ధర్మపరమైన నిషేధాలు (పరిచయం): అల్లాహ్ మరియు ప్రవక్త వారించిన మరియు హెచ్చరించిన వాటికి దూరంగా ఉండుట కూడా ఆరాధనలో భాగమే [వీడియో]

బిస్మిల్లాహ్

[6:55 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ధర్మపరమైన నిషేధాలు (పరిచయం)

అల్ హందులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅదహ్, వఅష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహ్, వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహ్. అమ్మా బఅద్!

మీరు ఈ పుస్తకాన్ని సంపూర్ణంగా చదవనిదే తీసి పక్కకు పెట్టకండి. ఇది మీ కొరకే, ఇతరులకు కాదు. నేను దీనిని ప్రేమ సిరా (Ink)తో వ్రాసాను. హృదయ ఏకాగ్రత, స్వచ్ఛతతో లిఖించాను.

దానిని ప్రేమ పోస్ట్ మరియు ఆకాంక్ష రాయబారి ద్వారా పంపాను. నీ చక్షువులకు ముందు నీ హృదయం; నీ కళ్ళకు ముందు నీ మనస్సులో అది నాటుకుపోవాలని.

ప్రియ సోదరా… ప్రియ సోదరి…

ఇస్లాం ధర్మం యొక్క పునాది బలమైన విశ్వాసముపై ఉన్నది. విశ్వాస ఆవశ్యకతా నివేదనలో ఆదేశాలను పాటించడం మరియు నివారణల నుండి దూరంగా ఉండడం తప్పనిసరి. ఇస్లాం ధర్మం యొక్క విసరురౌతు ఈ రెండు తిరుగలిరాయిల మీదే తిరుగుతుంది. అల్లాహ్ ఆదేశం చదవండి:

[وَمَا آَتَاكُمُ الرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَاكُمْ عَنْهُ فَانْتَهُوا] {الحشر:7}

దైవప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి, ఆయన మిమ్మల్ని నిషేధించిన దాని జోలికిపోకండి[. (సూరె హష్ర్ 59: 7).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః

 (فَإِذَا نَهَيْتُكُمْ عَنْ شَيْءٍ فَاجْتَنِبُوهُ وَإِذَا أَمَرْتُكُمْ بِأَمْرٍ فَأْتُوا مِنْهُ مَا اسْتَطَعْتُمْ)

“నేను దేని నుండి మిమ్మల్ని వారిస్తానో దాని జోలికిపోకుండా ఉండండి, దేని గురించి నేను మిమ్మల్ని ఆదేశిస్తానో సాధ్యమైనంత వరకు దానిని నెరవేర్చండి”. (బుఖారి, అల్ ఇఖ్తిదాఉ బిసునని రసూ- లిల్లాహ్, 7288. ముస్లిం, తౌఖీరిహీ వ తర్కి ఇక్సారి సుఆలిహీ… 1337).

అల్లాహ్ ఏ దాని ఆదేశం ఇచ్చి, అది తప్పనిసరిగా చేయాలని విధించాడో మరియు దానిని నెరవేర్చాలని ప్రోత్సహించాడో విశ్వాసుడు దానిని నెరవేరుస్తూ ప్రేమ, ఆశతో మరియు ఆయన సన్నిధానం పొందుటకు తన పరమపవిత్రుడైన ప్రభువును ఆరాధిస్తాడు. అలాగే వినయనమ్రతతో, భయభక్తులతో మరియు ఆజ్ఞాపాలన భావంతో అల్లాహ్ వారించిన మరియు హెచ్చరించిన వాటికి దూరంగా ఉండుట కూడా అతనిపై విధిగా ఉంది.

ఈ విధంగా చూస్తే ఇస్లాం ధర్మం “చేయండి”, “చేయకండి” అనే రెండిటి మధ్యలో ఉంది. దేనిని ఎంపిక చేసుకోవాలనే స్వేచ్ఛ మనిషిలో ఉంది. దారి స్పష్టంగా తన ముందు ఉంది. సత్ఫ- లితమో, దుష్ఫలితమో ప్రళయదినాన దొరకనుంది. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:

[إِنَّا هَدَيْنَاهُ السَّبِيلَ إِمَّا شَاكِرًا وَإِمَّا كَفُورًا] {الإنسان:3}

మేము అతనికి మార్గం చూపాము. ఇక అతను కృతజ్ఞుడు కావచ్చు లేదా కృతఘ్నుడూ కావచ్చు[. (సూరె దహ్ర్ 76: 3).

అయితే మనము దాసులం. కనుక దాసుడు తన యజమాని ఆధీనంలో ఉంటాడు. యజమాని ఆదేశిస్తాడు, వారిస్తాడు. దాసుడు సంతోషంగా శిరసావహిస్తాడు మరియు శ్రద్ధభక్తులతో విధేయత చూపుతాడు. మనం ఏకైక అల్లాహ్ కు దాసులమయి ఉండడంలో ఉన్న కీర్తి మనకు చాలు.

ప్రియ పాఠకులారా, లేదా శ్రోతల్లారా! నేను నా కొరకు మరియు మీ కొరకు విశ్వాసానికి మరియు దైవఏకత్వానికి సంబంధించిన కొన్ని వారింపులను సమకూర్చాను. వాటి ప్రస్తావన దివ్య ఖుర్- ఆనులో లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో ఉంది. మన విశ్వాసం అన్ని రకాల లోటుపాట్లకు, కొరత తగ్గింపు- లకు దూరంగా ఉండాలని మరియు అజ్ఞానంగా వాటిలో చిక్కుకోకుండా, వాటిని తెలుసుకొనుటకు మరియు వాటిలో చిక్కుకు- పోయిన ముస్లింలను హెచ్చరించి, హెచ్చరిక బాధ్యత పూర్తి చేయుటకు లేదా అల్లాహ్ కాపాడేవారిని దాని కీడు నుండి దూరముంచుటకు (ఇవి నేను సమకూర్చాను).

ఆయన మంచి నామముల, ఉత్తమ సద్గుణాల ఆధారంతో, ఆయన కారుణ్యాన్ని ఆశిస్తూ ఈ పనిలో శుభం కలుగజేయాలని, ఏలాంటి కొరతా, దోషం లేకుండా చేయాలని, కేవలం ఆయన సంతృప్తి కొరకు, ఆయన దర్శన భాగ్యం కలిగే కొరకు చేయాలని అల్లాహ్ ను వేడుకుంటున్నాను. మరియు దీనిని సమకూర్చిన, సరిచేసిన, ప్రచురించిన మరియు పంపిణీ చేసిన వారందరికీ అల్లాహ్ సత్ఫలితం ప్రసాదించుగాక! ఆమీన్. వల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

ధర్మపరమైన నిషేధాలు – 17 : బర్కత్ (శుభం) కలిగే ఉద్దేశంతో సమాధుల మీద, దాని చుట్టు ప్రక్కలో ఎక్కడా నమాజు, దుఆ, ఇతర ఆరాధనలు చేయకు [వీడియో]

బిస్మిల్లాహ్

[7:44 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ధర్మపరమైన నిషేధాలు – 17

17- బర్కత్ (శుభం) కలిగే ఉద్దేశంతో సమాధుల మీద, దాని చుట్టు ప్రక్కలో ఎక్కడా నమాజు చేయకు. అక్కడ దుఆ చేయుట ఘనత గల విషయమని భావించకు. అక్కడ నమాజు చేయుట సంపూర్ణత్వానికి ఓ నిదర్శనం అని భావించకు. ఇవన్నియూ షిర్కులో లేదా దాని దరిదాపులకు చేరుకుండా ఉండటానికి పాటించవలసిన ముఖ్య పనులు [1].

عَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُولُ الله : (لَعْنَةُ اللهِ عَلَى الْيَهُودِ وَالنَّصَارَى اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారని ఆయిష (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారుః “యూదులు మరియు క్రైస్తవులపై అల్లాహ్ శాపం కురువుగాక! వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనస్థలం(మస్జిదులు)గా చేసుకున్నారు”. (బుఖారి/ అస్సలాతు ఫిల్ బీఅతి/ 436, ముస్లిం/ అన్నహ్ యు అన్ బినాఇల్ మసాజిద్ అలల్ ఖుబూర్…/ 531).

మరో ఉల్లేఖనంలో ఉంది:

(أَلَا وَإِنَّ مَنْ كَانَ قَبْلَكُمْ كَانُوا يَتَّخِذُونَ قُبُورَ أَنْبِيَائِهِمْ وَصَالِحِيهِمْ مَسَاجِدَ أَلَا فَلَا تَتَّخِذُوا الْقُبُورَ مَسَاجِدَ إِنِّي أَنْهَاكُمْ عَنْ ذَلِكَ).

“మీకు పూర్వం గడచిపోయినవారు తమ ప్రవక్తల మరియు పుణ్యాత్ముల సమాధులను మస్జిదులుగా చేసుకునేవారు, వినండి! మీరు అలా సమాధులను మస్జిదులుగా చేయబోకండి. నేను మిమ్మల్ని దీని నుండి నిషేధిస్తున్నాను. (ముస్లిం 532).


[1]  సమాధి వద్ద నమాజు స్థితులు:

1- సమాధి వద్ద నమాజు చేయు వ్యక్తి సమాధి మరియు అందులో ఉన్న వారి గురించి ఏ ప్రత్యేక నమ్మకం లేకుండా, అల్లాహ్ ప్రసన్నత కొరకే, కాని అక్కడ చేయుట ఎక్కువ ఘనత అని భావిస్తే అతను షిర్క్ కు సంబంధించిన బిద్అత్ (దురాచారం) చేసినవాడు, శాపగ్రస్తుడు మరియు సృష్టిలో అతి నీచుడవుతాడు. కాని పెద్ద షిర్క్ కు పాల్పడిన, ఇస్లాం నుండి వైదొలిగినవాడు కాడు.

2- సమాధి వద్ద నమాజు చేయు వ్యక్తి అందులో ఉన్నవారి గురించి లాభాలు చేకూర్చే, నష్టాన్ని తొలిగించేవారని నమ్మి, వారితో మొర పెట్టుకుంటే, వేడుకుంటే అలాంటి వ్యక్తి పెద్ద షిర్క్ కు పాల్పడి, ఇస్లాం నుండి దూరమై, తౌహీద్ కు వ్యతిరేకమైన కార్యం చేసినవాడవుతాడు.

3- ఎవరైతే అజ్ఞానంతో సమాధి వద్ద నమాజ్ చేశాడో, అక్కడ సమాధి ఉన్నదని కూడా అతనికి తెలియదో అతని ఆ నమాజ్ సహీ అగును. అతడు పాపాత్ముడు కాడు.

పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

ధర్మపరమైన నిషేధాలు – 8 : కాబా తప్ప మరేదాని ప్రదక్షిణం (తవాఫ్) చేయకు [వీడియో]

బిస్మిల్లాహ్

[6:10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ధర్మపరమైన నిషేధాలు – 8

8- కాబా తప్ప మరేదాని ప్రదక్షిణం (తవాఫ్) చేయకు. మక్క ముకర్రమ, మస్జిదె హరాంలో ఉన్న కాబా ప్రదక్షిణం ఆల్లాహ్ యొక్క ఆరాధన మరియు ఆయన సన్నిధానంలో చేర్పించే ఉత్తమ కార్యం. దానిని వదలి లేదా దానితో పాటు ఏదైనా సమాధి, రాయి, మరేదాని ప్రదక్షిణం పుణ్యోద్దేశంతో, శిక్షకు భయ- పడుతూ చేయకు [1]

[وَإِذْ جَعَلْنَا البَيْتَ مَثَابَةً لِلنَّاسِ وَأَمْنًا وَاتَّخِذُوا مِنْ مَقَامِ إِبْرَاهِيمَ مُصَلًّى وَعَهِدْنَا إِلَى إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ أَنْ طَهِّرَا بَيْتِيَ لِلطَّائِفِينَ وَالعَاكِفِينَ وَالرُّكَّعِ السُّجُودِ] {البقرة:125}

ఈ గృహాన్ని (కాబా) మేము మానవులందరికీ కేంద్రంగాను, శాంతి నిలయంగానూ చేశాము. ఇబ్రాహీము నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి. ఇంకా ఈ నా గృహాన్ని, దానికి ప్రదక్షిణం చేసేవారి కొరకు, దానిలో ఏతెకాఫ్ పాటించేవారి కొరకు, రుకూ, సజ్దాలు చేసేవారి కొరకు పరిశుద్ధంగా ఉంచవలసిందని ఇబ్రాహీమును, ఇస్మాఈలును నిర్దేశించాము[. (బఖర 2: 125).


[1] సమాధుల, మజారుల వద్ద ప్రదక్షిణం మరియు జిబహ్ (జంతువు బలి) యొక్క రకాలు క్రింది విధంగా ఉన్నాయిః

1- సమాధిలో ఉన్నవారి గురించి ప్రదక్షిణం, జిబహ్ చేస్తే, అతడు తౌహీద్ (దైవఏకత్వం)కు వ్యతిరేకమైన పెద్ద షిర్క్ చేసినవాడౌతాడు.

2- ఒకవేళ అతని ప్రదక్షిణం అల్లాహ్ కొరకే కాని సమాధివారు లాభ నష్టాలు చేకూర్చే శక్తిగలవారని నమ్మితే అతడు కూడా తౌహీద్ కు వ్యెతిరేకమైన, ధర్మ భ్రష్టతకు కారణమయ్యే పెద్ద షిర్క్ చేసినవాడు అవుతాడు.

3- ఒకవేళ అతని ప్రదక్షిణం అల్లాహ్ కొరకే ఉండి నమాధివారి గురించి ఏ ప్రభావ విశ్వాసం లేకుండా ‘ఆ సమాధి వారిది ఉన్నత స్థానం, ఆయన ఆ స్థానం లాభనష్టాలకు కారణం’ అని నమ్మితే, అప్పుడు ఇది షిర్క్ సంబంధిత బిద్అత్ (దురాచారం) అవుతుంది. కాని ధర్మ భ్రష్టతకు కారణమయ్యే పెద్ద షిర్క్ కాదు. పోతే అల్లాహ్ యూదులను, క్రైస్తవులను శపించినట్లు అతను కూడా శాపగ్రస్తుడు అవుతాడు. అలాగే సమాధిని మస్జిదుగా చేసుకున్నవారు కూడా శాపగ్రస్తులు.

పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

వివాహ ఆదేశాలు – 2: విడాకులు, ఖుల, ముస్లిమేతరులతో వివాహం [వీడియో]

బిస్మిల్లాహ్

[31: 28 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

విడాకులు ఇచ్చే హక్కు ఎవరిది ❓
భార్యకు భర్త నుండి విడిపోయే హక్కు ఉందా ❓దాన్ని ఏమంటారు❓
ముస్లిమేతరుల తో వివాహ ఆదేశాలు ఏమిటి❓ లాభ నష్టాలు ఏమిటి ❓

మొదటి భాగం క్రింద వినవచ్చు
వివాహ ఆదేశాలు -1: నిబంధనలు, ధర్మములు, నిషిద్ధతలు [వీడియో]

విడాకులు

విడాకులు ఇష్టమైన కార్యమేమి కాదు. అయినా కొన్ని సందర్భాల్లో అనివార్యం. ఉదా: భార్యకు భర్తతో, లేదా భర్తకు భార్యతో జీవితం గడపడం కష్టతరమైనప్పుడు. లేదా మరే కారణమైనా సంభవించినప్పుడు అల్లాహ్ తన దయ, కరుణతో దీనిని తన దాసుల కొరకు ధర్మసమ్మతం చేశాడు. ఎవరికైనా ఇలాంటి అవసరం పడినప్పుడు విడాకులివ్వచ్చును. కాని అప్పుడు క్రింది విషయాలను దృష్టిలో ఉంచుకొనుట చాలా ముఖ్యం.

1- భార్య బహిష్టుగా ఉన్నప్పుడు విడాకులివ్వకూడదు. అప్పుడు విడాకులిచ్చాడంటే అతను అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవిధేయతకు మరియు నిషిద్ధ కార్యానికి పాల్పడినట్లే. అందుకు అతను విడాకులని చెప్పిన తన మాటను వెనక్కి తీసుకొని ఆమెను తన వద్దే ఉంచుకోవాలి. పరిశుద్ధమయిన తర్వాత విడాకులివ్వాలి. ఇప్పుడు కూడా ఇవ్వకుండా మరో సారి బహిష్టు వచ్చి పరిశుభ్రమయ్యాక తలచుకుంటే విడాకులివ్వాలి లేదా తన వద్దే ఉంచుకోవాలి.

2- పరిశుద్ధంగా ఉన్న రోజుల్లో ఆమెతో సంభోగిస్తే విడాకులివ్వకూడదు. కాని అప్పుడు ఆమె గర్భవతి అని తెలిస్తే విడాకు- లివ్వచ్చును. ఒకవేళ ఆమె గర్భం దాల్చకుంటే, వచ్చే నెలలో ఆమె బహిష్టురాళయి పరిశుభ్రమయ్యే వరకు ఓపిక వహించి, ఆ పరిశుభ్రత రోజుల్లో ఆమెతో సంభోగించకుండా విడాకులివ్వాలి.

విడాకులైన తరువాత

విడాకుల వల్ల భార్య భర్తతో విడిపోతుంది గనక కొన్ని ఆదేశాలు వర్తిస్తాయి వాటిని పాటించటం అవసరం.

1- భర్త సంభోగించి, లేదా కేవలం ఏకాంతంలో ఆమెతో ఉండి విడాకులిస్తే నిర్ణీత గడువు కాలం పూర్తి చేయుట ఆమెపై విధి. సంభోగించక, ఏకాంతంలో ఉండక విడాకులిస్తే ఆమెపై ఏ గడువూ లేదు. బహిష్టురాళ్ళ గడువు కాలం మూడు సార్లు బహిష్టు రావడం. బహిష్టు రాని స్త్రీల గడువు కాలం మూడు నెలలు. గర్భిణీల గడువు కాలం ప్రసవించే వరకు.

గడువు కాలం నిర్ణయించడంలో గొప్ప లాభం ఉందిః విడాకులిచ్చిన స్త్రీని తిరిగి తమ దాంపత్యంలోకి మరలించు- కునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆమె గర్భిణీయా లేదా అనేదీ తెలుస్తుంది.

2- ఇప్పుడిచ్చే విడాకులకు మునుపు రెండు విడాకులిచ్చి ఉంటే ఈ విడాకుల తర్వాత భార్య అతనిపై నిషిద్ధమవుతుంది. అంటే భర్త ఒకసారి విడాకులిచ్చి నిర్ణీత గడువులో మరలించుకున్నాడు లేదా నిర్ణీత గడువు కాలం దాటినందుకు పునర్వివాహం చేసుకున్నాడు. మళ్ళీ రెండవసారి విడాకులిచ్చాడు, నిర్ణీత గడువులో మరలించుకున్నాడు లేదా అది దాటినందుకు పునర్వివాహం చేసుకున్నాడు. ఇక మూడవసారి విడాకులిచ్చి- నట్లయితే ఆమె అతనికి ధర్మసమ్మతం కాదు. (మరలించుకునే హక్కు సయితం అతనికీ ఉండదు). ఆమె మరో వ్యక్తితో సవ్యమైన రీతిలో వివాహం చేసుకోవాలి. అతను ఆమెతో కాపురం చేయాలి. మళ్ళీ అతను ఆమెను ఇష్టపడక, ఆమెతో జీవితం గడపడం సంభవం కాక తనిష్టంతో విడాకులిచ్చిన సందర్భంలో ఆమె మొదటి వ్యక్తి కొరకు ధర్మసమ్మతం అవుతుంది. (అయితే మరో వ్యక్తి పెళ్ళి చేసుకునే, విడాకులిచ్చే ఉద్ధేశం ఆమెను మొదటి వ్యక్తి కొరకు హలాల్ చేయడమైతే మరి అందులో ఆ మొదటి వ్యక్తి ప్రోత్సాహం కూడా ఉంటే వారిద్దరూ ప్రవక్త నోట వెలువడిన శాపనానికి గురవుతారు. (అబూ దావూద్, కితాబున్నికాహ్, బాబున్ ఫిత్తహ్ లీల్). ఏ భర్త తన భార్యకు మూడు సార్లు విడాకులిచ్చాడో, అతను తిరిగి ఆమెను భార్యగా చేసుకునే విషయాన్ని అల్లాహ్ నిషిద్ధ పరచి స్త్రీ జాతిపై చాలా కనికరించాడు. వారిని వారి భర్తల అత్యాచారాల నుండి కాపాడాడు.

“ఖులఅ”

“ఖులఅ” అంటేః భర్తతో జీవితం గడపడం ఇష్టంలేని స్త్రీ, భర్త నుండి తీసుకున్న మహరు సొమ్ము (కన్యాశులకం) అతనికి వాపసు చేసి, అతని వివాహ బంధం నుండి విముక్తి పొందదలుచుకొనుట. ఒకవేళ భర్త ఆమెను ఇష్టపడక భార్యను విడిచిపెట్టాలనుకుంటే భార్య నుండి ఏ సొమ్ము తీసుకునే హక్కుండదు. అతను ఓపికతో ఆమెను సంస్కరిస్తూ జీవితం గడపాలి. లేదా మంచి విధంగా విడాకులివ్వాలి.

భర్తతో జీవితం గడపడం వాస్తవంగా దుర్భరమై, సహనం వహించడం కష్టతరమైతేనే తప్ప ఏ స్త్రీ కూడా తన భర్తతో ఖులఅ కోరుట మంచిది కాదు. అలాగే భార్య తన నోట ఖులఅ కోరాలనే ఉద్దేశంతో ఆమెను హింసించడం భర్తకూ ధర్మసమ్మతం కాదు. ఖులఅ కోరడంలో స్త్రీ న్యాయంపై ఉంటే భర్త సంతోషంగా విడాకు- లివ్వాలి. మరియు అతను ఇచ్చిన మహరు కంటే ఎక్కువగా ఆమె నుండి తీసుకోవడం కూడా మంచిది కాదు. ఒకవేళ అతను ఆమెకు ఇచ్చిన మహరు వాపసు తీసుకోకుంటే మరీ మంచిది.

వివాహ బంధాన్ని నిలుపుకునే, తెంచుకునే స్వేచ్ఛ

ఈ క్రింది కారణాల్లో ఏ ఒకటైనా భర్త భార్యలో లేదా భార్య భర్తలో చూసినచో వారు తమ వివాహ బంధాన్ని నిలుపుకునే లేదా తెంచుకునే స్వేచ్ఛ కలిగి ఉంటారు.

అఖ్ద్ సందర్భంలో తెలియని ఏదైనా వ్యాది, శారీరక లోపం భర్త భార్యలో లేదా భార్య భర్తలో తర్వాత చూసినచో తమ వివాహ బంధాన్ని నిలుపుకునే లేదా తెంచుకునే హక్కు వారికుంది. ఉదాః

1- ఇద్దరిలో ఏ ఒకరైనా పిచ్చివారు లేదా వ్యాదిగ్రస్తులయి రెండో వారి హక్కు నెరవేర్చ లేని స్థితిలో ఉంటే రెండో వారు వివాహ బంధం నుండి విముక్తి పొందవచ్చు. ఈ విషయం పరస్పర సంభోగానికి ముందు జరిగితే భర్త భార్యకు మహరు ఇచ్చి యుంటే దానిని తిరిగి తీసుకోవచ్చు.

2- భర్త వద్ద మహరు నగదు ఇచ్చే శక్తి లేనప్పుడు మరియు వారిద్దరిలో సంభోగం జరగక ముందు భార్యకు భర్త నుండి విడిపోయే హక్కుంటుంది. సంభోగం జరిగిన తర్వాత మాత్రం ఈ హక్కు ఉండదు.

3- భర్త వద్ద పోషణ ఖర్చులు ఇచ్చే శక్తి లేనప్పుడు భార్య కొద్ది రోజులు వేచి చూడాలి. ఏమీ ప్రయోజనం ఏర్పడకుంటే న్యాయ- వంతులైన ముస్లిం పెద్దల సమక్షంలో మాట పెట్టి విడిపోయే హక్కుంటుంది.

4- ఆచూకీ తెలియకుండా పరారీలో ఉన్న భర్త ఇల్లాలు పిల్లలకు ఏమీ ఖర్చులు ఉంచలేదు. ఎవరికీ వారి ఖర్చుల బాధ్యత అప్పజెప్పలేదు. వారి ఖర్చులు భరించువారెవరు లేరు. తన ఖర్చులకు ఆమె వద్ద కూడా ఏమీ లేదు. అలాంటప్పుడు ముస్లిం న్యాయశీలులైన పెద్దల మధ్యవర్తిత్వంతో ఆ వివాహ బంధం నుండి విడిపోవచ్చును.

అవిశ్వాసులతో వివాహం

ముస్లిం పురుషుడు అవిశ్వాసిరాళ్ళను (హిందు, బుద్ధ తదితర మత స్త్రీలను) వివాహమాడుట ధర్మసమ్మతం కాదు. యూద, క్రైస్తవ స్త్రీలను పెళ్ళాడడం యోగ్యమే. అయితే ముస్లిం స్త్రీ వివాహం ముస్లిం పురుషునితో తప్ప ఎవ్వరితో ధర్మ సమ్మతం కాదు. యూదుడు, క్రైస్తవుడైనా సరే యోగ్యం కాదు.

ముస్లిమేతర జంటలో భార్య ముందుగా ఇస్లాం స్వీకరిస్తే భర్త ఇస్లాం స్వీకరించే వరకు ఆమె అతనితో సంభోగానికి ఒప్పుకొనుట ధర్మసమ్మతం కాదు. అవిశ్వాసులతో వివాహ విషయంలో ప్రత్యేక ధర్మాలు క్రింద తెలుపబడుచున్నవిః

1- భార్యాభర్తలిద్దరూ ఒకేసారి ఇస్లాం స్వీకరిస్తే వారు అదే నికాహ్ పై ఉందురు (అంటే కోత్తగా మరోసారి “అఖ్దె నికాహ్” వివాహ ఒప్పందం అవసరం లేదు). ధార్మిక ఆటంకం ఏదైనా ఉంటే తప్ప. ఉదాః భర్తకు ఆమె మహ్రమాతులో అయి యుండవచ్చు. లేదా ఆమెతో వివాహం చేసుకొనుట అతనికి యోగ్యం లేకుండవచ్చు. అలాంటప్పుడు వారిద్దరు విడిపోవాలి.

2- యూద, క్రైస్తవ జంటల్లో కేవలం భర్త ఇస్లాం స్వీకరిస్తే వారు అదే నికాహ్ పై ఉందురు.

3- యూద, క్రైస్తవుల్లో గాకుండా వేరే మతఅవలంభికుల జంట ల్లో ఏ ఒక్కరైనా సంభోగానికి ముందే ఇస్లాం స్వీకరిస్తే వారి వివాహ బంధం తెగిపోతుంది. వారు భార్యాభర్తలుగా ఉండలేరు.

4- ముస్లిమేతర జంటల్లో భార్య సంభోగముకు ముందే ఇస్లాం స్వీకరిస్తే ఆమె అతని వివాహ బంధం నుండి విడిపోవును. ఎందుకనగా ముస్లిం స్త్రీ అవిశ్వాసులకు భార్యగా ఉండడం ధర్మ సమ్మతం కాదు.

5- ముస్లిమేతర జంటల్లో భార్య సంభోగం తర్వాత ఇస్లాం స్వీకరిస్తే ఆమె “ఇద్దత్” (గడువు) పూర్తి అయ్యే లోపులో భర్త ఇస్లాం స్వీకరించకున్నట్లయితే గడువు పూర్తి కాగానే వారి వివాహ- బంధం తెగిపోతుంది. ఆమె మరే ముస్లిం వ్యక్తితోనైనా వివాహం చేసుకోవాలనుంటే చేసుకోవచ్చును. భర్త ఇస్లాం స్వీకరణకై వేచించదలుచుకుంటే ఆమె ఇష్టం. అయితే ఈ మధ్యలో భర్తపై ఆమె ఏ హక్కూ ఉండదు. అలాగే అతను ఆమెకు ఏ ఆదేశం ఇవ్వలేడు. అతడు ఇస్లాం స్వీకరించిన వెంటనే ఆమె అతనికి భార్య అయి పోతుంది. పునర్వివాహ అవసరం ఉండదు. ఇందుకొరకు ఆమె సంవత్సరాల తరబడి నిరీక్షించినా ఆమె ఇష్టంపై ఆధార పడియుంది. అలాగే యూద, క్రైస్తవ గాకుండా వేరే మతాన్ని అవలంభించిన స్త్రీ యొక్క భర్త ఇస్లాం స్వీకరిస్తే పై ఆదేశమే వర్తించును. (అనగా వారి మధ్య వివాహ బంధం తెగిపోవును. ఒకవేళ భార్య ఇస్లాం స్వీకరించు వరకు వేచి చూడదలచుకుంటే భర్త వేచించవచ్చును).

6- సంభోగానికి ముందు భార్య మతభ్రష్టురాలైనచో వారి వివాహ బంధం తెగిపోవును. ఆమెకు మహరు కూడా దొరకదు. భర్త మతభ్రష్టుడయితే ఆమెకు సగం మహరు లభించును. మతభ్రష్టులైన వారు తిరిగి ఇస్లాం స్వీకరిస్తే వారు అదే నికాహ్ పై ఉందురు. ఇది వారి మధ్య విడాకులు కానప్పుడు.

యూద క్రైస్తవ స్త్రీలతో వివాహం వల్ల కలిగే నష్టాలు

అల్లాహు తఆలా వివాహాన్ని ధర్మ సమ్మతంగా చేసిన ముఖ్యోద్దేశం: ప్రవర్తనల్లో సంస్కారం, అశ్లీలత నుండి సమాజ పరిశుద్ధత మరియు శీలమానాలకు సంరక్షణ లభించాలని. సమాజంలో స్వచ్ఛమైన ఇస్లామీయ వ్యవస్థ స్థాపించబడాలని. అల్లాహ్ మాత్రమే సత్య ఆరాధ్యుడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిచ్చే సత్సమాజం ఉనికిలోకి రావాలని. ఇంతటి గొప్ప లాభాలు పొందాలంటే ధార్మికురాలు, సద్గుణసంపన్నురాలైన ఉత్తమ స్త్రీతో పెళ్ళి చేసుకుంటే తప్ప పూర్తి కావు. ఇక యూద, క్రైస్తవ స్త్రీలతో వివాహం వల్ల కలిగే నష్టాలు ఏలాంటివనేవి క్రింద సంక్షిప్తంగా తెలుసుకుందాముః

1- కుటుంబ రంగములోః చిన్న కుటుంబాల్లో భర్త శక్తివంతుడై ఉంటే భార్యపై అతని ప్రభావం పడుతుంది. ఆమె ఇస్లాం స్వీకరించవచ్చు అన్న ఆశ కూడా ఉంటుంది. ఒకప్పుడు దీనికి విరుద్ధంగా జరుగుతుంది. భర్త అధికారం చెల్లదు. అలాంటప్పుడు భార్య తన ధర్మంలో యోగ్యమని భావించేవాటికి అలవాటు పడుతుంది. ఉదాః మత్తు సేవించడం, పంది మాంసం తినడం, దొంగచాటు సంబంధాలు ఏర్పరుచుకొనడం లాంటివి. అందువల్ల ముస్లిం కుటుంబం చెల్లాచెదురైపోతుంది. సంతానం శిక్షణ మంచివిధంగా జరగదు. పరిస్థితి మరింత మితిమీరిపోతుంది; భార్య గనకా మతపక్షపాతం, మతకక్షల్లాంటి దుర్గుణురాలై సంతానాన్ని తన వెంట చర్చులకు తీసుకుపోతున్నప్పుడు. వారి ప్రార్థనలు, వారి చేష్టలు చిన్నతనం నుండే చూస్తూ చూస్తూ అదే మార్గంపై వారు పెరుగుతారు. సామెత కూడా ఉంది కదా: ‘ఎవరు ఏ అలవాటులపై పెరిగాడో వాటిపైనే చస్తాడు’. (తెలుగు సామెత: మ్రొక్కయి వంగనిది మానయి వంగునా).

2- సామాజిక నష్టాలు: ముస్లిం సమాజంలో యూద, క్రైస్తవ స్త్రీల సంఖ్య పెరగడం చాలా గంభీరమైన విషయం. ఆ స్త్రీలు ముస్లిం సమాజంలో విచార యుద్ధానికి పునాదులవుతారు. దాని వెనక వారి దురలవాటుల వల్ల ముస్లిం సమాజం కుళ్ళిబోతుంది, క్షీణించిపోతుంది. దానికి తొలిమెట్టుగా స్త్రీపురుషుల కలయిక, నగ్నత్వాన్ని పెంపొందించే దుస్తులు అధికమవడం. ఇస్లాంకు వ్యతిరేకమైన ఇతర విషయాలు ప్రభలడం.


ధర్మపరమైన నిషేధాలు – 23 : అల్లాహ్ యేతరుల కొరకు జంతు బలి చేయకు [వీడియో]

బిస్మిల్లాహ్

[11:37 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ధర్మపరమైన నిషేధాలు – 23

23అల్లాహ్ యేతరుల కొరకు జంతు బలి చేయకు. అది వారి సన్నిధానం పొందుటకుగాని, లేదా వారితో భయం చెంది, లేదా వారేమైనా ఇస్తారని ఆశించి. ఉదాహరణకుః జిన్నాతుల నుండి ఏ హానీ కలగకూడదని లేదా మృతుల నుండి ఏదైనా లాభం కలగాలని వారి కొరకు బలి ఇచ్చుట([1]).

[قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي للهِ رَبِّ العَالَمِينَ ، لَا شَرِيكَ لَهُ وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا أَوَّلُ المُسْلِمِينَ] {الأنعام:163}

ఇలా అను: నా నమాజ్, నా బలి (ఖుర్బానీ), నా జీవనం, నా మరణం, సమస్తమూ సకలలోకాలకూ ప్రభువైన అల్లాహ్ కొరకే, ఆయనకు ఏ భాగస్వామీ లేడు. ఈ ఆజ్ఞయే నాకు ఇవ్వబడింది[. (అన్ఆమ్ 6: 163,164).


([1])         అల్లాహ్ యేతరుల కొరకు చేసే జంతు బలి రెండు రకాలుగా ఉంటుందిః

1-  సన్నిధానం పొందుటకు, గౌరవభావంతో, ఆరాధన ఉద్దేశంతో చేయుట. అందులో అతని నుండి ఎదైనా మేలు ఆశిస్తూ, లేదా అతని నుండి కీడు కలగవద్దన్న భయంతో చేయుట. ఇది పెద్ద షిర్క్. ఇస్లాం నుండి బహిష్కరణకు కారణం. తౌహీద్ కు వ్యతిరేకం. ఉదాహ- రణకుః ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత జంతు బలి ఇచ్చి, దానిని ఇంట్లో ఉంచుట, జిన్, షైతానుల కీడు నుండి రక్షణ ఉద్దేశంతో దాని రక్తాన్ని గోడలకు పూయుట.

2- ఎవరైనా అతిథి, బందువు వచ్చినప్పుడు అల్లాహ్ ప్రసన్నత ఉద్దేశంతో జంతువును కోయుట ఇది ధర్మసమ్మతం.

పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

ధార్మిక విద్యార్జనలో సహనం ప్రాముఖ్యత [వీడియో]

బిస్మిల్లాహ్

[48:46నిముషాలు]
షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)

ధర్మ జ్ఞానం (మెయిన్ పేజీ)
https://teluguislam.net/others/ilm-knowledge/

సూరతుల్ కహఫ్ తఫ్సీర్ : 4వ భాగం : ఆయతులు 1-3 [వీడియో]

బిస్మిల్లాహ్

[29:55 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

18. సూరా అల్ కహఫ్

18:1  الْحَمْدُ لِلَّهِ الَّذِي أَنزَلَ عَلَىٰ عَبْدِهِ الْكِتَابَ وَلَمْ يَجْعَل لَّهُ عِوَجًا ۜ

ప్రశంసలన్నీ అల్లాహ్‌కు మాత్రమే శోభిస్తాయి. ఆయన తన దాసునిపై ఈ (ఖుర్‌ఆన్‌) గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఇందులో ఎలాంటి వక్రతనూ ఉంచలేదు.

18:2  قَيِّمًا لِّيُنذِرَ بَأْسًا شَدِيدًا مِّن لَّدُنْهُ وَيُبَشِّرَ الْمُؤْمِنِينَ الَّذِينَ يَعْمَلُونَ الصَّالِحَاتِ أَنَّ لَهُمْ أَجْرًا حَسَنًا

పైగా అన్నివిధాలా సరైనదిగా ఉంచాడు – తన వద్దనుంచి విధించబడే కఠినమైన శిక్ష గురించి హెచ్చరించటానికి, మంచి పనులు చేసే విశ్వాసులకు ఉత్తమ ప్రతిఫలం ఉందని శుభవార్తలు ఇవ్వటానికి,

18:3  مَّاكِثِينَ فِيهِ أَبَدًا

అందులో వారు శాశ్వతంగా ఉంటారని (తెలుపటానికి)


సూరతుల్ కహఫ్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – మెయిన్ పేజీ. (అన్నీ పాఠాల కోసం)
https://teluguislam.net/tafsir-kahf/

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran

సూరతుల్ కహఫ్ పారాయణం: సాద్ అల్-ఘమిడి | తెలుగు సబ్ టైటిల్స్: అహ్సనుల్ బయాన్ |వీడియో
https://teluguislam.net/2020/06/25/18-al-kahf

మాటిమాటికీ అల్లాహ్ యొక్క పేరు చెప్పుకొని ప్రజలను అడుగుతూ ఉండటం మంచి విషయం కాదు [వీడియో]

బిస్మిల్లాహ్

[4:32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ధర్మపరమైన నిషేధాలు – 31

31గొప్పవాడైన అల్లాహ్ ఉనికిని ప్రస్తావించి ఏదీ అడగకు. అల్లాహ్ తో అడిగినప్పుడు ఆయన ఉత్తమ నామాల మరియు గుణవిశేషాల ఆధారంతో అడగాలి.

عَنْ أَبِي مُوسَى الأشعَرِيِّ أّنَّهُ سَمِعَ رَسُولَ اللهِ يَقُولُ:  مَلْعُونٌ مَنْ سَأَلَ بِوَجْهِ الله وَمَلْعُونٌ مَنْ سُئِلَ بِوَجهِ الله ثُمَّ مَنَعَ سَائِلَهُ مَا لَم يُسأَلْ هُجرا

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా విన్నట్లు అబూ మూసా అష్అరీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అల్లాహ్ ఉనికిని ప్రస్తావించి అడిగినవాడు శపింపబడ్డాడు. అలాగే అల్లాహ్ అస్తిత్వ ఆధారంతో అడగబడినవాడు కూడా శపింపబడ్డాడు, ఒక వేళ అతను అడిగిన వ్యక్తిని నెట్టేసి అతనికి ఏమీ ఇవ్వకుంటే. అయితే అనవసరమైన, వృధా విషయం అడిగినవాడికి ఇవ్వకపోవడం వల్ల ఈ శాపం పడదు”. (అల్ ముఅజముల్ కబీర్ లిత్తబ్రానీ. సహీహా 2290).

పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

ధార్మిక విద్య ప్రాముఖ్యత & ధార్మిక పండితుల స్థానం [వీడియో]

బిస్మిల్లాహ్

[41:29 నిముషాలు]
షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)

వివాహ ఆదేశాలు -1: నిబంధనలు, ధర్మములు, నిషిద్ధతలు [వీడియో]

బిస్మిల్లాహ్

[35: 50నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

వివాహ నిబంధనలు

1- వధువరుల అంగీకారం: ఒక వ్యక్తి తనకు ఇష్టం లేని స్త్రీతో వివాహం చేసుకొనుటకు అతడ్ని ఒత్తిడి చేయడం, అలాగే ఒక స్త్రీ తనకు ఇష్టం లేని వ్యక్తితో వివాహం చేసుకొనుటకు ఆమెను ఒత్తిడి చేయడం సమంజసం కాదు. స్త్రీ అంగీకారం, ఇష్టాల్ని తెలుసుకోకుండా ఆమె వివాహం చేయుట నుండి ఇస్లాం వారించింది. ఆమె ఏ వ్యక్తితో పెళ్ళి చేసుకోనంటుందో, అతనితోనే చేసుకొనుటకు ఆమెపై ఒత్తిడి వేయడం ఆమె తండ్రికి కూడా యోగ్యం లేదు. (యువతులు తల్లిదండ్రుల్ని ధిక్కరించి వారు ఇష్టపడిన వారితో పెళ్ళి చేసుకోవచ్చు అని దీని భావం ఎంత మాత్రం కాదు).

2- “వలీ”: వలీ లేనిదే పెళ్ళి కాదు. ఎవరైనా చేసుకున్నా అది సరికాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారుః

لاَ نِكَاحَ اِلاَّ بِوَلِيٍّ
వలీ లేనిదే వివాహం కాజాలదు. (తిర్మిజి 1101).

ఎవరైనా స్త్రీ తనంతట తానే వివాహం చేసుకున్నచో ఆ వివాహం సరియైనది కాదు. ఆమె స్వయంగా అఖ్దె నికాహ్ (వివాహ ఒప్పందం) జరుపుకున్నా, లేదా ఎవరినైనా వకీలుగా నియమించి చేసుకున్నా, ఎట్టి పరిస్థితిలో అది నెరవేరదు. ముస్లిం స్త్రీ యొక్క వలీ అవిశ్వాసి కాజాలడు. ఏదైనా మహిళకు వలీ లేని పక్షంలో ఆ మహిళ ఉన్న ప్రాంత ముస్లిం నాయకుడు ఆమెకు వలీగా ఉండి ఆమె వివాహ కార్యాలు నిర్వహిస్తాడు.

వలీ యుక్త వయసుగల, తెలివిగల, నీతిమంతుడైన వధువు యొక్క దగ్గరి బంధువు అయి ఉండాలి. అతను ఆమె తండ్రి, లేదా అతని ‘వసీ’ (వధువు తండ్రి ఎవరికైతే బాధ్యత అప్పగించాడో అతను), లేదా ఆమె తాత (తండ్రి యొక్క తండ్రి), పై వరుసలో ఎంత దగ్గరివారైతే అంత మంచిది. క్రింది వరుసలో ఆమె కొడుకు, అతని కొడుకులు.

వధువు యొక్క స్వంత సోదరుడు. తండ్రి వరుస సోదరుడు, స్వంత సోదరుని కొడుకులు. తండ్రి వరుస సోదరుల కొడుకులు. ఎంత దగ్గరి వారైతే అంత మంచిది.

స్వంత పిన తండ్రి, తండ్రి వరుస పిన తండ్రి, వారి సంతానంలో ఎంత దగ్గరి వారైతే అంత మంచిది. తండ్రి యొక్క పినతండ్రి, అతని సంతానంలో ఎవరైనా. తాత పినతండ్రి, అతని సంతానంలో ఎవరైనా. వీరిలో ఎవరు వలీగా ఉంటాడో అతను తన బాధ్యతలో ఉన్న వధువు అనుమతి తీసుకొని ఆమె అంగీకారం మేరకు వివాహం జరపాలి.

వలీ ఉండడంలో లాభం, ఔచిత్యం వ్యభిచార ద్వారాలను మూసివేయడం. ఎవడైనా వ్యభిచారి ఏదైనా స్త్రీని మోసగించి వచ్చేసెయి మనం పెళ్ళి చేసుకుందామని చెప్పి, వాడే స్వయంగా తన స్నేహితుల్లో ఇద్దర్ని సాక్షులుగా పెట్టి వివాహం చేసుకోలేడు.

3- ఇద్దరు సాక్షులుః నీతినిజాయితీ గల ఇద్దరు, ఇద్దరికన్నా ఎక్కవ ముస్లిములు అఖ్దె నికాహ్ సందర్భంలో తప్పక పాల్గొనాలి. వారు నమ్మదగినవారై ఉండాలి. వ్యభిచారం, మధ్యం సేవించండం లాంటి ఘోర పాపాల (కబీరా గునాహ్)కు గురిఅయినవారు కాకూడదు.

వరుడు లేదా అతని వకీల్ అఖ్ద్ పదాలు ఇలా పలకాలిః మీ కూతురు లేదా మీ బాధ్యతలో ఉన్న ఫలాన స్త్రీ యొక్క వివాహం నాతో చేయండి. వలీ ఇలా అనాలిః నా కూతురు లేదా నా బాధ్యతలో ఉన్న స్త్రీ వివాహం నీతో చేశాను. మళ్ళీ వరుడు ఇలా అనాలిః నేను ఆమెతో వివాహాన్ని అంగీకరించాను. పెండ్లి కుమారుడు తన తరఫున వకీలును నియమించకుంటే అభ్యంతరం లేదు.

4- మహర్ చెల్లించుట విధిగా ఉందిః మహర్ తక్కువ నిర్ణయించుట ధర్మం. ఎంత తక్కువ ఉండి, చెల్లించడం సులభంగా ఉండునో అంతే ఉత్తమం. అఖ్దె నికాహ్ సందర్భంలో మహర్ పరిమాణాన్ని స్పష్ట పరచడం, మరియు అప్పుడే నగదు చెల్లించడమే సున్నత్. పూర్తి మహర్, లేదా కొంత మహర్ తర్వాత చెల్లించినా ఫర్వా లేదు.

ఒకవేళ వధువరులు తొలి రాత్రిలో కలుసుకోక ముందే అతను ఆమెకు విడాకులిస్తే ఆమె సగము మహరుకు హక్కుదారు అవుతుంది. తొలి రాత్రిలో కలుసుకోక ముందే భర్త చనిపోతే ఆమె సంపూర్ణ మహరుకు అధికారిణి అవుతుంది. అలాగే అతని ఆస్తిలో కూడా ఆమె భాగస్తురాలవుతుంది.

భర్త ఇంటి యజమాని, తను సంపాదించి భార్యపిల్లలపై ఖర్చు చేయాలి. అయితే అతను లేదా అతని ఇంటివారు భార్యతో లేదా ఆమె ఇంటివారితో  డబ్బు లేదా ఇతర సామాగ్రి డిమాండ్ చేసి, అడగడం, తీసుకోవడం ఎంతమాత్రం న్యాయం కాదు. వాస్తవానికి ఇది పురుషుత్వానికే మహా సిగ్గుచేటు. దీని విషయంలో ప్రళయదినాన ప్రశ్నించబడతాడు.

వివాహానంతరం

1- నఫఖ (పోషణం): అనగా భార్యకు సముచితమైన రీతిలో తిండి, బట్ట మరియు ఇల్లు సౌకర్యాలు కలిపించడం భర్త బాధ్యత. ఈ విధిలో పిసినారితనం వహించినవాడు పాపాత్ముడవుతాడు. భర్త స్వయంగా ఆమెకు ఖర్చులు ఇవ్వనప్పుడు, భార్య తనకు సరిపడు ఖర్చులు భర్త నుండి తీసుకోవచ్చును. ఒకవేళ ఆమె అప్పు తీసుకున్నా దానిని భర్తే చెల్లించాలి.

నఫఖలో వలీమ కూడా వస్తుంది. అంటే పెళ్ళైన తర్వాత వరుడు ప్రజల్ని ఆహ్వానించి వారికి విందు ఏర్పాటు చేయాలి. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం. ఎందుకనగా ఆయన ఇలా చేశారు. చేయాలని ఆదేశించారు.

2- వారసత్వం: ఎవరైనా ధర్మ పద్ధతిలో ఒక స్త్రీతో వివాహమాడితే వారిద్దరు భార్యభర్తలయ్యారు. పరస్పరం వారసులయ్యారు. అల్లాహ్ ఈ ఆదేశానుసారం: 

[وَلَكُمْ نِصْفُ مَا تَرَكَ أَزْوَاجُكُمْ إِنْ لَمْ يَكُنْ لَـهُنَّ وَلَدٌ فَإِنْ كَانَ لَـهُنَّ وَلَدٌ فَلَكُمُ الرُّبُعُ مِمَّا تَرَكْنَ مِنْ بَعْدِ وَصِيَّةٍ يُوصِينَ بِهَا أَوْ دَيْنٍ وَلَـهُنَّ الرُّبُعُ مِمَّا تَرَكْتُمْ إِنْ لَمْ يَكُنْ لَكُمْ وَلَدٌ فَإِنْ كَانَ لَكُمْ وَلَدٌ فَلَهُنَّ الثُّمُنُ مِمَّا تَرَكْتُمْ مِنْ بَعْدِ وَصِيَّةٍ تُوصُونَ بِهَا أَوْ دَيْنٍ …]. {النساء:12}

మీ భార్యకు సంతానం లేని పక్షంలో, వారు విడిచిపోయిన ఆస్తిలో మీకు అర్థభాగం లభిస్తుంది. కాని వారికి సంతానం ఉంటే అప్పుడు వారు విడిచివెళ్ళిన ఆస్తిలో మీకు నాలుగోభాగం లభిస్తుంది. ఇది వారు వ్రాసిపోయిన వీలునామా అమలుజరిపిన తరువాత, వారు చేసిపోయిన అప్పులు తీర్చిన తరువాత జరగాలి. మీకు సంతానం లేనిపక్షంలో మీరు విడిచిపోయే ఆస్తిలోని నాలుగో భాగానికి వారు (మీ భార్యలు) హక్కుదారులౌతారు. కాని మీరు సంతానవంతులైతే అప్పుడు వారికి ఎనిమిదో భాగం లభిస్తుంది. ఇది మీరు వ్రాసిన వీలునామాను అమలుజరిపిన తరువాత, మీరు చేసిన అప్పులు తీర్చిన తరువాత జరగాలి.” (సూరె నిసా 4: 12).

వారిద్దరి మధ్య సంభోగం జరిగినా జరగకపోయినా, వారిద్దరూ ఏకాంతములో కలుసుకున్నా కలుసుకోకపోయినా సరే పరస్పరం వారసలవుతారు.

వివాహ పద్ధతులు, దాని ధర్మములు

1- ప్రకటనః వివాహం గురించి ప్రకటించుట సున్నత్. వివాహంలో పాల్గొన్నవారు వధువరులను దీవిస్తూ ఈ దుఆ చదవాలిః

بَارَكَ اللهُ لَكَ، وَبَارَكَ عَلَيْكَ، وَجَمَعَ بَيْنَكُمَا فِي خَيْر

బారకల్లాహు లక వ బారక అలైక వ జమఅ బైనకుమా ఫీ ఖైర్. (అల్లాహ్ యొక్క శుభం మీపై ఎల్లప్పుడూ ఉండుగాక, మీ ఇద్దరి వధువరుల మధ్య అల్లాహ్ సర్వ మేళ్ళను సమకూర్చు గాక).

2- దుఆః ఇద్దరూ సంభోగించుకునే ముందు ఈ దుఆ చదువు కోవాలి.

بِسْمِ اللهِ اللَّهُمَّ جَنِّبْنَا الشَّيْطَانَ وَجَنِّبِ الشَّيْطَانَ مَا رَزَقْتَنَا

బిస్మిల్లాహి, అల్లాహుమ్మ జన్నిబ్ నష్షైతాన వ జన్నిబిష్షైతాన మా రజఖ్ తనా. (అల్లాహ్ నామముతో, ఓ అల్లాహ్! మమ్మల్ని మరియు మాకు ప్రసాదించు దానిని (సంతానాన్ని) షైతాను నుండి కాపాడు”.

3- భార్యభర్తలిద్దరూ తమ మధ్య జరిగిన సంభోగ విషయాల గురించి ఎవరికీ చెప్పుకోవద్దు. ఇది చాలా నీచమైన అలవాటు.

4- భార్య హైజ్ (బహిష్టు) లేదా నిఫాస్ (కాన్పు తర్వాత జరుగు రక్త స్రావ కాలం)లో ఉన్నప్పుడు సంభోగించడం నిషిద్ధం. రక్తస్రావం నిలిచాక, ఆమె స్నానం చేయనంత వరకు ఆమెతో సంభోగించ రాదు.

5- భార్య మలద్వారం గుండా సంభోగించడం నిషిద్ధం. అది ఘోర పాపాల్లో లెక్కించబడుతుంది. ఇస్లాం దీనిని కఠినంగా నిషేధించింది.

6- సంభోగంలో భార్యకు సంపూర్ణ తృప్తినివ్వడం తప్పనిసరి. భార్య గర్భం దాల్చ కూడదన్న ఉద్దేశంతో భర్తకు వీర్యము వెళ్తున్నప్పుడు పక్కకు జరిగి వీర్యం పడవేయడం మంచిది కాదు. (దీని వల్ల భార్య సుఖం పొందదు). అలా చేయడం భర్త తప్పనిసరి అని భావిస్తే భార్య అనుమతితో చేయాలి. ఏదైనా అవసరానికే చేయాలి.

భార్య గుణాలు

వివాహ ఉద్దేశం ఒకరు మరొకరితో ప్రయోజనం పొందడం, సత్సమాజ ఏర్పాటు, ఉత్తమ కుటుంబం ఉనికిలోకి రావడం. అందుకు మనిషి ఏ స్త్రీతో వివాహమాడబోతున్నాడో ఆమెలో ఈ ఉద్దేశాలు పూర్తి చేసే అర్హత కలిగి ఉండాలి. దానికి ఆమెలో శారీరక అందముతో పాటు ఆధ్యాత్మిక సుందరం కూడా ఉండాలి. అంటే శారీరకంగా ఏ లోపం లేకుండా ఉండాలి. ఆధ్యాత్మికంగా అంటే సంపూర్ణ ధార్మికురాళుగా, సద్గుణ సంపన్నురాలయి ఉండాలి. ఇలాంటి గుణాల స్త్రీలు లభించిన వారికి మహాభాగ్యం లభించినట్లే. అందుకే ధార్మికురాలు, సుగుణసంపన్నురాలికే ప్రాముఖ్యత ఇవ్వాలి. అదే విధంగా స్త్రీ కూడా తనకు కాబోయే భర్త అల్లాహ్ భయభీతి గలవాడు, సద్గుణసంపన్నుడయిన వాడు కావాలని కాంక్షించాలి.

వివాహనిషిద్ధమైన స్త్రీలు

ఏ స్త్రీలతో వివాహమాడడం నిషిద్ధమో (వారిని మహ్రమాత్ అంటారు) వారు రెండు విధాలుగా ఉన్నారు. (1) శాశ్వతంగా నిషిద్ధమున్నవారు. (2) తాత్కాలికంగా నిషిద్ధమున్నవారు.

(1) శాశ్వతంగా నిషిద్ధమున్నవారు మూడు రకాలుః

1- వంశిక బంధుత్వం:

ఇందులో ఏడు రకాల స్త్రీలున్నారు. వారి ప్రస్తావన అల్లాహ్ సూరె నిసా (4:23)లో చేశాడుః

[حُرِّمَتْ عَلَيْكُمْ أُمَّهَاتُكُمْ وَبَنَاتُكُمْ وَأَخَوَاتُكُمْ وَعَمَّاتُكُمْ وَخَالَاتُكُمْ وَبَنَاتُ الأَخِ وَبَنَاتُ الأُخْتِ …]. {النساء:23}

మీకు ఈ స్త్రీలు నిషేధించబడ్డారుః మీ తల్లులు, మీ కుమార్తెలు, మీ సోదరీమణులు, మీ తండ్రి సోదరీమణులు (మేనత్తలు), మీ తల్లి సోదరీమణులు, మీ సోదరుల కుమార్తెలు, మీ సోదరీమణుల కుమార్తెలు.

         తల్లులు అనగా స్వంత తల్లితో పాటు తండ్రి యొక్క తల్లి (నానమ్మ) మరియు తల్లి యొక్క తల్లి (అమ్మమ్మ).

         కుమార్తెలు అనగా స్వంత కుమార్తెలు, కొడుకు మరియు కూతుళ్ళ కుమార్తెలు (మనమరాళ్ళు). ఇలాగే క్రింది వరకు.

         చెల్లెళ్ళు అనగా స్వంత చెల్లెళ్ళు తండ్రి మరియు తల్లి వరుస చెల్లెళ్ళు.

         మేనత్తలు అనగా స్వంత మేనత్తలు, తండ్రి మేనత్తలు, తాత మేనత్తలు, తల్లి మేనత్తలు, తాతమ్మల మేనత్తలు.

         తల్లి సోదరీమణులు అనగా తల్లి యొక్క స్వంత సోదరీ మణులు, నానమ్మ సోదరీమణులు, తాత చిన్నమ్మలు, అమ్మమ్మ సోదరీమణులు, అమ్మమ్మ చిన్నమ్మలు. ఇలాగే పై వరకు.

         సోదరుల కుమార్తెలు అనగా స్వంత సోదరుల కుమార్తెలు, తండ్రి మరియు తల్లి వరుస గల సోదరుల కుమార్తెలు, సోదరుల మనమరాళ్ళు. ఇలా క్రింది వరకు.

         సోదరీమణుల కుమార్తెలు అనగా స్వంత సోదరీమణుల కుమార్తెలు, తండ్రి మరియు తల్లి వరుస గల సోదరీమణుల కుమార్తెలు, వారి మనమరాళ్ళు. ఇలా క్రింది వరకు.

2- పాల/స్తన్య సంబంధం వల్ల నిషేధింపబడిన స్త్రీలుః

వంశిక బంధుత్వం వల్ల ఏ స్త్రీలు నిషేధింపబడ్డారో స్తన్య (పాల) సంబంధం వల్ల ఆ స్త్రీలే నిషేధింపబడ్డారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని బుఖారి 2645, ముస్లిం 1447లో ఉంది:

يَحْرُمُ مِنَ الرَّضَاعِ مَا يَحْرُمُ مِنَ النَّسَبِ

“అనువంశిక బంధుత్వం వల్ల ఏ విధంగా నిషేధం ఏర్పడుతుందో స్తన్య సంబంధం వల్ల కూడా పరస్పర వివాహం నిషిద్ధమవుతుంది.

కొన్ని నిబంధనలున్నాయి, అవి పూర్తి అయినప్పుడే పాల సంబంధం ఏర్పడుతుంది. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయిః

ఐదు సార్లకంటే ఎక్కువ పాలు త్రాగి ఉండాలి. ఏ బాలుడైనా ఒక స్త్రీ పాలు నాలుగు సార్లు మాత్రమే త్రాగి ఉంటే ఆమె అతనికి తల్లి కాదు.

పాల వయసు దాటక ముందు త్రాగి యుండాలి. అంటే ఐదు సార్లు త్రాగడం అనేది పాల వయసు దాటక ముందు అయి ఉండాలి. ఐదిట్లో కొన్ని, పాల వయసులో మరి కొన్ని తర్వాత త్రాగి ఉంటే పాల సంబంధం ఏర్పడదు. ఆమె అతనికి తల్లి కాదు.

పై నిబంధనలు పూర్తయినప్పుడు పాలు త్రాగిన బాలుడు కొడుకు, పాలిచ్చిన స్త్రీ అతనికి తల్లి అవుతుంది. ఆమె సంతానం అతనికి సోదర సోదరీమణులవుతారు. వారు ఇతనికి ముందు పుట్టిన వారైనా తర్వాత పుట్టిన వారైనా. అలాగే ఆమె భర్త సంతానం కూడా అతనికి సోదర సోదరీమణులవుతారు. వారు ఇతను పాలు త్రాగిన తల్లితో పుట్టినవారైనా లేదా ఇతర భార్యలతో పుట్టినవారైనా. ఇక్కడ ఒక విషయం తప్పక గ్రహించాలి (గమనిక): ఈ పాల సంబంధ బంధుత్వం పాలు త్రాగిన బాలుని మరియు అతని సంతానం వరకే పరిమితం. ఆ బాలుని ఇతర బంధువులకు వర్తించదు.

3- శ్వశుర బంధుత్వం వల్ల నిషేధింపబడిన స్త్రీలుః

(1)   తండ్రి భార్యలు, తాత భార్యలుః ఒక వ్యక్తి ఏ స్త్రీతో అఖ్ద్ చేసుకున్నాడో ఆ స్త్రీ అతని కొడుకులకు, మనమళ్ళకు నిషిద్ధం. ఇలాగే క్రింది వరకు. అఖ్ద్ చేసుకున్న వ్యక్తి ఆమెతో సంభోగించినా, సంభోగించకపోయినా కేవలం అఖ్ద్ వల్ల ఆమె నిషిద్ధమవుతుంది.

(2)   కోడళ్ళుః ఒక వ్యక్తి ఏ స్త్రీతోనయితే అఖ్ద్ చేసుకున్నాడో ఆ స్త్రీ అతని తండ్రి మరియు తాతలకు నిషిద్ధం. తాతలు అంటే తండ్రి యొక్క తండ్రి మరియు తల్లి యొక్క తండ్రి. ఇలాగే పై వరకు. అతను ఆమెతో సంభోగించినా, సంభోగించక పోయినా కేవలం అఖ్ద్ చేసుకున్నంత మాత్రాన ఆమె వారిపై నిషిద్ధం.

(3)  భార్య తల్లి, భార్య నానమ్మలు, అమ్మమ్మలుః ఒక వ్యక్తి ఏ స్త్రీతో అఖ్ద్ చేసుకున్నాడో, సంభోగించక పోయినా అఖ్ద్ చేసుకున్నంత మాత్రాన,  ఆ స్త్రీ యొక్క తల్లి, ఆమె నానమ్మ, అమ్మమ్మలు అతనిపై నిషిద్ధమవుతారు.

(4) భార్య కూతుళ్ళు, భార్య మనమరాళ్ళుః ఒక వ్యక్తి ఏ స్త్రీతోనయితే పెళ్ళి చేసుకొని, ఆమెతో సంభోగించాడో ఆమె కూతుళ్ళు, మనమరాళ్ళు, ఇలా క్రింది వరకు అతని కొరకు నిషిద్ధం. వారు ఇతనికంటే ముందు భర్తతో అయినా, లేదా అతని తర్వాత భర్తతోనయినా. ఒకవేళ అతను ఆమెతో సంభోగించక ముందే విడాకులిస్తే పై పేర్కొన్నవారు అతని కొరకు నిషిద్ధం కారు.

(2) తాత్కలింగా నిషిద్ధమున్న స్త్రీలు

వారు ఈ క్రింది విధంగా ఉన్నారు:

1.భార్య సోదరీమణి, భార్య మేనత్త, భార్య తల్లి యొక్క సోదరీమణిః భార్య ఉండగా వీరితో వివాహం చేసుకోరాదు. భార్య చనిపోతే లేదా ఆమెకు విడాకులిస్తే ఆమె విడాకుల గడువు పూర్తి అయిన తర్వాత వారిని పెళ్ళాడవచ్చును.

2. ఏ స్త్రీ (తన భర్త చనిపోయినందుకు, లేదా విడాకులు పొందినందుకు) గడువులో ఉందో ఆమె ఆ గడువు పూర్తి కాక ముందు ఆమెతో వివాహ- మాడడం, లేదా ఆమెకు వివాహ సందేశం పంపడడం ధర్మసమ్మతం కాదు.

3. హజ్ లేదా ఉమ్రా కొరకు ఇహ్రామ్ స్థితిలో ఉన్న స్త్రీతో వివాహమాడడం ధర్మ సమ్మతం కాదు. ఆమె తన హజ్ లేదా ఉమ్రా సంపూర్ణంగా చేసుకొని ఇహ్రామ్ నుండి హలాల్ అయిన తరువాతనే వివాహమాడాలి.