ఖుర్ఆన్ ను పఠించడం | ఖుర్ఆన్ హక్కులు | హబీబుర్రహ్మాన్ జామిఈ  [వీడియో & టెక్స్ట్]

ఖుర్ఆన్ ను పఠించడం | ఖుర్ఆన్ హక్కులు – 2
వక్త: హబీబుర్రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/s95wqnlrv94 [9 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఖుర్ఆన్ పట్ల విశ్వాసికి ఉన్న హక్కులలో రెండవదాని గురించి వివరించబడింది. ఖుర్ఆన్‌ను విశ్వసించడం మొదటి హక్కు అయితే, దానిని నిరంతరం పఠించడం రెండవ హక్కు అని స్పష్టం చేయబడింది. ఖుర్ఆన్ పఠించడం వలన ప్రతి అక్షరానికి పది పుణ్యాలు లభిస్తాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు పేర్కొనబడింది. ప్రళయదినాన ఖుర్ఆన్ తనను పఠించిన వారి కొరకు సిఫారసు చేస్తుందని కూడా చెప్పబడింది. ఖుర్ఆన్‌ను పఠించవలసిన రీతిలో (హక్క తిలావతిహి) పఠించడం యొక్క ప్రాముఖ్యత నొక్కిచెప్పబడింది, దీనికి పలు అర్థాలు వివరించబడ్డాయి: ఏకాగ్రతతో చదవడం, అందులోని ధర్మాధర్మాలను అంగీకరించడం, దాని సందేశాన్ని ఇతరులకు వివరించడం, మరియు స్పష్టమైన ఆజ్ఞలను పాటిస్తూ, అస్పష్టమైన విషయాల జ్ఞానం కోసం పండితులను ఆశ్రయించడం. చివరగా, ఖుర్ఆన్‌ను తజ్విద్ (ఉచ్ఛారణ నియమాలు) మరియు తర్తీల్ (ఆగి ఆగి, స్పష్టంగా పఠించడం)‌తో చదవాలని సూచిస్తూ ప్రసంగం ముగించబడింది.

ఇన్నల్హమ్దులిల్లాహి వహ్దహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు అమ్మా బ’అద్.

అభిమాన సోదరులారా, కారుణ్య కడలి రమజాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ రోజు మనం ఖుర్ఆన్ యొక్క రెండవ హక్కు, ఖుర్ఆన్‌ను పఠించడం అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాం. ఖుర్ఆన్ యొక్క రెండవ హక్కు, ఖుర్ఆన్‌ను పఠించాలి. మొదటి హక్కు, ఖుర్ఆన్‌ను విశ్వసించడం. దాని గురించి ఇంతకు ముందు ఎపిసోడ్‌లో మనం తెలుసుకున్నాం. ఈ రోజు ఖుర్ఆన్‌ను పఠించడం.

ఖుర్ఆన్ యొక్క రెండవ హక్కు ఏమిటంటే, మనం ఖుర్ఆన్‌ను పఠిస్తూ ఉండాలి. కేవలం విశ్వసిస్తే సరిపోదు, విశ్వసించిన తరువాత ఖుర్ఆన్‌ను మనం పఠించాలి. ఖుర్ఆన్ పఠించడం వలన ఒక అక్షరానికి పది పుణ్యాలు లభిస్తాయని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఒక అక్షరానికి పది పుణ్యాలు. ఇంకా ఇలా ప్రవచించారు:

اقْرَءُوا الْقُرْآنَ فَإِنَّهُ يَأْتِي يَوْمَ الْقِيَامَةِ شَفِيعًا لأَصْحَابِهِ
(ఇఖ్రవుల్ ఖుర్ఆన ఫఇన్నహు య’అతీ యౌమల్ ఖియామతి షఫీఅన్ లిఅస్ హాబిహి)
“ఖుర్ఆన్‌ను అత్యధికంగా పారాయణం చేయండి. ప్రళయ దినాన అది తనను పారాయణం చేసిన వారి కొరకు సిఫారసు దారునిగా వస్తుంది.”

ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. ఖుర్ఆన్‌ను అత్యధికంగా పారాయణం చేయండి. ఖుర్ఆన్ తిలావత్ చేస్తూ ఉండండి. ప్రళయ దినాన అది తనను పారాయణం చేసిన వారి కొరకు సిఫారసు దారునిగా వస్తుంది అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు:

وَاتْلُ مَا أُوحِيَ إِلَيْكَ مِنْ كِتَابِ رَبِّكَ ۖ لَا مُبَدِّلَ لِكَلِمَاتِهِ وَلَنْ تَجِدَ مِنْ دُونِهِ مُلْتَحَدًا
(వత్లు మా ఊహియ ఇలైక మిన్ కితాబి రబ్బిక లా ముబద్దిల లికలిమాతిహి వలన్ తజిద మిన్ దూనిహి ముల్తహదా)

“నీ వద్దకు వహీ ద్వారా పంపబడిన నీ ప్రభువు గ్రంథాన్ని పఠిస్తూ ఉండు. ఆయన వచనాలను మార్చగలవాడెవడూ లేడు. నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఆయన ఆశ్రయం తప్ప వేరే ఆశ్రయాన్ని పొందజాలవు.” (సూర కహఫ్ 18:27)

ఖుర్ఆన్ పారాయణం చేసే విధానం కూడా బోధించబడింది. రెండవ హక్కు ఖుర్ఆన్‌ని పఠించాలి. ఖుర్ఆన్ పారాయణం చేయాలి, తిలావత్ చేయాలి. ఆ విధానం కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా ఆజ్ఞాపించాడు:

الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَتْلُونَهُ حَقَّ تِلَاوَتِهِ أُولَٰئِكَ يُؤْمِنُونَ بِهِ ۗ وَمَنْ يَكْفُرْ بِهِ فَأُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
(అల్లజీన ఆతైనాహుముల్ కితాబ యత్లూనహు హక్క తిలావతిహి ఉలాయిక యు’మినూన బిహి వమన్ యక్ఫుర్ బిహి ఫఉలాయిక హుముల్ ఖాసిరూన్)

“మేము ఎవరికి గ్రంథం వొసగామో వారు దానిని పారాయణం చేయవలసిన రీతిలో పారాయణం చేస్తారు. (అంతేకాదు,) వారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు. ఇక, దీనిపట్ల తిరస్కార వైఖరిని అవలంబించినవారే నష్టపోయేది.” (2:121)

ఈ ఆయతులో ‘హక్క తిలావతిహి’ గురించి ఫత్హుల్ ఖదీర్ ఆధారంగా అహ్సనుల్ బయాన్‌లో ఇలా ఉంది: పఠించవలసిన విధంగా పఠిస్తారు అన్న వాక్యానికి పలు అర్థాలు వివరించబడ్డాయి. ఉదాహరణకు ఒక అర్థం ఏమిటి? బాగా చదువుతారు, శ్రద్ధతో, ఏకాగ్రతతో పారాయణం చేస్తారు. పఠన సందర్భంగా స్వర్గ ప్రస్తావన వస్తే, స్వర్గంలో ప్రవేశం కల్పించమని అల్లాహ్‌ను వేడుకుంటారు. నరక ప్రస్తావన వస్తే, దాని బారి నుండి రక్షించమని ప్రార్థిస్తారు. ఇది ఒక అర్థం.‘హక్క తిలావతిహి’కి ఇది ఒక అర్థం. పఠించవలసిన విధానంగా పఠించాలి అంటే ఇది ఒక అర్థం.

రెండో అర్థం ఏమిటి? అందులో ధర్మసమ్మతంగా ఖరారు చేయబడిన వాటిని ధర్మసమ్మతాలుగా విశ్వసిస్తారు. అధర్మం అని స్పష్టం చేయబడిన వాటిని అధర్మంగానే భావిస్తారు. అంతేగాని యూదుల మాదిరిగా ప్రక్షిప్తాలకు పాల్పడటం గానీ, తప్పుడు అన్వయింపులు చేయడం గానీ చేయరు. అంటే, ఖుర్ఆన్‌లో దేనిని హలాల్ అని చెప్పబడిందో దానిని హలాల్‌గా నమ్ముతారు, అంగీకరిస్తారు, ఆచరిస్తారు. ఖుర్ఆన్‌లో దేనిని హరాం అని, నిషిద్ధం అని, అధర్మం అని చెప్పబడిందో దానిని అధర్మం అని నమ్ముతారు, విశ్వసిస్తారు, దాని నుండి దూరంగా ఉంటారు. ఇది దీనికి ఒక అర్థం. ఖుర్ఆన్‌ని పఠించవలసిన రీతిలో పఠించాలి. ‘హక్క తిలావతిహి’కి ఇది ఒక అర్థం. ఖుర్ఆన్‌లో ఏదైతే ధర్మం ఉందో, ధర్మం అని భావించాలి. అధర్మానికి అధర్మం అని భావించాలి. దానికి తప్పుడు అర్థాలు చెప్పరాదు, చేసుకోకూడదు.

అలాగే మూడవ అర్థం ఏమిటంటే, అందులో పొందుపరచబడి ఉన్న విషయాలను గురించి అందరికీ వివరిస్తారు, వాటిని దాచి ఉంచరు.

అలాగే ఇంకో అర్థం, అందులో చేయమని ఆజ్ఞాపించబడిన వాటిని—మహ్కమాత్ ఆయతులను—చేస్తారు. అస్పష్టంగా ఉన్న ముతషాబిహాత్ విషయాలను విశ్వసిస్తారు. అర్థం కాని విషయాల గురించి విద్వాంసులను, ధర్మ పండితులను అడిగి తెలుసుకుంటారు. ఇది చాలా ముఖ్య విషయం. తెలియకుండా, ధర్మ అవగాహన లేకుండా, మనమే ఊహించుకుని, కొంచెం వస్తే దానికి ఇంకా కొన్ని విషయాలు అల్లుకుని, మనమే దానికి భావాలు, అర్థాలు చెప్పటం చాలా తప్పు. ఖుర్ఆన్ అల్లాహ్ వాక్యం. ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని ప్రవక్త గారు ఏ విధంగా దానికి అర్థం చెప్పారు, సహాబాలు ఏ విధంగా అర్థం తీసుకున్నారో, అదే అర్థం మనం తీసుకోవాలి. ఆ ఆయతులు మహ్కమ్ ఆయతులు ఉండినా, ముతషాబిహ్ ఆయతులు ఉండినా. అర్థం కాని విషయాలు, ఆ విషయాల గురించి ధర్మ పండితులను, విద్వాంసులను అడిగి తెలుసుకోవాలి.

అలాగే చివరి మాట, ఖుర్ఆన్‌లో ఒక్కొక్క విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. పఠించవలసిన రీతిలో పఠిస్తారు అన్న వాక్యంలో ఎన్ని పరమార్థాలు ఇమిడి ఉన్నాయి! వీటన్నింటి పట్ల శ్రద్ధాసక్తులు కలిగి ఉన్నవారికే అల్లాహ్ మార్గదర్శకత్వం ప్రాప్తిస్తాడు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్‌లో ఇలా సెలవిచ్చాడు:

وَرَتِّلِ الْقُرْآنَ تَرْتِيلًا
(వరత్తిలిల్ ఖుర్ఆన తర్తీలా)
ఖుర్ఆన్ ను మాత్రం బాగా – ఆగి ఆగి నింపాదిగా (స్పష్టంగా) పఠించు.” (73:4)

అంటే ఖుర్ఆన్‌ను, ఖుర్ఆన్‌ను మాత్రం బాగా ఆగి ఆగి, నింపాదిగా, స్పష్టంగా పఠించు. అంటే తజ్విద్‌తో, తర్తీల్‌తో, సరైన ఉచ్ఛారణతో. ఖుర్ఆన్‌కి ఒక పద్ధతి ఉంది, తిలావత్ చేసే ఒక విధానం ఉంది. కొన్ని నియమాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఒక సబ్జెక్టే ఉంది, దానికి తజ్విద్ అంటారు. ఏ అక్షరం ఎక్కడ నుండి ఉచ్ఛరింపబడుతుంది, అవి మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు అరబీలో ‘ح’ (హా) అని ఒక అక్షరం ఉంది, ‘ه’ (హా) అని ఒక అక్షరం ఉంది. తెలుగులో ‘హ’ మాత్రమే ఉంటుంది. ‘ح’ (హా) అనే ఉచ్ఛారణ తెలుగులో లేదు, ఇంగ్లీషులో కూడా లేదు. అలాగే అరబీలో ‘ز’ (జా) ఒక అక్షరం ఉంది, ‘ج’ (జా) ఒక అక్షరం ఉంది. తెలుగులో రెండింటికీ ‘జ’ మాత్రమే ఉంటుంది. ‘ز’ (జా) అనే అక్షరం తెలుగులో లేదు. అలాగే ‘ف’ (ఫా) అనే అక్షరం తెలుగులో లేదు. తెలుగులో ‘ప’ ఉంటుంది, లేకపోతే ‘ఫ’ ఉంటుంది. ‘ف’ (ఫా) అనే అక్షరం తెలుగులో లేదు. చెప్పడం ఏమిటంటే, ఖుర్ఆన్‌ను తజ్విద్‌తో చదవాలి. ‘వరత్తిలిల్ ఖుర్ఆన తర్తీలా’, ఖుర్ఆన్‌ను బాగా ఆగి ఆగి, నింపాదిగా, తజ్విద్‌తో, ప్రతి అక్షరాన్ని తన మఖ్రజ్‌తో మనము చదివే ప్రయత్నం చేయాలి. రాకపోతే నేర్చుకోవాలి.

రెండవ హక్కు ఏమిటంటే, ఖుర్ఆన్‌ను పఠించాలి, ఖుర్ఆన్‌ను పారాయణం చేయాలి. ఇవి ఖుర్ఆన్‌కి సంబంధించిన రెండవ హక్కు. ఇన్షా అల్లాహ్, మిగతా హక్కు తర్వాత ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.

వ ఆఖిరు ద’అవానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44374


యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఖుర్ఆన్ హక్కులు)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2GoH_kZfwdME8eHCJumoPq

తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కార్యాలు – రాత్రి సూర బఖరలోని చివరి రెండు ఆయతుల పఠనం [ఆడియో]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 26 C నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కార్యాలు – రాత్రి సూర బఖరలోని చివరి రెండు ఆయతుల పఠనం
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

(5) రాత్రి సూర బఖరలోని చివరి రెండు ఆయతుల పఠనం

2:285  آمَنَ الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِ وَالْمُؤْمِنُونَ ۚ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّن رُّسُلِهِ ۚ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ

ఆమనర్రసూలు బిమా ఉన్‌జిల ఇలైహి మిర్రబ్బీహీ్‌ వల్‌ మువ్ మి నూన్‌ కుల్లున్‌ ఆమన బిల్లాహి వమలాయికతిహీ వకుతుబిహీ వరుసులిహ్‌ లా నుఫర్రిఖు బైన అహది మ్మిర్రుసులిహ్‌ వఖాలూ సమిఅ్ నా వఅతఅ్ నా గుఫ్‌రానక రబ్బనా వ ఇలైకల్‌ మసీర్‌

తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. “మేము ఆయన (పంపిన) ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్నీ పాటించము” (అని వారు చెబుతారు). “మేము విన్నాము. విధేయులం అయ్యాము. మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే” అని అంటారు.

2:286  لَا يُكَلِّفُ اللَّهُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۚ لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا اكْتَسَبَتْ ۗ رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِن نَّسِينَا أَوْ أَخْطَأْنَا ۚ رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِن قَبْلِنَا ۚ رَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهِ ۖ وَاعْفُ عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَا ۚ أَنتَ مَوْلَانَا فَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ

లాయుకల్లిఫుల్లాహు నఫ్‌ సన్‌ ఇల్లా వుస్‌ అహా లహా మా కసబత్‌ వ అలైహా మక్‌తసబత్‌ రబ్బనా లాతు ఆఖిజ్‌నా ఇన్నసీనా అవ్‌ అఖ్‌తానా రబ్బనా వలా తహ్‌మిల్‌ అలైనా ఇస్‌రన్‌ కమా హమల్‌ తహూ అలల్లజీన మిన్‌ ఖబ్‌లినా రబ్బనా వలా తుహమ్మిల్‌నా మాలా తాఖతలనా బిహ్‌ వఅ్ ఫు అన్నా వగ్‌ఫిర్‌ లనా వర్‌హమ్‌నా అంత మౌలానా ఫన్‌సుర్‌నా అలల్ ఖౌమిల్‌ కాఫిరీన్‌

అల్లాహ్‌ ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవి చూస్తుంది. (ఇలా ప్రార్థిస్తూ ఉండండి): “ఓ మా ప్రభూ! మేము మరచిపోయినా, లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభూ! మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభూ! మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదలిపెట్టు. మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయజూపు. నీవే మా సంరక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు.”

ప్రవక్త ﷺ ఇలా తెలిపారని అబూ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ قَرَأَ بِالْآيَتَيْنِ مِنْ آخِرِ سُورَةِ البَقَرَةِ فِي لَيْلَةٍ كَفَتَاهُ
“ఎవరు రాత్రి వేళ సూర బఖరలోని చివరి రెండు ఆయతులు పఠిస్తారో అతనికి అవే చాలు”.
(బుఖారి 5010 పదాలు, ముస్లిం 807).

ఇమాం నవవీ (రహిమహుల్లాహ్) చెప్పారుః అవి సరిపోతాయి అంటే తహజ్జుద్ కు బదులుగా సరిపోతాయి అని భావం. షైతాన్ నుండి, ఆపదల నుండి రక్షణకై అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా కావచ్చు. (సహీ ముస్లిం షర్హ్ నవవీ 6/ 340, హ.న. 807)

ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) పై అభిప్రాయాలకు/ భావాలకు మద్దతు ఇస్తూ ఇలా చెప్పారుః దీనిపై నేను ఇలా అంటానుః పైన పేర్కొనబడిన భావాలన్నియు సరియైనవి కావచ్చు. – అల్లాహ్ యే అందరికంటే ఎక్కువ తెలిసినవాడు- కాని మొదటి భావం గురించి మరో స్పష్టమైన ఉల్లేఖనం ఉంది, అది ఆసిం ద్వారా, అల్ ఖమాతో, ఆయన అబూ మస్ఊద్ తో, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పినట్లు తెలిపారు.

مَن قَرَأخَاتِمة الْبَقَرَةِ أَجْزَأَتْ عَنْهُ قِيَامَ لَيْلَةٍ
“ఎవరు సూర బఖరలోని చివరి ఆయతులు పఠిస్తారో అవి అతని వైపు నుండి తహజ్జుద్ కు బదులుగా సరిపోతాయి”.
(ఫత్హుల్ బారీ బిషర్హి సహీహిల్ బుఖారిః ఇబ్ను హజ్ర్ అస్ఖలానీ 8/ 673, హ.న. 5010).

ఈ రెండు ఆయతుల పారాయణం చాలా సులువైన విషయం, అనేక మంది వాటిని కంఠస్తం చేసి ఉంటారు అల్ హందులిల్లాహ్. ముస్లిం వ్యక్తి ప్రతి రాత్రి వాటిని క్రమం తప్పకుండా చదివే ప్రయత్నం చేయాలి. ఇవి సులువుగా ఉన్నాయని కేవలం వీటినే పట్టుకొని, తహజ్జుద్ కు ఉన్నటువంటి పుణ్యం గల ఇతర సత్కార్యాలను వదలకూడదు. ఎందుకనగా విశ్వాసి సాధ్యమైనంత వరకు ఎక్కువ పుణ్యాలు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఏ సత్కార్యం అంగీకరించబడుతుందనేది కూడా అతనికి తెలియదు.

అబ్దుల్లాహ్ బిన్ ఉమైర్ (రహిమహుల్లాహ్) చెప్పారుః అల్లాహ్ విధేయతకు సంబంధించిన విషయాల్లో, ఏదో అతి నీచమైన పని చేస్తున్నట్లుగా అతి సులువైన విషయాలతోనే సరిపుచ్చుకోకు. అలా కాకుండా ఎంతో ఆనందంతో, సంపూర్ణ కాంక్షతో కఠోరంగా శ్రమించే ప్రయత్నం చేయి. (హిల్యతుల్ ఔలియా…: అబూ నుఐమ్ 3/ 354).

తహజ్జుద్‌ కు సరిసమానమైన సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1yihDY9sySKSVkKwefBXfS

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN

మరణానంతర జీవితం – యూట్యూబ్ – ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3hWrEGNnzcmMZV3PtDByJH

తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కార్యాలు – రాత్రి వేళ 100 ఆయతులు పారాయణం [ఆడియో]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 26 B నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కార్యాలు – రాత్రి వేళ 100 ఆయతులు పారాయణం
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

(4) రాత్రి వేళ వంద ఆయతులు పారాయణం

ప్రవక్త ﷺ ప్రవచించారని తమీమ్ అద్దారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ قَرَأَ بِمِائَةِ آيَةٍ فِي لَيْلَةٍ، كُتِبَ لَهُ قُنُوتُ لَيْلَةٍ

“ఎవరు ఒక రాత్రిలో వంద ఆయతుల పారాయణం చేస్తారో అతనికి రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం లిఖించబడుతుంది”.

(అహ్మద్ –అల్ ఫత్ హుర్రబ్బానీ- 8/11, దార్మీ 3450, అల్బానీ సహీహుల్ జామి 6468 లో సహీ అన్నారు).

వంద ఆయతుల పారాయణం చాలా సులువు, నీ సమయంలో నుండి కేవలం పది నిమిషాల పాటు మాత్రమే గడుస్తుంది. నీ వద్ద సమయం మరీ తక్కువగా ఉంటే, ఈ ఘనతను పొందాలనుకుంటే సూర సాఫ్ఫాత్ (సూర నం. 37), లేదా సూర ఖలమ్ (68) మరియు సూర హాఖ్ఖా (69) పారాయణం చేయవచ్చు.

ఒకవేళ ఈ వంద ఆయతుల పారాయణం రాత్రి వేళ తప్పిపోతే ఫజ్ర్ మరియు జొహ్ర్ నమాజుల మధ్య పారాయణం చేయు, ఇందులో బద్ధకం వహించకు, ఇన్ షా అల్లాహ్ నీవు దాని పుణ్యం పొందగలవు. ఎలా అనగా ప్రవక్త ﷺ ఇలా శుభవార్త ఇచ్చారని హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ نَامَ عَنْ حِزْبِهِ، أَوْ عَنْ شَيْءٍ مِنْهُ، فَقَرَأَهُ فِيمَا بَيْنَ صَلَاةِ الْفَجْرِ، وَصَلَاةِ الظُّهْرِ، كُتِبَ لَهُ كَأَنَّمَا قَرَأَهُ مِنَ اللَّيْلِ

“ఎవరైనా తాను రోజువారీగా పారాయణం చేసే ఖుర్ఆనులోని కొంత ప్రత్యేక భాగం, లేదా ఏదైనా వేరే ఆరాధన చేయలేక నిద్రపోతే, మళ్ళీ దానిని ఫజ్ర్ మరియు జొహ్ర్ నమాజుల మధ్య పూర్తి చేసుకుంటే అతనికి రాత్రివేళ చేసినంత పుణ్యం లిఖించబడుతుంది”. (ముస్లిం 747).

ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) గారి ఈ ఉల్లేఖనం యొక్క వ్యాఖ్యానంలో ముబారక్ పూరి (రహిమహుల్లాహ్) ఇలా చెప్పారుః

ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే రాత్రిపూట (నమాజ్, ఖుర్ఆన్ పారాయణం లాంటి) ఏదైనా సత్కార్యం చేయుట, మరియు నిద్ర వల్ల లేదా మరే కారణంగా తప్పిపోతే ‘ఖజా’ చేయుట ధర్మసమ్మతమైనది. ఫజ్ర్ మరియు జొహ్ర్ నమాజుల మధ్య దానిని చేసినవాడు రాత్రి చేసినవానితో సమానం.

ముస్లిం (746), తిర్మిజి (445) మొదలైనవాటిలో హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ద్వారా రుజువైన విషయం ఏమిటంటేః నిద్ర లేదా ఏదైనా అవస్త కారణంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తహజ్జుద్ నమాజ్ చేయలేకపోతే పగటి పూట పన్నెండు రకాతులు చేసేవారు.

(తొహ్ఫతుల్ అహ్వజీ షర్హ్ జామి తిర్మిజిః ముబారక్ పూరీ 3/ 185, హ.న. 851).

బహుశా ఈ హదీసు ప్రతి రోజు ఖుర్ఆనులో ఓ ప్రత్యేక భాగ పారాయణం ఉండాలని, ప్రత్యేకంగా రాత్రి వేళ అని నిన్ను ప్రోత్సహిస్తుంది. ఏమీ! మనము అశ్రద్ధవహుల్లో లిఖించబడకుండా ఉండుటకు రాత్రి కనీసం పది ఆయతులైనా పారాయణం చేయాలని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రోత్సహించిన విషయం మీకు తెలియదా?

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః

مَنْ قَامَ بِعَشْرِ آيَاتٍ لَمْ يُكْتَبْ مِنَ الغَافِلِينَ، وَمَنْ قَامَ بِمِائَةِ آيَةٍ كُتِبَ مِنَ القَانِتِينَ، وَمَنْ قَامَ بِأَلْفِ آيَةٍ كُتِبَ مِنَ المُقَنْطِرِينَ

“పది ఆయతులతో తహజ్జుద్ చేయువారు అలక్ష్యపరుల్లో వ్రాయబడరు. మరెవరయితే వంద ఆయతులతో తహజ్జుద్ చేస్తాడో వినయ విధేయుల్లో వ్రాయబడుతాడు. ఇంకా ఎవరయితే వెయ్యి ఆయతులతో తహజ్జుద్ చేస్తారో ‘ముఖంతిరీన్’లో వ్రాయబడుతాడు”. (ముఖంతిరీన్ అన్న పదం ఖింతార్ నుండి వచ్చింది. ఖింతార్ భావం పై హదీసులో చూడండి).

(అబూదావూద్ 1398, ఇబ్ను హిబ్బాన్ 2572, ఇబ్ను ఖుజైమా 1144, అల్బానీ సహీహుత్తర్గీబ్ 639లో హసన్, సహీ అని అన్నారు).

ఇకనైనా మనం ఖుర్ఆన్ పారాయణం చేయడానికి అడుగు ముందుకు వేద్దామా? మన ఖుర్ఆన్ సంపూర్ణం చేయడమనేది కేవలం రమజాను వరకే పరిమితమయి ఉండకూడదు, సంవత్సరమెల్లా ఉండాలి. తహజ్జుద్ పుణ్యం పొందుటకు ప్రతి రోజు వంద ఆయతుల పారాయణ కాంక్ష అనేది అల్లాహ్ గ్రంథాన్ని బలంగా పట్టుకొని ఉండడానికి శుభప్రదమైన అవకాశం కావచ్చు.

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN

మరణానంతర జీవితం – యూట్యూబ్ – ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3hWrEGNnzcmMZV3PtDByJH

ఖుర్‌ఆన్‌ పారాయణం చేసేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు

బిస్మిల్లాహ్

అల్లాహ్‌ త ఆలా ఇలా తెలియజేశాడు:

أَقِمِ الصَّلَاةَ لِدُلُوكِ الشَّمْسِ إِلَىٰ غَسَقِ اللَّيْلِ وَقُرْآنَ الْفَجْرِ ۖ إِنَّ قُرْآنَ الْفَجْرِ كَانَ مَشْهُودًا وَمِنَ اللَّيْلِ فَتَهَجَّدْ بِهِ نَافِلَةً لَّكَ عَسَىٰ أَن يَبْعَثَكَ رَبُّكَ مَقَامًا مَّحْمُودًا

నమాజు నెలకొల్పు. సూర్యుడు నెత్తి నుండి వాలినప్పటి నుండి రాత్రి చీకటి అలుముకునే వరకు. తెల్లవారు జామున ఖుర్‌ఆన్‌ పారాయణం చెయ్యి. నిశ్చయంగా తెల్లవారు జామున చేసే ఖుర్‌ఆన్‌ పారాయణానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది. రాత్రిపూట కొంత భాగం తహజ్ఞుద్‌ (నమాజులో ఖుర్‌ఆన్‌ పఠనం చెయ్యి. ఇది నీ కొరకు అదనం. త్వరలోనే నీ ప్రభువు నిన్ను మఖామె మహ్‌మూద్‌కు (ప్రశంసనీయమైన స్థానానికి) చేరుస్తాడు.”  (సూరతు ఇస్రా /బనీ ఇస్రాయీల్‌: 78-79).

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “నిశ్చయంగా తెల్లవారు జామున చేసే ఖుర్‌ఆన్‌ పారాయణానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది” అంటే ఫజ్ర్ వేళ అల్లాహ్‌ దూతలు దివి నుండి భువికి దిగివస్తారు. (సహీహ్‌ తిర్మిజీ: 3135, సహీహ్‌ ఇబ్నుమాజా:670)

మరో హదీసులో ఇలా ఉంది: ‘రాత్రి వేళ విధుల్ని నిర్వహించిన దూతలు అల్లాహ్‌ సన్నిధికి చేరుకున్నపుడు – తనకంతా తెలిసినప్పటికీ – మీరు నా దాసుల్ని ఏ స్థితిలో వదలి వచ్చారు? అని అల్లాహ్‌ ప్రశ్నిస్తాడు. దానికి వారు: “మేము వారి వద్దకు వెళ్ళినప్పుడు కూడా వారు నమాజులో లీనమై ఉన్నారు. మేము వారివద్ద నుంచి తిరిగి వస్తున్నప్పుడు కూడా వారు నమాజులోనే నిమగ్నులై ఉన్నారు” అని సమాధానమిస్తారు.’ (బుఖారీ:522,ముస్లిం:1001).


హజ్రత్ అనస్‌ (రదియల్లాహు అన్హు) కథనం: “ప్రజలలో కొంత మంది అల్లాహ్‌కు అతి దగ్గరవారై ఉన్నారు .” అని ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు.

యా రసూలుల్లాహ్ ! వారెవరూ? అని కొందరు అడిగారు.

దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం): “వారు అహ్‌లుల్‌ ఖుర్‌ఆన్‌ (ఖుర్‌ఆన్‌ (గంథాన్ని పారాయణం చేసేవారు, దానిని నేర్పేవారు, నేర్చుకునేవారు) మరియు వారే అల్లాహ్‌కు అతి దగ్గరవారై ఉంటారు, వారు ఆయనకు ప్రత్యేకులు” అని అన్నారు.

[నసాయి, ఇబ్ను మాజా, హాకిమ్‌: సహీహ్‌ అత్తర్గీబ్‌ వత్తర్హీబ్‌: 1432]


హజ్రత్ ఉస్మాన్‌ బిన్‌ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “మీలో ఖుర్‌ఆన్‌ నేర్చుకొని ఇతరులకు నేర్పించినవారే అందరికంటే ఎక్కువగా మేళ్లు కలిగి ఉన్నవారు.” (బుఖారీ:4639)


హజ్రత్ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “నిశ్చయంగా అల్లాహ్‌ ఈ గ్రంథం కారణంగా కొన్ని జాతుల్ని ఉన్నతమైన స్థితికి పెంచుతాడు. మరికొన్ని జాతుల్నిదీని కారణంగానే అధోగతికి దిగజార్చుతాడు.” (ముస్లిం1353)


ప్రవక్త ముహమ్మద్‌(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజత్‌ అబూహురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు:

“సుమధుర స్వరంతో గొంతెత్తి ఖుర్‌ఆన్‌ పారాయణం చేసే దైవప్రవక్త కంఠ శ్వరాన్ని శ్రద్ధగా ఆలకించినట్లుగా అల్లాహ్‌ మరే స్వరాన్నీ ఆలకించడు.” (బుఖారీ:4636, ముస్లిం:1319).

సమధుర స్వరంతో ఖుర్‌ఆన్‌ పారాయణం చేసేవాని పట్ల అల్లాహ్‌ ప్రసన్నుడయి అతని ఆచరణను అంగికరిస్తాడు అని అర్ధం.


హజ్రత్ అనస్‌ (రదియల్లాహు అను) కథనం: అన్సార్‌ జాతికి చెందిన ఒక సహాబీ (అనుచరుడు) మస్జిద్ ఖుబాలో ఇమామత్‌ చేసేవారు. ఆయన ప్రతి రకాతు ఆరంభంలో ‘ఖుల్‌హువల్లాహు అహద్‌” సూరా పఠించిన తరువాత మరొక సూరా చదివేవారు. ఇలాగే ఆయన ప్రతి రకాతులో చేసేవారు.

కొందరు ఆయనను ఇలా అడిగారు? “నీవు ఆ సూరాను నమాజులో చదవకుంటే నమాజు కానట్టుగా ప్రతి రకాతులో నిత్యం చదువుతుంటావు, నీవు చదివేటుగా ఉంటే ఆ సూరను మాత్రమే చదువు లేకుంటే ఇతర సూరాలను చదువు అని అన్నారు.”

తరువాత ఆయన ఇలా సమాధానమిచ్చారు: “‘చూడండి! నేను ఇలాగే నమాజు చదువుతాను .మీకిష్టమైతే నేను మీ కొరకు ఇమామత్‌ చేస్తాను, మీకు ఇష్టం లేదంటే చెప్పండి ఇమామత్‌ మానుకుంటాను” అని అన్నారు. వారిలో అందరికంటే గొప్ప వ్యక్తిగా ఆయనను వారు భావించేవారు. కనుక ఇతరులు ఇమామత్‌ చేయడం వారికి ఇష్టముండేది కాదు.

చివరికి కొంత మంది ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు పోయి ఈ సమస్య గురించి తెలియజేశారు.

తరువాత ప్రవక్త ముహమ్మద్‌(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ వ్యక్తితో: “వారి కోరిక ప్రకారం (ఇమామత్‌) చేయుటకై నీకు ఏ విషయం అడ్డు? ఆ సూరానే నీవు ఎందుకు ప్రతి రకాతులో చదవాలనుకుంటున్నావు?” అని అడిగారు.

దానికి ఆ వ్యక్తి: “యా రసూలల్లాహ్‌! “నేను ఆ సూరా (ఖులహువల్లాహు అహద్‌) ను ఇష్టపడుతున్నాను అని అన్నారు.

అది విని ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనితో: “ఆ సూరాను నీవు ఇష్టపడుతున్నావంటే అది నీన్ను స్వర్గానికి తీసుకెళ్తుంది? అని చెప్పారు.

[సహీహ్‌ తిర్మిజీ:2901]


హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

ఖుర్‌ఆన్‌లో ముప్పై వాక్యాలు గల, ఒక సూరా ఉంది. అది (అల్లాహ్‌ సన్నిధిలో) ఒక వ్యక్తి గురించి సిఫారసు చేసి ఆఖరికి అతనికి క్షమాభిక్ష లభించేలా చేసింది.” అదే, “తబారకల్లిజీ బియదిహిల్‌ ముల్కు.” (తిర్మిజీ: 2891, ఇబ్నుమాజా: 3786, అబూదావూద్‌).

మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “దివ్య ఖుర్‌ఆన్‌లో ఒక సూరా ఉంది. అది తనను పఠించేవాని తరఫున వాదిస్తుంది. కడకు అతన్ని స్వర్గంలో చేర్పిస్తుంది.” (మజ్‌మవుజ్‌ జవాయిద్‌).

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్‌ మస్‌వూద్‌ (రదియల్లాహు అన్జ్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు; “తబారకల్లజీ బియదిహిల్‌ ముల్క్‌ ప్రతి రాత్రి చదివిన కారణంగా అల్లాహ్‌ వారిని సమాధి శిక్షనుండి కాపాడుతాడు.” [హాకిమ్‌, సహీహ్‌ తర్గీబ్‌ వత్‌ తర్హీబ్ : 1589]

హజ్రత్ జాబిర్‌ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం): “అలిఫ్ లామ్‌ మీమ్‌ తంజీల్ అస్‌ సజ్దా’  మరియు ‘తబారకల్లజీ’ సూరాలు పారాయణం చేసేవరకు నిద్రపోయేవారు కాదు.” అని తెలిపారు. [సహీహ్‌ తిర్మిజీ: 2892]

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం): “సూరతుల్ జుమర్  మరియు “బనీ ఇస్రాయిల్”  సూరాలు పారాయణం చేసేవరకు నిదపోయేవారు కాదు.” అని తెలిపారు.” [సహీహ్‌ తిర్మిజీ: 2892]

హజ్రత్ అబ్దుల్లాహ్ ఇబ్ను మస్‌వూద్‌ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఎవరైనా ఖుర్‌ఆన్‌ గ్రంథంలోని ఒక అక్షరాన్ని చదివితే అతనికి ఒక పుణ్యం లభిస్తుంది. ఆ ఒక్క పుణ్యం పది పుణ్యాలకు సమానంగా ఉంటుంది.” నా అభిప్రాయం ప్రకారం: ‘అలిఫ్‌ లామ్‌ మీమ్‌” అనేది ఒకే అక్షరం కాదు. పైగా ‘అలిఫ్‌’ ఒక అక్షరం, లామ్‌’ ఒక అక్షరం,మీమ్  ఒక అక్షరం అని అన్నారు.  (సహీహ్‌ తిర్మిజీ: 2910, సహీహ్‌ నసాయి: 2391, హాకిమ్‌).


[ఇది జఫరుల్లాహ్ ఖాన్ హఫిజ హుల్లాహ్ గారు రాసిన అల్లాహ్ ను ప్రేమించండి – స్వర్గాన్ని చేరుకోండి అను పుస్తకం నుండి తీసుకోబడింది]