జకాత్ | హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) 

హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) (Bulugh-al-Maraam)
సంకలనం  : అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం  : మౌలానా సఫీవుర్రహ్మాన్ ముబారక్ పూరీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్ , హైదరాబాద్ –ఇండియా

[డౌన్లోడ్ PDF]

عَنِ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا: { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-بَعَثَ مُعَاذًا ‏- رضى الله عنه ‏- إِلَى اَلْيَمَنِ.‏.‏.‏ } فَذَكَرَ اَلْحَدِيثَ, وَفِيهِ: { أَنَّ اَللَّهَ قَدِ اِفْتَرَضَ عَلَيْهِمْ صَدَقَةً فِي أَمْوَالِهِمْ, تُؤْخَذُ مِنْ أَغْنِيَائِهِمْ, فَتُرَدُّ فِ ي 1‏ فُقَرَائِهِمْ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِلْبُخَارِيّ ِ 2‏ .‏


‏1 ‏- كذا في الأصلين، وهي رواية مسلم، وأشار في هامش “أ” أن في نسخة “على” وهي رواية البخاري ومسلم.‏
‏2 ‏- صحيح.‏ رواه البخاري ( 1395 )‏، ومسلم ( 19 )‏، ولفظه: أن رسول الله صلى الله عليه وسلم بعث معاذا إلى اليمن، فقال له: “إنك تأتي قوما أهل كتاب، فادعهم إلى شهادة أن لا إله إلا الله وأني رسول الله، فإن هم أطاعوا لذلك، فأعلمهم أن الله افترض عليهم صدقة في أموالهم، تؤخذ من أغنيائهم وترد على فقرائهم، فإن هم أطاعوا لذلك، فإياك وكرائن أمولهم، واتق دعوة المظلوم؛ فإنها ليس بينها وبين الله حجاب”.‏

483. హజ్రత్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు)ను యమన్ వైపునకు సాగ నంపారు. తరువాత హదీసునంతటినీ వివరించారు. అందులో ఇలా వుంది: “అల్లాహ్ తరఫున వారి సంపదలపై ‘జకాత్’ విధించబడింది. అది వారి స్థితిమంతుల నుండి వసూలు చేయబడి వారిలోని అగత్యపరులలో, పేదలలో పంచి పెట్టబడాలి.” (బుఖారీ)

సారాంశం:
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో ధనవంతుల నుండి జకాత్ ను వసూలు చేసి అధికార స్థాయిలో హక్కుదారులకు (అగత్యపరులకు) పంపిణీ చేసే వ్యవస్థ ఏర్పడిందని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతోంది. ఏ ప్రాంతంలో జకాత్ వసూలు చేయబడుతుందో ఆ ప్రాంతంలోని పేదలకు, నిరాధార జీవులకే అది పంచిపెట్టబడటం న్యాయం అన్న విషయం కూడా దీనిద్వారా అవగతమవుతున్నది. ఒకవేళ అక్కడ జకాత్ పంపిణీ అయ్యాక కూడా మిగిలి ఉంటే అప్పుడు ఇతర ప్రాంతాలలోని హక్కు దారులకు ఇవ్వవచ్చు. ‘జకాత్’ అనేది పేదల హక్కు. దాన్ని చెల్లించటం శ్రీమంతుల బాధ్యత. జకాత్ ను చెల్లించి వారు తమ విధ్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తున్నారే తప్ప ఒకరిపై ఉపకారం ఏమీ చేయటం లేదని గ్రహించాలి.

తాకట్టులో ఉన్న బంగారం మీద జకాతు చెల్లించాలా? [వీడియో]

బిస్మిల్లాహ్

[ 1నిముషం]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
జకాత్ ఆదేశాలు [పుస్తకం] ఆధారంగా ఈ వీడియో చెప్పబడింది

వెండి, బంగారం మరియు డబ్బు మీద జకాత్ [వీడియో] [25 నిముషాలు]


జకాత్ ఆదేశాలు – 1: వెండి, బంగారం, డబ్బు, వ్యాపార సామాగ్రి మరియు షేర్స్ యొక్క జకాతు [వీడియో]

బిస్మిల్లాహ్

[19:09 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
జకాత్ ఆదేశాలు [పుస్తకం] ఆధారంగా ఈ వీడియో చెప్పబడింది

జకాత్ ఆదేశాలు (أحكام الزكاة)

ఇస్లామీయ పరిభాషలో జకాత్ అంటే: అల్లాహ్ యొక్క ఆరాధన ఉద్దేశ్యంతో నిర్ణీత ధన, ధాన్యాలు ధర్మవిధిగా నిర్ణీత ప్రజలకు చెల్లించవలసిన హక్కు.

జకాత్ ఇస్లాం మూల స్తంభాల్లో మూడవది. ఏ ముస్లిం ‘నిసాబ్‘ (అంటే జకాత్ విధింపుకు అవసరమై నిర్ణీత పరిమాణాని)కు అధికారి అయ్యాడో అతనిపై జకాత్ విధి అవుతుంది. అల్లాహ్ ఆదేశం చదవండిః

నమాజు స్థాపించండి. జకాత్ ఇవ్వండి“. (బఖర 2: 43).

జకాత్ ను ధర్మపరంగా విధిగావించడంలో అనేక లాభాలు, మేల్లున్నాయి. వాటిలో కొన్ని ఇవి:

1- ఆత్మశుద్ధి కలుగుతుంది. మనస్సులో నుండి దురాశ, పిసినారి తత్వాలు దూరమవుతాయి.

2- ముస్లిం భక్తుడు దాతృత్వం లాంటి సద్గుణ సంపన్నుడవుతాడు.

3- ధనవంతుని మరియు పేదవాని మధ్య ప్రేమ సంబంధాలు బల పడతాయి. ఎలా అనగా ఉపకారుని పట్ల ఆత్మ ఆకర్షితమవుతుంది మరియు ప్రేమిస్తుంది.

4- బీద ముస్లిముల అవసరాలు తీరుతాయి. వారు ఒకరి ముందు తమ చెయ్యి చాపకుండా ఉంటారు.

5- జకాత్ చెల్లించే మానవుడు పాపాల నుండి పరిశుద్ధుడు అవుతాడు. అంటే జకాత్ వల్ల అతని స్థానం ఉన్నతమై, అతని పాపాలు మన్నించ- బడతాయి.

ఏ వస్తువుల్లో జకాత్ విధిగా ఉంది

బంగారం, వెండి, వ్యాపార సామాగ్రి, పెంపుడు జంతువులు మరియు పంటలు, ఫలాలు మరియు లోహాలు, ధాతువులు.

బంగారం, వెండి జకాత్

బంగారం, వెండి ఏ రూపంలో ఉన్నా వాటిపై జకాత్ విధిగా ఉంది. అది ‘నిసాబ్’ కు అధికారి అయిన వ్యక్తిపై మాత్రమే.

బంగారం నిసాబ్: 20 దీనారులు. ఈ నాటి లెక్క ప్రకారం 85 గ్రాములు.

వెండి నిసాబ్: 200 దిర్హములు. ఈ నాటి లెక్క ప్రకారం 595 గ్రాములు.

పై లెక్క ప్రకారం ఏ వ్యక్తి నిసాబ్ కు అధికారి అయ్యాడో, అది అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయిందో, అతను అందులో నుండి (2.5%) రెండున్నర శాతం జకాతుగా చెల్లించాలి.

వాటి జకాత్, డబ్బు రూపంలో ఇవ్వదలుచు- కున్న వ్యక్తి, అతను వాటికి అధికారి అయినప్పటి నుండి ఒక సంవత్సరం పూర్తయినప్పుడు మార్కెట్లో ఒక గ్రాము బంగారం లేదా వెండి యొక్క ధర ఎంత ఉందో తెలుసుకొని, తన వద్ద ఉన్న మొత్తం బంగారం లేదా వెండి మూల్యం ఎంతవుతుందో లెక్కేసి అందులో నుండి రెండున్నర శాతం డబ్బు జకాతుగా ఇవ్వాలి. (మేము డబ్బు అని వ్రాసాము అయితే ఎవరు ఏ దేశంలో ఉన్నారో అక్కడ వారి కరెన్సీ పేరేముందో దాన్ని బట్టి వారు లెక్కించుకోవాలి).

దీని ఉదాహరణ: ఒక వ్యక్తి వద్ద 100 గ్రాముల బంగారం ఉంది అనుకుందాం. అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయింది కూడాను. అందుకు అతనిపై జకాత్ విధి అయింది. ఇక అతను రెండున్నర గ్రాముల బంగారం జకాతుగా ఇవ్వాలి. ఒకవేళ అతను దాని జకాత్ డబ్బు రూపంలో ఇవ్వదలుచుకుంటే, 100 గ్రాముల బంగారం ధర తెలుసుకోవాలి. (దాని ధర ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం ఒక లక్ష అని తెలిసిందనుకుందాం) అతను అందులో రెండున్నర శాతం జకాత్ ఇవ్వాలి. (అంటే (2,500) రెండు వేల అయిదు వందల రూపాలు). ఇదే విధంగా వెండి జకాతు ఇవ్వాలి.

ఇలాగే కరెన్సీలో కూడా జకాతు విధి అవుతుంది, నిసాబ్ కు అధికారి అయి, దానిపై సంవత్సరం గడచిన వెంటనే. ఎవరి వద్ద 595 గ్రాముల వెండి ధరకు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ కరెన్సీ ఉందో అతనిపై జకాత్ విధిగా ఉంది. అతను తన వద్ద ఉన్న మొత్తం డబ్బులో నుండి రెండున్నర శాతం జకాత్ గా ఇవ్వాలి.

ఏ ముస్లిం వద్ద కరెన్సీ (డబ్బు) ఉండి, సంవత్సరం దాటిందో అతను 595 గ్రాముల వెండి ధర తెలుసుకోవాలి, అతని వద్ద ఉన్న డబ్బు 595 గ్రాములవెండి ధరకు చేరుకుంటే జకాత్ ఇవ్వాలి, ఒకవేళ అతని వద్ద ఉన్న డబ్బు దాని ధరకు తక్కువ ఉంటే అతనిపై జకాత్ విధిగా లేదు.

ఉదాహరణ: ఒక వ్యక్తి వద్ద భారత కరెన్సీ ప్రకారం రూ. 80 వేలున్నాయనుకుందాం. అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయ్యింది కూడా. ప్రస్తుతం మార్కెట్లో 595 గ్రాముల వెండికి ఎంత ధర ఉందో తెలుసుకోవాలి. దాని ధర ఎనభై ఐదు వేలు అని తెలిస్తే అతనిపై జకాత్ విధిగా లేదు. ఎందుకనగా అతను నిసాబ్ కు అధికారి కాలేదు. నిసాబ్ కు అధికారి కావడానికి అతని వద్ద ఎనభై ఐదు వేల రూపాలుండాలి. ఏ దేశంలోనైనా వారి కరెన్సీ వెల వెండితో పోల్చబడితే వారు తమ కరెన్సీ జకాత్ వెండి లెక్కతో ఇవ్వాలి. అంటే 595 గ్రాముల వెండికి విలువగల డబ్బు ఉన్నప్పుడే అతనిపై జకాత్ విధి అగును.

వ్యాపార సామాగ్రి యొక్క జకాత్

సంపద కలిగి, దానిని వ్యాపారంలో ఉపయోగించే ముస్లిం వర్తకునిపై ప్రతి సంవత్సరం జకాత్ విధిగా ఉంది. ఇది అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహానికి కృతజ్ఞత మరియు అతనిపై ఉన్న తన పేదసోదరుల హక్కు అని తను భావించాలి. లాభోద్దేశంతో క్రయవిక్రయించే ప్రతీ వస్తువు వ్యాపార సామాగ్రి అనబడుతుంది; భూములు, ఇండ్లు, స్థిరాస్థులు (real estate), పశువులు, తినుత్రాగు పదార్థాలు మరియు వాహనాలు వగైరా. అవి నిసాబ్ కు చేరి ఉండాలి. అంటే పైన తెలిపిన 85 గ్రాముల బంగారం ధరకు లేదా 595 గ్రాముల వెండి ధరకు సమానంగా ఉండాలి. అందులో రెండున్నర శాతం జకాతుగా ఇవ్వాలి.

ఉదాహరణః ఒక వ్యక్తి వద్ద ఒక లక్ష రూపాయల విలువ గల వ్యాపార సామాగ్రి ఉంటే, అందులో నుండి రూ. 2500/- జకాత్ చెల్లించాలి. వ్యాపారస్తులు ప్రతి సంవత్సరం ఆరంభంలో తమ వద్ద ఉన్న మొత్తం సరుకును లెక్కించుకొని జకాత్ చెల్లించాలి. ఎవరైనా వ్యాపారి సంవత్సరం పూర్తి అయ్యేకి పది రోజుల ముందు ఏదైనా సరుకు కొనుగోళు జేస్తే దాని జకాత్ కూడా ముందు నుండే ఉన్న సరుకుతో కలపివ్వాలి. వ్యాపారం ప్రారంభించిన మొదటి రోజు సంవత్సరం యొక్క ఆరంభమగును. ఇలా ప్రతి సంవత్సరం జకాత్ చెల్లించాలి.

కంచెలోకి పంపకుండా పశువుశాలలో, ఇంటి వద్ద ఉంచి మేత ఇవ్వబడే పశువులు వ్యాపారం కోసం పెంచితే వాటి మీద జకాత్ విధి అవుతుంది. అవి నిసాబ్ కు చేరుకున్నా, చేరుకోకపోయినా వాణిజ్య సరుకులాగా దాని వెల నిసాబ్ కు చేరుకుంటే అందులో నుండి జకాత్ చెల్లించాలి.

షేర్స్ యొక్క జకాత్

రియల్ ఎస్టేట్ (Real estate) తదితర విషయాల్లో షేర్స్ ఈ రోజుల్లో ఓ పరిపాటి విషయం అయింది. (ధర్మసమ్మతమైన షేర్స్ కొనుట, అమ్ముట యోగ్యమే. కాని ధర్మసమ్మతం కాని వాటిలో ముస్లిం పాల్గొనుట ఎంత మాత్రం యోగ్యం కాదు). అందులో డిపాజిట్ చేసి ఉన్న డబ్బు కొద్ది సంవత్సరాల్లో పెరగవచ్చు, తరగనూవచ్చు. షేర్స్ లో ఉన్న డబ్బుపై జకాత్ ఉంది. ఎందుకనగా అది కూడా వాణిజ్య సరుకు లాంటిదే. షేర్స్ లో పాల్గొన్న ప్రతి ముస్లిం ప్రతి సంవత్సరం తన షేర్స్ ధర చూస్తూ ఉండాలి. జకాత్ చెల్లిస్తూ ఉండాలి.


జకాత్ ఆదేశాలు [పుస్తకం & వీడియో పాఠాలు]

బిస్మిల్లాహ్

జకాత్ (విధి దానం) ఆదేశాలు
[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [12 పేజీలు]

రచయిత : ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

జకాత్ ఆదేశాలు (Fiqh of Zakat) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1ojW-FuiGAt8MtqQ5Cssyt

విషయ సూచిక

  • జకాత్ అంటే ఏమిటి?
  • జకాత్ వల్ల కలిగే లాభాలు,మేళ్లు 
  • జకాత్ ఏ  వస్తువుల పై  విధిగా ఉంది?
  • బంగారం, వెండి జకాత్ 
  • వ్యాపార సామాగ్రి యొక్క జకాత్ 
  • షేర్ల యొక్క జకాత్ 
  • భూ సంబంధ ఉత్పత్తులపై జకాత్ 
  • పశువుల జకాత్ 
  • ఒంటెల జకాత్ 
  • ఆవుల జకాత్ 
  • మేకల జకాత్ 
  • జకాత్ హక్కుదారులు 

[పూర్తి పుస్తకం క్రింద చదవండి]

(ఇస్లామీయ పరిభాషలో జకాత్ అంటే: అల్లాహ్ యొక్క ఆరాధన ఉద్దేశ్యంతో, నిసాబ్ స్థాయికి చేరిన వ్యక్తి తన నిర్ణీత ధన, ధాన్యాలలో అర్హులైన ప్రజలకు చెల్లించవలసిన బాధ్యత).

జకాత్ ఇస్లాం మూల స్తంభాల్లో మూడవది. ఏ ముస్లిం అయితే జకాత్ యొక్క “నిసాబ్” (చెల్లించేవారి పరిధి)లోకి వస్తాడో అతనిపై జకాత్ విధిగా అవుతుంది. అల్లాహ్ ఆదేశం చదవండిః

నమాజు స్థాపించండి. జకాత్ ఇవ్వండి. (బఖర 2: 43).

జకాత్ ను ధర్మపరంగా విధిగావించడంలో అనేక లాభాలు, మేల్లున్నాయి. వాటిలో కొన్ని ఇవి:

  • 1- ఆత్మశుద్ధి కలుగుతుంది. మనస్సులో నుండి దురాశ, పిసినారి తత్వాలు దూరమవుతాయి.
  • 2- ముస్లిం భక్తుడు దాతృత్వం లాంటి సద్గుణ సంపన్నుడవుతాడు.
  • 3- ధనవంతుని మరియు పేదవాని మధ్య ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఎలా అనగా ఉపకారుని పట్ల ఆత్మ ఆకర్షితమవుతుంది మరియు ప్రేమిస్తుంది.
  • 4- బీద ముస్లిముల అవసరాలు తీరుతాయి. వారు ఒకరి ముందు తమ చెయ్యి చాపకుండా ఉంటారు.
  • 5-  జకాత్ చెల్లించే మానవుడు పాపాల నుండి పరిశుద్ధుడు అవుతాడు. అంటే జకాత్ వల్ల అతని స్థానం ఉన్నతమై, అతని పాపాలు మన్నించ- బడతాయి.

ఏ వస్తువుల్లో జకాత్ విధిగా ఉంది

బంగారం, వెండి, వ్యాపార సామాగ్రి, పశుసంపద, పండిన పంటలు, ఫలాలు మరియు నిధినిక్షేపాలు.

బంగారం, వెండి జకాత్

బంగారం, వెండి ఏ రూపంలో ఉన్నా వాటిపై జకాత్ విధిగా ఉంది. నిసాబ్ స్థాయికి చేరిన వ్యక్తి పై మాత్రమే.

బంగారం “నిసాబ్”: 20 దీనారులు. ఈ నాటి లెక్క ప్రకారం 85 గ్రాములు.

వెండి “నిసాబ్”: 200 దిర్హములు. ఈ నాటి లెక్క ప్రకారం 595 గ్రాములు.

పై లెక్క ప్రకారం ఏ వ్యక్తి “నిసాబ్” స్థాయికి చేరుకున్నాడో, అది అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయిందో, అతను అందులో నుండి (2.5%) రెండున్నర శాతం జకాతుగా చెల్లించాలి.

వాటి జకాత్, డబ్బు రూపంలో ఇవ్వదలుచు- కున్న వ్యక్తి, అవి అతని ఆధినంలో వచ్చినప్పటి నుండి ఒక సంవత్సరం పూర్తయినప్పుడు మార్కెట్లో ఒక గ్రాము బంగారం లేదా వెండి యొక్క ధర ఎంత ఉందో తెలుసుకొని, తన వద్ద ఉన్న మొత్తం బంగారం లేదా వెండి మూల్యం ఎంతవుతుందో లెక్కగట్టి, అందులో నుండి రెండున్నర శాతం డబ్బు జకాతుగా ఇవ్వాలి. (మేము డబ్బు అని వ్రాసాము అయితే ఎవరు ఏ దేశంలో ఉన్నారో అక్కడ వారి కరెన్సీ పేరేముందో దాన్ని బట్టి వారు లెక్కించుకోవాలి).

దీని ఉదాహరణ: ఒక వ్యక్తి వద్ద 100 గ్రాముల బంగారం ఉంది అనుకుందాం. అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయింది కూడాను. అందుకు అతనిపై జకాత్ విధి అయింది. ఇక అతను రెండున్నర గ్రాముల బంగారం జకాతుగా ఇవ్వాలి. ఒకవేళ అతను దాని జకాత్ డబ్బు రూపంలో ఇవ్వదలుచుకుంటే, 100 గ్రాముల బంగారం ధర తెలుసుకోవాలి. (దాని ధర ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం ఒక లక్ష అని తెలిసిందనుకుందాం) అతను అందులో రెండున్నర శాతం జకాత్ ఇవ్వాలి. (అంటే (2,500) రెండు వేల అయిదు వందల రూపాలు). ఇదే విధంగా వెండి జకాతు ఇవ్వాలి.

ఇలాగే కరెన్సీలో కూడా “నిసాబ్” స్థాయికి చేరిన వ్యక్తిపై, అవి అతని వద్ద ఉండి సంవత్సరం గడిస్తే అతనిపై జకాతు విధి అవుతుంది. ఎవరి వద్ద 595 గ్రాముల వెండి ధరకు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ కరెన్సీ ఉందో అతనిపై జకాత్ విధిగా ఉంది. అతను తన వద్ద ఉన్న మొత్తం డబ్బులో నుండి రెండున్నర శాతం జకాత్ గా ఇవ్వాలి.

ఏ ముస్లిం వద్ద డబ్బు ఉండి, సంవత్సరం దాటిందో అతను 595 గ్రాముల వెండి ధర తెలుసుకోవాలి, అతని వద్ద ఉన్న డబ్బు 595 గ్రాముల వెండి ధరకు చేరుకుంటే జకాత్ ఇవ్వాలి. ఒకవేళ అతని వద్ద ఉన్న డబ్బు దాని ధరకు తక్కువ ఉంటే అతనిపై జకాత్ విధిగా లేదు.

ఉదాహరణః ఒక వ్యక్తి వద్ద భారత కరెన్సీ ప్రకారం రూ. 80 వేలున్నాయనుకుందాం. అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయ్యింది కూడా. ప్రస్తుతం మార్కెట్లో 595 గ్రాముల వెండికి ఎంత ధర ఉందో తెలుసుకోవాలి. దాని ధర ఎనభై ఐదు వేలు అని తెలిస్తే అతనిపై జకాత్ విధిగా లేదు. ఎందుకనగా అతను “నిసాబ్” స్థాయికి చేరుకోలేదు. “నిసాబ్” స్థాయికి  చేరుకోడానికి అతని వద్ద ఎనభై ఐదు వేల రూపాయిలుండాలి.

వ్యాపార సామాగ్రి యొక్క జకాత్

సంపద కలిగి, దానిని వ్యాపారంలో ఉపయో గించే ముస్లిం వర్తకునిపై ప్రతి సంవత్సరం జకాత్ విధిగా ఉంది. ఇది అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహానికి కృతజ్ఞత మరియు అతనిపై ఉన్న తన పేదసోదరుల హక్కు అని తను భావించాలి. లాభోద్దేశంతో క్రయవిక్రయించే ప్రతీ వస్తువు వ్యాపార సామాగ్రి అనబడుతుంది; భూములు, ఇండ్లు, స్థిరాస్థులు (real estate), పశువులు, తినుత్రాగు పదార్థాలు మరియు వాహనాలు వగైరా. అవి “నిసాబ్” స్థాయికి చేరి ఉండాలి. అంటే పైన తెలిపిన 595 గ్రాముల వెండి ధరకు సమానంగా లేదా అంతకుమించి ఉండాలి. ఆ మొత్తంలో నుండి 2.5% (రెండున్నర శాతం) జకాతుగా ఇవ్వాలి.

ఉదాహరణ: ఒక వ్యక్తి వద్ద ఒక లక్ష రూపాయల విలువ గల వ్యాపార సామాగ్రి ఉంటే, అందులో నుండి రూ. 2500/- జకాత్ చెల్లించాలి. వ్యాపారస్తులు ప్రతి సంవత్సరపు ఆరంభంలో తమ వద్ద ఉన్న మొత్తం సరుకును లెక్కించుకొని జకాత్ చెల్లించాలి. ఎవరైనా వ్యాపారి సంవత్సరం పూర్తి అగుటకు పది రోజుల ముందు ఏదైనా సరుకు కొనుగోళు జేస్తే దాని జకాత్ కూడా ముందు నుండే ఉన్న సరుకుతో కలపివ్వాలి. వ్యాపారం ప్రారంభించిన మొదటి రోజు సంవత్సరం యొక్క ఆరంభమగును. ఇలా ప్రతి సంవత్సరం జకాత్ చెల్లించాలి.

పశుశాలలో లేదా ఇంటి వద్ద ఉంచి మేత ఇవ్వబడే పశువులు వ్యాపారం కోసం పెంచితే వాటి మీద జకాత్ విధి అవుతుంది. అవి పశువుల “నిసాబ్” స్థాయికి చేరుకున్నా, చేరుకోకపోయినా వాణిజ్య సరుకులాగా దాని వెల “నిసాబ్” స్థాయికి చేరుకుంటే అందులో నుండి జకాత్ చెల్లించాలి.

షేర్స్ యొక్క జకాత్

రియల్ ఎస్టేట్ (Real estate) తదితర రంగాల్లో షేర్స్ ఈ రోజుల్లో సర్వసాధనం అయ్యింది. (ధర్మసమ్మతమైన షేర్స్ కొనుట, అమ్ముట ఆమోదయోగ్యమే. కాని ధర్మసమ్మతం కాని వాటిలో ముస్లిం పాల్గొనుట ఎంత మాత్రం యోగ్యం కాదు). అందులో డిపాజిట్ చేసి ఉన్న డబ్బు కొద్ది సంవత్సరాల్లో పెరగవచ్చు లేదా తరగనూవచ్చు. షేర్స్ లో ఉన్న డబ్బుపై జకాత్ ఉంది. ఎందుకనగా అది కూడా వాణిజ్య సరుకు లాంటిదే. షేర్స్ లో పాల్గొన్న ప్రతి ముస్లిం ప్రతి సంవత్సరం తన షేర్స్ ధర చూస్తూ ఉండాలి. ‘నిసాబ్” స్థాయికి చేరి ఉంటే జకాత్ చెల్లిస్తూ ఉండాలి.

భూ సంబంధ ఉత్పత్తులపై జకాత్

నిల్వ మరియు తూకము చేయుగల ఖర్జూరం, ఎండిన ద్రాక్ష, గోధుమ, జొన్న, బియ్యం లాంటి ఆహారధాన్యాల, ఫలాలపై జకాత్ విధిగా ఉంది. కాని నిల్వ చేయలేని తాజా పండ్లు, కూరగాయలపై జకాత్ విధిగా లేదు. పై వాటిలో జకాత్ విధి కావడానికి అవి “నిసాబ్” స్థాయికి చేరి ఉండాలి. వాటి నిసాబ్ 612 కిలోలు. వాటిపై ఒక సంవత్సరం గడవాలన్న నిబంధన లేదు. కోతకు వచ్చినప్పుడు వాటిలో నుండి ఈ క్రింది పద్ధతిలో జకాత్ చెల్లించాలిః

 ప్రకృతి పరమైన వర్షాలు, నదుల మూలంగా పండిన పంటల్లో పదవ వంతు జకాత్ చెల్లించాలి. కృత్రిమ కాలువలు, బావుల మూలంగా పండిన పంటల్లో ఇరవయ్యో వంతు జకాత్ చెల్లించాలి.

ఉదా: ఒక వ్యక్తి తన భూమిలో గోధుమ విత్తనం వేశాడు. అతనికి 800 కిలోల పంట పండింది. ఇప్పుడు అతనిపై జకాత్ విధిగా ఉంది. ఎందుకనగా దీని నిసాబ్ 612 కిలోలు, అయితే దీనికంటే ఎక్కువగా పండింది. ఇక ఆ పంట వర్షంతో పండితే అందులో పదో వంతు అంటే 80 కిలోల జకాత్ చెల్లించాలి. ఒకవేళ కృత్రిమ కాలువల, బావుల ఆధారంగా పండితే అందులో ఇరవయ్యో వంతు అంటే 40 కిలోలు జకాత్ చెల్లించాలి.

పశువుల జకాత్

ఇక్కడ పశువులు అంటే: ఆవు, మేక, గొర్రె మరియు ఒంటె లని భావం. వీటి జకాతు కొరకు ఈ క్రింది నిబంధనలు వర్తిస్తాయిః

  • 1- “నిసాబ్” స్థాయికి చేరి ఉండాలి. ఒంటెల నిసాబ్ 5. మేకలు, గొర్రెల నిసాబ్ 40. ఆవుల నిసాబ్ 30. వీటికన్నా తక్కువ ఉంటే జకాత్ లేదు.
  • 2- వాటి యజమాని వద్ద అవి సంవత్సరమెల్లా ఉండాలి.
  • 3- అవి ‘సాయిమా’ అయి ఉండాలి. అనగా సంవత్సరంలో అధిక శాతం పచ్చిక మైదానాల్లో మేసేవి అయి ఉండాలి. శాలలో ఒక చోట ఉండి తమ ఆహారం తినునవి, లేదా వాటి యజమాని వాటి కొరకు మేత ఖరీదు చేసి, లేదా నిల్వ చేసి ఉంచేవాడైతే వాటిలో జకాత్ లేదు.
  • 4- రవాణ సాధనంగా లేదా వ్యవసాయ పరంగా పని చేయునవై ఉండకూడదు.

ఒంటెల జకాత్

ఒంటెల జకాత్ యొక్క నిసాబ్ 5 ఒంటెలు. ఏ ముస్లిం వ్యక్తి “నిసాబ్“ స్థాయికి చేరాడో, అవి అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తయిందో అతను ఈ విధంగా జకాత్ చెల్లించాలి.

  •  5 నుండి 9 వరకూ ఉంటే 1 మేక.
  • 10 నుండి 14 వరకూ ఉంటే రెండు మేకలు.
  • 15 నుండి 19 వరకూ ఉంటే మూడు మేకలు.
  • 20 నుండి 24 వరకూ ఉంటే నాలుగు మేకలు.
  • 25 నుండి 35 వరకూ ఉంటే ఏడాది వయసున్న ఒక ఆడ ఒంటె. అది గనక లేకుంటే రెండేళ్ళ ఒక మగ ఒంటె.
  • 36 నుండి 45 వరకూ ఉంటే రెండేళ్ళ ఒక ఆడ ఒంటె.
  • 46 నుండి 60 వరకూ ఉంటే మూడేళ్ళ ఒక ఆడ ఒంటె.
  • 61 నుండి 75 వరకూ ఉంటే నాలుగేళ్ళ ఒక ఆడ ఒంటె.
  • 76 నుండి 90 వరకుంటే రెండేళ్ళ రెండు ఆడ ఒంటెలు.
  • 91 నుండి 120 వరకుంటే మూడెళ్ళ రెండు ఆడ ఒంటెలు.
  • 120 ఒంటెలకు మించిపోతే ప్రతి నలభై ఒంటెలపై రెండేళ్ళ ఒక ఆడ ఒంటె. ప్రతి 50 ఒంటెలపై మూడేళ్ళ ఒక ఆడ ఒంటె.

ఇదే లెక్క క్రింది టేబల్ ద్వారా వివరించబడిందిః

సంఖ్య  జకాత్
నుండివరకు
591 మేక
10142 మేకలు
15193 మేకలు
20244 మేకలు
2535ఏడాది ఆడ ఒంటె. అది లేకుంటే 2 ఏళ్ళ మగ ఒంటె
36452 ఏళ్ళ 1 ఆడ ఒంటె
46603 ఏళ్ళ 1 ఆడ ఒంటె
61754 ఏళ్ళ 1 ఆడ ఒంటె
76902 ఏళ్ళ 2 ఆడ ఒంటెలు
911203 ఏళ్ళ 2 ఆడ ఒంటెలు

ఆవుల జకాత్

(ఆవులు, ఎద్దులు ఈ రెండింటి లెక్క ఒకటే. 1 నుండి 29 వరకుంటే జకాత్ లేదు). ఏ వ్యక్తి ఆధీనంలో 30 నుండి 39 వరకూ ఉన్నాయో (వాటిపై సంవత్సరం గడిచిందో) అందులో ఏడాది వయస్సుగల ఒక ఆడ లేదా మగ దూడను జకాత్ గా ఇవ్వాలి.

  • 40 నుండి 59 వరకూ ఉంటే రెండేళ్ళ దూడ.
  • 60 నుండి 69 వరకూ ఉంటే ఏడాది వయస్సు గల రెండు దూడలు.
  • 70 నుండి 79 వరకూ ఉంటే ఏడాది వయసుగల 1 దూడ, రెండేళ్ళ వయస్సుగల మరొక దూడ.
  • ఆ తరువాత వాటి సంఖ్య ఎంత పెరిగినా ప్రతి 30లో ఏడాది వయస్సుగల ఒక దూడ, ప్రతి 40లో రెండేళ్ళ వయస్సుగల ఒక దూడ జకాత్ గా ఇవ్వాలి.

దీనినే క్రింది టేబల్ ద్వారా తెలుసుకొండి:

సంఖ్య  జకాత్
నుండివరకు
3039ఒక ఆడ లేదా మగ దూడ
4059రెండేళ్ళ దూడ
6069ఏడాది వయస్సు గల రెండు దూడలు
7079ఏడాది దూడ ఒకటి, రెండేళ్ళ దూడ మరొకటి

మేకల జకాత్

(మేకలు, గొర్రెలు, పొట్టేలు అన్నిటి నిసాబ్ ఒకటే. అవి 1 నుండి 39  వరకుంటే జకాత్ విధిగా లేదు). ఏ వ్యక్తి  ఆధీనంలో 40 నుండి 120 వరకు మేకలున్నాయో అతను అందులో నుండి ఒక మేకను జకాత్ గా ఇవ్వాలి.

  • 121 – 200 వరకూ ఉంటే రెండు ఆడ మేకలు.
  • 201 – 399 వరకూ ఉంటే మూడు ఆడ మేకలు.
  • 400 – 499 వరకూ ఉంటే నాలుగు ఆడ మేకలు.
  • 500 – 599 వరకూ ఉంటే ఐదు ఆడ మేకలు.
  • ఆ తర్వాత వాటి సంఖ్య ఎంత పెరిగినా ప్రతి 100లో ఒక ఆడ మేకను జకాత్ గా ఇవ్వాలి.
సంఖ్య  జకాత్
నుండివరకు
401201 ఆడ మేక
1212002 ఆడ మేకలు
2013993 ఆడ మేకలు
4004994 ఆడ మేకలు
5005995 ఆడ మేకలు

జకాత్ హక్కుదారులు

జకాత్ హక్కుదారులెవరనేది స్వయంగా అల్లాహ్ ఇలా తెలిపాడు:

ఈ జకాత్ నిధులు అసలు కేవలం నిరుపేదలకు, అక్కరలుతీరనివారికి, జకాత్ వ్యవహారాలకై నియుక్తులైన వారికీ, ఇంకా ఎవరి హృదయాలను గెలుచుకోవటం అవసరమో వారికీ, ఇంకా బానిసల విముక్తికీ, ఋణగ్రస్తుల సహాయానికీ, అల్లాహ్ మార్గంలోనూ, బాటసారులకూ వినియోగించటం కొరకు, ఇది అల్లాహ్ తరఫు నుండి నిర్ణయించబడిన ఒక విధి. అల్లాహ్ అన్నీ ఎరిగినవాడూ వివేకవంతుడూ. (తౌబా 9: 60).

పై ఆయతులో అల్లాహ్ ఎనిమిది రకాలు తెలిపాడు. వారిలో ప్రతి ఒక్కడు జకాత్ తీసుకునే అర్హతగలవాడు. ఇస్లాం ధర్మంలో జకాత్ సమాజములోని అర్హులకే ఇవ్వబడుతుంది. ఇతర ధర్మంలో ఉన్నట్లు కేవలం పండితులకివ్వబడదు. జకాత్ హక్కుదారులు వీరు:

1- నిరుపేద (ఫఖీర్) అంటే తనకు అవసరమయ్యే ఖర్చులో సగముకన్నా తక్కువ సంపాదించేవాడు.

2- అక్కరతీరనివాడు (మిస్కీన్) అంటే తనకు అవసరమయ్యే ఖర్చులో సగముకన్నా ఎక్కువ సంపాదించేవాడు, కానీ అది అతనికి సరిపడదు. అందుకు అతనికి సరిపడునంత కొన్ని నెలలు లేదా ఒక సంవత్సరం వరకు జకాత్ సొమ్ము ఇవ్వవచ్చును.

3- జకాత్ వసూలు చేసే ఉద్యోగి అంటే జకాత్ వసూలు చేయడానికి ముస్లిం అధికారి తరఫున నియమింపబడిన ఉద్యోగులు. వారు ధనికులై- నప్పటికీ, వారి పనికి తగ్గట్టు జీతంగా వారికి జకాత్ నుండి ఇవ్వవచ్చును.

4- హృదయాలు గెలుచుకొనుటకు అంటే అవిశ్వాసుల్లో తమ వంశం, గోత్రంలో నాయకులుగా ఉన్నవారు ఇస్లాంలో ప్రవేశించే ఆశ ఉన్నచో వారికి, లేదా వారి కీడు ముస్లింలకు కలగకుండా జకాత్ సొమ్ము ఖర్చు చేయవచ్చును. అలాగే కొత్తగా ఇస్లాం స్వీకరించినవారిలో వారి అవసరార్థం, వారు స్థిరంగా ఇస్లాంపై ఉండుటకు జకాత్ ధనం ఖర్చు చేయవచ్చును.

5- బానిసలను స్వతంత్రులుగా చెయ్యటానికి మరియు శత్రవుల నుంచి ముస్లిం ఖైదీలను విడిపించుటకు జకాత్ సొమ్ము ఖర్చు పెట్టవచ్చును.

6- ఋణగ్రస్తులు అంటే అప్పులపాలైనవారు. ఇలాంటి వారికి జకాత్ నుండి ఖర్చు చేయవచ్చును. కాని క్రింది షరతులు వారిలో ఉండాలి:

  • A: ముస్లిం అయి యుండాలి.
  • B: స్వయంగా చెల్లించగల ధనికుడు కాకూడదు.
  • C: ఆ అప్పు ఏ పాప కార్యానికో చేసి ఉండ కూడదు.
  • D: అది ఆ సమయంలోనే చెల్లించుట తప్పనిసరి అయి యుండాలి.

7- అల్లాహ్ మార్గంలో అంటే జీతం తీసుకోకుండా పుణ్యాపేక్షతో ధర్మయుద్ధం చేయు వీరులు, వారి స్వంత ఖర్చుల కొరకు, లేదా ఆయుధాలకు జకాత్ డబ్బు ఇవ్వచ్చును. జిహాదులో ధర్మవిద్య అభ్యసించడం కూడా వస్తుంది. ఎవరైనా విద్యభ్యాసనలో నిమగ్నులైనట్లయితే, అతని విద్యకు సరిపడు ఖర్చులు జకాత్ నుండి ఇవ్వవచ్చును.

8- బాటసారి అంటే ప్రయాణికుడు. స్వస్థలంలో ఎంత ధనికుడైనా సరే ప్రయాణంలో ఏదైనా ఆర్థిక ఇబ్బందులకు గురయితే అతను తన గ్రామం చేరుకొనుటకు సరిపడు ఖర్చులు జకాత్ నుండి ఇవ్వవచ్చును.

మస్జిదుల నిర్మణాలకు, దారులు సరి చేయడానికి జకాత్ సొమ్ము ఉపయోగించరాదు.

నోట్స్:

1-  సముద్రం నుండి లభించే ముత్యాలు, పగడాలు మరియు చేపల్లో జకాత్ లేదు. వాణిజ్యసరుకుగా ఉన్నప్పుడు పైన తెలిపిన ప్రకారంగా జకాత్ చెల్లించాల్సి ఉంటుంది.

2- అద్దెకివ్వబడిన బిల్డింగులు, ఫ్యాక్టరీల పై జకాత్ లేదు. కాని వాటి నుండి పొందుతున్న పైకం “నిసాబ్“ స్థాయికి చేరుకొని, సంవత్సరం గడిస్తే అందులో జకాత్ విధిగా ఉంది.

ఇతర లింకులు: