సూర్య చంద్ర గ్రహణాలు – ఆచారాలు, దురాచారాలు – صلاة الخسوف [వీడియో]

బిస్మిల్లాహ్

సలాతుల్ ఖుసూఫ్ (సూర్య చంద్ర గ్రహణాల నమాజు)
సూర్య చంద్ర గ్రహణాలు – ఆచారాలు, దురాచారాలు

పెద్ద వీడియో [37 నిముషాలు]

సూర్య చంద్ర గ్రహణాలు – ఆచారాలు, దురాచారాలుపెద్ద వీడియో [37 నిముషాలు]

చిన్న వీడియో [15నిముషాలు]

సూర్య చంద్ర గ్రహణాలు – ఆచారాలు, దురాచారాలుచిన్న వీడియో [15 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

సూర్య గ్రహణము చంద్ర గ్రహణముల గురించి సైన్స్ మరియు  ఇస్లాం ఏం చెబుతుంది!

ముందుగా సూర్య చంద్రగ్రహణాల పేరిట జరిగే మూఢనమ్మకాలు తెలుసుకుందాం!

మన ప్రాంతాల్లో దురాచారాలు, మూడనమ్మకాలు గ్రహణ సమయ్యాల్లో ఎక్కవ పాటిస్తారు. మన దేశ ఎలక్ట్రానిక్ మిడియా పనికట్టుకొని ప్రత్యేకంగా పండితులను పిలిపించి దాని ప్రత్యేక సమయాన్ని వేచిస్తారు. ప్రజల అమాయకత్వమే తమ బలంగా సొమ్ము చేసుకోవటానికి ప్రయత్నిస్తుంటారు.

మన ప్రాంతాల్లో పాటించే కొన్ని మూఢనమ్మకాలు ఇలా వుంటాయి:

1) గర్భవతులు గ్రహణం చూడరాదనటం.
2)గ్రహణం పట్టే సమయంలో సూర్య చంద్రకాంతి పడేచోట కూర్చోకూడదనడం.
3) కూరగాయాలు తరగడం, పండ్లు కోయడం వంటివి చేయకూడదనడం. అలా చేస్తే పదార్థాలు విషం చేస్తాయని భావించటం.
4) గర్భిణులను గ్రహణ సమయాల్లో ఇంటికే పరిమితం చేయటం.
5) తమ నివాస స్థలాల్లో సూర్యకాంతులు పడకుండా చూడటం
6) గర్భవతి గ్రహణ సమయాల్లో చూస్తే పిల్లలు అంగవైకల్యాలుగా పుడతారని భావించడం.
7)ఫలానా రాశివారికి లాభం, ఫలాన రాశి వారికి కీడని నమ్మటం.
8)గ్రహణ సమయం అయిపోగానే ఇంటిని శుభ్రంగా కడగడం.
9)ఇంకా మూఢన్మకాలు, బహుదైవ కార్యకలపాలకు పాల్పడటం వంటివి చేయటం.

 నా సహోద సహోదరిమణులారా మూఢనమ్మకాలు పాటించకూడదు. లాభం నష్టం అనేది భూమ్యకాశాల సృష్టకర్త అయిన అల్లాహ్(దేవుడు) అధీనంలోనే ఉన్నాయి. అలాగే బహుధైవరాధనను అన్ని మత గ్రంధాలు ఖండిస్తున్నాయి. బహుధైవరాధన అనేది క్షమించరాని నేరం!!

సైన్స్ సూర్య చంద్రగ్రహణాల గురించి ఏం చెబుతుంది:

చంద్రగ్రణాల ద్వారా గర్బణిలకు ఎటువంటి ప్రమాదం లేదని, అలాగే తిను పదార్దాలు చెడిపోవటం అధిక ఉష్ణోగ్రతలు 35 – 40 వరకు ఉండటమేనని తేల్చింది. అలాగే గ్రహణాల ఏర్పాటు అనేది ఆకాశంలో భూమి, చంద్రుల నీడలాటే అని కూడా చెప్పింది. సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయి. అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం చంద్రుడు. ఇలా ఇవి ఒకదాని చుట్టూ ఒకటి పరిభ్రమించేటప్పుడు సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే.. చంద్రుని నీడ భూమిమీద పడుతుంది. సూర్యుడికి, చంద్రునికి మధ్యలో భూమి వస్తే భూమి నీడ చంద్రుని మీద పడుతుంది. ఈ నీడలు ఇలా పడడం వల్లనే గ్రహణాలు ఏర్పడుతాయి.

ఇలా మనకు గ్రహణాల సబబు తెలిసిందని నిర్భయంగా ఉండలేము. చీకట్లు క్రమ్ముకొని ఉన్న ప్రపంచాన్ని కాంతితో నింపే అంతటి శక్తి సూర్యునిలో అల్లాహ్ యే ఇచ్చాడు, తాను కోరినప్పుడు ఏదో సబబు కలుగజేసి ఆ కాంతిని తీసేసుకుంటున్నాడు, పగటి వేల చీకటిగా చేస్తున్నాడు, అలాగే చంద్రుణ్ణి కూడా అందుకే ఆ అల్లాహ్ తో భయపడాలి. ఈ గ్రహణాల సందర్భంలో ఏమి చేయాలని ఆదేశించాడో అవి చేయాలి. అప్పుడే మనం ఇహపరాల మోక్షం పొందుతాము.

ఇస్లాం సమాచారం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ


527. హజ్రత్‌ అబూ మస్‌వూద్‌ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-

“సూర్యచంద్రగ్రహణాలు ఏ ఒక్కరి మరణం, పుట్టుకలకు కారణభూతం కాజాలవు. సూర్యచంద్రులు అల్లాహ్ నిదర్శనాలలో రెండు నిదర్శనాలు. అందువల్ల మీరు సూర్యగ్రహణం గాని, చంద్రగ్రహణం గాని పట్టడం చూస్తే లేచి నమాజు చేయండి.”

[సహీహ్‌ బుఖారీ : 16వ ప్రకరణం – కుసూఫ్‌, 1వ అధ్యాయం – అస్సలాతి ఫీ కుసూఫిష్నమ్స్‌]

528. హజ్రత్‌ అబూమూసా (రది అల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్ష(సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో ఓసారి సూర్యగ్రహణం పట్టితే “ప్రళయం రాదు కదా’ అని ఆయన ఆందోళన చెందుతూ, మస్జిదుకు వెళ్ళి (కుసూఫ్‌) నమాజు చేశారు. అందులో ఖుర్‌ఆన్‌ పఠనం, రుకూ, సజ్దాలు నేనిదివరకెన్నడూ చూడనంత సుదీర్హంగా జరిగాయి. (తర్వాత) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రసంగించారు.

“ఇవి (సూర్యచంద్రగ్రహణాలు) అల్లాహ్ పంపుతున్న నిదర్శనాలు. అంతేగాని ఏ ఒక్కరి చావు పుట్టుకలకు కారణభూతం కాజాలవు. ఈ నిదర్శనాల ద్వారా అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు. అందువల్ల మీరు ఇలాంటి నిదర్శనాలేమైనా చూస్తే వెంటనే అల్లాహ్  స్మరణ (నమాజు) వైపుకు పరుగెత్తండి, ఆయన్ని వేడుకోండి, పాప మన్నింపు కోరండి.”

[సహీహ్‌ బుఖారీ : 16వ ప్రకరణం – కుసూఫ్‌, 14వ అధ్యాయం – అజ్జిక్రి ఫిల్‌కుసూఫ్‌]

సలాతుల్ కుసూఫ్ ప్రకరణం : హదీసులు :
అల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు)


గ్రహణ సమయాలలో నమాజ్ (సలాతుల్ కుసూఫ్) : హదీసులు 
[హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) (Bulugh-al-Maraam)]

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి
https://teluguislam.net/whatsapp/

%d bloggers like this: