సూర కహఫ్ తిలావత్ ఘనత, ముఖ్యంగా జుమా (శుక్రవారం) రోజు [వీడియో]

బిస్మిల్లాహ్

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు

  • జుమాకు సంబంధించిన ఆడియో, వీడియోలు, ఆర్టికల్స్ , పుస్తకాలు క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ప్రయోజనం పొందండి మరియు మీ స్నేహితులకు మరియు బంధుమిత్రులకు పంపించండి.
    https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

సూరతుల్ కహఫ్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – మెయిన్ పేజీ. (అన్నీ పాఠాల కోసం)
https://teluguislam.net/tafsir-kahf/

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran

సూరతుల్ కహఫ్ పారాయణం: సాద్ అల్-ఘమిడి | తెలుగు సబ్ టైటిల్స్: అహ్సనుల్ బయాన్ |వీడియో
https://teluguislam.net/2020/06/25/18-al-kahf

సజ్దాలో చేసుకొనే ప్రవక్త దుఆలు

1.సుబ్ హాన రబ్బియల్ అఅలా. (ముస్లిం 772).

سُبْحَانَ رَبِّيَ الأعلَى

(ఉన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు).

ఒక్కసారి చదవడం విధిగా ఉంది. ఎక్కువ సార్లు చదవడం చాలా మంచిది.

2- సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా వ బిహందిక అల్లాహుమ్ మగ్ఫిర్లీ. (బుఖారి 794, ముస్లిం 484).

سُبْحَانَكَ اللَّهُمَّ رَبَّنَا وَبِحَمْدِكَ اللَّهُمَّ اغْفِرْلِي

(మా ప్రభువైన ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధునివి, నీకే స్తోత్రములు, ఓ అల్లాహ్ నన్ను మన్నించు).

3- సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలా ఇకతి వర్రూహ్. (ముస్లిం 487).

سُبُّوحٌ قُدُّوسٌ رَبُّ الْـمَلَائِكَةِ وَالرُّوحُ

(దైవదూతలు మరియు జిబ్రీల్ యొక్క ప్రభువు పరిశుద్ధుడు, పరమపవిత్రుడు).

4- సుబ్ హాన జిల్ జబరూతి వల్ మలకూతి వల్ కిబ్రియాఇ వల్ అజమహ్. (అబూదావూద్ 873, నిసాయి 1049. అల్బానీ సహీ అని అన్నారు).

سُبْحَانَ ذِي الجَبَرُوتِ وَالمَلَكُوتِ وَالْكِبرِيَاءِ وَالْعَظْمَةِ

(సార్వభౌమాధికారి, సర్వాధిపతి, గొప్పవాడు మరియు ఘనుడు అయిన అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు).

5- అల్లాహుమ్మగ్ఫిర్లీ జంబీ కుల్లహూ దిఖ్ఖహూ వ జిల్లహు వ అవ్వలహూ వ ఆఖిరహూ వ అలానియతహూ వ సిర్రహూ. (ముస్లిం 483).

اللَّهُمَّ اغْفِرْلِي ذَنْبِي كُلَّهُ دِقَّهُ وَجِلَّهُ وَأوَّلَهُ وَآخِرَهُ وَعَلَانِيَتَهُ وَسِرَّهُ

(ఓ అల్లాహ్! నా చిన్నా పెద్ద, ముందు వెనక, బహిర్గతమైన, రహస్యమైన పాపాలన్నిటినీ క్షమించు).

6- అల్లాహుమ్మ లక సజత్తు వ బిక ఆమంతు వ లక అస్లమ్ తు సజద వజ్ హియ లిల్లజీ ఖలకహు వ సవ్వరహు వ షక్క సమ్అహు వ బసరహు తబారకల్లాహు అహ్ సనుల్ ఖాలికీన్. (ముస్లిం 771).

اللَّهُمَّ لَكَ سَجَدْتُ وَبِكَ آمَنْتُ وَلَكَ أَسْلَمْتُ سَجَدَ وَجْهِي لِلَّذِي خَلَقَهُ وَصَوَّرَهُ وَشَقَّ سَمْعَهُ وَبَصَرَهُ تَبَارَكَ اللهُ أَحْسَنُ الخَالِقِينَ

(ఓ అల్లాహ్ నేను నీ కొరకు సజ్దా చేశాను, నిన్ను విశ్వసించాను, నీకే శిరసవహించాను, నా ముఖం దానిని సృష్టించిన, ఆకారం ఇచ్చిన, చెవి, కళ్ళు ఇచ్చిన అల్లాహ్ కు సజ్దా చేసింది. అతి ఉత్తమ సృష్టికర్త అయిన అల్లాహ్ చాలా శుభాలు కలవాడు).

7- అల్లాహుమ్మ అఊజు బిరిజాక మిన్ సఖతిక వ బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక వ అఊజు బిక మిన్క లా ఉహ్ సీ సనాఅన్ అలైక అంత కమా అస్నైత అలా నఫ్సిక. (ముస్లిం 486).

اللَّهُمَّ أَعُوذُ بِرِضَاكَ مِنْ سَخَطِكَ وَبِمُعَافَاتِكَ مِنْ عُقُوبَتِكَ وَأَعُوذُ بِكَ مِنْكَ لَا أُحْصِي ثَنَاءً عَلَيْكَ أَنْتَ كَمَا أَثْنَيْتَ عَلَى نَفْسِكَ

(ఓ అల్లాహ్! నీ అప్రసన్నత నుండి నీ ప్రసన్నత శరణు, నీ శిక్ష నుండి నీ మన్నింపు శరణు కోరుతున్నాను. నిన్ను నీవు ఎలా స్తుతించుకున్నావో అలా నేను నీ స్తోత్రాలను లెక్కించలేను).

సజ్దాలో ఉన్నప్పుడు ఎక్కువగా దుఆ చేయడం మంచిది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వస్లలం) ఈ హదీసు ఆధారంగా:

దాసుడు తన ప్రభువుకు అత్యంత సమీపంగా ఉండేది సజ్దా స్థితిలో. అందుకు మీరు అందులో దుఆ ఎక్కు వగా చేయండి“. (ముస్లిం 482).

పుస్తకం నుండి: రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు (పగలు రాత్రి దుఆలు)
కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ, ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

కరోనా పాఠశాల నేర్పిన పాఠాలు – అరబీ జుమా ఖుత్బ తెలుగు అనువాదం [ఆడియో]

బిస్మిల్లాహ్

[16:23 నిమిషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లొడ్ చేసుకోండి [16:23 నిమిషాలు]

ఇతరములు:

తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 69 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 69
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

(1) “ఎవరు విశ్వసించి, వలసపోయారో, అల్లాహ్‌ మార్గంలో తమ ధనప్రాణాల ద్వారా పోరాడారో వారూ, వారికి ఆశ్రయమిచ్చి సహాయపడినవారూ – వారంతా ఒండొకరికి మిత్రులు” (8:72 ) దీనిలో ప్రఖ్యాతిగా ఎవరిని గూర్చి తెల్పబడింది?

A) అన్సారుల గూర్చి
B) ముహాజిర్ ల గూర్చి
C) ముహాజిర్ మరియు అన్సారుల గూర్చి

(2) భార్య – భర్తల మధ్య ప్రేమ పెరుగుటకు చేసే చేతబడిని ఏమంటారు?

A) అర్రుఖా
B) తివల
C) తమాయిమ్

(3) తావీజు వేసుకోవడం ఎలాంటి కార్యం అవుతుంది?

A) షిర్క్ (బహుదైవారాధన)
B) బిదాత్ (కల్పితాచారం)
C) పుణ్య కార్యం

క్విజ్ 69: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [13:31 నిమిషాలు]

ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 68 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 68
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

(1) దైవప్రవక్త (ﷺ) వారికి స్వప్నం లో శత్రుసైన్యాన్ని తక్కువ మందిగా చూపించింది ఏ యుద్ధ సందర్భంగా తెలపండి?

A) ఉహద్ యుద్ధం
B) బద్ర్ యుద్ధం
C) తబూక్ యుద్ధం

(2) ప్రళయదినం నాడు అల్లాహ్ మనల్ని ప్రశ్నించే 5 ప్రశ్నల క్రమంలో ఈ క్రింది వాటిలో ఒక ప్రశ్న ఉంది అదేమిటి?

A) తెలుసుకున్న విషయాలపై ఎంత వరకు ఆచరించావు ?
B) ఎంత వరకు తెలుసుకున్నావు ?
C) ఎంత ఎక్కువ మందికి తెల్పావు ?

(3) “భయపడినవాడు తెల్లవారుజామునే ప్రయాణం మొదలు పెట్టాడు ఇలాంటి వ్యక్తి గమ్యాన్ని చేరుకుంటాడు , వినండి ! అల్లాహ్ యొక్క సామగ్రి అమూల్యమైనది , జాగ్రత్తగా వినండి ! అల్లాహ్ సామగ్రి అనగా స్వర్గం ” [తిర్మిజీ ] దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి ఈ ప్రవచనం ద్వారా మనకు లభించే గుణపాఠం ఏమిటి?

A) తెల్లవారు జామున మాత్రమే ప్రయాణం చెయ్యాలి
B) అల్లాహ్ విధేయత కొరకు పుణ్యాలు చెయ్యడం లో ఆలస్యం చెయ్యకూడదు
C) పై రెండూ యధార్థమే

క్విజ్ 68: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [18:36 నిమిషాలు]

ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

లాక్ డౌన్ 5.0 మరియు మస్జిద్ లలో సామూహిక నమాజుల సూచనలు [వీడియో]

బిస్మిల్లాహ్

[14 నిముషాలు]

అబూ బక్ర్ బేగ్ ఉమ్రీ హఫిజహుల్లాహ్

Speaker: Abubaker Baig omeri
లాక్ డౌన్ 5.0 మరియు మస్జిద్ లలో సామూహిక నమాజులు.
Lockdown 5 & How to pray namaz in masajid

అల్ మజ్లిసుల్ ఇల్మీ ధార్మిక పండితుల సూచనలు

1. అల్లాహ్ వైపునకు మరలి అత్యధికంగా క్షమాపణ మరియు ఇస్తిగ్ఫార్ లాంటి ప్రార్ధనలు చేస్తూండండి.

2. కొత్త సూచనల వెలుగులో జుమా మరియు జమాత్ నెలకొల్పండి.

3. పరిస్థితులు పూర్తిగా మారనంత వరకు మస్జిదుల మరుగు దొడ్లను, వుజూ ఖానాలను మూసి ఉంచండి.

4. తువాలు ఇతర సామూహిక వస్తువులు మస్జిద్ లలో ఉంచకండి.

5. వీలైనంత వరకు కార్పెట్, మ్యాట్ లను మస్జిద్ లలో వినియోగించకండి.

6. తమ ఇంటి వద్దే తమ అవసరాలను పూర్తి చేసుకొని, వుజూ చేసుకుని మస్జిద్ లకు రండి.

7. మస్జిద్ లకు విచ్చేసేటప్పుడు మాస్క్ ను ధరించండి.

8. మస్జిద్ లకు విచ్చేసేటప్పుడు గుంపులు గా నిలబడకండి. మరియు సామాజిక దూరాన్ని పాఠించండి.

9. వృద్దులు. పిల్లలు, మరియు వ్యాధిగ్రస్తులు తమ ఇంటి వద్దనే నమాజు ఆచరించండి.

10. స్త్రీలు కూడా తమ ఇంటి వద్దనే నమాజు ఆచరించండి.

11. జుమా నమాజులు తమ ఇంటి వద్ద నమాజు ఆచరించేవారు జుమా బదులు జుహర్ నమాజ్ చదవండి.

12. జలుబు, జ్వరం ఉన్న వారు తమ ఇంటి వద్దనే నమాజు ఆచరించండి.

13. ఒకవేళ సామాజిక దూరాన్ని పాఠించి మాత్రమే నమాజు ఆచరించాల్సిందిగా ప్రభుత్వ ఆదేశాలు జారీ అయినచో సాధ్యమైనంత దూరాన్ని పాఠించి నమాజు ఆచరించవచ్చు.

14.సఫ్ (పంక్తుల) లో దూరాన్ని పాఠించడం వలన స్థలం సరిపోని పక్షంలో జుమా మరియు జమాత్ నమాజులు ఒకటికి రెండుసార్లు జమాత్ చేయవచ్చు.

15. మస్జిద్ ఇమాములు మరియు దాయీలు జుమా ఖుత్బాలను సంక్షిప్తం చేయండి.

16.నమాజుకు సరిగ్గా కొంత సమయం ముందు మస్జిద్ లకు విచ్చేయండి. నమాజు అయిన వెంటనే తమ తమ ఇంటికి వెళ్ళండి. సున్నతులు ఇంటి వద్ద ఆచరించడమే ఉన్నతం.

17. సామాజిక దూరాన్ని పాఠించకుండా, ఆదేశాలను సూచనలకు వ్యతిరేక వైఖరితో మహమ్మారికి గురై మీరు నష్టపోకండి, మరియు దయ చేసి సమాజానికి చెడ్డ పేరు తీసుకురాకండి.

18. మస్జిద్ ఇమాములు, మౌజన్ తదితరులతో ముసాఫహా, షేక్ హ్యాండ్ (shake hand) నుంచి దూరంగా ఉండండి.

19. అల్లాహ్ ఆగ్రహం నుండి రక్షణకు మంచిని ప్రోత్సహించండి, చెడును నిర్మూలించండి.

20. అవసరార్ధులకు వీలైనంత సహాయం అందించండి.

21. ఈ కోవిడ్ మహమ్మారి నుండి రక్షణకు ప్రార్ధనలు చేస్తూ ఉండండి. అల్లాహ్ అందరికీ మహమ్మారి నుండి రక్షణను మరియు ఆయురారోగ్యాలను ప్రసాధించుగాక. (ఆమీన్ )

ఈద్ సందర్భంలో చదివే తక్బీర్ పదాలు [ఆడియో]

బిస్మిల్లాహ్

ఈద్ సందర్భంలో చదివే తక్బీర్ పదాలు ఏమిటి
ఈ వీడియో చూసి నేర్చుకోండి
ఇతరులకు నేర్పి అధిక పుణ్యం పొందండి

[2:31 నిముషాలు]


అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌
లా ఇలాహ ఇల్లల్లాహ్
అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌ వ లిల్లాహిల్‌ హమ్ద్


అల్లాహు అక్బర్ కబీరా, వల్ హందులిల్లాహి కసీరా , వ సుబ్ హానల్లాహి బుక్రతన్ వ అసీలా
అల్లాహు అక్బర్ వలా న’బుదు ఇల్లల్లాహ్ ముఖ్లిసీన లహుద్దీన్ వలవ్ కరిహల్ కాఫిరూన్
లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ద సదఖ వ’అద వ నసర అబ్ద వ హజమల్ అహ్జాబ వహ్ద
లా ఇలాహ ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్


వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

రమదాన్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

జకాతుల్ ఫిత్ర్ (సదఖతుల్ ఫిత్ర్) – అబూ బక్ర్ బేగ్ ఉమరి (హఫిజహుల్లాహ్) [వీడియో]

బిస్మిల్లాహ్

అబూ బక్ర్ బేగ్ ఉమరి హఫిజహుల్లాహ్ (ఏలూరు)
[7 నిముషాలు]

ఈ చిన్న వీడియో క్లిప్ “జకాత్ మరియు ఫిత్రా వివరాలు” అనే వీడియో నుండి తీసుకోబడింది

రమదాన్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

ఈద్ (పండుగ) నెలవంక కనిపించిన వెంటనే అల్లాహ్ యొక్క గొప్పతనం చాటండి [వీడియో]

బిస్మిల్లాహ్

“అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌
లా ఇలాహ ఇల్లల్లాహ్
అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌
వ లిల్లాహిల్‌ హమ్ద్”

[2 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ యూట్యూబ్ ఛానల్ 

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి  [2 నిముషాలు]

రమదాన్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

లాక్ డౌన్ లో ఈద్ సున్నతు ఆచరణలను ఎలా పాటించాలి? [వీడియో]

బిస్మిల్లాహ్

[9:19 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి  [9:19 నిముషాలు]

రమదాన్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/