వడ్డీ నష్టాలు [వీడియో]

బిస్మిల్లాహ్

Evil Effects of Interest, Riba
[53 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

(తీర్పు దినం రోజు) వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయిన వాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణం “వ్యాపారం కూడా వడ్డీలాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్ద నుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతను గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవాధీనం. ఇకమీదట కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు.” [అల్ బఖర – 2 : 275 ]

అల్లాహ్ వడ్డీని హరింపజేస్తాడు. దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్ సుతరామూ ప్రేమించడు.విశ్వసించి (సున్నత్ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్ ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు. ఓ విశ్వసించినవారలారా! అల్లాహ్ కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలిఉన్న వడ్డీని విడిచి పెట్టండి. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరు ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరగకూడదు. ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదిలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీకొరకు శ్రేయోదాయకం.” [అల్ బఖర – 2 : 276 – 280 ]

వడ్డీ తినేవారిని, తినిపించే వారినీ, ఆ వ్యవహారాలు వ్రాసేవారినీ, అందులో సాక్ష్యం పలికేవారందరినీ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శపించారు. ఆ పాపంలో వీరందరూ సమానమే” అని చెప్పారు. (ముస్లిం 1598).

వడ్డీలో 73 స్థాయిలున్నాయి. వాటిలో అత్యంత హీనమైన స్థాయి (దశ) యొక్క పాపం; ఒక వ్యక్తి తన కన్న తల్లిని పెళ్ళాడటం వంటిది. వడ్డీ యొక్క అత్యంత తీవ్రస్థాయి పాపం ఒక ముస్లిం పరువు ప్రతిష్టలను మంటగలపటం”. (ముస్తద్రక్‌ హాకిం: 2/37, సహీహుల్‌ జామి: 3533. ).

బుద్ధిపూర్వకంగా ఒక దిర్హం వడ్డీ తినడం 36 సార్లకంటే ఎక్కువ వ్యభిచారం చేసినదానితో సమానం”. (అహ్మద్‌: 5/225, సహీహుల్‌ జామి:3375).

వడ్డీ ద్వారా ఎంత ధనం వచ్చినా దాని అంతం అల్పంతోనే అవుతుంది”. (అహ్మద్‌: 2/37, సహీహుల్‌ జామి: 3542.)

క్రింద ఇచ్చిన లింకులు కూడా దర్శించండి

ఆత్మహత్య చేసుకున్న ముస్లిం కొరకు జనాజా నమాజు మరియు దుఆ చేయవచ్చా [వీడియో]

బిస్మిల్లాహ్

[3 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

క్రింది ఆడియో కూడా తప్పక వినండి
ఇస్లాం ఆత్మహత్యకు అనుమతిస్తుందా? [ఆడియో]

పరలోకం (The Hereafter) ( మెయిన్ పేజీ)
https://teluguislam.net/hereafter/

ధర్మపరమైన నిషేధాలు – 41 : అల్లాహ్ తన గ్రంథం ద్వారా లేదా ప్రవక్త ద్వారా పంపిన ఏ ఒక్క విషయాన్నీ అసహ్యించుకోకు [వీడియో]

బిస్మిల్లాహ్

[3:43 నిముషాలు]
Do not hate what Allaah has revealed in the book or the Prophets’s sunnah
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మపరమైన నిషేధాలు 41

41- అల్లాహ్ తన గ్రంథం ద్వారా లేదా ప్రవక్త ద్వారా పంపిన ఏ ఒక్క విషయాన్నీ అసహ్యించుకోకు. ఉదాః బహుభార్యత్వం, వడ్డి నిషిద్ధత, జకాత్ (విధిదానం) లాంటివి.

[وَالَّذِينَ كَفَرُوا فَتَعْسًا لَـهُمْ وَأَضَلَّ أَعْمَالَـهُمْ ، ذَلِكَ بِأَنَّهُمْ كَرِهُوا مَا أَنْزَلَ اللهُ فَأَحْبَطَ أَعْمَالَـهُمْ] {محمد:8، 9}

ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగట్టారో వారికి వినాశం తప్పదు. అల్లాహ్ వారి కర్మలను తోవ తప్పించాడు. ఎందుకంటే వారు అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నారు. కనుక అల్లాహ్ వారి కర్మలను వ్యర్థపరిచాడు. (ముహమ్మద్ 47: 8,9).

పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు:

ధర్మపరమైన నిషేధాలు
https://teluguislam.net/?p=1705

ధర్మపరమైన నిషేధాలు – 40 : అల్లాహ్ అవతరించిన దానిని వదలి, వేరే వాటితో తీర్పు చేయకు [వీడియో]

బిస్మిల్లాహ్

[8:15 నిముషాలు]
Ruling by other than what Allaah has revealed
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మపరమైన నిషేధాలు 40

40- అల్లాహ్ అవతరించిన దానిని వదలి, వేరేవాటితో తీర్పు చేయకు [1]. లేదా అందులోని తీర్పుల్లో అన్యాయం, నిరంకుశత్వం, నిర్దాక్షిణ్యం మరియు కఠినాలు ఉన్నాయని, లేదా సంపూర్ణంగా కాకుండా లోపం ఉందని, లేదా వేరే చట్టాలు, తీర్పులు దానికంటే మేలైనవి అని, లేదా దాని లాంటివే మరియు ప్రజలకు ఉత్తమం అయినవని, లేదా అవి ఈ కాలానికి చెల్లవని భావించకు. ఇలాంటి నమ్మకాలన్నియూ అల్లాహ్ తో కుఫ్ర్ (తిరస్కారం) మరియు ధర్మభ్రష్టతకు కారణం అవుతాయి. అల్లాహ్ ఆదేశం చదవండి:

[وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللهُ فَأُولَئِكَ هُمُ الكَافِرُونَ]. {المائدة:44}

అల్లాహ్ అవతరించిన చట్టం ప్రకారం తీర్పు చేయనివారే అవిశ్వాసులు. (మాఇద 5: 44).


[1]  అల్లాహ్ అవతరించినది కాకుండా ప్రజా నిర్మిత చట్టాలు అవలం- బించేవారివి మూడు స్థితులు:

1 అల్లాహ్ యేతరుల చట్టాలతో తీర్పు చేసేవాడు అల్లాహ్ అవతరించిన చట్టం ఈ కాలంలో చెల్లదని, లేదా అది గాకుండా వేరేటివే ఉత్తమం అని, లేదా అది అసంపూర్ణమైనది, అన్యాయం, కఠినత్వంతో కూడినది అని నమ్మితే అతడు అవిశ్వాసి అయినట్లే, ఇస్లాం నుండి వైదొలగినట్లే, ధర్మభ్రష్టతకు గురి అయినట్లే. ఇంకా అతడు ఘోర విచ్ఛిన్నకారుడు మరియు అల్లాహ్ తో పోరాటానికి దిగినవాళ్ళల్లో అతి నీచుడు.

[وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللهُ فَأُولَئِكَ هُمُ الكَافِرُونَ].

అల్లాహ్ అవతరించిన చట్టం ప్రకారం తీర్పు చేయనివారే అవిశ్వా- సులు. (మాఇద 5: 44).    

2- ఎవరైతే అల్లాహ్ అవతరించిన చట్టమే అతిఉత్తమమైనదని, సంపూర్ణమైనదని నమ్మి కూడా తన కోరిక తీర్చుకొనుటకు లేదా ఏదైనా వాంఛకు లోనై, వేరే చట్ట ప్రకారం తీర్పు చేస్తే అతడు అవిశ్వాసి కాడు, ధర్మభ్రష్తతకైతే అంతకూ గురికాడు. పోతే అల్పవిశ్వాసిగా మరియు అల్లాహ్ ఇష్టానికి వ్యతిరేక మార్గాన్ని అవలంబించినవాడవుతాడు.

[وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللهُ فَأُولَئِكَ هُمُ الفَاسِقُونَ].

అల్లాహ్ అవతరించిన చట్టం ప్రకారం తీర్పు చేయనివారే దుర్మార్గులు. (మాఇద 5: 47).           

3- అల్లాహ్ అవతరించినదానితో తీర్పు చేయుటయే విధిగా అని నమ్మి కూడా దౌర్జన్యపరుడైన అధికారి, రాజుకు లేదా కరడుగట్టిన శత్రువు- లకు భయపడి వేరే చట్టాల ప్రకారం తీర్పు చేస్తే అతడు తన పట్ల అన్యాయం చేసుకున్నవాడు మరియు అసంపూర్ణ విశ్వాసిగా పరిగణింపబడతాడు.

[وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللهُ فَأُولَئِكَ هُمُ الظَّالِـمُونَ].

అల్లాహ్ అవతరించిన చట్టం ప్రకారం తీర్పు చేయనివారే దౌర్జన్యపరులు, అన్యాయులు.(మాఇద 5: 45).

పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు:

ధర్మపరమైన నిషేధాలు
https://teluguislam.net/?p=1705

ధర్మపరమైన నిషేధాలు – 38 : ఖుర్ఆన్, ప్రవక్త, ధర్మం మరియు ధర్మ విషయాలతో పరిహాసమాడకు, ఎగతాళి చేయకు [వీడియో]

బిస్మిల్లాహ్

[5:38 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మపరమైన నిషేధాలు 38

38- పరిహాసమాడకు. ఖుర్ఆన్, ప్రవక్త, ధర్మం మరియు ధర్మ-విషయాలతో పరిహాసమాడకు, ఎగతాళి చేయకు, హీనపరచకు [1]. అది (వేరే దురుద్దేశం లేకుండా) కేవలం నవ్వు పుట్టించుటకైనా సరే. ధర్మవిద్యతో లేదా ధార్మిక విద్యార్థులతో పరిహాసమాడుట [2]. మంచిని ఆదేశించి, చెడును నివారించే వారితో పరిహాసమాడుట. గడ్డం, మిస్వాక్ మరియు తదితర ధర్మవిషయాలతో పరిహాసమాడుట అల్లాహ్ తో కుఫ్ర్ చేసినట్లగును.

అల్లాహ్ ఆదేశం:

[وَلَئِنْ سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ قُلْ أَبِاللهِ وَآَيَاتِهِ وَرَسُولِهِ كُنْتُمْ تَسْتَهْزِئُونَ ، لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُمْ بَعْدَ إِيمَانِكُمْ]. {التوبة 65، 66}.

మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి? అని ఒకవేళ వారిని అడిగితే, మేము సరదాగా వేళాకోళంగా మాట్లాడుకుంటున్నాము అని తక్షణం బదులు చెబుతారు. వారితో ఇలా అనుః మీ వేళాకోళం, అల్లాహ్ తోనా ఆయన ఆయతులతోనా, ఆయన ప్రవక్తతోనా? ఇక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వా-సానికి పాల్పడ్డారు[. (తౌబా 9: 65,66).


[1] పరిహాసమాడుతూ తిరస్కరించుట, విడనాడి తిరస్కరించుటకంటే మరీ చెడ్డది. ఉదాః నమాజు వదిలే వ్యక్తి, లేదా విగ్రహానికి సాష్టాంగ- పడే వ్యక్తి కేవలం తిరస్కారానికి గురవుతాడు. కాని పరిహసించే వ్యక్తి తిరస్కారంతో పాటు పరిహాసానికి గురవుతాడు.

[2] ధర్మవేత్తలతో, ధర్మంపై నడిచేవారితో మరియు ధర్మం వైపునకు పిలిచేవారితో పరిహాసమాడేవారు రెండు రకాల భ్రష్టత్వానికి గురి అవుతారు.

1- అతని ఉద్దేశ్యంలో నేరుగా ధర్మాన్ని, రుజువైన ప్రవక్త సంప్రదాయాల్ని; ఉదాః గడ్డం ఉంచడం, లుంగీ, లాగు చీలమండలానికి పైకి ధరించడం లాంటివి ఉంటే ఇది కుఫ్ర్ (సత్యతిరస్కారం) అవుతుంది. అంతే గాకుండా ఒక ముస్లిం సోదరుడ్ని హీనపరచడం అన్నది అతను (హీనపరిచేవాడు) చెడు అన్నదానికి నిదర్శనం.

2-  అతడు వారి ధార్మిక జీవన శైలిని గాకుండా వారిని, వారి కొన్ని చేష్టల్ని ఉద్దేశించి పరిహసిస్తే పాపాత్ముడవుతాడు కాని కాఫిర్ కాడు.

పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు:

ధర్మపరమైన నిషేధాలు
https://teluguislam.net/?p=1705

మంచిని ఆదేశించడంతో పాటు, చెడును ఖండించడం తప్పనిసరి [వీడియో]

బిస్మిల్లాహ్

[5:33 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మ ప్రచారం (దావా) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/dawah/

మనిషి తనకు తాను చెడు నుంచి దూరంగా ఉండటానికి ఏమి చేయాలి? [వీడియో]

బిస్మిల్లాహ్

[6:10 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

పాపాలు (Sins) మెయిన్ పేజీ
https://teluguislam.net/sins/

“మేము చేస్తున్న చెడ్డ పనులు ఎవరూ చూడటంలేదు కదా” అనే వారికి హెచ్చరిక [వీడియో]

బిస్మిల్లాహ్

[5:11 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

పాపాలు (Sins) మెయిన్ పేజీ
https://teluguislam.net/sins/

ధర్మపరమైన నిషేధాలు – 33: నీ పాపాలు ఎంత ఉన్నా సరే అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకు [వీడియో]

బిస్మిల్లాహ్

నీ పాపాలు ఎంత ఉన్నా సరే అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకు
https://youtu.be/7lDpeGcBXHY [5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

మనిషి ఎన్ని పాపాలు చేసినా సరే, అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకూడదు. పాపాల నుండి పశ్చాత్తాపం (తౌబా) చెంది, వాటిని విడిచిపెట్టాలి కానీ, అల్లాహ్ క్షమాపణపై ఎన్నడూ నిరాశ చెందరాదు. ఎందుకంటే నిరాశ చెందడం అవిశ్వాసుల మరియు మార్గభ్రష్టుల లక్షణం. ఖుర్ఆన్ మరియు ప్రవక్త ఉపదేశాలు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అల్లాహ్ పాపులను కూడా ప్రేమగా “ఓ నా దాసులారా” అని సంబోధిస్తూ, తన కారుణ్యం పట్ల నిరాశ చెందవద్దని ఆదేశించాడు. నిరాశ చెందవద్దు అనేదానికి అర్థం పాపాలు చేస్తూ ఉండమని కాదు, చేసిన పాపాల గురించి అల్లాహ్ క్షమించడేమో అని దిగులు చెందకుండా, పశ్చాత్తాపంతో ఆయన వైపు మరలాలని అర్థం.

33వ విషయం, నీ పాపాలు ఎంత ఉన్నా సరే అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకు. అల్లాహు అక్బర్. సోదర మహాశయులారా, ఇది చాలా ముఖ్యమైన విషయం దీన్ని గమనించండి. పాపాలు ఎన్ని ఉన్నా గాని, పాపాల నుండి మనం తౌబా చేసుకోవాలి, పాపాలను విడనాడాలి, కానీ అల్లాహ్ యొక్క కారుణ్యం నుండి ఎప్పుడూ కూడా నిరాశ చెందకూడదు.

ఎప్పుడైతే మనిషి అల్లాహ్ యొక్క కారుణ్యానికి దూరం అయినట్లుగా తనకు తను భావించి, అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందుతాడో, అక్కడి నుండి అతడు చాలా నష్టపోతూ ఉంటాడు, మరింత పాపాల్లో కూరుకుపోతాడు, పుణ్యాలకు దూరమవుతాడు. అందుకొరకు పాపాలు ఎన్ని ఉన్నా గానీ నిరాశ చెందకూడదు. ఈ నిరాశ చెందడం అనేది విశ్వాసుల గుణం ఎంత మాత్రం కాదు.

అల్లాహుతాలా సూరత్ యూసుఫ్, ఆయత్ నెంబర్ 87లో తెలిపాడు.

إِنَّهُ لَا يَيْأَسُ مِن رَّوْحِ اللَّهِ إِلَّا الْقَوْمُ الْكَافِرُونَ
(ఇన్నహూ లా యైఅసు మిర్ రౌహిల్లహి ఇల్లల్ ఖౌముల్ కాఫిరూన్)
అల్లాహ్ యొక్క కారుణ్యం పట్ల అవిశ్వాసులు మాత్రమే నిరాశ చెందుతారు.

అంతేకాకుండా సూరత్ అల్-హిజ్ర్ లో ఆయత్ నెంబర్ 56, అల్లాహుతాలా తెలిపాడు.

وَمَن يَقْنَطُ مِن رَّحْمَةِ رَبِّهِ إِلَّا الضَّالُّونَ
(వమై యఖ్నతు మిర్రహ్మతి రబ్బిహీ ఇల్లద్ దాల్లూన్)
అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందేవారు మార్గభ్రష్టులు, సన్మార్గం నుండి దూరమైన వారు.

గమనించండి, అల్లాహుతాలా ఇందులో దుర్మార్గంలో పడిపోతారు వారు అని హెచ్చరించాడు కదా. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రత్యేకంగా మరియు విశ్వాసులందరికీ ఇచ్చిన ఆదేశం ఏంటి?

فَلَا تَكُن مِّنَ الْقَانِطِينَ
(ఫలా తకుమ్ మినల్ ఖానితీన్)
మీరు నిరాశ చెందిన వారిలో చేరకండి, వారిలో కలవకండి.

రెండుసార్లు నేను ఈ ఆయత్ ను చదివాను, మొదటిసారి పారాయణంలో చదవడంలో చిన్న తప్పు జరిగింది. ఆ చిన్న తప్పు అనేది అరబీలో భావంలో ఎంతో వ్యత్యాసాన్ని చూపిస్తుంది. القانتين ‘ అని అంటే, ఎంతో భక్తితో అల్లాహ్ యొక్క ఆరాధన చేసేవారు. ‘తీన్’ ‘తా’ తోని వస్తుంది, ‘ఖానితీన్’. కానీ ఇక్కడ, الْقَانِطِينَ ‘ ‘త్వా’, నిరాశ చెందడం. అల్లాహు అక్బర్. అందుకొరకు అరబీ భాష కనీసం ఖుర్ఆన్ చదివే విధంగా నేర్చుకోవడం చాలా అవసరం అని మేము నొక్కి చెబుతూ ఉంటాము.

ఈ విధంగా సోదర మహాశయులారా, ఖుర్ఆన్లో చూసుకుంటే ఎన్నో ఆయత్ లు ఉన్నాయి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మనకు నిరాశ చెందడం నుండి వారించారు. పాపాలు ఎన్ని ఉన్నా సరే నిరాశ చెందకూడదు. ప్రత్యేకంగా సూరతు జ్జుమర్ లో అల్లాహుతాలా దీని గురించి ఎంతో స్పష్టంగా చెప్పి ఉన్నాడు, ఆయత్ నెంబర్ 53.

قُلْ يَا عِبَادِيَ الَّذِينَ أَسْرَفُوا عَلَىٰ أَنفُسِهِمْ لَا تَقْنَطُوا مِن رَّحْمَةِ اللَّهِ
(ఖుల్ యా ఇబాదియల్లజీన అస్ రఫూ అలా అన్ఫుసిహిమ్ లా తఖ్నతూ మిర్ రహమతిల్లాహ్)
ఎవరైతే తమపై తాము అన్యాయం చేసుకున్నారో. అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి.

గమనించండి, పాపాలు చేసిన వారితో అల్లాహుతాలా ఎలా సంబోధిస్తున్నాడు? “ఓ నా దాసులారా!”

أَسْرَفُوا عَلَىٰ أَنفُسِهِمْ
(అస్ రఫూ అలా అన్ఫుసిహిమ్)
ఎవరైతే తమపై తాము అన్యాయం చేసుకున్నారో.

لَا تَقْنَطُوا مِن رَّحْمَةِ اللَّهِ
(లా తఖ్నతూ మిర్ రహమతిల్లాహ్)
అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి.

గుర్తుంటుంది కదా మీకు? పాపాలు ఎన్ని ఉన్నా గానీ నిరాశ చెందకూడదు. కానీ, స్టాప్. శ్రద్ధ వహించండి ఒక నిమిషం.

పాపాలు ఎన్ని ఉన్నా గానీ నిరాశ చెందకండి అంటే, ఇంకా పాపాలు చేసుకుంటూ పోండి పరవాలేదు అన్న భావం కాదు. అయ్యో ఇన్ని పాపాలు అయిపోయాయి, అల్లాహ్ క్షమిస్తాడో లేదో, ఇలా అనుకోకండి. ఇంత పెద్ద నేరం చేశాను నేను, నా లాంటి దుర్మార్గుడ్ని అల్లాహ్ మన్నిస్తాడా? ఇలా భావించకండి. అల్లాహ్ తో క్షమాపణ కోరుకోండి, తౌబా చేయండి, ఇస్తిగ్ ఫార్ చేయండి. ఇది భావం.

పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

పడుకునే ముందు ఈ చిన్న జిక్ర్ చేస్తే సముద్రపు నురుగంత పాపాలు కూడా మన్నించబడతాయి [వీడియో]

బిస్మిల్లాహ్

[1:39 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు [పుస్తకం]
https://teluguislam.net/2019/11/16/day-night-important-duas/

ఉదయం సాయంత్రం ప్రార్ధనలు (Morning Evening Supplications) [పుస్తకం]
https://teluguislam.net/2010/11/27/morning-evening-supplication-telugu-islam/