విధంగా సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క వివాహం యాసిర్ బిన్ ఆమిర్ తో జరిగింది.

ఆ విధంగా వారి జీవితం కొనసాగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా. కాకపోతే యాసిర్ రది యల్లాహు అన్హు వేరే దేశం నుంచి వచ్చారు గనుక, సుమయ్య రది యల్లాహు అన్హా ఒక దగ్గర బానిసగా ఉన్నారు గనుక, వారికి ఆదుకోవటానికి, వారికి కష్ట సమయాలలో సహాయం చేయటానికి, ఆర్థిక పరంగా వారికి సహాయం చేయటానికి, సుఖదుఃఖాలలో పాల్గొనటానికి వారికి రక్త సంబంధీకులు మక్కాలో ఎవరూ లేరు.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు. తౌహీద్ సందేశం మొదలెట్టారు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ గురించి, ఇస్లాం ధర్మం గురించి, విశ్వాసం గురించి, వాస్తవాల గురించి, జీవన విధానం గురించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రారంభ కాలంలోనే ఇస్లాం స్వీకరించే వారిలో ముందున్న వారు ఆల యాసిర్. అంటే యాసిర్ రది యల్లాహు అన్హు, సతీమణి సుమయ్య రది యల్లాహు అన్హా, తనయుడు అమ్మార్ రది యల్లాహు అన్హు.

ఇక ఆ తర్వాత మనము మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర చదివితే మక్కాలో వహీ వచ్చిన తర్వాత ప్రారంభ కాలంలో ఎవరెవరైతే ఇస్లాం స్వీకరిస్తారో వారి స్థితి ఎలా ఉన్నిందో మనకు అర్థం అవుతుంది. రకరకాలుగా, ముఖ్యంగా ఎవరైతే బానిసలుగా ఉన్నారో, పేదవారిగా ఉన్నారో, ఆర్థికంగా కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నారో, బంధువులు లేని వారు, రక్త సంబంధం లేని వారు, అటువంటి వారికి ఎక్కువగా ఇబ్బందులు వచ్చాయి. వారిలో ఈ కుటుంబం కూడా, ఆల యాసిర్.

చాలా విధాలుగా హింసించబడ్డారు. వారిని కొట్టటం, వారిని తిట్టటం, హింసించటం, బట్టలు తీసేసి విపరీతమైన వేడి కాలంలో మిట్ట మధ్యాహ్నం బట్టలు తీసి ఇసుక మీద పడుకోబెట్టేవారు. అల్లాహు అక్బర్. తండ్రి ఓ పక్కన, తల్లి ఓ పక్కన, కొడుకు ఓ పక్కన, ఒకరి ముందర ఒకరికి శిక్ష ఇస్తున్నారు.

కాస్త మనము గమనించాలి. ఈ రోజు మనం అల్హందులిల్లాహ్, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. ఆర్థికంగా కూడా పస్తులు ఉండే సమయం కాదు. రెండు రోజులు, మూడు రోజులు తినటానికి తిండి లేదు అనేది లేదు. అల్హందులిల్లాహ్, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పుష్కలంగా మనకి వరాలు ప్రసాదించాడు. అయినా కూడా ఇస్లాం పరంగా జీవించటానికి మనకు ఎటువంటి ఇబ్బందులు లేవు. అయినప్పటికీ మనము చాలా విషయాలలో నిర్లక్ష్యం పాటిస్తున్నాం, చేస్తున్నాం.

మన కళ్ళ ముందర కూడా చెడు జరిగితే మనకెందుకేలే అని చెప్పి మౌనం వహిస్తున్నాం. ఒకవేళ మనలో కొందరు దీన్ పరంగా నడుచుకున్నా వారి కుటుంబంలో ఎంత మంది? భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, అమ్మా నాన్న వారు దీన్ పరంగా ఉన్నారా? తౌహీద్ లో ఉన్నారా? షిర్క్ లేకుండా ఉన్నారా? బిద్అత్ చేయకుండా ఉన్నారా? దీన్ ప్రకారం నడుచుకుంటున్నారా?

దీన్ పరంగా నడుచుకోవటానికి, తౌహీద్ పైన నిలకడగా ఉండటానికి, షిర్క్ చేయకుండా ఉండటానికి, తౌహీద్ విశిష్టత తెలుసుకోవటానికి, దాని అనుగుణంగా జీవితం గడపటానికి, అల్లాహ్ ను స్మరించటానికి, నమాజులు నెలకొల్పటానికి మనకు ఎవరైనా అడ్డు వస్తున్నారా? చేతిలో కర్ర తీసుకొని కొడుతున్నారా? ఆ విధంగా మనము పోల్చుకుంటే లెక్కలేని అనేక వరాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ప్రసాదించాడు. ఈ విషయం గురించి మనందరమూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

అభిమాన సోదరులారా, నేను ప్రారంభంలోనే చెప్పాను. అవిశ్వాసులు పెడుతున్న బాధలు అనుభవిస్తూ చనిపోయారు సుమయ్య రదియల్లాహు అన్హా యొక్క భర్త యాసిర్ రదియల్లాహు అన్హు. చనిపోయారు. అలాగే సతీమణి సుమయ్య రదియల్లాహు అన్హాను కూడా పరమ దుర్మార్గుడైన అబూ జహల్ ఆవిడను బాధించడమే కాకుండా ఒక రోజు అనరాని మాటలు అని తన చేతిలో ఉన్న ఈటెను ఎత్తి సుమయ్య రదియల్లాహు అన్హా మీదికి, అంటే కొంతమంది చరిత్రకారులు కడుపు మీద అంటారు, కొందరు నాభి కింద అంటారు, అక్కడ బలంగా విసిరాడు. ఆ దెబ్బకు ఆ సాధీమణి విలవిల్లాడుతూ నేలకొరిగారు. ఇంత దారుణంగా ఇస్లాం ప్రారంభ కాలంలో, ఎందుకంటే అప్పుడే వారి పెద్ద వయసు వారిది, వృద్ధాప్యానికి చేరుకున్నారు యాసిర్ రదియల్లాహు అన్హు, సుమయ్య రదియల్లాహు అన్హా. ఆర్థికంగా చాలా తక్కువగా ఉండేవాళ్ళు. బంధువులు ఎవరూ లేరు, రక్త సంబంధీకులు ఎవరూ లేరు. ఇస్లాం ప్రారంభం. ఆ సమయంలో ఎన్ని బాధలు వచ్చినా, అవిశ్వాసుల తరపు నుండి, బహుదైవారాధకుల తరపు నుండి, ఇస్లాం శత్రువుల తరపు నుండి రకరకాల బాధలు వచ్చినా, వారి యొక్క విశ్వాసంలో కొంచెం కూడా మార్పు రాలేదు, బలహీనతకి వారు గురి కాలేదు. ఇది మనకోసం ఉన్న గుణపాఠం.

చివరికి బద్ర్ యుద్ధంలో అబూ జహల్ చంపబడ్డాడు కదా? అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అప్పుడు సుమయ్య మరియు యాసిర్ లేరు కదా రది యల్లాహు అన్హుమా, తనయుడు కొడుకు అమ్మార్ ఉన్నారు కదా. అప్పుడు ఎప్పుడైతే బద్ర్ యుద్ధంలో అబూ జహల్ చంపబడ్డాడో అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమ్మార్ బిన్ యాసిర్ రది యల్లాహు అన్హును ఉద్దేశించి ఇలా అన్నారు: “ఖద్ ఖతలల్లాహు ఖాతిల ఉమ్మిక్.” ఓ అమ్మార్! నీ తల్లిని చంపినవాడు ఈరోజు చంపబడ్డాడు.

అభిమాన సోదరులారా, సుమయ్య రది యల్లాహు అన్హా ఇస్లాం ప్రారంభ కాలంలోనే ఇస్లాం స్వీకరించారు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు ఆవిడ జీవించలేదు. అంటే అనేక మంది తండోపతండాలుగా ముస్లింలు అయిపోయారు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనా హిజ్రత్ చేశారు, అది ఆ జీవితము, ఆ సమయము సుమయ్య రది యల్లాహు అన్హా జీవితంలో రాలేదు. ప్రారంభంలోనే ఆవిడ ఇస్లాం స్వీకరించారు, ప్రారంభంలోనే ఆవిడ అమరగతులయ్యారు, షహీద్ అయ్యారు.

నేను ఈరోజు నా ప్రసంగానికి సారాంశం ఏమిటంటే సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవితంలోని మనకోసము ఉండే అనేక గుణపాఠాలలో మూడు విషయాలు, వారు మాకోసం ఆదర్శం. ఈమాన్, సబర్, సాబిత్ ఖద్మీ. ఈమాన్ – విశ్వాసం, సబర్ – సహనం, సాబిత్ ఖద్మీ – నిలకడ, స్థైర్యం. ఇవి మూడు ముఖ్యమైనవి. ఎందుకంటే సుమయ్య రది యల్లాహు అన్హాకి భర్త తరపు నుంచి పరీక్ష. ఎందుకంటే తన కళ్ళ ముందర భర్తని కొడుతున్నారు. భర్త శరీరం నుంచి బట్టలు తీసేసి మిట్ట మధ్యాహ్నం ఇసుకలో ఎడారిలో పడుకోబెడుతున్నారు, కళ్ళతో చూస్తున్నారు భర్త పడే, భరించే ఆ బాధలు. స్వయంగా సుమయ్య రది యల్లాహు అన్హాని కూడా ఆ ఐరన్ తో తయారు చేసిన ఆ సంకెళ్ళతో బాగా బిగించి ఆవిడని కూడా, అల్లాహు అక్బర్, ముసలావిడ. ఆ ముసలావిడని ఈ విధంగా బంధించడం. కొడుకు అమ్మార్ ని కొట్టటం. ఆ తల్లికి, ఆ విశ్వాసమూర్తికి, ఆ విశ్వాసమూర్తి పడిన బాధ కొంచెం ఊహించుకోండి. ఓ పక్క భర్త, ఓ పక్క కొడుకు, ఓ పక్క స్వయంగా ఆవిడ, అన్ని విధాల అవిశ్వాసుల, ముష్రికుల, ఖురైషుల, కుఫ్ఫార్ల తరపు నుంచి బాధలు పడతా ఉంటే, ఆమె ఎంత స్థిరంగా, ధైర్యంగా, సహనంతో, ఓర్పుతో, తన విశ్వాసంలో మార్పులు ఏ విధంగా కూడా రాకుండా, రానివ్వకుండా ఆవిడ ఉన్నిందంటే, అర్థమవుతుంది

ఈమాన్ అంటే ఏమిటి, తౌహీద్ అంటే ఏమిటి. ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ కొన్ని రోజుల జీవితం కోసం మనము మాటిమాటికి విశ్వాసాన్ని లెక్క చేయకుండా ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నాం. చిన్న చిన్న సమస్యలు వచ్చినా విశ్వాసాన్ని మనము అమ్మేస్తున్నాం. చిన్న కారణాల వల్ల నమాజ్ చేయటం ఆలస్యం చేస్తాం మనం. మనలో చాలా మంది. ప్రతి ఒక్కరు కాదు, చాలా మంది. మనం గమనిస్తున్నాము. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చిన్న కారణం ఉంటుంది, అది తర్వాత కూడా చేసుకోవచ్చు. అంత పెద్ద నష్టం జరిగేది ఏమీ లేదు. అయినా కూడా ఆ ప్రాపంచిక చిన్న లబ్ధి కోసము మనము నమాజ్ వదిలేస్తాము, జమాత్ వదిలేస్తాము, తర్వాత నమాజ్ చేస్తాం. ఇది మన జీవితం.

అంటే కొంచెం ప్రాపంచిక కొంత లాభం కోసం మన ఈమాన్ లో ఎంత మార్పు వస్తా ఉంది. ఇది చిన్న ఉదాహరణ ఇచ్చాను నేను. కానీ వారు అన్ని కష్టాలు వారికి వచ్చినా వారి విశ్వాసంలో ఎటువంటి తేడా జరగలేదు.

అభిమాన సోదరులారా, ఇక మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్ సెలవిచ్చారు, ఆ హదీస్ మనం తెలుసుకొని నేను ముగిస్తాను. అదేమిటంటే ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది:

ثَلَاثٌ مَنْ كُنَّ فِيْهِ وَجَدَ حَلَاوَةَ الْإِيْمَانِ
(సలాసున్ మన్ కున్న ఫీహి వజద హలావతల్ ఈమాన్)
“మూడు విషయాలు ఎవరిలోనైతే ఉంటాయో, ఆ వ్యక్తి విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందాడు.”

మూడు విషయాలు ఎవరిలోనైతే ఉంటే, ఏ వ్యక్తిలో మూడు విషయాలు, మూడు గుణాలు ఉంటే ఆ వ్యక్తి విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందాడు. ఇప్పుడు మనము విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందామా లేదా అనేది ఈ హదీస్ తెలుసుకొని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ మూడు విషయాలలో మొదటిది ఏమిటి?

أَنْ يَكُونَ اللَّهُ وَرَسُولُهُ أَحَبَّ إِلَيْهِ مِمَّا سِوَاهُمَا
(అన్ యకూనల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా)
“అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి.”

మొదటి విషయం ఇది. అంటే ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి, ప్రతి ముస్లిము అన్నిటికంటే ఎక్కువ, అంటే తన భార్య కంటే, పిల్లల కంటే, స్త్రీ అయితే భర్త కంటే, పిల్లల కంటే, అమ్మా నాన్న కంటే ఎక్కువ, బంధుమిత్రుల కంటే ఎక్కువ, ఈ ధనం కంటే ఎక్కువ, ఆస్తుల కంటే ఎక్కువ, ఆప్తుల కంటే ఎక్కువ, హోదా కంటే ఎక్కువ, ఉద్యోగం కంటే ఎక్కువ, చివరికి తన ప్రాణం కంటే ఎక్కువ అల్లాహ్ ను, అల్లాహ్ ప్రవక్తను ప్రేమించాలి. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. ఇది మొదటిది.

రెండవది:

وَأَنْ يُحِبَّ الْمَرْءَ لَا يُحِبُّهُ إِلَّا لِلَّهِ
(వ అన్ యుహిబ్బల్ మర్అ లా యుహిబ్బుహు ఇల్లా లిల్లాహ్)
“ఇతరులను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే ప్రేమించాలి.”

