2.1 హద్దుల ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు

1097 – حديث عَائِشَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: تُقْطَعُ يَدُ السَّارِقِ فِي رُبُعِ دِينَارٍ أخرجه البخاري في 86 كتاب الحدود: 13 باب قول الله تعالى (والسارق والسارقة فاقطعوا أيديهما)

1097. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- “కనీసం పావు (1/4) దీనార్ (దొంగిలించినందు)కు దొంగ చేతిని నరికి వేయాలి” అని దైవప్రవక్త ( సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారు.  

(సహీహ్ బుఖారీ – హద్దుల ప్రకరణం-86, 13వ అధ్యాయం-ఖౌలిల్లాహి తఅలా వస్సారిఖూ వస్సారిఖతు ఫఖ్తవు అయ్ దియహుమా)

1098 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، قَالَ: قَطَعَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَدَ سارِقٍ فِي مِجَنٍّ ثَمَنُهُ ثَلاَثَةُ دَرَاهِمَ

أخرجه البخاري في: 86 كتاب الحدود: 13 باب قول الله تعالى (والسارق والسارقة فاقطعوا أيديهما)

1098. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- “మూడు దిర్హమ్ ల విలువ గల డాలును దొంగిలించే దొంగలకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హస్త ఖండన శిక్ష విధించారు“.

(సహీహ్ బుఖారీ :- 86వ ప్రకరణం-శిక్షాస్మృతి, 13వ అధ్యాయం-ఖౌలిల్లాహి తఅలా వస్సారిఖూ వస్సారిఖతు ఫఖ్తవు అయ్ దియహుమా)  

1099 – حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لَعَنَ اللهُ السَّارِقَ، يَسْرِقُ الْبَيْضَةَ فَتُقْطَعُ يَدُهُ؛ وَيَسْرِقُ الْحَبْلَ فَتُقْطَعُ يَدُهُ

أخرجه البخاري في: 86 كتاب الحدود: 7 باب لعن السارق إذا لم يُسَم

1099.’ హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- “దొంగకు అల్లాహ్ శాపం కలుగుగాక. అతను కోడిగుడ్లు దొంగిలించినందుకు అతని చేయి నరకవేయబడుతుంది; తాడు దొంగిలించినందుకు కూడా అతని చేయి నరకబడుతుంది” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం).* (సహీహ్ బుఖారీ:- 86వ ప్రకరణం – శిక్షాస్మృతి, 7వ అధ్యాయం, లానస్సారిఖు ఇజా లమ్ యుసమ్మ) 

قطع السارق الشريف وغيره والنهي عن الشفاعة في الحدود

1100 – حديث عَائِشَةَ، أَنَّ قُرَيْشًا أَهَمَّهُمْ شَأْنُ الْمَرْأَةِ الْمَخْزُومِيَّةِ الَّتِي سَرَقَتْ، فَقَالَ: وَمَنْ يُكَلِّمُ فِيهَا رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالُوا: وَمَنْ يَجْتَرِى عَلَيْهِ إِلاَّ أُسَامَةُ بْنُ زَيْدٍ، حِبُّ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَكَلَّمَهُ أُسَامَةُ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَتَشْفَعُ فِي حَدٍّ مِنْ حُدُودِ اللهِ ثُمَّ قَامَ فَاخْتَطَبَ، ثُمَّ قَالَ: إِنَّمَا أَهْلَكَ الَّذِينَ قَبْلَكُمْ أَنَّهُمْ كَانُوا، [ص:186] إِذَا سَرَقَ فِيهِمُ الشَّرِيفُ تَرَكُوهُ، وَإِذَا سَرَقَ فِيهِمُ الضَّعِيفُ أَقَامُوا عَلَيْهِ الْحَدَّ؛ وَايْمُ اللهِ لَوْ أَنَّ فَاطِمَةَ ابْنَةَ مُحَمَّدٍ سَرَقَتْ، لَقَطَعْتُ يَدَهَا

أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 54 باب حدثنا أبو اليمان

1100. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- ఓసారి మఖ్జూమ్ తెగకు చెందిన ఒక స్త్రీ దొంగతనం చేసింది. (దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెకు హస్త ఖండన శిక్ష విధించారు.  దాని పట్ల ఖురైష్ తెగ వాళ్ళు తీవ్ర ఆందోళన చెందారు. వారు పరస్పరం సంప్రదించుకుని ఈ విషయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో ఎవరు మాట్లాడుతారు అని అన్నారు. అప్పుడు కొందరు సలహా ఇస్తూ ఈ విషయమై దైపప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో మాట్లాడగల వారు ఒక్క హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) మాత్రమేనని, ఆయన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అమితంగా అభిమానిస్తారని అన్నారు. చివరికి వారంతా హజ్రత్ ఉసామా (రదియల్లాహు అన్హు)ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో మాట్లాడి ఈ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు ఒప్పించారు. హజ్రత్ ఉసామా (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వెళ్ళి వారి విన్నపాన్ని ఆయన ముందుంచారు. అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్రత్ ఉసామా (రదియల్లాహు అన్హు)తో ఇలా అన్నారు:- “ఏమిటి, నీవు అల్లాహ్ నిర్ణయించిన శిక్షలలో ఒక శిక్ష గురించి (నా దగ్గర) సిఫారసు చేయదలిచావా?” అన్నారు. ఆ తరువాత ఆయన లేచి నిలబడి ప్రజల ముందు ఉపన్యసించారు. ఆ ఉపన్యాసం చివర్లో ఆయన ఇలా  అన్నారు – “స్థితిమంతుడు పేరు పలుకుబడులు గల వ్యక్తి ఎవరైనా దొంగతనం చేస్తే అతడ్ని శిక్షించకుండా వదిలి పెట్టేవారు. అదే పేదవాడు బలహీనుడైన వ్యక్తి దొంగతనం చేస్తే అతడ్ని శిక్షించేవారు. ఈ కారణంగానే మీకు పూర్వం గతించిన జాతులు నాశనమయ్యాయి. దైవసాక్షి! ముహమ్మద్ కూతురు ఫాతిమా (రదియల్లాహు అన్హా) అయినా సరే దొంగతనం చేస్తే నేనామె చేతిని నరికివేస్తాను”.  

(సహీహ్ బుఖారీ – 60వ ప్రకరణం – దైవప్రవక్తలు, 54వ అధ్యాయం – హద్దసనా అబుల్ యమాన్) 

1101 – حديث عُمَرَ بْنِ الْخَطَّابِ إِنَّ اللهَ بَعَثَ مُحَمَّدًا صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِالْحَقِّ، وَأَنْزَلَ عَلَيْهِ الْكِتَابَ فَكَانَ مِمَّا أَنْزَلَ اللهُ آيَةُ الرَّجْمِ، فَقَرَأْنَاهَا وَعَقَلْنَاهَا وَوَعَيْنَاهَا رَجَمَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَرَجَمْنَا بَعْدَهُ فَأَخْشى، إِنْ طَالَ بِالنَّاسِ زَمَانٌ، أَنْ يَقُولَ قَائِلٌ: وَاللهِ مَا نَجِدُ آيَةَ الرَّجْمِ فِي كِتَابِ اللهِ؛ فَيَضِلُّوا بِتَرْكِ فَرِيضَةٍ أَنْزَلَهَا اللهُ وَالرَّجْمُ فِي كِتَابِ اللهِ حَقٌّ عَلَى مَنْ زَنَى، إِذَا أُحْصِنَ، مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ، إِذَا قَامَتِ الْبَيِّنَةُ، أَوْ كَانَ الْحَبَلُ أَوِ الاعْتِرَافُ

أخرجه البخاري في: 86 كتاب الحدود: 31 باب رجم الحبلى من الزنا إذا أحصنت

1101. హజ్రత్ ఉమర్ ఫారూఖ్ (రదియల్లాహు అన్హు) కథనం:- అల్లాహ్ హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ని సత్య  ప్రాతిపదికపై ప్రభవింపజేశాడు. ఆయన పై దివ్య ఖుర్ఆన్ ని అవతరింపజేశాడు. అల్లాహ్ అవతరింపజేసిన దానిలో శిలాశిక్షకు సంబంధించిన సూక్తి కూడా ఉంది. మేము దీన్ని చదివాము, అర్ధం చేసుకున్నాము, గుర్తుంచుకున్నాము. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా శిలాశిక్షను అమలుపరచారు. ఆయన తరువాత మేము కూడా శిలాశిక్షను అమలు పరిచాము. కాని ఓ సుదీర్ఘకాలం గడచిన తరువాత ఈ విషయంలో ఎవరైనా, దైవగ్రంధంలో శిలాశిక్షకు సంబంధించిన సూక్తి ఏదీ మాకు కన్పించడం లేదే! అని అంటారేమోనని నేను భయపడుతున్నాను. ఒకవేళ ఇలా అంటే ముస్లింలు అల్లాహ్ అవతరింపజేసిన ఒక విధిని వదిలేసిన వారయి మార్గభ్రష్టులయిపోతారు. దైవగ్రంధం ప్రకారం వ్యభిచారానికి పాల్పడిన వివాహిత వ్యక్తి (పురుషుడైనా, స్త్రీ అయినా)కి శిలాశిక్ష నిర్దేశించబడింది. ఇది పూర్తిగా నిజం. కాకపోతే సాక్ష్యాల ద్వారా నేరం రుజువు కావాలి లేదా గర్భధారణ అయి ఉండాలి లేదా నేరస్థుడు స్వయంగా వ్యభిచరించినట్లు ఒప్పుకోవాలి.*  

(సహీహ్ బుఖారీ – 86వ ప్రకరణం-శిక్షాస్మృతి, 31వ అధ్యాయం-రజ్ముల్ హుబ్ల మినట్టినా ఇజా అహ్సనత్)  

* శిలా శిక్షకు సంబంధించిన సూక్తిలోని పదాలు ఈ విధంగా ఉన్నాయి. “అషైఖి వషైఖతి ఇజా జనియా ఫారజూ హమల్ బితా”. ఆ తరువాత ఈ సూక్తిలోని పదాలు రద్దయి పోయాయి; ఆజ్ఞ మాత్రం యధాతధంగా ఉండిపోయింది. అదీగాక శిలా శిక్ష ఆజ్ఞ దివ్యఖుర్ఆన్  ప్రకారం సత్యమైనది. “లేదా వారి కోసం అల్లాహ్ ఏదైనా మార్గం చూపించేవరకు” (4:15) అనే సూక్తిని గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వ్యాఖ్యానిస్తూ “అల్లాహ్ వారి కోసం మార్గం చూపించాడు. వివాహితకు శిలాశిక్ష అవివాహితకు కొరడా శిక్ష విధించాలి” అని అన్నారు. కనుక ముస్నద్ ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) గ్రంథంలో హజ్రత్ ఉబాదా బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు. ” ఓ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై వహీ అవతరించింది. వహీ అవతరణ సమయంలో ఏర్పడే ప్రత్యేక పరిస్థితి దూరమైన తరువాత ఆయన మాట్లాడుతూ ‘ఇదిగో భద్రపరచుకోండి. అల్లాహ్ ఈ స్త్రీల కోసం సరళ మార్గం సృష్టించాడు. వివాహితుడు వివాహితతో, అవివాహితుడు అవివాహితతో వ్యభిచారానికి పాల్పడితే వివాహితులకు 100 కొరడా దెబ్బలతో పాటు, శిలా శిక్ష విధించబడుతుంది. అవివాహితులకు వంద కొరడా దెబ్బల తరువాత ఒక సంవత్సరం పాటు దేశ బహిష్కరణా శిక్ష విధించబడుతుంది’ అని అన్నారు.” 

1102 – حديث أَبِي هُرَيْرَةَ وَجَابِرٍ قَالَ أَبُو هُرَيْرَةَ: أَتَى رَجُلٌ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَهُوَ فِي الْمَسْجِدِ، فَنَادَاهُ فَقَالَ: يَا رَسُولَ اللهِ إِنِّي زَنَيْتُ فَأَعْرَضَ عَنْهُ، [ص:187] حتَّى رَدَّدَ عَلَيْهِ أَرْبَعَ مَرَّاتٍ؛ فَلَمَّا شَهِدَ عَلَى نَفْسِهِ أَرْبَعَ شَهَادَاتٍ دَعَاهُ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: أَبِكَ جُنُونٌ قَالَ: لاَ قَالَ: فَهَلْ أَحْصَنْتَ قَالَ: نَعَمْ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: اذْهَبُوا بِهِ فَارْجُمُوهُ قَالَ جَابِرٌ: فَكُنْتُ فِيمَنْ رَجَمَهُ، فَرَجَمْنَاهُ بِالْمُصَلَّى؛ فَلَمَّا أَذْلَقَتْهُ الْحِجَارَةُ هَرَبَ، فَأَدْرَكْنَاهُ بِالْحَرَّةِ، فَرَجَمْنَاهُ

أخرجه البخاري في: 86 كتاب الحدود: 22 باب لا يرجم المجنون والمجنونة

1102. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వచ్చాడు. అప్పుడు  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మస్జిద్ లో ఉన్నారు. ఆ వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను సంబోధిస్తూ “దైవప్రవక్తా! నేను వ్యభిచారం చేశాను” అన్నాడు బిగ్గరగా. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ముఖాన్ని అతని వైపు నుండి పక్కకు తిప్పుకున్నారు. (అయితే అతను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముందుకు వచ్చి తాను వ్యభిచారానికి పాల్పడ్డానని మళ్ళీ చెప్పాడు) ఈ విధంగా అతను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముందు నాలుగుసార్లు అన్నాడు. అతను స్వయంగా తనకు వ్యతిరేకంగా నాలుగుసార్లు సాక్ష్యమిచ్చినందున దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతడ్ని దగ్గరకు పిలిచి “నీవేమయినా పిచ్చివాడివా?” అని అడిగారు. అతను ‘లేదండి’ అన్నాడు. “సరే, నీకు పెళ్ళయిందా?” అడిగారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). అతను ‘అయిందండీ’ అన్నాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అనుచరుల్ని ఆదేశిస్తూ “ఇతడ్ని తీసికెళ్ళి శిలాశిక్ష అమలు పరచండి” అని చెప్పారు.  

ఈ సందర్భంగా హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేస్తున్నారు: “ఆ వ్యక్తి పై రాళ్ళు రువ్వుతున్న వారిలో నేనూ ఉన్నాను. మేమతడ్ని ఈద్గాహ్ కు తీసికెళ్ళి రాళ్ళు రువ్వాము. నలువైపుల నుంచీ రాళ్ళు వచ్చి మీద పడటం మొదలవ్వగానే అతను వాటి ధాటికి నిలువలేక పరుగు లంకించుకున్నాడు.  మేము అతడ్ని వెంబడించి చివరికి మదీనా వెలుపల ఒక రాతి నేలలో కలుసుకొని అతని పై రాళ్ళు రువ్వాము”.  

(సహీహ్ బుఖారీ:- 86వ ప్రకరణం-శిక్షాస్మృతి, 22వ అధ్యాయం-లా యుర్జముల్ మజ్నూన్ వల్ మజ్నూన)  

1103 – حديث أَبِي هُرَيْرَةَ وَزَيْدِ بْنِ خَالِدٍ الْجُهَنِيِّ قَالاَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: أَنْشُدُكَ اللهَ إِلاَّ قَضَيْتَ بَيْنَنَا بِكِتَابِ اللهِ؛ فَقَامَ خَصْمُهُ، وَكَانَ أَفْقَهَ مِنْهُ، فَقَالَ: صَدَقَ، اقْضِ بَيْنَنَا بِكِتَابِ اللهِ، وَأْذَنْ لِيَ يَا رَسُولَ اللهِ فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: قُلْ فَقَالَ: إِنَّ ابْنِي كَانَ عَسِيفًا فِي أَهْلِ هذَا، فَزَنَى بِامْرَأَتِهِ، فَافْتَدَيْتُ مِنْهُ بِمِائَةِ شَاةٍ وَخَادِمٍ؛ وَإِنِّي سَأَلْتُ رِجَالاً مِنْ أَهْلِ الْعِلْمِ فَأَخْبَرُونِي أَنَّ عَلَى ابْنِي جَلْدَ مِائَةٍ وَتَغْرِيبَ عَامٍ، وَأَنَّ عَلَى امْرَأَةِ هذَا الرَجْمَ؛ فَقَالَ: وَالَّذِي نَفْسِي بِيَدِهِ لأَقْضِيَنَّ بَيْنَكُمَا بِكِتَابِ اللهِ: الْمِائَةَ وَالْخَادِمُ رَدٌّ عَلَيْكَ، وَعَلَى ابْنِكَ جَلْدُ مِائَةٍ وَتَغْرِيبُ عَامٍ؛ وَيَا أُنَيْسُ [ص:188] اغْدُ عَلَى امْرَأَةِ هذَا فَسَلْهَا، فَإِنِ اعْتَرَفَتْ فَارْجُمْهَا فَاعْتَرَفَتْ، فَرَجَمَهَا

أخرجه البخاري في: 86 كتاب الحدود: 46 باب هل يأمر الإمام رجلاً فيضرب الحد غائبًا عنه

1103. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు), జైద్ బిన్ ఖాలిద్ జహ్ నీ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వచ్చి “నేను దైవసాక్షిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీరు దైవగ్రంధం ఆధారంగా  మాత్రమే తీర్పివ్వండి” అని అన్నాడు. ఆ తరువాత అతని కన్నా కాస్త తెలివయిన వాడయిన అతని ప్రత్యర్థి లేచి “ఇతను సరయిన మాటే అన్నాడు దైవప్రవక్తా! మీరు మా వ్యవహారాన్ని దైవగ్రంధం ఆధారంగానే పరిష్కరించండి. జరిగిన సంఘటనేమిటో చెబుతాను అనుమతించండి” అని అన్నాడు. “సరే చెప్పు” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). అప్పుడతను ఇలా అన్నాడు: “నా కొడుకు ఇతనింట్లో  సేవకుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. ఆ అబ్బాయి ఓ రోజు ఇతని భార్యతో వ్యభిచరించాడు. అప్పుడు నేను నష్టపరిహారంగా ఇతనికి వంద మేకల్ని, ఒక బానిసను ఇచ్చాను. అయితే ఆ తరువాత నేను కొందరు తెలిసిన వాళ్ళను విచారిస్తే నా కొడుకుకు వంద కొరడా దెబ్బలు కొట్టాలని, తరువాత అతడ్ని ఒక సంవత్సరం పాటు నగర బహిష్కరణ చేయాలని, ఈ వ్యక్తి భార్యకు శిలాశిక్ష విధించాలని చెప్పారు వారు!”  

దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ మాటలు విని “నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తిమంతుని సాక్షి! నేను మీ వ్యవహారాన్ని దైవగ్రంధం ప్రకారం పరిష్కరిస్తాను. నీవు ఇతనికి నష్టపరిహారంగా ఇచ్చిన వంద మేకల్ని ఒక బానిసను వెనక్కి తీసుకో. నీ కొడుక్కి వంద కొరడా దెబ్బలు కొట్టబడతాయి, ఒక సంవత్సరం పాటు నగర బహిష్కరణ చేయడం జరుగుతుంది” అని అన్నారు. తరువాత (ఆయన తన అనుచరుడు) అనీస్! (ని ఉద్దేశించి) రేపు నీవు ఈ వ్యక్తి భార్య దగ్గరకెళ్ళి ఆమెను విచారించు. ఒకవేళ ఆమె కూడా ఈ నేరాన్ని ఒప్పుకుంటే ఆమెకు శిలాశిక్ష విధించబడుతుంది’ అని అన్నారు). హజ్రత్ అనీస్ (రదియల్లాహు అన్హు) వెళ్ళి విచారిస్తే ఆమె తన నేరాన్ని ఒప్పుకుంది. అప్పుడు ఆమెకు శిలాశిక్ష అమలు పరచమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశించారు.*  

(సహీహ్ బుఖారీ, 86వ ప్రకరణం-అల్ హుదూద్, 46వ అధ్యాయం- హల్ యామురుల్ ఇమాము రజులన్ ఫయజ్రిబుల్ హద్ద గాయిబన్ అన్హు)  

* ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఇలా రాస్తున్నారు: “హజ్రత్ అనీస్ (రదియల్లాహు అన్హు) ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ స్త్రీ అభిప్రాయం అడిగి తెలుసుకోవడానికి ఆమె దగ్గరకు పంపించారు. “నీ మీద ఆ వ్యక్తి వ్యభిచార నిందను మోపాడు, నీవు అతనికి కొరడా శిక్ష విధింపజేయవచ్చు” అని అన్నారు హజ్రత్ అనీస్ (రదియల్లాహు అన్హు) ఆమెతో. అయితే ఆమె స్వయంగా తన నేరాన్ని ఒప్పుకున్నందున ఆమెకు శిలా శిక్ష విధించబడింది.” షరీఅత్ దృష్ట్యా ఎవరి చేత కూడా నేరాన్ని ఒప్పించవలసిన అవసరం లేదు. అందువల్ల ఈ పని కోసం హజ్రత్ అనీస్ (రదియల్లాహు అన్హు)ని ఆ స్త్రీ దగ్గరకు పంపనవసరం లేదు. పైగా ఎవరైనా తన నేరాన్ని స్వయంగా అంగీకరిస్తే, దాన్ని నిరాకరించేందుకు అతనికి తగిన హితోపదేశం కూడా చేయవచ్చు.  (సంకలనకర్త) 

1104 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّ الْيَهُودَ جَاءُوا إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَذَكَرُوا لَهُ أَنَّ رَجُلاً مِنْهُمْ وَامْرَأَةً زَنَيَا فَقَالَ لَهُمْ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَا تَجِدُونَ فِي التَّوْرَاةِ فِي شَأْنِ الرَّجْمِ فَقَالُوا: نَفْضَحُهُمْ وَيُجْلَدُونَ فَقَالَ عَبْدُ اللهِ بْنُ سَلاَمٍ: كَذَبْتُمْ إِنَّ فِيهَا الرَّجْمَ فَأَتَوْا بِالتَّوْرَاةِ فَنَشَرُوهَا، فَوَضَعَ أَحَدُهُمْ يَدَهُ عَلَى آيَةِ الرَّجْمِ، فَقَرَأَ مَا قَبْلَهَا وَمَا بَعْدَهَا؛ فَقَالَ لَه عَبْدُ اللهِ بْنُ سَلاَمٍ: ارْفَعْ يَدكَ فَرَفَعَ يَدَهُ، فَإِذَا فِيهَا آيَةُ الرَّجْمِ فَقَالُوا: صَدَقَ يَا مُحَمَّدُ فِيهَا آيَةُ الرَّجْمِ فَأَمَرَ بِهِمَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَرُجِمَا
قَالَ عَبْدُ اللهِ بْنُ عُمَرَ: فَرَأَيْتُ الرَّجُلَ يَجْنَأُ عَلَى الْمَرْأَةِ، يَقِيهَا الْحِجَارَةَ

أخرجه البخاري في: 61 كتاب المناقب: 26 باب قول الله تعالى (يعرفونه كما يعرفون أبناءهم)

1104. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి (మదీనాలోని కొందరు) యూదులు వచ్చి “మాలో ఒక స్త్రీ, ఒక పురుషుడు వ్యభిచారానికి పాల్పడ్డారు” అని తెలిపారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “తౌరాత్ గ్రంధంలో శిలాశిక్ష గురించి ఏముంది”? అని అడిగారు. “మేము (వ్యభిచరించిన) వారిని అవమానపరచి కొరడా దెబ్బలు కొడ్తాము” అని అన్నారు వారు. (ఇస్లాం స్వీకరించిన యూద మతస్థుడు) హజ్రత్ అబ్దుల్లా బిన్ సలామ్ ఈ మాటలు విని “మీరు అబద్దమాడుతున్నారు. తౌరాత్ లో ఈ నేరానికి శిలాశిక్ష ఉంది” అని అన్నారు. ఆ యూదులు తౌరాత్ గ్రంధం తెప్పించి తెరచి చూపించారు. అప్పుడు ఒక యూదుడు శిలాశిక్ష ఆదేశం ఉన్న సూక్తి మీద చేయి పెట్టి దాన్ని కనబడకుండా దాచి దాని పైన ఉన్న క్రింద ఉన్న వాక్యాలను చదవసాగాడు. హజ్రత్ అబ్దుల్లా బిన్ సలాం జోక్యం చేసుకుంటూ “నీ చెయ్యి తీసేసి చదువు” అన్నారు. యూదుడు చేతిని తీస్తే అక్కడ శిలాశిక్ష ఆదేశం స్పష్టంగా ఉంది.  అప్పుడు యూదులు (నిజాన్ని ఒప్పుకుంటూ) “దైవప్రవక్తా! అబ్దుల్లా బిన్ సలాం చెప్పింది నిజమే. తౌరాత్ లో శిలాశిక్ష ఆదేశం ఉంది” అని అన్నారు.  దాని ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిద్దరికీ శిలాశిక్ష అమలు పరచమని ఆదేశించారు. ఆదేశానుసారం వ్యభిచారులిద్దరి పై రాళ్ళు రువ్వి శిక్షించడం జరిగింది. ‘శిక్షిస్తున్నప్పుడు నేను చూశాను. పురుషుడు స్త్రీకి అడ్డుగా నిలబడి తానే రాళ్ళ దెబ్బలన్నీ తింటూ ఆమెను రాళ్ళ దెబ్బల నుండి కాపాడటానికి ప్రయత్నించాడు’ అని హజ్రత్ అబ్దుల్లా బిన్  ఉమర్ (రదియల్లాహు అన్హు) తెలిపారు.  

(సహీహ్ బుఖారీ-61వ ప్రకరణం-కితాబుల్ మనాఖిబ్, 26వ అధ్యాయం-ఖౌలిల్లాహి తఆలా యారిఫూనహూ   కమా యారిఫూన అబ్నా అహుమ్)  

1105 – حديث عَبْدِ اللهِ بْنِ أَبِي أَوْفَى عَنِ الشَّيْبَانِيِّ، قَالَ: سَأَلْتُ عَبْدَ اللهِ بْنَ أَبِي أَوْفَى، هَلْ رَجَمَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: نَعَمْ قُلْتُ: قَبْلَ سُورَةِ النُّورِ أَمْ بَعْدُ قَالَ: لاَ أَدْرِي

أخرجه البخاري في: 86 كتاب الحدود: 21 باب رجم المحصن

1105. హజ్రత్ ఫైబానీ (రహిమహుల్లాహ్) కథనం:- నేను హజ్రత్ అబ్దుల్లా బిన్ అబీ ఔఫా (రదియల్లాహు అన్హు)తో మాట్లాడుతూ “దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) శిలాశిక్షను అమలు పరిచారా?” అని అడిగాను.  దానికి ఆయన అమలు పరిచారని అన్నారు. “అయితే దీన్ని నూర్ అధ్యాయం (సూరా) అవతరించక పూర్వం అమలు పరిచారా లేక  అవతరించిన తరువాత అమలు పరిచారా?” అని అడిగాను నేను. ఆయన “నాకీ సంగతి తెలియదు” అన్నారు.”*  (సహీహ్ బుఖారీ:- 86వ ప్రకరణం- కితాబుల్ హుదూద్, 21వ అధ్యాయం-రజ్ముల్ ముహసిన్)  

* నూర్ సూరా అవతరణకు పూర్వమా లేక అవతరణ తరువాతనా? అంటే “వ్యభిచారానికి పాల్పడిన స్త్రీ పురుషులిద్దరిలో ప్రతి ఒక్కరికి నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి” (24:2) అనే సూక్తి అవతరించక పూర్వం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శిలా శిక్ష అమలు పరిచారా లేక అవతరించిన తరువాత అమలు పరిచారా? అని అర్థం. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నూర్ సూరా అవతరించిన తరువాత శిలా శిక్షను అమలు పరిచారు. నూర్ సూరా అవతరణ పూర్వాపరాలకు సంబంధించిన ఇస్క్ (అపనింద) సంఘటన హిజ్రీ 4,5 లేక 6లో సంభవించింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ సంఘటన జరిగిన తరువాతనే శిలా శిక్ష అమలు పరిచారు. శిలా శిక్ష ప్రస్తావన ఉన్న ఈ హదీసును ఉల్లేఖించిన హజ్రత్ అబూ హుగైరా (రదియల్లాహు అన్హు)  హిజ్రీ 7వ సంవత్సరంలో ఇస్లాం స్వీకరించారు. మరో ఉల్లేఖకుడు హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) తమ తల్లితో పాటు హిజ్రీ 9వ యేట మదీనా వచ్చారు.  (సంకలనకర్త)  

1106 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِذَا زَنَتِ الأَمَةُ فَتَبَيَّنَ زِنَاهَا، فَلْيَجْلِدْهَا وَلاَ يُثَرِّبْ، ثُمَّ إِنْ زَنَتْ فَلْيَجْلِدْهَا وَلاَ يُثَرِّبْ، ثُمَّ إِنْ زَنَتِ الثَّالِثَةَ فَلْيبِعْهَا وَلَوْ بِحَبْلٍ مِنْ شَعَرٍ

أخرجه البخاري في: 34 كتاب البيوع: 66 باب بيع العبد الزاني

1106. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:- బానిస  స్త్రీ వ్యభిచరిస్తే ఆమె నేరం (సాక్ష్యాలు లేదా అంగీకారం ద్వారా) రుజువయితే ఆమెకు కొరడా దెబ్బల శిక్ష విధించబడుతుంది. ఆమెను మందలించడం జరగదు. ఆ తరువాత ఆమె మళ్ళీ వ్యభిచారానికి పాల్పడితే అప్పుడు కూడా ఆమెకు కొరడా దెబ్బల శిక్ష పడుతుంది. ఛీత్కరించుకోవడం, మందలించడం జరగదు. ఒకవేళ మూడోసారి కూడా వ్యభిచారానికి పాల్పడితే ఆమెను ఎంత తక్కువ ధరకైనా అమ్మి వేయడం జరుగుతుంది. చివరికి వెంట్రుకలతో పేనిన తాడంతటి ధర పలికినా సరే ఆమెను అమ్మి వేయడం జరుగుతుంది.*   (సహీహ్ బుఖారీ:- 33వ ప్రకరణం-బుయూ, 66వ అధ్యాయం-బైవుల్ అబ్ది జ్ఙాని )  

(*) ఈ హదీసుని బట్టి యజమాని స్వయంగా తన బానిసకు శిక్ష విధించవచ్చని తెలుస్తోంది. ఇమామ్ షాఫయీ (రహిమహుల్లాహ్) , ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్), అధిక సంఖ్యాక ధర్మవేత్తల అభిప్రాయం ఇదే. కాని ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) అభిప్రాయం ప్రకారం శిక్ష విధించే అధికారం న్యాయాధిపతికి ఉండాలి. మూడవసారి వ్యభిచారానికి పాల్పడినా బానిసకు కొరడా దెబ్బల శిక్షే పడుతుంది. అయితే బానిస అనేకసార్లు వ్యభిచారానికి పాల్పడి శిక్ష విధించబడకపోయినట్లయితే, ప్రస్తుత నేరానికి ఒక్కసారి మాత్రమే కొరడా దెబ్బల శిక్ష  పడుతుంది. గతంలో ఎన్నిసార్లు వ్యభిచరిస్తే అన్నిసార్లు ప్రస్తుతం శిక్ష విధించబడదు. హదీసులో బానిస మహిళను అమ్మే ఆదేశం ఇవ్వబడిందంటే, దాని ఉద్దేశం ఆమెకిక సమాజంలో ఎలాంటి విలువా లేదని తెలియజేయడమే. అధిక సంఖ్యాక ధర్మవేత్తల దృష్టిలో ఇది విధిగా పాటించవలసిన ఆదేశం కాదు. ఆహ్ల్ జాహిర్ ధర్మ వేత్తల ప్రకారం మాత్రం ఇది విధిగా పాటించవలసిన ఆదేశమే. (ఇమామ్ నవవీ – రహిమహుల్లాహ్).  

1107 – حديث أَبِي هُرَيْرَةَ وَزَيْدِ بْنِ خَالِدٍ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ سُئِلَ عَنِ الأَمَةِ، إِذَا زَنَتْ وَلَمْ تُحْصِنْ، قَالَ: إِنْ زَنَتْ فَاجْلِدُوهَا، ثُمَّ إِنْ زَنَتْ فَاجْلِدُوهَا، ثُمَّ إِنْ زَنَتْ فَبِيعُوهَا وَلَوْ بِضَفِيرٍ

أخرجه البخاري في: 34 كتاب البيوع: 66 باب بيع العبد الزاني

1107. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు), జైద్ బిన్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు)ల కథనం :- అవివాహిత అయిన బానిసరాలు వ్యభిచారానికి పాల్పడితే ఆమెకు శిక్షేమిటీ?” అని అడిగారు ఒకరు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం)ను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సమాధానమిచ్చారు: “బానిస స్త్రీ (ఆమె వివాహిత అయినా, అవివాహిత అయినా) వ్యభిచరిస్తే ఆమెకు కొరడా దెబ్బల శిక్ష పడుతుంది. ఆమె రెండవసారి వ్యభిచరిస్తే మళ్ళీ ఆమెకు కొరడా దెబ్బల శిక్ష పడుతుంది. ఆ తరువాత కూడా వ్యభిచారానికి పాల్పడితే (శిక్ష అమలు పరచిన తరువాత) యజమాని ఆమెను ఎంత చౌకగానయినా అమ్మివేయవచ్చు, చివరికి వెంట్రుకలతో  పేనిన తాడంత ధర వచ్చినా సరే అమ్మివేయవచ్చు.”  
(ఆమెకు ఇస్లామీయ సమాజంలో ఇక గడ్డి పరకంత విలువ కూడా లేదు)  
(సహీహ్ బుఖారీ:- 34వ ప్రకరణం-అల్ బయూ, 66వ అధ్యాయం-బైవుల్ అభిజాని)  

1108 – حديث أَنَسٍ، قَالَ: جَلَدَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فِي الْخَمْرِ، بِالْجَرِيدِ وَالنِّعَالِ؛ وَجَلَدَ أَبُو بَكْرٍ أَرْبَعِينَ
__________
أخرجه البخاري في: 86 كتاب الحدود: 4 باب الضرب بالجريد والنعال

1108. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- మద్యం సేవించిన నేరస్థులకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పులతో, బెత్తాలతో కొట్టి శిక్ష విధించేవారు. (మొదటి ఖలీఫా) హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) ఇలాంటి నేరస్థులకు నలభై కొరడా దెబ్బలు విధించేవారు.  

(సహీహ్ బుఖారీ:- 86వ ప్రకరణం-అల్ హుదూద్, 4వ అధ్యాయం-అజ్జర్బు బిల్ జరీది వన్నిఆల్)  

1109 – حديث عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ رضي الله عنه، قَالَ: مَا كُنْتُ لاِقِيمَ حَدًّا عَلَى أَحَدٍ فَيمُوتَ، فَأَجِدَ فِي نَفْسِي، إِلاَّ صَاحِبَ الْخَمْرِ، فَإِنَّهُ لَوْ مَاتَ وَدَيْتُهُ؛ وَذلِكَ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لَمْ يَسُنَّهُ

أخرجه البخاري في: 86 كتاب الحدود: باب الضرب بالجريد والنعال

1109. హజ్రత్ అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేనొకవేళ ఎవరికైనా శిక్ష అమలు పరచినప్పుడు అతను చనిపోవడం జరిగితే ఒక త్రాగుబోతు విషయంలో తప్ప నాకెలాంటి విచారం లేదు. త్రాగుబోతు వ్యక్తి శిక్ష వల్ల చనిపోతే నేనందుకు రక్త పరిహారం ఇప్పిస్తాను. ఎందుకంటే ఈ నేరానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎలాంటి నిర్ణీత శిక్షనూ నిర్ధారించలేదు.*

(సహీహ్ బుఖారీ:- 86వ ప్రకరణం-అల్ హుదూద్, 4వ అధ్యాయం-అజర్బుబిల్ జరీది వన్ని ఆల్)

*మద్యం సేవించిన నేరానికి కొరడా దెబ్బల శిక్ష లాంటిదేదీ నిర్దేశించబడలేదు. ఈ కారణంగా ధర్మ వేత్తల మధ్య కూడా భేదాభిప్రాయాలున్నాయి. ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), అబూ సౌర్ (రహిమహుల్లాహ్), అబూదావూద్ జాహిరి (రహిమహుల్లాహ్), ఇతర ఆహ్ల్ జాహిర్ ధర్మవేత్తల ప్రకారం ఈ నేరానికి శిక్ష నలభై కొరడా దెబ్బలు. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్), ఇమామ్ అబూహనీఫా (రహిమహుల్లాహ్), ఔజాయి (రహిమహుల్లాహ్), సుఫ్యాన్ సూరి (రహిమహుల్లాహ్), ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్), ఇస్ హాక్ (రహిమహుల్లాహ్) ల ప్రకారం ఎనభై కొరడా దెబ్బల శిక్ష పడాలి. పోతే కొరడా దెబ్బల సంఖ్య నలభై అయినా, ఎనభై అయినా, కొరడాతో కొట్టినా, చెప్పుతో కొట్టినా, బెత్తంతో కొట్టినా అన్నీ ధర్మసమ్మతమే. అయితే కొందరు ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం కొరడాతో తప్ప ఇతర వస్తువులతో శిక్షించడం ధర్మ సమ్మతం కాదు. కాని మొదటి అభిప్రాయం హదీసు ద్వారా రూఢి అవుతున్నందున ఈ రెండవ అభిప్రాయం సరయినది కాదు. వాస్తవం అల్లాహ్ కే తెలుసు.  (ఇమామ్ నవవీ – రహిమహుల్లాహ్).  

1110 – حديث أَبِي بُرْدَةَ رضي الله عنه، قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: لاَ يُجْلَدُ فَوْقَ عَشْرِ جَلَدَاتٍ، إِلاَّ فِي حَدٍّ مِنْ حُدُودِ الله

أخرجه البخاري في: 86 كتاب الحدود: 42 باب كم التعزير والأدب

1110. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:- “అల్లాహ్ నిర్ణయించిన శిక్షలు తప్ప మరే శిక్ష విషయంలోనూ (నేరస్థుడికి) పదికంటే ఎక్కువ కొరడా దెబ్బలు  కొట్టకూడదు.”  

(సహీహ్ బుఖారీ-86వ ప్రకరణం-అల్ హదూద్, 42వ అధ్యాయం-కమిల్ తాజీరు వల్ అదబ్)  

1111 – حديث عُبَادَةَ بْنِ الصَّامِتِ رضي الله عنه، وَكَانَ شَهِدَ بَدْرًا، وَهُوَ أَحَدُ النُّقَبَاءِ لَيْلَةَ الْعَقَبَةِ: أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ، وَحَوْلَهُ عِصَابَةٌ مِنْ أَصْحَابِهِ: بَايِعُونِي عَلَى أَنْ لاَ تُشْرِكُوا بِاللهِ شَيْئًا وَلاَ تَسْرِقُوا وَلاَ تَزْنُوا وَلاَ تَقْتُلُوا أَوْلاَدَكُمْ وَلاَ تَأْتَوا بِبُهْتَانٍ تَفْتَرُونَهُ بَيْنَ أَيْدِيكُمْ وَأَرْجُلِكُمْ، وَلاَ تَعْصُوا فِي مَعْرُوفٍ، فَمَنْ وَفَى مِنْكُمْ فَأَجْرُهُ عَلَى اللهِ، وَمَنْ أَصَابَ مِنْ ذَلِكَ شَيْئًا فَعُوقِبَ فِي الدُّنْيَا فَهُوَ كَفَّارَةٌ لَهُ، وَمَنْ أَصَابَ مِن ذَلِكَ شَيْئًا [ص:191] ثُمَّ سَتَرَه اللهُ، فَهُوَ إِلَى اللهِ، إِنْ شَاءَ عَفَا عَنْهُ، وَإِنْ شَاءَ عَاقَبَهُ فَبَايَعْنَاهُ عَلَى ذَلِكَ

أخرجه البخاري في: 2 كتاب الإيمان: 11 باب حدثنا أبو اليمان

1111. బద్ర్ యుద్ధంలో పాల్గొనడమేగాకుండా రెండవ ఉఖ్బా ప్రమాణ స్వీకారంలోనూ పాల్గొన్న ప్రతినిధులలో ఒకరయిన హజ్రత్ ఉబాదా బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అనుచరుల మధ్య నిలబడి ఇలా అన్నారు – “ఈ విషయాలను గురించి నా ముందు ప్రమాణం చేయండి. మేము ఏ విధంగానూ అల్లాహ్ కి సాటి కల్పించము. దొంగతనం చేయము. వ్యభిచారానికి పాల్పడము. మా సంతానాన్ని హతమార్చము. ఎవరి మీదా అపనిందలను మోపము. ధర్మసమ్మతమైన ఏ ఆదేశాన్ని శిరసావహించడానికి నిరాకరించము.” ఇక మీలో ఎవరైనా ఏదైనా నేరం చేసి, దానికి ఇహలోకంలోనే శిక్ష అనుభవిస్తే, ఆ శిక్ష అతని పాపానికి పరిహారమవుతుంది. ఒకవేళ అతను నేరం చేసినప్పటికీ (ఇహలోకంలో శిక్షకు గురికాకుండా) అల్లాహ్ అతని నేరాన్ని కప్పి పుచ్చడం జరిగితే అతని వ్యవహారం అల్లాహ్ చేతిలో ఉంటుంది. అల్లాహ్ తలచుకుంటే అతడ్ని క్షమించవచ్చు లేదా. శిక్షించవచ్చు”.  ఈ విషయాలను అంగీకరిస్తూ మేమంతా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేతిలో చేయి వేసి ప్రమాణం చేశాము .  

(సహీహ్ బుఖారీ:-2వ ప్రకరణం – ఈమాన్, 11వ అధ్యాయం – హద్దసనా అబుల్ యమాన్) 

1112 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: الْعَجْمَاءُ جُبَارٌ، وَالبِئْرُ جُبَارٌ، وَالْمَعْدِنُ جُبَارٌ، وَفِي الرِّكَازِ الْخُمُسُ

أخرجه البخاري في: كتاب الزكاة: 66 في الركاز الخمس

1112. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:- “నోరులేని జీవి ఎవరినైనా గాయపరిస్తే లేదా చంపితే దానికి ఎలాంటి నష్టపరిహారం లేదు. అలాగే ఎవరైనా నూతిలో లేదా గనిలో పడి చనిపోతే లేక  గాయపడితే దానిక్కూడా నష్టపరిహారం లేదు. భూమిలో ఏవైనా నిధి నిక్షేపాలు బయల్పడితే అందులో అయిదో భాగం బైతుల్ మాల్ (ప్రభుత్వ ధనాగారం)కు ఇచ్చి వేయాలి.” * (సహీహ్ బుఖారీ:- 24వ ప్రకరణం-జకాత్, 66వ అధ్యాయం-ఫిర్రికా జిల్ ఖుమ్సు)  

* ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ప్రకారం జంతువు పగలుగాని, రాత్రిగాని నష్టపరిస్తే, అందులో దాని యజమాని దోషం ఏమీ లేకపోతే లేదా దాని వెంట దాని యజమాని లేకపోతే ఎలాంటి నష్ట పరిహారం లేదు. ఒకవేళ జంతువుని తోలేవాడు లేక దానిపై స్వారీ చేసేవాడు గనక ఉండి ఆ జంతువు ఏదైనా హాని కలిగించిన పక్షంలో యజమాని నష్ట పరిహారం (Compensation) చెల్లించవలసి ఉంటుంది. ఇమామ్ దావూద్ (రహిమహుల్లాహ్) , అహఁలే జాహిర్ ధర్మవేత్తల ప్రకారం యజమాని జంతువుని ఉసిగొల్పితే తప్ప, అది మరే విధంగా హాని కలిగించినా నష్ట పరిహారం చెల్లించనవసరం లేదు. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) ప్రకారం యజమాని నష్ట పరిహారం చెల్లించాలి. ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) ప్రకారం హాని కలిగించే అలవాటున్న జంతువుని కట్టివేయకుండా విచ్చలవిడిగా వదలి పెడితే యజమాని నష్ట పరిహారం చెల్లించవలసి ఉంటుంది. ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) ప్రకారం జంతువులు కలిగించే హానికి ఎట్టి పరిస్థితిలోనూ నష్ట పరిహారం లేదు.  

ఎవరైనా తన సొంత భూమిలో లేదా బంజరు భూమిలో బావిగాని, గనిగాని తవ్వి ఉన్నప్పుడు అందులో ఎవరైనా పడి గాయపడితే లేదా చనిపోతే త్రవ్విన వ్యక్తి ఎలాంటి నష్టపరిహారం చెల్లించనవసరం లేదు. అయితే రహదారిలో లేదా ఇతరుల భూమిలో బావిగాని, గనిగాని త్రవ్వితే నష్టపరిహారం చెల్లించవలసి ఉంటుంది.  

నిధి నిక్షేపాలని అనువదించిన చోట మూల భాషలో ‘రికాజ్ అనే పదం ఉంది. రికాజ్ అంటే అధిక సంఖ్యాక ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం నేలలో పాతి పెట్టబడిన పురాతన నిధి అని అర్థం; ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) ప్రకారం గనిలోని నిక్షేపం  అని అర్థం.

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

మంచిని పోత్సహించడం – చెడు వైపునకు పురికొల్పడం | కలామే హిక్మత్

ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. “సన్మార్గం వైపునకు ఆహ్వానించే వానికి అతని ద్వారా సన్మార్గం పొందిన వారికి లభించినంత పుణ్యఫలం లభిస్తుంది. (అయితే) వారి ప్రతిఫలంలో మటుకు ఎటువంటి కొరతా రాదు. (ఇకపోతే) మార్గవిహీనత వైపునకు పిలిచే వ్యక్తికి, అతని ద్వారా మార్గభ్రష్టులైన వారికి లభించినంత దుష్ఫలం లభిస్తుంది. కాగా, ఆ మార్గభ్రష్టుల దుష్కర్మలు తగ్గటమూ జరగదు.” (ముస్లిం)

ఈ పవిత్ర హదీసు ద్వారా రూఢీ అయ్యేదేమిటంటే సౌశీల్యం దైవ మార్గదర్శకత్వాల ప్రాతిపదికలపై అల్లాహ్ వైపునకు, సత్కార్యాల వైపునకు సందేశం ఇచ్చేవాడు ఎంతో ఆదరణీయుడు. అతనికి లభించే ప్రతిఫలం అపారం. దాన్ని అతను ఊహించనైనా లేడు. అల్లాహ్ శుభవార్త ఇచ్చాడు :

41:33 وَمَنْ أَحْسَنُ قَوْلًا مِّمَّن دَعَا إِلَى اللَّهِ وَعَمِلَ صَالِحًا وَقَالَ إِنَّنِي مِنَ الْمُسْلِمِينَ

అల్లాహ్‌ వైపు (జనులను) పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ ‘నేను విధేయుల (ముస్లింల)లో ఒకడను’ అని పలికేవాని మాటకంటే మంచిమాట మరెవరిది కాగలదు?(హామీమ్ సజ్దా 41 : 33)

అల్లాహ్ వైపునకు ఆహ్వానించే వాని మాటకు అంతటి ఉన్నత స్థానం ఎందుకివ్వబడిందంటే అతని మాట ద్వారా ఎంతోమంది దైవ మార్గదర్శకత్వం పొందుతారు. వారందరికీ ఆ మహాభాగ్యం లభించటానికి కారకుడైనందుకు గాను వారు సంపాదించినంత పుణ్యం ఇతనికి కూడా ప్రాప్తిస్తుంది. సత్య సందేశానికి ఉన్న ప్రాధాన్యత ఎంతటిదో ఈ ఒక్క హదీసు ద్వారా అంచనా వేయవచ్చు.

పోతే; మార్గ విహీనత, మార్గభ్రష్టతల వైపునకు ప్రజలను పిలవటం మహా పాతకం. అదెంత ఘోరమయిన అపరాధం అంటే అతని ద్వారా ఎంతమంది మార్గభ్రష్టులయ్యారో, అంతమందీ ఎన్ని పాపాలు చేశారో అన్ని పాపాల భారం అతని పై కూడా పడుతుంది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించినట్లు హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) చెప్పారు : “ఏ ప్రాణీ అన్యాయంగా వధించబడినా దాని రక్తపు భారం ఆదం యొక్క మొదటి కుమారునిపై పడుతుంది. ఎందుకంటే మొదటి హత్య చేసిన వాడు అతనే.” (బుఖారీ, ముస్లిం, తిర్మిజి)

ఆదం కుమారుడైన ఖాబైల్, మరో కుమారుడైన హాబైల్ని హతమార్చాడు. లోకంలో అది మొట్టమొదటి హత్య. ప్రళయదినం వరకు ఎన్ని హత్యలు జరిగినా వాటి పాపం ఖాబైల్ ఖాతాలోకి వెళుతూనే ఉంటుంది. ఎందుకంటే అతనే హత్యల ద్వారం తెరిచాడు. ఈ విధంగానే చెడుల వైపునకు ప్రజలను పురికొల్పేవాడు కూడా ప్రళయం వరకు అతని అనుయాయులు చేసిన పాపభారాన్ని మోస్తూ ఉంటాడు. మరోవైపు ఆ చెడులు చేసే వారి దుష్పలం కూడా ఏమాత్రం తగ్గదు.

“ఎవరయితే సన్మార్గం వైపునకు ఆహ్వానిస్తారో…”

“ఎవరయితే మార్గ విహీనత వైపునకు పిలుస్తారో….”

అన్ని రకాల పిలుపు లేక ఆహ్వానం ఇందులో ఇమిడిఉంది. అది మూజువాణీగా కావచ్చు, సైగ ద్వారా కావచ్చు, ఆచరణ ద్వారా కావచ్చు, వ్రాతపూర్వకంగా కూడా కావచ్చు. ఇక్కడ సన్మార్గం అంటే దైవాదేశాలు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పవిత్ర పలుకులకు సంబంధించిన విషయం. అల్లాహ్ సెలవిచ్చాడు :

2:38 قُلْنَا اهْبِطُوا مِنْهَا جَمِيعًا ۖ فَإِمَّا يَأْتِيَنَّكُم مِّنِّي هُدًى فَمَن تَبِعَ هُدَايَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ

మేము వారితో అన్నాము: “మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి. నా ఉపదేశం ఎప్పుడు మీ వద్దకు వచ్చినా, దాన్ని అనుసరించే వారికి ఎలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.” (అల్ బఖర 2 : 38)

ఇక్కడ ‘నా తరఫు ఉపదేశం’ అంటే ఆకాశ గ్రంథాలు ప్రవక్తల ప్రబోధనలని భావం. అల్లాహ్ తరఫున అవతరించిన ఆదేశాలను పాటించటం, దైవప్రవక్తకు విధేయత చూపటం కూడా సన్మార్గానుసరణగానే భావించబడుతుంది.

దివ్య ఖుర్ఆన్లో మరోచోట ఇలా సెలవీయబడింది :

7:3 اتَّبِعُوا مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۗ قَلِيلًا مَّا تَذَكَّرُونَ

(ప్రజలారా!) మీ ప్రభువు తరఫున మీకు వొసగబడిన దానిని మీరు అనుసరించండి. అల్లాహ్‌ను వదలి ఇతర సంరక్షకులను అనుసరించకండి. మీరు బహుకొద్దిగా మాత్రమే హితబోధను గ్రహిస్తారు.(అల్ ఆరాఫ్ : 3)

మరోచోట చెప్పబడింది :

36:20 وَجَاءَ مِنْ أَقْصَى الْمَدِينَةِ رَجُلٌ يَسْعَىٰ قَالَ يَا قَوْمِ اتَّبِعُوا الْمُرْسَلِينَ
36:21 اتَّبِعُوا مَن لَّا يَسْأَلُكُمْ أَجْرًا وَهُم مُّهْتَدُونَ

(అంతలోనే ఆ) నగరం చివరి వైపు నుంచి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు : “ఓ నా జాతివారలారా! మీరు ప్రవక్తలను అనుసరించండి. మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగని వారి, సన్మార్గాన ఉన్న వారి వెనుక నడవండి.”(యాసీన్ : 20, 21)

ఏ గ్రంథమైతే దైవోపదేశాలకు, దైవప్రవక్త సంప్రదాయానికి అనుగుణంగా లేదో అది మార్గ విహీనత వైపునకు గొనిపోయే గ్రంథంగానే పరిగణించబడుతుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు మా ఈ (ధర్మ) వ్యవహారంలో ఎవరయినా లేనిపోని విషయాన్ని కల్పిస్తే అది రద్దు చేయబడుతుంది (బుఖారి, ముస్లిం). మరో సందర్భంలో ఇలా పలికారు : “మా పద్ధతిలో లేనిదాన్ని ఎవరయినా చేస్తే అది స్వీకారయోగ్యం కానేరదు.” (ముస్లిం)

“వారి పుణ్యఫలంలో ఏ కొరతా రాదు” అంటే సజ్జనుల లెక్కలోని సత్కర్మలను తీసి, వారిని సన్మార్గంలోకి తెచ్చిన వ్యక్తికి ఇవ్వటం జరగదు అని భావం. అల్లాహ్ కారుణ్యం అనంతమైనది. అది ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. విరివిగా లభిస్తుంది. ఈ వాక్యంలో అటు సద్వర్తనులకు, ఇటు సన్మార్గం వైపునకు ఆహ్వానించే వారికి ఇద్దరికీ శుభవర్తమానం ఉంది.

“వారి పాపాల భారంలో ఎటువంటి తగ్గింపూ జరగదు” : చెడులకు నాంది పలికి, అవి వెర్రితలలు వేయటానికి కారకుడైనందున ఆ చెడులను అనుసరించే వారందరికీ లభించేంత పాప భారం ఈ చెడుల పితామహుడికి కూడా లభిస్తుంది. ఈ వాక్యంలో దుర్వర్తనులకు, దుర్వర్తనం వైపునకు పిలిచిన వారికి కూడా గట్టి హెచ్చరిక ఉంది.

ప్రజలకు మార్గ దర్శకత్వం వహించటంలో ఉన్నత సంప్రదాయాలను నెలకొల్పటం, సత్ క్రియలకు పురికొల్పటం కూడా చేరి ఉంది. జరీర్ బిన్ అబ్దుల్లా గారి హదీసు ద్వారా ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. ఆయన ప్రకారం ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి కొంతమంది పల్లెవాసులు వచ్చారు. వారు ఆపదలో ఉన్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి దురవస్థను, అక్కరలను పసిగట్టి దానధర్మాల ద్వారా వారిని ఆదుకోవలసిందిగా ప్రజలకు పురికొల్పారు. అయితే ప్రజలు దానధర్మాలు చేయటంలో నిర్లిప్తత వహించారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఖారవిందంపై విచార ఛాయలు ప్రస్ఫుటమయ్యాయి. అంతలో ఒక అన్సారి వెండి నాణాల సంచి తెచ్చారు. మరొకరు కూడా అదే పని చేశారు. ఆపై ఒకరి తరువాత ఒకరు తెచ్చి దానం చేయసాగారు. ప్రవక్త గారి మోము ఆనందంతో విచ్చుకునేవరకూ వారు తెస్తూనే ఉన్నారు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు: “ఎవరయినా ఇస్లాంలో ఉత్తమ సంప్రదాయాన్ని నెలకొల్పితే తదనంతరం కూడా అది కొనసాగితే, దాన్ని పాటించే వారందరికీ లభించినంత పుణ్యఫలం, దాన్ని నెలకొల్పిన ఒక్క వ్యక్తికీ లభిస్తుంది. (అలా అని) అటు, దాన్ని అనుసరించే వారి ప్రతిఫలంలో కోత విధించటం జరగదు. (అదేవిధంగా) ఇస్లాంలో ఎవరయినా దుస్సంప్రదాయాన్ని ప్రవేశపెడితే, తరువాత వారు దాన్ని పాటిస్తే, ఆ పాటించే వారందరిపై పడే పాపభారం దాని మూల స్థాపకుడి పై కూడా పడుతుంది. అటు ఆ దుర్మార్గగాముల పాపంలో తగ్గింపు కూడా ఉండదు.” (ముస్లిం)

ఉన్నత సంప్రదాయాలను, ఉత్తమ అలవాట్లను నెలకొల్పటమంటే భావం ముస్లిములు షరీఅత్ ఆదేశాలను పాటించడంలో మార్గం సుగమం అయ్యే పనులు చేయడమని. అదేవిధంగా ఖుర్ఆన్, హదీసులను ఆయా ప్రజల మాతృ భాషలోకి అనువదించి, ధర్మావలంబనలో సాయపడటం కూడా ఈ కోవలోకే వస్తుంది.

ఈ హదీసులో పేర్కొనబడిన అన్సారీ సహచరుడు అందరి కంటే ముందు వెండి నాణాల సంచి తెచ్చి సమర్పించుకోవటం వల్ల ఇతర ముస్లిముల్లోని సేవాభావం జాగృత మయ్యింది. వారంతా దాన ధర్మాలకు పూనుకుని ఆ సత్కార్యంలో తలో చేయి వేశారు. దానికి గాను వారందరికీ లభించే సత్ఫలితం ఆ మొదటి అన్సారీకి లభిస్తుంది.

ఎందుచేతనంటే సత్కార్యం కోసం ఆయన వేసిన ముందడుగు ఇతర సహచరులకు ప్రేరణ నిచ్చింది. స్ఫూర్తి నిచ్చింది. ఇదేవిధంగా ఎవరయితే హితకార్యాల కోసం ప్రేరణ, ప్రోత్సాహాల వాతావరణం సృష్టిస్తారో వారి స్థానం గొప్పది. అయితే అటువంటి వారందరి ధ్యేయం అల్లాహ్ యొక్క ప్రసన్నతను చూరగొనడం అయి ఉండాలి. దాంతోపాటు చేసే పని కూడా ఉత్తమ పద్ధతిలోనే చేయాలి.

ఈ హదీసు ద్వారా మంచికై పురికొల్పే పని ఎంత మహత్పూర్వకమో, ఎంత ప్రాధాన్యతతో కూడుకున్నదో విశధమవుతోంది. అలాగే చెడులను సర్వసామాన్యం చేయడం ఎంత ఘోరపాతకమో స్పష్టమవుతోంది.

[డౌన్లోడ్ PDF]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ

యదార్థానికి మీ కొరకు దైవప్రవక్త (విధానం)లో అత్యుత్తమ ఆదర్శం ఉంది | కలామే హిక్మత్

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ కథనం ప్రకారం ముగ్గురు మనుషులు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ధర్మపత్నుల ఇళ్ళకు వచ్చి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఆరాధనల గురించి వివరాలు అడిగి తెలుసుకోసాగారు. వారికా వివరాలు తెలుపగా, అవి కొద్దిగేనని వారనుకున్నారు. తరువాత వారిలా అనసాగారు : “మహాప్రవక్త ఎక్కడా? మేమెక్కడ? ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ముందూ వెనుకటి పొరపొచ్చాలన్నీ క్షమించబడ్డాయి.” తరువాత వారిలో ఒకరు – “నేను ఇకనుండి రాత్రంతా నమాజ్లోనే గడుపుతాను” అని అంటే, మరొకరు, “నేను నిత్యం ఉపవాసం పాటిస్తాను, ఏ ఒక్క రోజు కూడా ఉపవాసం మానను” అన్నారు. ఇంకొకరు, “నేను స్త్రీలకు దూరంగా ఉంటాను, అసలెప్పుడూ వివాహమే చేసుకోను” అని ఖండితంగా చెప్పారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ విషయం తెలుసుకుని ఇలా ప్రబోధించారు : “మీరీ విధంగా అంటున్నారు. వినండి – దైవసాక్షిగా! నేను మీకన్నా అధికంగా దైవానికి భయపడేవాడిని. అయితే నేను ఉపవాసం పాటిస్తాను, విరమిస్తాను కూడా. నమాజ్ చేస్తాను, నిద్రపోతాను కూడా. ఇంకా స్త్రీలను కూడా వివాహమాడతాను. ఎవరు నా విధానం పట్ల విసుగెత్తాడో అతనితో నాకెట్టి సంబంధం లేదు.” (బుఖారి)

సూరా అల్ కౌసర్ (అత్యధిక శుభాలు) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]

సూరా అల్ కౌసర్ – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం)
https://youtu.be/q1WOtndCOOY [31 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 3 ఆయతులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలను ఈ సూరాలో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. మొదటి ఆయతులో వచ్చిన ‘కౌసర్’ (సమృద్ధి) అన్న పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ప్రసాదించబడిన అసంఖ్యాక అనుగ్రహాలను ప్రస్తావిస్తూ, అల్లాహ్ ను కొనియాడాలని, ఆయనకు కృతజ్ఞత చూపాలని బోధించడం జరిగింది. అవిశ్వాసుల వైరం, వారి గర్వం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఏమాత్రం నష్టపరచలేవని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సూరాను సూరతు’న్నహ్ర్’గా కూడా వ్యవహరిస్తారు.

77. తఫ్సీర్ సూరా ముర్సలాత్ (Tafsir Surah Mursalat) [వీడియో]

77. తఫ్సీర్ సూరా ముర్సలాత్ (Tafsir Surah Mursalat) [4 వీడియోలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ప్లే లిస్ట్: https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2R3mGtZwe7XSQ2iNzLDPT5

78. తఫ్సీర్ సూరా నబా (Tafsir Surah Naba) [వీడియోలు]

తఫ్సీరె సూర నబా (Tafsir Surah Naba) [వీడియోలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0bQpVcUnGot1P7G5t8KIv8

[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం నుండి]

[78] సూరా అన్ నబా

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 40 ఆయతులు ఉన్నాయి. ప్రళయాన్ని, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడాన్ని, తీర్పుదినాన్ని, శిక్షా బహుమానాలను ఈ సూరా ముఖ్యంగా ప్రస్తావించింది. ఈ సూరాలోని రెండవ ఆయతులో ప్రస్తావించబడిన ‘అన్ నబా’ (గొప్పవార్త) అన్న పేరునే దీనికి పెట్టడం జరిగింది.

అవిశ్వాసులు ముఖ్యంగా మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం అన్న విషయమై ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)తో వాదించేవారు. వారు మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడాన్ని తిరస్కరించేవారు, ఎగతాళి చేసేవారు. ఈ సూరా అవిశ్వాసులకు వారు వినడానికి ఇష్టపడని గొప్పవార్తను తెలియజేసింది. ఆ వార్త… మనిషి చేసిన పనులకు బాధ్యత వహించవలసి ఉంటుంది, జవాబు చెప్పుకోవలసి ఉంటుందన్న వార్త. తీర్పుదినం తప్పనిసరిగా వస్తుందని ఈ సూరా నొక్కి చెప్పింది.

సత్యతిరస్కారుల వాదనను తిప్పికొట్టడానికి ఈ సూరాలో అల్లాహ్ శక్తిసామర్ధ్యాలను, ప్రకృతిలో కనిపించే దృష్టాంతాలను వివరించింది. అల్లాహ్ భూమిని పరచి మనిషికి నివాసయోగ్యంగా చేసాడు. భూమి తొణకకుండా దానిపై పర్వతాలను నిలబెట్టాడు. ఆయన మనలను జంటలుగా సృష్టించాడు. నిద్రను విశ్రాంతికోసం సృష్టించాడు. ఆయన మనపై ఏడు ఆకాశాలను నిలబెట్టాడు. ఆకాశంలో దీపంగా సూర్యుడిని ఉంచాడు. మేఘాల నుంచి వర్షాన్ని కురిపిస్తున్నాడు. తీర్పుదినం స్వచ్ఛమైన సత్యం. మంచిచెడులను వేరు చేసే రోజు. ప్రతి ఒక్కరు తప్పక చవిచూడవలసిన రోజు. ఈ విషయాలు తెలుపుతూ నరకాగ్నిని వర్ణించడం కూడా జరిగింది. సత్యాన్ని తిరస్కరించిన వారికి, తీర్పుదినాన్ని కాదన్న వారికి నరకాగ్ని ఒక మాటు వంటిదని చెప్పడం జరిగింది. నరకంలో వారికి నల్లని, జుగుప్సాకరమైన, సలసలకాగే ద్రవంఇవ్వబడుతుంది. అక్కడ చల్లని నీడ కాని, చల్లని పానీయం కాని దొరకదు. మరోవైపు స్వర్గవనాలను వర్ణిస్తూ మనోహరమైన ఉద్యానవనంగా పేర్కొనడం జరిగింది. అక్కడివారికి సమవయస్కులైన కన్యలు, ప్రశాంతత లభిస్తాయి.

నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది | సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్) | హదీసు కిరణాలు [ఆడియో, టెక్స్ట్]

నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది | సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://youtu.be/lQSrDz01_OQ [19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, రియాదుస్ సాలిహీన్ నుండి ఐదవ హదీసు వివరించబడింది. ఈ హదీసులో మ’అన్ ఇబ్ను యజీద్, అతని తండ్రి యజీద్ మరియు తాత అఖ్నస్, ముగ్గురూ సహాబాలు కావడం ఒక విశేషంగా పేర్కొనబడింది. యజీద్ మస్జిద్ లో దానం చేయాలనే ఉద్దేశ్యంతో ధనాన్ని ఉంచగా, అతని కొడుకు మ’అన్ అవసరార్థం దానిని తీసుకున్నాడు. తండ్రి దీనిపై అభ్యంతరం చెప్పగా, వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీర్పు కోసం వెళ్లారు. ప్రవక్త (స) “ఓ యజీద్, నీ సంకల్పానికి ప్రతిఫలం నీకు లభిస్తుంది, మరియు ఓ మ’అన్, నీవు తీసుకున్నది నీకే చెందుతుంది” అని తీర్పు ఇచ్చారు. ఈ సంఘటన నుండి, కర్మలు సంకల్పాలపై ఆధారపడి ఉంటాయని, ఉద్దేశ్యం మంచిదైతే ఫలితం ఊహించని విధంగా ఉన్నా పుణ్యం లభిస్తుందని వివరించబడింది. అలాగే, తండ్రీకొడుకుల మధ్య విభేదాలు వస్తే పండితుల వద్దకు వెళ్లి పరిష్కారం వెతకాలని సూచించబడింది. చివరగా, ఒక వ్యక్తి తన కొడుకుకు లేదా తండ్రికి సాధారణ దానం (సదకా) ఇవ్వవచ్చని, కానీ జకాత్ ఇవ్వరాదని, ఎందుకంటే వారి పోషణ బాధ్యత తనపైనే ఉంటుందని వివరించబడింది. అయితే, వారు అప్పుల్లో ఉంటే, ఆ అప్పు తీర్చడానికి జకాత్ ఇవ్వవచ్చని స్పష్టం చేయబడింది.

5. హజ్రత్‌ మాన్‌ బిన్‌ యజీద్‌ బిన్‌ అఖ్‌నస్‌ (రదియల్లాహు అన్హుమ్) (ఈయన, ఈయన తండ్రీ తాతలు ముగ్గురూ దైవప్రవక్త అనుచరులే) కథనం:

“మా నాన్న యజీద్‌ ఒకసారి దానధర్మాల నిమిత్తం కొన్ని దీనార్లు బయటికి తీసి వాటిని మస్జిద్ లో ఒక వ్యక్తి దగ్గర (అవసరమున్న వానికి ఇవ్వమని) ఉంచి వెళ్ళిపోయారు. అదే సమయంలో నేను అక్కడికి వచ్చాను. (అవసరం నిమిత్తం) నేను ఆ వ్యక్తి నుండి దీనార్లు పుచ్చుకొని ఇంటికి తీసుకువచ్చాను. వాటిని చూసి మా నాన్నగారు “అల్లాహ్‌ సాక్షి! నేను ఇవి నీకివ్వాలనుకోలేదు. అంటూ నాతో వాదనకు దిగారు. నేను ఆయన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకు మా నాన్న వాదన గురించి వివరించాను. దానికి అయన: “ఓ యజీద్‌! నీకు నీ సంకల్పానికి అను గుణంగా పుణ్యం లభిస్తుంది. ఓ మాన్‌! అలాగే నువ్వు తీసుకున్న దీనార్లు కూడా నీకొరకు ధర్మ సమ్మతమే అవుతాయి” అని తీర్పు చెప్పారు” (బుఖారీ)

السلام عليكم ورحمة الله وبركاته
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.

الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين، نبينا محمد وعلى آله وصحبه أجمعين، أما بعد
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్ బిహి అజ్మయీన్, అమ్మా బాద్)
సకల లోకాల ప్రభువైన అల్లాహ్ యే సర్వ స్తోత్రాలకు అర్హుడు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ పైనా, ఆయన కుటుంబ సభ్యులు, సహచరులందరిపైనా అల్లాహ్ యొక్క శాంతి మరియు కరుణ వర్షించుగాక.

సోదర మహాశయులారా! రియాదుస్ సాలిహీన్, హదీసు మకరందం అనే ఈ ప్రఖ్యాతి గాంచిన హదీసు పుస్తకం మనం చదవడం, అందులోని హదీసుల వివరణ తెలుసుకోవడం మొదలుపెట్టాము. ఈ క్రమంలో అల్లాహ్ యొక్క దయవల్ల మనం ఇప్పటి వరకు నాలుగు హదీసులు చదివి ఉన్నాము.

ఈనాటి మన పాఠంలో ఐదవ హదీస్, మ’అన్ బిన్ యజీద్ బిన్ అఖ్నస్. మ’అన్, ఆయన తండ్రి పేరు యజీద్. ఆయన తండ్రి పేరు అఖ్నస్. మ’అన్ ఇబ్ను యజీద్ ఇబ్ను అఖ్నస్. రెండేసి మూడేసి సార్లు నేను ఈ పేర్లు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలాంటి మహా గొప్ప అదృష్టం చాలా అరుదుగా లభిస్తుంది. ఏమిటది? కొడుకు, తండ్రి, తాత. మ’అన్ ఇబ్ను యజీద్ ఇబ్ను అఖ్నస్. వీరు ముగ్గురూ కూడా సహాబీలు.

సామాన్యంగా ఏముంటుంది? ఒక వ్యక్తి సహాబీ, మహా ఎక్కువ అంటే అతని తండ్రి కావచ్చు. లేదా ఒక వ్యక్తి, అతని కొడుకు కావచ్చు. కానీ ఇక్కడ ముగ్గురూ, కొడుకు, అతని తండ్రి, ఈ కొడుకు యొక్క తాత. ముగ్గురూ కూడా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వాస స్థితిలో కలుసుకున్నారు మరియు విశ్వాస స్థితిలోనే అల్హమ్దులిల్లాహ్ చనిపోయారు కూడా. అయితే వీరు ముగ్గురూ కూడా అల్హమ్దులిల్లాహ్ సహాబీ. ఇమామ్ నవవీ రహమహుల్లాహ్ ఈ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు:

وهو وأبوه وجده صحابيون
(వ హువ వ అబూహు వ జద్దుహు సహాబియ్యూన్)
అతను, అతని తండ్రి మరియు అతని తాత సహాబాలు.

అయితే ఇక రండి, అసలు హదీస్ వైపునకు మనం వెళ్దాము. ఇందులో ఈ కొడుకు హదీసును ఉల్లేఖిస్తున్నారు. విషయం ఏం జరిగిందంటే, మ’అన్ యొక్క తండ్రి యజీద్, అల్లాహ్ మార్గంలో దానం చేసే ఉద్దేశంతో సొమ్ము తీసుకుని వెళ్ళాడు. మస్జిద్ లో ఒక వ్యక్తి కనబడ్డాడు. అతనికి ఇచ్చి, ఎవరైనా అవసరం గల వ్యక్తి వచ్చాడంటే అతనికి మీరు ఇవ్వండి అని చెప్పి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత కొంత సమయానికి మ’అన్ వచ్చాడు, ఈ కొడుకు. ఆ వ్యక్తితో కలిశాడు, ఏదో మాట అయి ఉంటుంది, ఆ సందర్భంలో మ’అన్ కి అది అవసరం ఉంది. ఆ వ్యక్తి ఆ దానం యొక్క సొమ్ము మ’అన్ కి ఇచ్చేశాడు. మ’అన్ కు అవసరం కూడా ఉండినది అప్పుడు.

ఆ తర్వాత ఈ విషయం మ’అన్ యొక్క తండ్రి యజీద్ కు తెలిసింది. ఎవరు? దానం చేసిన వ్యక్తి. అప్పుడు యజీద్ అన్నాడు, “అల్లాహ్ సాక్షి, నేను ఇవి నీకు ఇవ్వాలనుకోలేదు.” అప్పుడు ఈ కొడుకు మ’అన్ ఏం చేశాడు? ఇక ఈ విషయంలో తండ్రితో గొడవ పడడం మంచిది కాదు. అయితే నాన్నా, మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్లి ఈ విషయాన్ని తెలియజేసి, అక్కడి నుండి పరిష్కారం ఏంటో మనం తెలుసుకుందాము. ఇద్దరూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఈ విషయం వివరించారు. యజీద్ చెప్పాడు, నేను డబ్బు తీసుకెళ్లి కొంత సామాను తీసుకెళ్లి ఇచ్చాను మస్జిద్ లో ఒక వ్యక్తికి, ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తి వచ్చేది ఉంటే ఇవ్వమని. ఆ తర్వాత ఈ సొమ్ము నా కొడుకు తీసుకొచ్చుకున్నాడు. కొడుకు చెప్పాడు, అవును, నాకు అవసరం ఉండింది. అల్లాహ్ ఎక్కడైనా నాకు ఏదైనా ఇప్పిస్తాడా అన్నట్టుగా నేను బయటికి వెళ్ళాను. మస్జిద్ లో ఈ వ్యక్తి కలిశాడు, అతని వద్ద అది ఉంది. అయితే నేను తీసుకొచ్చుకున్నాను. ఇద్దరి మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విన్న తర్వాత:

لك ما نويت يا يزيد، ولك ما أخذت يا معن
(లక మా నవయిత యా యజీద్, వ లక మా అఖద్-త యా మ’అన్)
ఓ యజీద్! నీ సంకల్పానికి తగిన ప్రతిఫలం నీకు లభిస్తుంది. మరియు ఓ మ’అన్! నీవు తీసుకున్నది నీకే చెందుతుంది.

అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరికీ తీర్పు ఇచ్చారు. ఏంటి? ఓ యజీద్, నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది. నువ్వు దానం చేయాలనుకున్నావు, ఆ దానం పుణ్యం నీకు లభిస్తుంది. ఆ దానం కొడుకుకు ఇవ్వాలి అని నువ్వు అనుకోలేదు, ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తికి ఇవ్వాలనుకున్నావు. ఆ నీ నియ్యత్ ప్రకారంగా, నీ సంకల్పం ప్రకారంగా నీకు పుణ్యం లభిస్తుంది. మరియు ఓ మ’అన్, నువ్వు తీసుకున్నది ఈ దానంలో కూడా నీ కొరకు ధర్మసమ్మతమే అవుతాయి, హరామ్ కావు. ఎందుకు? తండ్రి నుండి నువ్వు దానంగా ఏదీ తీసుకోలేదు. ఒక వ్యక్తి నుండి నువ్వు తీసుకున్నావు.

ఈ హదీస్ సహీహ్ బుఖారీలో వచ్చి ఉంది.

మరియు మన ఈ మొదటి శీర్షిక, టాపిక్, ఉన్వాన్ ఇఖ్లాస్ కు సంబంధించినది. చిత్తశుద్ధి. మాట్లాడే మాట గానీ, మనం చేసే ఏదైనా పని గానీ, మన స్థితిగతులు అన్నీ కూడా కేవలం అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకే ఉండాలి. అల్లాహ్ తప్ప ఇక వేరే ప్రాపంచిక ఉద్దేశాలు, ప్రాపంచిక లాభాలు పొందడానికి, ప్రజలు చూసి మెచ్చుకోవడానికి ఇలాంటి దురుద్దేశాలు ఏవీ కూడా ఉండకూడదు.

ఈ శీర్షికలో, ఈ టాపిక్ లో ఇమామ్ నవవీ రహమహుల్లాహ్ ఈ హదీసును పేర్కొనడానికి ఉద్దేశం ఏంటి? మనిషి కొన్ని సందర్భాల్లో ఒక మంచి ఉద్దేశంతో ఒక పని చేస్తాడు. కానీ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉంటుందో, ఎలా కనబడుతుంది? మన నియ్యత్ కు, మన సదుద్దేశానికి వ్యతిరేకంగా కనబడుతుంది. అలాంటప్పుడు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకు? ఏ మనిషి, ఏ మంచి ఉద్దేశంతో ఏ పని చేశాడో, అతనికి అతని మంచి ఉద్దేశం ప్రకారంగానే పుణ్యం అనేది లభిస్తుంది.

ఈ హదీసులో మనం కొంచెం శ్రద్ధ వహిస్తే ఇంకా ఎన్నో విషయాలు మనకు బోధపడతాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన తండ్రితో ఏదైనా విషయంలో, అది ప్రత్యేకంగా ధర్మానికి సంబంధించిన విషయం అయి ఉండి ఉంటే, అందులో నేను ఉన్న మార్గమే, నా యొక్క ఆలోచనే, నా యొక్క అభిప్రాయమే కరెక్ట్ అయినది అని వాగ్వివాదానికి దిగి, పెద్ద తగాదాలు చేసుకొని గొడవలకు దిగకూడదు. తండ్రి యొక్క గౌరవాన్ని పాటించాలి. అలాగే, ఒకవేళ విషయం వారిద్దరి మధ్యలో సర్దుకొని, ఇంకా వేరే పెద్ద గొడవలకు దారి తీయకుండా సమాప్తమైతే అల్హమ్దులిల్లాహ్. కానీ లేదు, పరిష్కారం తేలడం లేదు, ఒక మంచి రిజల్ట్ వెళ్లడం లేదు, అలాంటప్పుడు ధర్మ జ్ఞానంలో ఎవరైతే పెద్దగా ఉన్నారో వారి వద్దకు వెళ్లి ఇద్దరూ తమ సమస్యను అక్కడ వారికి చెప్పుకొని, సరియైన ధర్మ పరిష్కారం తీసుకునే ప్రయత్నం చేయాలి. యజీద్ ఏమన్నాడు? లేదు, నువ్వు ఎందుకు తీసుకున్నావు మస్జిద్ లో ఉన్న చేసిన ధర్మాన్ని అని గొడవ పడ్డాడు. కానీ కొడుకు మ’అన్ ఏం చేశాడు? తండ్రితో గొడవ పడడం మంచిది కాదు, ప్రవక్త ఉన్నారు, ఆయన వద్దకు వెళ్లి మనం నిజం ఏంటో తెలుసుకుందాము అని.

దీని ద్వారా మనకు మరొక విషయం ఏం తెలుస్తుంది? ఏ ధర్మ విషయంలో గానీ, ఇద్దరి మధ్యలో ఏదైనా విభేదం ఏర్పడిందంటే, ఆ విభేదాలను తూతూ మంత్రం, లేదు నేను చెప్పినట్టే, ఏ లేదు నేను చెప్పిందే కరెక్ట్, ఈ విధంగా గొడవలకు దిగకుండా ధర్మజ్ఞానుల వద్దకు వెళ్లి పరిష్కారం తీసుకోవడం చాలా మంచి విషయం.

ఇక్కడ మరొక విషయం మనకు ఏం అర్థమైందంటే, మన దగ్గరి కాలంలో ఇమామ్ ఇబ్ను ఉథైమీన్ రహమహుల్లాహ్ చాలా గొప్ప పండితులు గడిసి చనిపోయారు. ఆయన రియాదుస్ సాలిహీన్ యొక్క వ్యాఖ్యానం చేస్తూ, ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పదం ఏదైతే చెప్పారో, “లక మా నవైత్” (నీవు ఏ నియ్యత్ చేశావో), ఈ పదం ద్వారా ఎన్నో విషయాలు, ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో ధర్మ విషయాలు చెప్పారు.

ఉదాహరణకు, ఒక వ్యక్తి వద్ద రెండు ఇళ్లు ఉన్నాయి అనుకోండి. ఒకటి చిన్నది, మరొకటి పెద్దది. అతడు అల్లాహ్ మార్గంలో చిన్న ఇల్లును దానం చేసేయాలి అని అనుకున్నాడు. అనుకొని, ఎవరైనా బాధ్యులతోను మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ, ఏదో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది? మనిషి ఇంటి బయట లేదా తన యొక్క ఇంటి వాకిలిలో నిలబడి ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ ఉంటే, మాట మాటల్లో అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. ఈ విధంగా మాట్లాడుతూ మాట్లాడుతూ, “నేను నా ఈ ఇంటిని అల్లాహ్ మార్గంలో దానం చేయాలనుకుంటున్నాను” అని పెద్ద ఇంటి వైపుకు వేలు చూపించాడు. అసలు అతని నియ్యత్ లో, సంకల్పంలో ఉన్నది ఏంటి? చిన్న ఇల్లు. కానీ ఆ మాట ధోరణిలో ఉండి, అక్కడ గమనించక వేలు అనేది ఎటు చూపించాడు? పెద్ద ఇల్లు వైపునకు. అలాంటప్పుడు ఎందరో పండితులు చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏ ఇల్లు దానం చేయాలి అతను? చిన్నదా, పెద్దదా? కాదు. నియ్యత్ ఏదైతే ఉందో, దాని ప్రకారంగానే. నియ్యత్ ఏదైతే ఉందో, దాని ప్రకారంగానే అతడు ఆచరించాలి.

అలాగే, ఒక వ్యక్తి కొందరితో కలిసి హజ్ కు బయలుదేరాడు. మీకాత్ లో ఉండి ముందు నుండే అతని యొక్క నియ్యత్ ఉన్నది, నేను హజ్జె తమత్తు చేస్తాను అని. హజ్జె తమత్తు అంటే ఏమవుతుంది? ముందు ఉమ్రా చేసి, హలాల్ అయిపోయి, మళ్ళీ ఎనిమిదవ తారీఖు నాడు మళ్ళీ హజ్ యొక్క ఇహ్రామ్ కొత్తగా చేస్తారు. అయితే వెళ్తున్నప్పుడు మీకాత్ వద్ద అందరితో పాటు “లబ్బైక్ హజ్జన్” అని అనేశాడు. వాస్తవానికి అతని యొక్క నియ్యత్ ఏముంది? హజ్ లేదా హజ్జె కిరాన్, హజ్జె ఇఫ్రాద్ చేయాలని లేదు, హజ్జె తమత్తు చేయాలని ఉంది. అయితే అతను “లబ్బైక్ హజ్జన్” అని నోటితో పలికినప్పటికీ, అతడు తన నియ్యత్ ప్రకారంగా ఉమ్రా చేయాలి ముందు. ఎందుకంటే హజ్జె తమత్తు చేసేది ఉంది. ఆ ప్రకారంగా అతను వచ్చి ఉమ్రా చేసేది ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు.

దీని ద్వారా మరొక గొప్ప విషయం ఏం తెలుస్తుందంటే, కొన్ని సందర్భాల్లో మనిషి దానధర్మాలు ఏదైతే చేస్తాడో, చేసిన తర్వాత అతనికి తెలిసింది, హక్కుదారునికి కాకుండా వేరే ఎవరికైనా చేరుకున్నది అని. అలాంటప్పుడు అతడు బాధపడవలసిన అవసరం లేదు. దీనికి సంబంధించి మరొక పెద్ద హదీస్ కూడా ఉంది. ఒక వ్యక్తి రాత్రిపూట ఎవరూ చూడకుండా, కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకే నేను దానం చేస్తాను అని బయలుదేరాడు. బయలుదేరేసరికి ఏమైంది? ఒక రాత్రి దొంగ చేతిలో పెట్టేశాడు. మరో రాత్రి వ్యభిచారిణి చేతిలో పెట్టేశాడు. మూడో రాత్రి చాలా ధనవంతుని యొక్క చేతిలో పెట్టేశాడు. ఉదయం తెలిసింది అతనికి ఇలా జరిగింది అని. చాలా బాధపడ్డాడు. కానీ తర్వాత అతనికి చెప్పడం జరిగింది, నీవైతే దొంగకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు, వ్యభిచారిణికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు, ధనవంతునికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు. నీ యొక్క నియ్యత్, నీ యొక్క సంకల్పం కరెక్ట్ గా ఉండింది గనక, దాని ప్రకారంగానే నీకు పుణ్యం కూడా లభిస్తుంది.

ఇప్పుడు ఈ హదీసులో మనం తెలుసుకున్నాము, మ’అన్ బిన్ యజీద్, అంటే యజీద్, తండ్రి, దానం మస్జిద్ లో పెట్టి వచ్చాడు. తర్వాత అతని కొడుకు వెళ్ళాడు. కొడుక్కు తెలియదు, మా నాన్నే పెట్టాడు అని కూడా. అయితే, తండ్రి తన దానం కొడుక్కు ఇవ్వచ్చా? ఇదొక ధర్మ విషయం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పటివరకైతే దానం సామాన్య దానంగా ఉందో, అంటే జకాత్ కాదు, ధర్మదానాలు, ఆమ్ సదకా ఖైరాత్ అని ఏదైతే అంటామో, జకాత్ కాదు. ఇలాంటివి కొడుక్కు ఇవ్వచ్చు, బంధువులకు ఇవ్వచ్చు, ఇంకా వేరే వారికి కూడా ఇవ్వచ్చు. కానీ, జకాత్ అన్నది కొడుక్కు ఇవ్వరాదు. ఎందుకు? జకాత్ ఇది ఒక విధి, కొడుకు యొక్క ఖర్చు తండ్రిపై విధిగా ఉంది. అందుకొరకే తండ్రి కొడుక్కు జకాత్ ఇవ్వలేడు.

కానీ ఒక మార్గం ఉంది ఉదాహరణకు, కొడుక్కు ఇవ్వడానికి. అదేమిటి? కొడుకు పెద్దగయ్యాడు, సంపాదిస్తున్నాడు, కానీ అతని యొక్క వ్యాపారంలో లేదా వేరే అనారోగ్యంలో, ఇంకా వేరే ఏదైనా కారణంగా అప్పులో పడ్డాడు. అప్పులో కొడుకు చిక్కుకున్నాడు. అయితే, తండ్రి అతని నుండి వేరై, వేరే సంపాదన, సామాన్యంగా మన వద్ద ఏమంటారు? వాని పొయ్యి వేరు, వాని వంట వేరు, ఈ విధంగా అనుకుంటాం కదా. కానీ అతని వద్ద అప్పు ఉంది, ఆ అప్పు తీరపడానికి తండ్రి తన యొక్క జకాత్ కొడుక్కు ఇవ్వచ్చు. అప్పు తీర్చడానికి.

అలాగే, ఆపోజిట్, కొడుకు తన జకాత్ తండ్రికి ఇవ్వచ్చా? లేదు. అట్టనే ఇవ్వరాదు. ఎందుకు? ఎప్పుడైతే తండ్రి వృద్ధాప్య… ముసలివాడై, లేదా అనారోగ్యం పాలై, అతడు ఇక ఏమీ సంపాదించలేని స్థితిలో ఉన్నాడో, ఆ తండ్రికి తినిపించడం, త్రాగించడం, అతని యొక్క మందుల ఖర్చులు చూసుకోవడం, అతని యొక్క బట్టల ఖర్చులు చూసుకోవడం, అతను ఉండడానికి ఒక ఇల్లు, ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? కొడుకు సంతానం చూసుకోవాలి. అయితే ఏదైనా కారణంగా తండ్రి వద్ద ఏదైనా అప్పు అయిపోయింది. మరి ఈనాటి కాలంలో మన వద్ద లాంటి పరిస్థితి ఉండకూడదు. ఇటు కొడుకు సంపాదించి పంపుతా ఉంటాడు, అటు అయ్యా… త్రాగడంలో… జ్యూస్ మరియు పాలు కాదు, బాదం పాలు కాదు. అర్థమవుతుంది కదా? ఆ, సారాయి తాగడంలో, కళ్ళు తాగడంలో ఇలాంటి వాటిలో ఖర్చు చేస్తున్నాడు లేదా అంటే, ఆ కొడుకు పంపినప్పుడు ఇచ్చేద్దాంలే అని అప్పులు చేస్తున్నాడు. ఇట్లాంటి వాటిలో కూడా చాలా అధ్వాన్నంగా పరిస్థితులు మారిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఒకవేళ తండ్రి అప్పులో చిక్కుకొని ఉండేది ఉంటే, కొడుకు వద్ద జకాత్ సొమ్ము ఏదైతే ఉందో, అప్పు తీర్చడానికి ఇవ్వచ్చు.

ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటి? మనిషి తన బాధ్యతలో ఎవరైతే ఉన్నారో, అతని యొక్క ఖర్చు కొంచెం తగ్గిపోతుంది నాకు అని అతనికి ఏదైనా జకాత్ ఇవ్వడం ఇది ధర్మసమ్మతం కాదు. ఈ విధంగా ఆలోచించుకుంటూ పోతే, పండితులు రాసినటువంటి వ్యాఖ్యానాలు మనం చూసుకుంటూ పోతే ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ ఈ హదీస్ ఏదైతే మనం ఇప్పుడు విన్నామో అల్లాహ్ యొక్క దయవల్ల, దీని యొక్క వ్యాఖ్యానం ఇంతవరకు మనం సరిపుచ్చుకుందాం.

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://teluguislam.net/2019/10/19/ikhlas/

నువ్వు అల్లాహ్ ప్రసన్నత కోసం నీ భార్య నోట్లో పెట్టే ముద్దకు కూడా ప్రతిఫలం పొందుతావు [ఆడియో]

నువ్వు అల్లాహ్ ప్రసన్నత కోసం నీ భార్య నోట్లో పెట్టే ముద్దకు కూడా ప్రతిఫలం పొందుతావు
https://youtu.be/H4nt2ZIXdcA [12 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[6] ఇహలోకంలోనే స్వర్గ సుఖాల శుభవార్త పాందిన పదిమందిలో ఒకరైన అబూ ఇస్‌హాఖ్‌ సాద్‌ బిన్‌ అబూ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) కథనం :

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాను అంతిమ హజ్‌ యాత్ర చేసిన యేట వ్యాధిగ్రస్తుణ్ణయి ఉన్న నన్ను పరామర్శించే నిమిత్తం నా వద్దకు వచ్చారు. అప్పుడు నేను విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. నేను ఆయన్ని “దైవప్రవక్తా! నా నొప్పి ఎంత తీవ్రంగా తయారయిందో తమరు చూస్తూనే ఉన్నారు. నేనా డబ్బు కలవాణ్లి. నాకు ఒక్కగానొక్క కూతురు తప్ప ఇతర వారసులెవరూ లేరు. నేను నా ధనంలోని మూడింట రొండొంతులను ఎవరికైనా దానం చేయవచ్చా?” అని అడిగాను. దానికి ఆయన “కూడదు” అన్నారు. తిరిగి నేను “సగం ధనం దానం చేయనా” అని అడిగాను. దానికి కూడా ఆయన “కూడదు” అనే అన్నారు. మళ్ళీ నేను “మూడింట ఒక వంతైనా దానం చేయలేనా దైవ ప్రవక్తా!” అని విన్నవించుకోగా అందుకు ఆయన “మూడింట ఒక వంతు అయితే చేయగలవు. కాని అది కూడా ఎక్కువే (లేక) పెద్దదే అవుతుంది” (అని అన్నారు). “ఎందుకంటే నువ్వు నీ వారసులను పరుల ముందు చేయి చాపుతూ తిరిగి దరిద్రులుగా వదలి వెళ్ళడంకన్నా స్టితిమంతులుగా వదలి వెళ్ళడమే ఎంతో శ్రేయస్కరం. (గుర్తుంచుకో!) నువ్వు దైవప్రసన్నత కోసం ఏది ఖర్చు పెట్టినా దానికి నువ్వు ప్రతిఫలం పొందుతావు. ఆఖరికి నువ్వు నీ భార్య నోట్లో పెట్టే ముద్దకు కూడా ప్రతిఫలం పొందుతావు” అని ఉపదేశించారు.

అప్పుడు నేను “ఓ దైవప్రవక్తా! నేను నా సహచరుల వెనుక ఉండిపోతానా? (అంటే నా సహచరులు ముందుగానే చనిపోయి నేను ఈ లోకంలో ఒక్కడినే ఉండిపోతానా?)” అని సందేహపడగా దానికి ఆయన “(అయితేనేమి? మంచిదేగా) ఎందుకంటే నీ సహచరుల అనంతరం నువ్వు బ్రతికివుంటే దైవప్రసన్నత కోసం నువ్వు చేసుకునే ప్రతి ఆచరణతో నీ స్థాయి, అంతస్థులు పెరుగుతాయి. బహుశా నీకు ఇంకా జీవితం గడిపే అవకాశం లభిస్తుందేమో! అప్పుడు కొంత మంది (విశ్వాసులకు) నీవల్ల మేలు కలగవచ్చు, ఇంకొంతమంది (దైవ తిరస్కారులకు) నీ వల్ల కీడు కలగవచ్చు. ఓ అల్లాహ్‌! నా సహచరుల హిజ్రత్‌ని (ప్రస్థానాన్ని) పరిపూర్ణం గావించు. వారిని పరాజయం పాలుచేయకు’ అని వేడుకున్నారు. కాని “సాద్‌ బిన్‌ ఖౌలా” దయార్హులు. ఎందుకంటే ఆయన మక్కాలో ఉండగానే కన్నుమూశారు. అందుకని ఆయన కనికరించబడాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దుఆ చేసేవారు. (బుఖారీ – ముస్లిం)

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://teluguislam.net/2019/10/19/ikhlas/

మనిషి సామూహికంగా చేసే నమాజు అతను తన ఇంట్లో లేదా బజారులో చేసే నమాజుకన్నా 20 రెట్లకు పైగా ఘనమైనది, ఎందుకంటే? [ఆడియో]

మనిషి సామూహికంగా చేసే నమాజు అతను తన ఇంట్లో /బజారులో చేసే నమాజుకన్నా 20 రెట్లకు పైగా ఘనమైనది, ఎందుకంటే?
https://youtu.be/sPhvRWKKhMY [19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

10-దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారని హజ్రత్‌ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారు:

“మనిషి సామూహికంగా చేసే నమాజు అతను తన ఇంట్లో లేక బజారులో చేసే నమాజుకన్నా ఇరవై రెట్లకు పైగా ఘనమైనది. ఎందుకంటే ఒక వ్యక్తి చక్కగా వుజూ చేసుకుంటాడు, తరువాత నమాజు కోసం మస్జిద్ కు వస్తాడు. నమాజు మాత్రమే అతణ్ణి మస్జిద్కు తీసుకువస్తే – అలాంటి వ్యక్తి మస్జిద్ చేరుకునేంత వరకూ అతను వేసే ఒక్కో అడుగుకు బదులుగా అతని ఒక్కో అంతస్తు పెరుగుతూ ఉంటుంది. అతని వల్ల జరిగిన ఒక్కో పాపం తొలగించబడుతూ ఉంటుంది. ఆ తరువాత మస్జిద్లో ప్రవేశించిన పిదప నమాజు అతన్ని ఆపివుంచినంతసేపూ అతను నమాజు చేస్తున్నట్టుగానే పరిగణించ బడతాడు. మీలో ఎవడైనా నమాజు చేసిన స్థానంలో కూర్చొని ఉన్నంత వరకూ దైవదూతలు అతనిపై అల్లాహ్‌ కారుణ్యం కురవాలని వేడుకుంటూనే ఉంటారు. ఆ వ్యక్తి పరులకు హాని కలిగించనంతవరకు, అతని వుజూ భంగం కానంతవరకు దైవదూతలు “ఓ అల్లాహ్‌! ఈ వ్యక్తిని కరుణించు. ఓ అల్లాహ్‌! ఇతన్ని మన్నించు. ఓ అల్లాహ్‌! ఇతన్ని కనిపెట్టుకుని ఉండు ‘ అని విన్నవించుకుంటూ ఉంటారు”

(బుఖారీ – ముస్లిం). హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి. హదీసులో వచ్చిన పదం “యన్‌హజుహూ” అంటే అతన్ని బయటికి తీసుకువస్తుంది లేక అతన్ని లేపుతుందని అర్థం.

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://teluguislam.net/2019/10/19/ikhlas/

అల్లాహ్‌ మీ శరీరాలను, మీ ముఖాలను చూడడు. ఆయన మీ అంతరంగాలను, ఆచరణలను మాత్రమే చూస్తాడు [ఆడియో]

అల్లాహ్‌ మీ శరీరాలను, మీ ముఖాలను చూడడు. ఆయన మీ అంతరంగాలను, ఆచరణలను మాత్రమే చూస్తాడు
https://youtu.be/5AZinozb7W8 [18 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

హజ్రత్‌ అబూ హురైరా అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ సఖర్‌ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు: “అల్లాహ్‌ మీ శరీరాలను, మీ ముఖాలను చూడడు. ఆయన మీ అంతరంగాలను, ఆచరణలను మాత్రమే చూస్తాడు.” (ముస్లిం)

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://teluguislam.net/2019/10/19/ikhlas/