ముస్లిం వనిత – పార్ట్ 03: హైజ్ (బహిష్టు, రుతుస్రావం, ముట్టు) ఆదేశాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[26:37 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ముస్లిం వనిత [పుస్తకం]

“హైజ్”, “నిఫాసు”ల ధర్మములు

“హైజ్” (బహిష్టు) కాలము, దాని గడువు: స్త్రీలకు ప్రతి నెలా జరిగే రక్తస్రావాన్ని హైజ్ అంటారు.

1- వయస్సు: ఎక్కువ శాతం 12 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సులో హైజ్ వస్తుంది. ఆరోగ్యం, వాతవరణం మరియు ప్రాంతాన్ని బట్టి ముందుగాని తరువాత గాని రావచ్చు.

2- కాలపరిమితి: కనీసం ఒక రోజు. గరిష్ఠ కాలపరిమితి 15 రోజులు.

గర్భిణి యొక్క బహిష్టు: సామాన్యంగా గర్భం నిలిచిన తర్వాత రక్త స్రావముండదు. గర్భిణీ ప్రసవ వేదనతో ప్రసవించడానికి రెండు మూడు రోజుల ముందు రక్తము చూసినచో అది “నిఫాసు” అగును. ఒకవేళ ప్రసవ వేదన లేనిచో అది “నిఫాసు” కాదు, బహిష్టు కాదు.

అసాధారణ బహిష్టు:

అసాధారణ బహిష్టు రకాలు:

1- ఎక్కువ, తక్కువ: ఉదాః ఒక స్త్రీ యొక్క (బహిష్టు కాలం) సాధారణంగా ఆరు రోజులు. కాని ఒక సారి ఏడు రోజులు వచ్చింది, ఏడు రోజుల అలవాటుండి ఆరు రోజులే వచ్చింది.

2- వెనక, ముందు: ఉదాః నెలారంభంలో అలవాటుండి నెలాఖరులో వచ్చింది. నెలాఖరులో అలవాటుండి నెలారంభంలో వచ్చింది.

పరిష్కారం: వెనక, ముందు అయినా, ఎక్కువ, తక్కువ రోజులు అయినా, ఎప్పుడు రక్తస్రావం చూసిందో అప్పుడే బహిష్టు, ఎప్పుడు ఆగి పోతుందో అప్పుడే పరిశుభ్రమయినట్లు.

3- పసుపు లేదా గోదుమ రంగు: బహిష్టు రోజుల మధ్యలో లేదా చివరిలో పరిశుభ్రతకు కొంచం ముందు పసుపు లేదా గోదుమ రంగు వలే అంటే పుండు నుండి వెళ్ళే నీటి మాదిరిగా చూచినచో అది బహిష్టు రక్తస్రావమే అగును. బహిష్టు స్త్రీలకు వర్తించే ఆదేశము ఆ స్త్రీకి వర్తించును. ఒకవేళ పరిశుభ్రత పొందిన తరువాత అలా వస్తే అది బహిష్టు రక్తస్రావము కాదు.

4- ఒక రోజు రక్తస్రావముండడము మరో రోజు ఉండక పోవడం.

ఇది రెండు రకాలుగా కావచ్చు.

మొదటి రకం: ఇది ఎల్లపుడూ ఉన్నచో “ముస్తహాజ” కావచ్చును. “ముస్తహాజా”లకు వర్తించే ఆదేశాలే ఆమెకు వర్తించును.

రెండవ రకం: ఎల్లపుడూ కాకుండా, ఎప్పుడయినా ఒకసారి వచ్చి, ఆ తరువాత పరిశుభ్రం అవుతుంది.

ఎవరికి ఒకరోజుకన్నా తక్కువ రక్తస్రావం ఆగిపోతుందో అది పరిశుద్ధతలో లెక్కించబడదు.                                                                                                                                                                                                          ఒకవేళ ఏదైనా గుర్తు ఉంటే అది వేరే విషయం; ఉదా: అలవాటుగా ఉన్న చివరి రోజుల్లో ఆగిపోవడం, లేదా తెల్లని ద్రవం రావడం (తెల్లబట్ట అవడం కూడా అంటారు కొందరు).

5- రక్తస్రావం ఉండదు కాని బహిష్టు రోజుల మధ్య లేక పరిశుద్ధమగుటకు కొంచెం ముందు తడిగా ఉన్నట్లు గ్రహించినచో అది బహిష్టు. ఒకవేళ పరిశుద్ధమయిన తరువాత ఉంటే అది బహిష్టు కాదు.

బహిష్టు యొక్క ధర్మములు

1- నమాజ్: బహిష్టు స్త్రీ పై ఫర్జ్, సున్నత్, నఫిల్ అన్ని విధాల నమాజులు నిషిద్ధం. చేసినా అది నెవరవేరదు. కాని కనీసం ఒక రకాత్ చేయునంత సమయం దాని మొదట్లో లేక చివరిలో లభించినచో ఆ నమాజు తప్పకుండా చేయవలెను. మొదటి దానికి ఉదాహరణః సూర్యాస్తమయం అయ్యాక మగ్రిబ్ యొక్క ఒక రకాత్ చేయునంత సమయం దాటాక బహిష్టు అయినచో, ఆమె పరిశుద్ధమయిన తర్వాత ఆ మగ్రిబ్ నమాజు ‘ఖజా’ చేయవలెను. ఎందుకనగా ఆ నమాజు యొక్క ఒక్క రకాతు చేయునంత సమయం పొందిన పిదపనే బహిష్టు అయింది. ఇక చివరి దానికి ఉదాహరణః సూర్యోదయానికి ముందు ఒక రకాత్ మాత్రమే చేయునంత సమయం ఉన్నపుడు పరిశుద్ధమయితే, (స్నానం చేశాక) ఆ ఫజ్ర్ నమాజ్ ‘ఖజా’ చేయాలి. ఎందుకనగా రక్తస్రావం ఆగిన తరువాత ఆమె ఒక్క రకాత్ చేయునంత సమయం పొందినది.

ఇక జిక్ర్, తక్బీర్, తస్బీహ్, తహ్మీద్, తినుత్రాగినప్పుడు బిస్మిల్లాహ్ అనడం, హదీసు మరియు ధర్మ విషయాలు చదవడం, దుఆ చేయడం, దుఆపై ఆమీన్ అనడం, ఖుర్ఆన్ పారాయణం వినడం, నోటితో కాకుండా చూస్తూ గ్రహించి చదవడం, తెరిచియున్న ఖుర్ఆనులో లేదా బ్లాక్ బోర్డ్ పై వ్రాసియున్న దాన్ని చూస్తూ మనస్సులో చదవడం నేరం కాదు, యోగ్యమే. ఏదైనా ముఖ్య అవసరం: టీచర్ గా ఉన్నపుడు లేదా పరీక్ష సమయాల్లో ఇంకా ఒకరి కరెక్షన్ కొరకు ఖుర్ఆన్ చూస్తూ చదవడం, చదివించడం పాపము కాదు, కాని ఆ సమయంలో చేతులకు గ్లౌజులు ధరించి ఉండాలి, లేదా ఏదైనా అడ్డుతో పట్టుకోవాలి.

2- ఉపవాసం (రోజా):  ఫర్జ్, నఫిల్ అన్ని విధాల రోజాలు నిషేధం. కాని ఫర్జ్ రోజాలు తరువాత ఖజా (పూర్తి) చేయాలి. ఉపవాస స్థితిలో బహిష్టు వస్తే ఆ ఉపవాసం నెరవేరదు, అది సూర్యాస్తమయానికి కొన్ని క్షణాల ముందైనా సరే. అది ఫర్జ్ ఉపవాసమయితే ఇతర రోజుల్లో పూర్తి చేయాలి. సూర్యాస్తమయమునకు కొద్ది క్షణాల ముందు రక్తస్రావం అయినట్లు అనిపించి, అలాకాకుండా సూర్యాస్తమయం తరువాతనే అయితే ఆ ఉపవాసం పూర్తయినట్లే. ఉషోదయం అయిన కొద్ది క్షణాల తర్వాత పరిశుద్ధమయితే ఆ రోజు యొక్క ఉపవాసం ఉండరాదు. అదే ఉషోదయానికి కొద్ది క్షణాలు ముందు అయితే ఉపవాసం ఉండాలి. స్నానం ఉషోదయం తరువాత చేసినా అభ్యంతరం లేదు.

3- కాబా యొక్క తవాఫ్ (ప్రదక్షిణం): అది నఫిలైనా, ఫర్జ్ అయినా అన్నీ నిషిద్ధం. హజ్ సమయంలో తవాఫ్ తప్ప ఇతర కార్యాలుః సఫా మర్వా సఈ, అరఫాత్ మైదానంలో నిలవడం, ముజ్దలిఫా, మినాలో రాత్రులు గడపడం, జమ్రాతులపై రాళ్ళు రువ్వడం మొదలగునవన్నీ పూర్తి చేయాలి. ఇవి నిషిద్ధం కావు. పరిశుద్ధ స్థితిలో తవాఫె హజ్ చేసిన వెంటనే లేక సఫా మర్వా సఈ మధ్యలో బహిష్టు ప్రారంభమయితే ఆ హజ్ లో ఏలాంటి లోపముండదు.

4-  మస్జిదులో నిలవడం: బహిష్టు స్త్రీ మస్జిదులో ఉండుట నిషిద్ధం.

5- సంభోగం: భార్య రజస్సుగా ఉన్నపుడు భర్త ఆమెతో సంభోగించడం నిషిద్ధం. భర్త సంభోగాన్ని కోరుతూ వచ్చినా భార్య అంగీకరించడం కూడా నిషిద్ధం. పురుషుని కొరకు అతని భార్య ఈ స్థితిలో ఉన్నపుడు ఆమెతో సంభోగం తప్ప ముద్దులాట మరియు కౌగలించుకొనుట ఇతర విషయాలన్నీ అల్లాహ్ అనుమతించాడు.

6- విడాకులుః భార్య రజస్సుగా ఉన్నపుడు విడాకులివ్వడం నిషిద్ధం. ఆమె ఆ స్థితిలో ఉన్నపుడు విడాకులిచ్చినా అతడు అల్లాహ్, ఆయన ప్రవక్త యొక్క అవిధేయుడయి ఒక నిషిద్ధ కార్యం చేసినవాడవుతాడు. కనుక అతడు విడాకులను ఉపసంహరించుకొని ఆమె పరిశుద్ధురాలయిన తరువాత విడాకులివ్వాలి. అప్పుడు కూడా ఇవ్వకుండా మరోసారి బహిష్టు తరువాత పరిశుద్ధురాలయ్యాక ఇష్టముంటే ఉంచుకోవడం లేదా విడాకులివ్వడం మంచిది.

7-  స్నానం చేయడం విధిగా ఉందిః పరిశుద్ధురాలయిన తరువాత సంపూర్ణంగా తలంటు స్నానం చేయుట విధి. తల వెంట్రుకలు కట్టి (జెడ వేసి) ఉన్నచో వాటిలో నీళ్ళు చేరని భయమున్నచో అవి విప్పి అందులో నీళ్ళు చేర్పించవలెను. నమాజు సమయం దాటక ముందు పరిశుద్ధమయినచో ఆ సమయంలో ఆ నమాజును పొందుటకు స్నానం చేయడంలో తొందరపడుట కూడా విధిగా ఉంది. ప్రయాణంలో ఉండి నీళ్ళు లేనిచో, లేదా దాని ఉపయోగములో ఏ విధమైనా హాని కలిగే భయమున్నచో, లేక అనారోగ్యం వల్ల హాని కలిగే భయమున్నచో స్నానానికి బదులుగా “తయమ్ముం”(1) చేయవలెను. తరువాత నీళ్ళు లభించిన లేక ఏ కారణమయితే అడ్డగించిందో అది తొలిగిపోయిన తరువాత స్నానం చేయవలెను.

(1) దాని విధానం ఇది: ఒక సారి రెండు చేతులు భూమిపై కొట్టి ముఖముపై ఒకసారి మరియు మణికట్ల వరకు చేతులపై ఒకసారి తుడుచుకోవాలి.

ముందు పాఠాలు:

ముస్లిం వనిత – పార్ట్ 02: పరద, బురఖా (హిజాబ్) [వీడియో]

బిస్మిల్లాహ్

[26:53 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ముస్లిం వనిత [పుస్తకం]

పర్ద

కుటుంబ జీవితం విఛ్ఛిన్నం కాకుండా, అధోగతి వైపునకు పోకుండా సురక్షితంగా ఉండాలని ఇస్లాం చాలా ప్రోత్సహించింది. మనిషి సుఖంగా ఉండి, సమాజం పరిశుద్ధంగా ఉండుటకు, దాన్ని మంచి సభ్యత, మంచి గుణాల యొక్క బలమైన అడ్డుతో రక్షణ కల్పించి కాపాడింది. ఈ గుణాలను పాటిస్తే భావోద్రేకాలు ఉద్భవించవు. మనోవాంఛలకు తావు ఉండదు. ఉపద్రవాలకు తావు ఇచ్చే కోరికల్ని కూడా ఆపుటకు అడ్డు ఖాయం చేసి స్త్రీ పురుషులు తమ కంటి చూపులను క్రిందికి జేసుకోవాలని ఆదేశించింది.

స్ర్తీల గౌరవాన్ని కాపాడుటకు అల్లాహ్ “పర్ద” ఆజ్ఞ ఇచ్చాడు. దీని ద్వారా వారి మానమర్యా- దలకు అవమానం జరగకుండ బధ్రంగా ఉండాలని, నీచ మనస్సు గలవారు మరియు అల్లకల్లోలం సృష్టించేవారు ఆమె నుంచి దూరముండేందుకు, గౌరవ మర్యాదల విలువ తెలియని మూర్ఖుల నుంచి బధ్రంగా ఉంచుటకు, విషపూరితమైన చూపులకు కారణమయ్యే ఉపద్రవాలను అడ్డుకొనుటకు, స్వయంగా స్త్రీ గౌరవము, తన మానము యొక్క భద్రతకు (పర్దా తప్పనిసరి).

స్త్రీలు తమ పూర్తి శరీరము కానరాకుండా “పర్ద” చేయుట విధి అనీ, పరపురుషుల ఎదుట తన అలంకరణను, వంపుసొంపులను బహిరంగ పర్చకూడదనీ ధర్మ వేత్తలు ఏకీభవించారు. రెండు అర చేతులు మరియు ముఖం విషయంలో ధర్మవేత్తలు బేధాబిప్రాయంలో పడి రెండు గ్రూపులయ్యారు. ప్రతి ఒక్కరి వద్ద తమ అభిప్రాయం ప్రకారం ఆధారాలున్నాయి. “పర్ద” చేయాలని, అది విధి అని, దాని హద్దును గూర్చి అనేక ఆధారాలు గలవు. ప్రతి ఒక్కరూ వాటి నుంచే ఆధారము తీసుకున్నారు. తమ అభిప్రాయానికి వ్యెతిరేకమున్న ఆధారాలకు ఎన్నో హేతువులు (కారణాలు) చెప్పారు. “పర్ద” విధి అని అల్లాహ్ ఆదేశాలు ఇలా ఉన్నాయి:

[وَإِذَا سَأَلْتُمُوهُنَّ مَتَاعًا فَاسْأَلُوهُنَّ مِنْ وَرَاءِ حِجَابٍ ذَلِكُمْ أَطْهَرُ لِقُلُوبِكُمْ وَقُلُوبِهِنَّ].

{ప్రవక్త భార్యలను మీరు ఏదైనా అడగవలసి ఉంటే తెరచాటున ఉండి అడగండి. ఇది మీ హృదయాల మరియు వారి హృదయాల పరిశుద్ధత కొరకు ఎంతో సముచితమైన పద్దతి}. (33: అహ్ జాబ్: 53).

[يَا أَيُّهَا النَّبِيُّ قُلْ لِأَزْوَاجِكَ وَبَنَاتِكَ وَنِسَاءِ الْـمُؤْمِنِينَ يُدْنِينَ عَلَيْهِنَّ مِنْ جَلَابِيبِهِنَّ ذَلِكَ أَدْنَى أَنْ يُعْرَفْنَ فَلَا يُؤْذَيْنَ وَكَانَ اللهُ غَفُورًا رَحِيمًا]

{ఓ ప్రవక్తా! నీ భార్యలకు, నీ కూతుళ్ళకు, విశ్వాసుల స్త్రీలకు తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడ తీసుకోమని చెప్పు. వారు గుర్తింప బడటానికీ, వేధింపబడకుండా ఉండేందుకు ఇది ఎంతో సముచితమైన పద్దతి, అల్లాహ్ క్షమించేవాడు కరుణించువాడునూ}. (33: అహ్ జాబ్: 59).

[وَقُلْ لِلْمُؤْمِنَاتِ يَغْضُضْنَ مِنْ أَبْصَارِهِنَّ وَيَحْفَظْنَ فُرُوجَهُنَّ وَلَا يُبْدِينَ زِينَتَهُنَّ إِلَّا مَا ظَهَرَ مِنْهَا وَلْيَضْرِبْنَ بِخُمُرِهِنَّ عَلَى جُيُوبِهِنَّ وَلَا يُبْدِينَ زِينَتَهُنَّ إِلَّا لِبُعُولَتِهِنَّ…] {النور:31}

{ఓ ప్రవక్తా! విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పుః తమ చూపులను కాపాడుకోండి అని, తమ మర్మాంగాలను రక్షించుకోండి అని, తమ అలంకరణను ప్రదర్శించవద్దని – దానంతట అదే కనిపించేది తప్ప – తమ వక్షః స్థలాలను ఓణి అంచులతో కప్పుకోవాలని, వారు తమ అలంకరణను వీరి ముందు తప్ప మరెవరి ముందు ప్రదర్శించ కూడదనిః భర్త ….}. (24: నూర్ :31).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పవిత్ర భార్య ఆయిషా సిద్దీఖా (రజియల్లాహు అన్హా) ఇలా చెబుతున్నారుః

كُنَّ نِسَاءُ المُؤْمِنَاتِ يَشْهَدْنَ مَعَ رَسُولِ اللَّهِ ﷺ صَلاَةَ الفَجْرِ مُتَلَفِّعَاتٍ بِمُرُوطِهِنَّ، ثُمَّ يَنْقَلِبْنَ إِلَى بُيُوتِهِنَّ حِينَ يَقْضِينَ الصَّلاَةَ، لاَ يَعْرِفُهُنَّ أَحَدٌ مِنَ الغَلَسِ

విశ్వాస స్త్రీలు దుప్పట్లు కప్పుకొని వచ్చి ప్రవక్త వెనక ఫజ్ర్ నమాజు చేసేవారు. నమాజైన తర్వాత వారు తిరిగి ఇండ్లకు పోతుండగా చీకటి కారణంగా వారు గుర్తింప బడేవారు కారు“. (బుఖారీ 548).

عَنْ فَاطِمَةَ بِنْتِ الْمُنْذِرِ أَنَّهَا قَالَتْ: كُنَّا نُخَمِّرُ وُجُوهَنَا وَنَحْنُ مُحْرِمَاتٌ، وَنَحْنُ مَعَ أَسْمَاءَ بِنْتِ أَبِي بَكْرٍ الصِّدِّيقِ

ఫాతిమ బిన్తె మున్జిర్ రహిమహుల్లాహ్ చెప్పారుః “మేము ఇహ్రాం (హజ్ లేక ఉమ్రా) స్థితిలో ఉండగా మా కొంగులను ముఖముపై వ్రేలాడ తీసుకునే వారిమి. అప్పుడు అస్మా బిన్తె అబీ బక్ర్ రజియల్లాహు అన్హా మాతో ఉండేవారు“. (మువత్త ఇమాం మాలిక్. హజ్/ తఖ్మీరుల్ ముహ్రిమి వజ్ హహు).

عَنْ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا، قَالَتْ: ” يَرْحَمُ اللَّهُ نِسَاءَ المُهَاجِرَاتِ الأُوَلَ، لَمَّا أَنْزَلَ اللَّهُ: {وَلْيَضْرِبْنَ بِخُمُرِهِنَّ عَلَى جُيُوبِهِنَّ} [النور: 31] شَقَّقْنَ مُرُوطَهُنَّ فَاخْتَمَرْنَ بِهَا “

ఆయిషా (రజియల్లాహు అన్హా) చెప్పారు: “వలసవచ్చిన (ముహాజిర్) మహిళలను అల్లాహ్ కరుణించుగాకా! మొదటి సారి {తమ వక్షః స్థలాలను ఓణి అంచులతో కప్పుకోవాలని} దివ్య ఖుర్ఆన్ ఆయతు అవతరించినపుడు తమ దుప్పట్లను చింపుకొని కప్పుకున్నారు“. (బుఖారిః 4758).

ఇవే గాకా ఇంకా అనేక ఆధారాలున్నాయి.

పైన తెలిపిన ప్రకారం ఏ బేధాబిప్రాయాలు ఉన్నా, అందరు కూడా అనారోగ్య స్థితిలో డాక్టరు వద్దకు వెళ్ళుట లాంటి అగత్య పరిస్థితిలో స్త్రీ తమ ముఖముపై ఉండే స్క్రాఫ్ (ముసుగు)ను తెరువ వచ్చనీ ఏకీభవించారు. అలాగే ఉపద్రవాలు జనించే ఆస్కారమున్నపుడు ముసుగు తెరవ కూడదని ఏకీభవించారు.

ఎవరయితే ముఖం యొక్క “పర్ద” తప్పనిసరి కాదంటారో వారు సయితం ఉపద్రవాలు జనించే భయమున్నపుడు ముఖం “పర్ద” విధి అంటారు. ఈ రోజుల్లో భక్తులు, పుణ్యాత్ములు అరుదై ఎటు చూసినా సంక్షోభం వ్యాపించియుంది. నీచులు, దుర్మార్గులు అనేకమైపోయారు. ఈ సమయాల్లో “పర్ద” ప్రాముఖ్యత చాలా ఉంది. ఈ రోజుల్లో తమ ముఖాన్ని తెరచి ఉంచే అనేక మంది స్త్రీలు కళ్ళకు, ముఖానికి మేకప్ పూసుకొని ఉంటారు, ఈ స్థితిలో ముఖం తెరచి ఉంచడం నిషిద్ధం (హరాం) అని అందరూ ఏకీభవించారు.

అదే విధంగా కుటుంబమూ, దాని గౌరవ మర్యాదలూ, నీతినడవడికలూ బధ్రంగా ఉండే కొరకు స్త్రీ పరుషుల విశృంఖలత (కలయిక)ను ఇస్లాం నిషేధిస్తుంది. ఉపద్రవముల, సంక్షోభముల ద్వారాలను మూసి వేయాలని ప్రోత్సహిస్తుంది. స్త్రీ బయటకు వెళ్ళుట, పురుషుల్లో కలసి విచ్చలవిడిగా తిరుగుట, ముఖముపై “పర్ద” లేకుండా ఉండుట వలన భావోద్రేకాలు ఉద్భవిస్తాయి. నేరాలకు మార్గాలు అతిసులువై, పాపంలో పడటం సులభతరం అవుతుంది. అందుకే అల్లాహ్ ఇలా ఆదేశించాడుః

[وَقَرْنَ فِي بُيُوتِكُنَّ وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْـجَاهِلِيَّةِ الأُولَى…] {الأحزاب:33}

{మీరు ఇళ్ళలోనే ఉండిపోండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా అలంకరణను ప్రదర్శిస్తూ తిరగకండి}. (33: అహ్ జాబ్: 33).

[وَإِذَا سَأَلْتُمُوهُنَّ مَتَاعًا فَاسْأَلُوهُنَّ مِنْ وَرَاءِ حِجَابٍ ذَلِكُمْ أَطْهَرُ لِقُلُوبِكُمْ وَقُلُوبِهِنَّ]. {الأحزاب:53}

{ప్రవక్త భార్యలను మీరు ఏదైనా అడగవలసి ఉంటే తెరచాటున ఉండి అడగండి. ఇది మీ హృదయాల మరియు వారి హృదయాల పరిశుద్ధత కొరకు ఎంతో సముచితమైన పద్దతి}. (అహ్ జాబ్ 33: 53).

ప్రవక్త స్త్రీ పురుషుల కలయికను చాలా కఠినంగా వారించారు. కలయికకు కారణమయ్యే ప్రతీదానికి అడ్డుతెర వేశారు. చివరికి అది ప్రార్థన సమయాల్లో, స్థలాల్లో అయినా సరే.

ఎవరైనా స్త్రీకి పురుషులున్న చోట పోవుట చాలా అవసరముండీ, తన ఈ అవసరానికి సహాయపడువారెవరూ లేనియడల లేక స్వయంగా తనకు లేదా తనబిడ్డలకు వారి పోషణ ఖర్చులు తెచ్చువారు లేనియడల, ఈ విధమైన మరేతర అత్యవసరమైన పనులకు పోదలుచు కుంటే పోవచ్చు, కాని ధర్మశాస్త్ర హద్దుబాట్లను గుర్తుంచుకొని పూర్తి శరీరాన్ని కప్పి ఉంచి, తన అలంకరణ ప్రదేశాలను బహిర్గతం చేయకుండా, పురుషుల కలయిక (ఇఖ్తిలాత్) నుంచి దూరముండి తన అవసరాలను తీర్చుకోవాలి.

నీతి గుణాల, కుటుంబముల సంరక్షణ కొరకు ఇస్లాం ఇచ్చిన మరో ఆదేశమేమనగా ఏ స్త్రీ కూడా పరపురుషునితో ఒంటరిగా ఉండరాదు. ఆమె భర్త లేక “మహ్రమ్” (వివాహ నిషిద్ధ బంధువు) లేకుండానే పరపరుషునితో ఒంటరిగా ఉండుటను ప్రవక్త చాలా గట్టిగా వారించారు. ఎందుకనగా షైతాన్ ఈ ఒంటరితనములో మనసులను చెడగొట్టి, అశ్లీల కార్యాలు చేయించే ప్రయత్నంలో ఉంటాడు.

ముందు పాఠం:

సూరతుల్ కహఫ్ తఫ్సీర్ – 2వ భాగం : సూరతుల్ కహఫ్ పరిచయం, ఘనత (పార్ట్ 2) [వీడియో]

బిస్మిల్లాహ్

[35:12 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

సూరతుల్ కహఫ్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – మెయిన్ పేజీ. (అన్నీ పాఠాల కోసం)
https://teluguislam.net/tafsir-kahf/

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran

సూరతుల్ కహఫ్ పారాయణం: సాద్ అల్-ఘమిడి | తెలుగు సబ్ టైటిల్స్: అహ్సనుల్ బయాన్ |వీడియో
https://teluguislam.net/2020/06/25/18-al-kahf

ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) – పార్ట్ 05: వుజూను భంగపరిచే విషయాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[22:07 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అంశాలు: వుజూను భంగపరిచే విషయాలు

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

వుజూను భంగపరిచే విషయాలు:

1- మలమూత్రపు దారుల నుండి ఏదీ వెలువడినా సరే అందు వలన వుజూ భంగమవుతుంది. ఉదాః మలము, మూత్రము, అపానవాయువు (పిత్తు), ‘మనీ’, ‘మజీ’, ‘వదీ’ రక్తము. (‘మనీ’ వలన స్నానం చేయడం విధి అవుతుంది).

2- నిద్ర.

3- మర్మాంగ స్థలాన్ని ఏ అడ్డు లేకుండా ముట్టుకోవడం.

4- ఒంటె మాంసం తినడం.

5- స్పృహ తప్పుట వల్ల కూడా వుజూ భంగమవుతుంది.


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) – పార్ట్ 04: మేజోళ్ళ (సాక్సులు) పై ‘మసహ్‌’ QA [వీడియో]

బిస్మిల్లాహ్

[42:19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అంశాలు: మేజోళ్ళ (సాక్సులు) పై ‘మసహ్‌’

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

మేజోళ్ళ పై ‘మసహ్’

ఇస్లాం ధర్మం యొక్క సులువైన, ఉత్తమ విషయం ఒకటి: మేజోళ్ళపై ‘మసహ్‘ చేసే అనుమతివ్వడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ‘మసహ్’ చేసేవారని రుజువైనది:

عَنْ عَمْرِو بْنِ أُمَيَّةَ t قَالَ: رَأَيْتُ النَّبِيَّ يَمْسَحُ عَلَى عِمَامَتِهِ وَخُفَّيْهِ.

అమ్ర్ బిన్ ఉమయ్య చెప్పారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ తలపాగ మరియు మేజోళ్ళపై ‘మసహ్’ చేస్తున్నది నేను చూశాను. (బుఖారి 205).

عَنِ المُغِيرَةِ  بِن شُعْبَةِ t قَالَ: بَيْنَا أَنَا مَعَ رَسُولِ الله ذَاتَ لَيْلَةٍ إِذْ نَزَلَ فَقَضَى حَاجَتَهُ ثُمَّ جَاءَ فَصَبَبْتُ عَلَيْهِ مِنْ إِدَاوَةٍ كَانَتْ مَعِي فَتَوَضَّأَ وَمَسَحَ عَلَى خُفَّيْهِ.

ముగీర బిన్ షొఅబ చెప్పారుః ఒక రాత్రి నేను ప్రవక్తతో ఉండగా, ఆయన ఒక చోట మజిలీ చేసి (ఓ చాటున) కాలకృత్యాలు తీర్చుకొని వచ్చారు, అప్పుడు నా వద్ద ఉన్న చెంబుతో నీళ్ళు పోశాను ఆయన వుజూ చేశారు. చివరిలో తమ మేజోళ్ళపై ‘మసహ్’ చేశారు. (బుఖారి 203, ముస్లిం 274).

వాటి పై ‘మసహ్’ చేయుటకు నిబంధనలు ఏమిటంటే అవి వుజూ చేసిన తర్వాత తొడిగి యుండాలి. పై భాగాన ‘మసహ్’ చేయాలి, క్రింది భాగాన కాదు.

‘మసహ్’ గడువు

స్థానికులు ఒక పగలు ఒక రాత్రి, ప్రయాణికులు (ఏ ప్రయాణంలో నమాజ్ ఖస్ర్ చేయవచ్చునో ఆ ప్రయాణంలో) మూడు రేయింబవళ్ళు మేజోళ్ళపై ‘మసహ్’ చేయవచ్చును. (వుజూ చేసి తొడిగిన తరువాత వుజూ భంగమయిన క్షణం నుంచీ గడువు మొదలవుతుంది).

‘మసహ్’ భంగమయే కారణాలు

గడువు ముగిసిన మరుక్షణం నుంచే ‘మసహ్’ భంగమైపోతుంది. ‘మసహ్’ చేసిన తరువాత కనీసం ఒకసారైనా తీసినట్లయితే ‘మసహ్’ భంగమవుతుంది. లేదా మనిషి (స్వప్నస్ఖలనం లేదా భార్యభర్తల సంభోగం కారణంగా) అశుద్ధతకు లోనైతే ‘మసహ్’ భంగమవుతుంది. స్నానం చేయుటకై అవి తీయడం కూడా తప్పనిసరి.


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

ఉసూలె సలాస (త్రి సూత్రాలు): పార్ట్ 3 – ఇస్లాం, ఈమాన్, ఇహ్సాన్ – షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ [వీడియో]

బిస్మిల్లాహ్

[42:18 నిముషాలు]
ఇస్లాం, ఈమాన్, ఇహ్సాన్ – హదీథ్ జిబ్రయీల్
ఉసూలె సలాసహ్ : త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – పార్ట్ 3
షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ హఫిజహుల్లాహ్

ఈ వీడియో పాఠాలు క్రింది పుస్తకం ఆధారంగా వివరించబడ్డాయి:
ఉసూలె సలాస (త్రి సూత్రాలు) [పుస్తకం] [మర్కజ్ దారుల్ బిర్ర్]

ఉసూలె సలాస (త్రి సూత్రాలు): పార్ట్ 2 – షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ [వీడియో]

బిస్మిల్లాహ్

[43:55 నిముషాలు]
ఉసూలె సలాసహ్ : త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – పార్ట్ 2
షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ హఫిజహుల్లాహ్

ఈ వీడియో పాఠాలు క్రింది పుస్తకం ఆధారంగా వివరించబడ్డాయి:
ఉసూలె సలాస (త్రి సూత్రాలు) [పుస్తకం] [మర్కజ్ దారుల్ బిర్ర్]

ప్రతి నమాజు తర్వాత చేతులెత్తి దుఆ చేయడం బిద్అత్ (కల్పితాచారం) కిందికి వస్తుందా? [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రతి నమాజు తర్వాత చేతులెత్తి దుఆ చేయడం బిద్అత్ (కల్పితాచారం) కిందికి వస్తుందా?
https://www.youtube.com/watch?v=uT6QWE7p4EI [9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, నమాజ్ తర్వాత చేతులెత్తి దుఆ చేయడం బిద్అత్ (మతంలో కొత్త ఆచారం) అవుతుందా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం ఆధారంగా చేతులెత్తి దుఆ చేయడాన్ని మూడు రకాలుగా విభజించారు. మొదటిది, ప్రవక్త గారు స్పష్టంగా చేతులెత్తిన సందర్భాలు (వర్షం కోసం దుఆ, అరఫా మైదానంలో దుఆ), ఇక్కడ మనం కూడా చేతులెత్తాలి. రెండవది, ప్రవక్త గారు దుఆ చేసినా చేతులెత్తని సందర్భాలు (సజ్దాలో, తషహ్హుద్ లో), ఇక్కడ మనం కూడా చేతులెత్తకూడదు. మూడవది, స్పష్టమైన ఆదేశం లేని సాధారణ సందర్భాలు. ఫర్జ్ నమాజ్ తర్వాత దుఆ అంగీకరించబడుతుందని హదీసులో ఉన్నప్పటికీ, ప్రవక్త గారు ప్రతి నమాజ్ తర్వాత క్రమం తప్పకుండా చేతులెత్తినట్లు రుజువు లేదు. కాబట్టి, దీనిని ఒక తప్పనిసరి అలవాటుగా మార్చుకోవడం ప్రవక్త విధానానికి విరుద్ధం మరియు బిద్అత్ అయ్యే ప్రమాదం ఉందని పండితులు వివరించారు. అప్పుడప్పుడు వ్యక్తిగతంగా దుఆ చేసుకుంటే తప్పు లేదు, కానీ దీనిని ఒక స్థిరమైన ఆచారంగా చేసుకోకూడదు.

ఇక్కడ వచ్చిన ప్రశ్న ఏంటి? నమాజుల తర్వాత దుఆ చేయడం బిద్అత్ అని అంటున్నారు. అయితే వాస్తవానికి, ప్రశ్న చాలా సంక్షిప్తంగా ఉంది. దీన్ని కొంచెం విడమరిచి అర్థం చేసుకునే అవసరం ఉంది. అప్పుడు ఇందులో బిద్అత్ ఏమిటి? సున్నత్ ఏమిటి? చేయవలసింది ఏమిటి? చేయకూడనిది ఏమిటి? మనకు అర్థమవుతుంది. ముందు అసలు ప్రశ్నలోనికే వెళ్దాం మనం.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీథ్ ద్వారా మనకు తెలుస్తుంది, ఫర్జ్ నమాజ్ ప్రత్యేకంగా, ఫర్జ్ నమాజుల గురించి. వాటి చివరి భాగం, అది సలాం కంటే ముందు కావచ్చు, సలాం తర్వాత కావచ్చు. మరికొన్ని ఉల్లేఖనాల్లో సలాం తర్వాత అన్నటువంటి ప్రస్తావన కూడా ఉంది. ఆ సమయంలో చేసే దుఆ అంగీకరించబడుతుంది. ఆ సమయంలో చేసే దుఆ అంగీకరించబడుతుంది. అలాంటప్పుడు, ఈ హదీథ్ విన్నవారు ఏమనుకుంటారు? మనం దుఆ చేయడంలో తప్పేంటి? కానీ ఇక్కడ మరో ప్రశ్నలో ఉన్నటువంటి విషయం, చేతులెత్తి దుఆ చేయడం అని ఇక్కడ ప్రస్తావన ఉంది.

దుఆలో చేతులు ఎత్తడంపై హదీసులు

అయితే, అబూ దావూద్ లోని ఒక హదీథ్,

إِنَّ اللَّهَ حَيِيٌّ كَرِيمٌ
(ఇన్నల్లాహ హయ్యియున్ కరీమున్)
అల్లాహు త’ఆలా చాలా సిగ్గుపడువాడు, ఎంతో ఉదారుడు.

అయితే ఎప్పుడైతే దాసుడు రెండు చేతులెత్తి అల్లాహ్ తో ఏదైనా దుఆ చేస్తాడో, అతని చేతులను, అతనికి ఏమీ ప్రసాదించకుండా తిరిగి ఉత్తగా, ఖాళీగా, ఏమీ ఇవ్వకుండా తిరిగి పంపేయడం అల్లాహ్ కు స్వయంగా ఇది ఇష్టం కాదు.

దీని ద్వారా ఏమర్థమవుతుంది? అంటే, మనం దుఆ చేసేటప్పుడు చేతులెత్తాలి. మొదటి హదీస్ ద్వారా, ఫర్జ్ నమాజ్ తర్వాత దుఆ స్వీకరించబడుతుంది అని, ఈ హదీస్ ద్వారా చేతులెత్తి చేస్తే మరీ స్వీకరించబడుతుంది అని, అల్లాహ్ తప్పకుండా ప్రసాదిస్తాడు అని. అలాంటప్పుడు మనం నమాజుల తర్వాత దుఆ చేసి, చేయడానికి చేతులు ఎత్తడం తప్పు లేదు అని ఈ హదీసుల ద్వారా తెలుస్తుంది, కదా?

షేఖ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్) వారి ఫత్వా: మూడు స్థితులు

అయితే, షేఖ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ యొక్క ఫత్వా దీని గురించి ప్రత్యేకంగా చదవడం జరిగింది. ఆయన చాలా మంచి సమాధానం ఇచ్చారు. ఏం చెప్పారు?

దుఆలో మనం ఎప్పుడు చేతులెత్తాలి, ఎప్పుడు చేతులెత్తకూడదు. దుఆ చేస్తూ మనం ఎప్పుడు చేతులెత్తాలి, ఎప్పుడు చేతులెత్తకూడదు. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారినే మనం అనుసరించాలి. అయితే, ఇక్కడ మనకు మూడు స్థితులు అనండి లేదా మూడు లెవెల్లు కనబడుతున్నాయి.

ఒకటి, కొన్ని సందర్భాలలో స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేస్తూ చేతులెత్తినట్లు రుజువు ఉంది. అక్కడ మనం తప్పకుండా చేతులెత్తాలి. ఉదాహరణకు, జుమా ఖుత్బా ఇస్తూ ఉండగా వర్షం కొరకు దుఆ చేసినప్పుడు చేతులెత్తి దుఆ చేశారు.

اللَّهُمَّ أَسْقِنَا
(అల్లాహుమ్మ అస్ఖినా)
ఓ అల్లాహ్, మాకు వర్షం కురిపించు.

సలాతుల్ ఇస్తిస్కా (వర్షం కొరకు నమాజ్) చేసినప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతులెత్తి దుఆ చేశారు అని రుజువు ఉన్నది. హజ్ చేస్తున్నప్పుడు మైదానే అరఫాత్ లో ఉన్నారు, చాలా దీర్ఘ సమయం వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతులెత్తి దుఆ చేశారు. చివరికి ఒంటె మీద కూర్చుండి చేతులెత్తి దుఆ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆ ఒంటెను నడపడానికి ఒక కట్టె ఉంటుంది కదా, అది కింద పడిపోయినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెయ్యి అలాగే ఎత్తి ఉన్నారు, మరో చెయ్యితో ఆ కింద పడిపోయిన వస్తువును తీసుకున్నారు. అంటే ఈ విధంగా ఎక్కడైతే ప్రవక్త చేతులెత్తారు అని మనకు రుజువు ఉందో, అక్కడ మనం చేతులెత్తాలి.

కానీ, ఎక్కడ ప్రవక్త చేతులెత్తలేదు, దుఆ చేశారు కానీ చేతులెత్తలేదు, అక్కడ మనం అలాగే దుఆ చేయాలి కానీ చేతులెత్తకూడదు. ఉదాహరణకు, సజ్దాలో దుఆ చేయండి అని చెప్పడం జరిగింది, దుఆ అంగీకరించబడుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అలాగే, తషహ్హుద్ లో ఉన్నప్పుడు కూడా మీరు దుఆ చేయండి అని చెప్పడం జరిగింది. కానీ ఈ సందర్భాలలో చేతులెత్తే ప్రస్తావన లేదు. అలాగే జుమా ఖుత్బా సందర్భంలో, సందర్భంలో, వేరే కొన్ని దుఆలు చేశారు కానీ చేతులెత్తినట్లు ఏ రుజువు లేదు, సుబూత్ లేదు. అందుకొరకు ఆ సందర్భాల్లో మనం చెయ్యి ఎత్తకూడదు. రెండు స్థితులు అర్థమైనాయి కదా?

ఇక మూడవది, ఏ సందర్భాల గురించి అయితే ఎత్తినట్లు, ఎత్తలేనట్లు ఏ ప్రస్తావన లేదో, అలాంటి చోట మనం ఏదైనా అడపాదడపా ఎత్తితే నష్టం లేదు కానీ, దానిని ఒక అలవాటుగా చేసుకోవడం, దానిని ఒక అలవాటుగా చేసుకోవడం ఇది ప్రవక్త విధానానికి వ్యతిరేకం అవుతుంది.

ముగింపు మరియు తీర్మానం

ఫర్జ్ నమాజ్ తర్వాత దుఆ, దీని ఘనత వచ్చి ఉంది. కానీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నమాజ్ యొక్క వివరణ ఎంతో మంది సహాబాలు ఉల్లేఖించారు. కానీ చేతులెత్తి దుఆ చేసినట్లు ఎక్కడైనా ఉల్లేఖనం ఉందా? లేదు. అందు గురించి, షేఖ్ అబ్దుల్లా అల్ జిబ్రీన్ రహిమహుల్లాహ్ చెప్పిన విషయం ఏంటంటే, ఎవరైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినటువంటి దుఆలు ఫర్జ్ నమాజ్ తర్వాత చేసి, ఆ తర్వాత చేతులెత్తి ఒకవేళ దుఆ చేసుకుంటే అభ్యంతరం లేదు.

అయితే మరి, షేఖ్ బిన్ బాజ్, షేఖ్ ఇబ్ను ఉథైమీన్ ఇంకా ఇతర పండితుల గురించి మనకు తెలుస్తుంది, వారు ఫత్వా ఏమిచ్చారు? ఫర్జ్ నమాజ్ తర్వాత చెయ్యి ఎత్తి దుఆ చేయడం బిద్అత్ అని. మరి ఎందుకు వీరు ఇలా చెప్పారు? ఎందుకు వీరు ఇలా చెప్పారంటే, మన వద్ద కొంతమంది ఇంకా వేరే ఏరియాలో కూడా, సలాం తింపిన తర్వాత ప్రవక్తతో ఏ ఏ దుఆలు అయితే రుజువై ఉన్నాయో, అవి ఆ విధంగా చదవకుండానే చేతులెత్తి దుఆ చేసే ఒక అలవాటుగా చేసుకుని ప్రతీ నమాజ్ తర్వాత చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి ప్రస్తావన వచ్చినప్పుడు, అవును మరి, ఇది ప్రవక్త యొక్క సున్నత్ కాదు మరియు ప్రతీ సారి చేస్తున్నారు, అందుకొరకే ఇది బిద్అత్ లో వచ్చే ప్రమాదం ఉంటుంది, అందుకొరకే బిద్అత్ అని ఫత్వా ఇచ్చారు.

అందుకొరకు, దీన్ని మనం ఇక్కడ ఈ విధంగా అర్థం చేసుకోవాలి. షేఖ్ అబ్దుల్లా అల్ జిబ్రీన్ రహిమహుల్లాహ్ వారి యొక్క ఫత్వాను ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇక ఎక్కడైతే ప్రస్తావన లేదో, చెయ్యి ఎత్తినట్లు, ఎత్తనట్లు, అక్కడ ఎప్పుడైనా ఒక్కసారి మనం ఎత్తి దుఆ చేస్తే అందులో పాపం లేదు కానీ, అదే ఒక అలవాటుగా చేయకూడదు.

هذا ما نعلم، والله أعلم بالصواب
(హాదా మా న’అలం, వల్లాహు అ’అలం బిస్సవాబ్)
ఇది మాకు తెలిసినది, మరియు సరైనది అల్లాహ్ కే బాగా తెలుసు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=12966

సురయే యాసీన్ ఘనత గురుంచి ఎంతో గొప్పగా చెబుతారు, ఇది నిజమేనా? మృతులపై యాసీన్ సూరా చదవవచ్చా? [వీడియో]

బిస్మిల్లాహ్

[1:12 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) – పార్ట్ 03: వుజూ ఘనత, వుజూ విధానం Q&A [వీడియో]

బిస్మిల్లాహ్

[01:03:56 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అంశాలు: వుజూ ఘనత, వుజూ విధానం

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

వుజూ :

వుజూ లేని నమాజ్ అంగీకరింపబడదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

لَا يَقْبَلُ اللهُ صَلَاةَ أَحَدِكُمْ إِذَا أَحْدَثَ حَتَّى يَتَوَضَّأَ

“మీలో ఎవనికైనా అపానవాయువు జరిగితే అతను వుజూ చేసుకోనంత వరకు అల్లాహ్ అతని నమాజును అంగీకరించడు”. (బుఖారి 6954).

వుజూ ఘనతలు చాలా ఉన్నాయి. వుజూ సందర్భంలో అవి గుర్తుకు తెచ్చుకోవడం మంచిది. వాటిలో కొన్ని ఇవి: ముస్లిం 245లో ఉంది:.

مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ خَرَجَتْ خَطَايَاهُ مِنْ جَسَدِهِ حَتَّى تَخْرُجَ مِنْ تَحْتِ أَظْفَارِهِ

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శుభవార్త ఇచ్చారని, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“ఎవరు వుజూ చేసినప్పుడు పూర్తి శ్రద్ధతో మంచి విధంగా చేస్తారో అతని శరీరం నుండి అతని పాపాలన్నీ రాలిపోతాయి. చివరికి గోళ్ళ నుండి కూడా వెళ్ళిపోతాయి”.

مَنْ أَتَمَّ الْوُضُوءَ كَمَا أَمَرَهُ اللهُ تَعَالَى فَالصَّلَوَاتُ الْـمَكْتُوبَاتُ كَفَّارَاتٌ لِمَا بَيْنَهُنَّ

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారని, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“అల్లాహ్ ఆదేశించిన విధంగా సంపూర్ణంగా వుజూ చేసేవారు, వారి ఫర్జ్ నమాజులు వాటి మధ్య జరిగే పాపాల ప్రక్షాళనకు కారణభూతమవుతాయి”. (ముస్లిం 231).

వుజూ విధానం :

* వుజూలో ఒక అవయవం తర్వాత మరో అవయవం క్రమ ప్రకారంగా మరియు వెంటవెంటనే కడుగుట తప్పనిసరి ([1]).

[1] క్రమ ప్రకారంగా వుజూ చేయాలి. అంటే: 1 నుండి 8 వరకు ఉన్న క్రమం ప్రకారం వీటిలో వెనకా ముందు చేయకూడదు. వెంటవెంటనే చేయాలి. అంటేః పై క్రమం ప్రకారం, ఒక అవయవం కడిగాక, దాని తడి ఆరక ముందే వెంటనే దాని వెనక అవయవం కడగాలి. మరీ ఆలస్యం చేయవద్దు.

1- వుజూ నియ్యత్ (సంకల్పం) నోటితో పలుకకుండా మనుసులోనే చేయాలి. ఒక పని చేయుటకు మనుసులో నిర్ణయించుకోవడమే ‘నియ్యత్’.

మళ్ళీ బిస్మిల్లాహ్ అనాలి. (క్రింది వుజూ చిత్రాలు చూడండి).

2- రెండు అరచేతులను మణికట్ల వరకు మూడు సార్లు కడగాలి. (చిత్రం2).

3- మూడు సార్లు నోట్లో నీళ్ళు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్ళు ఎక్కించి శుభ్రం చేయాలి. (చిత్రాలు 3, 4).

4- మూడు సార్లు ముఖము కడగాలి. అడ్డంలో కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు. నిలువులో నొసటి పై భాగం నుండి గదువ క్రింది వరకు. (చి.5)

5- రెండు చేతులు మూడేసి సార్లు కడగాలి. వ్రేలు మొదటి భాగము నుండి మోచేతుల వరకు. ముందు కుడి చెయ్యి, తరువాత ఎడమ చెయ్యి. (చి.6)

6- ఒక సారి తల ‘మసహ్’ చేయాలి. అంటే రెండు చేతులను తడి చేసి తల మొదటి (నుదుటి) భాగము నుండి వెనక మెడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ వెనక నుండి మొదటి వరకు తలను స్పర్శిస్తూ తీసుకురావాలి. (చూడండి చిత్రం 7 మరియు దాని తర్వాత చిత్రం).

7- ఒక సారి రెండు చెవుల ‘మసహ్’ చేయాలి. అంటే రెండు చూపుడు వ్రేళ్ళతో చెవి లోపలి భాగాన్ని, బొటన వ్రేళ్ళతో పై భాగాన్ని స్పర్శించాలి. (చిత్రం 8.)

8- రెండు కాళ్ళను వ్రేళ్ళ నుండి చీలమండల వరకు మూడేసి సార్లు కడగాలి. ముందు కుడి కాలు తరువాత ఎడమ కాలు.

9- తర్వాత దుఆ చదవాలి: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని, ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మీలో ఎవరైనా సంపూర్ణంగా వుజూ చేసుకొని ‘అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహ్’ చదువుతారో అతని కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి, ఎందులో నుండి ప్రవేశించ గోరినా అతని ఇష్టం“. (ముస్లిం 234).

أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ

(నేను సాక్ష్యమిస్తున్నాను; అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడని, ఆయన ఏకైకుడు భాగస్వామీ లేనివాడని మరియు సాక్ష్యమిస్తున్నాను; ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త).


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు