ఇస్లాం నుంచి బహిష్కరించే 6వ విషయం: చేతబడి
[డౌన్లోడ్ తెలుగు PDF] – [డౌన్లోడ్ అరబిక్ PDF]
మొదటి ఖుత్బా
إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ [آل عمران 102]. يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا [النساء 102]. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا * يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَنْ يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا [الأحزاب 70، 71].
స్తోత్రములు మరియు దరూద్ తరువాత:
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
“చేతబడి” దాని అర్థము, రకాలు & ఉదాహరణలు:
అల్లాహ్ దాసులారా! చేతబడి అంటే తాయత్తులపై, ముడులపై, మందులపై మంత్రాలు చదివి ఊదటం. దాని ద్వారా శరీరాలు, హృదయాలు ప్రభావితమవుతాయి. దానివల్ల వ్యక్తి వ్యాధి బారిన పడతాడు లేదా మరణిస్తాడు, లేదా మనిషి ఆలోచనలను, ఊహలను ప్రభావితం చేస్తుంది, లేదా భార్య భర్తలను వేరు చేయటము లేదా కలిసి వ్యాపారం చేస్తున్న ఇద్దరు స్నేహితులను వేరు చేయటము జరుగుతుంది. (అల్ ముగ్ని కితాబుల్ ముర్తద్)
అల్లాహ్ దాసులారా! చేతబడిలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి: హఖీఖి (వాస్తవమైనది). రెండవది: తఖయ్యులాతి (ఊహలు మరియు అంచనాలు).
హాఖీఖిలో మూడు రకాలు ఉన్నాయి:
మొదటిది శరీరం పై ప్రభావం చూపిస్తుంది, దానివల్ల వ్యక్తి వ్యాధి బారిన పడతాడు లేదా మరణిస్తాడు.
రెండవ రకములో మానవ హృదయం పై ప్రేమ లేదా ద్వేషము ద్వారా ప్రభావం చూపిస్తుంది, ఉదాహరణకు: భార్యను ద్వేషిస్తున్న భర్త మనసులో భార్య ప్రేమను సృష్టించడం, లేదా దానికి విరుద్ధము. దీని వల్లనే భర్త భార్యకు లేదా భార్య భర్తకు అందంగా కనిపించడం జరుగుతుంది (దీనినీ అరబిలో “అత్ ఫ్ ” అనే పేరుతో గుర్తిస్తారు) లేదా ప్రేమిస్తున్న భార్యకు భర్త దృష్టిలో శత్రువు లాగా చూపిస్తారు, దీని వల్ల భార్య భర్తకు, భర్త భార్యకు శత్రువు లాగా కనిపిస్తూ ఉంటారు (దీనినీ అరబీలో “సర్ ఫ్” అంటారు).
మూడో రకం ద్వారా మనిషి భ్రమ పడుతూ ఉంటాడు: నేను ఆ పని చేశాను, వాస్తవానికి ఆ పని అతను చేసి ఉండడు. ఈ చేతబడి యొక్క ఉదాహరణ: లబీద్ బిన్ ఆసిం అనే యూదుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారికి చేతబడి చేసాడు. దాని వల్ల ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) వారు ఏదైనా పని చేశారని అనుకునేవారు కానీ వాస్తవానికి ఆ పని చేసి ఉండరు. ఈ విధంగా ఎన్నో నెలల వరకు ప్రవక్త వారిపై ఆ చేతబడి ప్రభావం ఉండేది (ఈ సంఘటన బుఖారి, ముస్లిమ్లలో వివరించబడినది)
అల్లాహ్ దాసులారా! చేతబడి చేసేవాడు మంత్రాల ద్వారా షైతాన్ నుండి సహయం తీసుకుంటాడు, అది ఎలా అంటే: మాంత్రికుడు అతి చెడ్డదైన మురికి పరిస్థితిలో చేరి ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేస్తాడు, దీని కోసం అతను చెడ్డ జిన్నాతులను ఆశ్రయిస్తాడు, మరి కొన్ని ముడులను మంత్రించి దానిపై ఊదుతాడు, (దీనిని అరబీ భాషలో నఫస్ అంటారు) దీని గురించి అల్లాహ్ ఖురాన్ లో ఇలా తెలియజేశాడు:
وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي العُقَد
(మంత్రించి) ముడులలో ఊదే వారి కీడు నుండి (113: 04)
ఊదేవాళ్లు అంటే: చెడు జిన్నాత్తులు. వారు ముడులపై ఊదుతారు ఎందుకంటే చేతబడి యొక్క ప్రభావము జిన్నాతులు ఊదటం ద్వారానే అవుతుంది. కనుక వాళ్ళ శరీరాల నుంచి ఒక రకమైన ఊపిరి విడుదలవుతుంది, అందులో వాళ్ల ఉమ్మి కలిసి ఉంటుంది, దాని వల్ల ఎదురుగా ఉన్న వ్యక్తికి కీడు, హాని జరుగుతూ ఉంటుంది. ఈ జిన్నాతుల, షైతాన్ల ద్వారా ఎదుటి వ్యక్తి చేతబడికి గురవుతాడు, తఖ్దీర్ (విధివ్రాత) లోని ఒక రకం“కౌని” (జరగడం) మరియు “ఇజ్నీ” (ఆజ్ఞ) ద్వారానే చేతబడి సంభవిస్తుంది. అల్లాహ్ ఆదేశంపై శ్రద్ధ వహించండే:
وَمَا هُم بِضَارِّينَ بِهِ مِنْ أَحَدٍ إِلاَّ بِإِذْنِ اللَّه
ఎంత చేసినా వారు అల్లాహ్ అనుమతి లేకుండా ఆ చేతబడి ద్వారా ఎవరికీ ఎలిం కీడు కలిగించలేరు సుమా. (బఖర 2:102)
అల్లాహ్ దాసులారా! కొంతమంది మాంత్రికుల వద్దకు వెళ్లి తనను కొంత కాలం వరకూ తన భార్య పిల్లల నుంచి వేరు చేయాలనుకొని చేతబడి జరిపిస్తారు. దాని ద్వారా వారు కొంత కాలం వరకు భార్య పిల్లల నుంచి నిశ్చింతమై ఉంటారు, ఈ విధంగా వాళ్ళు ప్రయాణాలను , పనులన్నీ ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు ఆ చేతబడిని భంగం చేస్తారు.
అల్లాహ్ దాసులారా! మాంత్రికులు, చేతబడి చేసే వాళ్ళు మనుషులను మోసం చేస్తూ ఉంటారు. కనుక ఎవరైనా వాళ్ల వద్దకు వెళ్తే, వాళ్ల ముందు ఖురాన్ పారాయణం చేస్తారు. దాని ద్వారా వచ్చిన వ్యక్తి ఇతను అల్లాహ్ యొక్క వలి అని మంచి ఉద్దేశం కలిగి ఉంటారు. ఈ విధంగా మనుషులను మోసం చేస్తూ ఉంటారు. ఇలాంటి మాంత్రికులు తమ చేతబడిని కరామత్ (అల్లాహ్ తరఫు నుంచి మహిమ) అని ప్రదర్శిస్తూ ఉంటారు. వాస్తవానికి అది మంత్ర తంత్రాలు, చేతబడి. దానిని నేర్చుకోవటము మరియు అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్లడం కూడా నిషిద్ధము. దాని నుండి దూరం ఉండటం మరియు దానిని నివారించడము తప్పనిసరి (వాజిబ్).
అల్లాహ్ దాసులారా! తఖయ్యులాతి చేతబడి ప్రభావం అవ్వడానికి ఒకే మార్గం ఉన్నది – కంటి చూపులను ప్రభావితం చేయటము. శరీరము, హృదయము, ఆలోచనపై కాదు. కనుక ఎవరిపై అయితే చేతబడి చేస్తారో ఆ వ్యక్తి ప్రతి వస్తువు రూపాన్ని దానిని అవాస్తమైన వేరే రూపంలో చూస్తాడు. వాస్తవంగా ఆ వస్తువు ఉండదు. ఈ చేతబడి ఫిర్ఔన్ దర్బారులో ఉన్న మాంత్రికులు మూసా ప్రవక్త వారిపై ప్రయోగం చేశారు, ఇదొక రకమైన షైతాన్ పని.
ప్రజలారా! ఈ రకమైన “తఖయ్యులాతీ” చేతబడి వాస్తవాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక చూసేవాని కంట్లో దాని వాస్తవ ప్రభావం జరుగుతుంది, కానీ చూస్తున్న వస్తువుపై దీని ప్రభావం ఉండదు. చూస్తున్న వస్తువు ఎక్కడ ఉన్నది అక్కడే వాస్తవంగా అలాగే ఉంటుంది, కానీ చూసే వ్యక్తి కంట్లో మాత్రం చేతబడి ప్రభావం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ వస్తువు యొక్క రూపాన్ని మార్చటము తీర్చిదిద్దటము ఇది అల్లాహ్ కు మాత్రమే సాధ్యము, ఆయనకు ఎవరూ సాటి లేరు.
నేటి కాలంలో సర్కస్ పేరుమీద లేదా రెజ్లింగ్ గేమ్ అని చెప్పే ఆటలు కూడా తఖైయ్యులాతి చేతబడిలోనే భాగము. దాని ద్వారా మాంత్రికులు ప్రజల ఊహలను ప్రభావితం చేస్తూ ఉంటారు. కనుక వస్తువులు తమ అసలైన రూపానికి విరుద్ధంగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్లు తమ చేసే ఈ పనిని చేతబడి అని చెప్పరు. ఎందుకంటే ప్రజలు భయాందోళనకి గురికాకూడదని, దానిని రెజ్లింగ్ ఆటలు ఇంకా వేరే ఆటల పేర్లు ఇస్తూ ఉంటారు. కానీ పేర్లు మారటం వలన వాస్తవం మారదు, ఎందుకంటే వాస్తవాలను బట్టి నిర్ణయాలు ఉంటాయి. ఆ చేతబడి ఉదాహరణ ఏమిటంటే: ఒక వ్యక్తి తన తల వెంట్రుకల నుంచి కారు తీయడం, ఇంకో వ్యక్తి నిప్పులు తినటము, ఒక వ్యక్తి ఇనుపుతో తనకు తాను దాడి చేసుకోవడం లేదా నాలుకను కోసుకోవడం లేదా ఒక జంతువు నోటిలో ప్రవేశించి మల మార్గం ద్వారా బయటకు రావడం, ఇంకా తమ వస్త్రాల నుంచి పావురాన్ని వెలికి తీయటము లేదా ప్రజల ముందు ఒక వ్యక్తి ఛాతీపై కారు నడిపించుట ఇలాంటి మొదలైనవి ఎన్నో మానవుడి అధికారంలో లేనివి అన్ని షైతాన్ సహాయంతో జరుగుతూ ఉంటుంది. షైతాన్ దాని తీవ్రతను భరిస్తూ ఉంటాడు, లేదా ప్రజల కంటిపై చేతబడి ప్రభావం.
చేతబడి అవిశ్వాసపు పని మరియు చేతబడి చేయుట నిషిద్ధం
అల్లాహ్ దాసులారా! చేతబడి చేసే మాంత్రికుల గురించి ఖురాన్ లో కూడా ఖండించడం జరిగినది. అల్లాహ్ ఆజ్ఞ:
وَلَا يُفْلِحُ السَّاحِرُ حَيْثُ أَتَىٰ
మాంత్రికుడు ఏ విధంగా (ఎంత అట్టహాసంగా) వచ్చినా సఫలీకృతుడు కాలేడు. (తాహా 20:69)
ఇంకా ఇలా ఆదేశించాడు:
وَلَا يُفْلِحُ السَّاحِرُونَ
మాంత్రికులు సఫలీకృతులు కాలేరు. (యూనుస్ 10:77).
ఈ రెండు వాక్యాల ద్వారా మాంత్రికుడు ఏ విధంగానైనా సఫలికృతుడు కాలేడు, విజయం సాధించలేడని నిరూపించడం జరుగుతుంది (ఇది చేతబడి నేర్చుకొని అవిశ్వాసానికి పాల్పడిన వ్యక్తి హక్కులు) (అల్లామా షింఖీతి రహిమహుల్లాహ్ వారు ఖుర్ఆన్ వాక్యం వివరణలో మాంత్రికుడు కాఫిర్ (అవిశ్వాసి) అని నిరూపించారు)
ప్రవక్త మూసా అలైహిస్సలాం నోటి ద్వారా కూడా అల్లాహ్ మాంత్రికులను ఖండించాడు, ఖురాన్ వాక్యం ఈ విధంగా ఉన్నది:
مَا جِئْتُم بِهِ السِّحْرُ ۖ إِنَّ اللَّهَ سَيُبْطِلُهُ ۖ إِنَّ اللَّهَ لَا يُصْلِحُ عَمَلَ الْمُفْسِدِينَ
మీరు తెచ్చినది మంత్రజాలం, అల్లాహ్ ఇప్పుడే దానిని మిథ్యగా చేసి చూపిస్తాడు, అల్లాహ్ ఇలాంటి కల్లోల జనుల పనిని చక్కబడనివ్వడు. (యూనుస్ 10:81).
ఈ వాక్యం ద్వారా అర్థం అవుతున్న స్పష్టమవుతున్న విషయం ఏంటంటే ఈ భూమండలంపై మాంత్రికులు చేతబడి చేసేవాళ్లే కల్లోల్లాన్ని, ఉపద్రవాలను, సృష్టించేవాళ్ళు.
పైన వివరించబడిన ఆయతుల ద్వారా స్పష్టమవుతున్నది ఏమిటంటే: మాంత్రికుడు, చేతబడి చేసేవాడు కాఫిర్ (అవిశ్వాసి). చేతబడి చేపించడం నిషిద్ధం మరియు ఈ భూమండలవాసులపై దాని చెడు ప్రభావం, హాని కలుగుతుందని, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ పనిని మరణాంతరం మానవుడిని సర్వనాశనం చేసే పనులలో లెక్కించారు. హజ్రత్ అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
اجْتَنِبُوا السَّبْعَ الْمُوبِقَاتِ
“వినాశనానికి గురి చేసే ఏడు విషయాలకు దూరంగా ఉండండి”. దానికి సహచరులు “ప్రవక్తా! అవి ఏమిటి?” అని అడిగారు. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు:
الشِّرْكُ بِاللهِ، وَالسِّحْرُ…
“అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించడం, చేతబడి చేయటం….” (బుఖారి 2766/ ముస్లిం 89).
హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు:
لَيْسَ مِنَّا مَنْ تَطَيَّرَ أَوْ تُطُيِّرَ لَهُ، أَوْ تَكَهَّنَ أَوْ تُكُهِّنَ لَهُ، أَوْ سَحَرَ أَوْ سُحِرَ لَهُ… وَمَنْ أَتَى كَاهِنًا فَصَدَّقَهُ بِمَا يَقُولُ فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ ﷺ
“శకునం తీయువాడు, తీయించువాడు, జ్యోతిష్యం చేయువాడు, చేయించు వాడు, చేతబడి చేయువాడు, చేయించువాడు మాలోని వారు కారు. ఏ వ్యక్తి అయినా జ్యోతిష్యం చేయువాని వద్దకు వెళ్ళి అతడు చెప్పిన మాటలను ధృవీకరించినచో అతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లలాహు అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించినవాడవుతాడు.” (*)
(*) ఈ హదీస్ ని ఇమామ్ బజ్జార్ 3578 ఉల్లేఖించారు. అయితే ముఅజం కబీర్ 355లోని పదాలు ఇలా ఉన్నాయి: హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ రజియల్లాహు అన్హు ఒక వ్యక్తి చేతిలో ఇత్తడి కడియాన్ని చూసి, ఇదేమిటి అని ప్రశ్నించగా అతను చెప్పాడు: నాకు ‘వాహిన’ అను ఒక రోగం ఉంది, ఇది వేసుకుంటే అది దూరమవుతుందని నాకు చెప్పడం జరిగింది. ఈ మాట విన్న ఇమ్రాన్ రజియల్లాహు అన్హు చెప్పారు: أَمَا إِنْ مُتَّ وَهِيَ عَلَيْكَ وُكِلْتَ إِلَيْهَا నీవు ఇది వేసుకొని ఉండగానే చనిపోయావంటే నీవు దానికే అప్పగించబడిన వానివి అవుతావు. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పై హదీస్ తెలిపారు: “శకునం తీయువాడు, తీయించువాడు …. మాలోనివారు కారు”. (దీనిని అల్లమా అల్బానీ రహిమహుల్లాహ్ వారు సహీ అన్నారు. సహీహుల్ జామి 5435, సహీహా 2195).
ఇమామ్ బైహఖి హజ్రత్ ఖతాదాహ్ వారితో ఉల్లేఖించారు, కఅబ్ అన్నారు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “చేతబడి చేయువాడు, చేయించువాడు, జ్యోతిష్యం చేయువాడు, చేయించువాడు, శకునం చేయువాడు, చేయించువాడు నా నిజదాసులు కారు. నా నిజమైన దాసులు: నన్ను విశ్వసించి నాపై పూర్తి నమ్మకం కలిగినవారే”. (షుఅబుల్ ఈమాన్ 1176).
అల్లాహ్ దాసులారా! చేతబడి చేయించడం కొరకు మాంత్రికుని (జాదూగర్) వద్దకు వెళ్లడం అవిశ్వాసం. అది కుఫ్ర్ (అవిశ్వాసం) అవ్వడానికి కారణం ఏమిటంటే: అతను ఆ చేతబడి(జాదు) ను ఇష్టపడ్డాడు, తమపై లేదా ప్రజలపై చేయించడాన్ని సమ్మతించాడు.
జాదు (చేతబడి)కి పాల్పడక పోయినా దానిని ఇష్టపడటం కూడా అవిశ్వాసమే (కుఫ్ర్). ఎందుకనగా కుఫ్ర్ ను ఇష్టపడటం కూడా కుఫ్ర్ (అవిశ్వాసమే) అవుతుంది. ఇది ఎలాంటిదంటే: ఒక వ్యక్తి విగ్రహారాధనను లేదా శిలువకు సాష్టాంగం చేయడాన్ని ఇష్టపడుతున్నట్లు. ఇలాంటి వ్యక్తి ఒకవేళ అతను సాష్టాంగం చేయకపోయినప్పటికీ, విగ్రహారాధన చేయకపోయినా అతను కాఫిరే. ఉదాహరణకు: ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు “నేను చేతబడి చెయ్యను, చేయమని ఆజ్ఞాపించను, చేతబడి నేర్చుకోను, నేర్చుకోమని ఆజ్ఞాపించను, కానీ నా ఇంట్లో, సమాజంలో చేతబడి జరగటం నాకు ఇష్టం, నేను దానిని నిరాకరించను”. ఇలాంటి వ్యక్తి కూడా కాఫిరే. ఎందుకంటే కుఫ్ర్ పట్ల రాజీ పడి ఉండడం కూడా కుఫ్ర్ యే గనక. కనీసం తన మనస్సుతో కుఫ్ర్ ను ఖండించనివాని హృదయంలో విశ్వాసం లేనట్లే. (అల్లాహ్ మనల్ని రక్షించుగాక)
చేతబడి చేసేవాడు తౌహీదె రుబూబియత్ లో షిర్క్ మరియు తౌహీదె ఉలూహీయత్ లో కూడా షిర్క్ చేసినవాడయ్యాడు.
అల్లాహ్ దాసులారా! ఈ తఖయ్యులాతీ చేతబడి చేసేవాడు, వాస్తవాలను మార్చే శక్తి ఉందని ఆరోపిస్తాడు. మరి ఇలాంటి వాళ్ళు తమ ఈ దుష్చేష్ట వల్ల ఈ విశ్వంలో నియంత్రణ అధికారం కలిగి ఉన్నారని, మరియు అల్లాహ్ ను కాకుండా వేరే వాళ్ళతో సహాయం ఆర్థిస్తారు. ఈ రెండిటికి పాల్పడతారు, మొదటిది తౌహీదే రుబూబియత్ లో షిర్క్, రెండోది తౌహీదే ఉలూహియత్ లో షిర్క్ అవుతుంది. ఒక వ్యక్తి ముష్రిక్ మరియు మార్గ భ్రష్టుడు అవ్వడానికి ఈ రెండు ఆచరణలు సరిపోతాయి. తౌహీదే రుబూబియత్ లో షిర్క్ అవ్వటానికి కారణం ఏమిటంటే అతను వాస్తవాలను మార్చే శక్తి కలిగి ఉన్నాడని ఆరోపించటం. కానీ ఈ విశ్వంలో వాస్తవాలను మార్చే శక్తి అల్లాహ్ కు తప్ప మరెవరికీ లేదు, ఆయనే విశ్వాన్ని నడిపిస్తున్నాడు. ఆయనే సృష్టికర్త. ఆయనే ఒక వస్తువుని మరో వస్తువులో (రూపములో) మార్చే అధికారం కలిగి ఉన్నవాడు. కానీ ఇలాంటి అధికారము ఒక చేతబడి చేసేవాడు నేను కలిగి ఉన్నానని ఆరోపిస్తాడు, ఈ విషయంలో అతను షిర్క్ కి పాల్పడుతున్నాడు, ఈ విషయంలో అతను అబద్ధం చెప్తున్నాడు. ఎందుకంటే అతను చేసే జాదు (చేతబడి)ని బట్టి అతను నేను అధికారం కలిగి ఉన్నాను అని ఆరోపిస్తున్నాడు, కానీ కళ్ళ పై ఆ చేతబడి ప్రభావం ఉన్నంతవరకు ఎదుటి వ్యక్తి భ్రమలో పడి ఉంటాడు. ఎప్పుడైతే దాని ప్రభావం తగ్గుతుందో వాస్తవం ప్రజల ముందు స్పష్టమవుతుంది మరియు వస్తువులు తమ అసలైన రూపంలో కనిపిస్తాయి
తౌహీదే ఉలూహియత్ లో షిర్క్ అవ్వడానికి కారణం ఏమిటంటే అతను షైతాన్ నుంచి సహాయం తీసుకుంటాడు మరియు షైతాన్ కి సాష్టాంగం చేసి, షైతాన్ని ఆరాధిస్తాడు, షైతాన్ పేరు మీద జంతువులను జిబహ్ చేస్తాడు. మరి కొన్ని సందర్భాల్లో షైతాన్ ప్రసన్నత పొందటానికి ఖుర్ఆన్ని అవమానిస్తాడు. ఎందుకంటే షైతాన్ అతడి నుంచి ఎటువంటి ప్రతీకారము కోరడు, కేవలం అతను కుఫ్ర్ కి పాల్పడి, ఈ భూమండలంలో కల్లోలాన్ని వ్యాపించడం తప్ప. కనుక మాంత్రికుడు (చేతబడి చేసేవాడు) తనకు సహాయపడే షైతాన్ ను ఆరాధిస్తాడు, ఇదే అతని కుఫ్ర్ కి కారణం. మరియు ఆ మాంత్రికుడు అతన్ని ఆరాధించడం ద్వారా షైతాన్ లాభం పొందినట్లు గ్రహిస్తాడు. అదే షైతాన్ యొక్క అసలుద్దేశ్యం, అతడు ఆదం సంతతి నుండి కోరేది అదే. ఇదే విషయం అల్లాహ్ ఇలా తెలిపాడు:
أَلَمْ أَعْهَدْ إِلَيْكُمْ يَا بَنِي آدَمَ أَن لاَّ تَعْبُدُوا الشَّيْطَانَ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِين * وأنِ اعْبُدونِي هَذَا صِرَاطٌ مُسْتَقِيم
“ఓ ఆదం సంతతివారలారా! మీరు షైతాన్ను పూజించకండి, వాడు మీ బహిరంగ శత్రువు” అని నేను మీ నుండి వాగ్దానం తీసుకోలేదా? “మీరు నన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం” అని కూడా. (యాసీన్ 36:60,61).
ఇప్పటి వరకు వివరించబడిన విషయాల యొక్క సారాంశం ఏమిటంటే ఖురాన్, హదీసుల ఆధారంగా మరియు ఇజ్మాఎ ఉమ్మత్ ప్రకారంగా “చేతబడి నిషిద్ధము“. (మజ్మూఉల్ ఫతావా లిబ్ని తైమియహ్ 35/171)
షైతాన్ నుంచి సహాయం పొందటం వలన మాంత్రికుడికి ఏం లాభం? మరియు ఆ మాంత్రికుడికి ప్రజల నుంచి ఏమి లాభం?
అల్లాహ్ దాసులారా! చేతబడి చేసేవాడు (మాంత్రికుడు) షైతాన్ నుంచి అనేక లాభాలు పొందుతాడు. ఉదాహరణకు:
షైతాన్ అతనికి దూర ప్రదేశాల ప్రయాణం అతి వేగంగా చేపిస్తాడు, ఇలాంటివి మొదలైనవి.
మాంత్రికుడు ప్రజల బలహీనతల నుంచి లబ్ధి పొందుతాడు , దాని ద్వారా ఆర్థికంగా లాభం పొందుతూ ఉంటాడు. ఈ ముగ్గురు – షైతాన్ ,చేతబడి చేసేవాడు, చేయించేవాడు – తమ ప్రపంచాన్ని, పరలోకాన్ని నాశనం చేసుకుంటారు.
చేతబడి చేసేవాళ్లు, మాంత్రికుల విషయంలో ముస్లింల పై, ముస్లిం నాయకులపై ఉన్న బాధ్యతలు
అల్లాహ్ దాసులారా! చేతబడి చేయుట మరియు వాళ్ళ వద్దకు వెళ్లుట నుండి దూరంగా ఉండటం తప్పనిసరి. అయితే మాంత్రికుల వద్దకు పోకుండా ఉండటమే సరిపోదు, ఇస్లామీయ చట్ట ప్రకారం పరిపాలిస్తున్న దేశం అయితే, బాధ్యులకు మాంత్రికుల గురించి, వారి కార్యకలాపాల గురించి తెలియజేయాలి. వాళ్ళ సభలకు వెళ్లి, వాళ్ళ సంఖ్యను పెంచి, వాళ్లకు సహాయం చేయడం లాంటివన్నీ యోగ్యం లేలదు; అది టెలివిజన్ ద్వారానైనా, అనేక ఛానల్స్ మరియు అప్లికేషన్ల ద్వారా అయినా, అది కాలక్షేపం కొరకైనా, దాని అవగాహన కొరకైనా, లేదా దాన్ని తెలుసుకునే ప్రయత్నానికైనా సరే, ఏ ఉద్దేశంతో నైనా సరే వాళ్ళ వైపుకు వెళ్లకుండా ఉండాలి.
అల్లాహ్ దాసులారా! మాంత్రికులు, చేతబడి చేసేవాళ్లు మరియు ఇలాంటి అనేక ప్రక్రియలు అవిశ్వాస పూరితమైనవి. ఈ పనులు చేసే వాళ్ళపై అల్లాహ్ విధించిన శిక్షలను అమలు చేయడం ఉత్తమమైన ఆరాధన మరియు అల్లాహ్ సామిప్యాన్ని పొందే ఉత్తమైన ఆరాధనలలో ఒకటి. ఎందుకంటే వీళ్లు భూమండలంపై కల్లోల్లాన్నీ, ఉపద్రవాలను వ్యాపింప చేస్తారు, కనుక అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) వారి ఉల్లేఖనం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు ఇలా తెలియజేశారు: భూమిపై ఒక్క అపరాధికి అల్లాహ్ నియమించిన శిక్షను విధించడం వలన భూవాసులపై 40 రోజులు వర్షం కురవటం కన్నా ఉత్తమైనది. (ఇబ్ను మాజహ్, అల్లామా ఆల్బాని వారు ప్రామాణికంగా ఖరారు చేశారు)
ఇబ్ను తైమియహ్ రహిమహుల్లాహ్ వారు ఇలా చెప్పారు: (మాంత్రికులను హతమార్చడం) దీనితోపాటు వాళ్ళ ఆచరణ, చేతబడికి సహాయపడే ప్రతి దానిని నాశనం చేయాలి, వృధా చేయాలి, అంతం చేయాలి, వీళ్లను సామాన్య రహదారులపై కూర్చోవడానికి నివారించాలి, మరియు ఇలాంటివాళ్లకు ఇల్లు అద్దెకి ఇవ్వరాదు. ఇవన్నీ అల్లాహ్ మార్గంలో జిహాద్ యొక్క ఉత్తమమైన రూపము, మార్గము.( మజ్మూ ఫతావా లి ఇబ్న్ తైమీయహ్)
చేతబడి ప్రక్రియలో పడకుండా జాగ్రత్త పడడానికి తెలుసుకోవలసిన ఖచ్చితమైన విషయాలు మరియు చేతబడి చేసేవాడు మరియు అతని వద్ద పోయే వాళ్ల కుఫ్ర్ ను తెలుసుకొనుటకు ఈ ఖుత్బా చాలా ప్రయోజనం చేకూర్చి ఉండాలి.
బారకల్లాహు లీ వలకుం ఫిల్ ఖుర్ఆనిల్ అజీం, వనఫఅనీ వఇయ్యాకుం బిమా ఫీహి మినల్ ఆయాతి వజ్జిక్రిల్ హకీం, అఖూలు ఖౌలీ హాజా, వఅస్తగ్ ఫిరుల్లాహ లీ వలకుం ఫస్తగ్ఫిరూహ్, ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీం.
(అల్లాహ్ నాపై, మీ పై ఖుర్ఆన్ శుభాలను అవతరింపజేయుగాకా! నాకూ, మీకూ అందులో ఉన్న వివేకము, లాభము ద్వారా ప్రయోజనం చేకూర్చుగాక! నేను నా మాటను ముగిస్తాను. మరియు నా కొరకు, మీ కొరకు క్షమాపణ కోరుతున్నాను మీరు కూడా కోరండి. నిస్సందేహంగా అల్లాహ్ చాలా క్షమించేవాడూ మరియు కరుణించేవాడూ.
రెండవ ఖుత్బా
చేతబడి నుండి రక్షణ మార్గాలు
స్తోత్రాలు మరియు దరూద్ తరువాత …
అల్లాహ్ దాసులారా! అల్లాహ్ భీతి కలిగి ఉండండి. మరి గుర్తుంచుకోండి. చేతబడి ప్రభావం కలగకుండా జాగ్రత్తగా ఉండడానికి: అజ్కార్ సబాహ్, మసా (ఉదయం, సాయంత్రం దుఆలు) చదువుతూ ఉండాలి.
చేతబడి సంభవించిన తర్వాత స్వస్థత పొందటానికి మూడు పద్ధతులు అవలంభించాలి:
మొదటి పద్ధతి మరియు చాలా ముఖ్యమైనది: అజ్కార్ సబాహ్, మసా (ఉదయం, సాయంత్రం దుఆలు) చదువుతూ ఉండాలి.
రెండవది పద్ధతి మరియు చాలా లాభదాయకమైనది: చేతబడి చేసిన ఆ వస్తువునీ, దాచిన ప్రదేశాన్ని తెలుసుకోవడం. అది నేల లోపల ఉన్నా, లేదా కొండపై ఉన్నా, లేదా వేరే ఎక్కడున్నా సరే చేతబడి చేసి దాచిన ఆ వస్తువును తెలుసుకుంటే, దాన్ని అక్కడ నుంచి వెలికి తీసి నాశనం చేస్తే, తొలగిస్తే చేతబడి ప్రభావం దూరం అవుతుంది.
మూడవ పద్ధతి: ఇది ఏ వ్యక్తికి అయితే తన భార్యతో సంభోగ విషయంలో ఇబ్బందిగా ఉందో, అలాంటి వ్యక్తికి చేయబడ్డ చేతబడి కి చాలా లాభకరమైనది. ఏడు (7 ) పచ్చటి రేగి ఆకులను తీసుకోవాలి, దానిని రాయితో దంచి, రుబ్బి, సన్నగా పేస్ట్ చేసి దానిని ఒక గిన్నెలో వేసి దానిపై స్నానం చేసేంత నీటిని వేసి, అందులో ఆయతుల్ కుర్సీ మరియు ఖుల్ యొక్క నాలుగు సూరాలు చదివి మరియు సూరతుల్ ఆరాఫ్, సూరతుల్ యూనుస్ మరియు సూరతుత్ తాహా లో చేతబడికి సంబంధించిన ఆయతులు పఠించాలి. దాని తర్వాత ఆ నీటిలోని కొద్ది భాగాన్ని మూడు సార్లు చేసి త్రాగాలి, మిగిలిన నీళ్లతో స్నానం చేయాలి. ఈ విధంగా చేతబడి యొక్క ప్రభావము ఇన్ షా అల్లాహ్ తొలగిపోతుంది. ఈ విధంగా రెండు మూడు సార్లు వ్యాధి నయం అయ్యే వరకు చేసినా పర్వాలేదు.
అల్లాహ్ మీపై కరుణించుగాకా, తెలుసుకోండి! అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి సూర అహ్ జాబ్:56లో ఆజ్ఞాపించాడు:
إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا (56)
అల్లాహుమ్మ సల్లి వసల్లిమ్ వబారిక్ అలా అబ్దిక వరసూలిక ముహమ్మద్, వర్ జ అన్ అస్ హాబిహిల్ ఖులఫా, వమన్ తబిఅహుమ్ బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అల్లాహుమ్మ అఇజ్జల్ ఇస్లామ వల్ ముస్లిమీన్, వఅజిల్లష్ షిర్క వల్ ముష్రికీన్, వదమ్మిర్ అఅదాఅక అఅదాఅద్దీన్, వన్సుర్ ఇబాదకల్ మువహ్హిదీన్.
ఓ అల్లాహ్ మా దేశాలలో భద్రతను ప్రసాదించు, మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గంపై నడిచే వారీగా చేయు.
ఓ అల్లాహ్ మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు.
ఓ అల్లాహ్ మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్మల్ని కాపాడు.
سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُون وَسَلَامٌ عَلَى الْمُرْسَلِين وَالْحَمْدُ للهِ رَبِّ الْعَالَمِين
—
ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

You must be logged in to post a comment.