ఈ ప్రసంగంలో, ఇస్లాంలో వారసత్వపు హక్కుల గురించి, ముఖ్యంగా తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెల వాటా గురించి వివరించబడింది. సూరహ్ అన్-నిసాలోని ఆయతుల (వచనాల) ఆధారంగా, కుమారులతో పాటు కుమార్తెలకు కూడా ఆస్తిలో నిర్ధారితమైన వాటా ఉందని స్పష్టం చేయబడింది. ఆస్తి తక్కువైనా, ఎక్కువైనా సరే, ఈ వాటాను ఇవ్వడం అల్లాహ్ నిర్దేశించిన విధి (ఫర్ద్) అని నొక్కి చెప్పబడింది. ఆడపిల్లల వారసత్వపు హక్కును కాలరాయడం, కట్నకానుకలు ఇచ్చామనే సాకుతో వారి వాటాను నిరాకరించడం ఘోరమైన పాపమని హెచ్చరించబడింది. ప్రతి చర్యకు అల్లాహ్ సాక్షిగా ఉన్నాడని, ప్రళయ దినాన ప్రతి ఒక్కరూ తమ హక్కుల కోసం నిలదీస్తారని, అప్పుడు న్యాయం జరుగుతుందని గుర్తుచేయబడింది.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.
“తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అలాగే తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది. ఆ ఆస్తి తక్కువైనాసరే, ఎక్కువైనాసరే (అందులో) వాటా మాత్రం నిర్ధారితమై ఉంది.” (సూరహ్ నిసా 4:7)
ఈ ఆయత్ ను గమనించండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, “విశ్వాసులారా, మీ తల్లిదండ్రులు, మీ బంధువులు వదిలిన ఆస్తిలో మీకు హక్కు ఉంది” అని చెప్పలేదు. పురుషులకు ప్రత్యేకంగా “లిర్రిజాలి నసీబ్” – పురుషులకు హక్కు ఉంది, పురుషులకు వాటా ఉంది. అలాగే “వలిన్నిసాఇ నసీబ్” – స్త్రీలకు. పురుషులు, తల్లిదండ్రుల యొక్క సంతానమైనా లేదా బంధువులలో పురుషులు. అలాగే, ఎవరైనా తల్లిదండ్రులకు కూతుళ్ళు ఉన్నారు, అలాగే కుమారులు ఉన్నారు. అయితే ఎలాగైతే కుమారులకు తల్లిదండ్రుల ఆస్తిలో వాటా ఉందో, అలాగే కూతుళ్ళకు కూడా ఉంది.
ఇక్కడ గమనించవలసిన మరో విషయం, “మిమ్మా ఖల్ల మిన్హు అవ్ కసుర్” – ఆస్తి ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా. అరే, మా తల్లిదండ్రి చాలా తక్కువ వదిలి వెళ్లారు, మా చెల్లెళ్లకు, మా అక్కలకు లేదు అని ఎవరూ అనరాదు. ఎక్కువ వదిలినా, తక్కువ వదిలినా, ప్రతి ఒక్కరికీ అల్లాహ్ ఎవరెవరి పేర్లు చెప్పి వారి యొక్క హక్కులు నిర్ణయించాడో, వారికి తప్పకుండా అవి ఇవ్వాలి.
మరో విషయం గమనించాల్సింది, “నసీబమ్ మఫ్రూదా”. “మఫ్రూదా” అన్న దానికి మన కొన్ని తెలుగు ఖురాన్ అనువాదాల్లో “నిర్ధారితం” అన్న పదం వచ్చింది. కానీ “మఫ్రూదా” ఫర్ద్ నుండి. అంటే ఇది ఒక విధి. ఈ విధిని తప్పనిసరిగా పాటించాలి. ఇందులో ఎలాంటి కొరత అనేది చేయకూడదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చాలా స్పష్టంగా తెలుపుతున్నాడు.
మరి ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? ఎంతోమంది తమ అక్కచెల్లెళ్లకు సంబంధించినటువంటి, వారి తల్లిదండ్రులు ఏదైతే వదిలి వెళ్లారో, ఎందరో కొడుకులు, ఆ అక్కచెల్లెళ్ల యొక్క సోదరులు స్వయమే, మా హక్కు అని తీసుకుంటారు. మీకు మీ పెళ్లిళ్లలో కట్నకానుకల రూపంలో ఇచ్చేశాము, అయిపోయింది అని అంటారు. కానీ, ఈ కొడుకులకు వారి యొక్క చదువుల కొరకు, వారి యొక్క పెళ్లిళ్ల కొరకు, వారి యొక్క ఇంకా వేరే అవసరాలకు, ఉద్యోగం లేనందుకు ఏదైతే తండ్రి ఖర్చు పెట్టాండో, అవన్నీ కూడా మా తండ్రి మాకు ఖర్చు పెట్టాడు కదా, చెల్లెళ్లకు కట్నకానుకలు ఇచ్చినట్లుగా అని భావించకుండా, మీకు కట్నకానుకలు ఇవ్వడం జరిగింది, ఇక మీకు ఏ హక్కు లేదు అని కొట్టేస్తారు. అల్లాహ్ తో భయపడండి. ఒక ఫర్ద్ నమాజ్ ను వదులుట ఎంత పాపమని మీరు భయపడతారో, ఒక జకాత్ ఇవ్వడం విధిగా ఉంటే దానిని ఇవ్వకుంటే ఎంత పాపమని భయపడతారో, ఉపవాసం రమదాన్ లో ఉండడం విధి, అది ఉండకుంటే ఎంత పాపమని భయపడతారో, అలాగే అల్లాహ్ ఎవరికి ఆస్తిలో ఏ హక్కు నిర్ణయించాడో అది వారికి ఇవ్వకపోవడం అంతకంటే ఘోరమైన పాపం అని కూడా గమనించాలి. ఎందుకు? నమాజ్, రోజా, ఉపవాసాలు ఇలాంటివి అల్లాహ్ కు సంబంధించిన హక్కు. కానీ ఇక్కడ ఇది దాసులకు సంబంధించిన హక్కు.
ఇంకా మరొక ఆయత్ ఇదే సూరహ్ నిసాలో, ఆయత్ నెంబర్ 33 గమనించండి.
“తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తికి మేము వారి వారసులను నిర్థారించిపెట్టాము. మీరు ఎవరితోనయినా ఏదయినా ఒప్పందం చేసుకుని ఉంటే, తదనుగుణంగా వారి భాగాన్ని వారికి ఇవ్వండి. యదార్థానికి అల్లాహ్ అన్నింటిపై సాక్షిగా ఉన్నాడు.” (4:33)
తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలి వెళ్ళిన ఆస్తికి మేము వారి వారసులను నిర్ధారించాము. ఎవరికి ఏ వారసులు అనేది అల్లాహ్ నిర్ధారించాడు అని స్పష్టంగా చెప్పాడు. మీరు ఎవరితోనైనా ఏదైనా ఒప్పందం చేసుకుని ఉంటే, తదనుగుణంగా వారి భాగాన్ని వారికి ఇవ్వండి. “ఇన్నల్లాహ కాన అలా కుల్లి షైఇన్ షహీదా” అల్లాహు అక్బర్. యదార్థానికి అల్లాహ్ అన్నింటిపై సాక్షిగా ఉన్నాడు.
ఈ రోజు చెల్లెల్ల హక్కు ఏదైతే తినేస్తున్నారో, ఇహలోకంలో ఎవరు మీకు మీ వ్యతిరేకంగా సాక్షి ఉండకున్నా గానీ, అల్లాహ్ సాక్షిగా ఉన్నాడన్న విషయం మర్చిపోకండి. ప్రళయ దినాన అల్లాహ్ ముందు నిలబడినప్పుడు, అక్కడ మీ చెల్లెళ్లు, మీ సోదరీమణులు మీకు వ్యతిరేకంగా, మా తల్లిదండ్రులు వదిలిన ఆస్తిలో మా ఈ సోదరులు మాకు ఇవ్వలేదు అని అన్నప్పుడు, అక్కడ ఇవ్వడానికి ఏ ఇల్లు ఉండదు, ఏ భూమి ఉండదు, ఏ డబ్బు ఉండదు, ఏ బంగారం ఉండదు. ఆ రోజు మీ వద్ద ఏదైనా పుణ్యాలు ఉండేది ఉంటే అవి ఇవ్వాల్సి ఉంటుంది. లేదా అంటే, మీ సోదరీమణుల యొక్క పాపాలు దానికి పరిమాణంలో మీపై వేయబడుతుంది మరియు మీరు ఇహలోకంలో ఏదైతే మీ సోదరీమణుల హక్కులు చెల్లించలేదో, దానికి బదులుగా నరకంలో పోవలసి వస్తుంది. ఆ నరకం నుండి భయపడండి. సూరహ్ నిసాలో ఇంకా ఎన్నో ఆయతులు ఉన్నాయి ఈ ఆస్తికి సంబంధించిన, ఆయతులు చదవండి, గుణపాఠం నేర్చుకోండి.
అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
ప్రతి సున్నతును ప్రేమించే వ్యక్తి విన వలసిన మాటలు. ఏ సత్కార్యం సున్నత్ అవుతుంది, ఎప్పుడు సున్నతు అవుతుంది. ఈ ఆరు షరతులు లేకుంటే జాగ్రత్త సుమా! బిద్అత్ (నూతన ఆచారం) లో పడే ప్రమాదం ఉంది..
[ 32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
ఆరాధనలలో నూతన కల్పితాలు. దీనిలో ఆరు విధాలున్నాయి.
1. ఆరాధనల యొక్క ప్రధాన నియమాలలో కల్పించే నూతన కార్యాలు.
అంటే; అసలు ఇస్లాం ధర్మంలో లేని నూతన ఆరాధనలు. కొన్ని నఫిల్ నమాజులను లేక ఉపవాసాలను స్వయాన నిర్ధారించుకొని పాటించడం. లేక ధర్మంలో లేని నూతన పండుగలను కల్పించుకోవడం. మీలాద్ షరీఫ్, లేక మేరాజున్నబీ, లేక షాబాన్ నెలలో 15వరోజున జరుపుకొనే పండుగలు. మరియు ఆ రాత్రులను తహజ్జుద్ నమాజ్ మరియు పగలు ఉపవాసం పాటించడం వంటి ఆరాధనలు బిద్‌అత్ ఆరాధనలే.
నమాజ్ చేయడం మరియు ఉపవాసాలు పాటించడం ధర్మం అయినప్పటికి ఆ రోజులను మరియు ఆ రాత్రులను ప్రత్యేకించి ఆరాధనలు పాటించడం వల్ల బిద్‌అత్‌గా భావించబడతాయి.
2. ఆరాధనగా ధర్మం నిర్ణయించిన వస్తువులను చెల్లించడం.
అంటే; ఎవరైన గుర్రాన్ని లేక జింకను ఖుర్బానిగా చెల్లిస్తే స్వీకరించబడదు. ఎందుకంటే ఖుర్బాని కొరకు చెల్లించవలసిన జంతువులు: ఒంటెలు, ఎద్దులు, ఆవులు, మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు మాత్రమే.
అలాగే “ఫిత్రా దానం” ధాన్యం రూపంలో చెల్లించాలి. దానికి బదులు ఎవరైన డబ్బురూపంలో చెల్లిస్తే సున్నత్ విధానానికి విరుద్ధం.
3.ధర్మపరంగా నిర్ణయించబడిన ఆరాధనలలో పెంచడం లేక తగ్గించడం.
అంటే; అల్లాహ్ అదేశించిన కొన్ని ప్రత్యేక ఆరాధనలలో అదనపు విషయాలను చేర్చటం జుహ్ర్ లేక అస్ర్ లేక ఇషా నమాజ్ 4 రకాతులకు బదులు అయిదు రకాతులుగా హెచ్చించడం లేక తగ్గించడం.
4. ఆరాధనలను నూతన పద్ధతులలో పాటించడం.
అంటే; అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపిన పద్ధతిలో కాకుండా వేరే క్రొత్త పద్ధతులలో ఆరాధించటం. ఉదాహరణకు; అల్లాహ్ నామస్మరణ సామూహికంగా హెచ్చు స్వరంతో మరియు వివిధ రాగాలతో చేయడం, లేక ఆరాధలను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) విధానంకంటే కఠోరమైన విధానంలో చేయడం. అంటే ఎండలో నిలబడి నమాజు పాటించడం. లేక ఆరాధన క్రమాన్ని పాటించకపోవడం. అంటే వుజూ చేసేటప్పుడు ముందు కాళ్ళు కడిగి తరువాత ముఖం కడగటం వంటి క్రమం తప్పే పద్దతులు.
5. ఆరాధన సమయాన్ని తప్పడం.
ఉదాహరణకు: బక్రీద్ పండుగ నమాజ్ తరువాత ఖుర్బాని చెయ్యడం సాంప్రదాయం, కాని ఎవరైనా పండుగ నమాజుకు ముందే ఖుర్బాని చేస్తే అది ఆమోదయోగ్యమైన ఆచారం కాదు.
6,ఇస్లాం కేటాయించిన స్థలంలోనే ఆరాధన పాటించాలి.
అంటే; ఏతెకాఫ్ కొరకు మసీదులోనే బస చేయడం ధర్మం. కాని ఎవరైన స్త్రీలు తమ ఇంట్లో నమాజు పాటించే స్థలంలో ఏతెకాఫ్ చేస్తే ధర్మం కాదు.
లేక హజ్ విధిని నెరవేర్చుటకు అరఫా మైదానంలో విధిగా బసచేయాలి, అరఫా మైదానంలో బస చేయని పక్షంలో అతని హజ్ నెరవేరదు.
ముఖ్య గమనిక: ఆరాధనలు అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యం పొందాలంటే, దానిలో రెండు షరతులు తప్పనిసరిగా ఉండాలి.
ఒకటి; “అల్ ఇఖ్లాస్” (చిత్తశుద్ధి) అంటే; ప్రతి కార్యాన్ని అల్లాహ్ ప్రసన్నత పొందాలనే ఆకాంక్షతో చేయడం. కనుక అల్లాహ్ ఇలా తెలియజేసాడు:
“మరియు వారికి ఇచ్చిన ఆదేశం, వారు అల్లాహ్‌నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్రచిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని…”(సూరతుల్ బయ్యినహ్:5)
ఎవరైనా అల్లాహ్ ప్రసన్నత కాకుండా ఇతరుల మెప్పు పొందుటకై ఆరాధనలు పాటిస్తే అది షిర్క్ అవుతుంది.
రెండవది; అల్లాహ్ మరియు ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) గారి విధేయత.
అంటే; ఖుర్‌ఆన్ మరియు ప్రామాణికమైన హదీసుల వెలుగులోనే మనం ఆరాధనలను పాటించాలి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి విధేయతను మనం సరైన రీతిలో పాటించాలంటే, పైన ఇవ్వబడిన ఆరు షరతులకు అనుగుణంగా మన ఆరాధన విధానాలు ఉండాలి. అప్పుడే మన ఆరాధనలకు అల్లాహ్ వద్ద స్వీకార ముద్ర పడుతుంది.
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
9వ అధ్యాయం – విశ్వాసం “లా ఇలాహ ఇల్లల్లాహ్” సమ్మతితో ప్రారంభం
16.హజ్రత్ ముసయ్యబ్ (రది అల్లాహు అన్హు) కథనం :- అబూతాలిబ్‌కు మరణ సమయం ఆసన్నమయినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని చూడటానికి వచ్చారు. ఆ సమయంలో అబూ తాలిబ్ దగ్గర అబూ జహల్ బిన్ హెషామ్, అబ్దుల్లాహ్ బిన్ అబీ ఉమయ్య బిన్ ముగైరా కూర్చొని ఉన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూతాలిబ్‌ని ఉద్దేశించి “పెదనాన్నా! (ఇప్పటికైనా) అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని అంగీకరించండి. దీన్ని ప్రాతిపదికగా తీసుకొని ‘నేను అల్లాహ్ దగ్గర మీకు అనుకూలంగా సాక్ష్యమిస్తాను” అని అన్నారు.
అబూజహల్, అబ్దుల్లాహ్ బిన్ అబీ ఉమయ్యా ఈ మాటలు విని “అబూ తాలిబ్! మీరు అబ్దుల్ ముత్తలిబ్ అనుసరించిన మతాన్ని వదలిపెడ్తారా?” అని అడిగారు. ఆ తరువాత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని అంగీకరించవలసిందిగా మాటిమాటికీ అబూతాలిబ్‌కు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయితే అబూజహల్, అబ్దుల్లాహ్ బిన్ అబీ ఉమయ్యాలు కూడా తమ మాటను అనేకసార్లు ఉద్ఘాటించారు. చివరికి అబూతాలిబ్ వారిద్దరితో “నేను అబ్దుల్ ముత్తలిబ్ మతాన్నే అంటిపెట్టుకొని ఉంటాను” అని చెప్పేశారు. అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని ఒప్పుకోవడానికి ఆయన నిరాకరించారు.
అయినప్పటికీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (పెదనాన్న మీది ప్రేమను చంపుకోలేక) “అల్లాహ్ సాక్షి! అల్లాహ్ నన్ను వారించనంతవరకు నేను మీ పాప క్షమాపణ కోసం ప్రార్ధన చేస్తూ ఉంటాను” అని అన్నారు. అప్పుడు ఈ ఆయత్ అవతరించింది:
“బహు దైవారాధకులు (సత్యాన్ని తిరస్కరించి) నరకానికి అర్హులయ్యారని స్పష్టంగా తెలిసిన తరువాత వారు దగ్గరి బంధువులయినా సరే, వారి పాప మన్నింపు కోసం అల్లాహ్ ను ప్రార్ధించడం దైవప్రవక్తకు, విశ్వాసులకు ఎంత మాత్రం శోభించదు.”(ఖుర్ఆన్ : 9:113)
సూర్య గ్రహణము చంద్ర గ్రహణముల గురించి సైన్స్ మరియు ఇస్లాం ఏం చెబుతుంది!
ముందుగా సూర్య చంద్రగ్రహణాల పేరిట జరిగే మూఢనమ్మకాలు తెలుసుకుందాం!
మన ప్రాంతాల్లో దురాచారాలు, మూడనమ్మకాలు గ్రహణ సమయ్యాల్లో ఎక్కవ పాటిస్తారు. మన దేశ ఎలక్ట్రానిక్ మిడియా పనికట్టుకొని ప్రత్యేకంగా పండితులను పిలిపించి దాని ప్రత్యేక సమయాన్ని వేచిస్తారు. ప్రజల అమాయకత్వమే తమ బలంగా సొమ్ము చేసుకోవటానికి ప్రయత్నిస్తుంటారు.
మన ప్రాంతాల్లో పాటించే కొన్ని మూఢనమ్మకాలు ఇలా వుంటాయి:
1) గర్భవతులు గ్రహణం చూడరాదనటం. 2)గ్రహణం పట్టే సమయంలో సూర్య చంద్రకాంతి పడేచోట కూర్చోకూడదనడం. 3) కూరగాయాలు తరగడం, పండ్లు కోయడం వంటివి చేయకూడదనడం. అలా చేస్తే పదార్థాలు విషం చేస్తాయని భావించటం. 4) గర్భిణులను గ్రహణ సమయాల్లో ఇంటికే పరిమితం చేయటం. 5) తమ నివాస స్థలాల్లో సూర్యకాంతులు పడకుండా చూడటం 6) గర్భవతి గ్రహణ సమయాల్లో చూస్తే పిల్లలు అంగవైకల్యాలుగా పుడతారని భావించడం. 7)ఫలానా రాశివారికి లాభం, ఫలాన రాశి వారికి కీడని నమ్మటం. 8)గ్రహణ సమయం అయిపోగానే ఇంటిని శుభ్రంగా కడగడం. 9)ఇంకా మూఢన్మకాలు, బహుదైవ కార్యకలపాలకు పాల్పడటం వంటివి చేయటం.
నా సహోద సహోదరిమణులారా మూఢనమ్మకాలు పాటించకూడదు. లాభం నష్టం అనేది భూమ్యకాశాల సృష్టకర్త అయిన అల్లాహ్(దేవుడు) అధీనంలోనే ఉన్నాయి. అలాగే బహుధైవరాధనను అన్ని మత గ్రంధాలు ఖండిస్తున్నాయి. బహుధైవరాధన అనేది క్షమించరాని నేరం!!
సైన్స్ సూర్య చంద్రగ్రహణాల గురించి ఏం చెబుతుంది:
చంద్రగ్రణాల ద్వారా గర్బణిలకు ఎటువంటి ప్రమాదం లేదని, అలాగే తిను పదార్దాలు చెడిపోవటం అధిక ఉష్ణోగ్రతలు 35 – 40 వరకు ఉండటమేనని తేల్చింది. అలాగే గ్రహణాల ఏర్పాటు అనేది ఆకాశంలో భూమి, చంద్రుల నీడలాటే అని కూడా చెప్పింది. సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయి. అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం చంద్రుడు. ఇలా ఇవి ఒకదాని చుట్టూ ఒకటి పరిభ్రమించేటప్పుడు సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే.. చంద్రుని నీడ భూమిమీద పడుతుంది. సూర్యుడికి, చంద్రునికి మధ్యలో భూమి వస్తే భూమి నీడ చంద్రుని మీద పడుతుంది. ఈ నీడలు ఇలా పడడం వల్లనే గ్రహణాలు ఏర్పడుతాయి.
ఇలా మనకు గ్రహణాల సబబు తెలిసిందని నిర్భయంగా ఉండలేము. చీకట్లు క్రమ్ముకొని ఉన్న ప్రపంచాన్ని కాంతితో నింపే అంతటి శక్తి సూర్యునిలో అల్లాహ్ యే ఇచ్చాడు, తాను కోరినప్పుడు ఏదో సబబు కలుగజేసి ఆ కాంతిని తీసేసుకుంటున్నాడు, పగటి వేల చీకటిగా చేస్తున్నాడు, అలాగే చంద్రుణ్ణి కూడా అందుకే ఆ అల్లాహ్ తో భయపడాలి. ఈ గ్రహణాల సందర్భంలో ఏమి చేయాలని ఆదేశించాడో అవి చేయాలి. అప్పుడే మనం ఇహపరాల మోక్షం పొందుతాము.
ఇస్లాం సమాచారం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
527. హజ్రత్ అబూ మస్‌వూద్ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-
“సూర్యచంద్రగ్రహణాలు ఏ ఒక్కరి మరణం, పుట్టుకలకు కారణభూతం కాజాలవు. సూర్యచంద్రులు అల్లాహ్ నిదర్శనాలలో రెండు నిదర్శనాలు. అందువల్ల మీరు సూర్యగ్రహణం గాని, చంద్రగ్రహణం గాని పట్టడం చూస్తే లేచి నమాజు చేయండి.”
[సహీహ్ బుఖారీ : 16వ ప్రకరణం – కుసూఫ్, 1వ అధ్యాయం – అస్సలాతి ఫీ కుసూఫిష్నమ్స్]
528. హజ్రత్ అబూమూసా (రది అల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్ష(సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో ఓసారి సూర్యగ్రహణం పట్టితే “ప్రళయం రాదు కదా’ అని ఆయన ఆందోళన చెందుతూ, మస్జిదుకు వెళ్ళి (కుసూఫ్) నమాజు చేశారు. అందులో ఖుర్‌ఆన్ పఠనం, రుకూ, సజ్దాలు నేనిదివరకెన్నడూ చూడనంత సుదీర్హంగా జరిగాయి. (తర్వాత) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రసంగించారు.
