ఈ వీడియోలో వక్త ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గానికి వ్యతిరేకంగా ముస్లిం సమాజంలో చోటుచేసుకున్న బిద్అత్‌ల (నూతన పోకడల) గురించి హెచ్చరిస్తున్నారు. ఇస్లాం ధర్మంలో కేవలం రమదాన్ మరియు బక్రీద్ అనే రెండు పండుగలు మాత్రమే ఉన్నాయని, షబ్బే బరాత్ పేరుతో జరుపుకునే వేడుకలకు, మసీదుల అలంకరణలకు, శ్మశాన వాటికలలో దీపాలు వెలిగించటానికి ఇస్లాంలో ఎటువంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. సహబాలైన ఖలీఫాలు ఎవరూ కూడా ఇటువంటి పండుగలు జరపలేదని, ప్రవక్త పద్ధతికి విరుద్ధంగా చేసే ఆచరణలు స్వీకరించబడవని ఆయన వివరించారు.
ఇస్లాం ఆరాధనా పద్ధతులు మరియు బిద్అత్‌ల చొరబాటు
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటను పెడచెవిన పెట్టి ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని గడపటం సరికాదు. ఇస్లాంలో ఒక ఆరాధనా పద్ధతి ఉంది. ఈరోజు చాలామంది ఏం చేస్తారు? ఇస్లాం యొక్క పద్ధతులు పూర్తిగా తీసి బిద్అత్‌లు (ధర్మంలో లేని కొత్త విషయాలు) తీసుకొస్తారు. ఏవండీ, బిద్అత్‌లతో జీవితం గడిపితే మనకు ఏదైనా సాఫల్యం ఉందా?
ముస్లిం సమాజంలో కొన్ని ప్రాంతాలలో ‘షబ్బే బరాత్’ అన్న పండగ చేస్తారు. ఏవండీ, ప్రవక్త చెప్పిన మాటకు వ్యతిరేకంగా పోతే అల్లాహ్ ఏమన్నాడు?
وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ [వ మంయ్యుతి ఇల్లాహ వ రసూలహూ] మరియు ఎవరైతే అల్లాహ్ కు, మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో (4:13)
అల్లాహ్ కు విధేయత చూపాలి, ప్రవక్తకు విధేయత చూపాలి. ప్రవక్తకు విధేయత చూపకుండా ఉండటం అంటే? ఇస్లాం ధర్మశాస్త్రంలో ప్రవక్త ఎన్ని పండగలు నిర్ధారించారు? రెండే రెండు పండగలు ప్రవక్త వారు నిర్ధారించారు. ఆ రెండు పండగలు ఏంటండీ? రమదాన్ పండగ (ఈదుల్ ఫితర్), బక్రీద్ పండగ (ఈదుల్ అజ్ హా). ఈ రెండు పండగలు విడిచిపెట్టి మూడవ పండగ ఇస్లాంలో లేదు. ఒకవేళ ఉన్నట్లయితే జుమా రోజు మాత్రమే పండగ ప్రియులారా.
షబ్బే బరాత్ మరియు అనాచారాలు
మరి ఇస్లాం ధర్మంలో లేని కొత్త కొత్త పండగలు, ఈరోజు రాత్రి మసీదులు అలంకరించటం, అనేక ప్రాంతాల్లో స్మశాన వాటికలకు సైతం లైటింగ్ పెట్టడం, చనిపోయిన వారు తిరిగి వస్తారని వారి పేరు మీద ఇంట్లో అన్నం పక్కన పెట్టడం, ఇవి బిద్అత్ ప్రియులారా. ఒక్క ఆధారం కూడా లేదు. చాలామంది అంటారు ఇది బరకత్ గల రాత్రి, ప్రవక్త వారు అన్నారు ఈరోజు రాత్రి చాలా గొప్పతనం అని. అన్ని హదీసులు బలహీనమైన (దయీఫ్) హదీసులు ప్రియులారా. ఈ ‘షబ్బే బరాత్’ అన్న పండగ ఇస్లాం ధర్మంలో ఎలాంటి స్థానమును కలిగి లేదు.
ప్రవక్త విధేయత మరియు హెచ్చరిక
మరి మీరేం చేస్తున్నారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానానికి వ్యతిరేకంగా మనం చేస్తే, మనం ఆజ్ఞలకు లోబడి ఉన్నట్లా? ఆజ్ఞలను అతిక్రమించినట్లుగానా? ప్రవక్త అదే అన్నారు:
مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ [మన్ అహ్ దస ఫీ అమ్రినా హాజా లైస మిన్ హు ఫహువ రద్దున్] ఎవరైతే మా ఈ (ధార్మిక) వ్యవహారంలో, అందులో లేని దానిని (కొత్తగా) ప్రవేశపెడతారో, అది త్రోసిపుచ్చబడుతుంది (స్వీకరించబడదు). (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం)
మేము ఏ ఆజ్ఞ అయితే చేయలేదో, మేము ఏ పని గురించి అయితే ఆజ్ఞాపించలేదో ఎవరైనా ఆ పని చేస్తే, ఆ పని రద్దు చేయబడుతుంది. మీకు ప్రశ్న, ఎవరైతే ఈరోజు రాత్రి పండగ చేసి మసీదుల్లో వందేసి రకాతులు నమాజా? షాబాన్ నెలలో ఉపవాసం పెట్టొచ్చు. ఉపవాసం పెట్టడం ప్రవక్త సున్నత్. కానీ, 15 షాబాన్ రేపు ఉదయాన్ని ప్రత్యేకించుకొని ఉపవాసం పెట్టడం, ఇది బిద్అత్ ప్రియులారా.
సహబాల ఆచరణ – ఒక సవాలు
చూపించండి, ఎవరైనా ఒక్కరు చూపించండి ప్రవక్త వారు షబ్బే బరాత్ పేరుతో మసీదులలో రాత్రిపూట ప్రసంగాలు పెట్టి ప్రార్థన చేశారా? ప్రవక్త వారి సహబాలు, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు రెండున్నర ఏళ్ళు, హజ్రత్ ఉమర్ ఫారూఖ్ రజియల్లాహు అన్హు పదిన్నర సంవత్సరాలు, హజ్రత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు పన్నెండు సంవత్సరాలు, హజ్రత్ అలీ రజియల్లాహు అన్హు నాలుగున్నర ఏళ్ళు ఖలీఫాగా ఉన్నారు. వీరిలో ఎవరైనా ఈ షబ్బే బరాత్ అన్న పండగ పేరుతో పండగ చేశారా? ఎవ్వరూ చేయలేదు. కాబట్టి బిద్అత్‌లకు దూరంగా ఉండటం అల్లాహ్ యొక్క ఆజ్ఞకు లోబడి ఉండటం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్బాల్ – మగవారు దుస్తులు చీలమండలం (Ankles) క్రిందికి ధరించడం నిషిద్ధం https://youtu.be/RpDjA_KkfMo [11 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ప్రస్తుత ప్రసంగంలో, వస్త్రాలను చీలమండలాల క్రిందకు ధరించడం (ఇస్బాల్) ఇస్లాంలో తీవ్రమైన పాపంగా పరిగణించ బడుతుందని వివరించబడింది. గర్వంతో లేదా గర్వం లేకుండా పురుషులు తమ ప్యాంటు, లుంగీ లేదా మరేదైనా వస్త్రాన్ని చీలమండలాల క్రిందకు వేలాడదీయడం నిషిద్ధమని, అలా చేసిన వారికి ప్రళయ దినాన అల్లాహ్ కరుణ లభించదని హదీసుల ఆధారంగా స్పష్టం చేయబడింది. అయితే, స్త్రీలకు పరదృశ్యుల నుండి తమ పాదాలను కప్పి ఉంచే నిమిత్తం, తమ వస్త్రాలను చీలమండలాల నుండి ఒక మూరెడు వరకు క్రిందకు వేలాడదీయడానికి అనుమతి ఉంది, కానీ అంతకంటే ఎక్కువ పొడవు ఉండరాదు. ఆధునిక ఫ్యాషన్ల పేరిట స్త్రీలు పొట్టి దుస్తులు ధరించడం లేదా వివాహాలలో నేలపై ఈడ్చుకుంటూ వెళ్లే పొడవాటి గౌనులు ధరించడం కూడా ఇస్లాంలో నిషిద్ధమని హెచ్చరించబడింది.
దుస్తులు చీల మండలం క్రిందికి ఉంచుట. ఇక స్త్రీలు అనుకుంటున్నారు కావచ్చు, ఇందులో మాదేముందయ్యా, మగోళ్లకే కదా ఈ ఆదేశాలు? కొంచెం ఓపిక వహించండి శ్రద్ధగా వినండి.
దుస్తులు చీల మండలం క్రిందికి ఉంచుట, దీన్ని ప్రజలు చాలా చిన్నదిగా, విలువ లేనిదిగా భావిస్తారు. ఏమంత పెద్ద పాపం కాదయ్య, నాకైతే గర్వ ఉద్దేశ్యం లేదు కదా అనేస్తారు. కానీ ఇది అల్లాహ్ దృష్టిలో పెద్ద పాపాల్లో ఒకటి. అంటే, లుంగీ, ప్యాంట్ వగైరా చీల మండలం క్రిందికి ఉంచుట. కొందరి దుస్తులు నేలకు తాకుతూ ఉంటాయి. మరి కొందరివి భూమిపై వేలాడుతూ ఉంటాయి. దీనినే కొందరు ఏమంటారు? అయ్యా మున్సిపాలిటీ వాళ్ళు చప్రాసీ పని నీకు ఇచ్చారా, నీ ప్యాంటు ద్వారా గంత గలీజు ఊడ్చుకుంటూ వెళ్తున్నావు? ఎవరైనా ప్యాంటును ఈడ్చుకుంటూ వెళ్లేవారు కోపానికి రాకండి. కొందరు అలా జోక్ గా మాట్లాడుకుంటారు అని అంటున్నాను. వాళ్ళు అలా మాట్లాడుకునే పరిస్థితి మీరు తీసుకురాకండి, మీ ప్యాంట్లు, మీ యొక్క లుంగీలు, మీ యొక్క బట్టలు, పైజామాలు గిట్ల కిందికి వ్రేలాడదీసి.
అల్లాహ్ మాట్లాడని, చూడని మూడు రకాల వ్యక్తులు
హజ్రత్ అబూజర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించిన హదీద్ లో ఉంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
ثَلَاثَةٌ لَا يُكَلِّمُهُمُ اللَّهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يَنْظُرُ إِلَيْهِمْ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ : الْمُسْبِلُ ( وَفِي رِوَايَةٍ : إِزَارَهُ ) وَالْمَنَّانُ ( وَفِي رِوَايَةٍ : الَّذِي لَا يُعْطِي شَيْئًا إِلَّا مَنَّهُ ) وَالْمُنَفِّقُ سِلْعَتَهُ بِالْحَلِفِ الْكَاذِبِ “మూడు రకాల వ్యక్తులున్నారు. అల్లాహ్ వారితో సంభాషించడు. దయాభావంతో కన్నెత్తి చూడడు. వారిని పరిశుద్ధ పరచడు. వారికి తీవ్రమైన శిక్ష విధిసాడు. తన లుంగి (ప్యాంటు…) ను చీలమండలానికి క్రింది వరకు ఉంచేవాడు. ఉపకారం చేసి మాటిమాటికి చెప్పుకునేవాడు. దెప్పి పొడిచేవాడు. తన సరుకును అసత్య ప్రమాణాలతో అమ్మేవాడు” (ముస్లిం 106).
అల్లాహు అక్బర్. నాలుగు రకాల ఘోరమైన విషయాలు, చూస్తున్నారా? అల్లాహ్ మాట్లాడడు, కన్నెత్తి చూడడు, పరిశుద్ధ పరచడు, పైగా వారికి తీవ్ర శిక్ష ఉంటుంది.
ఎవరు వారు? అల్ ముస్బిల్. తన లుంగీ, ప్యాంట్, పైజామా ఏదైనా, ఏది అయినా తొడిగేది, సాక్స్ కాకుండా, ఎందుకంటే సాక్స్ కింది నుండి పైకి వస్తాయి. పై నుండి కిందికి వచ్చేటివి ఏ వస్త్రాలైనా గానీ చీల మండలానికి కిందిగా ఉన్నాయి అంటే, అతడికి ఈ శిక్ష ఉంది. ఇంకా రెండో వాడు ఎవడు? ఉపకారం చేసి, ఎవరికైనా ఏదైనా మేలు చేసి, మాటిమాటికి చెప్పుకునేవాడు, దెప్పిపొడిచేవాడు. మూడో వాడు ఎవడయ్యా? తన సరుకును అసత్య ప్రమాణాలతో అమ్మేవాడు.
కొందరు, నేను గర్వకారణంగా తొడగడం లేదు అని చెప్పి తన పవిత్రతను చాటుకుంటాడు. కాని అతని మాట చెల్లదు. గర్వం ఉద్దేశ్యం ఉన్నా లేకపోయినా అన్ని స్దితుల్లో అది నిషిద్ధం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఈ హదీసును గమనించండి:
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసును గమనించండి:
ఒకవేళ గర్వంతో క్రిందికి వదిలితే. దాని శిక్ష ఇంకా పెద్దది, భయంకర మైనది. ఇదే తరహా స్పష్టీకరణ ప్రవక్తగారి ఈ ప్రవచనంలో ఉన్నది:
مَنْ جَرَّ ثَوْبَهُ خُيَلَاءَ لَمْ يَنْظُرِ اللَّهُ إِلَيْهِ يَوْمَ الْقِيَامَةِ “ఎవరైతే తన వస్త్రాన్ని గర్వంతో వ్రేలాడ దీస్తాడో ప్రళయదినాన అల్లాహ్ అతని వైపు కన్నెత్తి చూడడు’. (బుఖారి 3665, ముస్లిం 2085).
ఎందుకనగా అందులో రెండురకాల నిషిద్ధతలున్నాయి. ఒకటి గర్వం, రెండవది చీలమండలం క్రిందికి ధరించడం.
చీలమండలానికి క్రింద ధరించే నిషిద్ధత అన్ని రకాల దుస్తులపై ఉంది. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రజియల్లాహు అన్హు) ప్రవక్తతో ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
ఇక, కొందరు ఏమంటారు, నాకు గర్వం లేదు అని అంటారు కదా, ఆ మాట చెల్లదని ఇంతకు ముందే మనం తెలుసుకున్నాము. వారికి ప్రత్యేకమైన శిక్ష ఉంది. అయితే రండి, మరొక హదీస్, ఇది నిసాయి లో వచ్చి ఉంది.
وارْفَعْ إِزَارَكَ إِلَى نِصْفِ السَّاقِ، فَإِنْ أَبَيْتَ فَإِلَى الْكَعْبَيْنِ، وَإِيَّاكَ وَإِسْبَالَ الْإِزَارِ، فَإِنَّهَا مِنَ الْمَخِيلَةِ، وَإِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمَخِيلَةَ “నీ లుంగీని సగం పిక్కల వరకు లేపి ఉంచు, అంతపైకి కుదరదనుకుంటే చీలమండలం వరకు, చీలమండలానికి క్రిందికి ధరించడం నుండి దూరముండు, అది గర్వాహంకారంలో లెక్కించబడుతుంది మరియు అల్లాహ్ గర్వాహంకారాలను ఇష్టపడడు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సహాబీకి చెప్పారు, “నీ లుంగీని సగం పిక్క వరకు లేపి ఉంచు. అంత పైకి కుదరదనుకుంటే, చీల మండలం వరకు.” చీల మండలం అంటే అందరికీ అర్థమైందా? గిట్టలు (ankles) అని అంటారు చూడండి, ఎక్కడైతే మన పాదం మొదలవుతుందో మరియు మన యొక్క పిక్క కింది కాలు భాగం పూర్తి అయి జాయింట్ ఏదైతే ఉంటుందో, రెండు వైపులా కొంచెం ఎక్కువగా వచ్చి ఉంటాయి ఆ ఎముకలు, గిట్టెలు అని కూడా కొందరు అంటారు, చీల మండలం అని అంటారు. దానిని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబీకి చెప్పారు, ఒకవేళ నీవు సగం పిక్క వరకు కుదరదు అనుకుంటే చీలమండలం వరకు, అంటే అది కనబడాలి. దానిపైకి ఉండాలి వస్త్రం.
وَإِيَّاكَ وَإِسْبَالَ الْإِزَارِ؛ فَإِنَّهَا مِنَ الْمَخِيلَةِ، وَإِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمَخِيلَةَ (వ ఇయ్యాక వ ఇస్బాలల్ ఇజార్, ఫ ఇన్నహా మినల్ మఖీలా, వ ఇన్నల్లాహ లా యుహిబ్బుల్ మఖీలా) “చీల మండలానికి క్రిందికి ధరించడం నుండి నువ్వు దూరం ఉండు. ఉద్దేశ్యం నీది లేకపోయినా గాని, ఇది గర్వ అహంకారం లో లెక్కించబడుతుంది. మరియు అల్లాహ్ త’ఆలా గర్వ అహంకారాలను ఇష్టపడడు.”
స్త్రీలకు సంబంధించిన ఆదేశం
ఇక స్త్రీల మాటకు వస్తారా? ఈ నిషిద్ధత స్త్రీలకు కూడా వర్తిస్తుంది. అయితే, వారి శరీరంలో ఏ కొంత భాగం కూడా పరపురుషులకు కనబడకుండా ఉండుట తప్పనిసరి గనక, ఆమె తన పాదాలు కనబడకుండా క్రిందికి వ్రేలాడదీయవచ్చును. కానీ ఎంత? అంతకంటే ఎక్కువ ఉంటే ఆమెకు కూడా శిక్షనే మరి. ఎంత? ఈ హదీసుపై శ్రద్ధ వహించండి. తిర్మిజీలో ఉన్న సహీ హదీస్, అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
مَنْ جَرَّ ثَوْبَهُ خُيَلَاءَ لَمْ يَنْظُرِ اللَّهُ إِلَيْهِ يَوْمَ الْقِيَامَةِ (మన్ జర్ర సౌబహు ఖుయలాఅ లమ్ యందురిల్లాహు ఇలైహి యౌమల్ ఖియామా) ఎవరైతే తమ యొక్క వస్త్రాలను చీలమండలానికి క్రిందిగా వేలాడదీస్తారో, హుయలా (గర్వ అహంకారాలతో), అల్లాహ్ అలాంటి వారి వైపున ప్రళయదినాన చూడడు. అక్కడ ఉమ్మె సలమా రదియల్లాహు త’ఆలా అన్హా అడిగినది, ప్రశ్నించినది:
فَكَيْفَ يَصْنَعْنَ النِّsسَاءُ بِذُيُولِهِنَّ؟ (ఫకైఫ యస్న’అన్నిసాఉ బి దుయూలిహిన్?) “స్త్రీలు వారి యొక్క వస్త్రాలలో ఏదైతే కిందికి వేలాడి ఉంటాయో వారి పరిస్థితి ఏమిటి?”
يُرْخِينَ شِبْرًا (యుర్ఖీన షిబ్రా) ప్రవక్త చెప్పారు: “ఒక జానెడు వారు కిందికి వేలాడదీయవచ్చు.” ఈ జానెడు అంటే ఎక్కడి నుండి జానెడు? చీల మండలం నుండి జానెడు, ఎందుకంటే అక్కడి వరకే తొడగాలని ముందు చెప్పారు కదా.
ఈ హదీసును స్త్రీలు చాలా శ్రద్ధగా వినాలి. ప్రత్యేకంగా ఈ రోజుల్లో లెగ్గింగ్స్ వేసుకొని, జీన్స్ ప్యాంట్లు వేసుకొని, చర్మానికి, తోలుకు మొత్తం అతుక్కుపోయే విధంగా, చాలా టైట్ గా ఉండే అటువంటి ప్యాంట్లు, పైజామాలు ఏదైతే స్త్రీలు తొడుగుతున్నారో, బయటికి వెళ్తున్నారో, భయపడండి అల్లాహ్ తో, గమనించండి. వారి యొక్క ఆ పైజామాలు, ప్యాంట్లు, లెగ్గింగ్స్ అన్నీ పైకి ఉంటాయి. అలాంటి వారు ప్రత్యేకంగా ఈ హదీసును వినాలి.
స్త్రీలము మేము మా పాదాలు కూడా పర పురుషులకు కనబడకుండా ఉండాలి కదా, మరి ఎవరైతే చీలమండలానికి క్రిందిగా తొడుగుతారో వారికి నరకశిక్ష ఉన్నది అని, ప్రళయ దినాన అల్లాహ్ చూడడు అని మీరు అంటున్నారు కదా ప్రవక్తా, మరి మా స్త్రీల పరిస్థితి ఏమిటి అంటే, “ఒక జానెడు వేలాడదీయండి” అని చెప్పారు. అయితే ఉమ్మె సలమా రదియల్లాహు త’ఆలా అన్హా అడిగారు:
إِذًا تَنْكَشِفُ أَقْدَامُهُنَّ (ఇదన్ తన్కషిఫు అఖ్దాముహున్నా) “నిలబడి ఉండి జానెడు కిందికి తీస్తే పర్లేదు, కానీ నడుస్తున్నప్పుడు వాళ్ళ యొక్క పాదాలు తెరచిఉంటాయి క కదా?” అప్పుడు ప్రవక్త చెప్పారు:
فَيُرْخِينَهُ ذِرَاعًا لَا يَزِدْنَ عَلَيْهِ (ఫ యుర్ఖీనహు దిరా’అన్, లా యజీద్న అలై) “ఒక మూరెడు వారు కిందికి ఉంచవచ్చు. అంతకంటే ఇంకా ఎక్కువ పొడుగ్గా ఉంచడం ఇది కుదరదు.” అందువల్ల వారు కూడా శిక్షలకు గురి అవుతున్నారు.
కానీ మన సమాజంలోని స్త్రీలలో రెండు రకాల ఫ్యాషన్లు వారిని నాశనానికి, వినాశనానికి గురి చేస్తున్నాయి. ఒకటి, ఆఫీసుల్లో జాబ్ చేసే స్త్రీలు అని గానీ, కాలేజీల్లో చదివే అమ్మాయిలు గానీ, స్కర్టులు వేసుకోవడం, ఇంకా ఏదేదో కొత్త కొత్త పేర్లతో ఏమేమో వేసుకోవడం, వారి యొక్క పాదాలు, చీలమండలు, సగం పిక్కలు, మోకాళ్ల వరకు కూడా కనబడి ఉండటం, ఇదొక ఫిత్నా అయిపోతుంది. ఇదొక చాలా వినాశనానికి వారు దారి తీస్తున్నారు. మరియు మరోవైపున, కొన్ని ఫంక్షన్లలో, కొన్ని ఫంక్షన్లలో, కొన్ని రకాల బట్టలు ఎలా కుట్టిస్తారంటే ఒక మీటర్, రెండు మీటర్లు, మూడు మీటర్లు వెనక్కి అది వేలాడుతూ ఉంటాయి. ఇది ఒక గర్వంగా, ఇది ఒక ఫ్యాషన్ గా, ఇది ఒక మోడల్ గా, ఆ, ఇది మా యొక్క పెళ్లికి ప్రత్యేక చిహ్నం అండి అన్నట్లుగా చెప్పుకుంటారు. కానీ ఈ హదీసు ఆధారంగా అది కూడా నిషిద్ధం. కొందరు పెళ్లికూతుర్లు ధరించే దుస్తులు మీటర్ కంటే ఎక్కువ కిందికి ఉంటాయి. ఒక్కోసారి ఎంతకంటే పొడుగ్గా ఉంటాయి, వెనక ఉన్నవారు ఎత్తి పట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి కూడా యోగ్యం కావు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.