తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 75: ప్రశ్న 02 నఫిల్‌ (అదనపు) సత్కార్యాల ద్వారా అల్లాహ్ కు చేరువకండి [ఆడియో]

బిస్మిల్లాహ్

రెండవ ప్రశ్నకు సిలబస్: క్రింద ఇచ్చిన హదీస్ ఖుద్సీ చదవండి

అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

“నా ‘వలీ’ ప్రియతమునితో శత్రుత్వం వహించేవాడు నాతో యుద్దానికి సిద్ధమవ్వాలని ప్రకటిస్తున్నాను. నా దాసుడు నా సాన్నిధ్యం కోరి ఆచరించే వాటిలోకెల్లా నేను అతనిపై విధిగా నిర్ణయించినవి నాకు ప్రియమైనవి. నా దాసుడు నఫిల్‌ (అదనపు) సత్కార్యాల ద్వారా నాకు ఇంకా ఎంతో చేరువవుతాడు. కడకు అతడు నా ప్రేమకు పాత్రుడవుతాడు. అతడు నాకు ప్రీతి పాత్రుడు అయినప్పుడు నేను, అతడు వినే చెవినవుతాను, అతడు చూసే కన్నునవుతాను, అతడు పట్టుకునే చెయ్యినవుతాను, అతడు నడిచే కాలునవుతాను. ఇక అతడు నన్ను అడిగితే నేను తప్పక ప్రసాదిస్తాను, శరణు కోరితే నేను శరణు ఇస్తాను. నేను చేసే ఏ పనిలోనూ తటపటాయించను, విశ్వాసుని ప్రాణం తీయునప్పుడు తప్ప. అతను మరణం అంటే ఇష్టపడడు, అతనికి హాని కలగించడం అంటే నేను ఇష్టపడను. (కాని అది జరగక తప్పదు)”. (బుఖారీ 6502).

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

ఆడియో విన్న తర్వాత క్రింది ప్రశ్న ట్రై చెయ్యండి

(2) ఫర్జ్ (విధి) చేయబడిన ఆరాధన తర్వాత ఏ ఆరాధన వల్ల దాసులు అల్లాహ్ కు ఇంకా దగ్గరవుతారు?

A] ఫర్జ్
B] హజ్
C] నఫిల్

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

షవ్వాల్ 6 ఉపవాసాల లాభాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[9:51 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (9:51 నిముషాలు)

“ఎవరు రమజాను మాసమెల్లా ఉపవాసాలుండి, షవ్వాల్ మాసములో ఆరు ఉపవాసాలుంటాడో అతనికి సంవత్సరమెల్లా ఉపవాసాలున్నంత పుణ్యం లభిస్తుంది.” (ముస్లిం 1164).

ఇతరములు:

నఫిల్ ఉపవాసాలు మరియు వాటి ఘనతలు [వీడియో క్లిప్]

బిస్మిల్లాహ్

[3:05 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (3:05 నిముషాలు)

ఈ వీడియో క్లిప్ క్రింద ఇవ్వబడిన వీడియో నుండి సేకరించబడింది :
ఉపవాస పాఠాలు -2: ఉపవాస ఆదేశాలు [వీడియో] [21:33 నిముషాలు]

క్రింది విషయాలు ఉపవాస (రోజా) ఆదేశాలు – జుల్ఫీ కేంద్రం నుండి [28 పేజీలు] అనే పుస్తకం నుండి తీసుకోబడింది.

నఫిల్ ఉపవాసాలు:

ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) ఈ రోజుల్లో ఉపవాసాలుండాలని ప్రోత్సహించారు.

1- షవ్వాల్ మాసములో ఆరు రోజాలు. ఆయన ఆదేశం ఇది:

“ఎవరు రమజాను మాసమెల్లా ఉపవాసాలుండి, షవ్వాల్ మాసములో ఆరు ఉపవాసాలుంటాడో అతనికి సంవత్సరమెల్లా ఉపవాసాలున్నంత పుణ్యం లభిస్తుంది.” (ముస్లిం 1164).

2- ప్రతి సోమవారం, గురువారం.

3- ప్రతి నెల మూడు రోజులు. అవి చంద్రమాస ప్రకారం 13,14,15 తారీకుల్లో ఉంటే మంచిది.

4- ఆషూరా రోజు. అంటే ముహర్రం పదవ తారీకు. అయితే ఒక రోజు ముందు 9,10 లేదా ఒక రోజు తర్వాత 10,11 కలిపి రోజా ఉండడం. మంచిది. ఇందులో యూదుల ఆచారానికి భిన్నత్వం కూడా ఉంది. దీని ఘనతలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రభోదించారని, అబూ ఖతాద (రజియల్లాహు అన్హు)  ఉల్లేఖించారు:

“ఆషూరా రోజాకు బదులుగా అల్లాహ్ గత ఒక సంవత్సరపు అపరాధాలు మన్నిస్తాడని నా నమ్మకం.”(ముస్లిం 1162).

5- అరఫా రోజు ఉపవాసం. అది జిల్ హిజ్జ మాసంలో 9వ తారీకు. దీని గురించి ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు.

“అరఫా రోజాకు బదులుగా అల్లాహ్ గత ఒక సంవత్సరం మరియు వచ్చే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాపాల్ని మన్నిస్తాడని నా నమ్మకం.” (ముస్లిం 1162).

ఇతరములు:

సున్నతు నమాజుల ఘనత, సంఖ్య [వీడియో]

బిస్మిల్లాహ్

సున్నతు నమాజుల ఘనత, సంఖ్య Sunnat Namazula Ghanata فضل السنن الرواتب (Telugu)

[వ్యవధి: 6 నిముషాలు ]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


సున్నతె ముఅక్కద:

స్థానికులైన ప్రతి ముస్లిం స్త్రీ పురుషులు పన్నెండు రకాతులు పాటించడం ఎంతో పుణ్యకార్యం. అవి జొహ్ర్ కు ముందు 4, దాని తరువాత 2, మగ్రిబ్ తరువాత 2, ఇషా తరువాత 2, ఫజ్ర్ కు ముందు 2 రకాతులు. స్వయంగా ప్రవక్తసల్లల్లాహు అలైహి వసల్లం  ఈ సున్నతులు పాటించేవారు. ఇంకా ఆయన ఇలా శుభవార్త ఇచ్చారని ఉమ్మె హబీబ రజియల్లాహు అన్హా తెలిపారుః

 (مَا مِنْ عَبْدٍ مُسْلِمٍ يُصَلِّي لله كُلَّ يَوْمٍ ثِنْتَيْ عَشْرَةَ رَكْعَةً تَطَوُّعًا غَيْرَ فَرِيضَةٍ إِلَّا بَنَى اللهُ لَهُ بَيْتًا فِي الْجَنَّةِ أَوْ إِلَّا بُنِيَ لَهُ بَيْتٌ فِي الْجَنَّةِ).

ఏ ముస్లిం భక్తుడు రాత్రి పగల్లో ఫర్జ్ కాకుండా పన్నెండు రకాతుల అదనపు (నఫిల్) నమాజు చేస్తూ ఉంటాడో అతనికి వాటికి బదులుగా అల్లాహ్ ఒక గృహము స్వర్గంలో నిర్మిస్తాడు, లేదా ఒక గృహం స్వర్గంలో నిర్మించచబడును“. (ముస్లిం 728).

సున్నతె ముఅక్కద మరియు సాధరణంగా నఫిల్ నమాజులన్నియూ ఇంట్లో చేయడం చాలా ఉత్తమం. ప్రవక్త ﷺ ప్రబోధించారని, జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

 (إِذَا قَضَى أَحَدُكُمْ الصَّلَاةَ فِي مَسْجِدِهِ فَلْيَجْعَلْ لِبَيْتِهِ نَصِيبًا مِنْ صَلَاتِهِ فَإِنَّ اللهَ جَاعِلٌ فِي بَيْتِهِ مِنْ صَلَاتِهِ خَيْرًا).

“మీలోనెవరైనా మస్జిదులో (ఫర్జ్) నమాజు నెరవేర్చుకున్నాక, తన ఇంటి కొరకు కూడా (సున్నతులు, నఫిల్ల లాంటి) నమాజుల యొక్క కొంత భాగాన్ని మిగిలించుకోవాలి. అల్లాహ్ అతని నమాజుకు బదులుగా అతని ఇంట్లో మేలే చేకూర్చుతాడు”. (ముస్లిం 778).

జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

 (فَإِنَّ خَيْرَ صَلَاةِ الْـمَرْءِ فِي بَيْتِهِ إِلَّا الصَّلَاةَ الْـمَكْتُوبَةَ).

“మనిషి తనింట్లో చేసే నమాజు అతి ఉత్తమమైనది. కేవలం ఫర్జ్ నమాజు తప్ప”. (బుఖారి 6113).


ఇతరములు:

సున్నతు మరియు నఫిల్ నమాజులు