తోట యజమాని గాధ (The tory of a garden owner) https://youtu.be/1Yk-Zvq2sqg [6 నిముషాలు] వక్త: సయ్యద్ అబ్దుస్సలామ్ ఉమ్రి (హఫిజహుల్లాహ్)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఒక వ్యక్తి ఓ మైదానం గుండా వెళ్తుండగా ఏదో ఓ మేఘం నుంచి “ఫలానా వ్యక్తి తోటలో వర్షం కురిపించు” అన్న శబ్దం వినపడింది. మళ్ళీ ఆ మేఘం పక్కకు జరిగి ఓ నల్లని రాతి నేలపై కురిసింది. (దాంతో చిన్న చిన్న కాల్వలు ఏర్పడ్డాయి) చివరకు ఒక (పెద్ద) కాలువ మిగతా కాలువలన్నిటిని తనలో కలుపుకొని ప్రవహించసాగింది. ఆయన కూడా ఆ ప్రవాహం వెంట నడవసాగాడు. అటు ఓ మనిషి పారతో తన తోటకు నీళ్ళు కడుతున్నాడు. ‘ఓ దైవ దాసుడా! నీ పేరేమిటి అని అతడ్ని అడిగాడు. ఫలాన పేరు అని ఇతను మేఘంలో విన్నపేరే అతడు చెప్పాడు. ‘ఓ దైవదాసుడా! నా పేరెందుకు అడుగుతున్నావు’ అని అతడడిగాడు. ఇతడన్నాడుః నీవు చెప్పిన పేరే చెబుతూ ఫలాన తోటలో వర్షం కురిపించు అని నేను ఏ మేఘంలో విన్నానో దాని నీళ్ళే ఇవి. అయితే అసలు నీవు చేస్తున్న పనేమిటి? అతడన్నాడుః నీవు అడిగావు గనక చెబుతున్నానుః పంట పండిన తర్వాత నేను దాని అంచనా వేసుకొని, మూడో వంతు భాగం దానం చేస్తాను. మరో మూడో వంతు నేను, నా ఆలుబిడ్డలు తినడానికి (ఉంచుకుంటాను). మరో మూడో వంతు తిరిగి విత్తనంగా వేయుటకు ఉపయోగిస్తాను”. మరో ఉల్లేఖనంలో ఉందిః “నేను మూడో వంతును పేదవాళ్ళల్లో, అడిగేవారిలో మరియు బాటసారుల్లో దానం చేస్తాను”. (ముస్లిం 2984).
అల్లాహ్ శుభ నామాలైన: అర్ – రహ్మాన్ & అర్ – రహీం యొక్క వివరణ – నసీరుద్దీన్ జామిఈ [వీడియో] https://youtu.be/TroaV88YDwc [27 నిముషాలు]
సారాంశం
ఈ ప్రసంగంలో అల్లాహ్ యొక్క శుభ నామాలైన ‘అర్-రహ్మాన్’ (అనంత కరుణామయుడు) మరియు ‘అర్-రహీమ్’ (అపార కృపాశీలుడు) యొక్క లోతైన అర్థాలు మరియు ప్రాముఖ్యత వివరించబడింది. ‘అర్-రహ్మాన్’ అనేది అల్లాహ్ యొక్క విశాలమైన, అంతం లేని మరియు లెక్కింపశక్యం కాని కారుణ్యాన్ని సూచిస్తుంది, ఇది ఈ లోకంలో విశ్వాసులు మరియు అవిశ్వాసులు అందరిపై వర్షిస్తుంది. ‘అర్-రహీమ్’ అనేది ప్రత్యేకంగా ప్రళయదినాన కేవలం విశ్వాసులపై నిరంతరంగా కురిసే కారుణ్యాన్ని సూచిస్తుంది. ‘అర్-రహ్మాన్’ అనే పేరు అల్లాహ్‌కు మాత్రమే ప్రత్యేకం అని, ఇతరులకు ఆ పేరు పెట్టరాదని స్పష్టం చేయబడింది. అల్లాహ్ కారుణ్యం 70 మంది తల్లుల ప్రేమ కంటే ఎక్కువ అనే ప్రచారంలో ఉన్న మాట సరైనది కాదని, దానికి బదులుగా అల్లాహ్ తన కారుణ్యాన్ని వంద భాగాలుగా చేసి, అందులో ఒక్క భాగాన్ని మాత్రమే ఈ లోకానికి పంపాడని, మిగిలిన 99 భాగాలను తన వద్దే ఉంచుకున్నాడని తెలిపే సహీ హదీస్ వివరించబడింది. అల్లాహ్ యొక్క ఈ కారుణ్యాన్ని పొందాలంటే విశ్వాసం, దైవభీతి, నమాజ్, జకాత్ మరియు ఖురాన్ పఠనం వంటి సత్కార్యాలు చేయాలని, అలాగే తోటి సృష్టి పట్ల కరుణ చూపాలని ప్రసంగం ఉద్బోధిస్తుంది.
పూర్తి ప్రసంగం
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వసహ్ బిహి అజ్మయీన్, అమ్మా బాద్. ( الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ) (సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబంపై మరియు ఆయన అనుచరులందరిపై శాంతి మరియు శుభాలు కలుగుగాక.)
ప్రియ వీక్షకుల్లారా, సోదర సోదరీమణులారా, అల్లాహ్ యొక్క శుభ నామాలైన అర్-రహ్మాన్ (الرَّحْمَٰنِ), అర్-రహీమ్ (الرَّحِيمِ) వీటి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. అయితే, అల్లాహు తాలా ఖురాన్ ఆరంభంలోనే బిస్మిల్లాహ్ (بِسْمِ اللَّهِ) తర్వాత వెంటనే అర్-రహ్మానిర్-రహీమ్ (الرَّحْمَٰنِ الرَّحِيمِ) ఈ రెండు నామాలను ప్రస్తావించాడు.
అర్-రహ్మాన్, ఈ పేరు అలాగే అర్-రహీమ్, ఈ పేరు. ఈ రెండు కూడా ఖురాన్‌లో అనేక సందర్భాలలో వచ్చాయి. అయితే ఇన్షాఅల్లాహ్, నేను ప్రయత్నం చేస్తాను, ఒక 15 నుండి 20 నిమిషాల లోపుగా ఈ రెండు నామాల గురించి కనీసం ఐదు విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మొదటి విషయం దీని యొక్క భావం. అర్-రహ్మాన్ అని అంటే, ఇందులో అంతం కాని, విశాలమైన, లెక్కలేనంత కరుణా కటాక్షాలు గలవాడు అల్లాహ్ అన్నటువంటి భావం అర్-రహ్మాన్ అనే పదానికి వస్తుంది. ఇక అర్-రహీమ్, ఇందులో కూడా కారుణ్యం అన్న భావం ఉంది. ఎందుకంటే రెండు పేర్లు కూడా రా, హా, మీమ్ (ر، ح، م) ద్వారానే వచ్చాయి. అయితే, అర్-రహీమ్ అన్న ఈ పదములో, ఈ పేరులో అల్లాహ్ యొక్క కారుణ్యం దాసులపై, తన యొక్క సృష్టి రాశులపై కురుస్తూనే ఉంటుంది, కంటిన్యూయేషన్, ఈ భావం ఉంది. అర్థమైంది కదా? అర్-రహ్మాన్, అల్లాహ్ యొక్క విశాలమైన, అంతం కాని, మనం లెక్కకట్టనటువంటి కరుణా కటాక్షాలు. ఆ కరుణా కటాక్షాలు గలవాడు. అర్-రహీమ్ అంటే ఆ కరుణ తన దాసులపై, తన సృష్టి రాశులపై యెడతెగకుండా కురిపిస్తూ ఉండేవాడు.
ఇవి రెండూ కూడా అల్లాహ్ యొక్క పేర్లు అని మనం నమ్మాలి. ఇది మన అఖీదా, మన విశ్వాసం. ఈ రోజుల్లో, రహ్మాన్ అంటే, ఆహా ఏ.ఆర్. రెహమాన్, సింగర్, ఇలా రహ్మాన్ అన్న పేరు వింటేనే అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాల గురించి గుర్తు రాకుండా, ఇహలోకంలో ఇలాంటి పేరు పెట్టుకొని ప్రఖ్యాతి చెందిన కొందరు మనకు గుర్తు రావడం ఇది వాస్తవానికి అల్లాహ్ పట్ల మన యొక్క అజ్ఞానం. అల్లాహ్ కారుణ్యాల పట్ల మనం సరిగ్గా తెలుసుకోలేకపోయాము అన్నటువంటి భావం.
సోదర మహాశయులారా, ఇందులోనే మరొక విషయం మనం తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైనది ఏమిటంటే, రహ్మాన్ ఇది కూడా అల్లాహ్ అన్న అసలైన నామం ఏదైతే ఉందో దాని తర్వాత స్థానంలో వస్తుంది. వేరే ఇంకా ఎన్నో లెక్కలేనన్ని ఇతర పేర్ల కంటే ఎక్కువ ప్రాముఖ్యత గలది. అందుకొరకే ధర్మవేత్తలు ఏమంటారు? అల్లాహ్ తప్ప ఎవరి పేరు కూడా రహ్మాన్ అని పెట్టరాదు. అబ్దుర్రహ్మాన్ అని పెట్టవచ్చు, అలాగే పిలవాలి కూడా. కేవలం రహ్మాన్ అని పిలవరాదు. తప్పు ఇలా పిలవడం. కేవలం రహీమ్ అనవచ్చు, రవూఫ్ అనవచ్చు, కరీమ్ అనవచ్చు, అబ్ద్ లేకుండా. కానీ రహ్మాన్ అన్న పదం వేరే, అంటే అల్లాహ్ తప్ప వేరే ఎవరికైనా ‘అబ్ద్’ అన్నది లేకుండా కేవలం రహ్మాన్ అని పెట్టడం, పిలవడం ఇది తప్పు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి.
అల్లాహ్ సూర బనీ ఇస్రాయీల్‌లోని సుమారు చివర్లో ఏమన్నాడు? “ఖులిద్వుల్లాహ అవిద్వుర్-రహ్మాన్”( قُلِ ادْعُوا اللَّهَ أَوِ ادْعُوا الرَّحْمَٰنَ). మీరు అల్లాహ్ అని పిలవండి, దుఆ చేయండి, రహ్మాన్ అని దుఆ చేయండి, ఎలా చేసినా పర్లేదు.
రహ్మాన్ విషయంలో మనం దాని అర్థం, దాని భావం తెలుసుకున్నాము కదా. సంక్షిప్తంగా ఆ భావంలో మనకు తెలిసిన విషయం ఏంటి? అల్లాహ్ లెక్కలేనన్ని, ఎంతో విశాలమైన, అతి గొప్ప, అంతం కాని కరుణా కటాక్షాలు గలవాడు. తన సృష్టి రాశులపై తన కరుణా కటాక్షాలు కురిపిస్తూనే ఉంటాడు.
ఇక్కడే ఒక పొరపాటును దూరం చేసుకోవాలి. తప్పుడు భావాన్ని మనం దాని రూపుమాపేసేయాలి. సర్వసామాన్యంగా మనలో ఒక మాట ప్రబలి ఉన్నది. అల్లాహ్ 70 తల్లుల కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు అని. చాలా ప్రబలి ఉంది కదా ఈ మాట? ఇది తప్పు. దీనికి సంబంధించి ఏ సహీ హదీస్ లేదు. మనం 70 అని అక్కడ చెబుతుంటే, ఒకవేళ చాలా ఎక్కువగా అని భావం తీసుకుంటే అది వేరే విషయం కావచ్చు కానీ, సర్వసామాన్యంగా ఇది తెలియని వారు ఏమనుకుంటారు? ఎందుకంటే ఇక్కడ దలీల్ కూడా లేదు. మళ్లీ మన ఈ మాట మన సమాజంలో ప్రబలి ఉంది. అందుకొరకు దీనిని తగ్గించే ప్రయత్నం చేయాలి. అల్లాహు తాలా 70 ఏ కాదు, లెక్కలేనన్ని కరుణా కటాక్షాలు గలవాడు. ఎలా?
దీనికి సంబంధించి నేను రెండు హదీసులు మీకు వినిపిస్తున్నాను. కొంచెం శ్రద్ధ వహించండి. ఇన్షాఅల్లాహ్ దీని ద్వారా విషయం మరింత స్పష్టంగా మీకు తెలిసి వస్తుంది. మొదటి హదీస్ సహీ బుఖారీలో వచ్చినది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు, جَعَلَ اللَّهُ الرَّحْمَةَ مِائَةَ جُزْءٍ (జ’అలల్లాహు అర్-రహ్మత మి’అత జుజ్’ఇన్) అల్లాహు తాలా తన కారుణ్యాన్ని, రహ్మత్‌ని 100 భాగాలు చేశాడు. ఎన్ని భాగాలండీ? 100 భాగాలు చేశాడు. తన వద్ద 99 భాగాలను ఆపుకున్నాడు, ఉంచుకున్నాడు. కేవలం ఒక్క భాగం మాత్రమే ఈ లోకంలో పంపాడు. ఆ ఒక్క భాగంలోనే మానవులకు, పశువులకు, ఇతర సృష్టి రాశులకు అందరికీ లభించినది. అందరికీ ఆ ఒక్క భాగంలో నుండే లభించినది. సర్వ సృష్టి పరస్పరం ఏ కారుణ్యం చూపుతుందో, అల్లాహ్ పంపిన 100 భాగాల్లో నుండి ఒక భాగంలోనిదే. చివరికి ఏదైనా పక్షి గాని, హదీస్‌లో వచ్చి ఉంది గుర్రం గురించి, ఒక గుర్రం తన యొక్క కాలు ఏదైనా అవసరానికి లేపినప్పుడు, తన దగ్గర పాలు త్రాగుతున్నటువంటి గుర్రం పిల్లకు తాకి ఏదైనా బాధ కలగకూడదు అని కూడా శ్రద్ధ వహిస్తుంది. అలాంటి ఆ కారుణ్యం ఆ గుర్రంలో కూడా ఉంది అంటే అల్లాహ్ పంపిన ఆ ఒక్క భాగంలోని ఒక చిన్న భాగమే. (సహీ బుఖారీ, హదీస్ నంబర్ 6000). (మహా ప్రవక్త మహితోక్తులు 1750)
ఇక రెండవ హదీస్, ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉండగానే ఒక బానిస, తన పాలు త్రాగే పిల్లవాడిని తప్పిపోయింది. ఎంతసేపయిందో పాపం, తన ఆ చంటి పాపకు పాలు త్రాగించకుండా ఆమె స్థనాలు పాలతో నిండిపోయి, అటు ఒక బాధగా ఉంది మరియు పాప తప్పిపోయినందుకు ఓ బాధ. ఈ మధ్యలో ఏ చిన్న పాపను చూసినా తీసుకుని పాలు త్రాపిస్తుంది. ఈ సంఘటనను గమనించిన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు సహాబాలతో ప్రశ్నించారు. ఏమిటి మీ ఆలోచన? ఈ తల్లి తన ఆ పిల్లను, ఆ బిడ్డను అగ్నిలో వేస్తుందా? ఉమర్ (రదియల్లాహు అన్హు) అంటున్నారు, మేమందరం అన్నాము, “లా” (లేదు). ఆమె ఏ కొంచెం శక్తి అయినా సంపాదించి పడకుండా జాగ్రత్త పడుతుంది కానీ, ఎలా వేయగలదు? అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు, لَلَّهُ أَرْحَمُ بِعِبَادِهِ مِنْ هَذِهِ بِوَلَدِهَا (అల్లాహు అర్హము బి’ఇబాదిహీ మిన్ హాజిహీ బి’వలదిహా) “అల్లాహ్ తన దాసుల పట్ల ఈమెకు తన బిడ్డపై ఉన్న కారుణ్యం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా కరుణ గలవాడు.”
అయితే అర్థమైంది కదా విషయం. రహ్మాన్, రహీమ్ యొక్క భావాలు ఏంటో అది తెలిసింది. అల్లాహ్ యొక్క పేర్లు అని మనం నమ్మాలి, విశ్వసించాలి అని తెలిసింది. ఈ పేర్లలో ఉన్నటువంటి అల్లాహ్ యొక్క గొప్ప గుణం కారుణ్యం, కరుణా కటాక్షాలు ఇవి తెలిసాయి. వీటిని మనం అలాగే నమ్మాలి, వేరే ఎవరితో పోల్చకూడదు, ఇందులో ఎలాంటి షిర్క్ చేయకూడదు. రహ్మాన్ అల్లాహ్ యొక్క ప్రత్యేక పేరు అని కూడా తెలిసింది, ఎవరూ కూడా దాని యొక్క అలాంటి పేరు పెట్టకూడదు. ఎవరైనా పెట్టదలచుకుంటే అబ్దుర్రహ్మాన్ అని పెట్టాలి కానీ, కేవలం రహ్మాన్ అని పెట్టరాదు. ఇక సమాజంలో ఉన్న ఒక పొరపాటు కూడా దూరమైపోయింది.
ఇక రండి సోదర మహాశయులారా, అల్లాహ్ యొక్క కరుణా కటాక్షం ఎంత గొప్పదంటే, ఈ లోకంలో అల్లాహు తాలా ఆయన్ని విశ్వసించిన వారినే కాదు, తిరస్కరించి తలబిరుసుతనం వహించి తన ప్రవక్తలను, పుణ్యాత్ములను సైతం శిక్షలకు గురి చేసే వారిని కూడా కరుణిస్తున్నాడు, వారిపై కూడా తన కరుణా కటాక్షాలు కురిపిస్తున్నాడు. అయితే, అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలు ఈ లోకంలో పుణ్యాత్ములతో పాటు పాపాత్ములకు కూడా దొరుకుతాయి. కానీ పరలోకాన, పరలోకాన కేవలం విశ్వాసులు మాత్రమే అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలకు అర్హులవుతారు. అక్కడ అవిశ్వాసులు, అల్లాహ్‌ను ధిక్కరించిన వారు పరలోక దినాన అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలను పొందలేరు. “వ కాన బిల్ ముఅమినీన రహీమా” (وَكَانَ بِالْمُؤْمِنِينَ رَحِيمًا) (ఆయన విశ్వాసుల పట్ల అపార కరుణాశీలుడు).
అర్-రహ్మాన్ అన్న పేరుతో ఖురాన్‌లో అల్లాహ్ అర్ష్ (సింహాసనం) పై ఉన్నాడు అన్న విషయానికి అర్-రహ్మాన్ అన్న పదంతో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రస్తావించాడు. “అర్-రహ్మాను అలల్-అర్షిస్తవా” (الرَّحْمَٰنُ عَلَى الْعَرْشِ اسْتَوَىٰ) (అనంత కరుణామయుడు సింహాసనంపై ఆసీనుడయ్యాడు).
ఈ రెండు పేర్ల యొక్క భావం మనకు తెలిసినప్పుడు, ఇక ఆ రెండు పేర్ల ప్రభావం మన జీవితాలపై ఎలా పడాలంటే, మనం ఎల్లవేళల్లో అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలు ఇహలోకంలో పొందడంతో పాటు, శాశ్వత జీవితమైన ఆ పరలోకంలో పొందడానికి ఈ లోకంలోనే ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో ప్రయత్నం చేయకుంటే, ఇక్కడ ఏదో అతని కరుణా కటాక్షాలు పొందుతాము, కానీ పరలోక దినాన పొందకుండా ఏ నష్టమైతే అక్కడ మనకు వాటిల్లుతుందో దాని నుండి తప్పించుకోవడానికి ఏ మార్గం ఉండదు.
అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలు ఇహలోకంతో పాటు పరలోకంలో కూడా మనం పొందాలంటే, విశ్వాస మార్గాన్ని అవలంబించాలి. మనం ధర్మంపై స్థిరంగా ఉండాలి. అల్లాహ్ ప్రతి ఆదేశాన్ని పాటించాలి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ని అనుసరించాలి, ఐదు పూటల నమాజులు చేయాలి, జకాతు ఇవ్వాలి, ఖురాన్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి చదువుతూ, వింటూ ఉండాలి. సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే, అల్లాహ్‌కు ఇష్టమైన రీతిలో, ప్రవక్త విధానంలో మన జీవితం గడవాలి, ఇస్లాంకు వ్యతిరేకంగా ఏ మాత్రం మనం నడవకూడదు. అప్పుడే ఇహలోకంలోతో పాటు పరలోకంలో కూడా మనం శాశ్వతమైన అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలు పొందగలుగుతాము. దీనికి సంబంధించి రండి, సంక్షిప్తంగా నేను కొన్ని ఆయతుల రిఫరెన్స్ మీకు ఇస్తాను. మీరు ఆ రిఫరెన్స్‌లను శ్రద్ధగా ఒకవేళ నోట్ చేసుకున్నారంటే కేవలం, వివరంతో కూడి దాని యొక్క వ్యాఖ్యానం మీరు ఇన్షాఅల్లాహ్ అల్లాహ్ దయతో చదువుకోగలరు. ఉదాహరణకు చూడండి:
సూరహ్ ఆలి-ఇమ్రాన్ (3), ఆయత్ 132.
సూరతుల్ అన్ఆమ్ (6), ఆయత్ 155.
సూరహ్ అల్-ఆరాఫ్ (7), ఆయత్ 63 (దైవభీతి గురించి).
సూరహ్ అల్-ఆరాఫ్ (7), ఆయత్ 204 (ఖురాన్ విషయంలో).
సూరతున్నూర్ (24), ఆయత్ 56 (నమాజ్, జకాత్, విధేయత).
సూరహ్ నమ్ల్ (27), ఆయత్ 46 (క్షమాపణ కోరడం).
ఇక, పరస్పరం సోదర భావం కలిగి ఉండడం, ఎవరి పట్ల ద్వేషం లేకుండా ఉండడం, ఎవరితో కూడా మనం మాట వదులుకోకుండా, ఎప్పుడైనా ఎవరితోనైనా ఏదైనా పొరపాటు జరిగితే, తప్పుడు భావాలు జరిగితే, మాటలో ఏదైనా అర్థం కాకుండా పరస్పరం సంబంధాల్లో తెగతెంపులు, దూరం ఏర్పడితే, “ఫ అస్లిహూ” (فَأَصْلِحُوا) (సంధి చేయండి) సులహ్, సంధి, దగ్గర కావడం, కలుపుగోలుతనంతో మెలగడం, ఇలా చేయడం ద్వారా కూడా మీరు అల్లాహ్ కారుణ్యాన్ని పొందుతారని సూరతుల్ హుజురాత్ (49), ఆయత్ 10లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తెలిపాడు.
ఇక్కడ మీరు గమనించండి, కొన్ని రిఫరెన్సులు మాత్రమే నేను రాయించాను కదా మీకు, ఇందులో అఖీదా వస్తుంది, ఇబాదాత్‌లు వచ్చేస్తాయి, ఆరాధనలు. ఇందులో క్యారెక్టర్, అఖ్లాక్ కూడా వచ్చేస్తుంది. భార్యాభర్తల సంబంధం విషయంలో కూడా అల్లాహ్ కారుణ్యాన్ని ఎలా పొందాలి? సూరత్ రూమ్‌లో చదవండి, 31వ ఆయత్ నంబర్. అల్లాహు అక్బర్. సోదర మహాశయులారా, పిల్లల పట్ల మనం అల్లాహ్‌కు ఇష్టమైన రీతిలో ప్రేమ కలిగి ఉండి, (ఇక్కడ నేను ఒక పదం పెంచాను గుర్తుందా? అల్లాహ్‌కు ఇష్టమైన రీతిలో) సర్వసామాన్యంగా ప్రతి తల్లిదండ్రికి సంతానం పట్ల ప్రేమ ఉంటుంది, ఇది స్వాభావికమైనది. కానీ మనం అల్లాహ్‌కు ఇష్టమైన రీతిలో వారిని ప్రేమించడం అంటే, వారు ఇహలోకంలో మనకు కేవలం సంతానం అనే కాదు, వారు రేపటి రోజు నరకంలో పోకుండా ఉండడానికి అల్లాహ్‌కు ఇష్టమైన రీతిలో వారిని శిక్షణ ఇవ్వడం, ఇది అసలైన ప్రేమ.
ఇక రండి, ఈ రహ్మాన్, రహీమ్ యొక్క వివరణలో మరో కోణంలో మరికొన్ని విషయాలు తెలుసుకొని సమాప్తం చేద్దాం. అదేమిటి? అల్లాహు తాలా ఎవరికైనా ఏదైనా కరుణ నొసంగాడంటే, ఎవరూ కూడా ఆపలేరు అని అల్లాహు తాలా చాలా స్పష్టంగా తెలిపాడు. మరియు అల్లాహ్ తన కారుణ్యాన్ని ఎవరి నుండైనా ఆపాడంటే, అల్లాహ్‌కు విరుద్ధంగా అతనికి కరుణ నొసంగేవాడు ఎవడూ లేడు.
ఇక్కడ మన విశ్వాసాన్ని ఈ ఖురాన్ యొక్క ఆయత్ ద్వారా మనం సరిచేసుకోవాలి. ముస్లింలలో కూడా ఎందరో తప్పుడు విశ్వాసాలు, అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు కలిగి ఉన్నారు. సర్వసామాన్యంగా మూసా (అలైహిస్సలాం) గురించి ఒక తప్పుడు కథను కొందరు ప్రసంగీకులు ప్రజల ముందు చెబుతూ ఉంటారు. ఇది వారు ఏమనుకుంటారు? అల్లాహ్ యొక్క వలీల షాన్ (గొప్పతనం) చెబుతున్నాము అని. కానీ నవూజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహ్‌కు వ్యతిరేకంగా, ప్రవక్తలకు వ్యతిరేకంగా ఎలాంటి కథలు కట్టి, అల్లి ప్రజల ముందు ప్రజలకు తెలియజేసి విశ్వాసాలను పాడు చేస్తున్నారో వారు అర్థం చేసుకోరు.. వృద్ధాప్యానికి దగ్గరైన ఒక స్త్రీ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నాకు పెళ్లి అయి కానీ సంతానం లేదు, మీరు ప్రవక్త కదా నాకు దుఆ చేయండి అల్లాహ్ సంతానం ఇవ్వాలని. మూసా (అలైహిస్సలాం) దుఆ చేస్తే అల్లాహు తాలా చెప్పాడంట, మూసా ఆమె అదృష్టంలో నేను సంతానం రాయలేదు అని. ఆమె చాలా బాధతో అటు పోతూ ఉంటే, ఒక అల్లాహ్ యొక్క వలీ కలిశాడంట. నవూజుబిల్లాహ్, ఇది అబద్ధం, కానీ ప్రజలు చెబుతారు, “ఓ సుబ్హానల్లాహ్, మాషాఅల్లాహ్, అల్లాహ్ కే వలీ కి క్యా షాన్ హై” అనుకుంటూ తలలు ఊపుతారు అజ్ఞానులు. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. ఏమైంది? బాధతో ఆ స్త్రీ వెళ్తూ ఉంటే అటు ఒక వలియుల్లా కలిశాడంట. “ఏంటమ్మా చాలా బాధగా వెళ్తున్నావ్, ఏమైంది నీకు?” అని అడిగితే, సంతానం లేదు, సంవత్సరాలు అయిపోయింది పెళ్లి అయి. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) వద్దకు వెళ్తే ఇక నాకు సంతానమే లేదు అని తెలిసింది, అందుకే బాధగా ఉన్నాను. “అట్లా ఎట్లా జరుగుద్ది, నేను నీకు సంతానం ఇప్పించి ఉంటాను” అని తన కట్టెతో ఇలా భూమి మీద కొట్టాడంట, తర్వాత అల్లాహ్‌తో వాదించాడంట. ఆ తర్వాత ఆమెకు సంతానం కలుగుతుంది అని శుభవార్త వచ్చిందంట. అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. చదవండి సూరహ్ ఫాతిర్ (35), ఆయత్ 2 మరియు సూరత్ అజ్-జుమర్ (39), ఆయత్ 38. ఇలాంటి తప్పుడు భావాలన్నీ కూడా దూరం కావాలి.
అయితే, ఈ లోకంలో మనం పుట్టడం, ఇది స్వయం అల్లాహ్ యొక్క కారుణ్యం. మనకు తల్లిదండ్రుల ద్వారా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఏదైతే పోషణ మార్గాలు వారికి నొసంగాడో, ఇది కూడా అల్లాహ్ యొక్క కారుణ్యం. ఈ లోకంలో మనకు సంతానం కలగడం, భార్యలు కలగడం, స్త్రీలకు భర్తలు లభించడం, ఇంకా ఎన్నో రకాల అనుగ్రహాలు, ఉపాధి అవకాశాలు, ఇవన్నీ కూడా అల్లాహ్ యొక్క కారుణ్యం. కానీ, అసలైన కారుణ్యాలను మరచిపోకండి. అవేంటి? విశ్వాసులకు లభించేటువంటి విశ్వాస భాగ్యం, పుణ్యకార్యాలు చేసేటువంటి భాగ్యం. అయితే సోదర మహాశయులారా, ఈ సందర్భంలో మనం గుర్తించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఇహలోకపు సామాగ్రిలో, ప్రపంచపు యొక్క వసతులలో మనకు ఏది లభించినా, విశ్వాసం లభించలేదు, పుణ్యకార్యాల భాగ్యం లభించలేదు అంటే మనకంటే దురదృష్టవంతుడు మరెవడూ ఉండడు. ఇహలోక సామాగ్రిలో ఏదైనా కొరత జరిగి, సంతానం చనిపోవడం గానీ, ఏదైనా వ్యాపారంలో నష్టం జరగడం గానీ, వ్యవసాయంలో మునగడం గానీ, ఇంకా ఏది జరిగినా విశ్వాసం బలంగా ఉంది, అల్లాహ్ ఇష్ట ప్రకారంగా మన జీవితం గడుస్తుంది అంటే, ఓపిక సహనాలతో ఇది అల్లాహ్ యొక్క గొప్ప కారుణ్యం మనపై ఉన్నట్లు. దీనికి చిన్న ఉదాహరణ ఇచ్చే ముందు, ప్రజలలో ప్రబలి ఉన్నటువంటి ఒక తప్పుడు ఆలోచన ఏమిటంటే, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే, ఎవరైనా వ్యాపారంలో నష్టంలో ఉంటే, ఎవరికైనా ఏదైనా ఇహలోకపు కష్టం, బాధ, ఏదైనా నష్టం జరిగితే ఎంతటి దుర్మార్గుడో, ఎంతటి దురదృష్టవంతుడో, అందుకొరకే అల్లాహ్ వాన్ని ఇలా పరీక్షిస్తున్నాడు అని అనుకుంటాము. ఒకవేళ అతడు విశ్వాసంలో మంచిగా ఉన్నా, నమాజులు మంచిగా చదువుతూ ఉన్నా, అతడు అల్లాహ్ యొక్క భయభీతి కలిగి ఉన్నా, ఇహలోక సామాగ్రి తగ్గింది గనుక మనం అతన్ని కించపరుస్తాము, అవహేళన చేస్తాము. సోదరులారా, ఇది చాలా తప్పు విషయం.
ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క నెలలు గడిచేవి ఇంట్లో పొయ్యి కాలేది కాదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవించి ఉండగానే తమ ఏడుగురి సంతానంలో ఆరుగురు చనిపోతారు, కేవలం ఒక్కరే మిగిలి ఉంటారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానికి కంటే ముందే ఇద్దరు భార్యలు చనిపోతారు. ఇక చాలా దగ్గరి బంధుమిత్రుల్లో ఎంతోమంది చనిపోతారు. నవూజుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, ప్రవక్తకు అల్లాహ్ కారుణ్యం లభించలేదా? కాదు. అల్లాహ్ ప్రవక్తనే సర్వలోకాలకు కారుణ్యంగా పంపాడు. “వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్” ( وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِّلْعَالَمِينَ). (నిన్ను మేము సర్వ లోకాలకు కారుణ్యంగా తప్ప పంపలేదు). అందుకొరకే అల్లాహ్ యొక్క రహ్మాన్, రహీమ్ యొక్క పేర్లు, ఈ భావం గల నామాలు ఎక్కడెక్కడ మనం విన్నా గానీ ఖురాన్‌లో, హదీస్‌లో, మన విశ్వాసం సరిగ్గా ఉండాలి, పరస్పరం మనం ఒకరి పట్ల ఒకరు కరుణించుకునేటువంటి గుణం కలిగి ఉండాలి.
చివరిలో నేను ఈ హదీస్, ఖురాన్ యొక్క ఆయత్‌తో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. “ముహమ్మదుర్-రసూలుల్లాహ్, వల్లజీన మఅహూ అషిద్దావు అలల్-కుఫ్ఫారి రుహమావు బైనహుమ్” (مُحَمَّدٌ رَسُولُ اللَّهِ ۚ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ). (ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త. ఆయనతో ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినంగా, తమలో తాము కరుణామయులుగా ఉంటారు). రుహమావు బైనహుమ్ (رُحَمَاءُ بَيْنَهُمْ). విశ్వాసులు పరస్పరం ఒకరికి ఒకరు కరుణించుకునేవారు. ఈ గుణం కలిగి ఉండడం తప్పనిసరి.
ఇక ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క హదీస్: “అర్రాహిమూన యర్హముహుముర్-రహ్మాన్, ఇర్హమూ మన్ ఫిల్-అర్ది యర్హమ్కుమ్ మన్ ఫిస్-సమా” (الرَّاحِمُونَ يَرْحَمُهُمُ الرَّحْمَٰنُ، ارْحَمُوا مَنْ فِي الْأَرْضِ يَرْحَمْكُمْ مَنْ فِي السَّمَاءِ). (కరుణించే వారిని కరుణామయుడైన అల్లాహ్ కరుణిస్తాడు. మీరు భూమిపై ఉన్నవారిని కరుణించండి, ఆకాశంలో ఉన్నవాడు (అల్లాహ్) మిమ్మల్ని కరుణిస్తాడు).
అల్లాహు తాలా మనందరికీ కూడా అల్లాహ్ యొక్క ఈ రెండు పేర్లను మంచి రీతిలో అర్థం చేసుకుని దాని ప్రకారంగా మన విశ్వాసాన్ని కలిగి ఉండే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.
వ ఆఖిరు దావానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.
وَيْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు. (సూరా అల్ హుమజా 104:1)
2. చాడీలు చెప్పేవారు స్వర్గంలో ప్రవేశించలేరు:
హజ్రత్ హుజైఫా (రజియల్లాహు అన్హు) ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “చాడీలు చెప్పేవాడు స్వర్గంలోకి వెళ్ళలేడు.” (బుఖారీ-ముస్లిం, సహీహ్ బుఖారీలోని అదబ్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)
చాడీలు చెప్పటం ముమ్మాటికీ నిషిద్ధం. ఈ విషయం తెలిసి కూడా ఎవడైనా దాన్ని ధర్మసమ్మతంగా భావించి చాడీలు చెబుతూ ప్రజల మధ్య సంబంధాలను చెడగొట్టటానికి పాల్పడితే అలాంటివారు ఎన్నటికీ స్వర్గానికి వెళ్ళలేరు.
