పళ్ళపుల్ల (మిస్వాక్) ప్రాముఖ్యత దాని ఘనత ఇస్లాంలో ఎంతగా ఉందో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోగలరు.
[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/aRwr]
[2 నిమిషాల వీడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
15వ అధ్యాయం – మిస్వాక్ (బ్రష్) చేయడం గురించి
142. హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “నా అనుచర సమాజానికి లేక ప్రజలకు కష్టమవుతుందని నేను భావించకపోతే, ప్రతి నమాజుకు ముందు మిస్వాక్ (బ్రష్) చేసుకోవాలని వారిని ఆదేశించేవాడ్ని”.
[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 8వ అధ్యాయం – అల్ మిస్వాకియౌముల్ జుమా]
143. హజ్రత్ అబూ మూసా అష్అరి (రది అల్లాహు అన్హు) కథనం:- నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్ళాను. అప్పుడు ఆయన చేతిలో మిస్వాక్ (పనుదోముపుల్ల) పట్టుకొని పల్లు తోముకుంటున్నారు. (ఆ తరువాత) దాన్ని నోట్లో పెట్టుకొని వాంతి చేసుకుంటున్నట్లు వావ్వావ్ అనసాగారు.
[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 73వ అధ్యాయం – అల్మిస్వాక్]
144. హజత్ హుజైఫా (రది అల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రివేళ తహజ్జుద్ నమాజ్ కోసం నిద్ర నుండి లేవగానే పనుదోము పుల్లతో గట్టిగా పల్లు తోముకునేవారు.
[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 73వ అధ్యాయం – అల్మిస్వాక్]
నుండి: మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) – శుచి, శుభ్రతల ప్రకరణం
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/