చాడీలు చెప్పడం (గీబత్) ఘోరమైన పాపం – నసీరుద్దీన్ జామి’ఈ [ఆడియో]

చాడీలు (గీబత్) చెప్పడం ఘోరమైన పాపం – నసీరుద్దీన్ జామి’ఈ [ఆడియో]
https://youtu.be/Z2pa3Sh8nWA [14 నిముషాలు]

1. చాడీలు చెప్పేవారికి నాశనం తప్పదు

وَيْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ
అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు. (సూరా అల్ హుమజా 104:1)

2. చాడీలు చెప్పేవారు స్వర్గంలో ప్రవేశించలేరు:

హజ్రత్ హుజైఫా (రజియల్లాహు అన్హు) ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “చాడీలు చెప్పేవాడు స్వర్గంలోకి వెళ్ళలేడు.” (బుఖారీ-ముస్లిం, సహీహ్ బుఖారీలోని అదబ్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

చాడీలు చెప్పటం ముమ్మాటికీ నిషిద్ధం. ఈ విషయం తెలిసి కూడా ఎవడైనా దాన్ని ధర్మసమ్మతంగా భావించి చాడీలు చెబుతూ ప్రజల మధ్య సంబంధాలను చెడగొట్టటానికి పాల్పడితే అలాంటివారు ఎన్నటికీ స్వర్గానికి వెళ్ళలేరు.

3. చాడీలు చెప్పేవారికి సమాధి శిక్ష తప్పదు

హజ్రత్ ఇబ్నే అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రెండు సమాధుల దగ్గర్నుంచి వెళ్తూ ఇలా అన్నారు. “ఈ రెండు సమాధుల్లో ఉన్నవారికి శిక్షపడుతోంది. వీరికి ఈ శిక్ష ఏదో పెద్ద విషయం మూలంగా పడుతుంది కాదు! (ఆ తర్వాత ఆయనే అన్నారు) ఎందుకు కాదు, అది పెద్ద విషయమే. వీరిలో ఒకడు చాడీలు చెప్తూ తిరుగుతుండేవాడు. మరొకతను మూత్రం పోసినప్పుడు ఒంటిమీద దాని తాలూకు తుంపరలు పడకుండా జాగ్రత్తపడేవాడు కాదు.” (బుఖారీ-ముస్లిం)

4. చాడీలు చెప్పేవారికి నరక శిక్ష తప్పదు

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈవిధంగా ప్రవచించారు: “నాకు మేరాజ్ (యాత్ర) చేయించబడినప్పుడు నేను కొంత మంది సమీపం నుంచి వెళ్ళటం తట స్థించింది. వారికి ఇత్తడి గోళ్ళున్నాయి. వాటితో వారు తమ ముఖాలను,రొమ్ములను గీక్కుంటున్నారు. అది చూసి నేను (ఆశ్చర్యంతో) “జిబ్రయీల్ ఎవరు వీరు?” అని అడిగాను. అందుకు జిబ్రయీల్ సమాధానమిస్తూ, “వీరా, వీరు (ప్రపంచంలో) ప్రజల మాంసం తినేవారు (అంటే వారిని పరోక్షంగా నిందించేవారు) వారి మాన మర్యాదలను కాలరాసేవారు” అని చెప్పారు (అబూదావూద్)

చాడీలు, అపనిందలు 

%d bloggers like this: