మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 2
[మరణానంతర జీవితం – పార్ట్ 52] [20 నిముషాలు]
https://www.youtube.com/watch?v=ADuGX4TjS2o
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد
(అల్-హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్) [సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రములు. ప్రవక్తల నాయకుడైన మా ప్రవక్త ముహమ్మద్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన సహచరులందరిపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఆ తర్వాత…]
రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక నరకంపై వంతెన.
మహాశయులారా, ఎవరికి ఎంత కాంతి లభిస్తుందో అంతే వేగంగా వారు ఆ వంతెనను దాటగలుగుతారు. ముస్తదరక్ హాకిం లోని హదీథ్, షేఖ్ అల్బానీ రహిమహుల్లా గారు సహీ అని అన్నారు. ఆ హదీథ్ లో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికి ఎంత కాంతి లభిస్తుంది అనే విషయాన్ని తెలియపరుస్తూ, ఎవరు ఎంత వేగంగా ఆ వంతెనను దాటుతారో స్పష్టపరిచారు.
హజ్రత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: ప్రళయ దినాన అల్లాహు తఆలా పూర్వీకులను, వెనుకటి వారిని, ప్రజలందరినీ సమీకరిస్తాడు. ఆ పొడవైన హదీథ్ లో కాంతి ఇవ్వబడే విషయాన్ని తెలియపరుస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ప్రతి ఒక్కరికి వారి కర్మల ప్రకారం కాంతి ఇవ్వడం జరుగుతుంది. నూర్ ఇవ్వడం జరుగుతుంది.
فَمِنْهُمْ مَنْ يُؤْتَى نُورُهُ مِثْلَ الْجَبَلِ
(ఫమిన్‌హుమ్ మన్ యూ’తా నూరుహు మిథ్లల్ జబల్)
[వారిలో కొందరికి పర్వతమంత కాంతి ఇవ్వబడుతుంది.]
కొందరికి కొండంత పరిమాణంలో, కొండ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కదా, కొండంత పరిమాణంలో వారికి కాంతి లభిస్తుంది. వారి సత్కార్యాలు మహా గొప్పగా ఉండవచ్చు. మరికొందరికి అంతకంటే మరీ ఎక్కువ పరిమాణంలో కూడా కాంతి లభిస్తుంది. మరికొందరికి వారు ఒక ఖర్జూరపు కర్ర తమ కుడిచేతిలో తీసుకున్నంత పరిమాణంలో లభిస్తుంది. మరికొందరికి అంతకంటే తక్కువ పరిమాణంలో. చివరి వ్యక్తి లేక చివరి రకం వారు, చివరి వర్గం వారు ఎవరికైతే కాంతి అతి తక్కువ పరిమాణంలో ఇవ్వడం జరుగుతుందో అది వారి కాలులోని, వారి పాదములోని బొటనవేలి పరిమాణంలో వారికి కాంతి లభిస్తుంది. అది కూడా ఒకసారి వెలుగుతూ ఉంటే ఒకసారి దాని యొక్క కాంతి అనేది నశించిపోతుంది.
Read More “నరకంపై వంతెన (ఫుల్ సిరాత్): పార్ట్ 2 – [మరణానంతర జీవితం – పార్ట్ 52] [ఆడియో, టెక్స్ట్]”