నమాజ్ తర్వాత (సలాం చెప్పిన తర్వాత) చేసుకొనే జిక్ర్ మరియు దుఆలు – వాటి అనువాదం, లాభాలు [వీడియో]

[5:26 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

1- అస్తగ్ ఫిరుల్లాహ్ , అస్తగ్ ఫిరుల్లాహ్, అస్తగ్ ఫిరుల్లాహ్, అల్లాహుమ్మ అంతస్సలాం వ మిన్కస్సలాం తబారక్త యాజల్ జలాలి వల్ ఇక్రామ్.

 أَسْـتَغْفِرُ الله  أَسْـتَغْفِرُ الله  أَسْـتَغْفِرُ الله

اللّهُـمَّ أَنْـتَ السَّلامُ ، وَمِـنْكَ السَّلام ، تَبارَكْتَ يا ذا الجَـلالِ وَالإِكْـرام

(అల్లాహ్ నీ క్షమాభిక్ష కోరుతున్నాను… అల్లాహ్ నీవే సలాం. శాంతి నీ నుండి లభిస్తుంది. ఔన్నత్యం, గొప్పదనాలు గలవాడా నీవు గొప్ప శుభాలు కలవాడివి). (ముస్లిం 592).

2- లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅతైత వలా ముఅతియ లిమా మనఅ’త వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్కల్ జద్ద్.

dhikr-after-obligatory-prayer-dawud-burbank-021.gif

అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఏకైకుడు, సాటిలేనివాడు. విశ్వ సామ్రాజ్యం ఆయనదే. స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయన సర్వాధికారుడు. ఓ అల్లాహ్! నీవు ప్రసాదించే దానిని అడ్డుకునేవాడెవడూ లేడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వలేడు. ఎవరి పెద్దరికం ఐశ్వర్యం నీ శిక్ష ముందు వారికి లాభం చేకూర్చ లేవు. (బుఖారి 844, ముస్లిం 593).

3- లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి లాఇలాహ ఇల్లల్లాహు వలా నఅబుదు ఇల్లా ఇయ్యాహు లహున్నిఅ’మతు వలహుల్ ఫజ్లు వలహుస్సనాఉల్ హసన్ లా ఇలాహ ఇల్లల్లాహు ముఖ్లిసీన లహుద్దీన వలౌ కరిహల్ కాఫిరూన్.

dhikr-after-obligatory-prayer-dawud-burbank-03

(అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఏకైకుడు, సాటిలేనివాడు. విశ్వసామ్రాజ్యం ఆయనదే. స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయన సర్వాధికారుడు. పుణ్యాలు చేసే, పాపాల నుండి దూరముండే భాగ్యం అల్లాహ్ యే ప్రసాదించువాడు, ఆ అల్లాహ్ తప్ప వెరొక ఆరాధ్యుడు లేడు. మేము ఆయన్నే ఆరాధిస్తాము. వరాలు, అనుగ్రహాలు ఆయన ప్రసాదించినవే. మంచి స్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. సత్యతిరస్కారులకు ఎంత అయిష్టకరంగా ఉన్నా సరే మేము మా ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకున్నాము). (ముస్లిం 594).

4-సుబ్ హానల్లాహ్ 33 సార్లు, అల్ హందులిల్లాహ్ 33 సార్లు, అల్లాహు అక్బర్ 33 సార్లు అనాలి. వంద పూర్తి చేయుటకు ఒక్క సారి అనాలి: “లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్”.

* పై జిక్ర్ వంద లెక్క పూర్తి చేసినవారి పాపాలు సముద్రపు నురగంత ఉన్నా మన్నించబడతాయి. (ముస్లిం 597).

5-అల్లాహుమ్మ అఇన్నీ అలా జిక్రిక వ షుక్రిక వ హుస్ని ఇబాదతిక.

dhikr-after-obligatory-prayer-dawud-burbank-05

(అల్లాహ్! నేను నీ ధ్యానం చేయటానికి, నీకు కృతజ్ఞతలు తెలుపుకోటానికి, తగురీతిలో నిన్ను ఆరాధించటానికి నాకు సహాయం చెయ్యి). (అబూదావూద్ 1522).

6- అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ జుబ్ని వఅఊజు బిక మిన్ అన్ ఉరద్ద ఇలా అర్జలిల్ ఉమురి వ అఊజు బిక మిన్ ఫిత్నతిద్దున్యా వ అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్ర్.

dhikr-after-obligatory-prayer-dawud-burbank-08

(అల్లాహ్! పిరికితనం నుండి నీ శరణు వేడుతున్నాను. నికృష్టమైన వృద్ధాప్యానికి చేరుకోవటం నుండి నీ శరణు కోరుతున్నాను. ప్రాపంచిక ఉపద్రవాల నుండి నీ శరణు వేడుతున్నాను. సమాధి యాతనల నుండి నీ శరణు వేడుతున్నాను). (బుఖారి 2822).

7- (1)బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, ఖుల్ హువల్లాహు అహద్, అల్లాహుస్సమద్, లమ్ యలిద్, వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్.

2) బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం, ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్, మిన్ షర్రి మా ఖలఖ్, వ మిన్ షర్రి గాసిఖిన్ ఇజా వఖబ్, వ మిన్ షర్రిన్ నఫ్ఫాసాతి ఫిల్ ఉఖద్, వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్.

(3) బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్, మలికిన్నాస్, ఇలాహిన్నాస్, మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్, అల్లజీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్, మినల్ జిన్నతి వన్నాస్.

(1)ఇలా అనుః ఆయనే అల్లాహ్, ఏకైకుడు, అల్లాహ్ ఎవరి అక్కరా లేనివాడు, ఆయనకు సంతానం లేదు మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ కాడు, ఆయనకు సరిసమానుడు ఎవడూ లేడు.

(2) ఇలా అనుః నేను ఉదయ కాలపు ప్రభువు శరణులోకి వస్తున్నాను, ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి, చిమ్మచీకటి కీడు నుండి ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో, ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి, మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో.

(3) ఇలా అనుః నేను మానవుల ప్రభువు, మానవుల సార్వభౌముడు, మానవుల ఆరాధ్య దైవం యొక్క శరణులోకి వస్తున్నాను, కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి, ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో, వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు) (అబూదావూద్ 1523).

8-అల్లాహు లాఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం లా తాఖుజుహూ సినతుఁ వలా నౌం, లహూ మా ఫిస్సమావాతి వమా ఫిల్ అర్జి మన్ జల్లజీ యష్ ఫఉ ఇన్’దహూ ఇల్లా బిఇజ్నిహీ యఅలము మా బైన ఐదీహిం వమా ఖల్ ఫహుమ్  వలా యుహీతూన బిషైఇమ్ మిన్ ఇల్మిహీ ఇల్లా బిమా షాఅ వసిఅ కుర్సియ్యుహుస్ సమావాతి వల్ అర్జ వలా యఊదుహూ హిఫ్జు- హుమా వహువల్ అలీయ్యుల్ అజీం. (సూ. బఖర 255). (ఈ ఆయతును ‘ఆయతుల్ కుర్సీ’అని అంటారు).

(అల్లాహ్! ఆయన తప్ప మరొక సత్యఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. ఆయన నిత్యుడువిశ్వవ్యవస్థకు ఆధారభూతుడు ఆయనకు కునుకురాదు మరియు నిదురరాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే, ఆయన సమ్ముఖంలో -ఆయన అనుజ్ఞ లేకుండా- సిఫారసు చేయగలవాడెవడు? వారి ముందున్నదీ మరియు వారి వెనుక ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు, మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు, ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన అత్యున్నతుడు, సర్వోత్తముడు).

* ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదివిన వారు స్వర్గంలో ప్రవేశించడానికి చావు మాత్రమే అడ్డు ఉంటుంది. (సహీహా 972).

9- అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫిఅ, వరిజ్ఖన్ తయ్యిబ, వ అమలమ్ ముతఖబ్బల. (ఫజ్ర్ నమాజు తర్వాత మాత్రమే.)

(ఓ అల్లాహ్! నేను నీతో ప్రయోజనకరమైన జ్ఞానం, పవిత్ర ఆహారం మరియు అంగీకరింపబడే ఆచరణ కోరుతున్నాను). (ఇబ్ను మాజ 925). ఇది ఫజ్ర్ తర్వాత.

కూర్పు : ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ

[Download PDF]

హజ్ ఉమ్రాల లాభాలు فضل الحج والعمرة

Video Courtesy: Dawah and Foreigners guidance office, zulfi, Saudi Arabia.

hajj and umrah - reward-1

umrah - reward-1

Visit: https://teluguislam.net/five-pillars/umrah-hajj-telugu-islam/

సుబ్ హా నల్లాహి వబి హమ్ దిహీ , అదద ఖల్కిహీ, వ రిధా నఫ్సిహీ, వ జినత అర్షిహీ, వ మిదాద కలిమాతిహీ

సుబ్ హా నల్లాహి వబి హమ్ దీహీ , అదద ఖల్కిహీ, వ రిధా నఫ్సిహీ, వ జినత అర్షిహీ, వ మిదాద కలిమాతిహీ

Sourceత్రాసును బరువు చేసే సత్కార్యాలు (Meezaan) – PDF Book

Great Rewards – చిన్న పనులు – గొప్ప పుణ్యాలు

ఇషా & ఫజ్ర్ నమాజులు జమాఅత్ లో చేస్తే రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం

Performing Isha and Fajr in the Masjid equal to praying tahajjud whole night

Sourceత్రాసును బరువు చేసే సత్కార్యాలు (Meezaan) – PDF Book

ధర్మం పై నిలకడకై దుఆలు الدعاء للثبات على الدين

Video Courtesy: Dawah and Foreigners guidance office, zulfi, Saudi Arabia.

దుఆలు మీరు నేర్చుకొనుటకై క్రింద పొందుపరిచాం 

dua-steadfastness-1

dua-steadfastness-2

dua-steadfastness-3

dua-steadfastness-4

Explanation of లా ఇలాహ ఇల్లల్లాహ్

Explanation of La Ilaha illallah (in Telugu)

లా ఇలాహ ఇల్లల్లాహ్ వివరణ (తెలుగులో) డాక్టర్. సయీద్ అ’హ్మద్ ఉమరీ మదని హఫిజహుల్లాహ్

ఒక నమాజు తర్వాత మరో నమాజ్ కొరకు వేచి ఉండుట

waiting from one salah to next salah in the masjid

Sourceత్రాసును బరువు చేసే సత్కార్యాలు (Meezzan) – PDF Book

సుబ్ హానల్లాహ్ , అల్ హమ్ దులిల్లాహ్ , అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్

SubhanAllaah-alHamdulillah-Laailaahaillallah-AllaahuAkbar

Sourceత్రాసును బరువు చేసే సత్కార్యాలు (Meezzan) – PDF Book

జిల్ హజ్జా మాసపు తొలి దశకంలో ఉపవాసం మరియు ఇతర సత్కార్యాల ఘనత


dhul-hijjah-RS-1

dhul-hijjah-RS-2

Source: హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి (Riyadh-us-Saaliheen) Chapter 226. జిల్ హజ్జా మాసపు తొలి దశకంలో ఉపవాసం …. [pdf]

ఖుర్బానీ ఆదేశాలు 

mina tents

ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం చివరిదైన 12వ మాసాన్ని జిల్ హిజ్జ (Dhul-Hijjah) అంటారు.

ఈ మాసంలో అల్లాహ్ ప్రసన్నత కొరకు నిర్ణీత వయస్సుగల ప్రత్యేక జంతువులను జిబహ్ చేయడాన్ని ఉర్దూలో ఖుర్బానీ (బలిదానం) అంటారు. అయితే హజ్జె ఖిరాన్ మరియు హజ్జె తమత్తు చేసేవారు ఇచ్చే బలిదానాన్ని అరబీలో (هَدْي) “హద్య్” అని, హజ్ చేయనివారు తమ ఇండ్లల్లో 10వ జిల్ హిజ్జ నుండి 13 వరకు ఇచ్చే బలిదానాన్ని “ఉజ్ద్ హియ” (أُضْحِيَة) (Ud’hiyah) అని అంటారు.

ఖుర్బానీ హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సున్నత్ (సాంప్రదాయం) అన్న విషయం మీరు సూర సాఫ్ఫాత్ (37:102-108) లో చూడవచ్చు. పూర్వ మతాల్లో కూడా ఈ సంప్రదాయం ఉండినది. చూడండి సూర హజ్ (22:34). మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చాక ప్రయాణంలో ఉన్నా, నగరంలో ఉన్నా ప్రతి ఏడాది ఖుర్బానీ ఇచ్చేవారు. ప్రవక్త తమ జీవితంలోని చివరి హజ్ లో విధిగా ఉన్న ఒక జంతు బలిదానమే కాకుండా సుమారు వంద వరకు బలిదానాలు ఇచ్చారు. ఇది దీని ఘనత మరియు ఎంతో గొప్ప పుణ్యకార్యం అనడానికి గొప్ప నిదర్నన.

ఖుర్బానీ అసలు ఉద్దేశ్యం

వాస్తవానికి ఇది హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తమ కంటికి చలువ, గారాలపట్టిని బలి చేయుటకు సిద్ధమైనందుకు లభించిన ఫలితం, ఇందులో మనకున్న గుణపాఠం ఏమిటంటే అల్లాహ్ మనకు అతి ప్రియమైన దానిని త్యాగం చేయాలని కోరినా మనం ముమ్మాటికి వెనకాడము. ఇన్షాఅల్లాహ్!

ఖుర్బానీ ప్రాముఖ్యత

 • శక్తి ఉండి కూడా ఖుర్బానీ చేయనివారు మా ఈద్గాహ్ కు రాకూడదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. (ఇబ్ను మాజ 3123)
 • ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో ఖుర్బానీ కావాలని కూడా ప్రవక్త ఆదేశించి ఉన్నారు. (అబూదావూద్ 2788).
 • ఒకసారి ప్రవక్త పండుగ ప్రసంగం ఇస్తూ చెప్పారు: ఎవరైతే పండుగ నమాజుకు ముందు ఖుర్బానీ చేశారో అది చెల్లదు గనక దాని స్థానంలో వారు మరో ఖుర్బానీ ఇవ్వాలి. (బుఖారి 7400).
 • కొన్ని సందర్భాల్లో ప్రవక్త (బీద సహచరులలో) ఖుర్బానీ జంతువులు పంపిణీ చేశారు (వారు వాటి ఖుర్బానీ చేయాలని). (బుఖారి 2300, ముస్లిం 1965).
 • ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ప్రవక్త ఖుర్బానీ వదల లేదు. (తిర్మిజి 1501, నిసాయి 4392, ఇబ్నుమాజ 3131).

ఖుర్బానీ చేయకుండా దానికి కలిగే పైకం దానం చేయడం ఎట్టి పరిస్థితిల్లో కూడా యోగ్యం కాదు. ప్రవక్త శుభ కాలంలో గడ్డు స్థితి ఉన్న రోజుల్లో కూడా ప్రవక్త ఖుర్బానీ చేయడం నుండి ఆప లేదు, పైగా ఇలా చెప్పారుః ఖుర్బానీ చేసేవారు మూడు రోజుల కంటే ఎక్కువ తమ ఇండ్లల్లో మాంసాన్ని మిగిలి ఉంచకూడదు, అంతా దానం చేసెయ్యాలి. కలిమి రోజులు దూరమయ్యాక ఇక మీరు మాంసాన్ని మూడు రోజులకంటే ఎక్కువ స్టాక్ చేసి, స్టోర్ చేసి ఉంచవచ్చు అని అనుమతించారు. (బుఖారి 5569, ముస్లిం 1974). ప్రవక్త గారి శుభఆదర్శం మనకు సరిపోదా?

ఖుర్బానీ ఘనత

ఖుర్బానీ చేయడంలో ఇన్ని పుణ్యాలు, అన్ని పుణ్యాలు అని ప్రత్యేకంగా ఏ ఒక్క సహీ హదీసు లేకపోయిన ఖుర్బానీకి ఏ ఘనత లేదు అని అనరాదు. అల్లాహ్ దీని ఘనతలో సూర హజ్ (22)లోని ఆయత్ 36లో “లకుమ్ ఫీహా ఖైర్” అన్నాడు, అంటే ఖుర్బానీలో మీకు అనేకాకనేక మేళ్ళున్నాయి. ఇంకా సహీ హదీసులో ఉంది: ఏ ఆచరణలు, కర్మలు ఘనత గలవైనవి అని ప్రవక్తను అడిగినప్పుడు, ఘనమైన శబ్దంతో తల్బియా చదవడం మరియు జంతువుల ఖుర్బానీ అని చెప్పారు. (ఇబ్ను మాజ 2924). ఇది ఘనత గల విషయమే గనక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సంవత్సరం ఖుర్బానీ చేశారు.

ఖుర్బానీ ఎవరి కొరకు?

ఖుర్బాన్ అన్న పదానికి భావం: అల్లాహ్ సాన్నిధ్యం పొందుటకు అల్లాహ్ కోరినదానిని సమర్పించడం. అందుకే ఏ జంతువునైనా ప్రవక్తల, వలీల, బాబాల ప్రసన్నతకు, వారి సాన్నిధ్యం పొందుటకు జిబహ్ చేస్తే అది షిర్క్ అవుతుంది. అందుకే అల్లాహ్ ఖుర్ఆన్ లో చెప్పాడు:

నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, ఖుర్బానీ ఇవ్వు. (కౌసర్ 108:2).

ఇంతకంటే మరీ స్పష్టంగా సూర అన్ఆమ్ (6:162,163)లో అల్లాహ్ ఇలా తెలిపాడు:

నిస్సందేహంగా నా నమాజు, నా ఖుర్బానీ (నా సకల ఆరాధనలు), నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వ లోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయనకు భాగస్వాములెవరూ లేరు. దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞాపాలన చేసే వారిలో (ముస్లిములలో) నేను మొదటి వాణ్ణి.  

కొన్ని ముఖ్య విషయాలు

1- ఖుర్బానీ చేయాలని ఉద్దేశించిన వ్యక్తి జిల్ హిజ్జ నెల వంక చూసినప్పటి నుండి ఖుర్బానీ చేయువరకు తన శరీరంలోని వెంట్రుకలు, గోళ్ళు వగైరా తీయకూడదు. (ముస్లిం 1977). ఎవరయితే ఆ తర్వాత ఏ రోజు ఖుర్బానీ చేయాలనుకున్నారో ఆ రోజు నుండే వెంట్రుకలు… తీయకుండా ఉండాలి.

2- ఒక్క మేక లేదా గొఱ్ఱె ఒక ఇంటివారి వైపు నుండి సరిపోతుంది. ఆ ఇంటిలో ఎంత మంది ఉన్నా సరే. (ఇబ్నుమాజ 3122, తిర్మిజి 1505). ఆవులో ఏడుగురు, ఒంటెలో పది మంది పొత్తు కలవవచ్చు. (తిర్మిజి 1501). డబ్బు ధనం ఉన్న వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఎన్ని జంతువుల ఖుర్బానీ ఇవ్వదలచినా అన్నీ ఖుర్బానీ ఇవ్వచ్చు, ఇది మాహా పుణ్యప్రధమైన విషయమే. (ప్రవక్త 100 వరకు ఖుర్బానీ చేసిన విషయం తెలిసిందే).

3- ఖుర్బానీ జంతువు ఎంత మంచిది, బలసినది, ధరగలది ఉంటుందో అంతే ఘనత గల విషయం కాని ప్రాపంచికంగా అహంకారానికి గురి కాకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సంవత్సరం బలిసిన, కొమ్ములు గల రెండు గొఱ్ఱెలను జిబహ్ చేసేవారు. సహాబాలు ఖుర్బానీ జంతువులకు మంచిగా ఆహారమిస్తూ బలసినవిగా చేసేవారు. (బుఖారి 5552 తర్వాత).

4- కేవలం అల్లాహ్ ప్రసన్నత పొందుటకు మాత్రమే ఖుర్బానీ ఇవ్వాలి. చూపుగోళు, ప్రదర్శనాబుద్ధి ఏ మాత్రం ఉండకూడదు. అల్లాహ్ ఇలా ఆదేశించాడు: వాటి మాసంగానీ, రక్తంగానీ అల్లాహ్ కు చేరవు. అయితే మీలోని భక్తి పరాయణత (తఖ్వా) మాత్రం ఆయనకు చేరుతుంది. (హజ్ 22:37).

ఖుర్బానీ నిబంధనలు

1- ఖుర్బానీలో ఇవ్వబడే జంతువు బహీమతుల్ అన్ఆమ్ (ఒంటె, ఆవు, మేక, పొట్టేలు) లోనిదై ఉండాలి. (సూర హజ్ 22:28,34).

2- ధర్మం తెలిపిన ఈడు దాటినదై ఉండాలి. (ముస్లిం 1963). మేక, గొఱ్ఱె 1 సంవత్సరం, ఆవు 2, ఒంటె 5 సంవత్సరాలు దాటాలి. ఒక వేళ సంవత్సరం పూర్తి నిండిన మేక లభ్యం కావటం కష్టతరంగా ఉన్నప్పుడు ఆరు నెలలు నిండిన గొఱ్ఱె ఖుర్బానీ ఇవ్వచ్చు. అయితే అది ఆరోగ్యవంతంగా, బలసి ఉండాలి.

3- ఖుర్బానీ జంతువు లోపాలు లేకుండా ఉండాలి. మీరు అల్లాహ్ మార్గంలో ఉత్తమమైన వాటిని ఖర్చు పెట్టండని అల్లాహ్ ఆదేశించాడు. (బఖర 2:267). ఖుర్బానీ జంతువులను స్పష్టమైన అంగవైకల్యం గాని, ఏదైనా లోపంగాని లేకుండా బాగా చూసుకోవాలని ప్రవక్త కూడా ఆదేశించారు. (అబూదావూద్ 2804, తిర్మిజి 1498).

ఆ లోపాలు ఇవి

 • ఒకటే కన్ను ఉన్నట్లు స్పష్టమగుట.
 • రోగం ఉన్నట్లు స్పష్టంగా కనబడుట.
 • స్పష్టమైన కుంటిది.
 • ఎముకల్లో సత్తువ లేని ముసలిది. (నిసాయి 4369, ఇబ్ను మాజ3144).

ఈ నాలుగే గాకుండా ఇంతకు తీవ్రమైన లోపాలుగల జంతువుల ఖుర్బానీ కూడా యోగ్యం కావు. ఉదాహరణకుః మొత్తానికే కళ్ళు లేనిది, ఒక్కటో రెండో కాళ్ళు లేనిది వగైరా. ఇక ఈ లోపాలు లేకుంటే మంచిదిః విరిగిన కొమ్ము, కొంచెం తెగి ఉన్న చెవి లేదా తోక.

ఏదైనా లోపం ఉండీ లేనట్లుగా స్వల్పస్థాయిలో ఉంటే అది లోపం అనబడదు.

4- ధార్మిక సమయంలోనే జిబహ్ చేయాలి. అంటే ఈదుల్ అజ్హా నమాజ్ మరియు ఖుత్బ అయిన తర్వాత నుండి 13వ జిల్ హిజ్జ సూర్యాస్తమయానికి ముందు. పండుగ నమాజుకు ముందు జిబహ్ చేసిన వారిది ఖుర్బానీగా పరిగణించబడదు. (బుఖారి 968, ముస్లిం 1961).

జిబహ్ షరతులు

1- ఖుర్బానీ ఇచ్చే వ్యక్తి ఖుర్బానీ జంతువును జిబహ్ చేయునప్పుడు బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. (అంటే: అల్లాహ్ పేరుతో జిబహ్ చేయుచున్నాను, అల్లాహ్ యే గొప్పవాడు). అల్లాహుమ్మ హాజా మిన్క వలక, అల్లాహుమ్మ తకబ్బల్ మిన్నీ అనాలి. (అంటే: ఓ అల్లాహ్! ఖుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు, నీ కొరకే ఖుర్బానీ చేయుచున్నాము, ఓ అల్లాహ్! నా వైపు నుండి దీనిని స్వీకరించు). (బుఖారి 5565, ముస్లిం 1967, దార్మీ 1989). జిబహ్ చేయువారు ఇతరులైతే మిన్నీ అనే చోట మిన్ హు అనాలి.

2- రక్తం బాగా పారాలి. అంటే రక్తం చింది వేగంగా వెళ్ళునటువంటి పదను ఆయుధంతో జిబహ్ చేయాలి. అయితే ఎముక, దంతము (పన్ను), గోరు ఉపయోగించకూడదు. (బుఖారి 2488, ముస్లిం 1968). [కత్తిని జంతువు కళ్ళ ముందు పదను పట్టకూడదు. ఒక జంతువు ముందు మరో జంతువును జిబహ్ చేయకూడదు].

3- నిర్ణీత స్థలం అంటే గొంతును కోయాలి; కనీసం రక్తం వేగంగా వెళ్ళు రెండు రక్త నరాలు కోయాలి, ఇంకా శ్వాస నాళం మరియు ఆహారనాళం కోయాలి. (జిబహ్ చేయు ముందే జంతువును ఖిబ్లా దిశలో చేసుకోవాలి. జంతువును ఎడమ వైపు పడవేసి, కుడి భుజానికి దగ్గర తన కాలు పెట్టి జిబహ్ చేయాలి).

4- జిబహ్ చేయు వ్యక్తి బుద్ధిమంతుడు అయి ఉండాలి. అంటే పిచ్చివాడు లేదా ఏమీ తెలియని బాలుడు కాకూడదు.

శ్రద్ధ వహించండి

1- ఖుర్బానీ చేసే శక్తి ఏమాత్రం లేనివారు కూడా ఖుర్బానీ పుణ్యం పొందవచ్చు. ఒక సహాబీ వద్ద పాలిచ్చే పశువు తప్ప ఏమీ లేదు, అదే వారి జీవనాధారం, అప్పుడు ప్రవక్త అతనికి చెప్పారు: నీవు పండుగ రోజు నీ తల వెంట్రుకలు, మీసాలు, నాభి క్రింది వెంట్రుకలు, గోళ్ళు తీసుకో, ఇదే నీ కొరకు ఖుర్బానీ చేసిన పుణ్యంతో సమానం. (నిసాయి 4365, అబూదావూద్ 2789. కొందరు పండితులు ఈ హదీసును జఈఫ్ అన్నారు, కాని హాకిం, అహ్మద్ షాకిర్, ముస్నద్ అహ్మద్ ముహక్కికీన్ మరియు నిసాయి యొక్క షారిహ్ సహీ అన్నారు).

2- స్త్రీలు కూడా ఖుర్బానీ జంతువు జిబహ్ చేయవచ్చును. (ఇబ్ను మాజ 3182, బుఖారి).

3- ఖుర్బానీ మాంసం, తోలు వగైరా జంతువు జిబహ్ చేసిన వ్యక్తికి మజూరీగా ఇవ్వకూడదు. కాని బహుమానంగా ఇస్తే పరవాలేదు. (బుఖారి 1716, ముస్లిం 1317). తోలు స్వంత ఉపయోగానికి ఉంచుకున్నా అభ్యంతరం లేదు.

తప్పులు సరిదిద్దుకుందాం

1- కొందరు స్వయం తమ ఖుర్బానీ చేయరు, మృతుల వైపు నుండి చేస్తారు, ఇది తప్పు మరియు ప్రవక్త సంప్రదాయానికి విరుద్ధం. మృతుల వైపున ఖుర్బానీ చేయడం అన్నదే భేదాభిప్రాయం గల సమస్య, ఇక స్వయం తన వైపు నుండి వదలి మృతుల వైపు నుండి ఖుర్బానీ చేయడం గురించి ఏ ధర్మ పండితుడూ అనుమతి ఇవ్వలేదు.

 మృతుల వైపున ఖుర్బానీ యొక్క మూడు రకాలున్నాయిః

 • ఖుర్బానీ ఇస్తున్న వ్యక్తి తన వైపున మరియు తన ఇంటివారిలో బ్రతికి ఉన్న మరియు చనిపోయిన వారంది వైపున అని సంకల్పించుకోవడం యోగ్యం. (ఇబ్ను మాజ 3122).
 • చనిపోయిన వ్యక్తి వసియ్యత్ చేసి పోతే అతని వైపున ఖుర్బానీ చేయడం.
 • అతని వసియ్యత్ లేకుండా అతని వైపున చేయడాన్ని కొందరు పండితులు సదక (దానధర్మాల) లో లెక్కించి యోగ్యం అని చెప్పారు. కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితంలోనే ఆయన భార్య హజ్రత్ ఖదీజ రజియల్లాహు అన్హా మరియు సంతానంలో ముగ్గురు బిడ్డలు, ముగ్గురు కొడుకులు చనిపోయారు, అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నడూ వారి తరఫున ఖుర్బానీ చేయలేదు. (అందుకు సదకగా పరిగణించి చేయడం కూడా సహీ అనిపించదు).

2- జంతువును జిబహ్ చేస్తున్నప్పుడు ఇంట్లోని ప్రతి వ్యక్తి పేరు పలుకుతూ జిబహ్ చేయడం తప్పు. అలాగే ఒక సంవత్సరం తండ్రి పేరున, మరో సంవత్సరం తల్లి పేరున, ఆ తర్వత ఏడాది ప్రథమ కొడుకు పేరున ఇలా చేయడం కూడా తప్పు. ఇంటి బాధ్యులెవరో వారి పేరున ఖుర్బానీ జరుగుతుంది, పుణ్యం ఇంటివారందరికీ లభిస్తుంది.

సంకలనం & అనువాదం : ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ.

[Download PDF]

%d bloggers like this: