ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) – పార్ట్ 03: వుజూ ఘనత, వుజూ విధానం Q&A [వీడియో]

బిస్మిల్లాహ్

[01:03:56 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అంశాలు: వుజూ ఘనత, వుజూ విధానం

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

వుజూ :

వుజూ లేని నమాజ్ అంగీకరింపబడదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

لَا يَقْبَلُ اللهُ صَلَاةَ أَحَدِكُمْ إِذَا أَحْدَثَ حَتَّى يَتَوَضَّأَ

“మీలో ఎవనికైనా అపానవాయువు జరిగితే అతను వుజూ చేసుకోనంత వరకు అల్లాహ్ అతని నమాజును అంగీకరించడు”. (బుఖారి 6954).

వుజూ ఘనతలు చాలా ఉన్నాయి. వుజూ సందర్భంలో అవి గుర్తుకు తెచ్చుకోవడం మంచిది. వాటిలో కొన్ని ఇవి: ముస్లిం 245లో ఉంది:.

مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ خَرَجَتْ خَطَايَاهُ مِنْ جَسَدِهِ حَتَّى تَخْرُجَ مِنْ تَحْتِ أَظْفَارِهِ

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శుభవార్త ఇచ్చారని, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“ఎవరు వుజూ చేసినప్పుడు పూర్తి శ్రద్ధతో మంచి విధంగా చేస్తారో అతని శరీరం నుండి అతని పాపాలన్నీ రాలిపోతాయి. చివరికి గోళ్ళ నుండి కూడా వెళ్ళిపోతాయి”.

مَنْ أَتَمَّ الْوُضُوءَ كَمَا أَمَرَهُ اللهُ تَعَالَى فَالصَّلَوَاتُ الْـمَكْتُوبَاتُ كَفَّارَاتٌ لِمَا بَيْنَهُنَّ

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారని, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“అల్లాహ్ ఆదేశించిన విధంగా సంపూర్ణంగా వుజూ చేసేవారు, వారి ఫర్జ్ నమాజులు వాటి మధ్య జరిగే పాపాల ప్రక్షాళనకు కారణభూతమవుతాయి”. (ముస్లిం 231).

వుజూ విధానం :

* వుజూలో ఒక అవయవం తర్వాత మరో అవయవం క్రమ ప్రకారంగా మరియు వెంటవెంటనే కడుగుట తప్పనిసరి ([1]).

[1] క్రమ ప్రకారంగా వుజూ చేయాలి. అంటే: 1 నుండి 8 వరకు ఉన్న క్రమం ప్రకారం వీటిలో వెనకా ముందు చేయకూడదు. వెంటవెంటనే చేయాలి. అంటేః పై క్రమం ప్రకారం, ఒక అవయవం కడిగాక, దాని తడి ఆరక ముందే వెంటనే దాని వెనక అవయవం కడగాలి. మరీ ఆలస్యం చేయవద్దు.

1- వుజూ నియ్యత్ (సంకల్పం) నోటితో పలుకకుండా మనుసులోనే చేయాలి. ఒక పని చేయుటకు మనుసులో నిర్ణయించుకోవడమే ‘నియ్యత్’.

మళ్ళీ బిస్మిల్లాహ్ అనాలి. (క్రింది వుజూ చిత్రాలు చూడండి).

2- రెండు అరచేతులను మణికట్ల వరకు మూడు సార్లు కడగాలి. (చిత్రం2).

3- మూడు సార్లు నోట్లో నీళ్ళు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్ళు ఎక్కించి శుభ్రం చేయాలి. (చిత్రాలు 3, 4).

4- మూడు సార్లు ముఖము కడగాలి. అడ్డంలో కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు. నిలువులో నొసటి పై భాగం నుండి గదువ క్రింది వరకు. (చి.5)

5- రెండు చేతులు మూడేసి సార్లు కడగాలి. వ్రేలు మొదటి భాగము నుండి మోచేతుల వరకు. ముందు కుడి చెయ్యి, తరువాత ఎడమ చెయ్యి. (చి.6)

6- ఒక సారి తల ‘మసహ్’ చేయాలి. అంటే రెండు చేతులను తడి చేసి తల మొదటి (నుదుటి) భాగము నుండి వెనక మెడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ వెనక నుండి మొదటి వరకు తలను స్పర్శిస్తూ తీసుకురావాలి. (చూడండి చిత్రం 7 మరియు దాని తర్వాత చిత్రం).

7- ఒక సారి రెండు చెవుల ‘మసహ్’ చేయాలి. అంటే రెండు చూపుడు వ్రేళ్ళతో చెవి లోపలి భాగాన్ని, బొటన వ్రేళ్ళతో పై భాగాన్ని స్పర్శించాలి. (చిత్రం 8.)

8- రెండు కాళ్ళను వ్రేళ్ళ నుండి చీలమండల వరకు మూడేసి సార్లు కడగాలి. ముందు కుడి కాలు తరువాత ఎడమ కాలు.

9- తర్వాత దుఆ చదవాలి: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని, ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మీలో ఎవరైనా సంపూర్ణంగా వుజూ చేసుకొని ‘అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహ్’ చదువుతారో అతని కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి, ఎందులో నుండి ప్రవేశించ గోరినా అతని ఇష్టం“. (ముస్లిం 234).

أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ

(నేను సాక్ష్యమిస్తున్నాను; అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడని, ఆయన ఏకైకుడు భాగస్వామీ లేనివాడని మరియు సాక్ష్యమిస్తున్నాను; ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త).


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

ఫిఖ్ హ్ (శుద్ధి,నమాజు) – పార్ట్ 02: మల మూత్ర విసర్జన పద్ధతులు [వీడియో]

బిస్మిల్లాహ్

[48:57 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అంశాలు: మల మూత్ర విసర్జన పద్ధతులు

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

మలమూత్ర విసర్జన:

మలమూత్ర విసర్జన పద్దతులు ఇలా ఉన్నాయి:

1- మరుగుదొడ్డిలో ఎడమ కాలుతో ప్రవేశిస్తూ, ప్రవేశముకు ముందే చదవాలి:

బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇసి

بسم الله اَللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْـخُبُثِ وَالْـخَبَائِثِ

(అల్లాహ్ పేరుతో, ఓ అల్లాహ్ నేను దుష్ట జిన్నాతు స్త్రీ పురుషుల నుండి నీ శరణు జొచ్చుచున్నాను).
(బుఖారి 142, ముస్లిం 375).

మరుగుదొడ్డి నుండి కుడి కాలు ముందు వేస్తూ బయటకు వచ్చి చదవాలి:

గుఫ్రానక
غُفْرَانَكَ  
నీ మన్నింపుకై అర్థిస్తున్నాను. (తిర్మిజి 7).

2- అల్లాహ్ పేరుగల ఏ వస్తువూ మరుగుదొడ్డిలోకి తీసుకెళ్ళకూడదు. కాని దాన్ని తీసి పెట్టడంలో ఏదైనా నష్టం ఉంటే వెంట తీసుకెళ్ళవచ్చును.

3- ఎడారి ప్రదేశంలో కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఖిబ్లా వైపున ముఖము, వీపు గానీ పెట్టి కూర్చోకూడదు. నాలుగు గోడల మధ్య కూడా మంచిది కాదు కాని అభ్యంతరము లేదు. 

4- సతర్ పరిధిలోకి వచ్చే శరీర భాగాన్ని ప్రజల

చూపులకు మరుగు పరచాలి. ఇందులో ఏ కొంచ మైనా అశ్రద్ధ వహించకూడదు. పురుషుల సతర్ నాభి నుండి మోకాళ్ళ వరకు. స్త్రీ యొక్క పూర్తి శరీరం, నమాజులో కేవలం ముఖము తప్ప. స్త్రీ నమాజులో ఉన్నప్పుడు పరపురుషులు ఎదురౌతే ముఖముపై ముసుగు వేసుకోవాలి.

5- శరీరం లేక దుస్తులపై మలమూత్ర తుంపరులు పడకుండా జాగ్రత్త వహించాలి.

6- మలమూత్ర విసర్జన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. నీళ్ళు లేనప్పుడు నజాసత్ మర్కలను దూరము చేయుటకు రాళ్ళు, కాగితము లాంటివి ఉపయోగించవచ్చును. పరిశుభ్రత కొరకు ఎడమ చెయ్యి మాత్రమే ఉపయోగించాలి.

ప్రశ్నలు & సమాధానాలు (Q&A) – మల మూత్ర విసర్జన పద్ధతులు

[29:11 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన వీడియో పాఠాలు

ఫిఖ్ హ్ (తహారా,శుద్ధి – నమాజు) – పార్ట్ 01 [వీడియో]

బిస్మిల్లాహ్

[51:22 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అంశాలు: పరిశుభ్రత, అపరిశుభ్రత, నజాసత్‌ (అశుద్దత) రకాలు, నజాసత్‌ (అశుద్దత) ఆదేశాలు

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

శుచి శుభ్రత ఆదేశాలు

పరిశుభ్రత మరియు అపరిశుభ్రత

‘నజాసత్’ అంటేమిటి? దేనితోనయితే ఒక ముస్లిం దూరంగా ఉండి, అది ఏ చోటనైనా అంటినచో కడుగుట విధిగా ఉందో దానినే ‘నజాసత్’ (అశుధ్ధత) అంటారు. రక్తం లాంటి కనబడే మలినమేదైనా శరీరానికి లేదా బట్టలకు అంటినచో దానిని కడుగుట తప్పనిసరి. కడిగిన తర్వాత దాని మర్క కనబడితే, అది తొలగడం కూడా కష్టంగా ఉంటే పాపం లేదు. ఒక వేళ మలినం కానరానిదై ఉంటే దాన్ని ఒక్కసారి కడిగినా సరిపోతుంది.

ఇక నేలపై ఏదైనా మలినం పడిపోతే అక్కడ నీళ్ళు పారబోస్తే అది శుభ్రమవుతుంది. మలినం పలుచగా పారునటువంటిదైతే అది ఎండిపోయిన- చో నేల పరిశుభ్రమవుతుంది. ఒక వేళ పారనిదిగా ఉంటే దాన్ని తీసిపడేసిన తరువాతనే అది శుభ్రమవుతుంది.

పరిశుభ్రత కొరకు మరియు అశుద్ధతను దూరము చేయుటకు నీళ్ళు ఉపయోగించబడ- తాయి. అవి వర్షపు మరియు సముద్రపు నీళ్ళు లాంటివి వగైరా. అలాగే ఎవరైనా ఉపయోగించిన తరువాత మిగిలిన నీళ్ళు ఉపయోగించవచ్చును. ఇంకా శుభ్రమైన ఏదైనా వస్తువు నీళ్ళలో కలిసి అందులో ఏలాంటి మార్పు రాకుండా దాని అసలు రూపములో ఉండిపోతే అవి కూడా ఉపయోగించవచ్చును. కాని ఏదైనా అపరిశుభ్ర- మైన వస్తువు అందులో కలుషితమై దాని అసలు రూపములో లేనిచో అవి ఉపయోగించకూడదు. అపరిశుభ్రమైన వస్తువు ఏదైనా కలుషితమై నీళ్ళ రంగు, రుచి, వాసనలో మార్పు వస్తే అవి ఉపయోగించరాదు. మార్పు రాని యెడల అవి ఉపయోగించవచ్చును.

అలాగే మనుషులు త్రాగిన తర్వాత మిగిలిన నీళ్ళు శుభ్రత పొందుటకు, వజూ చేయుటకు ఉపయోగించవచ్చును. కాని కుక్క లేక పంది ఎంగిలి చేసిన నీళ్ళు వాడరాదు. అవి అశుద్ధం.

‘నజాసత్’ రకాలు:

(1,2) మలమూత్రం.

(3) ‘వదీ’: అది తెల్లటి చిక్కని ద్రవ పదార్థం. అది మూత్రము తరువాత వెలువడుతుంది.

(4) ‘మజి’: అది తెల్లటి జిగటగల పదార్థం. అది భార్యభర్తల సరసాలాడడముతో, లేదా మనిషి కామాలోచనలో పడినప్పుడు వెల్తుంది.

*’మనీ’ (ఇంద్రియం, వీర్యం) శుభ్రమైనదే. అయినా అది పచ్చిగా ఉన్నప్పుడు కడుగుట, ఎండిపోయినప్పుడు నలుచుట అభిలషణీయం.

(5) తినుట యోగ్యం కాని జంతువుల మలమూత్రం అపరిశుభ్రం. తినుట యోగ్యమైన జంతువుల మలమూత్రం అపరిశుభ్రం కాదు.

పైన చెప్పబడిన మలినాలు శరీరానికి, లేదా దుస్తులకు అంటినచో వాటిని తీసేసి కడగాలి. అయితే కేవలం ‘మజి’ విషయంలో ఓ రాయితీ ఏమిటంటే: అది అంటిన చోట కడగకుండా నీళ్ళు చల్లినా సరిపోవును. *’మనీ’ కామంతో వెళ్ళినచో స్నానం చేయుట విధియగును.

(6) బహిష్టు మరియు బాలింత రక్తస్రావం.

‘నజాసత్’ ఆదేశాలు:

1- మనిషికి ఏదో ఒక పదార్థం అంటింది, కాని అది నజాసతేనా కాదా అనే నిర్థారణ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, దాని గురించి పరిశోధన చేసే అక్కర లేదు. అలాగే దాన్ని కడిగే అవసరం కూడా లేదు.

2- ఒక మనిషి నమాజ్ చేసిన తరువాత శరీరం లేదా తన దుస్తుల్లో నజాసత్ చూశాడు. దాని గురించి నమాజ్ కు ముందు తెలియదు, లేదా తెలిసు కాని మరచిపోయాడు. అలాంటప్పుడు అతని నమాజ్ అయినట్లే.

3- దుస్తుల్లో నజాసత్ పడిన స్థలం తెలియ కుంటే, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏ స్థలం అన్న అధిక అనుమానం కలుగునో దాన్నే కడగాలి. ఎందుకనగా మలినాన్ని దాని రంగు, రుచి లేదా వాసనతో పసిగట్టవచ్చును.

నమాజును భంగపరిచే కార్యాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[1:47 నిముషాలు]
నమాజును భంగపరిచే కార్యాలు
నమాజ్ పాఠాలు: 3 వ పాఠం: నమాజు ఆదేశాలు – పార్ట్ 1
https://teluguislam.net/?p=8594
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

నమాజును భంగపరుచు కార్యాలు:

  • 1- తెలిసి, కావాలని మాట్లడడం, అది కొంచమైనా సరే.
  • 2- పూర్తి శరీరముతో ఖిబ్లా దిశ నుండి పక్కకు మరలడం.
  • 3- వుజూను భంగపరిచే కారణాల్లో ఏ ఒకటైనా సంభవించడం.
  • 4- అనవసరంగా ఎడతెగకుండా ఎక్కువ చలనము చేయడం.
  • 5- కొంచం నవ్వినా నమాజు వ్యర్థమవుతుంది.
  • 6- తెలిసి కూడా ఎక్కువ రుకూ, సజ్దాలు, ఖియాం, జుల్సాలు చేయడం.
  • 7- తెలిసి కూడా (రుకూ, సజ్దా వగైరా) ఇమాంకు ముందు చేయడం.

నమాజ్ చేయరాని సమయాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[2:14 నిముషాలు]
నమాజ్ చేయరాని సమయాలు
నమాజ్ పాఠాలు: 3 వ పాఠం: నమాజు ఆదేశాలు – పార్ట్ 1
https://teluguislam.net/?p=8594
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

నమాజులు చేయరాని వేళలు:

కొన్ని సమయాల్లో నమాజు చేయుట యోగ్యం లేదు. అవి:

1- ఫజ్ర్ నమాజు తర్వాత నుండి సూర్యోదయం తర్వాత సూర్యుడు బారెడంత పైకి వచ్చే వరకు.

2- మిట్ట మధ్యానం, సూర్యుడు నడి ఆకాశంలో, తలకు సమానంగా ఉన్నప్పుడు. అది పశ్చిమాన వాలే వరకు.

3- అస్ర్ నమాజు తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు.

కాని ఈ సందర్భాల్లో కొన్ని నమాజులు చేయవచ్చు. ఉదాః తహియ్యతుల్ మస్జిద్ (మస్జిదులో ప్రవేశించిన వెంటనే చేయు నమాజ్). జనాజా నమాజ్. సూర్య గ్రహణ నమాజ్. తవాఫ్ సున్నతులు. తహియ్యతుల్ వుజూ లాంటివి.

అలాగే తప్పిపోయిన నమాజులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసు ఆధారంగా:

 (مَنْ نَسِيَ صَلَاةً أَوْ نَامَ عَنْهَا فَكَفَّارَتُهَا أَنْ يُصَلِّيَهَا إِذَا ذَكَرَهَا)

“ఎవరైనా ఏదైనా నమాజు మరచిపోతే, లేదా దాని సమయంలో నిద్రపోతే గుర్తు వచ్చిన వెంటనే దాన్ని నెరవేర్చడమే దాని ప్రాయశ్చితం”. (ముస్లిం 684, బుఖారి 597).

జమాఅతు నుండి కొన్ని రకాతులు తప్పిపోయిన వ్యక్తి ఆదేశాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[2:24 నిముషాలు]
జమాఅతు నుండి కొన్ని రకాతులు తప్పిపోయిన వ్యక్తి ఆదేశాలు
నమాజ్ పాఠాలు: 3 వ పాఠం: నమాజు ఆదేశాలు – పార్ట్ 1
https://teluguislam.net/?p=8594
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

మస్బూఖ్:

జమాతుతో ఒకటి లేదా ఎక్కువ రకాతులు తప్పిపోయిన వ్యక్తిని మస్బాఖ్ అంటారు.

ఇమాం రెండవ సలాం త్రిప్పిన తర్వాత ఈ వ్యక్తి సలాం త్రిప్పకుండా తప్పిపోయిన రకాతులు వెరవేర్చాలి.

అతను ఇమాంతో ఏ రకాతులో కలిసాడో అదే అతనిది మొదటి రకాతు.

ఇమాంను రుకూ స్థితిలో పొందినవాని ఆ రకాతు అయినట్లే. ఇమాంను రుకూలో పొందకుంటే ఆ రకాత్ తప్పిపోయినట్లే లెక్క.

జమాతు నిలబడిన తర్వాత వచ్చేవారు జమాతును ఏ స్థితిలో చూసినా అదే స్థితిలో కలవాలి. వారు రుకూ, లేదా సజ్దా ఇంకే స్థితిలో ఉన్నా సరే. వారు మరో రకాతు కొరకు నిలబడే వరకు నిరీక్షించవద్దు.

నిలబడి తక్బీరె తహ్రీమ అల్లాహు అక్బర్ అనాలి. రోగి లాంటి ఏదైనా ఆటంకం ఉన్నవారు కూర్చుండి అల్లాహు అక్బర్ అంటే ఏమీ తప్పు లేదు.

పురుషులు నమాజుకి టోపీ పెట్టుకోవడం తప్పని సరినా? టోపీ పెట్టుకోకబోతే నమాజు స్వీకరించబడదా? [వీడియో]

బిస్మిల్లాహ్

[3 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/

ఇస్లాంలో పురుషులు నమాజుకి టోపీ పెట్టుకోవడం తప్పని సరినా? కొందరు మస్జిదులో టోపీ లేకుండా నమాజు చదివితే వారిని అడ్డుకుంటూ ఉంటారు? కొందరైతే టోపీ లేకుండా మస్జిదు కు రావద్దు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి టోపీ పెట్టుకోకబోతే నమాజు స్వీకరించబడదా? టోపీ అస్తమానం పెట్టుకుంటూ ఉండాలా?

మాస్క్ ధరించి నమాజ్ చేయవచ్చా? [ఆడియో]

బిస్మిల్లాహ్
మాస్క్ ధరించి నమాజ్ చేయవచ్చా? || వక్త : షేఖ్ సలీమ్ జామిఈ.
7:15 నిముషాలు

నమాజ్ పాఠాలు 5: సున్నతె ముఅక్కద, విత్ర్ నమాజ్, ఫజ్ర్ సున్నతులు, చాష్త్ నమాజ్ [వీడియో]

బిస్మిల్లాహ్

[20:28 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


సున్నతె ముఅక్కద:

స్థానికులైన ప్రతి ముస్లిం స్త్రీ పురుషులు పన్నెండు రకాతులు పాటించడం ఎంతో పుణ్యకార్యం. అవి జొహ్ర్ కు ముందు 4, దాని తరువాత 2, మగ్రిబ్ తరువాత 2, ఇషా తరువాత 2, ఫజ్ర్ కు ముందు 2 రకాతులు. స్వయంగా ప్రవక్త  ఈ సున్నతులు పాటించేవారు. ఇంకా ఆయన ఇలా శుభవార్త ఇచ్చారని ఉమ్మె హబీబ రజియల్లాహు అన్హా తెలిపారుః

 (مَا مِنْ عَبْدٍ مُسْلِمٍ يُصَلِّي لله كُلَّ يَوْمٍ ثِنْتَيْ عَشْرَةَ رَكْعَةً تَطَوُّعًا غَيْرَ فَرِيضَةٍ إِلَّا بَنَى اللهُ لَهُ بَيْتًا فِي الْجَنَّةِ أَوْ إِلَّا بُنِيَ لَهُ بَيْتٌ فِي الْجَنَّةِ).

ముస్లిం భక్తుడు రాత్రి పగల్లో ఫర్జ్ కాకుండా పన్నెండు రకాతుల అదనపు (నఫిల్) నమాజు చేస్తూ ఉంటాడో అతనికి వాటికి బదులుగా అల్లాహ్ ఒక గృహము స్వర్గంలో నిర్మిస్తాడు, లేదా ఒక గృహం స్వర్గంలో నిర్మించచబడును“. (ముస్లిం 728).

సున్నతె ముఅక్కద మరియు సాధరణంగా నఫిల్ నమాజు లన్నియూ ఇంట్లో చేయడం చాలా ఉత్తమం. ప్రవక్త ﷺ ప్రబోధించారని, జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

 (إِذَا قَضَى أَحَدُكُمْ الصَّلَاةَ فِي مَسْجِدِهِ فَلْيَجْعَلْ لِبَيْتِهِ نَصِيبًا مِنْ صَلَاتِهِ فَإِنَّ اللهَ جَاعِلٌ فِي بَيْتِهِ مِنْ صَلَاتِهِ خَيْرًا).

మీలోనెవరైనా మస్జిదులో (ఫర్జ్) నమాజు నెరవేర్చుకున్నాక, తన ఇంటి కొరకు కూడా (సున్నతులు, నఫిల్ల లాంటి) నమాజుల యొక్క కొంత భాగాన్ని మిగిలించుకోవాలి. అల్లాహ్ అతని నమాజుకు బదులుగా అతని ఇంట్లో మేలే చేకూర్చుతాడు. (ముస్లిం 778).

జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

 (فَإِنَّ خَيْرَ صَلَاةِ الْـمَرْءِ فِي بَيْتِهِ إِلَّا الصَّلَاةَ الْـمَكْتُوبَةَ).

మనిషి తనింట్లో చేసే నమాజు అతి ఉత్తమమైనది. కేవలం ఫర్జ్ నమాజు తప్ప“. (బుఖారి 6113).


విత్ర్ నమాజ్:

అలాగే ముస్లిం విత్ర్ నమాజును పాటించుట ధర్మం. ఇది కూడా సున్నతె ముఅక్కద.

దీని సమయం ఇషా తరువాత నుండి ఉషోదయం వరకు ఉంటుంది.

అయితే రాత్రి చివరి ఘడియలో మేల్కొనగల వారికి ఆ సమయమే ఉత్తమం.

ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాల్లో ఎలాంటి సాంప్రదాయమంటే; ప్రవక్త మహా నీయులు ఎప్పుడూ విడనాడ లేదు. ప్రయాణంలో ఉన్నా, లేదా స్థానికంగా ఉన్నా తప్పకుండా చేసేవారు.

కనిష్ట సంఖ్య ఒక్క రకాతు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రుల్లో పదకుండు రకాతులు చేసేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనంలో ఉందిః

أَنَّ رَسُولَ اللهكَانَ يُصَلِّي بِاللَّيْلِ إِحْدَى عَشْرَةَ رَكْعَةً يُوتِرُ مِنْهَا بِوَاحِدَةٍ…

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి పూట 11 రకాతులు చేసేవారు, అందులో ఒక రకాతు విత్ర్ చేసేవారు. (ముస్లిం 736).

రాత్రి నమాజు రెండేసి రకాతులు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రాత్రి నమాజ గురించి ప్రశ్నించాడు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

 (صَلَاةُ اللَّيْلِ مَثْنَى مَثْنَى فَإِذَا خَشِيَ أَحَدُكُمْ الصُّبْحَ صَلَّى رَكْعَةً وَاحِدَةً تُوتِرُ لَهُ مَا قَدْ صَلَّى).

“రాత్రి వేళ నఫిల్ నమాజు రెండేసి రకాతుల చొప్పున చేయాలి. ఇక ఉషోదయం కావస్తోందని భావించినప్పుడు ఒక రకాతు చేయి. దీనివల్ల మొత్తం నమాజు విత్ర్ (బేసి సంఖ్య నమాజ్) అయిపోతుంది”.  (బుఖారి 991, ముస్లిం 749).

విత్ర్ లో దుఆయె ఖునూత్ చేయడం మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ బిన్ అలీ రజియల్లాహు అన్హు గారికి విత్ర్ లో చదివే దుఆ నేర్పారు. కాని ఎల్లప్పుడు చేయకూడదు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విత్ర్ నమాజు విధానం గురించి ఉల్లేఖించిన సహచరులు ఖునూత్ గురించి చెప్పలేదు.

రాత్రి నమాజు చేయలేకపోయినవారు మరుసటి రోజు రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండు ఇష్టమున్నన్ని రకాతులు చేయుట మంచిది. ఎప్పుడైనా రాత్రి నమాజు తప్పి పోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేసేవారు.


ఫజ్ర్ సున్నతులు:

ప్రవక్త ﷺ పాబందీగా పాటించే సున్న తుల్లో ఫజ్ర్ సున్నతులు కూడా, వాటిని ఆయన ప్రయాణంలో ఉన్నా, స్థానికంగా ఉన్నా విడనాడకపోయేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం:

أَنَّ النَّبِيَّ لَمْ يَكُنْ عَلَى شَيْءٍ مِنْ النَّوَافِلِ أَشَدَّ مُعَاهَدَةً مِنْهُ عَلَى رَكْعَتَيْنِ قَبْلَ الصُّبْحِ.

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నఫిల్ నమాజుల్లో ఫజ్ర్ సున్నతులను చేసేటంత ఎక్కువ పాబందీగా మరో నఫిల్ చేసేవారు కారు”. (బుఖారి 1163, ముస్లిం 724). వాటి ఘనత, ప్రాముఖ్యతలో ప్రవక్త ﷺ ఇలా చెప్పేవారు:

لَـهُمَا أَحَبُّ إِلَيَّ مِنْ الدُّنْيَا جَمِيعًا.

“ఆ రెండు రకాతులు నాకు ప్రపంచం మరియు, అందులో ఉన్న వాటికన్నా చాలా ప్రియమైనవి”. (ముస్లిం 725).

మొదటి రకాతులో (సూర ఫాతిహా తర్వాత) సూర కాఫిరూన్ మరియు రెండవ రకాతులో (సూర ఫాతిహ తర్వాత) సూర ఇఖ్లాస్ చదువుట ధర్మం. ఒక్కోసారి మొదటి రకాతులో ఖూలూ ఆమన్నా బిల్లాహి వమా ఉంజిల ఇలైనా….” (అల్ బఖర 2: 136) ఆయతులు మరియు రెండవ రకాతులో ఖుల్ యా అహ్లల్ కితాబి తఆలౌ ఇలా కలిమతిన్ సవాఇమ్ బైననా బైనకుమ్….” (ఆలె ఇమ్రాన్ 3: 64) ఆయతులు పఠించుట మంచిది.

ప్రవక్తను అనుసరిస్తూ వాటిని సంక్షిప్తంగా చేయాలి.

ఫర్జ్ నమాజుకు ముందు వాటిని చేయలేకపోయిన వ్యక్తి నమాజు తర్వాత కూడా చేయవచ్చును. అయితే సూర్యోదయం తర్వాత సూర్యుడు బల్లెమంత పైకి వచ్చాక చేయడం మరీ ఉత్తమం. దీని సమయం పగటిలి పొద్దు వాలేకి ముందు వరకు ఉంటుంది.


చాష్త్ నమాజ్:

దీనినే సలాతుల్ అవ్వాబీన్ అంటారు. ఇది సున్నతె ముఅక్కద. అనేక హదీసుల్లో దీని గురించి ప్రోత్సహించబడింది. అబూ జర్ర్  ఉల్లేఖించిన హదీస్ ముస్లిం 820లో ఉంది ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారుః

عَنْ أَبِي ذَرٍّ عَنْ النَّبِيِّ ﷺ أَنَّهُ قَالَ: (يُصْبِحُ عَلَى كُلِّ سُلَامَى مِنْ أَحَدِكُمْ صَدَقَةٌ فَكُلُّ تَسْبِيحَةٍ صَدَقَةٌ وَكُلُّ تَحْمِيدَةٍ صَدَقَةٌ وَكُلُّ تَهْلِيلَةٍ صَدَقَةٌ وَكُلُّ تَكْبِيرَةٍ صَدَقَةٌ وَأَمْرٌ بِالْمَعْرُوفِ صَدَقَةٌ وَنَهْيٌ عَنْ الْمُنْكَرِ صَدَقَةٌ وَيُجْزِئُ مِنْ ذَلِكَ رَكْعَتَانِ يَرْكَعُهُمَا مِنْ الضُّحَى).

“మానవ శరీరంలో ఎన్ని కీళ్ళు ఉన్నాయో వాటిలో ప్రతి దానికీ బదులుగా ఒక దానం (సదఖా) విధి అయి ఉంది. అయితే ప్రతి సుబ్ హానల్లాహ్ ఒక సదఖా, ప్రతి అల్ హందులిల్లాహ్ ఒక సదఖా, లాఇలాహ ఇల్లల్లాహ్ ఒక సదఖా, అల్లాహు అక్బర్ ఒక సదఖా, ఒక మంచిని బోధించడం ఒక సదఖా, ఒక చెడును నివారించడం ఒక సదఖా, వీటన్నిటికీ బదులుగా చాష్త్ సమయంలో రెండు రకాతులు సరిపోతాయి”.

عَنْ أَبِي هُرَيْرَةَ t قَالَ أَوْصَانِي خَلِيلِي بِثَلَاثٍ لَا أَدَعُهُنَّ حَتَّى أَمُوتَ: صَوْمِ ثَلَاثَةِ أَيَّامٍ مِنْ كُلِّ شَهْرٍ وَصَلَاةِ الضُّحَى وَنَوْمٍ عَلَى وِتْرٍ.

హజ్రత్ అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: నా ప్రాణ స్నేహితులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు మూడు విషయాలను గురించి హితబోధ చేశారు. నేను వాటిని చని పోయేంత వరకు వదలిపెట్టను. అవిః 1. ప్రతి (ఇస్లామీయ) నెలలో మూడు రోజుల ఉపవాసం పాటించటం. 2. చాష్త్ నమాజ్ చేయడం. 3. విత్ర్ నమాజ్ చేసి నిద్ర పోవడం. (బుఖారి 1178, ముస్లిం 721).

దీని ఉత్తమ సమయం పొద్దెక్కి, ఎండ తాపం పెరిగిన తర్వాత. పొద్దు వాలిన వెంటనే దీని సమయం సమాప్తమవుతుంది. కనిష్ట సంఖ్య రెండు రకాతులు. గరిష్ట సంఖ్యకు హద్దు లేదు.

వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు

విత్ర్ నమాజు ఘనత, రకాతుల సంఖ్య [వీడియో]

బిస్మిల్లాహ్

విత్ర్ నమాజు ఘనత, రకాతుల సంఖ్య Witr Namazu Ghanata, Rakatul sankhya أهمية صلاة الوتر

[వ్యవధి: 6:04 నిముషాలు ]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


విత్ర్ నమాజ్:

అలాగే ముస్లిం విత్ర్ నమాజును పాటించుట ధర్మం. ఇది కూడా సున్నతె ముఅక్కద. దీని సమయం ఇషా తరువాత నుండి ఉషోదయం వరకు ఉంటుంది. అయితే రాత్రి చివరి ఘడియలో మేల్కొనగల వారికి ఆ సమయమే ఉత్తమం.

ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాల్లో ఎలాంటి సాంప్రదాయమంటే; ప్రవక్త మహా నీయులు ఎప్పుడూ విడనాడ లేదు. ప్రయాణంలో ఉన్నా, లేదా స్థానికంగా ఉన్నా తప్పకుండా చేసేవారు.

కనిష్ట సంఖ్య ఒక్క రకాతు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రుల్లో పదకుండు రకాతులు చేసేవారు. ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖనంలో ఉంది:

أَنَّ رَسُولَ الله ﷺ كَانَ يُصَلِّي بِاللَّيْلِ إِحْدَى عَشْرَةَ رَكْعَةً يُوتِرُ مِنْهَا بِوَاحِدَةٍ…

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి పూట 11 రకాతులు చేసేవారు, అందులో ఒక రకాతు విత్ర్ చేసేవారు. (ముస్లిం 736).

రాత్రి నమాజు రెండేసి రకాతులు.

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రాత్రి నమాజ గురించి ప్రశ్నించాడు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

 (صَلَاةُ اللَّيْلِ مَثْنَى مَثْنَى فَإِذَا خَشِيَ أَحَدُكُمْ الصُّبْحَ صَلَّى رَكْعَةً وَاحِدَةً تُوتِرُ لَهُ مَا قَدْ صَلَّى).

“రాత్రి వేళ నఫిల్ నమాజు రెండేసి రకాతుల చొప్పున చేయాలి. ఇక ఉషోదయం కావస్తోందని భావించినప్పుడు ఒక రకాతు చేయి. దీనివల్ల మొత్తం నమాజు విత్ర్ (బేసి సంఖ్య నమాజ్) అయిపోతుంది”. 
(బుఖారి 991, ముస్లిం 749).

విత్ర్ లో దుఆయె ఖునూత్ చేయడం మంచిది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హసన్ బిన్ అలీ (రజియల్లాహు అన్హు) గారికి విత్ర్ లో చదివే దుఆ నేర్పారు. కాని ఎల్లప్పుడు చేయకూడదు. ఎందుకనగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి విత్ర్ నమాజు విధానం గురించి ఉల్లేఖించిన సహచరులు ఖునూత్ గురించి చెప్పలేదు.

రాత్రి నమాజు చేయలేకపోయినవారు మరుసటి రోజు రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండు ఇష్టమున్నన్ని రకాతులు చేయుట మంచిది. ఎప్పుడైనా రాత్రి నమాజు తప్పి పోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేసేవారు.


సున్నతు మరియు నఫిల్ నమాజులు