3. చాడీలు చెప్పేవారికి సమాధి శిక్ష తప్పదు
హజ్రత్ ఇబ్నే అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రెండు సమాధుల దగ్గర్నుంచి వెళ్తూ ఇలా అన్నారు. “ఈ రెండు సమాధుల్లో ఉన్నవారికి శిక్షపడుతోంది. వీరికి ఈ శిక్ష ఏదో పెద్ద విషయం మూలంగా పడుతుంది కాదు! (ఆ తర్వాత ఆయనే అన్నారు) ఎందుకు కాదు, అది పెద్ద విషయమే. వీరిలో ఒకడు చాడీలు చెప్తూ తిరుగుతుండేవాడు. మరొకతను మూత్రం పోసినప్పుడు ఒంటిమీద దాని తాలూకు తుంపరలు పడకుండా జాగ్రత్తపడేవాడు కాదు.” (బుఖారీ-ముస్లిం)
4. చాడీలు చెప్పేవారికి నరక శిక్ష తప్పదు
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈవిధంగా ప్రవచించారు: “నాకు మేరాజ్ (యాత్ర) చేయించబడినప్పుడు నేను కొంత మంది సమీపం నుంచి వెళ్ళటం తట స్థించింది. వారికి ఇత్తడి గోళ్ళున్నాయి. వాటితో వారు తమ ముఖాలను,రొమ్ములను గీక్కుంటున్నారు. అది చూసి నేను (ఆశ్చర్యంతో) “జిబ్రయీల్ ఎవరు వీరు?” అని అడిగాను. అందుకు జిబ్రయీల్ సమాధానమిస్తూ, “వీరా, వీరు (ప్రపంచంలో) ప్రజల మాంసం తినేవారు (అంటే వారిని పరోక్షంగా నిందించేవారు) వారి మాన మర్యాదలను కాలరాసేవారు” అని చెప్పారు (అబూదావూద్)
70- ఎంత గొప్ప వస్తువైనా ప్రసాదించడం అల్లాహ్‌కు కష్టతరమైన పని కాదు. సృష్టిరాసుల అవసరాలు పూర్తి చేయకుండా ఆయన్ని అడ్డుకునేవాడెవడూ లేడు. వారి అవసరాలు పూర్తి చేయటకు ఆయన్ని బలవంతం చేయువాడెవడూ లేడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీరు అల్లాహ్ తో దుఆ చేస్తున్నప్పుడు “అల్లాహ్! నీవు కోరితే నన్ను క్షమించు, అల్లాహ్! నీవు కోరితే నన్ను కరుణించు, అల్లాహ్! నీవు కోరితే నాకు ఆహరం ప్రసాదించు” అని దుఆ చేయవద్దు. దానికి బదులుగా దృఢ నమ్మకంతో దుఆ చేయాలి. ఆయన తాను కోరింది చేయగలవాడు. ఆయన్ని ఎవరూ బలవంతం పెట్ట లేరు”. (బుఖారి/ఫిల్ మషీఅతి వల్ ఇరాద 7477, ముస్లిం/ అల్ అజ్మ్ బిద్దుఆ…2678).
మరో ఉల్లేఖనంలో ఉందిః “తన కోరికను చాలా స్పష్టంగా తెలుపాలి. నిశ్చయంగా అల్లాహ్ ప్రాసదించేవాటిలో ఆయనకు కష్టతరమైనదేదీ లేదు”. (ముస్లిం 2679).
ఇంటి ఓనర్ కి డబ్బు అప్పు ఇచ్చి, దానికి వడ్డీ తీసుకోకుండా, అతని ఇంట్లో అద్దె ఇవ్వకుండా ఉండవచ్చా? [ఆడియో] https://youtu.be/9_0mCbZ5wWc [5 నిముషాలు]
(తీర్పు దినం రోజు) వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయిన వాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణం “వ్యాపారం కూడా వడ్డీలాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్ద నుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతను గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవాధీనం. ఇకమీదట కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు. [అల్ బఖర – 2 : 275 ]
అల్లాహ్ వడ్డీని హరింపజేస్తాడు. దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్ సుతరామూ ప్రేమించడు.విశ్వసించి (సున్నత్ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్ ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు.
ఓ విశ్వసించినవారలారా! అల్లాహ్ కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలిఉన్న వడ్డీని విడిచి పెట్టండి. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరు ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరగకూడదు. ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదిలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీకొరకు శ్రేయోదాయకం.[అల్ బఖర – 2 : 276 – 280 ]
ఈ ప్రసంగంలో, వక్త ఖురాన్ యొక్క ప్రాముఖ్యత మరియు ఘనత గురించి వివరించారు. ఖురాన్ అనేది హితోపదేశం, స్వస్థత, మార్గదర్శకత్వం మరియు కారుణ్యంతో కూడిన అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం అని ఆయన పేర్కొన్నారు. ఖురాన్ పారాయణం చేసేవారికి, దాన్ని నేర్చుకుని, నేర్పించేవారికి లభించే గొప్ప ప్రతిఫలాలను ఖురాన్ ఆయతులు మరియు ప్రవక్త హదీసుల ద్వారా వివరించారు. ఖురాన్ పారాయణ సభల యొక్క ఘనత, ప్రళయ దినాన ఖురాన్ తన సహచరులకు సిఫారసు చేయడం, మరియు స్వర్గంలో ఖురాన్ సహచరుడి ఉన్నత హోదా గురించి కూడా చర్చించారు. ఖురాన్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి పట్ల మరియు అల్లాహ్ మార్గంలో ధనాన్ని ఖర్చు చేసే వ్యక్తి పట్ల అసూయ పడటం అనుమతించబడిందని తెలిపారు. చివరగా, ఖురాన్‌ను విడిచిపెట్టిన వారి పశ్చాత్తాపాన్ని మరియు ‘ఖురాన్ నేర్చుకుని, ఇతరులకు నేర్పించేవారే మీలో ఉత్తములు’ అనే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుతో ప్రసంగాన్ని ముగించారు.
أَلْحَمْدُ لِلّٰهِ نَحْمَدُهُ وَنَسْتَعِيْنُهُ وَنَسْتَغْفِرُهُ وَنُؤْمِنُ بِهِ وَنَتَوَكَّلُ عَلَيْهِ [అల్ హందులిల్లాహి నహ్మదుహూ వ నస్త’ఈనుహూ వ నస్తగ్ఫిరుహూ వ ను’మిను బిహీ వ నతవక్కలు అలైహ్] సర్వ స్తోత్రములు అల్లాహ్ కే. మేము ఆయననే స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్నే అర్థిస్తున్నాము మరియు ఆయననే క్షమాపణ కోరుతున్నాము, ఆయనపైనే విశ్వసిస్తున్నాము మరియు ఆయనపైనే భారం మోపుతున్నాము.
وَنَعُوْذُ بِاللهِ مِنْ شُرُوْرِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا [వ న’ఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అ’మాలినా] మరియు మేము మా ఆత్మల కీడుల నుండి మరియు మా చెడు కార్యాల నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము.
مَنْ يَهْدِهِ اللهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ [మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ, వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహ్] అల్లాహ్ ఎవరికైతే మార్గనిర్దేశం చేస్తాడో, అతనిని ఎవరూ తప్పుదారి పట్టించలేరు, మరియు ఆయన ఎవరిని తప్పుదారి పట్టిస్తాడో, అతనికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.
وَأَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ [వ అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహ్] మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని, ఆయన ఏకైక దేవుడు మరియు ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.
وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُوْلُهُ [వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ] మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త.
أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيْثِ كِتَابُ اللهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ [అమ్మా బ’ద్ ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్, వ ఖైరల్ హద్ యి హద్ యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం] ఇక ఆ తర్వాత, నిశ్చయంగా అన్ని మాటలలో కెల్లా ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం (ఖురాన్). మరియు అన్ని మార్గాలలో కెల్లా ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గం.
وَشَرَّ الْأُمُوْرِ مُحْدَثَاتُهَا وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ وَكُلَّ ضَلَالَةٍ فِي النَّارِ [వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా, వ కుల్ల ముహ్దసతిన్ బిద్’అహ్, వ కుల్ల బిద్’అతిన్ దలాలహ్, వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్] మరియు అన్ని విషయాలలో కెల్లా చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. మరియు ప్రతి కొత్తగా కల్పించబడిన విషయం బిద్అత్ (ధర్మంలో నూతన ఆవిష్కరణ). మరియు ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వం. మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి దారితీస్తుంది.
సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన, సకల లోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయు గాక.
ఖురాన్ – అల్లాహ్ యొక్క గొప్ప ఉపకారం
అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనపై అసంఖ్యాకమైన వరాలను ప్రసాదించాడు, ఉపకారం చేశాడు. వాటిలో ఒకటి ముఖ్యమైనది ఖురాన్ గ్రంథం అవతరణ. ఖురాన్ అవతరణ ద్వారా ఈ ఉమ్మత్ పైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చేసిన గొప్ప ఉపకారాలలో ఒకటి. ఈ ఖురాన్ గ్రంథంలో మౌఇదా, హితోపదేశం ఉంది. షిఫా, స్వస్థత ఉంది. హుదా, మార్గదర్శకం ఉంది. రహ్మా, కారుణ్యం ఉంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర యూనుస్ లో ఇలా తెలియజేశాడు.
يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ وَشِفَاءٌ لِّمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ “ఓ ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుండి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థత నొసుగుతుంది. మరియు నమ్మే వారి కోసం మార్గదర్శకం చూపుతుంది (మరియు కారుణ్యం).”
ఈ ఖురాన్ జ్యోతి, స్పష్టమైన గ్రంథం. దానిలో ఏముంది? అది మనం తెలుసుకోవాలి. చదివి, అర్థం చేసుకొని. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు.
قَدْ جَاءَكُم مِّنَ اللَّهِ نُورٌ وَكِتَابٌ مُّبِينٌ “అల్లాహ్ తరఫు నుంచి మీ వద్దకు జ్యోతి వచ్చేసింది, అంటే స్పష్టమైన గ్రంథం వచ్చేసింది.”
అంటే ఈ ఖురాన్ జ్యోతి, స్పష్టమైన గ్రంథం. దాని ద్వారా, ఖురాన్ ద్వారా, ఈ జ్యోతి ద్వారా, ఈ నూర్ ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన ప్రసన్నతను అనుసరించే వారికి శాంతి మార్గాలను చూపుతాడు. తన కోరిక మేరకు వారిని చీకట్లో నుంచి, అంధకారంలో నుంచి వెలికి తీసి కాంతి వైపుకు తీసుకువస్తాడు. రుజుమార్గం వైపుకు దర్శకత్వం వహిస్తాడు, ఈ ఖురాన్ ద్వారా, ఈ నూర్, ఈ జ్యోతి ద్వారా.
ఇంకా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు.
إِنَّ الَّذِينَ يَتْلُونَ كِتَابَ اللَّهِ وَأَقامُوا الصَّلَاةَ وَأَنفَقُوا مِمَّا رَزَقْنَاهُمْ سِرًّا وَعَلَانِيَةً يَرْجُونَ تِجَارَةً لَّن تَبُورَ దైవగ్రంథాన్ని పఠిస్తూ నమాజును నెలకొల్పేవారు, మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ, బహిరంగంగానూ ఖర్చు చేసేవారు ఎన్నటికీ నష్టం కలుగని వర్తకాన్ని ఆశిస్తున్నారు. (35:29)
అంటే, ఈ జ్యోతిని, ఈ స్పష్టమైన గ్రంథాన్ని, ఈ ఖురాన్‌ని పఠిస్తూ నమాజును నెలకొల్పే వారు, ఖురాన్ పారాయణం, ఖురాన్ పఠనం, అలాగే నమాజును నెలకొల్పే వారు, వారిని మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగాను, బహిరంగంగాను ఖర్చు చేసేవారు. అంటే ఈ ఆయత్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూడు విషయాలు తెలియజేశాడు. ఒకటి, ఖురాన్ గ్రంథాన్ని పఠించేవారు, పారాయణం చేసేవారు. రెండవది, నమాజును నెలకొల్పేవారు. మూడవది, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించిన వాటిలో గోప్యంగా, బహిరంగంగా దానం చేసేవారు, ఖర్చు పెట్టేవారు. వారు ఎన్నటికీ నష్టం కలుగని వర్తకాన్ని ఆశిస్తున్నారు.
వారికి వారి ప్రతిఫలాలు పూర్తిగా ఇవ్వటానికి, తన కృపతో ఆయన వారికి మరింతగా ప్రసాదించటానికి గాను, (అంటే ఈ గుణాలు, ఈ లక్షణాలు కలిగిన వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పూర్తిగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు.) నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు, సన్మానించేవాడు.(35:30)
అభిమాన సోదరులారా, ఇప్పటివరకు మనం ఖురాన్ ఆయతులు లో కొన్ని ఖురాన్ గురించి, దైవ గ్రంథం గురించి తెలుసుకున్నాం.
ఖురాన్ పారాయణ సభల యొక్క ఘనతపై హదీసులు
ఈ ఖురాన్ పఠనం, ఖురాన్ నేర్చుకోవటం, ఖురాన్‌ని నేర్పించటం. దీని గురించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. అబూ హురైరా రది అల్లాహు త’ఆలా అన్హు కథనం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.
ఈ జ్యోతి గురించి, ఈ ఖురాన్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు,
అల్లాహ్ గృహాలలోని ఏదైనా ఒక గృహంలో కొంతమంది గుమిగూడి, జమా అయి, దైవ గ్రంథాన్ని పారాయణం చేస్తూ కేవలం పారాయణం మాత్రమే కాదు. యతదారసూనహూ దాన్ని గురించి పరస్పరం చర్చించుకునేవారు అంటే నేర్చుకునేవారు, నేర్పించేవారు. ఒకరికొకరు అర్థం చేసుకునేవారు, అర్థం చెప్పేవారు, నేర్చుకునేవారు, నేర్పించేవారు. అల్లాహ్ తరఫు నుండి వారి మీద ప్రశాంతత ఆవరిస్తుంది, మొదటి ప్రయోజనం, మొదటి ప్రతిఫలం. ఒకచోట జమా అయి ఖురాన్ పారాయణం చేస్తూ దాన్ని చర్చించుకుంటూ, నేర్చుకుంటూ, నేర్పిస్తూ ఉంటే అల్లాహ్ యొక్క ప్రశాంతత వారి మీద ఆవరిస్తుంది, అల్లాహ్ తరఫు నుండి. రెండవది, అల్లాహ్ కారుణ్యం వారిని కమ్ముకుంటుంది. మూడవది, దైవదూతలు వారిని చుట్టుముడతారు. నాలుగవది, ఇంకా వారిని గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన ఆస్థానములోని దైవదూతల దగ్గర వారికి పరిచయం చేస్తాడు.
ఇది ఖురాన్ పఠనం, ఖురాన్ నేర్పించడం గురించి.
అహ్లుల్లాహ్ – అహ్లుల్ ఖురాన్ (ఖురాన్ వారు)
అలాగే ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలను ఉద్దేశించి ఇలా అన్నారు, “ఇన్న లిల్లాహి అహ్లీన మినన్నాస్” (నిశ్చయంగా ప్రజలలో అల్లాహ్ కు చెందిన వారు ఉన్నారు). జనులలో అల్లాహ్ దాసులలో కొందరు అహ్లుల్లాహ్ (అల్లాహ్ ప్రజలు) ఉన్నారు. అల్లాహ్ కు చెందిన వారు. ఈ మాట విని సహాబాలు ప్రశ్నించారు, “ఓ దైవ ప్రవక్తా, మన్ హుమ్?” (వారెవరు?). ఆ అహ్లుల్లాహ్ అనే వారు, అహ్లుల్లాహ్ అనబడే వారు, అల్లాహ్ కు చెందిన వారు, వారెవరు? అని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. వారు, “హుమ్ అహ్లుల్ ఖురాన్” (వారు ఖురాన్ ప్రజలు). వారే అహ్లె ఖురాన్, ఖురాన్ వారు అల్లాహ్ కు చెందిన వారు. ఇక్కడ ఖురాన్ వారు అంటే ఎవరు? ఖురాన్ పఠించే వారు, ఖురాన్ పారాయణం చేసే వారు, ఖురాన్ ని నేర్చుకునే వారు, ఖురాన్ ని అర్థం చేసుకునే వారు, ఖురాన్ ని నేర్పించే వారు, వారు అహ్లుల్ ఖురాన్. వారి జీవితం ఖురాన్ పరంగా ఉంటుంది. వారే, “అహ్లుల్లాహి వ ఖాస్సతుహు” (అల్లాహ్ యొక్క ప్రజలు మరియు ఆయన ప్రత్యేకమైన వారు). వారే అల్లాహ్ కు చెందిన వారు, వారే అల్లాహ్ కు ప్రత్యేక దాసులు. ఇది ఖురాన్ పారాయణం యొక్క మహత్యం.
ఖురాన్ జాతులను ఉన్నతపరుస్తుంది మరియు పతనం చేస్తుంది
అభిమాన సోదరులారా, ఉమర్ బిన్ ఖత్తాబ్ రది అల్లాహు త’ఆలా అన్హు కథనం, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.
إِنَّ اللَّهَ يَرْفَعُ بِهَذَا الْكِتَابِ أَقْوَامًا وَيَضَعُ بِهِ آخَرِينَ [ఇన్నల్లాహ యర్ఫ’ఉ బి హాదల్ కితాబి అఖ్వామవ్ వ యద’ఉ బిహీ ఆఖరీన్] నిశ్చయంగా, నిస్సందేహంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గ్రంథం ఆధారంగా, ఈ ఖురాన్ మూలంగా కొన్ని జాతుల్ని ఉన్నత స్థితికి లేపుతాడు. ఈ ఖురాన్ మూలంగానే కొన్ని జాతుల్ని అధోగతి పాలు చేస్తాడు.
అంటే ఖురాన్ పారాయణం చేసే వారికి, ఖురాన్ అర్థం చేసుకునే వారికి, ఖురాన్ ని నేర్పించే వారికి, ఖురాన్ పరంగా తమ జీవితం గడిపే వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నత స్థితి, ఉన్నత స్థాయిని ప్రసాదిస్తాడు. గౌరవాన్ని ప్రసాదిస్తాడు. ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగే ఎవరైతే ఖురాన్ ని విడనాడుతారో, వదిలేస్తారో, ప్రక్కన పెట్టేస్తారో, పట్టించుకోరో అటువంటి వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అధోగతి పాలు చేస్తాడు, అగౌరవాన్ని పాలు చేస్తాడు.
ఈ ఖురాన్ గ్రంథం ఇహలోకంలో మరియు పరలోకంలో, ఈ ఇహపరలోకాలలో ఖురాన్ మూలంగా మనుషుల గౌరవం, స్థానం ఎన్నో రెట్లు, ఎంతగానో పెరిగిపోతుంది.
ప్రళయ దినాన ఖురాన్ సిఫారసు
ప్రళయ దినాన ఖురాన్ గురించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. అబూ ఉమామా రది అల్లాహు అన్హు అంటున్నారు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతుండగా నేను విన్నాను.
اقْرَءُوا الْقُرْآنَ فَإِنَّهُ يَأْتِي يَوْمَ الْقِيَامَةِ شَفِيعًا لِأَصْحَابِهِ [ఇఖ్రవుల్ ఖురాన ఫ ఇన్నహూ య’తీ యౌమల్ ఖియామతి షఫీ’అన్ లి అస్ హాబిహీ] “ఓ దైవ దాసులారా, ఖురాన్‌ను పఠించండి, పఠిస్తూ ఉండండి. అత్యధికంగా ఖురాన్ పారాయణం చేయండి. ఎందుకంటే ప్రళయ దినాన ఖురాన్ గ్రంథం తనను పారాయణం చేసిన వారి కొరకు సిఫారసు దారుగా వస్తుంది.”
అల్లాహు అక్బర్. రేపు ప్రళయ దినాన భయంకరమైన రోజు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు కుడి చేతిలో కర్మల పుస్తకం ఇస్తాడో, ఎడమ చేతిలో ఇస్తాడో తెలియదు. ఆ రోజు స్వయంగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా వేరే వారి గురించి పట్టించుకోరు. కొన్ని ముఖ్యమైన సందర్భాలలో, ఇందస్ సిరాత్ (పుల్ సిరాత్ దాటే సమయంలో), ఇందల్ కితాబ్ (కర్మల పుస్తకం ఇచ్చే సమయంలో), ఇందల్ మీజాన్ (కర్మలు తూచే సమయంలో). కర్మలు ఇది చేసే సమయంలో, ఎవరి కర్మలు ఎక్కువగా ఉన్నాయి, ఎవరి కర్మలు తక్కువగా ఉన్నాయి, త్రాసులు, కర్మల, కర్మల త్రాసులు వేసే సమయంలో. ఈ మూడు సందర్భాలలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆ మూడు సందర్భాలలో నేను నా గురించి తప్ప ఇతరుల గురించి నాకు ఆలోచన రాదు అని ఎవరికి అంటున్నారు? ఉమ్ముల్ ము’మినీన్ ఆయిషా సిద్దీఖా రది అల్లాహు త’ఆలా అన్హా గారిని అంటున్నారు. అటువంటి సమయంలో ఖురాన్ అత్యధికంగా పఠించే వారికి ఖురాన్ ఆ రోజు సిఫారసు చేస్తుంది.
స్వర్గంలో ఖురాన్ సహచరుడి (సాహిబె ఖురాన్) హోదా
అభిమాన సోదరులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు.
“రేపు ప్రళయ దినాన ఖురాన్ వారితో ఇలా అనడం జరుగుతుంది. ఇక్కడ ఖురాన్ వారు అంటే ఎవరు? ఖురాన్ ని పఠించేవారు. ఖురాన్ పారాయణం చేసేవారు అత్యధికంగా. ఖురాన్ ను అర్థం చేసుకునేవారు. ఖురాన్ పరంగా ఆచరించే వారు. సాహిబె ఖురాన్ తో, ఖురాన్ వానితో ఇలా అనబడుతుంది, ఏమని? ‘ఇఖ్ర’’, ఓ ఖురాన్ వాడా, ఓ ఖురాన్ కి చెందిన వాడా, ‘ఇఖ్ర’’ పఠిస్తూ ఉండు. ‘వర్తఖి’, ‘వరత్తిల్ కమా కున్త తురత్తిలు ఫిద్దున్యా’ నువ్వు ప్రపంచంలో నెమ్మదిగా ఖురాన్ పఠించినట్లు ఎప్పుడూ కూడా అలాగే పఠిస్తూ పైకెళ్తూ ఉండు. అలా పఠిస్తూ వెళ్తూ ఎక్కడ పఠనం, పారాయణం చేయటం ఆపుతావో ఆ చివరి ఆయత్ దగ్గరే నీ అంతస్తు ఉంటుంది.”
అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
అనుమతించబడిన అసూయ
అభిమాన సోదరులారా, పాపాలలో అసూయ అనేది ఘోరమైన పాపం. పెద్ద పాపం. కానీ రెండు విషయాలలో లేదా రెండు వ్యక్తుల, రెండు రకాల వ్యక్తుల విషయంలో అసూయ చెందవచ్చు, అనుమతి ఉంది. అదేమిటి?
لَا حَسَدَ إِلَّا فِي اثْنَتَيْنِ [లా హసద ఇల్లా ఫిస్నతైన్] “ఇద్దరు వ్యక్తుల పట్ల తప్ప మరెవ్వరి పట్ల అసూయ చెందకూడదు”
ఘోరమైన పాపం అసూయ. కానీ ఇద్దరి పట్ల అసూయ చెందవచ్చు.
رَجُلٌ آتَاهُ اللَّهُ الْقُرْآنَ فَهُوَ يَقُومُ بِهِ آنَاءَ اللَّيْلِ وَآنَاءَ النَّهَارِ [రజులున్ ఆతాహుల్లాహుల్ ఖురాన ఫహువ యఖూము బిహీ ఆనాఅల్లైలి వ ఆనాఅన్నహార్] ఒకడు, అల్లాహ్ ఖురాన్ జ్ఞానాన్ని ప్రసాదించాడు, రేయింబవళ్ళు దాన్ని ఆచరించే వ్యక్తి.
ఖురాన్ పఠించే వ్యక్తి, ఖురాన్ పరంగా ఆచరించే వ్యక్తి, ఖురాన్ నేర్పించే వ్యక్తి విషయంలో అసూయ చెందవచ్చు. అలాగే రెండో వ్యక్తి ఎవరు?
وَرَجُلٌ آتَاهُ اللَّهُ مَالًا فَهُوَ يُنْفِقُهُ آنَاءَ اللَّيْلِ وَآنَاءَ النَّهَارِ [వ రజులున్ ఆతాహుల్లాహు మాలన్ ఫహువ యున్ఫిఖుహూ ఆనాఅల్లైలి వ ఆనాఅన్నహార్] రెండవ వ్యక్తి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సిరిసంపదలు అనుగ్రహించగా వాటిని రేయింబవళ్ళు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టే వ్యక్తి.
ఈ ఖురాన్ కి చెందిన వ్యక్తి, ఈ దానం చేసే వ్యక్తి, వీరిద్దరి విషయంలో అసూయ పడవచ్చు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
ప్రళయ దినాన దుర్మార్గుని పశ్చత్తాపం
అభిమాన సోదరులారా, ఇక చివర్లో ఖురాన్ లో కొన్ని ఆయతుల అర్థం తెలుసుకుని ముగిద్దాం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. దుర్మార్గుడు పరలోకంలో వాడు ఎవడు అనేది మనకు తెలుస్తుంది.
ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: “అయ్యో! నేను దైవప్రవక్త (సఅసం) మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బావుందేది!” (25″27)
ఆ రోజు, ప్రళయ దినాన, ఎవ్వరూ ఎవరికీ పనికి రారు. సహాయం చేయరు, చేయలేరు. భార్య అయినా, సంతానం అయినా, అమ్మ నాన్న అయినా, బంధువులైనా ఎవ్వరైనా సరే, సిరిసంపదలైనా, హోదా అయినా ఏదీ పనికి రాదు. ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ, బాధతో, దుఃఖంతో తనను తాను నిందించుకుంటూ, “అయ్యో, నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బాగుండేది.”
يَا وَيْلَتَىٰ لَيْتَنِي لَمْ أَتَّخِذْ فُلَانًا خَلِيلًا “అయ్యో నా పాడుగాను, నేను ఫలానా వ్యక్తిని స్నేహితునిగా చేసుకోకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది.” (25:28)
لَّقَدْ أَضَلَّنِي عَنِ الذِّكْرِ بَعْدَ إِذْ جَاءَنِي ۗ وَكَانَ الشَّيْطَانُ لِلْإِنسانِ خَذُولًا “నా వద్దకు ఉపదేశం వచ్చిన తరువాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే! ఎంతయినా షైతాను మనిషికి (అదను చూసి) ద్రోహం చేసేవాడే!” (25:29)
“నా వద్దకు ఉపదేశం వచ్చింది. ‘అద్-దిక్ర్’ వచ్చింది, ఖురాన్ వచ్చింది. కానీ వాడు నాకు ఖురాన్ నుంచి దూరం చేశాడు. నా దగ్గరకు అల్లాహ్ ‘దిక్ర్’ పంపించాడు. ఖురాన్ వచ్చింది, హితోపదేశం వచ్చింది, ‘దిక్ర్’ వచ్చింది, మౌఇదా వచ్చింది, రహ్మా వచ్చింది. ఇవన్నీ ఖురాన్. కానీ వాడు నాకు వీటి నుంచి దూరం చేశాడు. ఎంతైనా షైతాను మనిషికి ద్రోహం చేసేవాడే.” కానీ అక్కడ తెలుసుకుని ఏం ప్రయోజనం లేదు. అది ఇక్కడ తెలుసుకోవాలి.
ఆ సందర్భంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోరు విప్పుతారు. వాడు బాధపడుతున్నాడు, “నా పాడుగాను”, తన్ను తాను నిందించుకుంటున్నాడు, కుమిలిపోతున్నాడు. ఆ సందర్భంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తారు.
وَقَالَ الرَّسُولُ يَا رَبِّ إِنَّ قَوْمِي اتَّخَذُوا هَٰذَا الْقُرْآنَ مَهْجُورًا “ఓ నా ప్రభువా! నిశ్చయంగా నా జాతి వారు ఈ ఖురాన్‌ను వదిలిపెట్టారు.”
అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకుతారు. అంటే పరలోకంలో పరాజయం, అవమానం, దుర్భర స్థితి, శిక్షకు కారణం ఏమిటి? ఖురాన్‌ను విడనాడటం, వదిలివేయటం.
ప్రజలలో ఉత్తములు ఎవరు?
కావున, అభిమాన సోదరులారా, ఈ ప్రపంచంలో అందరికంటే ఉత్తములు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఇచ్చారు. ఈ ప్రపంచంలో, అందరికంటే ఉత్తములు, ప్రవక్త గారు సెలవిచ్చారు, బుఖారీ గ్రంథంలోని హదీస్ ఇది.
అంటే ఈ భూమండలంలో మానవులలో, అల్లాహ్ దాసులలో, ఈ ఉమ్మత్ లో అందరికంటే శ్రేష్టమైన వారు, ఉన్నతమైన వారు, ఉన్నత స్థితికి చెందిన వారు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట పరంగా ఎవరు? ఖురాన్ నేర్చుకునేవారు, ఖురాన్ నేర్పించేవారు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేసే సౌభాగ్యం ప్రసాదించు గాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ అహ్లె ఖురాన్ లో చేర్చుగాక. మన జీవితాంతం ఖురాన్ ను పఠించే, ఖురాన్ ను అర్థం చేసుకునే, ఖురాన్ ను ఆచరించే సౌభాగ్యం ప్రసాదించు గాక.
Dua (ప్రార్థన)
اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ [అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్, కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్ మజీద్] ఓ అల్లాహ్! ముహమ్మద్ పై మరియు ఆయన కుటుంబంపై కారుణ్యం కురిపించు, ఇబ్రాహీం మరియు ఆయన కుటుంబంపై నువ్వు కారుణ్యం కురిపించినట్లు. నిశ్చయంగా నువ్వు ప్రశంసనీయుడవు, ఘనత గలవాడవు.
اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّdٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ [అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్, కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్ మజీద్] ఓ అల్లాహ్! ముహమ్మద్ పై మరియు ఆయన కుటుంబంపై శుభాలు కురిపించు, ఇబ్రాహీం మరియు ఆయన కుటుంబంపై నువ్వు శుభాలు కురిపించినట్లు. నిశ్చయంగా నువ్వు ప్రశంసనీయుడవు, ఘనత గలవాడవు.
رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ [రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతవ్ వ ఫిల్ ఆఖిరతి హసనతవ్ వ ఖినా అదాబన్నార్] ఓ మా ప్రభూ! మాకు ఇహలోకంలో మంచిని ప్రసాదించు మరియు పరలోకంలోనూ మంచిని ప్రసాదించు మరియు మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు.
رَبَّنَا لَا تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِن لَّدُنكَ رَحْمَةً ۚ إِنَّكَ أَنتَ الْوَهَّابُ [రబ్బనా లా తుజిగ్ ఖులూబనా బ’ద ఇద్ హదైతనా వ హబ్ లనా మిల్ లదున్క రహ్మా, ఇన్నక అంతల్ వహ్హాబ్] ఓ మా ప్రభూ! మాకు సన్మార్గం చూపిన తర్వాత మా హృదయాలను వక్రమార్గం వైపు త్రిప్పకు. మరియు నీ వద్ద నుండి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా నీవే గొప్ప దాతవు.
رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْإِيمَانِ وَلَا تَجْعَلْ فِي قُلُوبِنَا غِلًّا لِّلَّذِينَ آمَنُوا رَبَّنَا إِنَّكَ رَءُوفٌ رَّحِيمٌ [రబ్బనగ్ ఫిర్ లనా వ లి ఇఖ్వానినల్లదీన సబఖూనా బిల్ ఈమాని వలా తజ్’అల్ ఫీ ఖులూబినా గిల్లల్ లిల్లదీన ఆమనూ రబ్బనా ఇన్నక రవూఫుర్ రహీమ్] ఓ మా ప్రభూ! మమ్మల్ని మరియు విశ్వాసంలో మా కంటే ముందు గడిచిపోయిన మా సోదరులను క్షమించు. మరియు మా హృదయాలలో విశ్వసించిన వారి పట్ల ఎలాంటి ద్వేషాన్ని ఉంచకు. ఓ మా ప్రభూ! నిశ్చయంగా నువ్వు దయగలవాడవు, కరుణామయుడవు.
رَّبِّ ارْحَمْهُمَا كَمَا رَبَّيَانِي صَغِيرًا [రబ్బిర్ హమ్హుమా కమా రబ్బయానీ సగీరా] ఓ నా ప్రభూ! నా తల్లిదండ్రులు చిన్నప్పుడు నన్ను ఎలా కారుణ్యంతో పెంచారో, నువ్వు కూడా వారిపై అలాగే కారుణ్యం చూపు.
سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا أَنْتَ أَسْتَغْفِرُكَ وَأَتُوبُ إِلَيْكَ [సుబ్ హానకల్లాహుమ్మ వ బిహందిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అన్త అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్] ఓ అల్లాహ్! నీవు పవిత్రుడవు మరియు నీకే సర్వ స్తోత్రాలు. నీవు తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను మరియు నీ వైపుకే పశ్చాత్తాపంతో మరలుతున్నాను.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ [ఆఖిరు ద’వానా అనిల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్] మరియు మా చివరి ప్రార్థన, సర్వ స్తోత్రాలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే.
—
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:
“ఖుర్ఆన్ కంఠపాఠి గౌరవనీయులైన దైవదూత లాంటివాడు. అతను (ప్రళయదినాన) వారితోనే ఉంటాడు. ఖుర్ఆన్ పఠించడం తనకు ఎంతో ప్రయాసతో కూడిన పని అయినప్పటికీ, దాన్ని పఠించి కంఠస్తం చేసే వ్యక్తి రెట్టింపు పుణ్యఫలానికి అర్హుడవుతాడు.”
[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – అత్తఫ్సీర్ ఖుర్ఆన్, 80 వ అధ్యాయం – ‘అబస’ సూరా] ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం – 38 వ అధ్యాయం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2 సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
You must be logged in to post a comment.