100 సార్లు చదివితే 5 రకాల గొప్ప లాభాలు [వీడియో]

బిస్మిల్లాహ్

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ المُلْكُ وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ

లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌దహూ, లా షరీక లహూ, లహుల్‌ ముల్కు వలహుల్‌ హమ్దు, వహువ అలా కుల్లి షైఇన్‌ ఖదీర్‌.

అల్లాహ్‌ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే. సర్వ స్తోత్రములు ఆయనకే చెల్లును, ఆయనే  అన్నింటి పై అధికారం కలవాడు.
(బుఖారీ, ముస్లిం).

ఎవరైతే దీనిని రోజు వందసార్లు పఠిస్తారో అతడు పదిమంది బానిసలను విముక్తి చేసినట్లు అతడికి వ్రాయబడతాయి. వంద పుణ్యాలు లభిస్తాయి. అతని వంద తప్పులు తుడిచి వేయబడతాయి. అతడికి అది ఆరోజంతా ప్రొద్దుగూకే వరకు షైతాను బారినుండి రక్షణవుతుంది. మరియు అతడు ఖయామత్‌ రోజున తీసుకుని వచ్చే ఈ ఆచరణ కంటే శ్రేష్టమైనది మరెవ్వరూ తీసుకుని రాలేరు కాని దీనికంటే ఎక్కువ ఆచరించిన వారుతప్ప.

[అల్‌బుఖారీ 4/95 మరియు ముస్లిం  4/2071]

మండుటెండల్లో ఉపవాసాల ప్రాముఖ్యత [ఆడియో]

బిస్మిల్లాహ్

[19:20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఎండ తీవ్రత పెరిగిన రోజుల్లో ఉపవాసం ఉండడం ఎంతో సహన స్థైర్యాలతో కూడిన పని.

సహనం మూడు రకాలుగా ఉంటుంది:

  • (1) అల్లాహ్ ఆరాధన ఉద్దేశంతో ఉపవాసం పాటిస్తూ సహనం.
  • (2) అల్లాహ్ ఉపవాస స్థితిలో నిషేధించిన వాటికి దూరంగా ఉంటూ సహనం.
  • (3) ఉపవాస స్థితిలో ఆకలి దప్పులను మరియు మనోవాంఛల్ని అదుపులో పెట్టకోడానికి సహనం.

ఈ మూడు రకాలు ఉపవాసములో ఉన్నాయి. అందుకే సహనం యొక్క సత్ఫలితం లెక్కలేనంత లభించునని అల్లాహ్ శుభవార్త ఇచ్చి యున్నాడు.

إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُم بِغَيْرِ حِسَابٍ

సహనం వహించేవారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదించబడుతుంది. (జుమర్ 39:10)

తీవ్ర ఎండకాలంలో ఉపవాసం పాటించడం మన సహాబాల సదాచారం:

హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ (రజియల్లాహు అన్హు) తీవ్ర ఎండకాలంలో నఫిల్ ఉపవాసాలు ఉండేవారు.

ముఆజ్ (రజియల్లాహు అన్హు) తన మరణ సమయంలో అన్నారు: “చావు వల్ల బాధ లేదు, ప్రతి ఒక్కరికీ రానుందే, కాని ఆ ఎండ తాపాన్ని భరిస్తూ ఉండే ఉపవాసాలు ఇక ఉండలేను కదా అని బాధ.”

ఉమర్ (రజియల్లాహు అన్హు) మరణించే ముందు తన సుకుమారుడైన అబ్దుల్లాహ్ కు చేసిన వసియ్యత్: “నీవు విశ్వాస ఉత్తమ గుణాల్ని అవలంభించు: వాటిలో మొదటిది తీవ్ర ఎండకాలంలో ఉపవాసాలు పాటించు” అని చెప్పారు.

ఆయిషా (రజియల్లాహు అన్హా) ఎండకాలంలో ఉపావాసాలుండేవారు.

ప్రియపాఠకుల్లారా! పైన సహాబాల కొన్ని ఉదారహణలు ఏవైతే తెలిపానో అవి వారి నఫిల్ ఉపవాసాల విషయం. రమజాను యొక్క ఫర్జ్ ఉపవాసాలైతే ఎలాగైనా ఉండేవారు. ఈ రోజుల్లో మనలో అనేక మంది రమజాను ఉపవాసాలకు ఎండలు బాగున్నాయి కదా అని, ఉండకూడని సాకులు వెతుకుతారు. కాని సహాబాలు ప్రయాణాలు చేసుకుంటూ, అంతే కాదు తీవ్ర ఎండకాలంలో యుద్ధాలు చేసుకుంటూ కూడా ఉపవాసాలు పాటించారు. తబూక్ యుద్ధం ఏ కాలంలో ఏ పరిస్థితుల్లో జరిగిందో తెలుసా? మండుతున్న ఎండలు, పండుతున్న ఖర్జూరాలు, కోతకు వచ్చిన ఖర్జూరాలు గనక చేతులో చిల్లి గవ్వ లేని పరిస్థితి ఎందరిదో! అప్పుడు కొంతమంది కపటవిశ్వాసులు తప్పించుకునే ఉద్దేశంతో ఈ తీవ్ర ఎండల్లో ఎలా బయలుదేరాలి అని సాకులు చెబుతూ,[لَا تَنفِرُوا فِي الْحَرِّ] (ఇంత తీవ్రమైన ఎండ వేడిలో బయలుదేరకండి) అని ఇతరులను ఆపే ప్రయత్నం చేశారు, అప్పుడు అల్లాహ్ తెలిపాడు:

قُلْ نَارُ جَهَنَّمَ أَشَدُّ حَرًّا لَّوْ كَانُوا يَفْقَهُونَ

“నరకాగ్ని ఇంతకన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది” అని వారికి చెప్పు. ఆ సంగతిని వారు గ్రహిస్తే ఎంత బావుండు!” (తౌబా 9:81).

హజ్జాజ్ ఒక ప్రయాణంలో మక్కా మదీనాల మధ్య నీళ్ళున్న చోట మజలీ చేశాడు, పగటి భోజనం తీసుకరమ్మని చెప్పాడు, సమీపంలో ఓ ఎడారివాసి (బద్దూ) కనబడగా అతడ్ని పగటి భోజనానికి ఆహ్వానించాడు, అతడన్నాడు: నీకంటే మేలైనవాడు నన్ను ఆహ్వానిస్తే నేను అతని ఆహ్వానాన్ని స్వీకరించాను. అతడెవుడు అని హజ్జాజ్ అడిగాడు, బద్దూ చెప్పాడు: అల్లాహ్! ఉపవాసముండమని చెప్పాడు, నేను ఉపవాసమున్నాను. ఈ మండుతున్న ఎండలోనా ఉపవాసం అని హజ్జాజ్ ఆశ్చర్యంగా అడిగాడు, అతడన్నాడు: “అవును, దీనికంటే మరీ విపరీతమైన ప్రళయం నాటి ఆ వేడి నుండి రక్షణ కొరకు ఉపవాసమున్నాను” అని చెప్పాడు. ఈ సమాధానం విని హజ్జాజ్ చెప్పాడు: “నఫిల్ ఉపవాసమే గనక ఈనాటి ఉపవాసం వదులుకో, నాతో కలసి భోజనం చేయి, రేపటి రోజు ఉపవాసం ఉండు”. అప్పుడు ఆ ఎడారివాసి “రేపటి రోజు వరకు నేను బ్రతికుంటానని జమానతు (గ్యారంటీ) ఇవ్వగలవా” అని అడిగాడు. ఆ జమానతు నేనివ్వలేనని హజ్జాజ్ చెప్పాడు.

గమనించారా పాఠకుల్లారా! మనిషి విశ్వాసపరంగా ఎంత బలంగా ఉండునో, మనస్థైర్యం ఎంత దృఢంగా ఉండునో అంతే ఎండల్ని ఓర్చుకోనైనా ఉపవాసాలు ఉండగలుగుతాడు.

మండుటెండల్లో ఉపవాసం యొక్క మాటే వేరు. దాని రుచి, దాని అనూన్యమైన ఆహ్లాదం సౌభాగ్యులకు, అదృష్టవంతులకే లభిస్తుంది. చెప్పుకుంటు పోతే సలఫె సాలిహీన్ లో ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి.

కాని చివరిలో ఒకే ఒక విషయం గుర్తు చేస్తాను, శ్రద్ధగా బుద్ధిపూర్వకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి: అదేమిటంటే: ప్రళయం నాడు సూర్యుడు అతి సమీపంలో ఉంటాడో, 50 వేల సంవత్సరాలకంటే దీర్ఘకాలం అది, ప్రతి ఒక్కడు తన పాదాన్ని కదిలించలేని స్థితిలో ఉంటాడు, ప్రతి ఒక్కడు తన పాపాల పరిమాణంలో తన చెమటలో మునిగి ఉంటాడు, ఛాయ ఎక్కడా ఉండదు, కేవలం అల్లాహ్ అర్ష్ ఛాయ తప్ప. ఇన్నీ ఘోరమైన పరిస్థితులను ఎదురుకునే శక్తి నీలో ఏమైనా ఉందా? లేదు, ముమ్మాటికీ లేదు!!!

ఇక దేనికి ఆలస్యం ఉపవాసం ఉండడంలో.


కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
ZFGO జుల్ఫీ దావా సెంటర్ – సౌది అరేబియా

తిన్న తర్వాత, త్రాగిన తర్వాత అల్‌హందు లిల్లాహ్‌ అనండి

తిన్నత్రాగిన తర్వాత అల్‌ హందులిల్లాహ్‌ అనండి: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారని అనస్‌ బిన్‌ మాలిక్‌ ఈ ఉల్లేఖించారు: “మానవుడు ఏదైనా తిన్న తర్వాత లేదా ఏదైనా త్రాగిన తర్వాత అల్‌ హందు లిల్లాహ్‌ అనడం అల్లాహ్‌కు చాలా ఇష్టం. (ముస్లిం 2734). [పుణ్యఫలాలు| ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ].

ఫజ్ర్ కు ముందు సున్నతుల ఘనత [ఆడియో క్లిప్]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (30 సెకండ్లు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


ఫజ్ర్‌ నమాజుకు ముందు రెండు రకాతులు:

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు:

عَنْ عَائِشَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: رَكْعَتَا الْفَجْرِ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا فِيهَا

“ఫజ్ర్‌కు ముందు రెండు రకాతులు ప్రపంచము మరియు అందులో ఉన్నవాటి కంటే ఉత్తమమైనవి”. (ముస్లిం 725).

నాతో పాటు మీరు కూడా ఈ హదీసుపై శ్రద్ధ చూపండి: ఫజ్ర్‌ సున్నతులు ప్రపంచం, వాటిపై ఉన్న డబ్బు, ధనము,బిల్జింగులు, కార్ల కంటే చాలా మేలైనవి.

నమాజు నిధులు (Treasures of Salah) అను పుస్తకం నుండి


ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది; “ఆ రెండు రకాతులు నాకు ప్రపంచమంతటి కన్నా ప్రియమైనవి.”

عَنْ عَائِشَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنَّهُ قَالَ فِي شَأْنِ الرَّكْعَتَيْنِ عِنْدَ طُلُوعِ الْفَجْرِ: «لَهُمَا أَحَبُّ إِلَيَّ مِنَ الدُّنْيَا جَمِيعًا» مسلم 725

 


జుమా రోజులో ఒక మహత్తరమైన ఘడియ ఉంది [ఆడియో & హదీసులు]

బిస్మిల్లాహ్

(8:12 నిముషాలు )
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


وعنه أن رسول الله صلى الله عليه وسلم ، ذكر يوم الجمعة، فقال‏:‏ ‏ “‏فيها ساعة لا يوافقها عبد مسلم، وهو قائم يصلي يسأل الله شيئًا، إلا أعطاه إياه‏”‏ وأشار بيده يقللها، ‏(‏‏(‏متفق عليه‏)‏‏)‏ ‏.

1157. హజ్రత్‌ అబూహురైరా (రది అల్లాహు అన్హు)గారు చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒకసారి జుమా గురించి చెబుతూ ఇలా అన్నారు: “ఆ రోజులో ఒక ఘడియ ఉంది. ఏ ముస్లిం దాసుడయినా ఆ ఘడియను పొంది, ఆ సమయంలో అతను నిలబడి నమాజు చేస్తూ అల్లాహ్‌ ను ఏదయినా అడిగితే అల్లాహ్‌ తప్పకుండా ఇస్తాడు.” ఆ సమయం చాలా తక్కువగా ఉంటుందని ఆయన తన చేత్తో సంజ్ఞ చేసి చూపించారు.

(బుఖారీ-ముస్లిం) (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలోని జుమా ప్రకరణం)

ముఖ్యాంశాలు

శుక్రవారం రోజుకి సంబంధించిన మరొక మహత్యాన్ని ఈ హదీసులో పొందుపరచటం జరిగింది. ఆ రోజులో ఒక మహత్తరమైన ఘడియ ఉంది. ఆ ఘడియలో భక్తులు చేసుకునే విన్నపాలను అల్లాహ్‌ తప్పకుండా మన్నిస్తాడు. ఆ ఘడియ చాలా తక్కువగా ఉంటుంది.

అదీగాక ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అందుకని ఆ మహాభాగ్యాన్ని పొందాలంటే ఆ రోజు మొత్తం అత్యధికంగా అల్లాహ్ ను ధ్యానిస్తూ, ప్రార్థనలు, విన్నపాల్లో నిమగ్నులై ఉండాల్సిందే.


وعن أبي بردة بن أبي موسى الأشعري، رضي الله عنه، قال‏:‏ قال عبد الله بن عمر رضي الله عنهما‏:‏ أسمعت أباك يحدث عن رسول الله صلى الله عليه وسلم ، في شأن ساعة الجمعة‏؟‏ قال‏:‏ قلت‏:‏ نعم، سمعته يقول‏:‏ سمعت رسول الله صلى الله عليه وسلم ، يقول‏:‏ ‏ “‏هي ما بين أن يجلس الإمام إلى أن تقضى الصلاة‏”‏ ‏(‏‏(‏رواه مسلم‏)‏‏)‏‏.

1158. హజ్రత్‌ అబూ బుర్దా బిన్‌ అబూ మూసా అష్‌ అరీ (రది అల్లాహు అన్హు) కథనం: ఒకసారి అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు) నాతో మాట్లాడుతూ “శుక్రవారం నాటి ఘడియ గురించి మీ నాన్న ఏదయినా దైవప్రవక్త హదీసు చెప్పినప్పుడు నువ్వు విన్నావా?” అని అడిగారు. దానికి నేను సమాధానమిన్తూ, “విన్నాను ఆ ఘడియ ఇమామ్‌ వేదికపై కూర్చున్నప్పటి నుంచి నమాజ్‌ ముగిసేవరకు మధ్య కాలంలో ఉంటుందని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధిస్తుండగా తాను విన్నానని మా నాన్నగారు చెప్పారు” అని అన్నాను.

(ముస్లిం) (సహీహ్  ముస్లిం లోని జుమా ప్రకరణం)

ముఖ్యాంశాలు

శుక్రవారం రోజు ఆ ఘడియ ఎప్పుడొస్తుందనే విషయమై పండితుల మధ్య భిన్నాభి ప్రాయాలున్నాయి. కొంతమంది పండితులు పై హదీసును నిదర్శనంగా చేసుకొని ప్రార్థనలు స్వీకరించబడే ఆ శుభఘడియ శుక్రవారం రోజు ఇమామ్‌ ఖుత్బా కొరకు వేదికపై కూర్చున్నప్పటి నుంచి నమాజు ముగిసేవరకు మధ్యకాలంలో ఉంటుందనీ, అన్నింటికన్నా బలమైన అభిప్రాయం ఇదేనని అన్నారు. అయితే షేఖ్‌ అల్‌బానీ తదితర హదీసువేత్తలు అబూ మూసా (రది అల్లాహు అన్హు) వివరించిన ఈ హదీసుని ‘మౌఖూఫ్‌‘గా పేర్కొన్నారు. అంటే ఈ హదీసుని తాను నేరుగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుంచి విన్నారో లేదో ఆయన అనుచరుడు తెలుపలేదని దాని భావం. (వివరాల కోసం షేఖ్‌ అల్‌బానీ చేత పరిశోధించబడిన “రియాజుస్సాలిహీన్‌’ గ్రంథం చూడండి). అందుకే మరికొంతమంది పండితులు అబూదావూద్‌ మరియు నసాయి గ్రంథాల్లోని వేరొక హదీసుని ప్రాతిపదికగా చేసుకొని ఆ శుభఘడియ అస్ర్‌ మరియు మగ్రిబ్‌ నమాజుల మధ్యకాలంలో ఉంటుందని తలపోశారు. ఆ హదీసులో శుక్రవారం రోజు ఆ శుభఘడియను అస్ర్‌ నమాజ్‌ తర్వాత చివరివేళలో అన్వేషించమని ఆదేశించటం జరిగింది. మొత్తానికి ఆ ఘడియ నిర్ణయం అస్పష్టంగానే మిగిలిపోయింది కనుక ఆ రోజు సాంతం అత్యధికంగా దైవధ్యానంలో నిమగ్నులై ఉండటానికి ప్రయత్నించటం అన్ని విధాలా శ్రేయస్కరం.


నుండి: జుమానాటి ఘనత , జుమా నమాజు – హదీసులు – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ )

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

నిద్ర లేశారు, పాపాలు దూరమయ్యాయి! [వీడియో]

బిస్మిల్లాహ్

[కేవలం 3 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

dua wakeup sleep

నిద్ర మధ్యలో మేల్కొన్న వ్యక్తి చదవవలసిన దుఆ:

“ఎవరు రాత్రి వేళ నిద్ర నుండి మేల్కొని ‘లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీకలహూ, లహుల్‌ ముల్కు వలహుల్‌ హందు, వహువ అలా కుల్లి షైఇన్‌ ఖదీర్‌. అల్‌ హందులిల్లాహ్‌, వ సుబ్‌ హానల్లాహ్‌, వల్లాహు అక్బర్‌, వలాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్‌‘ చదివి, (అల్లాహుమ్మగ్ ఫిర్లీ) ‘అల్లాహ్‌ నన్ను క్షమించు’ అని లేదా మరేదైనా దుఆ చేసుకున్నచో అది అంగీకరింపబడుతుంది. ఒకవేళ వుజూ చేసుకొని నమాజ్‌ చేస్తే అదీ స్వీకరించబడుతుంది”

అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారని అబూ హురైర (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 1154).

[ఇది శత సాంప్రదాయాలు (100 Sunnah) పుస్తకం లోని 4 వ టాపిక్]

దరూద్ చదవండి ప్రవక్త సిఫారసు పొందండి [వీడియో]

బిస్మిల్లాహ్

[1 నిమిషం వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Video Courtesy: Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

ఉదయం పదిసార్లు, సాయంత్రం పదిసార్లు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠిస్తే, (ప్రళయ దినాన) ఆయన సిఫారసు భాగ్యం లభిస్తుంది.

عَنْ أَبِي الدَّرْدَاءِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ ﷺ: «مَنْ صَلَّى عَلَيَّ حِيْنَ يُصْبِحُ عَشْرًا وَحِيْنَ يُمْسِي عَشْرًا أَدْرَكَتْهُ شَفَاعَتِي يَوْمَ الْقِيَامَةِ». رَوَاهُ الطَّبَرَانِي

హజ్రత్ అబూదర్దా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయితే ఉదయం పదిసార్లు, సాయంత్రం పదిసార్లు నాపై దరూద్ పఠిస్తారో, ప్రళయ దినాన వారికి నా సిఫారసు లభిస్తుంది“.(తబ్రానీ-హసన్) [అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం. 11వ హదీసు]

ఇతరములు:

నమాజుకు త్వరగా వెళ్ళుట (التبكير إلى الصلاة) [వీడియో | టెక్స్ట్]

అజాన్ కు ముందు లేదా కనీసం అజాన్ అయిన వెంటనే నమాజు కోసం  మస్జిద్ కు వెళ్ళే అలవాటు వేసుకోవడంలో ఎంత గొప్ప పుణ్యం ఉందో తెలుపుతుందీ మీకు ఈ వీడియో

నమాజుకు త్వరగా వెళ్ళుట (التبكير إلى الصلاة)
https://www.youtube.com/watch?v=UAVJmKoyW7A [2 నిమిషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మాబాద్.

నమాజులో ఎల్లప్పుడూ ముందడుగు వేయుట, నమాజు కొరకు శీఘ్రపడుట, తొందరపడుట, నమాజ్ చేయటానికై మస్జిద్ కు వెళ్లడంలో అందరికంటే ముందు ఉండే ప్రయత్నం చేయుట ఇది ఎంతో శుభకరమైన, ఎంతో గొప్ప పుణ్యం గల ఒక సత్కార్యం. ఈ రోజుల్లో చాలామంది ఈ సత్కార్యాన్ని ఎంతో మర్చిపోతున్నారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ వినండి. ప్రవక్త గారు చెప్పారు:

لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ 
లవ్ యాలమున్నాసు మాఫిన్నిదాయి వస్సఫ్ఫిల్ అవ్వల్.
ఒకవేళ ప్రజలకు అదాన్ ఇవ్వడంలో, మొదటి పంక్తిలో నిలబడడంలో ఎంత పుణ్యం ఉన్నదో తెలిసి ఉండేది ఉంటే,

ثُمَّ لَمْ يَجِدُوا إِلَّا أَنْ يَسْتَهِمُوا عَلَيْهِ لَاسْتَهَمُوا 
సుమ్మలమ్ యజిదూ ఇల్లా అయస్తహిమూ అలైహి లస్తహమూ.
ఈ సదవకాశాన్ని పొందడానికి, అంటే అదాన్ ఇవ్వడానికి మరియు మొదటి పంక్తిలో నిలబడడానికి వారికి కురా వేసుకోవడం, చీటీ వేయడం లాంటి అవసరం పడినా వారు వేసుకొని ఆ అవకాశాన్ని పొందే ప్రయత్నం చేసేవారు.

అలాగే,

وَلَوْ يَعْلَمُونَ مَا فِي التَّهْجِيرِ لَاسْتَبَقُوا إِلَيْهِ 
వలవ్ యాలమూన మాఫిత్తహ్జీర్ లస్తబఖూ ఇలైహ్.
ముందు ముందు వెళ్లడం, అందరికంటే ముందు ఉండే ప్రయత్నం చేయడంలో ఎంత పుణ్యం ఉన్నదో వారికి తెలిసి ఉండేది ఉంటే దానికి త్వరపడేవారు, తొందరగా వెళ్లేవారు.

అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరొక హదీస్ కూడా వినండి. ఇప్పుడు విన్న హదీసులో ఘనత తెలిసింది. చాలా గొప్ప పుణ్యం ఉన్నది అని చెప్పారు. ఆ పుణ్యం ఎంతో అనేది వివరణ ఇవ్వడం లేదు. కానీ మరో హదీస్ చాలా భయంకరంగా ఉంది. ఎవరైతే వెనకనే ఉండిపోతా ఉంటారో వారి గురించి హెచ్చరిస్తూ చెప్పారు:

لَا يَزَالُ قَوْمٌ يَتَأَخَّرُونَ حَتَّى يُؤَخِّرَهُمُ اللَّهُ
లా యజాలు కౌమున్ యతఅఖ్ఖరూన్ హత్తా యుఅఖ్ఖిరహుముల్లాహ్.
కొందరు నమాజుల్లో మస్జిద్ కు వెళ్లడంలో మాటిమాటికీ వెనక ఉండే ప్రయత్నం చేస్తారు, చాలా దీర్ఘంగా వస్తూ ఉంటారు. చివరికి అల్లాహుతాలా వారిని వెనకనే ఉంచేస్తాడు. అన్ని రకాల శుభాలకు, అన్ని రకాల మేళ్లకు, అన్ని రకాల మంచితనాలకు వారు వెనకే ఉండిపోతారు.

అల్లాహుతాలా ప్రతీ సత్కార్యంలో మస్జిద్ కు వెళ్లడంలో ముందడుగు వేసే భాగ్యం ప్రసాదించుగాక. మరియు వెనక ఉండే వారిలో ఎవరైతే కలుస్తారో అలాంటి వారి నుండి అల్లాహ్ మనల్ని కాపాడుగాక.

జజాకుముల్లాహు ఖైరా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్.

ముహర్రం మరియు ఆషూరా ఘనతలు [వీడియో]

బిస్మిల్లాహ్

కేవలం 28 నిమిషాల ఈ క్లిప్ లో ముహర్రమ్ మాసము అందులోని ఆషూరా (పదవ తేది) ఘనత ఖుర్ఆన్ హదీసుల ఆధారంగా తెలుపడంతో పాటు, ఉపవాసం ఘనత, ఏ రోజుల్లో ఉపవాసం ఉండడం ఉత్తమం అన్న విషయం సహీ హదీసుల ఆధారంగా తెలుపాము.

[28 నిమిషాల వీడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

మిస్వాక్ ప్రాముఖ్యత – ఘనత (أهمية التسوك) [వీడియో]

బిస్మిల్లాహ్

పళ్ళపుల్ల (మిస్వాక్) ప్రాముఖ్యత దాని ఘనత ఇస్లాంలో ఎంతగా ఉందో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోగలరు.

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/aRwr]
[2 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia


15వ అధ్యాయం – మిస్వాక్‌ (బ్రష్‌) చేయడం గురించి

142. హజ్రత్‌ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “నా అనుచర సమాజానికి లేక ప్రజలకు కష్టమవుతుందని నేను భావించకపోతే, ప్రతి నమాజుకు ముందు మిస్వాక్‌ (బ్రష్‌) చేసుకోవాలని వారిని ఆదేశించేవాడ్ని”.

[సహీహ్‌ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 8వ అధ్యాయం – అల్‌ మిస్వాకియౌముల్‌ జుమా]

143. హజ్రత్‌ అబూ మూసా అష్‌అరి (రది అల్లాహు అన్హు) కథనం:- నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్ళాను. అప్పుడు ఆయన చేతిలో మిస్వాక్‌ (పనుదోముపుల్ల) పట్టుకొని పల్లు తోముకుంటున్నారు. (ఆ తరువాత) దాన్ని నోట్లో పెట్టుకొని వాంతి చేసుకుంటున్నట్లు వావ్‌వావ్‌ అనసాగారు.

[సహీహ్‌ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 73వ అధ్యాయం – అల్‌మిస్వాక్‌]

144. హజత్‌ హుజైఫా (రది అల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రివేళ తహజ్జుద్‌ నమాజ్‌ కోసం నిద్ర నుండి లేవగానే పనుదోము పుల్లతో గట్టిగా పల్లు తోముకునేవారు.

[సహీహ్‌ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 73వ అధ్యాయం – అల్‌మిస్వాక్‌]

నుండి: మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) – శుచి, శుభ్రతల ప్రకరణం


మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/

ఇతరములు : [తహారా] : [నమాజు]