“ఇవి (సూర్యచంద్రగ్రహణాలు) అల్లాహ్ పంపుతున్న నిదర్శనాలు. అంతేగాని ఏ ఒక్కరి చావు పుట్టుకలకు కారణభూతం కాజాలవు. ఈ నిదర్శనాల ద్వారా అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు. అందువల్ల మీరు ఇలాంటి నిదర్శనాలేమైనా చూస్తే వెంటనే అల్లాహ్ స్మరణ (నమాజు) వైపుకు పరుగెత్తండి, ఆయన్ని వేడుకోండి, పాప మన్నింపు కోరండి.”
[సహీహ్ బుఖారీ : 16వ ప్రకరణం – కుసూఫ్, 14వ అధ్యాయం – అజ్జిక్రి ఫిల్‌కుసూఫ్]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రది అల్లాహు అన్హు) తఖ్వా గురించి హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రది అల్లాహు అన్హు) గారికి ప్రశ్నించగా ఆయన (రది అల్లాహు అన్హు) ఓ ఉదాహరణ ద్వారా వివరించారు. ‘ఓ అమీరుల్ మోమినీన్! మీరు ఎప్పుడైనా ముళ్ళులతో నిండున్న దారిలో నడిచారా?’ అని ప్రశ్నిస్తే, ”ఔను, ఆ పరిస్థితి నాకు ఎదురయ్యింది” అని బదులిచ్చారు. ‘అటువంటి దారిలో మీరు ఎలా నడుస్తారు?’ అని మరోసారి ప్రశ్నించగా ”నా దుస్తులను ముళ్ళులతో గుచ్చుకోకుండా వాటిని కాపాడుకుంటూ నడుస్తాను” అని జవాబిచ్చారు ఉమర్ (రది అల్లాహు అన్హు). ‘తఖ్వా విషయం సైతం ఇంతే. ఎలాంటి దుష్టకార్యాలకు గురి కాకుండా, చెడు చేష్టల దరిదాపులకు పోకుండా, దైవ మార్గంలో తన జీవితాన్ని గడపటమే తఖ్వా’ అని హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రది అల్లాహు అన్హు) పేర్కొన్నారు.
18. హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రది అల్లాహు అన్హు) కథనం:- నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక ఆయన ఒంటె మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నాను. నాకు, ఆయనకు మధ్య అంబారీ కర్ర మాత్రమే అడ్డుగా ఉంది. హఠాత్తుగా ఆయన “ఓ ముఆజ్!’ అని పిలిచారు. నేను వెంటనే “(చెప్పండి) దైవప్రవక్తా! నేను మీ సేవ కోసం సిద్ధంగా ఉన్నాను” అన్నాను. కొంచెం దూరం నడిచిన తరువాత ఆయన మళ్ళీ “ఓ ముఆజ్!” అని పిలిచారు. “(సెలవియ్యండి) దైవప్రవక్తా! నేను మీ సేవ కోసం సిద్దంగా ఉన్నాను” అన్నాను. ఆ తరువాత మరి కొంచెం దూరం పోయాక మూడవసారి మళ్ళీ “ముఆజ్!” అని పిలిచారు. “(ఆజ్ఞాపించండి) దైవప్రవక్తా! నేను మీ సేవ కోసం సిద్ధంగా ఉన్నాను” అన్నాను నేను.
అప్పుడాయన “దాసుల మీద అల్లాహ్ హక్కు ఏముందో నీకు తెలుసా?” అని అడిగారు. అందుకు నేను “అల్లాహ్ కు , దైవప్రవక్తకే బాగా తెలుసు” అన్నాను. “దాసుల మీదున్న అల్లాహ్ హక్కు ఏమిటంటే, వారు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి, మరెవరినీ ఆరాధించకూడదు. దైవత్వంలో ఆయనకు మరెవరినీ సాటి కల్పించకూడదు” అన్నారు ఆయన. ఇలా చెప్పి కాస్సేపు మౌనంగా నడిచారు.
ఆ తరువాత “ఓ ముఆజ్ బిన్ జబల్!” అని పిలిచారు. నేను (వెంటనే సెలవియ్యండి) “దైవప్రవక్తా! మీ సేవ కోసం సిద్దంగా ఉన్నాను” అని అన్నాను. “దాసులు అల్లాహ్ హక్కు నెరవేర్చిన తరువాత, అల్లాహ్ పై దాసులకు ఉండే హక్కేమిటో నీకు తెలుసా?” అని అడిగారు ఆయన. నేను “అల్లాహ్ కు , దైవప్రవక్తకు మాత్రమే బాగా తెలుసు” అన్నాను. “అప్పుడు అల్లాహ్ (తన) దాసులను శిక్షించకపోవడమే ఆయనపై వారికున్న హక్కు” అని తెలిపారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
1811. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియజేశారు : (ప్రళయదినాన) మృత్యువు ఒక తెల్లని పొట్టేలు రూపంలో తీసుకురాబడుతుంది. ఒక ప్రకటనకర్త ఎలుగెత్తి “స్వర్గవాసులారా!” అని పిలుస్తాడు. స్వర్గవాసులు తలలు పైకెత్తి అతని వైపు చూస్తారు. ఆ ప్రకటనకర్త “దీన్ని మీరు గుర్తించారా?” అని అడుగుతాడు వారిని. స్వర్గవాసులు దాన్ని ఇంతకు పూర్వం కూడా చూసి ఉన్నందున “గుర్తించాము. అది మృత్యువు” అని అంటారు. తర్వాత ఆ ప్రకటనకర్త నరకవాసుల్ని కూడా ఎలుగెత్తి పిలుస్తాడు. వారు కూడా తలలు పైకెత్తి అటు వైపు చూస్తారు. “మీరు దీన్ని గుర్తించారా?” అని అడుగుతాడు ప్రకటనకర్త. నరకవాసులు కూడా దాన్ని ఇంతకు పూర్వం చూసి ఉన్నందున “గుర్తించాము అది మృత్యువు” అని అంటారు. ఆ తరువాత దాన్ని కోసివేయడం జరుగుతుంది. అప్పుడు ప్రకటనకర్త అందరినీ సంబోధిస్తూ “స్వర్గవాసులారా! ఇప్పుడు జీవితం శాశ్వతమయిపోయింది. ఇక (మీకెవరికీ) మరణం రాదు. నరకవాసులారా! ఇప్పుడు జీవితం శాశ్వతమయిపోయింది. ఇక (మీకెవరికీ) మరణం రాదు” అని అంటాడు.
ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సూక్తి పఠిస్తారు : “ప్రవక్తా! ఏమరుపాటుకు లోనయి సత్యాన్ని విశ్వసించని వారిని తీర్పు దినం గురించి భయపెట్టు. ఆ రోజు తీర్పు జరిగిన తరువాత దుఃఖం తప్ప మరేదీ మిగలదు.” (19:39)
(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్ , 19వ సూరా – మర్యం, 1వ అధ్యాయం – ఖౌలిహీ (వ అన్జిర్ హుమ్ యౌ మల్‌హస్రా)
నమాజు యొక్క ప్రాముఖ్యత మరియు సామూహికంగా నమాజు చేసే ఘనత ఎంత గొప్పగా ఉందో చాలా సోదర సోదరీమనులకు తెలియకనే మస్జిదులకు దూరంగా ఉన్నారు, అయితే మీరు స్వయంగా ఈ వీడియో చూడండి, ఇతరులకు చూపించండి, నరక శిక్షల నుండి తమను, ఇతరులను కాపాడండి.
You must be logged in to post a comment.