1719. హజ్రత్ ఉబాదా బిన్ సామిత్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-
ఎవరైతే అల్లాహ్ ని కలుసుకోవడానికి ఇష్టపడతాడో అతడ్ని కలుసుకోవడానికి అల్లాహ్ కూడా ఇష్టపడతాడు. అలాగే ఎవరు అల్లాహ్ ని కలుసుకోవడానికి ఇష్టపడడో అతడ్ని కలుసుకోవడానికి అల్లాహ్ కూడా ఇష్టపడడు.