
[2 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
عَنْ أَبِي أُمَامَةَ، رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: أَتَى عَلَيَّ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَأَنَا أُحَرِّكُ شَفَتَيَّ فَقَالَ: «مَا تَقُولُ يَا أَبَا أُمَامَةَ؟» قُلْتُ: أَذْكُرُ اللَّهَ، قَالَ: ” أَلَا أَدُلُّكَ عَلَى شَيْءٍ هُوَ أَكْثَرُ مِنْ ذِكْرِ اللَّهِ اللَّيْلَ مَعَ النَّهَارِ وَالنَّهَارَ مَعَ اللَّيْلِ، تَقُولُ:
الْحَمْدُ لِلَّهِ عَدَدَ مَا خَلَقَ، وَالْحَمْدُ لِلَّهِ عَدَدَ مَا فِي السَّمَاءِ وَالْأَرْضِ، وَالْحَمْدُ لِلَّهِ عَدَدَ مَا أَحْصَى كِتَابُهُ، وَالْحَمْدُ لِلَّهِ مِلْءَ مَا أَحْصَى كِتَابُهُ، وَالْحَمْدُ لِلَّهِ عَدَدَ كُلِّ شَيْءٍ، وَالْحَمْدُ لِلَّهِ مِلْءَ كُلِّ شَيْءٍ “
قَالَ: «وَتُسَبِّحُ مِثْلَهُنَّ» ثُمَّ قَالَ: «تَعَلَّمْهُنَّ وَعَلِّمْهُنَّ عَقِبَكَ مِنْ بَعْدِكَ»
అద్దుఆ: తబ్రానీ 1744, సహీహఅల్బానీ 2578
అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, నేను నా పెదవులను కదలిస్తూ ఉండగా ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నా వద్దకు వచ్చి, “అబూ ఉమామ ఏం పలుకుతున్నావు” అని అడిగారు, ‘అల్లాహ్ యొక్క జిక్ర్ (స్మరణ) చేస్తున్నాను’ అని నేను చెప్పాను, అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారు: “రాత్రితో పాటు పగటిని, పగటితో పాటు రాత్రిని కలిపి చేసే అల్లాహ్ జిక్ర్ కంటే ఎంతో ఉత్తమమైన, ఎక్కువ పుణ్యం గల జిక్ర్ నీకు తెలుపనా; నీవు ఇలా పలుకు:
الْحَمْدُ لِلَّهِ عَدَدَ مَا خَلَقَ، وَالْحَمْدُ لِلَّهِ مِلْءَ مَا خَلَقَ، وَالْحَمْدُ لِلَّهِ عَدَدَ مَا فِى السَّمَوَاتِ وَالأَرْضِ، وَالْحَمْدُ لِلَّهِ مِلْءَ مَا فِى السَّمَوَاتِ وَالأَرْضِ، وَالْحَمْدُ لِلَّهِ عَدَدَ مَا أَحْصَى كِتَابُهُ، وَالْحَمْدُ لِلَّهِ مِلْءَ مَا أَحْصَى كِتَابُهُ، وَالْحَمْدُ لِلَّهِ عَدَدَ كُلِّ شَىْءٍ، وَالْحَمْدُ لِلَّهِ مِلْءَ كُلِّ شَىْءٍ
అల్ హందులిల్లాహి అదద మా ఖలఖ్, వల్ హందులిల్లాహి అదద మా ఫిస్సమాఇ వల్ అర్జ్, వల్ హందులిల్లాహి అదద మా అహ్ సా కితాబుహ్, వల్ హందులిల్లాహి మిల్అ మా అహ్ సా కితాబుహ్, వల్ హందులిల్లాహి అదద కుల్లి షై, వల్ హందులిల్లాహి మిల్అ కుల్లి షై”
ఓ అల్లాహ్! నీ సృష్టి సంఖ్యకు సమానంగా నీకు ప్రశంసలు మరియు పొగడ్తలు, నీ సృష్టి నింపుకు సమానంగా నీకు ప్రశంసలు మరియు పొగడ్తలు, భూమ్యాకాశాల్లో ఉన్నవాటి సంఖ్యకు సమానంగా నీకు ప్రశంసలు మరియు పొగడ్తలు, భూమ్యాకాశాల్లో ఉన్నవాటి నింపుకు సమానంగా నీకు ప్రశంసలు మరియు పొగడ్తలు, నీ పుస్తకాల్లో వివరించిన వాటి సంఖ్యకు సమానంగా నీకు ప్రశంసలు మరియు పొగడ్తలు, నీ పుస్తకాల్లో వివరించిన వాటి నింపుకు సమానంగా నీకు ప్రశంసలు మరియు పొగడ్తలు, ప్రతి వస్తువు సంఖ్యకు సమానంగా నీకు ప్రశంసలు మరియు పొగడ్తలు, ప్రతి వస్తువు నింపుకు సమానంగా నీకు ప్రశంసలు మరియు పొగడ్తలు.
మళ్ళీ చెప్పారు: “ఇదే రీతిలో సుబ్ హానల్లాహ్ అని కూడా పలుకు. నీవు స్వయంగా ఇది నేర్చుకో మరియు నీ వెనక ఉన్నవారికి నేర్పు”.
నోట్: సుబ్ హానల్లాహ్ అదే రీతిలో పలుకు అంటే ఇలా పలకాలి అని భావం: సుబ్ హానల్లాహి అదద మా ఖలఖ్, సుబ్ హానల్లాహి అదద మా ఫిస్సమాఇ వల్ అర్జ్, సుబ్ హానల్లాహి అదద మా అహ్ సా కితాబుహ్, సుబ్ హానల్లాహి మిల్అ మా అహ్ సా కితాబుహ్, సుబ్ హానల్లాహి అదద కుల్లి షై, సుబ్ హానల్లాహి మిల్అ కుల్లి షై.
You must be logged in to post a comment.