అంటే ఇతరులను స్వార్థం కోసం కాకుండా, అల్లాహ్ ప్రసన్నత కోసం ప్రేమించాలి. ఉర్దూలో ఒక కవి ఇలా అంటాడు, ఉర్దూలో ఒక కవిత్వం ఉంది, ఒక పద్యము, దాంట్లో ఒక షేర్, ఒక వాక్యం ఇలా ఉంటుంది: “దిల్ మే ఆగ్, లబోం పే గులాబ్ రఖ్తే హైఁ, హమ్ అప్నే చెహ్రే పే దోహ్రీ నఖాబ్ రఖ్తే హైఁ.” మనసులో మాత్రం, హృదయంలో మాత్రం ప్రేమ లేదు, ద్వేషం ఉంది, మంట రగిలిపోతుంది. పెదవులపై నటిస్తాము. పువ్వులు ఉంటాయి, పెదవుల పైన పువ్వు ఉంది, కానీ లోపల మంట ఉంది. అంటే మన జీవితం ఈ విధంగా ఉంది. స్వార్థం ఉంటే మాట్లాడతాము, లాభం ఉంటే మాట్లాడతాము, అవసరం ఉంటే మాట్లాడతాము. ఆ అవసరాన్ని బట్టి మనము చేసే సలాం కూడా అలాగే ఉంటుంది. సలాం చేసే పద్ధతి, సలాం చేసే విధానము అది మన అవసరాన్ని బట్టి ఉంటుంది. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? రెండవ గుణం అంటే విశ్వాసం యొక్క మాధుర్యాన్ని ఎవరు పొందారు? ఆ పొందటానికి రెండవ గుణం ఏమిటి? ఇతరులను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే ప్రేమించాలి.

ఇక మూడవది:

وَأَنْ يَكْرَهَ أَنْ يَعُودَ فِي الْكُفْرِ كَمَا يَكْرَهُ أَنْ يُقْذَفَ فِي النَّارِ
(వ అన్ యక్రహ అన్ యఊద ఫిల్ కుఫ్రి కమా యక్రహు అన్ యుఖ్దఫ ఫిన్నార్)
“నరకాగ్ని భయంతో మళ్ళీ అవిశ్వాసిగా మారటాన్ని ఇష్టపడరు.”

అంటే నరకాగ్ని భయంతో మళ్ళీ అవిశ్వాసిగా మారటాన్ని ఇష్టపడరు. అంటే ఇస్లాం స్వీకరించాము లేకపోతే పుట్టుకతోనే ముస్లింగా ఉన్నాము, కొన్ని కారణాల వల్ల మళ్ళీ అవిశ్వాసిగా పోవటం అతని దృష్టిలో “నాకు భగభగ మండే అగ్నిలో వేసేస్తున్నారు. నేను భగభగ మండే ఆ అగ్నిలో నాకు వేసేస్తే అది నాకు ఇష్టమా? ఇష్టం ఉండదు. ఆ విధంగా విశ్వాసం నుంచి అవిశ్వాసం వైపునకి మరటం కూడా నాకు ఇష్టం ఉండదు”.

ఈ విధంగా ఈ మూడు గుణాలు ఉంటే అటువంటి వ్యక్తి విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందినట్లే. ఈ మూడు విషయాలు మనలో ఉన్నాయా లేవా అనేది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

అభిమాన సోదరులారా, ఈ విధంగా మొదటి విషయం సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవితంలోని ఈమాన్, దాని ప్రాముఖ్యత ఏమిటి, విశిష్టత ఏమిటి? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చివరికి భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, అమ్మ విషయంలో, నాన్న ఏ విధంగానైనా, అన్ని విధాల కుడి వైపు నుంచి, ఎడమ వైపు నుంచి, వెనుక నుంచి, ముందు నుంచి, కింద నుంచి, పైన నుంచి, అన్ని విధాల ఆర్థిక పరంగా, మానసికంగా, అన్ని విధాలా కూడా బాధలు వచ్చినా, హింసలు పెట్టినా, విశ్వాసంలో లోపం రానివ్వకూడదు. తౌహీద్ లో తేడా రానివ్వకూడదు. షిర్క్ కి పాల్పడకూడదు. ఇది సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవితంలోని మొదటి పాఠం. రెండో పాఠం ఏమిటి? సబర్, సహనం. మూడవది స్థిరత్వం, నిలకడ.

ఒక వ్యక్తి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగాడు: ఓ దైవ ప్రవక్తా, నాకు ఇస్లాం గురించి ఏమైనా బోధించండి అన్నాడు. అంటే ఇస్లాం గురించి బోధనలు చాలా ఉన్నాయి కదండీ. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగే వ్యక్తి యొక్క మానసిక స్థితిని గమనించి, దానికి తగిన విధంగా, సమయ సందర్భాన్ని బట్టి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానాలు ఇచ్చేవారు. ఒక వ్యక్తి వచ్చి అడిగారు, ఓ దైవ ప్రవక్తా నాకు ఇస్లాం గురించి ఏమైనా బోధించండి అంటే, అయితే దాని గురించి నేను మిమ్మల్ని తప్ప వేరొకరిని అడగవలసిన అవసరం రాకూడదు. ఇస్లాం గురించి ఒక విషయం చెప్పండి. మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకెవ్వరికీ అడిగే అవసరం రాకూడదు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన సమాధానం ఏమిటంటే: “ఆమంతు బిల్లాహి సుమ్మస్తఖిమ్.” అంటే నేను అల్లాహ్ ను నమ్ముకున్నాను, నేను విశ్వసించాను, నేను ముస్లింగా ఉన్నాను, నేను మోమిన్ గా ఉన్నాను అని చెప్పు, ఆ తర్వాత ఆ మాట పైనే నిలకడగా ఉండు. చెప్పటమే కాకుండా నిలకడగా ఉండు, స్థిరంగా ఉండు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, ఈ విధంగా సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవితాన్ని అల్లాహ్ మనందరికీ ఆదర్శంగా తీసుకొని, కష్టాలలో కూడా మొదటి విషయము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ప్రతి కష్టం నుండి, ప్రతి నష్టం నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి బాధ నుండి కాపాడుగాక. ఒకవేళ అల్లాహ్ ఇష్టం నిమిత్తం ఏదైనా సమస్య, బాధ వస్తే సుమయ్య రది యల్లాహు అన్హాని ఆదర్శంగా తీసుకొని మనము కూడా మన విశ్వాసాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి, సహనంతో ఉండాలి, స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. సుమయ్య రది యల్లాహు అన్హాని ఆదర్శంగా తీసుకొని జీవించే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రసాదించుగాక. ఆమీన్.

వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17185

ముస్లిం వనిత (మెయిన్ పేజీ):
https://teluguislam.net/muslim-woman/

సీరతే సహాబియ్యాత్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3cUt4NimP4PNSWLjHO3sXM

ప్రవక్త ﷺ గారి మేనత్త: సఫియ్య బిన్తె అబ్దుల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హా) [వీడియో]

బిస్మిల్లాహ్
ప్రవక్త ﷺ గారి మేనత్త: సఫియ్య బిన్తె అబ్దుల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హా) –
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

[13 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

సీరతే సహాబియ్యాత్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3cUt4NimP4PNSWLjHO3sXM

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జీవిత చరిత్ర – సలీం జామిఈ [ఆడియో, టెక్స్ట్]

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జీవిత చరిత్ర
https://youtu.be/6wNGPCoz60I [30 నిముషాలు]
సలీం జామిఈ హఫిజహుల్లాహ్

ఈ జుమా ప్రసంగంలో వక్త, ప్రముఖ సహచరుడు హజ్రత్ సల్మాన్ ఫార్సీ (రజియల్లాహు అన్హు) గారి జీవిత చరిత్ర మరియు సత్యం కోసం వారు చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని వివరించారు. అల్లాహ్ మానవులకు ప్రసాదించిన అత్యున్నత వరమైన ‘ఇస్లాం’ విలువను వివరిస్తూ, సల్మాన్ ఫార్సీ (రజియల్లాహు అన్హు) పర్షియాలో అగ్ని ఆరాధకుడిగా ఉండి, సత్యధర్మాన్ని అన్వేషిస్తూ క్రైస్తవ మత గురువుల వద్దకు చేరి, చివరికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి రాక గురించి తెలుసుకున్న తీరును కళ్లకు కట్టినట్లు చెప్పారు. బానిసత్వాన్ని అనుభవించి, మదీనాలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని కలుసుకొని, ప్రవక్తత సూచనలను (సదఖాను తినకపోవడం, బహుమానాన్ని స్వీకరించడం, ప్రవక్తతా ముద్ర) స్వయంగా పరీక్షించి ఇస్లాంను స్వీకరించిన వైనాన్ని, ఆ తర్వాత తన స్వేచ్ఛ కోసం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేసిన అద్భుత సహకారాన్ని ఈ ప్రసంగం వివరిస్తుంది.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వ లోకాల సృష్టికర్త పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి.

ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సహోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు గారి జీవిత చరిత్రను మనం తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! మానవునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రపంచంలో ఎన్నో అనుగ్రహాలను ప్రసాదించాడు. అల్లాహ్ మానవులకిచ్చిన అనుగ్రహాలను లెక్కచేయలేనన్నివి ఉన్నాయి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. నిజమే, అయితే అల్లాహ్ మానవులకు ప్రసాదించిన అనుగ్రహాలలో గొప్ప అనుగ్రహం ఏది అంటే, అది దైవ ధర్మ ఆచరణ.

అభిమాన సోదరులారా! ఒక్కసారి ఆలోచించి చూడండి, మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముస్లింలుగా, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే వారిగా పుట్టించాడు, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఇది ఎంత గొప్ప వరమో ఒక్కసారి ఆలోచించండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో తెలియజేశాడు:

إِنَّ الدِّينَ عِندَ اللَّهِ الْإِسْلَامُ
[ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం]
నిశ్చయంగా అల్లాహ్ వద్ద ధర్మం (ఒక్క) ఇస్లాం మాత్రమే. (3:19)

మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్పష్టంగా తెలియజేశాడు:

وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
[వమన్ యబ్ తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్ బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్]
ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు. (3:85)

కావున అభిమాన సోదరులారా! మనం ముస్లింలుగా, ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తూ ఏ చిన్న కార్యము చేస్తున్నా, ఏ పెద్ద కార్యము చేస్తున్నా దానికి రేపు ఇన్షా అల్లాహ్ విలువ ఉంటుంది. అయితే ఈ ఇస్లాం ధర్మాన్ని మనం ఎలా పొందాము? అల్లాహ్ దయవల్ల ఎలాంటి శ్రమ లేకుండా, ఎలాంటి కృషి లేకుండా, ఎలాంటి కష్టము లేకుండా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి పరీక్ష లేకుండా మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ అనుగ్రహాన్ని అలాగే బహుమానంగా ఉచితంగా ఇచ్చేశాడు.

అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మందికి ఈ ఇస్లాం ధర్మ స్వీకరణ భాగ్యం ఉచితంగా దొరకలేదు. వారు ఈ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి, ఈ ఇస్లాం ధర్మాన్ని ఆచరించడానికి ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, ఎన్నో పరీక్షల్నీ ఎదుర్కొన్నారు అభిమాన సోదరులారా. అలా అల్లాహ్ ను అర్థం చేసుకోవడానికి, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి కష్టపడిన, పరీక్షలు ఎదుర్కొన్న ఒక వ్యక్తి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు. రండి, ఈనాడు ఆ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు గారి యొక్క జీవిత చరిత్రను ఇన్షా అల్లాహ్ క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా! సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇరాన్ దేశానికి చెందిన అస్బహాన్ నగరంలో పుట్టారు. వారి తండ్రి ఆ నగరానికి ఒక గురువు, మత గురువు, పెద్ద. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు పుట్టినప్పటి నుండి తండ్రి వద్దనే మత విషయాలు నేర్చుకున్నారు. ఆ రోజుల్లో ‘మజూసీ’ ధర్మాన్ని అక్కడ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆచరించారు. మజూసీ ధర్మంలో ప్రజలు అగ్నిని పూజించేవారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి తండ్రి కూడా అగ్నిని పూజించేవాడు, తన కుమారుణ్ణి కూడా అగ్నిని పూజించేటట్టుగా నేర్పించాడు.

చివరికి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి తండ్రి అగ్ని పూజ కొరకు ఎంతగా పరిమితం చేసేసాడంటే, ఎలాగైతే ఒక మహిళను ఇంట్లోనే ఉంచేస్తారో ఆ విధంగా సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని కూడా వారి తండ్రి అగ్ని వద్దనే ఒక కుటుంబ.. ఒక ఇంటిలోనే ఉంచేశాడు. బయటి ప్రపంచం గురించి ఆయనకు ఎక్కువగా తెలియదు.

అయితే అభిమాన సోదరులారా, ఒకరోజు ఏదో ఒక ముఖ్య.. ఒక ముఖ్యమైన పని మీద తండ్రి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని బయటకు పంపించారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు బయట ప్రపంచం గురించి ఎక్కువగా తెలియని వారు, ఆ పని మీద బయటకు వెళ్ళారు. వీధుల్లో నుంచి వెళుతూ ఉంటే ఒకచోట చర్చి ఉండింది, ఆ చర్చి లోపల నుంచి శబ్దాలు వస్తుండటాన్ని ఆయన గమనించారు. ఆ శబ్దాన్ని గమనించిన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఏముందో చూద్దామని లోపలికి ప్రవేశించారు. వెళ్లి చూస్తే అక్కడ ప్రజలందరూ కలిసి పూజ చేస్తున్నారు. ఆయనకు చాలా నచ్చింది. నచ్చిన కారణంగా ఆయన అక్కడే చూస్తూ కూర్చుండిపోయాడు. సమయం గడిచిపోయింది. చీకటి అయిపోయింది కానీ ఆయన వచ్చిన పనిని మర్చిపోయాడు.

తర్వాత తండ్రి, సల్మాన్ ఫార్సీ వెళ్లి ఇంతవరకు రాలేదే అని వెతకటానికి వేరే మనుషుల్ని పంపించాడు. రాత్రి అయిన తర్వాత, చీకటి పడిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు తిరిగి నాన్న దగ్గరికి వెళ్ళారు. అప్పుడు నాన్నగారు సల్మాన్.. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి మీద కోపగించుకున్నారు. “నేను నీకు పంపించిన పని ఏమిటి? నువ్వు ఇంతవరకు ఎక్కడున్నావు? త్వరగా ఎందుకు రాలేదు? నువ్వు రాని కారణంగా ఇక్కడ అగ్ని ఆరిపోయింది. ఇక్కడ అగ్ని ఆరిపోకూడదు, ఆరిపోకుండా చూసుకోవలసిన బాధ్యత నీది” అని కోపగించుకున్నప్పుడు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు నాన్నగారితో అన్నారు: “నాన్నగారు, ఈరోజు నేను ఒక వింత విషయాన్ని చూశాను, అది నాకు చాలా నచ్చింది. ఒకచోట నేను కొంతమందిని చూశాను, వారు దేవుణ్ణి మరో రకంగా పూజిస్తున్నారు, వారి పూజా పద్ధతి నాకు చాలా నచ్చిందండి” అన్నారు.

అప్పుడు నాన్నగారికి చాలా కోపం వచ్చింది. “అరే! నీవు, నీ తండ్రులు, నీ తాతలు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నారో ఆ ధర్మము నువ్వు చూసిన వారి ధర్మము కంటే గొప్పది రా, దీన్నే నువ్వు ఆచరించాలి” అన్నారు.

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అన్నారు: “లేదండి నాన్నగారు, మనం చేసేది నాకు నచ్చట్లేదు. మన చేతులతో మనము కాల్చిన అగ్నిని మళ్ళీ మనం పూజించడం ఏందండి? కొద్దిసేపు మనము అక్కడ కట్టెలు వేయకపోతే ఆ అగ్ని చల్లారిపోతుంది. దాన్ని మనము దేవుడని పూజించడం ఇది నాకు నచ్చలేదండి. చర్చిలో వాళ్ళు చేస్తున్న విషయం నాకు చాలా నచ్చిందండి, అదే నాకు మంచిదనిపిస్తోందండి” అన్నారు.

నాన్నగారికి విషయం అర్థమైపోయింది. బిడ్డ చేయి జారిపోతున్నాడని గమనించిన నాన్నగారు వెంటనే సంకెళ్లు వేసేసి ఆయనకు ఇంటిలోనే బంధించేశారు. బంధించేసిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఒక వ్యక్తి ద్వారా ఆ క్రైస్తవుల వద్దకు సందేశాన్ని పంపించారు. “ఏమండీ! మీరు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నారో, ఈ ధర్మం ఎక్కడ పుట్టింది? ఈ ధర్మం యొక్క పునాదులు ఎక్కడున్నాయి? ఆ ప్రదేశం గురించి నాకు తెలియజేయండి” అన్నారు. ఆ వ్యక్తి అక్కడినుండి సమాధానం తీసుకొచ్చాడు, “ఈ ధర్మము ‘షామ’లో (అంటే షామ్ అంటే: ఫలస్తీన్, లబ్నాన్, జోర్డాన్ [ఉర్దున్] మరియు సిరియా.. ఈ పూర్తి భాగాన్ని ఆ రోజుల్లో ‘షామ్’ అనేవారు, తర్వాత దాన్ని నాలుగు ముక్కలుగా విభజించేశారు), ఆ షామ్.. ఆ షామ్ దేశంలో ఆ ధర్మం పుట్టింది, దాని యొక్క పునాదులు అక్కడే ఉన్నాయి” అని సమాధానం వచ్చింది. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారన్నారు: “ఎవరైనా ఆ దేశస్తులు మన దేశానికి వస్తే నాకు కబురు పంపించండి” అన్నారు.

అలాగే కొద్ది రోజుల తర్వాత కొంతమంది ఈ షామ్ దేశము నుండి ఈ ఇరాన్ దేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చారు. అప్పుడు కొంతమంది వెళ్లి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి, “మీరు కోరుకున్నట్లుగానే షామ్ దేశస్తులు కొంతమంది వ్యాపారం నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉన్నారు, మీరు వారితో కలవాలంటే కలవచ్చు” అన్నారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు ఏమన్నారంటే: “నేను ఇప్పుడు రాలేను, కలవలేను. వాళ్ళు మళ్లీ తిరిగి ప్రయాణం చేసేటప్పుడు నాకు కబురు పంపించండి” అన్నారు.

అలాగే వాళ్ళు తిరిగి మళ్ళీ వారి దేశానికి వెళుతున్నప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి కబురు పంపించగా, ఆయన ఏదో ఒకలాగా సంకెళ్లను తుంచుకుని వారితో పాటు కలిసి ఆ ఇరాన్ దేశము నుండి షామ్ దేశానికి ఆ వ్యాపారానికి వచ్చిన వ్యక్తులతో పాటు కలిసి వెళ్లిపోయారు. షామ్ వెళ్లిన తర్వాత అక్కడ ప్రజలతో చర్చించారు, “ఇక్కడ గొప్ప భక్తుడు అంటే ఎవరు? ఉత్తమమైన వ్యక్తి అంటే ఎవరు? వాని గురించి నాకు చెప్పండి, నేను ఆయన దగ్గరికి వెళ్లి శిష్యరికం చేరుకోవాలనుకుంటున్నాను” అన్నారు. అక్కడ ఒక పెద్ద చర్చి ఉంటే, ఆ చర్చిలో ఉన్న ఒక ఫాదర్ గురించి ఆయనకు తెలియజేయగా, ఆయన వెంటనే ఆ ఫాదర్ దగ్గరికి వెళ్లి: “అయ్యా, నేను ఫలానా దేశస్తుణ్ణి, నాకు అక్కడ ఉన్న విషయాలు నచ్చక మీ ధర్మాన్ని నేను ఇష్టపడి వచ్చాను కాబట్టి, నేను మీ దగ్గర శిష్యునిగా చేరాలనుకుంటున్నాను, అనుమతి ఉందా?” అని అడగ్గా, అతను “సరే బాబు నా దగ్గర నీవు శిష్యునిగా ఉండు” అని ఉంచుకున్నాడు.

ఆయన దగ్గర ఉండి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆయన నేర్పిన విధంగానే ధార్మిక విషయాలు నేర్చుకుని ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఆ పాదరి.. ఆ ఫాదర్ వద్ద ఒక చెడు అలవాటు ఉండేది, అది ఆయనకు నచ్చలేదు. ఆ అలవాటు ఏంటంటే, ఆయన ప్రజలకు దానధర్మాలు చేయండి అని చెప్పి బోధించేవాడు. ఆయన మాటలు విని ప్రజలు దానధర్మాలు తీసుకొని వచ్చి ఆయన చేతికి ఇస్తే, ఆ దానధర్మాల సొమ్ముని తీసుకొని వెళ్లి పేదలకు పంచకుండా అతను ప్రోగు చేసుకుని దాచుకునేవాడు. అది సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి నచ్చలేదు.

కొద్ది రోజుల తర్వాత అతని మరణం సంభవించింది. మరణం సంభవించక ముందు అతను దాచుకున్న సొమ్ము గురించి ఎవ్వరికీ చెప్పలేదు. ఒక్క సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి మాత్రమే తెలుసు. అతను మరణించిన తర్వాత ప్రజలందరూ ప్రోగయితే, అప్పుడు సల్మాన్ రజియల్లాహు అన్హు వారందరి ముందర కుండబద్దలు కొట్టేశారు. అదేమన్నారంటే: “అయ్యా, ఎవరినైతే మీరు గొప్ప వ్యక్తి అనుకుంటున్నారో, అతని యొక్క లక్షణం ఏమిటంటే మీరు ఇచ్చే సొమ్ముని ఆయన దాచుకున్నాడు. రండి చూపిస్తాను” అని చెప్పేసి ఆయన దాచుకున్న సొమ్ము మొత్తాన్ని చూపించేశారు. అప్పుడు ప్రజలకు పట్టరాని కోపం వచ్చింది. “ఎవరినైతే మేము గొప్ప వ్యక్తి అనుకున్నామో అతను ఇలాంటి మూర్ఖుడా” అని చెప్పి చాలా కోపగించుకున్నారు.

సరే, ఆ తర్వాత అతని స్థానంలో మరొక ఫాదర్ ని తీసుకొని వచ్చి అక్కడ ఉంచారు. ఆ ఫాదర్ చాలా గొప్ప వ్యక్తి, చాలా భక్తుడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అతని వద్ద శిష్యునిగా ఉండి దైవభక్తి, అలాగే దైవ ఆరాధనలో నిమగ్నమైపోయారు. రోజులు గడిచాయి. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ ఫాదర్ వద్ద చాలా విషయాలు నేర్చుకున్నారు, ఆ ఫాదర్ ని చాలా ఇష్టపడ్డారు. అతనిలో ఎలాంటి తప్పులు ఆయన గమనించలేదు.

చివరికి కొద్ది రోజుల తర్వాత ఆయన మరణం సంభవించినప్పుడు, మరణానికి ముందు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అతని వద్ద వెళ్లి: “ఏమండీ, నేను ఫలానా దేశస్తుడిని, అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మీరు మరణిస్తున్నారు, మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్లి ఈ విషయాలు నేర్చుకోవాలి? దైవ ధర్మ ఆచరణ చేయాలి? మీరు చెప్పిన వ్యక్తి వద్ద నేను వెళతాను, ఎవరి దగ్గర వెళ్లాలో చెప్పండి” అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే: “చూడు నాయనా! నీవు ఒక మంచి వ్యక్తివి అనిపిస్తున్నావు కాబట్టి, నాలాంటి వ్యక్తి నీకు ఈ నగరంలో దొరకడు. నీవు ‘మోసుల్’ అనే నగరానికి వెళ్ళిపో, అక్కడ ఫలానా పేరు చెప్పు, ఆ వ్యక్తి వద్ద వెళ్లి నీవు శిష్యరికం చేయి, అతను కూడా మంచి వ్యక్తి” అన్నారు.

చూడండి, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు మళ్లీ అక్కడి నుండి మోసుల్ నగరానికి వెళ్ళారు. ఆ వ్యక్తి గురించి తెలుసుకున్నారు, ఆయన దగ్గర వెళ్లి జరిగిన విషయాలన్నీ చెప్పి: “అయ్యా, నాకు ఫలానా వ్యక్తి మీ వద్దకు పంపించాడు. నేను మీ వద్ద వచ్చి దైవ విషయాలు, దైవ భక్తి విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను, అనుమతి ఉందా?” అంటే ఆయన సంతోషంగా పిలుచుకున్నాడు. అతని వద్ద శిష్యరికం చేశారు. అతను కూడా చాలా గొప్ప భక్తుడు. అతని వద్ద కూడా సల్మాన్ రజియల్లాహు అన్హు కొద్ది రోజులు శిష్యరికం చేసిన తర్వాత, చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎలాంటి పరీక్షలకు గురి చేస్తున్నాడో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి, కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తికి కూడా మరణం సంభవించింది. మరణానికి ముందు ఆ వ్యక్తితో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జరిగిన విషయం అంతా చెప్పారు. “అయ్యా నేను ఇరాన్ దేశస్తుడిని, అక్కడి నుంచి మళ్ళీ షామ్ వచ్చాను, షామ్ నుంచి ఫలానా వ్యక్తి నాకు మీ దగ్గరికి పంపించాడు. ఇప్పుడు మీరు కూడా మరణిస్తున్నారు, నేను దైవ విషయాలు భక్తి విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్లి ఈ విషయాలు నేర్చుకోవాలి?” అని అడగ్గా, ఆయన ఏం చెప్పారంటే: “‘నసీబైన్’ అనే ఒక నగరం ఉంది, ఆ నగరంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లండి, అతనికంటే గొప్ప వ్యక్తి నా దృష్టిలో ఎవడూ లేడు” అన్నారు.

మళ్ళీ నసీబైన్ లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, ఆయన దగ్గర శిష్యరికం చేశారు. ఆయన కూడా చనిపోతూ ఉంటే ఆయన దగ్గర కూడా: “అయ్యా, మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్ళాలి?” అంటే, అప్పుడు ఆయన చెప్పాడు: “‘అమ్మూరియా’ అనే ఒక ప్రదేశం ఉంది అక్కడికి వెళ్లండి” అన్నారు. సరే అమ్మూరియా ప్రదేశానికి వెళ్ళారు, అక్కడ శిష్యరికం చేశారు. ఆయన కూడా చనిపోయే సమయం వచ్చింది. అల్లాహు అక్బర్! ఎన్ని చోట్ల చూడండి.. ఇరాన్ నుండి సిరియాకు, సిరియా నుండి మళ్ళీ మోసుల్ కు, మోసుల్ నుండి నసీబైన్ కు, నసీబైన్ నుండి మళ్ళీ అమ్మూరియాకు. ఇన్ని చోట్ల తిరుగుతున్నారు ఎవరి కోసమండి? డబ్బు కోసమా? ధనం కోసమా? ఆస్తి కోసమా? కేవలం భక్తి కోసం ఇన్ని చోట్ల తిరుగుతున్నారు అభిమాన సోదరులారా.

అమ్మూరియాలో వెళ్ళిన తర్వాత, అప్పుడు అక్కడున్న ఫాదర్ మరణించేటప్పుడు: “అయ్యా, నేను తిరుగుతూనే ఉన్నాను, మీ తర్వాత ఇక నేను ఎక్కడికి వెళ్లాలో చెప్పండి” అని చెప్పగా, అప్పుడు ఆయన ఒక్క మాట చెప్పాడు. గమనించండి అభిమాన సోదరులారా, ఇక్కడి నుంచి టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది విషయం. ఆయన ఏం చెప్పాడంటే: “నాయనా, నేడు ప్రపంచంలో పరిస్థితుల్ని చూస్తూ ఉంటే చివరి ప్రవక్త వచ్చే సమయం వచ్చేసింది అనిపిస్తుంది. చివరి ప్రవక్త గురించి నాకు తెలిసిన జ్ఞానం ఏమిటంటే, అతను అరబ్బు దేశస్తుడై ఉంటాడు.” ఎవరు చెప్తున్నారండి? ఒక చర్చికి గురువైన ఫాదర్ గారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? వారి శిష్యునికే చెప్తున్నారు. ఏమంటున్నారంటే: “చివరి ప్రవక్త వచ్చే సమయం వచ్చేసింది అని నాకు అనిపిస్తుంది, అతను అరబ్బు దేశస్తుడై ఉంటాడు” – మొదటి విషయం.

రెండవ విషయం ఏమిటంటే: “అతను పుట్టిన నగరము నుండి ప్రయాణము చేసి, రెండు పర్వతాల మధ్య ఒక నగరం ఉంటుంది, ఆ నగరంలో ఖర్జూర చెట్లు ఉంటాయి, ఆ నగరానికి వలస ప్రయాణం చేస్తాడు.” రెండు విషయాలు. మూడో విషయం ఏమిటంటే: “అతను ‘సదఖ’ (దానధర్మాలు) తినడు.” నాలుగో విషయం ఏమిటంటే: “‘హదియా’ – బహుమానంగా ఇచ్చిన విషయాలను తీసుకుంటాడు, తింటాడు.” ఐదవ విషయం ఏమిటంటే: “అతని రెండు భుజాల మధ్య అల్లాహ్ తరపు నుంచి ఒక స్టాంప్ ఉంటుంది, దాన్నే ‘మొహ్రె నబువత్’ (ప్రవక్త పదవికి సూచనగా) ఒక స్టాంప్ లాంటిది ఉంటుంది” అన్నారు. ఈ ఐదు సూచనలు చెప్పాడు ఆయన.

అయితే అభిమాన సోదరులారా! సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అమ్మూరియాలో ఉన్నప్పుడు కొంచెం కష్టపడి కొన్ని ఆవులను కూడా సంపాదించుకొని పెంచుకున్నారు. ఇక వెయిట్ చేస్తున్నారు. అరబ్బు దేశం నుంచి ఎవరైనా వ్యాపారం కోసం ఇక్కడికి వస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు, ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత కొంతమంది అరబ్బు దేశస్తులు ఆ ప్రదేశానికి వ్యాపారానికి వెళ్లారు. అప్పుడు ఆయన వెంటనే వారి దగ్గరికి వెళ్లి: “ఏమండీ నేను కూడా మీతో పాటు అరబ్బు దేశానికి వచ్చేస్తాను. కావాలంటే నా దగ్గర ఉన్న ఈ ఆవులన్నీ మీకు ఇచ్చేస్తాను. దయచేసి నన్ను మీరు మీతో పాటు అరబ్బు దేశానికి తీసుకెళ్లండి” అని విన్నవించుకున్నారు.

అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి విన్నపాన్ని తీసుకున్న వాళ్ళు, ఆవులని తీసుకొని, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని కూడా తీసుకొని అక్కడి నుంచి తిరిగి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వచ్చిన వాళ్ళు మోసం చేశారు. ఆవులని లాక్కున్నారు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని మదీనాకి సమీపంలో ‘వాది అల్ ఖురా’ (ఇప్పుడు అది మదీనాలో కలిసిపోయింది, ఆ రోజుల్లో వాది అల్ ఖురా) అనే చోట తీసుకొని వచ్చి ఒక యూదుని చేతికి బానిసగా అమ్మేశారు. “అయ్యో నేను బానిసను కాదు” అని ఆయన మొత్తుకున్నా బలవంతంగా ఆయనను అమ్మేశారు.

అయితే ఆ యూదుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని తన వద్ద బానిసగా, ఖర్జూరపు తోటకు కాపలాదారిగా ఉంచుకున్నాడు. ఆయన అక్కడ ఉంటూనే రెండు పర్వతాల మధ్య కనిపిస్తున్న ఖర్జూర చెట్ల మధ్య కనిపిస్తున్న నగరాన్ని చూసుకున్నాడు. “అరే! నా గురువుగారు చెప్పిన నగరం లాగే ఈ నగరం కనిపిస్తా ఉంది” అని ఆయన మనసులో ఒక తపన, కోరిక కలిగింది. ఇక ప్రవక్త కోసం ఆయన తపిస్తున్నారు. ఆయన చెప్పినట్టుగా ప్రవక్త ఈ ప్రదేశానికే వస్తాడు అనే ఆలోచనలో ఆయన తపిస్తూ ఉన్నాడు.

మరి కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ యూదుడు ఏం చేశాడంటే, మదీనా నగరంలో ఉండే ఒక బంధువుకి అతనిని అమ్మేశాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇక మదీనా నగరంలోనే ‘బనూ ఖురైజా’ అనే చోటికి వచ్చేశారు. అక్కడికి వచ్చేసిన తర్వాత ఆయనకు నమ్మకం కుదిరింది, ఆయన చెప్పినట్లుగానే ఇక్కడ ఖర్జూర చెట్లు ఉన్నాయి, రెండు పర్వతాల మధ్య ఈ నగరం ఉంది. ఇక ప్రవక్త రావడమే తరువాయి. “ప్రవక్త గారు ఎప్పుడు వస్తారు? ప్రవక్త గారు ఎప్పుడు వస్తారు? నా కోరిక ఎప్పుడు తీరుతుంది?” అని చెప్పి ఆయన ఎదురుచూస్తున్నారు, తపిస్తూ ఉన్నారు అభిమాన సోదరులారా.

రోజులు గడిచాయి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలో ప్రవక్త పదవి ఇచ్చిన తర్వాత, 13 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఆయనను చంపాలని ప్రయత్నం చేశారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారికి మక్కా నుండి మదీనాకు వెళ్లిపోమని ఆదేశించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వెళుతూ వెళుతూ ముందు ఎక్కడ దిగారండి? ‘ఖుబా’లో దిగారు.

ఖుబాలో దిగినప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఖర్జూరపు చెట్టు మీద నిలబడి ఉంటే, ఆయన యజమాని వద్ద ఒక బంధువు వచ్చి: “ఏమండీ! మీకు తెలుసా? కొంతమంది ఖుబాకు వెళుతున్నారు. అక్కడ ఎవడో మక్కా నుంచి ఒకడు వచ్చాడంట. ఆయన గురించి అందరూ ‘ప్రవక్త ప్రవక్త’ అని చెప్పుకుంటున్నారు” అని చెప్పేశాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి చెవులు ఆ మాట పడగానే కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. ఎంతగా ఆయన సంతోషించాడంటే, ఇక కళ్ళు తిరిగి పడిపోతారేమో అని అనిపించింది. ఆ తర్వాత “ఏమైంది? ఎవరు? ఎవరు?” అని చెప్పేసి దగ్గరికి వచ్చి అడగ్గానే, యజమాని కోపంతో, “బానిస నువ్వయ్యి మా మధ్యలో వస్తావా? మా మాటల్లో మాట కలుపుతావా?” అని చెప్పేసి గట్టిగా గుద్దాడు. “వెళ్లి పని చూసుకో” అన్నాడు.

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు సాయంత్రం వరకు వేచి చూసి, ఆయన దగ్గర ఉన్న కొద్ది మొత్తం తినే పదార్థాన్ని తీసుకొని, ఖుబాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్న చోటికి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆయన ఎలా పరీక్షిస్తున్నారో చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చేసి, ఆ తినే పదార్థాన్ని ఆయన చేతికి ఇస్తూ ఏమంటున్నారంటే: “అయ్యా, మీరు గొప్ప భక్తుల్లాగా అనిపిస్తున్నారు. మీతో పాటు ఉన్న మీ శిష్యులు కూడా చాలా ఆకలితో ఉన్నట్టు అనిపిస్తోంది. కాబట్టి ఇది నా తరపు నుంచి ‘సదఖ’ – తీసుకోండి” అన్నారు.

‘సదఖ తీసుకోండి’ అని చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని శిష్యులకు ఇచ్చేశారు. శిష్యులు తిన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తినలేదు. అది గమనించిన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు కన్ఫర్మ్ చేసుకున్నారు, “ఆ! ఈయన సదఖ తినట్లేదు.” ఒక విషయం కన్ఫర్మ్ అయిపోయింది.

మళ్ళీ ఇంటికి వెళ్లారు. కొద్ది రోజుల తర్వాత ఆయన దగ్గర ఉన్న మరీ కొన్ని పదార్థాలను తీసుకొని.. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉంటే మళ్ళీ మదీనాకు వెళ్లారు. మదీనాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులతో పాటు కూర్చొని ఉంటే, “అయ్యా, ఇది నా తరపు నుండి ‘హదియా’ – బహుమానం” అని చెప్పారు. చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని, తానూ తిన్నారు, శిష్యులకు తినిపించారు. రెండో విషయం కన్ఫర్మ్ అయిపోయింది. సదఖ తినట్లేదు, హదియా తింటున్నారు.

ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జనాజా వెంబడి వెళుతూ ఉంటే, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆయన వెంటవెంట వెళ్లి అటు ఇటు అటు ఇటు ఎదురుచూస్తున్నారు. “ఎప్పుడెప్పుడు ఆయన బట్ట జారుతుంది, ఆ రెండు భుజాల మధ్య ఉన్న ఆ గుర్తుని నేను చూడాలి” అని వెనక వెనకే వెనక వెనకే ఆయన కదులుతూ ఉంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గమనించేశారు. ఇతను వెనుక నుంచి ఏదో కోరుకుంటున్నాడు అని అర్థం చేసుకున్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వెంటనే బట్టను అక్కడి నుంచి పక్కకు జరపగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వీపు మీద ఉన్న ఆ ముద్రను చూసి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ముద్దు పెట్టుకొని: “ఓ దైవ ప్రవక్త! నేను మీకోసం ఇంతగా తపించాను, ఫలానా దేశం నుండి ప్రయాణం చేశాను, ఫలానా ఫలానా ఫలానా చోటికి నేను తిరిగాను, మీకోసం ఎదురు చూశాను, చివరికి బానిసగా మారిపోయాను, ఇక్కడ నన్ను బానిసగా చేసేసారు, మీకోసం నేను ఎదురుచూస్తున్నాను ఓ దైవ ప్రవక్త” అని చెప్పేసి ఏడ్చారు.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం: “ఓ సల్మాన్! వెనుక నుండి ముందుకు రా” అని చెప్పి, ముందర కూర్చోబెట్టి జరిగిన పూర్తి కథను విన్నారు.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సల్మాన్ తో అన్నారు: “ఓ సల్మాన్! నీవు ఒక మంచి సమయాన్ని చూసుకొని, నీ యజమానితో ‘నేను పరిహారం చెల్లించేస్తాను నన్ను స్వతంత్రుడ్ని చేసేయ్’ అని అడుగు. అతను ఏం కోరతాడో అది ఇచ్చేద్దాం” అన్నారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వెళ్లారు. సమయం కోసం ఎదురుచూశారు. సమయం కోసం ఎదురుచూసిన తర్వాత ఒకరోజు యజమానితో చెప్పారు: “అయ్యా, మీకు ఏం కావాలో చెప్పండి నేను చెల్లించేస్తాను, నాకు మాత్రం విముక్తుడిని చేసేయండి ఈ బానిస నుండి” అన్నాడు.

అప్పుడు ఆయన ఏమన్నాడంటే: “నాకు మూడు వందలు లేదా ఐదు వందల ఖర్జూరపు చెట్లు నాటి ఇవ్వు. ఆ తర్వాత 400 ల బంగారు నాణాలు ఇవ్వు” అని షరతు పెట్టాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చి: “ఓ దైవ ప్రవక్త! నా యజమాని ఈ విధంగా షరతు పెట్టాడండి” అని చెప్పారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలతో అన్నారు: “ఏమండీ! మీ సోదరుడిని ఆదుకోండి” అన్నారు. అప్పుడు సహాబాలందరూ కలిసి, ఒక్కొక్కరు 10 చెట్లు, 20 చెట్లు, 30 చెట్లు, 40 చెట్లు.. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎవరికి ఎంత శక్తి ఇచ్చాడో అన్ని ఖర్జూరపు చెట్లు తీసుకొని వెళ్లి అక్కడ 500 ల ఖర్జూరపు చెట్లు నాటేశారు.

నాటే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట చెప్పారు, అదేమిటంటే: “గుంతలు తవ్వండి. నాటే ముందు నన్ను పిలవండి, నేను వచ్చి ప్రారంభిస్తాను” అన్నారు. గుంతలు తవ్వారు. ఖర్జూరపు చెట్లు సిద్ధంగా ఉంచారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పిలవగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్లి అక్కడ ‘బిస్మిల్లాహ్’ అని చెప్పి ఖర్జూరపు చెట్లు నాటడం ప్రారంభించిన తర్వాత, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు చెప్పారు: “అక్కడ నాటిన 500 ల చెట్లలో ఏ ఒక్క చెట్టు కూడా మరణించలేదు, అన్నీ బ్రతుక్కున్నాయి.” అన్నీ బ్రతికిన తర్వాత, యజమానితో: “ఏమండీ మీరు చెప్పినట్లుగానే 500 ల ఖర్జూరపు చెట్లు నాటేశాము, ఇక బంగారు నాణాలు మాత్రమే ఇవ్వవలసి ఉంది.”

కొద్ది రోజుల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి కొంచం బంగారం వచ్చింది. ఆ బంగారాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి చేతికి ఇచ్చి: “ఓ సల్మాన్! ఇది తీసుకొని వెళ్లి నిను యజమానికి ఇచ్చేయ్” అన్నారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ బంగారాన్ని తీసుకొని వెళ్లి యజమానికి ఇవ్వగా, అతను తూచాడు. తూచితే 400 ల బంగారు నాణాలకు సమానంగా అది ఉండింది. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి అతను బానిసత్వం నుండి విముక్తిని ఇస్తూ స్వతంత్రుడ్ని చేసేసాడు.

అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చిన తర్వాత బదర్ సంగ్రామం జరిగింది, అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు అందులో పాల్గొనలేదు, ఎందుకంటే ఆయన బానిసగా ఉన్నారు. ఆ తర్వాత ఉహద్ సంగ్రామం జరిగింది, ఆ సంగ్రామంలో కూడా సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు పాల్గొనలేదు. కారణం ఏమిటంటే ఆయన బానిసగా అక్కడ ఉండిపోయారు.

ఆ తర్వాత ఐదవ సంవత్సరంలో ఎప్పుడైతే మక్కా వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరియు ముస్లింలను ఇస్లాం ధర్మాన్ని అణచివేయాలని వచ్చారో, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కంగారు పడ్డారు. ఎందుకంటే పేద పరిస్థితి, ఆపైన కరువు. ఈ రెండు విషయాల వల్ల మళ్లీ శత్రువును ఎదుర్కోవాలంటే చాలా భయంకరమైన పరిస్థితి ఉండింది కాబట్టి, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలను కూర్చోబెట్టి: “ఏమి చేయాలి? ఎలా శత్రువుని ఎదుర్కోవాలి?” అని ప్రశ్నించినప్పుడు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలహా ఇచ్చారు. అదేమిటంటే: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మనం మదీనాకు నలువైపుల నుండి కందకాన్ని తవ్వేద్దాం. మా దేశంలో, ఇరాన్ లో ఇలాగే చేస్తాం” అన్నారు.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయన ఇచ్చిన సలహా నచ్చింది. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, సహాబాలకు ఆదేశించారు, అక్కడ కందకం తవ్వేశారు. అయితే అభిమాన సోదరులారా, సమయం ఎక్కువైపోయింది. చివరిగా రెండు మాటలు చెప్పి ముగిస్తున్నాను. అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి చేరుకున్న తర్వాత, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద శిష్యునిగా ఉండి, ఎంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇష్టపడ్డారు, అభిమాన పడ్డారు. దైవ ధర్మాన్ని బాగా నేర్చుకున్నారు. అల్లాహ్ ఆరాధన నేర్చుకుని, అల్లాహ్ మార్గంలో ఆయన ప్రతిచోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహకరించారు.

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఆయన అన్నారు: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీరు కందకంలో ఒకచోట గొడ్డలితో కొడుతూ ఉంటే అక్కడ తెల్లటి మెరుపు నేను చూశాను, అదేంటి?” అని అడిగారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: “దాన్ని నువ్వు చూశావా?” అంటే సల్మాన్ ఫార్సీ, “అవునండి నేను చూశాను” అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: “ఆ మెరుపులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాకు ఇరాన్ మరియు ఇరాన్ లో ఉన్న నగరాలన్నింటిని చూపించాడు. ఆ నగరాలన్నింటి చోట నా ధర్మము చేరిపోతుంది” అన్నారు. అల్లాహు అక్బర్!

అది విన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఆ మాట విన్న తర్వాత సల్మాన్ ఫార్సీ అన్నారు: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! అక్కడ దైవ ధర్మం చేరే సమయానికి నేను కూడా అందులో పాల్గొనాలనే దువా చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కోసం దువా చేశారు. అలాగే సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు బ్రతికి ఉండగానే ఆయన దేశానికి ఇస్లాం ధర్మం చేరిపోయింది.

ఆ తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు దైవాన్ని ఆరాధిస్తూ, దైవ ధర్మ సేవ కొరకు పోరాడుతూ ఆయన ఈ ప్రపంచం నుంచి తనువు చాలించారు. అల్లాహ్ తో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ ఇస్లాం ధర్మం మీద నిలకడగా నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఇస్లాం ఆచరించే మార్గంలో ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా, సులభంగా ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. పరీక్షల్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని నెగ్గించుగాక.

అకూలు కౌలి హాజా, అస్తగ్ఫిరుల్లాహ లి వలకుమ్ వ లిసాయరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.


సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

విశ్వాసుల మాతృమూర్తులు: జువైరియా & ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హుమా) జీవిత చరిత్ర [వీడియో]

బిస్మిల్లాహ్

[44 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్

ఇతరములు: 

విశ్వాసుల మాతృమూర్తులు – యూట్యూబ్ ప్లే లిస్ట్ (Youtube Play List)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3xXwwAsskOZEOa303Y2l-f

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad/

విశ్వాసుల మాతృమూర్తులు: సౌదా బిన్త్ జమ్ ‘అ & హఫ్సా బిన్త్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) జీవిత చరిత్ర [వీడియో]

బిస్మిల్లాహ్

[54 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్

ఇతరములు: 

విశ్వాసుల మాతృమూర్తులు – యూట్యూబ్ ప్లే లిస్ట్ (Youtube Play List)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3xXwwAsskOZEOa303Y2l-f

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad/

హజ్రత్ జైనబ్ బిన్తు ఖుజైమా & హజ్రత్ ఉమ్మె సలమా రజియల్లాహు అన్హుమాల జీవిత చరిత్ర [వీడియో]

బిస్మిల్లాహ్

[40 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్

ఇతరములు: 

విశ్వాసుల మాతృమూర్తులు – యూట్యూబ్ ప్లే లిస్ట్ (Youtube Play List)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3xXwwAsskOZEOa303Y2l-f

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad/

ఆయేషా బిన్త్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హా) గారి జీవిత చరిత్ర (సీరత్) [వీడియోలు]

బిస్మిల్లాహ్
ఆయేషా బిన్త్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హా) గారి జీవిత చరిత్ర (సీరత్) – 5 వీడియోలు – వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్

5 ఆడియో భాగాలు :

ఈ ప్రసంగంలో, వక్త అల్లాహ్‌ను స్తుతించిన తర్వాత ఇస్లాంలో స్త్రీ యొక్క ఉన్నత స్థానాన్ని వివరిస్తారు, సుగుణవతి అయిన స్త్రీ ఈ ప్రపంచంలోని ఉత్తమ సామాగ్రి అని తెలిపే ఒక హదీస్‌ను ఉదహరిస్తారు. ఆ తర్వాత, వక్త విశ్వాసుల తల్లి ఆయిషా సిద్దీఖా (రదియల్లాహు అన్హా) జీవిత చరిత్రను వివరిస్తారు. ఆమె వంశం, ఆమెకు సంతానం లేకపోయినప్పటికీ “ఉమ్మె అబ్దుల్లా” అనే కున్నియత్ (బిరుదు పేరు) ఎలా వచ్చిందో వివరిస్తారు. ఇంకా, ఆమె యొక్క అనేక బిరుదులైన ఉమ్ముల్ మూమినీన్ (విశ్వాసుల తల్లి), హబీబా (ప్రియమైనది), హుమైరా మరియు మువఫ్ఫకా వంటి వాటి వెనుక ఉన్న కారణాలను మరియు ప్రాముఖ్యతను హదీసులు మరియు ఖురాన్ ఆధారంగా వివరిస్తారు.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
[అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు.

وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ
[వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్]
మరియు అంతిమ విజయం దైవభీతిపరులకే.

وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ
[వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్]
మరియు శాంతి మరియు శుభాలు ప్రవక్తల నాయకునిపై మరియు దైవసందేశహరులపై వర్షించుగాక.

وَمَنْ تَبِعَهُمْ بِإِحْسَانٍ إِلَى يَوْمِ الدِّينِ
[వమన్ తబిఅహుం బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్]
మరియు ప్రళయదినం వరకు ఉత్తమ రీతిలో వారిని అనుసరించిన వారిపై కూడా.

أَمَّا بَعْدُ
[అమ్మాబాద్]
ఇక ఆ తర్వాత.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్‌కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.

అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఈ రోజు మనం ఆదర్శ మూర్తి, ఆదర్శ మహిళ, విశ్వాసుల మాతృమూర్తి, ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గురించి తెలుసుకోబోతున్నాం.

స్త్రీ స్థానం

ప్రపంచపు గొప్ప సౌభాగ్యం స్త్రీ. ఆ కోమలాంగి గనక భార్య రూపంలో వస్తే, ఆమె తన భర్త పాలిట, తన పిల్లల పాలిట సౌభాగ్యవతిగా అవతరిస్తుంది.

సత్కార్యం అంటే కేవలం తల మీద గుడ్డ కప్పుకోవటం, ముఖానికి గుడ్డ అడ్డం పెట్టుకోవటం మాత్రమే కాదు. అది అందులో భాగం కావచ్చు. అయితే, నిజమైన సత్కార్యం ఏమిటంటే, స్త్రీ తనకు శోభాయమానమైన మౌలిక సుగుణాలను కలిగి ఉండాలి. ఏ స్త్రీలోనైనా ఆ ప్రాథమిక గుణాలు లేకపోతే ఆ వైవాహిక జీవితం ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.

స్త్రీ గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు.

ఉత్తమ సామాగ్రి గురించి హదీస్

الدُّنْيَا كُلُّهَا مَتَاعٌ وَخَيْرُ مَتَاعِ الدُّنْيَا الْمَرْأَةُ الصَّالِحَةُ
[అద్దునియా కుల్లుహా మతా వ ఖైరు మతాయిద్దునియా అల్ మర్అతుస్సాలిహా]
ఈ ప్రపంచమంతా ఒక తాత్కాలిక వసతి, మరియు ఈ ప్రపంచంలోని ఉత్తమ వసతి సుగుణవతి అయిన స్త్రీ.

ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది.

ప్రపంచం మొత్తం కేవలం కొన్ని రోజుల జీవన సామగ్రి. అందులో అన్నిటికంటే మేలైన సామగ్రి సుగుణవతి అయిన స్త్రీ.

الله أكبر
[అల్లాహు అక్బర్]
అల్లాహ్ గొప్పవాడు.

స్త్రీ యొక్క విలువ, స్త్రీ యొక్క ప్రాముఖ్యత, స్త్రీ యొక్క గొప్పతనం మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్క వాక్యంలో చెప్పేశారు. ఈ పూర్తి ప్రపంచం, ఈ ప్రపంచం యొక్క విలువ, ఈ ప్రపంచంలోని అందచందాలు, ఆస్తి, ఐశ్వర్యాలు, హోదాలు, పదవులు, డబ్బు, బంగారం, వెండి, ఆణిముత్యాలు, వజ్రాలు, ఈ పూర్తి ప్రపంచం, ప్రపంచం యొక్క సామగ్రి ఇవన్నీ ఒక పక్క పెట్టి, మరో పక్క సుగుణవతి అయిన స్త్రీ. అంటే ఈ మొత్తం ప్రపంచపు సామగ్రి కంటే సుగుణవతి అయిన స్త్రీ గొప్పది, మేలైనది అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

ప్రియ సోదరులారా, ఇటువంటి గొప్ప సుగుణవతులలో ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా ఒకరు. ఆవిడ రదియల్లాహు అన్హా గురించి ఇన్షా అల్లాహ్ మనం ఈ రోజు క్లాసులో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి వంశం మరియు జీవితం

ఆవిడ పేరు ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా. తండ్రి పేరు అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు. ప్రవక్త గారి ప్రాణమిత్రులు, పురుషులలో అందరికంటే ముందు ప్రథమంగా ఇస్లాం స్వీకరించిన వారు. ఆ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు కూతురు ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా.

ప్రవక్త గారి వంశం, ఆయిషా రదియల్లాహు అన్హా గారి వంశం ఏడు లేదా ఎనిమిదవ తరములో ఒకటైపోతుంది. ఏడు లేదా ఎనిమిదవ తరములో ముర్రా బిన్ కాబ్ ఉన్నారు. ఆ ముర్రా బిన్ కాబ్ కి ఒక కుమారుడు తైమ్, ఇంకో కుమారుడు కిలాబ్. ముర్రా బిన్ కాబ్ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వంశంలో ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ ఈ వంశంలో ఏడు లేదా ఎనిమిదవ తరములో ముర్రా బిన్ కాబ్ ఉన్నారు. ఆ ముర్రా బిన్ కాబ్ కి ఒక కుమారుడు తైమ్, ఇంకో కుమారుడు కిలాబ్. ఆ తైమ్ నుంచి అబూబకర్ రదియల్లాహు అన్హు, ఆయిషా రదియల్లాహు అన్హా. అదే ముర్రా బిన్ కాబ్ యొక్క ఇంకో కుమారుడు కిలాబ్ నుంచి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే ఏడు లేదా ఎనిమిదవ తరములో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా వంశం ఒకటైపోతుంది.

ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి కున్నియత్: ఉమ్మె అబ్దుల్లా

ఇక బిరుదుల కంటే ముందు కున్నియత్ గురించి చెప్తాను ఇన్షా అల్లాహ్. కున్నియత్. కున్నియత్ అంటే అరబ్ దేశాలలో ఉన్న వారికి బాగా తెలుసు ఇది. సంతానం పేరుతో పిలువబడటాన్ని కున్నియత్ అంటారు. సంతానం పేరుతో పిలువబడటాన్ని కున్నియత్ అంటారు. అబూ అబ్దుల్లా, అబ్దుల్లా కి తండ్రి. అబూ ముహమ్మద్, ముహమ్మద్ కి తండ్రి. ఆ విధంగా. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కున్నియత్ ఏమిటి? అబుల్ ఖాసిం. మన ప్రవక్త గారి ఒక కుమారుడు ఖాసిం. బాల్యంలోనే మరణించారు. ఆ ఖాసిం పేరుతో అబుల్ ఖాసిం. ఖాసిం కి తండ్రి అని అర్థం.

ఆ విధంగా ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క బిరుదు ఉమ్మె అబ్దుల్లా. సంతానం పేరుతో పిలువబడటాన్ని కున్నియత్ అంటారు. ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క కున్నియత్ ఉమ్మె అబ్దుల్లా. అబ్దుల్లా కి తల్లి అని. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు. ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా కడుపున సంతానం పుట్టలేదు. సంతానం కలగలేదు. మరి సంతానం లేకుండా అబ్దుల్లా కి తల్లి ఎలా అయింది? ఆ కున్నియత్ ఎలా వచ్చింది? అనే విషయం తెలుసుకోవాలంటే ఒక హదీస్ మనం తెలుసుకోవాలి.

ఆ హదీస్ అబూ దావూద్, ఇబ్నె మాజా, అహ్మద్, బైహఖీ వగైరా హదీస్ గ్రంథాలలో ఉంది. ఈ హదీస్‌ని అల్లామా అల్బానీ రహమతుల్లాహి అలైహి సహీ అన్నారు. అన్ ఉర్వా, ఉర్వా రదియల్లాహు అన్హు కథనం. ఒకసారి ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని ఇలా విన్నవించుకున్నారు. యా రసూలల్లాహ్, ఓ దైవ ప్రవక్తా, కుల్లు సవాహిబీ లహున్న కునా. నా స్నేహితులందరికీ, స్నేహితురాళ్ళందరికీ కున్నియత్ ఉంది. నా స్నేహితురాలు వారందరూ తమ తమ బిడ్డల తల్లులు అని పిలువబడుతున్నారు. వారందరికీ కున్నియత్ ఉంది. మరి నేను ఎవరి తల్లి అని అనిపించుకోవాలి, పిలిపించుకోవాలి అని ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఈ విధంగా విన్నవించుకుంటే, అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సెలవిచ్చారు. ఖాల్, ఫక్తునీ బిబ్నికి అబ్దుల్లాహిబ్ని అజ్జుబైర్ యఅనీ ఇబ్ని ఉఖ్తిహా. ఓ ఆయిషా, నువ్వు నీ కొడుకు అయిన అబ్దుల్లా బిన్ జుబైర్ తల్లి అని పిలిపించుకో. అంటే నీ అక్క కొడుకు. యఅనీ ఇబ్ని ఉఖ్తిహా. నీ అక్క కొడుకు. అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క అక్క కూతురు. అస్మా రదియల్లాహు అన్హా. అబూబకర్ రదియల్లాహు అన్హు యొక్క పెద్ద కూతురు అస్మా రదియల్లాహు అన్హా గురించి మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఘారె సౌర్‌లో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్ ఉన్నప్పుడు అస్మా రదియల్లాహు అన్హా ఆ ముఖ్యమైన విషయాలు, అన్నం, పానీయాలు తీసుకుని పోయి ఇచ్చేవారు. ఆ అస్మా రదియల్లాహు అన్హా కొడుకు అబ్దుల్లా బిన్ జుబైర్. అబ్దుల్లా బిన్ జుబైర్ ముహాజిర్లు మక్కా నుంచి మదీనాకు వచ్చిన తర్వాత ముహాజిర్లలో మొట్టమొదటి సంతానం అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు. ముహాజిర్లు హిజ్రత్ చేసి మక్కా నుంచి మదీనాకు వచ్చాక ఆ ముహాజిర్లలో మొదటిగా ఎవరు పుట్టారంటే వారు అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు.

ఆ విధంగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హాని ఓ ఆయిషా నువ్వు నీ అక్క కొడుకు అబ్దుల్లా బిన్ జుబైర్ కి తల్లి అని పిలిపించుకో అని సమాధానం ఇస్తే, ఫకానత్ తుద్ఈ బి ఉమ్మి అబ్దిల్లా హత్తా మాతత్. ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా పరమపదించే వరకు ఉమ్మె అబ్దుల్లా అనే కున్నియత్‌తో పిలువబడేవారు. ఈ హదీస్ అనేక హదీస్ గ్రంథాలలో ఉంది. ఉదాహరణకు అబూ దావూద్, ఇబ్నె మాజా, అహ్మద్, బైహఖీ, అల్లామా అల్బానీ రహమతుల్లాహి అలైహి ఈ హదీస్‌ని సహీ అన్నారు. అంటే ఈ హదీస్ పరంగా మొదటి విషయం, ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గారి కున్నియత్ ఉమ్మె అబ్దుల్లా. రెండో విషయం, సంతానం లేకపోయినా కున్నియత్ పెట్టుకోవచ్చు అని అర్థమయింది. ఇది కున్నియత్ గురించి.

ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి బిరుదులు (అల్ఖాబ్)

ఇక అల్ఖాబ్, బిరుదులు. ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క అనేక బిరుదులు ఉన్నాయి. మనం కూడా సమాజంలో చూస్తున్నాము. అనేక మందిని వారి ప్రత్యేక సేవల వల్ల కొన్ని బిరుదులు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ప్రభుత్వం కూడా కొంతమందిని బిరుదు కేటాయిస్తుంది. ఆ విధంగా ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క బిరుదులు అనేకం ఉన్నాయి. ఆ అనేక బిరుదులలో కొన్ని బిరుదులు మనం తెలుసుకుందాం.

ఉమ్ముల్ మూమినీన్ (విశ్వాసుల తల్లి)

అన్నిటికంటే గొప్పది ఆ బిరుదు ఉమ్ముల్ మూమినీన్ అనే బిరుదు. విశ్వాసుల తల్లి. విశ్వాసుల మాతృమూర్తి. ఉమ్ముల్ మూమినీన్ అనే బిరుదు. ఈ బిరుదు స్వయంగా సకల లోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించాడు ఈ బిరుదు. ఈ ఉమ్ముల్ మూమినీన్ అనే బిరుదు ఆయిషా రదియల్లాహు అన్హాకి మాత్రమే కాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణిలందరికీ ఈ బిరుదు అల్లాహ్ ఇచ్చాడు. ప్రవక్త గారి భార్యలందరికీ ఈ బిరుదు వర్తిస్తుంది. ఇది అల్లాహ్ ఇచ్చిన బిరుదు. సూరతుల్ అహ్‌జాబ్ ఆయత్ నెంబర్ ఆరులో ఇలా ఉంటుంది.

النَّبِيُّ أَوْلَى بِالْمُؤْمِنِينَ مِنْ أَنْفُسِهِمْ وَأَزْوَاجُهُ أُمَّهَاتُهُمْ
[అన్నబియ్యు ఔలా బిల్ ముఅమినీన మిన్ అన్ఫుసిహిమ్ వ అజ్వాజుహు ఉమ్మహాతుహుమ్]
ప్రవక్త విశ్వాసులకు వారి ప్రాణాల కన్నా ఎక్కువ ప్రియమైనవారు, మరియు ఆయన భార్యలు వారి తల్లులు.

దైవ ప్రవక్తకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువ హక్కు ఉంది. దైవ ప్రవక్తకు విశ్వాసులపై, మూమినీన్‌లపై వారి ఆ విశ్వాసుల, ఆ మూమినీన్‌ల ఆత్మ కన్నా, ప్రాణం కన్నా ఎక్కువ హక్కు ఉంది. వ అజ్వాజుహు ఉమ్మహాతుహుమ్. ఆయన భార్యలు, అంటే ప్రవక్త గారి సతీమణులు విశ్వాసుల కొరకు తల్లులు. ప్రతి విశ్వాసికి ప్రవక్త గారి ఏ భార్య అయినా సరే తల్లి. ఉమ్ముల్ మూమినీన్. ఈ బిరుదు స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించిన బిరుదు సూరా అహ్‌జాబ్, సూరా నెంబర్ 33, ఆయత్ నెంబర్ ఆరు. వ అజ్వాజుహు ఉమ్మహాతుహుమ్. ప్రవక్త గారి భార్యలు విశ్వాసులకు తల్లులు. ఇది మొదటి బిరుదు, ఉమ్ముల్ మూమినీన్.

హబీబా (ప్రియమైనది)

ఇక రెండో బిరుదు హబీబా. ఇది హబీబ్ దీనికి స్త్రీ వచనం హబీబా. హబీబ్ మేల్ అయితే హబీబా ఫీమేల్. హబీబ్ పురుషులకి వర్తిస్తుంది, హబీబా స్త్రీలకు వర్తిస్తుంది. దాని అర్థం ఏమిటి? ప్రియమైనది, ఇష్టమైనది అని అర్థం. హబీబా అంటే ప్రియమైనది, ఇష్టమైనది అని అర్థం. ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క బిరుదులలో ఒక బిరుదు హబీబా. ప్రియమైన వారు. ఆవిడ పట్ల మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రేమ వల్ల ఈ బిరుదు ఇవ్వబడింది.

బుఖారీ మరియు ముస్లిం సంయుక్తంగా ఒక హదీస్ ఉంది. ముత్తఫకున్ అలైహి హదీస్. ఫకద్ సుఇల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అడగడం జరిగింది. ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటి? ఒక్క సహాబీ అడిగారు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఒక సహాబీ ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏమిటి? అయ్యున్నాసి అహబ్బు ఇలైక్? ఓ దైవ ప్రవక్తా, అందరికంటే ప్రియమైన వారు ఎవరు? మీకు, మీ దృష్టిలో, మీ వద్ద అందరికంటే ప్రియమైన వారు, ఇష్టమైన వారు ఎవరు అని ఆ సహాబీ ప్రవక్త గారిని అడిగితే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన సమాధానం ఏమిటి? ఖాల్, ఆయిషా. నాకు అందరికంటే ప్రియమైన వారు ఆయిషా అని సమాధానం ఇచ్చారు రదియల్లాహు అన్హా.

ఫకుల్తు, మినర్రిజాల్? ఆ సహాబీ మళ్ళీ అడిగాడు. ఓ దైవ ప్రవక్తా, పురుషులలో ఎవరు? ఖాల్, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇచ్చారు. అబూహా. ఆవిడ తండ్రి అన్నారు. అంటే ఆయిషా రదియల్లాహు అన్హా తండ్రి అబూబకర్ గారు. స్త్రీలలో నాకు అందరికంటే ప్రియమైన వారు, హబీబా ఆయిషా అయితే పురుషుల్లో అబూబకర్ అన్నారు. కుల్తు, సుమ్మ మన్? ఆ సహాబీ మూడోసారి అడిగారు. ఓ దైవ ప్రవక్తా, ఆ తర్వాత ఎవరు? ఖాల్, ఉమరుబ్నుల్ ఖత్తాబ్. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ అని సెలవిచ్చారు. రదియల్లాహు అన్హుమ్ అజ్మఈన్. ఈ హదీస్ ముత్తఫకున్ అలైహి. ఈ హదీస్‌లో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హాని అందరికంటే ప్రియమైన వారు అన్నారు గనక ఆ హబీబా అనే బిరుదు ఆమెకు ఉంది.

ఇంకా అహ్మద్ మరియు హాకింలో ఒక ఉల్లేఖనం ఉంది. ఉమర్ రదియల్లాహు అన్హు కాలములోని ఇరాఖ్ యుద్ధం గురించి. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు కాలములో ఇరాఖ్ విజయంలో గనీమత్ సొమ్ము వస్తుంది. ఇరాఖ్ విజయములో ఖిలాఫతే ఉమర్ బిన్ ఖత్తాబ్. ఇరాఖ్ విజయములో చాలా గనీమత్ సొమ్ము వస్తుంది, ధనం వస్తుంది. ఆ గనీమత్ సొమ్ములో ఒక విలువైన ఆభరణం కూడా ఉన్నింది. ఆ గనీమత్ సొమ్ములో ఒక విలువైన ఆభరణం ఉన్నింది. ఆ ఆభరణం చూసి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు సహాబాలను ఉద్దేశించి అడిగారు. ఈ ఆభరణం యొక్క విలువ మీకు తెలుసా అని. సహాబాలందరూ మౌనం వహించారు. చాలా ఖరీదైన, విలువైన ఆభరణం అది. అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు సహాబాలను ఉద్దేశించి మీరందరూ అనుమతిస్తే నేను ఈ విలువైన ఆభరణాన్ని ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హాకి ఇస్తాను. ఆవిడ వద్దకు పంపిస్తాను అని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు సహాబాల అనుమతి తీసుకుని ఆ విలువైన ఆభరణం ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా వద్దకి పంపిస్తారు. ఈ ఉల్లేఖనంలో చివర్లో నేను ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హానే ఈ ఆభరణం ఎందుకు ఇస్తున్నాను అని కారణం చెప్పారు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు. కారణం ఏమిటంటే ఎందుకంటే ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు అంటున్నారు, నేను ఈ ఆభరణం ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హానే ఎందుకు ఇస్తున్నాను? కారణం చెప్తున్నారు. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిడ పట్ల అంటే ఆయిషా రదియల్లాహు అన్హా పట్ల ప్రత్యేక ప్రేమ కలిగి ఉండేవారు. అంటే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హా పట్ల ప్రత్యేక ప్రేమ కలిగి ఉండేవారు కాబట్టి నేను ప్రవక్త గారి ఆ ప్రేమ మూలంగా ఈ విలువైన ఆభరణాన్ని ఆయిషా రదియల్లాహు అన్హాకి ఇస్తున్నాను అని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు సెలవిచ్చారు. అభిమాన సోదరులారా, ఈ ఉల్లేఖనంలో మన కోసం అనేక గుణపాఠాలు ఉన్నాయి. మొదటి గుణపాఠం ఏమిటి? ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఆ సహాబాలని అసలు అనుమతి కోరే అవసరమే లేదు. ఖలీఫా ఆయన. అయినా కూడా ఆయన యొక్క దైవభీతి, న్యాయం, నీతి, నిజాయితీ ఆ విధంగా ఉన్నింది. ఆయన అనుమతి కోరారు. రెండవది ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు తన కూతురు హఫ్సాకి అయినా ఇవ్వచ్చు కదా ఈ ఆభరణం. హఫ్సా రదియల్లాహు అన్హా కూడా ఉమ్ముల్ మూమినీన్ కదా. ఉమ్ముల్ మూమినీన్ ఇంకా కూతురు. హఫ్సా రదియల్లాహు అన్హా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హుకి కూతురు అవుతుంది. ఇంకా ప్రవక్త గారి భార్య గనక ఉమ్ముల్ మూమినీన్ కూడా. ఆ ఉద్దేశంతో నా కూతురు ఉమ్ముల్ మూమినీన్ కదా అని ఉద్దేశంతో ఇస్తే తప్పు ఏముంది? ఇవ్వచ్చు. కానీ నా కూతురు కూడా ఉమ్ముల్ మూమినీన్, ఆయిషా కూడా ఉమ్ముల్ మూమినీన్, ఇంకా ఇతర ఉమ్మహాతుల్ మూమినీన్ కూడా ఉన్నారు. అయినప్పటికిని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆ ఆభరణాన్ని ఆయిషా రదియల్లాహు అన్హాకి మాత్రమే ఎందుకు ఇచ్చారంటే అదే కారణం. ఎందుకంటే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిడ పట్ల ప్రత్యేక ప్రేమ కలిగి ఉన్నవారు. మాషా అల్లాహ్, చూడండి సహాబాలు ఏ విధంగా ప్రవక్త గారి హదీసులను, ప్రవక్త గారి ప్రేమని, ప్రవక్త గారి ప్రసన్నతను, ప్రవక్త గారి విధేయతను ఏ కోణములో ఆలోచన చేసేవారు? ఏ విధంగా ప్రవక్త గారిని ప్రసన్నత పొందపరిచాలి? అలాగే ఆయన విధేయత ఎలా చూపాలి? ప్రవక్త గారికి ఏ విషయంలో ప్రేమ ఉన్నింది? ఎవరితో ప్రేమ ఉన్నింది? ఆ విధంగా సహాబాలు గమనించేవారు, ఆలోచించేవారు.

సిద్దీఖా, తయ్యిబా, ముబర్రఆ

అభిమాన సోదరులారా, అలాగే ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క బిరుదులలో సిద్దీఖా అని ఒక బిరుదు. ఎల్లప్పుడూ సత్యం పలికేవారు. తండ్రి సిద్దీఖ్, కూతురు సిద్దీఖా. అలాగే తయ్యిబా ఒక బిరుదు ఉంది. ముబర్రఆ ఒక బిరుదు ఉంది. తయ్యిబా అంటే పవిత్రురాలు. ముబర్రఆ అంటే దోషాల నుంచి ఆ పాపం ఏ అభాండం వేయబడిందో, అపనింద మోపబడిందో దాని నుంచి బరాఅత్. ముబర్రఆ. ఏ అభాండం మీరు వేశారో ఆ విషయంలో ఆవిడ పవిత్రురాలు అని అర్థం. ఇది స్వయంగా ఖురాన్‌లో ఉంది ఇది. తయ్యిబా, ముబర్రఆ అనేది.

హుమైరా

ఇంకో బిరుదు ఉంది, హుమైరా. ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క బిరుదు హుమైరా. హుమైరా అంటే అరుణిమ లేక ఎరుపు రంగుని హుమైరా అంటారు అరబీలో. అరుణిమ లేక ఎరుపు రంగు. అంటే తెలుపు రంగులో కొంచెం ఎరుపు రంగు ఉండటం. తెలుపు రంగులో కొంచెం ఎరుపు రంగు ఉండటాన్ని అరబీలో హుమైరా అంటారు. తెలుపు ఎరుపు రంగు అన్నమాట. ఇటువంటి రంగు హిజాజ్‌లో బహు తక్కువ అని ఇమాం జహబీ, ఇమాం జహబీ రహమతుల్లాహి అలైహి తన పుస్తకం సియరు ఆలామిన్ నుబలాలో తెలియజేశారు. ఈ తెలుపు రంగులో ఎరుపు రంగు, ఇటువంటి రంగు హిజాజ్‌లో చాలా తక్కువ, అరుదు అని ఇమాం జహబీ రహమతుల్లాహి అలైహి తన పుస్తకం సియరు ఆలామిన్ నుబలా, భాగం ఏడు, పేజ్ నెంబర్ 168లో ఈ విషయం తెలియజేశారు.

ఈ హదీస్ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హాని యా హుమైరా అనే పదంతో సంబోధించిన, సంభాషించిన హదీస్ నసాయీలో ఉంది. ఇమాం నసాయీ రహమతుల్లాహి అలైహి సుననుల్ కుబ్రాలో ఈ హదీస్ ని సున వచ్చారు. ఈ హదీస్ ఈ విధంగా ఉంటుంది. దఖలల్ హబశతు యల్అబూన్. హబశాకి చెందిన వారు, ఇథియోపియన్‌లు ఒక ప్రత్యేకమైన ఆట ప్రదర్శించడానికి మస్జిద్ నబవీలో ప్రవేశించారు. ఆ ప్రత్యేకమైన ఆట వారు ప్రదర్శించేటప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హాని ఇలా అన్నారు. ఫఖాల లియన్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా స్వయంగా అంటున్నారు, దైవ ప్రవక్త నాతో అన్నారు. ఏమన్నారు?

يَا حُمَيْرَاءُ أَتُحِبِّينَ أَنْ تَنْظُرِي إِلَيْهِمْ
[యా హుమైరా అతుహిబ్బీన అన్ తన్జురీ ఇలైహిమ్]
ఓ హుమైరా, నువ్వు వారిని చూడటానికి ఇష్టపడుతున్నావా?

ఓ హుమైరా, నువ్వు ఆ హబశా చెందిన వారి ఆ ప్రత్యేకమైన ఆటను నువ్వు చూడాలనుకుంటున్నావా? అతుహిబ్బూన, చూడటం ఇష్టపడతావా? అంతన్జురీ ఇలైహిమ్. ఆ ఆట ప్రదర్శన. ఫకుల్తు నఅమ్. నేను అవునన్నాను అని ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా తెలియజేశారు. అంటే ఈ హదీస్‌లో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హాని హుమైరా అనే బిరుదుతో పిలిచారు.

అభిమాన సోదరులారా, ఇక్కడ హదీస్ పరంగా ఒక ముఖ్యమైన గమనిక ఉంది. హదీస్ పరంగా, ఉసూలే హదీస్ పరంగా. ఆ గమనిక ఏమిటి? ఇమాం జరకశీ రహమతుల్లాహి అలైహి ఒక పుస్తకం ఉంది, దాని పేరు అల్ ఇజాబా. ఆ పుస్తకంలో ఇమాం మిజ్జీ రహమతుల్లాహి అలైహి యొక్క కౌల్ ఆయన నఖల్ చేశారు. ఇమాం జరకశీ రహమతుల్లాహి అలైహి ఇమాం మిజ్జీ రహమతుల్లాహి యొక్క కౌల్ ని నఖల్ చేశారు. ఇమాం మిజ్జీ రహమతుల్లాహి అలైహి ఈయన కూడా పెద్ద పండితులు, ముహద్దిస్. అనేక పుస్తకాలు ఉన్నాయి. ఇమాం మిజ్జీ రహమతుల్లాహి అలైహి. ఇమాం మిజ్జీ రహమతుల్లాహి అలైహి ఏం చెప్తున్నారంటే, ఏ హదీస్‌లో యా హుమైరా అనే పదం ఉంటుందో ఆ హదీస్ జయీఫ్ లేదా మౌజూ అయి ఉంటుంది అన్నారు. నసాయీలోని ఈ ఒక్క హదీస్ తప్ప. ఇప్పుడు నేను చెప్పిన హదీస్ నసాయీలో ఉంది. దఖలల్ హబశతు యల్అబూన హబశాకి చెందిన వారు మస్జిద్ నబవీలో ఒక ప్రత్యేకమైన ఆట ప్రదర్శించడానికి వచ్చారు. ఆ సందర్భంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హాని ఉద్దేశించి యా హుమైరా అంటే ఓ ఆయిషా నువ్వు ఈ ప్రదర్శన చూస్తావా, నీకు ఇష్టంగా ఉందా అని అడిగారు అనే ఈ హదీస్ తప్ప, ఈ హదీస్‌లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హాని యా హుమైరా అన్నారు. నసాయీలోని ఈ హదీస్ తప్ప మిగతా హదీసులన్నీ ఏ హదీసులో యా హుమైరా అనే పదం ఉంటుందో అవి జయీఫ్ లేక మౌజూ అయి ఉంటుందని ఇమాం మిజ్జీ రహమతుల్లాహి అలైహి తెలియజేశారు. ఈ విషయం మనం ఇమాం జరకశీది అల్ ఇజాబాలో చూడగలం.

మువఫ్ఫకా

అభిమాన సోదరులారా, ఇక అనేక బిరుదులు ఉన్నాయి. ఒక్క బిరుదు చెప్పి నేను ఇంతటితో ఈ రోజు క్లాస్ ముగిస్తాను. వచ్చే వారం ఇన్షా అల్లాహ్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గురించి వేరే విషయాలు తెలుసుకుందాం. ఆ బిరుదు ఏమిటంటే మువఫ్ఫకా. ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క బిరుదు మువఫ్ఫకా. మువఫ్ఫకా అంటే సద్బుద్ధి ప్రసాదింపబడిన వారు. మనం ఉర్దూ భాషలో దుఆ చేస్తాం. ఓ అల్లాహ్, అయ్ అల్లాహ్, ముఝే నేక్ తౌఫీఖ్ దే. నేక్ తౌఫీఖ్ దే. తౌఫీఖ్. ఈ తౌఫీఖ్ ఎవరికి ఇవ్వబడుతుందో వారు మువఫ్ఫఖ్ అవుతారు. పురుషుడు అయితే పురుషుడు అయితే మువఫ్ఫఖ్, స్త్రీ అయితే మువఫ్ఫకా.

ఒక హదీస్ ఉంది. తిర్మిజీ, అహ్మద్ మరియు తబరానీలో. ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ఆయన అంటున్నారు, సమీతు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యఖూల్. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తుండగా నేను విన్నానని అబ్దుల్లా ఇబ్నె అబ్బాస్ చెప్తున్నారు. మన్ కాన లహు ఫరతాని మిన్ ఉమ్మతీ దఖలల్ జన్నహ్. ఎవరికి నా ఉమ్మత్‌లోని ఏ తల్లిదండ్రుల ఇద్దరి సంతానం ప్రాజ్ఞ వయసు బాలిగ్ అవ్వకముందే మరణించారు, అటువంటి తల్లిదండ్రులు స్వర్గానికి పోతారు. మన్ కాన లహు ఫరతాని మిన్ ఉమ్మతీ దఖలల్ జన్నహ్. నా అనుచర సమాజములోని ఏ తల్లిదండ్రుల ఇద్దరి సంతానం, ఫరతున్ అంటే ముందు వెళ్ళిపోయిన వ్యక్తి. ఫరత్ అంటే ముందు వెళ్ళిపోయిన వ్యక్తికి ఫరత్ అంటారు. ఫరతాన్ ముందు వెళ్ళిపోయిన ఇద్దరు వ్యక్తులు. అంటే ప్రాజ్ఞ వయసు చేరకముందే, బాలిగ్ అవ్వకముందే, బాల్యములోనే ఎవరి ఇద్దరి సంతానం మరణిస్తారో అటువంటి వారు స్వర్గములో పోతారు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిస్తే, ఆ సందర్భంలో ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా ఒక ప్రశ్న అడిగారు. అది ఏమిటంటే, వమన్ కాన లహు ఫరద్? ఓ దైవ ప్రవక్తా, మీ మాట పరంగా ఎవరి సంతానంలోని ఇద్దరు పిల్లలు బాల్యంలో మరణిస్తే అని చెప్పారు కదా మీరు, మరి ఎవరి తల్లిదండ్రుల ఒక బిడ్డ మాత్రమే బాల్యంలో మరణిస్తే? అని ప్రశ్న. దానికి ప్రవక్త గారు, వమన్ కాన లహు ఫరద్ యా మువఫ్ఫకా. ఓ తౌఫీఖ్ ఇవ్వబడిన ఆవిడ, ఒక సంతానమైనా బాల్యంలో మరణిస్తే అటువంటి అమ్మ నాన్న కూడా, అటువంటి వారి అమ్మ నాన్న కూడా స్వర్గంలో పోతారు అని ప్రవక్త గారు సెలవిచ్చారు. ఇంకో ప్రశ్న అడిగారు ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా. ఫమన్ లం యకున్ లహు ఫరదున్ మిన్ ఉమ్మతిక్? ఓ దైవ ప్రవక్తా, మీ ఉమ్మత్‌లోని కొంతమంది ఉంటారు, వారి సంతానం బాల్యంలో చనిపోలేదు, ఒక సంతానం కూడా, ఒక బిడ్డ కూడా బాల్యంలో చనిపోలేదు. మరి అటువంటి వారి పరిస్థితి ఏమిటి? చూడండి ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా ఉమ్మత్ గురించి ఎంత ఆలోచన చేసేవారు మాషా అల్లాహ్. మన గురించి ఎంత ఆలోచన చేసేవారు. మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొదటి మాట ఏమిటి? ఇద్దరు సంతానం, ఇద్దరు పిల్లలు బాల్యంలో చనిపోతే వారి అమ్మ నాన్న స్వర్గం. ఆయిషా రదియల్లాహు అన్హా ప్రశ్న ఏమిటి? ఓ దైవ ప్రవక్తా, ఒక బిడ్డ మాత్రమే బాల్యంలో చనిపోతే? వారు కూడా స్వర్గం. ఆయిషా రదియల్లాహు అన్హా మూడో ప్రశ్న ఏమిటి? ఓ దైవ ప్రవక్తా, చాలా మంది ఉంటారు, వారికి సంతానం ఉండదు లేకపోతే సంతానం అయినా కూడా బాల్యంలో చనిపోరు. మరి వాటి పరిస్థితి ఏమిటి? దానికి సమాధానం ప్రవక్త గారు ఇచ్చారు. ఫఅన ఫరతు ఉమ్మతీ లం యుసాబూ బి మిస్లీ. అటువంటి వారి కోసం నేను ముందు వెళ్ళిపోయి ఉంటాను. ముందు వెళ్ళిపోయిన వ్యక్తిని నేనవుతాను అటువంటి వారి కోసం. ఎందుకంటే నాలాంటి బాధలు ఎవరికీ రాలేదు. అంటే ఫరత్ అంటే ముందు వెళ్ళిపోయిన వ్యక్తి. ఎందుకంటే ఎవరి సంతానం బాల్యంలో చనిపోతే వారు ముందుగా వెళ్ళిపోయి వారి ఆతిథ్యం కోసం సిద్ధం ఉంచి ఉంచుతారు. అందుకు నా ఉమ్మత్‌కి నేను ఫరత్ అవుతాను. నేను ముందు వెళ్ళిపోయి నా ఉమ్మత్ కోసం నేను సిద్ధం చేసి ఉంచుతాను ఆ ఆతిథ్యం అని దానికి అర్థం.

అభిమాన సోదరులారా, కాకపోతే ఈ హదీస్‌లో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గారిని మువఫ్ఫకా అనే బిరుదుతో సంభాషించారు. కాకపోతే అల్లామా అల్బానీ రహమతుల్లాహి అలైహి ఈ హదీస్ ని జయీఫ్ అన్నారు. ఇమాం అహ్మద్ షాకిర్ రహమతుల్లాహి అలైహి ఈ హదీస్ ని సహీ అన్నారు. సారాంశం ఏమిటంటే ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గారికి అనేక బిరుదులు ఉన్నాయి. ఉమ్ముల్ మూమినీన్ అల్లాహ్ ఇచ్చిన బిరుదు. హబీబా ఆవిడ పట్ల ప్రవక్త గారి ప్రేమ వల్ల హబీబా అనే బిరుదు. ఆమె పవిత్రత, విశ్వాసం, తఖ్వా, దైవభీతి వలన ఇంకా అల్లాహ్ ఆమె గురించి బరాఅత్ ఆయత్ అవతరింపజేశాడు దాని మూలంగా తయ్యిబా, ముబర్రఆ అనే బిరుదులు. అలాగే హుమైరా అనే బిరుదు, అలాగే మువఫ్ఫకా అనే బిరుదు. అభిమాన సోదరులారా, ఇంకా ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గురించి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అవి ఇన్షా అల్లాహ్ వచ్చే క్లాసులలో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఉమ్మహాతుల్ మూమినీన్‌ల జీవితాల చరిత్రను చదివి అర్థం చేసుకుని ఆ చరిత్రను ఆదర్శంగా తీసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఈ చరిత్రను మనం కేవలం చరిత్ర మాదిరిగానే కాకుండా వారి జీవితంలోని మన కోసం ఆదర్శం ఏమిటి? ఈ విషయాలు మనము గ్రహించాలి. ఇవన్నీ ఇన్షా అల్లాహ్ మనము వచ్చే క్లాసులలో ఇంకా వివరంగా ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా జీవితం చాలా వివరంగా ఉంటుంది. అవన్నీ వివరాలు ఇన్షా అల్లాహ్ మనము క్లుప్తంగా తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
[వఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
మరియు మా చివరి ప్రార్థన, సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ
[వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఇతరములు: 

విశ్వాసుల మాతృమూర్తులు – యూట్యూబ్ ప్లే లిస్ట్ (Youtube Play List)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3xXwwAsskOZEOa303Y2l-f

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad/

ఖదీజా బిన్త్ ఖువైలిద్ (రదియల్లాహు అన్హా) గారి జీవిత చరిత్ర (సీరత్) [వీడియో]

బిస్మిల్లాహ్

మొదటి భాగం

[47 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్

రెండవ భాగం

[52 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్

ఇతరములు: 

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad/

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఎందుకు ఎక్కువ మంది భార్యలున్నారు? [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఎందుకు ఎక్కువ మంది భార్యలున్నారు?
https://youtu.be/XPzalQiVVY4 [6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బహుళ వివాహాల గురించిన ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. మొత్తం 11 మంది భార్యలు ఉన్నారని, వారిలో ఇద్దరు ఆయన జీవితకాలంలోనే మరణించారని, ఆయన మరణించే సమయానికి తొమ్మిది మంది ఉన్నారని వక్త స్పష్టం చేశారు. ఈ వివాహాలు అల్లాహ్ యొక్క ప్రత్యేక అనుమతితో జరిగాయని, దీనికి సూరతుల్ అహ్‌జాబ్‌లో ప్రమాణం ఉందని వివరించారు. ఈ వివాహాల వెనుక ఉన్న అనేక కారణాలను ఆయన వివరించారు: స్త్రీలకు ఆదర్శవంతమైన జీవితాన్ని తెలియజేయడం, వైవాహిక జీవితంలోనూ ఆయన ఒక ఉత్తమ ఆదర్శంగా నిలవడం, వివిధ వంశాలు మరియు వర్గాల మధ్య సంబంధాలను బలపరచడం, మరియు ఇస్లాం యొక్క గొప్పతనాన్ని, శత్రువుల పట్ల కూడా గౌరవప్రదంగా వ్యవహరించే తీరును తెలియజేయడం వంటివి ముఖ్యమైనవి. ఇది ఇస్లాం యొక్క విశ్వజనీన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి దోహదపడిందని ఆయన పేర్కొన్నారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొత్తం భార్యలు 11. అయితే తమ జీవితంలో ఇద్దరు భార్యలు చనిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించే సందర్భంలో తొమ్మిది భార్యలు వారి వద్ద ఉన్నారు.

అయితే, ప్రవక్తకు నలుగురి కంటే ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకునే అటువంటి అనుమతి, అర్హత స్వయంగా నిజ సృష్టికర్త అయిన మనందరి ఆరాధ్యుడైన అల్లాహ్ ప్రసాదించాడు. ఆ ఆజ్ఞ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పెళ్లిళ్లు చేసుకున్నారు. దీని యొక్క వివరణ సూరతుల్ అహ్‌జాబ్‌లో చూడవచ్చును. సూరా నెంబర్ 33, మరి ఇందులో ప్రత్యేకంగా ఎక్కడైతే అల్లాహ్ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒకరి కంటే ఎక్కువగా భార్యలు చేసుకునే అటువంటి అనుమతి ఇచ్చాడో, ఆయతు నెంబర్ 28 నుండి సుమారు సుమారు 35 వరకు మరియు ఆ తర్వాత ఒక రెండు ఆయతులు కూడా మీరు చూశారంటే దీనికి సంబంధించిన ఎన్నో లాభాలు మనకు ఏర్పడతాయి.

సంక్షిప్తంగా మనం చెప్పుకోవాలంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం పురుషులకే ప్రవక్త కారు, స్త్రీలకు కూడాను. అయితే, ప్రవక్త వారి ఆదర్శ జీవితం పురుషులకు ఎంత అవసరమో, అలాగే స్త్రీలకు కూడా అవసరం. ఒకరి కంటే, నలుగురి కంటే ఎక్కువ భార్యల ద్వారా ఇలా ప్రవక్త వారి ఆదర్శవంతమైన జీవితాన్ని తెలుసుకొని ప్రజలందరికీ తెలియజేయడానికి మంచి సహకారం ఏర్పడుతుంది.

రెండవ విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన అందరి కొరకు ఒక ఉత్తమ ఆదర్శం అని ఇదే సూరతుల్ అహ్‌జాబ్‌లో కూడా అల్లాహ్ మనకు తెలియజేశాడు. అయితే, ఈ ఆదర్శం కేవలం మస్జిద్ వరకు, బయట బజారు వరకు, యుద్ధాల్లోనే కాదు, వైవాహిక జీవితంలో, ఫ్యామిలీ లైఫ్‌లో కూడా. అంతేకాదు, ఇంకా మనం కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే, మానవుల్లో, సమాజంలో విద్యా రీత్యా గానీ, బుద్ధి జ్ఞానాల పరంగా గానీ, విషయాలు నేర్చుకుని ఆచరించే పరంగా గానీ, సమాజంలో ప్రజలు ఏ తారతమ్యాలు ఏర్పాటు చేసుకుంటారో దాని పరంగా గానీ వేరువేరుగా ఉంటారు గనుక, వేరువేరు వంశాలకు సంబంధించిన భార్యలు ప్రవక్త దగ్గర ఉండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉత్తమ ఆదర్శాన్ని అందరికీ తెలియజేయడానికి.

అంతే కాదు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా వచ్చారు. సర్వ మానవాళిలో ప్రత్యేకంగా ఆ కాలంలో బహుదైవారాధకుల రూపంలో, యూదుల రూపంలో, క్రైస్తవుల రూపంలో ఎందరో అక్కడ నాయకులు ఉన్నారు. అయితే, ఆ నాయకుల యొక్క బిడ్డలు సైతం ఎప్పుడైతే యుద్ధంలో బానిసరాళ్లుగా వచ్చారో, వారికి వారి హోదా, అంతస్తు ప్రకారంగా వారి యొక్క తండ్రులకు ఇస్లాం యొక్క గొప్పతనం తెలిసిరావాలి, ‘నా బిడ్డలు బానిసరాళ్లు అయ్యారు’ అన్నటువంటి అవమానంతో ఇస్లాం పట్ల మరింత వారి యొక్క హృదయాలలో ఏ చెడు చేసుకోకూడదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి బిడ్డలను వివాహం చేసుకున్నారంటే, ఇస్లాం యొక్క గొప్ప నాయకుల వద్ద నా బిడ్డలు ఒక మహారాణిగా ఉన్నారు అన్నటువంటి సంతోషంతో వారు కూడా ఇస్లాంకు మరింత దగ్గరగా అయ్యారు.

ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఉర్దూ తెలిసిన వారు మౌలానా సయ్యద్ సులేమాన్ మన్సూర్‌పురి రహ్మతుల్లాహి అలైహి వారి ‘రహ్మతున్ లిల్ ఆలమీన్’ పుస్తకంలో దీని యొక్క వివరాలను కూడా ఇన్షా అల్లాహ్ చూడగలుగుతారు. ఈ సమాధానం సరిపోతుందని ఆశిస్తున్నాను.

ఇతరములు: 

మద్రాస్ ప్రసంగాలు – ప్రవక్త ﷺ జీవితచరిత్రకు సంబంధించిన వివిధ కోణాలపై 8 ఖుత్బాలు
అల్లామా సయ్యిద్ సులైమాన్ నద్వీ
https://teluguislam.net/2021/12/01/madras-prasangalu/

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
https://teluguislam.net/2011/03/25/muhammad-the-final-prophet/
అనువాదం : ముహమ్మద్ నసీరుద్దీన్ 

మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [15 వీడియోలు]
https://teluguislam.net/2020/01/02/prophet-muhammad-seerah/
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 70 నిముషాలు

“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో]
https://teluguislam.net/2019/08/05/the-meaning-of-muhammad-rasolullaah/
అనువాదం : ముహమ్మద్ నసీరుద్దీన్

ప్రవక్త ﷺ గారి జీవిత చరిత్ర (సీరత్) పాఠాలు 12: ప్రవక్త ﷺ గురించి ఎవరేమన్నారు? [వీడియో]

బిస్మిల్లాహ్

[14:28 నిముషాలు]

సీరత్ పాఠాలు – 12: ప్రవక్త ﷺ గురించి ఎవరేమన్నారు?

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [14:27 నిముషాలు]

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గురించి ఎవరేమన్నారు?

కొందరు తత్వవేత్తలు, ఇస్లాం స్టడీ చేసిన పాశ్చాత్య నిపుణులు (orientalists) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇచ్చిన స్టేట్ మెంట్స్ తెలుపుతున్నాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గొప్పతనాన్ని, ఆయన ప్రవక్తపదవిని, ఆయన ఉత్తమ గుణాలను వారు ఒప్పుకున్న విషయాల్ని స్పష్టం చేస్తున్నాము. కొందరు ఇస్లామీయ విరోధులు, శత్రువులు చేస్తున్న దుష్ప్రచారానికి, పక్షపాతానికి ఈ ఇస్లాం ధర్మం దూరంగా ఉంది అని వారు తెలిపిన ఇస్లాం ధర్మ వాస్తవికతలను మీ ముందుంచుతున్నాము. (అయితే ఇస్లాంగానీ, ప్రవక్తగానీ వారి ప్రశంసలకు, సాక్ష్యాలకు ఆధారపడిలేరు. మరి ఇవి తెలిపే కారణం ఏమిటంటే; ఇస్లాంను అర్థం చేసుకోకుండా, దానిని చెడుగా భావించేవారు, వారి వంశం, లేదా వారి లాంటి మతాలపై ఉన్నవారిలో కొందరు ఇస్లాంను చదివి ఎలా అర్థం చేసుకున్నారో అదే విధంగా ఇస్లాం అధ్యాయనం చేసి, న్యాయంపై ఉండాలన్నదే మా ఉద్దేశం).

జోర్జ్ బర్నార్డ్ షా:

George Bernard Shaw. జననం 26/7/1856.
మరణం 2/11/1950. జన్మ స్థలం Ireland.

జోర్జ్ బర్నార్డ్ షా తన రచన “ముహమ్మద్”లో (బ్రిటిష్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని కాల్చేసింది) ఇలా వ్రాశాడుః “ఈ నాటి సమాజానికి ముహమ్మద్ లాంటి మేధావి అవసరం చాలా ఉంది. ఈ ప్రవక్త ఎల్లప్పుడూ తన ధర్మాన్ని గౌరవ స్థానంలో ఉంచాడు. ఆయన తీసుకొచ్చిన ధర్మం ఇతర నాగరికతలను అంతమొందించే అంతటి శక్తి గలది. శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండునది. నా జాతి వాళ్ళల్లో చాలా మంది స్పష్టమైన నిదర్శనంతో ఈ ధర్మంలో ప్రవేశిస్తున్నది నేను చూస్తున్నాను. సమీపం లోనే ఈ ధర్మం యూరపు ఖండంలో విశాలమైన చోటు చేసుకుంటుంది”.

ఇంకా ఇలా వ్రాశాడు: “అజ్ఞానం, లేదా పక్షపాతం వల్ల మధ్య శతాబ్థి (Middle Ages) లోని క్రైస్తవ మత పెద్దలు ముహమ్మద్ తీసుకొచ్చిన ధర్మాన్ని అంధవికారంగా చిత్రీకరించి, అది క్రైస్తవ మతానికి శత్రువు అని ప్రచారం చేశారు. కాని నేను ఈ వ్యక్తి (ముహమ్మద్) గురించి చదివాను. అతను వర్ణనాతీతమైన, అపరూపమైన వ్యక్తి. ఆయన క్రైస్తవమతానికి శత్రువు ఎంత మాత్రం కారు. ఆయన్ను మానవ జాతి సంరక్షకుడని పిలవడం తప్పనిసరి. నా దృష్టిలో ఆయన గనక నేటి ప్రపంచ పగ్గాలు తన చేతిలో తీసుకుంటే మన సమస్యల పరిష్కార భాగ్యం ఆయనకు లభిస్తుంది. నిజమైన శాంతి, సుఖాలు ప్రాప్తమవుతాయి. అవి పొందడానికే మానవులు పరితపిస్తున్నారు.

థోమస్ కార్లైల్:

Thomas Carlyle జననం 4/12/1795 స్కాట్లాండ్ లోని Ecclefechan గ్రామంలో. మరణం 5/2/1881.
లండన్ లో. ప్రఖ్యాతిగాంచిన చరిత్ర కారుడు, సాహిత్య పరుడు.

థోమస్ కార్లైల్ తన ప్రఖ్యాతిగంచిన రచన “On Heroes, HeroWorship, and the Heroic in History”లో ఇలా వ్రాశాడు: “ముహమ్మద్ కుయుక్తుడు, మోసగాడు, అసత్యరూపి మరియు అతని ధర్మం కేవలం బూటకపు, బుద్ధిహీన విషయాల పుట్ట అన్న ప్రస్తుత మన వ్యూహం, మరియు ఇలాంటి వ్యూహాలను వినడం నేటి విద్యాజ్ఞాన యుగంలో మన కొరకే సిగ్గు చేటు. ఇలాంటి మూఢ, సిగ్గుచేటు విషయాలు ప్రభలకుండా పోరాడడం మన విధి. ఈ ప్రవక్త అందజేసిన సందేశం 12 వందల సంవత్సరాల నుండి రెండు వందల మిలియన్లకంటే ఎక్కువ మంది కొరకు ప్రకాశవంతంగా ఉంది. ఈ సందేశాన్ని విశ్వసించి, దాని ప్రకారం తమ జీవితాలను మలచుకొని దానిపై చనిపోయిన ప్రజలు అసంఖ్యాకులు. ఇంతటి గొప్ప వాస్తవం అబద్ధం, బూటకం అని భావించగలమా?”.

రామక్రిష్ణ రావు:

Prof. K. S. Ramakrishna Rao, Head of the Department
of Philosophy, Government College for Women, University of Mysore.

మన ఇండియా తత్వవేత్త రామక్రిష్ణారావు గారు ఇలా చెప్పారు: “అరబ్ ద్వీపంలో ముహమ్మద్ ప్రకాశమయినప్పుడు అది ఓ ఎడారి ప్రాంతం. అప్పటి ప్రపంచ దేశాల్లో నామమాత్రం గుర్తింపు లేని ప్రాంతం అది. కాని ముహమ్మద్ తన గొప్ప ఆత్మ ద్వారా క్రొత్త యుగాన్ని, నూతన జీవితాన్ని, కొత్త సంస్కృతి, సభ్యతను ఏర్పరిచారు. మరియు కొత్త రాజ్యాన్ని నిర్మించారు. అది మొరాకో నుండి ఇండియా ద్వీపకల్పం వరకు విస్తరించింది. అంతే కాదు ఆయన ఆసియా, ఆఫ్రికా మరియు యూరప్ ఖండాల్లోని జీవనశైలి, విచారణా విధానాల్లో గొప్ప మార్పు తేగలిగాడు.

S.M.జ్వీమర్:

Samuel Marinus Zwemer. జననం 12/4/1867.
Michigan. మరణం 2/4/1952. New York.

(S.M. Zweimer) ఇలా వ్రాశాడు: “నిశ్చయంగా ముహమ్మద్ ధార్మిక నాయకుల్లో అతి గొప్పవారు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన శక్తివంతుడైన సంస్కరణకర్త, అనర్గళవాగ్ధాటి, ధైర్యంగల అతిసాహసి, సువిచారం చేయు గొప్ప మేధావి అని అనడమే సమంజసం. ఈ సద్గుణాలకు విరుద్ధమైన విషయాలు ఆయనకు అంకితం చేయుట ఎంత మాత్రం తగదు, యోగ్యం కాదు. ఆయన తీసుకొచ్చిన ఈ ఖుర్ఆన్ మరియు ఆయన చరిత్ర ఇవి రెండూ ఆయన సద్గుణాలకు సాక్ష్యం.

విలియం మోయిర్:

Sir William Muir. జననం 27/4/1819. UK.
మరణం 11/7/1905. UK.

సర్ విలియమ్ యోయిర్ (Sir William Muir) ఇలా చెప్పాడు: “ముహమ్మద్ -ముస్లిముల ప్రవక్త- చిన్నప్పటి నుండే అమీన్ అన్న బిరుదు పొందారు. ఆయన ఉత్తమ నడవడిక, మంచి ప్రవర్తనను బట్టి ఆయన నగరవాసులందరూ ఏకంగా ఇచ్చిన బిరుదు ఇది. ఏదీ ఎట్లయినా, ముహమ్మదు వర్ణనాతీతమైన శిఖరానికి ఎదిగి యున్నారు. ఏ వ్యక్తి ఆయన గురించి వర్ణించగలడు?. ఆయన్ను ఎరగనివాడే ఆయన గౌరవస్థానాన్ని ఎరగడు. ఆయన గురించి ఎక్కువగా తెలిసినవాడు ఆయన గొప్ప చరిత్రను నిశితంగా పరిశీలించినవాడు. ఈ చరిత్రనే ముహమ్మదును ప్రవక్తల్లో మొదటి స్థానంలో మరియు విశ్వమేధావుల్లో ఉన్నతునిగా చేసింది.

ఇంకా ఇలా అన్నాడుః “ముహమ్మద్ తన స్పష్టమైన మాట, సులభమైన ధర్మం ద్వారా సుప్రసిద్ధులయ్యారు. మేధావుల మేధను దిగ్ర్భమలో పడవేసిన పనులు ఆయన పూర్తి చేశారు. అతి తక్కువ వ్యవధిలో అందరినీ జాగరూక పరచిన, అప్రమత్తం చేసిన, నశించిపోయిన సద్గుణాల్లో జీవం పోసిన, గౌరవ మర్యాదల ప్రతిష్ఠను చాటి చెప్పిన ఇస్లాం యొక్క ప్రవక్త ముహమ్మద్ లాంటి సంస్కరణకర్త చరిత్రలో ఎవ్వరూ మనకు కనబడరు.

లియో టోల్స్ టాయ్:

Leo Tolstoy Nikolayevich. జననం 9/9/1828
Tula Oblast, Russia. మరణం 20/11/1910
ప్రపంచపు గొప్ప నవలా రచయిత, తత్త్వవేత్త

గొప్ప నవలారచయిత, తత్వవేత్త రష్యాకు చెందిన లియో టోల్స్ టాయ్ ఇలా చెప్పాడు: “ముహమ్మద్ విఖ్యాతి, కీర్తి గౌరవానికి ఇది ఒక్క విషయం సరిపోతుంది: ఆయన అతి నీచమైన, రక్తపాతాలు సృష్టించే జాతిని, సమాజాన్ని దుర్గుణాల రాక్షసి పంజాల నుండి విడిపించారు. వారి ముందు అభివృద్ధి, పురోగతి మార్గాలు తెరిచారు. ముహమ్మద్ ధర్మశాస్త్రం కొంత కాలంలో విశ్వమంతటిపై రాజ్యమేలుతుంది. ఎందుకనగా ఆ ధర్మానికి బుద్ధిజ్ఞానాలతో మరియు మేధ వివేకాలతో పొందిక, సామరస్యం ఉంది.

ఆస్ట్రియా దేశస్తుడైన షుబ్రుక్ చెప్పాడుః ముహమ్మద్ లాంటి వ్యక్తి వైపు తనకు తాను అంకితం చేసుకోవడంలో మానవజాతి గర్వపడుతుంది. ఎందుకనగా ఆయన చదువరులు కానప్పటికీ కొద్ది శతాబ్ధాల క్రితం ఒక చట్టం తేగలిగారు. మనం ఐరోపాకు చెందిన వాళ్ళం గనక దాని శిఖరానికి చేరుకున్నామంటే మహా అదృష్టవంతులమవుతాము.

వస్సలాము అలైకు వరహ్మతుల్లాహి వబరకాతుహు

సీరత్ ముందు పాఠాలు :

ఇతరములు: