ఇస్లామీయ విశ్వాసం గురించి సారాంశము – షేఖ్ ముహమ్మద్ ఇబ్నె సాలిహ్ అల్ ఉసైమీన్ [పుస్తకం]

ఇస్లామీయ విశ్వాసం గురించి సారాంశము
షేఖ్ ముహమ్మద్ ఇబ్నె సాలిహ్ అల్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్)

[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [67 పేజీలు]

  • ముందుమాట
  • ఇస్లాం ధర్మం
  • ఇస్లాం మూలస్తంభాలు
  • ఇస్లామీయ అఖీద పునాదులు
  • మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం చూపటం.
  • దైవదూతల పట్ల విశ్వాసం
  • దైవగ్రంధాల పట్ల విశ్వాసం
  • దైవ సందేశహరుల పట్ల విశ్వాసం
  • పరలోకం పట్ల విశ్వాసం
  • విధివ్రాత పట్ల విశ్వాసం
  • ఇస్లామీయ అఖీద లక్ష్యాలు

నిశ్చయంగా సర్వ పొగడ్తలు అల్లాహ్ కొరకే,మేము ఆయనను స్తుతిస్తున్నాము, ఆయనతోనే సహాయం అర్థిస్తున్నాము. ఆయనతోనే మేము మన్నింపు వేడు కుంటున్నాము మరియు మేము ఆయన వైపే పశ్చాత్తాపముతో మరలుతున్నాము. మరియు మేము మన హృదయముల చెడుల నుండి, మన చెడు కర్మల నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము. అల్లాహ్ మార్గదర్శం ప్రసాదించినవాడిని మార్గభ్రష్టుడిగా మార్చేవాడు ఎవడూ లేడు, మరియు ఆయన మార్గభ్రష్టుడిగా మార్చినవాడికి సన్మార్గం చూపేవాడు ఎవడూ లేడు. అల్లాహ్ తప్ప వేరే సత్య ఆరాధ్యుడు లేడని, ఆయన ఏకైకుడని, ఆయనకు ఎవ్వరూ భాగస్వాములు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. మరియు ముహమ్మద్ ఆయన దాసుడని, ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యం పలుకు తున్నాను. అల్లాహ్ ఆయనపై, ఆయన కుటుంబముపై, ఆయన అనుచరులపై మరియు దాతృత్వంతో వారిని అనుసరించిన వారిపై శుభాలను, శాంతిని కురిపించుగాక.

అమ్మా బాద్: నిశ్చయంగా తౌహీద్ యొక్క జ్ఞానం అన్ని శాస్త్రాలలో అత్యంత మహిమాన్వితమైన మరియు అత్యంత ఉన్నత స్థానం గల, అత్యంత వాంఛనమైన జ్ఞానము. ఎందుకంటే దానితో అల్లాహ్ యొక్క, ఆయన గుణగణాల యొక్క, ఆయన దాసులపై ఉన్న ఆయన హక్కుల యొక్క జ్ఞానోదయం అవుతుంది. మరియు ఎందుకంటే అది అల్లాహ్ కు చేరుకునే మార్గం యొక్క మరియు ఆయన ధర్మశాసనాల మూలాల యొక్క తాళము.

ఇందుకనే దైవ ప్రవక్తలందరు దాని వైపు ఆహ్వానించటంలో ఏకమయ్యారు. అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:

وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ
మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా: “నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి” అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చి పంపాము. [అల్ అంబియా:25]

అల్లాహ్ స్వయంగా తన ఏకేశ్వరోపాసన గురించి సాక్ష్యం పలికాడు. మరియు ఆయన దూతలు, జ్ఞానవంతులు దానిని ఆయనకు ప్రత్యేకిస్తూ సాక్ష్యం పలికారు. అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు.

شهِدَ اللهُ أَنَّهُ لَا إِلَهَ إِلَّا هُوَ وَالْمَلَائِكَةُ وَأُولُوا الْعِلْمِ قَائِمَا بِالْقِسْطِ لَا إِلَهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمِ
నిశ్చయంగా, ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడని, అల్లాహ్, దైవదూతలు మరియు జ్ఞానవంతులు సాక్ష్యమిచ్చారు; ఆయనే న్యాయపరిరక్షకుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడు! ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు. [ఆలె ఇమ్రాన్:18]

మరియు తౌహీదు యొక్క ఈ ఉన్నత స్థానము ఉండటం వలన ప్రతీ ముస్లింపై దీనిని నేర్చుకోవటం, ఇతరులకు నేర్పించటం, దీనిలో పర్యాలోచన చేయటం, విశ్వసించటం తన ధర్మమును సురక్షణాత్మక, సంత్రుప్తికర, స్వీకృతమైన మూలాలపై నిర్మించటానికి తప్పనిసరి అవుతుంది. దీని ద్వారా అతడు దాని ఫలాలను, ఫలితాలను ఆస్వాదిస్తాడు. మరియు అల్లాహ్ భాగ్యమును కలిగించేవాడు.

– రచయిత

ఇస్లాం ధర్మం: అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇచ్చి పంపించిన ధర్మం మరియు అల్లాహ్ దాని ద్వారా పూర్వ ధర్మాలను సమాప్తం చేశాడు. మరియు దానిని తన దాసుల కొరకు పరిపూర్ణం చేశాడు. మరియు దాని ద్వారా వారిపై అనుగ్రహమును పరిపూర్ణం చేశాడు. మరియు దానిని వారి కొరకు ధర్మంగా ఇష్టపడ్డాడు. కావున ఆయన ఎవరి నుండి కూడా అది కాకుండా వేరే ధర్మమును ఆమోదించడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

مَّا كَانَ مُحَمَّدٌ أَبَا أَحَدٍ مِّن رِّجَالِكُمْ وَلَكِن رَّسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ وَكَانَ اللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمًا

(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు, కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు. మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతి విషయపు జ్ఞానం గలవాడు. (అల్ అహ్’ జాబ్: 40}

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الإِسْلَامَ دِينًا

{ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను, మీ పై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను ఇంకా ఇస్లాంను మీ ధర్మంగా సంతృప్తి సమ్మతితో ఇష్టపడ్డాను} {అల్ మాయిదా :3}

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إنَّ الَّذِينَ عِندَ اللهِ الإِسْلَامُ
నిస్సందేహంగా ఇస్లాం యే అల్లాహ్ వద్ద సమ్మతమైన ధర్మం. [ఆలె ఇమ్రాన్ :19]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَمَن يَبْتَغِ غَيْرَ الإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِين

{మరియు ఎవడైనా ఇస్లాం తప్ప ఇతర ధర్మాన్ని అవలంభించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు.} [ఆలె ఇమ్రాన్ : 85]

అల్లాహ్ తఆలా ప్రజలందరిపై దీనినే అల్లాహ్ కొరకు ధర్మంగా ఎంచుకోవటమును అనివార్యం చేశాడు. కావున ఆయన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశిస్తూ ఇలా పలికాడు:

قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ لَا إِلَهَ إِلَّا هُوَ يُحْيِي وَيُمِيتُ 
فَآمِنُواْ بِاللَّهِ وَرَسُولِهِ النَّبِيِّ الْأُمِّيِّ الَّذِي يُؤْمِنُ بِاللَّهِ وَكَلِمَاتِهِ وَاتَّبِعُوهُ لَعَلَّكُمْ تَهْتَدُونَ

{(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: “మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను. భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు; ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు. కావున అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుడు నిరక్షరాస్యుడైన ఈ ప్రవక్తను విశ్వసించండి. అతను అల్లాహ్ ను మరియు ఆయన సందేశాలను విశ్వసిస్తాడు. అతనినే అనుసరించండి, తద్వారా మీరు మార్గదర్శకత్వం పొందుతారు!”} {అల్ ఆరాఫ్: 158}

హజ్రత్ అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

ఎవరి (చేతిలో) ఆదీనంలో ముహమ్మద్ ప్రాణం ఉందో ఆయన సాక్షిగా “ఈ (జాతిలో) సమాజంలోని యూదుడైన క్రైస్తవుడైనా, ఇంకెవరైనా నాకు ఇచ్చి పంపించబడ్డ (ఖుర్ఆన్) దాని అనుసారంగా విశ్వసించకుండానే మరణిస్తే అతను నరకవాసుల్లోంచి అయిపోతాడు”.

దాని (ఇస్లాం ధర్మం) పట్ల విశ్వాసం: ఆయన తీసుకుని వచ్చిన ధర్మమును దృవీకరించటంతో పాటు అంగీకరించడం మరియు దానికి కట్టుబడి ఉండటం. కేవలం దృవీకరిస్తే సరిపోదు. అందుకనే అబూతాలిబ్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దానిని దృవీకరించి, అది ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం అని సాక్ష్యం పలికినా కూడా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించినవారు కాలేకపోయారు.

ఇస్లాం ధర్మం పూర్వ ధర్మాలు పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రయోజనములన్నింటిని పరిగణలోకి తీసుకుంది. అది ప్రతీ కాలము, ప్రదేశము మరియు జాతి కొరకు ప్రయోజనకరమవటం వలన వాటి ప్రత్యేకత కలదు. అల్లాహ్ తఆలా తన ప్రవక్తను ఉద్దేశించి ఇలా సెలవిచ్చాడు:

وَأَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيْهِ مِنَ الْكِتَابِ وَمُهَيْمِنَا عَلَيْهِ

{ఇంకా ఓ ప్రవక్తా మేము నీ వైపుకు ఈ గ్రంధాన్ని సత్యాసమేతంగా అవతరింప చేసాము, అది తనకన్నా ముందు వచ్చిన గ్రంధాలను సత్యమని ధృవీకరిస్తుంది వాటిని పరిరక్షిస్తుంది.} [అల్ మాయిదా:48]

ఇస్లాం మతం ప్రతి యుగానికి, ప్రతిచోటా మరియు ప్రతి ఉమ్మత్ కు చెల్లుబాటు అవుతుంది అంటే ఈ మతంతో బలమైన సంబంధం ఏ కాలానికి, ప్రదేశానికి మరియు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండకూడదు, కానీ ఇందులో వారి మెరుగుదల మరియు ప్రయోజనం ఉంది. కొంతమంది అనుకుంటున్నట్లుగా మతం సుదూర ప్రాంతాలకు, ప్రతిచోటా, ప్రతి జాతికి విధేయంగా, అనుసరణగా ఉందని దీని అర్థం కాదు.

ఇస్లాం ధర్మం – ఆ సత్య ధర్మము దేనినైతే తగినవిధంగా అంటిపెట్టుకుని ఉండేవారికి అల్లాహ్ సహాయం చేస్తాడని మరియు అతనిని ఇతరులపై ఆధిక్యతను ప్రసాదిస్తాడని హామీ ఇచ్చాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

هُوَ الَّذِي أَرْسَلَ رَسُولَهُ بِالْهُدَى وَدِينِ الْحَقِّ لِيُظْهِرَهُ عَلَى الدِّينِ كُلِهِ وَلَوْ كَرِهَ الْمُشْرِكُون

{బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) అది ఎంత అసహ్యకరమైనా, తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని మరియు సత్యధర్మాన్నీ ఇచ్చి పంపి దానిని సకల ధర్మాల మీద ప్రబలింప జేసినవాడు (ఆధిక్యతనిచ్చిన వాడు) ఆయన (అల్లాహ్) యే!} [సఫ్:9]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَعَمِلُوا الصَّالِحَاتِ لَيَسْتَخْلِفَنَّهُم فِي الْأَرْضِ كَمَا اسْتَخْلَفَ الَّذِينَ مِن قَبْلِهِمْ وَلَيُمَكِّنَنَّ لَهُمْ دِينَهُمُ الَّذِي ارْتَضَى لَهُمْ وَلَيُبَدَلَنَّهُم مِّن بَعْدِ خَوْفِهِمْ أَمْنًا يَعْبُدُونَنِي لاَ يُشْرِكُونَ بِي شَيْئًا وَمَن كَفَرَ بَعْدَ ذلِكَ فَأُوْلَئِكَ هُمُ الْفَاسِقُون

{మరియు మీలో విశ్వసించి సత్కార్యాలు చేసేవారితో వారికి పూర్వం వారిని భూమికి ఉత్తరాధికారులుగా చేసినట్లు, వారిని కూడా ఉత్తరాధికారులుగా చేస్తానని; మరియు వారి కొరకు తాను సమ్మతించిన ధర్మాన్ని (ఇస్లాంను) స్థిరపరుస్తానని; మరియు వారి పూర్వపు భయస్థితిని వారి కొరకు శాంతిస్థితిగా మార్చుతానని, అల్లాహ్ వాగ్దానం చేశాడు. (ఇదంతా) వారు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించాలని మరియు నాకు ఎవరినీ సాటిగా (భాగస్వాములుగా) కల్పించరాదని, మరియు దీని తరువాత కూడా ఎవరైనా సత్యతిరస్కారానికి పాల్పడితే అలాంటి వారు, వారే అవిధేయులు.} [నూర్:55]

1. అది అల్లాహ్ తఆలా ఏకేశ్వరోపాసన గురించి ఆదేశిస్తుంది మరియు షిర్క్ నుండి వారిస్తుంది.

2. సత్యం పలకటం గురించి ఆదేశిస్తుంది మరియు అసత్యం పలకటం గురించి వారిస్తుంది.

3. న్యాయం గురించి ఆదేశిస్తుంది మరియు అన్యాయం నుండి వారిస్తుంది. న్యాయం (అదల్) అంటే ఒకే రకమైన వస్తువుల మధ్య సమానత్వము మరియు వేరువేరు వస్తువుల మధ్య వ్యత్యాసం చూపటం. న్యాయం అంటే కేవలం సమానత్వం కాదు ఏ విధంగానైతే కొందరు పలుకుతున్నారో, వారు ఇలా పలుకుతున్నారు: ఇస్లాం ధర్మం సమానత్వమైన ధర్మము. ఎందుకంటే వేరువేరు వస్తువుల మధ్య సమానత్వము అన్యాయం అవుతుంది. ఇస్లాంలో అన్యాయమునకు స్థానం లేదు. ఆ విధంగా చేసేవాడు పొగడబడడు.

4. అమానత్ గురించి ఆదేశిస్తుంది మరియు ఖియానత్ గురించి వారిస్తుంది.

5. మాట నెరవేర్చడం గురించి ఆదేశిస్తుంది మరియు ద్రోహం నుండి వారిస్తుంది.

6. తల్లిదండ్రుల యెడల మంచిగా మెలగమని ఆదేశిస్తుంది మరియు తల్లిదండ్రుల పట్ల అవిధేయత నుండి వారిస్తుంది.

7. బంధుత్వమును కలపమని ఆదేశిస్తుంది. వారు దగ్గరి బంధువులు మరియు బంధుత్వమును త్రెంచటం నుండి వారిస్తుంది.

8. ఇరుగుపొరుగు వారితో సద్వ్యవహారం చేయమని ఆదేశిస్తుంది మరియు వారితో దుర్వ్యవహారం నుండి వారిస్తుంది.

సాధారణంగా ఇస్లాం ప్రతీ ఉన్నత నైతికత గురించి ఆదేశిస్తుంది మరియు ప్రతి చెడు నైతికత నుండి వారిస్తుంది. మరియు ప్రతీ సత్కార్యము గురించి ఆదేశిస్తుంది మరియు ప్రతి దుష్కార్యము నుండి వారిస్తుంది.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

إنَّ اللهَ يَأْمُرُ بِالْعَدْلِ وَالإِحْسَانِ وَإِيتَاءِ ذِي الْقُرْبَى وَيَنْهَى عَنِ الْفَحْشَاءِ وَالْمُنكَرِ وَالْبَغْيِ يَعِظُكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُونَ

{నిశ్చయంగా, అల్లాహ్ న్యాయం చేయమని మరియు (ఇతరులకు) మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం చేయమని మరియు అశ్లీలత, అధర్మం మరియు దౌర్జన్యాలకు దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఈ విధంగా మీకు బోధిస్తున్నాడు, బహుశా మీరు హితబోధ గ్రహిస్తారని.} [నహ్ల్: 90]

ఇస్లాం మూలస్తంభాలు: దేనిపై ఇస్లాం భవంతి నిర్మితమై ఉన్నదో వాటిని ఇస్లాం మూలస్తంభాలు అంటారు. అవి ఐదు: అవి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన హదీసులో ప్రస్తావించబడినవి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

ఇస్లాం పునాది ఐదు వస్తువులపై ఉంచబడినది. అంటే అల్లాహ్ ఏకేశ్వరోపాసన చేయాలి. ఇంకో ఉల్లేఖనంలో అల్లాహ్ తప్ప వేరే వాస్తవ ఆరాధ్య దైవం లేడని, ముహమ్మద్ ఆయన దాసుడు, ఆయన ప్రవక్త అని సాక్ష్యం పలకటం, నమాజ్ నెలకొల్పటం, జకాత్ విధిదానం చెల్లించటం, రమజాన్ ఉపవాసాలు ఉండటం మరియు హజ్ చేయటం. ఒక వ్యక్తి హజ్ ను ముందు ప్రస్తావించి రమజాన్ ఉపవాసములను తరువాత ప్రస్తావిస్తే అబ్దుల్లాహ్ ఇబ్నెఉమర్ అలా కాదు రమజాన్ ఉపవాసాలు ఆ తరువాత హజ్ అని పలికారు. మరియు నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఈవిధంగానే విన్నాను అన్నారు.

1. అల్లాహ్ తప్ప నిజమైన దైవం లేడని, ముహమ్మద్ ఆయన దాసులు మరియు ఆయన ప్రవక్త అని సాక్ష్యం చెప్పడం అంటే:

సాక్ష్యంపై పూర్తి మరియు ఖచ్చితమైన విశ్వాసం కలిగి ఉండటం మరియు ఈ సాక్ష్యాన్ని నాలుకతో పలకటం, అంటే సాక్షి యొక్క సాక్ష్యం తాను చూసినట్లుగా విశ్వాసం మరియు నమ్మకం కలిగి ఉండాలి.

ఈ సాక్ష్యం ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పటికీ ఒకే మూలస్తంభముగా లెక్కించబడుతుంది. ఇలా ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తరుపు నుండి పంపించబడ్డ సందేశహరులు. కాబట్టి ఆయన కొరకు దైవదాస్యము గురించి, దైవదౌత్యము గురించి సాక్ష్యం పలకటం అల్లాహ్ తప్ప వేరే వాస్తవ ఆరాధ్యదైవం లేడనే సాక్ష్యం పరిపూర్ణం అవటంలోనిది. ఇలా ఎందుకంటే ఈ రెండు సాక్ష్యాలు కర్మలు సరిఅవటానికి, ఆమోదానికి ఆధారము, ఎందుకంటే అల్లాహ్ పట్ల చిత్తశుద్ది లేకుండా, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుసరణ లేకుండా ఏ కార్యమూ సరికాదు మరియు ఆమోదించబడదు. కావున అల్లాహ్ కొరకు చిత్తశుద్ధితోనే లా యిలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యము పలకటం నిజమవుతుంది మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరణ ద్వారా ముహమ్మద్ అల్లాహ్ దాసుడు అని, ఆయన ప్రవక్త అని సాక్ష్యం పలకటం నిజమవుతుంది.

ఈ గొప్ప సాక్ష్యం యొక్క ఫలాలు: మనస్సును, స్వయాన్ని సృష్టిరాసుల దాస్యం నుండి మరియు ప్రవక్తేతరులు అనుసరణ నుండి స్వేచ్ఛ నొసగటం.

2. నమాజును నెలకొల్పటం: దాన్ని దాని సమయాలలో, దాని సంపూర్ణ పద్ధతిలో నిలకడగా ఆచరించటం ద్వారా మహోన్నతుడైన అల్లాహ్ ను ఆరాధించటం.

దాని ఫలాలు: హృదయం విశాలమవటం, కంటి చలవ ప్రాప్తించటం, అశ్లీలత, చెడుల నుండి నివారించటం.

3. జకాత్ చెల్లించటం: జకాత్ యోగ్యత గల సంపదలలో నుంచి అనివార్య పరిమాణమును ఖర్చు చేయటం ద్వారా అల్లాహ్ ఆరాధన చేయటం.

దాని ఫలాలు: దుష్ట గుణాల (పిసినారితనం) నుండి మనస్సు శుద్ది అవటం మరియు ఇస్లాం, ముస్లిముల అవసరాలను తీర్చటం.

4. రమజాను మాసపు ఉపవాసములు ఉండటం: రమజాను దినంలో అన్న పానీయాల నుండి ఆగి అల్లాహ్ ఆరాధన చేయటం.

దాని ఫలాలలో నుంచి: అల్లాహ్ మన్నతను ఆశిస్తూ ఇష్టకరమైన వస్తువులను వదలటం పై మనస్సును అదుపులో ఉంచటం.

5. బైతుల్లాహ్ హజ్ చేయటం: హజ్ కార్యాలను నెలకొల్పటం కొరకు కాబతుల్లాహ్ వైపు ప్రయాణమును పూనుకుని అల్లాహ్ ఆరాధన చేయటం..

దాని ఫలాలలో ఒకటి: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కి విధేయతతో ఆర్థిక మరియు శారీరక శ్రమ చేయడానికి ఆత్మను మచ్చిక చేసుకోవడం, మరియు ఈ కారణంగా హజ్ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మార్గంలో ఒక రకమైన పవిత్రయుద్దం.

ఈ మూలస్తంభాల కొరకు మేము ప్రస్తావించిన ఫలాలు, మేము ప్రస్తావించని ఫలాలు ఉమ్మత్ ను పరిశుభ్రమైన, స్వచ్ఛమైన ఇస్లామీయ ఉమ్మత్ గా తీర్చిదిద్దుతాయి. అది అల్లాహ్ కొరకు సత్యధర్మముతో ఆరాధన చేస్తుంది మరియు సృష్టి పట్ల న్యాయపరంగా, నీతిపరంగా వ్యవహారం చేస్తుంది. ఎందుకంటే ఇవి కాకుండా ఇస్లాంలోని ఇతర నియమాలు ఈ మూలస్తంభాల మెరుగుదల వలన మెరుగు అవుతాయి. మరియు ఉమ్మత్ యొక్క పరిస్థితులు దాని ధర్మం యొక్క వ్యవహారం మెరుగుదల వలన మెరుగవుతాయి. మరియు అది తన ధర్మం యొక్క వ్యవహారాల మెరుగుదల కోల్పోయినంతగా దాని పరిస్థితుల మెరుగుదలను కోల్పోతుంది. ఎవరైతే దానిని స్పష్టంగా తెలుసుకోదలచారో వారు అల్లాహ్ యొక్క ఈ వాక్యమును చదవాలి :

وَلَوْ أَنَّ أَهْلَ الْقُرَى آمَنُوا وَاتَّقَوْا لَفَتَحْنَا عَلَيْهِمْ بَرَكَاتِ مِنَ السَّمَاءِ وَالْأَرْضِ وَلَكِنْ كَذَّبُوا فَأَخَذْنَاهُمْ بِمَا كَانُوا يَكْسِبُونَ أَفَأَمِنَ أَهْلُ الْقُرَى أَنْ يَأْتِيَهُمْ بَأْسُنَا بَيَاتًا وَهُمْ نَائِمُونَ أوَأمِنَ أَهْلَ الْقُرَى أَنْ يَأْتِيَهُمْ بَأْسُنَا ضُحَى وَهُمْ يَلْعَبُونَ أَفَأَمِنُوا مَكْرَ اللَّهِ فَلَا يَأْمَنُ مَكْرَ اللَّهِ إِلَّا الْقَوْمُ الْخَاسِرُونَ

{ఈ బస్తీలో నివసించే వాళ్ళేగనక విశ్వసించి, భయభక్తులతో మెలిగి ఉన్నట్లయితే మేము వాళ్ల కోసం భూమ్యాకాశాల శుభాలను (ద్వారాలను) తెరిచే వాళ్ళం. కాని వాళ్ళు ధిక్కారానికి పాల్పడ్డారు. అందువల్ల వారి (చెడు) సంపాదనకు కారణంగా మేము వాళ్ళను పట్టుకున్నాము. అయినప్పటికీ ఈ బస్తీల వాళ్లు రాత్రివేళ నిద్రపోతున్నప్పుడు తమపై మా శిక్ష వచ్చిపడదని నిశ్చింతగా ఉన్నారా? ఏమిటీ, పొద్దెక్కుతుండగా తాము ఆటపాటల్లో నిమగ్నులై ఉన్నప్పుడు (హఠాత్తుగా) మా ఆపద విరుచుకు పడుతుందన్న భయం ఈ బస్తీల వాళ్లకు బొత్తిగా లేదా? ఏమిటీ, వాళ్ళు అల్లాహ్ ఈ వ్యూహం గురించి నిశ్చింతగా ఉన్నారా? నష్టపోయే వారు తప్ప మరొకరెవరూ అల్లాహ్ వ్యూహం గురించి నిర్లక్ష్యంగా ఉండరు.} [అల్ ఆరాఫ్:96-99]

చరిత్రను పరిశీలిస్తే, హేతుబద్ధతకులకు ఒక గుణ పాఠం, హృదయాలపై ముసుగు లేని వారికి చాలా అంతర్దృష్టి ఉంటుంది. అల్లాహుల్ ముస్తఅన్

ఇస్లాం ధర్మము మేము ఇంతకు ముందు స్పష్టపరచినట్లుగా అఖీద (విశ్వాసం) మరియు షరీఅ (ధర్మశాసనం) పేరు. మరియు మేము దాని శాసనాలను సూచించినాము. దాని శాసనాల పునాదిగా షుమారు చేయబడే దాని మూల స్తంభాలను మేము ప్రస్తావించాము.

ఇస్లామీయ అఖీద విషయానికొస్తే దాని పునాదులు: అల్లాహ్ పై విశ్వాసం, ఆయన దూతలపై, ఆయన గ్రంధములపై, ఆయన ప్రవక్తలపై, పరలోకంపై, మంచి-చెడు విధివ్రాతపై విశ్వాసం. అల్లాహ్ యొక్క గ్రంధము మరియు ఆయన ప్రవక్త విధానము ఈ పునాదుల గురించి ఆధారాలుగా ఉన్నవి.

అల్లాహ్ తన గ్రంధములో ఇలా సెలవిస్తున్నాడు:

لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ

(మీరు మీ ముఖములను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే అల్లాహ్ ను, అంతిమ దినాన్నీ, దైవదూతలనూ, దైవగ్రంధాన్ని, దైవప్రవక్తలనూ విశ్వసించటం. } [అల్ బఖర:177]

మరియు విధివ్రాత గురించి ఆయన ఇలా సెలవిస్తున్నాడు:

إِنَّا كُلَّ شَيْءٍ خَلَقْنَاهُ بِقَدَرٍ وَمَا أَمْرُنَا إِلَّا وَاحِدَةً كَلَمْحِ بِالْبَصَرِ

(నిశ్చయంగా మేము ప్రతి దానిని ఒక విధివ్రాత తో సృష్టించాము. మరియు మా ఆజ్ఞ కేవలం ఒక్కటే చాలు, కనురెప్పపాటుది, (అది అయిపోతుంది).} [అల్ ఖమర్ : 49-50]

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ లో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను జిబ్రయీల్ అలైహిస్సలాం విశ్వాసం గురించి అడిగినప్పుడు ఆయన ప్రతిస్పందనగా ఇలా అన్నారు:

విశ్వాసం అంటే నీవు అల్లాహ్ పై, ఆయన దూతలపై, ఆయన గ్రంధములపై, ఆయన ప్రవక్తలపై మరియు అంతిమ దినంపై విశ్వాసమును చూపటం మరియు నీవు విధివ్రాతపై దాని మంచి-చెడులపై విశ్వాసము చూపటం.

ఇక అల్లాహ్ పై విశ్వాసం అన్నది నాలుగు విషయాలను కలిగి ఉంటుంది:

స్వభావం (ఫిత్రత్), బుద్ధి (అఖ్ల్), షరీఅత్, అనుభూతి (హిస్స్) మహోన్నతుడైన ఆయన ఉనికిని సూచిస్తున్నవి.

1. పరిశుద్ధుడైన, మహోన్నతుడైన అల్లాహ్ ఉనికిపై స్వాభావిక సూచన:

నిశ్చయంగా ప్రతీ జీవి తన సృష్టికర్త గురించి ముందస్తూ ఎటువంటి పరిశీలన, జ్ఞానం లేకుండానే తన సృష్టికర్తపై స్వాభావిక విశ్వాసంతో జన్మిస్తుంది. అతని హృదయంపై ఆ స్వభావము నుండి మరల్చే దానితో ఎవరైన ప్రభావం చూపితే తప్ప అది ఆ స్వభావము నుండి మరలదు. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చి ఉన్నారు. జన్మించే ప్రతీ పిల్లవాడు స్వభావంపై జన్మిస్తాడు. కాని అతని తల్లిదండ్రులు అతనిని యూదునిగా లేదా క్రైస్తవునిగా లేదా మజూసీగా మార్చివేస్తారు.

2. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఉనికిపై హేతుబద్ధత (బుద్ధి) యొక్క సూచన:

దీని విషయానికొస్తే, ఈ జీవులు, ముందు మరియు తరువాత, వాటిని సృష్టించిన సృష్టికర్తను కలిగి ఉండాలి, ఎందుకంటే అవి తమంతట తాముగా ఉనికిలోకి రావు, లేదా అనుకోకుండా అకస్మాత్తుగా ఉనికిలోకి రావు. అది తనంతట తానుగా ఉనికిలోకి రావటం అసాధ్యం, ఎందుకంటే ఏదైనా వస్తువు తనను తాను సృష్టించుకోదు, ఎందుకంటే దాని ఉనికికి ముందు అది ఉనికిలో లేదు, అలాంటప్పుడు అది సృష్టికర్త ఎలా అవుతుంది?!

మరియు అది అకస్మాత్తుగా ఉనికిలోకి రావటం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతీ ఉనికిలోకి వచ్చే వాడి కొరకు తప్పనిసరిగా ఉనికిలోకి తెచ్చేవాడు ఉండాలి. ఈ అద్భుతమైన వ్యవస్థపై దాని ఉనికి, సామరస్యపూర్వక సామరస్యం, కారణాలు మరియు మూల కారణాల మధ్య, మరియు ఒకదానితో మరొకటి ఉన్న జీవుల మధ్య సమన్వయమైన సంబంధం ఉన్నందున, వాటి ఉనికి యాదృచ్ఛికం కావడం ఖచ్చితంగా నిషేధించబడింది. ఎందుకంటే యాదృచ్ఛికంగా ఉన్నది దాని ఉనికి యొక్క మూలంలో ఉన్న ఒక వ్యవస్థపై కాదు, కాబట్టి అది మనుగడ సాగించి అభివృద్ధి చెందితే అది ఎలా క్రమబద్దంగా ఉంటుంది?!

ఈ జీవులు తమంతట తాముగా మనుగడ సాగించలేకపోతే, అవి యాదృచ్చికంగా మనుగడ సాగించలేకపోతే, వాటిని ఉనికిలో తీసుకుని వచ్చేవాడు ఉండాలి, ఆయనే సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్.

మహోన్నతుడైన అల్లాహ్ సూరతు-తూర్ లో ఈ హేతుబద్ధమైన ఆధారము మరియు నిశ్చయాత్మక రుజువును పేర్కొన్నాడు, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

أَمْ خُلِقُوا مِنْ غَيْرِ شَيْءٍ أَمْ هُمُ الْخَالِقُونَ
వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా? [తూర్:35]

అంటే సృష్టికర్త లేకుండా వారు సృష్టించబడలేదు. మరియు వారు స్వయంగా సృష్టించబడలేదు. కావున ఋజువయ్యేదేమిటంటే వారి సృష్టికర్త ఉన్నాడు ఆయనే మహిమాన్వితుడైన, మహోన్నతుడైన అల్లాహ్. అందుకనే జుబైర్ ఇబ్నె ముత్ఇమ్ (రజియల్లాహు అన్హు) దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరతు తూర్ చదువుతూ ఈ ఆయతులకు చేరుకున్నప్పుడు విని:

أَمْ خُلِقُوا مِنْ غَيْرِ شَيْءٍ أَمْ هُمُ الْخَالِقُونَ أَمْ خَلَقُوا السَّمَاوَاتِ وَالْأَرْضَ بَلْ لَا يُوقِنُونَ أَمْ عِنْدَهُمْ خَزَائِنُ رَبِّكَ أَمْ هُمُ الْمُصَيْطِرُونَ

{వారు ఏ సృష్టికర్త లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా? లేక వారు ఆకాశాలను మరియు భూమిని సృష్టించారా? అలా కాదు, వారికి విశ్వాసం లేదు. లేదా వారి దగ్గర నీ ప్రభువు కోశాగారాలు ఏవైనా ఉన్నాయా? లేక వారు వాటికి అధికారులా?} [అత్తూర్ : 35-37]

ఆ సమయమున జుబైర్ ముష్రిక్ గా ఉన్నారు ఇలా పలికారు: “నా హృదయం ఉప్పొంగింది, ఇస్లాం నా హృదయంలో నాటుకోవడం ఇదే మొదటిసారి”.

దీనిని వివరించడానికి మేము ఒక ఉదాహరణ ఇద్దాం: చుట్టూ ఉద్యానవనాలు మరియు కాలువలు ప్రవహించే ఒక గొప్ప భవనం ఉందని మరియు భవనం మంచాలు మరియు తివాచీలతో అలంకరించబడి, వివిధ రకాల అలంకరణ వస్తువులతో అమర్చబడిందని ఎవరైనా మీకు తెలియజేస్తే, ఈ భవనం దాని అన్ని లక్షణాలతో తనంతట తానుగా ఉనికిలోకి వచ్చిందని, లేదా సృష్టికర్త లేకుండా అకస్మాత్తుగా ఉనికిలోకి వచ్చిందని మీకు ఎవరైనా చెబితే, అప్పుడు మీరు వెంటనే దానిని తిరస్కరించి అబద్దం అని చెబుతారు మరియు దానిని మూర్ఖత్వమైన మాటగా భావిస్తారు. ఈ సువిశాల ప్రపంచం తన భూమి, ఆకాశాలు మరియు పరిస్థితులతో, దాని ప్రత్యేకమైన మరియు వింత అమరికతో తనను తాను ఎలా సృష్టించుకోగలదు లేదా దానిని సృష్టించే వారు లేకుండా ఉనికిలోకి ఎలా వస్తుంది?!

3. అల్లాహ్ ఉనికి గురించి షరయీ సూచన ఇది:

పరలోక గ్రంధాలన్నీ చెబుతున్నాయి (రుజువులు ఇస్తున్నాయి), మరియు పుస్తకాలలో మానవుల శ్రేయస్సు మరియు మంచితనంపై ఆధారపడిన ఆజ్ఞలు కూడా సర్వజ్ఞుడైన ప్రభువు తరుపు నుండి తన సేవకుల మంచితనం మరియు ఆసక్తులు గురించి అని రుజువు చేస్తున్నాయి. ఆ పుస్తకాల్లోని విశ్వం గురించి సమాచారం, దాని సత్యాన్ని ప్రపంచం అంగీకరించడం, తన సమాచారాన్ని ఉనికిలోకి తీసుకురావడానికి సామర్ధ్యం ఉన్న ప్రభువు నుండి వచ్చినదని రుజువు చేస్తుంది.

4. అల్లాహ్ ఉనికిపై చైతన్యం కలిగించే ఆధారాలు రెండు విధాలుగా ఉన్నవి:

వాటిలో ఒకటి: దుఆ చేసేవారి దుఆలు అంగీకరించబడతాయని మరియు బాధలో ఉన్న ప్రజల కోరికలు నెరవేరుతాయని మేము వింటున్నాము మరియు చూస్తున్నాము. అవి అల్లాహ్ ఉనికి సూచించే ఖచ్చితమైన ఆధారాలు, అల్లాహ్ తఅలా ఇలా సెలవిస్తున్నాడు:

وَنُوحًا إِذْ نَادَى مِن قَبْلُ فَاسْتَجَبْنَا لَهُ

అంతకు ముందు నూహ్ మొర పెట్టుకున్నప్పటి సమయాన్ని గుర్తు చేసుకోండి. మేము అతని మొరను ఆలకించి ఆమోదించాము. [అంబియా:76]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ أَنِّي مُمِدُّكُمْ بِأَلْفِ مِنَ الْمَلَائِكَةِ مُرْدِقِينَ

సహాయం కోసం మీరు మీ ప్రభువును మొరపెట్టుకున్న ఆ సందర్భాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి – మరి అల్లాహ్ మీ మొరను ఆలకించి, “నేను వెయ్యిమంది దూతలతో మీకు సహాయం చేస్తాను. వారు ఎడతెగకుండా – ఒకరి వెనుక ఒకరు వస్తుంటారు” అని చెప్పాడు. [అన్ఫాల్:9]

సహీహ్ బుఖారీలో అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ఇలా ఉన్నది. ఆయన ఇలా తెలిపారు:

ఒక పల్లెటూరి బైతు జుమా రోజు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బా ఇస్తుండగా వచ్చి ఇలా పలికాడు: “ఓ అల్లాహ్ ప్రవక్తా! డబ్బు నాశనమై పోయింది. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు, మా కోసం అల్లాహ్ ను ప్రార్ధించండి, అప్పుడు మీరు మీ రెండు చేతులు పైకెత్తి ప్రార్ధించారు, అప్పుడు మేఘాలు పర్వతాల వలె పెరిగాయి మరియు మీరు మిమ్బర్ నుండి కూడా కిందకు రాలేదు, మీ గడ్డం మీద వర్షపు నీరు పడటం నేను చూశాను.”

రెండవ జుమా నాడు అదే పల్లెటూరి బైతు లేదా మరో వ్యక్తి లేచి నిలబడి ఇలా పలికాడు: ఓ అల్లాహ్ ప్రవక్త ఇళ్ళులు నాశనమైపోయాయి, సంపద మునిగిపోయింది. కావున మీరు మా కొరకు అల్లాహ్ తో ప్రార్ధించండి. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులు పైకెత్తి ఇలా ప్రార్ధించారు:

اللهم حوالينا ولا علينا

“ఓ అల్లాహ్! మా చుట్టూ వర్షం కురిపించు, మాపై వర్షం కురిపించకు”. ఆయన ఏ వైపు సైగ చేసేవారో ఆ వైపు మేఘాలు విచ్చిన్నం అయిపోయేవి.

నిజ హృదయంతో అల్లాహ్ పట్ల శ్రద్ధ వహించి, ప్రార్ధనను అంగీకరించే షరతులను నెరవేర్చే వారి ప్రార్ధనలు అంగీకరించబడతాయని నేటికీ ఇది కనిపిస్తుంది మరియు స్వీయ స్పష్టమవుతుంది.

వాటిలో రెండవ విధం: మొజిజాత్ (అద్భుతాలు) అని పిలువబడే ప్రవక్తలు సంకేతాలు మరియు ప్రజలు చూసే లేదా విన్నవి కూడా ఆ ప్రవక్తలను పంపించిన అల్లాహ్ తఆలా ఉనికికి ఖచ్చితమైన మరియు తిరుగులేని సాక్ష్యాలు, ఎందుకంటే ఈ మొజిజాత్ లు మానవాళి శక్తి యొక్క పరిమితులకు అతీతమైనవి, అల్లాహ్ తన ప్రవక్తలను ధృవీకరించడానికి మరియు వారికి సహాయం చేయడానికి మరియు సహకరించడానికి వెల్లడిస్తాడు.

దీనికి ఉదాహరణ మూసా అలైహిస్సలాం గారి మొజిజా అల్లాహ్ తన కర్రను సముద్రం మీద కొట్టమని ఆయనను ఆజ్ఞాపించినప్పుడు, అతను కర్రను కొట్టినప్పుడు, సముద్రంలో పన్నెండు పొడి మార్గాలు ఏర్పడ్డాయి మరియు నీరు వాటి మధ్య పర్వతంలా నిలబడింది, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

فَأَوْحَيْنَا إِلَى مُوسَى أَنِ اضْرِب بَعَصَاكَ الْبَحْرَ فَانفَلَقَ فَكَانَ كُلُّ فِرْقٍ كَالطَّوْدِ الْعَظِيمِ

అప్పుడు మేము మూసాకు: “నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు!” అని వహీ ద్వారా తెలిపాము. అప్పుడది హటాత్తుగా చీలిపోయింది, దాని ప్రతిభాగం ఒక మహా పర్వతం మాదిరిగా అయిపోయింది. [అష్ షురా :63]

రెండవ ఉదాహరణ: ఈసా అలైహిస్సలాం గారి అద్భుతం. అల్లాహ్ ఆజ్ఞ మేరకు ఆయన మృతులను జీవింపజేసేవారు మరియు వారిని వారి సమాధుల నుండి లేపేవారు, అల్లాహ్ ఆయన గురించి ఇలా సెలవిచ్చాడు:

وَأُحْيِي الْمَوْتَى بِإِذْنِ اللَّهِ
{మరియు అల్లాహ్ ఆజ్ఞ మేరకు నేను మృతులను జీవింపజేస్తాను.} [ఆలే ఇమ్రాన్ :49]

మరియు ఇలా సెలవిచ్చాడు:

وَإِذْ تُخْرِجُ الْمَوتَى بِإِذْنِي
{మరియు అప్పుడు నీవు నా ఆజ్ఞ ప్రకారము మృతులను బయటకు తీసేవాడివి} [మాయిద:110]

మూడవ ఉదాహరణ: మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మొజిజా ఏమిటంటే, ఖురేషీలు మిమ్మల్ని ఒక సంకేతం (అద్భుతం) కోసం అడిగి నప్పుడు, మీరు చంద్రుడి వైపు సైగ చేశారు. అప్పుడు అది రెండు ముక్కలుగా వేరై పోయింది. దాన్ని ప్రజలు చూశారు. దాని గురించి వర్ణిస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

اقْتَرَبَتِ السَّاعَةُ وَانْشَقَّ الْقَمَرُ وَإِنْ يَرَوْا آيَةً يُعْرِضُوا وَيَقُولُوا سِحْرٌ مُسْتَمِرٌّ

{ప్రళయం దగ్గరపడింది. చంద్రుడు చీలిపోయాడు. ఒకవేళ వీళ్లు ఏదైనా మహిమను చూసినా, దాన్నుండి ముఖం త్రిప్పుకుంటారు. పూర్వం నుండి జరుగుతూ వస్తున్న మాయాజాలమే కదా ఇది అనంటారు.} [అల్ ఖమర్ : 1-2]

అల్లాహ్ తన ప్రవక్తల కొరకు సహాయంగా, సహకారంగా వెల్లడించే ఈ ఇంద్రియ సూచనలు అల్లాహ్ ఉనికిపై ఖచ్చితంగా సూచించే సూచన.

అంటే ఆయన ఒక్కడే ప్రభువు. ఆయనకి భాగస్వామి లేదా సహాయకుడు ఎవ్వరూ లేరు.

మరియు ప్రభువు (రబ్) ఎవరంటే ఎవరి కొరకైతే సృష్టించటం, సామ్రాజ్యాధికారం, ఆదేశం ప్రత్యేకమో అతనే. కావున అల్లాహ్ తప్ప ఇంకెవరు సృష్టికర్త లేడు, ఆయన తప్ప యజమాని లేడు, ఆయనకు తప్ప ఇంకెవరికి ఎటువంటి ఆదేశం లేదు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

ألَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ
{వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం, ఆజ్ఞాపన ఆయన సొత్తు} [అల్ ఆరాఫ్:54]

మరియు ఇలా సెలవిచ్చాడు :

ذَلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ
{ఈ అల్లాహ్ యే మీ ప్రభువు. విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయన్ని వదిలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు.} [ఫాతిర్:13]

సృష్టిలోంచి ఎవరు కూడా అల్లాహ్ సుబహానహువ తఆలా యొక్క రబూబియత్ ను తిరస్కరించలేదు. కాని ఎవరికైతే అహంకారం ఉన్నదో వారు తప్ప. వారికి తాము పలికే వాటి పైనే నమ్మకం ఉండేది కాదు. ఎలాగైతే ఫిర్ఔన్ యొక్క ఈ మాటలతో వెల్లడౌతుంది. అతడు తన జాతి వారిని ఉద్దేశించి ఇలా పలికాడు:

{నేను మీ యొక్క గొప్ప ప్రభువును} [నాజిఆత్:24].

మరియు ఇలా పలికాడు:

{ఓ ప్రముఖులారా నేను తప్ప మీకు మరో దేవుడున్నాడన్న సంగతి నాకు తెలియదు.} [అల్ ఖసస్:38]

కాని ఇది ఎటువంటి విశ్వాసంతో కూడుకున్నది కాదు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{నిజానికి వారి మనసులు (సత్యాన్ని) నమ్మినప్పటికీ అన్యాయం, అహంకారంతో వారు దాన్ని త్రోసి పుచ్చారు} [అన్ నమ్ల్ : 14]

మరియు మూసా అలైహిస్సలాం ఫిర్ఔన్ తో ఇలా పలికారు ఆయన గురించి అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా వివరించాడు:

{గుణపాఠంతో కూడుకున్న ఈ సూచనలను భూమ్యాకాశాల ప్రభువు తప్ప మరొకరెవరూ అవతరింపజేయలేదన్న విషయం నీకు తెలుసు. ఓ ఫిర్ఔన్ నిశ్చయంగా నువ్వు వినాశానికి గురయ్యావని నేను భావిస్తున్నాను} [అల్ ఇస్రా : 102]

ఇందు కారణంగానే ముష్రికులు అల్లాహ్ యొక్క ఉలూహియత్ లో సాటి కల్పించటంతో పాటు అల్లాహ్ రుబూబియత్ ను అంగీకరించే వారు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

قُلْ لِمَنِ الْأَرْضُ وَمَنْ فِيهَا إِنْ كُنْتُمْ تَعْلَمُونَ سَيَقُولُونَ لِلَّهِ قُلْ أَفَلَا تَذَكَّرُونَ قُلْ مَنْ رَبُّ السَّمَاوَاتِ السَّبْع وَرَبُّ الْعَرْشِ الْعَظِيمِ سَيَقُولُونَ لِلَّهِ قُلْ أَفَلَا تَتَّقُونَ قُلْ مَنْ بِيَدِهِ مَلَكُوتُ كُلّ شَيْءٍ وَهُوَ يُجِيرُ وَلَا يُجَارُ عَلَيْهِ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ سَيَقُولُونَ لِلَّهِ قُلْ فَأَنَّى تُسْحَرُونَ

{“భూమి మరియు అందులో ఉన్న సమస్త వస్తువులు ఎవరివో మీకే గనక తెలిసి ఉంటే చెప్పండి?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. “అల్లాహ్ వే” అని వారు వెంటనే సమాధానం ఇస్తారు. “మరయితే మీరు హితబోధను ఎందుకు గ్రహించటం లేదు?” అని అడుగు. “సప్తాకాశాలకు, మహోన్నతమైన (అర్ష్) పీఠానికి అధిపతి ఎవరు?” అని వారిని ప్రశ్నించు. “అల్లాహ్ యే” అని వారు జవాబిస్తారు. “మరలాంటప్పుడు మీరెందుకు భయపడరు?” అని వారిని (నిలదీసి అడుగు. సమస్త విషయాల సార్వభౌమత్వం ఎవరి చేతుల్లో ఉందో, శరణు ఇచ్చేవాడెవడో, ఎవరికి వ్యతిరేకంగా ఏ శరణూ లభించదో ఆయనెవరో మీకు తెలిసి ఉంటే చెప్పండి? అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. “అల్లాహ్ మాత్రమే” అని వారు చెబుతారు. “మరైతే మీరు ఎలా మోసపోతున్నారు?” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.} [అల్ మూమినూన్ : 84-89]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ خَلَقَهُنَّ الْعَزِيزُ الْعَلِيمِ

{ఒకవేళ, నీవు వారితో: “భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారు?” అని అడిగితే! వారు తప్పక: “వాటిని సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు సృష్టించాడు” అని అంటారు.}[జుక్రుఫ్ :9]

అల్లాహ్ సెలవిచ్చాడు:

وَلَئِن سَأَلْتَهُم مِّنْ خَلَقَهُمْ لَيَقُولُنَّ اللَّهُ فَأَنَّى يُؤْفَكُون

(మరియు నీవు: “వారిని ఎవరు సృష్టించారు?” అని వారితో అడిగినప్పుడు, వారు నిశ్చయంగా: “అల్లాహ్!” అని అంటారు. అయితే వారు ఎందుకు మోసగింప బడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)?} [జుక్రుఫ్:87]

మరియు అల్లాహ్ యొక్క ఆదేశం అమ్రే కౌనీ మరియు అమ్రే షరయీలో జత అయి ఉంటుంది. ఏ విధంగానైతే ఆయన తన విజ్ఞతకు తగిన విధంగా తాను కోరుకున్న విధంగా విశ్వం యొక్క పర్యలోచన చేసి అందులో నిర్ణయాలు తీసుకుంటాడో అదే విధంగా తన విజ్ఞతకు తగిన విధంగా ఆరాధనలను నిర్ణయించి, వ్యవహారాల అదేశాలను జారి చేసి అందులో శాసకుడవుతాడు. కావున ఎవరైతే ఆరాధనలను ధర్మబద్దం చేసే వానిగా లేదా వ్యవహారాలలో న్యాయనిర్ణేతగా అల్లాహ్ తో పాటు వేరే వారిని చేసుకుంటాడో ఆయనతో పాటు సాటి కల్పించాడు. అతని విశ్వాసం రూఢీ అవ్వదు.

అంటే ఆయన ఒక్కడే నిజఆరాధ్య దైవమని, ఆయన తో పాటు ఎవరు సాటి లేరని విశ్వసించటం. ఇలాహ్ అన్న పదము మాలూహ్ అంటే ఇష్టతతో, గౌరవంతో ఆరాధింపబడేవాడు అని అర్ధము. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

(మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. ఆయన అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు.} [అల్ బఖర:163]

وقال تعالى : شهدَ اللهُ أنَّهُ لا إِلَهَ إِلَّا هُوَ وَالْمَلائِكَةُ وَأُوْلُوا الْعِلْمِ قَائِمَا بِالْقِسْطِ لَا إِلَهَ إِلا هُوَ الْعَزِيزُ الْحَكِيمِ

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

నిశ్చయంగా, ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడని, అల్లాహ్, దైవదూతలు మరియు జ్ఞానవంతులు సాక్ష్యమిచ్చారు; ఆయనే న్యాయపరిరక్షకుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడు! ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు. [ఆలి ఇమ్రాన్ :18]

అల్లాహ్ తో పాటు ఆరాధ్యదైవంగా చేసుకుని ఆయనను వదిలి పూజింబడే ప్రతీ దాని ఉలూహియత్ అవాస్తవము. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

ذَلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ هُوَ الْبَاطِلُ وَأَنَّ اللَّهَ هُوَ الْعَلِيُّ الْكَبِير} [الحج: 62]

ఇది ఎందుకంటే, నిశ్చయంగా అల్లాహ్! ఆయనే సత్యం! మరియు అయనకు బదులుగా వారు ఆరాధించేవన్నీ అసత్యాలే! మరియు నిశ్చయంగా అల్లాహ్ ఆయన మాత్రమే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు). [హజ్:62]

మరియు వాటికి ఆరాధ్య దైవాలుగా నామకరణం చేయటం వలన వాటికి ఉలూహియత్ హక్కు ప్రాప్తించదు. అల్లాహ్ తఆలా లాత్, ఉజ్జా మరియు మనాత్ విషయంలో ఇలా సెలవిచ్చాడు:

إِنْ هِي إِلا أَسْمَاء سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا أَنزَلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ

{నిజానికి ఇవన్నీ మీరూ, మీ తాత ముత్తాతలు వాటికి పెట్టుకున్న పేర్లు మాత్రమే. వీటి గురించి అల్లాహ్ ఏ ప్రమాణమూ పంపలేదు.}[నజ్మ్:23]

అల్లాహ్ తఆలా హూద్ అలైహిస్సలాం గురించి తెలిపాడు. ‘ఆయన తన జాతి ప్రజలకు ఇలా బోధించాడు:

أَتُجَادِلُونَنِي فِي أَسْمَاء سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاوَكُم مَّا نَزَّلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ

(ఏమిటీ, మీరూ మీ తాతముత్తాతలూ కల్పించుకున్న పేర్ల విషయంలో నాతో గొడవ పడుతున్నారా? వాటి గురించి (అవి ఆరాధ్య దైవాలని నిర్ధారించే) ఏ ప్రమాణాన్నీ అల్లాహ్ అవతరింప జెయ్యలేదు.} [అల్ ఆరాఫ్:71]

అల్లాహ్ తఆలా యూసుఫ్ అలైహిస్సలాం గురించి తెలిపాడు. ‘ఆయన చెరసాలలో తనతో పాటు ఉన్న ఇద్దరు ఖైదీలను ఇలా బోధించాడు:

يَا صَاحِبَي السِّجْنِ أَأَرْبَابٌ مُتَفَزِقُونَ خَيْرٌ أَمِ اللهُ الْوَاحِدُ الْقَهَّارُ مَا تَعْبُدُونَ مِنْ دُونِهِ إِلَّا أَسْمَاءَ سَمَّيْتُمُوهَا أَنْتُمْ وَآبَاؤُكُمْ مَا أَنْزَلَ اللَّهُ بِهَا مِنْ سُلْطَانِ

{ఓ కారాగార సహచరులారా! అనేకమంది విభిన్న ప్రభువులు మేలా? లేక సర్వాధిక్యుడైన ఒక్క అల్లాహ్ మేలా? (మీరే చెప్పండి!) ఆయనను వదలి మీరు పూజిస్తున్నవి మీరూ, మీ తాత ముత్తాతలూ స్వయంగా కల్పించుకున్న కొన్ని పేర్లు తప్ప మరేమీ కావు. వాటికీ సంబంధించి అల్లాహ్ ఏ ప్రమాణాన్నీ అవతరింప జెయ్యలేదు.} [యూసుఫ్:39-40]

అందుకనే దైవప్రవక్తలు అలైహిముస్సలాం తమ జాతి వారిని ఇలా బోధించేవారు :

اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَهِ غَيْرُهُ
(‘మీరు అల్లాహ్ ‘ను ఆరాధించండి, ఆయన తప్ప మరొకరెవరూ మీకు ఆరాధ్యులు కారు’`0 [అల్-ఆరాఫ్ : 59]

కాని ముష్రికులు దాన్ని నిరాకరించారు. మరియు వారు అల్లాహ్ ను వదిలి ఆరాధ్య దైవాలను చేసుకున్నారు. అల్లాహ్ తో పాటు వారిని ఆరాధించేవారు, వారితో సహాయమును అర్ధించేవారు మరియు మొరపెట్టుకునేవారు.

అల్లాహ్ రెండు బుద్ధిపరమైన ప్రమాణాలతో ముష్రికులు ఈ ఆరాధ్యదైవాలు చేసుకోవటమును అసత్యపరచాడు:

మొదటి ప్రమాణం: వారు తయారు చేసుకున్న ఈ ఆరాధ్య దైవాలలో ఉలూపియ్యత్ లక్షణాలలో నుంచి ఏదీ లేదు. వారు సృష్టించబడిన వారు, సృష్టించలేరు. తమ దాస్యం చేసే వారికి ఎటువంటి లాభము చేకూర్చలేరు మరియు వారి నుండి ఎటువంటి నష్టమును దూరం చేయలేరు. వారికి మరణ, జీవనాల అధికారం లేదు. ఆకాశములలో వారికి ఎటువంటి అధికారము లేదు. వాటిలో వారికి భాగస్వామ్యము లేదు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{అయినా వారు ఆయనకు బదులుగా ఏమీ సృష్టించలేని మరియు తామే సృష్టింపబడిన వారిని ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారు. మరియు వారు తమకు తాము ఎట్టి నష్టం గానీ, లాభం గానీ చేసుకోజాలరు. మరియు వారికి మరణం మీద గానీ, జీవితం మీద గానీ మరియు పునరుత్థాన దినం మీద గానీ, ఎలాంటి అధికారం లేదు.} [ఫుర్ఖాన్:3]

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{వారితో ఇలా అను: “అల్లాహ్ ను వదలి మీరు ఎవరినైతే, (ఆరాధ్యదైవాలుగా) భావిస్తున్నారో, వారిని పిలిచి చూడండి!” ఆకాశాలలో గానీ మరియు భూమిలో గానీ రవ్వ (పరమాణువు) అంత వస్తువుపై కూడా వారికి అధికారం లేదు. మరియు వారికీ ఆ రెండింటిలో ఎలాంటి భాగస్వామ్యమూ లేదు. మరియు ఆయనకు వారిలో నుండి ఎవ్వడూ సహాయకుడునూ కాడు. ఆయన వద్ద ఆయన అనుమతించిన వారి కొరకు తప్ప – (ఒకరి) సిఫారసు (ఇంకొకరికీ) ఏమాత్రం ఉపకరించదు.} [సబా:22-23]

وقال تعالى : أَيُشْرِكُونَ مَا لَا يَخْلُقُ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ وَلَا يَسْتَطِيعُونَ لَهُمْ نَصْرًا وَلَا أَنْفُسَهُمْ يَنْصُرُونَ }

మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

ఏమీ? దేనినీ కూడ సృష్టించలేని మరియు (స్వయంగా) తామే సృష్టించబడిన వారిని, వారు ఆయనకు సాటిగా (భాగస్వాములుగా) కల్పిస్తారా? మరియు వారు, వారికి ఎలాంటి సహాయం చేయలేరు మరియు తాము కూడా సహాయం చేసుకోలేరు.} [ఆరాఫ్:191-192]

ఈ ఆరాధ్యదైవాల పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, వారిని ఆరాధించడం చాలా మూర్ఖత్వం మరియు చాలా పనికిరాని పని.

రెండవ ప్రమాణము: ఈ ముష్రికులందరు అల్లాహ్ అన్నిటి అధికారాలు తన చేతిలో కలిగి ఉన్న ఏకైక ప్రభువు, సృష్టికర్త అని, ఆయనే ఆశ్రయం ఇచ్చేవాడని, ఆయనకు వ్యతిరేకంగా ఎవరు ఆశ్రయం ఇవ్వలేరని అంగీకరించేవారు. ఇది ఆయన ఒక్కడి కొరకు రుబూబియత్ ను తప్పనిసరి చేసినట్లుగా ఆయన ఒక్కడి కొరకు ఉలూహియత్ ను తప్పనిసరి చేస్తుంది.

كما قال تعالى : {يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءَ وَأَنْزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَكُمْ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَنْدَادًا وَأَنْتُمْ

అల్లాహ్ ఏవిధంగా నైతే సెలవిచ్చాడో:

{ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి- తద్వారానే మీరు (పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు. ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పు గానూ చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా నిలబెట్టకండి.} [బఖర:21 – 22]

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

(మరియు నీవు: “మిమ్మల్ని ఎవరు సృష్టించారు?” అని వారితో అడిగినప్పుడు, వారు నిశ్చయంగా: “అల్లాహ్!” అని అంటారు. అయితే వారు ఎందుకు మోసగింప బడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)?} [జుఖ్రుఫ్: 87]

మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{“ఆకాశం నుండి, భూమి నుండి మీకు ఉపాధిని సమకూర్చే వాడెవడు? చెవులపై, కళ్లపై పూర్తి అధికారం కలవాడెవడు? ప్రాణమున్న దానిని ప్రాణము లేని దాని నుండీ, ప్రాణము లేని దానిని ప్రాణమున్న దాని నుండీ వెలికి తీసేవాడెవడు? సమస్త కార్యాల నిర్వహణకర్త ఎవరు?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. “అల్లాహ్ యే” అని వారు తప్పకుండా చెబుతారు. “మరలాంటప్పుడు మీరు (అల్లాహ్ శిక్షకు) ఎందుకు భయపడరు? ఆ అల్లాహ్ యే మీ నిజప్రభువు. సత్యం తరువాత మార్గ విహీనత తప్ప ఇంకేముంటుందీ? మరి మీరు ఎటు మరలిపోతున్నారు?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.} [యూనుస్:31-32]

అల్లాహ్ యొక్క నామములు మరియు గుణగణాలను విశ్వసించడం. అంటే అల్లాహ్ తన గ్రంధం లేదా తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క సున్నత్ లో తన కోసం నిరూపించిన నామములు మరియు గుణగణాలను అల్లాహ్ గౌరవానికి తగినవిధంగా నిరూపించాలి, తద్వారా వాటి అర్థం మారకూడదు. వాటిని అర్థరహితంగా చేయకూడదు, వాటి స్థితిని నిర్ణయించకూడదు మరియు వాటిని ఏ ప్రాణితో సమానమైన పోలిక ఇవ్వకూడదు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا ۖ وَذَرُوا الَّذِينَ يُلْحِدُونَ فِي أَسْمَائِهِ ۚ سَيُجْزَوْنَ مَا كَانُوا يَعْمَلُونَ

{అల్లాహ్ కు మంచి మంచి పేర్లున్నాయి. కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. ఆయన పేర్ల విషయంలో వక్రంగా వాదించే వారిని వదలి పెట్టండి. వారు చేస్తూ ఉండిన దానికి వారు తప్పకుండా శిక్షించబడతారు.} [ఆరాఫ్ 7 :180]

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَلَهُ الْمَثَلُ الأعْلَى فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَهُوَ الْعَزِيزُ الْحَكِيم

{ఆకాశాలలోనూ, భూమిలోనూ ఆయన గుణగణాల దర్పమే సర్వోన్నతమైనది. ఆయన సర్వాధిక్యుడు, వివేకవంతుడు.} [రూమ్:27]

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ وَهُوَ السَّمِيعُ البصير
{ఆయన్ని పోలిన వస్తువేది లేదు. ఆయన వినేవాడు, చూసేవాడు} [షూరా : 11]

ఈ విషయంలో రెండు వర్గాలు మార్గ భ్రష్టతకు గురిఅయ్యాయి:

మొదటి వర్గం (ముఅత్తిల) అల్లాహ్ యొక్క పేర్లు మరియు లక్షణాలను లేదా వాటిలో కొన్నింటిని విశ్వసించనివారు. అల్లాహ్ కు ఈ పేర్లు మరియు లక్షణాలను ధృవీకరించడం వాస్తవానికి అల్లాహ్ ను అతని సృష్టితో సమానంగా చేస్తుందని వారు నమ్ముతారు. కానీ ఈ వాదన ఈ క్రింది కారణాల వల్ల పూర్తిగా తప్పు మరియు అబద్ధం:

మొదటిది: తప్పుడు ఆవశ్యకములను కలిగి ఉంది. ఉదాహరణకు అల్లాహ్ యొక్క కలాం లో వైరుధ్యం. అదెలాగంటే అల్లాహ్ నామములను, గుణగణాలను తన స్వయం కొరకు నిరూపించుకున్నాడు. మరియు తన లాంటిది ఏదీ లేదని నిరాకరించాడు. ఒకవేళ వాటి నిరూపణ వలన సారూప్యత అయితే అల్లాహ్ యొక్క కలాంలో వైరుధ్యం అవుతుంది. మరియు కొన్ని ఆయతులు కొన్ని ఆయతులను అసత్యాలని పలికినట్లవుతుంది.

రెండవ కారణం ఏమిటంటే, రెండు వస్తువులు పేరు లేదా గుణములో ఒకేలా ఉండటం వల్ల అవి రెండూ ఒకేలా మరియు సమానంగా ఉన్నాయని సూచించదు, ఉదాహరణకు, వినడం, చూడటం మరియు మాట్లాడటంలో ఇద్దరు వ్యక్తులు ఒకటే అని మీరు గమనిస్తారు. దానితో వారు మానవతా భావములో, వినటంలో, చూడటంలో మరియు మాట్లాడటంలో సమానవటం కాజాలదు. అదే విధంగా మీరు చేతులు, కాళ్ళు మరియు కళ్ళు ఉన్న జంతువులను చూస్తారు, కానీ అవి వీటన్నింటిలో ఒకటిగా ఉండటం అంటే వాటి చేతులు, కాళ్ళు మరియు కళ్ళు ఒకదానికొకటి మనకు సమానంగా ఉన్నాయని అర్థం కాదు. పేర్లు లేదా లక్షణాల పరంగా జీవుల మధ్య వ్యత్యాసం కనిపిస్తే, సృష్టికర్తకు మరియు జీవులకి మధ్య వ్యత్యాసం స్పష్టంగా మరియు ఎక్కువగా ఉంటుంది.

రెండవ వర్గము: (ముషబ్బిహ) వీరు పేర్లను, గుణాలను అల్లాహ్ తోపాటు ఆయన సృష్టిని పోల్చుతూ దృవీకరిస్తారు. ఇది నుసూస్ (ఖుర్ఆన్, హదీస్) సూచనకు తగిన విధంగా భావిస్తారు. ఎందుకంటే అల్లాహ్ తన దాసులతో వారు అర్ధం చేసుకునే విధంగా సంబోధిస్తాడు. కొన్ని కారణాల వలన ఈ భావన అసత్యము. అవి:

మొదటి కారణం: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను ఆయన సృష్టితో పోల్చడం అవాస్తవం, దీనిని బుద్ది మరియు షరీఆ ఖండిస్తాయి. అయితే గ్రంధం మరియు సున్నహ్ యొక్క సాక్ష్యం మరియు ఆవశ్యకత తప్పు మరియు అబద్ధం అవటం పూర్తిగా అసాధ్యం.

రెండవ కారణం: అల్లాహ్ తఆలా దాసులను అసలు అర్థం నుండి వారు అర్థం చేసుకోగలిగిన దాని ద్వారా సంబోధిస్తాడు, కాని తన వ్యక్తిత్వం మరియు లక్షణాలకు సంబంధించిన అర్థాల వాస్తవికత మరియు ఖచ్చితత్వానికి సంబంధించినంత వరకు, అల్లాహ్ తన జ్ఞానాన్ని తన వద్ద ప్రత్యేకంగా ఉంచాడు.

అల్లాహ్ తాను వినేవాడని తాను స్వయంగా నిరూపించుకుంటే, వినికిడి అసలు అర్ధం (ఇది శబ్దాల యొక్క అవగాహన) పరంగా తెలుసు, కానీ సర్వ శక్తిమంతుడైన అల్లాహ్ యొక్క వినికిడికి సంబంధించి దీని వాస్తవికత తెలియదు, ఎందుకంటే వినికిడి వాస్తవికత జీవులలో కూడా మారుతుంది, కాబట్టి సృష్టికర్త మరియు జీవుల మధ్య వ్యత్యాసం స్పష్టంగా మరియు ఎక్కువగా ఉంటుంది.

అల్లాహ్ తన స్వయం గురించి ఆయన తన సింహాసనమును అధిరోహించాడు అని తెలియపరచినప్పుడు, అధిరోహించడం అసలు అర్ధం పరంగా మనకు తెలుసు. కాని అల్లాహ్ తన సింహాసనమును అధిరోహించిన విషయంలో ఆయన దాన్ని ఎలా అధిరోహించాడో అన్న వాస్తవికత తెలియదు. ఎందుకంటే జీవుల విషయంలో అధిరోహించడం మారుతూ ఉంటుంది. స్థిరంగా ఉన్న కుర్చీని అధిరోహించటం బెదిరిపోయి ఆదీనంలో లేని ఒంటెను అధిరోహించటం లాంటిది కాదు. జీవుల విషయంలోనే వేరు వేరుగా ఉంటే సృష్టికర్త మరియు జీవుల మధ్య వ్యత్యాసము స్పష్టంగా, ఎక్కువగా ఉండును.

అల్లాహ్ ను విశ్వసించటం విశ్వాసపరులకు గొప్ప ఫలాలను ఇస్తుంది. వాటిలో కొన్ని:

ఒకటి: అల్లాహ్ యొక్క ఏకేశ్వరోపాసన (తౌహీద్) ను నిరూపించటం, అదెలాగంటే ఆయన ఒక్కడిపై తప్ప ఇతరులపై ఆశ పెట్టుకోకూడదు, ఆయనతోనే భయపడాలి, ఆయనను తప్ప ఇతరులను ఆరాధించకూడదు.

రెండు: అల్లాహ్ మంచి నామములు, ఆయన గొప్ప గుణాలకు తగిన విధంగా మహోన్నతుడైన ఆయన పట్ల పరిపూర్ణంగా ప్రేమను, గౌరవమును కలిగి ఉండటం.

మూడు: ఆయన ఆదేశించిన వాటిని చేసి ఆయన వారించిన వాటిని విడనాడటం ద్వారా ఆయన ఆరాధనను నిరూపించటం.

దైవదూతలు గోప్యమైన లోకము, సృష్టి. అల్లాహ్ ఆరాధన చేసేవారు. వారికి రుబూబియత్, ఉలూహియత్ ప్రత్యేకతలలోంచి ఏదీ లేదు. అల్లాహ్ వారిని కాంతితో సృష్టించాడు. వారికి తన ఆదేశాలను పూర్తి చేసే సామర్ధ్యమును, వాటిని జారీ చేసే శక్తిని ప్రసాదించాడు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَلَهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَمَنْ عِندَهُ لَا يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِهِ وَلَا يَسْتَحْسِرُونَ يُسَبِّحُونَ اللَّيْلَ وَالنَّهَارَ لَا يَفْتُرُونَ

{ఆయన వద్ద ఉన్నవారు ఆయన్ని ఆరాధించటం పట్ల గర్వం ప్రదర్శించరు. (ఆయన దాస్యం చేస్తూ) అలసిపోరు. వారు రేయింబవళ్లు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు. ఏమాత్రం బద్దకం కూడా చూపరు.} [అంబియా 21:19-20]

వారు సంఖ్యలో చాలా ఉన్నారు. వారిని అల్లాహ్ తప్ప ఎవరూ లెక్కవేయలేరు. మేరాజ్ గాధ గురించి సహీహైన్ లో అనస్ రజియల్లాహు అన్హు గారి హదీసులో ఇలా ఉన్నది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఆకాశములలో ఉన్న బైతే మామూర్ కి తీసుకుని వెళ్ళినప్పుడు చూశారు అక్కడ ప్రతి రోజు డెబ్బై వేల దైవదూతలు నమాజు చేస్తున్నారు. అక్కడ నమాజు చేసి వెళ్ళిన వారి వంతు మరల రావటం లేదు.

దైవదూతలపై విశ్వాసం అన్నది నాలుగు విషయములను ఇమిడి ఉంది:

ఒకటి: వారి ఉనికి పట్ల విశ్వాసం కలిగి ఉండటం.

రెండు: ఏ దైవదూతల పేర్లు మనకు తెలుసో వారి పట్ల విశ్వాసమును కలిగి ఉండటం. ఉదాహరణకు జిబ్రయీల్ అలైహిస్సలాం. ఎవరి పేర్లెతే మనకు తెలవదో వారి పట్ల సంక్షిప్తంగా విశ్వాసమును కలిగి ఉండటం.

మూడు: దైవదూతల గుణముల గురించి మనకు ఏమి తెలుసో దాన్ని విశ్వసించటం. ఉదాహరణకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాం సృష్టించబడిన గుణము గురించి తెలియపరచారు. ఆయనకు ఆరు వందల రెక్కలు కలవు. అవి ఆకాశమండలమును కప్పివేసి ఉన్నాయి.

అప్పుడప్పుడు దైవదూతలు అల్లాహ్ ఆదేశం మేరకు మానవుని రూపంలో ప్రత్యక్షమవుతారు.ఉదాహరణకు జిబ్రయీల్ అలైహిస్సలాం గురించి వస్తుంది. అల్లాహ్ ఆయనను మర్యమ్ అలైహిస్సలాం వద్దకు పంపించినప్పుడు ఆయన ఆమె వద్దకు సామాన్య మానవుని రూపంలో ప్రత్యక్షమయ్యారు. మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులతో కూర్చున్నప్పుడు ఆయన మానవరూపంలో తెల్లటి వస్త్రములలో, నల్లటి జుట్టుని కలిగి, ఆయనపై ఎటువంటి ప్రయాణ చిహ్నములు లేకుండా ప్రత్యక్షమయ్యారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులలోంచి ఎవరికి ఆయన ఎవరో తెలియదు. ఆయన వచ్చి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మోకాళ్ళకు తన మోకాళ్ళను ఆనిచ్చి, తన అరచేతులను ఆయన తొడలపై పెట్టారు. ఆ తరువాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇస్లాం గురించి, ఈమాన్ గురించి, ఇహ్సాన్ గురించి, ప్రళయము మరియు దాని సూచనల గురించి ప్రశ్నించారు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు వాటి గురించి సమాధానమిచ్చారు. ఆయన వెళ్ళిపోయిన తరువాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులతో ఇతను జిబ్రయీల్, మీకు మీ ధర్మం గురించి నేర్పటానికి ఆయన మీ వద్దకు వచ్చారు అని అన్నారు. మరియు ఇలాగే అల్లాహ్ ఇబ్రాహీం, లూత్ అలైహిమస్సలాం వద్దకు పంపించిన దూతలు కూడా వారు మానవుని రూపంలో వచ్చారు.

దైవదూతలపై విశ్వాసంతో ఇమిడి ఉన్న నాల్గవ విషయం: మాకు తెలిసిన వారి ఆచరణలు వేటినైతే వారు అల్లాహ్ ఆదేశం మేరకు కార్యరూపము దాల్చుతారో వాటిపై విశ్వాసమును కలిగి ఉండటం. ఉదాహరణకు అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడటం, రాత్రింబవళ్ళు ఎటువంటి అలసత్వం, విరక్తి లేకుండా ఆయన ఆరాధన చేయటం. వారిలోని కొందరు దూతలు కొన్ని ప్రత్యేక కార్యాల కొరకు ఉన్నారు.

ఉదాహరణకు: జిబ్రయీల్ అమీన్ అలైహిస్సలాం అల్లాహ్ వహీ తీసుకుని రావటం కొరకు ఉన్నారు. అల్లాహ్ దైవవాణిని ఇచ్చి వారిని సందేశహరుల వద్దకు, దైవప్రవక్తల వద్దకు పంపిస్తాడు. ఉదాహరణకు మీకాయీల్ అలైహిస్సలాంకి వర్షం, మొక్కల బాధ్యత ఇవ్వబడినది. ఉదాహరణకు ఇస్రాఫీల్ అలైహిస్సలాం ప్రళయం సంభవించేటప్పుడు, మానవులు మరల జీవింపబడి లేపబడేటప్పుడు బాకలో ఊదే బాధ్యత ఇవ్వబడి ఉన్నారు. అలాగే మలకుల్ మౌత్ మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఆత్మలను సేకరించే బాధ్యత ఇవ్వబడి ఉన్నారు.అలాగే మాలిక్ కి నరకము యొక్క బాధ్యత ఇవ్వబడి ఉంది. అంతే కాక అతడు నరక రక్షక భటుడు. మరియు అలాగే మాతృగర్భములలో ఉండే శిశువులపై బాధ్యులుగా ఉండే దూతలు, తల్లి గర్భంలో మనిషి నాలుగు నెలలు పూర్తి చేసుకోగానే అల్లాహ్ ఒక దూతను అతని ఆహారము గురించి, అతని ఆయుషు గురించి, అతని ఆచరణ గురించి, అతడు పుణ్యాత్ముడవుతాడో, పాపాత్ముడవుతాడో వ్రాయమని ఆదేశించి పంపుతాడు. మరియు అలాగే ఆదమ్ సంతతి యొక్క ఆచరణల పరిరక్షణ, వాటిని వ్రాసే బాధ్యత ఇవ్వబడిన దూతలు. ప్రతీ మానవుని కొరకు ఇద్దరు దూతలుంటారు. ఒకరు కుడి వైపున, రెండవవారు ఎడమ ప్రక్కన ఉంటారు. మరియు అలాగే శవమును సమాధిలో ఉంచినప్పుడు అతడిని ప్రశ్నించే బాధ్యత ఇవ్వబడిన దూతలు. అతని వద్దకు ఇద్దరు దూతలు వచ్చి అతని ప్రభువు గురించి, అతని ధర్మం గురించి మరియు అతని ప్రవక్త గురించి అతడిని ప్రశ్నిస్తారు.

దైవదూతలపై విశ్వాసం చూపటం పెద్ద పెద్ద ఫలాలను ఇస్తుంది, వాటిలో నుంచి:

1. అల్లాహ్ యొక్క గొప్పతనం (అజ్మత్) , శక్తి మరియు సామర్ధ్యం యొక్క జ్ఞానం లభిస్తుంది, ఎందుకంటే సృష్టి యొక్క గొప్పతనం సృష్టికర్త యొక్క గొప్పతనంపై సూచిస్తుంది.

2. మానవులను రక్షించడానికి మరియు వారి చర్యలను నమోదు చేయడానికి మరియు వారి ఇతర ఆసక్తులు మరియు శ్రేయస్సు కోసం దైవదూతలను నియమించిన అల్లాహ్ యొక్క కృప మరియు ఆశీర్వాదానికి కృతజ్ఞత తెలిపే అవకాశం లభిస్తుంది.

3. దైవదూతలు అల్లాహ్ ఆరాధనలో నిమగ్నమవడంపై వారిపట్ల ప్రేమ ప్రాప్తిస్తుంది.

కొందరు అవినీతిపరులు మరియు తప్పుదారి పట్టిన వ్యక్తులు దైవదూతల భౌతిక ఉనికిని తిరస్కరించారు, దైవదూతలు అంటే మానవులలోని మంచితనం యొక్క రహస్య శక్తి అని వారు అంటున్నారు, కానీ ఇది అల్లాహ్ గ్రంధం మరియు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ మరియు ముస్లింల ఇజ్మా (ఏకాభిప్రాయం) యొక్క తిరస్కరణ.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు.

{సర్వస్తోత్రాలు (శూన్యంలో నుంచి) ఆకాశాలను, భూమిని సృష్టించిన అల్లాహ్ కే శోభిస్తాయి. ఆయన రెండేసి, మూడేసి, నాలుగేసి రెక్కలు గల దూతలను తన సందేశ వాహకులుగా చేసుకుంటాడు.} [ఫాతిర్ :1]

మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు.

{మరియు సత్యతిరస్కారుల ప్రాణాలను దైవదూతలు తీసే దృశ్యాన్ని నీవు చూడగలిగితే (ఎంత బాగుండేది). వారు (దైవదూతలు) వారి ముఖాలపైనను మరియు వారి పిరుదుల పైనను కొడుతూ ఉంటారు.} [అన్ఫాల్:50]

మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{ఈ దుర్మార్గులు మరణ యాతనలో ఉన్నప్పుడు దైవదూతలు తమ చేతులు చాచి సరే ఇక మీ ప్రాణాలు (బయటకు తీయండి అని పలికినప్పుడు నీవు చూస్తే ఎంత బాగుండు.} [అన్ ఆమ్:93]

మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

(తుదకు వారి హృదయాలలోని ఆందోళన తొలగించబడిన తరువాత ఇంతకీ మీ ప్రభువు సెలవిచ్చినదేమిటి? అని అడుగుతారు. సత్యమే పలికాడు. ఆయన మహోన్నతుడు, ఘనాఘనుడు అని వారు చెబుతారు.) [సబా:23]

మరియు స్వర్గవాసుల గురించి ఇలా సెలవిచ్చాడు:

{దైవదూతలు అన్ని ద్వారాల నుండి వారివద్దకు వస్తారు. మీరు చూపిన సహనానికి బదులుగా మీపై శాంతి కురియుగాక. ఈ అంతిమ గృహం ఎంత మంచిది.} [రఅద్:23-24]

సహీహ్ బుఖారీలో అబూహురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ఇలా ఉంది దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

అల్లాహ్ ఎవరైన దాసుడిని ప్రేమించినప్పుడు జిబ్రయీల్ ను పిలిచి ఇలా తెలుపుతాడు: అల్లాహ్ ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాడు కావున నీవు అతడిని ప్రేమించు. అప్పుడు జిబ్రయీల్ అతడిని ప్రేమిస్తారు. జిబ్రయీలు ఆకాశంలో ఉండేవారిలో ఇలా ప్రకటిస్తారు : అల్లాహ్ ఫలా వ్యక్తిని ప్రేమిస్తున్నాడు కావున మీరూ ఆ వ్యక్తిని ప్రేమించండి. అప్పుడు ఆకాశంలో ఉండేవారు అతడిని ప్రేమిస్తారు. ఆ తరువాత భూమిపై అతని కొరకు ఆమోదం వ్రాయబడుతుంది.

సహీహైన్ లోనే అబూహురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

జుమా రోజున మస్జిదులోని ప్రతి ద్వారం వద్ద దైవదూతలు కూర్చుని మొదట వచ్చిన వారి పేర్లు రాస్తారు, తరువాత ఇమామ్ మిన్బర్ మీద కూర్చున్నప్పుడు, వారు రిజిస్టర్ మూసివేసి ఖుత్బా (ప్రసంగం) వినటంలో లీనమైపోతారు.

ఈ ఆయతులు (ఆయతులు మరియు హదీసులు) దైవదూతలకు భౌతిక ఉనికి ఉందని మరియు కొంతమంది మార్గవిహీనులు పలికినట్లు రూపం లేని శక్తి కాదని స్పష్టమైన సాక్ష్యాలు. మరియు ఈ స్పష్టమైన నియమాల ఆధారంగా, ముస్లింలు ఈ అంశంపై ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు.

అల్ కుతుబ్ కితాబున్ యొక్క బహువచనం. దాని అర్ధము ముక్తూబున్ (వ్రాయబడినది) వస్తుంది. ఇక్కడ దాని అర్ధము అల్లాహ్ తన సృష్టి కొరకు కారుణ్యంగా, వారి కొరకు సన్మార్గంగా మరియు వాటి ద్వారా వారు ఇహపరాలలో తమ శుభమునకు చేరుకోవటానికి తన ప్రవక్తలపై అవతరింపజేసిన గ్రంధములు.

దైవ గ్రంధముల పై విశ్వాసం అన్నది నాలుగు విషయములను ఇమిడి ఉంది :

ఒకటి: వాటి అవతరణ అల్లాహ్ వద్ద నుండి వాస్తవం అన్నదానిపై విశ్వాసం కలిగి ఉండటం .

రెండు: వాటిలో నుంచి వేటి పేరు మనకు తెలుసో దాన్ని విశ్వసించటం. ఉదాహరణకు ఖుర్ఆన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడినదని, తౌరాత్ మూసా అలైహిస్సలాం పై అవతరింపబడినదని, ఇంజీలు ఈసా అలైహిస్సలాం పై అవతరింపబడినదనీ, మరియు జబూర్ దావూద్ అలైహిస్సలాంకు ఇవ్వబడినదని. ఇక వేటి పేర్లు మనకు తెలియవో వాటిపై సంక్షిప్తముగా విశ్వాసమును కలిగి ఉండటం.

మూడు: వాటి సమాచారములు సరియైనవని దృవీకరించటం. ఉదాహరణకు ఖుర్ఆన్ సమాచారములు మరియి మార్పు చేర్పులు జరగని పూర్వ గ్రంధముల సమాచారములు.

నాలుగు: రద్దుపరచబడని వాటి ఆదేశములను ఆచరించటం, వాటి పట్ల సంతృప్తి చెందటం, వాటిని అంగీకరించటం. దాని విజ్ఞత మనకు అర్ధం అయినా లేదా అర్ధం కాకపోయిన సరే. పూర్వ గ్రంధములన్ని దివ్యఖుర్ఆన్ ద్వారా రద్దు పరచబడినవి.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{وَأَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ الْكِتَابِ وَمُهَيْمِنَا عَلَيْهِ}

(మరియు (ఓ ప్రవక్తా) మేము నీ వైపుకు ఈ గ్రంధాన్ని సత్యసమేతంగా అవతరింప జేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంధాలను సత్యమని దృవీకరిస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది) [అల్ మాయిద: 48] . అంటే (దానిపై తీర్పునిచ్చేదిగా).

కావున పూర్వగ్రంధాల ఆదేశాలలో నుంచి ఖుర్ఆన్ దృవీకరించిన, సరియైనవని తెలిపిన వాటిని తప్ప వేటినీ ఆచరించటం సమ్మతం కాదు.

దైవగ్రంధాలపై విశ్వాసం చూపటం పెద్ద పెద్ద ఫలాలను ఇస్తుంది, వాటిలో నుంచి :

ఒకటి: మహోన్నతుడైన అల్లాహ్ యొక్క తన దాసులపై ఉన్న ఉపకారమును తెలుసుకోవటం. ఎందుకంటే ఆయన ప్రతీ జాతిపై వారి సన్మార్గం కొరకు ఒక గ్రంధమును అవతరింపజేశాడు.

రెండు: అల్లాహ్ తన ధర్మశాసనాలు ఏర్పరచటంలో ఆయన యొక్క విజ్ఞత ఏమిటో తెలుసుకోవటం. ఎందుకంటే ఆయన ప్రతీ జాతి వారికొరకు వారి పరిస్థితులకు తగిన విధంగా ధర్మశాసనాలను చేశాడు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

{لِكُلٍّ جَعَلْنَا مِنكُمْ شِرْعَةً وَمِنْهَاجًا)
(మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్ని నిర్ధారించాము) [అల్ మాయిద:48]

మూడు: ఈ విషయంలో అల్లాహ్ యొక్క అనుగ్రహం పట్ల కృతజ్ఞత తెలుపుకోవటం.

అర్రుసుల్ రసూల్ యొక్క బహువచనం. దాని అర్ధం ముర్సల్ అని వస్తుంది. అంటే ఏదైన వస్తువును చేరవేయటానికి పంపించ బడినవాడు అని అర్ధం. ఇక్కడ దైవసందేశహరుడు అంటే మానవులలో నుంచి ఆ వ్యక్తి ఎవరికైతే వహీ ద్వారా ధర్మశాసనాలు ఇవ్వబడినవో మరియు వాటిని చేరవేయమని ఆదేశించబడినదో.

దైవసందేశహరులలో మొదటి వారు నూహ్ అలైహిస్సలాం, మరియు వారిలో చివరి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{(ఓ ముహమ్మద్) మేము నూహ్ వైపుకు, అతని తరువాత వచ్చిన ప్రవక్తల వైపుకు వహీ పంపినట్లే నీ వైపునకు వహీ పంపాము.} [అన్నిసా:163]

సహీహ్ బుఖారీలో అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనంలో షఫాఅత్ గురించి హదీసు ఉన్నది. అందులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “ప్రజలు తమ కొరకు సిఫారసు చేయించు కోవటానికి ఆదమ్ అలైహిస్సలాం వద్దకు వస్తారు. ఆయన వారితో నిరాకరిస్తారు. మరియు ఇలా తెలుపుతారు మీరు అల్లాహ్ మొట్టమొదట ప్రవక్తగా పంపించిన నూహ్ అలైహిస్సలాం వద్దకు వెళ్ళండి. మరియు ఆయన పూర్తి హదీసును ప్రస్తావించారు.”

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

مَّا كَانَ مُحَمَّدٌ أَبَا أَحَدٍ مِّن رِجَالِكُمْ وَلَكِن رَّسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ} [الأحزاب]

{(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు.} [అహ్ జాబ్ ]

ప్రవక్త లేదా సందేశహరుడు రాని ఉమ్మత్ ఒక్కటి కూడా లేదు, కానీ అల్లాహ్ ఒక శాశ్వత షరీఅత్ తో తన స్వంత ప్రజల వద్దకు ఒక ప్రవక్తను పంపాడు, లేదా ప్రవక్త యొక్క ధర్మశాస్త్రాన్ని బహిర్గతం ద్వారా పునరుద్ధరించడానికి ఒక ప్రవక్తను పంపాడు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{وَلَقَدْ بَعَثْنَا فِي كُلَّ أُمَّةٍ رَسُولاً أَنِ اعْبُدُوا اللهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ]

(నిశ్చయంగా మేము ప్రతీ సముదాయంలో ప్రవక్తను ప్రభవింపచేసాము, [ప్రజలారా] కేవలం అల్లాహ్ ను ఆరాధించండి మరియు తాగూత్ (మిథ్యాదైవాలు) కు దూరంగా ఉండండి} [నహ్ల్:36]

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

(హెచ్చరించేవాడు గడచి ఉండని సమాజం అంటూ ఏదీ లేదు} [ఫాతిర్:24]

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

(మేము తౌరాతు గ్రంధాన్ని అవతరింపచేసాము, అందులో మార్గదర్శకత్వము జ్యోతీ ఉండేవి, ఈ తౌరాతు ఆధారంగానే ముస్లిములైన ప్రవక్తలు, రబ్బానీలు, ధర్మవేత్తలు, యూదుల సమస్యలను పరిష్కరించేవారు.) [మాయిద:44].

ప్రవక్తలందరూ మానవులు మరియు సృష్టించబడినవారు. వారికి రుబూబియత్, ఉలూహియత్ లోంచి ఎటువంటి ప్రత్యేకతలు లేవు. మహోన్నతుడైన అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి సెలవిచ్చాడు, ఆయన ప్రవక్తల అధినాయకుడు మరియు అల్లాహ్ వద్ద వారందరికన్న గొప్ప స్థానం కలవారు:

قُل لا أَمْلِكُ لِنَفْسِي نَفْعًا وَلَا ضَرًّا إِلا مَا شَاء اللهُ وَلَوْ كُنتُ أَعْلَمُ الْغَيْبَ لَاسْتَكْثَرْتُ مِنَ الْخَيْرِ وَمَا مَسَّنِيَ السُّوءُ إِنْ أَنَا إِلا نَذِيرٌ وَبَشِيرٌ لِقَوْمٍ يُؤْمِنُون

{(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: “అల్లాహ్ కోరితే తప్ప నా స్వయానికి నేను లాభం గానీ, నష్టం గానీ చేసుకునే అధికారం నాకు లేదు. నాకు అగోచర విషయజ్ఞానం ఉండి ఉన్నట్లైతే నేను లాభం కలిగించే విషయాలను నా కొరకు అధికంగా సమకూర్చుకునేవాడిని. మరియు నాకు ఎన్నడూ ఏ నష్టం కలిగేది కాదు. నేను విశ్వసించే వారికి కేవలం హెచ్చరిక చేసేవాడను మరియు శుభవార్త నిచ్చేవాడను మాత్రమే!”} [ఆరాఫ్:188]

మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

{వారితో ఇలా పలకండి: నిశ్చయంగా మీకు కీడు చేయటం గానీ లేదా సరైన మార్గం చూపటం గానీ నా వశంలో లేదు. ఇంకా ఇలా పలకండి: నిశ్చయంగా నన్ను అల్లాహ్ నుండి ఎవ్వడునూ కాపాడలేడు మరియు నాకు ఆయన తప్ప మరొకరి ఆశ్రయం కూడా లేదు.} [అల్ జిన్న్: 21-22]

మరియు ప్రవక్తలకి మానవుల లక్షణములైన అనారోగ్యము, మరణం, తినటం, త్రాగటం అవసరం మరియు ఇతర లక్షణాలు ఉంటాయి. ఇబ్రాహీం అలైహిస్సలాం మహోన్నతుడైన తన ప్రభువు గుణముల గురించి వర్ణించిన దాని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

وَالَّذِي هُوَ يُطْعِمُنِي وَيَسْقِينِ وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشفِينِ وَالَّذِي يُمِيتُنِي ثُمَّ يُحْيِين الشعراء: [81-79]

{ఆయనే నన్ను తినిపిస్తున్నాడు, త్రాగిస్తున్నాడు. మరియు నేను వ్యాధిగ్రస్తుడనైతే, ఆయనే నాకు స్వస్థత నిచ్చేవాడు. మరియు ఆయనే నన్ను మరణింపజేసేవాడు, తరువాత మళ్ళీ బ్రతికింపజేసేవాడు.} [అష్ షుఅరా :79 – 81]

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

నేను కేవలం మీ లాంటి మానవుడ్ని మాత్రమే. మీరు మరచిపోయినట్లే నేనూ మరచిపోతాను. అయితే నేను మరచిపోయినప్పుడు మీరు నన్ను గుర్తు చేయండి”.

మరియు అల్లాహ్ వారి ఉన్నత స్థానములు, వారి గొప్పతనమును వివరిస్తూ వారు తన ఆరాధన చేస్తారని వారి గురించి వర్ణించాడు; నూహ్ అలైహిస్సలాం విషయంలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{అతడు మాత్రం కృతజ్ఞతాపూర్వకంగా మెలిగిన మా దాసుడు.} [అల్ ఇస్రా :3]

మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం విషయంలో ఇలా సెలవిచ్చాడు:

{సమస్త లోకవాసులను హెచ్చరించేవానిగా ఉండటానికిగాను తన దాసునిపై గీటురాయిని అవతరింపజేసిన అల్లాహ్ గొప్ప శుభకరుడు.} [అల్ ఫుర్ఖాన్:1]

మరియు ఇబ్రాహీం, ఇస్ హాఖ్, యాఖూబ్ అలైహిముస్సలాం గురించి ఇలా సెలవిచ్చాడు:

{ఇంకా మా దాసులైన ఇబ్రాహీం, ఇస్ హాఖ్, యాఖూబ్ లను కూడా జ్ఞాపకం చేసుకో. వాళ్ళు చేతులు గలవారు, కళ్లు గలవారు. మేము వారిని ఒకానొక ప్రత్యేక విషయానికై అంటే పరలోక స్మరణ నిమిత్తం ప్రత్యేకించాము. వారంతా మా వద్ద ఎన్నుకోబడినవారు, ఉత్తములు.} [సాద్ : 45-47]

మరియు మర్యమ్ కుమారుడగు ఈసా అలైహిస్సలాం గురించి ఇలా సెలవిచ్చాడు:

{అతను కేవలం ఒక దాసుడు మాత్రమే. మేము అతనిని అనుగ్రహించాము. ఇస్రాయీలు సంతతి వారికొరకు అతన్ని ఒక ఉదాహరణగా చేశాము.} [జుక్రుఫ్ : 59]

ఒకటి: వారి దైవదౌత్యము అల్లాహ్ వద్ద నుంచి వచ్చిన సత్యమని విశ్వసించాలి. ఎవరైతే వారిలో నుంచి ఏ ఒక్కరి దైవదౌత్యమును నిరాకరిస్తాడో వారందరిని నిరాకరించినవాడు అవుతాడు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{నూహ్ జాతివారు ప్రవక్తలను తిరస్కరించారు} [అష్షూరా: 105]

అల్లాహ్ నూహ్ జాతివారిని ప్రవక్తలందరిని తిరస్కరించినవారిలో చేశాడు. ఇంకా వారు నూహ్ ను తిరస్కరించినప్పుడు ఆయన తప్ప ఇంకెవరు ప్రవక్తలు లేరు. అలాగే ఏ క్రైస్తవులైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించి ఆయనను అనుసరించలేదో వారు మర్యమ్ కుమారుడగు మసీహ్ (ఈసా) అలైహిస్సలాంను తిరస్కరించారు, అలాగే ఆయనను అనుసరించలేదు. ప్రత్యేకించి ఆయన వారికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి శుభవార్తను ఇచ్చారు. వారికి ఆయన గురించి శుభవార్త ఇవ్వటం యొక్క అర్ధం ఆయన వారి వైపుకు పంపించబడ్డ ప్రవక్త, అల్లాహ్ ఆయన ద్వారా వారిని మార్గభ్రష్టత నుండి రక్షిస్తాడు మరియు వారిని సన్మార్గం వైపు మార్గదర్శకం చేస్తాడు.

రెండు: ఆ ప్రవక్తలలోంచి మనకు తెలిసిన వారి నామములతో పాటు వారిని విశ్వసించటం. ఉదాహరణకు ముహమ్మద్, ఇబ్రాహీం, మూసా, ఈసా మరియు నూహ్ అలైహిముస్సలాం. ఈ ఐదుగురు ప్రవక్తలు ప్రవక్తలలో నుంచి ఉలుల్ అజ్మ్ (దృఢ సంకల్పము కల ప్రవక్తలు) ప్రవక్తలు. అల్లాహ్ ఖుర్ఆన్ లో రెండు చోట్ల ప్రస్తావించాడు :

وَإِذْ أَخَذْنَا مِنَ النَّبِيِّينَ مِيثَاقَهُمْ وَمِنكَ وَمِن نُوحٍ وَإِبْرَاهِيمَ وَمُوسَى وَعِيسَى ابْنِ مَرْيَمَ وَأَخَذْنَا مِنْهُم مِيثَاقًا

(మరియు (జ్ఞాపకముంచుకో వాస్తవానికి మేము ప్రవక్తలందరి నుండి వాగ్దానం తీసుకున్నాము మరియు నీతో (ఓ ముహమ్మద్), నూహ్ తో, ఇబ్రాహీమ్ తో, మూసాతో మరియు మర్యమ్ కుమారుడైన ఈసాతో కూడా! మరియు మేము వారందరి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాము.) [అల్ అహ్ జాబ్: 7]

شَرَعَ لَكُم مِّنَ الدِّينِ مَا وَصَّى بِهِ نُوحًا وَالَّذِي أَوْحَيْنَا إِلَيْكَ وَمَا وَصَّيْنَا بِهِ إِبْرَاهِيمَ وَمُوسَى وَعِيسَى أنْ أَقِيمُوا الذِينَ وَلا تَتَفَرَّقُوا فِيهِ كَبُرَ عَلَى الْمُشْرِكِينَ مَا تَدْعُوهُمْ إِلَيْهِ اللَّهُ يَجْتَبِي إِلَيْهِ مَن يَشَاء وَيَهْدِي إِلَيْهِ

{ఆయన, నూహ్ కు విధించిన (ఇస్లాం) ధర్మాన్నే, మీ కొరకు శాసించాడు; మరియు దానినే (ఓ ముహమ్మద్!) మేము నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము; మరియు మేము దానినే ఇబ్రాహీమ్, మూసా మరియు ఈసాలకు కూడా విధిగా చేశాము. ఈ ధర్మాన్నే స్థాపించాలని మరియు దానిని గురించి భేదాభిప్రాయాలకు గురి కాకుండా ఉండాలని. నీవు దాని వైపునకు పిలిచేది బహుదైవారాధకులకు ఎంతో సహింపలేనిదిగా ఉంది. అల్లాహ్ తాను కోరిన వానిని తన వైపునకు ఆకర్షిస్తాడు మరియు పశ్చాత్తాపంతో తన వైపునకు మరలేవానికి మార్గదర్శకత్వం చేస్తాడు.} [అష్షూరా: 13]

ఇక ఏ ప్రవక్తల పేరు మనకు తెలవదో వారిపై మనం సంక్షిప్తంగా విశ్వాసం కనబరచాలి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{وَلَقَدْ أَرْسَلْنَا رُسُلاً مِن قَبْلِكَ مِنْهُم مَّن قَصَصْنَا عَلَيْكَ وَمِنْهُم مَّن لَّمْ نَقْصُصْ عَلَيْكَ} [غافر : 78]

(నిశ్చయంగా నీకు పూర్వం కూడా మేము ఎంతోమంది ప్రవక్తలని పంపీ ఉన్నాము. వారిలో కొందరి సంగతులు మేము నీకు తెలియపర్చాము. మరికొందరి వృత్తాంతాలను అసలు నీకు తెలుపనే లేదు.) [గాఫిర్:78]

మూడు: వారి గురించి ఏవైతే సమాచారాలు నిజమో వాటిని నమ్మటం.

నాలుగు: వారిలో నుంచి మన వైపు పంపించబడ్డ ప్రవక్త షరీఅతును ఆచరించటం. ఆయన వారిలో పరిసమాప్తి అయిన ప్రజలందరివైపు పంపించబడ్డ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُونَ حَتَّى يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لاَ يَجِدُوا فِي أَنفُسِهِمْ حَرَجًا مِّمَّا قَضَيْتَ وَيُسَلِّمُوا

{అలా కాదు, నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించనంత వరకు మరియు (ఓ ప్రవక్తా! నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో ఏ మాత్రం సంకోచం లేకుండా దానికి (యథాతథంగా) శిరసావహించనంత వరకు, వారు (నిజమైన) విశ్వాసులు కాలేరు!} [అన్ని సా:65]

ఒకటి: తన దాసులపై అల్లాహ్ యొక్క కారుణ్యము, ఆయన అనుగ్రహము గురించి జ్ఞానము ప్రాప్తిస్తుంది; ఏవిధంగానైతే వారిని అల్లాహ్ మార్గము వైపునకు సన్మార్గము చూపించటం కొరకు, వారు అల్లాహ్ ఆరాధన ఎలా చేయాలో వారికి తెలియపరచటం కొరకు వారి వైపునకు సందేశహరులను పంపించాడో అలా. ఎందుకంటే మానవుని బుద్ధి స్వయంగా దానిని గ్రహించదు.

రెండు: ఈ గొప్ప అనుగ్రహం పై అల్లాహ్ యొక్క కృతజ్ఞత తెలుపుకోవటం.

మూడు: దైవసందేశహరులు అలైహిముస్సలాం పట్ల ప్రేమ, ఆదరాభిమానములు చూపటం మరియు వారికి తగినవిధంగా వారి గొప్పతనమును కొనియాడటం. ఎందుకంటే వారు అల్లాహ్ యొక్క ప్రవక్తలు, అల్లాహ్ యొక్క ఆరాధన చేసేవారు, ఆయన సందేశాలను చేరవేసేవారు మరియు ఆయన దాసులకు హితబోధన చేసేవారు.

సత్య తిరస్కారులు అల్లాహ్ యొక్క ప్రవక్తలు మానవులలోంచి కాజాలరని భావించి తమ వైపు పంపించబడ్డ ప్రవక్తలను తిరస్కరించారు. అల్లాహ్ ఈ భావన గురించి ఖుర్ఆన్ లో ప్రస్తావించి ఖండించాడు :

وَمَا مَنَعَ النَّاسَ أَنْ يُؤْمِنُوا إِذْ جَاءَهُمُ الْهُدَى إِلَّا أَنْ قَالُوا أَبَعَثَ اللَّهُ بَشَرًا رَسُولًا قُلْ لَوْ كَانَ فِي الْأَرْضِ

مَلَائِكَةُ يَمْشُونَ مُطْمَئِئِينَ لَنَزَّلْنَا عَلَيْهِمْ مِنَ السَّمَاءِ مَلَكًا رَسُولا] { الإسراء [95-94

{ప్రజల వద్దకు మార్గదర్శకత్వం వచ్చిన మీదట, విశ్వసించనీయకుండా వారిని ఆపిన విషయమల్లా ఒక్కటే – “అల్లాహ్ ఒక మానవమాత్రుణ్ణి ప్రవక్తగా పంపాడా?!” అని వారన్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ దైవదూతలు భూమండలం మీద తిరుగుతూ, నివాసమేర్పరచుకుంటూ ఉన్నట్లయితే, మేము వారి వద్దకు కూడా ఆకాశం నుంచి దైవదూతనే ప్రవక్తగా పంపి ఉండేవారం”.} [ఇస్రా:94-95]

ఈ ఆయతులో అల్లాహ్ ప్రవక్తలు మానవులలోంచే అవటం తప్పనిసరి అని తెలిపి సత్యతిరస్కారుల ఈ భావనను ఖండించాడు. ఎందుకంటే ఆయన సందేశహరులను ఎవరివైపు పంపించాడో భూవాసులు వారు కూడా మానవులే. ఒక వేళ భూవాసులు దైవదూతలే అయితే వారిలాగే అవటానికి అల్లాహ్ ఆకాశము నుంచి వారిపై దైవదూతలను దించేవాడు. మరియు ఇదే విధంగా ప్రవక్తలను తిరస్కరించి వారితో ఇలా పలికిన వారి గురించి తెలియపరచాడు :

إِنْ أَنْتُمْ إِلَّا بَشَرٌ مِثْلُنَا تُرِيدُونَ أَنْ تَصُدُّونَا عَمَّا كَانَ يَعْبُدُ آبَاؤُنَا فَأْتُونَا بِسُلْطَانٍ مُبِينٍ قَالَتْ لَهُمْ رُسُلُهُمْ إِنْ نَحْنُ إِلَّا بَشَرٌ مِثْلُكُمْ وَلَكِنَّ اللَّهَ يَمُنُّ عَلَى مَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ وَمَا كَانَ لَنَا أَنْ تَأْتِيَكُمْ بِسُلْطَانِ إِلَّا بِإِذْنِ اللَّهِ }

{ “మీరూ మాలాంటి మనుషులే తప్ప మరేమీ కాదు. మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన దేవుళ్ళ ఆరాధన నుండి మమ్మల్ని ఆపాలన్నది మీ ఉద్దేశం. మరైతే స్పష్టమైన ప్రమాణాన్ని మా ముందు తీసుకురండి” అని చెప్పారు. వారి ప్రవక్తలు వారితో ఇలా అన్నారు: “అవును, మేమూ మీలాంటి మనుషులమే. అయితే అల్లాహ్ తన దాసులలో

తాను కోరిన వారిపై ప్రత్యేకంగా దయదలుస్తాడు. అల్లాహ్ అనుజ్ఞ లేకుండా మేము ఏ ప్రమాణాన్ని కూడా మీ వద్దకు తేలేము.} [ఇబ్రాహీం:10-11]

పరలోకం (అంతిమ దినం): లెక్క తీసుకోబడటం కొరకు, ప్రతిఫలం కొరకు ప్రజలు మరల జీవింపజేసి లేపబడే ప్రళయదినం. దానికి ఆ పేరుతో పిలవటానికి కారణం దాని తరువాత వేరే ఏ దినం లేదు. ఎందుకంటే స్వర్గవాసులు తమ నివాసములలో మరియు నరకవాసులు తమ నివాసములలో స్థిరపడి ఉంటారు.

పరలోకం (అంతిమదినం) పై విశ్వాసం మూడు విషయములతో ఇమిడి ఉంది:

ఒకటి: మరణాంతరం మరల లేపబడటంపై విశ్వాసం: అది రెండవ బాకా ఊదబడినప్పుడు మృతులు జీవింపబడటం. అప్పుడు ప్రజలు కాళ్ళకు చెప్పులు లేకుండా, ఒంటి పై వస్త్రములు లేకుండ నగ్నంగా మరియు సున్తీ చేయబడి లేకుండా అల్లాహ్ సమక్షంలో నిలబడుతారు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُعِيدُهُ وَعْدًا عَلَيْنَا إِنَّا كُنَّا فَاعِلِينَ

(ఏవిధంగా మేము మొదటిసారి సృష్టించామో అదేవిధంగా మరోసారి కూడా చేస్తాము. ఈ వాగ్దానం నెరవేర్చే బాధ్యత మా పైన ఉంది. దాన్ని మేము తప్పకుండా నెరవేరుస్తాము) [అల్ అంబియా: 104]

మరణాంతరం మరల లేపబడటం వాస్తవము, నిరూపితమైనది. దీనిపై ఖుర్ఆన్, హదీసులు మరియు ముస్లింల ఇజ్మా నుండి ఆధారములు కలవు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{మరి ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు. మరి ప్రళయదినాన మీరంతా నిశ్చయంగా లేపబడుతారు.} [అల్ మూమినస్: 15-16]

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

“ప్రళయదినమున ప్రజలు ఖాళీ కాళ్ళతో చెప్పులు లేకుండా, నగ్నంగా వస్త్రములు లేకుండా, సున్తీ చేయబడకుండా సమీకరించబడుతారు”. (బుఖారీ, ముస్లిం)

దీని ఋజువు అవటం పై ముస్లింల ఇజ్మా ఉన్నది. మరియు ఇది విజ్ఞత యొక్క అగత్యము. అల్లాహ్ ఈ మానవులని మరలా జీవింపజేయటం, తన ప్రవక్తలను పంపించి వారిపై నిర్దేశించిన ఆదేశములను పాటించటంపై ఆ రోజు ప్రతిఫలం ప్రసాదించటం అగత్యము. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لا تُرْجَعُون

{“ఏమీ? వాస్తవానికి మేము మిమ్మల్ని వృధాగానే పుట్టించామని మరియు మీరు మా వైపునకు ఎన్నడూ మరలి రారని భావించారా?”} [అల్ మూమినూస్: 115]

మరియు ఆయన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా సెలవిచ్చాడు :

إِنَّ الَّذِي فَرَضَ عَلَيْكَ الْقُرْآنَ لَرَادُّكَ إِلَى مَعَادٍ

(నిశ్చయంగా నీ పై ఖుర్ఆన్ ను అవతరింపజేసినవాడు నిన్ను తిరిగి పూర్వస్థలానికి చేర్చనున్నాడు ) [అల్ ఖసస్:85]

రెండు: లెక్కతీసుకోబడటంపై, ప్రతిఫలం ప్రసాదించబడటం పై విశ్వాసం కనబరచటం: దాసునితో అతని కర్మలపై లెక్క తీసుకోబడును మరియు దాని ప్రతిఫలం ప్రసాదించబడును. దీనిపై ఖుర్ఆన్, హదీసు మరియు ముస్లిముల ఇజ్మాలో ఆధారం కలదు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

(నిశ్చయంగా మా వైపునకే వారి మరలింపు ఉంది. ఆ తరువాత నిశ్చయంగా వారి లెక తీసుకునేది మేమే) [అల్ గాషియ:25-26]

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

 مَن جَاء بِالْحَسَنَةِ فَلَهُ عَشْرُ أَمْثَالِهَا وَمَن جَاء بِالسَّيِّئَةِ فَلَا يُجْزَى إِلَّا مِثْلَهَا وَهُمْ لَا يُظْلَمُون

{ఎవడు ఒక సత్కార్యం చేస్తాడో, అతనికి దానికి పదిరెట్లు ప్రతిఫలం ఉంటుంది. మరియు ఎవడు ఒక పాపకార్యం చేస్తాడో, అతనికి దానంతటి శిక్షయే ఉంటుంది. మరియు వారి కెలాంటి అన్యాయం జరుగదు.} [అల్ అస్ఆమ్: 160]

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَنَضَعُ الْمَوَازِينَ الْقِسْطَ لِيَوْمِ الْقِيَامَةِ فَلا تُظْلَمُ نَفْسٌ شَيْئًا وَإِن كَانَ مِثْقَالَ حَبَّةٍ مِنْ خَرْدَلٍ أَتَيْنَا

(మరియు పునరుత్థాన దినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటు చేస్తాము. కావున ఏ వ్యక్తికి కూడా ఏ మాత్రం అన్యాయం జరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మ ఉన్నా మేము దానిని ముందుకు తెస్తాము మరియు లెక్క చూడటానికి మేమే చాలు!) [అల్ అంబియా: 47]

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

“నిశ్చయంగా అల్లాహ్ విశ్వాసపరుడిని దగ్గరకు తీసుకుని అతని పై పరదా కప్పివేస్తాడు. అప్పుడు అతనితో ఈ ఈ పాపాలు నీకు తెలుసా? అని అడుగుతాడు. అతను ‘తెలుసు ఓ నా ప్రభువా’ అని సమాధానమిస్తాడు. చివరికి అతను తన పాపములను అంగీకరించిన తరువాత తాను వినాశనానికి గురి అవుతాడని తన మనసులో భావిస్తాడు. అల్లాహ్ ఇలా అంటాడు: నేను ఇహలోకములో వాటిని పరదాతో కప్పివేశాను. ఈ రోజు వాటిని నేను మన్నించి వేస్తున్నాను అంటాడు. అప్పుడు ఆయన అతనికి అతని పుణ్యాల కర్మల పట్టికను ఇస్తాడు. ఇక అవిశ్వాసపరులను , కపటులనిను సృష్టిరాసులందరి ముందు పిలిచి ఇలా ప్రకటించబడును: “వీరందరు తమ ప్రభువును తిరస్కరించారు. వినండి అల్లాహ్ యొక్క శాపము దుర్మార్గులపై కురియుగాక.” (బుఖారీ, ముస్లిం)

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసులో ఇలా ఉన్నది:

ఎవరైన ఒక పుణ్యకార్యమును సంకల్పించుకుని దానిని ఆచరిస్తే అల్లాహ్ దాన్ని తన వద్ద పది రెట్ల నుండి ఏడువందల రెట్ల వరకు లేదా అంత కంటే అధికంగా పుణ్యాలుగా వ్రాసివేస్తాడు. మరియు ఎవరైనా ఒక పాపమును సంకల్పించుకుని ఆచరిస్తే దాన్ని అల్లాహ్ ఒక పాపకార్యముగానే వ్రాస్తాడు.”

కర్మల లెక్క తీసుకోబడటం మరియు వాటి ప్రతిఫలం ప్రసాదించబడటం జరుగుతుంది అన్న దానిపై ముస్లింలందరి ఏకీభావము కలదు. అది విజ్ఞతకు ప్రకారం జరుగును. ఎందుకంటే అల్లాహ్ ఖుర్ఆన్ ను అవతరింపజేశాడు మరియు దైవప్రవక్తలను పంపించాడు. మరియు వారు తీసుకుని వచ్చిన ఆదేశములను స్వీకరించటం మరియు వాటిలో నుంచి తప్పనిసరి ఆచరించవలసిన వాటిని దాసులపై అనివార్యం చేశాడు. మరియు ధర్మమును వ్యతిరేకించేవారితో యుద్ధమును అనివార్యం చేశాడు. మరియు వారి రక్తములను, వారి సంతానమును, వారి స్త్రీలను మరియు వారి సంపదలను ధర్మసమ్మతం చేశాడు. ఒకవేళ లెక్కతీసుకోవటం, ప్రతిఫలం ప్రసాదించటం జరగకపోతే ఈ ఆదేశాలన్ని వృధా అగును. అల్లాహ్ వృధా వస్తువుల నుండి పరిశుద్ధుడు.

అల్లాహ్ ఈ ఆయతులలో వాటి వైపు సూచిస్తూ ఇలా సెలవిచ్చాడు:

فَلَنَسْأَلُنَّ الَّذِينَ أُرْسِلَ إِلَيْهِمْ وَلَنَسْأَلُنَّ الْمُرْسَلِينَ فَلَنَقْصُنَّ عَلَيْهِمْ بِعِلْمٍ وَمَا كُنَّا غَائِبِينَ

{కావున మేము ఎవరి వద్దకు మా సందేశాన్ని (ప్రవక్తను) పంపామో వారిని తప్పక ప్రశ్నిస్తాము మరియు నిశ్చయంగా ప్రవక్తలను కూడా ప్రశ్నిస్తాము. అప్పుడు వారికి పూర్తి జ్ఞానంతో వివరిస్తాము. ఎందుకంటే మేము లేకుండా లేము.} [అల్ ఆరాఫ్: 6-7]

మూడు: స్వర్గము, నరకమును విశ్వసించటం మరియు అవి రెండూ సృష్టిరాసుల శాశ్వత నివాసములని విశ్వసించటం.

కావున స్వర్గము అనుగ్రహాల నిలయము. దాన్ని అల్లాహ్ దైవభీతి కల విశ్వాసపరుల కొరకు సిద్ధం చేసి ఉంచాడు. వారు అల్లాహ్ తమపై దేనిని విశ్వసించటం అనివార్యం చేసిన దానిని విశ్వసించారు మరియు అల్లాహ్ కు ఆయన ప్రవక్తకు విధేయత చూపారు, అల్లాహ్ కొరకు చిత్తశుద్దిని చూపారు, ఆయన ప్రవక్తను అనుసరించారు. అందులో రకరకాల అనుగ్రహాలు కలవు. వేటినైతే ఏ కళ్ళు చూడలేదో, ఏ చెవులు వినలేదో, వాటి గురించి ఏ మానవుని మనస్సులో ఆలోచన రాలేదో.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ جَزَاؤُهُمْ عِنْدَ رَبِّهِمْ جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا رَضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ذَلِكَ لِمَنْ خَشِيَ رَبَّهُ

{అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు; నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు. వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గ వనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్ను డయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు. ఈ అనుగ్రహ భాగ్యం తన ప్రభువుకు భయపడేవానికి మాత్రమే.} [అల్ బయ్యిన: 7-8]

فَلاَ تَعْلَمُ نَفْسٌ مَّا أُخْفِيَ لَهُم مِّن قُرَّةِ أَعْيُنٍ جَزَاء بِمَا كَانُوا يَعْمَلُون

{కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచి పెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు.} [అస్ సజ్దహ్: 17]

ఇక నరకము: అది శిక్ష నిలయం. దానిని అల్లాహ్ దుర్మార్గులైన అవిశ్వాసపరుల కొరకు సిద్ధం చేసి ఉంచాడు. ఎవరైతే ఆయనను తిరస్కరించి ఆయన ప్రవక్తల పట్ల అవిధేయత చూపారో. అందులో రకరకాల శిక్షలు, నీతిదాయకమైన శిక్షలు కలవు. వాటి వినాశకాల గురించి ఏ హృదయములో ఆలోచన తట్టదు.

قال الله تعالىوَاتَّقُواْ النَّارَ الَّتِي أُعِدَّتْ  ِللْكَافِرِين} [آل عمران: 131]

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَاتَّقُواْ النَّارَ الَّتِي أُعِدَّت للْكَافِرِين
{మీరు సత్యతిరస్కారుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భీతిపరులై ఉండండి.} [ఆలె ఇమ్రాన్ :131]

وَقُلِ الْحَقُّ مِن رَّبِّكُمْ فَمَن شَاء فَلْيُؤْمِن وَمَن شَاء فَلْيَكْفُرْ إِنَّا أَعْتَدْنَا لِلظَّالِمِينَ نَارًا أَحَاطَ بِهِمْ سُرَادِقُهَا وَإِن يَسْتَغِيثُوا يُغَاثُوا بِمَاء كَالْمُهْلِ يَشْوِي الْوُجُوهَ بِئْسَ الشَّرَابُ وَسَاءتْ مُرْتَفَقًا

మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

(మరియు వారితో అను: “ఇది మీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కావున ఇష్టపడిన వారు దీనిని విశ్వసించ వచ్చు మరియు ఇష్టపడని వారు దీనిని తిరస్కరించ వచ్చు!” నిశ్చయంగా, మేము దుర్మార్గుల కొరకు నరకాగ్నిని సిద్ధపరచి ఉంచాము, దాని జ్వాలలు వారిని చుట్టుకుంటాయి. అక్కడ వారు నీటి కొరకు మొర పెట్టుకున్నప్పుడు, వారికి ముఖాలను మాడ్చే (మరిగే నూనె వంటి నీరు (అల్ ముహు) ఇవ్వబడుతుంది. అది ఎంత చెడ్డ పానీయం మరియు ఎంత చెడ్డ (దుర్భరమైన) విరామ స్థలం!) [అల్ కహఫ్:29]

إِنَّ اللَّهَ لَعَنَ الْكَافِرِينَ وَأَعَدَّ لَهُمْ سَعِيرًا خَالِدِينَ فِيهَا أَبَدًا لَا يَجِدُونَ وَلِيًّا وَلَا نَصِيرًا يَوْمَ تُقَلَّبُ وُجُوهُهُمْ فِي النَّارِ يَقُولُونَ يَالَيْتَنَا أَطَعْنَا اللَّهَ وَأَطَعْنَا الرَّسُولا

మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{అల్లాహ్ అవిశ్వాసులను శపించాడు. ఇంకా వారి కోసం మండే అగ్నిని సిద్ధం చేసి ఉంచాడు. అందులో వారు ఎల్లకాలం పడి ఉంటారు. వారు ఏ సంరక్షకుణ్ణి, సహాయకుణ్ణి పొందలేరు. ఆ రోజు వారి ముఖాలు అగ్నిలో అటూ ఇటూ పొర్లింప బడతాయి. అప్పుడు వారు, “అయ్యో! మేము అల్లాహ్ కు, ప్రవక్తకు విధేయత చూపి ఉంటే ఎంత బావుండేది?” అని అంటారు.} [అల్ అహాబ్: 64 66]

ఒకటి : ఆ ప్రళయదినం నాడు పుణ్యమును ఆశించి విధేయత చూపాలనే కోరిక,దానీ ఆశ;

రెండు: ప్రళయదినం నాడు శిక్ష నుండి భయముతో అవిధేయత కార్యములు చేయటం నుండి, వాటి నుండి సంతృప్తి చెందటం నుండి భయమును కలిగి ఉండటం.

మూడు: ప్రళయదిన అనుగ్రహముల ఆ దినము ప్రతిఫలము ఆశ వలన ఇహలోకములో కోల్పోయిన వాటిపై విశ్వాసపరులు సంతుష్ట పడటం.

మరణాంతరం లేపబడటం అసంభవం అని భావిస్తూ అవిశ్వాసపరులు మరణాంతరం లేపబడటమును తిరస్కరించారు.ఈ భావన తప్పు. షరీయత్ , విషయజ్ఞానము, హేతుబద్ధత ఇది తప్పు అవటంపై సూచిస్తున్నాయి.

షరీఅత్ సూచన గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు::

సత్యాన్ని తిరస్కరించిన వారు (చనిపోయిన తరువాత) మరల సజీవులుగా లేపబడమని భావిస్తున్నారు. వారితో ఇలా అను:

అది కాదు, నా ప్రభువు సాక్షిగా! మీరు తప్పకుండా లేపబడతారు. తరువాత మీరు (ప్రపంచంలో) చేసిందంతా మీకు తెలుపబడుతుంది. మరియు ఇది అల్లాహ్ కు ఎంతో సులభం”.} [తగాబుస్:7]

దివ్యగ్రంధములన్ని దీనిపై ఏకీభవించాయి.

విషయజ్ఞానము యొక్క సూచన: అల్లాహ్ ఇహలోకములో మృతులను జీవింప చేయటాన్ని తన దాసులకు చూపించాడు. సూరతుల్ బఖరాలో దీని గురించి ఐదు ఉదాహరణలు కలవు. అవి:

మొదటి ఉదాహరణ: మూసా అలైహిస్సలాం జాతివారు ఆయనతో ఇలా పలికినప్పటి ఉదాహరణ :

(మేము అల్లాహ్ ను కళ్ళారా చూడనంత వరకు నిన్ను విశ్వసించము.} [బఖర:55],

అప్పుడు అల్లాహ్ వారిని మరణింపజేసి ఆ తరువాత జీవింపజేశాడు. ఈ విషయంలో అల్లాహ్ బనీ ఇస్రాయీలును ఉద్దేశించి ఇలా సంబోధించాడు :

وَإِذْ قُلْتُمْ يَامُوسَى لَنْ نُؤْمِنَ لَكَ حَتَّى نَرَى اللَّهَ جَهْرَةً فَأَخَذَتْكُمُ الصَّاعِقَةُ وَأنْتُمْ تَنْظُرُونَ ثُمَّ بَعَثْنَاكُمْ مِنْ بَعْدِ

{మీరు మూసాతో అన్న మాటలను గుర్తుకు తెచ్చుకోండి:“ఓ మూసా! మేము అల్లాహ్ ను కళ్ళారా చూడనంతవరకూ నిన్ను విశ్వసించము”. (మీ ఈ పెడసరి ధోరణికి శిక్షగా) మీరు చూస్తుండగానే (మీ పై) పిడుగు పడింది. అయితే (ఈసారయినా) మీరు కృతజ్ఞులవుతారేమోనన్న ఉద్దేశంతో చనిపోయిన మిమ్మల్ని తిరిగి బ్రతికించాము.} [బఖర:55-56]

రెండవ ఉదాహరణ: ఆ చంపబడిన వ్యక్తి సంఘటన ఎవరి గురించి అయితే బనూ ఇస్రాయీలు వారు పోట్లాడుకున్నారో. అయితే తనను ఎవరు వదించారో ఆ శవం తెలియపరచటానికి అల్లాహ్ వారిని ఒక ఆవును జబాహ్ చేసి దానిలోని మాంసము యొక్క కొంత భాగముతో ఆ శవముపై కొట్టమని వారిని ఆదేశించాడు.

ఈ విషయంలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

{وَإِذْ قَتَلْتُمْ نَفْسًا فَادَّارَأْتُمْ فِيهَا وَاللهُ مُخْرِجٌ مَا كُنتُمْ تَكْتُمُونَ فَقُلْنَا اضْرِبُوهُ بِبَعْضِهَا كَذَلِكَ يُحْيِ اللَّهُ الْمَوْتَى

{(జ్ఞాపకం చేసుకోండి.) మీరు ఒక వ్యక్తిని హత్య చేసి, ఆ విషయంలో పరస్పరం విభేదించు కోసాగారు. కాని మీ గుట్టును అల్లాహ్ రట్టు చేయాలనే నిర్ణయించుకున్నాడు. కనుక, “ఈ ఆవు (మాంసపు ముక్క నొకదాన్ని హతుని దేహానికేసి కొట్టండి (అతడు లేచి నిలబడ తాడు)” అని మేము అన్నాము. ఈ విధంగా అల్లాహ్ మృతులను బ్రతికించి తన నిదర్శనాలను చూపుతున్నాడు మీరు ఇకనయినా బుద్ధిగా మసలుకోవాలని!} [అల్బ ఖర:72-73]

మూడవ ఉదాహరణ: ఆ జాతి వారి సంఘటన ఎవరైతే ప్రాణ భయంతో తమ బస్తీలను వదిలి బయటకు వచ్చి పారిపోయారో. వారు వేలల్లో ఉన్నారు. అల్లాహ్ వారిని మరణింపజేసి ఆ తరువాత జీవింపజేశాడు.

ఈ విషయంలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

أَلَمْ تَرَ إِلَى الَّذِينَ خَرَجُواْ مِن دِيَارِهِمْ وَهُمْ أُلُوفٌ حَذَرَ الْمَوْتِ فَقَالَ لَهُمُ اللهُ مُوتُواْ ثُمَّ أَحْيَاهُمْ إِنَّ اللَّهَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَكِنَّ أَكْثَرَ النَّاسِ لا يَشْكُرُون

(ఏమీ? మృత్యుభయంతో, వేల సంఖ్యలో ప్రజలు తమ ఇండ్లను వదలి పోయింది నీకు తెలియదా? అప్పుడు అల్లాహ్ వారితో : “మరణించండి!” అని అన్నాడు కాని తరువాత వారిని బ్రతికించాడు. నిశ్చయంగా, అల్లాహ్ మానవుల పట్ల అత్యంత అనుగ్రహం గలవాడు, కాని చాలా మంది కృతజ్ఞతలు చూపరు.) [బఖర:243]

నాలుగవ ఉదాహరణ: ఆ వ్యక్తి సంఘటన ఎవరైతే వినాశమునకు గురి అయిన బస్తీ వద్ద నుండి వెళ్లాడో. అల్లాహ్ దాన్ని జీవింప జేయటం దూరవిషయం అని భావించాడు. అప్పుడు అల్లాహ్ అతనిని వంద సంవత్సరముల వరకు మరణింపజేసి ఆ తరువాత అతనిని జీవింపజేశాడు.

ఈ విషయంలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

أَوْ كَالَّذِي مَرَّ عَلَى قَرْيَةٍ وَهِيَ خَاوِيَةٌ عَلَى عُرُوشِهَا قَالَ أَنَّى يُحْيِي هَذِهِ اللَّهُ بَعْدَ مَوْتِهَا فَأَمَاتَهُ اللَّهُ مِائَةَ عَامٍ ثُمَّ بَعَثَهُ قَالَ كَمْ لَبِثْتَ قَالَ لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ قَالَ بَلْ لَبِثْتَ مِائَةَ عَامٍ فَانْظُرْ إِلَى طَعَامِكَ وَشَرَابِكَ لَمْ يَتَسَنَّهُ وَانْظُرْ إِلَى حِمَارِكَ وَلِنَجْعَلَكَ آيَةً لِلنَّاسِ وَانْظُرْ إِلَى الْعِظَامِ كَيْفَ نُنشِزُهَا ثُمَّ تَكْسُوهَا لَحْمًا فَلَمَّا تَبَيَّنَ لَهُ قَالَ أَعْلَمُ أَنَّ اللَّهَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ

{లేక! ఒక వ్యక్తి ఇండ్ల కప్పులన్నీ కూలిపోయి, పాడుపడిన (తలక్రిందులై బోర్లా పడిన) నగరం మీదుగా పోతూ: “వాస్తవానికి! నశించిపోయిన ఈ నగరానికి అల్లాహ్ తిరిగి ఏ విధంగా జీవం పోయగలడు?” అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ అతనిని మరణింపజేసి నూరు సంవత్సరాల తరువాత తిరిగి బ్రతికింపజేసి: “ఈ స్థితిలో నీవు ఎంతకాలముంటివి?” అని అడిగాడు. అతడు: “ఒక దినమో, లేక ఒక దినములో కొంత భాగమో!” అని అన్నాడు. దానికి ఆయన “కాదు, నీవు ఇక్కడ ఈ (మరణించిన) స్థితిలో, నూరు సంవత్సరాలు ఉంటివి. ఇక నీ అన్నపానీయాల వైపు చూడు, వాటిలో ఏ మార్పూ లేదు. ఇంకా నీవు నా గాడిదను కూడా చూడు! మేము ప్రజల కొరకు నిన్ను దృష్టాంతంగా చేయదలిచాము. ఇక ఆ (గాడిద) ఎముకలను చూడు, ఏ విధంగా వాటిని ఉద్ధరించి తిరిగి వాటిపై మాంసం కప్పుతామో!” అని అన్నాడు. ఇవి అతనికి స్పష్టంగా తెలిసిన తరువాత అతడు: “నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడని నాకు (ఇప్పుడు తెలిసింది!” అని అన్నాడు.} [అల్ బఖర : 259]

ఐదవ ఉదాహరణ: ఇబ్రాహీము ఖలీలుల్లాహ్ సంఘటన. ఆయన అల్లాహ్ తో మృతులను ఏవిధంగా జీవింపజేస్తాడో చూపించమని అడిగారు. అప్పుడు అల్లాహ్ ఆయనను నాలుగు పక్షులను జబాహ్ చేసి వాటి భాగములను చుట్టుప్రక్కల ఉన్న పర్వతములపై విస్తరింపజేసి వేసి ఆ తరువాత వాటిని పిలవమని ఆదేశించాడు. అప్పుడు వాటి భాగములు ఒకదానితో ఒకటి కలిసి ఇబ్రాహీమ్ అలైహిస్సలాం వైపుకు పరుగెత్తుకుని వచ్చినవి.

అల్లాహ్ ఈ విషయంలో ఇలా సెలవిచ్చాడు:

وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ أَرِنِي كَيْفَ تُحْيِي الْمَوْتَى قَالَ أَوَلَمْ تُؤْمِن قَالَ بَلَى وَلَكِن لِيَطْمَئِنَّ قَلْبِي قَالَ فَخُذْ أَرْبَعَةَ مِنَ الطَّيْرِ فَصُرْهُنَّ إِلَيْكَ ثُمَّ اجْعَلْ عَلَى كُلّ جَبَلِ مِنْهُنَّ جُزْءًا ثُمَّ ادْعُهُنَّ يَأْتِينَكَ سَعْيًا وَاعْلَمْ أَنَّ اللَّهَ عَزِيزٌ

(మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్: “ఓ నా ప్రభూ! నీవు మృతులను ఎలా సజీవులుగా చేస్తావో నాకు చూపు!” అని అన్నప్పుడు, (అల్లాహ్) అన్నాడు: “ఏమీ? నీకు విశ్వాసం లేదా?” దానికి (ఇబ్రాహీమ్): “ఉంది, కానీ నా మనస్సు తృప్తి కొరకు అడుగు తున్నాను!” అని అన్నాడు. అపుడు (అల్లాహ్): “నాలుగు పక్షులను తీసుకో, వాటిని బాగా మచ్చిక చేసుకో! తరువాత (వాటిని కోసి) ఒక్కొక్కదాని ఒక్కొక్క భాగాన్ని, ఒక్కొక్క కొండపై పెట్టి రా, మళ్ళీ వాటిని రమ్మని పిలువు, అవి నీ వద్దకు ఎగురుకుంటూ వస్తాయి. కాబట్టి నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు అని తెలుసుకో!”అని అన్నాడు.) [అల్ బఖర:260]

చనిపోయినవారిని పునరుత్థానం చేయటం సంభవం అన్నదానిపై సూచిస్తున్న నిజమైన ఇంద్రియ ఉదాహరణలు ఇవి, మృతులను పునరుత్థానం చేయడంలో, వారి సమాధుల నుండి వారిని అల్లాహ్ అనుమతితో బయటకు తీసుకురావడంలో మరియం కుమారుడైన ఈసా సూచనల గురించి సర్వశక్తిగల అల్లాహ్ ఏమి చేశాడో మనం ఇప్పటికే ప్రస్తావించాం.

హేతుబద్దమైన సూచనలు రెండు విధములుగా కలవు:

వాటిలో ఒకటి: నిశ్చయంగా అల్లాహ్ భూమ్యాకాశములను మరియు వాటిలో ఉన్న వాటిని మొదటిసారి సృష్టించాడు. సృష్టిని మొదటిసారి సృష్టించే సామర్ధ్యము కలవాడు దానిని మరల సృష్టించటం నుండి అశక్తుడు కాడు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَهُوَ الَّذِي يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ وَهُوَ أَهْوَنُ عَلَيْهِ

(మరియు ఆయనే సృష్టి ఆరంభించిన వాడు, ఆ తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు. ఇది ఆయనకు ఎంతో సులభమైనది.) [రూమ్:27]

كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُعِيدُهُ وَعْدًا عَلَيْنَا إِنَّا كُنَّا فَاعِلِين

(ఏవిధంగా మేము మొదటిసారి సృస్టించామో అదేవిధంగా మరోసారి కూడా చేస్తాము. ఈ వాగ్దానం నెరవేర్చే బాధ్యత మాపైన ఉంది. దాన్ని మేము తప్పకుండా నెరవేరుస్తాము.) [అల్ అంబియా: 104]

కృశించిపోయిన ఎముకలను జీవింప జేయటమును నిరాకరించిన వారిని ఖండిస్తూ ఆదేశిస్తూ ఇలా సెలవిచ్చాడు:

قُلْ يُحْيِيهَا الَّذِي أَنشَأهَا أَوَّلَ مَرَّةٍ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيم

{ఇలా అను: “మొదట వాటిని పుట్టించిన ఆయనే, మళ్ళీ వాటిని బ్రతికిస్తాడు. మరియు ఆయన ప్రతి సృష్టి సృజన పట్ల జ్ఞానముకలవాడు.} [యాసీస్:79]

రెండవది: భూమి నిర్జీవంగా, బంజరుగా ఉంటుంది, దానిలో పచ్చని చెట్టు ఉండదు, దానిపై వర్షం పడుతుంది, దానిలో ఒక సజీవ ఆకుపచ్చని మొక్కలు పుట్టుకొస్తాయి, దీనిలో అందాలు చిందించే అన్ని రకాల వస్తువులు ఉంటాయి, దాని మరణం తర్వాత దానిని పునరుద్ధరించ గలిగినవాడు చనిపోయిన వారిని పునరుజ్జీవింప జేయగలడు,

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

وَمِنْ آيَاتِهِ أَنَّكَ تَرَى الْأَرْضَ خَاشِعَةَ فَإِذَا أَنزَلْنَا عَلَيْهَا الْمَاء اهْتَزَّتْ وَرَبَتْ إِنَّ الَّذِي أَحْيَاهَا لَمُحْيِي الْمَوْتَى

{మరియు ఆయన సూచన (ఆయాత్) లలో ఒకటి: నిశ్చయంగా నీవు భూమిని పాడు నేలగా (ఎండిపోయిన బంజరు నేలగా) చూస్తున్నావు; కాని మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపించగానే, అది పులకించి, ఉబ్బి పోతుంది. నిశ్చయంగా దీనిని (ఈ భూమిని) బ్రతికించి లేపే ఆయన (అల్లాహ్ యే) మృతులను కూడా బ్రతికించి లేపుతాడు. నిశ్చయంగా, ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు.} [ఫుస్సిలత్:39]

وَنَزَّلْنَا مِنَ السَّمَاءِ مَاءً مُبَارَكًا فَأَتْبَتْنَا بِهِ جَنَّاتِ وَحَبَّ الْحَصِيدِ وَالنَّخْلَ بَاسِقَاتِ لَهَا طَلْعٌ نَضِيدٌ رِزْقًا لِلْعِبَادِ وَأَحْيَيْنَا بِهِ بَلْدَةً مَيْتًا كَذَلِكَ الْخُرُوجُ

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{ఇంకా మేము ఆకాశం నుండి శుభప్రదమైన నీటిని (వర్షాన్ని) కురిపించాము. తద్వారా తోటలను, కోతకొచ్చే ఆహార ధాన్యా లను మొలిపించాము. ఒకదానిపై ఒకటి పేరుకుని ఉండే పండ్ల గుత్తులు గల ఎత్తయిన ఖర్జూరపు చెట్లను, దాసులు ఉపాధి నిమిత్తం వీటిని (ఉత్పత్తి చేశాము). ఇంకా మేము దీంతో నిర్జీవంగా ఉన్న ప్రదేశానికి జీవం పోశాము. ఈ విధంగానే (సమాధుల నుండి బయటకు రావలసి ఉన్నది.} [ఖాఫ్:9-11]

మరణం తర్వాత సంభవించే వాటిపై విశ్వాసం పరలోకంపై విశ్వాసంతో ఇమిడి ఉంటుంది. ఉదాహరణకు:

(1) సమాధి పరీక్ష:

అది మృతునికి ఖననం చేసిన తరువాత అతని ప్రభువు గురించి, అతని ధర్మం గురించి, అతని ప్రవక్త గురించి ప్రశ్నించటం. అప్పుడు అల్లాహ్ విశ్వాసపరులను స్థిరమైన మాటపై నిలకడను ప్రసాదిస్తాడు. అప్పుడు అతను నా ప్రభువు అల్లాహ్ అని, నా ధర్మం ఇస్లాం అని, నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని సమాధానమిస్తాడు.

ويضل الله الظالمين فيقول الكافر : هاه هاه، لا أدري، ويقول المنافق أو المرتاب : لا أدري سمعت الناس يقولون شيئًا فقلته

అల్లాహ్ దుర్మార్గులను మార్గభ్రష్టతకు గురి చేస్తాడు. అప్పుడు అవిశ్వాసపరుడు ఇలా పలుకుతాడు అయ్యో అయ్యో నాకేమీ తెలియదు. మరియు కపటుడు, సందేహానికి గురి అయినవాడు ఇలా పలుకుతాడు నాకేమి తెలియదు. ప్రజలు ఏదో చెబుతుంటే విన్నాను అదే నేను పలికాను.

(2) సమాధి శిక్ష మరియు దాని అనుగ్రహాలు:

దుర్మార్గుల కొరకు అంటే కపటుల, అవిశ్వాసపరుల కొరకు సమాధి శిక్ష ఉంటుంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَلَوْ تَرَى إِذِ الظَّالِمُونَ فِي غَمَرَاتِ الْمَوْتِ وَالْمَلائِكَةُ بَاسِطُواْ أَيْدِيهِمْ أَخْرِجُواْ أَنفُسَكُمُ الْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُونِ بِمَا كُنتُمْ تَقُولُونَ عَلَى اللهِ غَيْرَ الْحَقِّ وَكُنتُمْ عَنْ آيَاتِهِ تَسْتَكْبِرُون 

(ఈ దుర్మార్గులు మరణయాతనలో ఉన్నప్పుడూ దైవదూతలు తమ చేతులు చాచి సరే ఇక మీ ప్రాణాలు బయటికి తీయండి మీరు అల్లాహ్’కు అబద్దాలు ఆపాదించునందుకు అల్లాహ్ ఆయతుల పట్ల గర్వాతిశయంతో విర్రవీగినందులకు.) [అల్ అస్ఆమ్:93]

అల్లాహ్ ఫిరౌను వంశము గురించి ఇలా సెలవిచ్చాడు:

{ఆ నరకాగ్ని! వారు దాని ఎదుటకు ఉదయమూ మరియు సాయంత్రమూ రప్పింపబడుతూ ఉంటారు. మరియు (పునరుత్థాన దినపు ఘడియ వచ్చినపుడు: “ఫిరౌను జనులను తీవ్రమైన శిక్షలో పడవేయండి!” అని ఆజ్ఞ ఇవ్వబడుతుంది.} [గాఫీర్: 46].

సహీహ్ ముస్లింలోని జైద్ బిన్ సాబిత్ ఉల్లేఖనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

“మీరు సమాధిలో ఖననం చేయటం వదిలివేస్తారని నాకు భయం లేకపోతే నేను అల్లాహ్ మీకు నేను సమాధుల నుండి వినే సమాధి శిక్షలను మీకు వినిపించమని అల్లాహ్ తో వేడుకునేవాడిని”. ఆ తరువాత తన ముఖమును త్రిప్పి ఇలా పలికారు “మీరు నరక శిక్ష నుండి అల్లాహ్ తో శరణం వేడుకోండి”. మేము నరకాగ్ని శిక్ష నుండి అల్లాహ్ శరణు వేడుకొంటున్నాము అని వారు పలికారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు “మీరు సమాధి శిక్ష నుండి అల్లాహ్ తో శరణు వేడుకోండి”. మేము సమాధి శిక్ష నుండి అల్లాహ్ తో శరణు వేడుకుంటున్నాము అని వారు సమాధానమిచ్చారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు “మీరు బహిర్గతం అయిన, బహిర్గతం కాని ఉపద్రవాల నుండి అల్లాహ్ తో శరణు వేడుకోండి”. మేము బహిర్గతం అయిన, బహిర్గతం కాని ఉపద్రవాల నుండి అల్లాహ్ తో శరణు వేడుకుంటున్నాము అని వారు సమాధాన మిచ్చారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు “మీరు దజ్జాల్ ఉపద్రవాల నుండి అల్లాహ్ తో శరణు వేడుకోండి”. మేము దజ్జాల్ ఉపద్రవాల నుండి అల్లాహ్ తో శరణు వేడుకుంటున్నాము అని వారు సమాధానమిచ్చారు.

ఇక సమాధి అనుగ్రహాలు: ఇవి సత్యవిశ్వాసుల కొరకు ఉన్నవి.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

{“మా ప్రభువు అల్లాహ్ మాత్రమే” అని పలికి, దానిపై స్థిరంగా ఉన్న వారి వద్దకు దైవదూతలు దిగివచ్చి, (ఇలా అంటూ ఉంటారు): “మీరు భయపడకండి. దుఃఖించకండి. మీకు వాగ్దానం చేయబడిన స్వర్గలోకపు శుభవార్తను అందుకోండి.} [ఫుస్సిలత్:30]

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

(మరి (గుండెలోని) ప్రాణం గొంతు దాకా వచ్చేసినపుడు, ఆ స్థితిని మీరు కళ్లారా చూస్తూ ఉండిపోతారు. మేము ఆ చనిపోయే వ్యక్తికి మీ కన్నా చాలా సమీపంలో ఉంటాము. కాని మీరు మాత్రం చూడలేరు. మీరు మీ వాదనలో) సత్యవంతులే అయితే, ఆ పోయే ప్రాణాన్ని (కాస్త తిరిగి రప్పించుకోండి! మరెవడైతే దైవసామీప్యం పొందినవారిలో చేరాడో, అతని కొరకు సౌఖ్యం, మధుర భక్ష్యాలు, అనుగ్రహభరితమైన స్వర్గవనం ఉంది.) [వాఖియ:83-89]

బర్రా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విశ్వాసపరుని గురించి ఎవరైతే తన సమాధిలో దైవదూతల ప్రశ్నలకు సమాధానమిచ్చి ఉంటాడో ఇలా సెలవిచ్చారు:

ఆకాశము నుండి ఒక ప్రకటించేవాడు ఇలా ప్రకటిస్తాడు: నా దాసుడు సత్యం పలికాడు కావున అతని కొరకు స్వర్గ తివాచీని పరచండి. మరియు అతనికి స్వర్గ వస్త్రములను తొడిగించండి. అతని కొరకు స్వర్గము వైపు ఒక ద్వారమును తెరవండి. ఇంకా ఆయన ఇలా సెలవిచ్చారు. కావున అతని వద్దకు స్వర్గపు గాలి, సువాసన వస్తూ ఉంటుంది. మరియు అతని సమాధిలో ఎక్కడి వరకు దృష్టి వెళుతుందో అక్కడి వరకు విశాలపరచ బడుతుంది. దీనిని అహ్మద్ మరియు అబూదావుద్ ఒక పొడవైన హదీసులో ఉల్లేఖించారు.

విచక్షణా రహితులైన వారిలోంచి ఒక సమూహం మార్గభ్రష్టతకు గురి అయినది. కావున వారు సమధి శిక్షను, దాని అనుగ్రహాలను సంభవించటమును వ్యతిరేకించటం వలన అది సంభవించటం అసంభవమని భావిస్తూ తిరస్కరించారు. ఇంకా వారు ఇలా పలికారు: ఒక వేళ సమాధిని తెరిచి శవమును చూస్తే అది ఎలా ఉండేదో అలాగే ఉంటుంది. అది విశాలమవటం గాని, బిగితువుగా అవటం గాని జరగదు. ఎటువంటి మార్పు జరగదు. షరీఅత్ పరంగా, ఇంద్రియ జ్ఞానం పరంగా మరియు బుద్ధి పరంగా ఇది అసత్య భావన అవుతుంది.

ఇక షరీఅత్ పరంగా చూస్తే సమాధి శిక్ష, దాని అనుగ్రహాల నిరూపణను సూచించే నుసూస్ (ఖుర్ఆన్ ఆయతులు, హదీసులు) వచ్చి ఉన్నవి.

సహీహ్ బుఖారీలోని ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం:

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సారి కొన్ని తోటల వద్ద నుండి వెళ్ళారు. అప్పుడు ఇద్దరు వ్యక్తులను సమాధిలో శిక్షింపబడుతున్నప్పుడు వారి స్వరమును విన్నారు. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు పూర్తి హదీసును ప్రస్తావించారు. అందులో ఇలా ఉన్నది: వారిలో ఒకడు మూత్రము నుండి పరిశుభ్రతను పాటించేవాడు కాదు. ఇంకో రివాయత్ లో తన మూత్రము నుండి అని ఉంది. మరియు రెండవ వ్యక్తి చాడీలను చేరవేసే వాడు. ముస్లిం యొక్క ఒక రివాయత్ లో అతడు మూత్రము నుండి పరిశుభ్రత పాటించేవాడు కాదు అని ఉంది.

ఇంద్రియ జ్ఞానము విషయానికొస్తే: నిదురించే వ్యక్తి తన కలలో తాను విశాలమైన మరియు ఆనందకరమైన ప్రదేశంలో ఉన్నానని, అందులో అనుగ్రహాలతో లబ్ది పొందుతున్నాడని లేదా తాను ఇరుకైన మరియు భయంకర ప్రదేశంలో ఉన్నానని, దానితో బాధపడుతున్నానని మరియు కొన్నిసార్లు తాను చూసిన దాని నుండి మేల్కొన్నానని చూస్తాడు. ఏదేమైనా, అతను తన గదిలో తన మంచంపై తాను ఉన్న స్థితిలో ఉన్నాడు, మరియు నిద్ర మరణానికి సోదరుడు, అందుకే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దాన్ని మరణం తో నామకరణం చేశాడు.

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

اللَّهُ يَتَوَفَّى الْأَنفُسَ حِينَ مَوْتِهَا وَالَّتِي لَمْ تَمُتْ فِي مَنَامِهَا ۖ فَيُمْسِكُ الَّتِي قَضَىٰ عَلَيْهَا الْمَوْتَ وَيُرْسِلُ الْأُخْرَىٰ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ

(అల్లాహ్‌యే ఆత్మలను వాటి మరణ సమయంలో స్వాధీనం చేసుకుంటాడు. మరణం రాని వారి ఆత్మలను కూడా వాటి నిద్రావస్థలో ఆయన వశపరచుకుంటున్నాడు. మరి మరణ ఉత్తర్వు ఖరారైన వారి ఆత్మలను ఆపుకుంటున్నాడు. ఇతర ఆత్మలను ఒక నిర్ణీత గడువు వరకు వదలిపెడుతున్నాడు. చింతన చేసే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి.) [అజ్జుమర్ 39 :42]

బుద్ధి విషయానికొస్తే: నిద్రపోయేవాడు తన కలలో వాస్తవికతకు అనుగుణమైన నిజమైన కలను చూస్తాడు, బహుశా అతను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను యథాతథంగా చూశాడు, మరియు ఆయనను చూసిన వారు నిజంగా అతన్ని చూశారు, అయితే, మంచంపై తన గదిలో నిదురించే వ్యక్తి చూసినదానికి చాలా దూరంలో ఉన్నాడు. ఇది ఈ లోక పరిస్థితులలో సాధ్యమైతే, పరలోక పరిస్థితులలో అది సాధ్యం కాదా?!

ఇక మృతుని సమాధి తెరిచి చూస్తే అది ఎలా ఉన్నదో అలాగే ఉంటుందని, సమాధి విశాలమవటంలో, ఇరుకుగా ఉండటంలో ఎటువంటి మార్పు జరగదని వారి వాదనలో వారి నమ్మకం ఏదైతే ఉన్నదో దాని సమాధానం ఈ క్రింది విధంగా ఇవ్వవచ్చు:

ఒకటి: షరీఆత్ లో చెప్పబడినదాన్ని ఇటువంటి నిరాధారమైన నిరాధారమైన అనుమానాలతో వ్యతిరేకించడం అనుమతించబడదు, షరీఆ తీసుకువచ్చింది ఏమీటో ప్రత్యర్థి ఏవిధంగా సమీక్షించాలో ఆవిధంగా సమీక్షిస్తే, ఈ అనుమానాల చెల్లుబాటు కాదని అతనికి తెలుస్తుంది మరియు ఇలా తెలుపబడింది:

చాలా మంది సరైన ప్రకటనను విమర్శిస్తారు, అయినప్పటికీ వారి విమర్శ వారి పొరపాటు (బలహీనమైన అవగాహన) ఫలితంగా ఉంటుంది.

రెండవది: బర్జఖ్ జీవిత విషయాలు అగోచర విషయాలకు సంబంధించినవి, వాటిని ఇంద్రియాల నుండి అర్ధం చేసుకోవడం సాధ్యం కాదు. వాటి వాస్తవికతను ఇంద్రియాల ద్వారా తెలుసుకోగలిగితే, అగోచర విషయాలపై విశ్వాసం వల్ల ప్రయోజనం ఉండదు, కానీ ఈ విధంగా అగోచరవిషయాలను విశ్వసించేవారు మరియు దానిని ధృవీకరించడానికి ఉద్దేశపూర్వకంగా నిరాకరించే వారు ఇద్దరూ సమానులవుతారు.

మూడవది: సమాధిలో శిక్షను, అనుగ్రహాలను, సమాధి విశాలమును మరియు బిగుతువును మృతుడు మాత్రమే అనుభవిస్తాడు ఇతరులు అనుభవించరు. నిదురించే వ్యక్తి తన కలలో తాను ఇరుకైన మరియు భయంకర ప్రదేశంలో లేదా విశాలమైన మరియు ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఉన్నట్లు చూస్తాడు, అతని చుట్టూ ఉన్న వారు దానిని చూడలేరు మరియు అనుభూతి చెందరు. మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం తన సహచరుల మధ్య ఉన్నప్పుడు ఆయన వైపు వహీ (దైవవాణి) అవతరింపబడేది. అప్పుడు ఆయన దైవవాణిని వినే వారు. ఆయన అనుచరులు దానిని వినలేక పోయేవారు. అప్పుడప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముందు దైవదూత మానవుని రూపంలో ప్రత్యక్షమయ్యి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో సంభాషించేవాడు. సహచరులు దైవదూతను చూడలేకపోయేవారు. మరియు అతనిని వినలేక పోయేవారు.

నాల్గవది: సృష్టికి అవగాహన శక్తి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ గ్రహించడానికి వీలు కల్పించిన దాని ద్వారా పరిమితం చేయబడుతుంది, మరియు వారు ఉన్న ప్రతిదాన్ని గ్రహించలేరు, సప్తాకాశాలు, భూమి మరియు వాటిలోని ప్రతిదీ నిజమైన స్తుతితో అల్లాహ్ నీ స్తుతిస్తుంది, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కొన్నిసార్లు తన సృష్టిలో నుంచి తాను కోరుకున్న వారికి దానిని వినిపిస్తాడు. దీనితో పాటు ఇవన్ని మన దృష్టికి కానరావు. ఈ విషయంలో అల్లాహ్ తఆలా ఇలా సెలవిస్తున్నాడు:

تُسَبِّحُ لَهُ السَّمَاوَاتُ السَّبْعُ وَالأَرْضُ وَمَن فِيهِنَّ وَإِن مِّن شَيْءٍ إِلَّا يُسَبِّحُ بِحَمْدِهِ وَلَكِن لَّا تَفْقَهُونَ تَسْبِيحَهُمْ

(సప్తాకాశాలు, భూమి మరియు వాటిలో ఉన్న సమస్తమూ ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయన పవిత్రతను కొనియాడనిది, ఆయన స్తోత్రం చేయనటువంటిది ఏదీ లేదు, కాని మీరు వాటి స్తుతిని అర్థం చేసుకోలేరు.) [ఇస్రా : 44]

ఈ విధంగా షైతానులు, జిన్నులు భువిలో రాకపోకలు కొనసాగించేవి. జిన్నులు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఆయన ఖుర్ఆన్ పారాయణమును నిశ్శబ్దంగా విన్నారు. ఆ తరువాత తమ జాతివారి వద్దకు హెచ్చరిస్తూ వెళ్ళారు. ఇంత జరిగిన కూడా వారు మన కంటికి కనబడరు.

ఈ విషయంలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

يَا بَنِي آدَمَ لَا يَفْتِنَنَّكُمُ الشَّيْطَانُ كَمَا أَخْرَجَ أَبَوَيْكُم مِّنَ الْجَنَّةِ يَنزِعُ عَنْهُمَا لِبَاسَهُمَا لِيُرِيَهُمَا سَوْآتِهِمَا إِنَّهُ يَرَاكُمْ هُوَ وَقَبِيلُهُ مِنْ حَيْثُ لا تَرَوْنَهُمْ إِنَّا جَعَلْنَا الشَّيَاطِينَ أَوْلِيَاء لِلَّذِينَ لا يُؤْمِنُونَ

{ఓ ఆదమ్ సంతానమా! షైతాన్ మీ తల్లిదండ్రుల నుండి (స్వర్గ) వస్త్రాలను తొలగించి, వారి మర్మాంగాలను వారికి కనబడేటట్లు చేసి వారిని స్వర్గం నుండి వెడల గొట్టినట్లు మిమ్మల్ని కూడా ఆపదకు (ఫీత్నాకు) గురిచేయకూడదు. నిశ్చయంగా వాడు మరియు వాని సంతతి వారు మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నారు. కాని, మీరు వారిని చూడలేరు. నిశ్చయంగా, మేము షైతానులను, విశ్వసించని వారికి స్నేహితులుగా చేశాము.} [ఆరాఫ్:27]

సృష్టి ఉనికిలో ఉన్న వాటి వాస్తవికతను గ్రహించనప్పుడు, నిర్ధారిత అగోచరవిషయాలను వారు గ్రహించక తిరస్కరించడం సమ్మతం కాదు.

అల్ ఖదర్ (దాల్ కి ఫతహ తో) అంటే అల్లాహ్ తన ముందస్తు జ్ఞానంతో మరియు తన విజ్ఞతతో లోకము యొక్క విధివ్రాతను వ్రాయటం మరియు తీర్పు నివ్వటం.

విధివ్రాతపై విశ్వాసం అన్నది నాలుగు విషయములను ఇమిడి ఉంది:

ఒకటి: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు తన చర్యలకు, లేదా తన దాసుల చర్యలకు సంబంధించిన ప్రతిదీ, సంక్షిప్తంగా, సవివరంగా శాశ్వతంగా తెలుసు అని విశ్వసించడం.

రెండు: అల్లాహ్ దీనిని లౌహె మహ్ ఫూజ్ లో వ్రాసి ఉంచాడని విశ్వసించడం.

ఈ రెండు విషయముల గురించి అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا فِي السَّمَاء وَالْأَرْضِ إِنَّ ذَلِكَ فِي كِتَابٍ إِنَّ ذَلِكَ عَلَى اللَّهِ يَسير

(ఏమీ? నీకు తెలియదా? ఆకాశంలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసని! నిశ్చయంగా, ఇదంతా ఒక గ్రంధంలో (వ్రాయబడి ఉంది. నిశ్చయంగా ఇదంతా అల్లాహ్ కు చాలా సులభమైనది.) [హజ్:70]

సహీహ్ ముస్లిం లో అబ్దుల్లాహ్ బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం: ఆయన ఇలా సెలవిచ్చారు, నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా ప్రవచిస్తుండగా విన్నాను:

“అల్లాహ్ ఆకాశములను, భూమిని సృష్టించక యాభై వేల సంవత్సరముల ముందే సృష్టిరాసులు విధివ్రాతను వ్రాసివేశాడు”.

మూడవది: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ చిత్తం ప్రకారమే సమస్త జీవులు ఉండగలవనీ విశ్వసించాలి – అది ఆయన చర్యకు సంబంధించినది అయినా, లేదా సృష్టించబడిన వారి చర్యకు సంబంధించినది అయినా.

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన చర్యకు సంబంధించి ఇలా అన్నాడు:

وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاء وَيَخْتَار

{నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.} [ఖసస్:68]

మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{అల్లాహ్ తాను తలచుకున్నది చేసి తీరుతాడు.} [ఇబ్రాహీమ్:27]

మరియు ఇలా సెలవిచ్చాడు:

هُوَ الَّذِي يُصَوِّرُكُمْ فِي الْأَرْحَامِ كَيْفَ يَشَاء

{ఆయనే తాను కోరిన విధంగా మాతృగర్భాల్లో మీ రూపు రేఖలను మలుస్తాడు.} [ఆలి ఇమ్రాన్ :6].

మరియు అల్లాహ్ సృష్టిరాసుల చర్యలకు సంబంధించి ఇలా సెలవిచ్చాడు :

وَلَوْ شَاءَ اللهُ لَسَلَّطَهُمْ عَلَيْكُمْ فَلَقَاتَلُوكُمْ

{అల్లాహ్ యే గనక తలిస్తే మీపై వారికి ప్రాబల్యాన్ని ఒసగేవాడు. అదేగనక జరిగితే వారు మీతో యుద్ధం చేసేవారు.} [నిసా:90]

మరియు ఇలా సెలవిచ్చాడు ;

وَلَوْ شَاء رَبُّكَ مَا فَعَلُوهُ فَذَرْهُمْ وَمَا يَفْتَرُونَ

(నీ ప్రభువే గనక తలుచుకుంటే వారెన్నటికీ అలా చేయలేరు. కాబట్టి నీవు వాళ్ళను, వారి కల్పనలను వదిలివెయ్యి.} [అస్ఆమ్:112]

నాల్గవది : సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కొరకు సమస్త ప్రాణులు తమ స్వంత స్వభావం, లక్షణాలు మరియు కదలికలతో సహా సృష్టించబడ్డారని విశ్వసించడం,

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

اللهُ خَالِقُ كُلِّ شَيْءٍ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ وَكِيل

{అల్లాహ్ యే ప్రతి దాని సృష్టికర్త మరియు ఆయనే ప్రతి దానికి కార్యకర్త.} [జుమర్:62]

అల్లాహ్ సుబహానహు వతఆలా ఇలా సెలవిచ్చాడు :

وَخَلَقَ كُلَّ شَيْءٍ فَقَدْرَهُ تَقْدِيرًا

(ఆయన ప్రతి వస్తువును సృష్టించి, దానికి తగ్గట్టుగా దాని లెక్కను నిర్ధారించాడు} [ఫుర్ఖాన్:2]

అల్లాహ్ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి తెలిపాడు. ఆయన తన జాతిప్రజలకు ఇలా బోధించారు:

{“వాస్తవానికి, మిమ్మల్ని మరియు మీరు (చెక్కి) చేసిన వాటిని సృష్టించింది అల్లాహ్ యే కదా!”} [సాఫ్ఫాత్:96]

పైన మేము వర్ణించినట్లు విధివ్రాతపై విశ్వాసం అన్నది దాసునికి తన స్వచ్ఛంద పనులు చేయటంలో ఇచ్చ మరియు వాటిపై సామర్ధ్యం ఉంటున్నది అన్న దానికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే షరీయత్ మరియు పరిస్థితులు అది దాసునికి ఉన్నదని నిరూపించటానికి ఆధారాలు.

ఇక షరీయత్ విషయానికి వస్తే అల్లాహ్ ఇచ్చ విషయంలో ఇలా సెలవిస్తున్నాడు :

{ఇక కోరినవారు (మంచి పనులు చేసి) తమ ప్రభువు వద్ద స్థానం ఏర్పరచుకోవచ్చు.} [నబా:39]

{మీ పొలాల్లోకి మీరు కోరిన విధంగా రండి.} [బఖర:223]

మరియు అల్లాహ్ సామర్ధ్యం విషయంలో ఇలా సెలవిచ్చాడు:

 فَاتَّقُوا اللهَ مَا اسْتَطَعْتُمْ وَاسْمَعُوا وَأَطِيعُوا
(కాబట్టి శాయశక్తులా మీరు అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. వినండి, విధేయత చూపండి.} [తగాబున్: 16]

మరియు ఇలా సెలవిచ్చాడు:

(అల్లాహ్ ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవిచూస్తుంది.} [బఖర:286].

ఇక పరిస్థితులు: ప్రతి మనిషికి తెలుసు అతనికి ఇచ్చ మరియు సామర్ధ్యం ఉన్నదని. వాటి ప్రకారమే కార్యచరణ చేస్తాడు. మరియు వాటి ప్రకారమే కార్యచరణను వదిలివేస్తాడు. మరియు అతడు తన ఇచ్చతో వాటిల్లే చర్య నడవటం మరియు తన ఇచ్చతో కాకుండా వాటిల్లే వణకటం మధ్య తేడా గమనిస్తాడు. కాని మనిషి యొక్క ఇచ్చ, సామర్ధ్యం అల్లాహ్ యొక్క ఇచ్చ, సామర్ధ్యంతో వాటిల్లుతాయి. ఎందుకంటే అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

ا لِمَنْ شَاءَ مِنْكُمْ أَنْ يَسْتَقِيمَ وَمَا تَشَاءُونَ إِلَّا أَنْ يَشَاءَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ} [التكوير: 29-28]

(మీలో, ఋజుమార్గంలో నడవదలచుకున్న ప్రతివాని కొరకు మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు.) [అత్ తక్వీర్ :28-29]

ఈ విశ్వమంతా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ రాజ్యాధికారము కలదు కాబట్టి, ఆయన జ్ఞానం, సంకల్పం లేకుండా ఆయన ఆధీనంలో ఏదీ లేదు.

విధివ్రాతపై విశ్వాసం గురించి మేము తెలియపరచినది ఏ దాసునికి విధి కార్యాలను వదిలివేయటానికి లేదా అవిధేయతకు పాల్పడటానికి అనుమతి ఉన్నదని ఆధారం కాదు. కావున దానితో ఆధారం చూపటం ఈ కొన్ని మార్గాల వలన అసత్యమగును:

ఒకటి: అల్లాహ్ యొక్క వాక్కు.

{అల్లాహ్ కు సాటి (భాగస్వాములు) కల్పించేవారు అంటారు: “ఒకవేళ అల్లాహ్ కోరితే మేము గానీ, మా తండ్రితాతలు గానీ ఆయనకు సాటి కల్పించే వారమూ కాము మరియు దేనినీ నిషేధించి ఉండేవారమూ కాము.” వారికి పూర్వం వారు కూడా మా శిక్షను రుచి చూడనంత వరకు ఇదే విధంగా తిరస్కరించారు. వారిని అడుగు: “మీ వద్ద ఏదైనా (రూఢి అయిన) జ్ఞానం ఉందా! ఉంటే మా ముందు పెట్టండి. మీరు కేవలం కల్పనలను అనుసరిస్తున్నారు మరియు మీరు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు”} [అస్ఆమ్ : 148]

ఒకవేళ వారికి విధివ్రాత ఆధారమే అయితే అల్లాహ్ వారికి తన శిక్ష రుచిని చూపించి ఉండడు.

రెండు: అల్లాహ్ యొక్క వాక్కు :

{(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము. ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగల కూడదని! మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.} [నిసా: 165]

ఒకవేళ విధవ్రాత విభేదకులకు ఆధారమైతే సందేశహరులను పంపి దానిని నిరోధించటం జరిగేది కాదు. ఎందుకంటే సందేశహరులను పంపిన తరువాత విభేదము అన్నది వాటిల్లుతుంది అంటే అది అల్లాహ్ యొక్క విధివ్రాతతోనే జరుగుతుంది.

మూడు: బుఖారీ, ముస్లిం ఉల్లేఖించినది, పదాలు బుఖారీవి – అలీ బిన్ అబూ తాలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం:

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: మీలో నుంచి ప్రతి ఒక్కరి స్థావరమును అల్లాహ్ నరకంలో లేదా స్వర్గములో వ్రాసి ఉంచాడు. అప్పుడు అనుచరులలో నుంచి ఒకరు ఇలా ప్రశ్నించారు: ఓ ప్రవక్త మేము దానిపైనే నమ్మకం ఉంచుకోకూడదా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేదు. మీరు ఆచరించండి. ప్రతి ఒక్కరి కొరకు శులభం చేయబడింది అని సమాధానమిచ్చి ఆ తరువాత ఈ ఆయతును చదివారు: {ఎవరైతే (దైవమార్గంలో) ఇచ్చాడో, (తన ప్రభువుకు భయపడుతూ ఉన్నాడో.} [అల్-లైల్:5]

ముస్లిం హదీథు గ్రంథంలోని పదాలు ఇలా ఉన్నవి: “ప్రతి ఒక్కరికి ఆ పని శులభతరం చేయబడినది దేని కొరకైతే వారు సృష్టించబడ్డారో”. ఆ తరువాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించమని ఆదేశించి విధివ్రాతపై నమ్మకమును కలిగి ఉండటాన్ని వారించారు.

నాలుగు: నిశ్చయంగా అల్లాహ్ దాసుడిని ఆదేశించాడు మరియు వారించాడు. మరియు అతడి శక్తి మేరకు అతనికి బాధ్యతను అప్పగించాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

فَاتَّقُوا اللهَ مَا اسْتَطَعْتُمْ وَاسْمَعُوا وَأَطِيعُوا} [التغابن : 16]

{కాబట్టి శాయశక్తులా మీరు అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. వినండి, విధేయత చూపండి.} [తగాబున్: 16]

మరియు ఇలా సెలవిచ్చాడు: (అల్లాహ్ ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించి భారం వేయడు.) [బఖర : 286]

ఒకవేళ దాసుడు ఏదైన కార్యం చేయటానికి బలవంతం పెట్టబడితే, అతడు వదిలించుకోలేనిదానికి బాధ్యుడవుతాడు, మరియు ఇది సరైనది కాదు, కాబట్టి అజ్ఞానం, మతిమరుపు లేదా బలవంతం కారణంగా అతని నుండి పాపం చేయబడితే, అతనిపై ఎటువంటి పాపం లేదు, ఎందుకంటే అతను క్షమార్హుడు.

ఐదవది: అల్లాహ్ విధి దాచబడి ఉన్న రహస్యం, కాబట్టి విధి జరిగిన తరువాత మాత్రమే తెలుస్తుంది. కానీ ఒక వ్యక్తి ఏదైనా చేసినప్పుడు, అతను ఏమీ చేయాలనుకుంటున్నాడో అతనికి ముందే తెలుసు, కాబట్టి అతని చర్య యొక్క ఉద్దేశ్యం అల్లాహ్ యొక్క విధి గురించి అతని జ్ఞానంపై ఆధారపడి ఉండదు. ఇది విధి ద్వారా అతని యొక్క వాదనను తిరస్కరిస్తుంది, ఎందుకంటే తెలియనిది దేనికైనా వాదనగా ఎలా మారుతుంది.

ఆరు: మనిషి ప్రాపంచిక వ్యవహారాల విషయంలో ప్రయోజనకరమైన వాటిని కోరుకుంటూ ఉండటం మేము చూస్తుంటాము. చివరికి అతను వాటిని పొందుతాడు. ఇంకా అతను తనకు ప్రయోజనం కలిగించని వాటి వైపు మరలడు. ప్రయోజనం కలిగించని వాటి వైపు మరలటానికి విధివ్రాత ద్వారా ఆధారం చూపడు. అటువంటప్పుడు ధార్మిక వ్యవహారాలలో ప్రయోజనం కలిగించే వాటిని వదిలి నష్టం కలిగించే వాటి వైపు ఎలా మరలుతాడు మరియు వాటి విషయంలో విధివ్రాత ద్వారా ఎలా ఆధారం చూపుతాడు. ఈ రెండు వ్యవహారాల విషయం ఒకటి కాదా ? !

దీనిని స్పష్టపరచటానికి మీకు కొన్ని ఉదాహరణలను ఇస్తున్నాము:

ఒకవేళ మనిషి ముందు రెండు మార్గములు ఉంటే: అందులో ఒకటి అతడిని క్రమశిక్షణారాహిత్యం కల పట్టణం వైపు తీసుకెళుతుంది. అందులో హత్య, దోపిడి, అత్యాచారము, భయము మరియు ఆకలి రాజ్యమేలుతుంది. రెండవ మార్గము అతడిని క్రమశిక్షణ, స్థిరమైన భద్రత, సంపన్నమైన జీవితం ధన, మాన, ప్రాణాల పట్ల గౌరవం కల పట్టణం వైపు తీసుకెళుతుంది. అటువంటప్పుడు అతను ఆ రెండు మార్గములలో నుంచి ఏ మార్గములో నడుస్తాడు?

వాస్తవానికి, అతను మరొక మార్గాన్ని ఎంచుకుంటాడు, ఇది చుట్టూ శాంతి ఉన్న వ్యవస్థీకృత నగరంలో ముగుస్తుంది. అశాంతి, భయం, దోపిడీలు ఉన్న నగర మార్గాన్ని విధివ్రాతను ఆధారంగా తీసుకుని వివేకవంతుడు ఎవరూ ఎంచుకోడు. అటువంటప్పుడు పరలోక విషయంలో అతడు విధివ్రాతను ఆధారంగా తీసుకుని స్వర్గమార్గమును వదిలి నరకమార్గమును ఎలా ఎంచుకుంటాడు?

ఇంకో ఉదాహరణ: ఒక వైద్యుడు రోగికి మందు తాగమని ఆదేశించినప్పుడు, అతను తనకు ఇష్టం లేకపోయినా తాగుతాడు, అదేవిధంగా అతను ఏదైనా హానికరమైన ఆహారాన్ని తినకుండా నిరోధించినప్పుడు, అతను దానిని కోరినప్పటికీ వదిలివేస్తాడు. రోగి తన స్వంత భద్రత మరియు వైద్యం కోసం మాత్రమే ఇదంత చేస్తాడు. అతను విధివ్రాతను ఆధారంగా చేసుకుని మందు త్రాగకుండా ఉండటం లేదా తనని నష్టం కలిగించే ఆహారమును తినటం చేయలేడు. అటువంటప్పుడు మనిషి విధివ్రాతను ఆధారంగా చేసుకుని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశించిన వాటిని ఎలా వదిలి వేస్తాడు మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వారించిన వాటిని ఎలా చేస్తాడు?

ఏడు: విధులను వదలటం పై లేదా పాప కార్యములను పాల్పడటం పై విధివ్రాతను ఆధారంగా చూపించే వాడిపై ఎవరైన దౌర్జన్యమునకు పాల్పడి అతని సంపదను తీసుకుని లేదా అతని పవిత్రతను ఉల్లంఘించి ఆ తరువాత విధివ్రాతను ఆధారంగా చూపి మీరు నన్ను నిందించకండి నా ఈ హింస విధివ్రాత ప్రకారం జరిగింది అని పలికితే అతడు అతని ఆధారమును అంగీకరించడు. అటువంటప్పుడు అల్లాహ్ హక్కు విషయంలో అతిక్రమించటంలో విధివ్రాతను తన స్వయం కొరకు ఆధారంగా చూపేవాడు తనపై ఇతరులు హింసకు పాల్పడే విషయంలో విధివ్రాతను ఆధారంగా చూపటమును ఎందుకు అంగీకరించడు?!

ఈ విషయంలో ఒక సంఘటన ప్రస్తావించబడుతుంది. విశ్వాసుల నాయకులు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు వద్దకు చేతులు వదించబడే శిక్షకు అర్హుడైన ఒక దొంగను తీసుకుని రావటం జరిగింది. అప్పుడు ఆయన అతని చేతులను నరకమని ఆదేశించారు. అప్పుడు అతను ఓ విశ్వాసులు నాయకుడా ఆగండి నేను అల్లాహ్ విధిప్రకారం దొంగతనం చశాను. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా సమాధానమిచ్చారు: మేము కూడా అల్లాహ్ తఖ్దీర్ ప్రకారమే చేయిని నరుకుతున్నాము.

ఒకటి: కారకాలను వినియోగించేటప్పుడు అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండటం ఎలాగంటే కారకాలపై నమ్మకమును కలిగి ఉండకూడదు. ఎందుకంటే ప్రతీది అల్లాహ్ విధి ప్రకారమే జరుగును.

రెండవది: ఒక లక్ష్యాన్ని సాధించే సమయంలో స్వార్థానికి పాల్పడవద్దు, ఎందుకంటే లక్ష్యాన్ని సాధించడం అల్లాహ్ నుండి వచ్చిన ఆశీర్వాదం, ఇది మంచి మరియు విజయం యొక్క కారణాల ఫలితంగా అల్లాహ్ నిర్దేశించింది. ఒక వ్యక్తి యొక్క స్వార్థం, ఆశీర్వాదాలను పొందినందుకు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవటమును మరపింపచేస్తుంది.

మూడవది: అల్లాహ్ యొక్క విధి ప్రకారం మనిషికి లభించిన వాటి పట్ల సంతృప్తి చెందటం, సంతోష పడటం. కావున అతను ఏదైన ఇష్టమైన వస్తువు కోల్పోవటం వలన లేదా ఏదైన అయిష్టకరమైనది లభించటం వలన బాధపడకూడదు. ఎందుకంటే ఇది అల్లాహ్ విధివ్రాత ప్రకారం. భూమ్యాకాశాల రాజ్యాధికారం ఆయనకే చెందుతుంది. ఆయన విధి ఖచ్చితంగా జరుగును. ఈ విషయంలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

مَا أَصَابَ مِنْ مُصِيبَةٍ فِي الْأَرْضِ وَلَا فِي أَنْفُسِكُمْ إِلَّا فِي كِتَابٍ مِنْ قَبْلِ أَنْ نَبْرَأَهَا إِنَّ ذَلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ لِكَيْلَا تَأْسَوْا عَلَى مَا فَاتَكُمْ وَلَا تَفْرَحُوا بِمَا آتَاكُمْ وَاللَّهُ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُورٍ

(భూమి మీద గానీ లేదా స్వయంగా మీ మీద గానీ విరుచుకు పడే ఏ ఆపద అయినా సరే! మేము దానిని సంభవింప జేయక ముందే గ్రంధంలో వ్రాయబడకుండా లేదు. నిశ్చయంగా, ఇది అల్లాహ్ కు ఎంతో సులభం. ఇదంతా మీరు పోయిన దానికి నిరాశ చెందకూడదని మరియు మీకు ఇచ్చిన దానికి సంతోషంతో ఉప్పొంగి పోరాదని. మరియు అల్లాహ్ బడాయీలు చెప్పుకునేవారూ, గర్వించే వారూ అంటే ఇష్టపడడు.) [హదీద్:22-23]

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తున్నారు:

“విశ్వాసి పరిస్థితి చాలా ఆశ్చర్యకరమైనది. అతను ఏ పరిస్థితిలో ఉన్నా అతనికి మేలు మాత్రమే కలుగుతుంది. ఇది కేవలం విశ్వాసి విషయంలో మాత్రమే జరుగుతుంది. అతనికి ఆనందం కలిగినప్పుడు అల్లాహ్ ‘ కు కృతజ్ఞత తెలుపు కుంటాడు, అతనికి అది మేలును ప్రసాదిస్తుంది. ఒక వేళ అతనికి కష్టం కలిగితే అతను సహనం వహిస్తాడు అది అతనికి మేలు చేస్తుంది”.

అందులో ఒకటి: జబరియ్యా వర్గము వారు దాసుడు తన చర్యపై బలవంతం చేయబడ్డాడు. అతనికి అందులో ఎలాంటి నిర్ణయం కాని విధివ్రాత కాని లేదు. రెండవది: ఖదరియ్యహ్, వారు అంటారు, దాసుడు సంకల్పం మరియు శక్తితో తన పని నుండి స్వతంత్రుడు, మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సంకల్పం మరియు అతని శక్తి అతనిపై ఎటువంటి ప్రభావాన్ని చూపవు.

షరీఆ విషయానికొస్తే: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దాసుని కొరకు సంకల్పాన్ని, ఇచ్చను రుజువు చేసి, అతనికి పనిని జోడించాడు, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

مِنكُم مَّن يُرِيدُ الدُّنْيَا وَمِنكُم مَّن يُرِيدُ الآخِرَةَ} [آل عمران : 152]

(మీలో కొందరు ప్రపంచం కోసం ప్రాకులాడగా, మరికొందరు పరలోకాన్ని కోరుకున్నారు.) [ఆలె ఇమ్రాన్ :152]

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَقُلِ الْحَقُّ مِن رَّبِّكُمْ فَمَن شَاء فَلْيُؤْمِن وَمَن شَاء فَلْيَكْفُرْ إِنَّا أَعْتَدْنَا لِلظَّالِمِينَ نَارًا أَحَاطَ بِهِمْ

{ఈ విధంగా ప్రకటించు: (ఆసాంతం) సత్యం (తో కూడుకున్న ఈ ఖుర్ఆన్) మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది. కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరినవారు నిరాకరించవచ్చు. (అయితే సత్యాన్ని నిరాకరించిన దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. దాని కీలలు వారిని చుట్టుముడతాయి.} [కహఫ్:29]

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وقال تعالى: {مَنْ عَمِلَ صَالِحًا فَلِنَفْسِهِ وَمَنْ أَسَاء فَعَلَيْهَا وَمَا رَبُّكَ بِظَلامِ لِلْعَبِيد} [فصلت: 46]

{ఎవడైతే సత్కార్యం చేస్తాడో అతడు తన (మేలు) కొరకే చేస్తాడు. మరియు దుష్కార్యం చేసేవాడు దాని (ఫలితాన్ని) అనుభవిస్తాడు. మరియు నీ ప్రభువు తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు.} [ఫుస్సిలత్:46]

పరిస్థితులకు సంబంధించి: ప్రతి వ్యక్తికి తాను ఇష్టపూర్వకంగా చేసే ఐచ్ఛిక చర్యలు: తినడం, త్రాగటం, అమ్మడం మరియు కొనడం మరియు అతని ఇష్టానికి వ్యతిరేకంగా తనపై పడేవి: జ్వరం నుండి వణుకు మరియు పైకప్పు నుండి పడిపోవడం వంటివి మధ్య వ్యత్యాసం తెలుసు, అతను మొదటి దానిలో బలప్రయోగం లేకుండా తన సంకల్పం ద్వారా స్వయనిర్ణయంతో చేసేవాడు, మరియు రెండవ దానిలో అతను స్వయనిర్ణయుడు కాడు, మరియు అతను తనపై వాటిల్లిన దానిని కోరుకోడు.

షరియత్ విషయానికొస్తే: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అన్నింటికీ సృష్టికర్త, మరియు ప్రతిదీ ఆయన చిత్తం ప్రకారమే అవుతుంది, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన గ్రంధంలో దాసుల చర్యలు తన చిత్తం ప్రకారమే జరుగుతాయని స్పష్టపరచాడు, మరియు ఆయన ఇలా సెలవిచ్చాడు:

وَلَوْ شَاءَ اللهُ مَا اقْتَتَلَ الَّذِينَ مِن بَعْدِهِم مِّن بَعْدِ مَا جَاءتْهُمُ الْبَيِّنَاتُ وَلَكِنِ اخْتَلَفُوا فَمِنْهُم مَّنْ آمَنَ وَمِنْهُم مَّن كَفَرَ وَلَوْ شَاء اللهُ مَا اقْتَتَلُوا وَلَكِنَّ اللهَ يَفْعَلُ مَا يُرِيد

(ఒకవేళ అల్లాహ్ యే గనక తలిస్తే వీరి తరువాత స్పష్టమయిన నిదర్శనాలు చూసిన ప్రజలు పరస్పరం తగువులాడుకునేవారు కాదు. కాని వారు విభేదాల్లో పడిపోయారు. వారిలో కొందరు విశ్వసించగా, మరి కొందరు అవిశ్వాసులుగా ఉండి పోయారు. అల్లాహ్ గనక కోరితే వీరు పరస్పరం కలహించుకునే వారు కారు. కాని అల్లాహ్ మాత్రం తాను తలచిందే చేస్తాడు.) [బఖర:253]

మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وقال تعالى: {وَلَوْ شِئْنَا لَآتَيْنَا كُلَّ نَفْسٍ هَدَاهَا وَلَكِنْ حَقَّ الْقَوْلُ مِنِّي لأَمْلأَنَّ جَهَنَّمَ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ أَجْمَعِين }

(మరియు మేము కోరినట్లయితే, ప్రతి వ్యక్తికి (ఆత్మకు) దాని మార్గదర్శకత్వం చేసి ఉండేవారము. కాని, నేను: “నిశ్చయంగా జిన్నాతులు మరియు మానవులందరితో నరకాన్ని నింపివేస్తాను” అని పలికిన, నా మాట సత్యమయ్యింది.} [సజ్దా: 13]

బుద్ధి విషయానికొస్తే: ఈ విశ్వమంతా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆదీనంలో ఉన్నది, మరియు మానవుడు ఈ విశ్వంలోని వాడే. కావున అతను సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆధీనంలో ఉన్నాడు, మరియు ఆదీనంలో ఉన్నవారికి యజమాని అనుమతి, ఇచ్చ లేకుండా అతని రాజ్యంలో కార్య నిర్వహణ చేయటం సాధ్యం కాదు.

అరబీ పరిభాషలో హదఫ్ అంటే చాలా అర్ధాలు వస్తాయి అందులో నుంచి ఒకటి విల్లు గురి పెట్టి కొట్టటానికి ఏర్పాటు చేసుకున్న గుర్తు. మరియు ఉద్దేశించబడిన ప్రతి వస్తువు.

ఇస్లామీయ విశ్వాసం యొక్క లక్ష్యాలు, దాని ఉద్దేశాలు మరియు ఉదాత్త లక్ష్యాలు, దానికి కట్టుబడి ఉండటం వల్ల కలిగేవి, మరియు అవి అనేక మరియు వైవిధ్యమైనవి, వాటిలో నుంచి:

ఒకటి: అల్లాహ్ ప్రసన్నతను కోరుతూ ఆయనను మాత్రమే ఆరాధించడం. అల్లాహ్ సృష్టికర్త, అతనికి భాగస్వాములు లేరు. కాబట్టి, ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు మనం చేసే ప్రతి చర్య ద్వారా ఆయన ప్రసన్నతను ఉద్దేశించాలి.

రెండు: ఈ ‘అఖీదా’ను పాటించకపోవడం వల్ల కలిగే గందరగోళం నుండి మనస్సును విముక్తి చేయడం. ఈ ‘అఖీదా’ను నమ్మని వ్యక్తి భౌతిక మార్గాలను ఆరాధించే నాస్తికుడు కావచ్చు లేదా తప్పుడు నమ్మకాల వల్ల కలిగే తప్పుదారి మరియు చీకటిని అనుసరించేవాడు కావచ్చు..

మూడు: మానసిక మరియు మేధో సంతృప్తిని పొందడం. ఈ ‘అఖీదా’ను విశ్వసించేవారు మానసిక సంక్లిష్టతలకు లేదా గందరగోళానికి బలైపోరు. ఈ ‘అఖీదా’ ప్రభువు మరియు ఆయన దాసుని మధ్య ప్రత్యక్ష మరియు బలమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది. విశ్వాసి అల్లాహ్‌ను ప్రభువుగా, శాసనకర్తగా మరియు రాజుగా అంగీకరిస్తాడు. అతను ఈ విశ్వాసంతో సంతృప్తి చెందుతాడు. అతని హృదయం ఇస్లాంను అనుసరించడం పట్ల సంతృప్తి చెందుతుంది మరియు అతను ఈ ఆనందాన్ని వేరొకదానితో మార్పిడి చేసుకోడు.

నాలుగు: ఉద్దేశాలను మరియు కర్మలను శుద్ధి చేసుకోవడం. ఈ ‘అఖీద’ ఆరాధనలలో లేదా ఇతరులతో వ్యవహరించేటప్పుడు తప్పుదారి పట్టకుండా కాపాడుతుంది. దీని అనుచరులు ప్రవక్తలు నిర్దేశించిన మార్గాన్ని అనుసరిస్తారు. ఈ మార్గం హృదయాలలో మరియు చర్యలలో భద్రత మరియు స్వచ్ఛతకు దారితీస్తుంది.

ఐదు: అన్ని విషయాలలో పరిపక్వత, గంభీరత ఉండటం, ఎందుకంటే విశ్వాసి ప్రతిఫలం పొందడానికి నీతికార్యాలు చేయడానికి ఏ అవకాశాన్ని వృధా చేయడు. అదేవిధంగా, శిక్షకు భయపడి, అతను తనను తాను పాపానికి దూరంగా ఉంచుకుంటాడు, ఎందుకంటే ఈ విశ్వాసం యొక్క పునాదులలో ఒకటి మనిషి పునరుత్థానానికి సంబంధించినది, మరియు ప్రతి మంచి మరియు చెడు కర్మల యొక్క ప్రతిఫలంపై నమ్మకమును కలిగి ఉండటం.

మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{మరియు ప్రతి ఒక్కరికీ వారి కర్మల ప్రకారం స్థానాలు ఉంటాయి. మరియు నీ ప్రభువు వారి కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు.} [అన్ ఆమ్:132]

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఈ మాటల ద్వారా ఈ లక్ష్యం విషయంలో ప్రోత్సహించారు;

ఒక బలవంతుడైన విశ్వాసీ అల్లాహ్ దృష్టిలో బలహీనమైన విశ్వాసి కంటే ఎంతో మేలైనవాడు మరియు ప్రీతిపాత్రుడు, ప్రతీ ఒక్కరిలో మేలు ఉంది, నీకు లాభదాయకమైన దాని విషయంలో ఆశ చెందు, అల్లాహ్ తో సహాయాన్ని అర్థించు వెనుకంజ వేయకు, ఒకవేళ నీకేమైనా నష్టం కలిగితే నేను ఇలా చేస్తే అలా చేస్తే ఇలా అయ్యి ఉండేది కాదు అంటూ మాట్లాడకు ‘కానీ ఖద్దరల్లాహు వ మాషా ఫ‘అల్  ’ (అల్లాహ్ నిర్ణయించిన విధివ్రాత ప్రకారం జరిగింది, మరియు ఆయన తలచినది చేశాడు) అని పలుకు, నిశ్చయంగా ఈ “లౌ(ఒకవేళ ) “అనే పదం షైతాన్ కార్యాలకు తలుపు తెరుస్తుంది. (ముస్లిం)

ఆరు: ఇస్లాం మతాన్ని, దాని మూలస్తంభాలను దృఢంగా మార్చడం, దాని కోసం అన్ని రకాల వెలుగులను, విలువైన వస్తువులను త్యాగం చేసి, దాని మార్గంలో వచ్చే ఇబ్బందులను పట్టించుకోని బలమైన ఉమ్మత్ ను సృష్టించడం. ఈ విషయంలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرَسُولِهِ ثُمَّ لَمْ يَرْتَابُوا وَجَاهَدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ فِي سَبِيلِ اللَّهِ أُوْلَئِكَ

{వాస్తవానికి, ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసించి, ఆ తరువాత ఏ అనుమానానికి లోను కాకుండా, అల్లాహ్ మార్గంలో, తమ సిరిసంపదలతో మరియు ప్రాణాలతో పోరాడుతారో! అలాంటి వారు, వారే! సత్యవంతులు.} [హుజరాత్: 15]

ఏడు: వ్యక్తులను, సమజాన్ని సంస్కరించటం ద్వారా ఇహపరాల ఆనందమును పొందటం మరియు ప్రతిఫలమును, గౌరవాలను పొందటం. ఈ విషయంలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

مَنْ عَمِلَ صَالِحًا مِّن ذَكَرٍ أَوْ أُنثَى وَهُوَ مُؤْمِنٌ فَلَنُحْيِيَنَّهُ حَيَاةَ طَيِّبَةً وَلَنَجْزِيَنَّهُمْ أَجْرَهُم بِأَحْسَنِ مَا كَانُوا

(ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.} [నహల్:97]

ఇస్లామీయ విశ్వాసం యొక్క లక్ష్యాలలో ఇవి కొన్ని, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మన కోసం మరియు ముస్లింలందరికీ వాటిని సాధించే భాగ్యమును కలిగిస్తాడని మేము ఆశిస్తున్నాము; ఆయన చాలా దయగలవాడు మరియు చాలా ఉదారంగా ఉంటాడు. మరియు అన్ని స్తుతులు అల్లాహ్ కే చెందుతాయి. ఆయనే లోకాలకు ప్రభువు.

అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కలిగించుగాక.

దీని రచన ముహమ్మద్ ఇబ్నె సాలిహ్ అల్ ఉసైమీస్ కలముతో పరిపూర్ణమయ్యింది.

[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [67 పేజీలు]