నరకం, నరకవాసులు, వారికి ఇవ్వబడే శిక్షలు [పార్ట్ 2] [మరణానంతర జీవితం – పార్ట్ 56] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

నరకం, నరకవాసులు, వారికి ఇవ్వబడే శిక్షలు [పార్ట్ 2]
[మరణానంతర జీవితం – పార్ట్ 56] [23 నిముషాలు]
https://www.youtube.com/watch?v=EB7-tLfxGug
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. హామిదన్ వముసల్లియన్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

నరకం, నరకవాసులు, వారికి ఇవ్వబడే శిక్షల గురించి మనం తెలుసుకుంటున్నాము. నరకంలో ఎందరో కాపలాదారులు ఉంటారు. వారందరి నాయకుడైన కాపలాదారి, వారందరికీ నాయకుడు అతని పేరు మాలిక్. ఖురాన్ లో ఆయన ప్రస్తావన వచ్చి ఉంది. నరకవాసులు ఆయన్ని పిలుస్తూ, అల్లాహ్ తో చెప్పండి మమ్మల్ని ఈ నరకం నుండి బయటికి తీయాలి అని కోరుతారు. అదే విషయాన్ని అల్లాహ్ తాలా ఇలా ప్రస్తావించాడు.

وَنَادَوْا يَا مَالِكُ لِيَقْضِ عَلَيْنَا رَبُّكَ ۖ قَالَ إِنَّكُم مَّاكِثُونَ
(వనాదవ్ యా మాలికు లియఖ్ది అలైనా రబ్బుక్, ఖాల ఇన్నకుం మాకిసూన్)
(వారు అరుస్తూ ఉంటారు) “ఓ మాలిక్, నీ ప్రభువు మా పని సరిచేయాలని (మాకు మరణం ప్రసాదించాలని) వేడుకో.” దానికి అతను, “మీరు ఇక్కడే కలకాలం ఉండవలసిందే” అని జవాబిస్తాడు.

వారు అరుస్తూ ఉంటారు, “ఓ మాలిక్, మేము ఈ నరకంలో పడే శిక్షలు భరించలేనివి. మేము ఇక్కడనే నశించిపోవాలని నీ ప్రభువును కోరుకో.” అప్పుడు అతను ఏమంటాడు? “ఇలా మీ కోరికలు పూర్తి కావు. మీరు ఇక్కడే పడి ఉంటారు.” నరక కాపలాదారుల ఈ నాయకుడు చూడటానికి ఎంతో భయంకరంగా మరియు అతడు పుట్టినప్పటి నుండి ఒక్కసారి కూడా నవ్వలేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు.

ఆ హదీసు సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో ఉల్లేఖించబడినది. సముర బిన్ జుందుబ్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించిన ఆ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చూసిన స్వప్నం గురించి తెలియజేశారు. మరియు ప్రవక్తలకు చూపబడే కలలు, స్వప్నలు వాస్తవము, నిజము అన్న విషయం మనకు తెలిసినదే. ప్రవక్త చెప్పారు, నేను ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను ఆ నరకంలో. అక్కడ ఒక వ్యక్తిని మహా అసహ్యకరమైన ఆకారంలో చూశాను. మీలో ఎవరైనా అసహ్యకరమైన ఆకారం అంటే ఎంత అసహ్యకరమైన ఆకారం మీ మనసులో వస్తుందో అంతకంటే మరీ అసహ్యకరమైన ఆకారంలో నేను ఒకరిని చూశాను. అతడు నరకం వద్ద ఆ నరకాగ్నిని తేజింపజేస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. “ఓ జిబ్రీల్ ఇతను ఎవరు?” అని నేను అడిగాను. తర్వాత నాకు సమాధానం ఇవ్వబడినది:

فَإِنَّهُ مَالِكٌ خَازِنُ النَّارِ
(ఫఇన్నహు మాలికున్ ఖాజినిన్నార్)
“ఇతనే మాలిక్, నరకం యొక్క కాపలాదారి.”

మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మేరాజ్ చేయించబడినప్పుడు, గగన ప్రయాణానికి వెళ్ళినప్పుడు, ప్రతీ ఆకాశంలో వెళ్ళినప్పుడు ఆ ఆకాశంలో ఉన్నవారు, ప్రవక్తలు గానీ, దైవదూతలు గానీ, ఎవరైనా అందరూ నవ్వు ముఖముతో, ఆనందంతో స్వాగతం పలుకుతూ వారితో సలాం దువాలు జరిగాయి. కానీ కేవలం ఒకే వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి అతని నుండి నేను దాటినప్పుడు సలాం చేశాను. “فَسَلَّمْتُ عَلَيْهِ فَرَدَّ عَلَيَّ السَّلَامَ” (ఫసల్లమ్తు అలైహి ఫరద్ద అలయ్యస్సలామ్) “నేను అతనికి సలాం చేస్తే, అతను నా సలాంకు జవాబు పలికాడు.” కానీ నవ్వలేదు. చిరు ముఖంతో, ఆనందంతో నాకు సమాధానం పలకలేదు. నాకు స్వాగతం కూడా పలికాడు కానీ అది కూడా నవ్వు ముఖం అనేది ఏ మాత్రం లేదు. అప్పుడు జిబ్రీల్ నాతో చెప్పారు, “యా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం),

ذَاكَ مَالِكٌ خَازِنُ جَهَنَّمَ
(దాక మాలికున్ ఖాజిను జహన్నమ్)
“ఇతను జహన్నం (నరకం) యొక్క కాపలాదారి అయిన మాలిక్.”

لَمْ يَضْحَكْ مُنْذُ خُلِقَ
(లమ్ యద్-హక్ మున్దు ఖులిఖ్)
“అతను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నవ్వలేదు.”

وَلَوْ ضَحِكَ إِلَىٰ أَحَدٍ لَضَحِكَ إِلَيْكَ
(వలవ్ దహిక ఇలా అహదిన్ లదహిక ఇలైక్)
“అతను కనీసం ఏ ఒక్కరి వైపునైనా చూసి నవ్వి ఉండేదుంటే, ఆ ఒక్క వ్యక్తి నీవే అయి ఉండేవాడివి.”

కానీ అతను నీ వైపు కూడా చూసి నవ్వలేదు. ఇక గమనించండి, ఇంతటి ఘోరమైన కాపలా దారి, ఆ నరకం యొక్క కాపలా దారి, ఆ నరకంలో పడే వాళ్ళ పరిస్థితి ఏముంటుందో, అది ఇంకా ముందుకు ఆ విషయాలు రానున్నాయి. కానీ ప్రస్తుతం నరకం, నరకం యొక్క వైశాల్యం మరియు నరకం, దాని యొక్క కాపలాదారులు, ఆ కాపలాదారులకు నాయకుడైన వాడు ఎలాంటివాడు, వారి యొక్క గుణగణాల గురించి మనం ప్రస్తుతం తెలుసుకుంటున్నాము.

తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 36 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 36
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 36

1) నన్ను చూసి ప్రజలు నిలబడాలి,లేదా నా ముందు నిలబడే ఉండాలి అని భావిస్తే అది ఎలాంటి చర్య అవుతుంది?

A) పుణ్య కార్యం
B) షిర్క్ ( దైవత్వం ప్రకటించుకున్నట్లు)

2) మనకు ఏదయినా నష్టం జరిగినప్పుడు “నేను ఒక వేళ అలా చెయ్యకపోతే బాగుండేది” అని అనవచ్చునా?

A) లేదు అనకూడదు
B) అనవచ్చు

3) ప్రళయదినం నాడు అత్యధిక శిక్ష పడేది వీరిలో ఎవరికి?

A) బొమ్మలు గీసే వాళ్లకు
B) పిచ్చి వాళ్లకు

క్విజ్ 36: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [20 నిమిషాలు]


1) నన్ను చూసి ప్రజలు నిలబడాలి, లేదా నా ముందు నిలబడే ఉండాలి అని భావిస్తే అది ఎలాంటి చర్య అవుతుంది?

B) షిర్క్ ( దైవత్వం ప్రకటించుకున్నట్లు)

( مَنْ أَحَبَّ أَنْ يَمْثُلَ لَهُ الرِّجَالُ قِيَامًا فَلْيَتَبَوَّأْ مَقْعَدَهُ مِنَ النَّارِ ) أخرجه أبو داود (5229) , وأحمد (16830), وأخرجه الترمذي (2755) بلفظ : ( مَنْ سَرَّهُ أَنْ يَتَمَثَّلَ لَهُ الرِّجَالُ قِيَامًا فَلْيَتَبَوَّأْ مَقْعَدَهُ مِنَ النَّارِ) . وصححه الشيخ الألباني في ” مشكاة المصابيح ” برقم (4699(

షిర్క్ అవుతుందని ఏదైతే సమాధానం మీరు చదివారో, దీని వివరం తెలుసుకునేకి ముందు ఒక హదీసు విందాము :

ముఆవియా (రజియల్లాహు అన్హు) ఒక చోట వచ్చారు, ఆయన్ని చూసి అబ్దుల్లాహ్ బిన్ ఆమిర్ (తాబిఈ) నిలబడ్డారు, అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ (రజియల్లాహు అన్హుమా) (సహాబి బిన్ సహాబీ) కూర్చొని ఉన్నారు. ఇది చూసి ముఆవియ (రజియల్లాహు అన్హు) అబ్దుల్లాహ్ బిన్ ఆమిర్ తో చెప్పారు : “కూర్చో, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను:

ప్రజలు తన కొరకు నిలబడాలని ఎవడు ఇష్టపడతాడో అతను తన నివాసం నరకంలో ఏర్పరుచుకోవాలి”. అబు దావూద్ లో ‘అహబ్బ’అనే పదం ఉంది అంటే ఇష్టపడతాడో, కోరుకుంటాడో, తిర్మిజిలో ఉంది: ‘సర్ర’అంటే నచ్చుతుందో, సంతోషం ఏర్పడుతుందో. అంటే అతడ్ని చూసి నిలబడని వారిని సంతోషంగా చూడడు, వారితో ప్రేమగా ఉండడు, నిలబడినవారి పట్ల సంతోషంగా వ్యవహరిస్తాడు.

ఈ సమస్య అంటే “ఒకరిని చూసి నిలబడటం” అనే విషయంలో కొన్ని వివరాలు ఉన్నాయి తెలుసుకోవడం చాలా అవసరం.

  • 1- నేను ఏదైనా సమావేశంలో వస్తే, లేదా ప్రజలు నన్ను చూస్తే నిలబడాలని ఇష్టపడడం, కాంక్షించడం నిషిద్ధం.
    ఇది గర్వానికి దారి తీస్తుంది, అప్పుడు గర్వం లేకున్నా గర్వ చిహ్నాల్లోకి వస్తుంది.
  • 2- మనిషి ఇలాంటి కోరిక, కాంక్ష వల్ల నరకం పాలవుతాడని హెచ్చరించడం జరిగింది.
  • 3- ఈ కోరిక, కాంక్ష ఉన్నవారిని చూసి నిలబడేవారు, ఓ నిషిద్ధ కార్యానికి సహాయం చేసినవారవుతారు.
  • 4- ఇలాంటి కోరిక లేనివారి కొరకు కూడా నిలబడకూడదు, ఈ నిలబడటం అనే అలవాటు వారిలో ఆ కోరికను జనింపజేసే ప్రమాదముంది.
  • 5- ఇక ఎవరైతే తమ ధర్మపరమైన బడాయితనాన్ని చాటుకుంటున్నారో, అనుయాయులు వారిని గౌరవించాలి, మర్యాద పాటించాలని కోరుకుంటున్నారో వారు నిజసృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క గౌరవమర్యాదలో జోక్యం చేసుకుంటున్నారు, కనుక అలాంటివారి కొరకు నిలబడుట షిర్క్ లోకి నెట్టేసే ప్రమాదం ఉంది.
  • 6- ఇంట్లో పెద్దలు వస్తే పిల్లలు, నిలబడుట లేదా టీచర్లు క్లాస్ రూంలోకి వస్తే స్టూడెంట్స్ నిలబడుట కూడా మంచి అలవాటు కాదు.
  • 7- కొందరు ఒక చోట ఉన్నారు ఎవరైనా వారి బంధువు, గురువు లాంటి పెద్దలు వచ్చారు అప్పుడు వారు నిలబడి, రెండు అడుగులు ముందుకు వచ్చి వచ్చే వ్యక్తికి స్వాగతం పలుకుతే పాపం కాదు. సహీ బుఖారీ 3043లో ఉంది: ఒక సందర్భంలో సఅద్ (రజియల్లాహు అన్హు) వచ్చినప్పుడు ప్రవక్త ఔస్ వంశంవారితో మీ నాయకుడైన సఅద్ వచ్చారు నిలబడి స్వాగతించండని ఆదేశించారు.

    అలాగే ప్రయాణం నుండి వచ్చినవారిని స్వాగతించడానికి నిలబడి సలాం చేయడం, ముసాఫహా (కరచాలనం), ముఆనఖ (హగ్, అలాయిబలాయి) చేయడం యోగ్యమే. ప్రవక్త తమ కూతురింటికి వెళ్ళినప్పడూ, కూతురు ప్రవక్త ఇంటికి వచ్చినప్పుడు నిలబడి స్వాగతం పలికేవారని అబూ దావూద్ 5217 మరియు ఇతర హదీసుల్లో ఉంది.

    (ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఉన్నాయి, ఫత్ హుల్ బారీ 11/49-51 మరియు షేఖ్ అల్బానీ గారి సహీహాలోని హదీసు 357, మరియు షేఖ్ ఇబ్ను ఉసైమీన్ గారి మజ్మూఉల్ ఫతావా 24/2 చూడవచ్చును)

2) మనకు ఏదయినా నష్టం జరిగినప్పుడు “నేను ఒక వేళ అలా చెయ్యకపోతే బాగుండేది” అని అనవచ్చునా?

A) లేదు అనకూడదు

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمُؤْمِنُ الْقَوِيُّ خَيْرٌوَأَحَبَّ إِلى اللهِ مِنَ الْمُؤْمِنِ الضَّعِيْفِ وَفِيْ كُلِّ خَيْرٌ اِحْرِصْ عَلَى مَا يَنْفَعُكَ وَاسْتَعِنْ بِاللهِ وَلَاتَعْجَزُ. وَإِنْ أَصَابَكَ شَيْءٌ فَلَا تَقُلْ لَوْ أَنِّيْ فَعَلْتُ كَانَ كَذَا وَكَذَا وَلَكِنْ قُلْ قَدَّرَ اللهُ وَمَا شَاءَ فَعَلَ فَإِنَّ لَوْ تَفْتَحُ عَمَلَ الشَّيْطَانِ”. رَوَاهُ مُسْلِمٌ.

మిష్కాత్ 5298. అబూ హురైరహ్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం,

”దృఢమైన, పరిపూర్ణ విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కంటే గొప్పవాడు. వాడి ప్రతిపనిలో మేలు ఉంటుంది. కావున లాభం చేకూర్చే దాన్ని కోరుకో, అల్లాహ్ తఆలా సహాయంకోరు. బలహీనత ప్రదర్శించకు. ఒకవేళ ఏదైనా ఆపదవస్తే, ”ఒకవేళ నేను అలా చేస్తే ఇలా అయ్యేదని అనకు.” అల్లాహ్ తఆల కోరింది అయ్యిందని, నా విధిలో ఉన్నది జరిగిందని భావించు. ఎందుకంటే ఒకవేళ అనేది షై’తాన్ ద్వారాన్ని తెరచి వేస్తుంది”. (సహీ ముస్లిం).

3) ప్రళయదినం నాడు అత్యధిక శిక్ష పడేది వీరిలో ఎవరికి ?

A) బొమ్మలు గీసే వాళ్లకు

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “أَشَدُّ النَّاسِ عَذَابًا عِنْدَ اللهِ الْمُصَوِّرُوْنَ”.

4497. ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రాణుల చిత్రాలు తయారుచేసే వారిని తీర్పుదినం నాడు అందరి కంటే కఠినంగా శిక్షించడం జరుగుతుంది.” (బు’ఖారీ, ముస్లిమ్)

وَعَنْهَا عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “أَشَدُّ النَّاسِ عَذَابًا يَوْمَ الْقِيَامَةِ الَّذِيْنَ يُضَاهُوْنَ بِخَلْقِ اللهِ”.

4495. ‘ఆయి’షహ్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం, ”తీర్పు దినం నాడు అల్లాహ్ తఆలా సృష్టించిన ప్రాణుల నకిలీ చిత్రాలు చేసేవారిని, అంటే ప్రాణుల చిత్రాలు తయారుచేసే వారిని అందరికంటే కఠినంగా శిక్షించటం జరుగుతుంది.” (బు’ఖారీ, ముస్లిమ్)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “قَالَ اللهُ تَعَالى: )وَمَنْ أَظْلَمُ مِمَّن ذَهَبَ يَخْلُقُ كَخَلْقِيْ فَلْيَخْلُقُوْا ذَرَّةً أَوْ لِيَخْلُقُوْا حَبَّةً أَوْ شَعِيْرَةً”(. متفق عليه.

4496. అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. అల్లాహ్ ఆదేశం, ”నేను సృష్టించే వాటిలా సృష్టించే అంటే చిత్రాలు వేసేవాడి కంటే దుర్మార్గుడు మరెవడు కాగలడు? అతడిని ఒక చీమ లేదా ఒక గోధుమ గింజ సృష్టించి చూపమనండి.” (బు’ఖారీ, ముస్లిమ్)

వివరణ-4496: ఇలా ఎందుకు ఆగ్రహించడం జరిగిందంటే, చీమను లేదా గోధుమ గింజను సృష్టించలేడు. అందు వల్ల ప్రాణుల చిత్రాలుగానీ ఫోటోలను గానీ తీయ రాదు అని హెచ్చరించడం జరిగింది

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “كُلُّ مُصَوِّرٍفِي النَّارِيَجْعَلُ لَهُ بِكُلِّ صُوْرَةٍ صَوَّرَهَا نَفْسًا فَيُعَذِّبُهُ فِيْ جَهَنَّمَ”. قَالَ ابْنُ عَبَّاسٍ: فَإِنْ كُنْتُ لَابُدَّ فَاعِلًا فَاصْنَعِ الشَّجَرَوَمَا لَا رُوْحَ فِيْهِ.

4498.’అబ్దుల్లాహ్ బిన్ ‘అబ్బాస్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రాణుల చిత్రాలు తయారు చేసే ప్రతి ఒక్కరినీ నరకంలో వేయబడును. ఇంకా వారితో, చేసిన చిత్రాలన్నింటిలో ప్రాణం పోయమని ఆదేశించటం జరుగును. వారు ఎలాగూ ప్రాణం పోయలేరు, అందువల్ల నరకంలోనే ఉండవలసి వస్తుంది”. ఇబ్నె ‘అబ్బాస్ (రజియల్లాహు అన్హు) అభిప్రాయం, ”ఒకవేళ చిత్రం వేసే అవసరం వస్తే చెట్లు, నిర్జీవ వస్తువుల చిత్రాలు వేసుకోండి.” (బు’ఖారీ, ముస్లిమ్) అంటే బట్టలపై, దుస్తులపై నిర్జీవ ఫలాల, ఆకుల, వస్తువుల చిత్రాలు వేసుకోవచ్చును.

ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz