దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net

దిష్టి తగలకుండా బుగ్గకి నల్ల చుక్క లేదా కాళ్ళకి నల్ల దారం కట్టవచ్చా? https://youtu.be/5a9fdHuql-U [5 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, దిష్టి తగలకుండా కాళ్లకు నల్ల దారం కట్టుకోవడం మరియు మెడలో తాయెత్తులు (తావీజులు) ధరించడం వంటి నమ్మకాలపై ఇస్లామీయ తీర్పును వివరించబడింది. ఇవి ఇస్లాంలో నిషిద్ధమైన చర్యలని, షిర్క్ (బహుదైవారాధన) కిందకు వస్తాయని స్పష్టం చేయబడింది. ఇలాంటివి ధరించి చేసే నమాజ్ వంటి ఆరాధనలు స్వీకరించబడవని చెప్పబడింది. ఇలాంటి మూఢనమ్మకాలకు బదులుగా, కేవలం అల్లాహ్‌పైనే ఆధారపడాలని మరియు అన్ని రకాల కీడు, రోగాలు మరియు దిష్టి నుండి రక్షణ పొందడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన ఖురాన్ సూరాలు మరియు ప్రామాణికమైన దువాలను పఠించాలని నొక్కి చెప్పబడింది.
[ప్రశ్న] మరి కాళ్ళ కాడ నల్ల దారం కట్టుకుంటారు. అడిగితే దిష్టి తగలకుండా అంటారు. ఇది ఎంత సత్యం? నిజం? మరి వాళ్ళు ఐదు పూటల నమాజులు చదువుతారు, వాళ్ళ నమాజులు స్వీకరించబడతాయా? నల్ల దారం కాళ్ళకి కట్టుకొని, మెడలో తావీజు వేసుకొని నమాజ్ చదివితే స్వీకరించబడుతుందా?
నల్ల దారం మరియు తాయెత్తులపై ఇస్లామీయ తీర్పు
నల్ల దారం అనేది కట్టుకోకూడదు. మనుషులే కాదు, అప్పటి కాలంలో అరబ్బులో ఒంటెలకు ఒక రోగం వచ్చేది. దాని కారణంగా ఒక రకమైన తీగ, ‘వతర్’ అని వారు అనేవారు, దానిని ఒంటెల మెడలకు వేసేవారు. అయితే ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణంలో ఉన్నప్పుడు, కొందరు ఇలాంటి తప్పుకు పాల్పడింది చూసి ఇలా అన్నారు:
لَا يَبْقَيَنَّ أَحَدُكُمْ قِلَادَةً أَوْ وَتَرًا (లా యబ్ఖయన్న అహదుకుం కిలాదతన్ అవ్ వతరన్) “మీలో ఎవరు కూడా తమ ఒంటెలో ఇలాంటి ఏ పట్టా గానీ, ఏ దారం గానీ, ఏ తీగ గానీ, ఇలాంటి రోగాలు రాకుండా, దిష్టి తగలకుండా వేయకూడదు” అని చాలా స్పష్టంగా చెప్పారు.
ఇక మన వద్ద కొందరు తావీజులు ఏవైతే వేసుకుంటారో, తావీజ్ మెడలో గానీ, ఇక్కడ గానీ, కొందరు ‘ఇమామె జామిన్’ అని సౌదియాకు వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళ తల్లులు, “నా బేటా, తూ ఇమామె జామిన్ పెహన్ కే జా, తూ సలామత్ సే ఆయేగా మేరా బేటా” అని ఎంతో ప్రేమగా తల్లులు వేయించి పంపుతారు. మరికొందరు స్త్రీలు వారి యొక్క గర్భ సమయంలో గానీ, లేదా వారికి కాన్పు చాలా సులభంగా జరగాలని కానీ, ఇక్కడ నడుములో కట్టుకుంటారు. అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహ్ హిదాయత్ ఇవ్వు గాక. మరి కొందరి గురించి వచ్చిన వార్తలు, ప్రజలు అడిగిన ప్రశ్నల్లో, కొందరు తొడలకు కూడా ఇలాంటి తావీజులు కట్టుకుంటారు అని తెలిసింది. మరి కొందరు కింద చీలమండలానికి పైగా కాళ్ళకు కూడా వేసుకుంటారు. ఇవన్నీ కూడా తప్పు విషయాలు. ఇంట్లో పుట్టిన చిన్న పిల్లలకు ఏ దిష్టి తగలకూడదని నల్ల పూసలు వేస్తారు. ఇటు పక్కన నల్ల కాటుక అది పెడతారు. లేదా ఇక్కడ పెడతారు, లేదా పాదంలో పెడతారు. ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం దూరం ఉండాలి.
సరైన విశ్వాసం మరియు రక్షణ మార్గాలు
అల్లాహ్ పై మాత్రమే మన నమ్మకం ఉండాలి. అల్లాహ్‌ను మాత్రమే మనం బలంగా విశ్వసించాలి. మరియు అన్ని రకాల దిష్టి నుండి, చెడు నుండి, మరియు అన్ని రకాల కీడుల నుండి రక్షణ కొరకు మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన దువాలు చదువుతూ ఉండాలి మరియు ఇంకా మన ఇహలోక పరంగా కొన్ని మంచి సాధనాలను ఉపయోగించి, చెడుకు పాల్పడే అటువంటి సాధనాలను వదులుకోవాలి.
ప్రవక్త (స) నేర్పిన దువాలు (ప్రార్థనలు)
మనకు ఏమైనా అవస్థ, బాధ, కష్టం, శరీరంలో ఏదైనా నొప్పి ఉండేది ఉంటే, మూడు సార్లు ‘బిస్మిల్లాహ్’ చదివి, ఏడు సార్లు ఈ దువా చదవాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పారు:
أَعُوذُ بِعِزَّةِ اللَّهِ وَقُدْرَتِهِ مِنْ شَرِّ مَا أَجِدُ وَأُحَاذِرُ (అ’ఊదు బి ఇజ్జతిల్లాహి వ ఖుద్రతిహీ మిన్ షర్రి మా అజిదు వ ఉహాదిర్) “నేను అనుభవిస్తున్న మరియు భయపడుతున్న దాని కీడు నుండి అల్లాహ్ యొక్క శక్తి మరియు ఘనతతో శరణు వేడుకుంటున్నాను.” ఆ చోట ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ వేలు పెట్టి ఈ దువా చదువుతూ ఉంటే అల్లాహ్ త’ఆలా స్వస్థత కలిగించేవాడు ఉన్నాడు. మరియు దానికి తగినటువంటి కొన్ని మందులు గట్రా వాడటంలో కూడా పాపం లేదు.
ఎవరికైనా దిష్టి తగిలే అటువంటి ప్రమాదం ఉండేది ఉంటే, ఈ దువా చదువవచ్చు:
أَعُوذُ بِكَلِمَاتِ اللَّهِ التَّامَّاتِ مِنْ شَرِّ مَا خَلَقَ (అ’ఊదు బి కలిమాతిల్లాహిత్ తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్) “అల్లాహ్ యొక్క సంపూర్ణ వాక్యాలతో ఆయన సృష్టించిన ప్రతి దాని కీడు నుండి శరణు కోరుతున్నాను.”
అలాగే, ప్రత్యేకంగా దిష్టి గురించి:
أَعُوذُ بِكَلِمَاتِ اللَّهِ التَّامَّةِ مِنْ كُلِّ شَيْطَانٍ وَهَامَّةٍ وَمِنْ كُلِّ عَيْنٍ لامَّةٍ (అ’ఊదు బి కలిమాతిల్లాహిత్ తామ్మహ్, మిన్ కుల్లి షైతానిన్ వ హామ్మహ్, వ మిన్ కుల్లి ‘అయ్నిన్ లామ్మహ్) “అల్లాహ్ యొక్క సంపూర్ణ వాక్యాలతో నేను శరణు కోరుతున్నాను, ప్రతి షైతాన్ నుండి, ప్రతి విషపు పురుగు నుండి మరియు హాని కలిగించే ప్రతి కన్ను (దిష్టి) నుండి.”
ఇంకా వేరే ఎన్నో రకాల దువాలు ఉన్నాయి. ప్రత్యేకంగా సూరతుల్ ఇఖ్లాస్ (ఖుల్ హువల్లాహు అహద్), సూరతుల్ ఫలఖ్ (ఖుల్ అ’ఊదు బి రబ్బిల్ ఫలఖ్), సూరతున్ నాస్ (ఖుల్ అ’ఊదు బి రబ్బిన్ నాస్), ఈ సూరాలు జ్ఞాపకం ఉంచుకొని, ఇవి మరియు ఆయతుల్ కుర్సీ లాంటివి మనం చదువుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక సహీ హదీథ్‌లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
مَا تَعَوَّذَ مُتَعَوِّذٌ بِمِثْلِهِمَا (మా త’అవ్వద ముత’అవ్విదున్ బి మిస్లిహిమా) “శరణు కోరేవాడు ఈ రెండింటి (సూరహ్ ఫలఖ్, నాస్) వంటి వాటితో ఎన్నడూ శరణు వేడుకోలేదు.” మరి కొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఇఖ్లాస్ కూడా. ఇంతకంటే ఉత్తమమైన, మంచి, గొప్ప ఏ శరణు వేడుకోవడానికి ఏ మంచి సూరాలు దువాలు ఇక వేరేవి లేవు అని కూడా ప్రవక్త చెప్పి ఉన్నారు. బహుశా ఈ ప్రశ్నకు ఇంత సమాధానం సరిపోతుందని అనుకుంటున్నాను.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[8:30 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ధర్మపరమైన నిషేధాలు –20
20– అల్లాహ్ ను వదలి సమాధిలో ఉన్నవారితో దుఆ చేసే, లేదా వారిని అల్లాహ్ ముందు మధ్యవర్తిగా నిలబెట్టే ఉద్దేశ్యంతో సమాధులను దర్శించకు. అక్కడ వారి స్థితిగతులను, వారి పర్యవసానాన్ని గ్రహించి, గుణపాఠం నేర్చుకునే ఉద్దేశ్యం ఉండాలి. (ప్రవక్త నేర్పిన ప్రకారం) వారికి సలాం చేయుటకు, వారి కొరకు అల్లాహ్ తో దుఆ చేయుటకు వెళ్ళుట మంచిదే.
ఆ అల్లాహ్ యే మీ ప్రభువు. సామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయ- నను కాదని మీరు పిలిచే ఇతరులు కనీసం ఒక గడ్డిపోచకు కూడా యజమానులు కారు. వారిని వేడుకుంటే, వారు మీ అర్థింపులను వినలేరు. ఒకవేళ విన్నా వాటికి ఏ సమాధానమూ మీకు ఇవ్వలేరు. మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు ప్రళయం నాడు తిరస్కరిస్తారు. సత్యాన్ని గురించిన ఈ సరైన సమాచారాన్ని తెలిసిన వాడు తప్ప మరొకడెవ్వడూ మీకు అందజేయలేడు[. (ఫాతిర్ 35: 13,14).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[6:48నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[6:55 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ధర్మపరమైన నిషేధాలు (పరిచయం)
అల్ హందులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅదహ్, వఅష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహ్, వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహ్. అమ్మా బఅద్!
మీరు ఈ పుస్తకాన్ని సంపూర్ణంగా చదవనిదే తీసి పక్కకు పెట్టకండి. ఇది మీ కొరకే, ఇతరులకు కాదు. నేను దీనిని ప్రేమ సిరా (Ink)తో వ్రాసాను. హృదయ ఏకాగ్రత, స్వచ్ఛతతో లిఖించాను.
దానిని ప్రేమ పోస్ట్ మరియు ఆకాంక్ష రాయబారి ద్వారా పంపాను. నీ చక్షువులకు ముందు నీ హృదయం; నీ కళ్ళకు ముందు నీ మనస్సులో అది నాటుకుపోవాలని.
ప్రియ సోదరా… ప్రియ సోదరి…
ఇస్లాం ధర్మం యొక్క పునాది బలమైన విశ్వాసముపై ఉన్నది. విశ్వాస ఆవశ్యకతా నివేదనలో ఆదేశాలను పాటించడం మరియు నివారణల నుండి దూరంగా ఉండడం తప్పనిసరి. ఇస్లాం ధర్మం యొక్క విసరురౌతు ఈ రెండు తిరుగలిరాయిల మీదే తిరుగుతుంది. అల్లాహ్ ఆదేశం చదవండి:
“నేను దేని నుండి మిమ్మల్ని వారిస్తానో దాని జోలికిపోకుండా ఉండండి, దేని గురించి నేను మిమ్మల్ని ఆదేశిస్తానో సాధ్యమైనంత వరకు దానిని నెరవేర్చండి”. (బుఖారి, అల్ ఇఖ్తిదాఉ బిసునని రసూ- లిల్లాహ్, 7288. ముస్లిం, తౌఖీరిహీ వ తర్కి ఇక్సారి సుఆలిహీ… 1337).
అల్లాహ్ ఏ దాని ఆదేశం ఇచ్చి, అది తప్పనిసరిగా చేయాలని విధించాడో మరియు దానిని నెరవేర్చాలని ప్రోత్సహించాడో విశ్వాసుడు దానిని నెరవేరుస్తూ ప్రేమ, ఆశతో మరియు ఆయన సన్నిధానం పొందుటకు తన పరమపవిత్రుడైన ప్రభువును ఆరాధిస్తాడు. అలాగే వినయనమ్రతతో, భయభక్తులతో మరియు ఆజ్ఞాపాలన భావంతో అల్లాహ్ వారించిన మరియు హెచ్చరించిన వాటికి దూరంగా ఉండుట కూడా అతనిపై విధిగా ఉంది.
ఈ విధంగా చూస్తే ఇస్లాం ధర్మం “చేయండి”, “చేయకండి” అనే రెండిటి మధ్యలో ఉంది. దేనిని ఎంపిక చేసుకోవాలనే స్వేచ్ఛ మనిషిలో ఉంది. దారి స్పష్టంగా తన ముందు ఉంది. సత్ఫ- లితమో, దుష్ఫలితమో ప్రళయదినాన దొరకనుంది. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:
మేము అతనికి మార్గం చూపాము. ఇక అతను కృతజ్ఞుడు కావచ్చు లేదా కృతఘ్నుడూ కావచ్చు[. (సూరె దహ్ర్ 76: 3).
అయితే మనము దాసులం. కనుక దాసుడు తన యజమాని ఆధీనంలో ఉంటాడు. యజమాని ఆదేశిస్తాడు, వారిస్తాడు. దాసుడు సంతోషంగా శిరసావహిస్తాడు మరియు శ్రద్ధభక్తులతో విధేయత చూపుతాడు. మనం ఏకైక అల్లాహ్ కు దాసులమయి ఉండడంలో ఉన్న కీర్తి మనకు చాలు.
ప్రియ పాఠకులారా, లేదా శ్రోతల్లారా! నేను నా కొరకు మరియు మీ కొరకు విశ్వాసానికి మరియు దైవఏకత్వానికి సంబంధించిన కొన్ని వారింపులను సమకూర్చాను. వాటి ప్రస్తావన దివ్య ఖుర్- ఆనులో లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో ఉంది. మన విశ్వాసం అన్ని రకాల లోటుపాట్లకు, కొరత తగ్గింపు- లకు దూరంగా ఉండాలని మరియు అజ్ఞానంగా వాటిలో చిక్కుకోకుండా, వాటిని తెలుసుకొనుటకు మరియు వాటిలో చిక్కుకు- పోయిన ముస్లింలను హెచ్చరించి, హెచ్చరిక బాధ్యత పూర్తి చేయుటకు లేదా అల్లాహ్ కాపాడేవారిని దాని కీడు నుండి దూరముంచుటకు (ఇవి నేను సమకూర్చాను).
ఆయన మంచి నామముల, ఉత్తమ సద్గుణాల ఆధారంతో, ఆయన కారుణ్యాన్ని ఆశిస్తూ ఈ పనిలో శుభం కలుగజేయాలని, ఏలాంటి కొరతా, దోషం లేకుండా చేయాలని, కేవలం ఆయన సంతృప్తి కొరకు, ఆయన దర్శన భాగ్యం కలిగే కొరకు చేయాలని అల్లాహ్ ను వేడుకుంటున్నాను. మరియు దీనిని సమకూర్చిన, సరిచేసిన, ప్రచురించిన మరియు పంపిణీ చేసిన వారందరికీ అల్లాహ్ సత్ఫలితం ప్రసాదించుగాక! ఆమీన్. వల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.