ఖురాన్ తఫ్సీర్ – సూరా అల్ ఖియామహ్ (ప్రళయం) [వీడియోలు]

పరిచయం

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 40 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ప్రళయం గురించి, ఆ రోజున మరణించిన వారు మళ్ళీ లేపబడడం గురించి, తీర్పుదినం గురించి, శిక్షా బహుమానాల గురించి బోధించింది. మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం అన్నది ఒక భ్రమ ఎంతమాత్రం కాదని, అనివార్యంగా చోటుచేసుకునే సంఘటన అనీ ఈ సూరా హెచ్చరించింది. ప్రళయం రోజు భయాందోళనలతో అందరూ కళ్ళు తేలవేస్తారు. చంద్రుడు కాంతివిహీనుడై పోతాడు. సూర్యచంద్రులు తమ కాంతిని కోల్పోతారు. తీర్పుదినాన ప్రతి ఒక్కరికి వారి కర్మల గురించి తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి నాలుక, కాళ్ళుచేతులు అవి చేసిన పనులకు సాక్ష్యం చెబుతాయి. మనిషిని ఒక వీర్యపు బిందువుతో పుట్టించిన అల్లాహ్ చనిపోయిన తర్వాత మళ్ళీ లేపి నిలబెట్టే శక్తిసామర్ధ్యాలు ఉన్నవాడు.

యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఖురాన్ తఫ్సీర్ – సూరా అల్ ఖియామహ్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1OVnR38cf3AOW5Uf-_gRGv

75:1 لَا أُقْسِمُ بِيَوْمِ الْقِيَامَةِ

నేను ప్రళయ దినంపై ప్రమాణం చేస్తున్నాను.

75:2 وَلَا أُقْسِمُ بِالنَّفْسِ اللَّوَّامَةِ

ఇంకా నేను, తనను తాను నిందించుకునే ఆత్మపై ప్రమాణం చేస్తున్నాను.

75:3 أَيَحْسَبُ الْإِنسَانُ أَلَّن نَّجْمَعَ عِظَامَهُ

ఏమిటి, మానవుడు మేమతని ఎముకలను కూర్చలేమని అనుకుంటున్నాడా?

75:4 بَلَىٰ قَادِرِينَ عَلَىٰ أَن نُّسَوِّيَ بَنَانَهُ

తప్పకుండా కూర్చగలము. మేమతని వ్రేళ్ళ కొనలను సైతం (యధాతథంగా) సవరించగలం.

75:5 بَلْ يُرِيدُ الْإِنسَانُ لِيَفْجُرَ أَمَامَهُ

ఈ మానవుడైతే ఇక మీదట కూడా దురంతాలకు పాల్పడదలుస్తున్నాడు.

75:6 يَسْأَلُ أَيَّانَ يَوْمُ الْقِيَامَةِ

“ఇంతకీ ప్రళయదినం ఎప్పుడు?” అని అడుగుతున్నాడు.

75:7 فَإِذَا بَرِقَ الْبَصَرُ

చూపు చెదిరిపోయినప్పుడు…”

75:8 وَخَسَفَ الْقَمَرُ

చంద్రుడు కాంతిహీనుడై పోయినప్పుడు…”

75:9 وَجُمِعَ الشَّمْسُ وَالْقَمَرُ

సూర్య చంద్రులు కలిపివేయబడినప్పుడు….

75:10 يَقُولُ الْإِنسَانُ يَوْمَئِذٍ أَيْنَ الْمَفَرُّ

ఆ రోజు మానవుడు, “నేనెక్కడికి పారిపోను?” అంటాడు.

75:11 كَلَّا لَا وَزَرَ

లేదు. ఎక్కడా ఏ ఆశ్రయమూ లేదు.

75:12 إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ الْمُسْتَقَرُّ

ఆ రోజు నీ ప్రభువు వద్దనే స్థానముంటుంది.

75:13 يُنَبَّأُ الْإِنسَانُ يَوْمَئِذٍ بِمَا قَدَّمَ وَأَخَّرَ

ఆ రోజు మనిషికి, తానేం ముందుకు పంపాడో, మరేం వెనుక వదిలాడో తెలుపబడుతుంది.

75:14 بَلِ الْإِنسَانُ عَلَىٰ نَفْسِهِ بَصِيرَةٌ

మానవుడు తనకు వ్యతిరేకంగా తానే సాక్షిగా ఉంటాడు.

75:15 وَلَوْ أَلْقَىٰ مَعَاذِيرَهُ

(తన దుష్కర్మలను కప్పిపుచ్చుకోవటానికి) ఎన్ని సంజాయిషీలు ఇచ్చుకున్నప్పటికీను.

75:16 لَا تُحَرِّكْ بِهِ لِسَانَكَ لِتَعْجَلَ بِهِ

(ఓ ప్రవక్తా!) నీవు ఖుర్ఆన్ ను తొందరగా కంఠస్థం చేసుకోవటానికి నీ నాలుకను వేగంగా కదిలించకు.

75:17 إِنَّ عَلَيْنَا جَمْعَهُ وَقُرْآنَهُ

దాన్ని సమకూర్చే, (నీ చేత) పారాయణం చేయించే బాధ్యత మాది.

75:18 فَإِذَا قَرَأْنَاهُ فَاتَّبِعْ قُرْآنَهُ

కాబట్టి మేము దానిని పఠించాక, నువ్వు దాని పఠనాన్ని అనుసరించు.

75:19 ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ

మరి దానిని విడమరచి చెప్పే బాధ్యత కూడా మాపైనే ఉంది.

75:20 كَلَّا بَلْ تُحِبُّونَ الْعَاجِلَةَ

ఎన్నటికీ కాదు. మీరసలు తొందరగా లభించే దాని (ప్రపంచం)పై మోజు పడుతున్నారు.

75:21 وَتَذَرُونَ الْآخِرَةَ

పరలోకాన్ని మాత్రం వదలిపెడుతున్నారు.

75:22 وُجُوهٌ يَوْمَئِذٍ نَّاضِرَةٌ

ఆ రోజు ఎన్నో ముఖాలు (ఆహ్లాదకరంగా) తాజాగా ఉంటాయి.

75:23 إِلَىٰ رَبِّهَا نَاظِرَةٌ

తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి.

75:24 وَوُجُوهٌ يَوْمَئِذٍ بَاسِرَةٌ

ఆ రోజు మరెన్నో ముఖాలు ఉదాసీనం (కాంతిహీనం)గా ఉంటాయి.

75:25 تَظُنُّ أَن يُفْعَلَ بِهَا فَاقِرَةٌ

తమ పట్ల నడ్డి విరిచే వ్యవహారం జరగనున్నదని అవి అనుకుంటూ ఉంటాయి.

75:26 كَلَّا إِذَا بَلَغَتِ التَّرَاقِيَ

అసంభవం. (గుండెలోని) ప్రాణం గొంతు ప్రక్కన గల ఎముక వరకూ చేరుకున్నప్పుడు,

75:27 وَقِيلَ مَنْ ۜ رَاقٍ

“మంత్రించి నయం చేసే వాడెవడైనా ఉన్నాడా?” అని అనబడినప్పుడు,

75:28 وَظَنَّ أَنَّهُ الْفِرَاقُ

“పోయేకాలం వచ్చింద”న్న సంగతిని అతను తెలుసుకున్నప్పుడు,

75:29 وَالْتَفَّتِ السَّاقُ بِالسَّاقِ

ఒక పిక్క మరో పిక్కతో ఒడుసుకున్నప్పుడు,

75:30 إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ الْمَسَاقُ

(ఓ మానవాత్మా!) ఈ రోజు నీవు నీ ప్రభువు వైపు సాగిపోవలసి ఉంటుంది.

75:31 فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ

వాడు సత్యాన్ని ధృవీకరించనూ లేదు, నమాజు చేయనూ లేదు.

75:32 وَلَٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ

పైగా వాడు (సత్యాన్ని) ధిక్కరించాడు, వెను తిరిగిపోయాడు.

75:33 ثُمَّ ذَهَبَ إِلَىٰ أَهْلِهِ يَتَمَطَّىٰ

మిడిసిపడుతూ, తన ఇంటివారల వైపు వెళ్ళిపోయాడు.

75:34 أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ

శోచనీయం. నీ వైఖరి కడు శోచనీయం.

75:35 ثُمَّ أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ

మరి విచారకరం. నీ ధోరణి మిక్కిలి విచారకరం.

75:36 أَيَحْسَبُ الْإِنسَانُ أَن يُتْرَكَ سُدًى

ఏమిటీ, తనను ఇట్టే వదలిపెట్టడం జరుగుతుందని మానవుడు అనుకుంటున్నాడా?

75:37 أَلَمْ يَكُ نُطْفَةً مِّن مَّنِيٍّ يُمْنَىٰ

ఏమిటి, అతను (ఒకప్పుడు, మాతృ గర్భంలో) స్ఖలించబడిన చిక్కటి వీర్య బిందువుగా ఉండలేదా?

75:38 ثُمَّ كَانَ عَلَقَةً فَخَلَقَ فَسَوَّىٰ

మరి అతను ఒక నెత్తుటి గడ్డగా మారాడు. తరువాత అల్లాహ్ అతణ్ణి (దశను) మలిచాడు. ఆపైన అతణ్ణి తగు విధంగా తీర్చిదిద్దాడు.

75:39 فَجَعَلَ مِنْهُ الزَّوْجَيْنِ الذَّكَرَ وَالْأُنثَىٰ

మరి దాన్నుండి ఆడ మగలనే జంటలను చేశాడు.

75:40 أَلَيْسَ ذَٰلِكَ بِقَادِرٍ عَلَىٰ أَن يُحْيِيَ الْمَوْتَىٰ

ఇదంతా చేసినవాడు మృతులను బ్రతికించలేడా?